జియోలో పని చేయాలనుకుంటే.. వచ్చేయండి! | Jio Targets Top AI Talent at India AI Impact Summit 2026 | Sakshi
Sakshi News home page

జియోలో పని చేయాలనుకుంటే.. వచ్చేయండి!

Feb 16 2026 3:59 PM | Updated on Feb 16 2026 4:20 PM

Jio Targets Top AI Talent at India AI Impact Summit 2026

ప్రతిభావంతుల అన్వేషణకు రిలయన్స్‌ జియో (Reliance Jio) సరికొత్త పంథాను ఎంచుకుంది. జియో చీఫ్ ఏఐ సైంటిస్ట్ గౌరవ్‌ అగర్వాల్‌ (Gaurav Aggarwal) తన బృందాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026 (India AI Impact Summit 2026)ను వేదికగా చేసుకుంటున్నారు. జియోలో పని చేయాలనుకునే ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఈ సమ్మిట్‌లోనే తనను నేరుగా  సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

బెంగళూరుకు చెందిన గౌరవ్‌ అగర్వాల్.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ఈ వారం మొత్తం తన బృందంతో కలిసి ఉంటానని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా ప్రకటించారు. “మా బృందాన్ని కలవండి. మేము ఏం నిర్మిస్తున్నామో మీతో పంచుకోవడానికి సంతోషిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

తాజా అప్డేట్‌లో, ఏఐAI మోడల్స్, ఆప్టిమైజేషన్, లేదా ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధిలో పనిచేస్తున్న ఇంజనీర్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. “మీరు ఏఐ సరిహద్దుల్లో నిర్మిస్తున్న ‘క్రాక్డ్ ఇంజనీర్లు’ అయితే, మాకు మీరు అవసరం. నన్ను సంప్రదించండి. మా రిక్రూట్‌మెంట్ బృందంతో మీ పరిచయాన్ని వేగంగా ట్రాక్ చేస్తాను. భారత్ కోసం, భారీ స్థాయిలో నిర్మిద్దాం!” అంటూ గౌరవ్‌ అగర్వాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఏఐ, టెక్ పరిశ్రమ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. వీరిలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌, ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌, మెటా ఛీఫ్‌ ఏఐ ఆఫీసర్‌ అలెగ్జాండర్‌ వాంగ్‌, టీసీఎస్‌ సీఈవో కృతివాసన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement