‘‘వాటికి పుల్ స్టాప్ పెట్టాలంటే లోకేశ్‌తో రాజీనామా చేయించాలి’’ | RK Roja Demands AP Education Minister Nara Lokesh’s Resignation Over DSC Irregularities | Sakshi
Sakshi News home page

‘‘వాటికి పుల్ స్టాప్ పెట్టాలంటే లోకేశ్‌తో రాజీనామా చేయించాలి’’

Aug 4 2026 8:16 PM | Updated on Aug 4 2026 8:34 PM

Roja demands for Nara Lokesh resignation

నగరి: నారా లోకేశ్‌ విద్యా శాఖ మంత్రి అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ భ్రష్టుపట్టి పోయిందంటూ మాజీమంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి యువజన విభాగం టౌన్ హాల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించి అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా చీకటి జీవోలు తెచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, వసతి దీవెన వెంటనే ఇవ్వాలి. ఇచ్చేవరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంటుంది. 

అనర్హులైన వారికి ఇచ్చిన ఉద్యోగాలను క్యాన్సల్ చేస్తూ అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. 420 జీవోలు తీసుకువచ్చి ఎగ్జాం లేకుండా ఇంటర్వ్యూ లేకుండా దొంగ సర్టిఫికెట్ పెట్టి స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకున్నారు. అర్హత ఉండి ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం పోరాడుతుంది. z

లోకేశ్‌ విద్యా శాఖ మంత్రిగా ఉండి స్కూల్ పిల్లలకి నాణ్యమైన భోజనం, పుస్తకాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక ఎంతోమంది కలలు కన్నా తమ జీవితాన్ని కలలుగా మిగిల్చుకుని విద్యార్థులు కూలీ పనులకు వెళ్లే పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని ఈ మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకల్ని మళ్లీ సరి చేసే విధంగా సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలి. అంతేగాకుండా ఇవన్నీటికీ పుల్ స్టాప్ పెట్టాలంటే లోకేశ్‌తో రాజీనామా చేయించాలి’’ అంటూ ఆర్కే రోజా డిమాండ్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement