సాక్షి, తాడేపల్లి: నేడు పింగళి వెంకయ్య జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. పింగళి వెంకయ్యకు నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయతను చాటి చెప్పే చిహ్నం మన త్రివర్ణ పతాకం. భారత జాతీయ జెండాకు రూపకల్పన చేసిన చిరస్మరణీయుడు, తెలుగు జాతికే గర్వకారణం పింగళి వెంకయ్య. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయతను చాటి చెప్పే చిహ్నం మన త్రివర్ణ పతాకం. భారత జాతీయ జెండాకు రూపకల్పన చేసిన చిరస్మరణీయుడు, తెలుగు జాతికే గర్వకారణం పింగళి వెంకయ్య గారు. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/62kGr55Rqz
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2026


