ఆకాశమంత మందిరి, భూదేవి అంత పీట అన్నట్టు జరుగుతున్నాయి ప్రస్తుతకాలంలో పెళ్లిళ్లు. పెళ్లి జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలి పోవాలని కోరుకుంటారు ఇందుకోసం చాలా ఆర్భాటాన్ని ప్రదర్శిస్తుంటారు. పంజాబ్ పెళ్లిలో వధువుపై నోట్ల వర్షం కురిపించిన కుటుంబం చిక్కుల్లో పడింది.
విషయం ఏమిటంటే..తమ ఇంట పెళ్లిన గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆరాటంతో వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించడం ప్రస్తుతం నెట్టింట తెగ చర్చకు దారి తీసింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను పెళ్లి కుమార్తెపై వెదజల్లారంటూ సోషల మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. (జస్ట్ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!)

పంజాబ్‌లోని తర్న్ తరణ్ జిల్లాలో వాలంటైన్స్ డే రోజు ఒక జంట వివాహం చేసుకుంది. వీరి వివాహ రిసెప్షన్ సందర్భంగా పెళ్లికూతురిపై ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను పూలవర్షంలా కురిపించారట. ఇదిఆన్‌లైన్‌లో షేర్ అయిన వెంటనే దావానలంలా వ్యాపించింది. అటు వధూవరుల కుటుంబంనుంచిగాన,ఈ ఇటు వివాహంలో పాల్గొన్న ఎవరి నుండి నిజమైన నిర్ధారణ లేనప్పటికీ గ్రాండ్ క్యాష్ పార్టీ అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.
ఇదీ చదవండి: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు
రూ. 8.5 కోట్లు కాదు, లక్షలే
ఈ వీడియో వైరల్‌గా మారడంతో వరుడి కుటుంబం స్పందించింది. ఈ వాదనలను వరుడి కుటుంబ సభ్యులు , వివాహ కార్యక్రమ నిర్వాహకులు తోసిపుచ్చారు.ఈ కార్యక్రమంలో జంటపై రూ.3–4 లక్షల నగదును మాత్రమే కురిపించామన్నారు. రూ. 8.5 కోట్లు అని జరుగుతున్న ప్రచారం అవాస్తమని వరుడి సోదరుడు సికందర్ సింగ్ ఖండించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవెంట్ మేనేజర్, DJ కూడా వైరల్ అయిన రూ. 8.5 కోట్ల వాదనను తోసిపుచ్చారు. మొత్తం నగదు సుమారు రూ. 4 లక్షలు అని కొన్ని డాలర్ నోట్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పడం గమనార్హం
ఇదీ చదవండి: థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!


