వేదికపై న్యాయమూర్తులు, విశ్వయోగి విశ్వంజీ, ప్రజా ప్రతినిధులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ ఉద్ఘాటన
గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్/ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ)/మంగళగిరి టౌన్: మాతృభాషను పరిరక్షించుకోవడం ద్వారానే మనిíÙకి మనుగడ సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు‡ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ చెప్పారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు–ప్రత్తిపాడు ప్రధాన మార్గంలో ఉన్న శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలను (2026) శనివారం న్యాయమూర్తి ప్రారంభించారు. పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ శ్రీనరసింహ మాట్లాడుతూ ‘మాతృభాషలో రాణించినప్పుడే ఇతర భాషల్లో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాం. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులు, పీహెచ్‌డీలు చేస్తే స్రత్పవర్తన, వ్యక్తిత్వం అలవడతాయనుకోవడం భ్రమ. తల్లిదండ్రుల పెంపకం, భాష ద్వారా అవి అలవడతాయి. జిల్లా స్థాయి న్యాయస్థానాల వరకు తీర్పులు తెలుగులో వెలువరించాలి.
తద్వారా సామాన్య ప్రజలకు తమ కేసులకు సంబంధించిన వ్యవహారాలను తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. కేసు వివరాలు, వాదోపవాదనలు, న్యాయమూర్తులు వెలువరించే తీర్పులను మాతృభాషలో పొందే హక్కు ప్రజలకు ఉంది. అధికారిక వ్యవహారాల్లో తెలుగుభాషకు ప్రాధాన్యత ఉండాలి. పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగాలి’’ అని పేర్కొన్నారు. తెలుగుభాషను బోధించే ఉపాధ్యాయులను గౌరవించడం సమాజ ధర్మమని, వారికి సముచిత గౌరవాన్ని కల్పించని సమాజం సమాజమే కాదని చెప్పారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశ్వయోగి విశ్వంజీ, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోడా రఘురామ్, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తదితరులు తెలుగుభాష ఔన్నత్యం గురించి వివరించారు.
తెలుగు భాషాభివృద్ధికి ఆంధ్ర సారస్వత పరిషత్తు చేస్తున్న సేవలను గజల్ శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్, తెలుగు మహాసభల ముఖ్య సమన్వయకర్త పి.రామచంద్రరాజు, కొప్పరపు కవుల సాహితీపీఠం ప్రతినిధి మా శర్మ, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ, వివిధ దేశాల నుంచి వచి్చన తెలుగు ప్రముఖులు, భాషావేత్తలు, అభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దుర్గమ్మ సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ ఏఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువ్రస్తాలు అందజేశారు. కాగా, జస్టిస్ శ్రీనరసింహ గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని కూడా దర్శించుకున్నారు.


