క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుఉన్నపుడు కేవలం ఓవర్లు పరుగులు, బాల్స్, వికెట్స్, విజయాలు, రికార్డులు మరికొంతమంది కూడా విశేషంగా మారిపోతుంటారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా అవతరిస్తారు. ఇటీవల భారతదేశం , అమెరికా మధ్య జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాయ్‌లో ఇలాంటి విశేషమే చోటు చేసుకుంది. ఒక అందాల ముందు గుమ్మ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ 3వేల 3.77 లక్షలకు పెరిగిందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ICC పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తళుక్కున మెరిసింది ఐరా రావత్ (Aira Rawat). ఆ క్షణం ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. ఇండియా vs USA మ్యాచ్ సందర్భంగా కెమెరా ప్యాన్ అవుతూన్న సందర్భంలో ఒక యువతి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతే నిమిషాల్లోనే, ఇంటర్నెట్ ఆమె ఫోటోలు, వీడియోలతో నిండిపోయింది. మ్యాచ్ రోజున ఆమె నీలం రంగు టీ-షర్టు, తెల్లటి షార్ట్ స్కర్ట్ ధరించి స్టేడియంలో సందడి చేసింది. ఉత్కంఠగా జరుగుతున్న మ్యాచ్ మధ్యలు ఆమె హావభావాలు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. టీమిండియా పట్ల అమె అభిమానానికి,ఆమె క్రికెట్ వైబ్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆసక్తికరంగా, తోటి క్రికెట్ ప్రేమికులతో కలిసి గ్రూప్ సెల్ఫీ తీసుకుంటున్న రావత్ ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్

ఎవరీ ఐరా
ఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అన్న ఊహాగానాలకు భారీగా వ్యాపించాయి. ఐరాకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టమట. ఇన్‌స్టాగ్రామ్ పేజీలో, క్రికెట్ స్టేడియంలో పోజులిచ్చిన కొన్ని ఫోటోలను చూడవచ్చు. ప్రత్యక్ష మ్యాచ్‌లను చూడటానికి రావత్ తరచుగా స్టేడియాలలో వాలిపోతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లకు ఆమె వీరాభిమాని. నిజానికి, ఒకసారి విరాట్ కోహ్లీని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని కూడా చెప్పింది రావత్.

విరాట్ అనుష్క శర్మను వివాహం చేసుకున్నప్పుడు రావత్ వయసు దాదాపు 18 సంవత్సరాలు. అంతేనా ఐరా రావత్ మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. అందుకే తన బయోలో తనని తాను ఫ్యాషన్ డ్రీమర్ అని పేర్కొంది. ఫ్యాషన్ , స్టైలింగ్ పట్ల ఆసక్తి ఎక్కువట
ఇరా రావత్ గురించి నిజం ఏమిటంటే..
ఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అనే దానిపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ విడుదల కాలేదు. అయితే, కొన్ని AI డిటెక్షన్ టూల్స్ , డిజిటల్ విశ్లేషకులు ఆమె వైరల్ చిత్రాలను "అనుమానాస్పదంగా" ఫ్లాగ్ చేయడంతో ఇవి ఏఐమాయాజాలమే అనే ఊహాగానాలకు మరింత పెరిగాయి. AI-జనరేటెడ్ కంటెంట్ వాస్తవికంగా మారుతున్న నేటి డిజిటల్ యుగంలో, అసలైన, వర్చువల్ ఐడెంటిటీల మధ్య రేఖను గుర్తించడం చాలా కష్టతరంగామారింది. అందుకే గుడ్డిగా నమ్మకుండా వినియోగదారులు ఇలాంటి ప్రొఫైల్స్‌ను ఫాలో అయ్యేముందు ప్రామాణికతను ధృవీకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
(కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్)


