చంద్రబాబు బెదిరింపులకు భయపడం: అంబటి రాంబాబు | Cases Against Us Protection for TDP Leaders: Ambati Sharp Attack on CBN | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బెదిరింపులకు భయపడం: అంబటి రాంబాబు

Aug 4 2026 12:39 PM | Updated on Aug 4 2026 1:19 PM

Cases Against Us Protection for TDP Leaders: Ambati Sharp Attack on CBN

సాక్షి, గుంటూరు: ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమని చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు.

టీడీపీ నేతలు చేసిన తప్పులకు వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు. బెయిల్‌ రాకుండా ఉండేలా కఠినమైన సెక్షన్లతో కేసులు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

“ఆలూరులో టీడీపీ నేతే దాడి చేశారు”
ఆలూరు ఘటనను ప్రస్తావించిన అంబటి.. అక్కడ అసలు తప్పు చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతే మహిళపై దాడి చేసి ఆమె బట్టలు చించేశారని, అయినా అధికార పార్టీ నేతలను కాపాడే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

“చంద్రబాబు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు”
కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు కేసులు, అరెస్టులను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ భయపడదని అంబటి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement