breaking news
Guntur
-
Political Corridor: అడ్డంగా దొరికిపోయి తప్పించుకునేందుకు కొత్త డ్రామా
-
‘అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారు’
సాక్షి, తాడేపల్లి: రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునకు కారణమైందని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆక్షేపించారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి మురళీకృష్ణ చెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:చోద్యం చూస్తున్నారు:ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్ చేయించకుండా చోద్యం చూడటం బాధాకరం. పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరమైతే పొలాలను రియల్ వెంచర్లుగా మార్చి రూ.3 వేల కోట్లు దోచుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర కుట్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదని భావిస్తున్న నరేంద్ర, నియోజకవర్గ రైతాంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. మరో వైపు రాజధాని అమరావతి కోసం పొన్నూరు రైతులను కొండవీటి వరదనీటితో ముంచారు. పంటలు నీటమునిగి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా మంత్రులు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ పొలాల వైపు కన్నెత్తి కూడా చూసిన పాపానపోవడం లేదు. పంట నష్టంపై అధికారులను నివేదిక కోరినట్టు కూడా ఎక్కడా వార్తలు కూడా లేవు. రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టు వారి సమస్యలు అసలు సమస్యలే కావన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.పొన్నూరులో 72 వేల ఎకరాల్లో పంట నష్టం:పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ 17 కి.మీ మేర ప్రవహిస్తుంది. గుంటూరు ఛానల్‌కు గత ఏడాది గండ్లు పడ్డాయి. దాంతో ఇప్పుడు వరదనీటికి గండ్లు తెగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని రైతులు కోరినప్పుడు నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పాడు. కానీ పంట కాలువల్లోని నల్ల మట్టిని తెచ్చి ఆ గండ్లు పూడ్చేయించాడు. తూటికాడు తీయమంటే గడ్డి మందు స్ప్రే చేసి వదిలేశారు. దీనికి సాగునీటి సంఘాలు రూ.24 లక్షల బిల్లులు పెట్టుకున్నాయి. ఎండినట్టే ఎండి మళ్లీ వర్షాలతో గడ్డి పెరిగిపోయిండి. వర్షాలకు ఈ తూటికాడు తూములకు అడ్డం పడి నంబూరు దగ్గర కాలువలకు మూడు గండ్లు పడ్డాయి.ఒక్క కాకాణి వద్దనే 11 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులే చెబుతున్నారు. చేబ్రోలు మండలంలో 15 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంటే అందులో 5 వేల ఎకరాలు నీట మునిగాయి. పొన్నూరు మండలంలో 28 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు మునిగిపొయాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటోలు చూపారు)సమస్యపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళితే చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే ఆలోచన వారిలో కనిపించలేదు. గత ఏడాది గుంటూరు ఛానల్, కృష్ణా వెస్ట్ ఛానల్, హైలెవల్ ఛానల్, అప్పాపురం ఛానల్ పరిధిలో మొత్తం 237 గండ్లు పడి 74వేల ఎకరాల మాగాణి, 30 వేల ఎకరాల ఉద్యానవన పంటలు కొట్టుకుపోయాయి. ఈ ఏడాది ఇప్పటికే 72వేల ఎకరాల్లో పంట వరద ముంపునకు గురైనట్టు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కడా ఎన్యుమరేషన్ కి ఆదేశించలేదు.పొన్నూరును ముంచెత్తిన అమరావతి వరద:నంబూరు గ్రామంలో గతంలో ఉత్సవాల కోసం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, 18 వేల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు అల్లాడిపోతుంటే కనీసం పరామర్శించలేదు. నిజానికి ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం అమరావతి ముంపును తగ్గించడం కోసం ప్రభుత్వం కొండవీటి వాగుకు పంపులు పెట్టి గుంటూరు ఛానల్, కృష్ణా ఛానల్, అప్పాపురం ఛానల్లోకి మళ్లిస్తోందని రైతులు చెబుతున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.రూ.3 వేల కోట్ల దోపిడీకి ధూళిపాళ్ల స్కెచ్:గుంటూరు – బాపట్ల ప్రధాన రహదారిని నేషనల్ హైవేగా మార్చి ఫోర్ వేగా అభివృద్ధి మార్చాలని చూస్తున్నారు. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో కట్టిన చేబ్రోలు–కొమ్మమూరు బ్రిడ్జిని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర పునర్నిర్మాణం చేయాలని అనుకోలేదు. నాడు జగన్ సీఎం అయ్యాక రూ.45 కోట్లకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను నియమించి బ్రిడ్జి పనులు మొదలుపెడితే కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలలుగా ఈ పనులు పక్కన పడేశారు.కాంట్రాక్టర్‌ను రూ.5కోట్లు కమీషన్లు కట్టాలని డిమాండ్ చేయడంతో పనులు వదిలేసి వెళ్లిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదలతో రోడ్డు సగం కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జి కనుక కూలిపోతే రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గత నెలన్నర కాలంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో జాడ లేకుండా పోయాడు.నంబూరు రైతులు తమ గోస వినిపించాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే అవి పంటలు పండే పొలాలు కాదని, లేఅవుట్లుగా మార్చుకోవాలని ఉచిత సలహాలిస్తున్నాడని వారు వాపోతున్నారు. రాజధానికి దగ్గరగా ఉన్న 30 వేల ఎకరాలను లేఅవుట్లుగా మార్చితే ఎకరాకు రూ.10 లక్షల వంతున వసూలు చేసి రూ.3 వేల కోట్లు సొమ్ము చేసుకోవచ్చనేది ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. -
అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. "అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం." ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2025 -
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగాయి. ఏపీ రాజధాని అమరావతి.. కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. కొండవీటి వాగు, పాలవాగు పొంగిపొర్లుతుంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో కనుచూపుమేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు.వేల ఎకరాలు భూములు నీటమునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయ పాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్ఆర్ఏం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాల నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు.. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణంఅమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులా మారిపోయింది. -
గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద
-
గుంటూరు జైలు నుంచి తురకా కిషోర్ విడుదల
సాక్షి, గుంటూరు: జిల్లా జైలు నుంచి వైఎస్సార్సీపీ నాయకుడు, మాచర్ల మునిసిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిషోర్ శుక్రవారం విడుదలయ్యారు. 215 రోజుల నుంచి కిషోర్‌ను జైల్లో ఉంచిన కూటమి ప్రభుత్వం. ఆయనపై మొత్తం 12 అక్రమ కేసులు బనాయించింది. మొత్తం 12 కేసుల్లో 11 కేసులు హత్యయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్‌ను చంద్రబాబు సర్కార్ బనాయించింది.ఆరేళ్ల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కిషోర్‌పై కేసు నమోదు చేసి పీటీ వారింట్ ద్వారా అరెస్టు చూపించిన ప్రభుత్వం.. జైలు నుంచి బయటికి రానివ్వకుండా చేసింది. కిషోర్‌పై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెంట చింతల పోలీసులు నమోదు చేసిన కేసులో కిషోర్‌ది అక్రమ అరెస్టు అని హైకోర్టు తేల్చి చెప్పింది.తురకా కిషోర్‌పై కేసుల మీద కేసులు పెడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వ్యవహారంలో అటు పోలీసులు, ఇటు మేజిస్ట్రేట్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఆయన అరెస్ట్ సీఆర్పీసీ, బీఎన్ఎస్ఎస్ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు సైతం విరుద్ధమని తేల్చిచెప్పింది. ఇందులో ఎలాంటి సందేహం లేదంది.కిషోర్ రిమాండ్ విషయంలో మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించలేదని ఆక్షేపించింది. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొన్న మేజి్రస్టేట్, ఈ విషయంలో తన సంతృప్తిని ఎక్కడా రికార్డ్ చేయలేదని పేర్కొంది. కిషోర్ విడుదల ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో గుంటూరు జిల్లా జైలు నుంచి ఇవాళ(శుక్రవారం) తురకా కిషోర్ విడుదలయ్యారు. -
హైకోర్టు మాటంటే లెక్కలేదా? వెంటనే కిషోర్ ను విడుదల చేయండి
-
ఏపీ పోలీసుల కోర్టు ధిక్కారం!.. తురకా కిషోర్‌పై కొత్త కుట్ర
సాక్షి, గుంటూరు: హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌ను జైలు అధికారులు విడుదల చేయలేదు. హైకోర్టు తక్షణమే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినా జైలు అధికారులు కిషోర్‌ను విడుదల చేయకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తురకా కిషోర్ తరపున న్యాయవాది.. హైకోర్టు ఉత్తర్వులను గురువారం రాత్రి 12 గంటల సమయంలో జైలుకు అందించినప్పటికీ విడుదల చేయడం లేదు. కాగా, తమ పేరుతో రిలీజ్‌కు డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి తాము విడుదల చేయలేమని జైలు అధికారులు వింతగా జవాబు ఇవ్వడం గమనార్హం.అంతకుముందు.. తురకా కిషోర్‌పై ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వ్యవహారంలో అటు పోలీసులు, ఇటు మేజిస్ట్రేట్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఆయన అరెస్ట్ సీఆర్పీసీ, బీఎన్ఎస్ఎస్ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు సైతం విరుద్ధమని తేల్చి చెప్పింది. ఇందులో ఎలాంటి సందేహం లేదంది. కిషోర్ రిమాండ్ విషయంలో మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించలేదని ఆక్షేపించింది.బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొన్న మేజిస్ట్రేట్, ఈ విషయంలో తన సంతృప్తిని ఎక్కడా రికార్డ్ చేయలేదని పేర్కొంది. కిషోర్ విడుదల ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. -
జక్కంపూడి రామ్మోహన్ రావుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆయనకు నివాళులు అర్పించారు. రామ్మోహన్a చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు. -
నేను లోకల్.. నేను చెప్పిందే జరగాలంటూ ధూళిపాళ్ల అరాచకాలు
-
Naseer Ahmed: వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకర ప్రవర్తన
-
ఓ మహిళకు ముద్దు పెడుతూ.. టీడీపీ MLA వీడియో వైరల్
-
టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు..
సాక్షి టాస్క్‌ఫోర్స్: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ (టీడీపీ) ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ వ్యవహరించిన తీరు తేటతెల్లమైంది.అయితే, సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో ఉండి వీడియో కాల్చేసి మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే నసీర్, ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ రకంగా రాసలీలలు చేస్తున్న ఎమ్మెల్యే నసీర్ తీరుపై మహిళా లోకం దుమ్మెత్తి పోస్తోంది. ఆ వీడియోలో ఆడియో వినపడకపోయినా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. -
పిల్లల్ని లాగిపడేసి.. గుంటూరు జైలు వద్ద పోలీసుల హైడ్రామా
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌పై పెట్టిన అన్ని అక్రమ కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. దీంతో ఇవాళ ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. అదీ కుటుంబ సభ్యులు చూస్తుండగానే బలవంతంగా ఆయన్ని జీపు ఎక్కించుకుని తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా జైలు వద్ద బుధవారం పోలీసుల హైడ్రామా నడిచింది. తురకా కిషోర్ రిలీజ్ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఏడు నెలల తర్వాత విడుదల కాబోతుండడంతో వారంతా సంతోషంగా కనిపించారు. అయితే అది ఎంతో సేపు నిలవలేదు. జైలుకు వచ్చిన వెంటనే ఆయన తన కుటుంబ సభ్యులను దగ్గరికి తీసుకున్నారు. కూతుళ్లను అక్కున చేర్చుకున్నారు. అయితే ఇంతలో రెంటచింతల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంటి బిడ్డలను లాగేసి పడి.. కుటుంబ సభ్యులను నెట్టేసి మరీ.. కిషోర్‌ను బలవంతంగా జీపు ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో పోలీసులు కుటుంబ సభ్యులు చెప్పేది వినకుండా ఆయన్ని బలవంతంగా లాక్కెల్లారు. తోపులాటలో కిషోర్ కూతురు సహా కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. కిషోర్‌ది అక్రమ నిర్బంధమేనని ఆయన కుటుంబ సభ్యులు మండిపడ్డారు. జైలు ఆవరణలో పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ విషయమైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ చెబుతున్నారు.తురకా కిషోర్ పై మొత్తం 12 కేసులు నమోదు చేశారు పోలీసులు. అందులో 11 హత్యాయత్నం కేసులు, ఒక పీడీయాక్ట్ కేసు నమోదు చేశారు. ఈ పీడీ యాక్ట్ కేసుపై న్యాయ పోరాటం చేయగా.. కోర్టు కేసు కొట్టేసింది. అదే సమయంలో.. మిగతా కేసుల్లో తురకా కిషోర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
పవన్.. దాడులు చేస్తే అది సివిలైజేషనా?
సాక్షి, తాడేపల్లి రూరల్: మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే.. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం వాటిని అమలు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ప్రజలను, తన అభిమానులను రెచ్చగొడుతున్నారు. వీరా మనల్ని పరిపాలించేది.. అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.. తన సినిమా ఈవెంట్లో అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడటంపై శుక్రవారం రాత్రి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. “సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.. దాడి చేయండి.. కొట్టండి.. మీకు నచ్చిన విధంగా దాడి చేయండి.. అది సివిలైజేషన్’ అంటూ పవన్‌కళ్యాణ్ ప్రజలను, వారి సైనికులను రెచ్చగొట్టడం దారుణమన్నారు. అదే రకమైన ప్రవర్తన జనసైనికులకూ వచ్చిందన్నారు.మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కారును అడ్డగించి ఆపి రాళ్లు రువ్వి, పైకెక్కి వారు చేసిన విన్యాసాలను అందరూ చూశారని, తిరుపతిలో ఓ థియేటర్ అద్దాలు పగులగొట్టి.. టికెట్ లేకుండానే సినిమా చూశారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ విధమైన ప్రవర్తనతో వీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతున్నారని ప్రశ్నించారు. -
చరిత్రలో ఆడవారిని మోసం చేసిన ఏకైక పార్టీ టీడీపీ
-
సంతమాగులూరు తండ్రీకొడుకుల హత్య కేసులో టీడీపీ నేత?
సాక్షి,బాపట్ల: జిల్లా సంతమాగులూరు మండలంలో జరిగిన జంట హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు సమాచారం.చెల్లని చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కుమారుడు కిడ్నాప్,దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు చెల్లని చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్తున్న వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను అగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం దారుణంగా హత్య చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తండ్రీ,కొడుకుల హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెంగుళూరులో బాదం మాధవరెడ్డితో హతులు వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డికి ఆర్ధిక పరమైన గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి వివాదం కారణంగానే మృతుల్ని పక్కాప్లాన్ ప్రకారం హత్య చేశారని, హత్యలో స్వయంగా బాదం మాధవరెడ్డి పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
నేడు బాలగంగాధర తిలక్ జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర తిలక్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. బాలగంగాధర తిలక్‌కు నివాళులు అర్పించారు. దేశసేవకు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘స్వరాజ్యం నా జన్మ హక్కు. నేను దాన్ని పొంది తీరుతాను’ అని గర్జించి స్వాతంత్ర్య పోరాటంలో తొలి ఉద్యమ జ్వాలలు రగిలించిన మహానాయకుడు బాలగంగాధర్ తిలక్. దేశసేవకు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా నివాళులు’ అర్పించారు.‘స్వరాజ్యం నా జన్మ హక్కు. నేను దాన్ని పొంది తీరుతాను’ అని గర్జించి స్వాతంత్ర్య పోరాటంలో తొలి ఉద్యమ జ్వాలలు రగిలించిన మహానాయకుడు బాలగంగాధర్ తిలక్ గారు. దేశసేవకు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ బాలగంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/z7sYb1MBAA— YS Jagan Mohan Reddy (@ysjagan) July 23, 2025 -
Guntur: డీఎంపీ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ ఆందోళన
-
కోడలి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్..!
తాడేపల్లి రూరల్: తన చావుకు భార్య కారణమని పేర్కొంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన బ్రహ్మయ్య (30) సీసీ కెమెరాల టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరి టిడ్కో నివాసాల్లో ఉంటున్న యువతితో వివాహం జరిగింది. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని పుట్టింటికి పంపించేశాడు. అందరూ బ్రహ్మయ్యను బతిమిలాడితే ఆమెను కాపురానికి తీసుకొచ్చినట్లు బంధువులు తెలిపారు. అత్తాకోడళ్ల గొడవల కారణంగా బ్రహ్మయ్య సొంత ఇంటి నుంచి ఉండవల్లి అమరావతి రోడ్‌లోని ఒక ఇంటిలో అద్దెకు దిగాడు. అక్కడ మళ్లీ ఆమె ఫోనులో ఎక్కువగా మాట్లాడుతుండటంతో గొడవలు జరిగాయి. ఈలోగా ఆషాఢ మాసం రావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన చావుకు భార్య కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని బ్రహ్మయ్య ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయిన ఏడాదికే ఇలా కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బ్రహ్మయ్య తల్లి కన్నీరుమున్నీరైంది. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందామని చెప్పినా ఎందుకు ఇలా చేశావని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి చావుకు కారణమైన కోడలు, ఆమె ప్రియుడిని శిక్షించాలని డిమాండ్ చేసింది. -
కరేడు రైతులను తరిమేయాలని చూస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం కుట్రతో కరేడు రైతులను తరిమేయాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. వాళ్ల కోసం సేకరించిన భూములు వాళ్లకే ఇవ్వడం లేదు.. రైతులను ఒత్తిడి తెచ్చి వెళ్లగొట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఇండోసోల్‌కు పొగ పెట్టి పొమ్మంటోంది అంటూ కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశమే లేదని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కరేడు చాలా విచిత్రమైన విషయం. రైతులపై ఒత్తిడి తెచ్చి వెళ్లగొట్టాలని చూస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసి నిర్వాసితులకు న్యాయం చేశాం. పోర్టుకు ఆనుకుని ఇండోసోల్ కంపెనీ అనుబంధ పరిశ్రమ గుడ్లూరు మండలం చేవూరు, రావూరులో భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించాం. ఇందుకోసం ఇండోసోల్ కంపెనీతోనే సుమారు రూ.500 కోట్లు రైతులకు పరిహారంగా ఇప్పించాం. ఆ భూముల్లో ఆ కంపెనీ ఏర్పాటవుతున్న దశలో కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. వారి డబ్బుతో వారికి కేటాయించిన భూములను వారికి ఇవ్వకుండా కరేడుకు వెళ్లిపొమ్మంది. కరేడులో సారవంతమైన, ఏటా రెండు పంటలు పండే భూములు ఇవ్వాలని రైతులపై ఒత్తిడి తెస్తోంది.రైతులకు ఆ భూములు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సిందేనని బలవంతం చేస్తోంది. ఇది ఎంత మాత్రం సరికాదు. ఇండోసోల్‌కు కేటాయించిన భూములను బీపీసీఎల్‌కు ఇచ్చి, ఇండోసోల్‌కు పొగ పెట్టి పొమ్మంటోంది. బీపీసీఎల్‌కు ఇవ్వాలనుకుంటే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూములు సరిపడా ఉన్నాయి. అలా చేయకుండా రైతులకు ఏమాత్రం ఇష్టం లేని భూములు కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వం వివాదం రాజేసింది. ఇది ముమ్మాటికీ కుట్రే. సారవంతమైన భూములు కోల్పోతామని కరేడు రైతులు ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండోసోల్ సొంత ఖర్చుతో ప్రభుత్వం సేకరించిన భూములను వారికి ఇవ్వకుండా, మరోచోటుకు వెళ్లమనడం పరిశ్రమలను తరిమేసే కుట్రే అవుతుంది. చంద్రబాబుకు పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశం లేదు. పరిశ్రమలను పెట్టే వారిని బెదిరించి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. కరేడు రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది అని హామీ ఇచ్చారు. -
అరిస్తే నేను బెదిరేవాడిని కాను.. నేను బెదరను!
గుంటూరు: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకు తొలి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది. ‘‘అసలు మేము పార్టీ వాళ్లమా.. కాదా? ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకి విలువ ఉంది గానీ మీ గెలుపు కోసం, తెలుగుదేశం కోసం కష్టపడిన మాకు విలువ ఉందా ? మీ చుట్టూ పిచ్చికుక్కల్లా తిరుగుతున్నాం.. పార్టీ గెలిచిన నుంచి మమ్మల్ని ఆలకించినోళ్లు లేరు’’ అంటూ తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే బూర్లపై టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. పెదనందిపాడు మండలం పాలపర్రులో ఆదివారం స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటిస్తున్న ఆయనకు మహిళలు మాటల తూటాలతో చుక్కలు చూపించారు. వీవోఏ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారికి సహకరించడం ఏమిటని ఆయన్ను ప్రశ్నించారు. కార్యాలయానికి ఎన్నిసార్లు వచ్చినా పట్టించుకునే వారు గానీ ఆలకించే వారు గానీ లేరని ఆగ్రహించారు. తాము పార్టీలో వాళ్లమా కాదా అనేది ఇప్పుడు ఊర్లో అందరి మధ్యా చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని గెలిపించుకుని సంవత్సరం అవుతుందని, ఏరోజైనా తమను పట్టించుకున్నారా ? అని ఫైర్ అయ్యారు.అరిస్తే నేను బెదిరే వాడిని కాదుదీనికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ‘‘అది మీ ఊరి సమస్య మీరే తేల్చుకోవాలంటూ సమాధానం ఇవ్వగా.. మరి మా ఊరు సమస్య అన్నప్పుడు నువ్వు ఓట్లకి ఎందుకొచ్చావ్ అప్పుడు ?’’ అంటూ మహిళలు ఎదురు ప్రశ్నించారు. ఒక దశలో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ‘‘నాకు చాలా ఓర్పు ఉంది.. సాయంత్రం వరకు ఉండే ఓపిక ఉందని, వచ్చినప్పుడు అరిస్తే నేను బెదిరేవాడిని కాను.. నేను బెదరను !’’ అంటూ మహిళలకు వేలు చూపిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరనం తమకు లేదని మహిళలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడి అవినీతికి పాల్పడిన వీవోఏ వివరాలను నమోదు చేసుకున్నారు. వారం రోజుల్లో విచారణ చేయించి, అవినీతి నిరూపణ అయితే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మహిళలు శాంతించారు. -
గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు గురు పౌర్ణమి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు హృదయపూర్వక నమస్కారాలు.#GuruPurnima— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025 -
గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో నాగమల్లేశ్వరరావుకు YSRCP నేతల పరామర్శ
-
ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసిన టీడీపీ నేత
-
నాగమల్లేశ్వరరావు కేసులో గుంటూరు ఎస్పీకి YSRCP ఫిర్యాదు
-
తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు తొలి ఏకాదశి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని.. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2025 -
మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు సోదరుడికి వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు సోదరుడు వేణు ప్రసాద్‌తో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,గుంటూరు: అమరావతి విస్తరణ కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు షాకిచ్చారు. రాజధాని విస్తరణకు తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.అమరావతి రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. రాజధానికి సమీపంలోని 11 గ్రామాల్లో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం బేజాత్ పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబులో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.అయితే, అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెప్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది.ల్యాండ్ పూలింగ్కురాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే.రాజధాని భూముల్ని అమ్మేందుకు కుట్రమరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు.మండిపడుతున్న అమరావతి రైతులుఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు. -
కలిస్తే తప్పేంటి? ఎల్లో మీడియాకు గూబ గుయ్యిమనేలా ఎస్పీ సమాధానం
-
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో విచిత్ర ఘటన
-
జగన్ కు కృతజ్ఞతలు.. గుంటూరు వెస్ట్ లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం
-
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్, పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు, రీజినల్ కో–ఆర్డినేటర్లు సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చించారు. సూపర్‌సిక్స్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
సింగయ్య ఘటనపై గుంటూరు SP క్లారిటీ
-
జగన్ పర్యటనపై బాబు విష ప్రచారం.. తిప్పికొట్టిన గుంటూరు DSP
-
QR కోడ్‌తో బాబు మోసాలను నిలదీద్దాం.. ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
సాక్షి,గుంటూరు: ఏపీలో ఏడాదిగా కూటమి పాలనలో.. టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం.. ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్ నిజంగా అశ్చర్యకరం. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గన్‌మెన్‌ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు గన్‌మెన్‌పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి గన్‌మెన్ లేఖ రాశారు. మరో గన్‌మెన్‌ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిపై, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్‌పై కేసులు. ఇలా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు.. చంద్రబాబూ?సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్ చేశారు?టీవీ డిబెట్లో అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది. మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా?మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా అని వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బయటకొచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారు. కనీసం చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదా? న్యాయం చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. న్యాయం వైపు నిలిచే వ్యక్తి చంద్రబాబు కాదు. మరో ప్రాంతంలో ఇంటర్ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తర్వాత బాలిక శవమై కనిపించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. టీడీపీ నేత.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటిప్రజల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లను మంజూరు చేసి 10లక్షల ఇళ్లు పూర్తి చేశాం. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించ్చాం. మహిళలపై ఎవరికి గౌరవం ఉంది?. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి.కరెంట్ బిల్లుల బాదుడే.. బాదుడు15వేల కోట్లు కరెంట్ బిల్లుల బాదుడు,గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీ కాలేజీల్ని నిర్విర్యం చేశాడు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల పేరిట బాదుడే బాదుడే. రేషన్ వెహికల్స్ వాహనాల్ని తీసేశాడు. రేషన్ ద్వారా ఇచ్చే పప్పు దాన్యాల్ని ఎగనామం పెట్టాడు. ఫలితంగా పప్పు దాన్యాల రేట్లు పెంచి బాదుడే బాదుడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. సుమారు 3లక్షలపై చీలూకు ఉద్యోగాల్ని తొలగించారు.ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరేసరిపంటలకు సరైన మద్దతు లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా ఒరిగిందా అంటే? అదీ లేదు. వచ్చీ రాగానే పీఆర్సీ అన్నారు. పీఆర్సీని ఆపేశారు. ఈ జులై 1వ తారీఖుతో కలిసి నాలుగు డీఏ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 20 వేలకోట్ల వరకు ఆపేశారు. చంద్రబాబు పెట్టిన తాకట్టు.. చంద్రబాబు తాను అబద్ధమాడుతూ.. తానెప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టడం లేదు. కానీ 4-4-2025 నాడు విడుదల చేసిన జీవో 69 కింద ఏపీఎండీసీ కింద 436 మినరల్ ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టారు. వాటి విలువ 191,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి ప్రెస్మీట్లో రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో, బాండలను అందరూ రెడీగా పెట్టుకోవాలి. చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకునేందుకు మీ ఇంటికి ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని పంపిస్తున్నారు. నేతలు వచ్చినప్పుడు మ్యానిఫెస్టో, బాబుష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాండును అందించారు. ఆ బాండు, ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ ఎంత వరకు ఎన్నికల హామీలు నెరవేర్చారో అడగండి. అప్పుడైనా చంద్రబాబుకు ఎన్నికల హామీలు నెరవేర్చుతారో చూడాలి. ఒకవేళ మీ వద్ద ‘బాబు మ్యానిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటూ’ అనే పేరుతో చంద్రబాబు మ్యానిఫెస్టోను డౌన్లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్‌ను వైఎస్సార్సీపీ అందుబాటులోకి తెస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వంపై ఫైట్ చేయండి. రాష్ట్ర ప్రజల తరుఫున వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. -
జనం గుండె ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వనిస్తోంది : రోజా
సాక్షి,గుంటూరు: వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్నారు. రెంటపాళ్లలో కూటమి నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన వేళ కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకుల్ని సృష్టించింది. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. భారీ కేడ్లు, చెక్ పోస్టులతో వైఎస్ జగన్ అభిమానుల్ని, వైఎస్సార్సీపీ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ వైఎస్ జగన్‌పై తమకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు.తమ అభిమాన నాయకుడు రెంటపాళ్లకు వస్తున్నారనే సమాచారంతో సత్తెనపల్లితో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ అభిమానులు,పార్టీ శ్రేణులు రెంటపాళ్లవైపు కదిలారు. జనప్రభంజనంలా తరలివచ్చారు. వెల్లువలా వచ్చిన ప్రజలతో సత్తెనపల్లి నియోజకవర్గం జనసంద్రంలా మారింది. ప్రభుత్వం ఆంక్షలు సైతం వైఎస్ జగన్‌పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనపై అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్ అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన తరంగాలను ఆపలేకపోయారు.“రోడ్లు మూసేశారా? మాకేం!”“పోలీసులు అడ్డుపడుతున్నారా? మాకేం!”మన గుండెల్లో ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వని మారుతోంది.మన నరాల్లో ప్రవహించే రక్తం, జననేతను ఒక్కసారి చూడాలనే తపనతో ఉప్పొంగుతోంది.అందుకే..పొలాల గట్లే రోడ్లయ్యాయి,పొలాల బాటలే ఎర్ర తివాచీలయ్యాయి,ముళ్ల దారులే హైవేలయ్యాయి.అభిమానులు పోటెత్తారు!“తగ్గేదేలే!” అంటూజగన్ను ఒక్క చూపైనా చూడాలన్న ఆశతోఇలా బయలుదేరారు… వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ @ysjagan అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన… pic.twitter.com/StMxCxf2az— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 -
నాగమల్లేశ్వరరావు మృతి: నాడు జరిగింది ఇదే..
సాక్షి, పల్నాడు: సత్యం ఊపందుకోకముందే ఒక అబద్ధం ప్రపంచవ్యాప్తంగా సగం దూరం ప్రయాణించగలదు. అలాంటి ప్రచారాలు ఎల్లో బ్యాచ్‌కు వెన్నతో పెట్టిన విద్య. మీడియా సంస్థలను, సోషల్ మీడియాను మేనేజ్ చేయగలిగే వాళ్లు.. ఇప్పుడు జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంతోనూ తప్పుడు రాతలు, ప్రచారాలతో చెలరేగిపోతున్నారు. ఏడాది కిందట.. పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో నాగమల్లేశ్వరరావు అనే వైఎస్సార్సీపీ నేత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. బాధితుడి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు సిద్ధమయ్యారు. అంతే.. పచ్చదండు విషపు రాతలతో రెచ్చిపోసాగింది. బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడంటూ సైకో ప్రచారం కొనసాగించింది. ఇది రెంటపాళ్ల గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు ఆనాడు ఏ జరిగిందంటే.. 2024 జూన్ 4న.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నాగమల్లేశ్వరరావు ఇంటిపై కూటమి నేతలు దాడి చేశారు. ఆ కాసేపటికే ఆయన్ని స్థానిక పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలా.. జూన్ 5 రాత్రి 10గంటల వరకు పోలీసులు నిర్భంధించారు. అయితే స్టేషన్లో ఏం జరిగిందంటే.. ‘‘మన ఇంటిపై దాడి చేస్తున్నారు నాన్నా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాగమల్లేశ్వరరావుకు ఆయన కుమార్తె ఫోన్ చేశారు. కుమార్తెతో మాట్లాడుతుండగా ఫోన్ లాక్కుని.. నాగమల్లేశ్వరరావును పోలీసులు దుర్భాషలాడారు. గ్రామంలోకి వెళ్ల కూడదని బెదిరించారు. ఒకవేళ తమను కాదని గ్రామంలోకి వెళ్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. గ్రామంలో ఉండకూడదు’’ అని నాగమల్లేశ్వరరావును పోలీసులు భయపెట్టారు. గ్రామంలో ఉంటే కాల్చేస్తామని బెదిరింపులకు దిగారు. ఆపై జైలు నుంచి బయటకు వచ్చిన నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. తనను పోలీస్ స్టేషన్లో తీవ్రంగా అవమానించి.. కొట్టారంటూ తండ్రికి ఫోన్ చేసి వాపోయారు. ఇలా రెడ్‌బుక్ పాలనలో భాగంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైన వైఎస్సార్సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు కావడం గమనార్హం. ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రెంటపాళ్ల గ్రామాన్ని వెళ్లారు. మరోవైపు.. ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగంతో అన్నివిధాల ప్రయత్నించిన కూటమి ప్రభుత్వం.. చివరకు ఇలా ‘బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాడంటూ’’ ఐటీడీపీ అండ్ కో ద్వారా విషప్రచారానికి దిగజారిపోయింది. -
‘ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళన చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై మాజీ మంత్రి, ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చే రక్షణ ఇదేనా? చంద్రబాబు సర్కారును నిలదీశారు. చివరికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేదని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొడితే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?, ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?, మహిళలపై అఘాయిత్యాలు చేస్తే అదే చివరి రోజని చంద్రబాబు బడాయి మాటలు చెప్తున్నారు. మరి ఆయన సొంత నియోజకవర్గంలో దారుణం జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నారు?, రాష్ట్రమంతా అరాచకం రాజ్యమేలుతోంది. మహిళ హోంమంత్రిగా ఉండికూడా ఉపయోగం లేదు. కుప్పం బాధిత మహిళను పరామర్శించే సమయం కూడా హోంమంత్రికి లేదా?, వీడియో కాల్ చేసి మాట్లాడటం హోంమంత్రి అహంకారానికి నిదర్శనం’ అని మండిపడ్డారు ఆర్కే రోజా. -
రేపు రెంటపాళ్లకి వైఎస్ జగన్
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. రేపు (బుధవారం) సత్తెన పల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లనున్నారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్సీపీ నేత, ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం, నాగమల్లేశ్వర రావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ బుధవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ చేరుకుంటారు. అక్కడ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి ఆంక్షల పేరిట కట్టడి చేయాలని భావిస్తోంది. అయితే జగన్ ఎట్టి పరిస్థితుల్లో జనం మధ్యే పర్యటిస్తారని వైఎస్సార్సీపీ కుండబద్ధలు కొడుతోంది. -
హాట్సాఫ్ డాక్టర్ ! క్షణం ఆలస్యమైనా.!
గుంటూరు మెడికల్ : ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయం.. నిడమానూరు బైపాస్.. రాత్రి పూట చిమ్మ చీకట్లో నెత్తుటి మడుగులో స్పృహ లేకుండా పడిఉన్న భర్తను చూసి ఆమె గుండెలు బాదుకుంటోంది. అయ్యా.. కాపాడండి! అంటూ కన్నీరుమున్నీరవుతోంది. అప్పటికే కొన్ని వందల వాహనాలు అటు ఇటు పరుగులు పెడుతున్నా ఆగలేదు. ఇంతలో గుంటూరుకు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్, లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పి.వి.రాఘవశర్మ గన్నవరం నుంచి గుంటూరు వస్తున్నారు. రోడ్డు పక్కన దూరంగా పడి ఉన్న బాధితుడు, ఆర్తనాదాలు పెడుతున్న ఆయన భార్య కనిపించారు. వెంటనే కారు ఆపి పరుగు పరుగున అక్కడకు వెళ్లారు. బాధితుడి నాడి పట్టుకున్న వెంటనే మరికొద్ది క్షణాలు మాత్రమే ఊపిరి ఉంటుందని అర్థమైంది. వెంటనే భుజాలపై వేసుకుని ఒక్క ఉదుటున కారు వద్దకు వెళ్లారు. అప్పటి వరకు గుండెల నిండా కన్నీళ్లతో.. అంతులేని దిగులు చీకట్లలో కూరుకుపోయిన ఆ ఇల్లాలు.. వణుకుతున్న తన రెండు చేతులు జోడించి.. అయ్యా దేవుడిలా వచ్చారు! అంటూ దణ్ణం పెట్టింది. వేగంగా బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నుంచి బయటపడ్డాడు. డాక్టర్ రాఘవశర్మ మానత్వపు వైద్య సేవలకు అక్కడ ఉన్న ప్రజలు, పోలీసులు ‘హాట్సాఫ్ డాక్టర్ !’ అంటూ సలాం కొట్టారు. -
వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై బయటపడ్డ కూటమి కుట్ర
-
పోలీసులతో మమల్ని అణచలేరు: అంబటి రాంబాబు
గుంటూరు: వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులతో అణచలేరని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడారు. ‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు బెయిల్ పై విడుదల కావడం జరిగింది..సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు అనంతరం ఆయనను విడుదల చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించింది..కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసుల పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రావటం లేదు అని కొమ్మినేని శ్రీనివాసరావు పై లక్ష్యకట్టి అరెస్ట్ చేశారు..చీమకి కూడా హాని చేయకుండా కలం కోసం పని చేస్తున్న జర్నలిస్ట్‌ను జైలులో పెట్టడం దుర్మార్గం. పోలీసుల అదుపులో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు పై అరమరావతి రాజధాని ప్రాంత ప్రజల ముసుగులో టీడీపీ గుండాలు దాడికి ప్రయత్నం చేశారు..రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత కేవలం మైక్ ముందే హోం మంత్రి.. ఇకపై డిబేట్లు పెట్టే అవకాశం లేదు అంటూ హోం మంత్రి అనిత మాట్లాడడం సిగ్గుచేటు. చీకటి పడిన తరువాత కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని చంద్రబాబు, లోకేష్ జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు..పోలీసులతో మమల్ని అణచలేరు’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
జైలు నుంచి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని విడుదల
గుంటూరు: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జైలు నుంచి సోమవారం సాయంత్రం( జూన్ 16) ఆయన విడుదలయ్యారు. సాక్షి ఛానెల్ డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అక్రమ కేసు బనాయించిన గుంటూరు తుళ్లూరు పోలీసులు.. కొమ్మినేనిని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టుపై శుక్రవారం(జూన్ 13) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ బెయిల్ మంజూరు చేసింది. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం గత శుక్రవారం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి’ అని సృష్టం చేసిన ద్విసభ్య ధర్మాసనం.. బెయిల్‌ను మంజూరు చేసింది. -
వైఎస్ జగన్ గుంటూరు పర్యటన.. రూట్ మ్యాప్ ఇదే..
-
గుంటూరు జిల్లాలో YSRCP లీగల్ సెల్ మీటింగ్
-
టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి
టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె. మహేంద్ర (75) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి గుంటూరులో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో గుంటూరులో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.మొదట దర్శకత్వంలో శిక్షణ తీసుకున్న మహేంద్ర తర్వాత నిర్మాతగా మారి 50కు పైగా సినిమాలు తెరకెక్కించారు. చెన్నై నుంచి హైదరబాద్‌కు సినీ పరిశ్రమ వచ్చాక ఆయన ఏఏ ఆర్ట్స్ బ్యానర్‌ను నిర్మించారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కూడా మహేంద్రనే కావడం విశేషం. ఆపై దర్శకుడు గోపీచంద్ మలినేనిని కూడా ఆయనే ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ప్రేమించి పెళ్ళి చేసుకో, ఆరని మంటలు, ఎదురులేని మొనగాడు, ప్రచండ భైరవి, ఢాకూరాణి వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. -
ప్రభుత్వంపై అడ్వకేట్ పొన్నవోలు ఫైర్
-
కొమ్మినేనిపై కేసు.. పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
సాక్షి, గుంటూరు: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ విషయంలో పోలీసుల తీరుపై మంగళగిరి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఈ కేసుకు ఎలా వర్తిస్తుంది? అని ప్రశ్నించింది. గతంలో ఓసారి చెప్పినా మళ్లీ ఇవే సెక్షన్లు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ, ఎస్పీకి మెమో జారీ చేస్తామని హెచ్చరించింది. అదే సమయంలో.. కొమ్మినేనిపై నమోదు అయిన ఎస్సీ, ఎస్టీ యాక్ట్, 356(2) సెక్షన్స్‌ను జడ్జి తొలగించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు మఫ్టీలో హైదరాబాద్‌కు వచ్చి మరీ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల వయస్సున్న కొమ్మినేనిపై అక్రమ కేసులు బనాయించి మరీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు దిగిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు మండిపడుతున్నారు. పలువురు జర్నలిస్టులు, మేధావులు సైతం కొమ్మినేని అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు.మరోవైపు.. కొమ్మినేనిని రాత్రంతా నల్లపాడు పీఎస్‌లోనే ఉంచారు పోలీసులు. కొమ్మినేనిని అడ్వకేట్లు కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై న్యాయవాదుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు అన్నీ పూర్తయ్యాక మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు.కొమ్మినేని అరెస్టుపై జర్నలిస్టుల నిరసనలుసీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్‌ను నిరసిస్తూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు నిరసనలకు దిగారు. నల్ల జెండాలతో ర్యాలీలతో పాటు నినాదాలు చేశారు. బేషరతుగా కొమ్మినేనిని విడుదల చేయాలని, ఏపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందిఅల్లూరి సీతారామరాజు జిల్లా: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టును ఎమ్మెల్సీ అనంత బాబు ,మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు ఖండించారు. కక్షపూరితంగా కొమ్మినేని అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని విమర్శించారు.కొమ్మినేని అరెస్టు దుర్మార్గం సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు దుర్మార్గం, కక్షపూరితమని, సాక్షి మీడియాను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు, నిజాయితీగా పని చేసే జర్నలిస్టును వేధించడం దారుణమని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలతో ‘సాక్షి’కి సంబంధం లేకపోయినా వైఎస్ జగన్‌ను, ఆయన సతీమణి భారతిని తిట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేశారని విమర్శించారు.కొమ్మినేని అరెస్టు అక్రమం అనంతపురం కార్పొరేషన్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు అక్రమమని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కొమ్మినేనిని అరెస్టు చేయించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. సాక్షి మీడియాపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు, కొమ్మినేని విషయంలో మాత్రం ఆగమేఘాలపై స్పందించడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు.విశ్లేషకుల వ్యాఖ్యలను ‘సాక్షి’కి ఆపాదించకూడదు సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుల అభిప్రాయాలను సాక్షి మీడియాకు ఆపాదించడం సరైనది కాదని సెంటర్ ఫర్ పొలిటికల్ స్ట్రాటజీ అండ్ రీసెర్చ్ (సీపీఆర్‌ఎస్) చీఫ్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ మామిడి సుదర్శన్ అన్నారు. గతంలో ఈనాడులో వచి్చన పలు వ్యాసాలపై ఆ పత్రిక అధినేత రామోజీరావు మీద కోర్టులో పరువు నష్టం దావా వేసినప్పుడు రామోజీరావు ఇదే విషయాన్ని కోర్టుకు నివేదించారని తెలిపారు. పేపర్లో రాసే వ్యాసాలు, విశ్లేషణలు రాసిన వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప, ఈనాడుకు ఏ సంబంధంలేదని హైకోర్టుకు రామోజీరావు నివేదించారని సోమవారం ఒక ప్రకటనలో ఆయన గుర్తుచేశారు. సాక్షి టీవీ చర్చలో అమరావతిపై విశ్లేషకుడి అభిప్రాయం ఆయన వ్యక్తిగతమని, దీనితో సాక్షికి సంబంధంలేదని స్పష్టం చేశారు.జర్నలిస్టులను అణిచివేతకే అక్రమ అరెస్ట్‌లు తిరుపతి మంగళం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్ష సాధింపులు, రెడ్‌బుక్ పాలన, అక్రమ కేసులు బనాయించి గిట్టనివాళ్లను జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్న సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం దాడులకు తెగబడుతూ అక్రమ అరెస్ట్‌లు చేయడం బాధాకరమన్నారు. జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం, పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడం చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘కొమ్మినేని’ అరెస్టు కక్ష సాధింపే.. హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడాన్ని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించాయి. ఇది పోలీసుల కక్ష సాధింపు చర్యలో భాగమని ఐఎఫ్‌డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్ తదితరులు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు సందర్భంగా వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. -
YSRCP: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడిపై సస్పెన్షన్ వేటు
గుంటూరు,సాక్షి: గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. కావటితో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పరేటర్లు కూడా వైఎస్సార్సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు మాజీ మేయర్ కావటి, ఇద్దరు కార్పొరేట్లపై ఫిర్యాదులు రావడంతోనే చర్యలకు ఉపక్రమించింది. -
గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘పవన్.,. మీ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?’
తాడేపల్లి : ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 143 వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మాయ చేసి గెలిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. చంద్రబాబు ప్రజలకు నిలువునా వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ‘ వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. కడప మహానాడుకి జనం నామమాత్రంగా కూడా రాలేదు. వైఎస్సార్సీపీ ఒక్క వెన్నుపోటు దినం అని పిలుపునిస్తే లక్షలమంది ప్రజలు వచ్చారు. మీరు ఏ అభివృద్ధి చేయలేక జగన్‌ని దూషించటమే పనిగా పెట్టుకున్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మరింత దిగజారి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటానికి మంత్రికి సిగ్గులేదా?. దళితులకు ఈ రాష్ట్రంలో అవమానం జరుగుతోంది. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది టీడీపీ వాళ్లే అని గంటా శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ వలనే గంజాయి బజారులో కూడా దొరుకుతోంది. హోంమంత్రి అనితకు కులం కోటాలనే హోంమంత్రి పదవి వచ్చింది. దళితులను కొడితే హోంమంత్రి కేర్లేస్గా మాట్లాడుతున్నారు. టీడీపీలో చాలామందిపై కేసులు ఉన్నాయి. వారిని ఇలానే బజారులో కొడతారా?. పరిటాల సునీత ఇలాకాలో దళిత బాలికపై నెలల తడబడి అత్యాచారం చేశారు. ఈ ఘటన మీకు కనబడుటం లేదా, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?, ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు వెన్నుపోటు దారుడు కాదా?, విద్యార్థులు, మహిళలు, తల్లులను మోసం చేసింది టీడీపీ కాదా?, రైతులను మోసం చేసింది నిజం కాదా?, చివరకు రాష్ట్రంలో సినిమా హాళ్లను కూడా మూసివేసే పరిస్థితికి తెచ్చారు. మీ నాయకుడు పవన్ కళ్యానే సినిమా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకి మాత్రమే రాజకీయ ఉద్యోగం ఇప్పించారు. పంచాయతీ రాజ్ శాఖని నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థని నాశనం చేశారు’ అని మండిపడ్డారు. -
బాబు,పవన్ పై నిప్పులుచెరిగిన అంబటి
-
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్న పోలీసులు
-
అంబటి రాంబాబుపై సీఐ జులుం
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఓవరాక్షన్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి కలెక్టరేట్‌కు వెళ్తుండగా టీజేపీఎస్ కాలేజీ వద్ద అంబటి రాంబాబును పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. అయితే,తాము నిరసన కార్యక్రమానికి అనుమతి తిసుకున్నా ఎందుకు అడ్డుకున్నారని సీఐని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన సీఐ.. అడ్డుకుంటాం అంటూ అంబటిపై దౌర్జన్యానికి దిగారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ దురుసుగా ప్రవర్తించారు. అంబటి రాంబాబుని ఏంటి పళ్ళు కోరుకుతున్నావ్ అంటూ అంబటి రాంబాబుకు మీదకు వెళ్లారు. ప్రస్తుతం సీఐ వెంకటేశ్వర్లు దురుసు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గుంటూరు జైల్లో నందిగం సురేష్ ను పరామర్శించిన సజ్జల
-
తెనాలిలో విషాదం.. బంగారం వ్యాపారి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. బంగారం వ్యాపారి సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారి ఆత్మహత్య పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పోలీసులు వేధింపులే కారణమని సమాచారం.దొంగ బంగారం కేసులో సిద్దేశ్ శివాజీని కొంత బంగారం ఇవ్వమని పోలీసులు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. సిద్ధేష్ శివాజీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పంకజ శ్రీని వంశీతో మాట్లాడకుండా అడ్డుకున్న పోలీసులు
-
వంశీకి తీవ్ర అస్వస్థత.. జీజీహెచ్ వద్ద పంకజశ్రీతో పోలీసుల వాగ్వాదం
సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వంశీని సోమవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకువచ్చారు. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీ సతీమణి పంజశ్రీకి కాసేపటి క్రితమే ఆమె జీజీహెచ్‌కు చేరుకున్నారు. ఆమెను గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఇక, వంశీని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే జీజీహెచ్ గేట్లను మూసివేశారు పోలీసులు.మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో, వంశీని సోమవారం ఉదయం జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. అనంతరం, వంశీకి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక, వంశీకి జీజీహెచ్‌కు తరలించిన వెంటనే పోలీసులు.. ఆసుపత్రి ప్రధాన గేట్లను మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆసుప్రతికి వచ్చి పేషంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు సైతం వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం.మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లకుండా ఆమెను గేటు వద్దనే నిలిపివేశారు. ఈ క్రమంలో పంకజశ్రీతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో, వంశీ ఆరోగ్య పరిస్థితిపై పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా సైతం చేరుకున్నారు. ఫాతిమాను కూడా ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. -
వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు
గుంటూరు: ఈ ఏడాది ఫిబ్రవరిలో నా భర్త సాయిబాబు బల్బు బిగిస్తూ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు చేయి మణికట్టు వద్ద విరిగింది. స్థానిక కొత్తపేటలోని హాస్పిటల్‌కు తీసుకెళితే సర్జరీ చేశారు. చేసిన మరుసటి రోజే ఆయనకు కుడివైపు పక్షవాతం వచ్చింది. కనీసం ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయకపోగా హడావుడిగా మమ్మల్ని బయటకు పంపేశారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబాన్ని నడిపించే నా భర్త అచేతనంగా పడి ఉండడానికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. మెడికల్ వెరిఫికేషన్ పెట్టించాలని మనవి.–జక్కంపూడి శ్రీవల్లి, గుంటూరునా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు -
రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి : రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు.మంగళవారం (మే 20)న జరగనున్న ఈ సమావేశంలో రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లు పాల్గొననున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు సహా అనేక అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
పల్నాడులో అరాచకం .. సాక్షి జర్నలిస్ట్‌పై టీడీపీ గూండాల దాడి
పల్నాడు: కారంపూడిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా సాక్షి ప్రతినిధి అశోక్ వర్థన్‌పై దాడి చేశారు. అశోక్ వర్థన్‌పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి దిగారు. కారంపూడి వైస్ ఎంపీపీ ఉప ఎన్నికకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను టీడీపీ గుండాలు అడ్డుకున్నాయి. అయితే టీడీపీ గూండాల దాడిని చిత్రీకరించేందుకు సాక్షి జర్నలిస్ట్ అశోక్‌వర్థన్ కవరేజ్‌కు వెళ్లారు. కవరేజ్‌కు వెళ్లిన సాక్షి ప్రతినిధి అశోక్ వర్థన్‌పై టీడీపీ గూండాలు దాడి చేశాయి. దాడి చేసిన గూండాల్లో పంగులూరి అంజయ్య, చెప్పిడి రాము,గొల్ల సురేష్ యాదవ్,గోరంట్ల నాగేశ్వరరావు, తదితరులు ఉన్నట్లు తేలింది. -
బాబు సర్కార్ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్ అరెస్ట్
గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను దూషించిన రాజు.. సురేష్‌ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడు.నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడు. ఎందుకు వీరంగం సృష్టిస్తున్నావంటూ రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, నందిగామ సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజు తమ కారులపై దాడి చేసి తమ కుటుంబ సభ్యులను దూషించాడని.. నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో నందిగం సురేష్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగం సురేష్‌ని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. -
గురి తప్పని విజయం... భళా ముఖేశ్!
వెంట్రుక వాసిలో పతకాలు చేజారిపోయే పిస్టల్ షూటింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ గుంటూరుకు చెందిన ముఖేశ్ నేలపల్లి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. జూనియర్ పిస్టల్ షూటింగ్లో పతకాలతో భవిష్యత్ తారగా ఎదిగాడు.... గత ఏడాది పెరూలో జరిగిన వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మొత్తం 5 బంగారు, 2 కాంస్య పతకాలు సాధించి ముఖేశ్ రికార్డు సృష్టించాడు. ఈ నెల 17 నుంచి 26 వరకు జర్మనీలోని సుహుల్లో జరగనున్న జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో ముఖేశ్ సాధన చేస్తున్నాడు. 11 ఏళ్ల వయస్సులో స్కూల్ నిర్వహించిన వేసవి శిబిరంలో బాస్కెట్‌బాల్ సాధన కోసం ముఖేశ్ చేరాడు. కోచ్ సూచనతో అనుకోని విధంగా పిస్టల్ షూటింగ్ శిక్షణలో అన్న హితేశ్‌తో కలిసి సాధన ప్రారంభించాడు. కొద్ది రోజులకే ముఖేశ్ పతకాలు సాధించడంతో తండ్రి శ్రీనివాసరావు 2018లో స్థానికంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ కోచ్, ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ చీఫ్ కోచ్ నగిశెట్టి సుబ్రమణ్యం దగ్గర శిక్షణలో చేర్పించారు. తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు ముఖేశ్పుణేకు మకాం మార్చాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ పుణేలో నిర్వహిస్తున్న ‘గన్ ఫర్ గ్లోరీ’ షూటింగ్ అకాడమీలో చేరాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్‌లో విభాగాలలో ముఖేశ్ నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో 80కుపైగా పతకాలు సాధించిన ముఖేష్ భారత రైఫిల్ షూటింగ్ శిబిరానికి ఎంపికయ్యాడు.ఒలింపిక్స్ లక్ష్యంభారత జట్టు తరపున సీనియర్ విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. జర్మనీలో జరగనున్న పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడుతున్నాను. పతకాలతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. – ముఖేశ్– మురమళ్ళశ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరు -
తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష
సాక్షి,పల్నాడు: మూడు హత్య కేసుల్లో నిందితుడైన తన్నీరు అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2023 మే 5న నరసరావుపేటలో సలీమా అనే మహిళను తన్నీరు అంకమ్మరావు దారుణంగా హత్య చేశాడు.అయితే ఈ హత్యపై గురువారం నరసరావుపేట కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం,అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట కోర్టు చరిత్రలో తొలిసారి న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ప్రస్తుతం మరో హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అంకమ్మరావు..నరసరావుపేటలో మూడు హత్యలు చేశాడు. జులాయిగా తిరుగుతూ మూడు హత్యలకి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అంకమ్మరావుకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. -
గుంటూరులోని విద్యా భవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయ సంఘాలు
-
వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధి కల్పనపై అక్రమ కేసు
-
సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్!
తెనాలి: చల్లా లక్ష్మీనారాయణ– ‘ ఏదో ఒక రోజు పెద్ద చెఫ్‌ని అవుతాను’ అంటూ చిన్నప్పుడు అన్నప్పుడు, అందరూ నవ్వుకున్నారు. అయితే, అమ్మను తొలి గురువుగా తీసుకున్న ఆయన, పాకశాస్త్రంలో అపూర్వ శిఖరాలను అధిరోహించారు. ఆధునిక నలభీమునిగా, ప్రత్యేకమైన రెసిపీల సృష్టిలో తన ప్రతిభను చాటారు. ఆయన వంటల ప్రయాణం.. ‘శ్రమ’కు ‘రుచి’ని మేళవించి, ఆహారప్రియులను ‘ఔరా..’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఆయన ప్రస్థానం, నిజంగా ఈ రంగంలో యువతకు ప్రేరణ. ప్రస్తుతం వీసా రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చిన ఆయన స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం మీ కోసం.. అదృష్టానికి తొలి మెట్లు.. లక్ష్మీనారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలానికి చెందిన అంగలకుదురు. తెనాలిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ఐఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పొందారు. ఒక హోటల్లో ఉద్యోగంతోపాటు హోటల్ మేనేజ్మెంట్, టూరిజంలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. ఆపై సింగపూర్‌లో ఫుడ్ హైజీన్ కోర్సు అభ్యసించి, ముంబయిలోని బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ద్వారా హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీలో దూరవిద్య ద్వారా కోర్సు పూర్తి చేశారు. 1997లో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రముఖ హోటళ్లలో చెఫ్‌గా సేవలందించారు. 2007–09 కాలంలో సింగపూర్‌లోని నయూమి హోటల్స్‌లో చెఫ్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం మైసూరు, కూర్గ్ ప్రాంతాల్లోని రిసార్ట్స్, తిరుపతిలోని ఐసీటీ హోటల్లో సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు కాకినాడ, చెన్నై నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో పనిచేశారు. శ్రమతోపాటు ప్రతిభకు గుర్తింపుగా అదృష్టం తలుపు తట్టినట్లు 2023లో అమెరికా నుంచి ఆహ్వానం లభించింది. అక్కడి కాలిఫోర్నియాలో ప్రసిద్ధ హోటల్లో చెఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఎండినా... నిమ్మ అమ్మే! వరించిన అవార్డులు సింగపూర్‌లోని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెఫ్స్ సొసైటీ, సౌత్ ఇండియన్ చెఫ్స్ అసోసియేషన్ (ఎస్ఐసీఏ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కలినరీ అసోసియేషన్ (ఐఎఫ్‌సీఏ), అమెరికన్ కలినరీ ఫెడరేషన్ (ఏసీఎఫ్) సభ్యత్వాలు లక్ష్మీనారాయణకు లభించాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ తిరుపతి, విశాఖపట్నం వేదికగా నిర్వహించిన వంటకాల పోటీలతో పాటు అనేక సోలో, గ్రూపు విభాగాల్లో పాల్గొని పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ఎన్నో దేశాల వంటకాల్లో మేటిగా.. పలు దేశాల వంటకాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. దక్షిణ భారతీయ వంటకాలకే పరిమితం కాకుండా థాయ్, ఇటాలియన్, మెక్సికన్ వంటి అంతర్జాతీయ వంటకాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీటిపై పెరిగే మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యేకమైన ‘హనీ చిల్లీ చెస్ట్ నట్స్’ రెసిపీలో లక్ష్మీనారాయణ సిద్ధహస్తులు. ఆయన తయారు చేసే మరో ప్రసిద్ధ వంటకం ‘చిల్లీ తోఫు’ కూడా ఎంతో ఆదరణ పొందింది. నాన్వెజిటేరియన్ వంటకాల విషయంలో, మటన్ కర్రీతో దోసెలా స్ట్రీమ్ చేసి వడ్డించే ప్రత్యేకమైన ‘మటన్ మొప్పాస్’, మంగళూరు శైలిలో ‘ఘీ రోస్ట్ ప్రాన్స్’, ఆంధ్ర ప్రత్యేకత అయిన ‘నాటుకోడి–రాగిముద్ద’, అరుదైన ‘జాక్‌ఫ్రూట్ బిర్యానీ’, మసాలా రుచులతో నిండిన ‘గుంటూరు మటన్ ఫ్రై బిట్ బిర్యానీ’లు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.‘సాఫ్ట్వేర్’ ఒక్కటే మార్గం కాదునేటి యువతకు ‘సాఫ్ట్వేర్ ఉద్యోగం’ ఒక్కటే మార్గం కాదు. హోటల్, టూరిజం వంటి రంగాలలోనూ అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నా వృత్తి విషయానికి వస్తే, ప్రతి దేశం నాకు ఒక కొత్త పాఠం, ప్రతి వంటకం ఒక కొత్త సవాలు. ఇన్నేళ్ల ప్రయాణంలో అనుభవించిన అవమానాలు, ఒంటరితనం, సుదీర్ఘమైన పనిగంటలు– ఇవన్నీ నా ఎదుగుదలకు బలమైన మూల స్తంభాలయ్యాయి. వంటకాలు తయారు చేయడం మాత్రమే కాదు, వాటిలో మనసు కలపాలి. పదార్థాలకు భావాలను మేళవించినప్పుడే వంటకానికి ప్రాణం వస్తుంది. – చల్లా లక్ష్మీనారాయణ -
వాళ్ళ పేర్లు చెబితేనే నిన్ను విడిచిపెడతాం అంటూ... పాలేటి కృష్ణవేణి సంచలన నిజాలు
-
నేడు అల్లూరి వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. అల్లూరి సీతారామరాజుకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శం. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. అడవిబిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శం. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు.… pic.twitter.com/iCLvQgElEG— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025 -
పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై వైఎస్ జగన్ వారితో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. -
భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు. The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025 -
గుంటూరు లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కలకలం
గుంటూరు: లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరు బ్రాడీపేటలోనీ శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్‌లు చేయటం.. అబ్బాయిల్ని తీసుకొని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్ విద్యార్థునులు చెబుతున్నారు. అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.గత ఏడాది కూడా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు.తెలంగాణలోని ఈ ఏడాది మార్చి నెలలో సంగారెడ్డి జిల్లాలోని ఓ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది. హాస్టల్లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్టల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. -
కోకో రైతులు ఆందోళన!
-
ఓటమిపై గుంటూరు YSRCP మేయర్ అభ్యర్థి రియాక్షన్...
-
గోరంట్ల మాధవ్‌కు ఊరట.. బెయిల్ మంజూరు
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. మాధవ్‌తో పాటు ఆయన అనుచరులకు గుంటూరు కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి 20 వేలుతో కూడిన పూచీకత్తు పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే.. ఐటీడీపీ కార్యకర్త అయిన చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించారంటూ నగరంపాలెం పోలీసులు మాధవ్‌ను, ఆయన అనుచరులు ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి రిమాండ్ విధించగా తొలుత రాజమండ్రి జైలుకు తరలించారు. అక్కడి ఆయనకు బెయిల్ లభించలేదు. తాజాగా ఆయన మరో పిటిషన్ వేయగా.. బెయిల్ మంజూరు అయ్యింది. -
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులకు అస్వస్థత
గుంటూరు,సాక్షి: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యం కోసం పీఎస్ఆర్ ఆంజనేయులును హుటాహుటీన జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్‌లో ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్ చేసింది. ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
అది మీ ఖర్మ.. జేఏసీకి YSRCP మద్దతు
-
నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం
తాడేపల్లి,సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (మంగళవారం) అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యచరణపై వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)..వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌బాబు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి..మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రులు షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్‌ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌లను నియమించారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
పెదవడ్లపూడి(మంగళగిరి): ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లిదండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. -
ఆడపిల్లలు తిరిగే చోట వైన్ షాప్ పెడతారా ?
-
వైన్ షాప్ కోసం కోట్లు కమిషన్ ఇచ్చారు.. మహిళలపై ఎక్సైజ్ CI ఫైర్
-
దిక్కున్నచోట చెప్పుకోండి.. మా వెనుక బాబున్నాడు
-
ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు.. బయటకు రావాలంటే భయమేస్తుంది
-
గుంటూరులో మహిళల ధర్నా
సాక్షి, గుంటూరు: నగరంలోని మణి హోటల్ సెంటర్లో లక్కీ వైన్స్‌ను తొలగించాలంటూ మహిళలు, స్థానికులు ఆందోళనకు దిగారు. మద్యం షాపు దగ్గరకు వచ్చిన ఎక్సైజ్ సీఐ లతను మహిళలు నిలదీశారు. వైన్ షాపు కారణంగా మద్యం తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సీఐ లత దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ధర్నా చేస్తున్న స్థానికులపై ఎక్సైజ్ సీఐ లత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి మద్యం షాపును తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూల్స్ ప్రకారమే ఇక్కడ షాప్ కేటాయించామని సీఐ తెలిపారు. వైన్స్ దగ్గర తాగుబోతులు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా సెక్యూరిటీ కల్పిస్తామంటూ సీఐ లత చెప్పుకొచ్చారు. దీంతో సీఐ లతపై మహిళలు ఆగ్రహించారు. దీంతో సీఐ, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్నా చేస్తున్న స్థానికులతో వైన్స్ యాజమాన్యం కూడా గొడవకు దిగింది.ఇక్కడ నుంచి వైన్స్ తీసే ప్రసక్తే లేదంటూ మహిళలపై వైన్స్ యజమాని చిందులు తొక్కారు. ప్రభుత్వమే మాకు మద్యం అమ్ముకోమని లైసెన్స్ ఇచ్చిందని.. మీరేంటి చేసేదంటూ స్థానికులపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఐదేళ్లపాటు మమ్మల్ని మీరేం చేయలేరంటూ ధర్నా చేస్తున్న వారిపై చిందులేశారు. -
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు. -
గుంటూరులో రోడ్డెక్కిన మిర్చి రైతులు
-
గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రికత్త.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా గుంటూరులో మిర్చి రైతులు చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో, చంద్రబాబు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనలకు దిగారు. బుధవారం ఉదయమే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు-నరసరావుపేట రోడ్డుపై బైఠాయించిన ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులతోపాటు మిర్చి రైతులు నిరసన చేస్తున్నారు. దీంతో, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మిర్చికి కనీసం 20వేలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పోయడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో, రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి.. రైతుల వద్ద నుంచి మిర్చి బస్తాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసుల ముందే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం, మిర్చిని రోడ్డుపై పోసి ఆందోళన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
2014-19 మధ్య కాలంలో మీరు సంతోషంగా ఉన్నారా.. సంతోషంగా ఉన్నారా?
గుంటూరు,సాక్షి: అంబేద్కర్ జయంతి సభలో సీఎం చంద్రబాబు తడబడ్డారు. 2014-2019లో ప్రజలు ఆనందంగా కూర్చొని నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా? , ఉన్నాయా? అని నొక్కి నొక్కి సభ సాక్షిగా అడిగారు చంద్రబాబు. అది తన హయాం అనే విషయం మర్చిపోయిన చంద్రబాబు.. ఆ సమయంలో ఎవ్వరూ సంతోషంగా లేరనే విషయాన్ని ఆయన తన నోటి వెంటే పలికారు.రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. నా చరిత్రలో ఎప్పుడు చూడని రాజకీయం 2014-2019లో చూశానని అన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అప్రమత్తమయ్యారు. చంద్రబాబు వద్దకు వచ్చి ఆయన చెవిలో ఏదో గుసగుసలాడారు. అసలు విషయాన్ని ఆయన చెవిలో ఊదారు. వెంటనే తేరుకున్న చంద్రబాబు సారీ సారీ అంటూ తడబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఈ ఘటనతో బాబు.. తన పరిపాలనలో జనం సంతోషంగా లేరన్న విషయం తనే ఒప్పేసుకున్నట్లయింది. కొన్నిసార్లు మనం చేసిన తప్పుల్ని ఎంత దాచుదామనుకున్నా అది ఏదొక సమయంలో నోరూ జారుతూనే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది అని జనం ఆ నోట ఈ నోట అనేసుకుంటున్నారనుకోండి. -
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి మరో 11మంది పోలీసులు బలి
గుంటూరు,సాక్షి: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి మరింత మంది పోలీసులు బలయ్యారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసినా సరే.. ముసుగు వేయలేదంటూ పోలీసులుపై కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ, ఎల్లో మీడియా ఆదేశాలతో పదకొండు మంది పోలీసులపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను మీడియా ముందు ముసుగు వేసి చూపించినందుకు పోలీస్ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. శనివారం ఎస్పీ ప్రెస్ మీట్ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ప్రెస్ మీట్లో హాజరు పరచేందుకు పోలీసులు ప్రయత్నించారు.అయితే, నేను ముసుగు వేసుకొను అని గోరంట్ల మాధవ్ పోలీసులు తేల్చి చెప్పారు. గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ఎందుకు ప్రెస్ మీట్ ముందు హాజరు పరచలేదని ఎస్పీని ఎల్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్‌కు ముసుగు వేసి ప్రెస్మీట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనందుకు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. ఆకస్మితంగా బదిలీ చేసి డీజీపీ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డీఎస్పీతో పాటు మరో పదిమంది పోలీసుల పైన వేటు పడింది. అరండల్ పేట సీఐ వీరాస్వామితో పాటు ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశించింది. -
‘చేబ్రోలు కిరణ్ కుమార్‌ను పెంచి పోషించింది ఐటీడీపీనే’
గుంటూరు,సాక్షి: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా చేబ్రోల్ కిరణ్ కుమార్ వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కిరణ్ కుమార్‌ను ఐటీడీపీ పోషిస్తోంది. ఐటీడీపీని లోకేష్ పోషిస్తున్నాడని దుయ్యబట్టారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కలిసేందుకు అంబటి రాంబాబు శుక్రవారం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్ రాత్రి ఎలా ట్రీట్ చేశారో అని తెలుసుకునేందుకు వచ్చా. మాధవ్‌ను నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని చెప్పారు. కోర్టు ముందు ప్రవేశ పెట్టేటప్పుడు కలిసేందుకు అవకాశం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు తెలిపారు.‘‘ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను లోకేష్ పెంచి పోషించారని.. వైఎస్సార్సీపీ నేతలపై కిరణ్‌తో అనుచిత వ్యాఖ్యలు చేయించారు. చేబ్రోలు కిరణ్ కుమార్ ఏడాది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అప్పటినుంచి అతన్ని అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. కిరణ్ కుమార్‌ను ఐటీడీపీ పోషిస్తోంది. ఐటీడీపీని లోకేష్ పోషిస్తున్నాడని ధ్వజమెత్తారు. -
గోరంట్ల మాధవ్ ఎక్కడ?.. పోలీసులు చెప్పడం లేదు: అంబటి
సాక్షి, గుంటూరు: గోరంట్ల మాధవ్‌ను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పడం లేదని.. ఒక వేళ అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాత్రి.. గోరంట్ల మాధవ్‌తో మాట్లాడేందుకు నగరపాలెం పీఎస్‌కు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి వెళ్లారు. కానీ గోరంట్ల మాధవ్‌ను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పకపోవడంతో అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను లోకేష్ పెంచి పోషించారని.. వైఎస్సార్సీపీ నేతలపై కిరణ్‌తో అనుచిత వ్యాఖ్యలు చేయించారని అంబటి రాంబాబు మండిపడ్డారు. చేబ్రోలు కిరణ్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోందని.. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం కిరణ్‌ను అరెస్ట్ చేయించి.. చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని అంబటి మండిపడ్డారు. -
నేడు భగవాన్ మహవీర్ జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు భగవాన్ మహావీర్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు.ఈ క్రమంలో వైఎస్ జగన ట్విట్టర్ వేదికగా..‘జైనుల ఆరాధ్య దైవం, మహావీరుడు ప్రభోదించిన పంచమహా వ్రతాలు, నైతిక జీవనానికి మార్గదర్శకాలు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జైనుల ఆరాధ్య దైవం, మహావీరుడు ప్రభోదించిన పంచమహా వ్రతాలు, నైతిక జీవనానికి మార్గదర్శకాలు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు#MahavirJayanti pic.twitter.com/h4H0IhH9Ay— YS Jagan Mohan Reddy (@ysjagan) April 10, 2025 ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మనోజ్ కొఠారి, జైన్ సమాజ్ మాజీ అధ్యక్షుడు సుక్రాజీ ఫౌలాముతా, జైన్ సమాజ్ సెక్రటరీ పన్నాలాల్ జీ, జైన్ సమాజ్ కమిటీ మెంబర్ విక్రమ్ బండారి, జైన్ సమాజ్ మాజీ ఉపాధ్యక్షుడు మోహన్‌లాల్ కొఠారి పాల్గొన్నారు. 10.04.2025తాడేపల్లివైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ @ysjaganఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ… pic.twitter.com/VCgMzJFxJc— YSR Congress Party (@YSRCParty) April 10, 2025 -
పసివాడి ప్రాణం తీసిన వీధి కుక్క
-
మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
తెనాలి: స్థానిక అయితానగర్‌కు చెందిన రౌడీ షీటర్ లడ్డూ, గతంలో తనకు సన్నిహితంగా ఉన్న మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపెట్టగా రిమాండ్‌కు ఆదేశించారు. సముద్రాల పవన్‌కుమార్ అలియాస్ లడ్డూ.. పట్టణంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ఎన్నారైపై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతడిని పట్టణ బహిష్కరణ చేశారు. తెనాలి రావొద్దని ఆదేశించారు.అయినా రహస్యంగా పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నాడు. గత అక్టోబరులో బహిరంగంగానే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ సంబరానికి కూటమి నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత మూడురోజులకే అంటే అదే నెల 28వ తేదీ రాత్రి డెకరేషన్ పనులు చేస్తుండే నాజరుపేటకు చెందిన కాకుమాను ఇంద్రజిత్ అనే వ్యక్తిపై అయితానగర్ సెంటర్లోనే లడ్డూ దాడిచేశాడు. వర్కర్‌ను స్కూటర్‌పై ఇంటిదగ్గర దించి తిరిగి వెళుతున్న ఇంద్రజిత్‌పై అకారణంగా లడ్డూ దాడిచేశాడు. అతడి స్కూటర్ తీసుకెళ్లి తగులబెట్టాడు. కూటమి నేతలతో ఉన్న బంధం కారణంగానే లడ్డూ ఇంతకు తెగించాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు వార్తల్లొకొచ్చాడు. దూరంగా ఉంచిందని.. తెనాలి సమీపంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళతో లడ్డూకు పాత పరిచయం ఉంది. ఆమె విజయవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా ఆమె లడ్డూను దూరంగా ఉంచింది. ఆగ్రహం చెందిన లడ్డూ శనివారం తనకోసం విజయవాడ వెళ్లి, తనతో గొడవ పెట్టుకున్నాడు. ఆమెను అనుసరించి తెనాలి వచ్చి, తర్వాత ఆమె నివసించే గ్రామానికి వెళ్లాడు. ఆమెను ఊరి వెలుపలికి రమ్మని బెదిరించాడు. తన దగ్గరకు వచ్చిన మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఫిర్యాదుతో రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తర్వాత అరెస్టుచేసి, స్థానిక ప్రైవేటు వైద్యశాలలో పరీక్షలు చేయించారు. ఆదివారం రాత్రి మేజి్రస్టేటు ముందు హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు.రూరల్ ఎస్ఐ ప్రతాప్‌కుమార్ కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
గుంటూరులో దారుణం.. కుక్క దాడిలో బాలుడు మృతి
సాక్షి, గుంటూరు: నగరంలోని స్వర్ణ భారతి నగర్లో దారుణం జరిగింది. వీధి కుక్క దాడిలో నాలుగేళ్ల ఐజాక్ అనే బాలుడు మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని గుంటూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. బాలుడు మృతితో తండ్రి నాగరాజు, తల్లి రాణి రోదిస్తున్నారు. బాలుడి తల్లి.. ఏడ్చి ఏడ్చి ఆసుపత్రిలో సొమ్ముసిల్లి పడిపోయారు.వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. శునకాల దాడితో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై ఇటీవల కుక్కల దాడులు పెరిగిపోయాయి. ఎటు చూసినా కుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. ఏ సమయంలో చూసిన రోడ్లపైన కుక్కలు గుంపులుగా సంచరిస్తూనే ఉన్నాయి. కుక్కల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
‘బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తి వైఎస్ జగన్’
సాక్షి, తాడేపల్లి: భారతదేశం గర్వించదగిన మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రశంసించారు వైఎస్సార్సీపీ నాయకులు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగాయి. ఈ వేడుకల్లో మాజీమంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు అరుణ్ కుమార్, రమేష్ యాదవ్ , మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘అంటరానితనం , అస్పృశ్యతను ఎదుర్కొని స్వాతంత్ర పోరాటంలో బాబు జగజ్జీవన్ రామ్ పాల్గొన్నారు. ఆయన ఆశయాలు దేశమంతా కొనసాగాలి. ఆయన ఆలోచనలను భుజాన వేసుకున్న నాయకుడు వైఎస్ జగన్. అధికారం వస్తే బడుగు బలహీన వర్గాలను పైకి ఎలా తీసుకురావాలో చేసి చూపిన వ్యక్తి జగన్. గొప్ప ఆలోచనతో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఏర్పాటు చేశారు. కానీ, ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద కరెంట్ లేని పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ విగ్రహానికి దండేసే పరిస్థితి లేదు. ప్రైవేట్ వ్యక్తులతో వ్యాపారం చేయిస్తున్నారు. బాబు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆలోచనలకు తిలోదకాలిచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దళితులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎంతో మంది దళితులు ఊరు వదిలి వెళ్లిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా. వైఎస్ జగన్ వెంట మనమంతా నడిస్తేనే భావితరాల ఆశయాలు నెరవేరతాయి. మా పార్టీ నాయకులను అన్ని రోజులు జైళ్లలో పెట్టాల్సిన అవసరం ఏముంది?. టీడీపీ నాయకులు తప్పులు చేయడం లేదా?.మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ..‘బాబు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తి వైఎస్ జగన్. గత ఐదేళ్లు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జగన్ కృషి చేశారు. ఐదేళ్ల పాలనలో ఎక్కడా రక్తం చిందిన పరిస్థితి లేదు. రాష్ట్రంలో కూటమి పది నెలల పాలనలో విధ్వంసం జరిగింది. ఎస్పీ, బీసీ, మైనార్టీ, ఎస్టీలపై అక్రమ కేసులు పెట్టారు. దాడులుఉ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోంది.ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ..‘బాబు జగజ్జీవన్ రామ్ రాజకీయంగా ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించారు. ఆ స్థాయిలో దళితులకు అన్ని పదవులు ఇచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. దళితులను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌కే చెల్లింది. దళితులను ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగేలా చేశారు. ఆకాశమే హద్దులా దళితులకు జగన్ అవకాశం కల్పించారు. జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్. అందుకు ఉదాహరణే విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. ఈ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహానికి కనీసం దండ కూడా వేయలేని పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం దళితుల పట్ల చూపుతున్న వివక్షకు చరమగీతం పాడాలి. మాజీ ఎమ్మెల్యే, టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ‘దళితులు, బలహీనవర్గాలు సముచితమైన స్థానం సాధించేందుకు బాబు జగజ్జీవన్ రామ్ కృషి చేశారు. జగజ్జీవన్ రామ్ అడుగుజాడల్లో వైఎస్ జగన్ నడుస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ..‘సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం పాటుపడిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్. చరిత్ర ఉన్నంత వరకూ ఈ సమాజం బాబు జగజ్జీవన్ రామ్ గుర్తుండిపోతారు. జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం జగన్ పనిచేశారు అని అన్నారు. -
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారురంజాన్ పండుగ సందర్బంగా వైఎస్ జగన్..‘ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్’ అని అన్నారు.భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2025 -
గుంటూరులో దారుణం.. రెండో భార్య చిత్ర హింసలకు బాలుడు మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మొదటి భార్య సంతానమైన కవల పిల్లలను రెండో భార్య తీవ్రంగా హింసించింది. అంతటితో ఆగకుండా పండుగ వేళ ఆరేళ్ల బాబును గోడకేసి కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో బాలుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలంలోని గొల్లపాలెంకు చెందిన సాగర్ అనే వ్యక్తికి గతంలో వివాహం జరిగింది. సాగర్‌కు ముగ్గురు సంతానం. ముగ్గురిలో కార్తీక్, ఆకాష్ కవల పిల్లలు. కొద్ది రోజుల క్రితం మొదటి భార్య చనిపోవడంతో ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలను లక్ష్మి తరచూ చిత్రహింసలకు గురిచేస్తోంది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని వారిని ప్రతీరోజు కొడుతూనే ఉండేది. ఈ క్రమంలో ఆదివారం దారుణంగా హింసిస్తూ చిన్న కుమారుడు కార్తీక్‌ను గోడకేసి కొట్టింది. దీంతో ఆ బాలుడు తల పగిలి అక్కడికక్కడేచనిపోయాడు. పెద్ద కుమారుడు ఆకాశ్ శరీరంపై రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. దీంతో, ఆకాశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా బాలుడి మరణంతో లక్ష్మి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు.. లక్ష్మిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
గాల్లో తేలిపోవచ్చు.. ఇట్టే వాలిపోవచ్చు
రోడ్డుపై ఆటో లేదా ట్యాక్సీ ఎక్కినట్టుగానే.. ఎయిర్ ట్యాక్సీ ఎక్కి గాలిలో ప్రయాణించే సదుపాయం మనకూ ఆందుబాటులోకి రాబోతోంది. చైనా, దుబాయ్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎయిర్ ట్యాక్సీలు భవిష్యత్‌లో ఏపీలోనూ సందడి చేయనున్నాయి. గుంటూరుకు చెందిన ఓ యువకుడు వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు. మోటార్లు మినహా పరికరాలన్నీ మేడిన్ ఆంధ్రా కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు, నగరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని గుంటూరుకు చెందిన ఓ యువకుడు మన దేశంలోనూ సాకారం చేసేందుకు కృషి చేస్తున్నారు. ‘మాగ్నమ్ వింగ్స్’ కంపెనీ పేరిట కంపెనీ నెలకొల్పి ఎయిర్ ట్యాక్సీల తయారీ ప్రారంభించారు. తొలి ఎయిర్ ట్యాక్సీ సంస్థగా.. ఏపీలో ప్రప్రథమంగా మాగ్నమ్ వింగ్స్ తొలి ఎయిర్ ట్యాక్సీ సంస్థగా ఆవిర్భవించింది. గుంటూరులోని ఏటుకూరు రోడ్డు కేంద్రంగా 2018లో చావా అభిరామ్ దీనిని ప్రారంభించారు. యునైటెడ్ స్టేట్స్‌లోని రోబోటిక్స్ యూనివర్సిటీ ఆఫ్ యూటాలో ఉన్నత విద్యను అభ్యసించిన అభిరామ్.. అక్కడే మంచి ఉద్యోగాలు వచ్చినా స్థిరపడకుండా సొంత గడ్డపై పరిశ్రమ స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మాగ్నమ్ వింగ్స్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలి ఎయిర్ ట్యాక్సీ ఏపీలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయాలు, నగరాలకు వేగవంతమైన కనెక్షన్, అత్యవసర వైద్య సేవల కోసం వినియోగించేందుకు అధునాతన పరికరాలు సిద్ధం చేస్తున్నారు. రెండు, మూడు సీట్లతో.. పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా ఎయిర్ ట్యాక్సీని రూపొందించి∙మాగ్నమ్ వింగ్స్ విజయవంతంగా ప్రయోగించింది. అయితే, పైలట్ లేని వాటిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతించదు కాబట్టి.. పైలట్ కూడా ఉండేలా రెండు లేదా మూడు సీట్లతో ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నారు. రెండు సీట్లతో ఒక ఎయిర్ ట్యాక్సీని రూపొందించి వీ–2 అని పేరు పెట్టారు. దీని ప్రయోగం విజయవంతం కావడంతో రెండో వెర్షన్ తయారీలో నిమగ్నమయ్యారు. మూడు సీట్లతో కూడిన ఎక్స్–4 అనే మోడల్‌ను మరో నెల రోజుల్లో పరిశీలించనున్నారు. తక్కువ ఖర్చుతోనే ప్రయాణం వీ–2 రకం వెయ్యి అడుగుల ఎత్తులో గరిష్టంగా 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఎక్స్–4 ఎయిర్ ట్యాక్సీ 300 కిలోమీటర్ల దూరాన్ని 20 వేల అడుగుల ఎత్తులో 300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దూర ప్రయాణాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మార్కెట్లోకి వచ్చేసరికి వీ–2 మోడల్ ధర రూ.2 కోట్లు, ఎక్స్–4 రకం రూ.8 కోట్లు ఉండొచ్చని అభిరామ్ చెప్పారు. క్యాబ్ ఖర్చుతోనే ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణం అందుబాటులోకి తీసుకు రావాలనేది తన లక్ష్యమని ఆయన తెలిపారు. తమ వాహనాలు బ్యాటరీ సహాయంతోనే నడుస్తాయని, ఆకాశ మార్గంలో దూరం తక్కువగా ఉండటం వల్ల నిర్వహణ ఖర్చు సైతం పెద్దగా ఉండదని వివరించారు. అనుమతులే తరువాయి మనదేశంలో బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో సైతం ఎయిర్ ట్యాక్సీలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఎయిర్ ట్యాక్సీ పాలసీ ఇంకా ముసాయిదా (డ్రాఫ్టింగ్) దశలోనే ఉంది. విధి విధానాలు అందుబాటులోకి వస్తే అనుమతుల ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చు. మాగ్నమ్ వింగ్స్ సంస్థ ద్వారా ఎయిర్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా కావాలనుకున్న వారికి వాటిని విక్రయిస్తామని మాగ్నమ్ వింగ్స్ సీఈవో చావా అభిరామ్ చెప్పారు. అనుమతులు లభించిన వెంటనే విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో విమానాశ్రయ కనెక్షన్, అత్యవసర వైద్య సేవలు ప్రారంభిస్తామన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఈ సేవలను విస్తరించేందుకు యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా.. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మా ఎయిర్ ట్యాక్సీలు కేవలం ప్రయాణాల కోసం మాత్రమే కాదు. అత్యవసర వైద్య సేవలు, వైద్యులు, రోగుల రవాణా, మెడికల్ సపోర్ట్ డెలివరీ వంటి సేవల ద్వారా వేలాది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. భద్రత మా తొలి ప్రాధాన్యత. సింగిల్, డబుల్, త్రిబుల్, ఫైవ్ సీటర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. వైమానిక విప్లవానికి నాంది పలికేందుకు పాటుపడుతున్నాం. – చావా అభిరామ్, సీఈవో, మాగ్నమ్ వింగ్స్ ప్రయోజనాలివీ..» కారుతో పోలిస్తే 70% తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేయగలదు. » రోడ్డు ప్రయాణం సుమారు 100 కిలోమీటర్లు ఉంటే.. ఎయిర్ ట్యాక్సీ 50 కిలోమీటర్లలోపే గమ్యాన్ని చేరుకుంటుంది. » నగరాల మధ్య తక్కువ దూరంలోనే ప్రయాణించగలదు. 40 కి.మీ. పరిధిలోని ప్రయాణాలను కేవలం 10–15 నిమిషాల్లో పూర్తి చేయగలదు. » ప్రయాణ చార్జీలు ఓలా, ఉబర్ క్యాబ్ ధరలకు సమానంగా ఉండేలా రూపొందించబడింది. » కిలోమీటరుకు సుమారు రూ.50 చార్జీ అయ్యే అవకాశం. » పర్యావరణహితంగా పూర్తిగా ఎలక్ట్రిక్ టెక్నాలజీతో నడిచే ఇవి కార్బన్ ఎమిషన్ లేకుండా శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. » అత్యున్నత భద్రతా ప్రమాణాలు, బహుళ రిడండెన్సీ వ్యవస్థలు, అత్యాధునిక ఆటోనమస్ ఫ్లైట్ మోడ్, మల్టీ–రోటర్ టెక్నాలజీతో భద్రతను మరింత మాగ్నమ్ వింగ్స్ మెరుగుపరిచింది. » ఎమర్జెన్సీ సేఫ్టీ ఫీచర్లు, సేఫ్ బ్యాటరీ బ్యాకప్, ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సిస్టం, ప్రయాణికుల రక్షణ కోసం అధునాతన సెన్సార్ నెట్వర్క్ అందుబాటులో ఉంటుంది. » అత్యంత అత్యవసర వైద్యసేవల కోసం ఎయిర్ అంబులెన్స్‌లుగా కూడా ఎయిర్ ట్యాక్సీలు ఉపయోగపడతాయి.» యాక్సిడెంట్, గుండెపోటు, ఇతర అత్యవసర చికిత్సల కోసం వైద్యులను తక్కువ సమయంలో ఆస్పత్రులకు చేర్చేందుకు ఉపయోగపడతాయి. » మెడికల్ సపోర్ట్, అత్యవసర ఔషధాల డెలివరీ, బ్లడ్ బ్యాగ్స్, ఎంతో కీలకమైన అవయవ మార్పిడి కోసం అవసరమైన సపోర్టింగ్ సామగ్రిని ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఇతర దూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వేగంగా పంపించేందుకు సాయం చేస్తాయి. -
తిరుపతమ్మని ఎవరు చంపి ఉండొచ్చు?
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్‌కు వచ్చే జంక్షన్లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్‌ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్‌స్కా్వడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్దలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్‌బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్‌కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎవరు చంపి ఉండొచ్చు? జెస్సీ, నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదలలో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సి, నజీరా లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి వున్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది రావడంతో లక్ష్మీ తిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనాథలుగా పిల్లలు లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని రోధించారు. పిల్లలను ప్రభుత్వం సంరక్షించాలని విన్నవించారు.హతురాలు పామర్రు వాసి.. తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం జరిగిన హత్యాచారం కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీ‹Ùకుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీ‹Ùకుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీంతోపాటు విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పామర్రు స్వగ్రామం.. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మీ తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త అయిన నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని ఆమెకు చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్‌జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్‌జెండర్ నజీరాతోనూ తిరుపతమ్మకు పరిచయం అయింది. వీరిద్వారా తిరుపతమ్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్‌కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడినీ అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది.వీడియోలు, రీల్స్.. హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ విస్తృతంగా జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీ తిరుపతమ్మ, మరికొంతమంది మహిళలు రీల్స్, ఇంస్టాగ్రామ్ లో పాటలు పాడుతూ సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. -
ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి విడుదల
గుంటూరు, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ దక్కడంతో.. గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు. కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారని ఆయా పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కూటమి ప్రభుత్వ ఆదేశాలతో.. వివిధ పోలీస్ స్టేషన్లకు.. కోర్టులకు.. జైళ్లకు.. తిప్పుతూ ఇబ్బంది పెట్టారు.వివిధ జిల్లాల్లో కేసుల నుంచి ఊరట లభించిందని అనుకునేలోపు.. అనూహ్యంగా సీఐడీ కేసు తెర మీదకు వచ్చింది. అయితే ఈ కేసులోనూ ఆయన నిన్న(శుక్రవారం మార్చి 21) ఊరట దక్కింది. సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే..జిల్లా జైలుకు చేరిన రిలిజింగ్ ఆర్డర్స్ చేరడం ఆలస్యమైంది. ష్యూరిటీ సమర్పణకు నిన్న సమయం లేకపోవడం.. ప్రక్రియలన్నీ ఈ ఉదయాన్నే పూర్తవటంతో.. రిలీజ్ ఆర్డర్స్ ఆలస్యమైంది. మరోవైపు కోర్టుకు చేరుకున్న పోసాని న్యాయవాదులు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్సీఐడీ పెట్టిన కేసు.. బెయిల్ మంజూరు -
డీలిమిటేషన్‌పై ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు. ‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.. .. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైఎస్ జగన్ లేఖలో కోరారు. 👉పూర్తి లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండిమరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రంలోని బీజేపీకి తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మధ్య రాజకీయ సమరం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 22న) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు. -
నేడు గుంటూరు జైలు నుంచి విడుదల కానున్న పోసాని కృష్ణమురళి
-
నేడు గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల
సాక్షి, గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నేడు గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు జిల్లా జైలుకు రిలిజింగ్ ఆర్డర్స్ చేరాయి. వాస్తవానికి నిన్ననే పోసానికి సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ష్యూరిటీ సమర్పణకు నిన్న సమయం లేకపోవడంతో ఆయన విడుదల కావడం ఆలస్యమైంది. తాజాగా ప్రక్రియలన్నీ పూర్తవటంతో జిల్లా జైలుకు విడుదల ఆర్డర్ వచ్చింది.కూటమి సర్కార్.. పోసానిపై అక్రమ కేసులు బనాయించిన విషయం తెలిసిందే. కక్ష సాధింపుతో పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 18 కేసులు నమోదు చేశారు. పిటీ వారెంట్ పేరుతో పోలీసులు.. ఆయన్ను రాష్ట్రమంతా తిప్పారు. దీంతో, ఆయన కోర్టును ఆశ్రయించగా.. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరైంది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా, బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇక, పోసాని బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా.. న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు..ఏపీ పోలీసులు ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరించింది. -
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
-
పోసానికి బెయిల్ మంజూరు
గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్ ను మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు.. గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ ఫర్ ప్రొహిబిషన్/ఎక్సైజ్ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు.. ఆపై వేధింపులుకాగా, ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ 19 కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. -
‘చంద్రబాబు ప్రపంచానికే తానే దిక్సూచీ అనడం పెద్ద జోక్’
సాక్షి,తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్-2047 ఒక బూటకమని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రపంచానికే తానే దిక్సూజీ అనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం, ప్రపంచంలోనే తాను ఒక విజనరీగా చెప్పుకునేందుకే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ల నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలుశక్తిని పెంచకుండా, రాష్ట్రంలో తన విజన్‌తో సంపదను సృష్టిస్తానంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...శాసనసభలో చంద్రబాబు అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ గురించి మాట్లాడుతూ చేసిన ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేందుకే. చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా ఉండి మూడు విజన్ డాక్యుమెంట్లను ప్రకటించారు. విజన్-2020 అని ఒకసారి, విజన్-2029 అని మరోసారి, తాజాగా విజన్-2047 అని మూడోసారి తన స్వర్ణాంధ్ర లక్ష్యాలను ఆయన చాటుతూనే ఉన్నారు. నిజంగా ఒక లక్ష్యం ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన గతంలో ప్రకటించిన విజన్లలో ఎన్ని సాధించారు? ఎంతమంది ప్రజల జీవితాల్లో ప్రగతిని తీసుకువచ్చారు? రాష్ట్రాన్ని ఎంత ఉన్నత స్థాయికి తెచ్చారో చెప్పాలి. గత రెండు విజన్లలోనూ చంద్రబాబు చేసింది ఏమిటా అని చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడమే. ఇప్పుడు తాజా విజన్‌లో పీ4 ద్వారా ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజల ఆస్తులను కూడా ప్రైవేటువ్యక్తులకు కట్టబెట్టనున్నారు. చివరికి నడిచే రోడ్లను కూడా ప్రైవేటు వారికి అప్పగించి, టోల్ ట్యాక్స్ ద్వారా ప్రజల జేబులు ఖాళీ చేయించబోతున్నారు.విద్య-వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఘనుడుచంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన ఘనమైన విజన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళే పేదల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించాడు. ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. విద్యారంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి పూర్తిగా సహకరించారు. తాను సీఎం కాదు, సీఈఓను అని పిలిపించుకునేందుకే చంద్రబాబు ఇష్టపడ్డారు. అలాగే పనిచేశారు. చివరికి చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ వామపక్షాలు ఆయనకు గొప్ప బిరుదును ఇచ్చాయి. ఎంఎస్ఎంఈ లకు బదులుగా కార్పోరేట్ సంస్థలు వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్మిన నాయకుడు చంద్రబాబు. విజన్ 2020 తరువాత రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాల సంఖ్య దాదాపు 70 శాతం ఉన్నట్లు తేలింది. అంటే ఆయన విజన్ వల్ల ఎక్కడ సంపద పెరిగింది? ప్రజలు సంపన్నులు ఎందుకు కాలేకపోయారు? చంద్రబాబు విజన్ వల్ల పేదరికం పెరిగింది. హైటెక్ సిటీ, చుట్టుపక్కల భూములు ఏ విధంగా ఒక వర్గానికే ఉపయోగపడేలా చంద్రబాబు విధానాలు సహకరించాయంటూ రీసెర్చ్ స్కాలర్లు పుస్తకాలు రాశారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవు.వ్యవసాయం దండగ అనే భావంతోనే పాలనవ్యవసాయం దండగ అనే భావంతోనే చంద్రబాబు పాలన సాగించారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు రెండు కోట్ల మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ అడ్డుకుంటుంటే చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన హయాంలో చెప్పుకునేందుకు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ తీసుకురాలేదు. ఇప్పుడు బనకచర్ల తన ఆలోచనల నుంచే పుట్టిందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గతంలో ఐటీని తానే ప్రమోట్ చేశానని, హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టానంటూ గొప్పలు చెప్పుకున్నారు. తాను లేకపోతే హైదరాబాద్‌కు ఐటీ వచ్చేదేకాదు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. మరి ముంబై, బెంగుళూరు వంటి నగరాలు ఐటీలో మనకన్నా ముందుగానే అభివృద్ధి చెందాయన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు మరిచిపోతుంటారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వల్ల దేశంలో ఎలక్ట్రానిక్ యుగం ప్రారంభమైందని, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఫీజురీయింబర్స్‌మెంట్ వంటి పథకాల వల్ల గ్రామాల్లోంచి కూడా సాంకేతిక విద్యను చదివిన ఐటీ నిపుణులు పుట్టుకు వచ్చారనే వాస్తవాలను చంద్రబాబు అంగీకరించరు. ఆఖరికి కరోనా వల్ల ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం అవకాశం ఇస్తే, దానికి కూడా తన సూచనల వల్లే ఈ విధానంను ఐటీ సంస్థలు పాటించాయని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు.పొలిటికల్ గవర్నెన్స్ చంద్రబాబు విజనా?పాత రాజకీయాలకు కాలం చెల్లింది, నేను కొత్త రాజకీయాలు తయారు చేస్తానంటూ విజన్ 2020లో ప్రకటించారు. అంటే జన్మభూమి కమిటీలను తీసుకురావడం, పొలిటికల్ గవర్నెన్స్‌ను తీసుకురావడమే ఆయన విజనా? స్థానిక సంస్థల్లో ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా, ఫిరాయింపులతో పదవులను కాజేయడమే ఆయన గవర్నెన్స్ లక్ష్యమా? ప్లెయిన్ స్పీచ్ అనే పుస్తకంలో ప్రభుత్వం యంత్రాంగం అవినీతిలో మునిగిపోయింది, బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవన్నీ చంద్రబాబు మరిచిపోయారా? ఇప్పుడు విజన్ 2047 గురించి బాధ్యత లేకుండా మాట్లాడారు. తన తాజా విజన్‌లో ఈ దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి వెడుతుందని పేర్కొన్నారు. ఒక సీఎంగా ఏ రకంగా దేశ జీడీపీ గురించి మాట్లాడుతున్నారు? 2047 నాటికి ప్రతి ఇంటికి 18వేల డాలర్ల ఆదాయం ఉండాలని సూచిస్తున్నారు. అంటే 2047 వరకు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఏం అడగకూడదు. చంద్రబాబును ఆయన హామీల గురించి ప్రశ్నించకూడదు. స్వర్ణాంధ్ర విజన్‌ను విజయవంతం చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి, పారిశ్రామికవేత్తలను కూడా వారే తీసుకురావాలని చంద్రబాబు సూచిస్తున్నారు. అలాంటప్పుడు దావోస్‌కు సీఎంగా ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళడం? ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్ళాలిగా? రాష్ట్రంలో 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను తీసుకువస్తాను, సంపదను సృష్టిస్తానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా 13 శాతం వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నమని చెబితే, తాజాగా చంద్రబాబు 17 శాతం వృద్ధి రేటును సాధిస్తామని ఏ ప్రాతిపాదికన చెబుతున్నారు? ఇప్పటి వరకు అన్నింటిలోనూ లోటు కనిపిస్తోంది. ఇలా అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడతారా? రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ళలో 3.7 శాతం వృద్ధిరేటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌లో 7.23 శాతం వృద్దిరేటు తక్కువగా ఉంది. సేల్స్ టాక్స్‌లో 6.66 శాతం వృద్ధిరేటు తక్కువగా ఉంది. క్యాపిటల్ ఇన్వేస్ట్మెంట్ 50.53 శాతం తగ్గింది. సంపద పెరిగిందని ఎలా చెబుతున్నారు? ప్రపంచానికే చంద్రబాబు దిక్సూచీ అనడం పెద్ద జోక్ప్రపంచానికే తాను దిక్సూచీగా మారతానని విజన్ డాక్యుమెంట్లో ప్రకటించుకోవడం పెద్ద జోక్. గతంలో ఆయన హయాంలోనే 54 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఆయన ఏపీ ఆయిల్ సీడ్స్ ను కూడా ప్రైవేటువారికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, 1.30 లక్షల ఎకరాల ఆర్టీసీ భూములను, వైయస్ జగన్ హయాంలో నిర్మించిన పోర్ట్‌లను కూడా ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అలాగే త్రిభాషా విధానంపైన మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజలు కోరుతున్న అన్ని భాషలను ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళలోకి తీసుకురాలేకపోతున్నారు? -
ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ
సాక్షి,గుంటూరు: సీఐడీ కార్యాలయంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. పోసాని కృష్ణమురళికి సోమవారం కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. న్యాయవాది సమక్షంలోనే పోసానిని విచారించింది. కాగా, సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదామరోవైపు, తనపై నమోదైన కేసులో బెయిల్ కోసం పోసాని కృష్ణమురళి గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా విచారణ నిమిత్తం మరింత సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది. -
ప్రవాస భారతీయ కుటుంబంలో విషాదం
తెనాలి: అమెరికా నార్త్ కెరోలినాలో తుపాను కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. దీంతో తెనాలి అయితానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. తెనాలికి చెందిన బిషప్ గడ్డం థామస్ కుమార్తె షారోన్ నథానియేల్‌కు, అమెరికాకు చెందిన నథానియేల్ లివిస్కాతో 2007లో వివాహమైంది. వారు అమెరికాలోనే ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. ఆదివారం తెల్లవారుజామున అమెరికాలో సంభవించిన తుపానుకు భారీ వృక్షం కూలి వీరి ఇంటిపై పడింది. ప్రమాదంలో ఇల్లు పాక్షికంగా కూలడంతో బెడ్రూమ్లో నిద్రిస్తున్న షారోన్ కుమారులు సాధు జోషయ్య(13), జాషువా అషె్వల్(11) ప్రాణాలు విడిచారు. సమాచారం తెలియగానే షారోన్ తల్లి మేరీగ్రేస్, సోదరుడు సాధు థామస్ అమెరికాకు పయనమయ్యారు. -
పవన్ కల్యాణ్‌పై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని.. అమలు చేయమంటే నిధులు లేవంటూ చెబుతున్నారంటూ సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో సమయంలో చెప్పినట్లు గ్రామంలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాల్సిందేనని నిలదీశారు.‘‘గత ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దళితులు, గిరిజనుల భూములను పెద్దలు కొట్టేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పరిపాలన గాలికి వదిలేశాడు. సనాతన ధర్మం అంటూ కాషాయ బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు. ఇలా తిరగడానికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు?. పవన్ కల్యాణ్‌కి దేవాదాయ శాఖ కేటాయిస్తే బాగుంటుంది. చంద్రబాబు ఆలోచించాలి’’ అంటూ రామకృష్ణ చురకలు అంటించారు.చంద్రబాబుపై సీపీఎం ఫైర్నెల్లూరు: సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛ ఆంధ్రపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. స్వచ్ఛ ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల మాత్రం మురికి కుపాలలో దోమలతో జీవనం సాగిస్తున్నారన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పన్ను, నీటి పన్నులను బలవంతంగా వసూలు చేస్తున్నారు’’ అని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. -
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా
-
‘కూటమి’ వేధింపులు.. గుంటూరు మేయర్ రాజీనామా
సాక్షి, గుంటూరు: గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కూటమి సర్కార్ తనను ఎంతగానో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు పంపా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు కూడా తాళం వేశారు. నెలరోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు మా కార్పొరేటర్లను కొనుగోలు చేశారు. కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరించారు’’ అని మనోహర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ నెల 17 తేదిన స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. స్టాండింగ్ కమిటికి నేనే ఛైర్మన్‌ను. స్టాండింగ్ కమిటీలో ఏం ప్రతిపాదనలు ఉండాలి. ఎక్కడ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అనేది నేను నిర్ణయించాలి. కానీ నాకు తెలియకుండా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు తాళం వేశారు. నేను ఛాంబర్‌కు వెళ్తే అధికారులు డ్రామాలు ఆడుతున్నారు.‘‘గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటినుంచి ఇంత దారుణమైన అవమానం ఏ మేయర్‌కు జరగలేదు. నాపై కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ దయవల్లే నేను మేయర్ అయ్యాను. పీవీకే కూరగాయలు మార్కెట్ పేరు మార్చితే చూస్తూ ఊరుకోం’’ అని మనోహర్ నాయుడు హెచ్చరించారు. -
గుంటూరు జైల్లో పోసానిని కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు
సాక్షి, గుంటూరు: గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు శనివారం కలిశారు. రిమాండ్‌లో ఉన్న పోసానితో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, పోసాని అనారోగ్యంతో ఉన్నారని.. కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.‘‘2016లో నంది అవార్డుల కమిటీలో ఏకపక్షంగా ఉందని మాట్లాడినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 12 కేసులు పెట్టారు. మీడియాతో మాట్లాడితే కేసులు పెడతారా?. మరోసారి ప్రెస్ మీట్ పెడితే మరో 6 కేసులు పెట్టారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్రవ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పి హింసిస్తోంది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోసానిపై పెట్టిన నాలుగు కేసుల్లో 111 సెక్షన్లు పెట్టి బయటికి రానివ్వకుండా కుట్ర చేశారు.’’ అని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.‘‘కోర్టు పోలీసులకు చివాట్లు పెడుతున్న మారటం లేదు. రెడ్ బుక్కు టీడీపీకే కాదు. మాక్కూడా బుక్కులు ఉన్నాయి. మేము కూడా పేర్లు నమోదు చేసుకుంటున్నాం. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కేసులు పెడుతున్న 62 మందిని గుర్తించాం. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని పిటిషన్ల మీద పిటిషన్ల వేశారు. అమ్మో ఇంకేముంది అని హడావుడి చేశారు. అందరివి చంద్రబాబు లాంటి ప్రాణాలే. పోలీసులు ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నారు. కేసులు పెట్టి పోలీసులు వాటి సమాచారాన్ని దాచేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసుని బయటికి తీస్తున్నారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
తాడేపల్లి పీఎస్‌లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని పోలీసులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు వైఎస్సార్సీపీ నేతలు. ఈ మేరకు వైఎస్సార్సీపీ నాయకులు నారాయణమూర్తి, కొమ్మూరు కనకారావులు ఫిర్యాదు చేశారు. -
వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా నేడు ప్రజలంతా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.హోలీ పండుగ సందర్బంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ హోలీ మీ అందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు.#happyholi2025— YS Jagan Mohan Reddy (@ysjagan) March 14, 2025 -
గుంటూరు జైలులో పోసాని కృష్ణమురళికి అంబటి రాంబాబు పరామర్శ
-
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. తనపై బాపట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పోసాని పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. BNS 35(3) సెక్షన్‌ను ఫాలో కావాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా, పోసానిని సీఐడీ పోలీసులు నిన్న (బుధవారం) రాత్రి( గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు.నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు.టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
లోకేశ్ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకే ఇదంతా: పోసాని
సాక్షి, అమరావతి /గుంటూరు లీగల్: తన మీద ఎన్ని కేసులు కట్టారో తనకే తెలియదని, రాష్ట్రమంతా తిప్పుతున్నారని, తాను నిజంగా తప్పు చేస్తే నరికేయండి సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారాయన. పోసానిని సీఐడీ పోలీసులు బుధవారం రాత్రి గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. తన పరిస్థితి చాలా దైన్యంగా ఉందని దయచేసి విడుదల చేయమని వేడుకున్నారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు. నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు. టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. హైకోర్టులో పోసాని పిటిషన్ కొట్టివేత సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పీటీ వారెంట్‌ను అమలు చేసి కర్నూలు నుంచి మంగళగిరి మేజిస్ట్రేట్ వద్దకు పోసానిని తీసుకొస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ చెప్పడంతో.. హైకోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది. పీటీ వారెంట్ అమలైన నేపథ్యంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ పిటిషన్‌ను తోసిపుచి్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఎం చంద్రబాబును పోసాని దూషించారంటూ మంగళగిరికి చెందిన తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
మేజిస్ట్రేట్ ముందు కన్నీరు పెట్టుకున్న పోసాని
సాక్షి, గుంటూరు: పోసాని కృష్ణమురళిని మేజిస్ట్రేట్ ముందు సీఐడీ హాజరుపరిచింది. మేజిస్ట్రేట్ ముందు పోసాని కన్నీరు పెట్టుకున్నారు. మేజిస్ట్రేట్ ముందే న్యాయవాదులతో పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నన్ను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు.. రానన్నా. నాకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయండి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు పెడతారా?. నా మీద ఎని కేసులు పెట్టారో నాకే తెలియదు’’ అంటూ పోసాని వాపోయారు.‘‘నన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ బాపట్ల పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను తెనాలి కోర్టు అనుమతించింది.కాగా, పోసాని కృష్ణమురళిపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై మరో కేసు తెరపైకి తెచ్చారు.పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకుగానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూ ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.. తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. -
ఎల్లప్పుడూ ప్రజల వెంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు(YSRCP Formation Day) బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్.. మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. వైఎస్సార్సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ప్రజల కష్టాల నుంచి వైఎస్సార్సీపీ పుట్టింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోంది. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం.జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే స్థితిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని అన్నారాయన. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన.. ఇవాళ వైఎస్సార్సీపీ చేపట్టిన ఫీజు పోరు గురించి ప్రస్తావించారు. ఈ వేడుకల్లో పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్నారు.ప్రజాభ్యుదయమే పరమావధిగా ఎదుగుతున్న వైఎస్సార్సీపీ(YSRCP).. సవాళ్లనే సోపానాలుగా మార్చుకుంది. ప్రజాసమస్యల పరిష్కారంపై మడమ తిప్పకుండా పోరాటాలు చేస్తోంది. మహానేత వైఎస్సార్ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రాజకీయాల్లో నైతిక విలువలను చాటిచెప్పిన వైఎస్ జగన్(YS Jagan) ‘నేను విన్నాను.. నేను ఉన్నానంటూ’ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. -
AP: జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరు ఆసుపత్రిలో జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి చెందింది. వారం క్రితం వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలోకి చేరిన మహిళ.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా, గుంటూరు జీజీహెచ్‌లో గత నెల.. షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతి చెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత మరణించింది.కాగా, ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. -
పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు : విడదల రజని
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసరావుపేట జైలులో రిమాండ్‌లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు గొంతెత్తే స్వాతంత్రం కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై ఉక్కుపాదంతో అణిచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే తప్పుడు కేసులుతెలుగుదేశం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు బనాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడుగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న రాకేష్ గాంధీపై కావాలనే తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపారు. భాషా అనే వ్యక్తితో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈనెల 6వ తేదీన ఒక కేసు నమోదు చేయించారు. రాకేష్ గాంధీ తన ఇద్దరు మిత్రులు ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి కోటేశ్వర్ లతో కలిసి తనపై దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని, అసభ్య పదజాలంతో దూషించారంటూ భాష ఫిర్యాదు చేశాడు. చుట్టుపక్కల వారు గమనించడంతో తన ఫోన్ లాక్కుని వారు పరారయ్యారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఏకంగా సెక్షన్ 308 కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు పెడితే కోర్టులు చీవాట్లు పెడుతుండటంతో, రాకేష్ గాంధీపై ఈ సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి, దాని ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలురాకేష్ గాంధీ అరెస్ట్ విషయంలో పోలీసులు అల్లిన కట్టుకథ ఇలా ఉంటే.. వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాకేష్ బెదిరించినట్టుగా చెబుతున్న ఆరో తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతడు గుంటూరులో ఇంట్లో ఉన్నాడు. దీనికి సీసీ ఫుటేజీ ఆధారాలున్నాయి. అదే వ్యక్తి అదే సమయంలో చిలుకలూరిపేట కళామందిర్ సెంటర్లో ఎలా ఉంటాడో పోలీసులే చెప్పాలి. చిలకలూరిపేటలో ఉంటే వేధిస్తున్నారనే కారణంతో గత 9 నెలలుగా రాకేష్ గుంటూరులోనే ఉంటున్నాడు. ఘటన జరిగినట్టుగా చెబుతున్న 6వ తేదీతో పాటు అంతకు ముందు రోజు కూడా అతడు గుంటూరులోనే ఉన్నాడు. గుంటూరులో నాతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇదే కేసులో ఉన్న మరో వ్యక్తి ఫణీంద్ర నాగిశెట్టి కూడా ఘటన జరిగిన రోజు, అదే సమయంలో సెలూన్లో హెయిర్ కటింగ్ కోసం వెళ్లాడు. ఇందుకు సీసీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయి. మరో వ్యక్తి దామిశెట్టి కోటేశ్వర్ కూడా ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఆధారాలన్నీ చూస్తే కట్టుకథలు అల్లి వైస్సార్సీపీ శ్రేణులను వేధింపులకు గురిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. కేవలం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతో సీఐ ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలను నిజం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆధారాలను కోర్టు ముందుంచడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మెప్పకోసం పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు ద్వారా పోలీసు వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోంది. -
‘యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’
గుంటూరు: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని పార్టీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈరోజు(ఆదివారం) గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందలు పడుతున్నారు. పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేస్తాం. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు. నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెడికల్ కాలేజ్ లను ప్రభుత్వం రంగం నుండి ప్రవేటు రంగానికి మార్చేసి పప్పు బెల్లాల్లా అమ్ముకునేందుకు సిద్దం మయ్యారు. పెట్టుబడి దారులకు అమ్ముకుంటున్నారు. యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’ అని అంబటి స్పష్టం చేశారు. -
ఆగని ‘కూటమి’ వేధింపులు.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ అరెస్ట్
చిలకలూరిపేట: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. పల్నాడు జిల్లా చిలకలూ రిపేటలోని తూర్పు మాలపల్లెకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్‌గాంధీని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుంటూరులో అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరెస్టు చేస్తారన్న భయంతో రాకేష్‌గాంధీ చిలకలూరిపేటలో నివాసం ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాకేష్‌గాంధీ ఆచూకీ తెలియజేయాలని అతని తండ్రి దొడ్డా దాసును పోలీసులు 4 రోజులపాటు అక్రమంగా నిర్బంధించి వేధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అయినప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన బాషా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్గాంధీపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాకేష్గాంధీపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై చిలకలూరిపేట అర్బన్ సీఐ పి.రమేష్‌ను వివరణ కోరగా, దొడ్డా రాకేష్‌గాంధీని అరెస్టు చేశామన్నారు. రాకేష్‌గాంధీని న్యాయస్థానంలో హాజరుపరిచారు. చిలకలూరిపేట కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. -
ఆగని కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు
-
విప్లవం, ప్రేమ వేరు కాదని చెప్పిన విప్లవ ప్రేమికురాలు!
ఉమ్మడి గుంటూరు జిల్లా క్రైస్తవ మతానికీ, కమ్యూనిస్టు ఉద్యమానికీ పేరు. దళితులు ఈరెండింటిలో రాష్ట్రంలో ఎక్కడా లేనంత పెద్ద సంఖ్యలో చేరడం చరిత్ర. ఒకనాటి తెనాలి తాలూకా, ఇప్పటి కొల్లిపర మండలంలోని దావులూరు ఒక పచ్చటి పల్లెటూరు. కమ్యూనిస్టు ఉద్యమం, క్రైస్తవ మిషనరీలు ఇచ్చిన తోడ్పాటుతో ఆ ఊరిలో ఆడ పిల్లలు, మగ పిల్లలు బాగా చదువులపై శ్రద్ధ పెట్టేవారు. ‘పాలేరు’, ‘భూమికోసం’ వంటి నాటికలు, బుర్రకథలు వారిలో ఉత్సాహాన్ని ప్రోదిచేసేవి. వేము సువార్తమ్మ, నాలాది దయమ్మ, గుమ్మడి సత్యవేదం వంటి వారు మోటూరి ఉదయం వంటి నాయకురాళ్ళ దగ్గర బుర్రకథ నేర్చుకున్నారు. తర్వాత బుర్రకథ పితామహుడిగా పేరుగాంచిన షేక్ నాజర్‌తో కలిసి పనిచేశారు.దావులూరు కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో వేము కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబంలో సుమారు మూడు తరాలవారు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి తమ ఆస్తి పాస్తులను ఉద్యమం కోసం త్యాగం చేశారు. 1934లో పుట్టిన సువార్తమ్మ కమ్యూనిస్టు పార్టీ నాయకులైన అంబటి రాజారావు, దీనమ్మల కుమార్తె. వేము రామసుబ్బయ్యకు మేనత్త కూతురు. వారిది ఆ రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీ పద్ధతి ప్రకారం జరిగిన దండల పెళ్లి. ఆమె పదో తరగతి వరకు చదివింది. తర్వాత హిందీ ‘భాషా ప్రవీణ’ పూర్తి చేసింది. సువార్తమ్మ, రామసుబ్బయ్య అనేక నిర్బంధాలను ఎదుర్కొని రాజ మండ్రి, కడలూరు, సేలంలలో జైలు శిక్ష అనుభవించారు. వారికి ఏడుగురు పిల్లలు. వారిలో ఇద్దరు చిన్న వయసులోనే పోషణ కరవై చనిపోగా ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు మిగిలారు. చదవండి: International women's day 2025 హోమ్ మేకర్‌కు వేతనమేదీ? దళిత ఉద్యమంలో పాల్గొంటూ చిన్న కొడుకు శాంతి చనిపోయాడు. భర్త పార్టీ కోసం పొలం ఇవ్వడం, ఉద్యోగం చెయ్యకుండా, ఇల్లు పట్టకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా పార్టీ పనులపై తిరుగుతున్నా ఆమెకు ఎప్పుడూ కోపం రాలేదు. ఆయన నిబద్ధతను గౌరవించింది. ఉద్యమం విజయవంతమైతే పేదలు, పీడితుల జీవితాలలో వెలుగు వస్తుందని నమ్మిన గొప్ప ప్రజాస్వామికవాది. సువార్తమ్మ దృష్టిలో విప్లవం, ప్రేమ వేరు కాదు. ఈ నెల ఒకటవ తేదీన మృతి చెందిన వేము సువార్తమ్మ గారికి జోహార్లు!– ప్రొ.చల్లపల్లి స్వరూపరాణి; ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు -
కొనసాగుతున్న కూటమి వేధింపులు.. పోసానిపై మరో కేసు నమోదు!
సాక్షి,గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో పోసానిపై మరో కేసు నమోదైంది. నరసరావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళీపై మరో కేసు నమోదైంది. దీంతో ఆదోని త్రీటౌన్ పోలీసులు గుంటూరు జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోసానిని గుంటూరు నుంచి కర్నూలుకు తరలిస్తున్నారు. -
మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రజలందరిపై మహాశివుడి అనుగ్రహం సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలందరిపై మహాశివుడి అనుగ్రహం సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.#Mahashivratri2025— YS Jagan Mohan Reddy (@ysjagan) February 26, 2025 -
‘లోకేష్.. అదే మాట మిర్చి యార్డు ముందు చెప్పగలరా?’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏసీ గదిల్లో కూర్చుని మిర్చి వ్యాపారులు, బ్రోకర్లతో మీటింగ్ పెడితే ఏం లాభం. మిర్చి యార్డ్‌కు వచ్చి మా పరిస్థితి చూసి మా బాధలు వింటే అర్ధమవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన రేటు వల్ల మిర్చి రైతు మరింత కష్టాల్లో పడతాడు. క్వింటా మిర్చి రూ.19,000 నుంచి రూ. 20,000తో ప్రభుత్వం కొనుగోలు చేయాలి’ అనేది మిర్చి రైతుల డిమాండ్.మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..చంద్రబాబు వలనే మిర్చి మద్దతు ధర రూ.11,781 అంటూ రైతులపై ప్రేమను కురిపించే యత్నం చేశారు. ఇదే ఎక్కువ అని, ఇంతకుమించి అనవసరం అన్న రీతిలో లోకేష్ ఏదో బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. దీనిపై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. అదే మాట గుంటూరు మిర్చి యార్డు ముందు చెప్పగలరా? అంటూ సవాల్ చేశారు. ఈ మేరకు అంబటి రాంబాబు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ వేదికగా నారా లోకేష్ కు చాలెంజ్ విసిరారు. చంద్రబాబు వల్లే క్వింట మిర్చి మద్దతు ధర 11,781 రూపాయలు అన్న లోకేష్ అదే మాటగుంటూరు మిర్చి యార్డు ముందు చెప్పగలవా?@naralokesh @ncbn— Ambati Rambabu (@AmbatiRambabu) February 25, 2025 నషాళానికి పొలిటికల్ మిర్చి ‘ఘాటు’ -
గుంటూరు పెదకాకానిలో తీవ్ర విషాదం
గుంటూరు: జిల్లాలోని పెదకాకానిలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో నలుగురు దుర్మరణ చెందారు. గోశాల వద్ద సంపులో పూడిక తీస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుది. ఒక రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. సంపులో పూడిక తీసివేతకు రైతు.. కూలీలను మాట్లాడుకుని ఆ పని చేస్తుండగా ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. -
‘చంద్రబాబు మిర్చి రైతులను పచ్చిమోసం చేస్తున్నారు’
గుంటూరు రాష్ట్రంలో ధరలు పతనమై తీవ్రంగా నష్టపోతున్న మిర్చిరైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు డ్రామాలతో కాలం గడుపుతున్నారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పరిధిలోని మార్క్ ఫైడ్ నుంచి మిర్చి కొనుగోళ్ళు చేయించకుండా, కేంద్రప్రభుత్వం కొనుగోళ్ళు చేయాలని చంద్రబాబు కోరడం అర్థరహితమని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా కూటమి ప్రభుత్వం మద్దతుధరకు కొనుగోలు చేయలేదని, దీనిని బట్టే మిర్చి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం తెట్టతెల్లమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంకా ఆయన ఏమన్నారంటే... రాష్ట్రంలో మిర్చి ధర దారుణంగా పతనమైంది. జనవరిలో హార్టీకల్చర్ విభాగం మిర్చి పంటకు సంబంధించిన నివేదికను ముందుగానే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో మిర్చిరైతులు సంక్షోభంలో ఉన్నారు, పెట్టుబడి వ్యయాలు పెరిగాయి, దిగుబడి తగ్గుతోంది, మిర్చి రేటు కూడా పడిపోతోంది, మార్కెట్ ఇంట్రవెన్షన్ లేకపోతే రైతులు దెబ్బతింటారు అని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించింది. అయినా కూడా సీఎం చంద్రబాబు స్పందించలేదు. చివరికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ గారు మిర్చి రైతుల బాధలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చియార్డ్ కు వెళ్ళడంతో రాష్ట్ర ప్రభుత్వం గత్యంతరం లేని స్థితిలో స్పందించింది. కనీసం ఇప్పటికైనా మిర్చిరైతుల సమస్యను గుర్తించి మద్దతుధరకు కొనుగోళ్ళు చేస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం తరుఫున ఒక్క క్వింటా మిర్చి కూడా కొనుగోలు చేయలేదు. పైగా మిర్చి రైతులను ఆదుకుంటున్నామంటూ సీఎం చంద్రబాబు డ్రామాలు ప్రారంభించారు.నాఫెడ్ ఎప్పుడైనా మిర్చికొనుగోళ్ళు చేసిందా?శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రాసిన లేఖలో గత ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.27వేల వరకు అమ్ముడుపోయింది. నేడు మిర్చిధర దారుణంగా పతనమైంది. వెంటనే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు. అసలు మిర్చి కొనుగోళ్ళకు కేంద్రప్రభుత్వానికి ఏం సంబంధం? నాఫెడ్ ఎప్పుడైనా కొనుగోళ్ళు చేసిందా? మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్ళు చేయించడానికి ఉన్నా కూడా సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒకవేళ కేంద్రం స్పందించి ముందుకు వస్తే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మిర్చీని వారికి విక్రయించండి.వైఎస్సార్సీపీ హయాంలో మార్కెట్ ఇంట్రవెన్షన్2021లో వైఎస్సార్సీపీ హయాంలో మిర్చిరేటు పడిపోయినప్పుడు క్వింటాకు రూ.7వేలు మద్దతుధర ప్రకటించాం. ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారం మిర్చికి కనీసం రూ.14 నుంచి 15వేల రూపాయల వరకు మద్దతుధరను ప్రకటించాల్సి ఉంది. ఆనాడు వైయస్ జగన్ గారు రైతులపక్షన నిలబడి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్ళు చేయించారు. రూ. 65వేల కోట్లను వెచ్చించి ధాన్యంను కొనుగోలు చేశాం. ఇతర పంటలకు సంబంధించి రూ.7800 కోట్లతో కొనుగోలు చేశాం. రూ.3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. కరోనా సమయంలో అరటి, గుమ్మడికాయలను కూడా కొనుగోలు చేశాం. వ్యవసాయరంగంలో వైయస్ జగన్ గారు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉండేలా రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యదోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేష్ చేతుల్లో కీలుబొమ్మల్లా ఐపీఎస్ అధికారులురేటులేక నష్టపోతున్న రైతులను పరామర్శించడానికి వెళ్ళిన మాజీ సీఎం వైయస్ జగన్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు కుంటిసాకులు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను పరామర్శించేందుకు సీఎం, వ్యవసాయ మంత్రులకు ఎన్నికల కోడ్ అడ్డం వస్తే, కనీసం ఎందుకు అధికారులను అయినా పంపించలేదు? రైతుల పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రైతుల పక్షనా వారి బాధను అర్థం చేసుకునేందుకు వైయస్ జగన్ గారు గుంటూరు వెడితే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇదే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తే దానికి సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరైనా దానికి కోడ్ వర్తించదా? రైతుల కోసం వెళ్ళిన వైయస్ జగన్, ఇతర వైయస్ఆర్సీపీ నేతలపైనా కేసులు పెట్టడం కక్షసాధింపు కాదా? భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఒక మాజీ సీఎంకు ఉన్న జెడ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని రైతులను పరామర్శించేందుకు వెళ్ళిన రోజున ఉపసంహరించారు. కుట్రపూరితంగానే భద్రతను తొలగించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. ఇందుకు రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలి. చంద్రబాబు, లోకేష్ చేతుల్లో కీలుబొమ్మలా ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రైతుల కోసం ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి మేం సిద్దంగా ఉన్నాం.’అని అంబటి స్పష్టం చేశారు. -
గుండెల్ని మండిస్తున్న మిర్చి ధర
గత కొన్ని వారాలుగా వివిధ రకాల మిరప ధరలు విపరీతంగా పడిపోవడంతో గుంటూరులోని మిర్చి రైతులు గుండెల్లో మిర్చి మంటతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆక్రందనలు చేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన ‘గుంటూరు మిర్చి యార్డ్’ (Guntur Mirchi yard) ఏటా 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రూ. 10,000 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రప్రభుత్వానికి రూ. 100 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. అయితే, అన్ని మిరప రకాల ధరలు ఇటీవలి వారాల్లో ఒక్కో బస్తాకు రూ. 1,000 నుండి రూ. 4,000 వరకు పడిపోయాయి. కర్నూలు, నంద్యాల, దాచేపల్లి, సత్తెనపల్లి (Sattenapalle) తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కూడా అధిక లాభాలు వస్తాయనే ఆశతో గుంటూరుకు వెళ్లిన రైతులు... ఇప్పుడు నష్టాల బారిన పడుతున్నారు.అధికారిక సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి సాగు 1.94 లక్షల హెక్టార్లలో ఉంది, ఈ సీజన్లో 11.29 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం వరుస చీడపీడల వల్ల సాగు ఖర్చులు 30% పైగా పెరిగాయి. చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలకు అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పల్నాడు జిల్లాలో ఎకరాకు రూ. 2.5 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేసిన అనేక మంది నష్ట భయంతో గజగజలాడుతున్నారు. ‘ప్రస్తుత మార్కెట్ ధర లతో, మా పెట్టుబడులను తిరిగి పొందేందుకు మార్గం కనబడడం లేద’ని రైతులు వాపోతున్నారు.అనూహ్యంగా గత కొన్ని వారాలుగా మిర్చి కొనుగోళ్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారి పోయింది. ముఖ్యంగా చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి కీలక మార్కెట్ల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం గణనీయంగా మందగించిందని మిర్చి యార్డ్‌లో కొందరు వ్యాపారస్తులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2023–24లో 0.179 మిలియన్ టన్నుల దిగుమతులతో చైనా భారతీయ ఎర్ర మిరప కాయల అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ఇది పరిమాణంలో సుమారుగా 14 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఒలియోరెసిన్, పాక రంగాల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా చైనాకు ఎర్ర మిరప ఎగుమతులు పుంజుకున్నాయి. విలువ పరంగా రెండవ అతిపెద్ద కొనుగోలుదారు అయిన థాయ్‌లాండ్, దాని దిగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 10.6 శాతం పెరిగాయి. గడచిన కొంత కాలంలో భారత దేశం నుండి అమెరికాకు ఎర్ర మిర్చి ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. గత ఏడాది 29,173 టన్నుల నుంచి 2023–24లో ఎగుమతులు 25 శాతం పెరిగి 36,413 టన్నులకు చేరుకున్నాయి. అంటే ఎగుమతుల డిమాండ్ తగ్గిందన్నది దీనినిబట్టి చూస్తే అవాస్తవమే అన్నమాట!గిట్టుబాటు ధర లభించక మిర్చి రైతులు విలవిల్లాడి పోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అన్ని విధాలా విఫలమైందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న తెలుదేశం పార్టీ అధి నేత తన అధికారులతో మంతనాలు, సమీక్షల తోనూ; కేంద్రంవైపు సహాయం కోసం చూసే చూపులతోనూ కాలం గడుపు తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాని, మిర్చి రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన చర్యలైతే తీసుకోవడం లేదు. నిజంగా రైతుకు మేలు చేయడమే సీఎం నైజం అయితే తమకు వెంటనే భరోసా ఇచ్చే చర్యలను చేపట్టాలని రైతాంగం కోరుకుంటోంది.చదవండి: రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాంరాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ వ్యాపారులు, విక్రయదారులు, ప్రభుత్వ అధికారులతో చర్చించారని చెబుతున్నారు. ఈ చర్చల్లో వ్యాపారులను కొనుగోలు కార్యకలా పాలను పెంచాలని డైరెక్టర్ కోరినా... మార్కెట్లో ఎటువంటి నిర్ణయాత్మక మార్పు కనబడడం లేదు. ఈ అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి నుండి రైతులను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోక తప్పదు. లక్షల్లో అప్పుచేసి మిరప సాగు చేసిన రైతులు కనీసం పెట్టుబడి కూడా రాబట్టుకోలేని దయనీయ స్థితిలో ఉండగా, వ్యాపారులు నిశ్శబ్దంగా అసంబద్ధ చర్యలకు పాల్పడుతున్నట్టుగా పలు అనుమానాలు కలుగుతున్నాయి. లేకుంటే అంతగా అభివృద్ధి చెందిన మిరపకు మార్కెట్ పడిపోవడం ఎలా సాధ్యం? చైనాతో సహా 20కి పైగా దేశాలు గుంటూరు మిర్చి వైపు చూస్తుండటం, గత సంవత్సర లాభసాటిగా మార్కెట్ ఉండటం చూస్తుంటే ఈ పతనం వెనుక ఉన్న కాణాలు అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెను నిద్దర వదిలి మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి.- బలిజేపల్లి శరత్ బాబు ప్లాంట్ ప్రొటెక్షన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త -
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు వైఎస్సార్సీపీ నేతల నివాళి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీసీ కేంద్ర కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆజాద్ ఆలోచనలు, సిద్దాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. భారత విద్యా వ్యవస్ధను ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయుడు ఆజాద్ అని కొనియాడారు.ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి వైఎస్సార్సీపీ ఘనంగా నివాళులర్పించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆజాద్ చిత్రపటానికి వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ..‘విద్యాశాఖా మంత్రిగా విద్యా వ్యవస్ధను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్పవాడిగా ఆయన నిలిచారని, ఆయన బాటలోనే పయనిస్తూ, ఆయన అడుగుజాడల్లో అందరూ ముందుకు వెళ్ళాలని కొనియాడారు. ఆజాద్ ఆలోచనలు, నిర్ణయాలు విద్యారంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాయి, విద్యారంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్కరణలు తీసుకురావడానికి గల కారణం కూడా ఆజాద్. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలు, వైఎస్సార్సీపీ సిద్దాంతాలు ఆజాద్ స్పూర్తితోనే కొనసాగుతున్నాయని గర్వంగా చెప్పగలం. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్పూర్తిని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు షేక్ ఆసిఫ్, డాక్టర్ మెహబూబ్ షేక్, మనోహర్ రెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, మస్తాన్, గౌస్, రవిచంద్ర, కొమ్మూరి కనకారావు, పురుషోత్తం, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
గుంటూరులో ఉచితంగా చికెన్,గుడ్లు వంటకాల పంపిణీ... పోటెత్తిన జనాలు (ఫొటోలు)
-
తప్పుడు కేసుపై డీజీపీకి పేర్ని నాని ఫిర్యాదు
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమోదు అయిన విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) డీజీపీకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేస్తూ డీజీపీ(AP DGP) హరీష్ కుమార్ గుప్తాకు ఓ లేఖ రాశారు. గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న గుంటూరు మిర్చి రైతులను బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన జగన్, మరికొందరు వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ నల్లపాడు పీఎస్‌లో టీడీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది.అయితే ఆ పర్యటనలో పాల్గొనని పేర్ని నాని(Perni Nani)పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు. ఈ పర్యటనలో పాల్గొనకున్నా తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తనపై ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారాయన. ప్రజాక్షేత్రంలో ఉన్న తనపై ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం.. అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారాయన. ఈ అంశంపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లపై, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారాయన. ఇదీ చదవండి: సభ పెట్టలేదు.. మైక్ ముట్టలేదు.. ఇదేమీ దుర్మార్గం -
గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్
గుంటూరు: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా గుంటూరులో మహిళా సాధికారత కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే గత శుక్రవారం నాట్స్ ఆధ్వర్యంలో నెహ్రు యువక కేంద్రంలో మహిళలకు కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ కుట్టుశిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణి చేశారు. పేద మహిళలు స్వశక్తితో నిలబడేలా.. సాధికారత సాధించేలా చేసేందుకు నాట్స్ తన వంతు సహకారం అందిస్తుందని నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కో ఆర్డినేటర్ రామకృష్ణ బాలినేని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే వారి కుటుంబాలు ఆర్ధిక స్థిరత్వం సాధిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్‌తో పాటు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్‌కు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
జేఈఈ టాపర్ గుత్తికొండ మనోజ్ఞకు నాట్స్ అభినందనలు
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జేఈఈ పరీక్షలో 100 శాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అభినందించింది. అత్యంత కఠినమైన ఈ పరీక్షలో ఒత్తిడి తట్టుకుని నూటికి నూరు శాతం సాధించిన మనోజ్ఞ తెలుగు విద్యార్ధులందరికి ఆదర్శంగా నిలిచారని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పట్టుదల.. ఏకాగ్రత ఉంటే ఎంతటి కష్టమైన పరీక్షలనైనా గట్టెక్కవచ్చనేది మనోజ్ఞ నిరూపించిందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. మనోజ్ఞ సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.జేఈఈ మెయిన్ ఫలితాలలో గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సాయి మనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించిన ఏకైక తెలుగు విద్యార్థినిగా నిలిచింది. 14 మందికి మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. గుంటూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో మనోజ్ఞ చదువుతోంది. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి: -
‘నడిచొచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు’
సాక్షి,నెల్లూరు: రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులోని మిర్చి యార్డులో రైతు సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటే.. గతంలో ఏనాడూ నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్లు జరపకపోయినా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాఫెడ్‌కి బోగస్ లేఖ రాసిన సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘గతంలో ఏనాడూ నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్లు జరపకపోయినా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాఫెడ్‌కి బోగస్ లేఖ రాసిన సీఎం చంద్రబాబు, మరోసారి రైతులను దారుణంగా వంచించారని స్పష్టం చేశారు. మిర్చి రైతులపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్)లో రైతులను ఆదుకోవాలని కోరేవారని ఆయన వెల్లడించారు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి సీఎంకు లేదు కాబట్టే, ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన రూ.3,480 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ గురించి పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారన్న ఆయన, జగన్ పర్యటనలను అడ్డుకునే ఉద్దేశంతోనే, గుంటూరు మిర్చియార్డు సందర్శనలో ఏ మాత్రం భద్రత కల్పించలేదని అన్నారు. జగన్ పర్యటనతోనే రైతుల సమస్యలపై ప్రభుత్వంలో చలనం మొదలైందని చెప్పారు.ప్రశ్నిస్తే కేసులు పెడతారా?:రైతుల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. టీడీపీ కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒకవైపు దిగుబడులు పడిపోయి, మరోవైపు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ నిన్న (బుధవారం) గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతులతో మాట్లాడితే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. రైతులకు అండగా నిలవాలని జగన్ వెళితే, వాస్తవాలను మరుగుపర్చి ప్రజల దృష్టి మళ్లించేందుకు విష ప్రచారం చేస్తోంది. ‘మమ్మల్ని ప్రశ్నిస్తే మీపై బురద జల్లుతాం’.. అన్నట్లుంది ప్రభుత్వ వ్యవహారం. ఆఖరుకి రైతులను కూడా అవమానించే విధంగా ప్రభుత్వం, ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది.ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించ లేదు:‘జగన్ జనంలోకి వెళ్లకూడదు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. తమ వైఫల్యాలు ప్రజల వద్ద ఎండగట్టొద్దు’.. అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. అందుకే జగన్ జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నా, ఆయన గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో కనీస భద్రత కూడా కల్పించలేదు. చివరకు రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేయలేదు. ‘నడిచొచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు. ఆయన్ను సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నించకూడదు. రైతుల సమస్యలపై అస్సలు అడగకూడదు. ఏమడిగినా అధికారం చేతిలో ఉంది కాబట్టి కేసులు పెడతాం’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్‌పైనా కేసు పెట్టారు.ఇదే నా ఛాలెంజ్:జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. రైతుల సమస్యలపై కనీసం చర్చ మొదలైంది. ప్రభుత్వం రైతులను గాలికొదిలేసినప్పుడు, వారి బాధ్యతను గుర్తు చేయడానికి మాజీ సీఎం జగన్ పర్యటిస్తే, దానిపై ఆక్రోషం వెళ్లగక్కుతున్న చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నాయకులకు నా ఓపెన్ ఛాలెంజ్. మీరు నేరుగా మిర్చి యార్డుకు వెళ్లి రైతుల సమస్యల గురించి అడిగి రాగలరా? మిర్చి రైతులు మిమ్మల్ని కారం దంచినట్టు దంచకుండా వదిలిపెట్టరు.నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు పచ్చి అబద్ధం:అచ్చెన్నాయుడి ప్రెస్‌మీట్ చూస్తే.. టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన పేపర్ చదవడం తప్ప, ఆయనకు రైతుల సమస్యలపై ఏ మాత్రమైనా అవగాహన ఉందా? అనే అనుమానం కలిగింది. అలాంటి వ్యక్తి వ్యవసాయ మంత్రి కావడం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. రైతుల కోసం నడుం బిగించినట్లు, నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ఒక బోగస్ లేఖ రాసి చేతులు దులిపేసుకున్నారు. ఈ లేఖ ద్వారా ఆయన రైతులను మరోసారి వంచించారు.గతంలో ఎప్పుడూ నాఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయడం జరగలేదు. మరి అలాంటప్పుడు మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, నాఫెడ్‌కు చంద్రబాబు లేఖలు రాయడం మిర్చి రైతులను మోసం చేయడం కాదా?.అది కూడా వాస్తవం కాదా?:మిర్చి రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ఉద్యానవన శాఖ అధికారులిచ్చిన నివేదికలో, క్వింటాలుకు రూ.11,600 చొప్పున మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇస్తూ కనీసం 25 శాతం పంటను కొనుగోలు చేయాలని, ఇందుకోసం రూ.3,480 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవుతుందని చెప్పారు. ఆ మొత్తం భరించడానికి ఇష్టపడని చంద్రబాబు, ఆ ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టిన మాట వాస్తవం కాదా? మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కాకుండా మార్కెట్ ప్రైస్ సపోర్ట్ కింద నాఫెడ్ తరఫున కొనుగోలు చేయాలని లేఖ రాయడం చేతులు దులిపేసుకోవమే. చంద్రబాబు కేంద్ర మంత్రికి రాసిన లేఖ ప్రకారం చూసినా గత మా ప్రభుత్వంలో రైతుకు రూ.20 వేలకు తగ్గకుండా మద్దతు ధర లభించింది. ఒకవేళ గతం కంటే ఎక్కువ ధరకు మిర్చి కొనుగోలు చేసి ఉంటే, దావోస్‌లో మాట్లాడి నేనే చేయించానని చంద్రబాబు ప్రచారం చేసుకునే వాడు.ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు:కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం మిర్చికి మాత్రమే కాదు, ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితి. గత వైయస్సార్సీపీ పాలనలో దళారీ వ్యవస్థకు తావు లేకుండా పంటల కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ గాలికొదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం మిర్చి పంటకే కాదు.. పసుపు, పత్తి, అరటి, ఉల్లి, పెసర, మినుము పంటలకు మద్దతు ధర కల్పించాం. కానీ నేడు చంద్రబాబు ఇస్తామన్నవి ఇవ్వకపోగా, గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు కూడా లేకుండా చేశారని కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. -
KSR Live Show: జగన్ దెబ్బకు కూటమిలో దడ
-
‘రైతుల గోడు వింటే కేసు పెడతారా?’
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనను అడ్డుకోలేకపోయిన కూటమి ప్రభుత్వం.. మరో కుట్రకు తెరదీసింది. మిర్చి యార్డులో పర్యటించి రైతుల గోడు విన్నందుకుగానూ ఆయనపై కేసు(Case Against YS Jagan) పెట్టింది. ఎలాంటి సభ, మైక్ ప్రచారం నిర్వహించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.మిర్చి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకుగానూ మాజీ సీఎం హోదాలో కూడా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇవ్వలేదు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా వ్యవహారంపై ఆయన సీఎం చంద్రబాబును నిలదీశారు కూడా. అయితే వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు కొందరు నల్లపాడు పీఎస్(Nallapadu Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో కొసమెరుపు ఏంటంటే.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అసలు ఆ పర్యటనకు రాకపోయినా కేసు నమోదు చేయడం. వైఎస్ జగన్, పేర్ని నానితో పాటు ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, గుంటూరు మేయర్ కావట్టి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మిర్చి రైతుల(Mirchi Farmers) కష్టాలుపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే కక్ష కట్టి చంద్రబాబు ప్రభుత్వం తమ నేతలపై కేసు పెట్టిందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం
-
Big Question: గుంటూరు మిర్చి యార్డు సాక్షిగా బాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
అడుగడుగునా భద్రతా వైఫల్యం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: అన్నదాతలను పరామర్శించి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చి యార్డు వద్దకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆయన పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ సీఎం పర్యటన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకంగా మారింది. బుధవారం గుంటూరు మిర్చి యార్డులో వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఆయన పీఏ కె.నాగేశ్వరరెడ్డి ఒక రోజు ముందుగానే గుంటూరు కలెక్టర్, డీజీపీ, విజయవాడ పోలీసు కమిషనర్, గుంటూరు ఎస్పీ, ఐజీ ఇంటెలిజెన్స్(సెక్యూరిటీ)లకు సమాచారమిచ్చారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎంకి అవసరమైన సెక్యూరిటీ, ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. జగన్ పర్యటనను పట్టించుకోవద్దని గుంటూరు జిల్లా పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. నాయకులు, కార్యకర్తలే రోప్ పార్టీగా..గుంటూరులోకి రాగానే జగన్‌ను పలుకరించేందుకు ‘వై జంక్షన్’ నుంచి మిర్చి యార్డు వరకు మహిళలు, పార్టీ నేతలు, అభిమానులు రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరారు. పలువురు నేతలు, కార్యకర్తలే రోప్ పార్టీగా మారి ముందుకు కదిలారు. జగన్ మిర్చి యార్డు వద్దకు వచ్చేదాకా ఇదే పరిస్థితి ఉంది. మాజీ సీఎం అక్కడ పర్యటిస్తున్నా ఒక్క పోలీసు కూడా పరిస్థితిని చక్కదిద్దకపోవడంతో తోపులాట జరిగింది. మరోవైపు జగన్ కార్యక్రమానికి అడ్డంకులు కల్పించేందుకు ఆయన మాట్లాడే సమయంలో పదే పదే మైక్‌లో అనౌన్స్మెంట్లు చేయించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సమావేశానికి అనుమతులు లేవంటూ ప్రకటనలు చేశారు. దీంతో మీడియాతో మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో జగన్ తన వాహనంలో కొద్దిసేపు నిరీక్షించారు. అరగంట తర్వాత తన వాహనం వద్దకు చేరుకోగలిగిన కొందరు మీడియా ప్రతినిధులతో మాత్రమే మాట్లాడి వెళ్లాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేతకు కనీస భద్రత లేదు: వైఎస్ జగన్ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. కనీస పోలీసు భద్రత కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత తీసేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు చేస్తున్నది సరైనదో కాదో ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. -
ఉప్పొంగిన అభిమానం
పట్నంబజారు, నగరంపాలెం (గుంటూరు ఈస్ట్/వెస్ట్): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బుధవారం గుంటూరులో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మిర్చి యార్డు ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. కూటమి ప్రభుత్వ కుట్రలు బద్దలు బట్టబయలు చేస్తూ.. మిర్చి రైతుకు భరోసా కల్పించేందుకు వచ్చిన జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. తమ పక్షాన వారి గొంతుకై.. గిట్టుబాటు ధర కల్పించని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వచ్చిన నాయకుడికి జనం నీరాజనం పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్డు మార్గాన గుంటూరు–చిలకలూరిపేట రోడ్డులోని వై. జంక్షన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చిన రైతులు, యువత, విద్యార్థులు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. పార్టీ నేతలు, కార్యకర్తలు వారికి తోడయ్యారు. భారీ ర్యాలీ నడుమ వైఎస్ జగన్ కోల్డ్ స్టోరేజ్ ప్రాంతం మీదుగా మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. యువత, ప్రజలు జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్‌తో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వై జంక్షన్ వద్ద జననేతకు భారీ స్వాగతం లభించింది. పోలేరమ్మ తల్లి గుడి ప్రాంతం నుంచి రహదారికి ఇరు వైపులా పెద్ద సంఖ్యలో మహిళలు బారులుతీరారు. వారి దగ్గరకు జగన్ రాగానే.. ‘జగనన్నా..’ అంటూ కేకలు వేస్తూ.. చేతులూపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు యువకులు డివైడర్‌పై, ఇళ్లపై నుంచి మొబైల్ ఫోన్లలో జగన్ కాన్వాయ్‌ని చిత్రీకరిస్తూ కనిపించారు. దారిపొడవునా అదే ఆదరణదారి పొడవునా అభిమాన జనం పోటెత్తడంతో వై. జంక్షన్ నుంచి మిర్చి యార్డు వద్దకు చేరేసరికి అరగంటకు పైగా పట్టింది. జగన్ మిర్చి యార్డు వద్దకు రాగానే యువత ఆనందంతో ఈలలు వేశారు. దారిపొడవునా అందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. అప్పటికే తమ సమస్యలు చెప్పుకునేందుకు యార్డు గేటు వద్దకు వచ్చి ఎదురు చూస్తున్న మిర్చి రైతులు ఎదురేగి జగన్‌కు స్వాగతం పలికారు. తమ సమస్యలు వినేందుకు జననేత జగన్ వచ్చారంటూ పలువురు రైతులు భావోద్వేగానికి లోనయ్యారు. పంటలకు మద్దతు ధర లభించడం లేదని మొర పెట్టుకున్నారు. -
జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని, మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. గుంటూరులోని ఆ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనపై ముందుగానే సమాచారం ఇచ్చినా, ఆయనకు భద్రత కల్పనను అస్సలు పట్టించుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిందని వారు ఆక్షేపించారు.మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే గుంటూరు పోలీసులు బందోబస్త్‌ను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కుంటిసాకులు చెబుతున్నారని వారు ధ్వజమెత్తారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్ రోడ్డు మీదకు వస్తే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంటుందో తెలిసి కూడా.. ఆయన మిర్చి రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని విఫలం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు.గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీవైఎస్ జగన్‌కు భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంపై గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయనుంది. రేపు ఉదయం 11 గంటకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు గవర్నర్‌ను కలవనున్నారు.వ్యవసాయ మంత్రి పచ్చి అబద్ధాలు: అంబటి రాంబాబుమిర్చి రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పిచేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌కు వచ్చి రైతులతో మాట్లాడారు. ధర లేక కునారిల్లుతున్న మార్కెట్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జగన్ రైతులతో మాట్లాడి వెళ్లగానే, వ్యవసాయ మంత్రితో పాటు పలువురు టీడీపీ నేతలు స్పందించారు. ఒకటి, రెండుసార్లు తప్ప ఎప్పుడూ క్వింటా మిర్చి రూ.13 వేలకే విక్రయిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారు.మరో వైపు హడావిడిగా సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌కు లేఖ రాశారు. మిర్చిపంటకు రేటు పడిపోయింది, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇంత సీనియారిటీ ఉన్న సీఎం ఇలాగేనా సమస్యపై స్పందించేది? వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అయిదేళ్లలో పంటలకు ఎప్పుడు మద్దతు ధర రాకపోయినా, రైతు నష్టపోతున్నారని గ్రహించినా వారిని ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. పత్తి, ధాన్యం, పొగాకు ఇలా అనేక పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు.కళ్లు మూసుకున్న ప్రభుత్వం:కానీ, నేడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? మిర్చి పంటకు పెట్టుబడులు పెరిగిపోయి, పండిన మిర్చికి కనీస మద్దతు ధర లభించక రైతులు నష్టాల పాలైతే, కూటమి ప్రభుత్వ స్పందన అత్యంత దారుణం. మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎంకు లేదా? నాడు మాది రైతు పక్షపాత ప్రభుత్వం. ఆనాడు రూ.65 వేల కోట్లు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేశాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పత్తి, కంది, ధాన్యం, మిర్చికి మద్దతు ధర లేదు. ధాన్యాన్ని అతి తక్కవ రేటుకు దళారీలకు, మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. రైతు నట్టేట మునుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.జగన్ మిర్చి మార్కెట్‌కు రాకుండా కుట్ర:జగన్ మిర్చి మార్కెట్‌కు రాకుండా చూసేందుకు కుట్ర చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించాలని అనుకోవడం తప్పా? కనీస పోలీస్ బందోబస్త్ కల్పించకుండా ఎన్నికల కోడ్ ఉందంటూ కుంటిసాకులు చెప్పించారు. అది కూడా పోలీసులు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి చేతులు దులుపుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంది. వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పడు ఓట్ల కోసం ప్రచారం చేసుకునే వారు. ఊరేగింపులు, బహిరంగ సభలు పెట్టే వారు అనుమతులు తీసుకోవాలి. వైఎస్ జగన్ మిర్చి యార్డ్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసం ప్రచారం కోసం వెళ్ళారా? రైతులను పరామర్శించడం ఎన్నికల ప్రచారం కిందకు వస్తుందా? కోడ్ ఉంటే దానిపైన పోలీసులు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు?అయినా కోడ్ ఉల్లంఘించే ఉద్దేశం మాకు లేదు. ఎన్నికలు జరుగుతున్నా పరామర్శించేందుకు అవకాశం ఉంటుంది. నిన్ననే జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఈ ఎన్నికల కోడ్ ఉన్నట్లు పోలీసులకు గుర్తు రాలేదా? అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరింప చేశారు. అంటే విజయవాడలో ఒక నిబంధన, గుంటూరులో మరో నిబంధన ఉంటుందా? గుంటూరు మిర్చి మార్కెట్లో రైతులతో జగన్ మాట్లాడితే, వారి కష్టాలు ప్రజలకు తెలుస్తాయని, అందుకే ఆ పర్యటన అడ్డుకోవాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది.మఫ్టీలో పోలీసులు డ్రోన్లు ఎగరేశారు:జగన్‌కు మాజీ సీఎంగా జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉంది. కానీ ఈ రోజు కనిపించలేదు. ఎందుకని ప్రశ్నిస్తే అనుమతి తీసుకోలేదని సమాధానం చెబుతున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు డ్రోన్లు ఎగరేసి, ఈ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారో చిత్రీకరించి వారిపై కేసులు పెట్టాలని కుట్ర పన్నారు. నారా లోకేష్ వికృతానందం కోసం, ఆయన ఆదేశాల మేరకు పోలీసులు ఇటువంటి పనులు చేశారు. కోడ్ పేరుతో పోలీసులు ఎవరూ జగన్ గారి కార్యక్రమం వైపు వెళ్ళవద్దని చెప్పారు. జగన్ రోడ్డు మీదికి వస్తే పెద్ద ఎత్తున జనం వస్తారు. అటువంటి ప్రజాదరణ జగన్ సొంతం. మిర్చియార్డ్ వద్ద పోలీసులు లేక తోపులాటలు జరిగాయి. దీంతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులే జనాన్ని నియంత్రించారు. చివరికి జగన్ మీడియాతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేయాలని కుట్రపన్నారు.జగన్‌ను చూసేందుకు, కలిసేందుకు తరలి వస్తున్న జనాన్ని నియంత్రించేందుకు ఒక్క పోలీస్‌ను కూడా నియమించకుండా చేయడం నారా లోకేష్‌కు సమంజసమా? అధికారం శాశ్వతమని వారు భావిస్తున్నారు. జగన్‌కి భద్రత లేకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఈ కుట్రలో పోలీస్ యంత్రాంగం భాగస్వామి అవుతోంది. ఏదైనా జరిగితే దానికి ఎవరు భాధ్యత వహిస్తారు? జెడ్ ప్లస్ సెక్యూరిటీని కూడా ఇవ్వకుండా చేశారంటే దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. ప్రజలు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం జగన్ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దీనికి మూల్యం చెల్లించక తప్పదు.ఇప్పుడు కళ్లు తెరుస్తున్నారు: మేరుగు నాగార్జునగుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటించిన తర్వాతే ప్రభుత్వం కళ్లు తెరిచింది. కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై దృష్టి లేదు. జగన్ వచ్చి రైతు కష్టాలను, వారి వెతలను బయటపెడితే ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి కేంద్రానికి మిర్చి రైతుల గురించి లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ఒక్క పోలీస్ కూడా మిర్చియార్డ్ వద్ద లేరు. అంటే వైఎస్ జగన్‌పై ఎలాంటి కక్ష సాధింపు, కుట్రలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. ఈ ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా మా నాయకుడిని కాపాడుకునేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తారు. పోలీసులు లేకపోతే జగన్ కార్యక్రమం జరగదని కుట్ర పన్నారు. అయినా కూడా పార్టీ కార్యకర్తలే వాలంటీర్లుగా పని చేశారు.చిల్లర రాజకీయాలు మానుకోవాలి: నందిగం సురేష్గుంటూరు మిర్చియార్డ్‌కు వచ్చిన జగన్‌కు ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడానికే మొత్తం సమయాన్ని వినియోగిస్తున్నారు. ఈ రోజు ధర లేక మిర్చి రైతులు పెడుతున్న ఆక్రందనలు కూటమి ప్రభుత్వం చెవులకు సోకడం లేదు. జగన్ మిర్చి రైతుల కోసం గుంటూరుకు వస్తే కనీసం ఒక్క పోలీస్‌ను కూడా బందోబస్తు కోసం నియమించకుండా చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసి ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్.. సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించే వారేనా?. రైతుల ఇబ్బందులను గాలికి వదిలేశారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీపై పగ తీర్చుకునేందుకే పని చేస్తున్నారు. ప్రజలు ఇందుకేనా మీకు అధికారంను కట్టబెట్టింది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి పార్టీలకు కనీసం సింగిల్ డిజిట్ కూడా రాదు.ప్రభుత్వ విధానాలు చూస్తూ ఊరుకోం: మోదుగుల వేణుగోపాల్రెడ్డిమాజీ సీఎం గుంటూరు మిర్చియార్డ్‌కు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎంగా చంద్రబాబు కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాము. ఈ రోజు మిర్చియార్డ్ వద్ద కనీస పోలీస్ బందోబస్త్ కూడా లేకుండా గుంటూరు ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రేపు మళ్ళీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేస్తారు? మీరు చేసిందే మమ్మల్ని కూడా చేయమని పరోక్షంగా చెబుతున్నారా? కక్ష సాధింపులకు చూపుతున్న శ్రద్ద రైతు సమస్యలపై చూపించలేరా? వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో చూపించిన ప్రాధాన్యత మిర్చి రైతులపై ఎందుకు చూపించలేదు? జగన్ కార్యక్రమంపై ఈ రోజు ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలాంటి విధానాన్నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తామంటే వైఎస్సార్సీపీ శ్రేణులు చూస్తూ ఊర్కోవు.డీజీపీ సమాధానం చెప్పాలి: విడదల రజినికూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అండగా నిలబడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో క్వింటా మిర్చికి కనీసం రూ.25 వేలు వస్తే, నేడు క్వింటా రూ.12 వేలకు కూడా కొనుగోలు చేయడం లేదు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు గుంటూరు మిర్చి మార్కెట్‌కు జగన్ వచ్చారు. రైతులతో మాట్లాడారు. రైతులు తమ గోడును జగన్‌తో వెళ్లబోసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు ఆనాడు మా ప్రభుత్వం అండగా నిలిచిందని రైతులే గుర్తు చేశారు.జగన్ మిర్చిమార్కెట్కు వస్తే పోలీసులు చూపిన నిర్లక్ష్యం చూస్తుంటే, వారు చట్టప్రకారం కాకుండా తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తున్నట్లు అర్థమయ్యింది. కనీస భద్రత కూడా కల్పించలేదు. పెద్ద సంఖ్యలో జనం వస్తుంటే నియంత్రించే పోలీసులు ఎక్కడా కనిపించలేదు. ఏదైనా తొక్కిసలాట జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? వేల సంఖ్యలో తరలి వచ్చిన రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీనిపై డీజీపీ నుంచి జిల్లా ఎస్సీ వరకు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేయడం లేదు. కేవలం రైతుల గురించి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే, దానికి కుంటిసాకులు చెప్పడం దారుణం. -
ఉక్కిరి బిక్కిరి చేసిన అభిమానం ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ
-
జగన్‌తో తమ గోడు చెప్పు కున్న మిర్చి రైతులు
-
ఇప్పటికైనా కళ్లు తెరవండి చంద్రబాబు : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : ధరల్లేక, పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను ఇవాళ వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ ట్వీట్లో ఏమన్నారంటే 1.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం. ఇవాళ మిర్చిరైతుల కష్టాలు చూస్తున్నాం. చంద్రబాబు సీట్లోకి వచ్చారు, మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలుపెట్టారు. 2.మన ప్రభుత్వంలో నిరుడు క్వింటాలుకు అత్యధికంగా రూ.21-27 వేల దాకా పలికిన మిర్చి ధర, ఇప్పుడు రూ.8-11వేలకు పడిపోయింది.3.పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు సుమారు రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.4.కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఈజిల్లాల్లో రైతులందరి పరిస్థితీ అంతే. 5.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఆ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి.. వీరంతా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదు. గవర్నమెంటు తరఫున రైతులను పలకరించే వారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్ యార్డు ఉంది. ఇక్కడ రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబునాయుడు వినిపించడంలేదు.6.చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చి రైతులకు సహాయం చేయకపోగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ కూడా మూలన పడేశారు. 7.ఆర్బీకేలను, ఈ-క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యంచేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నావడ్డీకే రుణాలు, విత్తనాలు ఎరువులకు సైతం ఆర్బీకేల్లో నాణ్యతకు గ్యారంటీ.. ఇలా ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు.ధరల్లేక, పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను గుంటూరు మార్కెట్ యార్డులో పరామర్శించాను. పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చియార్డు ప్రాంతం కిక్కిరిసిపోయింది. అందుకే ప్రజలనుద్దేశించి మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయాను.…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 19, 20258.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు, మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి, రైతులకు MSP ధరలు రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే జోక్యంచేసుకుని కొనుగోలు చేసేది. కనీస మద్దతు ధరలు తెలియజేస్తూ ఆర్బీకేల్లో పోస్టర్లు ఉంచేవాళ్లం. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే, ధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం అక్షరాల రూ. 7,773 కోట్లు ఖర్చు చేసి మన ప్రభుత్వం రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే, చంద్రబాబునాయుడు కుంభ కర్ణుడిలా నిద్రపోతున్నాడు.9.మన ప్రభుత్వ హయాంలో CM APP అనే గొప్ప మార్పును తీసుకు వచ్చాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో ఆ యాప్‌ద్వారా నిరంతరం సమాచారం వచ్చేది. ఆర్బీకేల్లో ఉండే సిబ్బంది రైతులకు అందుతున్న ధరలమీద ఎప్పటికప్పుడు యాప్‌లో అప్డేట్ చేసేవాళ్లు. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఉంచేవాళ్లం. రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి 14400, 1907 నంబర్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఈవ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.10.ఇప్పుడు మిర్చికి వచ్చినట్టే పంటలకు వ్యాధులు వస్తే, ఆర్బీకే సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన సూచనలు ఇచ్చి, రైతులు పాటించేలా చేసేవాళ్లం. ఆర్బీకేలద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. 11.రైతులకు అందే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబుల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఈ ల్యాబులను గాలికొదిలేశారు. ప్రైవేటుకు అప్పగిస్తున్నారు.12.మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్రమం తప్పకుండా ఈ తనిఖీలమీద, తీసుకుంటున్న చర్యలమీద రిపోర్టులు ఇస్తూ, గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్టపడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తులమీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం. 13.మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూలేని విధంగా చాలా గొప్పగా పంటలబీమా అందించాం. 2019-20లో రూ.90.24 కోట్లు, 2020-21లో రూ.36.02 కోట్లు, 2021-22లో రూ.439.79 రైతులకు కోట్లు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దుచేసి రైతులపై భారాన్ని మోపారు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం మోపకుండా ఉచిత పంటలబీమాను అమలు చేసి, 54.55లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్టపరిహారం కింద చెల్లించాం.14.ఒక్క మిర్చే కాదు, కంది పండిస్తున్న రైతులు కూడా ధరల్లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే, ఇప్పుడు రూ.5,500లు కూడా రావడంలేదు. గత ఏడాది రూ.9-10వేల మధ్య ధర వచ్చేది. కాని మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150లు పైనే ఉంది.15.గత ఏడాది క్వింటాలు పత్తి ధర రూ.10వేలు ఉండేది. ఇప్పుడు రూ.5వేలుకూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558లు. ఇప్పుడు రూ.6వేలు రావడం కష్టంగా ఉంది. అలాగే మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలుకు రూ.10వేలు రాగా, ఇప్పుడు రూ.7వేలు కూడా రావడంలేదు. టమోటా రైతులకు కిలోకి రూ.3-5లు కూడా రావడంలేదు.16.ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు. రైతుకు ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ కాకుండా, రూ.20వేలు ఇస్తామని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. పోనీ మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా, రద్దుచేశారు. పలావూ.. లేదు, బిర్యానీ లేదు. కాని, మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు ఇచ్చాం.17.ఇదొక్కటే కాదు ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దుచేశారు, ఒక సీజన్లో పంట నష్టం జరిగితే, అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నావడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఈ-క్రాప్‌ను లేకుండా చేసేశారు, ధరల స్థిరీకరణ నిధికీ ఎగనామం పెట్టారు. కనీసం ఎరువులను కూడా సకాలంలో పంపిణీ చేయడంలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం అత్యంత దారుణం. 18.చంద్రబాబు.. ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజని గుర్తించండి, రైతు కన్నీరు పెట్టుకుంటే..అది రాష్ట్రానికి అరిష్టం. చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి, మిర్చి రైతులతో మాట్లాడి, వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలుచేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.’ అని ట్వీట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
జగన్ భద్రత గాలికి.. చంద్రబాబు కుట్ర అదేనా