breaking news
Nara Lokesh Babu
-
Karumuri Nageswara: మీ ఎల్లో మీడియా కాదు .. అది నేషనల్ మీడియా
-
ఇండిగో వైఫల్యంపై కేంద్రమంత్రి తీరును నిలదీసిన అర్నబ్ గోస్వామి
-
ఖాళీ కుర్చీతో.. టీడీపీని ఏకిపారేసిన అర్నబ్ గోస్వామి
సాక్షి, ఢిల్లీ: తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ ఎంపీ.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడిపై ప్రముఖ న్యూస్ యాంకర్ అర్నబ్ గోస్వామి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిణామాలపై విమానయాన శాఖ మంత్రిగా కాకుండా.. మరెవరిని ప్రశ్నించాలంటూ నిలదీశారాయన. ఇండిగో సంక్షోభ వ్యవహారంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్నాయుడి వైఫల్యాన్ని ఇంతకు ముందు అర్నబ్ ప్రశ్నించారు. ఇండిగోపై సమీక్ష జరపడానికి అసలు లోకేష్ ఎవరంటూ నిలదీశారు. అయితే ఈ వైఫల్యాన్ని.. లోకేష్‌ను ఎత్తి చూపడాన్ని టీడీపీ తట్టుకోలేకపోయింది. తప్పు చేసినా తమను ప్రశ్నించవద్దనే తీరుతో టీడీపీ నేతలు.. రిపబ్లికన్ టీవీని బ్యాన్ దిశగా అడుగులు వేసింది. దీంతో అర్నబ్ అనూహ్య చర్యకు దిగారు. స్టూడియోలో ఖాళీ కుర్చీ వేయించి మరీ.. కేంద్రమంత్రిని కాకుండా ఇంకెవరిని ప్రశ్నించాలంటూ టీడీపీ అండ్ కోను కడిగిపారేశారు. లక్షల మందిని ఇబ్బంది పెట్టిన మంత్రిని నిలదీయకూడదనడం ఎంత వరకు కరెక్ట్ అని ఏకిపారేశారు. -
మాకేం సంబంధం లేదు.. అంతా కేంద్రమే: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఇండిగో సమస్యను ఏపీ మంత్రి నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీ కొట్టుకున్న సెల్ఫ్ డబ్బా ఎంత ట్రోలింగ్‌కు దారి తీసిందో చెప్పనక్కర్లేదు. అసలు ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు లోకేష్ ఎవరంటూ ఎవరు? అంటూ జాతీయ మీడియా చానెల్స్ ఏకిపారేశాయి. అదే టైంలో.. టీడీపీ నుంచి విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్నాయుడిని సైతం రాజీనామా చేయాలంటూ బలమైన డిమాండే వినిపిస్తోంది. ఈ దరిమిలా ఇండిగో సమస్యను అవలీలగా కేంద్రంపైకి నెట్టేశారు చంద్రబాబు. మంచి జరిగితే క్రెడిట్‌ను నిసిగ్గుగా తన ఖాతాలో వేసుకునే నారా చంద్రబాబు నాయుడు.. ఇండిగో సమస్య విషయంలో మాత్రం యూటర్న్ తీసుకున్నారు. ఈ సంక్షోభాన్ని కేంద్రమే పరిష్కరించాలంటూ సోమవారం వ్యాఖ్యలు చేశారాయన. ‘‘ఇండిగో ప్రమాణాలు పాటించడం లేదు. టైం ఇచ్చినా చేయలేకపోయారు. ఇండిగో గుత్తాధిపత్యం వల్లే సమస్యలు వచ్చాయి. ఈ విషయంపై మేమేం మానిటరింగ్ చేయడం లేదు. ఇండిగో సమస్యపై కేంద్రం దృష్టి పెట్టింది. వాళ్లే సమస్యకు కేంద్రమే పరిష్కారం కనిపెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. ఏపీలో ప్రభుత్వంలో ఉంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. కానీ, సంక్షోభ బాధ్యతలను మాత్రం భాగస్వామిగా స్వీకరించడం లేదు. పైగా ఇండిగో సమస్యతో దేశం పరువు తీసిన రామ్మోహన్‌నాయుడుతో బాధ్యతగా మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిన పని కూడా చేయలేదు. ఇవేవీ చేయకపోగా.. ట్రోలింగ్ దెబ్బకు యూటర్న్ తీసుకుని ఇప్పుడు ‘‘అబ్బే.. ఇండిగో సమస్యతో మాకేం సంబంధం లేదని.. అంతా కేంద్రందే’’నంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం. -
Chevireddy Mohith: లోకేష్ 100 కు 10 రెట్లు అనుభవిస్తావ్
-
ఇండిగోతో లోకేష్ డీల్..!? మోదీ సీరియస్..
-
కొమ్మినేని గారు నవ్వితేనే కేసు పెట్టారు.. అర్నాబ్ గోస్వామిని తలుచుకుంటేనే బాధేస్తుంది
-
సమస్య పరిష్కారంలో మంత్రి రామ్మోహన్ విఫలం: అమర్నాథ్
-
విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి.. జగన్‌పై విమర్శలా?
సాక్షి, అమరావతి: విద్యారంగాన్ని భ్రష్టుపట్టించడమే కాకుండా.. విద్యారంగాన్ని బలోపేతం చేసిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడానికే పేరెంట్, టీచర్ సమావేశాలు పెట్టుకునేందుకైతే కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా, ప్రెస్‌మీట్ పెట్టుకుంటే సరిపోదా అని చంద్రబాబు, లోకేశ్‌ను నిలదీశారు. ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించి.. సెట్టింగ్‌లు, షూటింగ్‌లు పెట్టి ప్రత్యేక విమానాలపై వెళుతూ ప్రజలపై భారం మోపడం దేనికని ప్రశ్నించారు. పాఠశాల సమావేశాలను సైతం రాజకీయ సభలుగా మార్చేసి వైఎస్ జగన్‌పై ద్వేషభావం కలిగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనలో విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏడాదిన్నరలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పులు తేవడం మినహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేసిన పాపానపోలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నరకే పాలన చేతకాక చేతులెత్తేసిన చంద్రబాబు ఇంకో మూడున్నరేళ్లు ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమయ్యే పనికాదన్నారు. ఆ బడిని తీర్చిదిద్దింది జగనే ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) పేరుతో పార్వతీపురం మన్యం జిల్లా భామిని స్కూల్లో సీఎం చంద్రబాబు పిల్లల ముందు షో చేసి వచ్చాడు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆ పాఠశాలను నిర్మిస్తే, వైఎస్ జగన్ సీఎం అయ్యాక నాడు–నేడు ద్వారా మరింత మెరుగులు దిద్దితే అవన్నీ కనపడనీయకుండా లక్షలు ఖర్చుచేసి సెట్టింగ్ వేశారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌లను తండ్రీకొడుకులు రాజకీయ కార్యక్రమంలా మార్చేశారు. ఈవెంట్ కోసం తీసుకొచ్చిన కెమెరాల సాక్షిగా వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన బెంచీలు, డిజిటల్ బోర్డులతో తామే గొప్పగా చేశామని చెప్పుకునే ప్రయత్నం చేసి తండ్రీకొడుకులు విఫలమయ్యారు. అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. పైగా మొదటి ఏడాది పథకాన్ని పూర్తిగా అమలు చేయకపోగా రెండో ఏడాది సైతం 30 లక్షల మంది పిల్లలకు పథకాన్ని వర్తింపచేయలేదు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందే కాకుండా వైఎస్ జగన్ చేసిన పనులను కూడా తామే చేసినట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో విద్యావ్యవస్థ నాశనమైందని చెబితే విద్యార్థులు ఎలా నమ్ముతారోనన్న ఆలోచన కూడా తండ్రీకొడుకులకు లేదు’ అని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. -
ఇండిగో సంక్షోభంపై పరువు పోగొట్టుకున్న టీడీపీ
సాక్షి, అమరావతి: ఇండిగో సంక్షోభంపై టీడీపీ పరువు పోగొట్టుకుంది. లోకేష్ రివ్యూ చేస్తున్నారంటూ.. జాతీయ మీడియాలో టీడీపీ అధికార ప్రతినిధి అతి చేశారు. అసలు నారా లోకేష్ ఎవరన్న అర్నబ్ గోస్వామి.. విమానయాన శాఖకు, లోకేష్‌కు సంబంధమేంటి? అంటూ ప్రశ్నించారు. ‘‘ఏ హోదాలో లోకేష్ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఇది పౌర విమానయాన శాఖ.. లేక టీడీపీ శాఖ?’ అంటూ అర్నబ్ మండిపడ్డారు. అర్నబ్ గోస్వామి ప్రశ్నలకు టీడీపీ నేత నీళ్లు నమిలారు.విమాన ప్రయాణికుల కష్టాలు తీర్చడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని ఇతర ఎయిర్ లైన్స్ సొమ్ము చేసుకుంటున్నా రామ్మోహన్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండిగో సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.ఇండిగో సంక్షోభాన్ని నారా లోకేష్ చక్కదిద్దుతున్నారని చెప్పుకుంటున్న టీడీపీ అధికార ప్రతినిధిని నారా లోకేష్‌కు ఏం సంబంధం అంటూ జాతీయ మీడియా చివాట్లు పెట్టింది. సంక్షోభాన్ని కూడా నారా లోకేష్ క్రెడిట్ కోసం వాడుకుంటున్నారంటూ నెటిజన్ల మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభ నివారణకు రామ్మోహన్ నాయుడు తూతు మంత్రంగా చర్యలు చేపట్టారు. సమీక్షలు, ప్రకటనలతోనే సరిపెట్టారు.ఎఫ్డీటీఎల్ నిబంధనల అమలు పరచడంలో తీవ్ర వైఫల్యం చెందారు. సేఫ్టీ నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలును పట్టించుకోని రామ్మోహన్.. లక్షలాదిమంది ప్రయాణికులు ఆందోళనలకు దిగడంతో ఇండిగో పై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఈ సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి దానికి తగిన విధంగా చర్యలు చేపట్టడంలో రామ్మోహన్నాయుడు విఫలయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
చంద్రబాబు తిన్న ప్లేట్ తీసిన లోకేష్.. అంబటి సెటైర్లే సెటైర్లు
-
ఇళ్ల కూల్చివేత వెనుక లోకేశ్
భవానీపురం (విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురం జోజినగర్‌లో 42 ప్లాట్లలో ఇళ్ల కూల్చివేత వెనుక మంత్రి లోకేశ్ ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు సర్కారుకు ఇళ్లు కూల్చివేయడమే తప్ప కట్టిన చరిత్ర లేదని విమర్శించారు. జోజినగర్‌లో ఇళ్ల కూల్చివేసిన ప్రాంతాన్ని శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీమంత్రి, పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి పరిశీలించారు. బాధితుల్ని పరామర్శించారు. బాధితులు నేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సుమారు 2.17 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటే దానివెనుక కచ్చితంగా ప్రభు త్వ పెద్దల అండ, వెన్నుదన్ను ఉండే ఉంటాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో 200 మంది పోలీసులు రౌడీల్లా వచ్చి ఇళ్లల్లోవారిని బయటకు లాక్కొచ్చి కూల్చేశారని చెప్పారు. -
జనసేన 'పంచ'సూత్ర.. రెచ్చిపోతున్న షాడో సీఎం
-
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్.. హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: మోసాలతో, కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కో ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా దోచుకుంటున్నారని.. పైగా గోబెల్స్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పలు అంశాలపై మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉందికానీ బాబు, ఆయన బినామీలు స్కామ్‌లు చేస్తూనే ఉన్నారుప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి ఫైబర్‌ను కట్టుబెట్టి వందల కోట్లు దోచిపెట్టారుకేబినెట్ ఆమోదం లేకుండా ప్రివలేజ్ ఫీజులు రద్దు చేశారుప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్‌పై బాబే సంతకం చేశారుచంద్రబాబుకు దేవుడు.. ప్రజలే బుద్ధి చెబుతారుచంద్రబాబు బరితెగింపు2014-19 మధ్య చంద్రబాబు స్కామ్లుఆషామాషీ స్కాములు కావవి!స్కిల్ స్కామ్ కేసును కేంద్రం కూడా గుర్తించిందిస్కిల్ స్కామ్‌లో 370 కోట్లు షెల్ కంపెనీలకు తరలించారుచంద్రబాబు, బినామీలతో అమరావతి భూకుంభకోణంఇసుక స్కామ్‌తో వందల కోట్లు దోచిపెట్టారువివిధ కేసులలో బెయిల్ మీద ఉన్న చంద్రబాబుచంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారుల్ని బెదిరించారుఅబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారుబెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ బరితెగింపుబెదిరించి తనపై ఉన్న కేసుల్ని మూసేయించుకుంటున్నారుఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్‌లు చేస్తున్నారుబాబు అండ్‌కో గోబెల్స్‌ను మించి పోయారువీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఆగదు అశోక్ గజపతిని ఎందుకు విచారణ జరపలేదు?చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీసెప్టెంబర్ 1 ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారురమణ, సురేష్.. ఇద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారుఅలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదువిచారణ జరిపి ఆస్తుల్ని స్వాధీనం ఎంఉదకు చసుకోలేదుసింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిఅశోక్ గజపతిని ఎందుకు విచారించలేదుసుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా? పరకామణి కేసులో.. పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం.. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. టీటీడీలో పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు.పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు. ఇది ధర్మమేనా? వాళ్లంతా టీడీపీ మనుషులే.. లడ్డూ ప్రసాదంలో వాస్తవాల కోసం వైవీ సుబ్బారెడ్డి కేసు వేశారు నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు అప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి పీఏ కాదుటీడీపీ ఎంపీ వేమారెడ్డి అనుచరుడు.. ఏపీ భవన్ ఉద్యోగిలడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌లో అంతా టీడీపీ వాళ్లే ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా భాగమే దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారుదేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారునెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారుఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్‌తోనే రావాలిసర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్‌ల్లోనూ పరీక్షలో నెగ్గాలి ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారుమా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాంపకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?బాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారుమళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొందిటీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? తారాస్థాయికి చంద్రబాబు కక్షా రాజకీయాలుఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు.. అరెస్టులుచెవిరెడ్డిని జైలుకు పంపారుమిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు మిథున్‌రెడ్డి బెయిల్ టైంలో ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ప్రశ్నించారుకాకాణి, శ్రీకాంత్, వంశీ.. వాళ్లను అరెస్ట్ చేశారుపోసాని లాంటి సామాన్యుడ్ని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టును, చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించారుమంత్రి సంద్యారాణి పీఏ వ్యవహారంలో ఆధారాలున్నా చర్యలు లేవువాట్సాప్ మెసేజ్‌లు కళ్ల ముందే కనిపిస్తున్నా పోలీసుల్లో చలనం లేదుఆధారాలు చూపించినా ఇప్పటిదాకా కేసు పెట్టలేదుపైగా వార్త రాసిన సాక్షి, సాక్షి విలేఖరిపై కేసులు పెట్టి నోటీసులు పంపించారు పిన్నెల్లి సోదరులపై తప్పుడు కేసులు పెట్టారురిగ్గింగ్ అడ్డుకున్నందుకే పిన్నెల్లిని జైల్లో పెట్టారుటీడీపీ ఆధిపత్య పోరు ఘటనను.. రాజకీయ ప్రతీకారానికి వాడుకుంటున్నారుటీడీపీ వాళ్లు హత్య చేసుకుంటే.. పిన్నెల్లిని ఇరికించారుచంపింది.. చంపబడ్డవాళ్లు.. టీడీపీ వాళ్లేనని పోలీసులే స్వయంగా చెప్పారుటీడీపీ గొడవల వల్లేనని ఎస్పీ స్వయంగా ట్వీట్ చేశారు చంద్రబాబు పాలనలో పిన్నెల్లిపై పెట్టిన కేసులు 16విశాఖలో వైఎస్సార్సీపీ విద్యార్థి నాయకుడు కొండా రెడ్డిని దొంగ కేసులో అరెస్ట్ చేశారుకొండా రెడ్డిపై గంజాయి కేసు పెట్టారుఆశ్చర్యం ఏంటంటే.. అరెస్ట్ చేసింది ఓ చోట.. నేరం జరిగిందని చెప్పింది మరో చోటఇలాంటి రాజకీయాలతో వ్యవస్థలు బతుకుతాయా?అన్యాయంగా వైఎస్సార్సీపీ వాళ్లను జైలుకు పంపారులిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబుఅప్పుడు ఏదైతే స్కామ్ చేశారో.. ఇప్పుడు సీఎంగా అదే పని చేస్తున్నారుఅలాంటి వ్యక్తి తన కేసుల్ని నీరుగార్చేందుకు.. మధ్యలో ఉన్న మా ప్రభుత్వ పాలసీని తప్పుగా ప్రచారం చేస్తున్నారులేని కేసుతో .. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టులు చేశారుమా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారుమిథున్రెడ్డి బెయిల్ సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు?అని జడ్జే ప్రశ్నించారు రెడ్‌బుక్ వెర్రితలలు వేస్తోందిరాష్ట్రమంతా కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీడీవాళ్లేమంత్రులు, ఎమ్మెల్యేల మనుషులతోనే ఆ దందా నడిచిందికుటీర పరిశ్రమ లాగా.. రాష్ట్రంలో ప్రతీ మూలా నడిపించారు మా పార్టీకి చెందిన జోగి రమేష్‌పై తప్పుడు కేసు పెట్టారుజోగి రమేష్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారుజోగి రమేష్ కొడుకును కూడా ఇబ్బంది పెడుతున్నారువాళ్ల పార్టీకి చెందిన నిందితులనే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు వీళ్లదే ప్రభుత్వం.. వీళ్లదే స్కామ్కల్తీ మద్యం కేసుల్లో.. తయారు చేసింది, పంచింది.. దోచుకుంది.. అంతా వాళ్లేరెడ్బుక్ పాలనలో కల్తీ మద్యం తయారు చేసే దమ్ము వేరే పార్టీ వాళ్లకు ఉంటుందా? నమ్మేలా ఉందా ఇది?తప్పుడు ఆధారాలతో.. సాక్ష్యాలతో.. వైఎస్సార్సీపీ వాళ్లను జైల్లో పెడుతున్నారు ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారుపీఆర్సీ లేదు.. ఐఆర్ లేదుచంద్రబాబు రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు ఏపీసీవోఎస్తో వైఎస్సార్సీపీ హయాంలో ఒకటో తేదీనే జీతాలిచ్చాంబాబు హయాంలో ఏపీసీవోఎస్‌ను నీరుగార్చారురెండు , మూడు నెలలకు కూడా ఏవీసీవోఎస్లో జీతాల్లేవుఉద్యమాల్ని ఖాతరు చేయకుండా స్కామ్‌లు చేస్తున్నారుజీతాలు పెరగొద్దని పీఆర్సీ చైర్మన్‌ను కూడా నియమించలేదుఐదు డీఎలు పెండింగ్‌లో ఉన్నాయి.. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు.. మిగతావి వాయిదాల్లో ఇస్తారట!రిటైర్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వం మాత్రమేవిశాఖ స్టీల్‌కు సొంత గనుల్లేకనే ఈ నష్టాలుమిట్టల్ అనే ప్రైవేట్ వ్యక్తి కోసం చంద్రబాబు సొంత గనులు ఇవ్వాలని అడుగుతారుకానీ, విశాఖ స్టీల్‌కు మాత్రం అడగరు.. ప్రభుత్వ ప్లాంట్‌ను పట్టించుకోరుఅందుకే గనులు ఇవ్వాలని మేం అసెంబ్లీలో తీర్మానం చేశాంప్రైవేటీకరణ కాకుండా ఆపేశాంస్టీల్ ప్లాంట్ విషయంలో మాములు దగా చేయలేదుఎన్నికల ముందు.. నాడు.. కాపాడుకుంటా.. కలిసి పోరాడతాం అని చెప్పారుఇప్పుడేమో.. ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా?.. తమాషాలొద్దంటూ సీరియస్పీడీ యాక్టులు పెట్టి విశాఖ ఉద్యోగులను లోపల వేస్తారట!దటీజ్ చంద్రబాబు ప్రైవేటీకరణపై కోటి సంతకాలతో కోర్టుకెళ్తాంగవర్నర్ను కలుస్తాం.. కోర్టులో పిటిషన్ వేస్తాంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సూపర్ స్కామ్లాభం ప్రైవేట్‌వాళ్లకు.. భారం ప్రభుత్వం, ప్రజలకా?ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఉద్యమంకోటి సంతకాలతో 16న గవర్నర్‌ను కలుస్తాం ఆ పత్రాలతోనే కోర్టులో పిటిషన్ సైతం వేస్తాం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసి.. ఖూనీ చేశారు నెలకు రూ.300 కోట్లు అవుతుందిఅలా ఏడాదికి అయ్యే ఖర్చు రూ.3600 కోట్లుకానీ, ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు హతం చేస్తున్నారుబకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సర్వీసులను ఆపేశాయి104, 108లు స్కామ్‌గా మారిపోయాయిపేదలకు వైద్య సాయం అందేదెలా?సంజీవని పేరుతో డ్రామాకు తెర తీశారుఇంకోవైపు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్‌గా నడుస్తోందికొత్త కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఒక స్కామ్ అయితే.. ప్రైవేటీకరణ తర్వాత పని చేసే సిబ్బందికి ప్రభుత్వ జీతాలట!ఇది మరో పెద్ద స్కామ్.. బాబు ఇచ్చిన బొనాంజా భూమి, బిల్డింగ్, స్టాఫ్.. జీతాలు అన్నీ ప్రభుత్వానివే.. కానీ, ఓనర్లు ప్రైవేట్వాళ్లుభారం ప్రజలమీదకు.. లాభాలు ప్రైవేట్ వాళ్లకా?? నేటి తరం ఆస్తి చదువుపిల్లల్ని చదివించేందుకు చంద్రబాబు ముందుకు రావడం లేదుస్కూళ్లలో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయినాడు-నేడును పూర్తిగా ఆపేశారుఇంగ్లీష్ మీడియాన్ని ఆపేశారుఫీజు రియంబర్స్మెంట్, వసతి బకాయిలు కోట్లలో పెరిగిపోయాయితల్లికి వందనం పేరిట మోసానికి పాల్పడ్డారువైఎస్సార్సీపీలో జరిగిన మంచిని చంద్రబాబు నిలిపివేశారుకలుషిత ఆహారం.. నీరు.. సరైన వసతులు లేక పిల్లల ప్రాణాలు పోతున్నాయిఅనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారువందలాది మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారుచిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారుచంద్రబాబు పాలనలో.. ఇది ఎవరూ జీర్ణించుకోలేని విషయాలు గోబెల్స్‌కే మెంటార్ మన చంద్రబాబుసూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. అన్నీ మోసాలేపెన్షన్లు.. సిలిండర్లు.. ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదుఅయినా కూడా హామీలన్నీ నెరవేర్చామని ప్రచారంహిట్లర్ కాలంలోని జోసెఫ్ గోబెల్స్ ప్రపంచానికి తెలుసు అబద్ధపు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారం అంటుంటాంఅందుకే చంద్రబాబు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారాలు అని పేరుకానీ, ఆ గోబెల్సే చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవాలిఇలాంటివి చేస్తున్న చంద్రబాబు మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో వేయాలిగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఎలా ఉండేది?ఆర్బీకేలు అద్భుతంగా పని చేసేవిరైతులకు గిట్టుబాటు ధర కోసం ఆరాట పడ్డాంబాబు పాలనలో రైతులను దళారులను మోసం చేస్తున్నారుచంద్రబాబేమో చోద్యం చూస్తున్నారుఇచ్చిన హామీలు మోసం.. రైతుల పరిస్థితి దయనీయం.. టాపిక్ డైవర్ట్ కోసం రైతన్నా మీ కోసం అంటూ డ్రామాలుజీవితంలో రైతుల కోసం ఏం చేయని చంద్రబాబు.. బోగస్ ప్రచారాలకు దిగారుఘోరాతి ఘోరంగా ఉంది చంద్రబాబు పాలనదిత్వా తుపాను గురించి ముందస్తు సమాచారం ఉందిపంట కోతలకు సిద్ధంగా ఉందనీ తెలుసుఅయినా చంద్రబాబు ప్రభుత్వం నష్టాన్ని నివారించలేకపోయిందిమా హయాంలో ఇలాంటి విపత్తులు వస్తే పరిస్థితి ఎలా ఉండేది?వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. తక్షణ చర్యల ఉండేవిరైతులు ఎలా పోయినా ఫర్వాలేదని చంద్రబాబు అనుకుంటున్నారుకేజీ అరటికి రూ.50 పైసలా?వరి, కొబ్బరి, పత్తి.. ప్రతి పంట పరిస్థితి ఇదే..రైతులు ఎలా బతికేది?.. ఇంత ఘోరంగా పాలన సాగుతోందిచంద్రబాబు అనే వ్యక్తి అసలేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా?.. సీఎంగా ఉండి ఎందుకు?.. రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మోసాలేరెండేళ్లలో రూ.40 వేల పంట సాయం ఇవ్వాలి.. కానీ, రూ.10 వేలే ఇచ్చారు 18 నెలల బాబు పాలనలో 17 ప్రకృతి విపత్తులుకూటమి పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నంరూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు వైఎస్సార్సీపీ హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమావైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.7,000 కోట్ల ఉచిత పంటల బీమాచంద్రబాబు పాలనలో ఉచిత పంటల బీమా పేరిట మోసం84 లక్షల మంది రైతులు ఉంటే.. 19 లక్షల మందికే ఇన్సూరెన్స్ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదుఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడిస్తారో తెలియదుదయనీయంగా ఏపీ కౌలు రైతుల పరిస్థితిమరి గతంలో ఎలా ఉండేది?.. వైఎస్సార్సీపీ హయాంలో పండుగలా వ్యవసాయం62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారుచంద్రబాబు హయాంలో దండుగగా మారిన వ్యవసాయంమోంథా తుపానును పీకపట్టి చంద్రబాబు, లోకేష్, పవన్‌లే ఆపినట్లు బిల్డప్ ఇచ్చారుతుపాను తర్వాత కూడా రైతులకు న్యాయం చేయలేదునష్టపోయిన రైతులకు పైసా సాయం అందించలేదుపైగా పంట నష్టాన్ని దారుణంగా తగ్గించారు సేవ్ ఆంధ్రప్రదేశ్‌లా.. పాలనరాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉందినాణేనికి రెండో వైపు ఎలా ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందిరాష్ట్రంలో సేవ్ ఆంధ్రా పాలన జరుగుతున్నదిరాష్ట్రం మొత్తం దేశం వైపు చూడాలిరైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందిరైతు, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎదగదు -
‘బాబూ.. అధికారం శాశ్వతం కాదు.. కేసులున్నాయ్ కదా?’
సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడతారని తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు యథేచ్చగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. చంద్రబాబు వచ్చాకే మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘అధికారం కోసం చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలకు పాల్పడతారు. అధికార దుర్వినియోగంలో చంద్రబాబు పీహెచ్డీ పొందారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు, లోకేష్ పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారు. పల్నాడులో జంట హత్యల కేసును పిన్నెల్లి సోదరుల మీద బనాయించారు. టీడీపీలోని రెండు వర్గాలు దాడులు చేసుకుని హత్యలు చేసుకున్నాయని సాక్షాత్తు ఎస్పీనే ప్రకటించారు. మరి అలాంటప్పుడు పిన్నెల్లి సోదరుల మీద కేసు ఎందుకు పెట్టారు?. ప్రకాశం జిల్లాలో ఒక టీడీపీ నేతని కూడా టీడీపీ రెండో వర్గమే హత్య చేసింది. దోచుకుని, దాచుకునే విషయంలో గొడవలు పడి వారికి వారే హత్యల దాకా వెళ్తున్నారు. అలాంటి కేసుల్లో మా వారిని ఎందుకు ఇరికిస్తున్నారు?జోగి రమేష్ సోదరుల మీద కూడా అలాగే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ములకలచెరువులో నకిలీ మద్యం బయట పడినప్పుడు జోగి రమేష్ లేడు. ఆ తర్వాత కావాలనే జోగి బ్రదర్స్ మీద అక్రమ కేసు పెట్టారు. కొందరు పోలీసులు చట్టాన్ని అతిక్రమించి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. చంద్రబాబుకు అధికారం శాశ్వతం కాదని తెలుసుకుంటే మంచిది. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళ్లారు. ఒంటినిండా రోగాలు ఉన్నాయని కోర్టును తప్పుదారి పట్టించి బెయిల్ తెచ్చుకున్నారు. సాక్షులను బెదిరించటానికి వీల్లేదని బెయిల్ ఇచ్చే ముందు కోర్టు చెప్పింది. ఆ కోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారు.ఇవన్నీ బయటకు తెలుస్తాయని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రోజుకొక వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేస్తూ డైవర్షన్ చేస్తున్నారు. పల్నాడులో చంద్రబాబు హయాంలోనే ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. వైఎస్సార్, జగన్ హయాంలో రాయలసీమ, పల్నాడు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. చంద్రబాబు వచ్చాకే మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే సహించేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. డిప్యూటీ సీఎం సినిమాకు వెయ్యి, ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాకు రూ.500 రేటు పెంచారు. నారా లోకేష్ సినిమా తీస్తే రూ.1500 పెంచుతారు. అధికార దుర్వినియోగం చేయటంలో కూటమి నేతలు ముందున్నారు’ అని ఎద్దేవా చేశారు. -
ప్రజల సొమ్ముతో..బాబు.. లోకేష్.. పవన్ జల్సాలు
-
ప్రజా ధనంతో ప్రభుత్వ పెద్దల జల్సాలు!
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని.. అది అర్థం చేసుకోవాలంటూ ఏపీ ప్రజల ముందు నారా చంద్రబాబు నాయుడు ఆడే డ్రామాలు తెలియంది కాదు. ఈ వంకతో ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎగ్గొడుతూ వస్తున్నారు కూడా. అయితే రాష్ట్రం అప్పులలో కూరుకుపోతున్నా సరే.. ప్రజా సొమ్ముతో ప్రభుత్వ పెద్దల జల్సాలు మాత్రం ఆగడం లేదు.. రాష్ట్రం ఆర్ధిక లోటులో ఉన్నా సరే.. ప్రభుతవ ఖజానాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు గండికొడుతూనే ఉన్నారు. ప్రత్యేక విమానాల్లోనే పర్యటనలకు మొగ్గు చూపిస్తున్నారు. వీకెండ్ ఎంజాయ్మెంట్కైతే అధికారిక పర్యటనలనే వంకతో తెగచక్కర్లు కొట్టేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోందిసీఎం అయినప్పటి నుంచి చంద్రబాబు ఇప్పటిదాకా 88 సార్లు ప్రత్యేక విమానాల్లో తిరిగారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి నిజంగానే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉదయం టిఫిన్ మంగళగిరిలో, లంచ్ తిరుపతిలో, డిన్నర్ హైదరాబాదులో.. ఇలా ఆయన ప్రత్యేక పర్యటనలకు మాత్రం లెక్కే లేకుండా పోయింది. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ నుంచి ఆయన కాలు కింద పెట్టడం లేదని అధికార వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటిదాకా 92సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. ఈ మధ్యే క్రికెట్ చూడటానికి ప్రత్యేక విమానంలో దుబాయ్, ముంబై వెళ్లారు కూడా. అయితే సొంత ఖర్చులతో ఆయన ఇదంతా చేస్తున్నారని.. ఆర్టీఐ ద్వారా ఈ విషయం తేటతెల్లమైందంటూ ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు వైఎస్ జగన్ మీద ఫోకస్ పెడుతూ కూటమి పెద్దల విలాసాలను ప్రజల్లోకి పోనీయకుండా ఎల్లో మీడియా జాగ్రత్త పడుతోంది. -
వారం రోజులు టైం ఇస్తున్న.. లోకేష్ కు నాగార్జున యాదవ్ వార్నింగ్
-
ఫీజులకు బూజు.. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యను అథఃపాతాళానికి దిగజార్చింది. అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతుండగా.. పాఠాలు బోధించడం మానేసి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం పిల్లలను వేధిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ గత ఏడాదిన్నరకుపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అటకెక్కించే కుయుక్తులు పన్నుతూ లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది. కళాశాలల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ఎన్నికల సమయంలో నమ్మబలికి తరువాత చేతులు ఎత్తేసింది. ఇప్పటి వరకు చెల్లించాల్సిన ఎనిమిది క్వార్టర్ల ఫీజుల డబ్బులు రూ.5,600 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన మరో రూ.2,200 కోట్లతో కలిపి ఏకంగా రూ.7,800 కోట్ల మేర బకాయిలు కొండలా పేరుకుపోయాయి. నిధులను తొక్కిపెట్టి అరకొరగా, పాక్షిక చెల్లింపులతో విద్యార్థులను సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది. తేలికగా ఎగ్గొట్టవచ్చనే దురుద్దేశంతోనే తల్లుల ఖాతాలో కాకుండా, తాము కాలేజీల ఖాతాలో జమ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. ఉన్నత విద్యలో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ అమలు చేసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా సంపూర్ణ భరోసా కల్పించి ఐదేళ్ల పాటు అండగా నిలిచారు. త్రైమాసికం వారీగా నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. 2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికం ఫీజులు ఏప్రిల్‌లో ప్రాసెస్ చేసి మే నెలలో విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అడ్డు పెట్టుకుని టీడీపీ కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకున్నారు. అనంతరం అధికారంలోకి వచి్చన చంద్రబాబు సర్కారు సుమారు ఎనిమిది క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేసింది. ప్రభుత్వ వర్సిటీల్లోనూ సర్టిఫికెట్ల నిలుపుదల.. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడంతో విద్యార్థులు ఫీజులు చెల్లిస్తే గానీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వబోమనే పరిస్థితికి ఉన్నత విద్య దిగజారిపోయింది. చివరికి ప్రభుత్వ వర్సిటీలు సైతం ఇదే బాటలో పయనిస్తూ విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపేశాయి. సర్కారు బాధ్యతారాహిత్యానికి బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విలువైన ఉద్యోగ అవకాశాలు, పీజీ విద్య సీట్లను కోల్పోతున్న దుస్థితి దాపురించింది. ఎంటెక్, పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యా మండలికి మొరపెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 2014–19లో టీడీపీ హయాంలో 16.73 లక్షల మంది విద్యార్థులకు బకాయి పెట్టిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే తక్షణ బాధ్యతగా భావించి చెల్లింపులు చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులకు మంగళం పలికి ఆర్నెల్లకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామంటూ కళాశాలలను, విద్యార్థులను నిలువునా ముంచేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో కళాశాలలు.. రాష్ట్రవ్యాప్తంగా 230కిపైగా ఇంజనీరింగ్ కళాశాలలు, 1,250 వరకు డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యలో వివిధ కోర్సుల్లో బోధన సాగిస్తున్నాయి. ఇందులో 70 శాతం సీట్లు కనీ్వనర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి బోధిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు సుమారు రూ.7,800 వేల కోట్ల చెల్లింపులు నిలిపివేయడంతో నిర్వహణ భారాన్ని భరించలేక అటు కాలేజీలు ఇటు విద్యార్థులు ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఫీజుల కోసం విద్యార్థులపై యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి, పుస్తెలు తాకట్టు పెట్టి ఫీజులు కడుతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. వసతి దీవెనకు మంగళం.. పిల్లల చదువులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు హాస్టల్ మెయింటెనెన్స్ (వసతిదీవెన) ద్వారా ఆరి్థక సాయం అందించి ఆదుకున్నారు. భోజన, వసతి ఖర్చుల కోసం ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఫీజులను నీరుగార్చగా.. వసతి దీవెనను ఏకంగా ఎత్తేసింది. విద్యార్థులకు రూ.2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు ఎగ్గొట్టింది. హాస్టల్ మెయింటెనెన్స్ ఇచ్చే అంశాన్ని పక్కన పడేసింది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్య అభ్యసిస్తున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు బృందం నమ్మబలికింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టింది. విద్యకు లోటు బడ్జెట్ఒక్కో విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు అవసరం. చంద్రబాబు ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు కేటాయింపులు చూపించి నిధులు మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. అదే వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద ఫీజుల కోసం రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కారు బకాయి పెట్టిన రూ.1,778 కోట్లు సైతం చెల్లించింది. కళాశాలలు సక్రమంగా నడిచేలా, విద్యార్థులు నిశ్చింతగా చదువుకునేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భరోసా కల్పించింది. ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. ఇలా ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క విద్యా దీవెన, వసతి దీవెన కోసమే ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. ‘ఎక్స్’లో ట్వీట్ల పిట్టలా లోకేశ్! ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పర్యవేక్షణలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కుదేలైంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అస్తవ్యస్తంగా మారింది. ప్రపంచ స్థాయి విద్య, క్వాంటం సెంటర్లు అంటూ ప్రచారం మినహా కళాశాలలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడం విద్యా నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఉన్నత విద్యపై సమీక్ష చేసినప్పుడల్లా అదిగో ఫీజులు చెల్లిస్తున్నాం.. ఇదిగో ఇచ్చేస్తున్నాం.. అంటూ ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్లు చేసుకోవడంతోనే లోకేశ్ కాలం గడిపేస్తున్నారు. ఈ తంతు గతేడాది జూన్ నుంచి మొదలు కాగా ఈ ఏడాది నవంబర్ వచి్చనా బకాయిలు చెల్లించకపోవడంతో కొండలా పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది జూలైలో కచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని యాజమాన్యాలకు హామీ ఇచ్చిన లోకేశ్ అక్టోబర్ చివరిలో కంటి తుడుపుగా విదిల్చారు. పుట్టపర్తిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం రూ.60 వేలు ఫీజు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా సమాచారం పంపించింది. తమకు రీయింబర్స్మెంట్ జమ కానందున ఫీజులు కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది.కదిరిలోని ఎస్ఎంజేఎల్ డిగ్రీ కాలేజీతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన కళాశాలలో సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో కొందరు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టి విద్యార్థులను పరీక్షలకు పంపించారు. కొందరు బాలికలను చదువు మానిపించి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నపరెడ్డి గారి గంగిరెడ్డి సొంతూరు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటుపల్లె కొత్తపల్లి. ఆయన కుమార్తె గౌరీప్రియ రాజంపేటలో ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో రూ.45 వేలు అప్పు చేసి కాలేజీలో చెల్లించారు. రెండో ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోందని వాపోతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి బీటెక్ ఎలాంటి ఆర్థిక ఆటంకాలు లేకుండా పూర్తయిందని గుర్తు చేసుకుంటున్నారు. ఎంబీఏ పూర్తయి ఏడాదిన్నర.. రామచంద్రపురం కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశా. ఫీజు చెల్లించలేదని సరి్టఫికెట్లు ఇవ్వడంలేదు. రూ.48,500 వరకు కట్టాలని చెబుతున్నారు. నాన్న ఇటుక బట్టీలో కార్మికుడు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నా – ఎస్.గంగరాజు, సందిపూడి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా నగలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించా మా కుమార్తె తిరుపతి సమీపంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో ఏడాది చదువుతోంది. ఇప్పటి వరకు ఫీజు రీయిబర్స్‌మెంట్ అందలేదు. కళాశాల యాజమాన్యం ఒత్తిడిని తట్టుకోలేక బంగారు నగలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించాం. నా భర్త చనిపోయారు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివించుకుంటున్నా. – సుభద్రమ్మ, విద్యార్థిని తల్లి, తిరుపతిమానసికంగా కుంగిపోతున్నా.. కర్నూలు జీఎన్ఎంలో నర్సింగ్ మూడో ఏడాది చదువుతున్నా. గతంలో మా అమ్మ ఖాతాలో జగనన్న విద్యా దీవెన సకాలంలో జమయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక కాలేజీ యాజమాన్యం ఖాతాలో జమకాలేదు. పెండింగ్ ఫీజులు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. ఇంట్లో ఫీజులు అడగలేక.. కాలేజీలో ఒత్తిళ్లు తట్టుకోలేక మానసికంగా కుంగిపోతున్నా. ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నాం. – కె.సురేష్, నర్సింగ్ విద్యార్థిసి.బెళగల్ మండలం, ముడుమూల మా పీక పట్టుకుంటుంది.. మా అబ్బాయి కార్తికేయ భీమిలి మండలంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ మూడో ఏడాది చదువుతున్నాడు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఒక క్వార్టర్ ఫీజు మాత్రమే జమ చేసింది. అప్పటికే కళాశాల యాజమాన్యం రూ.20 వేలు చొప్పున వసూలు చేసింది. జిరాక్స్ షాపుపై ఆధారపడి జీవిస్తున్న నేను అతి కష్టం మీద ఆ డబ్బులు కట్టా. లేదంటే సెమిస్టర్ పరీక్షలు రాయనివ్వబోమంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఉందనే కాలేజీలో చేర్చాం. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుంటే యాజమాన్యం మా పీక పట్టుకుంటుంది. – గంటా రాజు, భీమిలి మండలం సకాలంలో ఇస్తే మాకీ అవస్థలుండవు నా కుమారుడు హుసేన్ అమీద్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గతేడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. మాకు ఎలాంటి చర, స్థిర ఆస్తులు లేవు. చిన్న దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. ఏటా ప్రభుత్వం సకాలంలో ఫీజులు జమ చేస్తే మాకీ అవస్థలు ఉండవు. – హుసేన్‌బీ, విద్యార్థి తల్లి, పాములపాడు, నంద్యాల జిల్లాచిల్లి గవ్వ ఇవ్వలేదు.. నా కుమారుడు రోషన్ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. కళాశాలలో ఫీజు కట్టకపోతే పంపొద్దు అంటూ బెదిరిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం సాయం చేస్తుందనే ధైర్యంతో ఉన్నత విద్యలో చేరి్పంచాం. – బాబు, విద్యార్థి తండ్రి, చిత్తూరుమదనపల్లె సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ రెండో ఏడాది చదువుతున్న విజయ్‌బాబుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ చదివిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు అప్పులు చేసి జూన్‌లో రూ.25 వేలతో మొదటి ఏడాది ఫీజు కట్టారు. ఉన్నత చదువులు చదవాలని ఆశతో ప్రభుత్వాన్ని నమ్ముకుని ఎంబీఏలో చేరితే తన పరిస్థితి తల్లకిందులైందని.. రెండో ఏడాదీ ఫీజు తానే కట్టుకోక తప్పదని విజయ్‌బాబు వాపోతున్నాడు. -
వదిలిపెట్టం అన్నీ చూస్తున్నాం రాజా లోకేష్ కు కాకాణి వార్నింగ్
-
Vijayawada: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు
-
ఎన్నికల హామీలు మరిచిన కూటమిపై AISF ఆగ్రహం
-
విజయవాడలో హైటెన్షన్.. పోలీసుల బారికేడ్లు తోసేసి లోకేష్ ఇంటి ముట్టడి!
-
ట్రైనీ సీఎం.. నీతి ప్రవచనాలు లోకేష్ ను ఏకిపారేసిన అంబటి
-
‘సీఎం ట్రైనింగ్‌లో బిజీగా లోకేష్.. పవన్ జస్ట్ ఫొటోల డీసీఎం’
సాక్షి, తాడేపల్లి: ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలుపెడుతూ.. తనకు ఇచ్చిన శాఖను మాత్రం మంత్రి నారా లోకేష్ గాలికి వదిలేశారని వైఎస్సార్సీపీ గుంటూరు అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. నారా లోకేష్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ హస్టళ్లలో అన్నంలో పురుగులు వస్తున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు రోగాల పాలవుతున్నా పట్టించుకోవటం లేదు. కామెర్లతో పిల్లలు చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నారా లోకేష్ విద్యా, ఐటీ శాఖలను గాలికి వదిలేశారు. సీఎంగా ట్రైనింగ్ అవుతున్నారు. ఆదాయం ఉన్న శాఖల్లో వేలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఆయన ఉన్నారు. చిన్నవయసులోనే ప్రవచనాలు చెబుతూ కొత్త అవతారం ఎత్తారు. సోషల్ మీడియాలో జగన్ పై ఏఐ వీడియోలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒకవైపు దారుణమైన పోస్టులు పెట్టిస్తూ మరోవైపు ట్వీట్ లో ప్రవచనాలు చెప్తున్నారు. రాజకీయాల్లో దుష్ట సంప్రదాయాలు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు. మీడియాను అడ్డు పెట్టుకుని ప్రచారం పొందటమే పనిగా పెట్టుకున్నారు. పిల్లల ముందు చంద్రబాబు దారుణమైన అబద్దాలు చెప్పారు. తన వెన్నుపోటు రాజకీయాల గురించి వాస్తవాలు చెబితే బాగుండేది. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ యాంటీ హీరోలుగా తయారయ్యారు. హీరోలుగా నటిస్తూ విలన్ పనులు చేస్తున్నారు. వైఎస్ జగన్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అటు చంద్రబాబు కోసమూ పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాకే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని పవన్ కళ్యాణ్ అబద్దాలు చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ నిజాలేంటో అక్కడి రైతులే చెప్పారు(ఈ సందర్భంగా రైతులు పవన్ ఎదుట మాట్లాడిన వీడియోను అంబటి ప్రదర్శించారు. ప్రశ్నించటానికే పుట్టిన పార్టీ అని చెప్పుకున్న పవన్ ఎదుటివారు ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారు. కూటమికి సపోర్టు చేసిన విషయమ్మీద తన మనిషే ప్రశ్నించినా సమాధానం చెప్పలేక పోయిన పిరికి వ్యక్తి పవన్. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగానే కాదు.. మంత్రిగా కూడా పనికి రాడు. అసలు రాజకీయాలకే పనికి రాని వ్యక్తి పవన్’’ అని అంబటి మండిపడ్డారు.బూతులు మాట్లాడటంలో పవన్ కళ్యాణ్ ని మించినవారు లేరు. సోషల్ మీడియాలో లోకేష్ ఆర్గనైజ్డ్గా బూతులు మాట్లాడిస్తున్నారు. పవర్ లేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన జస్ట్ ఫోటోల ఉప ముఖ్యమంత్రి. అసలైన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోంది మాత్రం లోకేష్. అమరావతి నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరుగుతోంది. లోకేష్, పవన్ కళ్యాణ్ దోచుకుని దాచుకుంటున్నారు. ప్రజలే సరైన సమయంలో సమాధానం చెప్తారు. అధికారం కోసం ఇతరుల కాళ్లు పట్టుకోవడం కాదు. మేము కూటమితో పోరాడి అధికారంలోకి వస్తాం అని అంబటి ఉద్ఘాటించారు. -
పిల్లల అసెంబ్లీలోనూ రాజకీయాలే
సాక్షి, అమరావతి: రాజ్యాంగం విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీని సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న, మంత్రి లోకేశ్ రాజకీయ ప్రసంగాలతో విద్యార్థుల్లో విద్వేషాలు నింపేలా మాట్లాడారు. విద్యార్థులకు విజ్ఞాన యాత్రగా ఉండాల్సిన కార్యక్రమాన్ని సొంత అజెండా అమలు వేదికగా చేశారు.మొత్తం కార్యక్రమం నాలుగు గంటల పాటు జరిగితే.. అందులో మాక్ అసెంబ్లీ గంటన్నర పాటు జరిగింది. మిగిలిన రెండున్నర గంటలు పూర్తిగా రాజకీయ ప్రసంగాలకు కేంద్రమైంది. సీఎం చంద్రబాబు ప్రసంగం ఒక్కటే గంటా నలభై నిమిషాల పాటు సాగింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైవ్ టెలీకాస్ట్ చేసిన ఈ కార్యకమ్రంలో సీఎం, స్పీకర్ల రాజకీయ ప్రసంగాలే ప్రధానంగా సాగాయి. పోలీసులకు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదని.. తన పాదయాత్రలో ఇది గమనించానని లోకేశ్ వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? : స్పీకర్ అయ్యన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. రాష్ట్రం ఏమైపోయినా, గ్రామాలు, కుటుంబాలు ఏమైనా పర్లేదన్నట్లుగా ప్రతిపక్షం ఉందంటూ విద్యార్థుల్లో విద్వేషాలు రగిలేలా మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? ప్రజలు వారిని ఏం చేయాలి? ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలి? ఇక పెద్దలు నిర్ణయించాలి’.. అంటూ చంద్రబాబు వైపు చేతులు చూపుతూ అయ్యన్న మాట్లాడారు.రాజకీయాలు, స్కోత్కర్షతో సీఎం ప్రసంగంఈ మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం యావత్తూ రాజకీయాలు, వ్యక్తిగత గొప్పలే ప్రధానంగా సాగింది. ప్రతిపక్షంపై విద్యార్థుల్లో విషం నింపడమే లక్ష్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యే కావాలంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని చెప్పడంతో అంతా విస్మయం వ్యక్తంచేశారు. ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని నిజాంకి ఇస్తే నిజాం ఆ వజ్రాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడని కొత్త భాష్యం చెప్పారు.ఇక తాను తన చిన్నతనంలో లాంతరు వెలుగులో చదువుకున్నానని, దాంతో 1999లో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చానని.. ఇప్పుడు ఏకంగా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి వచ్చామని అన్నారు. ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు తన కీర్తిని తానే కీర్తించుకున్నారు. ఎప్పటిలాగే.. సెల్‌ఫోన్ తానే తెచ్చానని, టెక్నాలజీకి తానే ఆద్యుడినని, ఇప్పుడు టీచర్ స్థానంలో ఏఐ పనిచేస్తోందంటే దానికి తానే కారణమని గప్పాలు కొట్టుకున్నారు. -
Vijayawada: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి తీరుతాం: విద్యార్థి సంఘాలు
-
చంద్రబాబు, లోకేష్ ఏడుపులు.. YS జగన్ కు దీవెనలు
-
Ambati: లోకేష్ బాబుకు, ఆయన బాబుకు ముందుంది ముసళ్ళ పండుగ
-
జనసేనాని లేని సదస్సు
విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు అంతా ఉత్త ఫార్స్ మారింది. బిర్లా టాటా అంబానీ వంటి పెద్ద పారిశ్రామిక సంస్థలు ఏవి పెట్టుబడుల సదస్సు రాకపోగా చోటామోటా సంస్థలు స్టార్టప్ కంపెనీలు కొన్ని మాత్రమే కనిపించాయి. గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థలనే మళ్లీ పిలిచి మళ్లీ భూములు కేటాయించి మళ్లీ ఫోటోలు దిగడం మినహా రాష్ట్రానికి గొప్పగా లాభం జరిగింది ఏమీ లేదని పారిశ్రామిక విశ్లేషకులు అంటున్నారు.గతంలో వైయస్ జగన్ ఇదే సదస్సు నిర్వహించగా దానికి ముఖేష్ అంబానీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. నేడు అలాంటి పెద్ద తలకాయలు ఏవీ రాకపోవడం గమనార్హం. చోటామోటా సంస్థలతో ఉత్తుత్తి ఒప్పందాలు చేసుకుని లక్షలకోట్ల పరిశ్రమలు.. లక్షల్లో యువతకు ఉద్యోగాలు అంటూ మభ్యపెట్టడం మినహా వాటిల్లో గ్రౌండ్ అయ్యేవి చాలా తక్కువ అంటున్నారు.జనసేనాని ఎక్కడరాష్ట్రంలో జరుగుతున్న ప్రముఖమైన ఈవెంట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేకపోవడం వింత అనిపించింది. తెలుగుదేశానికి ప్రభుత్వానికి ఎప్పుడు ఏ అడ్డంకి ఆపద వచ్చిన అడ్డుగా నిలబడి ఆ డ్యామేజ్ అంతా మోసే పవన్ కళ్యాణ్ ఇలాంటి కార్యక్రమానికి హాజరు కాకపోవడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అని జనసైనికులు సందేహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జన సేన తరఫున జనసేన విప్ పిడుగు హరిప్రసాద్.. కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ మాత్రమే పాల్గొన్నారు. ఇతరత్రా ఇంకెవరు అక్కడ కనిపించకపోవడం విచిత్రంగా అనిపించింది. ఎంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు కచ్చితంగా ఉప ముఖ్యమంత్రి కి ఆహ్వానం ఉండాలి. లక్షల కోట్ల ఒప్పందాలు అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో ఆ ప్రభుత్వం ఏర్పాటుకు కారకుడైన పవన్ కళ్యాణ్ ఇలాంటి వేదికల మీద కనిపించకపోవడం వెనుక ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా అన్న సందేహాలు కూడా వెలువెత్తుతున్నాయి.తండ్రీకొడుకులకు ఎలివేషన్లుపవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం ఒక ఎత్తు అయితే రెండు రోజులు ఈవెంట్ ఆద్యంతం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ల కోసం ఇస్తున్న ఎలివేషన్ ఇంకో ఎత్తు. అసలు వచ్చే కంపెనీలు ఎన్ని అవి తెచ్చే పెట్టుబడులు ఎంత యువతకు లభించే ఉద్యోగాలు ఇవన్నీ అనే లెక్కలు పక్కన పెడితే లోకేష్ పవన్ కళ్యాణ్ లు అంతర్జాతీయ స్థాయి మేధావులు మాదిరిగాను ఆఖరికి లోకేష్ తను వేసుకున్న జాకెట్ తో ఫోటోను కూడా ఫేస్బుక్లో పెట్టి అది ఎక్కడ కొన్నది ...ఎక్కడ కుట్టించింది చెప్పండి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. పేరు ఊరు లేని కంపెనీలు వాటి యజమానులతో ఫోటోలు దిగడం ఆ కంపెనీ వేలాది కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటనలు.. వాస్తవ సమాచారాన్ని ప్రజలకు విడుదల చేసి అదేదో అద్భుతం జరిగిపోతుందన్నట్లుగా ప్రజలను నమ్మిస్తూ వచ్చారు. ఈ రెండు రోజుల కార్యక్రమం ఆద్యంతం లోకేష్ ను హీరోగా నిలబెట్టడానికి ఏర్పాటు చేసింది తప్ప రాష్ట్రానికి ఏమాత్రం పనికివచ్చేదిగా లేదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు చంద్రబాబు అంతర్జాతీయ మేధావి అన్నట్లుగా అనుకూల మీడియా దానికి తోడు సోషల్ మీడియా మరికొన్ని పెయిడ్ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్లు కూడా ఎక్కడ లేని హైప్ ఇస్తూ ఆయన్ను చాణక్యుడు అని ఎలివేషన్లు ఇస్తున్నాయి. మున్ముందు లోకేష్ ను పార్టీకి ప్రభుత్వానికి సైతం పెద్దదిక్కుగా నిలబెట్టడానికి ఈ వేదికను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇది రాష్ట్రానికి ఏమాత్రం కాదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమం కేవలం చంద్రబాబు లోకేష్ ల వ్యక్తిగత కార్యక్రమం లేదా కుటుంబ ఫంక్షన్ మాదిరిగా నిర్వహించుకొని వాళ్లకు వాళ్లే జబ్బలు చేర్చుకున్నారని జనసేన నేతలు కూడా లోలోన కామెంట్లు చేసుకుంటున్నారు. ఇక ఈ సదస్సుకు పవన్ కళ్యాణ్ ను ప్రోటోకాల్ కోసం అయినా పిలిచారా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.-సిమ్మాదిరప్పన్న -
స్టూడెంట్స్ చస్తున్నా.. నో యాక్షన్.. నో రియాక్షన్
-
ReNew సంస్థను రాష్ట్రం నుంచి పంపేసారంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు
-
క్రెడిట్ చోరీలో అడ్డంగా దొరికిన నారా లోకేష్
సాక్షి, విజయవాడ: క్రెడిట్ చోరీలో నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ (Renew) పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో సైతం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకుంది. పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా రెన్యూ పవర్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో భూ కేటాయింపులూ జరిగాయి. 600 మెగా వాట్లు, 300 మెగా వాట్లు సామర్థ్యం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అయితే విచిత్రంగా అదే రెన్యూ కంపెనీతో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌లో కూటమి ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. రెన్యూ సంస్థను గత 5 ఏళ్లలో రాష్ట్రం నుండి పంపేసారంటూ నారా లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారువై ఎస్ జగన్ తెచ్చిన కంపెనీతో మళ్ళీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుటుంటుంది. ఇప్పటికే వైఎస్ జగన్ తన పాలనలో అందించిన అనేక సంక్షేమ పథకాలు,రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీకి పాల్పడగా.. తాజాగా లోకేష్ సైతం రెన్యూతో ఒప్పందం కుదర్చుకుని క్రెడిట్ చోరీకి పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 జూన్ 20న రెన్యూ ప్రోజెక్టుకి అనుమతులు ఇస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జిఓ 15 జారీ చేసింది. 2024 ఫిబ్రవరి5 న రెన్యూకి రెండో ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నట్లు జారీ చేసిన జీవోల్లో పేర్కొంది. గత ప్రభుత్వంలో రెన్యూ పెట్టుబడుల ఒప్పందాలు, జీవోలపై ఇప్పటి సిఎస్,ఎనర్జీ సెక్రటరీగా కూడా ఉన్న విజయానంద్ సంతకాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వాటికి గురించి ట్వీట్ చేసి నారా లోకేష్ అభాసుపాలయ్యారు. -
ఎందుకు వచ్చారు.. వెళ్లిపోండి.. మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్
-
మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్
-
‘చంద్రబాబు మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు’
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నీచరాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలను , దైవాన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన తప్పిదాలు చేస్తున్న చంద్రబాబును ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే ఏకైక అజెండాతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ఏడాదిన్నర కాలంలో అనేక నిదర్శనాలున్నాయి. వైఎస్సార్సీపీపై నిందలు వేయడానికి తన ఎల్లో మీడియాను వాడుకుంటారు. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష తీర్చుకునేందుకు ముందుగా కొన్ని కథనాలను రాయిస్తారు. ఏదో జరిగిపోతుందనే భావన ప్రజలకు కలిగేలా చేస్తారు. ఆ తర్వాత ఏదో పెద్ద నేరం చేసేశారని నమ్మించడానికి దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తారు.చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే ఐపీఎస్ అధికారులతో సిట్ వేసి విచారణ చేయిస్తారు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి బలవంతంగా వారితో వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పిస్తారు.బెదిరించి వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పిస్తారు.లేదంటే భౌతికంగా దాడి చేసి చెప్పిస్తారు. బలవంతంగా పేర్లు చెప్పించడం .. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టడమే చంద్రబాబు ప్రభుత్వం పని. దేవుడిని సైతం తన స్వార్ధ రాజకీయాలకు వాడుకునే నీచమైన స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. చంద్రబాబు రాజకీయ కక్షలకు తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు.టిటిడిని అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌పై బురదజల్లుతున్నారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూని కల్తీ అయ్యిందని చంద్రబాబు దుర్మార్గంగా ప్రచారం చేశారు. జగన్‌పై బురద చల్లడానికే చంద్రబాబు ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారు.పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేశారు.సీబీఐ విచారణ జరిపించాలని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ద్వారా విచారణ చేయించాలని చెప్పింది.దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవద్దని చంద్రబాబుకు చురకలు అంటించింది. కోర్టుకు వెళ్లినందుకు వైవీ సుబ్బారెడ్డిపై కక్ష తీర్చుకునేందుకు వరుస కథనాలు రాయించారు. చిన్న అప్పన్న అనే వ్యక్తిని జూన్ 6వ తేదీన సిట్ విచారించింది. వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పాలని చిన్న అప్పన్నపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఏపీలో ఏదైనా పెద్ద ఇష్యూ జరగగానే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెస్తారు.నెయ్యిలో కల్తీ ఉందని ఇంత వరకూ నిరూపించలేకపోయారు.లడ్డూ ప్రసాదాన్ని ఇప్పటి వరకూ ఎక్కడికీ టెస్టుకు పంపించనే లేదు.కానీ లడ్డూ కల్తీ అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న అప్పన్న 2018 వరకూ వైవి.సుబ్బారెడ్డి వద్ద పీఏగా పనిచేశారు. అంతకంటే ముందు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వద్ద కూడా పనిచేశారు. చంద్రబాబు టార్గెట్ వైవీ సుబ్బారెడ్డి కాబట్టి వేరే నేతల పేర్లు బయటికి రావు. ఇప్పటి మంత్రి పార్థసారథి గతంలో టీటీడీ పర్చేజింగ్ కమిటీలో ఉన్నారు.వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ నేత కాబట్టి ఆయన్ని టార్గెట్ చేశారు.2014-19 మధ్య చంద్రబాబు హయాంలో నెయ్యి ఖరీదు 276 రూపాయలు మాత్రమే. ఏదో ఒక విధంగా దైవాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ, జగన్‌పై బురదజల్లడమే చంద్రబాబు పని. మా పార్టీ నుంచి ప్రజలను దూరం చేయాలన్నదే చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ చేస్తున్నది చాలా నీచమైన రాజకీయం. దేవాలయాలను, దైవాన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన తప్పిదాలు చేస్తున్న చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు. ఎవరిపై కక్ష తీర్చుకుందాం..ఎవరిని లోపల వేద్దామనేదే చంద్రబాబు ఆలోచన .చంద్రబాబు,లోకేష్ వైఎస్సార్సీపీపై కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి’అని హితువు పలికారు. -
ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నాకు సంబంధం లేదు
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యేలు ఇక నుంచి చేసే తప్పులకు.. తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి నేతల తీరుపై చర్చ జరిగింది. ఆ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా ఇన్ఛార్జ్ మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో అన్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు ఆ వ్యవహారంతో ఇక తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఎమ్మెల్యేల బాధ్యత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు. ఇవాళ మూడున్నర గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అంశాలపై చర్చ అనంతరం మంత్రుల వద్ద చంద్రబాబు ఎమ్మెల్యేల పని తీరుపై చర్చ జరిగింది. ఇందులో 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు తమ పద్దతులు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో.. తన పార్టీ ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని టీడీపీ అధిష్టానం అంగీకరించింది. ఎమ్మెల్యేల అవినీతి, దోపిడీ బాగోతాలపై అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించి.. ఆ నివేదికను తెప్పించుకున్న చంద్రబాబు, లోకేష్‌లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అనవసరంగా కొందరికి టికెట్లు ఇచ్చామని మంత్రుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే యువ తరాన్ని ప్రొత్సహించే క్రమంలో టికెట్లు ఇచ్చామని.. కానీ, ఫస్ట్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లకు మంచి చెడులు తెలియడం లేదంటూ లోకేష్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్యేల రచ్చ.. సర్వేపై బాబు, లోకేష్ గగ్గోలు!
సాక్షి, విజయవాడ: అధికార టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని, వారికి అనవసరంగా సీటు ఇచ్చామని ఇటీవల చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, ఎమ్మెల్యేల దోపిడీపై తాజా సర్వే ఒకటి చంద్రబాబును టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది.తాజాగా చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కొందరు మంత్రులపై చంద్రబాబు మండినట్టు సమాచారం. అలాగే, ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని చంద్రబాబు, లోకేష్‌లు అంగీకరించారు. ఎమ్మెల్యేల దోపిడీపై ఎస్-9 సంస్థ సర్వేలో(టీడీపీ సొంత సర్వే) తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలిసింది. సర్వే రిపోర్టులు, కార్యకర్తల ఫిర్యాదులతో చంద్రబాబు, లోకేష్ గగ్గోలు పెట్టినట్టు తెలిసింది. అంతకుముందు.. కొంత మందికి టికెట్లు అనవసరంగా ఇచ్చానని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.కాగా, యువకులను ఎంకరేజ్‌చేసే పనిలో భాగంగా టికెట్లు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నప్పటికీ కొందరు నేతలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసినట్టు తెలిసింది. మరోవైపు.. తాజాగా తొలిసారి ఎమ్మెల్యేలకు మంచి చెడులు తెలియడం లేదన్న లోకేష్ వ్యాఖ్యలు చేయడం ఈ ఎపిసోడ్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనా తండ్రి, కొడుకుల వ్యాఖ్యలతో టీడీపీ ఎమ్మెల్యేల దోపిడీ బండారం బట్టబయలైంది. ఇక, ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. -
పవన్, లోకేష్.. నాకు న్యాయం చేయండి: సుధా మాధవి
సాక్షి, విజయవాడ: టీడీపీ నాయకురాలు సుధా మాధవి మరోసారి తమ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కోసం తాము ఎంతో కష్టపడామని.. తన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేనూ ఆడబిడ్డనే.. పవన్ కల్యాణ్, నారా లోకేష్ నా ఆవేదన వినండి. మాకు న్యాయం చేయకపోతే చావే శరణ్యం అని కన్నీరుపెట్టుకున్నారు.టీడీపీ నాయకురాలు సుధా మాధవి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ కోసం చాలా కష్ట పడ్డాను. టీడీపీ నుండి టికెట్ ఇప్పిస్తామని నా నుండి ఏడు కోట్లు తీసుకున్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మా డబ్బులతో ఆస్తులు కొన్నాడు. టీడీపీకి నేను చాలా చేశాను.. నా సేవలను గుర్తించండి. వేమన సతీష్ ఒక్కడే కార్యకర్త కాదు.. మేము కూడా కార్యకర్తలమే. నాకు అన్యాయం జరిగింది కాబట్టే నేను జై భీమ్ రావ్ పార్టీ నుండి పోటీ చేశాను. నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకున్నారు. మీ ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇలాగే స్పందిస్తారా?.వేమన సతీష్ ఏడు కోట్లు తీసుకొన్నారు.. 43 లక్షలు చెక్ ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఆరు కోట్లు కూడా వేయాలి. మాకు అన్యాయం జరిగింది అని వీడియో తీసి పంపించాము. మా సమస్య చంద్రబాబుకి చెప్పుకుందామని విజయవాడ వస్తే పోలీసులు తీసుకొని వెళ్లారు. వేమన సతీష్‌కి మేము డబ్బులు ఇవ్వలేదని వీడియో తీయించారు. ఒక పోలీస్ అధికారి కులం పేరుతో బూతులు తిట్టారు. మా బిడ్డలు వాళ్ళ కస్టడీలో ఉన్నారని నమ్మించారు.. అలాగే భయపెట్టి వీడియో తీయించారు. మేము ఎన్ని ఆస్తులు అమ్ముకున్నది విచారణ చేసి న్యాయం చేయాలి. మేము ఇచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కొన్నారు. ఎలక్షన్ సమయంలో డబ్బులు ఎలా వచ్చాయి.రాజేష్ మహాసేన , యూట్యూబ్‌లో మాట్లాడే వాళ్ళు మాకు న్యాయం చేపించండి. జడ శ్రావణ్ కోర్టులో కేసు వేసిన తర్వాత మాత్రమే.. మమ్మల్ని పోలీసులు విడుదల చేశారు. లేదంటే మమ్మల్ని అక్కడే చంపేసేవాళ్లు. నేను ఆడబిడ్దని.. నాకు న్యాయం చేయండి. డబ్బులు ఇచ్చిన వీడియోలు అన్ని ఉన్నాయి. మాకు అంత సీన్ లేదు అని ప్రచారం చేస్తున్నారు. మహా టీవీలో డిబేట్ పెట్టండి.. సతీష్‌ని పిలవండి.. నేను వస్తాను. నా కుటుంబానికి రక్షణ కల్పించి.. మా ఆస్తులు మాకు ఇప్పించండి. చనిపోదాం అనిపిస్తుంది.. అలా వేధిస్తున్నారు. పవన్, లోకేష్ నా ఆవేదన వినండి. ఆస్తులు పోగొట్టుకొని నడి రోడ్డు మీద నిలబడ్డాను. మాకు బుద్ధి వచ్చింది రాజకీయాల వైపు ఇంకెప్పుడు చూడను. మాకు న్యాయం చేయకపోతే మాకు చావే శరణ్యం. చంద్రబాబు, లోకేష్‌కి కూడా మా సమస్య తెలియజేశాం. కిడ్నాప్ చేశారు కాబట్టే మేము మీడియా ముందుకు వచ్చాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
నారా లోకేష్ పై గోరంట్ల మాధవ్ ఫైర్
-
లోకేష్.. ఎంత మందిని జైలులో పెడతావు?: అంబటి
సాక్షి, తిరుపతి: మంత్రి నారా లోకేష్‌కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారం శాశ్వతం కాదు.. ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. మీ నాన్నను జైల్లో పెట్టారని నీకు కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీలో ఏ ఒక్కరూ భయపడరు. మా పార్టీ నాయకులపైన అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడతామని చూస్తే దీని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అధికారం శాశ్వతం కాదు. అధికార మదంతో లోకేష్ ఉన్నాడు. తన తల్లిని అంబటి రాంబాబు అవమానించాడు అంటూ లోకేష్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. విచారించుకోండి నేను ఏరోజు ఆయన తల్లిని అవమానించలేదు. మీ నాన్నను జైల్లో పెట్టారని నీకు కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా?. ఎంత మందిని జైలులో పెడతారు?. జైల్లో పెడితే బయటకు రామా.. మీరు ఏమైనా చంపేస్తారా. జైల్లో నుంచి మీ నాన్న చంద్రబాబు బయటకు రాలేదా?. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మొదలైంది. అన్నీ ప్రజలే చూస్తున్నారు. రాబోయే మూడేళ్లలో మేమంతా ఎలా బలపడతామో మీరే ఊహించుకోండి. కూటమి ప్రభుత్వానికి ఓట్లు ఎందుకు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఆయన్ను ఓడించాము అనే బాధతో ప్రజలు ఆయన పర్యటనకు తరలి వస్తున్నారు.మీ రెడ్‌బుక్ బంగాళాఖాతంలో మునగడం ఖాయం. పవన్ కళ్యాణ్.. మీరు 15 ఏళ్లు కాదు జీవితాంతం కలిసే ఉండండి మాకేం నష్టం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగింది మీరు కలిసి ఉంటేనే మాకు కలదు సుఖం. మేము బలపడతాం. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ.. చిరంజీవిని అవమానిస్తే పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. మీరు పోరాట యోధులు అన్నారు. అన్యాయం జరిగితే సహించరు అన్నారు ఇదేనా?. నువ్వు చెప్తే నమ్మి కాపులందరూ చంద్రబాబుకు ఓటు వేశారు. మీ పోరాట పటిమని గంగలో ముంచేయండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కళ్యాణదుర్గంలో నారా లోకేష్ కు చేదు అనుభవం
-
కళ్యాణ దుర్గంలో నారా లోకేష్‌కు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. అంబేద్కర్ విగ్రహానికి నారా లోకేష్ నివాళులర్పించకుండా వెళ్లిపోయారు. దీంతో లోకేష్ తీరుపై దళిత సంఘాలు, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది.'తల్లికి వందనం' ఎగనామంఎన్నికల సమయంలో బూటకపు హామీలు గుప్పించి...అధికారంలోకి రాగానే హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించడం చంద్రబాబు నైజం. ఈ క్రమంలోనే తల్లికి వందనం పథకాన్ని కొందరికే అమలు చేసి మరోసారి తల్లులను మోసం చేశారు. అర్హత ఉన్న వారందరికీ తల్లికి వందనం డబ్బు జమ చేస్తామంటూనే నేటికి ఏడాదిన్నర దాటినా నిబంధనల పేరుతో నేటికీ నియోజకవర్గంలో వేలాది మంది తల్లులకు డబ్బు జమ చేయకుండా చేతులు దులుపుకున్నారు.జీఓ ప్రకారం తల్లికి వందనం పథకం లబ్ధిదారుల్లో భారీగా కోత పడింది. నియోజకవర్గ వ్యాప్తంగా 309 మొత్తం పాఠశాలలుండగా 38,221 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 38,221 మందికి తల్లికి వందనం పథకం వర్తింపజేయాల్సి వుంది. కానీ భూమి లేకున్నా భూమి ఉందని, వాహనం ఉందని, ప్రైవేట్ జాబ్ ఉందని ఇలా పలు రకాలుగా తల్లులకు ఎగనామం పెట్టేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. కులం, మతం, వర్గం పార్టీ చూడకుండా జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా సకాలంలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసేవారు. దీనికి తోడు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, జగనన్న విద్యా కానుక, విదేశీ విద్యా దీవెన తదితర అనేక పథకాలు క్యాలెండర్ ప్రకారం అమలు చేసేవారు.పాఠశాలలు తెరిచే సమయానికే ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారానే నియోజకవర్గ వ్యాప్తంగా ఏటా 27,923 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.77.72 కోట్లు జమ చేసేవారు. అంతే కాకుండా విద్యా దీవెన పథకంలో 24,082 మంది ఇంటర్ విద్యార్థులకు ఏటా రూ.41.67 కోట్లు అందజేశారు. జగనన్న వసతి దీవెన కింద 22,543 మంది విద్యార్థులకు రూ.21.24 కోట్లు బ్యాంకు ఖతాల్లో జమ చేశారు. ఇలాంటి పథకాలను పక్కాగా అమలు చేయడంతో తల్లిదండ్రులపై పిల్లల చదువుల భారం పెద్దగా పడేది కాదు. -
ప్రజాధనంతో బాబు, లోకేశ్ షికార్లు
సాక్షి, అమరావతి: ‘మోంథా తుపానుతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలు, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. చంద్రబాబు విదేశాలకు, ఆయన కొడుకు మంత్రి లోకేశ్ క్రికెట్ మ్యాచ్‌లకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి షికార్లు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు కథనాలను వండి వార్చుతున్నారు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.మోంథా తుపానుతో 8 మంది చనిపోయారని, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారికి ప్రభుత్వం అండగా నిలవలేదన్నారు. తండ్రీ కొడుకుల టూర్లపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో గ్రీవెన్స్ డ్రామా మొదలు పెట్టారని.. లోకేశ్ 4 గంటల్లోనే 4 వేల అర్జీలను పరిశీలించారంటూ జాకీలెత్తి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ‘అసలు అన్ని అర్జీలు పరిశీలించడం సాధ్యమా? ఇద్దరూ అతిపెద్ద ఈవెంట్ మేనేజర్లుగా మారి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారు. పాలనను గాలికొదిలేసి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ప్రజాధనంతో చంద్రబాబు 75 సార్లు, లోకేశ్ 80 సార్లు హైదారాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్లలో తిరిగారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 120 సార్లకు పైగానే వెళ్లారని అన్నారు. -
Nellore: మహిళలను తరలిస్తున్న ఆటోను ఢీకొట్టిన కారు
-
లోకేష్ నెల్లూరు పర్యటనలో అపశృతి
-
అంబేద్కర్ విగ్రహంపై రెడ్ బుక్ రాజ్యాంగం
-
ఆదుకోవాల్సింది పోయి.. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?: సతీష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి మండిపడ్డారు. లోకేష్ 4 గంటల్లో 4వేల దరఖాస్తులు తీసుకున్నారని ఎల్లోమీడియా రాసింది. పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలు నమ్ముతారో లేదో తెలుసుకోరా? అని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ల విషయంలోనూ దారుణంగా మోసం చేశారు. 5 లక్షల మంది పెన్షన్ దారులను తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు’’ అంటూ నిలదీశారు.‘‘రైతులపై తుపాను దెబ్బ కొడితే వారిని ఆదుకోవాల్సిందిపోయి గాలికి వదిలేశారు. చంద్రబాబు లండన్, లోకేష్ క్రికెట్ చూడటానికి వెళ్లారు. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?. గూగుల్ సెంటర్ వల్ల లక్షా 80 ఉద్యోగాలు వస్తాయని పబ్లిసిటీ ఇస్తున్నారు. నిజానికి పదివేల ఉద్యోగాలైనా తెప్పించగలరా?. ఆరోగ్యశ్రీ లేక జనం అల్లాడిపోతుంటే పట్టించుకోరా?. ఏ ఆస్పత్రిలోనూ ఆరోగ్యశ్రీ అమలు కావటం లేదు. రాష్ట్రంలో రైతులు బతకటమే కష్టం అన్నట్టుగా మారింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు టమోట, మామిడి, ఉల్లి పంటలను రోడ్డు మీద కాలువల్లో పడేసే దుస్థితి నెలకొంది...అన్ని వర్గాల ప్రజలు అసహనంతో ఉన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సమస్యలతో జనం ఉంటే చంద్రబాబు లండన్‌లో విహరిస్తారా?. లులూ మాల్ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేస్తారా?. అందులో పెద్ద స్కాం ఉందన్న సంగతి సాధారణ ప్రజలకు కూడా తెలుసు. వైఎస్ జగన్ 18 సార్లు ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నిస్తే ఒక్క దానికీ సమాధానం చెప్పలేదు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్క జడ్పీటీసీ అయినా గెలవగలరా?. జగన్ సీటు ఇస్తే గెలిచి తర్వాత పార్టీ మారిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?..పోలీసులను అడ్డం పెట్టుకుని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి వీరుడిలాగ మాట్లాడతావా?. పోలీసులు లేకుండా ఒక్క సీటైనా గెలవగలరా?. అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. మహిళా క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదు?. మిగతా అన్ని రాష్ట్రాల క్రికెటర్లకు ఆయా ప్రభుత్వాలు కోటి చొప్పున పారితోషికం ఇచ్చాయి. ముంబాయి వెళ్లి క్రికెట్ చూసిన లోకేష్ ఎందుకు శ్రీచరణికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు?. నకిలీ మద్యాన్ని బయట పెట్టారనే జోగి రమేష్ ని అరెస్టు చేశారు. బెల్టు షాపులోని మద్యనే బస్సు ప్రమాదానికి కారణమన్నందుకు మా పార్టీ నేత శ్యామలాకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఏ గ్రామానికి వచ్చినా బెల్టుషాపును చూపిస్తా’’ అంటూ సతీష్‌రెడ్డి సవాల్ విసిరారు. -
Jada Sravan: జగన్ హయాంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే..
-
‘రాష్ట్రంలోని దుర్మార్గాలకు ఆద్యుడు నారా లోకేష్’
సాక్షి,తాడేపల్లి: రాజ్యాంగ ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ.. రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగపండులా తయారయ్యాయని.. వైయస్సార్సీపీ స్టేటే కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృతరూపం బట్టబయలైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యమైందని.. కూటమి ప్రభుత్వం నేర స్వభావాన్నే రూల్ ఆఫ్ లా గా నడుపుతుందని మండిపడ్డారు. రెండేళ్లలోనే ఇంతటి దారుణమైన పాలన ఉంటే... రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే ప్రమాదముందని.. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, మీడియా వీటిని అధ్యయనం చేసి.. జరుగుతున్న దారుణాలను ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...రాష్ట్రంలో ప్రభుత్వం శూన్యం..2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రభుత్వం అన్నమాటకు నిర్వచనమే మారిపోయింది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం మెజారిటీ ప్రజల కోరికలు, ఆకాంక్షలన్నింటికీ ఫలానా పార్టీ పరిష్కరిస్తుందని ఎన్నుకుంటారు. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక భాగం అయితే రెండోది.. పరిపాలన. పాలనా పరమైన విధులన్నీ అధికారులు చేస్తున్నప్పుడు .. ప్రభుత్వం అవసరం ఎందుకంటే అది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మేనిఫెస్టోను అమలు చేస్తుంది. అదే ప్రజాస్వామ్యం. అది ఏ మేరకు నెరవేరుతుందన్నది వేరే విషయం. అలా అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక పద్దతి ప్రకారం నడవడానికి అవసరమైన మార్గదర్శకం ఇచ్చి నడిపే ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది అనుకుంటే.. అది 2024 జూన్ తర్వాత ఈ రాష్ట్రంలో శూన్యం అయింది. పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ నేరస్వభావాన్నే ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ.. బ్యూరోక్రాట్స్ లో అలాంటి వాళ్లను దగ్గరకు తీసుకుంటున్నారు. కానివాళ్లను మెడలు వంచడమే, దూరం పెట్టడమే చేస్తుండడంతో వాళ్లు కూడా గత్యంతం లేక అదే దారిలో పయనిస్తున్నారు. ఇలా ఈ ఏడాది కాలంలో వ్యవస్థలను తమ నేర స్వభావాలకు అనుకూలంగా... తాము చేసే తప్పులకు ప్రొటెక్ట్ చేసేదిలా మార్చివేస్తున్నారు.టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ...మాజీ మంత్రి, వెనుకబడిన వర్గాలకు చెందిన బలమైన నాయకుడిగా ఎదిగిన జోగి రమేష్ ను ఏ తప్పు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారు. ఈ కేసు చూస్తే... నేరం జరుగుతున్న మొలకల చెరువు, ఇబ్రహీం పట్నం, అనకాపల్లి, ఏలూరులో నకిలీ మద్యం తయారీ చేస్తున్న చోట పోలీసులు పట్టుకున్నారు. నిన్నా, మొన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మా పాత్ర లేదు అని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ సాక్షాత్తూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ 2024 అభ్యర్ధి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ ఫ్యాక్టరీ బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్లు అవుతుంది. ఒకవైపు వైయస్సార్సీపీ నాయకుల తప్పు లేకపోయినా... వారిని అరెస్టులు చేస్తుంటే... రెండేళ్లుగా నకిలీ లిక్కర్ తయారీ మొత్తాన్ని వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ ఉన్నాడంటూ అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెట్టడంతో మొదలై... వైయస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తూ.. తప్పుడు స్టేట్ మెంట్లతో వేరేవాళ్లను అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచారు.ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నేతలపై కేసులు..పల్నాడు వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా తప్పుడు కేసులు నమోదు చేసారు. స్ధానిక టీడీపీ నాయకులు వాళ్ల మధ్య అంతర్గత కలహాలతో గొడవపడి జంట హత్యలు జరిగితే... దాని మీద ఎస్పీ కూడా ఇది టీడీపీ అంతర్గత విభేదాల వల్లే అని ప్రకటన ఇచ్చినా, ఘటనా స్ధలంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వాహనంతో సహా పలు ఆధారాలున్నా.. వైయస్సార్సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను జైల్లో పెట్టారు.ఇటీవల సోషల్ మీడియా యాక్టవిస్టు సవీంద్ర రెడ్డిను ఏదో పోస్టు పెట్టారని అరెస్టు చేసి.. కన్ఫషన్ కింద వేరకొటి నమోదు చేసి.. అదీ సరిపోదనుకుని ఏకంగా గంజాయి ప్యాకెట్ పెట్టి కేసు నమోదు చేశారు. అయితే అదృష్టవశాత్తూ అరెస్టు చేసిన టైమింగ్ ఆధారాలు, పోలీసులు చెప్పిన విషయాలు సరిపోలకపోవడంతో హైకోర్టు సీబీఐకి రిఫర్ చేయడంతో ఆయన బైటపడ్డాడు. అదే కేసులు మరికొంత యువకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.టీడీపీ నేతల తప్పులనూ వైఎస్సార్సీపీకి అంటగట్టే దుర్మార్గం..ఇక తునిలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంలో ఈ ఘాటుకానికి పాల్పడింది కూడా టీడీపీ నేతే. టీడీపీ నేతను పట్టుకుంటే... రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘాతుకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఆందోళన రావడంతో ఉలిక్కపడ్డ ప్రభుత్వం, పోలీసులు కస్టడీలో ఉన్న వ్యక్తి చెరువులో దూకి చనిపోయాడని పోలీసులు చెప్పారు. మరుసటి రోజు లైంగిక అకృత్యానికి పాల్పడ్డ వ్యక్తి కుమారుడు తన తండ్రి మరణంపై అనుమానం ఉందని కేసు పెట్టాడు. మరోవైపు మైనర్ బాలికపై లైంగిక అఘాయిత్యానికి పాల్డడ్డ వ్యక్తిని వీడియో తీసి... బాలిక చదువుతున్న స్కూల్ కి పంపిస్తే... దానికి అతనిపై చనిపోయిన వ్యక్తి కుమారుడు చేత ఫిర్యాదు తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. అందులో అదర్స్ అని రాయడం ద్వారా వైయస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేరం చేసిన వాళ్లకు సంబంధించి అనుమానాస్పదంగా చనిపోయాడని చెబుతూ... నిందితుల తరపున ఎందుకు వకాల్తా తీసుకున్నారు. వీరికి ప్రభుత్వ అండదండలు పూర్తిగా ఉన్నాయి. జోగి రమేష్ అరెస్టులో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో టీడీపీ నేతలే ఉన్నారు.. ఆధారాలు సైతం అక్కడే ఉంటే... ఇక్కడ విజయవాడలో జోగి రమేష్ ను అరెస్టు చేస్తున్నారు. తప్పుడు కేసు పెట్టడానికి కూడా జనం నమ్ముతారా ? కోర్టులో నిలబడుతుందా? అన్నది ఆలోచించడం లేదు. ఇవాల్టికి అరెస్టు చేసి.. రెండు మూడు నెలలు జైల్లో వేస్తే.. మిగిలిన విషయాలు తర్వాత చూసుకోవచ్చు అని భావిస్తున్నారు. నకిలీ లిక్కర్ కేసులో అసలు సూత్రధారి జయచంద్రా రెడ్డి, అతనే ఫ్యాక్టరీ పెట్టాడు, అతనికి సంబంధించిన బార్లలో నకిలీ లిక్కర్ అమ్మకాలు చేస్తున్నాడని పోలీసులే చెప్పారు. అతను సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, కానీ వారి అరెస్టులు మాత్రం ఉండవు.నకిలీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జయచంద్రా రెడ్డికి చంద్రబాబు బీఫామ్ ఇస్తున్న దృశ్యం చూస్తే.. జనరల్ గా బీపామ్ తీసుకున్నప్పుడు పక్కనే కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ జయచంద్రారెడ్డి పక్కనే ఆయన ఆత్మలా జనార్ధనరావు పక్కనే ఉన్నాడు. ఇది పక్కన పెట్టి.. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం జోగి రమేష్ తో ఏదో పెళ్లిలో జనావర్ధన రావు ఫోటో దిగితే దాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబుతో బీపామ్ తీసుకుంటున్న జయచంద్రా రెడ్డి, పక్కనే జనార్ధన రావు ఉంటే దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు. వీళ్లద్దరూ ఆఫ్రికాలో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వాస్తవానికి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ వ్యవహారం బయటపడ్డంతోనే రాష్ట్రంలో ఒక దుమారం చెలరేగింది. మద్యం సేవించే వారిలోనూ ఒక భయం మొదలైంది. దీన్ని డైవర్షన్ చేయడానికి.. సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవడం అలవాటైన చంద్రబాబు... తక్షణమే నకిలీ మద్యం వ్యవహారాన్ని జోగి రమేష్ వైపు తిప్పాడు. జోగి రమేష్ , వైయస్సార్సీపీకి దెబ్బ కొట్టడంతో పాటు, తన పార్టీ నేతలైన జయచంద్రారెడ్డి ఇతరులను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఆఫ్రికాలో ఉన్న జనార్ధన రావుతో ముందే మాట్లాడుకుని అతడ్ని ఇండియాకు తీసుకొచ్చారు. ఎయిర్ పోర్టులో జనార్ధరావు చొక్కా, పోలీసుల కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన పేరు మీద విడుదల చేసిన వీడియోలో చొక్కా రెండూ ఒకటే. ఇదెలా సాధ్యం. మరో కీలకమైన విషయం జనార్ధన రావు ఫోన్ దొరికితే అందులో జయచంద్రా రెడ్డితో పాటు టీడీపీ నేతల వివరాలు, వారి లావాదేవీలు బయటపడతాయి కాబట్టి ముంబాయిలో పోన్ పోయిందని చెప్పారు. ఆ తర్వాత జనార్ధన రావు ఒక వీడియో విడుదల చేశాడు. ఇది ఎలా అతుకుతుంది.ఆగని నకిలీ లిక్కర్ తయారీ...లిక్కర్ బాటిల్లు చూసి కొనండి.. క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించింది. అంటే నకిలీ లిక్కర్ తయారిని ప్రభుత్వం అంగీకరించింది. వైన్ షాపులలో క్యూ ఆర్ కోడ్ పెడతారు సరే.. బెల్టు షాపులలో ఏం క్యూఆర్ కోడ్ ఉంటుంది. అక్కడెలా నకిలీ లిక్కర్ ని నియంత్రిస్తారు. రాష్ట్రంలో లక్షకు పైగా బెల్టు షాపులున్నాయి. వీటి ద్వారా ఈ నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. ఇవి కాక వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చారు. అక్కడ లూజ్ సేల్ ఉంటుంది. అంటే అక్కడ కూడా నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోడా మిషన్లు మాదిరిగా కూటమి పాలనలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. దానికి సాక్ష్యం బెల్టు షాపుల్లో జరుగుతున్న అమ్మకాలే. ప్రభుత్వానికి అంతంత మాత్రం ఆదాయం పెరిగింది. లిక్కర్ అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఇదే నిదర్శనం. జోగి రమేష్ అరెస్టు అత్యంత దుర్మార్గం, అన్యాయం. నియంతల పాలనలో కూడా లేనంతగా వ్యవస్దలను కూటమి ప్రభుత్వం కంట్రోల్ చేసి... హిట్లర్ కంటే దారుణంగా పాలన సాగిస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ దారుణాలన్నీ కొనసాగిస్తున్నాడు.తప్పులు నిలదీస్తే కేసులు - నారా వారి రూల్ ఆఫ్ లా...కేవలం తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా, పూర్తి స్పృహతోనే, క్రూరమైన, అణిచివేత ధోరణితో కూడిన పాలన సాగిస్తున్నారు. ప్రత్యర్థుల వాయిస్, ప్రజల ఆకాంక్షలు బయటకు వినిపించకుండా గొంతు నొక్కడంతో పాటు వీరి చేస్తున్న దుర్మార్గాలను ఎదుట వాళ్ల మీద నెట్టడంలో వీళ్లు సిద్ధహిద్దులు. లోకేష్ వీటన్నింటికీ ఆద్యుడు. ముందు అరెస్టు చేసి.. సెల్ఫ్ కన్ఫెషన్ పేరుతో వారే స్టేట్ మెంట్లు తయారు చేస్తున్నారు. కోర్టుల్లో నిలబడినా, లేకున్నా ముందుగా జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ కేసు తీసుకున్నా మూడు అంశాల మీదే నడుస్తుంది. తామనుకున్న వారిని అరెస్టు చేయడం, వారి పేరు మీద స్టేట్మెంట్ రాసుకోవడం, ఎవరి మీద వాళ్లకు కోపం ఉంటే.. వాళ్ల స్ధాయిలను బట్టి వారి పేర్లు కూడా కేసులో చేర్చడం పనిగా మారింది. ఇలా నెలల తరబడి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది నారా వారి కొత్త రూల్ ఆఫ్ లా. కన్ఫెషన్ పేరుతో అరెస్టు చేయడం, తమకు నచ్చిన సెక్షన్లతో కేసు నమోదు చేయడం అలవాటుగా మారింది. అరెస్టు చేసిన తర్వాత వాళ్ల ఇంట్లో సోదాలు చేసి... అక్కడ పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు చూపిస్తున్నారు. అవి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తమకు కావాల్సిన అధారాలను వీళ్లే అక్కడ పెట్టి.. వాటినే కోర్టులో ఎవిడెన్స్ గా పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి.నిష్పాక్షపాతంగా దర్యాపు చేయడానికి ఇన్వెస్టిగేషన్ అధికారికి చట్టానికి లోబడి ఇచ్చిన వెసులుబాటును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. కోర్టులు కూడా ఆమాత్రం వెసులు బాటు ఇవ్వకపోతే దర్యాప్తు ఎలా ముగుస్తుందని అనుకుంటున్న పరిస్థితి. దానివల్ల నేరం చేయకుండా కూడా అధికారంలోకి ఉన్నవాడికి నచ్చకపోతే శిక్షకు గురవుతావన్నది రుజువు అవుతుంది. శిక్ష కరారు కాకముందే.. నిందితుడు 50 రోజులో, 60 రోజులో... ఏ నేరం చేయకున్నా, ఆధారాలు లేకున్నా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. ఈ కేసులో నిజానికి ఇంకా రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ జరుగుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరిస్తుంది కాబట్టే... లిక్కర్ షాపులలో మద్యం బ్యాటిళ్లకు క్యూ ఆర్ కోడ్ పెట్టింది. దీన్ని అందరూ గమనించాలి.ప్రజా రక్షణ పట్టని ప్రభుత్వమిదికాశీబుగ్గ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రమాదం అంటేనే అకస్మాత్తుగా జరుగుతుంది. ఎవరూ ప్రమాదాలు జరుగుతాయని ముందే ఊహించరు. కానీ ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పోలీసులదే. కాశీబుగ్గ ఘటన జరిగిన వెంటనే అధికార తెలుగుదేశం పార్టీ మంత్రులు మాకు సంబంధం లేదు.. అది ప్రైవేటు దేవాలయం అని ప్రకటించారు. ఘోరం జరిగిన వెంటనే అది మాది కాదు అన్నారంటే.... తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే. సిగ్గున్న ప్రభుత్వం ఇలా చేస్తుందా? ఏ మాత్రం బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం ఇలా చేస్తుందా? ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపడుతున్నారంటే.. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, సింహాచలంలో ప్రమాదం జరిగింది ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. కారణం మీ ప్రాధాన్యాతలు వేరు. బాథ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావించడం లేదు. వ్యవస్ధలో పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా... దాన్నుంచి తప్పించుకోవడంతో పాటు పక్కవారిమీదకు నెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆలయ ధర్మకర్త తాను ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. ఒకవేళ చెప్పకపోయినా.. రెండేళ్ల నుంచి నిర్వహణలో ఉన్న ఆలయంలో పవిత్ర దినం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న విషయం తెలియదా? పలాస లాంటి పట్టణంలో ఒకే దగ్గర అంత పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటే నాకు తెలియదని ఎలా తప్పించుకుంటారు ? చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న ప్రచార సాధనాల బలం తలకెక్కడంతో దేన్నీ పట్టించుకోవడం లేదు. ఏం జరిగినా ఎదుట వాళ్లదే తప్పు అని చెప్పడం పరిపాటిగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయడమో.. సంబంధిత అధికారులను బాధ్యులను చేయకుండా... విచారణ చేయకుండానే, అసలేం జరగలేదని ముందే చెబితే ఇది ఏ రకమైన పాలన? ఎక్కడైనా సమస్య వచ్చినా పోలీసులో, అధికారులో చూసుకుంటారు, వారికి ఆ మేరకు అవగాహన ఉంటుందని ప్రజలు భావిస్తారు. ధైర్యంగా ఉంటారు. అలా ఉండే వారిని కూడా ప్రభుత్వం నీరుగార్చుతుంటే... ఇలాంటి పాలనే ఉంటుంది.రెండేళ్లలోనే రాష్ట్రంలో ఇంతటి దారుణంగా ఉంటే రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో జరుగుతున్న దారుణాలను మీడియా, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు స్టడీ చేసి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వమే తప్పు చేసి ఎదుట వారి మీద కేసులు పెట్టి.. ఆ తప్పును కొనసాగించడం మరింత దారుణమని మండిపడ్డారు -
లోకేష్ కుట్రే.. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు: జోగి శకుంతల
సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఏమీ లేదన్నారు ఆయన సతీమణి శకుంతల. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసినా దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతల సాక్షితో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన, నారా లోకేష్ కక్ష పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఏమీ లేదు. కావాలనే ఈ కేసులో పోలీసులు ఇరికించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశాం. ఇవాళ ఉదయాన్నే మా ఇంటిని వచ్చిన పోలీసులు.. తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యవహరించారు. పైన దేవుడు ఉన్నాడు.. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ..‘పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి. మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సహా ఆయన సోదరుడు జోగి రాము, ఆయన సహచరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. -
కాశీబుగ్గ తొక్కిసలాటకు ఉచిత బస్సు కారణమంటూ లోకేష్ అడ్డగోలు మాటలు
-
మోంథా తుపాన్.. లోకేష్‌కు నెట్ ప్రాక్టీస్!
రాష్ట్రాన్ని మోంథా తుపాను వణికించింది. రైతులను, మత్స్యకారులను ఇతర చిరు జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నాలుగైదు రోజులు ప్రజలు ఇళ్ళకే పరిమితమైపోయి గుమ్మం దాటి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారులు సైతం తమ స్థాయిల్లో శ్రమించి తుపాను నష్టాన్ని.. కష్టాన్ని తగ్గించడానికి కృషి చేశారు. అయితే, ఈ మొత్తంలో మోంథా తుఫానుపై ప్రభుత్వ సహాయ చర్యలు.. నష్ట నివారణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తదితర అంశాలు అన్ని లోకేష్ బాబుకు ఉపకరించేలా ఉన్నాయి. అటు లోకేష్, చంద్రబాబు ఇద్దరు కూడా తుపాను నష్టాన్ని తగ్గించడంలో తీవ్రంగా కృషి చేశారు అని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివిధ శాఖల అధికారులు, మంత్రులను ఆదేశిస్తూ సమన్వయపరుస్తూ లోకేష్ అత్యద్భుత పనితీరు కనబరిచారని తెలుగుదేశం నాయకులతో పాటు అధికార యంత్రాంగం సైతం సర్టిఫికెట్లు ఇస్తూ వస్తోంది.అంటే రాష్ట్రంలో తుపాను నష్టాన్ని తగ్గించడంలో చంద్రబాబు కన్నా లోకేష్ మరింత సమర్థవంతంగా పనిచేశారు అనేది తెలుగుదేశం వాదన. ఇది వాదన కాదు లోకేష్ బాబుకు స్థాయికి నుంచి ఎలివేషన్లు ఇస్తూ ఆయన సామర్ధ్యాన్ని ప్రజల్లోకి మరింత గొప్పగా తీసుకువెళ్లడానికి టీడీపీతో పాటు దాని అనుబంధ మీడియా సోషల్ మీడియా వ్యవస్థలకు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. క్యాబినెట్లో కేవలం ఒక మంత్రిగా ఉన్న లోకేష్ అన్ని శాఖలను సమన్వయపరుస్తున్నారని వివిధ శాఖలపై అవగాహన పెంచుకొని ఆ మంత్రులను సైతం కమాండ్ చేస్తూ మార్గదర్శకునిగా నిలబడ్డారని టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పటికే ఎలివేషన్లు ఇస్తుంది. తెలుగుదేశం నాయకులు, మంత్రులు కూడా లోకేష్ సామర్థ్యాన్ని గొప్పగా చెబుతూ ఆయనకు తిరుగులేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.లోకేష్ ప్రాక్టీస్ కోసం మోంథా సహాయ చర్యలు..వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వ కాలంలోనే అంటే 2029 ఎన్నికలలోపే లోకేష్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించాలన్నది చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి అభీష్టంగా కనిపిస్తున్నది. దీనికి సపోర్టివ్ అన్నట్లుగా ఇప్పటికే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం లోకేష్ బాబుకు ఎనలేని ప్రాధాన్యమిస్తూ చంద్రబాబు సమక్షంలోనే చినబాబును ముఖ్యమంత్రిగా చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే లోకేష్ సత్తాను, సమర్ధతను చాటుకోవడానికి ఈ తుఫాను సహాయ చర్యలు.. ముందస్తు ఏర్పాట్లు.. ప్రజలకు పునరావాస కల్పన.. విద్యుత్ పునరుద్ధరణ.. వంటి పనులన్నీ లోకేష్ సునాయాసంగా చేసేసినట్లుగా తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అంటే ఈ విపత్తు.. లోకేష్‌కు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగపడిందని టీడీపీ భావిస్తోంది. ఇక, ఆయన అన్ని పనులు చేసేయగలుగుతున్న నేపథ్యంలో లోకేష్‌ను ఇక ముఖ్యమంత్రిగా చేసేయాల్సిందే అన్నట్లుగా డిమాండ్లు వస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ బాగా చేసి బ్రహ్మాండమైన పనితీరు కనబరుస్తున్నందున ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.మరోవైపు.. మోంథా తుఫాను రైతులను, ఇతర ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన లోకేష్‌కు మాత్రం ప్రయోజన కార్యగా మారిందని.. ఆయన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆ ఉత్పాతం ఒక అవకాశంగా మారిందని తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే లోకేషను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాల్సిందే అన్నట్లుగా ఎలివేషన్లు ఇస్తున్నారు. దీనికి జనసేనాని పవన్ కళ్యాణ్, కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏమంటారో చూడాలి.-సిమ్మాదిరప్పన్న. -
కాశీబుగ్గ తొక్కిసలాటపై మంత్రి లోకేష్ పొంతన లేని మాటలు
శ్రీకాకుళం : జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) ఏకాదశి పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భర్తులు రావడంతో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అయితే శనివారం సాయంత్రం మంత్రి లోకేష్.. తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ దేవాలయాన్ని సందర్శించారు.దీనిలో భాగంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట అంశానికి సంబంధించి పొంతనలేని మాటలు మాట్లాడారు. ప్రతీ శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా లేదన్నారు. భక్తుల రద్దీకి ఉచిత బస్సు కూడా కారణమని లోకేష్ చెప్పిన సమాధానం వింతగా ఉంది. ఉదయం ఆరు గంటలకే భక్తులు అక్కడికి చేరుకున్నా సమాచారం లేదని దాటవేత సమాధానం చెప్పారు లోకేష్. ఒక ఊరి నుంచి వంద మంది వస్తే తెలుస్తుంది కానీ.. ఒక ఊరి నుంచి పది మంది చొప్పున వస్తే ఎలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. ఇలా లోకేష్ మాటల్లో తడబాటు కనబడింది. ధర్మకర్త వీడియో వెలుగులోకి.. సర్కారు వైఫల్యమే కారణంపోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది కూటమి పెద్దలు చెప్పే వాదన తప్పు అని ధర్మకర్త పాండా మాటల్లోనే తేలిపోయింది. పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చామని ధర్మకర్త పాండా చెప్పిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ధర్మకర్త స్థానంలో ఉన్న పాండా సమాచారం ఇచ్చినా సర్కారు తగిన భద్రత కల్పించకపోవడం గమనార్హం. ముందస్తు సమాచారం లేదంటూ మంత్రులు, అధికారుల ప్రకటించగా, సమాచారం ఇవ్వలేదా అని పాండాను మీడియా ప్రశ్నించింది. ‘ఈరోజు కాదు.. నిన్నే పోలీసులకు చెప్పా’ అని పాండా చెప్పారు. దీనికి సంబంధించిన ఆ వీడియో బయటకి రావడంతో సర్కారు వైఫల్యం బట్టబయలైంది. దాంతో తర్వాత ధర్మకర్త పాండాతో సమాచారం ఇవ్వలేదని, ఇంతమంది భక్తులు వస్తారని అనుకోలేదంటూ అధికారులు చెప్పించడంతో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందనడానికి ఉదాహరణ. -
అదిరిందయ్యా చంద్రం.. పట్టిందయ్యా దరిద్రం
-
24 గంటల ముందు వచ్చారు.. 48 గంటల్లో వెళ్లిపోయారు
-
సమీక్ష పేరుతో బాబు,లోకేష్ లు ఆర్భాటాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విడదల రజిని
-
సార్.. సార్.. చేసేస్తున్నాం సర్!
సాక్షి, అమరావతి: ‘సార్.. సార్.. ఆ పనిలోనే ఉన్నాం సర్.. చేసేస్తున్నాం సర్..’ ఇవి ఇంధనశాఖ మంత్రి చెప్పిన మాటలు. అలాగని సీఎంకో, పీఎంకో కాదు.. తోటి మంత్రితో అన్న మాటలు. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు విద్యాశాఖ మంత్రి లోకేశ్ బుధవారం ఫోన్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. బుధవారం సాయంత్రానికి వందశాతం విద్యుత్ పునరుద్ధరిస్తామని మంత్రి గొట్టిపాటి ఆయనకు తెలిపారు. కొన్నిచోట్ల ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలో భాగంగా విద్యుత్ నిలిపివేసినట్లు చెప్పారు. విద్యుత్‌శాఖ సిబ్బంది, అధికారులు, సీఎండీలు కూడా క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైనట్లు వివరించారు. గొట్టిపాటి చెప్పిందంతా విన్న లోకేశ్.. విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు.అయితే ఇప్పటికే ఇంధనశాఖ మంత్రిగా పేరుకే గొట్టిపాటి గానీ, అసలు నడిపించేదంతా లోకేశ్ అనే ప్రచారం ఉంది. ఉద్యోగుల బదిలీలు, ఉన్నతాధికారుల నియామకాల్లో లోకేశ్ చెప్పిందే జరుగుతోందని, తనమాట కనీసం చెల్లుబాటు కావడం లేదనే అసంతృప్తి మంత్రిలోను ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటన్నిటికీ బలం చేకూరుస్తూ లోకేశ్ తనకు ఫోన్‌చేసి విద్యుత్‌శాఖపై ఆరాతీశారంటూ గొట్టిపాటి పత్రికా ప్రకటన విడుదల చేయడం ఆయన నిస్సహాయతకు నిదర్శనంగా భావిస్తున్నారు.మరోవైపు లోకేశ్ ఫోన్‌చేసిన అనంతరం గొట్టిపాటి డిస్కంల సీఎండీలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పోల్ టు పోల్ పెట్రోలింగ్ చేస్తూ సమస్య లేనిచోట విద్యుత్ పునరుద్ధరించాలని అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్నందున పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. లోకేశ్‌కు గొట్టిపాటి చెప్పినట్లు బుధవారం సాయంత్రానికి వందశాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అసాధ్యమని తేల్చిచెప్పారు. -
నారా లోకేష్ పేరుతో సైబర్ నేరం.. 54 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
విజయవాడ: ప్రభుత్వం నుంచి మెడికల్ హెల్ప్ కోసం ఎదురుచూస్తున్న బాధితులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. మంత్రి నారా లోకేష్ పేరును ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లోకేష్ ఫోటో ఉపయోగించి సైబర్ కేటుగాళ్లు ఈ నేరాలకు పాల్పడ్డారు. అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు దోచేసిన ముగ్గురు నిందితులు. సోషల్ మీడియా వేదికగా సురేంద్ర టిడిపి ఎన్.అర్.ఐ కన్వీనర్ అంటూ మోసాలు చేశారు.వాట్సాప్ డీపి నారా లోకేష్ ది ఉండటంతో నిజమని నమ్మిన బాధితులు. నిందితులు రాజేష్, సాయి శ్రీనాథ్, సుమంత్‌లను సీ.ఐ.డీ పోలీసులు అరెస్ట్ చేశారు. పది లక్షల రూపాయలు వీత్ డ్రాకి అనుమతి వచ్చింది అంటూ.. ట్యాక్స్ లు పేరిట బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటనలో 9 మంది బాధితుల నుంచి 54 లక్షల రూపాయల కాజేసిన కేటుగాళ్లు. -
సూటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఒక స్పష్టమైన తేడా ఉంది. చంద్రబాబు దాదాపు రోజు ఎక్కడో చోట ఉపన్యాసం ఇస్తుంటారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన అలవాటు అది. ఆయన ఏ ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేయగలరు. కాని జగన్ అందుకు పూర్తి భిన్నంగానే ఉంటారు. రోజూ మీడియాలో కనిపించాలన్న తాపత్రయం వైఎస్ జగన్‌కు ఉండదు. పక్షానికో, నెలకో మీడియాతో మాట్లాడినా లేదంటే ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆ సందర్భంగా ఏమి చెప్పదలిచినా అత్యధిక శాతం ఆధారాలతో సహా తన వాదన వినిపిస్తారు. జగన్ చెప్పే విషయాలను ఖండించలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఏవేవో ఇతర పిచ్చి విమర్శలు చేస్తుంటారు. మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇది గత ఏడాదిన్నరగా సాగుతున్న వ్యవహారమే!. కొద్ది రోజుల క్రితం జగన్ మీడియా సమావేశంపెట్టి కొన్ని అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. ఆ సందర్భంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన గూగుల్ డాటా సెంటర్.. దాని మూలం ఎక్కడ నుంచి వచ్చింది?.. తన హయాంలో వచ్చిన ఆదాని డేటా సెంటర్ కు దీనికి ఉన్న లింక్ ఏమిటి?.. విశాఖకు తన హయాంలో జరిగిన మంచి ఏమిటి?.. తదితర విషయాలపై సాక్ష్యాధారాలు చూపిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గూగుల్ డాటా సెంటర్ ను స్వాగతించిన తీరు ఆసక్తికరంగా ఉంది. దాని వల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందా? రాదా? అనేదానితో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా ఆయన స్వాగతించడం విశేషం. అదే సమయంలో.. తాను తీసుకు వచ్చిన అదాని డాటా సెంటర్‌కు కొనసాగింపే ఈ గూగుల్ డాటా సెంటర్ అని సశాస్త్రీయంగా రుజువు చేశారాయన. అక్టోబర్ మొదటివారంలో గూగుల్ సంస్థ ఎపి ప్రభుత్వ ఐటి కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ అదానీ సంస్థలకు భూములు కేటాయించాలని కోరిన విషయాన్ని జగన్ బహిర్గతం చేశారు. అంతవరకు ఇదేదో గూగుల్ సంస్థ నేరుగా వచ్చి పెట్టుబడులు పెడుతున్నదని భ్రమించినవారికి నిజం ఏమిటో తెలిసినట్లైంది. అదానీ డాటా సెంటర్‌కు తన హయాంలో జీవో ఇచ్చి శంకుస్థాపన చేసిన వైనం, అలాగే సీ సబ్ కేబుల్ ను సింగపూర్ నుంచి తీసుకు రావడానికి ఆ దేశప్రభుత్వంతో తన హయాంలో జరిగిన సంప్రదింపుల లేఖలుమొదలైన వాటన్నింటిని ప్రజలకు చూపించారు. ఇప్పుడు రూ. 87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నది ఆ అదానీ గ్రూపేనని.. మొత్తం నిర్మాణం పూర్తి అయిన తర్వాత గూగుల్ దానిని లీజుకు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ..చంద్రబాబు మాత్రం అదానీ పట్ల కనీస కృతజ్ఞత చూపలేదని, అదానీ పేరు చెబితే తనకు(జగన్‌కు) ఎక్కడ పేరు వస్తుందోననే అలా చేశారని వివరించారు. నిజంగానే అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అదానీకి ప్రాదాన్యత ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్తపడడం అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ నేతలు ఈ గూగుల్ డేటా సెంటర్ ను చంద్రబాబు, లోకేష్ లు సాదించారన్న ప్రచారం చేస్తున్న తరుణంలో దానిని జగన్ పటాపంచలు చేసినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమి చేశారన్నదానితో సంబంధం లేకుండా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. విశాఖ డేటా సెంటర్ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు తప్ప ఎక్కడా చంద్రబాబు, లోకేష్‌ల పేర్లు ప్రస్తావించకపోవడం గమనించాల్సిన అంశం. ఇది ఆ ఇద్దరికీ నిరాశ కలిగించి ఉండొచ్చు. ఒక వేళ సుందర్ పిచాయ్ వీరికి నేరుగా లేఖ రాసి ఉంటే గనుక.. ఎల్లో మీడియా భూమ్యాకాశాలు దద్దరిల్లేలా హోరెత్తించి ఉండేవేమో!. ఇదే సందర్భంలో.. జగన్ చాలా స్పష్టంగా డాటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని, ఎకో సిస్టమ్ అభివృద్ది అవుతుందని, అందుకే ఆ సమయంలో తాము అదానీని డాటా సెంటర్‌తో పాటు ఐటీ బిజినెస్ పార్క్, రీక్రియేషన్ సెంటర్ తదితర సంస్థలు ఏర్పాటు చేసి 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న షరతు పెట్టామని చెప్పారు. దీనికి సంబంధించిన జీవోలను కూడా ఆయన చూపించారు. తన హయాంలో 300 మెగావాట్ల డాటా సెంటర్‌కు ప్లాన్ చేస్తే.. దాని కొనసాగింపుగా ఇప్పుడు వెయ్యి మెగావాట్ల సెంటర్ ను ప్లాన్ చేశారని వివరించారు. అలా డాటా సెంటర్ క్రెడిట్‌ను చంద్రబాబు చోరి చేశారని జగన్ ఎత్తిపొడిచారు. అయితే.. ఇప్పటిదాకా దీనికి నేరుగా ప్రభుత్వ పక్షాన ఎవరూ సమాధానం ఇవ్వలేకపోయారు!. జగన్ ఏదో ఈ డాటా సెంటర్‌కు అడ్డుపడుతున్నారన్న ప్రచారం చేయాలని తలపెట్టిన టీడీపీకి.. ఆ పార్టీ అనుకూల మీడియాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ కూడా. దీనికి తోడు హైదరాబాద్ కు సంబందించి చంద్రబాబు నిత్యం చేసుకునే ప్రచారాన్ని కూడా ఆయన పూర్వపక్షం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం నుంచి హైదరాబాద్ తో చంద్రబాబుకు సంబందం ఎక్కడ ఉందని, ఈ కాలంలో జరిగిన అభివృద్దికి వైఎస్ఆర్, కేసీఆర్ కారణమని స్పష్టం చేశారు. అలాగే తొలుత నేదురుమల్లి జనార్దనరెడ్డి హయాంలో రాజీవవ్ గాంధీ సైబర్ టవర్స్ కు శంకుస్థాపన చేసిన ఫోటోను, తదుపరి ప్రైవేటు సంస్థ ద్వారా ఒక భవనం కట్టించి దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టి,మొత్తం నగరాన్ని తానే కట్టించానని బిల్డప్ ఇస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటిలో ఏ ఒక్కదానిని ఖండించలేని నిస్సహాయ స్థితి చంద్రబాబు బృందానిదే అని చెప్పాలి. దానికి కారణం జగన్ ఏమి చెప్పినా సాక్ష్యాధారాలతో సహా మాట్లాడడమే. మరో వైపు మంత్రి లోకేష్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.86 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. జగన్ మాదిరి ఎక్కడా ఆధారాలు ప్రదర్శించలేదు. అందుకే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక వ్యాఖ్య చేశారు. గూగుల్ కంపెనీతో ఆ మేరకు ప్రకటన ఇప్పిస్తే తాము లోకేష్ కు సన్మానం చేస్తామని ప్రకటించారు. లోకేష్ సలహాదారులు ఎవరో కాని, బాగా అబద్దాలు చెప్పించారనిపిస్తుంది. దాని వల్ల ఆయన ప్రతిష్టకు నష్టం అని కూడా వారు భావించినట్లు లేదు. తీరా చూస్తే అసలు గూగుల్‌కు ప్రపంచం అంతా కలిపి 1.83 వేల మంది ఉద్యోగులు ఉంటే.. ఒక్క విశాఖ పట్నంలోనే అంతమంది ఎలా వస్తారన్న సింపుల్ కొశ్చెన్ కు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు. జగన్ టైంలో అదానీకి ప్రధానంగా భూమి మాత్రమే సమకూర్చితే.. ఇతర రాయితీలు భారీ ఎత్తున ఇవ్వలేదు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 22వేల కోట్ల మేర రాయితీలు, అది కూడా కేవలం 200 ఉద్యోగాల కల్పించబోతున్న సంస్థకు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సందర్భంలో ఎల్లోమీడియా పచ్చి అబద్దాలను ప్రచారం చేసే యత్నం చేసింది. విశాఖపై సాక్షి పత్రిక విషం చిమ్మిందని నీచమైన అసత్యాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళే యత్నం చేసింది. నిజానికి గతంలో జగన్ విశాఖకు ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఆ నగరంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎన్ని దారుణమైన కధనాలు రాసింది పాత పత్రికలు, అప్పటి వీడియోలు చూస్తే తెలుస్తుంది. అసలు అదానీకి మొత్తం కొండ అంతా రాసిచ్చేశారని డాటా సెంటర్ ఏర్పాటు నేపధ్యంలో విషం చిమ్మింది ఎల్లో మీడియా. అంతేకాదు.. ఆ రోజుల్లో విశాఖ వద్ద సముద్ర మట్టం పెరుగుతోందని, చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా ఆ సందర్భంలో అబద్దాలను సృష్టించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. సముద్రం తీరాన భోగాపురం, మూల పేట వరకు రోడ్డు వేయాలని సంకల్పిస్తే.. ఇళ్లకు నష్టం జరుగుతుందని ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేశారు.ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారు. గూగుల్ డాటా సెంటర్ అనండి.. మరొకటనండి.. ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించరు. అలాగని, దానివల్ల వచ్చే సమస్యల గురించి ప్రశ్నించడం తప్పని కూటమి ప్రభుత్వం అంటున్నా.. ఎల్లో మీడియా ఏడుపు లంఖించుకున్నా.. అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కచ్చితంగా ఎలాంటి సందేహాలు ఉన్నా, నివృత్తి చేసి ముందుకు వెళితే మంచిదని చెప్పాలి. నకిలీ మద్యం మాఫియా, ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిన వైనం, పంటలకు గిట్టుబాటు దరలు లేక రైతులు పడుతున్న పాట్ల గురించి కూడా ఇలాగే ఆదారాలతో జగన్ ప్రసంగించారు. జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇచ్చే పరిస్తితి లేనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏదో విధంగా ఎదురుదాడి చేసి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకుంది. అదానీ డాటా సెంటర్ కు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలకు.. చంద్రబాబు లేదంటే లోకేష్‌లు నేరుగా పాయింట్ వైజ్ జవాబు ఇచ్చి ఉంటే అర్దవంతంగా ఉండేది. ఆ పని చేయలేకపోతున్నారు కాబట్టే పాలన సామర్ధ్యంలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధవంతం అనిపిస్తాయి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Shyamala: దమ్ముంటే సమాధానం చెప్పండి.. కర్నూల్ బస్సు ఘటనపై...
-
తప్పు చేసానని నిరూపిస్తే.. చావడానికైనా సిద్ధం
-
దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ సత్యప్రమాణం
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నంత పని చేశారు. విజయవాడ కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన.. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకే సంబంధం లేదని అన్నారు.నా వ్యక్తిత్వంపై నింద వేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారు. నా మనసును బాధ పెట్టారు. అందుకే కుటుంబంతో సహా వచ్చా. నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నా కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నా. నేను ఏ తప్పు చేయను చేయలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి బెజవాడ దుర్గమ్మ పై ప్రమాణానికి నేను సిద్ధమని నేను చెప్పాను. ఆ సవాలకు కట్టుబడి నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేశారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ , లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధం అని అన్నారాయన. ‘‘నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం చెబుతారు?. నాపై తప్పుడు ఆరోపణలు చేసినవాళ్లు సత్యప్రమాణానికి సిద్ధమా?. పోనీ.. లైడిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా?. కనక దుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలి’’ అని జోగి రమేష్ మరోమారు సవాల్ విసిరారు. -
ఔను... లోకేష్ కు అంత సీన్ లేదు.. డేటా సెంటర్లు కావాలి.. డబ్బా సెంటర్లు కాదు
-
లోకేష్ గాలి తీసిన ఈనాడు
-
Big Question: నాన్నారు.. దొరికిపోయాం..!
-
గూగుల్‌తో లక్ష ఉద్యోగాలు అనేది అబద్ధం: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో గూగల్ సంస్థలో ఉద్యోగాల విషయమై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక కామెంట్స్ చేశారు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం అంటూ నిజాలను బయటపెట్టారు. వాస్తవాలను కుండబద్దలు కొట్టారు. దీంతో, చంద్రబాబు, నారా లోకేష్ వ్యాఖ్యలు అబద్దమని తేలిపోయింది.బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిజం చెప్పడానికి నాకు మొహమాటం లేదు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదు. డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావు. గూగుల్ సంస్థలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవం. రెండు, మూడు వేలలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయానేది సమస్య కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల పట్ల బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో విష్ణుకుమార్..‘ఉచిత బస్సు ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైంది. టికెట్ ఉన్న మగవాళ్లను కూడా బస్ నుంచి దించేస్తున్నారు. ఆర్టీసీ యూనియన్ నాయకులే ఈ మాట చెప్పారు. మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. దీంతో, కూటమి ప్రభుత్వం ఉన్న లొసుగులు మరోసారి బహిర్గతమయ్యాయి. -
లోకేష్ దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు..
-
బాబు, లోకేష్ కు శైలజనాథ్ స్ట్రాంగ్ కౌంటర్
-
‘నకిలీ మద్యం.. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్’
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి నేతల కనుసన్నల్లో లిక్కర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు సాకే శైలజానాథ్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంటే.. మీరు జేబులు నింపుకుంటున్నారా? అని ప్రశ్నించారు. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ పాలనలో బెల్టు షాపులు లేవు. ప్రభుత్వమే నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరిపించింది. చంద్రబాబు ఓ అసమర్థ ముఖ్యమంత్రి. బాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోంది. కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ వారంతా టీడీపీ నేతలే. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంటే.. మీరు జేబులు నింపుకుంటున్నారా?. చంద్రబాబు అబద్దాల ముఖ్యమంత్రి. నకిలీ లిక్కర్ కుటీర పరిశ్రమను చంద్రబాబు రాష్ట్రమంతా నడిపిస్తున్నారు. కల్తీ మద్యం వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.ఏపీలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. చంద్రబాబు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. చాలా కాలం నుంచి లిక్కర్ దందాకు చంద్రబాబు ప్లాన్ చేశారు. చంద్రబాబు మనుషుల చేతుల్లోనే లిక్కర్ షాపులున్నాయి. లక్షలాది బెల్టు షాపులు టీడీపీ వారివే. చంద్రబాబు డర్డీ పాలిటిక్స్ చేస్తున్నారు. అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ లిక్కర్ అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. కల్తీ మద్యం అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే కేసును సీబీఐకి అప్పగించాలి. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌ను ఇరికించే కుట్రలు జరుగుతున్నాయి. జోగి రమేష్ ఛాలెంజ్‌ను చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్వీకరించలేదు?.రాష్ట్రంలో అన్యాయం, అరాచక పాలన సాగుతోంది. లోకేష్ మీ నాన్నలా రాజకీయాలు చేయకు.. మంచి రాజకీయాలు నేర్చుకో. చంద్రబాబు సిట్ అంటేనే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. చంద్రబాబు వేసే సిట్.. ఆయన సిట్ అంటే సిట్, ఆయన స్టాండ్ అంటే స్టాండ్ . చంద్రబాబు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రి గా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ శాఖలు సరిగా పనిచేయలేదని సాక్షాత్తూ మంత్రి సత్యకుమార్ అంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ఇస్తే పేదల పరిస్థితి ఏంటి?. వైఎస్సార్సీపీ, ప్రజలు అడిగే ప్రశ్నలకు కూటమి నేతల దగ్గరా సమాధానాలు లేవు’ అని అన్నారు. -
అతకని అతిశయోక్తులతో ప్రధాని ప్రసంగం...
దేశ రాజధాని ఢిల్లీ.. అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయిట. దేశ ప్రగతిలో కీలకంగా మారాయట. ఈ వ్యాఖ్యలు ఎవరో ఆషామాషీ వ్యక్తులు చేసింది కాదు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నవి. మరీ ఇంత అతిశయోక్తా? ఢిల్లీ ఇప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతమన్నది అందరికీ తెలుసు. కానీ అమరావతి? అమరావతి అభివృద్ది చెందుతుందని, దానికి తమ సహకారం ఉంటుందని చెబితే ఫర్వాలేదు. అలా కాకుండా భారతదేశాన్ని నడిపించగలిగే శక్తి ఆంధ్రప్రదేశ్‌కు ఉందంటే ప్రజలు నమ్మగలుగుతారా? ఇదే నిజమైతే ముంబై, బెంగుళూరు, చెన్నై హైదరాబాద్, పూణేల మాటేమిటి? అవి కదా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నవి. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ ముఖచిత్రం మారుతోందని, ఈ 16 నెలల ఎన్డీయే పాలనలో వేగవంతమైన అభివృద్ది జరుగుతోందని ప్రధాని అన్నారు. అదేంటో కాస్తా వివరించి ఉంటే బాగుండేది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లేస్తూ పోలీసు రాజ్యాన్ని నడపడం, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటకు అప్పనంగా అప్పగించేయడమేనా ముఖచిత్ర మార్పు అంటే? లేక... ఏడాదిన్నర కాలంలో రూ.2.10 లక్షల కోట్లు అప్పులు చేయడమా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టం చేశాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఏపీలో సుదీర్ఘకాలం అధికారం వెలగబెట్టింది తన భాగస్వామి చంద్రబాబే అన్నది మరచిపోయారు. మొన్నటికి మొన్న ఎన్డీయేను వీడిన చంద్రబాబును మోడీ, అమిత్ షాలు అనని మాటలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేసుకున్నారని విమర్శించడం మాత్రమే కాదు.. తనకన్నా సీనియర్ అని చంద్రబాబును వెటకారమాడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. లోకేశ్ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగానూ తెగనాడిన ప్రధాని ఇప్పుడు అదే నోటితో ఆయన్నో యువనేతగా అభివర్ణిస్తున్నారు. మనోడైతే వారసత్వ రాజకీయాలు చేసినా ఓకే అన్నమాట. జీఎస్టీ రేట్లలో తగ్గింపులను ఉత్సవాలుగా జరిపే ప్రయత్నం చేస్తున్న మోడీ, చంద్రబాబులు ఏడేళ్లుగా ప్రజల నుంచి అప్పనంగా దోచుకున్న విషయంపై మాట్లాడరు. వాస్తవానికి పెట్రోలు, డీజిళ్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తేనే మధ్యతరగతి వారికి నాలుగు రూకలు మిగులుతాయి. సూపర్ గిఫ్ట్ అవుతుంది. విశాఖలో రానున్న అదానీ, గూగుల్ల డేటా సెంటర్‌ను ప్రస్తావించిన మోడీ దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న రూ.22 వేల కోట్ల రాయితీల్లో కొంత కేంద్రమూ భరిస్తుందని చెప్పి ఉంటే ప్రజలపై అప్పుల భారం కొంతైనా తగ్గిఉండేది. ఏపీ అభివృద్ధికి రాయలసీమ కీలకమన్న ప్రధాని ఆ ప్రాంతంలో వలసల నిరోధానికైనా, టమోటా, ఉల్లి, మిర్చి వంటి పంటలకు తగిన ధరలు కల్పించేందుకైనా ఏమైనా పథకాలు ప్రకటించి ఉంటే అసలు మేలు చేసిన వాళ్లు అయ్యేవారు. అదేదీ చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడితే ఎవరికి ప్రయోజనం? విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా ఊసైనా ఎత్తలేదు ప్రధాని తన ప్రసంగంలో. మొత్తం ప్రసంగంలో మోడీ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడం ఒక ప్రత్యేకతని చెప్పాలి. బహుశా ఇది టీడీపీ, జనసేనలకు నిరాశ కలిగించి ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో ఐదారు సార్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రధాని రాష్ట్రనికి ఇచ్చిందేమీ లేదని, పర్యటనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు వృథా చేస్తోందని అవుతోందన్న విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానిని ఆకాశానికి ఎత్తేస్తే.. మోడీ కూడా బాబు, పవన్‌లను కీర్తించి వెళ్లారు. ఎందరో ప్రధానులతో పనిచేసిన తనకు మోడీ లాంటి నేత అస్సలు కనపడనే లేదని, విలక్షణ నాయకుడని, జాతికి ఎనలేని సేవలందిస్తున్నారని చంద్రబాబు కీర్తిస్తే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత పాటే మళ్లీ పాడారు. కూటమి ఏపీలో 15 ఏళ్లపాటు కలిసి ఉంటుందని భరోసా ఇచ్చారు. మోడీ దార్శనికతతో, చంద్రబాబు స్పూర్తితో సమష్టిగా ముందుకు వెళతామని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీ తగ్గింపులనే డబుల్ బెనిఫిట్లు వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పు చేయకుండా వారం గడవని పరిస్థితుల్లో, ఎన్నికల హామీలు నెరవేర్చలేక సతమతమవుతున్న చంద్రబాబు ఈ మాటలనడం ఆత్మవంచనే అవుతుంది. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుందన్న భయమున్నా అది సూపర్ అని ప్రచారం చేయక తప్పడం లేదు. జీఎస్టీ తగ్గింపువల్ల ప్రజలకు నేరుగా కలిగే ప్రయోజనం ఎంతన్నదానిపై కూడా ప్రయోజనం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ తన ప్రతిభే అని అన్నిచోట్ల చెప్పుకునే చంద్రబాబు ఈసారి మాత్రం అన్నీ మోడీ చలవేనని చెప్పుకున్నారు. గతంలో ప్రధాని మోడీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్రానికి అవసరమైన కొన్ని డిమాండ్లను సీఎం హోదాలో జగన్ ప్రస్తావించే వారు. వినతిపత్రం లాంటివి ఇచ్చేవారు. చంద్రబాబు ఈ పని మాత్రం చేయలేకపోయారు. కారణమేమిటో మరి?తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న లోకేశ్ తనకు ఇచ్చిన శాఖలను సమర్థం నిర్వహిస్తున్నారని పవన్ పొగడడం గమనించాల్సిన అంశమే. లోకేశ్ నాయకత్వానికి పరోక్షంగా ఆమోదం చెప్పినట్లు అనుకోవాలి. లోకేశ్ కూడా తన శక్తి వంచన లేకుండా సినిమా డైలాగుల మాదిరి మోడీని మురిపించే యత్నం చేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..అనేది నమో స్టైల్ అని ఆయన అన్నారు. మోడీ లోకేశ్‌కు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అనుచరులు సంబరపడుతున్నారు. రాజకీయ వారసత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలు సభ ప్రచారానికి బాగానే ఉపయోగపడవచ్చు కానీ ప్రజలకు ఎంత ప్రయోజనం సిద్దిస్తుందన్నదే డౌటు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేష్ నోటి దూలకు.. భగ్గుమన్న బెంగళూరు
-
Big Question: సాక్షి డిబేట్ కు ఉలిక్కిపడ్డ లోకేష్.. నిజం తెలిసిపోయిందని భయం
-
లేఖ రాశానని.. నా భర్తను అరెస్ట్ చేశారు: మేకతోటి అరుణ
సాక్షి, తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలో బెల్ట్‌షాప్‌లపై మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నిస్తూ ఒక జెడ్పీటీసీగా లేఖ రాయడాన్ని జీర్ణించుకోలేక తన భర్త వీరయ్యపై పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులో అర్ధరాత్రి దౌర్జన్యంగా లాక్కెళ్ళారని దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి వైఎస్సార్సీపీ ఇంచార్జి దొంతిరెడ్డి వేమారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. దళితులమైన తమపై మంత్రి నారా లోకేష్ కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయించి, తన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనే నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడతామని, నారా లోకేష్ ఎన్ని అక్రమ కేసులు పెట్టించినా భయపడేదే లేదని మేకతోటి అరుణ స్పష్టం చేశారు. తాను చేస్తున్న తప్పులకు నారా లోకేష్ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ఈనెల పదో తేదీన దుగ్గిరాల మండల సర్వసభ్య సమావేశంలో బెల్ట్‌షాప్‌లపై బాధ్యత కలిగిన ఒక జెడ్పీటీసీ సభ్యురాలుగా అధికారులను ప్రశ్నించాను. మా మండలంలో ప్రతి వీధిలోనూ బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసి, మద్యాన్ని విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. దీనిపై ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని సర్వసభ్య సమావేశంలో నేను ప్రస్తావించాను.ఈ సమావేశానికి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. అందువల్ల ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెడుతూ లేఖ రాశాను. (ఈ సందర్బంగా ఆ లేఖ ప్రతిని వీడియాకు ప్రదర్శించారు) ఈ లేఖను ఎండీఓకు అందచేయడం ద్వారా దానిని మంత్రివర్యులకు పంపాలని కోరాను. మండలంలో కూల్ డ్రింక్ షాప్‌లు, కంటైనర్లలో బెల్ట్‌షాప్ లను నిర్వహిస్తూ, ప్రజలకు మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ, వారిని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఫోటోలతో సహా ఆ లేఖకు జత చేసి ఎండీఓకు అందచేశాను.ఆ రోజు నేను మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏం మాట్లాడానో దానికి సంబంధించిన వీడియోను కూడా ఈ సందర్బంగా ప్రదర్శిస్తున్నాను. (ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). ఈ సమావేశంలో కేవలం మద్యం, బెల్ట్‌షాప్‌ల గురించి, అధిక ధరలకు జరుగుతున్న మద్యం విక్రయాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే మాట్లాడానే తప్ప ఎవరినీ విమర్శించలేదు. అయినా కూడా దీనిని తట్టుకోలేని స్థితిలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంది. దీనిని బయటపెట్టినందుకు నా భర్త దాసరి వీరయ్యను ఎక్కడో జరిగిన హత్యకేసులో నిందితుడిగా కేసులు బనాయించి, అర్థరాత్రి దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు.నారా లోకేష్ అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దళితులపై తప్పుడు కేసులు, అరాచకాలు, దాష్టీకాలు పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ఏడాది జూన్ 4న తుమ్మపూడిలో జరిగిన హత్యకేసులో కూడా నా భర్త వీరయ్యను ఇరికించారు. మంత్రి నారా లోకేష్ కావాలనే మాపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానికి నా భర్తనే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఐజీ నా భర్తపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. నారా లోకేష్ దళితులమైన మాపైన ఎన్ని కేసులు పెట్టినా, వేధించినా భయపడేదే లేదు.వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన గళం విప్పకుండా మమ్మల్ని అడ్డుకోలేరు. గత ప్రభుత్వంలో అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే, అది అక్రమ కేసు అంటూ ఇదే నారా లోకేష్ మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటీ? వైఎస్సార్సీపీలో ఉన్న దళిత నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం లేదా? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ది చెబుతారని అరుణ స్పష్టం చేశారు.వీరయ్య పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసులు: దొంతిరెడ్డి వేమారెడ్డివీరయ్యను కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పోలీస్ రాజ్యంలో జీవిస్తున్నామా? అనే సందేహం కలుగుతోంది. తప్పుడ చేస్తే చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చు. కానీ పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే, వైఎస్సార్సీపీలో ఆయన నాయకుడిగా కొనసాగుతున్నందున కక్షసాధింపుతో కావాలనే ఒక భయోత్పాతాన్ని సృష్టించేలా ఆయనను అరెస్ట్ చేశారు.అర్ధరాత్రి తన కుటుంబంతో నిద్రిస్తున్న సమయంలో, ఆయనను పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు హంగామాతో బలవంతంగా ఈడ్చుకుంటూ తమతో తీసుకువెళ్ళిన ఘటన అభ్యంతరకరం. ఆయన సంతానంలో దివ్యాంగురాలైన కుమార్తె కూడా ఉంది. జరుగుతున్న ఈ తతంగంతో ఆమె భీతావాహం అయ్యింది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? లోకేష్ రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందా? అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వైయస్ఆర్సీపీ నేతలను భయపెట్టాలనుకోవడం వారి అవివేకమని వేమారెడ్డి హెచ్చరించారు. -
Gudivada: గూగుల్ సంస్థతో ఆ మాట చెప్పిస్తే నిన్ను నేనే సన్మానిస్తాలోకేష్
-
Gudivada: తండ్రిని అడ్డం పెట్టుకొని నీలా మంత్రిని అవ్వలేదు కష్టబడి నిలబడి మంత్రిని అయ్యా..
-
గూగుల్‌తో ఆ మాట చెప్పిస్తే సన్మానం చేస్తాం: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో గూగుల్ డాటా సెంటర్ రాకతో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం, దాని అనుకూల మీడియా.. సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రచారంపై క్లారిటీ ఇవ్వకపోగా.. గత వైఎస్సార్సీపీ పాలనపై, ఆ పార్టీ నేతలపై ఐటీ మంత్రి నారా లోకేష్ నిందలు వేస్తున్నారు. అయితే వాటికి మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ (Gudivada Amarnath on Google Data Center Jobs)ఇచ్చారు. శుక్రవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గూగుల్‌తో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కదా. ఆ మాట గూగుల్‌తోనే చెప్పించండి. కనీసం ఆ సంస్థతో ఓ అధికారికి ప్రెస్‌నోట్ అయిన రిలీజ్ చేయించండి. అది నిజమని తెలిస్తే మేమే సన్మానం చేస్తాం.... గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం, ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోకేష్ మీడియా ముఖంగా ప్రజల అనుమానాలకు సమాధానం చెపుతారు అని భావించాను. కానీ ఆ డేటా సెంటర్‌ను మా పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనిని స్వాగతిస్తున్నట్లు తొలిరోజే వైఎస్సార్సీపీ చెప్పింది. అయితే.. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయని, ఎంత రెవెన్యూ రాష్ట్రానికి వస్తుందని మాత్రం అడిగాం. అందులో తప్పేముంది?.... 1 గిగా వాట్ డేటా సెంటర్ ద్వారా గూగుల్ ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది?. గూగుల్ డేటా సెంటర్ వలన 200 మందికి ఉద్యోగాలు వస్తాయని ఈనాడు పేపర్ లో వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ లో ఉన్న ఉద్యోగులు 1.88 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో 1.88 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది కదా. అయినా ఉద్యోగాల గురించి లోకేష్, టీడీపీ నేతలు కాదు చెప్పాల్సింది. ఆ మాట ఆ సంస్థ చెప్పాలి. అసలు గూగుల్‌తో సమాధానం చెప్పించడానికి ఐటీ మంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటి?. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నన్ను గుడ్డు అన్నా.. నేను లోకేష్‌ను పప్పు అన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు.ముందు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి. మాయ మాటలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయొద్దు. కష్టపడి పోరాటం చేసి జగన్ ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను. ఎవరో డబ్బులు కడితే చదువుకోలేదు(లోకేష్‌ను ఉద్దేశించి..). విశాఖ నగరానికి ఏడాదికి ఐదు టీఎంసీల నీళ్లు అవసరం. గూగుల్ డేటా సెంటర్‌కు ఏడాదికి మూడు టీఎంసీల నీళ్లు అవసరం, ఎలా సర్దుబాటు చేస్తారు?. డేటా సెంటర్ వలన ఒకటి నుంచి రెండు సెంటిగేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అని మేధావులు చెబుతున్నారు. దాని మీద ఏమైనా స్టడీ చేశారా?. ఒక రోజు మొత్తానికి విశాఖ నగరంకు ఎంత కరెంట్ అవసరమో, గూగుల్ డేటా సెంటర్ కు ఒక గంటకు అంత కరెంట్ అవసరం అవుతుంది. రామాయపట్నం, బందరు మూలపేట, భోగాపురం ఎయిర్ పోర్టు, NTPC గ్రీన్ ఎనర్జీ దగ్గర నేను నిలబడి మా హయంలో వచ్చింది అని చెప్పగలను. నువ్వు మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చావు నేను మంత్రి ఎన్ని పరిశ్రమలు తెచ్చావు కూర్చొని రాసుకుందాం రా?.. నారా లోకేష్ ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏం తెచ్చారు.. ఏ ప్రయోజనం చేకూర్చారు. నువ్వు మంత్రిగా ఏమి చేశావో చెప్పగలవా.. అమరావతి రోడ్లు తప్ప. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే లోకేష్ భరించలేరు. వర్ధంతి జయంతికి తేడా తెలియని వ్యక్తి కూడా మాట్లాడుతున్నారా?. ఆయనలా నేను ఎవరి దగ్గర స్క్రిప్ట్ తీసుకొని చదవను. ట్రోలింగ్‌కు జాతి పితా లోకేష్ అని ఎద్దేశా చేశారు. వ్యక్తిగత విమర్శలు ఇకనైనా మానుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ లోకేష్‌కు హితవు పలికారు. ఇదీ చదవండి: కల్తీ మద్యం కేసు.. కమీషన్ మాట్లాడుకుందామా? -
నకిలీ మద్యం కేసులో ఉన్నది లోకేష్, ఎంపీ: దేవినేని అవినాష్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.జోగి రమేష్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) గురువారం ఉదయం జోగి రమేష్‌ను(Jogi Ramesh) కలిశారు. ఈ క్రమంలో ఆయనపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనంతరం, దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులతో జోగి రమేష్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను జోగి రమేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్‌కు వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ నేతలే. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్(Nara Lokesh), మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు. జయచంద్రారెడ్డి, జనార్ధన్ రావు నెలనెలా మామూళ్లు చినబాబు, వసంత కృష్ణప్రసాద్, ఎంపీ చిన్నికి పంపించారు. టీడీపీ నేతలు దొరికిపోవడంతో వైఎస్సార్సీపీపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పెట్టిన తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.పోలీసులు కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సెక్షన్లను వైఎస్సార్సీపీ(YSRCP) నేతలపై పెడుతున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ కమిషనర్ కలవలేదు. అదే టీడీపీ నుంచి చోటా మోటా నేతలు వెళితే సీపీ వారిని కలిశాడు. పోలీస్ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా? టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా?. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం బుద్ధా వెంకన్న ఆరాటపడుతున్నాడు. వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేస్తే పదవులు వస్తాయని బుద్ధా వెంకన్న అనుకుంటున్నాడు అని ెసెటైరికల్ కామెంట్స్ చేశారు. -
Jogi: సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న అసత్య వార్తలపై YSRCP ఫిర్యాదు
-
చంద్రబాబు, లోకేష్‌కు జోగి రమేష్ సవాల్
సాక్షి, విజయవాడ: తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనార్థన్‌తో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అని సవాల్ చేసి రెండ్రోజులవుతోంది. మళ్లీ చెబుతున్నా లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. చంద్రబాబు, లోకేష్ రెడీనా?. చంద్రబాబు మరి ఇంత దారుణంగా దిగజారిపోయాడు. రిమాండ్‌లో ఉన్న జనార్థన్‌రావుతో వీడియో రికార్డ్ చేశారు. బలహీనవర్గానికి చెందిన నన్ను జైల్లో వేయాలని చూస్తున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇబ్రహీంపట్నం నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్నా.. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు’’ అని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. -
Jogi: ఇవిగో నా రెండు ఫోన్లు.. నా భార్య బిడ్డలపై ప్రమాణం చేసి చెప్తున్నా
-
‘వినేవాడుంటే చెప్పేవాడే చంద్రబాబు.. లోకేశ్ శైలీ ఇదే’
సాక్షి, తూర్పుగోదావరి: వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు.. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి అని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్. డేటా సెంటర్‌పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్తో చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీతో ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని చంద్రబాబు, లోకేష్ డబ్బా కొట్టుకుంటున్నారు. అభివృద్ధి అంతా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది. చంద్రబాబు కాలంలో ఏపీలోనూ ఎటువంటి అభివృద్ధి లేదు. తొమ్మిది హార్బర్స్‌కు శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంతో చేసినా ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం చెందాం.. ఇది వాస్తవం. అప్పటి ఐటీ మంత్రి అమర్నాథ్ను డేటా సెంటర్ అంటే తెలుసా అని లోకేష్ ప్రశ్నించడం హాస్యాస్పదం.డేటా సెంటర్ అంటే ఏమిటి లోకేష్?. డేటా సెంటర్‌పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్తో చర్చకు లోకేష్ సిద్ధమా? దీనిపై సవాల్ చేస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖలో పెట్టుబడులు, గోదావరి జిల్లాలో ఆక్వా అభివృద్ధి, పోర్టుల అభివృద్ధి అన్ని గత ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలే. జిందాల్ సంస్థ తరిమివేస్తే మహారాష్ట్రకి వెళ్లి మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అమ్మేసే వ్యవహారం చేస్తున్నారు. పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రాపర్టీ ఏది?. రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం కాకుండా ఉంటాయి’ అని హితవు పలికారు.ప్రజలు చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టుకున్నారని అనుకుంటున్నారా?. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డి.. ఆయన వైఎస్సార్సీపీ కోవర్ట్ అంటున్నారు. మరి ఎమ్మెల్యే టికెట్ మీరెందుకు ఇచ్చారు?. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మీపై ఆరోపణలు వస్తే పక్కవారిపై బురద జల్లడం మీకు అలవాటు. చిన్నపాటి సోషల్ మీడియా కేసులకి దేశం దాటితే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి పాస్‌పోర్టు రద్దు చేస్తున్నారు. మరి జయచంద్రా రెడ్డి విషయంలో ఎందుకు చేయలేదు. ఆయన ఫోన్ సంభాషణలు ఎవరితో చేశారో స్పష్టం చేయండి. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించండి అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి.సిట్ వేయడం వల్ల ఇటువంటి ఉపయోగం ఉండదు. టీడీపీ నేతలపై సిట్ కేసు నమోదు చేస్తుందా?. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే భాగస్వాములు కదా.. సీబీఐకి అప్పగించండి. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు. పాలకొల్లు, అమలాపురం, ఎక్కడ చూసినా నకిలీ మద్యం కేంద్రాలు బయటపడ్డాయి. 16 నెలలుగా రాష్ట్ర ప్రజలతో నకిలీ మద్యం తాగిస్తున్నారు. ప్రతి నాలుగు బాటిల్లో ఒకటి నకిలీ మద్యమే. జోకర్లు ఎమ్మెల్యేలు అయితే రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది. రాజమండ్రిలో ప్రవీణ్ చౌదరి రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల సంఘం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 9000 రూపాయలు పెంచి వేతన సవరణ చేశారు. రాజమండ్రి ప్రస్తుత ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే 5400 మాత్రమే చేయించారు’ అని చెప్పుకొచ్చారు. -
నా భార్య పిల్లలతో నీ ఇంటికి వస్తా.. నువ్వు, నీ కొడుకు సిద్ధమా..?
-
లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
ఇబ్రహీంపట్నం: నకిలీ మద్యం కేసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని.. మరి చంద్రబాబు, లోకేశ్‌లు కూడా సిద్ధమా.. అని సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావుతో తన పేరు చెప్పించడం ద్వారా చంద్రబాబు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు ఈ కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా చంద్రబాబేనని స్పష్టం చేశారు. ‘వారం రోజులుగా నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం సిట్ విచారణకు ఆదేశించారు. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. అనేలా సాగేది విచారణ కాదు. నకిలీ మద్యం రాకెట్ బట్టబయలు కావడంతో దిక్కుతోచక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారు. ఇందులో భాగంగానే నా పేరు తీసుకొచ్చారు. ఈ కేసులో నా పాత్ర ఉంటే నేను ఏ శిక్షకైనా సిద్ధమే’ అని తెలిపారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ఇంకా ఏమన్నారంటే.. రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు ‘నకిలీ లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదని నేను దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. నేను నా భార్యా బిడ్డలతో వస్తాను. చంద్రబాబు, లోకేశ్‌లకు దమ్ముంటే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేయగలరా? పోనీ విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేస్తారా? ఈ ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా? కల్తీ మద్యం కేసుతో నాకు ఏ రకమైన సంబంధం లేదు. నారా వారి సారాను రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారు. ప్రతి మద్యం షాపులో, బెల్టు షాపుల్లో.. చివరకు ఇంటింటికీ రేషన్ పంపిణీలా నకిలీ మద్యాన్ని పంపిస్తున్నారు.ఇదంతా బయట పడటంతో డైవర్షన్ కోసం జనార్దన్‌తో వీడియో విడుదల చేయించారు. వాస్తవానికి రిమాండ్ రిపోర్టులో నా పేరు ఎక్కడా లేదు. అయినా పోలీసు కస్టడీలో ఉన్న అతనితో నా పేరు చెప్పించడం ద్వారా అత్యంత దిగజారుడు రాజకీయాలకు దిగారు. మీ దుర్మార్గాలను ఎండగడుతున్నానన్న అక్కసుతో ఈ కేసులో నన్ను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుష్ట ప్రయత్నం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది.గతంలో చంద్రబాబు ఇంటి దగ్గరకు నేను ప్రశ్నించడానికి బయలుదేరానని, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ నన్ను ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు. నెలో రెండు నెలలో నన్ను జైలులో పెట్టి మీ క్షణికానందం తీర్చుకున్నంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు. లోకేశ్.. ఎల్లకాలం అధికారంలో ఉంటామని భ్రమల్లో ఉండొద్దు. మీరు సీటు ఇచ్చి తంబళ్లపల్లెలో పోటీకి నిలబెట్టిన జయచంద్రారెడ్డే కల్తీ మద్యానికి ఆద్యుడు. తప్పుడు కేసులకు భయపడేది లేదు ఒక తప్పుడు వీడియోను సృష్టించి, నన్ను జైల్లో పెట్టడం ద్వారా మీ రాక్షసానందం తీరవచ్చు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. దమ్ముంటే ధైర్యంగా నేరుగా ఎదుర్కోండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు.. భయపడేదీ లేదు. మీ దుర్మార్గాలను ఎండగడుతూనే ఉంటాం. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు అత్యంత చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. మీ రెడ్ బుక్కు ఫైర్ పుట్టించడం ఖాయం. దమ్ముంటే నా సవాలుకు స్పందించండి.కల్తీ లిక్కర్ స్కామ్‌లో అక్రమ మద్యం నిల్వలను స్వయంగా నేను మీడియాకు.. ‘ఇదే నారా వారి సారా’ అని చూపిస్తే, ఈ కేసులో నిందితుడైన జనార్దన్‌ను అడ్డుపెట్టుకుని నా పేరు మీద వీడియో విడుదల చేయించారు. జనార్దన్‌తో నాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. ఇది కేవలం చంద్రబాబు సృష్టించిన కట్టు కథ మాత్రమే. ప్రజలంతా గమనిస్తున్నారు’ అని స్పష్టం చేశారు. -
CBI విచారణకు తండ్రీకొడుకులు భయపడుతున్నారా?
-
కల్తీ మద్యం తయారీదారుల వెనుక చంద్రబాబు, లోకేష్
సాక్షి,తాడేపల్లి: తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో పలువురు మరణించారు. అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె శనివారం(అక్టోబర్11)న మీడియాతో మాట్లాడారు.‘కల్తీ మద్యం కేసును సీబీఐకి ఇవ్వాలి. కల్తీ మద్యం తయారీ దారుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. అందుకే కేసును నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు రావటం లేదు?.నకిలీ మద్యం గురించి చంద్రబాబు మాట్లాడాలి.జయచంద్రారెడ్డి టీడీపీ పెద్దలకు కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. అలాంటి వ్యక్తిని వైఎస్సార్సీపీ కోవర్టు అని ముద్ర వేస్తున్నారు. మరి జయచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ కోవర్టులయితే టికెట్ ఎందుకు ఇచ్చారు?. లావు శ్రీకృష్ణదేవరాయలు సహా ఇప్పుడు ఉన్న కొందరు మంత్రులు కూడా మా కోవర్టులే.మరి వాళ్లపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?.ఏపీలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. రేపల్లె, ఏలూరు సహా అనేక చోట్ల టీడీపీ నేతలు నకిలీ మద్యం కింగ్ పిన్‌లా మారారు. మా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయి.ఎక్కడా నకిలీ, కల్తీకి ఆస్కారం లేకుండా చేశారు.కానీ టీడీపీ నేతలు తమ జేబులు నింపు కోవటానికి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.ఈ మద్యంతో రాష్ట్రంలో మహిళల తాళి బొట్టు తెంచుతున్నారు. చంద్రబాబు హయాంలో నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెరిగి పోయాయి. ప్రతి నాలుగు సీసాల్లో ఒకటి నకిలీ మద్యమే. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనిఖీలు చేయటం లేదు. ప్రభుత్వ పెద్దల కుట్ర దీని వెనుక ఉంది. అయినప్పటికీ ఎల్లో మీడియాలో వార్తలు రావటం లేదు. నకిలీ మద్యం కావడం వల్లే తెలంగాణ వెళ్లి కొనుగోలు చేస్తున్నారు’అని అన్నారు. -
Fake Liquor Case: నువ్వు వెళ్లి లొంగిపో.. నేను చూసుకుంటా..!
-
దొంగలు మా వాళ్లే.. నకిలీ మద్యంపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
-
నకిలీ మద్యం పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
-
నకిలీ మద్యం సరఫరా.. అంగీకరించిన లోకేష్!
సాక్షి,అమరావతి: ఏపీలో నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారంది. .ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం రాకెట్ కేసులు కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల్లో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం(అక్టోబర్ 10వ తేదీ) నారా లోకేష్‌తో ఆయన నివాసంలో టీడీపీ మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నకిలీ మద్యం తయారీ, బెల్టు షాపుల పెరుగుదల, వాటి వెనుక ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల గురించి చర్చ జరిగింది. ముఖ్యంగా బెల్టు షాపుల ద్వారా నకిలీ మద్యం సరఫరా అవుతుందన్న అంశంపై నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో ఎమ్మెల్యేలు బెల్టు షాపులను పెట్టిస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తద్వారా బెల్టు షాపులు బాగా పెరిగిపోయాయని అంగీకరించారు. -
చంద్రబాబు ధ్యాసంతా అదే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ(మంగళవారం, అక్టోబర్ 7) తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండేళ్లు కావొస్తోందని.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు.‘‘ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోంది. జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదు. పూర్తిగా పాలన గాడితప్పింది. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే వీళ్ల ధ్యాస. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన బినామీలు.. వారి జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. దోచుకో.. పంచుకో.. తినుకో.. కనిపిస్తోంది’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘అక్రమాలకు అవకాశం లేకుండా మన హయాంలో లిక్కర్ పాలసీ ఉండేది. క్వాలిటీ విషయంలో ఏరోజు కూడా రాజీ పడలేదు. లిక్కర్ కొనుగోలు ఎంపానెల్ డిస్టలరీస్ నుంచే కొనుగోలు. ప్రతికోటా క్రమం తప్పకుండా క్వాలిటీ చెక్ చేసేవాళ్లు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లోకి లిక్కర్. నిర్దిష్టమైన సమయాల్లోనే మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్లం. షాపులు తగ్గించి, బెల్టుషాపులు ఎత్తివేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిర్వహించింది. ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్ రద్దు చేశాం. మూడింట ఒక వంతు షాపులు తగ్గించాం. మన హయాంలో ప్రతి బాటిల్‌పైన క్యూ ఆర్‌కోడ్ ఉండేది. ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూ ఆర్‌కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్లు. నూటికి నూరుశాతం క్వాలిటీతోనే మద్యం అమ్ముడుపోయేది...కాని, రాష్ట్రంలో ఇప్పుడు కల్తీ లిక్కర్ మాఫియా నడుస్తోంది. దీనికోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారు.. చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మాఫియాకు ప్రైవేటు దుకాణాలు అప్పగించారు. వేలం పాట నిర్వహించి.. బెల్టుషాపులు వారి మనుషులకే అప్పగించారు. వీళ్లందరికీ మళ్లీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్. ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైనున్న పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత అని పంచుకుంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లీగల్‌గా ఆదాయాలు పెంచుకోవడానికి తెరలేపారు. వీరికి సంబంధించిన షాపుల నుంచి తమకు కావాల్సిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నారు, ఇదోరకం మాఫియా...ఇదికాక మరో రకం మాఫియా నడుపుతున్నారు. ప్రజలు చనిపోయినా పర్వాలేదు, తమ జేబుల్లోకి డబ్బు వస్తే చాలనుకుంటున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షస పరిపాలన నడుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యాన్ని పరిశ్రమ మాదిరిగా నడుపుతున్నారు. క్వాలిటీ లేని లిక్కర్‌ను తయారుచేసి, తన ప్రైవేటు మాఫియా నెట్‌వర్క్‌ద్వారా నేరుగా పంపిస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. ఆ కల్తీ మద్యాన్ని తాగి మనుషులు చనిపోతున్న పరిస్థితి. ప్రాంతాల వారీగా కల్తీ దందా నడుపుతున్నారు. కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇబ్రహీపట్నంలో భారీగా దొరికిన మద్యం, దాని తయారీకి సంబంధించిన వస్తువులు మాఫియా తీవ్రతను తెలియజేస్తున్నాయి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ లూటీ చేస్తున్నారు..ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. మన హయాంలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కడం చూస్తున్నాం. మన హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ అలాంటివి లేవు. ఎరువుల పంపిణీలో కూడా స్కాం చేశారు. దళారీలతో చేతులు కలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పేదలను ఇంకా అన్యాయం చేస్తున్నారు. వారిని మరింత పేదరికంలోని నెడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారు. మనం కొత్తగా పెట్టిన కాలేజీలను ఇప్పుడు తన బినామీలకు, తన మనుషులకు తెగనమ్ముతున్నాడు...మనం వచ్చేంతవరకూ రాష్ట్రంలో ఉన్నవి 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. మనం ఒక విజన్‌ను ఆవిష్కరించాం. ప్రతి జిల్లాల్లో గవర్నమెంటు కాలేజీ ఉండాలన్న సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు ఎందుకు నడుపుతుంది?. అలా చేయకపోతే ప్రైవేటు వాళ్లు ప్రజలను దోచుకుంటారు. ఇవి నడపకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఉన్నప్పుడే 2023-24లోనే కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు కాలేజీలు క్లాసులకు అందుబాటులోకి తెచ్చాం. తద్వారా 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పులివెందులోల 50 సీట్లు NMC ఇస్తే.. వద్దని చంద్రబాబు లెటర్ రాశాడు. మన హయాంలోనే అవసరమైన నిధులకు ఫైనాన్సియల్ టై అప్ చేశాం. అమరావతికి 50వేల ఎకరాలు సరిపోవని, మరో 50వేల ఎకరాలు సేకరిస్తున్నాడు...మొదటి 50 వేల ఎకరాలకే మౌలిక సదుపాయాలకోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నారు. అలాంటి లక్షలమందికి, కోట్ల మందికి వైద్యం అందించి, చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేస్తున్నారు?. ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టలేరా?. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది...అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం. మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరణ చేస్తాం. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాల సందర్శన. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్ పత్రాల సమర్పణ. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ర్యాలీలు. ఒక జిల్లాలో నేనుకూడా పాల్గొంటాను. నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు. సేకరించిన ఈ సంతకాలు గవర్నర్‌కు అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుంది’ అని వైఎస్ జగన్ వివరించారు. -
బాబుకు మునిశాపం ఇంకా తీరినట్లు లేదు!
నెలకోసారి నాలుగు వేల పింఛన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి హెలికాప్టర్లలో వెళుతున్నారు. ఖర్చుల సంగతి కాసేపు పక్కనబెడదాం. కానీ, ఈ పర్యటనల సందర్భంగా ఆయన అసత్యాలు, అర్ధ సత్యాలూ మాట్లాడుతుండటం ఆయన పదవికి శోభనిచ్చేది కాదు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సినంత అనుభవం బాబు గారిది. అబద్ధాలకోరు అని ప్రజలు అనుకునేలా ఉండకూడదు. ప్రతిపక్షాల ఆరోపణలు కాకపోయినా ప్రజలందరికీ ఇట్టే అర్థమైపోయే అబద్ధాలు ఆడటం వల్లనే వస్తోంది చిక్కు.చంద్రబాబుకు సంక్షేమం మీద అస్సలు నమ్మకం లేదన్నది అందరికీ తెలిసిన సత్యమే. అప్పు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయకూడదని స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించిన వ్యక్తి ఈయన. కానీ.. ఎన్నికలు వస్తే చాలు.. ముందు వెనుకలు ఆలోచించకుండా.. ఖర్చులతో నిమిత్తం లేకుండా ఎడాపెడా హామీలు గుప్పించేస్తారు. 2024లోనూ ఇలాగే చేసి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అరకొర అమలుతో మమా.. అనిపించేశారు. గోరుముద్దలు పెట్టేటప్పుడు ఇదే పప్పు అనుకో! ఇదే కూర అనుకో, ఇదే పచ్చడి అనుకో, ఇదే పెరుగు అనుకో.. అని పిల్లలకు చెబుతారు చూడండి.. సరిగ్గా అలాగే చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారు.పర్యటనల సందర్భంగా ‘పేదల సేవలో ప్రజా వేదిక’ అనే పేరు స్టేజికి పెట్టి చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ, తీసుకునే చర్యలేవీ పేదలకు అనుకూలంగా ఉండవు. పేదల పేరు చెప్పి ధనికులు, పెట్టుబడిదారులకు సేవ చేస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి. విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాస్తవం దీనికి చాలా భిన్నం. ఒక ఫించన్ల మొత్తంలో పెంపు మినహా కూటమి సర్కారు తొలి ఏడాది ఎన్నికల హామీలు నెరవేర్చింది ఏమీ లేదు. అయినా సరే.. ఫించన్ల పంపిణీలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అంటారు బాబుగారు.వాస్తవానికి ఈ క్రెడిట్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దక్కాలి. ఎందుకంటే సుమారు 45 లక్షలుగా ఉన్న ఫించన్లను 64 లక్షలకు తీసుకువెళ్లారు. అదే సమయంలో 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాలుగున్నర లక్షల ఫించన్లు తొలగించారు. ఇదిలా ఉంటే.. ఫించన్ల సొమ్మును ఇంటి పన్నులకు జమ చేసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలాంటిది జగన్ టైమ్‌లో జరిగి ఉంటే చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఉండేవారు. విజయనగరం జిల్లాను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తామని చంద్రబాబు చెప్పడం స్వాగతించదగిందే. కాకపోతే ఇప్పటికే ఆయన సుమారు 15 ఏళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఆ సంగతి మర్చిపోతుంటారు.చంద్రబాబు ఈ మధ్య చెబుతున్న పలు అసత్యాల్లో పెట్టుబడుల అంశం ఒకటి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో గత 15 నెలల్లో 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. నిజమైతే ఇదో అద్భుతమైన రికార్డు. కేంద్రమే ప్రకటించి ఉండేది. అదేమీ జరగలేదు. ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ఇప్పుడు నిరుద్యోగ భృతిని ఎగవేయడం కోసం ఇలా అబద్ధాలు చెబుతున్నట్లు స్పష్టమవుతోంది. వలంటీర్లు 2.5 లక్షల మందితోపాటు ఏడాది కాలంలో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంటుంది. అలాగే 2014-19 మధ్య మాదిరిగానే ఇప్పుడు కూడా పెట్టుబడులపై అసత్యాలు కుమ్మరిస్తున్నారు. ఇప్పటికే పది లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చేశాయని ఆయన చెప్పారని ఎల్లో మీడియానే రాసింది. ఇందులో వాస్తవం ఎంతన్నది ఆయనకు, ఎల్లో మీడియాకు తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండంటూ సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.విశాఖలో జరగబోయే సదస్సుకు రావాలని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్‌లు ఢిల్లీ వెళ్లి పారిశ్రామిక వేత్తలను కోరారు. ఇది తప్పు కాదు. కానీ, ఇంతకాలం చంద్రబాబు బ్రాండ్‌ను చూసి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారని ప్రచారం చేశారు. ఆ బ్రాండ్ ఏమైందో తెలియదు కానీ.. వీరే వెళ్లి సదస్సుకు రావాలని పరిశ్రమల వారిని అభ్యర్ధించవలసి వస్తోంది. ఇదే పనిమీద వీరు దుబాయికి కూడా వెళుతున్నారట. సదస్సు తర్వాత మరో పదో, పదిహేను లక్షల కోట్లో లేదా అంతకన్నా ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు చెబుతారు. ఆ తర్వాత అవి వచ్చేశాయని అంటారు.వైఎస్సార్సీపీ విద్యుత్తు ఛార్జీలతో ప్రజల నడ్డి విరిచిందని తాము ఆ పని చేయలేదని ఆయన చెబుతున్నారు. ఛార్జీల మోత తట్టుకోలేక ప్రజలు హాహాకారాలు చేస్తూంటే చంద్రబాబు అసలు పెరగలేదని ధైర్యంగా చెబుతున్నారు. దీని గురించి ఆయన జనాన్ని ప్రశ్నించి ఉంటే తెలిసేది. పైగా అనుమతించిన దానికన్నా ఎక్కువ వసూలు చేసినందుకు విద్యుత్ నియంత్రణ మండలి చివాట్లు పెట్టి డబ్బు వెనక్కు ఇవ్వాలని ఆదేశించిన విషయాన్నీ కప్పిపుచ్చుతున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలోనూ ఇలాంటి అబద్ధాలను ఎవరైనా నమ్ముతారా? అన్నది కూడా ఆలోచించడం లేదు. 2024లో ఏపీకి స్వాతంత్రం వచ్చిందని అంతటి సీనియర్ నేత చెప్పడం దారుణంగా ఉంటుంది. నిజంగానే వైఎస్సార్సీపీ హయాంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు కాని, ఆయన పార్టనర్ పవన్ కళ్యాణ్ తదితరులు అన్ని అసత్యాలు ప్రచారం చేయగలిగేవారా?.ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలను కట్టడి చేయడానికి, హామీల గురించి ప్రశ్నించకుండా ఉండడానికి నిర్భంధకాండను అమలు చేస్తున్న సర్కార్, లోకేశ్ రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అధినేతగా చంద్రబాబు స్వాతంత్రం గురించి మాట్లాడడం అర్థరహితం అనిపిస్తుంది. ఇప్పుడు నియంతృత్వంగా ఉందా? గతంలో ఉందా అని ఆయన ఒక సర్వే చేయించుకుంటే మంచిది. పైగా సోషల్ మీడియాను అణచివేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్నే నియమించిన ఆయన స్వేచ్చ గురించి కథలు చెబుతున్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే తోలు తీస్తానని కూడా చంద్రబాబు హెచ్చరించారు. మంచిదే.. నిజంగా అందులో నిజం ఉంటే ఆయన ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు ఎందరిపై మహిళల వేధింపులకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎందరి తోలు తీశారో చెబితే బాగుండేది కదా!.జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఎమ్మెల్యేని ఏం చేశారు?. ఒక విద్యాలయ ప్రిన్సిపాల్‌ను వేధించిన మరో ఎమ్మెల్యేని ఏం చేశారు?. చిత్తూరులో ఒక యువతిని హింసించిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల తోలు తీశారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కబుర్లు చెప్పడం వేరు. కార్యాచరణ వేరు. లంచాలు ఇచ్చే అవసరం లేకుండా పని చేయించాలన్నది తమ ఆలోచన అని, అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా పనిచేయకపోతే ప్రజల ముందు నిలబెడతానని ఆయన చెబుతున్నారు. ఎల్లో మీడియాలోనే వసూల్ రాజాలుగా మారిన టీడీపీ ఎమ్మెల్యేలు అంటూ వచ్చిన వార్తల సంగతేమిటి?. తొలుత వారిని కట్టడి చేసిన తర్వాత ఇలాంటి కబుర్లు చెప్పాలి.ప్రజలకు ఎలాంటి లంచాలతో పని లేకుండా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థలను ధ్వంసం చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడేదో ఆకస్మిక తనిఖీల ద్వారా ఏదో చేస్తామంటే ఎవరు నమ్ముతారు!. దీపావళికి మూడు లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని ఆయన అంటున్నారు. అవి ఎవరి హయాంలో నిర్మితమైంది అందరికీ తెలుసు. కాకపోతే వాటిని తామే నిర్మించామని చెప్పకుండా, గత ప్రభుత్వం ఏం చేసింది.. తమ సర్కార్ ఏం చేసింది వివరిస్తే గౌరవంగా ఉంటుంది. అలాకాకుండా జగన్ ప్రభుత్వం క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకున్నంత మాత్రాన జనానికి వాస్తవాలు తెలియకుండా పోవు కదా!. చంద్రబాబు నుంచి సత్యం ఆశించడం అత్యాశేనా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Liquor Scam: లోకేష్ రౌండప్.. నకిలీ దందాలో చినబాబు
-
విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో రక్షిత తాగునీటిని అందించలేని ప్రభుత్వ నిర్లక్ష్యమే.. విద్యార్ధుల మరణానికి కారణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ ఓ బాధ్యత లేని విద్యాశాఖ మంత్రి కాగా.. చంద్రబాబు ఓ అసమర్థ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు విద్యార్ధులు చనిపోయారని.. ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని తేల్చి చెప్పారు.చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో విద్యావ్యవస్ధలో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పించి విద్యాలయాలను దేవాలయాలుగా మార్పు చేస్తే... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూపాయి కాగితం ఖర్చుపెట్టిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్థతకు నిదర్శనమని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..మొద్దు నిద్రలో విద్యా వ్యవస్థ..రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొద్దునిద్రలో ఉంది. ప్రభుత్వరంగ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు అధ్వాన్న స్ధితిలోకి నెట్టబడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మరణ మృదంగాన్ని తలదన్నే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జూలై నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 11 మంది గిరిజన బిడ్డలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారు. గిరిజన తల్లిదండ్రులు కొండా కోనలను దాటించి గురుకుల పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించారు.విద్యావంతులుగా వస్తారనుకుని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు విగత జీవులుగా వస్తున్న పిల్లలను చూసి గుండె పగులేలా రోదిస్తున్నారు. ఇది ప్రభుత్వ చేతగాని తనానికి, అసమర్థతకు నిదర్శనం. ఈ పిల్లల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన చేస్తున్నాడని చెప్పడానికి, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనికిరాడు అని చెప్పడానికి జరుగుతున్న ఉదంతాలే నిదర్శనం.వైఎస్ జగన్ హయాంలో దేవాలయాలుగా విద్యాలయాలుఒక కుటుంబంలో రేపటి తరాన్ని నడిపించాల్సిన బిడ్డలను అర్ధాంతరంగా పోగొట్టుకోవడం అత్యంత బాధాకరం. జూలై నెలలో పదో తరగతి చదువుతున్న పిల్లవాడు చనిపోతే.. ఇవాళ వారం రోజుల్లోనే ఇద్దరు బాలికలు కేవలం సరైన తాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో మృత్యువాత పడడం దురదృష్టకరం. వైఎస్ జగన్ హయాంలో విద్యాలయాలను దేవాలయాలుగా మార్చారు.ప్రతి విద్యార్థి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని ప్రతి స్కూల్లో ఫర్నీచర్, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి మంచినీళ్ల సరఫరా, డిజిటల్ క్లాస్ రూములు, ఇంగ్లిషు, తెలుగు మీడియంలో ముద్రించిన పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిషు మీడియం, టోఫెల్ విద్య అందించడంతో పాటు నూతనంగా తరగతి గదులు నిర్మించి వసతులు ఏర్పాటు చేశారు. నాడు-నేడు ద్వారా దాదాపు 50 వేల స్కూళ్లను అభివృద్ధి చేసి ప్రజలకందించారు. అదే విధంగా అమ్మఒడి పథకంలో రూ.2 వేలు మినహాయించి.. స్కూళ్లు అభివృద్ధి, మౌలిక వసతులను మెరుగుపర్చడానికి వాడితే ఆ రోజు అర్ధజ్ఞానం కలిగిన లోకేష్ అమ్మఒడి అర్ధవడి అయిందని మాట్లాడారు.హోం మంత్రి భోజనంలోనే బొద్దింకఇవాళ లోకేష్ కూడా అమ్మఒడిలో రూ.2వేలు కట్ చేసి... స్కూళ్ల అభివృద్ధికి, వసతుల కల్పనకు ఎక్కడైనా రూపాయి కాగితం వెచ్చించారా లోకేష్ ? ఏ స్కూల్ లోనైనా నాణ్యమైన భోజనం అందించారా? రాష్ట్ర ప్రజలు ఆలోచన్ చేయాలి. సాక్షాత్తూ ఈ రాష్ట్ర హోంమంత్రి భోజనం చేస్తున్న కంచంలోనే బొద్దింక ఆహారంలో వచ్చింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ 14 నెలల కూటమి పాలనలో అనేక సందర్భాల్లో కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో పిల్లలు ఆసుపత్రిలో చేరిన సందర్బాలు ఉన్నాయి. ఇది చేతకాని పాలనకు పరాకాష్ట కాదా? ఇది అసమర్థ ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు కావాలా? 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రికి పరిపాలన మీద ఏమాత్రం శ్రద్ధ ఉందో ఈ ఘటనలు చూస్తేనే అర్ధం అవుతుంది.కేవలం చంద్రబాబు కుమారుడు అనే ఒకే ఒక్క అర్హత తప్ప.. ఏ అర్హతా లేని లోకేష్‌ని విద్యాశాఖ మంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టడంతోనే విద్యావ్యవస్థకు చెదలు పట్టడం మొదలైంది. వ్యవస్థను కొద్ది, కొద్దిగా చెదలు తిన్నట్టుగా కూటమి నేతలు తింటున్నారు. దీనంతటికీ కారణం మంత్రి నారాయణ. నారాయణ కాలేజీల సంస్థల చైర్మన్‌గా తన సంస్థలను పెంచి పోషించాలన్న దురుద్దేశమే కారణం.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లకు తరలిపోయారు. కారణం ప్రభుత్వమే ప్రైవేటు విద్యను ప్రోత్సహించడమే. ప్రభుత్వ విద్యాలయాలను నాశనం చేయడమే. వసతులు లేని ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్ధులు ఎందుకు ఉంటారు? అదే కారణంతో 5 లక్షల మంది ప్రైవేటుకు మారిపోయారు.చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలిచనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు కనీసం రూ.25 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్రను వీడాలి. లోకేష్ ఫ్యాక్టరీలు, కంపెనీల తీసుకుని రావడానికి ఢిల్లీ వెళ్లాడని పెద్ద, పెద్ద అక్షరాలతో అచ్చు వేస్తున్న పచ్చ మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలను రాష్ట్రానికి, దేశానికి తెలియజేయాలి. ఇది ఒక వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే? ఇంత చేతకాని వారికి పరిపాలించే అర్హత ఉందా? లోకేష్ ఏ రోజైనా ఈ ఏడాది కాలంలో ఈ సంస్కరణలను తీసుకురాగలిగాను, ఈ అభివృద్ధి చేశాను అని చెప్పగలిగాడా?ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్, వసతి దీవెన పెండింగ్, అమ్మఒడి పావు ఒడి చేశాడు. ఒక ఏడాది స్కీమ్ ఎగరగొట్టాడు. పేర్లు మార్చినంత మాత్రాన పనిమంతుడు కాలేవన్నవిషయాన్ని లోకేష్ గుర్తుంచుకోవాలి. పనితనం చూపించాలి. అడవిబిడ్డల ఘోషను, పాపాన్ని మూటగట్టుగుంటున్నావన్న విషయం గుర్తించుకో లోకేష్. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ కు సున్నామార్కులు వస్తాయి. తన శాఖలో సక్రమంగా పనిచేయలేని లోకేష్ అన్ని శాఖలను సంస్కరించాలని కుతూహలపడతాడు.మంచినీళ్లవ్వకుండా విలాసాలకు మంచినీళ్లలా ఖర్చుగిరిజన బిడ్డల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. ఒకే ఒక వసతి గృహం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు 135 మంది ఆసుపత్రికి వెళ్లారు. వారిలో నుంచి దాదాపు 25 మందికి పచ్చకామెర్లు ఉన్నట్లు తేలింది. దీనికి కారణం ఆ హాస్టల్ లో ఆర్వో ప్లాంట్ నిర్వహించకుండా, సురక్షిత మంచినీటిని అందించలేకపోవడమే కారణం. చివరికి చిన్నపిల్లలకు మంచినీళ్లు కూడా అందించలేని ఈ చేతకాని ప్రభుత్వం... గొప్పలు చెప్పడానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని సభలు పెట్టడానికి, వందలసార్లు హైదరాబాద్ కు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి మాత్రం విచ్చలవిడిగా ఖర్చుచేస్తోంది.ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కొలుకుల స్కూల్, పుల్లలచెరువు స్కూల్లో ఉపాధ్యాయులు లేరు. 170 మంది ఉపాధ్యాయులు వెళ్లిపోతే.. 26 మంది మాత్రమే వచ్చారని విద్యాశాఖ అధికారులకు చెప్పాను. అయినా స్పందన లేదు. లోకేష్ శాఖలో నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన వసతీ లేదు. చివరకు నాణ్యమైన భోజనం కూడా అందివ్వలేని అసమర్థ మంత్రిగా లోకేష్ నిలబడ్డం ఖాయం. 611 మంది చదువుతున్న స్కూళ్లో మంచినీళ్ల ఆర్వో ప్లాంట్ నిర్వహణకు ప్రభుత్వం వద్ద డబ్బులేదా? ఈ డబ్బంతా ఎటు పోతుంది. కూటమి ప్రభుత్వం తెచ్చిన రూ.2.11 లక్షల కోట్ల డబ్బుంతా ఎవడి జేబులోకి పోయింది. దోచుకున్న మద్యం డబ్బు ఎటు పోతుంది.వీధుల్లో వరదలా మద్యం- ఆదాయం మాత్రం టీడీపీ నేతల జేబుల్లో..ఇవాళ ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం రాకెట్ పట్టుబడింది. అతను కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే. రోడ్ల మీద, వీధుల్లో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది.. రాష్ట్ర ఖజనాకు మాత్రం ఆదాయం రావడం లేదని ఆరా తీస్తే... చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో బయటపడ్డ నకిలీ మద్యమే అసలు కారణం. ఇవాళ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న ప్రతీ మూడు సీసాల్లో ఒకటి నకిలీ మద్యం సీసాయే. నకిలీ మద్యం తాగి వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. కల్తీ భోజనం తిని వందలాది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కచ్చితంగా మారాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కోసం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కు హితవు పలుకున్నాం. చాతగాని, చేవలేని ఎంత మంది నాయకులున్నా.. సమర్ధత గలిగిన వైయస్.జగన్ నాయకత్వం కాలిగోటికి సరిపోరు అన్న విధంగా కూటమి పాలన సాగుతోంది. వైయస్.జగన్ ఒంటరిగా 151 సీట్లు గెలిచి, ఎక్కడా ఏ రకమైన రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రతి గ్రామంలో నూతన భవనాలను నిర్మించి, నూతన వ్యవస్థలను నెలకొల్పారు. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే. .వాటిని కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెడుతోంది. వ్యవస్థల్లోకి ప్రైవేటు వ్యక్తులు వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇవాళ విద్యాశాఖను చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. విద్యాశాఖలో ప్రైవేటు వ్యవస్థ ఉండడం వల్ల ఏ విధంగా ప్రభుత్వవిద్యావ్యవస్ధ నాశనం అవుతుందో.. అదే విధంగా వైద్య వ్యవస్థ కూడా అలాగే మారబోతుందని వైయస్సార్సీపీ పదే పదే గళం వినిపిస్తుంది.చంద్రబాబు పాలనలో నీరుగారుతున్న వ్యవస్థలుచివరగా 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడు అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతిలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా నీరుగారిపోతున్నాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి.. ఈ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలు ఏదైనా ఉన్నాయంటే.. నకిలీ మద్యాన్ని భారీ ఎత్తున తయారు చేసే ఫ్యాక్టరీలే తప్ప.. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేనే లేదు అని తాటిపర్తి చంద్రశేఖర్ తేల్చి చెప్పారు.విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ..ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాలలో గ్రానైట్ క్వారీలున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీనరేజీ వసూళ్లుకు మంచి విధానం తెస్తే మాపై విషం కక్కారు. ఇవాళ కూటమి ప్రభుత్వం సీనరీ వసూళ్లు చేసే బాధ్యతను ఏ ఏం ఆర్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. ఈ సంస్థ ప్రతీ రోడ్డులోనూ చెక్ పోస్టులు పెట్టి, ఏ మట్టి ట్రాక్టర్, ఇసుక లారీ, మట్టి బండి వెళ్లినా వాళ్లకు కప్పం కట్టాల్సిందే.వీళ్ల పేమెంట్ చేసేది రెండేళ్లలో రూ.1135 కోట్లు అని వాళ్ల కరపత్రిక ఈనాడులో రాశారు. అందులోనే గత ఏడాది సీనరేజ్ రూ.450 కోట్లు అని రాశారు. అలాంటప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి ? ఒక కంకర లారీ లోడ్ కు రూ.5010 చెల్లించాలి. ఈ విధంగా దాదాపు రూ.6 కోట్లు ఒక రోజుకు వసూలు చేస్తున్నారు. వారికి ఏడాదికి వస్తున్న ఆదాయం ఎంత? వారు కడుతున్న అమౌంట్ ఎంత ? గతంలో ఎవరైనా ఇంటికి మట్టి తోలుకుంటే డబ్బులు కట్టాల్సిన పనిలేదు. ఇవాళ ఏ ఏం ఆర్ సంస్థకు మాత్రం కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. -
Tatiparthi: విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అట్టర్ ఫ్లాప్
-
‘బాబు చీటర్, లోకేష్ లూటర్ అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు’
సాక్షి, విశాఖ: చంద్రబాబు(Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) మండిపడ్డారు. కానీ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఎప్పుడూ ఒకే మాట మాట్లాడుతారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని మరోసారి అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు.ఈనెల తొమ్మిదిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) విశాఖ పర్యటనపై నేడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘ఏడు నియోజకవర్గాల మీదుగా వైఎస్ జగన్ రోడ్ షోగా వెళ్ళే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వైఎస్ జగన్ కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే. కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి.చంద్రబాబులా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట జగన్ మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్‌లో దాదాపు పదివేల మంది ఉద్యోగాలు పోయాయి. కూటమి ప్రభుత్వం పేదవారి కడుపు కొడుతోంది. పేదవాడికి ఉచిత వైద్యం అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు చీటర్, లోకేష్(Nara Lokesh) లూటర్ అని జనం మాట్లాడుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎవరికి లాభం? -
లోకేష్ బూతులపై పేర్ని నాని రియాక్షన్
-
కంగారు పెట్టకండి.. గుద్దితే నాకే బొ*.. : మంత్రి నారా లోకేష్
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇందులో నేతలకు ఓ పద్ధతి అంటూ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నేతల బూతు పురాణాలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా.. స్వయంగా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవువుతున్నాయి. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఓ మహిళా ఆటోడ్రైవర్ పక్కనే కూర్చున్న లోకేష్.. ఆమె కంగుతినే రేంజ్లో మాట అన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఇతర నేతలంతా ఆటోలో ప్రయాణించారు. ఆ సమయంలో.. ఆటో వెనుక రాసిన కొటేషన్లు చదువుతూ, లోకేష్ హాస్యం చేయబోయారు. ‘‘కంగారు పెట్టకండి..గుద్దితే నాకే బొ*’’ అంటూ లోకేష్ నోట మాట వచ్చింది. దీంతో ఆ మహిళా డ్రైవర్ ఒక్కసారిగా కంగుతింది. అయితే మంత్రిగారూ ఫీలవుతారనుకుందో ఏమో.. ఆమె కూడా ఇబ్బందిగానే నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు చేరింది. కనీస గౌరవం లేకుండా ఓ మహిళ ముందు ఇలాగేనా మాట్లాడేంది అంటూ ప్రశ్నిస్తున్నారు పలువురు. -
మహిళ ఆటో డ్రైవర్ తో మంత్రి లోకేష్ సభ్యత లేని వ్యాఖ్యలు
-
సీఎం హైదరాబాద్ టూర్ @ 71
సాక్షి, అమరావతి: తీరిక దొరికితే చాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్కే విమానం.. దిగే విమానం.. అన్నట్లు వారాంతాల్లో, సెలవు రోజుల్లో విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం చంద్రబాబు 70 సార్లు హైదరాబాద్ వెళ్లి వచ్చినట్లు టీడీపీ కూటమి వర్గాలు.. అధికార వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది.ఆ తర్వాత ఆదివారం 71వ సారి కూడా హైదరాబాద్ వెళ్లి రావడంతో మరోమారు ఈ విషయం వైరల్ అయ్యింది. మంత్రి లోకేశ్ ఈ 16 నెలల్లో 77 సార్లు హైదరాబాద్‌కు వెళ్లొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర, ఎన్నికల ప్రచార సమయంలో మినహా ఏపీ వైపే చూడలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ వేదికగానే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నట్లు సమాచారం.సినిమా షూటింగ్‌లు, వ్యక్తిగత పనులకే అక్కడ పరిమితం కావడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు, పార్టీ వర్గాలు వాపోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ హైదరాబాద్, ఇతర ప్రాంతాలకే పరిమితమయ్యారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోనే ఎక్కువగా గడుపుతున్నారని, విజయవాడలో ఉన్న రోజులను వేళ్లపై లెక్క పెట్టవచ్చని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మంత్రి లోకేష్ ఆదేశాలను ధిక్కరిస్తున్న జీవీఎంసీ కూటమి కార్పొరేటర్లు
-
‘ప్రజలను వేధించడానికే.. కూటమి అధికారంలోకి వచ్చింది’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలను పీడించడానికే అంటూ ఆరోపించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కురసాల కన్నబాబు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు అని అన్నారు. కొడుకు తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబే ఆయనే వేధింపులను నేర్పిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.కాకినాడ రూరల్‌లో వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్‌ను ఉత్తరాంధ్ర జిల్లాల రిజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘కూటమికి అధికారం వచ్చింది ప్రజల్ని పీడించడానికి.. వైఎస్సార్సీపీని అణగదొక్కడానికే. సామాన్యుల నుండి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు. పోలీసులు ఎందుకు దిగజారిపోయి పని చేస్తున్నారని సాక్షాత్తూ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.కొడుకు తప్పు చేస్తే తండ్రి తప్పు అని చెప్పాలి. అలా కాకుండా.. ప్రజల్ని పీడించుకుని, వేధించుకుని తిను అని చంద్రబాబు తన కొడుక్కి నేర్పించాడు. వైఎస్సార్సీపీ శ్రేణులు.. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను ప్రవేశపెట్టారు. ప్రజలకు సంక్షేమం ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఫలానా పథకం రాలేదని అడగాలంటే భయపడే పరిస్ధితి వచ్చింది. ఈ అన్యాయాలు అన్నింటినీ తప్పకుండా డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఎలా ఇస్తారు ?
-
లోకేష్ నిర్వాకంతో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయిన విద్యార్థులు
-
ఇది వర్సిటీయా.. లేక జైలా!?
బీచ్‌రోడ్డు (విశాఖ జిల్లా): ‘ఊపిరి పీల్చుకోలేని స్థితిలో తమ సహ విద్యార్థి ఆక్సిజన్.. ఆక్సిజన్.. అంటూ చనిపోయాడని, ఇందుకు ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు మండిపడ్డారు. ఆరు నెలలుగా వర్సిటీలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ఏయూ పాలకులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని, వారి నిర్లక్ష్యం ఖరీదే బీఈడీ విద్యార్థి మణికంఠ మరణమని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించడం చేతకాని వీసీ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏయూలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మణికంఠ బుధవారం ఉదయం ఊపిరి తీసుకోలేక అస్వస్థతకు గురవ్వడం.. సహ విద్యార్థులు ఏయూ ఆరోగ్య కేంద్రానికి ఫోన్ చేయడం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ ఉన్నప్పటికీ.. ఆక్సిజన్ పెట్టకుండానే కేజీహెచ్‌కు తరలించడం.. కాసేపటికే మణికంఠ మరణించడం తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శుక్రవారం ఏయూ విద్యార్థులు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఆరు నెలలుగా తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఈడీ ప్రవేశ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి వర్సిటీలో చేరిన మణికంఠను విగతజీవిగా అప్పగించడంపై ఆయన తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అధికంగా ఉన్న పరీక్షల ఫీజులు తగ్గించాలని కోరినా పట్టించుకోలేదని, అలాంటప్పుడు వీసీగా కొనసాగటం ఎందుకని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు ఎవరి మేలు కోసమో వర్సిటీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 6వ తేదీ నాటికి సమస్యలన్నీ పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మెస్ చార్జీల పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్ అతీగతీ లేదని మండిపడ్డారు. సమస్యల గురించి మాట్లాడితే ఫెయిల్ చేస్తామంటూ విభాగాధిపతులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది విశ్వవిద్యాలయమా.. లేక జైలా అని మండిపడ్డారు. పోలీసుల అత్యుత్సాహం ఏయూలో విద్యార్థులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తమను అడ్డుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న కలెక్టరేట్ వద్ద సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తించి, భీమిలి పోలీస్ స్టేషన్‌కు తరలించారని వాపోయారు. మణికంఠ మృతికి నష్ట పరిహారం కోసం ఏయూ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. పురుష పోలీసులతో విద్యార్థినులపై దాడి చేయటం ఘోరమన్నారు. రాజకీయ ద్వేషంతో ఆందోళనలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. తామెలాంటి రాజకీయాలు చేయడం లేదని, సమస్యల్ని తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాక్ కమిటీ ఏయూను సందర్శిస్తుందని తెలిసి ఒక్క రాత్రిలోనే రోడ్లు వేసిన ఉన్నతాధికారులు.. తమ సమస్యలను మాత్రం ఆరు నెలలుగా పరిష్కరించకుండా సాగదీస్తున్నారని ధ్వజమెత్తారు.ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీఏయూ డిస్పెన్సరీలో అందిస్తున్న సేవలు, విద్యార్థి మణికంఠ మరణానికి గల కారణాలపై విచారించేందుకు డీఎంఅండ్‌హెచ్‌వో, కేజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్లతో కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను కలెక్టర్‌కు సమర్పించనుంది. వారం రోజుల్లో నివేదికలోని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తరుఫున డీఎస్పీ ప్రమీల హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. పోలీసులు మాపై దాడి చేశారు మా తోటి విద్యార్థికి జరిగిన అన్యాయం, మా సమస్యల పరిష్కారం కోసం మేము ఉన్నతాధికారుల వద్దకు వెళ్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలని కూడా చూడకుండా మాపై దాడి చేశారు. నన్ను ఒక పోలీసు మోకాలితో నెట్టి వెనక్కి తోశారు. నా చేతికి గాయాలయ్యాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఏయూను శవాల దిబ్బగా మారుస్తున్నారు. – సౌజన్య, ఎంబీఏ విద్యార్థిని వర్సిటీలో నియంత పాలన ఆంధ్ర యూనివర్సిటీలో నియంత పాలన సాగుతోంది. తనపై చాన్స్‌లర్ అయిన గవర్నర్ ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా వీసీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయలేని అసమర్థ ఉన్నతాధికారులు తక్షణమే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి. – తరుణ్, బీఈడీ విద్యార్థి లిఖిత పూర్వకంగా ఇవ్వాలి విద్యార్థుల సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? ఎలా పరిష్కరిస్తారు? లిఖిత పూర్వకంగా ఏయూ అధికారులు తెలపాలి. ఇచి్చన గడువు లోపు సమస్యలు పరిష్కరించ లేకపోతే వారి పదవులకు రాజీనామా చేయాలి. ఆరు నెలలుగా అనేకసార్లు మా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రతిసారీ చేస్తాం అంటున్నారే తప్ప పరిష్కరించడం లేదు. ఈసారి పరిష్కరించే వరకు వదిలే ప్రసక్తి లేదు. – ప్రవీణ్ కుమార్, లా స్టూడెంట్ -
ఏయూ విద్యార్థుల ఆందోళనపై మంత్రి లోకేష్ విమర్శలు
-
‘ఎవరిది రాజకీయం?..’ లోకేష్‌పై ఏయూ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: తమ ఆందోళనలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్వార్థంతోనే విద్యార్థులు రాజకీయం చేస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ లోకేష్‌కు ఏయూ స్టూడెంట్స్ అల్టిమేటం జారీ చేశారు. ‘‘విద్యార్థులు రాజకీయం చేస్తున్నారా? ఎవరిది రాజకీయం?. మా ఇబ్బందులు చెప్పుకోవడం స్వార్థం అవుతుందా?. వీసీ రాజకీయ ఎజెండాతోనే వచ్చినట్లు మీ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ఏయూ వీసీ.. గీతం వర్సిటీ కోసం పని చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాగే మాట్లాడితే మీ ఇంటిని ముట్టడిస్తాం. తక్షణమే మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’ అని విద్యార్థులు హెచ్చరించారు.ఏయూ విద్యార్థుల ఆందోళనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏయూ బంద్‌కు విద్యార్థులు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ నిరసనలు కాస్త ఆందోళనలుగా మారాయి. అయితే.. స్వార్థం కోసమే విద్యార్థులు ఆందోళనకు దిగారంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. కావాలనే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆంధ్రా వర్సిటీలో రాజకీయం చేస్తున్నాయి. మణికంఠ అనే విద్యార్థి ఫిట్స్ వచ్చి మరణించాడు. ఆంబులెన్స్‌లో ఉన్నప్పటికీ అతని ప్రాణాలు రక్షించలేకపోయారు. అయితే దాని వెనకాల ఏదో ఉందంటూ స్టూడెంట్స్ ఆందోళనలు చేస్తున్నారు. ఇది సరికాదు. కేవలం వాళ్ల స్వార్థం కోసం వాళ్లు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.. .. వీసీ నియామకాల్లో రాజకీయం ఏం లేదు. విద్యార్థులు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటాం. ఏయూని టాప్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని నారా లోకేష్ అన్నారు. మరోవైపు వీసీ రాజశేఖర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. విద్యార్థుల చర్చ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఒక ఉద్దేశ పూర్వక నిరసనగానే అనిపిస్తోందని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు శుక్రవారం రెండో రోజుకి చేరాయి. వీసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను శుక్రవారం ఉదయం విద్యార్థులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో వాళ్లకు అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి రణరంగంగా మారింది. తమ జుట్టు పట్టుకుని లాగి పడేసి అనుచితంగా ప్రవర్తించారంటూ ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు మీడియా ఎదుట వాపోయారు. విద్యార్థుల డిమాండ్లు..ప్రతి విద్యార్థికి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలిడిస్పెన్సరీలో సౌకర్యాలను మెరుగుపరచాలిఆక్సిజన్ సిలిండర్స్ ను అందుబాటులో ఉంచాలిచనిపోయిన మణికంఠ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలివారం రోజుల్లో హామీలపై స్పష్టత ఇవ్వాలి.. లేదంటే విసీ రాజీనామా చేయాలివిద్యార్థుల డిమాండ్లతో పాటు విద్యార్థులు సమస్యలపై త్రీ మెన్ కమిటీ ఏర్పాటుకు వీసీ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. విద్యార్థులు తమ డిమాండ్లను నిర్ణీత కాలపరిమితిలో నెరవేరుస్తామని రాసివ్వాలని కోరగా.. అందుకు వీసీ రాజశేఖర్ అంగీకరించలేదు. అలాగే పదవికి రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.గత ఏడాది కాలంగా ఏయూలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. అయినా వర్సిటీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీఈడీ స్టూడెంట్ మణికంఠ మృతి చెందడం, ఈ మరణానికి అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తుండడంతో ఆ నిరసనలు ఆందోళనల రూపం దాల్చాయి. మరో వీసీ నియామకం వెనుక రాజకీయాలు నడిచాయన్న ఆరోపణలనూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ క్రమంలో వీసీ వైఖరి కారణంగానే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. -
లోకేష్ వీడియో చూపిస్తూ ఏకిపారేసిన విడదల రజిని
-
అయ్యా లోకేశ్.. నా గోడు పట్టదా!
సాక్షి, నెల్లూరు సిటీ: సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ టీడీపీ నాయకులు, కార్యకర్తలను పూర్తిగా వాడుకుని వదిలేస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడి జీవితం కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. టీడీపీని నమ్ముకుని ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డానని నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన కంచి మల్లికార్జునరెడ్డి తెలిపారు.‘1983లో పార్టీ స్థాపించినప్పటి నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశాను. పార్టీ కోసం నా జీవితాన్ని, ఆస్తులను త్యాగం చేశాను. ఈ రోజు బతుకుదెరువు కోసం పార్టీ నేతలను, స్థానికులను యాచించాల్సిన దుస్థితి వచ్చింది’ అని మల్లికార్జునరెడ్డి ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్ పేరుతో సేవా కార్యక్రమాలకు రూ.కోట్లు ఖర్చు..‘నేను 2014లో నారా లోకేశ్ సేవా సమితిని ఏర్పాటు చేశాను. రూ.కోట్లు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాను. అప్పట్లో పవర్ ప్రాజెక్ట్‌లకు ఐస్ సరఫరా కాంట్రాక్ట్ చేసేవాడిని. నేను సంపాదించిన డబ్బులతోపాటు 2 ఇళ్లు, ఇంటి స్థలం అమ్మేసి లోకేశ్ సేవా సమితి కార్యక్రమాలకు ఖర్చు చేశాను. రూ.1.50లక్షలు ఖర్చు చేసి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు, తల్లి అమ్మణ్ణమ్మల పెయింట్ ఫొటో వేయించాను. ఆ ఫొటోను చంద్రబాబుకు బహూకరించాను. గతేడాది డిసెంబర్లో షుగర్ పెరిగి నాకు ఒక కాలు తొలగించారు. తల నరాలు బలహీనపడి నా భార్య అనార్యోగంతో బాధపడుతోంది. దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు.’ అని చెప్పారు. ‘ఇటీవల నెల్లూరు వచి్చన లోకేశ్‌ను కలిశాను. నా పరిస్థితిని వివరించడంతో అధైర్య పడొద్దు.. మంత్రి నారాయణకు చెప్పాను. ఆయన చూసుకుంటారని లోకేశ్ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరూ సాయం చేయలేదు. నా జీవితాన్ని పారీ్టకి అంకితం చేశాను. నన్ను ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం’ అని అన్నారు. -
రెండు కంపెనీలకు ఒక్క రూపాయికే భూమి ఇచ్చామని ఒప్పుకున్న లోకేష్
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వైఖరి శాసన మండలి సాక్షిగా బయటపడింది. రెండు ఐటీ కంపెనీలకు ఎకరా స్థలాన్ని రూపాయికే ఇచ్చామంటూ మంత్రి నారా లోకేష్ అంగీకరించారు.మంగళవారం శాసన మండలిలో రాష్ట్రంలో పరిశ్రమలు, వాటి పెట్టుబడులు అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో కూటమి ప్రభుత్వంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ‘గత ఐదేళ్లలో విశాఖలో ఐటీ కంపెనీలు సహా అనేక కంపెనీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. మేం ఆనాడు శంకుస్థాపనలు చేసిన కంపెనీలు ఇవాళ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు శంకుస్థాపనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాదు రాష్ట్రంలోని ఐటీ నిబంధనలకు అనుగుణంగా వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన సంస్థలు, వాటి వివరాల్ని సభలో వెల్లడించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో వేలకోట్ల విలువైన భూముల్ని కేవలం ఊరుపేరు లేని కంపెనీలకు ఎకరం భూమిని రూపాయికే కట్టబెట్టిందని మండిపడ్డారు. ఆక్షన్‌లో పెట్టకుండా వేల కోట్ల విలువైన భూముల్ని లులు, ‘ఉర్సా’ అనే ఊరూపేరూ లేని, రెండు మాసాల వయసున్న ఓ కంపెనీకి విశాఖలోనే ఖరీదైన 60 ఎకరాల స్థలాన్ని ఎకరా 99 పైసలకే కట్టబెట్టడాన్ని నిలదీశారు.అందుకు సభలో ఉన్న నారా లోకేష్ స్పందించారు. తాము రాష్ట్రంలో రెండు ఐటీ కంపెనీలకు రూపాయికే ఎకరా స్థలాన్ని కట్టబెట్టినట్లు ఒప్పుకునున్నారు. మేం ఎకరా స్థలం ఒక్క రూపాయికి ఇచ్చింది కేవలం రెండు కంపెనీలకు మాత్రమే. టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకు ఇచ్చాం’ అని వ్యాఖ్యానించారు. దీంతో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములను నిబంధనలు పాటించకుండా, పారదర్శకత లేకుండా కేటాయించిన విషయం సభ సాక్షిగా బట్టబయలైంది. -
మండలిలో నారా లోకేష్ పరుష పదజాలం
సాక్షి,అమరావతి: శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ సహనం కోల్పోయారు. పరుష పదజాలం ఉపయోగించారు. ‘ఏం పీకారు. మీరు పీకింది ఏంటి..?’ అంటూ నోరుపారేసుకున్నారు. మంగళవారం శాసన మండలిలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపారు. కేంద్రమంత్రి కుమార స్వామి ఇదే విషయం చెప్పారు’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఘాటుగా సమాధానం ఇచ్చారు.దీంతో నారా లోకేష్ సహనం కోల్పోయారు. ఏం పీకారు.. మీరు పీకింది ఏంటి..?అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలపై వాగ్వాదానికి దిగారు . అయితే, లోకేష్ భాషపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ సభకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
తప్పు ద్రోవ పట్టించా.. క్షమించండి సభలో లోకేష్ క్షమాపణలు
-
తల్లికి వందనంపై ప్రశ్నల వర్షం కురిపించిన YSRCP ఎమ్మెల్సీలు
-
శాసన మండలి సాక్షిగా బయటపడ్డ పచ్చి నిజం
సాక్షి, అమరావతి: ఏపీలో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. మండలి సాక్షిగా పచ్చి నిజం వెల్లడైంది. 1 నుంచి ఇంటర్ వరకు 77,58,930 మాత్రమే విద్యార్థులు ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. 2023-24 UDISE డేటా ప్రకారం 87, 41, 885 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం లో 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక UDISE డేటాతో పోలిస్తే 9,82,955 మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినట్లు తేలింది.రాష్ట్ర ప్రభుత్వం డేటాతో పోలిస్తే సుమారు 6 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గిపోయారు. గత రెండు విద్యా సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య ఘోరంగా తగ్గిపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు తగ్గిపోయారు. సీఎంగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టాక విద్యార్థుల సంఖ్య తగ్గింది.ఫీజుల భారం, విద్యా ప్రమాణాలు తగ్గిపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గింది. గత ఏడాది అమ్మ ఒడి పథకాన్ని ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యలోనూ భారీగా కోత విధించింది. మండలిలో మంత్రి లోకేష్ సమాధానంతో అసలు నిజం బట్టబయలైంది. ఏపీలో 77,58,930 మంది విద్యార్థుల్లో 66,57,508 మందికే వర్తింపు చేసిన ప్రభుత్వం.. 11,01,422 మంది విద్యార్థులు అనర్హులుగా ప్రకటించింది. ఈ ఏడాది 2 లక్షల 70 వేల మందికి తల్లికి వందనం నిధులు ఇప్పటికి జమకాలేదు. కేంద్రం ఇచ్చిన నిధులపై మండలిలో మంత్రి లోకేష్ సమాధానం చెప్పలేకపోయారు. -
Botsa : సభలో ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకో...
-
మండలిలో మంత్రి లోకేష్‌ను ఏకిపారేసిన బొత్స
సాక్షి, అమరావతి: శాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై వైఎస్సార్సీపీ చర్చకు పట్టుబట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్ అబద్ధపు వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మేం బకాయి పెట్టినట్లు లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవం అని బొత్స మండిపడ్డారు.ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్‌కు మండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణల మధ్య వాగ్వివాదం జరిగింది. ‘‘సభలో సీనియర్, జూనియర్ అనే తేడాలు ఉండవు. ఎవరైనా సభా మర్యాదలు పాటించాలి. కొన్ని పరుష పదాలు వాడకూడదు.. కొన్ని నేర్చుకోండి. మంత్రి లోకేష్ చెప్పినట్లుగా మేం బకాయిలు పెట్టామన్నది అవాస్తవం. చర్చకు రండి మేము సిద్ధంగా ఉన్నాం. సభను తప్పుదోవ పట్టించి ప్రజలు మభ్య పెడితే కుదరదు’’ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి లోకేష్ వర్సెస్ మండలి చైర్మన్..గత ప్రభుత్వం హయాంలో అవుట్ సోర్సింగ్ వర్కర్లకు పథకం అమలు అయ్యింది.. వారికి ఇప్పుడు నిలిపివేశారు.. వారికి అమలు చేసే అవకాశం ఉందా? అంటూ మండలి ఛైర్మన్ మోషేన్ రాజు.. మంత్రి లోకేష్‌ను అడిగారు మున్సిపాలిటీల్లో పనిచేసే వర్కర్స్ జీతాలు 12 వేలు.. రూరల్ ప్రాంతంలో 10 వేల కంటే తక్కువ ఉన్నవారికి పథకం వర్తిస్తుందని మంత్రి లోకేష్. సమాధానమిచ్చారు. మున్సిపాలిటీలో 18 వేలు వేతనం ఉంది.. మీరు 12 వేలు నిబంధన పెడితే పథకం ఏ విధంగా వాళ్లకు అందుతుందంటూ మండలి ఛైర్మన్ ప్రశ్నించారు. దీంతో పరిశీలిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.శాసనమండలిలో తల్లికి వందనంపై చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయేలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యార్థుల కోసం అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ ప్రభుత్వం దాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టారు. 67 లక్షల మందికి విద్యార్థులకు పథకం ఇస్తామని 54 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు.. రెండో ఏడాది అరకొరగా ఇచ్చారు. నిబంధనల పేరుతో అనర్హుల సంఖ్యను పెంచారు. కరెంట్ బిల్లు 300 దాటినా పథకం కట్ చేశారు.స్టీల్ ప్లాంట్ అందరికీ సెంటిమెంట్ తో కూడుకున్నది..విశాఖ స్టీల్ ప్లాంట్ అందరికీ సెంటిమెంట్‌తో కూడుకున్నదన్నారు బొత్స. ‘ ఇండస్ట్రీస్ మేం అభివృద్ధి చేశామని టీడీపీ చెప్తుంది.ా రిశ్రామిక రంగం విచ్చిన్నమైంది.. మేమొచ్చి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పారు. గత ఐదేళ్లలో జీడీపీ పెరిగింది తప్ప ఎక్కడా తగ్గలేదు. మా ప్రభుత్వ హయాంలో దేశంలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూసారు. విశాఖలో 2023లో జరిగిన సమ్మిట్‌కి ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు వచ్చారు. ప్రభుత్వ విధానాలు నచ్చి నవీన్ జిందాల్ వంటి వారు వచ్చారు. 13 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు చేసుకున్నాం.. పరిశ్రమలు రావాలంటే వాళ్లకు నమ్మకం ఉండాలి..పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వానికి కో ఆర్డినేషన్ జరగటం నిరంతర ప్రక్రియ.. ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే చూస్తాయి.. సెకీ ఒప్పందాలపై నానా రాగ్ధాంతం చేసారు.. ఆ తర్వాత ఏమైంది.. విశాఖను ఫార్మా హబ్ లా తీర్చిదిద్దాం.. మాట్లాడితే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టాం అని చెప్పుకుంటారు. గత ఐదేళ్లలో విశాఖలో ఐటీ కంపెనీలు సహా అనేక కంపెనీలు తెచ్చాం..ఇవాళ వాళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో అవన్నీ మా హయాంలో మేం శంకుస్థాపనలు చేసినవే. లులూ కంపెనీ ఐదు మాల్స్ మూతపడ్డాయి.. అసలు దాని వర్త్ ఎంత..దాని క్రెడిబిలిటీ ఏంటి?, విజయవాడ ఆర్టీసీ స్థలం వాళ్లకు ఇవ్వటం ఏంటి.?,ఆక్షన్ లో పెట్టకుండా నేరుగా ఎందుకు ఇచ్చి వేస్తున్నారు’ అని ప్ర శ్నల వర్షం కురిపించారు బొత్సమండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ ఏపీ శాసన మండలి నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేశారు. హోంమంత్రి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. -
ప్రజా సొమ్ముతో జల్సా రాయుళ్లు
-
ఎక్కే విమానం.. దిగే విమానం!
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారిది ఒకే తీరు. గన్నవరం విమానాశ్రయంలో ఎక్కే విమానం.. దిగే విమానం.. వారాంతం విశ్రాంతి కోసం ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దురి్వనియోగం చేస్తున్నారనే చర్చ అటు టీడీపీ కూటమి వర్గాలో.. ఇటు అధికార వర్గాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు.. ఈ 15 నెలల్లో సీఎం చంద్రబాబు దాదాపు 70 సార్లు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. మంత్రి లోకేశ్ 77 సార్లు ‘ప్రత్యేక’ంగా ప్రయాణాలు చేశారని తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ప్రత్యేక’ ప్రయాణాలకు అంతేలేదు. ఆయన ఏపీలో కంటే హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోనే ఎక్కువగా గడిపారు. పట్టుమంటే పదిరోజులు ఆయన విజయవాడలో ఉన్న దాఖలాలే లేవని అధికారులు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నా చంద్రబాబు వారాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి హైదరాబాద్‌కు వెళ్లి.. అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో సరదాగా గడుపుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారంలో ఉండి కూడా చుట్టపుచూపుగా విజయవాడ వస్తున్నారంటూ అధికారులు వ్యంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబుది అదే తీరు.2019లో అధికారం కోల్పోయాక.. మూడేళ్లపాటు అంటే 2022 వరకూ ఏపీ ముఖం చూడలేదన్న సంగతి తెల్సిందే... కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ఎత్తి చూపుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజాసేవలో నిమగ్నమైతే.. కనీసం వారికి మనోధైర్యం కలి్పంచేందుకు కూడా చంద్రబాబు అప్పట్లో రాష్ట్రానికి రాలేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2019 మే 30 నుంచి 2024 జూన్ 7 మధ్య రెండు మూడుసార్లు మాత్రమే హైదరాబాద్‌కు వెళ్లారని.. నిత్యం ప్రజలకు సుపరిపాలన అందించడానికే సమయం వెచి్చంచారని గుర్తు చేస్తున్నారు. లోకేశ్ 77 సార్లు హైదరాబాద్‌కు.. మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా తండ్రి సీఎం చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు 77 సార్లు వెళ్లినట్లు టీడీపీ కూటమి, సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అంటే.. గత 15 నెలలుగా సగటున వారానికి ఒకసారి లోకేశ్ హైదరాబాద్‌కు వెళ్లి సరదాగా గడిపినట్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గతేడాది ఆగస్టు 31న బుడమేరు వరద విజయవాడను చుట్టముట్టి.. విలయం సృష్టించి.. అపార ఆస్తి, ప్రాణనష్టం జరిగినప్పుడు కూడా లోకేశ్ హైదరాబాద్, ముంబయిలో ఉన్నారని ప్రజలు ఎత్తి చూపుతున్నారు.2014–19 మధ్య టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా లోకేశ్ ఇదే రీతిలో వ్యవహరించారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయాక.. మూడేళ్లపాటు రాష్ట్రానికి వచి్చంది వేళ్లపై లెక్కపెట్టవచ్చు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సమయంలో మినహా లోకేశ్ మిగతా రోజుల్లో హైదరాబాద్‌కే పరిమితం అయ్యారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో టూర్లు..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే... దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ అటు అధికార వర్గాలు.. ఇటు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉంటున్నారన్నది స్పష్టమవుతోంది. కలెక్టర్ల సమావేశం వంటి ముఖ్యమైన సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా కొడుతుండడం అధికార వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.ఈ 15 నెలల్లో పవన్ విజయవాడలో ఉన్నది చాలా తక్కువని సోషల్ మీడియాలో, కూటమి వర్గాల్లో చర్చ సాగుతోంది. సినిమా షూటింగ్‌లు, వ్యక్తిగత పనుల నిమిత్తం పవన్ కళ్యాణ్ రాజధానిలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా గడుపుతున్నారన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారాహి యాత్ర సమయంలో మినహా మిగతా సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకే పరిమితమయ్యారు. -
‘జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్.. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు’
సాక్షి, తిరుపతి: తిరుమలను కూటమి నేతలు రాజకీయ స్వార్థాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్సార్సీపీ హయాంలోనే రవి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సయమంలో పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను అని సవాల్ విసిరారు. అలాగే, జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు అంటూ ఎద్దేవా చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ హయాంలో రవి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నాం. మా పాలనలోనే రవి కుమార్ దొంగతనం బయటపెట్టాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రవి కుమార్ చోరీ చేశాడు. రవి కుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులు టీటీడీకి ఇచ్చారు. రవి కుమార్ అనే దొంగను చంద్రబాబు ప్రభుత్వం పట్టుకుందా?. కొట్టేయాలని అనుకున్న వారు దొంగను పట్టుకుంటారా?. దమ్ముంటే, ధైర్యముంటే విజిలెన్స్ నివేదిక బయట పెట్టాలి. రవి కుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఆస్తులు ఉన్నాయి. మా బినామీలకు ఆస్తులు రాసి ఇచ్చి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలి. మంత్రి ఆనం సమాధానం ఇచ్చాక కూడా ఆ నివేదిక ఎందుకు బయటకు రాదు?. ఆ నివేదికకు సంబంధించి చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది.జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు. నేను ఉన్నప్పుడు పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను. దమ్ముంటే సీబీఐ చేత విచారణ చేయించండి. నిజాలు నిగ్గు తేలాలి అంటే సీబీఐ చేత విచారణ చేయించాలి. సీబీఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. పరకామణిలో ఏం జరుగుతుందో సీసీ ఫుటేజీ ద్వారా బయటపెట్టాలి. కూటమికి తాబేదార్లుగా ఉన్న అధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు రావు. చంద్రబాబు హయాంలో కొట్టేసిన స్వామి వారి నిధులను మేం ఆ దేవదేవుడికి రాయించాం. కోడిగుడ్డు మీద ఈకలు పీకడాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలి. బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి అడుగడుగునా తప్పులే జరుగుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన సీసీ కెమెరాలు పుటేజ్ బయట పెట్టాలి. లడ్డు విషయంలో జరిగిన తరహాలో సీబీఐ విచారణ జరిపించాలి. వందల కోట్లు మేము అవినీతికి పాల్పడ్డామని మాపై నిందలు వేశారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తాము అని చెప్పిన బీఆర్ నాయుడు ఇది చాలా మంచి స్కీమ్ అని మెచ్చుకున్నారు. 22-07-2025 రోజున శ్రీవాణి టికెట్ల ధరను రూ.2వేలకు పెంచడానికి తీర్మానం చేశారు. భగవంతుడిని అడ్డు పెట్టుకుని వ్యాపారం, రాజకీయాలు చేస్తున్నారు. పరకామణిలో ఏం జరుగుతుందో నిరంతరం చూపించాలి. వీఐపీ దర్శనాలు తగ్గిస్తున్నామని చెప్పి, ఇంకా పెంచుతూ పోయారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
‘అలీబాబా అర డజను దొంగల్లో నువ్వూ ఒకడివి’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఫైర్ అయ్యింది. తిరుమల పరకామణిని సైతం తన రాజకీయాలకు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్‌కు ఒక అలవాటుగా మారింది. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే. సిగ్గు, శరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలు. పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబువి పచ్చి అబద్ధాలు’’ అంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.‘‘దశాబ్దాలుగా పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్‌ను పట్టుకున్నది 2023, ఏప్రిల్‌లో. అంటే వైఎస్సార్సీపీ హయాంలో. లోకేష్ నువ్వైతే పంచాయతీ చేసి రవికుమార్ ఆస్తులను కొట్టేసేవాడివి.. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు నిశిత విచారణ జరపడంతో, రవికుమార్ కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి గిఫ్టురూపంలో ఇచ్చేశారు. ఇదంతా చట్టప్రకారం, కోర్టులు నిర్దేశించిన న్యాయసూత్రాల ప్రకారం పారదర్శకంగా జరిగింది...లోకేష్.. నువ్వైతే పంచాయతీలు చేసి, ఈ ఆస్తులను కొట్టేసి, దొంగ పెట్టుబడుల రూపంలో ఏ దుబాయ్‌కో తరలించేవాడివి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఓ స్లోగన్ నడుస్తోంది.. క్యాష్.. సూట్‌కేసు.. రాజేష్.. లోకేష్.. అని. ఈ ప్రభుత్వంలోని అలీబాబా అరడజను దొంగల్లో నువ్వు ఒకడివి’’ అంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.#LooterLokeshరాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్‌కు ఒక అలవాటుగా మారింది. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే. సిగ్గు, శరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలు. పరకామణిలో చోరీ విషయంలోనూ… https://t.co/p6pkWARVqW— YSR Congress Party (@YSRCParty) September 20, 2025 -
చెప్పాడండి.. పెద్ద పోటుగాడు .. లోకేష్ పై పేర్ని నాని సెటైర్లు
-
నన్ను చంపాలని చూస్తున్నారు..! రండి నా పవర్ ఏంటో చూపిస్తా..
-
22 నుంచే దసరా సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 22 నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టుచేశారు. ఈ సెలవులు సోమవారం నుంచే ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్న విషయాన్ని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని, వారి కోరిక మేరకు ఈనెల 22 నుంచి అక్టోబరు 2 వరకు దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే అంశంపై గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేసినా విద్యాశాఖ మంత్రిగాని, అధికారులుగాని స్పందించలేదు. అలాగే, ఎస్జీటీల ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ సాధ్యంకాదనితేల్చిచెప్పిన లోకేశ్ గంట వ్యవధిలోనే ఎమ్మెల్సీల సూచన మేరకు ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ చేపడతామని ప్రకటించారు. స్పౌజ్ కేటగిరీలో అంతర్ జిల్లా బదిలీలను కూడా ఉపాధ్యాయ సంఘాలు కోరినా పట్టించుకోని లోకేశ్.. ఎమ్మెల్సీలు కోరగానే బదిలీలు చేపడుతున్నట్లు ప్రకటించారు. -
ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్న ఎంపీ శబరి, సీఎం అడిషనల్ సెక్రటరీ!
సాక్షి, విజయవాడ: ఏరికోరి సీఎం చంద్రబాబు నియమించుకున్న ఐఏఎస్ అధికారితో టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాటల యుద్ధానికి దిగారు. ఒకరికొకరు తిట్టుకోవడంతో పాటు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నడుస్తున్న ఈ పంచాయితీ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ ఎంపీ శబరి వెర్సస్ సీఎంవో కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్నారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజే జరిగిన ఈ వాగ్వాదం వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంపీ శబరి ఎదురు చూడసాగారు. ఆ సమయంలో ఆమెను సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా‘‘సీఎం బాగా బిజీగా ఉన్నారు’’ అని చెప్పి అనుమతించలేదు. అప్పటిదాకా పడిగాపులు పడ్డ ఆమె ఆ సమాధానంతో ఒక్కసారిగా ఊగిపోయారు. ‘‘నేనొక ఎంపీని.. నాతో ఇలాగేనా మాట్లాడేది’’ అని గట్టిగా అరిచారు. దీనికి ఆయన ‘‘నీలా ఎవరూ నాతో ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేదు’’ అంటూ మండిపడ్డారు. ఆ ఏకవచనం పిలుపుతో మరింత రగిలిపోయిన శబరి.. తనతో మర్యాదగా ప్రవర్తించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివాదం మరింత ముదరకుండా.. కొందరు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కట్ చేస్తే.. తాజాగా ఆమె మంత్రి నారా లోకేష్‌కు ఈ వ్యవహారంపై పిర్యాదు చేశారు. లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా కార్తీకేయ మిశ్రాకు పేరుంది. ఈ క్రమంలోనే ఆయన్ని కావాలనే చంద్రబాబుకి అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో.. సీఎంవో సీనియర్ అధికారి ఒకరి చేత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇలా ఎలా??
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాల గొంతు నులిమేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాల అణచివేతకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఒకదాన్ని ఏర్పాటు చేసింది. వీరి సిఫారసులు ఎలా ఉంటాయన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వం తీరుతెన్నులను విమర్శిస్తున్న, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను నకిలీలుగా ముద్రవేసే ప్రయత్నం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏది ఫేక్ ఏది కాదన్నది అందరికంటే బాగా తెలిసింది ప్రజలకే. కానీ ప్రభుత్వం, టీడీపీలు రెండూ తాము చెప్పిన విషయాలే సత్యమని నమ్మించేందుకు, ప్రభుత్వంలో జరుగుతున్న రకరకాల అవినీతి కార్యకలాపాలు బయటకు రాకూడదన్నట్టు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇష్టారీతిన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన బాబు, పవన్‌లు వైసీపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదని ఇప్పటికీ విమర్శిస్తూండటం విచిత్రం. ప్రతిపక్షంలో ఉండగా అన్ని వర్గాలను ప్రభుత్వంపై ఉసిగొల్పేలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు దంచిన ఈ ద్వయం ఇప్పుడు మాత్రం ఎవరైనా గట్టిగా మాట్లాడినా సరే వారి సంగతి చూస్తామని, కొత్త చట్టాలు తెచ్చి అణచివేస్తామని అధికారికంగానే చెప్పుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో యూరియాకు పెద్ద కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయాలనే సామాజిక మాధ్యమాలు బాగా హైలైట్ చేశాయి. దీంతో చంద్రబాబు తెగ ఆవేశపడిపోతున్నారు. సామాజిక మాధ్యమాలే లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆఖరకు ఈ విమర్శ హద్దులు దాటి.. మనుషులా, పశువులా అనే వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆయన రైతుల సమస్యను బహిర్గతం చేస్తున్న సాక్షి మీడియాపై కూడా తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. టీడీపీ అనుబంధ మీడియా సాయంతో సాక్షిలో వచ్చే వార్తలు ఫేక్ అన్న ప్రచారం చేయాలన్నది ఆయన ఉద్దేశం.ప్రతిపక్ష నేత జగన్ కూడా ఏ విమర్శ చేసినా అందులో సహేతుకత ఉండేలా జాగ్రత్తపడతారు. కాగ్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలిచ్చిన సమాచారం ఆధారంగానే టీడీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు, పవన్‌లు అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాల ఆధారంగా రాజకీయాలు చేయడం వీరికి అలవాటే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వీరు చేసిన అసత్యపు అరోపణలు అన్ని ఇన్నీ కావు. హిందూ మతానికి అపచారం జరిగిపోతోందని పదే పదే చెప్పేవారు. ప్రతి చిన్న విషయాన్నీ జగన్‌కు ఆపాదిస్తూండే వారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రసాదం లడ్డూలో కల్తీ ఆరోపణలు కూడా జగన్‌పైకే నెట్టేసే ప్రయత్నం చేసిన విషయం ఇటీవలి పరిణామమే. ఇదే సమయంలో జగన్ మాత్రం హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసే ఆరోపణలు కూడదని బాబు, పవన్‌కు హితవు చెప్పారు. తిరుమలకు అప్రతిష్ట తీసుకురావద్దని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముప్పైవేల మంది మహిళలు మాయమైనట్టు, అందుకు వలంటీర్లు కారణమైనట్టు తనకు కేంద్ర నిఘా వర్గాల వారు చెప్పారని పవన్ చేసిన ఇంకో ఆరోపణ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆయన పూర్తిగా మరచిపోయారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జగన్, ఆయన తల్లి విజయమ్మ తదితరులు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆమె కుమారుడిని ఆపాయ్యంగా దగ్గరకు తీసుకున్న సన్నివేశాన్ని అంతా చూశారు. అయినా మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ దానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఒక వీడియో కూడా ఎడిట్ చేసి టీడీపీ వారు ప్రచారం సాగించారని వైసీపీ ఆరోపించింది. కేంద్రం సూచనల ప్రకారం జగన్ ముఖ్యమంత్రిగా రీసర్వే చేపడితే జగన్ భూములన్నిటిని లాగేసుకుంటారని చంద్రబాబు, పవన్, లోకేశ్‌లు నానా యాగీ చేశారు. తీరా చూస్తే ఏమంది? అధికారంలోకి వచ్చిన తరువాత వారు కూడా అదే రీసర్వే పథకాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం అప్పుల గురించి కూడా ఇంతే. అప్పులతో ఆంధ్రప్రదేశ్ కాస్తా శ్రీలంక మాదిరిగా అల్లకల్లోలమైపోతుందని ఒకసారి.. అప్పులు రూ.14 లక్షల కోట్లు దాటిపోయాయని ఇంకోసారి రకరకాలుగా వ్యాఖ్యానించిన అప్పటి ప్రతిపక్ష నేతలు.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట సవరించుకున్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ స్వయంగా రాష్ట్రం అప్పులు రూ.6.5 లక్షల కోట్లని వెల్లడించారు. కానీ చంద్రబాబు ఆ తర్వాత కూడా జగన్ టైమ్‌లో రూ.పది లక్షల కోట్ల అప్పు అని చెబుతున్నారు. పోనీ అందులో తన 2014 టరమ్ లో చేసిన అప్పు,విభజన నాటి అప్పు కూడా ఉందని చెబుతారా? అంటే అదేమి ఉండదు. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. రెండు లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకువచ్చారు. ఈ వార్తను సాక్షి ఇచ్చింది. దానిని ఖండించే పరిస్థితి కూటమి సర్కార్‌కు లేదు. విశాఖలో జరిగిన సోదాల్లో ఒక కంపెనీలో మాదకద్రవ్యాలు వచ్చాయని, అదంతా వైసీపీ వారికి సంబంధించిందన్నట్టు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎంతగా ప్రచారం చేశాయి? తీరా చూస్తే అవి డ్రగ్స్ కాదని, అక్వా కంపెనీలలో వాడే ఈస్ట్ అని తేలింది. జగన్ టైమ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదంటూ టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సైతం తమ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు తెచ్చినట్లుగా చెప్పడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లు గతంలో చేసిన ఇలాంటి ఆరోపణలు, చెప్పిన అసత్యాలు, చేసిన ఆచారణ సాధ్యంకాని వాగ్దానాలు మొదలైన వాటన్నిటిని ప్రస్తావిస్తూ నాడు-నేడు కింద సోషల్ మీడియాలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఇవి వీరిని బాగా చికాకు పెడుతున్నాయి. తమ ఫేక్ ప్రచారమే తమకు చుట్టుకుంటోందన్నది వారి బాధ కావచ్చు. ఎవరు ఫేక్ ప్రచారం చేసినా తప్పే. అంతేకాదు. సోషల్ మీడియాలో వైసీపీ మహిళా నేతలను, రాజకీయాలతో సంబంధం లేని జగన్ సతీమణి భారతి వంటివారిపై కూడా ఒక వర్గం సోషల్ మీడియా నీచమైన పోస్టులు పెడుతున్నా, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే టీడీపీ వారిపై ఎవరైనా అభ్యంతరకర పోస్టు పెట్టినా వెంటనే స్పందిస్తారు. ఎవరు అలాంటి పోస్టులు పెట్టినా ఒకే రకంగా పోలీసు వ్యవస్థ స్పందిస్తే మంచిది కదా!. చంద్రబాబు,లోకేశ్‌లు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టులో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లు నడుపుతుంటారని, తప్పుడు ప్రచారాలు చేయిస్తుంటారని వైసీపీ తరచుగా ఆరోపిస్తుంటుంది. అయినా ఇతర సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూటమి నేతలు భరించలేకపోతున్నారన్న భావన ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను, సాక్షి మీడియాను తరచు బెదిరిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. కుట్రపూరితంగా జర్నలిస్టులను జైళ్లకు పంపుతున్నారు. అయినా వారి వైఫల్యాలు, స్కామ్‌లు బయటకు వస్తున్నాయి. వాటిని తట్టుకోలేక చంద్రబాబు అసహనంతో ఏకంగా కొత్తగా చట్టాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించిన సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్య తీసుకోవాలని యత్నిస్తే చాలు.. నోటీసులు ఇస్తే చాలు..ఇంకేముంది భావ స్వేచ్ఛను అరికడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలో ఉంటే మాత్రం ఎవరికి భావ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉండకూండా చూడాలని యత్నిస్తున్నారు.ఇలా ప్రతి అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే చంద్రబాబు అసలు రాజకీయం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు, లోకేష్ ని ఇమిటేట్ చేస్తూ.. ఏకిపారేసిన KA పాల్
-
తండ్రిని మించిన కొడుకు.. రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన
-
లోకేశ్‌ను ఆ ఒక్క ప్రశ్న అడిగి ఉండాల్సింది!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ తాజాగా ఒక వ్యాఖ్య చేశారు. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదట. కావాలనుకుంటే జగన్‌ను ఎప్పుడో జైలుకు పంపి ఉండేవారట!. జాతీయ టీవీ చానల్ ఏర్పాటు చేసిన సదస్సులో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలలో ఎంతవరకు నిజం ఉందన్నది చర్చనీయాంశం. ఒక్కసారి రెండేళ్లు వెనక్కు వెళదాం.. ..అప్పట్లో లోకేశ్ ప్రతిపక్ష పార్టీ నేత. రాష్ట్రమంతటా యువగళం పేరుతో పడుతూ లేస్తూ ఓ యాత్ర లాంటిది చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని గ్రామాలను చుట్టేసి వచ్చారు కానీ.. తనతోపాటు ఓ ఎర్రటి పుస్తకాన్ని మోసుకెళ్లారాయన. జేబులో ఉంచుకున్నాడా? లేదు.. ఎక్కడికక్కడ సమావేశాల్లో పైకెత్తి అందరికీ చూపించాడు. శత్రువుల జాబితా సిద్ధం చేస్తున్నాని.. వాళ్ల భరతం పడతానని సవాళ్లూ విసిరారు. ఈ క్రమంలో బట్టలిప్పిస్తానని.. అదని ఇదనీ అవాకులు, చెవాకులు చాలానే మాట్లాడారులెండి. ఎన్నికలొచ్చాయి. సూపర్ సిక్స్‌ను నమ్మారో.. ఈవీఎంల గందరగోళమో తెలియదు కానీ..జాతీయ స్థాయి విశ్లేషకులు, ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ తెలుగుదేశం, జనసేన బీజేపీల కూటమి అధికారంలోకైతే వచ్చింది. రాష్ట్రంలో అరాచకానికి, అవ్యవస్థకు నాందీ పడింది కూడా అప్పుడే!.. .. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయో లేదో రెడ్‌బుక్ పేరుతో టీడీపీ రాజ్యాంగం మొదలైంది. ఒకట్రెండు చోట్ల హోర్డింగ్‌లు పెట్టిమరీ తాము వైసీపీ వారిపై కక్ష తీర్చుకోబోతున్నామని ప్రకటించారు కూడా. అందుకు తగ్గట్టుగానే టీడీసీ కార్యకర్తలు వైసీపీ వారి ఇళ్లపై, ఆస్తులపై విరుచుకుపడ్డారు. దాడులు చేశారు. పల్నాడు ప్రాంతంలో కొంతమంది వైసీపీ నేతలు వీరి ఆగడాలను తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. తప్పుడు కేసుల బనాయింపు, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కొత్త కేసు పెట్టడం వంటి కొత్త కొత్త మార్గాలు సృష్టించి మరీ అమలు చేశారు టీడీపీ పెద్దలు. కొందరిని సుదూర ప్రాంతాలలోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి నరకయాతన పెట్టారు. వైసీపీ నేతలపై అక్రమ కేసు బనాయించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చిందంటే ఏపీలో కక్ష రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని దూషించిన టీడీపీ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనం. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలను వేధించినా కేసులే కట్టరు. ఇతర అరాచకాల సంగతి సరేసరి. నేతల పరిస్థితి ఇలా ఉంటే.. సోషల్ మీడియా వారినైతే దారుణంగా హింసించే విధంగా అక్రమ అరెస్టులు సాగించారు. అదే టీడీపీ, జనసేనలకు చెందిన వారు హింసకు పాల్పడినా, అరాచక పోస్టులు పెట్టినా చూడనట్టు వ్యవహరించడం ఇంకో విచిత్రం. నామ్ కా వాస్తే ఒకటి, అరా కేసులు పెట్టినా అవి తూతూ మంత్రం కేసులే. పోలీసు రాజ్యం ఎలా నడపాలో, కక్షలు ఎలా తీర్చుకోవాలో భవిష్యత్తు ప్రభుత్వాలకు కూటమి సర్కార్ తీరు మార్గదర్శకం అయ్యే ప్రమాదం కనిపిస్తుంది.చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఏ రకంగా దూషించారో అందరికి తెలుసు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి, అధికారుల పేర్లు కూడా రెడ్‌బుక్ లో రాస్తున్నామని బెదిరిస్తూ లోకేశ్ ప్రచారం చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ఇంత ఘోరంగా లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మీద చంద్రబాబు పట్టు ఏమీ లేదని, మొత్తం కథ లోకేశే నడిపిస్తున్నారని, పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు ఇస్తూ ఎవరెవరిని హింసించాలో సూచిస్తుంటారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అక్కడక్కడా తిరుగుతూ ప్రసంగాలకే పరిమితం అవుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలన్నిటిని లోకేశ్ హాండిల్ చేస్తున్నారని అంటున్నారు. దానికి తగినట్లే లోకేశ్ ప్రధాని హోం మంత్రులను కలిశారు. జాతీయ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రభుత్వ విధానాలపైన, అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక పద్దతిగా వ్యవహరించవలసిన లోకేశ్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ అసత్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది విమర్శ.. .. రాజ్‌దీప్ సర్దేశాయి నిర్వహించిన సమావేశలో చంద్రబాబును జగన్ జైలులో పెట్టారు కాబట్టి జగన్‌ను జైలుకు పంపుతారా అన్న ప్రశ్నకు లోకేశ్ జవాబిస్తూ, 'అది మా ఎజెండా కాదు. చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. మా ప్రాధాన్యం ఏపీ అభివృద్ది. చట్టాన్ని ఉల్లంఘిస్తే నాతోపాటు ఎవరైనా దాని పర్యవసానం అనుభవించాల్సిందే. నేను తప్పు చేసినా మా నాన్న నన్ను జైలుకు పంపుతారు. మరో ఆలోచన లేదు" అని లోకేష్ చెప్పారట. ఈ వ్యాఖ్యలలో నిజమెంత అన్నది ఆయన ఆత్మకు స్పష్టంగా తెలుసు. కావాలంటే జగన్‌ను ఎప్పుడో జైలుకు పంపేవాళ్లమన్నది అహంభావంతో కూడిన సమాధానం కాక మరేమిటని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. జగన్‌పై కక్షతోనే లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి పలువురిని జైలుపాలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ కేసులో జగన్‌ను కూడా జైలుకు పంపించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజూ తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. దీనిని ప్రతీకార రాజకీయం అనరా? రాజ్ దీప్ సర్దేశాయికు ఏపీలో ఏమి జరుగుతున్నదో తెలియకపోవచ్చు. లోకేశ్ జవాబు విన్నవెంటనే మరి రెడ్‌బుక్ మాటేమిటి అని ప్రశ్నించి ఉండాల్సింది..!! కొద్ది రోజుల క్రితం కడపలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ తాను ఏదీ మర్చిపోలేదని, తన తండ్రిని 53 రోజులు అక్రమంగా నిర్భంధిస్తే కుమారుడిగా మర్చిపోతానా? తప్పు చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది అని లోకేశ్ చెప్పారు. నిజానికి లోకేశ్ ప్రస్తుతానికి మంత్రి మాత్రమే. కాకపోతే సకల శాఖల మంత్రిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది ప్రశ్న. మిగిలిన మంత్రులను డమ్మీలుగా మార్చారా?లోకేశ్ చెప్పే దానినే పరిగణనలోకి తీసుకుంటే తండ్రి మీద వచ్చిన కేసులను నీరు కార్చకుండా చట్టం తన పని తాను చేసుకుపోయేలా వ్యవహరించే ధైర్యం ఉందా? అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా ప్రతీకార రాజకీయాలు, రెడ్‌బుక్ గోల మానుకుని, హుందాగా నడిస్తే మంచిది. లేకుంటే ఆయన ప్రత్యర్థులపై వేస్తున్న ఉచ్చులో తానే పడిపోయే అవకాశం ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ తో చంద్రబాబు.. లోకేష్ ఎక్కడ? తండ్రిని పక్కనబెట్టిన చినబాబు!
-
ఇంత చెత్త వెధవ ఎక్కడా లేడు.. సతీష్ రెడ్డి సంచలన కామెంట్స్
-
KSR Live Show: రెడ్ బుక్ లోకేష్ వెన్నులో వణుకు మొదలైంది..
-
లోకేష్ నువ్వొక విద్యాశాఖ మంత్రివా..? తండ్రి కొడుకులకు ఇచ్చిపడేసిన AISF లీడర్
-
నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడదు
-
NO.1 క్రిమినల్స్.! అంతా మనోళ్లే!
-
ఎద్దు ఈనిందనగానే.. జున్నుపాలు అడిగాడంట!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే అందరు సచివుల కంటె తాను కార్యవాది మంత్రిని అని చాటుకోవడానికి పాపం.. నారా లోకేష్ బాబుకు చాలా అత్యుత్సాహంగా ఉన్నట్టుంది. టెక్నాలజీని వాడడంలో వేగం మాత్రమే కాదు, కార్యకర్తలు తమ కష్టాల్ని చెప్పుకుంటే వాటికి తక్షణం స్పందించడంలో కూడా తనను మించిన వారు లేరని చాటుకోవాలనే ఉబలాటం చాలానే ఉన్నట్టుంది. ఓ కార్యకర్త నారా లోకేష్‌ను ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పెట్టగానే, 20 నిమిషాల్లోగా మంత్రిగారు దానికి రెస్పాన్స్ ఇచ్చారు. సంబంధిత పోలీసుల్ని పనిమీద పురమాయించేశారు. న్యాయం చేయాలని, తనకు అప్ డేట్ చేయాలని ఎక్స్ లో హుకుం విడిచారు. చూడబోతే.. ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయమన్న పెద్దమనిషి ఆత్రుత గురించి మన పెద్దోఆల్లు సామెతలు తయారుచేశారు. కానీ లోకేష్ వ్యవహార సరళిని గమనిస్తే.. ‘ఎద్దు ఈనిందంటే.. సాయంత్రం ఇంటికి జున్నుపాలు పంపు..’ అని అడిగే చందంగా కనిపిస్తున్నారు. Please look into this issue @appolice100. Kindly follow up @officeofNL and keep me updated. https://t.co/558zUiBWA5— Lokesh Nara (@naralokesh) September 4, 2025ఇంతకూ ఈ కామెడీ ఎపిసోడ్ తాలూకు కథా కమామీషూ ఏంటంటే... ‘‘అన్నా @naralokesh గారు. నా పేరు రోజిబాబు. నా జీవనాధారం అయిన ఇన్నోవా కారును YCPకి చెందిన ఒక వ్యక్తి అన్యాయంగా లాక్కుని వెళ్తే గత సంవత్సరంగ నాకు జరిగిన అన్యాయం గురించి గుంటూరులోని నగరపాలెం పోలీసుల చుట్టూ తిరుగుతున్న స్పందన లేదు .దయచేసి నా కారు నాకు ఇప్పించండి.నాకు అదే జీవనాధారం.’’ అంటూ ఎవరో ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. లోకేష్ వెంటనే పోలీసులను ట్యాగ్ చేసి, ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ సంగతేంటో చూడండి.. ఏ సంగతి ఎప్పటికప్పుడు నాకు చెప్పండి’’ అని ట్వీటు వేసేశారు. ఇదంతా సదరు రోజిబాబు ట్వీటు పెట్టిన 20 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఒక మామూలు వ్యక్తి ట్వీటుకు మాననీయ మంత్రి వర్యులు అంత వేగంగా స్పందిస్తే సంతోషించాలి గానీ.. విమర్శ ఎందుకు? అనిపించవచ్చు. అక్కడే ఉంది తమాషా!. సదరు రోజిబాబు.. ట్విటర్ అకౌంటు పెట్టుకున్నదే ఈ సెప్టెంబరు నెలలో.. అనగా ఇవాళ గత రెండురోజుల్లోనో మాత్రమే. ఆయన ఖాతాలో ఉన్నది ఇదొక్కటే ట్వీటు! ఆయన ఇలా పెట్టడమూ వెంటనే మంత్రి స్పందించడమూ.. ఏదో ముందే స్క్రిప్టు ప్రకారం జరిగిన కామెడీ ఎపిసోడ్ లాగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పోస్టు కింద కామెంట్లలో స్పందిస్తున్న నెటిజన్ల జోరు గమనిస్తే... చినబాబుకు బహుశా జ్ఞాననేత్రం తెరచుకోవాల్సిందే! ఆ రోజిబాబు అకౌంటును గంట ముందే క్రియేట్ చేసుకుని పోస్టు పెడితే.. అప్పుడే స్పందనా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏకంగా డీసీఎం పోస్టు నువ్వే తీసుకోరాదా అంటున్నారు. తల్లికి వందనం రాలేదని, ఉద్యోగాలు అడిగినా గానీ స్పందించరు గానీ.. వైసీపీ వాళ్లు కారు లాక్కున్నారనగానే.. ముందూ వెనకా చూసుకోకుండా చర్యలకు పురమాయించడమేనా అని కొందరు అడుగుతున్నారు. మహానాడుకు వచ్చినప్పుడు నా ఫోను పోయింది సార్.. సీకె దిన్నె పోలీసులకు ఫిర్యాదుచేసినా దిక్కులేదు.. తమరు ఇప్పించండి అంటూ దాసరి రామకృష్ణారెడ్డి అనే తెదేపా సీనియర్ కార్యకర్త అంటున్నారు. సుగాలి ప్రీతి తల్లి విలాపం విషయంలో ఈ వేగవంతమైన స్పందన ఎక్కడికెళ్లిందని అంటున్నారు. మొత్తానికి ఒక్క ట్వీటు ద్వారా.. నారా లోకేష్ అభాసు పాలైపోతున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. ఒకరు ఒక ఫిర్యాదు చేస్తే అందులో ఉండే న్యాయబద్ధత గురించి తెలుసుకుని స్పందించడం విజ్ఞుల విధానం. అలా కాకుండా.. నింద వైసీపీ వారి మీద ఉన్నది కదా అని.. చర్యలకు ఉపక్రమిస్తూ రెచ్చిపోయి స్పందిస్తే ఇలా అభాసుపాలు కావల్సిందేనని అంతా అనుకుంటున్నారు. పీఆర్ స్టంటులను, స్ట్రాటజీలను తగలెయ్యా అని జనం ఆడిపోసుకుంటున్నారు. నేరుగా మొరపెట్టుకోవడానికి అవకాశం ఇవ్వరని, వినతిపత్రాలు రాసుకుంటే బుట్టదాఖలు అవుతాయని, ట్వీట్ల రూపంలో అయితే సోషల్ మీడియా క్రేజ్ కోసం స్పందిస్తారని.. పాపం ఆ జోజిబాబుకు కూటమి నేతల మీద ఒక నమ్మకం ఉంటే తాను ఖాతా క్రియేట్ చేసుకుని తొలిపోస్టుగానే ఈ నింద పెట్టడం తప్పేమీ కాదు. కొత్త ఖాతా అయినంత మాత్రాన, ఒకటే పోస్టు ఉన్నంత మాత్రాన మంత్రి స్పందించకూడదని కూడా లేదు. కానీ.. ఇలాంటి నిరాధార నిందలు రోజుకు కొన్ని వేలు కూడా వస్తుంటాయి. నిరాధారంగా వేసే నిందల పట్ల కూడా మహా వేగం స్పందించేస్తే అభాసుపాలు కావాల్సిందే. ఒకవేళ జోజిబాబు ఆరోపణ నిజమే అయితే.. వైసీపీకి చెందిన వ్యక్తి కారు లాక్కోవడానికి ఎలాంటి కారణం ఉన్నదో ముందు తెలుసుకోవాలి. సదరు జోజిబాబు పోలీసుల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతున్నా ఎందుకు పని జరగలేదో తెలుసుకోవాలి. ఒకవేళ అదంతా నిజమే అని తేలితే.. ఏడాదిరోజులుగా పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేస్తారా? ట్రాన్స్ఫర్ చేస్తారా? కూడా లోకేష్ తేల్చి చెప్పాలి. అంతే తప్ప.. వైసీపీ అనే పదం కనపడగానే.. బురద చల్లుడుకు వీలుగా ఉన్నదని ఇలా రెచ్చిపోయి స్పందిస్తే నవ్వులపాలవుతారు. ఎద్దు ఈనిందంటే.. జున్నుపాలు తెమ్మన్నంత మేధావిగా కొత్త సామెతలు పుట్టడానికి కారకులవుతారని చినబాబు తెలుసుకోవాలి.:::ఎం. రాజేశ్వరి -
జూ ఎన్టీఆర్ అంటే లోకేష్ కి అందుకే భయం..!
-
YS జగన్ పై ట్వీట్.. అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
-
తప్పుడు ట్వీట్ చేసి అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
సాక్షి, అమరావతి: దగుల్భాజీ పోస్ట్‌తో మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై లోకేష్ పైశాచిక ప్రచారానికి తెరతీశారు. తల్లి విజయమ్మను వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ ఫేక్ ప్రచారం చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మను వైఎస్ జగన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే, విజయమ్మను వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ లోకేష్ దుష్ప్రచారానికి ఒడిగట్టారు.తప్పుడు ట్వీట్ చేసి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. నీతులు చెప్పబోయిన నారా లోకేష్.. గోతిలో పడ్డారు. లోకేష్‌ది సైకో మనస్తత్వం అంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల మండిపడతున్నాయి. -
లోకేష్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు: అంబటి
-
‘జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్‌కు భయం’
సాక్షి,గుంటూరు: 9వ తేదీన రైతుల తరుఫున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో అన్నీ ఆర్డీఓ కార్యాలయాల్లో రైతుల తరుఫున వైఎస్సార్సీపీ వినతి పత్రాలు సమర్పిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. లోకేష్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. వైఎస్ జగన్ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియో లోకేష్ పోస్టు చేసి ప్రేలాపనలు పేలుతున్నారు.లోకేష్.. మీ బాబాయిని సంకెళ్లతో కట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ పోటీకి వస్తారని లోకేష్ భయం. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన తల్లిని కూడా తిట్టించాడు. వీకెండ్లో లోకేష్ మాయమై ఎక్కడ తేలుతాడు కూడా చెబుతా. ఏపీలో నాదే రాజ్యమని లోకేష్ అనుకుంటే చాలా పొరపాటు. దౌర్భాగ్యమైన పద్దతుల్లో చంద్రబాబు,లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోకుండా వైఎస్ జగన్‌పై మీరు బురదజల్లే పనిలో ఉన్నారు. లోకేష్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. అధికారం శాశ్వతం కాదు. వైఎస్ జగన్ మీద బురదజల్లడం మానుకోవాలి. దౌర్భాగ్యమైన పరిస్థితిలో చంద్రబాబు,లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. -
Lakshmi Parvathi: వెన్నుపోటుకు 30 సంవత్సరాలు... అందుకే ఈ సంబరాలు
-
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్‌కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని! -
Ambati Rambabu: నీ టైం అయిపొయింది అంబటి మాస్ వార్నింగ్
-
గుంటూరు కలెక్టరేట్ వద్ద SFI ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన
-
రాసలీలతో రెచ్చిపోతున్న చినబాబు గ్యాంగ్
-
‘ఇది చాలా తప్పు నారా లోకేష్’.. ఏబీవీపీ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా రంగం నిర్జీవమైపోయిందంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మండిపడ్డారు. యువగళంలో నారా లోకేష్ యువతకు చాలా హామీలిచ్చారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు పూర్తైతే.. ఈరోజుకీ డిగ్రీ అడ్మిషన్ల పట్ల స్పష్టత లేదు.. ఐదు నెలలు పూర్తైంది.. విద్యార్థులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అడ్మిషన్లు ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రైవేట్ యూనివర్శిటీలకు వలస పోతున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల వద్ద తీసుకున్న లంచాల కారణంగానే అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నాయని అనుమానాలొస్తున్నాయి. మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ బహిరంగంగా విడుదల చేయలేదు. మీ పార్టీ కార్యకర్తలకు డీఎస్సీ పోస్టులు ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది. మెరిట్ లిస్ట్‌ను మెసేజ్‌లు పెట్టి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పడం ముమ్మాటికీ తప్పు..రోస్టర్, మెరిట్ లిస్ట్ ప్రకారమే నియామక పత్రాలు అందించి రిక్రూట్ మెంట్ జరపాలి. ప్రైవేట్ యూనివర్శిటీల్లో చదివే పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. ఐసెట్, పీజీ సెట్లు అయిపోయినా ఇంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల ఆవరణలోకి విద్యార్ధి సంఘాలు రాకూడదని జీవో ఇవ్వడం దారుణం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి పనిచేస్తున్నారు..యూనివర్శిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు చేయొద్దంటారు. మీరు మాత్రం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు ఉండాలని మీరే అంటారు. కానీ మీరే రాజకీయ కార్యకలాపాలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ పునరాలోచన చేసి జీవోను ఉపసంహరించుకోవాలి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి’’ అని యాగంటి వెంకట గోపి డిమాండ్ చేశారు.స్కూళ్లు, కాలేజీల ఆవరణలో డ్రగ్స్ దందా విపరీతమైపోయింది. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలి. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తాం’’ అని వెంకట గోపి హెచ్చరించారు. -
డీఎస్సీలో డొంక తిరుగుడు!
సాక్షి, అమరావతి :మెగా డీఎస్సీ.. ‘దగా డీఎస్సీ’గా మారనుందా..? ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో అమ్మకానికి పెట్టారా..? పారదర్శకంగా మెరిట్ లిస్ట్ వెల్లడించకుండా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్ పంపిస్తాం.. మీరే చూసుకోండి అని గుంభనంగా వ్యవహరించడం ఏమిటి? అనే అనుమానాలు ఉపాధ్యాయ అభ్యర్థుల్లో రేకెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే తమకు కావాల్సిన అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు అడ్డదారులు ఎంచుకుందా? అనే సందేహాలు కలుగుతున్నాయని మండిపడుతున్నారు. గతానికి భిన్నంగా డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ వెల్లడించకుండా నేరుగా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెస్సేజ్ పంపించేందుకు ఏర్పాట్లు చేయడం వెనుక పెద్ద కుట్రే దాగుందన్న అభిప్రాయం అభ్యర్థుల్లో కలుగుతోంది. ఏ డీఎస్సీలోనూ లేని రీతిలో..సాధారణంగా డీఎస్సీ పరీక్షలు జిల్లా స్థాయిలో నిర్వహించి మెరిట్ లిస్ట్ ప్రకటించి ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వాలి. కానీ 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీంతో అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నియామకాలు నిలిచిపోగా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 2018 డీఎస్సీ కంటే దారుణమైన తప్పులు 2025 డీఎస్సీలో చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మెసేజ్‌లు పంపుతామని ప్రభుత్వం చెబుతుండటంతో అభ్యర్థులు నివ్వెరపోతున్నారు. తప్పులు సరిచేయకుండానే మార్కుల వెల్లడి3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించగా ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం విడుదలైన ఫైనల్ కీ చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించినా, దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని విద్యాశాఖ ప్రకటించడంతో ఫైనల్ కీలో తప్పులపై విద్యాభవన్ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదులు చేశారు. ‘సాక్షి’ ఈ విషయాన్ని డీఎస్సీ కన్వీనర్ దృష్టికి తీసుకెళ్లగా ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవంటూనే నిపుణులతో పరిశీలన చేయిస్తున్నట్లు చెప్పారు. తీరా ఆ తప్పులను సరిచేయకుండానే అభ్యర్థుల మార్కులు ప్రకటించారు. టెట్ మార్కుల నమోదులోనూ నిర్లక్ష్యం టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. టెట్‌లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలో సాధించిన వాటికి అదనంగా కలవడంతో మెరిట్ లిస్ట్‌లో ఉంటారు. ఇప్పటి వరకు జరిగిన టెట్ వివరాలు, అభ్యర్థుల డేటా, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో సదరు అభ్యర్థి ఆధార్, ఫోన్ నంబర్లతో లింక్ అయ్యి ఉంటాయి. ఫోన్ నంబర్లు మారినా ఆధార్ మారే అవకాశం లేదు. కానీ డీఎస్సీ 2025 నిర్వహణలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నో అనుమానాలు.. !నార్మలైజేషన్ అనంతరం ఆగస్టు 11న ఫలితాలను ప్రకటించగా సవరించిన టెట్ మార్కులతో ఈనెల 13న స్కోర్ కార్డులను విడుదల చేశారు. టెట్ మార్కుల్లో తప్పులు ఉంటే అభ్యర్థులే స్వయంగా సవరించుకోవాలంటూ ఒకరోజు అవకాశం కల్పించారు. అభ్యర్థులే టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారంటూ పాఠశాల విద్యాశాఖ నెపం వారిపై నెడుతోంది. మరి విద్యాశాఖ వద్ద అభ్యర్థుల ‘టెట్’ డేటా ఉంటే అభ్యర్థులే సవరించుకోవాలని ఎందుకు చెప్పినట్లు? డీఎస్సీ దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించే క్రమంలోనే అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ వివరాలు నమోదు చేయగానే టెట్ మార్కులు వచ్చేలా ఎందుకు చేయలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.మెరిట్ అభ్యర్థులకు అన్యాయం..!1990 నుంచి 2019 స్పెషల్ డీఎస్సీ వరకు ఫలితాలను ప్రకటించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్‌ను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. డీఎస్సీ 2025లో మాత్రం అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను ప్రభుత్వం ప్రకటించకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీనివల్ల ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? మెరిట్ లిస్ట్‌లో ఏ స్థానంలో ఉన్నామో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. ఈ విధానం తమకు కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డీఎస్సీలో చోటుచేసుకున్న తప్పులపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా ఎత్తివేయడంపై ఆయా అభ్యర్థులు కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.డీఎస్సీ ఫలితాల్లో గూడుపుఠాణీ!టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీ ఫలితాల వెల్లడిలో అభ్యర్థులను దగా చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. డీఎస్సీ ఫలితాలు ప్రకటించే సమయంలో మెరిట్ లిస్ట్‌లను తొక్కిపెట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. పారదర్శకతకు పాతర వేస్తూ మెరిట్ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. ఫలితాలు వెలువడే ముందు దాదాపు 60 వేల మందికి టెట్ మార్కుల సవరణకు అవకాశం ఇవ్వడం అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడే ఈ విధానాలకు తక్షణం స్వస్తి పలకాలి అని డిమాండ్ చేశారు. -
DCM పవన్ స్థాయిని తగ్గించి మరీ నారా లోకేష్ కు ఎలివేషన్
-
పక్కనే ఉంటూ పవన్ స్థాయిని తగ్గించే పనిలో!
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమిలో ఇటీవలి పరిణామాలను గమనించారా? మంత్రి లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న వైనం.. ఇంకోపక్క ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను తక్కువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే.. రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఏమిటన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలన్నింటిలో పవన్ కల్యాణ్ పక్కనే లోకేశ్ ఫొటో కూడా ముద్రిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర స్థాయిలో ప్రధాని, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ఫొటోలను మాత్రమే ప్రచురించాలి. అయితే చాలా రాష్ట్రాలు వీటిని విస్మరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటో కూడా వేస్తున్నారు. ఏపీ పరిస్థితి కూడా ఇదే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పవన్‌తోపాటు లోకేశ్ ఫొటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైస్సార్సీపీ హయాంలో చేసి ఉంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టునే ధిక్కరిస్తారా? అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా నానా యాగీ చేసి ఉండేది. కాని ఇప్పుడు లోకేశ్ ఫొటో వేస్తున్నా నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక, రాజకీయ బంధం అంత బలీయమన్నమాట. విశేషం ఏమిటంటే లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రకటనల్లో మంత్రి ఫొటో వేస్తే ఫర్వాలేదేమో కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల కార్యక్రమాలకు కూడా ఆయా మంత్రులవి కాకుండా లోకేశ్ ఫొటో ముద్రిస్తూండటంతోనే వస్తోంది తేడా. ఏ హోదాలో అలా చేస్తున్నారని ఎవరూ అడగడం లేదు. అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. లోకేశ్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత బలం చేకూరుస్తాయి. ప్రస్తుతం చంద్రబాబుకన్నా లోకేశే పవర్ పుల్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేశ్ గురించి పొగుడుతున్నారు. తద్వారా టీడీపీలోను, కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేశ్‌ను సాధ్యమైనంత త్వరగా సీఎంను చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కాని, కుటుంబ సభ్యులు కొందరి నుంచి గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, పవన్‌తోసహా, వివిధ వర్గాల వారిని మానసికంగా సిద్దం చేసిన తర్వాత లోకేశ్‌ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చ చెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాలలో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న రాగాన్ని పవన్ కల్యాణ్ ఎత్తుకున్నారు. అంటే.. లోకేశ్‌ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్నమాట. దాంతో లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపును తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ, జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ స్థాయిని తగ్గిస్తారా? అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి వాదన. వాస్తవానికి ఈ విషయంలో లోకేశ్ అప్పట్లో క్లారిటీతో మాట్లాడారు. సీఎం పదవిని పవన్‌కు షేర్ చేయడానికి గాని, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికిగాని ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేశ్‌కు ప్రస్తుతం ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర శాఖల ప్రచార ప్రకటనలలో కూడా పవన్‌తోపాటు లోకేశ్ ఫొటో వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేశ్ స్థాయిని పెంచేసినట్లయింది. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఒకటే స్థాయి అని ప్రపంచానికి తెలియ చేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీలై ఉండవచ్చు కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక, అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పవన్‌ను ‘అన్నా..’ అని సంబోధిస్తూనే లోకేశ్ తెలివిగా తనమాటే చెల్లుబడి అయ్యేలా చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద తొలి విడత రైతులకు ప్రభుత్వం తరపున రూ.ఐదు వేలు ఇస్తున్న సందర్భంలో వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఫోటో వేయకుండా పవన్ కల్యాణ్ లోకేశ్ ఫోటోలనే వేశారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమ్ అమలు ప్రచార ప్రకటనలో సైతం రవాణాశాఖ మంత్రి రామ ప్రసాదరెడ్డికి బదులు లోకేశ్ ఫొటో వేశారు. తద్వారా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోయినా, పవన్, లోకేశ్‌లది ఒకటే స్థాయి అన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వగలిగారన్న విశ్లేషణలు వస్తున్నాయి.అంతకుముందు లోకేశ్‌కు డిప్యూటి సీఎం పదవి ఎలా ఇస్తారని గొణిగిన జనసేన వర్గాలు కూడా నోరు మెదపలేకపోతున్నాయి. దీనివల్ల తమ నేత స్థాయి తగ్గిందని జనసేన క్యాడర్ భావిస్తున్నప్పటికి, పవన్ కి లేని బాధ తమకు ఎందుకులే అని సరిపెట్టుకుంటున్నారట. టీడీపీలో కాబోయే సీఎం లోకేశ్ అన్న సంగతేమి రహస్యం కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్‌లోనే కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో అభ్యర్ధిగా ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ పదవిని వెంటనే తన కొడుక్కు ఇవ్వదలిస్తే చంద్రబాబు ఒక్కరోజులో చేయవచ్చు. కాని ఆయన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదలి ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, సిద్దపడకపోవచ్చు. కాకపోతే పార్లమెంటుకు వెళ్లాలని అనుకుంటే అనుకోవచ్చేమో! ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా పెద్ద ఇబ్బందులు లేవు. లోకేశ్‌కు సీఎం పదవి ఇస్తే పార్టీ గట్టిగానే ఉంటుందా? లేదా? అన్న మీమాంస ఆయనకు ఉండవచ్చు.అలాగే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి అందరిని కలుపుకుని వెళ్లగలరా? లేదా?అన్నదానిపై కూడా ఆలోచన చేస్తుండవచ్చు. మానసికంగా తయారు చేయకుండా లోకేశ్ కు ప్రమోషన్ ఇస్తే సమస్యలు వస్తాయని ఆయన భావిస్తుండవచ్చు. అయితే ఏ పని చేసినా దాన్ని సమర్థించే దశకు పవన్ కల్యాణ్‌ను తీసుకు రాగలిగారు. పవన్ కల్యాణ్ అవసరాలు తీరుస్తూ ఆయనకు ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లులు సమకూర్చడం ద్వారా గౌరవిస్తున్నట్లు కనిపిస్తే సరిపోతుందన్న అభిప్రాయం కూటమి నేతలలో ఉందట. అందువల్లే టీడీపీ నేతలకన్నా పవనే ఎక్కువ విధేయతను కనబరచుతున్నారని ఆ పార్టీ వారు అభిప్రాయపడుతున్నారు. జనసేన వైపు నుంచి ఎవరూ టీడీపీని ప్రశ్నించరాదని పవన్ సోదరుడు నాగబాబు స్పష్టంగా చెప్పడం, అలా ప్రశ్నించే వారు ఎవరైనా ఉంటే పార్టీని వదలి వెళ్లవచ్చని ఒక ఎమ్మెల్యేకే పవన్ హెచ్చరిక చేయడం వంటివాటిని ఉదాహరణలుగా చూపుతున్నారు. దీంతో లోకేశ్‌ను సీఎంగా చేసినా పవన్ కల్యాణ్ పెద్దగా అభ్యంతరం పెట్టకవచ్చన్న భావన ఇటీవలి కాలంలో బలపడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. లోకేశ్‌కు ఎలివేషన్ ఇవ్వడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. ప్రచార ప్రకటనలలో ఫోటోలు వేయడం, తల్లికి వందనం స్కీమ్ లోకేశే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాలలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయి. లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవడం, ఢిల్లీ వెళ్లిన సందర్భాలలో ఆయా కేంద్ర మంత్రులను కలవడం, వాటికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చేలా చేయడం వంటివి చేస్తున్నారు. తప్పు కాదు కానీ... లోకేశ్ రాజకీయ అపరిపక్వత, కక్షపూరిత ధోరణి, రెడ్‌బుక్ అంటూ ప్రజల దృష్టిలో ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల దృష్టిలో విలన్‌గా కనిపిస్తుండడం వంటివి ఆయనకు నష్టం చేయవచ్చన్న ఆందోళన తెలుగుదేశం వర్గాలలో ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ టికెట్ కు డబ్బులిచ్చిన లోకేష్.. కొమ్మినేని సెటైర్లు


