జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా.. | Reliance Jio Affordable 5G Recharge Plans in 2026 | Sakshi
Sakshi News home page

జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా..

Feb 8 2026 6:11 PM | Updated on Feb 8 2026 6:37 PM

Reliance Jio Affordable 5G Recharge Plans in 2026

భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త 5జీ రీఛార్జ్ ప్లాన్‌లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

రూ.198 రీఛార్జ్ ప్లాన్
ఇది రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటివి పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే.

రూ.349 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు. జియో హాట్‌స్టార్, జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌లతో పాటు.. మూడు నెలలు జొమాటో గోల్డ్ కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా పొందవచ్చు.

ఇదీ చదవండి: కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే!

Advertisement
 
Advertisement
Advertisement