విదేశాల్లో చదవాలని..ఒక వ్యక్తి బంగారంలాంటి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ని కాలదన్నాడు. చివరికి అప్పులపాలై..ఎంత తక్కవ వేతనానికి పనిచేసేందుకైనా సై అంటున్నాడు.అలా కాకుండా జాబ్ చేస్తూనే లేకా కాస్త ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉన్నాక..ఆ దిశగా అడుగులు వేసిన బాగుండేది. కానీ అత్యాసతో తీసుకున్న ఈ నిర్ణయం..అతడిని ఎంతటి దయనీయ స్థితిలోకి నెట్టేసిందో చూస్తే..విదేశీ మోజులో ఉండే యువతకు అడకి కథ ఓ గొప్ప కనువిప్పు అని చెప్పొచ్చు.
ఓ వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్‌లో చేసిన పోస్ట్ పెను దుమారం రేపి వివిధ చర్చలకు దారితీసింది. ఆ పోస్ట్‌లో ఇలా ఉంది. "నా స్నేహితుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఏడాదికి ఏడు లక్షలు వేతనమిచ్చే జాబ్ ఆఫర్‌ని కాలదన్నాడు. విదేశాల్లో ఎంఎస్ చేస్తే..అంతకుమించి సంపాదించాలనే అత్యాశతో వద్దనుకున్నాడు. చివరకి తను అనుకున్నట్లుగానే యూఎస్‌లో విజయవంతంగా ఎంఎస్ పూర్తిచేశాడు.
కానీ రూ. 40 లక్షల అప్పుతో రోడ్డుపై నిలబడ్డాడు. దాంతో ఇప్పుడు కనీసం ఏడాదికి రూ. 3లక్షల వేతనమిచ్చే జాబ్‌లో అయినా చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. చూశారా..! దురాశ ఎంతటి పరిస్థితికి తీసుకొచ్చేస్తుందో తెలుసుకోండి..ఇది బంగారంలాంటి ఆఫర్లను, నిర్ణయాలను నాశనం చేసేస్తుంది తస్మాత్ జాగ్రత్త." అంటూ తన పోస్ట్‌ని ముగించాడు.
ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..చాలామంది నెటిజన్లు తమ స్నేహితులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ఇబ్బందులు పడ్డారని, అమెరికాలో చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.
One of my friends rejected a 7LPA campus job thinking it was not enough for him.
He decided to go to the US for MS instead. Now he has a Masters, 40 LPA in debt and is ready to settle for even a 3 LPA job.
Greed is the death of all good things my friends.— enji vi (@original_ngv) February 16, 2026
(చదవండి: బేబీ కేర్‌పై పరిణితి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..)


