breaking news
Busine Virupakshi
-
కలియుగ పతివ్రత.. ఇలాంటి రాజకీయాలు చూసి ఒక మహిళగా సిగ్గుపడుతున్నా
-
పోలీసులే దొంగలు! విరూపాక్షి ఇంట్లో సీసీ ఫుటేజీ... సంచలన నిజాలు బయటపెట్టిన జగన్
-
గుర్తుపెట్టుకో చంద్రబాబు వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్
-
అసలు ఆ రోజు... మినిట్ టూ మినిట్ ఏమి జరిగిందో వివరించిన జగన్
-
కథ,స్క్రీన్ ప్లే ..డైరెక్షన్ మొత్తం బాబుదే..!
-
విరుపాక్షి ఏమైనా ఉగ్రవాదా ? కూటమికి జగన్ వార్నింగ్..
-
భార్య బట్టలను భర్తే చింపించే స్థాయికి తల దించుకో చంద్రబాబు!
-
జైలులో విరుపాక్షికి ధైర్యం చెప్పిన జగన్
-
కూటమి పాలనలో కుట్ర రాజకీయాలు: వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు జిల్లా: రెడ్‌బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ రెచ్చిపోతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కుట్ర రాజకీయాలు చేస్తూ.. విరూపాక్షిని అరెస్ట్ చేయించారని.. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ నిలదీశారు.‘‘అధికార దుర్వినియోగం ఏస్థాయిలో ఉందో విరూపాక్షి అక్రమ అరెస్టే ఉదాహరణ. ఏపీలో బాధితులే నిందితులవుతున్నారు. దాడికి గురైనవారిపైనే కేసులు పెడుతున్నారు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఇంటిని ధ్వంసం చేసి మరీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో వందల మంది పోలీసులు.. దొంగల మాదిరి విరూపాక్షి ఇంటి కిటీకీలను ధ్వంసం చేశారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై 3 కేసులు పెట్టారు. ఒక కేసులో 34 మందిని ఇరికించారు. రెండో కేసులో మరో 14 మందిని చేర్చారు. మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. మొత్తం 38 మందిని జైలుకు పంపారు. కార్యకర్త గిరిని తన కారులో ఎక్కించుకుని వెళ్తుండగా.. దారిలో ఎమ్మెల్యే విరూపాక్షిపై దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చేయిని విరగగొట్టారు. తప్పును కప్పిపుచ్చేందుకు టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపాడు. పైగా ఆమెతో తప్పుడు మాటలు చెప్పించారు..ఎమ్మెల్యే అనుచరులు చింపారని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. భర్తే భార్య బట్టలు చింపుతున్న వీడియో బయటకొచ్చింది. బాబు కుట్ర రాజకీయాలు చూసి రాష్ట్రం షాక్‌కు గురైంది. కారును ధ్వంసం చేశారని ఎమ్మెల్యేపై మూడో కేసు పెట్టారు. వాళ్లే కారును ధ్వంసం చేసి.. ఎమ్మెల్యేపై మూడో కేసు పెట్టారు. పీఎస్‌కు వెళ్లి గిరి, శ్రీరాములు చూపించి ఫిర్యాదు చేశారు. కనీసం పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
LIVE: MLA విరూపాక్షితో ములాఖత్ అనంతరం YS జగన్ సంచలన PRESS MEET
-
ఎమ్మెల్యే విరుపాక్షితో YS జగన్ ములాఖత్
-
జగన్ సార్ ఉన్నంతవరకు మాకు ఎలాంటి భయం లేదు.. విరూపాక్షి భార్య కామెంట్స్
-
రెడ్‌బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ రెచ్చిపోతుంది: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కర్నూలు పర్యటన.. -
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే కుట్ర
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు, జనం రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ పోలీసుల ద్వారా ఆంక్షలు విధించింది. ఈ పరిణామంపై పార్టీ శ్రేణులు, అభిమానులు మండిపడుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం కర్నూలు జిల్లాకు రానున్నారు. జైలులో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటనకు వైఎస్సార్సీపీ శ్రేణులు దూరంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.కఠిన చర్యలు ఉంటాయ్: ఎస్పీజిల్లాలో ఇప్పటికే 30 యాక్ట్ అమల్లో ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎలాంటి ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్‌షోలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఆంక్షలపై వైఎస్సార్సీపీ మండిపాటుములాఖత్ను త్వరగా ముగించాలంటూ పోలీసులు సమయం ఇవ్వడం, అలాగే జగన్ కాన్వాయ్‌ను కిలోమీటర్ దూరమే ఆపేయాలని పోలీసులు చెప్పడంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజలను జగన్‌కు దూరంగా ఉంచేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ పర్యటనల సమయంలో ఇదే విధంగా ఆంక్షలు, బారికేడ్లు, కేసుల భయంతో ప్రజలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. అయితే.. అభిమానాన్ని ఆపలేరుజగన్ పర్యటనలకు వచ్చిన నేతలపై, కార్యకర్తలపై కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా జగన్‌ను కలిసేందుకు, ఆయనకు మద్దతు తెలిపేందుకు కర్నూలు ప్రజలు తరలివస్తారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ పర్యటన కూడా విజయవంతమవుతుందని అంటున్నారు. జగన్ భద్రతపై ఆందోళనమాజీ సీఎం హోదాలో ఉన్న జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ, ఆయన పర్యటనలకు అవసరమైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. ఇటీవలే వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వైఎస్ జగన్ పర్యటనల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలను వివరించారు. భద్రతా అంశాలు, పోలీసుల ఆంక్షలపై తమ ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. -
రేపు కర్నూలుకు వైఎస్ జగన్.. విరూపాక్షికి పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (ఆగస్టు 13, 2026) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి పరామర్శించనున్నారు.పర్యటనలో భాగంగా గురువారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైఎస్ జగన్ బయలుదేరుతారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పంచలింగాల వద్ద ఉన్న కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్నారు. జైలులో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి మాట్లాడనున్నారు. విరూపాక్షికి ధైర్యం చెప్పడంతో పాటు, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు తెలుసుకోనున్నారు. స్థానిక నేతలతోనూ మాట్లాడనున్నారు. ములాఖత్ అనంతరం.. వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం వైఎస్ జగన్ కర్నూలు నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.విరూపాక్షి అక్రమ అరెస్టు వ్యవహారంపై వైఎస్సార్సీపీ ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆయనను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే వైఎస్ జగన్ పర్యటనలకు పోలీసుల ఆంక్షల పేరిట అడ్డుతగులుతున్న కూటమి ప్రభుత్వం.. రేపు అదే పంథాను కొనసాగించే అవకాశం లేకపోలేదు. -
జైల్లో MLA విరూపాక్షిని పరామర్శించిన బైరెడ్డి
-
చంద్రబాబు బెదిరింపులకు భయపడం: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమని చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు.టీడీపీ నేతలు చేసిన తప్పులకు వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు. బెయిల్ రాకుండా ఉండేలా కఠినమైన సెక్షన్లతో కేసులు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.“ఆలూరులో టీడీపీ నేతే దాడి చేశారు”ఆలూరు ఘటనను ప్రస్తావించిన అంబటి.. అక్కడ అసలు తప్పు చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతే మహిళపై దాడి చేసి ఆమె బట్టలు చించేశారని, అయినా అధికార పార్టీ నేతలను కాపాడే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.“చంద్రబాబు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు”కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు కేసులు, అరెస్టులను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదని అంబటి స్పష్టం చేశారు. -
పోలీసులా..? రౌడీలా? అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేస్తారా..?
-
విరుపాక్షి అన్నతో మాట్లాడినప్పుడు నాతో చెప్పిన మాట... YSRCP నేతలు ఫైర్
-
ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్
-
ఆలూరు ఎమ్మెల్యే అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
-
రాత్రి 3గంటలకు వచ్చి డోర్లు పగలగొట్టి... సంచలన నిజాలు బయటపెట్టిన విరూపాక్షి భార్య
-
MLA విరూపాక్షి అరెస్ట్ పై జగన్ రియాక్షన్
-
విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..
-
ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్
-
ఏం బెదిరిస్తున్నావా..? పోలీసులు Vs ఎమ్మెల్యే విరుపాక్షి
-
ఇంట్లోకి దూరి కొట్టారు.. చంపేస్తారా..? వైకుంఠ జ్యోతిపై విరూపాక్షి ఫైర్
-
AP: ఆలూరు నియోజకవర్గంలో టెన్షన్.. టెన్షన్..
సాక్షి, కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. అన్ని ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎవరిని రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే వీరుపాక్షిపై అట్రాసిటీ కేసు బనాయించేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.చిప్పగిరి పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళనవిరూపాక్షిని చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. విరూపాక్షి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పీఎస్‌కు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే అన్నిదారులు మూసివేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా..కాగా, వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి.. వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2.45 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌లను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఇది జరిగింది..టీడీపీ నాయకుడు నాగరాజు.. వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరుపాక్షిపై సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం, ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన విరూపాక్షి, చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. -
ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్
అప్డేట్స్:విరూపాక్షికి రిమాండ్ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్విరూపాక్షితో పాటు 17 మందికి రిమాండ్ విధింపు రిమాండ్ విధించిన ఆలూరు జూనియర్ సివిల్ కోర్టు 307 సెక్షన్ కింద కేసు నమోదుఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విరూపాక్షితో పాటు మరో 34 మంది కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపువిరూపాక్షిని కోర్టుకు తరలించిన చిప్పగిరి పోలీసులుజడ్జి ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులుసాక్షి, కర్నూలు జిల్లా: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో రాత్రి 2.45 గంటల సమయంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఎమ్మెల్యే నివాసం తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎ. మధుసూధన్, బీవై. రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు.చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నాయకుడు నాగరాజు, అతని అనుచరులు దాడికి తెగబడితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే విరూపాక్షి వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ గూండాలు ఎమ్మెల్యేపై రాళ్లు రువ్వడంతో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనపై టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా, గొడవకు ఎమ్మెల్యేనే కారణమంటూ సీఐ రవిశంకర్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు.దాడికి పాల్పడిన టీడీపీ నాయకులను అరెస్టు చేయకుండా, బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రజాప్రతినిధిపై కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసినట్లు పోలీసు బలగాలు వ్యవహరించడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం, తలుపులు పగులగొట్టి విరూపాక్షితో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేసి చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.ఎమ్మెల్యే నివాసంలోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌లను పోలీసులు తీసుకెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వాస్తవాలను బయటకు రానివ్వకుండా సాక్ష్యాలను మాయం చేసేందుకే హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారా? అని ప్రశ్నించారు. వాటిలోని దృశ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వంసం చేయకుండా భద్రపరచాలని, ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుబంధ విభాగంలా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ శ్రేణులను బెదిరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పార్టీ భయపడేది లేదని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు నాగరాజుతో పాటు నిందితులందరినీ అరెస్టు చేయాలని, సీఐ రవిశంకర్‌రెడ్డి ఏకపక్ష వ్యవహారశైలిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. చిప్పగిరిలో శాంతిభద్రతలను పరిరక్షించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్.. చిప్పగిరిలో ఉద్రిక్తత
సాక్షి, కర్నూలు: కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి పోలీసులు హైడ్రామాకు తెరలేపారు. వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2.45 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్ డిస్కులను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, టీడీపీ నాయకుడు నాగరాజు వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోనలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరుపాక్షిపై సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం, ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన విరూపాక్షి, చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.


