AP: ఆలూరు నియోజకవర్గంలో టెన్షన్‌.. టెన్షన్‌.. | Police Deployed In Large Numbers In Alur Constituency | Sakshi
Sakshi News home page

AP: ఆలూరు నియోజకవర్గంలో టెన్షన్‌.. టెన్షన్‌..

Aug 2 2026 9:16 AM | Updated on Aug 2 2026 12:19 PM

Police Deployed In Large Numbers In Alur Constituency

సాక్షి, కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. అన్ని ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎవరిని రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే వీరుపాక్షిపై అట్రాసిటీ కేసు బనాయించేందుకు పోలీసులు ప్లాన్‌ చేస్తున్నారు.

చిప్పగిరి పీఎస్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ ఆందోళన
విరూపాక్షిని చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పీఎస్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. విరూపాక్షి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పీఎస్‌కు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే అన్నిదారులు మూసివేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాకుండా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా..
కాగా, వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌గా అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి.. వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2.45 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్‌ డిస్క్‌లను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇది జరిగింది..
టీడీపీ నాయకుడు నాగరాజు.. వైఎస్సార్‌సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  విరుపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరుపాక్షిపై సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం, ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన విరూపాక్షి, చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement