breaking news
recharge
-
జియో రీఛార్జ్ ప్లాన్స్: తక్కువ ధర, ఎక్కువ బెనిఫిట్స్!
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.55, రూ.77, రూ.111 ఉన్నాయి. వీటి ద్వారా వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?, వ్యాలిడిటీ ఎంత? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రూ.55 ప్లాన్ఇది రిలయన్స్ జియో బడ్జెట్-ఫ్రెండ్లీ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ . కేవలం రూ. 55 ధరతో లభించే జియోటీవీ ప్రో ప్యాక్, 30 రోజుల వ్యాలిడిటీతో పాటు, జియోటీవీ యాప్ ద్వారా 16కు పైగా భాషలలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్‌ను అందిస్తుంది. టీవీ ఛానెల్‌లతో పాటు, జియోటీవీ ప్రో ప్లాన్‌లో మొత్తం 3MB డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ కేవలం మూడు రోజులు మాత్రమే. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి వాయిస్ కాలింగ్ సదుపాయం లభించదు.రూ.77 ప్లాన్ఇది ఒక డేటా వోచర్. ఈ ప్లాన్ అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఓటీటీ ప్రయోజనాలను అందించడమే. ఎందుకంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కేవలం 3 జేబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇది కూడా కేవలం 5 రోజుల వ్యాలిడిటీ మాత్రమే. సోనీలివ్ ఓటీటీ 30 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. సోనీలివ్ ద్వారా కంటెంట్‌ను చూడటానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా దానిని స్ట్రీమ్ చేసుకోవచ్చు. జియోటీవీ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.రూ.111 ప్లాన్ఇది ఒక ఫ్లెక్స్ యూత్ అండ్ గేమింగ్ ప్యాక్. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో మొత్తం 5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 28 రోజుల సమయంలో 5జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చన్నమాట. ఈ ప్యాక్‌లో మరో ప్రత్యేకమైన బెనిఫిట్ కూడా ఉంది. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్లు గేమింగ్ ప్యాక్ ఎంచుకోవచ్చు. దీనిలో జియో గేమ్ మొబైల్‌కు 56 రోజుల యాక్సెస్ లభిస్తుంది. మరోవైపు యూత్ ప్యాక్ ఎంచుకుంటే.. జియో గేమ్ మొబైల్‌తో పాటు, స్నాప్‌చాట్ ప్లస్ కూడా లభిస్తాయి. ఈ ఆప్షన్ వ్యాలిడిటీ 28 రోజులు. -
జియో రూ.149 రీఛార్జ్ ప్లాన్.. 90 రోజుల జియోహాట్‌స్టార్!
జియో వినియోగదారుల కోసం రూ.149తో జియోహాట్‌స్టార్ డేటా ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు. ఇందులో మొత్తం 10జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే.. ప్యాక్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత 30 రోజుల వ్యవధిలో 10జీబీ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు.ఈ ప్యాక్‌లో మరో ప్రత్యేక ప్రయోజనం 90 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్. దీంతో జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మొబైల్లో వీక్షించేందుకు 90 రోజుల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ముఖ్యంగా జియోహాట్‌స్టార్ కంటెంట్‌ను ఎక్కువగా చూసేవారికి, డేటా అవసరం ఉన్న జియో యూజర్లకు ఈ ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది.అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ రూ.149 ప్యాక్‌లో వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు ఉండవు. ఇది పూర్తిగా డేటా, జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాల కోసం మాత్రమే. కాబట్టి కాలింగ్, ఎస్ఎమ్ఎస్ కోసం ప్రత్యేకంగా యాక్టివ్ ప్లాన్ ఉండాల్సి ఉంటుంది.కాగా.. 10GB హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవు. ఆ తర్వాత డేటా వేగం 64 Kbpsకు తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ డేటా వినియోగించే వారికి ఇది ప్రధానంగా డేటా యాడ్-ఆన్‌గా ఉపయోగపడుతుంది. మొత్తం మీద రూ.149కు 10GB డేటా + 90 రోజుల ఎస్ఎమ్ఎస్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభించడం ఈ ప్యాక్‌లో ప్రధాన ఆకర్షణ. -
జియో రీచార్జ్: ఫ్యామిలీ ప్లాన్.. 4 సిమ్‌లకు అన్లిమిటెడ్!
డబ్బులన్నీ ఫోన్ రీచార్జ్లకే అయిపోతున్నాయి.. ఇది ప్రతి కుంటుంబంలో వినిపించే మాటే. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్దీ కుటుంబంలోని ప్రతి సభ్యుడి మొబైల్‌కు ప్రత్యేకంగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో నెలవారీ మొబైల్ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఫ్యామిలీల కోసం ఆకర్షణీయమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. జియోప్లస్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ కేటగిరీలోని రూ.449 ప్లాన్ ద్వారా ఒకే కనెక్షన్ కింద గరిష్ఠంగా నలుగురు కుటుంబ సభ్యుల సిమ్‌లను నిర్వహించుకోవచ్చు.రూ.449 ప్లాన్‌తో నాలుగు నంబర్లుఈ ప్లాన్‌లో ప్రైమరీ సిమ్‌కు నెలకు రూ.449 చెల్లించాలి. దీనికి కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవాలంటే ఒక్కో అదనపు సిమ్‌కు నెలకు రూ.150 చొప్పున చెల్లించాలి. గరిష్ఠంగా మూడు అదనపు సిమ్‌లను జోడించవచ్చు. అంటే నాలుగు సిమ్‌లను కలిపి వినియోగిస్తే నెలవారీ ఖర్చు రూ.899 అవుతుంది. ఈ లెక్కన ఒక్కో సిమ్‌కు నెలకు సగటున రూ.225 మాత్రమే ఖర్చవుతుంది.90GB వరకు షేరింగ్ డేటాడేటా ప్రయోజనాల విషయానికి వస్తే, ప్రైమరీ కనెక్షన్‌కు 75GB షేరింగ్ డేటా లభిస్తుంది. అదనంగా జోడించే ప్రతి సిమ్‌కు ఫ్యామిలీ డేటా పూల్‌లో మరో 5GB డేటా చేరుతుంది. మూడు అదనపు సిమ్‌లను జోడిస్తే 15GB అదనపు డేటా లభిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఉపయోగించుకునే మొత్తం డేటా 90GBకి చేరుతుంది. అంతేకాకుండా అర్హత ఉన్న ప్రాంతాలు, ఫోన్లలో జియో ట్రూలీ అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం కూడా అందిస్తుంది. కుటుంబ సభ్యులు తమ అవసరాలకు అనుగుణంగా షేరింగ్ డేటాను వినియోగించుకోవచ్చు.అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత రోమింగ్డేటాతో పాటు ఈ ప్లాన్‌లో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నాలుగు సిమ్ల వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, దేశవ్యాప్తంగా నేషనల్ రోమింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ప్రతి సిమ్‌కు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి. కుటుంబంలోని నలుగురు సభ్యులకు విడివిడిగా ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు చేయడం కంటే ఒకే ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లో సిమ్‌లను నిర్వహించుకోవడం కొందరు వినియోగదారులకు సౌకర్యవంతమైన, ఖర్చు తగ్గించుకునే ప్రత్యామ్నాయంగా మారవచ్చు. -
జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్!
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.111 కూడా ఒకటి. ఇది ఒక ఫ్లెక్స్ యూత్ అండ్ గేమింగ్ ప్యాక్. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో మొత్తం 5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 28 రోజుల సమయంలో 5జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చన్నమాట.ఈ ప్యాక్‌లో మరో ప్రత్యేకమైన బెనిఫిట్ కూడా ఉంది. ఇందులో రెండు ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్‌ను మీరు ఎంచుకోవచ్చు.గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్లు గేమింగ్ ప్యాక్ ఎంచుకోవచ్చు. దీనిలో జియో గేమ్ మొబైల్‌కు 56 రోజుల యాక్సెస్ లభిస్తుంది. మరోవైపు యూత్ ప్యాక్ ఎంచుకుంటే.. జియో గేమ్ మొబైల్‌తో పాటు, ఫ్యాన్ కోడ్, స్నాప్‌చాట్ ప్లస్ కూడా లభిస్తాయి. ఈ ఆప్షన్ వ్యాలిడిటీ 28 రోజులు.అయితే.. ఈ బెనిఫిట్స్ పొందాలంటే మైజియోలో ఇచ్చే ఓచర్‌ను రీడీమ్ చేసుకోవాలి. రీచార్జ్ చేసిన తేదీ నుంచి 28 రోజుల్లోపు ఓచర్‌ను రీడీమ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎంచుకున్న బెనిఫిట్ యాక్టివేట్ అవుతుంది.మొత్తం మీద ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 5జీబీ డేటాతో పాటు, గేమింగ్, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. గేమింగ్ ఎక్కువగా చేసే వాళ్లకు గేమింగ్ ప్యాక్, సోషల్ మీడియా, స్పోర్ట్స్, గేమింగ్ ఇష్టపడే వాళ్లకు యూత్ ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది. -
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: అదిరిపోయే ఆఫర్..
రిలయన్స్ జియో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన వినియోగదారుల కోసం మెగా వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌లో టెలికాం సేవలను ప్రారంభించిన జియో.. ఈ ప్రత్యేక సందర్భంలో రూ.3,599 విలువైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాది మొత్తం కనెక్టివిటీతో పాటు ఎంటర్టైన్మెంట్, క్లౌడ్, ఏఐ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది.రూ.3,599 ప్లాన్‌లో ఏమేం లభిస్తాయి?ఈ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. వినియోగదారులకు ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా చొప్పున ఏడాదికి మొత్తం 912.5GB డేటా అందుతుంది. దీంతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5G డేటా ప్రయోజనం కూడా ఉంటుంది.నెలనెలా రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి ఈ వార్షిక ప్లాన్ ఉపయోగకరంగా ఉండనుంది. బేస్ ప్యాక్‌లో భాగంగా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి సేవలకు కూడా యాక్సెస్ లభిస్తుంది.అదనపు ప్రయోజనాలు ఇవే..కనెక్టివిటీ ప్రయోజనాలకు అదనంగా జియో ఈ ప్లాన్‌లో పలు ఎంటర్టైన్మెంట్, డేటా బెనిఫిట్స్‌ను అందిస్తోంది.జియో హాట్‌స్టార్: హాలీవుడ్ కంటెంట్‌తో కూడిన మొబైల్ సబ్స్క్రిప్షన్.జియో టీవీ ప్రో: 1,000కుపైగా టీవీ ఛానళ్లకు యాక్సెస్. రూ.55 చొప్పున 12 నెలల వోచర్ రూపంలో ప్రయోజనం.డేటా బూస్టర్: 12 నెలల పాటు ప్రతి నెల అదనంగా 10GB డేటా.జియో ఏఐ క్లౌడ్: బేస్ స్టోరేజ్‌కు అదనంగా 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్.రూ.35,100 గూగుల్ జెమిని ప్రో ఉచితంఈ వార్షికోత్సవ ఆఫర్లో అత్యంత ఆకర్షణీయమైన ప్రయోజనం గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్స్క్రిప్షన్. అర్హత కలిగిన జియో వినియోగదారులకు 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని విలువ రూ.35,100గా పేర్కొంది. ఇందులో 5,000GB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు అధునాతన AI ఆధారిత ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.షాపింగ్, ట్రావెల్‌పై ప్రత్యేక వోచర్లుమైజియో యాప్ ద్వారా వినియోగదారులకు పలు భాగస్వామ్య సంస్థల వోచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.ఈజ్‌మైట్రిప్: విమాన టికెట్లపై రూ.2,200 వరకు తగ్గింపు.అజియో: రూ.1,000 కంటే ఎక్కువ విలువైన షాపింగ్‌పై రూ.200 తగ్గింపు.సినీపోలిస్: కనీసం రూ.550 విలువైన రెండు టికెట్లపై ఫ్లాట్ రూ.150 తగ్గింపు. (ఈ ఆఫర్ మంగళవారం వర్తించదు.)మొత్తంగా చూస్తే.. రూ.3,599 వార్షిక ప్లాన్ ద్వారా ఏడాది పాటు డేటా, అపరిమిత కాలింగ్, SMSలతో పాటు 5G, OTT, క్లౌడ్ స్టోరేజ్, AI సేవలు, షాపింగ్, ట్రావెల్ ప్రయోజనాలను ఒకే ప్యాక్‌లో అందించేందుకు జియో ప్రయత్నిస్తోంది. -
జియో రూ.77 రీచార్జ్ ప్లాన్ గురించి తెలుసా?
రిలయన్స్ జియో వినియోగదారుల కోసం రూ. 77 ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తోంది. ఇది ఒక డేటా వోచర్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దీనితో పాటు ఓటీటీ ప్రయోజనం కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.జియో రూ.77 ప్లాన్ అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఓటీటీ ప్రయోజనాలను అందించడమే. ఎందుకంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కేవలం 3 జేబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇది కూడా కేవలం 5 రోజుల వ్యాలిడిటీ మాత్రమే.సోనీలివ్ ఓటీటీ 30 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. సోనీలివ్ ద్వారా కంటెంట్‌ను చూడటానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా దానిని స్ట్రీమ్ చేసుకోవచ్చు. జియోటీవీ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.రూ.55 ప్లాన్తమ స్మార్ట్ఫోన్ల నుండే టీవీ ఛానెళ్లను చూడాలనుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియో బడ్జెట్-ఫ్రెండ్లీ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ప్రవేశపెట్టింది. కేవలం రూ. 55 ధరతో లభించే జియోటీవీ ప్రో ప్యాక్, 30 రోజుల వ్యాలిడిటీతో పాటు, జియోటీవీ యాప్ ద్వారా 16కు పైగా భాషలలో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్‌ను అందిస్తుంది.టీవీ ఛానెల్‌లతో పాటు, జియోటీవీ ప్రో ప్లాన్‌లో మొత్తం 3MB డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ కేవలం మూడు రోజులు మాత్రమే. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి వాయిస్ కాలింగ్ సదుపాయం లభించదు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ ప్యాక్ మాత్రమే.ఇదీ చదవండి: ఖాతాదారులకు అలర్ట్: 3 రోజులు బ్యాంకులు బంద్! -
జియో రీచార్జ్ ప్లాన్: 200 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్లు!
దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులకు దేశీయ ప్రముఖ టెలికమ్ ఆపరేటర్ జియోలో ఆకర్షణీయ ప్లాన్ అందుబాటులో ఉంది. తరచూ రీచార్జ్ చేసుకునే అవసరం లేకుండా ఎక్కువ వ్యాలిడిటీతో పాటు డేటా, కాలింగ్, ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్, ఏఐ సేవలు అందించే ప్లాన్‌ను జియో అందిస్తోంది. రూ.2,025 ధర కలిగిన ఈ ప్లాన్ 200 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో మొత్తం 500GB హైస్పీడ్ డేటాతో పాటు పలు అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.2,025 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 500GB డేటా లభిస్తుంది. అంటే రోజుకు సగటున 2.5GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. నిర్దేశిత డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకు తగ్గుతుంది. అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమిత 5G డేటా కూడా అందుబాటులో ఉంటుంది.డేటాతో పాటు ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది. అలాగే ప్రతిరోజూ 100 SMSలను ఉచితంగా పంపుకోవచ్చు. దీంతో కాలింగ్, SMS కోసం ప్రత్యేకంగా మరో ప్యాక్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు.ఈ ప్లాన్ ప్రత్యేకత కేవలం డేటా, కాలింగ్‌కే పరిమితం కాదు. ఇందులో జియో హాట్‌స్టార్ మొబైల్ (Mobile + Hollywood) సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అలాగే జియో ఏఐ క్లౌడ్‌లో 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ పొందవచ్చు.ఇక ఏఐ సేవలను వినియోగించుకునే వారికి మరో కీలక ప్రయోజనం ఉంది. అర్హత కలిగిన కస్టమర్లకు 18 నెలల గూగుల్ జెమినై ప్రో (Google Gemini Pro) సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వాస్తవంగా దీని విలువ రూ.35,100 ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో 5,000GB క్లౌడ్ స్టోరేజ్, న్యానో బనానా సహా పలు AI ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. -
రోజుకు రూ.10లోపే.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం 299 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 299 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 3 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుకు రోజుకు రూ.10 కంటే (రూ.9.96) తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ ధరలో మంచి ప్లాన్ కోసం ఎదురు చూసేవారికి ఇది మంచి ఆప్షన్స్.Your day has a lot to do, and a lot to say.#BSNLIndia #BSNLSelfCareApp #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #299plan @CMDBSNL @robertravi21 pic.twitter.com/NivCHPXBKr— BSNL India (@BSNLCorporate) August 31, 2026 -
జియో రీచార్జ్: రూ.199కే 1.5 GB ప్లాన్
తక్కువ ధరలో ఎక్కువ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వినియోగదారులకు జియో ప్రీపెయిడ్‌లో రూ.199 రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 18 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 27GB డేటాను వినియోగించుకోవచ్చు.ఈ రూ.199 ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. అలాగే జియో యాప్స్‌కు సంబంధించిన జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అన్లిమిటెడ్ 5G డేటా కావాలంటే ప్రత్యేక 5G యాడ్ఆన్ ద్వారా పొందవచ్చు.దీంతోపాటు జియో ప్రస్తుతం రోజుకు 1.5GB డేటాతో నెలవారీ ప్లాన్లను కూడా అందిస్తోంది. రూ.319 ప్లాన్‌లో 1.5GB రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, జియో యాప్ ప్రయోజనాలు, ఒక నెల వ్యాలిడిటీ ఉన్నాయి. మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్సైట్లో ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను రీచార్జ్ చేసుకోవచ్చు. -
ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!
ఎయిర్టెల్ యూజర్ల కోసం ప్రస్తుతం ఎన్నో రకాల ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రోజువారీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 5G డేటా, OTT సబ్స్క్రిప్షన్లు కావాలనుకునే వారికి కొన్ని ప్లాన్స్ ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఈ కథనంలో రోజుకు 2.5GB డేటా లభించే మూడు ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.రూ.399 ప్లాన్ఎయిర్టెల్ రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 2.5జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 70జీబీ డేటాను వినియోగించుకోవచ్చన్నమాట. అన్లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు. రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. దీంతో పాటు 28 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, హలో ట్యూన్స్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం యాక్సెస్ లభిస్తాయి.రూ.1,199 ప్లాన్ఎక్కువ కాలం రీచార్జ్ గురించి ఆలోచించకుండా ఉండాలనుకునే వారికి రూ.1,199 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2.5జీబీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. సబ్స్క్రైబర్లు ప్లాన్ కాల వ్యవధిలో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. రోజువారీ డేటా పరిమితి అయిపోగానే, మరుసటి రోజు వరకు ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది.రూ.3,999 ప్లాన్తరచూ రీచార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి రూ.3,999 ప్లాన్ మంచి ఆప్షన్. ఈ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రీఛార్జ్ చేసుకోవలసిన అవసరం లేదు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అదనంగా మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.ఏ ప్లాన్ తీసుకోవాలి?నెలనెలా రీచార్జ్ చేసుకునే అలవాటు ఉన్నవారికి రూ.399 ప్లాన్ సరిపోతుంది. 84 రోజుల వ్యాలిడిటీతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ కావాలనుకునే వారికి రూ.1,199 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఏడాది పాటు ఒకే రీచార్జ్‌తో డేటా, కాలింగ్, 5జీ సేవలు కొనసాగాలనుకునే వారికి రూ.3,999 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. -
జియో రీచార్జ్ ప్లాన్: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్!
మొబైల్ రీఛార్జ్ విషయంలో ఎక్కువ వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, అపరిమిత 5జీ, కాలింగ్, ఎస్ఎంఎస్, ఎంటర్టైన్మెంట్, ఏఐ సేవలు అందించే ప్లాన్లకు ప్రస్తుతం వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో అందిస్తున్న రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ పలు ప్రయోజనాలతో ఆకట్టుకుంటోంది. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే 98 రోజుల పాటు సేవలు పొందొచ్చు.98 రోజుల వ్యాలిడిటీ.. 196 జీబీ డేటారూ.999 ప్లాన్‌లో 98 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం వ్యాలిడిటీ కాలంలో 196 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందిస్తారు. తరచూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దాదాపు మూడు నెలల పాటు ఈ సేవలను పొందవచ్చు.5జీ యూజర్లకు అపరిమిత డేటా5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు జియో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్‌తో అపరిమిత 5జీ డేటా ప్రయోజనం లభిస్తుంది. 5జీ సేవలు అందుబాటులో లేకపోతే రోజువారీ 2 జీబీ హైస్పీడ్ డేటా వినియోగం పూర్తయ్యాక ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.జియోహాట్‌స్టార్, గూగుల్ ఏఐ ప్రోఈ ప్లాన్‌లో వినోదం కోసం జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో 5,000 జీబీ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, జెమిని ప్రో యాక్సెస్‌తో పాటు నానో బనానా సహా పలు ఏఐ ఫీచర్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జియో క్లౌడ్ ద్వారా అదనంగా 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనం కూడా లభిస్తుంది.సబ్స్క్రిప్షన్ కొనసాగాలంటే ఇదే కీలకంఅయితే జియోహాట్‌స్టార్, గూగుల్ ఏఐ ప్రో ప్రీమియం ప్రయోజనాలకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈ ప్రయోజనాలను యాక్టివ్‌గా కొనసాగించేందుకు తదుపరి నెలల్లో కనీసం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 5జీ డేటాతో పాటు ఎంటర్టైన్మెంట్, ఏఐ సేవలను ఒకే ప్లాన్‌లో కోరుకునే వారికి రూ.999 రీఛార్జ్ ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. -
టైర్ అయ్యాం అవుదాం మినీ రిటైర్
ఉదయం లేచింది మొదలు రాత్రి స్టవ్ కట్టేసే వరకు ఉరుకుల పరుగుల జీవితం. పెళ్లి, పిల్లలు, ఇల్లు, ఆఫీస్ డెడ్‌లైన్స్... కెరీర్ రేసులో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆధునిక మహిళలు 2026లో కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. అదే ‘మినీ రిటైర్మెంట్’. 60 ఏళ్లకు తీసుకునే రిటైర్మెంట్ కాకుండా కెరీర్ మధ్యలోనే 3 నుండి 6 నెలలు బ్రేక్ తీసుకుని లైఫ్‌ను రీఛార్జ్ చేసుకుంటున్నారు. మన దేశంలో ఈ ధోరణి పట్ల 85 శాతం ఆసక్తితో ఉంటే 35 శాతం ఆచరణలో చూపుతున్నారు.హైదరాబాద్‌లోని ఒక లీడింగ్ ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్న కావ్య (32) ఐదేళ్లుగా రాత్రింబగళ్లు ప్రాజెక్టులతో కుస్తీ పట్టింది. శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడి లోనైంది. రెజ్యూమేలో గ్యాప్ వస్తే కెరీర్ పాడవుతుందన్న భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా నాలుగు నెలల‘మినీ–రిటైర్మెంట్’ తీసుకుంది. ఫోన్ పక్కన పడేసి, కేరళలో ఆయుర్వేద డిటాక్స్ తీసుకుంటూ, చిన్నప్పుడు వదిలేసిన పెయింటింగ్ మళ్లీ మొదలుపెట్టింది. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో మళ్లీ ఆఫీసులో అడుగుపెట్టింది.ఒక ఎడ్–టెక్ స్టార్టప్‌లో కస్టమర్ సపోర్ట్ హెడ్‌గా ఉన్న సుజాత (36) ఆఫీస్ ఒత్తిడికి తోడు ఇంట్లో బాధ్యతలు ఎక్కువై డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇలా అయితే లాభం లేదని దాచుకున్న డబ్బుతో మూడు నెలలు లీవ్ పెట్టి కేవలం పిల్లలతో గడపడానికి, యోగా నేర్చుకోవడానికి ఆ సమయాన్ని వాడుకుంది. ఈ చిన్న బ్రేక్ ఆమెకు కొత్తజన్మను ఇచ్చింది. ఈ ఇద్దరి కథలూ 2026లోమహిళల మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి.ఎందుకీ ధోరణి?మహిళలపై సమాజం మోపుతున్న ‘సూపర్ ఉమెన్’ ట్యాగ్ వారిపై భారానికి కారణమవుతోంది. ఇటు ఆఫీసులో మగవారితో సమానంగా టార్గెట్లు రీచ్ అవ్వాలి... అటు ఇంట్లో పర్ఫెక్ట్ కోడలిగా, భార్యగా, తల్లిగా బాధ్యతలు నెరవేర్చాలి. ఈ ‘మల్టీ టాస్కింగ్’ వల్ల మహిళల్లో విపరీతమైన యాంగ్జయిటీ, ఇన్సోమ్నియా (నిద్రలేమి) వంటి సమస్యలు పెరిగిపోయాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే సమయం దొరకని పరిస్థితి. ‘ఇలాగే పరిగెడితే ఆరోగ్యం పాడవుతుంది, కొన్నాళ్లు బ్రేక్ తీసుకోక తప్పదు’ అనే సామాజిక అవసరం ఏర్పడింది. బాస్ భరోసా ఇస్తున్నారా? ఒకప్పుడు ‘కెరీర్ గ్యాప్’ ఉంటే రెజ్యూమేలను డస్ట్‌బిన్ లో వేసే కంపెనీలు 2026లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ‘సబాటికల్ లీవ్స్’ (జీతం లేని దీర్ఘకాలిక సెలవులు) ఇస్తూ ‘మీరు బ్రేక్ తీసుకుని రండి,మీ సీటు భద్రంగా ఉంటుంది’ అని భరోసా ఇస్తున్నాయి. అయితే కుటుంబాల నుండి మద్దతు విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. విద్యావంతులైన భర్తలు, ఆధునిక కుటుంబాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే సంప్రదాయ మధ్యతరగతి ఇళ్లలో మాత్రం ‘ఉన్న ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వడం ఏంటి? పిచ్చి కాకపోతే’ అనే ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ మహిళలు వీటన్నింటినీ దాటి తమ ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.సగటు మహిళ ఏం నేర్చుకోవాలి? మరి నెలజీతం వస్తేనే ఇల్లు గడిచే సగటు మధ్యతరగతి మహిళలు, ఒక్క రోజు కూడా లీవ్ దొరకని చిన్న ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి ఏంటి? వారు ఈ ధోరణిని ఎలా అడాప్ట్ చేసుకోవాలి? దీనికి పెద్ద పెద్ద ప్లాన్స్ అక్కర్లేదు. ‘మినీ రిటైర్మెంట్’ అనే భావనను మీ రోజువారీ జీవితంలోకి మార్చుకోవచ్చు. ‘నో ఆఫీస్ టాక్’: శనివారం లేదా ఆదివారం కనీసం ఒక అరపూట ఫోన్ ను, ఆఫీస్ మెయిల్స్ ను పూర్తిగా పక్కన పెట్టేయండి.మైక్రోబ్రేక్స్: నెలకు ఒక శనివారం ఇంట్లో వంట పనికి సెలవు పెట్టి, హోటల్ నుండి తెప్పించుకోండి. ఆ సమయాన్ని మీకోసం కేటాయించుకోండి.నో చెప్పడం నేర్చుకోండి: ఆఫీసులో మీ పని పరిధి దాటి వచ్చే అదనపు ఒత్తిళ్లకు, ఇంట్లో అనవసరపు బాధ్యతలకు సున్నితంగా ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి. పెద్ద బ్రేక్ తీసుకోకపోయినా ఈ చిన్న మార్పులు మీ మైండ్‌ను రీఛార్జ్ చేస్తాయి.జీవితం అంటే కేవలం సంపాదించడం, బాధ్యతలు మోయడమే కాదు... అందులో మనకూ ఒక స్థానం ఉండాలి. రేసుగుర్రాల్లా పరిగెత్తడం కాసేపు ఆపి, కాస్త అలసట తీర్చుకోవడంలో తప్పు లేదు. మన ఆరోగ్యం బాగుంటేనే, మన కుటుంబం, కెరీర్ బాగుంటాయి. కాబట్టి వీలైతే కొన్ని నెలలు, లేదంటే కనీసం వారంలో కొన్ని గంటలైనా మీ కోసం మీరు ‘మినీ–రిటైర్’అవ్వండి. జీవితాన్ని మళ్లీ ఆస్వాదించండి!నగరాల్లో మహిళల మినీ రిటైర్మెంట్బెంగళూరు: ఇక్కడ 35% మహిళలు టెక్ కంపెనీలలో కోడింగ్ డెడ్‌లైన్స్ తట్టుకోలేక 35 ఏళ్ల లోపే 6 నెలల సబాటికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.హైదరాబాద్: గచ్చిబౌలి, మాదాపూర్ ఐటీ కారిడార్లలోని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు, ఫైనాన్షియల్ సెక్టార్లలో పని చేసే మహిళల్లో 28 శాతం ‘మెంటల్ హెల్త్ బ్రేక్స్’ కోసం కంపెనీల నుండి భరోసా పొందుతున్నారు.ముంబై: ఇక్కడ 22% మంది మహిళలు అడ్వర్టయిజింగ్, మీడియా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగాల్లో బ్రేక్స్ తీసుకుని సోలో ట్రావెలింగ్కు వెళ్తున్నారు.ఢిల్లీ: గుర్గావ్, నోయిడా పరిసర ప్రాంతాల్లో 15% మహిళలు కాలుష్యం, లాంగ్ కమ్యూటింగ్ (ప్రయాణ ఒత్తిడి) వల్ల బర్నౌట్ అయి డిజిటల్ డిటాక్స్ కోసం విరామం తీసుకుంటున్నారు. -
జియో మెంబర్షిప్.. రూ.300తో టెన్షన్ లేని రీఛార్జ్!
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం 'జియో ప్రైమ్ మెంబర్షిప్'ను(Jio Prime Membership) తీసుకొచ్చింది. జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మెంబర్‌షిప్‌ను రీలాంచ్ చేసింది. అయితే.. ఈసారి ప్రైమ్‌లో ప్రధాన ఆకర్షణ కేవలం అదనపు ఆఫర్లు కాదు.. టారిఫ్ ధరలు పెరిగినా కస్టమర్లపై ఆ భారం పడకుండా రక్షణ కల్పించడం.రూ.300 చెల్లిస్తే..జియో ప్రైమ్ మెంబర్షిప్ కోసం ఒక్కసారి రూ.300 చెల్లించాలి. ఈ మెంబర్షిప్ జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. సభ్యత్వం తీసుకున్న తర్వాత.. ప్లాన్స్ ధరలు పెరిగినా, ప్రస్తుతం ఉన్న ధరలకే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం మెంబర్షిప్ తీసుకున్న వాళ్లకు మాత్రమే. ఇది 5 సెప్టెంబర్ 2027 వరకు వర్తిస్తుంది. అంటే ఏడాది పాటు రీఛార్జ్ ధరలు పెరిగినా భయం లేదన్నమాట.రూ.600 క్యాష్‌బ్యాక్జియో ప్రైమ్‌లో సభ్యత్వం తీసుకున్న వారికి రూ.600 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లు కూడా లభిస్తాయి. ఇందులో రూ.300 క్యాష్‌బ్యాక్‌ను కొత్త జియో హోమ్ లేదా జియో పీసీ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. మరో రూ.300 వోచర్‌ను స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కోసం కొత్త జియో సిమ్ కనెక్షన్ తీసుకునేటప్పుడు పొందవచ్చు.కొత్త సేవలకు ముందుగానే యాక్సెస్ప్రైమ్ సభ్యులకు జియో తీసుకొచ్చే కొత్త ఉత్పత్తులు, సేవలు, ట్రయల్స్‌కు ముందస్తు యాక్సెస్ కూడా లభిస్తుంది. అంతేకాదు.. కస్టమర్లకు ప్రత్యేకంగా ప్రయారిటీ కస్టమర్ సపోర్ట్ అందించేందుకు ప్రత్యేక సర్వీస్ ఛానల్‌ను కూడా జియో ఏర్పాటు చేయనుంది. మెంబర్షిప్ వ్యవధిలో మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.ఎవరు తీసుకోవచ్చు?ప్రస్తుతం జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ వాడుతున్న అందరు జియో కస్టమర్లు రూ.300 చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అయితే.. ఇతర నెట్‌వర్క్‌లలో ఉన్నవారు జియోకి మారడం లేదా కొత్త జియో కనెక్షన్ తీసుకోవడం ద్వారా ఈ మెంబర్‌షిప్‌లో చేరవచ్చు.ఎక్కడ తీసుకోవాలి?జియో ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకునే వారు మైజియో యాప్ లేదా జియో.కామ్, జియో స్టోర్స్, జియో పార్ట్నర్ స్టోర్స్ ద్వారా తీసుకోవచ్చు. తరచూ రీఛార్జ్ ధరలు పెరుగుతాయేమోనని ఆందోళన చెందే జియో కస్టమర్లకు ఇది ఉపయోగపడుతుంది. -
ఒక్కసారే రీచార్జ్.. 412 రోజులు నో టెన్షన్!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 2399 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.నిజానికి చాలా కంపెనీలు యాన్యువల్ ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం మరో 47 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తుంది. అంటే ఏడాది పూర్తయినా ఇంకా కొన్ని రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.This Independence Day, give yourself the freedom from frequent recharges.Get 412 days of BSNL connectivity with one recharge, including 47 extra days beyond a year.Recharge smart via #BReX 👉 https://t.co/SpaVXw85OI#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife… pic.twitter.com/qGtt7WkKxS— BSNL India (@BSNLCorporate) August 13, 2026 -
రీచార్జ్ షాక్.. నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు
ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు భారతి ఎయిర్టెల్ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరల వద్ద ఉన్న నాలుగు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను కంపెనీ తొలగించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆయా ప్లాన్లను వినియోగిస్తున్న కస్టమర్లు ఇకపై అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ప్యాక్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా రూ.299 ప్లాన్ తొలగింపు వినియోగదారులపై ఎక్కువ ప్రభావం చూపనుంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందించే ఈ ప్లాన్‌కు బదులుగా ఇప్పుడు రూ.349 ప్యాక్ ప్రధాన ప్రత్యామ్నాయంగా మారింది. ఇందులో రోజుకు 2 జీబీ డేటాతో పాటు ఇతర సాధారణ ప్రయోజనాలు లభిస్తాయి. అంటే గతంలో రూ.299 చెల్లించిన వినియోగదారుడు ఇప్పుడు అదే తరహా నెలవారీ రీచార్జ్ కోసం కనీసం రూ.50 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సుమారు 16.7 శాతం పెరుగుదలకు సమానం.మధ్యస్థ ధరల విభాగంలోనూ ఎయిర్టెల్ కొన్ని ఎంపికలను తగ్గించింది. రూ.579, రూ.619, రూ.649 ప్యాక్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆయా ధరల వద్ద రీచార్జ్ చేసుకునే అవకాశం కస్టమర్లకు తగ్గింది. తాజా నివేదికల ప్రకారం, కొన్ని సర్కిళ్లలో మరికొన్ని ప్లాన్లలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రతి వినియోగదారుడి ఎయిర్టెల్ నంబర్, సర్కిల్‌ను బట్టి ప్రస్తుతం కనిపించే ప్లాన్లు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది.ఈ పరిణామాన్ని సాధారణ టారిఫ్ పెంపుగా కాకుండా, ఎంపిక చేసిన ధరల విభాగాల్లో ప్లాన్లను పునర్వ్యవస్థీకరించే చర్యగా చూడవచ్చు. చౌకైన ప్యాక్‌లను తొలగించి తదుపరి ధరల ప్లాన్ల వైపు కస్టమర్లను మళ్లించడం ద్వారా ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచుకోవడం కంపెనీ వ్యూహంలో భాగమై ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
జియో రీచార్జ్: ఇవి టెన్షన్ లేని మంత్లీ ప్లాన్లు!
ప్రతి నెలా మొబైల్ రీచార్జ్ పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే చాలా ప్లాన్లు 28 రోజుల వాలిడిటీతోనే ఉంటాయి. అయితే నెలనెలా రీచార్జ్ చేసుకునే వారికి రిలయన్స్ జియోకు చెందిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు ఉపయోగకరంగా ఉన్నాయి. రూ.319, రూ.339 ధరలతో లభించే ఈ ప్లాన్లలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందుతాయి. ముఖ్యంగా వీటికి నెలవారీ సర్వీస్ వాలిడిటీ ఉండటం ప్రత్యేకత. అంటే ప్రతి 28 రోజులకు ఒకసారి రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.రూ.319 ప్లాన్.. ఏం లభిస్తాయంటే?జియో రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితోపాటు 18 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ సబ్స్క్రిప్షన్ విలువ రూ.35,100గా కంపెనీ పేర్కొంటోంది. 5,000 జీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే రోజువారీ డేటా పరిమితి 1.5 జీబీ కావడంతో అదనపు 5జీ డేటా ప్రయోజనం ఇందులో లేదు. జియో టీవీ, జియో ఏఐ లౌడ్ వంటి సేవలు కూడా బండిల్‌గా వస్తాయి.రూ.339 ప్లాన్.. అదనంగా టాక్టైమ్రూ.339 ప్రీపెయిడ్ ప్లాన్‌లోనూ రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనికి కూడా నెలవారీ వాలిడిటీ ఉంటుంది. రూ.319 ప్లాన్‌తో పోలిస్తే ఇందులో రూ.14.95 విలువైన టాక్‌టైమ్ అదనంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌లోనూ గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్, జియో టీవీ, జియో ఏఐ లౌడ్ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే 5జీ డేటా ప్రత్యేకంగా అందుబాటులో ఉండదు.ఈ రెండు ప్లాన్లు దేశవ్యాప్తంగా అన్ని జియో టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు మైజియో యాప్ ద్వారా వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు. తరచూ రీచార్జ్ గడువు గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది లేకుండా నెలవారీ వాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. -
జియో రీఛార్జ్: బడ్జెట్ నుంచి యాన్యువల్ ప్లాన్స్ వరకు!
2026 నాటికి రిలయన్స్ జియో ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది అన్లిమిటెడ్ ప్లాన్ల బేస్ ఎంట్రీ పాయింట్ రెండుసార్లు పెరగడంతో పాటు.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఓటీటీ యాప్స్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ ప్రీమియం, ఏఐ సబ్స్క్రిప్షన్లు వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ కథనంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముఖ్యమైన ప్లాన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.బడ్జెట్ ప్లాన్లుతక్కువ ఖర్చుతో ఇంటర్నెట్, కాలింగ్ కావాలనుకునే వారికి జియో రెండు ప్రధాన ప్లాన్లను అందిస్తోంది.➤ రూ.199 ప్లాన్ ద్వారా 18 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇది ప్రధానంగా డేటా వినియోగదారుల కోసం రూపొందించిన ప్లాన్.➤రూ.349 ప్లాన్ ప్రస్తుతం జియోలో అత్యంత చౌకైన అన్లిమిటెడ్ ప్లాన్. దీని ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అలాగే జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సేవలు లభిస్తాయి.ధరలు ఎందుకు పెరిగాయి?గత ఏడాది నుంచి జియో అన్లిమిటెడ్ ప్లాన్ల ధరలను రెండుసార్లు పెంచింది. ఒకప్పుడు రూ.249గా ఉన్న అన్లిమిటెడ్ ప్లాన్ ముందుగా రూ.299కి, ఇప్పుడు రూ.349కి చేరింది. దీంతో వినియోగదారులు కొంత ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నా, అదనంగా ఓటీటీ వంటి ప్రయోజనాలు కూడా అందిస్తున్నారు.మధ్యశ్రేణి ప్లాన్స్28 రోజుల కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి ఈ ప్లాన్స్. ఈ ప్లాన్‌లన్నింటిలో కూడా అపరిమిత కాలింగ్, ఇతర సాధారణ జియో ప్రయోజనాలు లభిస్తాయి.➜రూ.666 ప్లాన్: 70 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ డేటా.➜రూ.719 ప్లాన్: 70 రోజులు, రోజుకు 2 జీబీ డేటా.➜రూ.799 ప్లాన్: 84 రోజులు, రోజుకు 1.5 జీబీ డేటా.➜రూ.899 ప్లాన్: 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా.➜రూ.1199 ప్లాన్: 84 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా.నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రత్యేక ప్లాన్లువినోదాన్ని ఇష్టపడే వినియోగదారుల కోసం జియో నెట్‌ఫ్లిక్స్‌తో కూడిన ప్రత్యేక ప్లాన్లను కూడా అందిస్తోంది.➯రూ.1299 ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.➯రూ.1799 ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తున్నారు.యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్స్తరచూ రీఛార్జ్ చేయడం ఇష్టం లేని వారికి జియో ఏడాది వ్యాలిడిటీతో రెండు ప్రధాన ప్లాన్లు అందిస్తోంది.➢రూ.3599 ప్లాన్ ద్వారా 365 రోజుల పాటు రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో యాప్స్ యాక్సెస్ లభిస్తాయి.➢రూ.3999 ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎక్కువ డేటా వినియోగించే వారికి ఇది ఫ్లాగ్షిప్ వార్షిక ప్లాన్‌గా అందుబాటులో ఉంది.జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగినా.. ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ ప్రీమియం, ఏఐ సేవలు వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాకుండా.. వినోదం, డిజిటల్ సేవలను కూడా ఒకే రీఛార్జ్‌లో పొందాలనుకునే వినియోగదారులకు ఈ కొత్త ప్లాన్లు మంచి ఎంపిక అనే చెప్పాలి. -
ఎయిర్టెల్ రీచార్జ్ షాక్: ఆ ప్లాన్ ఇక లేదు!
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. కంపెనీ అధికారిక వెబ్సైట్, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొన్ని సర్కిళ్లలో తొలగించింది. దీంతో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ కలిగిన ఎంట్రీ-లెవల్ ప్లాన్‌గా ఇప్పుడు రూ.349 ప్లాన్ నిలిచింది.ఈ మార్పును పలు టెక్నాలజీ వెబ్సైట్లు గుర్తించగా, కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు కూడా రూ.299 ప్లాన్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ మార్పు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందా, లేక ఎంపిక చేసిన టెలికాం సర్కిళ్లకే పరిమితమా అనే విషయంపై ఎయిర్టెల్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇప్పటి వరకు రూ.299 ప్లాన్‌లో 28 రోజుల చెల్లుబాటు, రోజుకు 1GB హైస్పీడ్ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, హలోట్యూన్స్తో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో వంటి అదనపు ప్రయోజనాలు లభించేవి. ఈ ప్లాన్ అందుబాటులో లేకపోవడంతో అదే తరహా వినియోగదారులు ఇప్పుడు రూ.349 ప్లాన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.రూ.349 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదనంగా ఆరు నెలల పాటు ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ హలోట్యూన్స్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి డిజిటల్ ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం రూ.399 ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటాతో పాటు 28 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.ఇదిలా ఉండగా, టిప్‌స్టర్ సంజూ చౌదరి వెల్లడించిన సమాచారం ప్రకారం రూ.579, రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సర్కిళ్లలో తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్లాన్లు ఇంకా కొన్ని ఇతర సర్కిళ్లలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది. -
జియో రీఛార్జ్: రూ.198 ప్లాన్.. రోజుకి 2జీబీ డేటా!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.198 కూడా ఒకటి. ఈ ప్లాన్ ద్వారా లభించే డేటా ఎంత, వ్యాలిడిటీ, ఇతర ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.రూ.198 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అయితే వ్యాలిడిటీ మాత్రం 14 రోజులు మాత్రమే. కాగా జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి. తక్కువ ధరలో రీఛార్జ్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక అవుతుంది.రూ.55కే 1000పైగా ఛానళ్లు!జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ.55కే ఒక ప్రత్యేక టీవీ వోచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరలోనే ప్రీమియం లైవ్ టీవీ ఛానళ్లను చూడవచ్చు.రూ.55 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అయితే దీని ద్వారా 10ఎంబీ డేటా మాత్రమే లభిస్తుంది. డేటా పరంగా పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ.. టీవీ ఛానల్స్ చూడటానికి పనికొస్తుంది. జియోటీవీ యాప్‌లో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో జియోస్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లకు చెందిన ఛానల్స్ అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతో మొబైల్లో లైవ్ టీవీ చూడాలనుకునే జియో వినియోగదారులకు ఈ రూ.55 ప్లాన్ మంచి ఎంపిక. -
కేవలం రూ.55కే 1000పైగా ఛానళ్లు!
జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ.55కే ఒక ప్రత్యేక టీవీ వోచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరలోనే ప్రీమియం లైవ్ టీవీ ఛానళ్లను చూడవచ్చు. అయితే.. ఇది సాధారణ రీచార్జ్ ప్లాన్ కాదు. ఎందుకంటే.. ఈ వోచర్‌ను ఉపయోగించాలంటే ఇప్పటికే యాక్టివ్‌లో ఉన్న ఒక బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. బేస్ ప్లాన్ లేకపోతే ఈ వోచర్ పనిచేయదు.రూ.55 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అయితే దీని ద్వారా 10ఎంబీ డేటా మాత్రమే లభిస్తుంది. డేటా పరంగా పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ.. టీవీ ఛానల్స్ చూడటానికి పనికొస్తుంది. జియోటీవీ యాప్‌లో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో జియోస్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లకు చెందిన ఛానల్స్ అందుబాటులో ఉంటాయి.స్టార్ ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ, సోనీ సెట్ హెచ్డీ, సోనీ సబ్ హెచ్డీ వంటి ప్రముఖ ఛానళ్లను కూడా వీక్షించవచ్చు. అయితే జియోస్టార్‌కు చెందిన స్పోర్ట్స్ ఛానళ్లు ఈ ప్లాన్‌లో ఉండవు. తక్కువ ఖర్చుతో మొబైల్లో లైవ్ టీవీ చూడాలనుకునే జియో వినియోగదారులకు ఈ రూ.55 ప్లాన్ మంచి ఎంపిక. -
జియో రీఛార్జ్: ఇవే 28 రోజుల ప్లాన్లు..
రిలయన్స్ జియో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ డేటా వినియోగదారుల నుంచి భారీగా డేటా ఉపయోగించే వారు, 5జీ యూజర్లు, గేమర్లు, ఓటీటీ ప్రియుల వరకు వేర్వేరు కస్టమర్ల కోసం ప్రత్యేక ప్యాక్‌లు ఉన్నాయి. వీటిలో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ప్లాన్ల ధరలు రూ.189 నుంచి రూ.545 వరకు ఉన్నాయి. జియో అధికారిక వెబ్సైట్లో ప్రస్తుతం 28 రోజుల ప్లాన్లలో రూ.299, రూ.329, రూ.349, రూ.399, రూ.445, రూ.459 తదితర ప్యాక్‌లు కనిపిస్తున్నాయి.రూ.189 ప్లాన్రూ.189 ప్యాక్‌లో 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్లు, మొత్తం 2 జీబీ డేటా లభిస్తుంది. డేటా వినియోగం తక్కువగా ఉండే, ప్రధానంగా కాల్స్ కోసం సిమ్‌ను ఉపయోగించే వారికి ఇది పనికొస్తుంది.రూ.299, రూ.329 ప్లాన్లు.. రోజుకు 1.5 జీబీరూ.299 ప్లాన్‌లో 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా అంటే మొత్తం 42 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఉంటాయి. రూ.329 ప్లాన్ కూడా ఇదే విధంగా రోజుకు 1.5 జీబీ డేటాతో వస్తుంది. అయితే ఇందులో జియోసావన్ ప్రో వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. జియో అధికారిక ప్లాన్ లిస్టులో ఈ రెండు ప్యాక్‌లు ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీతో కనిపిస్తున్నాయి.ఇక రూ.299 లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన ప్లాన్లకు సంబంధించి జియో-గూగుల్ ఏఐ ఆఫర్ కూడా ముఖ్యమైన ఆకర్షణగా మారింది. అర్హత ఉన్న 18 ఏళ్లు పైబడిన జియో వినియోగదారులకు 18 నెలల Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌ను అదనపు చార్జీ లేకుండా అందించే ఆఫర్ ఉంది. దీని విలువ రూ.35,100గా జియో పేర్కొంటోంది. అయితే ఈ ప్రయోజనాన్ని కొనసాగించడానికి అర్హత కలిగిన ప్లాన్‌ను యాక్టివ్‌గా ఉంచాల్సి ఉంటుంది.రూ.349.. 5జీ వినియోగదారులకు కీలక ప్లాన్రూ.349 ప్యాక్ జియోలోని ప్రముఖ 28 రోజుల 5జీ ప్లాన్లలో ఒకటి. ఇందులో రోజుకు 2 జీబీ చొప్పున మొత్తం 56 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా అందుతుంది. జియో అధికారిక వెబ్సైట్ ప్రస్తుతం ఈ ప్లాన్‌ను 28 రోజుల వ్యాలిడిటీతో చూపిస్తోంది.రూ.399.. రోజుకు 2.5 జీబీ డేటాభారీగా డేటా వినియోగించే వారికి రూ.399 ప్యాక్ మరో ఆసక్తికరమైన ఎంపిక. 28 రోజుల పాటు రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం 70 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అర్హత ఉన్న కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా కూడా ఉంటుంది. గేమింగ్, సినిమాలు, స్పోర్ట్స్ వంటి కంటెంట్ ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి.రూ.445.. ఓటీటీ ప్రియులకుఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూసే వారి కోసం రూ.445 ప్లాన్ రూపొందించారు. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు పలు ఓటీటీ సేవలకు యాక్సెస్ లభిస్తుంది. జియో అధికారిక సైట్లో ఈ ప్యాక్ ప్రస్తుతం 10 ఓటీటీ చేర్చిన ప్లాన్‌గా 28 రోజుల వ్యాలిడిటీతో చూపిస్తోంది.రూ.459.. డేటా + గేమింగ్రూ.459 యూత్ అండ్ గేమింగ్ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటాతో పాటు అదనంగా 5 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 61 జీబీ హైస్పీడ్ డేటా. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అర్హత ఉన్నవారికి అపరిమిత 5జీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. గేమింగ్, ఓటీటీ సంబంధిత ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జియో అధికారిక ప్లాన్ లిస్టులో ఈ ప్యాక్ ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీతో ఉంది.రూ.495, రూ.545.. గేమర్ల కోసంరూ.495 ప్యాక్‌లో రోజుకు 1.5 జీబీతో పాటు అదనంగా 5 జీబీ డేటా, అంటే మొత్తం 47 జీబీ డేటా లభిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్, బీజీఎంఐ, ఫ్యాన్‌కోడ్ వంటి గేమింగ్ ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.రూ.545 ప్యాక్ మరింత డేటా, గేమింగ్ ప్రయోజనాలు కోరుకునే వారికి ఉద్దేశించింది. రోజుకు 2 జీబీతో పాటు అదనంగా 5 జీబీ డేటా కలిపి మొత్తం 61 జీబీ డేటా లభిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్‌లో ప్రీమియం గేమ్స్, బీజీఎంఐ సంబంధిత ప్రయోజనాలు, ఫ్యాన్‌కోడ్ తదితర సేవలు ఇందులో ఉన్నాయి.మరో కొత్త ఆప్షన్.. రూ.200 ఓటీటీ ప్యాక్జియో 28 రోజుల విభాగంలో తర్వాత మరో ఆసక్తికరమైన మార్పు చేసింది. ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో రూ.200 ఓటీటీ పాస్ అందిస్తోంది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 30 జీబీ డేటా, 15 ఓటీటీ సేవలకు యాక్సెస్‌తో పాటు జియోటీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్ల ప్రయోజనం ఉంటుంది. ఇది సాధారణ వాయిస్+డేటా కాంబో ప్లాన్‌కు భిన్నమైన కంటెంట్ ఆధారిత ప్యాక్. -
జియో రీచార్జ్.. కొత్త రూ.200 ప్లాన్
దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినోదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని కొత్త రూ.200 OTT పాస్‌ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది సాధారణ డైలీ డేటా ప్లాన్ కాకుండా, 28 రోజుల పాటు 30GB హైస్పీడ్ డేటాతో పాటు 15 ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌ల యాక్సెస్‌ను అందించే ప్రత్యేక యాడ్-ఆన్ ప్లాన్‌గా జియో ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రస్తుతం జియో వెబ్సైట్, మైజియో యాప్‌లో అందుబాటులో ఉంది.ఈ ప్లాన్‌లో రోజుకు 1GB లేదా 2GB చొప్పున డేటా ఇవ్వరు. బదులుగా మొత్తం 30GB డేటా ఒకేసారి లభిస్తుంది. వినియోగదారులు 28 రోజుల చెల్లుబాటు వ్యవధిలో తమ అవసరానికి అనుగుణంగా ఈ డేటాను వినియోగించుకోవచ్చు. తరచూ వీడియో స్ట్రీమింగ్ చేసే వారు లేదా ఒకేసారి ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.ఈ OTT పాస్‌లో యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్ట్స్, హోయిచోయ్, ఫ్యాన్‌కోడ్ తదితర మొత్తం 15 OTT సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అదనంగా జియోటీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను కూడా వీక్షించే అవకాశం కల్పించింది. అయితే స్పోర్ట్స్ ఛానళ్లకు ఈ ప్యాక్‌లో పూర్తి యాక్సెస్ ఉండదని జియో స్పష్టం చేసింది.అయితే ఈ ప్లాన్‌కు సంబంధించి వినియోగదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది డేటా-ఓన్లీ యాడ్-ఆన్ ప్యాక్. ఇందులో వాయిస్ కాల్స్ లేదా SMS ప్రయోజనాలు ఉండవు. అలాగే ఈ OTT ప్రయోజనాలను పొందాలంటే సాధారణంగా యాక్టివ్ జియో బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ వంటి సేవలను మైజియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. -
జియో రీచార్జ్.. ఈ ప్రత్యేక ప్లాన్ గురించి తెలుసా?
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.450 విలువైన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. తక్కువ కాలపరిమితితో వచ్చినప్పటికీ, రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు AI సేవలు, OTT ప్రయోజనాలు కలిపి ఈ ప్లాన్‌ను ఆకర్షణీయంగా మార్చాయి. ప్రస్తుతం ఈ ప్లాన్ జియో అధికారిక వెబ్సైట్, మైజియో యాప్ ద్వారా అందుబాటులో ఉంది.ఈ ప్లాన్‌లో 36 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హైస్పీడ్ డేటా (మొత్తం 72GB), అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. 5G స్మార్ట్‌ఫోన్ కలిగి, జియో True 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G డేటా కూడా అందుబాటులో ఉంటుంది.డేటా, కాలింగ్‌తో పాటు ఈ ప్లాన్‌లో మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, జియో ఏఐ క్లౌడ్‌లో 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తాయి. అంతేకాదు, అర్హత కలిగిన వినియోగదారులకు 18 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఉచితంగా అందిస్తోంది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.35,100గా జియో పేర్కొంటోంది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా అధునాతన జెమినై ఏఐ ఫీచర్లు, డీప్ రీసెర్చ్, నానో బనానా ఇమేజ్ టూల్స్, గూగుల్ వర్క్‌స్పేస్ ఏఐ వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు.అయితే గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనం కొనసాగాలంటే వినియోగదారులు జియో నిర్దేశించిన అర్హత గల ప్లాన్లతో నిరంతరం రీఛార్జ్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతం జియో నిబంధనల ప్రకారం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ అర్హత గల అన్లిమిటెడ్ ప్లాన్‌ను కొనసాగిస్తేనే ఈ ఏఐ సబ్స్క్రిప్షన్ యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే జియో హాట్‌స్టార్ ప్రయోజనాలు కూడా ఆఫర్ నిబంధనలకు లోబడి ఉంటాయి. -
జియో రీఛార్జ్‌లు.. తక్కువలో టాప్ 10 ప్లాన్లు
దేశంలో 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియో, రూ.350లోపు బడ్జెట్లోనూ పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. అయితే రూ.350లోపు ఉన్న అన్ని ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా లభించదు. జియో అధికారిక నిబంధనల ప్రకారం, అపరిమిత ట్రూ 5G వినియోగానికి ప్రత్యేక అర్హతలు ఉన్నాయి.రూ.350లోపు జియో ప్లాన్లు.. ప్రయోజనాలురూ.349 ప్లాన్» వాలిడిటీ: 28 రోజులు» రోజుకు 2 జీబీ డేటా» అపరిమిత వాయిస్ కాల్స్» రోజుకు 100 ఎస్ఎంఎస్» జియో ట్రూ 5జీ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో, 5జీ ఫోన్ కలిగిన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా.రూ.329 ప్లాన్» 28 రోజుల వాలిడిటీ» రోజుకు 1.5 జీబీ డేటా» అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్రూ.319 ప్లాన్» క్యాలెండర్ నెల వాలిడిటీ» రోజుకు 1.5 జీబీ డేటా» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్రూ.299 ప్లాన్» 28 రోజుల వాలిడిటీ» రోజుకు 1.5 జీబీ డేటా» అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్రూ.249 ప్లాన్» 28 రోజుల వాలిడిటీ» రోజుకు 1 జీబీ డేటా» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్రూ.239 ప్లాన్» 22 రోజుల వాలిడిటీ» రోజుకు 1.5 జీబీ డేటా» అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్రూ.209 ప్లాన్» 22 రోజుల వాలిడిటీ» రోజుకు 1 జీబీ డేటా» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్రూ.200 ప్లాన్» 28 రోజుల వాలిడిటీ» మొత్తం 30 జీబీ డేటా (రోజువారీ పరిమితి లేదు)» డేటా అవసరాన్ని బట్టి వినియోగించుకునే అవకాశంరూ.198 ప్లాన్» 14 రోజుల వాలిడిటీ» రోజుకు 2 జీబీ డేటా» అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్రూ.189 ప్లాన్» 28 రోజుల వాలిడిటీ» మొత్తం 2 జీబీ డేటా» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు. -
జియో రూ.448 Vs ఎయిర్టెల్ రూ.469 ప్లాన్.. ఏది బెస్ట్?
భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వినియోగదారుల కోసం ప్రత్యేక వాయిస్ ఓన్లీ ప్లాన్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం సిమ్‌ను ఉపయోగించే వారికి ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.జియో రూ.448 ప్లాన్జియో రూ.448 ప్లాన్ ద్వారా వినియోగదారులు 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, మొత్తం 1,000 ఎస్ఎంఎస్లు పొందుతారు. అయితే ఈ ప్లాన్‌లో మొబైల్ డేటా లభించదు. అదనంగా జియోటీవీ, జియోఏఐ క్లౌడ్ వంటి సేవలు లభిస్తాయి. అయితే.. ఈ ప్లాన్‌తో జియో 5G సేవలు అందుబాటులో ఉండవు. అవసరమైతే వేరుగా డేటా వోచర్ రీచార్జ్ చేసుకుని ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు.ఎయిర్టెల్ రూ.469 ప్లాన్ఎయిర్టెల్ రూ.469 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో కూడా డేటా ఉండదు. అవసరమైతే డేటా వోచర్‌ను విడిగా రీచార్జ్ చేసుకోవచ్చు. అదనపు ప్రయోజనంగా 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఉచిత యాక్సెస్, సేఫ్ నెట్వర్క్ సర్వీస్, ఫ్రీ హలో ట్యూన్స్ వంటి సౌకర్యాలు కూడా అందిస్తారు.ఈ రెండు ప్లాన్లు వాయిస్ కాల్స్ కోసం మంచి ఎంపికలే. అయితే జియో ప్లాన్‌లో 1,000 ఎస్ఎంఎస్లు లభిస్తే, ఎయిర్టెల్ ప్లాన్‌లో 900 ఎస్ఎంఎస్లు మాత్రమే ఉంటాయి. అయితే ఎయిర్టెల్ అదనంగా అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి ఉపయోగకరమైన సర్వీస్ అందిస్తుంది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ మెరుగ్గా పనిచేస్తుందో దాని ఆధారంగా ఎంపిక చేసుకోవడం మంచిది. జియో సేవలు బాగా అందుబాటులో ఉంటే రూ.448 ప్లాన్ మంచి ఎంపిక. అదనపు డిజిటల్ ప్రయోజనాలు కావాలనుకునే వారు ఎయిర్టెల్ రూ.469 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం! -
రోజుకి 2 జీబీ డేటా.. కేవలం రూ.51 మాత్రమే!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న సమయంలో.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ. 51కే సరసమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.మైళ్ల దూరంలో ఉన్నా లేదా దగ్గర్లో ఉన్నా BSNLతో మీకు కనెక్ట్ అయి ఉంటుంది అని ట్వీట్ చేస్తూ.. కంపెనీ రూ.51 ప్లాన్ గురించి వివరించింది. ఇది కేవలం ప్రారంభ కస్టమర్లకు మాత్రమే అని తెలుస్తోంది. దీని ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. కాగా ఈ అవకాశం జూన్ 30 వరకు మాత్రమే అని తెలుస్తోంది. తేదీని మళ్లీ పెంచుతారా?, లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.Miles apart or just around the corner—stay connected to what matters most with BSNL.#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #TechUpdates #BSNLServices #SmartIndia #EverydayConnectivity #offer51@CMDBSNL @robertravi21 pic.twitter.com/KtiQXVrKCf— BSNL India (@BSNLCorporate) June 19, 2026 -
మొబైల్ రీఛార్జ్‌లు పెరగొచ్చు!
దేశంలోని టెలికాం వినియోగదారులకు మరోసారి మొబైల్ రీఛార్జ్‌ల భారం పడే అవకాశం కనిపిస్తోంది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో టెలికాం కంపెనీలు టారిఫ్‌లను సుమారు 10 శాతం మేర పెంచే అవకాశముందని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. గతంలో జరిగినట్లుగా 15–20 శాతం భారీ పెంపులు అవసరం లేదని, ఈసారి పరిమిత స్థాయిలో ధరల సవరణ జరిగే అవకాశం ఉందని ఆయన సీఎన్‌బీసీ-టీవీ18 వార్తాసంస్థతో పేర్కొన్నారు.టెలికాం రంగంలో ప్రస్తుతం ఆదాయ వృద్ధి కేవలం టారిఫ్ పెంపులపైనే ఆధారపడడం లేదని మల్హోత్రా వివరించారు. వినియోగదారులు అధిక డేటా ప్రయోజనాలు, 5జీ సేవలు, ప్రీమియం ప్లాన్ల వైపు మారుతుండటంతో కంపెనీలకు ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) సహజంగానే పెరుగుతోందన్నారు. టారిఫ్ పెంపు లేకుండానే ఏఆర్పీయూ ఏటా 4–5 శాతం మేర పెరుగుతోందని ఆయన అంచనా వేశారు.ఇటీవల సంవత్సరాల్లో జరిగిన టారిఫ్ పెంపులను వినియోగదారులు పెద్దగా వ్యతిరేకించకపోవడం, 5జీ సేవల వినియోగం పెరగడం, అధిక విలువ కలిగిన ప్లాన్లకు మారుతున్న కస్టమర్ల సంఖ్య పెరగడం వంటి అంశాలు టెలికాం కంపెనీల ఆదాయాలకు ఊతమిస్తున్నాయి. దీంతో భారీ ధరల పెంపుల అవసరం ప్రస్తుతం కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు, ఇతర బ్రోకరేజ్ సంస్థలు కూడా 2026లో టెలికాం టారిఫ్‌ల పెంపుపై అంచనాలు వెలువరించాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన సంస్థలు 10–15 శాతం వరకు టారిఫ్‌లను పెంచవచ్చని జెఫరీస్ వంటి సంస్థలు ఇప్పటికే పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు ఏ టెలికాం సంస్థ అధికారికంగా ధరల పెంపును ప్రకటించలేదు.టారిఫ్‌లు నిజంగానే 10 శాతం పెరిగితే ప్రస్తుతం రూ.299 ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ధర సుమారు రూ.329కు, రూ.349 ప్లాన్ రూ.384కు చేరే అవకాశం ఉంటుంది. అయితే తుది నిర్ణయం టెలికాం కంపెనీల వ్యూహాలు, మార్కెట్ పరిస్థితులు, పోటీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. -
యూజర్లకు షాక్.. వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం!
భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను సుమారు 4-5 శాతం పెంచినట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ.. యూజర్లకు షాకిచ్చింది. మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది.వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. అన్ని ప్లాన్లకూ ఒకేసారి ధరలను పెంచే ప్రణాళిక ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. అయితే ఎంత పెంచనుంది?, యూజర్లు రీఛార్జ్ చేసుకోవడానికి అదనంగా ఎంత వెచ్చించాల్సి ఉంటుందనే విషయాలను సంస్థ వెల్లడించలేదు.ప్రస్తుతం చిన్నపాటి సవరణలు మాత్రమే ఉంటాయి. భారీ పెంపు ఉండదు. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ పేర్కొన్నారు. ఒక ముఖ్యమైన వాటాదారుగా ప్రభుత్వం కంపెనీపై విశ్వాసం ఉంచిందని, కంపెనీ పనితీరును మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా! -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. ఇక్కడే మొబైల్ రీఛార్జ్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవడానికి కావలసిన కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం పేయూతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.ప్రస్తుతం వాట్సాప్ పరిచయం చేసిన ఈ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. ఇకపై పేటీఎం లేదా గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్‌లతో పనిలేకుండానే.. నేరుగా వాట్సాప్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవచ్చు.వాట్సాప్ హోమ్ స్క్రీన్‌పై ప్రత్యేకంగా రూపాయి ఐకాన్‌ను జోడించింది. రీఛార్జ్ చేయడానికి ఆ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్‌ను ఎంచుకుని, మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న నెంబర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక, UPI, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిని ఎంచుకుని.. చెల్లింపును పూర్తి చేయాలి. -
పాపులర్ రీచార్జ్ ప్లాన్ రేటు మార్చేసిన ఎయిర్టెల్
ప్రముఖ టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ తన వినియోగదారులకు షాకిచ్చింది. అత్యధిక ఆదరణ పొందిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ధరను సైలెంట్‌గా పెంచింది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటాను అందించే ప్లాన్ ధరను రూ. 859 నుండి రూ. 899కి సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఈ దీర్ఘకాలిక ప్లాన్ ఇప్పుడు మరింత భారంగా మారింది.ఈ రూ. 899 ప్లాన్ ద్వారా వినియోగదారులకు 84 రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డేటా విషయానికొస్తే, ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా అందుతుంది. అదనపు ప్రయోజనాల కింద అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం (12 నెలలు), స్పామ్ అలర్ట్‌లు, ఉచిత హలోట్యూన్స్ వంటి రివార్డ్స్ లభిస్తాయి. అయితే, గతంలో ఉన్న క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలతో కూడిన 'రివార్డ్స్ మినీ' సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ తొలగించినట్లు తెలుస్తోంది.ఈ ధర పెంపు పరిమితంగా ఉన్నప్పటికీ, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తన సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడంతో పాటు, వినియోగదారులను క్రమంగా 5G సేవల వైపు మళ్లించేందుకు ఎయిర్టెల్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు కేవలం ఒక ప్లాన్‌కే పరిమితం కావడంతో, సాధారణ వినియోగదారులపై తక్షణ ప్రభావం తక్కువగానే ఉండవచ్చు.సాధారణంగా టెలికాం రంగంలో భారీ టారిఫ్ పెంపునకు ముందు ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేయడం అరుదు. కాబట్టి, ప్రస్తుతానికి అన్ని ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం లేదని సమాచారం. కాగా, ఎయిర్టెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను కూడా రూ. 4,000 నుండి రూ. 4,999కి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా 84 రోజుల ప్లాన్ ధర పెరగడంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. -
అందరికీ నచ్చిన జియో రీఛార్జ్ ప్లాన్!
మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా నిలిచింది తక్కువ ఖర్చుతో.. సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలని భావించే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక.రూ.189 రీఛార్జ్ ప్లాన్ వివరాలురిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 300 ఎస్ఎమ్ఎస్లు, ఇంటర్నెట్ వినియోగానికి 2జీబీ డేటా లభిస్తాయి. ఒకసారి ఈ డేటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. కానీ స్పీడ్ తగ్గుతుంది. దీనివల్ల కనీస అవసరాల కోసం అయినా కనెక్టివిటీ కొనసాగించవచ్చు.50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. కాలింగ్స్ మాత్రమే కాకుండా జియోటీవీ ద్వారా ఎక్కడైనా టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. అంతే కాకుండా.. డిజిటల్ యుగంలో డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని 50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇది ఫోటోలు, వీడియోలు వంటి ఫైల్స్‌ను సురక్షితంగా నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.అయితే.. ఈ ప్లాన్ కొన్ని థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్‌లో కనిపించకపోవచ్చు. అందువల్ల వినియోగదారులు మైజియో యాప్‌ను డౌన్లోడ్ చేసి, అందులోని ‘రీఛార్జ్’ విభాగంలో ఈ ప్లాన్‌ను ఎంపిక చేసుకుని యాక్టివేట్ చేయాలి. -
30 రోజుల రీఛార్జ్ తప్పనిసరి!
మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం రంగంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు.పార్లమెంటులో చర్చసాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటుంది. కానీ, టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఒకరోజుకు 2 జీబీ డేటా ఇస్తే వినియోగదారుడు 1.5 జీబీ మాత్రమే వాడితే మిగిలిన 0.5 జీబీ అర్ధరాత్రికి మాయమైపోతోంది.ఇది వినియోగదారుడిని వంచించడమే. ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి.రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరికాదు. కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ సదుపాయం ఉండాలి.మూడేళ్ల గ్రేస్ పీరియడ్ తర్వాతే నంబర్లను రద్దు చేయాలి. (ప్రస్తుతం 90 రోజుల నిబంధన అమలులో ఉంది).మంత్రి స్పందనటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల ప్రకారం.. ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్‌ను చేర్చాలని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘కంపెనీలు అందించే ప్లాన్ ఆప్షన్లలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ ఉండాలి. ఈ నిబంధనను కంపెనీలు పాటిస్తున్నప్పటికీ వాటిని వినియోగదారులకు తెలిసేలా మరింతగా మార్కెటింగ్ చేయాలని కోరుతున్నాం’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?2022లోనే ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి టెలికాం సంస్థ ప్లాన్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల రూపంలో కనీసం ఒక 30 రోజుల ప్లాన్‌ను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం అమలులో ఉండటంతో ధరలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంది. అయినప్పటికీ, వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ట్రాయ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.త్వరలో కీలక నిర్ణయం?పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. రీఛార్జ్ వ్యాలిడిటీ పీరియడ్, ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేత అంశాలను ట్రాయ్ ప్రస్తుతం పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
రూ.1234తో రీఛార్జ్.. 336 రోజుల వ్యాలిడిటీ!
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో 336 రోజుల వ్యాలిడిటీతో ఓ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సంవత్సరం పొడవునా ఫోన్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి రిలయన్స్ జియో రూ.1234 ప్లాన్ ఒక అద్భుతమైన వరం. ఈ ప్లాన్ 336 రోజుల బలమైన వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే.. మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, సుమారు 11 నెలల వరకు మళ్లీ స్టోర్‌కు వెళ్లడం గానీ, ఆన్లైన్ చెల్లింపు చేయడం గానీ అవసరం ఉండదు. కేవలం కాలింగ్ కోసం మాత్రమే ఫోన్ వాడే వాళ్లకు ఇది మంచి ఎంపిక.ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 0.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం 336 రోజులలో, మీకు 168 GB డేటా యాక్సెస్ లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, మీ ఇంటర్నెట్ వేగం 64kbpsకి పడిపోతుంది, కానీ మీ కనెక్షన్ మాత్రం బలంగానే ఉంటుంది. అదనంగా.. మీకు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 ఉచిత SMS సందేశాలు లభిస్తాయి. వినోదం కోసం, జియోసావన్, జియోటీవీకి ఉన్న ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఈ ప్యాక్‌ను పొందవచ్చు.గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జియో అందిస్తున్న రూ.1234 అద్భుతమైన ఆఫర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులో లేదు. ఇది ప్రత్యేకంగా కంపెనీ అందిస్తున్న సరసమైన జియో భారత్ ఫోన్‌ను ఉపయోగించే కస్టమర్ల కోసం మాత్రమే.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల దోపిడీ.. రాజ్యసభలో రాఘవ్ చద్దా వ్యాఖ్యలు! -
టెలికాం కంపెనీల నయా దోపిడీ.. రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు
సాధారణంగా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే.. ప్లాన్‌ను బట్టి డేటా, టాక్‌టైమ్ వేరుగా ఉంటాయి. టాక్‌టైమ్ విషయం పక్కన పెడితే.. డేటా మాత్రం ఉపయోగించినా?, ఉపయోగించకపోయినా? రోజు పూర్తవగానే (అర్ధరాత్రి 12 తరువాత) డేటా ఎక్స్పైరీ అవుతుంది. ఆ తరువాత మరుసటి రోజు డేటా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.రాఘవ్ చద్దా రాజ్యసభలో మొబైల్ డేటా వినియోగంపై ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. తన అభిప్రాయం ప్రకారం.. టెలికాం కంపెనీలు వినియోగదారులకు న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. వినియోగదారులు తమ డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకునే హక్కు కలిగి ఉండాలి వాదించారు.భారతదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అవసరం చాలా అవసరం. కాబట్టి మొబైల్ డేటా వినియోగం ప్రతి ఒక్కరికి ముఖ్యమే. అయితే, టెలికాం సంస్థలు అందిస్తున్న డేటా ప్లాన్లలో కొన్ని లోపాలు ఉన్నాయని రాఘవ్ చద్దా సూచించారు.ప్రస్తుతం చాలా కంపెనీలు రోజువారీ డేటా పరిమితులతో (1.0 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ వంటి) ప్లాన్లు అందిస్తున్నాయి. కానీ వినియోగదారు ఆ రోజు మొత్తం డేటాను ఉపయోగించకపోతే.. మిగిలిన డేటా రాత్రి 12 గంటలకు పూర్తిగా రద్దవుతుంది. అంటే.. వినియోగదారు తన డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు. ఇది వినియోగదారుల పట్ల అన్యాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.ఇతర సేవలతో పోలిస్తే ఈ పరిస్థితి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఉదాహరణకు.. మనం ఒక లీటర్ పెట్రోల్ కొట్టించామంటే అది పూర్తయ్యే వరకు ఉపయోగిస్తాం. విద్యుత్ ఎంత వినియోగిస్తారో.. దానికి మాత్రమే డబ్బు చెల్లిస్తాము. కానీ కానీ మొబైల్ డేటా విషయంలో మాత్రం వినియోగించని డేటా కూడా కోల్పోతున్నాం. డబ్బు మాత్రం చెల్లించాలి. ఇది సరైన విధానం కాదని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.డేటా రోల్ఓవర్పై రాఘవ్ చద్దా డిమాండ్మిగిలిపోయిన రోజువారీ డేటాను వృధా చేయకుండా తర్వాతి రోజుకు బదిలీ (Rollover) చేయాలిఉపయోగించని డేటా విలువను తర్వాతి రీఛార్జ్ ప్లాన్లలో తగ్గించి వినియోగదారులకు ఊరటనివ్వాలిమిగులు డేటాను ఇతరులకు బదిలీ చేసుకునే వెసులుబాటును టెలికం కంపెనీలు… pic.twitter.com/mjCA509IK5— greatandhra (@greatandhranews) March 23, 2026పరిష్కార మార్గాలుడేటా పూర్తిగా వినియోగించకపోతే.. మిగిలిన డేటాను కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. దీనికి మూడు పరిష్కార మార్గాలున్నాయని రాఘవ్ చద్దా వెల్లడించారు.డేటా రోల్ఓవర్: ఒక రోజు వినియోగించని డేటా తరువాతి రోజు ఉపయోగించడానికి అవకాశం ఇవ్వాలి. ఇది వినియోగదారులకు న్యాయం చేస్తుంది.డిస్కౌంట్ లేదా సర్దుబాటు: వినియోగదారులు తరచుగా తక్కువ డేటా వినియోగిస్తే, వారికి వచ్చే నెల రీచార్జ్‌లో తగ్గింపు ఇవ్వాలి.డేటా బదిలీ: వినియోగించని డేటాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు పంపే అవకాశం కల్పించాలి. డేటాను వినియోగదారుల డిజిటల్ ఆస్తిగా పరిగణించాలి.ఇదీ చదవండి: 26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్! -
రూ.1000లోపు రీఛార్జ్.. 164 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన కొత్త ప్లాన్ ప్రకారం.. 997 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు.. అపరిమిత కాలింగ్స్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఈ నెల చివరి వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుంది.More days, same price! BSNL Validity Bonus Offer ₹997 plan now gives 164 days instead of 150 days.Plan detail:* Cost: ₹997* Validity: 164 Days (Bonus included!)* Data: 2GB/Day* Calls: UnlimitedDon't miss out—this limited-time bonus till March 31, 2026.Recharge… pic.twitter.com/225a4Cb04P— BSNL India (@BSNLCorporate) March 22, 2026 -
జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!
ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే అవసరం వద్దనుకునేవారి కోసం రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో ఒకటి సెలక్ట్ చేసుకుంటే.. 200 కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ.1748 ప్లాన్రూ. 1748 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు డేటా లభించదు. ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఎంటర్టైన్మెంట్ కోసం జియోటీవీ, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌కు యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు లేదా సెకండరీ నంబర్‌ను ఉపయోగించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.2025 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా (మొత్తం 500 జీబీ), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఇవి కాకుండా కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3599 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాదిపాటు (365 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వీటితో పాటు కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3999 ప్లాన్రూ. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు. హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత వేగం 64Kbpsకి పడిపోతుంది. -
ఒక రీఛార్జ్.. 72 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 485 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 485 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.Caption-Shoot. Share. Shine! Celebrate this Holi with extra data and uninterrupted fun on BSNL ₹485 plan. Hurry, offer ends 31st March 2026.#HoliWithBSNL #ExtraDataExtraFun #BSNLIndia #Holi2026 pic.twitter.com/Hw9gdSPEPd— BSNL India (@BSNLCorporate) March 3, 2026 -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!
రూ.2626 యాన్యువల్ ప్లాన్ పరిచయం చేసిన బీఎస్ఎన్ఎల్ మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ కొంత ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త రూ. 2766 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు.A Year of Connectivity, SortedChoose BSNL ₹2799 Annual Plan, get- 3GB data/day, Unlimited calls, 100 SMS/day for 365 days validity. Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c #BSNL #BSNLAnnualPlan #BSNL2799 #StayConnected pic.twitter.com/80JMv67IaH— BSNL India (@BSNLCorporate) February 12, 2026రూ. 2,626 రీఛార్జ్ ప్లాన్దేశ్ కా నెట్వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్లాన్ కోసం వినియోగదారులు 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 365 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ ద్వారా.. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. -
NHAI: ఉచితంగా రూ.1000 ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్!
జాతీయ రహదారులపై ప్రయాణించే.. ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎన్హెచ్ఏఐ 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే.. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలోని మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడం.జాతీయ రహదారులపై ప్రయాణించే వారిలో చాలామంది.. టోల్ ప్లాజాలలో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రత లోపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్హెచ్ఏఐ ప్రజల సహకారం కోరుతోంది. కాబట్టి ఎవరైనా.. టోల్ ప్లాజాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉందని గమనిస్తే.. ఫోటో తీసి రాజ్‌మార్గయాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) & మొబైల్ నంబర్‌తో సహా వివరాలతో అప్లోడ్ చేయాలి.సంబంధిత అధికారులు ఫోటోలను పరిశీలించి.. సమాచారం నిజమని ద్రువీకరిస్తే, ఫోటోలను షేర్ చేసిన వారి వెహికల్ నెంబర్‌కు రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి సహకరిస్తారని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.Report & Get Rewarded!To enhance commuter convenience and hygiene standards across National Highways, NHAI is conducting the ‘Clean Toilet Picture Challenge’ till 30th June 2026. The initiative encourages National Highway users to report any unclean toilet facilities at Toll… pic.twitter.com/fu3cmstoSZ— NHAI (@NHAI_Official) February 12, 2026 -
జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా..
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త 5జీ రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.రూ.198 రీఛార్జ్ ప్లాన్ఇది రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటివి పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే.రూ.349 రీఛార్జ్ ప్లాన్ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు. జియో హాట్‌స్టార్, జియోసావన్ ప్రో సబ్స్క్రిప్షన్లతో పాటు.. మూడు నెలలు జొమాటో గోల్డ్ కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే! -
కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే!
ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ లేటెస్ట్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.దేశ్ కా నెట్వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ ఏడాది ప్లాన్ తీసుకొచ్చింది. 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.Desh ka network, Desh ka bharosa. BSNL Bharat Connect 26 PlanEnjoy 2.6GB data/day, unlimited calls, 100 SMS/day & 365 days validity all at just ₹2626.That’s why millions trust BSNL Bharat Connect 26 Plan.Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c Offer valid… pic.twitter.com/cmJE1pTXxR— BSNL India (@BSNLCorporate) February 7, 2026 -
జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీలు.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో నెల, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ ఉన్నాయి. అయితే ఈ కథనంలో 84 రోజుల పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్రూ.469 ప్లాన్: కంపెనీ అందించే 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. అపరిమిత కాల్స్ లభిస్తాయి. అయితే డేటా లభించదు. నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలన్నా.. కేవలం కాలింగ్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలన్నా యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.548 ప్లాన్: 84 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. 7 జీబీ డేటా కూడా పొందవచ్చు. ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డేటా ఎక్కువ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అంత ఉపయోగకరంగా ఉండదు.రూ.979 ప్లాన్: రోజుకు 2జీబీ డేటా కావాలనుకునే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్. 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. సోనీ లివ్ యాప్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. మొత్తం 168 జీబీ డేటా లభిస్తుందన్నమాట.రిలయన్స్ జియోరూ.448 ప్లాన్: జియో అందిస్తున్న ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో డేటా లభించదు. కానీ అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో కాల్స్ చేయాలకునేవారు లేదా నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.రూ.799 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులే. అయితే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. జియో టీవీ, జియో ఎయిర్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి.రూ.859 ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా కావాలనే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ (168 జీబీ డేటా).. మూడు నెలలు జియో హాట్‌స్టార్‌కు ఫ్రీ యాక్సిస్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా యూజర్లు గూగుల్ జెమినీ ప్రోకు 18 నెలలు సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. -
జియో మంత్లీ రీచార్జ్.. ఆల్ ఇన్ వన్ ప్లాన్!
మీరు జియో సిమ్ వాడుతున్నారా? ఎక్కువ ప్రయోజనాలున్న మంచి నెలవారీ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. రిలయన్స్ జియో ఇటీవల ‘హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్’ పేరుతో రూ.500 ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ప్లాన్‌తో డేటా, అపరిమిత కాలింగ్, అలాగే ఉచిత యూట్యూబ్ ప్రీమియం సహా అనేక ఓటీటీ (OTT) సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.జియో రూ.500 ప్లాన్ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ధర రూ .500. వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ మొత్తం 56 జీబీ డేటాను అందిస్తుంది. అంటే వినియోగదారులు రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్ లో అదనపు ఛార్జీ లేకుండా ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 100 SMSలు పంపుకోవచ్చు.ఈ ప్లాన్ లో అనేక ఓటీటీ యాప్స్ కు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా ఉంది.ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఇవే..యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్ స్టార్ (టీవీ/మొబైల్), సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్ట్స్, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్.. ఈ సబ్స్క్రిప్షన్లన్నీ ఈ ప్లాన్‌తో ఉచితంగా లభిస్తాయి.ఈ ఓటీటీలు మాత్రమే కాకుండా ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది. జియో హోమ్ 2 నెలల ఉచిత ట్రయల్, జియో ఏఐ క్లౌడ్‌లో 50 జీబీ స్టోరేజ్ కూడా కొత్త కనెక్షన్లతో అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఈ ప్లాన్ లో 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా ఉంది. -
అదే రీఛార్జ్ ప్లాన్.. పెరిగిన డైలీ డేటా!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బీఎస్ఎన్ఎల్.. తన రూ. 2399, రూ. 485, రూ. 347, రూ. 225 రీఛార్జ్ ప్లాన్ల మీద 0.5 జీబీ అదనపు డేటా అందిస్తుంది. గతంలో ప్యాక్ రీఛార్జ్ ద్వారా 2.5 జీబీ డేటా లభిస్తే.. ఇప్పుడు అదే ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 3.0 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.BSNL enhances prepaid plans with extra daily data!Enjoy a data boost on ₹2399, ₹485, ₹347 & ₹225 at no extra cost. Stay connected longer on Bharat’s trusted network. Offer valid till 31 Jan 2026Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c#BSNL… pic.twitter.com/iQvAesldmr— BSNL India (@BSNLCorporate) January 9, 2026 -
పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?
కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్‌లను 10 శాతం నుంచి 20 శాతం పెంచవచ్చు. ఎయిర్టెల్ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుందని సమాచారం. అయితే వోడాఫోన్ ఐడియా (VI) పరిస్థితి మరింత సవాలుగా మారనుంది. దాని బకాయి చెల్లింపులను తీర్చడానికి, కంపెనీ FY27 & FY30 మధ్య మొబైల్ సర్వీస్ రేట్లను 45 శాతం వరకు పెంచాల్సి రావచ్చు.ఏ కంపెనీ ఎంత టారిఫ్‌లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది. జియో రూ.299 ప్లాన్‌ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!జూన్ 2026 నుంచి టారిఫ్‌లు పెరిగితే, సాధారణ వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జ్ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు & ఎక్కువ డేటా వినియోగించేవారి ఇది కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెలికాం కంపెనీల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది. -
జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!
దేశీయ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో.. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే 91 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.కంపెనీ పరిచయం చేసిన ఈ లేటెస్ట్ రూ. 91 ప్లాన్ కేవలం జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే. దీని ద్వారా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 3జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 50 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వర్తించదు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్ ఉండాలనే ఉద్దేశ్యంతో.. జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది.ఇతర రీఛార్జ్ ప్లాన్స్!రూ.3,599 ప్లాన్: ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.రూ.3,999 ప్లాన్: లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి. -
రూ.225 రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ వెల్లడించిన తరువాత.. నెల రోజుల ప్లాన్ ప్రకటించింది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 225 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఇప్పుడు రోజుకు 3జీబీ డేటా పొందవచ్చు (గతంలో ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభించేది). ఈ ప్లాన్ ఆఫర్ కేవలం ఈ నెల 31వరకు (జనవరి 31) మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.BSNL introduces an upgraded ₹225 prepaid recharge plan offering 3GB data per day (earlier 2.5 gb data per day) without any increase in cost.Offer valid till 31 Jan 2026 Recharge smart via #BReX 👉 https://t.co/f8OlvSla9c#BSNL #FestiveOffer #SwadeshiNetwork #DigitalBharat pic.twitter.com/bkTwyNVqtW— BSNL_Andhrapradesh (@bsnl_ap_circle) January 5, 2026బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట. -
కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఉప్పుడు తాజాగా 365 రోజుల ప్లాన్ ప్రకటించింది.బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట.Start the New Year the smart way with #BSNL.Enjoy 365 days of worry-free connectivity at just ₹2799.Wherever the journey takes you, BSNL keeps you connected with 3GB/day data, unlimited calls, and reliable coverage all year long.Recharge smart via #BReX 👉… pic.twitter.com/T6at7LDTUU— BSNL India (@BSNLCorporate) January 4, 2026 -
సిమ్ లేదు.. సిగ్నల్ లేదు.. అయినా ‘హలో!’
‘నీతో మాట్లాడాలని ఎంతో ఉంది. కాని, నా రీచార్జ్ ప్లాన్ అయిపోయింది’ అని ఫోన్ నోరు మూసేసే బాధ ఒకరిదిదైతే, ప్రతి నెలా మొబైల్ బిల్లుల రిమైండర్‌కి భయపడి ముందుగా చెల్లించే వారిది ఇంకోరకం బాధ. ఇలా రీచార్జ్ కష్టాల మాయలో మునిగిపోయినప్పుడు ఆఫ్రికాలోని ఒక అబ్బాయి నెట్‌వర్క్‌కే నేరుగా ‘గుడ్ బై’ చెప్పేశాడు. సిమ్ లేదు, టవర్ లేదు, డేటా అవసరం అసలే లేదు, అయినా కూడా ఫోన్ లో ‘హలో!’ అన్నాడు. అదే సైమన్ పీట్రస్ కనిపెట్టిన టెక్నాలజీ మ్యాజిక్! ఆఫ్రికాలోని న మీబియాలో ఉండే ఓ చిన్న గ్రామం. అక్కడ గాలి, ఇసుక, నిశ్శబ్దం తప్ప పెద్దగా టెక్నాలజీకి హలో చెప్పేవారు తక్కువ. చాలామంది ఇళ్లలో విద్యుత్ కూడా ఉండదు. ఇక మొబైల్ సిగ్నల్ అంటే లాటరీ కొట్టడం లాంటిది. ఇలా నెట్వర్క్ కూడా లేని ఊరిలో పెరిగిన సైమన్ , అసలు సమస్య సిగ్నల్‌లో లేదని, టెక్నాలజీలో ఉందని నమ్మాడు. ఆ నమ్మకమే అతన్ని సిమ్ లేకుండా కాల్ చేసే ఫోన్ వైపు నడిపించింది. చాలామంది ‘ఇది ఎలా సాధ్యం?’ అంటూ నవ్వుకున్నారు. కాని, అతను మాత్రం పాత రేడియోలు, టీవీలు, మొబైల్ స్క్రాప్స్ అన్నింటినీ కలిపి ఒక కొత్త ఫోన్ తయారు చేశాడు. రేడియో ఫ్రీక్వెన్సీతో రెండు దారులుగా మాట్లాడుకునే సిస్టమ్. వాకీ–టాకీలా కనిపిస్తుంది కాని, కాదు. పూర్తిగా ఫోన్ రూపంలోనే తయారుచేశాడు. ఈ ఫోన్లోనే టీవీ చూడొచ్చు, లైట్ ఆన్ చేయొచ్చు, ఒక ఇన్‌బిల్ట్ సోలార్ చార్జర్‌ని సెట్ చేశాడు. అతని ప్రతిభను మెచ్చి, స్కూల్ సైన్ ్స ఫెయిర్‌లో మొదటి బహుమతి ఇచ్చేశారు. వార్తలు అంతర్జాతీయంగా పాకాయి. కాని, ఆ తర్వాత పెద్ద కంపెనీలు, పెట్టుబడిదారులు, పరిశోధన కేంద్రాలు ఎవరూ ముందుకు రాలేదు. ఇది కొంచెం బాధే. అయినప్పటికీ, చాలామంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, యువ ఆవిష్కర్తలు అతని ప్రయోగాన్ని అభినందిస్తున్నారు. పునర్వినియోగ టెక్నాలజీలు, నూతన విద్యుత్ పనితీరులు, కమ్యూనికేషన్ రంగాల్లో సైమన్ ప్రయోగం ఒక మంచి ప్రేరణగా నిలుస్తోందని ప్రసంసిస్తున్నారు. కొన్నిసార్లు కోట్ల బడ్జెట్లు, భారీ లాబొరేటరీలు, పెద్ద పెద్ద కంపెనీలు తప్పనిసరి కాదు, కాని, భవిష్యత్తు ఆవిష్కరణలు ఒక చిన్న స్పార్క్‌తోనే మొదలవుతాయి అని సైమన్ అందరికీ రిమైండ్ చేస్తున్నాడు. -
మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?
ఇంకొన్ని రోజుల్లో 2026 వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. దీని ప్రకారం ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ 20% వరకు ఖరీదైనవి కావచ్చు.మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 2026లో తమ ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం సంస్థలు టారిఫ్‌లను 16 నుంచి 20 శాతం వరకు పెంచవచ్చు. ఇది రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఏటా టెలికాం కంపెనీలు ఇలా పెంచుకుంటూనే వెళ్తున్నాయి. జూలై 2024లో కూడా కంపెనీలు టారిఫ్‌లను పెంచినప్పుడు.. రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మరోమారు అదే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. యూజర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.ఏ కంపెనీ ఎంత టారిఫ్‌లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది.జియో రూ.299 ప్లాన్‌ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.వోడాఫోన్ ఐడియా 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుంచి రూ.419కి పెరగవచ్చు. అదేవిధంగా, 56 రోజులు (సుమారు 2 నెలలు) చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579కి బదులుగా రూ.699కి పెరగవచ్చు. -
జియో లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: యూజర్లకు పండగే!
రిలయన్స్ జియో తన కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియోను ''హ్యాపీ న్యూ ఇయర్ 2026'' ప్లాన్లను ఆవిష్కరించింది. ఇందులో నెల రోజుల ప్లాన్, ఏడాది ప్లాన్ రెండూ ఉన్నాయి. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హీరో యాన్యువల్ రీఛార్జ్ఏడాది పాటు రీఛార్జ్ కావాలనుకునే వారి కోసం రిలయన్స్ జియో ఈ ప్లాన్ పరిచయం చేసింది. రూ. 3599లతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.5 జీబీ 5జీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌కు 18 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ పేరుతో 500 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా జియో ప్రకటించింది. ఇది 28 రోజుల చెల్లుబాటు ఉన్నప్పటికీ.. రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా ఓటీటీ ప్రయోజనాలు (యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్, సోని లివ్, జీ5 మొదలైనవి) లభిస్తాయి. యాన్యువల్ ప్లాన్ మాదిరిగానే 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా పొందవచ్చు.ఫ్లెక్సీ ప్యాక్ఫ్లెక్సీ ప్యాక్ పేరుతో.. 103 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. అయితే ఇందులో కేవలం డేటా మాత్రం లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుడు.. హిందీ, ఇంటర్నేషనల్, ప్రాంతీయ ప్యాక్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్లిమిటెడ్ కాల్స్ -
ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 365 రోజుల ప్లాన్ పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన రూ. 2399 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాల్స్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. నాన్ స్టాప్ కనెక్షన్ అని పోస్ట్ చేసింది.సంవత్సరం ప్లాన్ కోరుకునేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంటే తక్కువే. దీన్నిబట్టి చూస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లన్స్ పరిచయం చేస్తూ ముందుకు సాగుతుందని స్పష్టమవుతోంది.Attention !!!Non- stop connection at 2399/- for 365 days#BharatFibre #SuccessStory #Partnership #4Gmobile #BusinessSuccess #BSNLSelfCareApp #SwitchToBSNL #entertainment #mobilerecharge #fypage✨ #explorepage pic.twitter.com/774dFc3jeJ— BSNL_Kolkata (@BSNL_KOTD) December 13, 2025 -
రూపాయికే నెలరోజుల రీఛార్జ్!.. డైలీ 2జీబీ డేటా
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇటీవల రూ. 199 ప్లాన్ ప్రకటించిన సంస్థ.. ఇప్పుడు మరోమారు రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ అందించనుంది.బీఎస్ఎన్ఎల్ ఆగష్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రూ.1 ప్లాన్ పరిచయం చేసింది. దీనిని దీపావళి సమయంలో కూడా కొనసాగించింది. ఇప్పుడు మరోమారు ఈ ప్లాన్ కంటిన్యూ చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.దీని ద్వారా యూజర్ 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. సిమ్ కార్డు కూడా పూర్తిగా ఉచితం కావడం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. ఎక్కువమంది ప్రజలు ఈ ప్లాన్ కోరుకోవడం వల్లనే దీనిని మళ్లీ తీసుకురావడం జరిగిందని సంస్థ స్పష్టం చేసింది. ఇది డిసెంబర్ 1 నుంచి 31వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.Back by public demand - BSNL’s ₹1 Freedom Plan!Get, a Free SIM with 2GB data/day, unlimited calls and 100 SMS/day for 30 days of validity.Applicable for new users only! #BSNL #AffordablePlans #BSNLPlans #BSNLFreedomPlan pic.twitter.com/pgGuNeU8c2— BSNL India (@BSNLCorporate) December 1, 2025రూ.199 ప్లాన్ వివరాలుబీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. -
రూ.200 కంటే తక్కువ రీఛార్జ్: డైలీ 2జీబీ డేటా..
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా కంపెనీలు అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 28 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Get more value every day with the #BSNL ₹199 Plan!Enjoy 2GB/day, unlimited calls & 100 SMS/day for 28 days - powered by Bharat's trusted network.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNLPlans #PrepaidPlans #BSNL #ConnectingBharat#BestPrepaidPlan #BSNLRecharge pic.twitter.com/mxRECIwJcU— BSNL India (@BSNLCorporate) November 30, 2025రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. -
రూ.500 కంటే తక్కువ.. 72 రోజుల వ్యాలిడిటీ
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమ అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 72 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.BSNL పోర్ట్‌ఫోలియోలో అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి రూ. 500 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని సంస్థ తెలిపింది.రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన ఈ రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా.. యూజర్ అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్/రోజుకు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 72 రోజులు మాత్రమే.72 Days of Smart Savings in One Recharge!BSNL’s ₹485 Plan gives you 72 days of unlimited calls, 2GB/day data & 100 SMS/day.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNL #BSNLRecharge #BSNL4G pic.twitter.com/t6IyOzc0cA— BSNL India (@BSNLCorporate) November 23, 2025ఇప్పటికే రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు -
రూ.251 రీఛార్జ్ ప్లాన్: 100జీబీ హైస్పీడ్ డేటా
ఎయిర్టెల్, రిలయన్స్ జియో వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తున్న సమయంలో.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ఓ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.దేశంలో 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంలో భాగంగా ఈ ప్లాన్ ప్రవేశపెట్టడం జరిగిందని.. బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏ. రాబర్ట్ జే. రవి పేర్కొన్నారు. కంపెనీ ఇటీవల దేశవ్యాప్తంగా 'మేక్ ఇన్ ఇండియా' అత్యాధునిక 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను విస్తరించిందని అన్నారు. కేవలం 251 రూపాయలకే 100 జీబీ డేటా అందిస్తున్న ఘనత బీఎస్ఎన్ఎల్ సొంతమని అన్నారు.Study, Stream, Succeed with #BSNL !Get BSNL’s Student Special Plan @ ₹251 with Unlimited Calls, 100GB Data & 100 SMS/Day. Offer valid till 14 Dec, 2025. #BSNLLearnersPlan #DigitalIndia #ConnectingBharat pic.twitter.com/GNb3PclKGu— BSNL India (@BSNLCorporate) November 15, 2025 -
జియో కొత్త రీచార్జ్.. 200 రోజుల చౌక ప్లాన్
టెలికాం రంగంలో అతిపెద్ద యూజర్ బేస్, రీఛార్జ్ ప్లాన్ల విస్తృత పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం తక్కువ-ధర, హై-ఎండ్ విభాగాలలో విస్తృత శ్రేణి ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే కస్టమర్ల కోసం దీర్ఘకాల వ్యాలిడిటీతో చౌక రీచార్జ్ప్లాన్ను ప్రవేశపెట్టింది.మిలియన్ల మంది మొబైల్ వినియోగదారుల అవసరాలను గుర్తించి, జియో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ల జాబితాలో చేర్చిన ప్లాన్ ధర రూ.2025. ఖరీదైన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ కొనడానికి ఇష్టపడని కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక. జియో ఈ ప్లాన్‌ను ఉత్తమ 5జీ ప్లాన్లలో ఒకటిగా లిస్ట్ చేసింది.ప్లాన్ ప్రయోజనాలుజియో తన రూ.2025 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో వినియోగదారులకు 200 రోజుల సుదీర్ఘ వాలిడిటీని అందిస్తుంది. అన్ని మొబైల్ నెట్ వర్క్ లకు 200 రోజుల పాటు అపరిమిత కాలింగ్ ను ఆనందించవచ్చు. ఇక డేటా ప్రయోజనాల విషయానికి వస్తే.. 200 రోజుల పాటు మొత్తం 500 జిబి డేటాను అందిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు హై స్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు ఉన్నాయి. ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.జియో యూజర్లు ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ లో మూడు నెలల పాటు జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా ఉంది. మీరు టీవీ ఛానెల్స్ చూడాలనుకుంటే జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ పొందుతారు. డేటా స్టోరేజ్ కోసం 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్ లో ఉంది. -
రోజుకు 2.5జీబీ డేటా: కొత్త రీఛార్జ్ ప్లాన్
జియో, ఎయిర్టెల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తున్న సమయంలో.. బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లి రూ. 225 ప్లాన్ ప్రవేశపెట్టింది. కొంత ఎక్కువ డేటా కావాలనుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన రూ. 225 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 75 జీబీ డేటా (రోజుకు 2.5 జీబీ), అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. జియో & ఎయిర్టెల్ వంటి టెలికాం బ్రాండ్లు తమ ప్రాథమిక ప్రీపెయిడ్ ప్లాన్లను రూ. 250 కంటే ఎక్కువకు పెంచినప్పటికీ, BSNL తన వినియోగదారులకు చాలా సరసమైన & డబ్బుకు తగిన విలువైన ప్లాన్‌ను అందిస్తూనే ఉంది.రూ. 255 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే నెల రోజులు చెల్లుబాటు అవుతుందన్నమాట. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ అయినప్పటికీ.. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, బీఎస్ఎన్ఎల్ సినిమా, ఎరోస్ నౌ యాప్ వంటి కొన్ని ఫ్రీ యాడ్ ఆన్ సేవలను పొందవచ్చు. అంటే కాలింగ్ & ఇంటర్నెట్తో పాటు వినోదాన్ని ఆస్వాదించడానికి ఈ ప్లాన్ మిమ్మల్ని అనుమతిస్తుంది.బీఎస్ఎన్ఎల్ రూ. 347 ప్లాన్బీఎస్ఎన్ఎల్ 50 రోజుల వ్యాలిడిటీతో రూ. 347 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించుకుపోవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా ఉంటుంది. వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు.ఇదీ చదవండి: శివ్ నాడార్.. జాబితాలో అంబానీ కంటే ముందు: రూ.2708 కోట్లు.. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: హై-స్పీడ్ డేటా, ఫ్రీ కాలింగ్స్
జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే.. హై-స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించేవారు కొరకు.. మూడు అద్భుతమైన ఫ్యాక్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డేటా మాత్రమే కాకుండా.. ఫ్రీ టీవీ ఛానెల్స్, ఓటీటీ యాప్‌లకు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.రూ. 599 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడంతో.. మీకు 30Mbps ఇంటర్నెట్ వేగం.. 1000GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. ఫ్రీ వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా.. 800 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 తో సహా 11 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు.రూ. 899 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. 1000GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. కాగా ఈ ప్లాన్ 800కి పైగా టీవీ ఛానెల్‌లు, జియో హాట్‌స్టార్, సోనీ లివ్ & జీ5 తో సహా 11 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.రూ. 1199 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ 100Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. మీకు మొత్తం 1000GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో వస్తుంది. 800కి పైగా టీవీ ఛానెల్స్, నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్‌స్టార్‌తో సహా 15 ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: అరట్టైను తెలుగులో ఎలా పిలవాలంటే?: శ్రీధర్ వెంబు -
తక్కువ ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్: రెండు రోజులే ఛాన్స్
ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. భారతదేశంలో 4జీ నెట్‌వర్క్‌ను పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అధికారికంగా ప్రారంభించింది. వినియోగదారుల కనెక్టివిటీని పెంచడానికి, బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే దాదాపు లక్ష కొత్త 4G టవర్లను ఏర్పాటు చేసింది. కాగా 4జీ నెట్వర్క్ని ఏడాదిలోగా 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇప్పటికే వెల్లడించారు. ఈ తరుణంలో ఒక స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ (రూ.1999) కూడా పరిచయం చేసింది.బీఎస్ఎన్ఎల్ 1999 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. 330 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ఇంకో రెండు రోజలు (అక్టోబర్ 15) మాత్రం అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.ప్రయోజనాలు➤కాలింగ్: భారతదేశం అంతటా అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ కూడా.➤డేటా: రోజుకు 1.5జీబీ హై-స్పీడ్ డేటా, మొత్తం డేటా 495జీబీ➤ఎస్ఎమ్ఎస్: రోజుకు 100 ఫ్రీ ఎస్ఎమ్ఎస్లు➤స్పెషల్ ఆఫర్: బీఎస్ఎన్ఎల్ వెబ్సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 2 శాతం వరకు అదా చేయవచ్చు.ఓటీటీ బెనిఫిట్స్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు.. 350 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్, వివిధ ఓటీటీ అప్లికేషన్లకు యాక్సెస్ పొందవచ్చు. ప్రీమియం ఛానెల్స్, అదనపు ఓటీటీ కంటెంట్ యాక్సెస్ కోసం యూజర్ BiTVకి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోవచ్చు. మొత్తం మీద ఇతర టెలికాం కంపెనీల ప్లాన్స్ కంటే.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ప్రయోజనకారిగా ఉంటుందని తెలుస్తోంది. -
జియో 3 నెలల ప్లాన్: చౌకగా డైలీ 2జీబీ.. అన్లిమిటెడ్
రిలయన్స్ జియో తన 9వ వార్షికోత్సవాన్ని ఇటీవలె జరుపుకొంది. అప్పటి నుండి, కంపెనీ తన వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. అందులో ఒకటే రూ.899 ప్లాన్. దీంతో హై స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు ఇతర ఆకట్టుకునే ప్రయోజనాలను అందిస్తోంది.జియో రూ.899 ప్లాన్.. ప్రయోజనాలుజియో నుండి వచ్చిన ఈ ఆకట్టుకునే ప్లాన్ ధర రూ.899. పూర్తి 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు 20జీబీ అదనపు డేటాను కూడా అందిస్తోంది. అంటే మొత్తం డేటా 200GB అవుతుంది.ఇంకా ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ను కూడా అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపించుకోవచ్చు. జియో 5జీ నెట్ వర్క్ ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు.డేటా, కాలింగ్ మాత్రమే కాదు, ఈ ప్లాన్ జియో టీవీ, జియో ఐ క్లౌడ్, జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ లతో సహా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 3నెలల జియో హాట్ స్టార్ మొబైల్, టీవీ సబ్ స్క్రిప్షన్ కూడా చేర్చారు.అదనంగా, ఈ ప్లాన్ లో 3 నెలల పాటు జియోసావ్ ప్రోకు 1 నెల జొమాటో గోల్డ్ సబ్ స్క్రిప్షన్, ఉచితంగా 6 నెలల నెట్ మెడ్స్ ఫస్ట్ సభ్యత్వం ఉన్నాయి. ఇంకా ఈజీ మై ట్రిప్ పై రూ .2220 వరకు డిస్కౌంట్, హోటల్ బుకింగ్ లపై 15% వరకు తగ్గింపును అందిస్తుంది. అజియోపై రూ.200 తగ్గింపు, రిలయన్స్ డిజిటల్‌పై రూ.399 వరకు తగ్గింపును కూడా పొందుతారు. -
రోజుకు 2.5జీబీ డేటా.. అన్లిమిటెడ్ కాల్స్: రూ.225 ప్లాన్
భారత ప్రభుత్వం యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL), జియో & ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలకు సవాలు విసురుతూ కేవలం రూ.225 ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. రూ.250 కంటే తక్కువ ధరకే అత్యుత్తమ ప్రయోజనాలను అందించడం ద్వారా ఎక్కువమంది వినియోగదారులను ఆకట్టుకునే చర్యలో భాగంగానే బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన రూ. 225 ప్లాన్.. 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. అంటే రోజువారీ ఖర్చు రూ.7.50 అన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వినియోగదారుడు రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా, ఏ నెట్‌వర్క్‌కు అయినా.. అపరిమిత లోకల్ & ఎస్టీడీ కాలింగ్ లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను అందించే ఈ ప్లాన్.. ఇతర ప్రైవేట్ ఆపరేటర్స్ ప్లాన్స్ కంటే చౌక.బీఎస్ఎన్ఎల్ ఇతర రీఛార్జ్ ప్లాన్స్రూ.199 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, వీటన్నింటితో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తుంది. దేశంలోని ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే రూ .199 ప్లాన్ ఆర్థిక ప్రయోజనాలు, అధిక ప్రయోజనాలను కలిగి ఉందని పేర్కొంటూ బీఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది.బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "స్వదేశీ" 4G స్టాక్‌ను ప్రారంభించారు. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' దార్శనికత వైపు ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది. ఈ 4G టెక్నాలజీని పూర్తిగా దేశీయ సాఫ్ట్వేర్ & హార్డ్వేర్పై నిర్మించారు. దీనిని భారతీయ కన్సార్టియం అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 98,000 సైట్లలో 4G సేవను విస్తరించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. -
రూ.500 లోపు రీచార్జ్.. 72 రోజులు అన్లిమిటెడ్!
ప్రైవేట్ టెలికం సంస్థలు టారిఫ్‌లు పెంచిన క్రమంలో వినియోగదారులు చౌక రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక వ్యాలిడిటీని ఇచ్చే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ధర రూ .485. ఈ ప్లాన్ లో రోజూ హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ ఇటీవల ఇలాంటి ప్రయోజనాలతోనే రూ .199 రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. ఇది మంత్లీ ప్లాన్ కాగా తాజా రూ.485 ప్లాన్ (Recharge plan) దాదాపు రెండున్నర నెలల వ్యాలిడిటీతో వస్తుందిరూ.485 ప్లాన్ ప్రయోజనాలుబీఎస్ఎన్ఎల్ రూ.485 ప్లాన్‌లో 2 జీబీ రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 72 రోజుల వాలిడిటీతో లభిస్తాయి. అంటే యూజర్లు మొత్తం 144 జీబీ డేటాను పొందుతారు. ఇది బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియో కాల్స్ లేదా లైట్ స్ట్రీమింగ్ కు సరిపోతుంది. వర్క్ లేదా ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ డేటాపై ఆధారపడే వారికి, రూ .500 కంటే తక్కువ ధర పరిధిలో ఇది ఉత్తమ ప్లాన్. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లేదా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 2 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.200 లోపు రీచార్జ్.. రోజుకు 2 జీబీ డేటా -
ఒక్కసారే రీఛార్జ్.. ఏడాదంతా ఫ్రీ!: బెస్ట్ యాన్యువల్ ప్లాన్స్ ఇవే..
చాలామంది యూజర్లు మంత్లీ ప్లాన్స్ (28 రోజులు) రీఛార్జ్ చేసుకుంటారు. ఈ ప్యాక్ ధరలు, యాన్యువల్ ప్లాన్‌తో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఏడాది ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఈ కథనంలో బెస్ట్ యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.ఎయిర్టెల్ఎయిర్టెల్ తన యూజర్ల కోసం రూ.3599, రూ.2249 ప్లాన్స్ అందిస్తోంది. రూ.3599 రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటివాటితో పాటు.. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్ వంటివి లభిస్తాయి. కాగా రూ.2249 ప్లాన్ ద్వారా 365 రోజుల అపరిమిత కాలింగ్స్.. 30 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇందులో డైలీ డేటా.. ఇతర సబ్స్క్రిప్షన్ ఉండవు.రిలయన్స్ జియోజియో యూజర్లకు రూ.3599, రూ.999, రూ.234, రూ.895 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 3599 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్లు అపరిమిత కాలింగ్స్ పొందటమే కాకుండా.. రోజుకి 2.5 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. పైగా జియో టీవీ, హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.3999 ప్లాన్ ద్వారా అదనంగా జియో ప్యాక్ కోడ్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అయితే రూ.1234 ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీతో రోజుకి 0.5 జీబీ డేటా లభిస్తుంది. జియో ఫోన్ ప్రైమా యూజర్లు 336 రోజుల వాలిడిటీ కోసం రూ.895 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి 28 రోజులకు 2 జీబీ డేటా లభిస్తుంది.వోడాఫోన్ ఐడియావోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే.. ఇది తన యూజర్ల కోసం రూ. 3599తో రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకి 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ పొందవచ్చు. అంతే కాకుండా ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే.. రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫ్రీ డేటా పొందవచ్చు. రూ.3799తో రీఛార్జ్ చేస్తే.. అదనంగా ఆమెర్జన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజుకి 1.5 జీబీ చాలనుకుంటే.. రూ.3499తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ డేటా వద్దనుకుంటే.. రూ.1999తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ప్యాక్ మొత్తానికి 24 జీబీ డేటా లభిస్తుంది.ఇదీ చదవండి: ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!బీఎస్ఎన్ఎల్బీఎస్ఎన్ఎల్ విషయానికి.. రూ.2399, రూ.1999, రూ. 1515 అనే ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.2399 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 600 రోజులు అపరిమిత కాల్స్, రోజుకి 2 జీబీ డేటా వంటివి లభిస్తాయి. రూ.1999 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు 600 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. అయితే రూ.1515 ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. -
యూజర్లకు షాకిచ్చిన జియో: చౌకైన ప్లాన్ నిలిపివేత
సాధారణంగా ఎక్కువమంది తక్కువ ధరలో.. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లనే ఎంచుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు టెలికాం కంపెనీలు సరసమైన ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. అయితే రిలయన్స్ జియో మాత్రం రోజుకు 1జీబీ డేటా ఇస్తున్న రూ. 249 ప్లాన్‌ను నిలిపివేసింది.ఆగస్టు 18 నుంచి జియో తన ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ. 249 (రోజుకి 1జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ)ను నిలిపివేసింది. కాబట్టి ఇప్పుడు వినియోగదారులు రూ. 299 ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ రోజుకి 1.5 జీబీ డేటా పొందవచ్చు. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులే.ఇప్పటి వరకు రూ. 249తో రీఛార్జ్ చేసుకున్న జియో యూజర్లు.. ఇకపై మరో 50 రూపాయలు వెచ్చించి రూ. 299 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్లాన్ ద్వారా రోజుకి 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. కొంత ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపిక అవుతుంది.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్‌కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?ఇది కాకుండా రూ. 189 ప్లాన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా 2జీబీ డేటా, 300 ఎస్ఎమ్ఎస్లు, 28 రోజులపాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. డేటా అవసరం లేదు అనుకున్న యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కంపెనీ 1జీబీ డేటా ఇచ్చే ప్లాన్ తిరిగి ఎప్పుడు ప్రవేశపెడుతుంది? అనే వివరాలు వెల్లడికాలేదు. బహుశా ఈ ప్లాన్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం లేదని అనిపిస్తోంది. -
టెలికాం టారిఫ్‌లు పెంపు?
ఈ ఏడాది చివరికల్లా టెలికాం ఆపరేటర్లు కొత్త టారిఫ్ పెంపును ప్రకటిస్తారని పరిశ్రమ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాంతో మళ్లీ అధిక రీఛార్జ్ బిల్లులు చెల్లించాల్సి వస్తుందని భారతీయ మొబైల్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య ఈ పెరుగుదల ఉండొచ్చని ఇక్రా ప్రతినిధి అంకిత్ జైన్ తెలిపారు. అయితే ఈ పెంపు టెలికాం కంపెనీని అనుసరించి మొత్తం టారిఫ్‌లో 15-20% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఇది 2024లోని పెంపు కంటే తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు.‘టెలికాం కంపెనీల టారిఫ్ పెంపు తప్పదు. మొత్తం టారిఫ్‌లో ఇది 15-20 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. 2025 ఆర్థిక సంవత్సరంలో ఒక వినియోగదారుడి నుంచి కంపెనీలకు సమకూరే సగటు ఆదాయం(ఆర్పూ) రూ.200గా ఉంది. ఇది 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.220కు పెరుగుతుంది’ అని అంకిత్ అన్నారు.గతంలో ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్‌లను 19-21 శాతం పెంచాయని, దీంతో కొంతమంది వినియోగదారులు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ప్లాన్ వ్యాలిడిటీ పీరియడ్స్ మార్చకుండా ధరల పెంపుపై ఆపరేటర్లు దృష్టి సారిస్తారని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఐసీఐసీఐ పేదల బ్యాంకు కాదా? మినిమం బ్యాలెన్స్ రూల్స్‌లో మార్పుభారతీ ఎయిర్టెల్ ఇప్పటికే డేటా టారిఫ్‌లను పెంచే సూచనలు చేసింది. ‘భారత్‌లో మొబైల్ టారిఫ్ డిజైన్ తారుమారుగా ఉంది. సంపన్నులు తక్కువ చెల్లిస్తున్నారు. పేదలు కూడా వారితో సమానంగా పే చేస్తున్నారు. ఇది మారాల్సి ఉంది’ అని భారతీ ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ కంపెనీ ఇటీవల తెలిపారు. రిలయన్స్ జియో ప్రతినిధులు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత 5జీ పెట్టుబడులకు మద్దతు ఇవ్వడానికి టారిఫ్ దిద్దుబాట్లు అవసరమని చెప్పారు. -
హైస్పీడ్ డేటాతో కొత్త రీఛార్జ్ ప్లాన్
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పరిచయం చేస్తూ.. యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే వోడాఫోన్ ఐడియా (VI) రూ.365 రీఛార్జ్ ప్యాక్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వోడాఫోన్ ఐడియా.. తన కస్టమర్ల కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్, కాలింగ్‌ను అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 365 తీసుకొచ్చింది. ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే.. అన్లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకి 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. హై-స్పీడ్ 4G ఇంటర్నెట్ ఆస్వాదించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. -
365 రోజులు ఎంతసేపైనా మాట్లాడుకునేలా..
బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లు అందించడంలో బీఎస్ఎన్ఎల్కు ప్రత్యేక స్థానం ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను తక్కువ ధరలకు అందించడం ద్వారా తన యూజర్ బేస్‌ను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తన తాజా ఆఫర్లలో కేవలం రూ.1,999 ధరతో ఇయర్లీ ప్లాన్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పింది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ ప్లాన్‌ను పోటీ టెలికాం సంస్థల కంటే తక్కువ ధరకే అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.వ్యాలిడిటీ: 365 రోజులుడేటా: ఒకేసారి 600 జీబీ(రోజువారీగా 1.64 జీబీ)వాయిస్ కాలింగ్: అపరిమిత కాల్స్ చేయవచ్చు.ఎస్ఎంఎస్: రోజుకు 100ప్లాన్ ధర: రూ.1,999ఇదీ చదవండి: త్వరలో యూఎస్ కొత్త వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇలాంటి సరికొత్త ప్లాన్లును తీసుకొస్తుంది. కేవలం ఒక రూపాయితోనే 30 రోజుల అపరిమిత కాల్స్ అందిస్తున్నట్లు, ఇండిపెండెన్స్‌డే సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటిస్తున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది. -
సిమ్ యాక్టివ్ ప్లాన్లు.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే చాలు
చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నంబర్లు ఉంటాయి. టెలికం సంస్థలు టారిఫ్‌లను పెంచేసిన నేపథ్యంలో రెండింటికీ రీచార్జ్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా వినియోగించే నంబర్ కాకుండా మరో నంబర్‌ను తక్కువ ఖర్చుతో యాక్టివ్ ఉంచుకొనే రీచార్జ్ ప్లాన్ల కోసం చాలా మంది చూస్తున్నారు.డేటా లేకుండా కూడా మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి సహాయపడే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను ప్రారంభించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అన్ని ప్రధాన టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ క్రమంలో ఎయిర్టెల్, జియో, వీఐలు తమ డేటా ఫ్రీ ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..ఎయిర్టెల్ డేటా రహిత ప్లాన్స్ఇంటర్నెట్ డేటా సదుపాయం లేకుండా కాలింగ్, ఎస్ఎంఎస్ ల పూర్తి ప్రయోజనాన్ని అందించే రెండు ప్లాన్లను ఎయిర్ టెల్ ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ రూ.469కి అందుబాటులో ఉంది. ఇది దేశవ్యాప్తంగా అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, 900 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.1849. ఇందులో అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్, ఏడాది పొడవునా 3600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.జియో లాంగ్ వాలిడిటీ ఆఫర్లు84 రోజులు, 336 రోజుల వాలిడిటీ ఉన్న రెండు డేటా ఫ్రీ ప్లాన్లను జియో అందిస్తోంది. రూ.448 విలువైన 84 రోజుల ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదే సమయంలో రూ .1748 విలువైన 336 రోజుల ప్లాన్ వినియోగదారులకు అన్లిమిటెడ్ కాలింగ్, 3600 ఎస్ఎంఎస్ల సదుపాయాన్ని అందిస్తుంది.వొడాఫోన్ ఐడియా ప్లాన్స్వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్టెల్ మాదిరిగానే రెండు ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.470 ప్లాన్‌లో యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ.1849 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రెండు ప్లాన్లు అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్లను అందిస్తాయి. ఇది దాదాపు ఎయిర్టెల్ ఆఫర్లను పోలి ఉంటుంది.చదవండి: ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. ఓటీటీలన్నీ ఫ్రీ.. -
బంపరాఫర్.. ఒక్క రూపాయి రీఛార్జ్‌తో అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం ఒక రూపాయితోనే 30 రోజుల అపరిమిత కాల్స్ అంటూ ట్వీట్ చేసింది.భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ పరిచయం చేసింది. దీని ద్వారా యూజర్ 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. సిమ్ కార్డు కూడా పూర్తిగా ఉచితం కావడం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.Azadi ka plan at just Rs. 1/- & get true digital freedom with BSNL.With 30 days of unlimited calls, 2GB data/day, 100 SMS/day, and a free SIM. Applicable for new users only.#BSNL #DigitalIndia #IndependenceDay #BSNLFreedomOffer #DigitalAzadi pic.twitter.com/L9KoJNVaXG— BSNL India (@BSNLCorporate) July 31, 2025 -
ఎయిర్టెల్ రీచార్జ్‌పై 25% క్యాష్ బ్యాక్.. ఇలా చేస్తే..
దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సేవలతో పాటు, బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను కూడా అందిస్తోంది. మొబైల్ టారిఫ్‌లు పెరిగిన నేపథ్యంలో మీరు మొబైల్ రీఛార్జ్, బ్రాడ్ బ్యాండ్ బిల్లు లేదా డిటిహెచ్ రీఛార్జ్ పై ఆదా చేయాలనుకుంటే మీకో చక్కటి మార్గం ఉంది. దీని ద్వారా ప్రతి రీఛార్జ్ పైనా 25 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని మీకు తెలుసా?యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీని సాయంతో రీఛార్జ్ వంటి యుటిలిటీ చెల్లింపులపై బంపర్ క్యాష్ బ్యాక్ పొందడం ఈ కార్డు ప్రత్యేకత. మీరు ఎయిర్టెల్ రీఛార్జ్‌లలో డబ్బులు ఆదా చేయాలనుకుంటే, ఈ కార్డు మీకు సరైన ఎంపిక. దీనితో ఇతర కంపెనీల రీఛార్జ్ లపై కూడా డిస్కౌంట్లు పొందవచ్చు.25 శాతం క్యాష్ బ్యాక్ పొందండిలా..ఈ క్యాష్ బ్యాక్ కోసం యూజర్లు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వరా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీఛార్జ్ కోసం ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించినట్లయితే ఫ్లాట్ 25 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే సమయంలో ఇతర రీఛార్జ్ లపై కూడా 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ 60 రోజుల్లో ప్రాసెస్ అయి నేరుగా క్రెడిట్ స్టేట్ మెంట్ లో ప్రతిబింబిస్తుంది. -
బాబోయ్.. రీచార్జ్ ప్లాన్లు మళ్లీ పెరుగుతాయా?
దేశంలో మొబైల్ రీచార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లను పెంచవచ్చని తెలుస్తోంది. ధరల పెరుగుదల 10 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ఓ వార్తా నివేదిక తెలిపింది. 2024 జూలైలో బేస్ ధరలను 11 నుండి 23 శాతం పెంచిన భారతీయ టెలికాం కంపెనీలు ఈసారి కొత్త విధానాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మే నెలలో బలమైన క్రియాశీలక యూజర్ల పెరుగుదలే ఈ పెంపునకు కారణమని చెబుతున్నారు.మళ్లీ మొబైల్ టారిఫ్‌ల పెంపుభారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాతో సహా భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లపై తాజా పెంపును విధించవచ్చని ఈటీ టెలికాం నివేదిక తెలిపింది. ఈ పెరుగుదల 10-12 శాతం మధ్య ఉంటుందని, మిడ్-టు-హై-ప్రైస్ రీఛార్జ్ ప్లాన్లను కొనుగోలు చేసే వినియోగదారులను కంపెనీలు లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది.టారిఫ్‌ల పెంపుతో యాక్టివ్ సబ్స్క్రైబర్లు వేరే టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్‌కు మళ్లకుండా ఆపరేటర్లు టైర్డ్ విధానంపై దృష్టి సారించారు. మే నెలలో యాక్టివ్ సబ్స్క్రైబర్ల బలమైన వృద్ధి మరోసారి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ 31 రోజుల్లో భారతీయ టెలికాం రంగంలో 7.4 మిలియన్ల క్రియాశీల చందాదారులు పెరిగారు. 29 నెలల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1.08 బిలియన్లకు చేరింది. -
365 రోజుల వ్యాలిడిటీ: వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తుంటే.. దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన వోడాఫోన్ ఐడియా మాత్రం ఖరీదైన ప్లాన్ (రూ. 4999) ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ఖరీదైనది అయినప్పటికీ.. ఆఫర్స్ కూడా బోలెడన్ని ఉన్నాయని తెలుస్తోంది.వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ.4,999 వ్యాలిడిటీ.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తొలగించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏడాది పాటు.. రోజుకి 100 ఎస్ఎమ్ఎస్లు పంపుకోవచ్చు. అయితే డేటా రోజుకు 2 జీబీ మాత్రమే. అపరిమిత వాయిస్ కాల్స్ యధావిధిగా లభిస్తాయి.ఎస్ఎమ్ఎస్లు, డేటా, వాయిస్ కాల్స్ మాత్రమే కాకుండా.. Vi MTV, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5, ప్లేఫ్లిక్, Fancode, Aaj Tak, Manoramax వంటి అనేక ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సభ్యత్వాలు లభిస్తాయి.వోడాఫోన్ ఐడియా రూ. 4999 ప్లాన్ అపరిమిత ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇందులో వీకెండ్ డేటా రోల్ ఓవర్, డేటా డిలైట్స్, హాఫ్ డే అన్లిమిటెడ్ డేటా వంటివి ఉన్నాయి. రోజుకి 2జీబీ డేటా అయినప్పటికీ హాఫ్ డే అన్లిమిటెడ్ డేటా కింద.. ప్రతిరోజూ అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు అపరిమిత డేటా అందుబాటులో ఉంటుంది. ఇది సగం రోజు వినియోగాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ వారాంతపు డేటా రోల్‌ఓవర్‌ను కూడా కలిగి ఉంది, అంటే ఉపయోగించని ఇంటర్నెట్ డేటాను వారంలోని చివరి రెండు రోజుల్లో తీసుకెళ్లి ఉపయోగించవచ్చు. -
జియో యూజర్లకు శుభవార్త: రూ.100 రీఛార్జ్‌తో ఎన్నో బెనిఫిట్స్!
భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులతో అగ్రగామిగా ఉన్న టెలికాం ఆపరేటర్ రిలయన్స్ 'జియో'.. రూ.100 ప్లాన్‌లో రూ.299 విలువైన ఓటీటీ బెనిఫిట్స్ అందించే ఒక కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ముఖ్యంగా మొబైల్ లేదా టీవీలో స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారుల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.100 ప్లాన్జియో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.100 ప్లాన్.. సాధారణంగా రూ.299 ప్లాన్‌లో కనిపించే ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం డేటా 5 జీబీ మాత్రమే. జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్లపై ఎక్కువ ఖర్చు చేయకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ వంటి వాటిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.బేస్ ప్లాన్ రీఛార్జ్ తప్పనిసరిజియో వినియోగదారులు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. 100 రూపాయల ప్లాన్ ద్వారా బెనిఫిట్స్ పొందాలంటే.. జియో నంబర్లో యాక్టివ్ బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుని ఉండాల్సిందే. బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోకుండా.. రూ. 100 రీఛార్జ్ ద్వారా ప్రయోజనాలను పొందలేరు. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల అన్ని టెలికాం ఆపరేటర్లను వినియోగదారుల ప్రయోజనం కోసం.. వాయిస్ కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సేవలను కలిగి ఉన్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు ప్రతిస్పందనగా, రిలయన్స్ జియో ఎటువంటి డేటా ప్రయోజనాలను అందించకుండా.. కాలింగ్, ఎస్ఎమ్ఎస్ వంటి వాటికోసం మాత్రమే రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్లు (రూ.458, రూ.1958) ప్రత్యేకంగా వాయిస్ కాల్స్ & టెక్స్ట్ మెసేజస్ వంటివి మాత్రమే అవసరమయ్యే వారికి ఉపయోగపడతాయి. అంటే ఈ ప్లాన్లలో డేటా లభించదు.రూ.458 ప్లాన్ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే ఉంటుంది. వ్యాలిడిటీ సమయంలో అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు, నేషనల్ రోమింగ్ వంటివి లభిస్తాయి. అంతే కాకుండా.. జియో సినిమా, జియో టీవీ, జియోకు సంబంధించిన యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?రూ. 1,958 ప్లాన్ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు, నేషనల్ రోమింగ్ సేవలు ఉన్నాయి. వీటితో పాటు.. వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ యాక్సెస్‌ను పొందుతారు. కొత్త ప్లాన్ల తీసుకొచ్చిన జియో.. రూ. 479, రూ. 1899 ప్లాన్లను నిలిపివేసింది. -
ఫోన్ రీచార్జ్‌లకు జేబులు ఖాళీ!
ఫోన్ రీచార్జ్‌లకు వినియోగదారుల జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా (విఐ) రానున్న డిసెంబర్ నాటికి తమ టారిఫ్‌లను 10-20% పెంచే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.ఇది ఆరు సంవత్సరాలలో నాలుగో అతిపెద్ద టారిఫ్ పెంపు కానుంది. టెలికాం కంపెనీలు చివరిసారిగా 2024 జులైలో టారిఫ్‌లను పెంచాయి. 4G, 5G మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు 25 శాతం వరకూ టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచాయి.గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ విశ్లేషకుల ప్రకారం.. భారత్‌లో టెలికాం టారిఫ్‌లలో సుమారు 15% పెంపు ఉండే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు 10% టారిఫ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించడానికి టారిఫ్‌ల పెంపు దోహదపడనున్నది. ఇండియన్ టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రత కారణంగా టారిఫ్‌లు గత కొన్ని సంవత్సరాలుగా తక్కువగా ఉన్నాయని, దీనిని సరిదిద్దేందుకు ఈ చర్య తీసుకోవాలని ఆపరేటర్లు భావిస్తున్నారు. అయితే టారఫ్‌ల పెంపు కారణంగా వినియోగదారులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, దీని ప్రభావం వినియోగ శక్తి, మార్కెట్ డైనమిక్స్‌పైనా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రంగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, భవిష్యత్ సాంకేతిక అవసరాల కోసం పెట్టుబడులను సమర్థించేందుకు టారిఫ్‌ల పెంపు అవసరమని టెలికాం ఆపరేటర్లు పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణయం ఖరారు కాకపోయినా, ఇది వినియోగదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం రానున్న నెలల్లో టెలికాం ఆపరేటర్ల నుండి వెల్లడవుతుందని భావిస్తున్నారు. -
సూపర్ సేవర్ ప్యాక్.. 98 రోజుల కొత్త రీచార్జ్ ప్లాన్
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రారంభిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రీఛార్జ్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కాస్త పొదుపైన, 98 రోజుల సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, డేటాతోపాటు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.జియో రూ.999 ప్లాన్జియో ప్రస్తుతం తన రూ .999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆనందింవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు.ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ 90 రోజులపాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. తద్వారా వినియోగదారులు ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను, సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు. అలాగే ఈ రీఛార్జ్ ప్లాన్‌తో జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.జియో రూ.1,049 ప్లాన్రూ .999 ప్లాన్‌తో పాటు, దీనికి దగ్గర ఉండే రూ .1,049 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది. దీంతో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. వినియోగదారులు 50 జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా పొందుతారు. ఇది కమ్యూనికేషన్‌తో పాటు స్టోరేజ్ అవసరాలకు అనువుగా ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్‌లో జియో సినిమా ప్రీమియం (డిస్నీ + హాట్‌స్టార్) కు 90 రోజుల మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జీ5, సోనీలైవ్ యాక్సెస్ లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. -
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో.. తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించేవారికోసం రూ. 1049 ప్లాన్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రిలయన్స్ జియో రూ.1,049 ప్లాన్ ద్వారా.. 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. అంతే కాకుండా రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా ఈ ప్లాన్‌లో 50జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్, 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జీ5, సోనీలివ్ వంటి వాటికి కూడా యాక్సెస్ లభిస్తుంది.ఇదీ చదవండి: అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్460 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది. ఈ కంపెనీ అపరిమిత కాలింగ్, ఎస్ఎమ్ఎస్, డేటా వంటి వాటికోసం విభిన్న శ్రేణి రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. ప్రస్తుతం సంస్థ 5జీ, 4జీ, 4జీ ప్లస్ అనే సర్వీసులను అందిస్తోంది. -
IPL 2025: ఈ రీఛార్జ్ ప్లాన్లతో జియోహాట్‌స్టార్ ఫ్రీ..
క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న.. 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025' (IPL 2025) మొదలవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే జియో అన్లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా కొన్ని ప్రత్యేక ప్యాకేజీల ద్వారా క్రికెట్ వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ కథనంలో జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉన్న ప్రత్యేక డేటా ప్లాన్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.జియోకేవలం 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. 90 రోజుల వ్యాలిడిటీతో, 5జీబీ డేటా, జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచితంగా ఐపీల్ వీక్షించవచ్చు. ఈ ఆఫర్ 2025 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత.. దీని వ్యాలిడిటీ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 90 రోజుల వరకు ఉంటుంది.ఎయిర్టెల్ఎయిర్టెల్ కూడా తన యూజర్ల కోసం ప్రత్యేక ప్లాన్ అందిస్తోంది. వినియోగదారులు 100 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 5జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. రూ. 195 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 90 రోజుల వ్యాలిడిటీతో 15జీబీ డేటా లభిస్తుంది. 90 రోజుల జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీవోడాఫోన్ ఐడియావోడాఫోన్ ఐడియా అందిస్తున్న రూ.101 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 3జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో.. 90 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే 151 రూపాయల రీఛార్జ్ ద్వారా 4జీబీ డేటా, 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. 169 రూపాయల ప్లాన్ ద్వారా 8జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో.. 30 రోజుల మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. -
ఒక్క రీఛార్జ్.. 425 రోజుల వ్యాలిడిటీ: BSNL కొత్త ప్లాన్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) హోలీకి ముందు అద్భుతమైన ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాన్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ చెల్లుబాటుతో అపరిమిత కాల్‌లను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్.. ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు అందించే టాప్ ప్లాన్లకు గట్టి పోటీని ఇస్తుంది.హోలీ ధమాకా ఆఫర్ పేరుతో తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ధర రూ. 2399. ఇది 425 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేరుకుంటే అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు చేసుకోవచ్చు. కొంత తక్కువ ఖర్చుతో.. ఎక్కువ రోజుల ప్లాన్ కోసం వేచి చూసేవారికి బెస్ట్ ఆప్షన్ అని తెలుస్తోంది.బీఎస్ఎన్ఎల్ ఇతర ప్లాన్స్➤రూ. 1999 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 600 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.1499 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 24 జీబీ డేటా మరియు, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.1198 ప్లాన్: 300 నిమిషాల వాయిస్ కాల్స్, నెలకు 3 జీబీ డేటా మరియు నెలకు 30 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.997 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తుంది. వాలిడిటీ 160 రోజులు. ➤రూ. 897 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 90 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తుంది. వాలిడిటీ 180 రోజులు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. 54 రోజులు..
ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఎప్పటికప్పుడు చౌక రీచార్జ్ ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఉచిత ఎస్ఎంఎస్ వంటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.కొత్త ప్లాన్ ప్రయోజనాలురూ. 347 ధరతో బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ వినియోగదారులకు ఢిల్లీ, ముంబైలోని ఎంటీఎన్ఎల్ (MTNL) ప్రాంతాలతో సహా దేశం అంతటా ఉచిత అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్‌ను అందిస్తుంది. అదనంగా, రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను యూజర్లు ఆనందించవచ్చు.ఈ ప్లాన్ 54 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదనపు బోనస్‌గా బీఐటీవీ (BiTV)కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంటారు. ఇది 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు, వివిధ రకాల OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా సేవలను మెరుగుపరచడంపై బీఎస్ఎన్ఎల్ దృష్టి సారిస్తోంది. కంపెనీ 65,000 కొత్త 4జీ టవర్లను విజయవంతంగా అమలులోకి తెచ్చింది. దేశం అంతటా తమ వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు ఈ సంఖ్యను త్వరలో లక్షకు పెంచాలని యోచిస్తోంది.ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో, మెరుగైన సర్వీస్ డెలివరీని లక్ష్యంగా చేసుకుని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల రూ. 6,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది.బీఎస్ఎన్ఎల్కు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే విస్తృత ప్రయత్నంలో ఇది భాగం. ఇటీవలి సంవత్సరాల్లో బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్ల సాయాన్ని ప్రకటించింది. 2007 తర్వాత మొదటిసారిగా బీఎస్ఎన్ఎల్ లాభాల్లోకి వచ్చింది. 2025 ఆర్థిక సంవ్సతరం మూడవ త్రైమాసికంలో రూ.262 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. -
జియో రీచార్జ్ ప్లాన్లలొ మార్పులు
రిలయన్స్ జియో (Reliance Jio) తన రెండు ప్రముఖ డేటా యాడ్-ఆన్ ప్లాన్లకు (recharge plans) సంబంధించి మార్పులు చేసింది. రూ. 69 ప్లాన్, రూ. 139 ప్యాక్‌ల వ్యాలిడిటీని సవరించింది. ఈ ప్లాన్లకు ప్రత్యేక వ్యాలిడిటీని ప్రవేశపెట్టింది. అలాగే కొద్ది రోజుల క్రితం రూ. 448 ప్లాన్‌ను కూడా జియో అప్డేట్ చేసింది. రూ. 189 ప్యాక్‌ను తిరిగి ప్రవేశపెట్టింది.గతంలో రూ.69, రూ.139 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లకు ప్రత్యేక వ్యాలిడిటీ ఉండేది కాదు. యూజర్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీనే వీటికీ వర్తించేది. అంటే యూజర్ ఖాతాలో యాక్టివ్ బేస్ రీఛార్జ్ ఉన్నంత కాలం ఉంటాయి. ఉదాహరణకు, బేస్ ప్యాక్‌కు 30 రోజులు వ్యాలిడిటీ ఉంటే, యాడ్-ఆన్ అదే కాలానికి యాక్టివ్‌గా ఉండేది.కొత్త సవరణ ప్రకారం, రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇప్పుడు కేవలం 7 రోజుల స్టాండ్ఎలోన్ వాలిడిటీతో వస్తాయి. అంటే బేస్ ప్యాక్‌తో ముడిపడి ఉన్న మునుపటి దీర్ఘకాల వ్యాలిడిటీకి భిన్నంగా, ఈ ప్లాన్ల కింద అందించిన డేటాను వినియోగించుకోవడానికి వినియోగదారులకు ఒక వారం మాత్రమే సమయం ఉంటుంది.ఇక డేటా ప్రయోజనాల విషయానికొస్తే, రూ.69 ప్లాన్ 6జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అదే రూ.139 ప్లాన్ 12జీబీ డేటా అందిస్తుంది. కేటాయించిన డేటా వినియోగించిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకి పడిపోతుంది. ఇవి డేటా-ఓన్లీ ప్లాన్లు అని గమనించడం ముఖ్యం. అంటే అవి వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంసెస్ వంటి ప్రయోజనాలు ఉండవు. అంతేకాకుండా యూజర్ నంబర్లో యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే ఈ యాడ్-ఆన్లు పనిచేస్తాయి.మళ్లీ రూ.189 ప్లాన్యాడ్ ఆన్ ప్యాక్‌లలో సవరణలతో పాటు, రిలయన్స్ జియో తన రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తిరిగి ప్రారంభించింది. దీనిని కొంతకాలం తొలగించగా ఇటీవల మళ్లీ 'అఫర్డబుల్ ప్యాక్‌లు' విభాగం కింద చేర్చింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తంగా 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు జియోటీవీ, జియోసినిమా (ప్రీమియం కంటెంట్ మినహా), జియోక్లౌడ్ స్టోరేజ్ వంటి జియో సేవలను కూడా పొందగలరు.రూ.448 ప్లాన్ ధర తగ్గింపుజియో తన రూ.448 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరను రూ.445కి తగ్గించింది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. అదనంగా సబ్స్క్రైబర్లు జీ5, జియో సినిమా ప్రీమియం, సోనీ లివ్, లయన్స్టేజ్ ప్లే, వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒకసారి రీఛార్జ్ చేస్తే 12 నెలల పాటు సర్వీసులు పొందేలా కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. తరచూ రీఛార్జ్‌లు, ఇతర టెలికాం ప్రొవైడర్ల నుంచి పెరుగుతున్న ఖర్చుల భారంతో సతమతమవుతున్న వినియోగదారులకు ఊరటనిచ్చేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.సూపర్ రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఆఫర్ కేవలం రూ.1,999కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 12 నెలలు. నెలవారీ రీఛార్జ్‌ల ఇబ్బంది లేకుండా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.అన్ లిమిటెడ్ కాలింగ్: యూజర్లు అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లపై అపరిమిత ఉచిత కాలింగ్‌ను వినియోగించుకోవచ్చు.600 జీబీ డేటా: ఈ ప్లాన్‌లో రోజువారీ వినియోగ పరిమితులు లేకుండా మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. యూజర్లు ఏడాది పొడవునా తమ సౌలభ్యం మేరకు ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు.రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు: నిరంతరాయంగా కమ్యూనికేషన్ కోసం రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్లు, దీర్ఘకాలిక వాలిడిటీ ఆఫర్లను అందిస్తుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇటీవల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు చౌక రీఛార్జ్ ధరల కోసం బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త సూపర్ రీఛార్జ్ ప్లాన్ మరింత మంది యూజర్లను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: రైల్వే అంతటా ‘కవచ్’ అమలుఇతర ప్రొవైడర్లు ఇలా..ఇతర టెలికాం ప్రొవైడర్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉదాహరణకు, జియో పైన తెలిపిన సర్వీసులతో వార్షిక ప్లాన్‌ను రూ.3,599కు అందిస్తుంది. ఇందులో 2.5 జీబీ రోజువారీ పరిమితితో 912.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఉన్నాయి. ఎక్కువ డేటాను అందిస్తుండడంతో జియో ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కంటే ఖరీదుగా ఉంది. అయితే అందుకోసం కొన్ని సర్వీసులు అదనంగా ఇస్తుంది. యూజర్లు నిజంగా ఈ సర్వీసులను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తేనే ఆ ప్లాన్ మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలోనూ ఇలా బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే అదనంగానే వసూలు చేస్తున్నాయి. -
జియో కొత్త ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. కొన్ని రోజులకు ముందు ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎమ్ఎస్ కోసమే రీఛార్జ్ చేసుకునేవారి కోసం రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ఆదేశించింది. దీంతో జియో రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటి గురించి తెలుసుకుందాం.జియో ప్రవేశపట్టిన కొత్త ప్లాన్ల జాబితాలో 84 రోజుల ప్లాన్, 365 రోజుల ప్లాన్ ఉన్నాయి. వీటి రీఛార్జ్‌తో యూజర్ కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ వంటివి మాత్రమే చేసుకోవచ్చు, డేటా లభించదు. ఇవి కీ ప్యాడ్ మొబైల్ లేదా.. డేటా అవసరం లేని మొబైల్స్ ఉపయోగిస్తున్నవారికి మంచి ఆప్షన్.రూ.458 : 84 రోజులుజియో యూజర్లు రూ. 458తో రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎమ్ఎస్లు పొందుతారు. అంతే కాకుండా వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయవచ్చు.రూ.1,958 : 365 రోజులుజియో అందిస్తున్న మరో ప్లాన్ ధర రూ. 1,958. ఈ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ పొందుతుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. 3,600 ఉచిత ఎస్ఎమ్ఎస్లు పొందుతారు. జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయవచ్చు.జియో రెండు ప్లాన్లను తొలగించిందిజియో ఇప్పుడు తన జాబితా నుంచి రెండు పాత రీఛార్జ్ ప్లాన్లను తొలగించింది. అవి రూ. 479 ప్లాన్, రూ. 1899 ప్లాన్. 1899 రూపాయల ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో 24 జీబీ డేటాను అందించగా, రూ. 479 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 6 జీబీ డేటాను అందించింది. ఇప్పుడు ఇవి రెండూ అందుబాటులో లేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపు -
ట్రాయ్ ఎఫెక్ట్.. ఎయిర్టెల్ కొత్త చౌక ప్లాన్లు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలను అనుసరించి దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ (Airtel) రెండు వాయిస్-ఓన్లీ చౌక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించాలని ట్రాయ్ ఇటీవల టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ ప్లాన్లను ప్రారంభించిన ఏడు రోజులలోపు ట్రాయ్ సమీక్షిస్తుంది.ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్టెల్ తన వాయిస్-ఓన్లీ ప్లాన్లను సవరించింది. ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ప్రయోజనాలను అలాగే ఉంచుతూ తక్కువ ధరలో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. పాత ప్లాన్లను తొలగించింది. ఈమేరకు ఎయిర్టెల్ తన వెబ్సైట్లో ప్లాన్లను అప్డేట్ చేసింది. సవరించిన ఎయిర్టెల్ ప్లాన్లు ఇవే..రూ.469 ప్లాన్ఇది 84 రోజుల ప్లాన్. గతంలో ఈ ప్లాన్ ధర రూ.499 ఉండేది. దీన్ని ప్రస్తుతం రూ. 30 తగ్గించింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆనందించవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 900 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. ఎటువంటి డేటా అవసరం లేకుండా కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు అవసరమయ్యే 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం దీన్ని తీసుకొచ్చారు.రూ. 1849 ప్లాన్ ఇది 365 రోజుల ప్లాన్. ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 1,959. రూ. 110 తగ్గించి రూ. 1,849 లకు తీసుకొచ్చింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ మాట్లాడవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా దీర్ఘకాలిక వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను కోరుకునే వినియోగదారుల కోసం దీన్ని రూపొందించారు.జియో ప్లాన్లుట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా వాయిస్-ఓన్లీ ప్లాన్లను ప్రారంభించిన మొదటి టెలికం కంపెనీ రిలయన్స్ జియో. 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో చౌకైన వాయిస్-ఓన్లీ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. 84 రోజుల ప్లాన్ ధర రూ. 458. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. 1,000 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇక 365-రోజుల ప్లాన్ ధర రూ. 1,958. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు ఆనందించవచ్చు. ఈ రెండు ప్లాన్లలోనూ ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. -
రోజంతా అన్లిమిటెడ్ డేటా: కేవలం రూ. 49తో..
భారతదేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఎకనామిక్ రీఛార్జ్ ప్లాన్లతో మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. దేశంలోని సుమారు 490 మిలియన్లకు పైగా వినియోగదారులకు కనెక్ట్ అయి ఉండటానికి కంపెనీ ఎప్పటికప్పుడు వినూత్నమైన లేదా సరసమైన రీఛార్జ్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 49 రూపాయలతో డేటా రీఛార్జ్ అందిస్తోంది.రూ.49 రీఛార్జ్ ప్లాన్ వివరాలుజియో డేటా ప్యాక్ కేటగిరీ కింద రూ. 49 రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత డేటా మాత్రమే లభిస్తుంది. అయితే మీరు కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సేవలను పొందలేరు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఒక రోజు మాత్రమే. అయితే ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.రిలయన్స్ జియో అందిస్తున్న ఒక్క రోజు అపరిమిత డేటా ప్లాన్.. దాని ప్రత్యర్ధ సంస్థలైన ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా (VI), బీఎస్ఎన్ఎల్ వంటి వాటిపై ఒత్తిడిని పెంచింది. కాగా జియో తన కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లాన్స్ అందించింది.2024 జులైలో జియో తన కొత్త అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా అమలులోకి వచ్చిన ప్లాన్ ధరలు.. ఉన్న ప్లాన్ ధరల కంటే 20 శాతం ఎక్కువయ్యాయి. దీంతో 155 రూపాయల ప్లాన్ 189 రూపాయలకు, 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలకు చేరుతుంది. రూ. 2999 యాన్యువల్ ప్లాన్.. త్వరలో 3599 రూపాయలకు చేరాయి.ఇదీ చదవండి: స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట!.. వచ్చేసింది మొబైల్ యాప్రీఛార్జ్ ప్లాన్ ధరలు భారీగా పెరగడంతో.. చాలామంది బీఎస్ఎన్ఎల్ వైపు తిరిగారు. ఆ తరువాత మళ్ళీ తమ యూజర్లను ఆకర్శించడానికి జియో సరికొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వచ్చినదే.. రూ. 49 డేటా ప్లాన్. ఇది ఇంటర్నెట్ బాగా వాడేవారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. -
ట్రాయ్ కొత్త రూల్స్.. రూ.10తో రీఛార్జ్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 2G సేవలను ఉపయోగిస్తున్న దాదాపు 150 మిలియన్ల భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ వంటి వాటికోసం మాత్రమే మొబైల్ ఉపయోగించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కీప్యాడ్ మొబైల్స్ లేదా 2జీ మొబైల్స్ వాడేవారికి డేటాతో పనిలేదు. అయినప్పటికీ వారు రీఛార్జ్ చేసుకోవాలంటే డేటాకు కూడా కలిపి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో.. టెలికాం కంపెనీలు సరసమైన ప్లాన్స్ ప్రారంభించాల్సి ఉంది.రీఛార్జ్ ప్లాన్లు రూ. 10 నుంచికొత్త నిబంధనల ప్రకారం Airtel, Jio, BSNL, Vodafone Idea (Vi) 10 రూపాయల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉండే టాప్ అప్ వోచర్లను పరిచయం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ట్రాయ్ రూ. 10 డినామినేషన్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని తొలగించింది. దీంతో ఏదైనా విలువ కలిగిన టాప్ అప్ వోచర్లను జారీ చేయడానికి ఆపరేటర్లను అనుమతిస్తుంది.ఆన్లైన్ రీఛార్జ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యతకు దృష్టిలో ఉంచుకుని.. కలర్ కోడెడ్ ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్‌ను తొలగించాలని రెగ్యులేటర్ నిర్ణయించింది. ప్రత్యేక టారిఫ్ వోచర్ల చెల్లుబాటును కూడా 90 రోజుల నుంచి 365 రోజులకు పెంచింది. ఇంటర్నెట్ సేవలు అవసరం లేని 2G ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాయిస్.. ఎస్ఎంఎస్ ప్లాన్లను రూపొందించాలని టెలికాం ఆపరేటర్లకు సూచించింది.ఇదీ చదవండి: సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే ఆఫర్స్: రూ. 209తో..ట్రాయ్ మార్గదర్శకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కానీ కంప్లైంట్ రీఛార్జ్ ప్లాన్లను రూపొందించడానికి టెలికాం కంపెనీలకు కొన్ని వారాల సమయం ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక లాంచ్ తేదీని ప్రకటించనప్పటికీ, జనవరి చివరి నాటికి సరసమైన రీఛార్జ్ ప్లాన్లు మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. -
సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే ఆఫర్స్: రూ. 209తో..
జియో, ఎయిర్టెల్ కంపెనీలు యూజర్లను ఆకర్షిస్తున్న వేళ.. 'వోడాఫోన్ ఐడియా' (VI) వినియోగదారుల కోసం ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర రూ. 209 మాత్రమే. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ అన్ని రకాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వోడాఫోన్ ఐడియా అందిస్తున్న 209 రూపాయల ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించడం మాత్రమే కాకుండా, రోజుకు 2జీబీ డేటా అందిస్తుంది. అంతే కాకుండా 300 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అందించే ప్రయోజనాలు రూ.199 ప్లాన్‌కు సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. రూ.209 ప్లాన్‌లో కంపెనీ అపరిమిత కాలర్ ట్యూన్లను అందిస్తోంది. రూ. 209 ప్లాన్ కాకుండా.. కంపెనీ రూ. 218, రూ. 249, రూ. 289 ప్లాన్స్ కూడా అందిస్తోంది.రూ. 218 ప్లాన్కంపెనీ రూ.218 ప్లాన్ ద్వారా 1 నెల వాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో, మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 3జీబీ డేటాను పొందుతారు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ప్లాన్‌లో.. కంపెనీ అపరిమిత కాలింగ్, 300 ఉచిత ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. 300 ఎస్ఎమ్ఎస్ల పరిమితి ముగిసిన తర్వాత.. ఒక్కో లోకల్ ఎస్ఎమ్ఎస్ కోసం రూ.1, ఎస్టీడీ ఎస్ఎమ్ఎస్ కోసం రూ. 1.5 పైసలు చెల్లించాల్సి వస్తుంది.రూ. 249 ప్లాన్కంపెనీ అందించే.. ఈ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 1 జీబీ డేటా పొందవచ్చు. డేటా పరిమితి ముగిసిన తర్వాత, ప్లాన్‌లో అందించే ఇంటర్నెట్ వేగం 64Kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ ప్రతిరోజూ 100 ఎస్ఎమ్ఎస్లను అందిస్తోంది. దీనితో పాటు, మీరు అపరిమిత కాలింగ్ కూడా పొందుతారు.రూ. 289 ప్లాన్ఈ ప్లాన్ ద్వారా మీరు 40 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. 4 జీబీ డేటా లభిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత, మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాలి. ఈ ప్లాన్ 600 ఉచిత ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండిమొబైల్ రీఛార్జ్ మరింత భారం అవుతుందా?రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది. -
ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండి
గతంలో రీఛార్జ్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ అయినా వచ్చేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి రీఛార్జ్ ముగిసిన తరువాత తప్పకుండా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అయితే కొందరు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాలంటే కొంత కష్టమనుకుంటారు, అలాంటి వారు ఆరు నెలలకు లేదా ఏడాదికి రీఛార్జ్ చేసుకుంటారు. ఈ కథనంలో 84 రోజుల ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..జియో (Jio)రిలయన్స్ జియో అందిస్తున్న అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.799 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా (మొత్తం 126 జీబీ), రోజులు 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్స్ వంటివి లభిస్తాయి. రోజువారీ డేటా పూర్తయిన తరువాత 64 kbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. జియో టీవీ, జిఓ సినిమా, జిఓ క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.బీఎస్ఎన్ఎల్ (BSNL)బీఎస్ఎన్ఎల్ 84 రోజుల ప్లాన్ ధర రూ. 628 మాత్రమే. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 40 kbpsకు తగ్గుతుంది.ఎయిర్టెల్ (Airtel)ఎయిర్టెల్ 84 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 509. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుడు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా (84 రోజులకు) లభిస్తుంది. ఈ డేటా పూర్తయిపోతే.. ఒక ఎంబీకి 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారు.. అన్లిమిటెడ్ 5జీ డేటాకు అనర్హులు. ఇందులో ఫ్రీ హలోట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్, అపోలో 24/7, స్పామ్ కాల్స్ వంటివి ఉన్నాయి.వీఐ (వొడాఫోన్ ఐడియా)వొడాఫోన్ ఐడియా అందించే అతి చౌకైన ప్లాన్‌లో రూ. 509 కూడా ఒకటి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనిని రీఛార్జ్ చేసుకున్న యూజర్లు అన్లిమిటెడ్ కాల్స్, 1000 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా వంటివి పొందుతారు. ఎస్ఎమ్ఎస్లు, డేటా అనేది మొత్తం ప్యాక్‌కు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి అది ఖాళీ అయితే మళ్ళీ వాటి కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అదనపు ప్రయోజనాలు కూడా ఏమీ లభించవు. -
జియో కొత్త ప్లాన్.. రెండేళ్లు యూట్యూబ్ ఫ్రీ
2025 జనవరి 11 నుంచి రిలయన్స్ జియో తన ఎయిర్ ఫైబర్ & ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ప్రయోజనాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన వినియోగదారులు 24 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియమ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రయోజనాలను పొందుతారు. జియో.. యూట్యూబ్ మధ్య ఈ ముఖ్యమైన భాగస్వామ్యం, దేశవ్యాప్తంగా ఉన్న సబ్స్క్రైబర్ల కోసం డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించింది.యూట్యూబ్ ప్రీమియమ్ ప్రత్యేకతలు➤అడ్వర్టైజెంట్ బ్రేక్ లేకుండా.. ఇష్టమైన వీడియోలను ఎలాంటి అడ్డంకులు చూడవచ్చు.➤ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా (ఆఫ్‌లైన్) ఎప్పుడైనా కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.➤ఇతర యాప్స్ ఉపయోగిస్తూనే లేదా స్క్రీన్ ఆఫ్ అయినప్పటికీ వీడియోలు చూడవచ్చు.. మ్యూజిక్ కూడా వినవచ్చు.➤యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియమ్ కింద 100 మిలియన్ల కంటే ఎక్కువ పాటల ఫ్రీ లైబ్రరీ వంటి వాటిని పొందవచ్చు.ప్లాన్ వివరాలురూ. 888, రూ. 1199, రూ. 1499, రూ. 2499, రూ. 3499 ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంది సంస్థ అందించే ప్రయోజనాలను పొందవచ్చు. ఈ అవకాశం జియో ఎయిర్ ఫైబర్ & జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేయడం ఎలా➤ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత, మై జియో యాప్‌లో మీ అకౌంట్లో లాగిన్ అవ్వండి.➤ఆ పేజీలో కనిపించే యూట్యూబ్ ప్రీమియమ్ బ్యానర్‌పై క్లిక్ చేయండి.➤మీ యూట్యూబ్ ఖాతాతో లాగిన్ అవ్వండి లేదా కొత్త ఖాతాను క్రియేట్ చేయండి.➤అదే వివరాలతో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెటప్ టాప్ బాక్స్‌లో లాగిన్ అవ్వండి, యాడ్-ఫ్రీ కంటెంట్‌ను ఆస్వాదించండి.Enjoy ad-free YouTube on your big screen with JioAirFiber & JioFiber.Get 24 months of YouTube Premium today.#JioAirFiber #JioFiber #YouTubePremium #WithLoveFromJio pic.twitter.com/JN864Ki7UP— Reliance Jio (@reliancejio) January 11, 2025 -
ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తున్నాయి. అంతే కాకుండా అవి టారిఫ్‌లను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరలకు సూపర్ ప్లాన్లను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల 14 నెలల వ్యాలిడిటీతో ఓ ప్లాన్ అందించడం ప్రారంభించింది.14 నెలల ప్లాన్ప్రైవేట్ టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందిస్తున్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4జీ సేవలను ప్రారంభించనే లేదు. అయితే ప్రస్తుతం చాలామంది బీఎస్ఎన్ఎల్ సేవలకు మారిపోవడానికి ప్రధాన కారణం తక్కువ ధరకే ప్లాన్స్ అందించడం.ఇప్పుడు పరిచయం చేసిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ 14 నెలల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. నిజానికి ఈ ప్లాన్ కేవలం 13 నెలలు లేదా 395 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేది. ఇప్పుడు దీనిని ఒక నెల పెంచి 14 నెలల వ్యాలిడిటీకి మార్చారు. అంటే ఒక్కసారి ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 425 రోజులు చెల్లుబాటు అవుతుందన్నమాట.ప్రయోజనాలురూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా లోకల్, రోమింగ్ కాల్స్‌తో సహా అపరిమిత కాల్‌లను ఆస్వాదించవచ్చు. 425రోజులు రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అంటే వినియోగదారుడు మొత్తం 850 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 2జీబీ డేటా పూర్తయిపోయినప్పటికీ.. 4kbps వేగంతో అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు ఉచితం.జియో, ఎయిర్టెల్ (Airtel) వంటి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించిన తరువాత.. చాలామంది బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారిపోయారు. ఆ తరువాత రీఛార్జ్ ప్లాన్స్ ధరలను కొంత తగ్గించడంతో.. కొందరు మళ్ళీ జియో, ఎయిర్టెల్ వైపు తిరిగారు. ప్రస్తుతం జియో కూడా వార్షిక ప్లాన్స్ రూ. 3,599 ధరతో అందిస్తోంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.8000 కోట్లు ఉన్నాయి.. ఏం చేయాలో తెలియట్లేదు!జియో (Jio) వార్షిక ప్లాన్ (రూ.3599)తో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్ (రూ. 2399) చాలా తక్కువ. కాబట్టి ధరలను దృష్టిలో ఉంచుకుని యూజర్లు తమకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 14 నెలల ప్లాన్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
తిరుగులేని రీఛార్జ్ ప్లాన్.. హాఫ్‌డే ఇష్టమొచ్చినంత డేటా
నష్టాల్లో ఉన్న ప్రైవేట్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా పోటీని తట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏడాది కాలపరిమితితో కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను (Vi SuperHero) ప్రవేశపెట్టింది. కస్టమర్లు అర్ధరాత్రి 12 నుండి మధ్యాహ్నం 12 వరకు అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు.దీనికితోడు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితం. ఈ ప్రీ–పెయిడ్ ప్లాన్స్ ధర ర.3,599 నుంచి ర.3,799 వరకు ఉంది. ప్రస్తుతానికి ఇవి మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానాకు పరిమితం.వీఐ సూపర్‌హీరో ప్లాన్ల ప్రయోజనాలు⇒ అపరిమిత డేటా: ప్రతి రోజు హాఫ్-డే (అర్ధరాత్రి 12 నుండి మధ్యాహ్నం 12 వరకు) అపరిమిత డేటా.⇒ రోజువారీ డేటా కోటా: మిగిలిన గంటలలో ( మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి 12 వరకు) 2 GB హై-స్పీడ్ డేటా.⇒ వారాంతపు డేటా రోల్ఓవర్: వినియోగదారులు ఉపయోగించని వారాంతపు డేటాను ఫార్వార్డ్ చేయవచ్చు. వారాంతంలో దాన్ని ⇒ ఉపయోగించుకోవచ్చు.⇒ ఓటీటీ (OTT) ప్రయోజనాలు: రూ.3,699 ప్లాన్ ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. అదే రూ.3,799 ప్లాన్‌లో యితే ఒక సంవత్సరం అమేజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) సబ్స్క్రిప్షన్ ఉంటుంది.ఓవైపు వొడాఫోన్ ఐడియా తన 4G నెట్‌వర్క్‌లో దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉండగా పోటీ సంస్థలు జియో, ఎయిర్టెల్ ఇప్పటికే తమ కస్టమర్ల కోసం అపరిమిత 5G డేటా ప్లాన్లను రూపొందించాయి. ఈ కొత్త "సూపర్‌హీరో" ప్లాన్లతో వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) దాని సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకోవడానికి, కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య తన మార్కెట్ ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది.అదే సమయంలో వోడాఫోన్ ఐడియా 19.77 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. గడిచిన సెప్టెంబర్ నెలలో 15.5 లక్షల మంది యూజర్లను చేజార్చుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల విడుదల చేసిన అప్డేట్ ప్రకారం.. వోడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 18.30% వద్ద ఉంది. రిలయన్స్ జియో 39.9% వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉంది. భారతి ఎయిర్టెల్ 33.5% వాటాతో రెండవ స్థానంలో ఉంది.ఇక కంపెనీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో విక్రయిస్తున్న వార్షిక ప్లాన్స్‌లో భాగంగా రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు అపరిమిత డేటా అందుకోవచ్చు. అలాగే రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు.బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ప్రత్యేక వార్షిన్ ప్లాన్ తీసుకొచ్చింది. న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్. -
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్.. 425 రోజులు అన్లిమిటెడ్..
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) ప్రత్యేక న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది.ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్. అన్ని ఇతర కంపెనీలు గరిష్టంగా 365 రోజుల వ్యాలిడిటీతో వార్షిక ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి బీఎస్ఎన్ఎల్ ప్లాన్లతో పోలిస్తే ఖరీదైనవి. గత సంవత్సరం ద్వితీయార్థంలో బీఎస్ఎన్ఎల్ సేవలను పొందేందుకు లక్షలాది మంది వినియోగదారులు తమ నంబర్లను పోర్ట్ చేసుకున్నారు. గత ఏడాది ఇతర కంపెనీలు టారిఫ్‌లు పెంచేయడంతో బీఎస్ఎన్ఎల్ మంచి ఎంపికగా నిలిచింది.Get 2GB/Day Data & Unlimited Calls for 425 Days – all for just ₹2399/-! Hurry, offer valid till 16th Jan 2025 – don’t let this deal slip away! Stay ahead. Stay connected. Stay with BSNL!#BSNLIndia #UnlimitedCalls #2GBData #StayConnected pic.twitter.com/23lkFS3phH— BSNL India (@BSNLCorporate) January 2, 2025 -
జియో న్యూ ఇయర్ ఆఫర్.. ఎన్ని ప్రయోజనాలో..
కొత్త సంవత్సరం 2025 వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికం కంపెనీ జియో (Jio)తన వినియోగదారుల కోసం ప్రత్యేక “న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్”ని (new recharge plan) ప్రారంభించింది. విస్తృతమైన కనెక్టివిటీ, ఖర్చు ఆదా, ప్రత్యేకమైన డీల్స్‌తో రూ. 2025 ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వినియోగదారులకు మెరుగైన మొబైల్ అనుభవాన్ని అందించడం దీని లక్ష్యం.రూ.2025 ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.2025 ప్లాన్‌తో సబ్స్క్రైబర్లు అపరిమిత 5జీ ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ పరిమితి 2.5 జీబీతో మొత్తం 500 జీబీ 4జీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఎస్ఎంఎస్ పంపవచ్చు. పెద్ద మొత్తంలో డేటా వినియోగించేవారికి, కమ్యూనికేషన్ కోసం ఫోన్లను విస్తృతంగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది.రూ.2150 విలువైన కూపన్లుజియో భాగస్వామి బ్రాండ్ల నుండి అదనపు విలువను పొందడం ఈ ప్లాన్ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి. వినియోగదారులు ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అజియో (AJIO) నుండి కనీసం రూ. 2500 కొనుగోలుపై రూ. 500 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విగ్గీలో రూ. 499 కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్లపై రూ. 150 తగ్గింపును పొందొచ్చు. ఇక ఈజ్‌మైట్రిప్‌లో (EaseMyTrip) విమాన బుకింగ్‌లపై రూ. 1500 ఆదా చేసుకోవచ్చు.డిసెంబర్ 11న ప్రారంభమైన రూ. 2025 ప్లాన్ 2025 జనవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు కొత్త సంవత్సరాన్ని అదిరిపోయే సేవింగ్స్, ఆఫర్స్‌తో మొదలు పెట్టవచ్చు. హై-స్పీడ్ 5జీ, పుష్కలమైన డేటా, అపరిమిత కాల్స్, పార్ట్నర్ డిస్కౌంట్స్ వంటి ఫీచర్లతో జియో రూ. 2025 ప్లాన్ ఆధునిక వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. -
ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్: హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ
ప్రముఖ టెలికాం దిగ్గజం 'భారతి ఎయిర్టెల్' తన యూజర్ల కోసం సరికొత్త, సరసమైన ప్లాన్ తీసుకువచ్చింది. కేవలం రూ. 398తో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు మాత్రమే కాకుండా.. రోజుకు 2జీబీ అపరిమిత 5జీ డేటా వంటి వాటిని పొందవచ్చు.ఎయిర్టెల్ అందించిన ఈ కొత్త ప్లాన్ ద్వారా హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, పాపులర్ వెబ్ సిరీస్‌లతో సహా ప్రయాణంలో ప్రీమియం వినోదాన్ని ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. దీనితో పాటు వింక్ మ్యూజిక్ సదుపాయం కూడా ఉంది. ఈ ప్లాన్ 28 రోజులు వాలిడిటీని కలిగి ఉంది.భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం రోజుకు 2జీబీ డేటాతో రూ. 379 ప్లాన్ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు. అదే విధంగా రూ. 349 ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా కూడా అందిస్తోంది. కాగా ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ప్లాన్ 398 రూపాయలు. దీని ద్వారా అదనపు ఖర్చు లేకుండా నెలకు ఒక ట్యూన్‌ని సెట్ చేయడానికి అనుమతిస్తుంది. -
అదిరిపోయే బెనిఫిట్స్.. జియో న్యూ ఇయర్ ప్లాన్
రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త సంవత్సరం సందర్భంగా నూతన ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేకమైన ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ 2025’ గడువు డిసెంబర్ 11, 2024 నుంచి జనవరి 11, 2025 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో రీఛార్జ్ ప్లాన్‌తోపాటు కూపన్లను కూడా అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ.2025తో రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ప్లాన్ వివరాలు200 రోజుల పాటు అన్లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్ యాక్సెస్.500 జీబీ 4జీ డేటా (రోజుకు 2.5 GB).అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయం.పార్టనర్ కూపన్ల రూపంలో రూ.2150 విలువైన అదనపు ప్రయోజనాలు.రూ.500 అజియో కూపన్. రూ.2500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే ఈ కూపన్ ఉపయోగించవచ్చు.స్విగ్గీపై రూ.150 తగ్గింపు. కనిష్ట ఆర్డర్ రూ.499 పై వర్తిస్తుంది.ఈజ్ మై ట్రిప్ పై రూ.1500 తగ్గింపు: మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఫ్లైట్ బుక్ చేస్తే ఈ కూపన్ వినియోగించుకోవచ్చు.ఈ ప్లాన్ నెలవారీ రూ.349 ప్యాకేజీతో పోలిస్తే మొత్తంగా రూ.468 సేవింగ్స్‌ను అందిస్తుంది. -
రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. తన చవక రీచార్జ్ ప్లాన్లతో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈసారి రోజుకు రూ. 6 ఖర్చుతోనే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటాను అందించే అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. అది ఏ ప్లాన్.. ఎన్ని రోజులు వ్యాలిడిటీ.. బెనిఫిట్స్ ఏంటి అన్నవి ఇక్కడ తెలుసుకుందాం…ఇటీవల, ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కానీ ప్రభుత్వ టెల్కో అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ప్లాన్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఖరీదైన టారిఫ్ ప్లాన్లను భరించలేని లక్షల మంది వినియోగదారులు ఆయా కంపెనీలను వీడి బీఎస్ఎన్ఎల్కి మారుతున్నారు.కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, పాత యూజర్లను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రోజుకు 6 రూపాయల కంటే తక్కువ ధరతో అపరిమిత కాలింగ్, 2GB డేటా, ఇతర అనేక ప్రయోజనాలను అందించే ప్లాన్ అందిస్తోంది. ఇది ఏడాదికిపైగా సుదీర్ఘ వ్యాలిడిటీని అందిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేసే టెన్షన్‌ను తొలగిస్తుంది.ప్లాన్ వివరాలుఈ ప్లాన్ ధర రూ. 2399. దీని వ్యాలిడిటీ 395 రోజులు. రోజు ప్రకారం చూస్తే రూ. 6 కంటే తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. బడ్జెట్ విభాగంలో ఈ ప్లాన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజువారీ 2GB డేటా, 100 ఎస్ఎంఎస్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్క సారి రీఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్ ఇంటర్నెట్, కాలింగ్‌ని ఆస్వాదించవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా..
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన తర్వాత చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది యూజర్లను ఆకట్టుకునేందుకు ఏడాదిపాటు ప్రయోజనాలు అందించే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.చౌకైన రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198. ఈ రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. ఇక ఇతరర ప్రయోజనాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు లభిస్తాయి. అలాగే ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాదు.. ఈ ప్లాన్‌లో ప్రతి నెలా 30 ఉచిత SMSల సౌకర్యాన్ని కూడా ఆనందివచ్చు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బీఎస్ఎన్ఎల్.. మరో మైలురాయి!ధర తగ్గిన మరో ప్లాన్ కొత్త ప్లాన్‌ను ప్రారంభించడంతోపాటు బీఎస్ఎన్ఎల్ తన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్లలో మరొకదాని ధరను కూడా తగ్గించింది. రూ. 1999 ప్లాన్ ధరను రూ. 100 తగ్గించి ఇప్పుడు రూ. 1899కే అందిస్తోంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 600GB డేటా, ప్రతిరోజూ 100 ఉచిత SMS వంటి ఉన్నాయి. -
పవర్ ఇక ప్రీ పే!
కొత్తపేట: రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీల చెల్లింపు విధానం ప్రీపెయిడ్ విధానంలోకి మారనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల స్థానే స్మార్ట్ మీటర్లు రానున్నాయి. మొదట మాన్యువల్ మీటర్ల నుంచి ప్రారంభమైన విద్యుత్ మీటర్లు ఆధునిక పరిజ్ఞానానికి అనుగుణంగా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల వంతు వచ్చిoది. ప్రీపెయిడ్ ఆప్షన్‌తో ఈ మీటర్లు రూపొందించారు. సాధారణంగా ఈ నెల వినియోగించిన విద్యుత్ బిల్లును వినియోగదారులు మరుసటి నెల చెల్లిస్తున్నారు. బిల్లు ఇచ్చిన 15 రోజుల వరకు ఎటువంటి అపరాధ రుసుం చెల్లించవలసిన అవసరం లేదు. ఈ లెక్కన వినియోగదారుడికి బిల్లు చెల్లించడానికి దాదాపు నెల వరకు సమయం ఉంటుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పద్ధతి ఇదే. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దశల వారీగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మీటర్లలో ప్రీపెయిడ్ ఆప్షన్ జతచేశారు. దీని ద్వారా విద్యుత్ సరఫరా కోసం ముందుగానే రీచార్జి చేయాల్సి ఉంటుంది. అలా చేయక పోతే సరఫరా ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. విద్యుత్ మీటర్లలో మార్పులు మొదట మెకానికల్ (మాన్యూవల్) మీటర్లు ఉండేవి వాటిలో యూనిట్లు చూసి రీడర్లు బుక్‌లో రీడింగ్ రాసుకునేవారు. తర్వాత ఎలెక్ట్రో మెకానికల్ మీటర్లు, హై యాక్యురసీ మీటర్లు వచ్చాయి. ఆ తరువాత ఐఆర్ పోర్ట్ అంటే స్కాన్ చేస్తే రీడింగ్ ఆటోమేటిక్ రికార్డు అవుతుంది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. ఇవన్నీ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రూపొందించినవే. ఇప్పటి వరకు అమలవుతున్న విధానానికి అలవాటు పడిన వినియోగదారులకు స్మార్ట్ మీటర్‌పై మరింత అవగాహన కల్పించాల్సి ఉంటుంది. జీతాలకు కోట్లు విద్యుత్ శాఖ పరిధిలో వేల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి నెలా విద్యుత్ శాఖ జీతాలు, పింఛన్లు చెల్లించడానికి రూ.కోట్లు కావాల్సి వస్తోంది. ఇక శాఖాపరంగా అభివృద్ధి కోసం వందల కోట్లు కావాల్సి వస్తోంది. వీటికి మూలాధారం విద్యుత్ బిల్లుల ద్వారా వచ్చే ఆదాయమే. జిల్లాలో నెలకు సుమారు రూ.50 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల రూపంలో ఆదాయం వస్తోంది. అదే స్మార్ట్ మీటర్లు పెడితే ఇంకా పెరుగుతుందని అంచనా. ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలు, పంచాయతీలు, పరిశ్రమలు, వ్యాపార, గృహావసరాలు కలిపి మొత్తం 6,12,317 సర్విసులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాల పరంగా ఇప్పటి వరకు రూ.103 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఆ బకాయిల చెల్లింపుల కోసం ఎన్ని నోటీసులు ఇచ్చినా వసూళ్లు మాత్రం అంతంత మాత్రమేనని ఆ శాఖ రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలే కదా విద్యుత్ సరఫరా కట్ చేయరనే భావన ఏర్పడడంతో అవి మొండి బకాయిలుగా మారాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్ విధానం అమలులోకి వస్తే విద్యుత్ శాఖకు బకాయిల బాధ ఉండదు. ఉపయోగాలు.. » సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఏ విధంగా చూసుకుంటామో.. ఇక్కడ అదే విధంగా యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. »బ్యాలెన్స్ ఉన్నంత వరకే విద్యుత్ సరఫరా ఉంటుంది. నగదు అయిపోయిన వెంటనే సరఫరా బంద్ అవుతుంది. రీచార్జి చేస్తేనే విద్యుత్ వెలుగులుంటాయి. »బ్యాలెన్స్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. నష్టాలూ.. » విద్యుత్ సంస్థను నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే వారి ఉపాధికి పెద్ద దెబ్బేనని చెప్పాచ్చు. » అవగాహన లేమితో రీచార్జ్ చేసుకోవడంలో వినియోగదారులు ఏ మాత్రం అలసత్వం వహించినా, సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. » విద్యుత్ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. లైన్ల నుంచి విద్యుత్‌ను అక్రమంగా వాడుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్.. 105 రోజులు అన్లిమిటెడ్
రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ చివరి రోజు దగ్గర పడుతున్నకొద్దీ కస్టమర్లు టెన్షన్ పడుతూ ఉంటారు. అధిక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు రీచార్జ్ చేసుకుందామంటే ధర ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వారి కోసం ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్లను పరిచయం చేస్తోంది.ప్రైవేట్ టెలికాం సంస్థలు దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్లాన్ల కోసం అధిక ఛార్జీలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. లక్షల మంది వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ తన ఆఫర్లలో అనేక దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్లను చేర్చింది. తాజాగా 105 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది.105 రోజుల వ్యాలిడిటీ ప్లాన్బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు అధిక వ్యాలిడిటీని అందిస్తూ రూ. 666 ధరతో అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 105 రోజుల పాటు ఏదైనా నెట్వర్క్కి అపరిమిత కాలింగ్ ఉంటుంది. అదనంగా ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా చెల్లుబాటు వ్యవధికి మొత్తం 210 జీబీ డేటాను అందిస్తోంది. అంటే రోజువారీ 2జీబీ హై-స్పీడ్ డేటాకు సమానం. ఈ ధరతో ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీల్లో విస్తృతమైన వ్యాలిడిటీ ప్లాన్లు లేవు. -
ఆకర్షణీయమైన బెనిఫిట్లతో జియో కొత్త రీచార్జ్ ప్లాన్లు
రిలయన్స్ జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఇటీవల సగటున 15 శాతం పెంచింది. దీనిపై కస్టమర్ల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అప్డేట్లో భాగంగా కంపెనీ ఇప్పటికే ఉన్న ప్లాన్లపై కొన్ని ప్రయోజనాలను జియో సవరించింది.వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణగా జియో కొత్త ఆప్షన్లను రూపొందించింది. కొత్త ఆఫర్లలో రూ. 1,028, రూ. 1,029 రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ రెండూ వినియోగదారులకు సమగ్ర ప్రయోజనాలను అందించేలా రూపొందించారు. ఏ ప్లాన్ ఏయే బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.రూ. 1,028 ప్లాన్జియో రూ. 1,028 ప్లాన్ 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. అదనంగా సబ్స్క్రైబర్లు 2జీబీ రోజువారీ డేటాను అందుకుంటారు. ప్లాన్ వ్యవధిలో మొత్తం 168జీబీ లభిస్తుంది. జియో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.రూ. 1,028 ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ మెంబర్షిప్ ఉంది. తరచుగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ఇది సరైనది. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ సేవలకు కూడా యాక్సెస్‌ను పొందుతారు.రూ. 1,029 ప్లాన్జియో రూ. 1,029 ప్లాన్ విషయానికి వస్తే అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు 84 రోజులపాటు ఆనందించవచ్చు. రోజూ 2జీబీ 4జీ డేటా, అందుబాటులో ఉన్న చోట అపరిమిత 5జీ డేటా వినియోగించుకోవచ్చు. స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారులకు ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనాలను అందిస్తుంది. దీంతోపాటు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్కి యాక్సెస్ ఉంటుంది. -
టాప్ కంపెనీకి టెన్షన్.. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం అనేక కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు అపరిమిత వాయిస్ కాల్స్, డేటా వంటి ప్రయోజనాలను తక్కువ ధరలకే దీర్ఘ కాల వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. ఇంత తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లు టాప్ టెలికాం కంపెనీలలో దేనిలోనూ లేవు. అందుకే ఈ ప్లాన్‌తో టాప్ కంపెనీకి టెన్షన్ తప్పదు.బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన అద్బుతమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.997 ప్లాన్ ఒకటి. ఇది 160 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 320 జీబీ హై స్పీడ్ డేటాను పొందుతారు. అలాగే రోజూ 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పంపుకోవచ్చు. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ దేశం అంతటా ఉచిత రోమింగ్, జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి అనేక విలువ-ఆధారిత సేవలతో వస్తుంది.ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ కూడా యూజర్లకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీస్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. త్వరలో 5జీ సేవలను కూడా ప్రారంభించే పనిలో ఉంది. 5జీ నెట్వర్క్ టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
తక్కువ ధరకు బీఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్
ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరల పెంచడంతో చాలా మంది యూజర్లు ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL)కు మారుతున్నారు. దీంతోపాటు 4జీ సేవలు పెరగడం, 5జీ నెట్ వర్క్ కూడా అందుబాటులోకి రానుండటం, అందుబాటు ధరల్లో రీచార్జ్ ప్లాన్లు అందించడంతో బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ అనేక ఆకర్షణీయ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. ఇతర ప్రైవేటు టెలికాం సంస్థల ప్లాన్ లతో పోలిస్తే తక్కువ ధరకే సేవలు అందిస్తోంది. ఇటీవల 30 రోజుల వ్యాలిడిటీతో రూ.229 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ రూ.229 ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMSలు అందిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా రోజుకు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అంటే ప్లాన్ వ్యాలిడిటీలో 60GB డేటాను పొందవచ్చు. 2GB డేటాతో, 30 రోజుల వ్యాలిడిటీని కేవలం తక్కువ ధరకే BSNL అందిస్తోంది. -
జియో 365 రోజుల ప్లాన్.. ప్రయోజనాలెన్నో!
ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్స్ పెంచేసిన జియో మళ్ళీ మెల్లగా దిగి వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల నాలుగు కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లు ప్రకటించింది. కాగా ఇప్పుడు 3599 రూపాయల వార్షిక ప్లాన్ వెల్లడించింది. ఈ ప్లాన్ వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.జియో వార్షిక ప్లాన్ రూ. 3599 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ నెలకు రూ.276 వరకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ప్రతి రోజూ హైస్పీడ్ 2.5 జీబీ డేటా పొందవచ్చు. అంటే 365 రోజులూ రోజులు 2.5 జీబీ లెక్కన 912.5 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను ఉపయోగించుకోవచ్చు.ఇటీవల ప్రవేశపెట్టిన నాలుగు ప్రీపెయిడ్ ఆఫర్లురూ.199 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు మాత్రమే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సబ్స్క్రిప్షన్లు (18 రోజులు) ఉన్నాయి.రూ.209 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 22 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.249 ప్లాన్: రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.299 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది. -
జియో యూజర్లకు అంబానీ గిఫ్ట్!.. సైలెంట్‌గా నాలుగు కొత్త ప్లాన్స్
జియో రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచేసిందని యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ముకేశ్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగానే అంబానీ నాలుగు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టారు.జియో కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లురూ.199 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు మాత్రమే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సబ్స్క్రిప్షన్లు (18 రోజులు) ఉన్నాయి.రూ.209 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 22 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.249 ప్లాన్: రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.299 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం వల్ల ఇప్పటికే చాలామంది జియో యూజర్లు 'బీఎస్ఎన్ఎల్'కు మారిపోతున్నారు. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇక యూజర్లను మళ్ళీ ఆకట్టుకోవడానికి సంస్థ ఈ ప్లాన్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ'
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ ఇటీవల భారీగా పెరిగాయి. ఈ తరుణంలో అంబానీ 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ' పేరుతో ఓ ప్లాన్ తీసుకువచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం రూ.319 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఈ రోజు (ఆగష్టు 2) ప్లాన్ యాక్టివేట్ లేదా రీఛార్జ్ చేసుకుంటే.. సెప్టెంబర్ 1వరకు యాక్టివ్‌గా ఉంటుంది. మళ్ళీ మీరు సెప్టెంబర్ 2న రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ ఫీచర్స్ఈ ప్లాన్ ఎంచుకునే యూజర్లు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. లిమిటెడ్ ముగిసిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది.ఈ ప్లాన్‌లో భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. యూజర్లు రోజుకు గరిష్టంగా 100 ఎస్ఎమ్ఎస్లు పంపుకోవచ్చు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. టెలికాం కంపెనీలు 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లను అందించాలని కోరింది. దీనికి స్పందించిన జియో రూ.296, రూ.259 ప్లాన్లను విడుదల చేసింది. రూ.296 ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS మరియు 30 రోజుల పాటు 25GB డేటా ఉన్నాయి. అదే విధంగా రూ.259 ప్లాన్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ప్రయోజనాలెన్నో!
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచిన తర్వాత.. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు కొత్త ప్లాన్లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్లు ఫ్రీ కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇది తప్పకుండా తన పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ల ధర రూ. 329, రూ. 949, రూ. 1049. ఇందులో ప్రతి ఒక్కటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనిలైవ్ వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు సబ్స్క్రిప్షన్లను అందిస్తోంది.జియో రూ.329 ప్లాన్రూ.329 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుందిరోజుకు 1.5GB డేటాను అందిస్తుంది అపరిమిత ఫ్రీ కాలింగ్ ఉందిప్రతిరోజూ 100 ఉచిత SMSలతో వస్తుందిజియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.949 ప్లాన్రూ.949 ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది.అపరిమిత ఫ్రీ కాలింగ్ లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు.ఈ ప్లాన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (మొబైల్) కోసం 90 రోజుల సబ్స్క్రిప్షన్ అందిస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్‌తో వస్తుంది, హై-స్పీడ్ ఇంటర్నెట్ను పొందాలనుకునేవారికి మంచి ఆప్షన్.జియో రూ.1,049 ప్లాన్ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది రోజుకు 2GB డేటా ఉపయోగించుకోవచ్చు.ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందిస్తుందివినియోగదారులు సోనీలైవ్, జీ5 వంటి వాటికి సబ్స్క్రిప్షన్ పొందుతారుజియోటీవీ మొబైల్ యాప్‌తో వస్తుంది.5జీ వెల్కమ్ ఆఫర్ లభిస్తుంది. -
దిగొచ్చిన జియో.. సైలెంట్‌గా మళ్లీ పాత ప్లాన్
టారిఫ్ పెంపుతో యూజర్లలో తీవ్ర అసంతృప్తిని మూటకట్టుకున్న రిలయన్స్ జియో, వారిని సంతృప్తి పరచడానికి కాస్త దిగివచ్చింది. తన రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌ని నిశ్శబ్దంగా తిరిగి ప్రవేశపెట్టింది.ఎక్కువ మంది రీచార్జ్ చేసుకునే రూ.999 ప్లాన్ ధరను జూలై 3న రూ.1,199కి జియో పెంచేసింది. అయితే తాజాగా కొన్ని సవరించిన ప్లాన్ ఫీచర్లు, ప్రయోజనాలతో పాత ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది.కొత్త రూ. 999 ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దాని పొడిగించిన వ్యాలిడిటీ. పాత ప్లాన్‌లో ఇది 84 రోజులు ఉండగా కొత్త ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే 14 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. కానీ రోజువారీ డేటాను మాత్రం కొత్త ప్లాన్‌లో తగ్గించేశారు. గత ప్లాన్‌లో రోజుకు 3GB డేటా లభిస్తుండగా కొత్త ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి తగ్గినప్పటికీ దీంతో 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇక రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ ఫీచర్లు ఉన్నాయి.దీనికి పోటీగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ కూడా రూ.979 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే అపరిమిత 5G డేటాను ఆనందించవచ్చు. ఇక ఎయిర్టెల్ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనం ఏమిటంటే, 56 రోజుల పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్. -
జియో యూజర్లకు ఊరట.. అందుబాటులోకి చౌక ప్లాన్లు
రిలయన్స్ జియో కోట్లాది మంది వినియోగదారులకు ఊరటను కలిగించింది. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు తర్వాత, వినియోగదారులు చౌకైన ప్లాన్ల కోసం చూస్తున్నారు. వీరి కోసం ఇప్పుడు కంపెనీ వినియోగదారుల కోసం రెండు చౌకైన ప్లాన్లను తీసుకొచ్చింది.రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఈ నెల 3వ తేదీ నుంచి పెంచింది. దాదాపు 25 శాతం వరకు టారిఫ్‌లు పెరిగాయి. దీంతో అప్పటి వరకూ ఉన్న రూ. 149, రూ. 179 వంటి చౌక, సరసమైన ప్లాన్లను జియో జాబితా నుండి తొలగించింది. దీంతో వాటిని రీచార్జ్ చేసుకునే యూజర్లు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అలాంటి యూజర్ల కోసం సరికొత్త చౌక ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ల ధరలను రూ. 189, రూ. 479గా నిర్ణయించింది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లను మై జియో యాప్ నుంచి రీఛార్జ్ చేసుకోవాలి.జియో రూ.189 ప్లాన్రూ.189 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని ఇస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ చేయవచ్చు. 300 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 2GB డేటా మాత్రమే లభిస్తుంది. అన్ని సాధారణ ప్లాన్ల మాదిరిగానే, జియో కస్టమర్లకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.జియో రూ. 479 ప్లాన్దీర్ఘకాలం వ్యాలిడిటీ కోసం చూసే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత ఉచిత కాలింగ్, 1000 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు 6GB డేటాను అందిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. -
రేపటి నుంచే కొత్త రీచార్జ్ ప్లాన్లు.. ఇక నెలకు కనీసం..
ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ పెంపును ప్రకటించాయి. ఆయా కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. ఇవి మరి కొన్ని గంటల్లో అమల్లోకి వస్తాయి. ఎయిర్టెల్, జియో కొత్త ప్లాన్లు జూలై 3 నుంచి, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లు జూలై 4 నుంచి వర్తిస్తాయి.మునుపటి ప్లాన్ల మాదిరిగానే, మూడు టెల్కోలు వేర్వేరు యూజర్ల కోసం ఉద్దేశించిన వేర్వేరు బండిల్స్‌ను అందిస్తున్నాయి. వీటిలో నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే చాలా మంది నెలవారీ ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూడు టెల్కోలకు సంబంధించిన మంత్లీ మినిమమ్ రీచార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం..ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్టెల్ తన కనీస నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం కాల్స్, మెసేజింగ్ కోసం సిమ్ కార్డును ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా మంచిది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో అత్యంత తక్కువ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఇది రూ .155 నుంచి భారీగా పెరిగింది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు, 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండి, ఎక్కువ మొబైల్ డేటాను ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.వీఐ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియాలో కూడా అత్యంత సరసమైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
యూజర్లకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్
భారతీయ టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ జియో తన కొత్త అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన ఈ ప్లాన్స్ జులై 3నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాన్లతో పోలిస్తే కొత్తగా అమలులోకి వచ్చే ప్లాన్స్ ధరలు 20శాతం ఎక్కువ.కంపెనీ వెల్లడించిన డేటా ప్రకారం.. జులై 3నుంచి 155 రూపాయల ప్లాన్ 189 రూపాయలకు, 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలకు చేరుతుంది. రూ. 2999 యాన్యువల్ ప్లాన్.. త్వరలో 3599 రూపాయలకు చేరుతుంది. దీనికి సంబంధించిన వివరాలను జియో అధికారికంగా వెల్లడించింది.జియో మొత్తం మీద 2 పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు, 17 ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఒక్కసారిగా పెంచుతూ ప్రకటించింది. జియో ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నేతృత్వంలో ఉంది. కొత్త రీఛార్జ్ ధరలు తప్పకుండా యూజర్ల మీద భారం చూపిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.Reliance Jio introduces new unlimited 5G plans to be available from 3rd July pic.twitter.com/TsDMAG682r— ANI (@ANI) June 27, 2024 -
సూపర్ రీచార్జ్ ప్లాన్: రెండు కంపెనీల్లో ఒకటే.. మరి ఏది బెస్ట్?
దీర్ఘకాల వ్యాలిడిటీ రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్న వారి కోసం ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్లలో అద్భుతమైన ప్లాన్లు ఉన్నాయి. రూ.395తో రెండు కంపెనీలు ప్లాన్లను అందిస్తున్నాయి. ధర ఒకటే అయినా వ్యాలిడిటీ, డేటా, ఇతర ప్రయోజనాల్లో తేడాలున్నాయి. ఏ కంపెనీ రీచార్జ్ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయో ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం..జియో రూ.395 ప్లాన్» 84 రోజుల వ్యాలిడిటీ» అపరిమిత 5జీ డేటా» 5జీ కనెక్టివిటీ, 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్సెట్ లేకపోతే వాడుకునేందుకు 6 జీబీ డేటా» అపరిమిత వాయిస్ కాలింగ్ » మొత్తం 1000 ఎస్ఎంఎస్లు» జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్» "మై జియో యాప్ ఎక్స్ క్లూజివ్" ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.395 ప్లాన్» 70 రోజుల వ్యాలిడిటీ » మొత్తంగా 6 జీబీ హైస్పీడ్ డేటా» 600 ఎస్ఎంఎస్లు» అపోలో 24|7 సర్కిల్‌కు 3 నెలల పాటు యాక్సెస్» ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు» అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్» రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ యాప్, వెబ్సైట్లో లభ్యం -
ఫుల్ వ్యాలిడిటీ.. ఈ రీచార్జ్ ప్లాన్ల గురించి తెలుసా?
దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్టెల్ 30, 60, 90 రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్ ప్లాన్లను అందిస్తోంది. నెలంతా కచ్చితమైన వ్యాలిడిటీని ఇచ్చే ప్లాన్ల కోసం వినియోగదారుల నుంచి అభ్యర్థనలు రావడంతో 30, 60, 90 రోజుల ప్లాన్లను ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది.ఇంతకుముందు 28, 56 లేదా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి.30 రోజుల ప్లాన్లుఎయిర్టెల్లో మొత్తం మూడు 30 రోజుల ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్లు వరుసగా రూ.199, రూ.296, రూ.489 ధరల శ్రేణిలో లభిస్తాయి. ఈ అన్ని ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను పొందవచ్చు.రూ.199 ప్లాన్‌లో 3 జీబీ డేటా, రూ.296 ప్లాన్‌లో 25 జీబీ డేటా, రూ.489 ప్లాన్‌లో 50 జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ.296, రూ.489 ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా ఆఫర్ కూడా ఉంది.60 రోజుల వాలిడిటీతో..ఎయిర్ టెల్ రూ.519 ప్లాన్ 60 రోజుల వాలిడిటీని అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 5జి డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.90 రోజుల ప్లాన్లు90 రోజుల ప్లాన్ ధర రూ.779. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితో పాటు అపరిమిత 5 జి డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కూడా పొందవచ్చు. -
కొత్త రీచార్జ్ ప్లాన్.. ‘28 రోజులు’ టెన్షన్ లేదిక!
Airtel 35 Days Validity Plan: దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. నెలవారీ రీచార్జ్‌కు సంబంధించి టెలికాం కంపెనీలు సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీనే అందిస్తుంటాయి. అయితే తక్కువ వ్యాలిడిటీతో ఇబ్బందిపడే కస్టమర్ల కోసం ఎయిర్టెల్ 35 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రీఛార్జ్ ప్లాన్లలో తక్కువ వ్యాలిడిటీ పీరియడ్ల సమస్యకు ప్రతిస్పందనగా ఎయిర్టెల్ నుండి తాజా ఆఫర్ వచ్చింది. అంతరాయం లేని సేవల కోసం ప్రతి 28 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా మంది వినియోగదారులు తరచుగా అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సవాలును గుర్తించి ఎయిర్టెల్ 35 రోజుల పాటు ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీని అందిస్తూ రూ.289 ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ప్లాన్ ప్రయోజనాలు ఎయిర్టెల్ కొత్త రూ. 289 రీఛార్జ్ ప్లాన్ అధిక వ్యాలిడిటీని అందించడమే కాకుండా వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చెల్లుబాటు వ్యవధిలో అపరిమిత కాలింగ్‌తో పాటు, రోజుకు 300 ఉచిత ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. అయితే అధిక డేటా అవసరాలు ఉన్న వినియోగదారులకు ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు. ఎందుకంటే మొత్తం చెల్లుబాటు వ్యవధికి 4GB డేటా మాత్రమే ఈ ప్లాన్‌పై లభిస్తుంది. -
మొబైల్ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్ ప్లాన్ల పెంపు..? ఎంతంటే..
టెలికాం సేవలందిస్తున్న కంపెనీలు తమ వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెలికాం టారిఫ్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. గత రెండేళ్లుగా ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయని సంస్థలు ఈసారి ఎలాగైనా వాటిని పెంచాలని యోచిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్కో టెలికం సంస్థ తమ టారిఫ్‌లను కనీసం 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కస్టమర్ నుంచి వచ్చే సరాసరి ఆదాయం(ఆర్పూ) పెంచుకోవడంలో భాగంగా మరోసారి తమపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయని తెలిసింది. కొంతకాలం నుంచి టెలికాం కంపెనీలు టారిఫ్‌ల పెంపునకు సరైన సమయం కోసం వేచిచూస్తున్నాయి. ఈమేరకు కంపెనీలు తమ ఇన్వెస్టర్ల సమావేశంలో పలుమార్లు టారిఫ్ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో అవి పూర్తి అయిన తర్వాత కంపెనీలు ఛార్జీల పెంపుపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. టారిఫ్ ప్లాన్లలో మార్పులు ఎంట్రీ లెవల్ కస్టమర్ల కోసం టెలికం సంస్థలు వివిధ ధరల్లో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి టెలికం సంస్థలు ఇబ్బడిముబ్బడి టారిఫ్ ప్లాన్ల ధరల్లో మార్పులు చేస్తున్నాయి. దీంతో తక్కువ ఆదాయం కలిగిన వారు తమ నెలవారి టారిఫ్ చెల్లింపులు భరించలేకపోతున్నారని వాదనలు వస్తున్నాయి. టెలికం సంస్థలు వీరికోసం ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. 2021లో టారిఫ్‌లను పెంచిన టెలికాం కంపెనీలు 5జీ టెక్నాలజీ కోసం భారీగా పెట్టుబడులు పెట్టాయి. దాంతో కంపెనీల ఖర్చులు పెరిగాయి. ఆ వ్యయంలో కొంతమేర వినియోగదారుల నుంచి రాబట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించబోతున్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: విమాన సంస్థల వేసవి షెడ్యూల్ విడుదల -
ఫ్లైట్ ఎక్కుతున్నారా? అయితే ఈ రీచార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి..
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో భాగమైపోయాయి. వీటిని వినియోగించకుండా నిమిషాలు కూడా ఉండలేని పరిస్థతి. విమాన ప్రయాణంలో సాధారణ రీచార్జ్ ప్లాన్లు పనిచేయవని మనందరికీ తెలుసు. ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లు ఉంటేనే ఫ్లైట్‌లో ఉన్నంత సేపూ కాలింగ్ కానీ, ఇంటర్నెట్ కానీ వినియోగించుకునేందుకు వీలుంటుంది. టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, రిలయన్స్ జియో కొన్ని ఇన్-ఫ్లైట్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి ఫ్లైట్‌లో ఉన్నప్పుడు యూజర్లు కనెక్ట్ అయి ఉండేందుకు వీలు కల్పిస్తాయి. ఈ ప్లాన్లు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అందిస్తున్న ఇన్-ఫ్లైట్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. జియో రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు -
మొబైల్ తరహాలోనే విద్యుత్‌కూ రీచార్జ్
సాక్షి, అమరావతి:విద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా దేశవ్యాప్తంగా 19.79 కోట్ల విద్యుత్ సర్వీసులు, 52.19 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్), 1.88 లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్ లేదా స్మార్ట్‌మీటర్లు బిగించాలనుకుంటోంది. ఈ మేరకు మీటర్ల బిగింపు, అమలు ప్రక్రియపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) జారీ చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంతమేర విద్యుత్ వాడుతున్నారో ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ముందుగా చెల్లించి రీచార్జ్ చేసుకోవాలి. రీచార్జ్ మొత్తం అయిపోగానే వినియోగదారుల మొబైల్‌కు మూడుసార్లు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపాలి. ప్రతి కస్టమర్‌కు రూ.300 అరువు ఇచ్చేలా.. ప్రతి వినియోగదారునికీ గరిష్టంగా రూ.300 క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంటే రూ.1,000 రీచార్జ్ చేసుకుంటే అదనంగా రూ.300 కరెంట్‌ను వాడుకునే వెసులుబాటు కల్పించాలి. ముందుగా చెల్లించిన రూ.1,000లో వినియోగం పూర్తవుతూ రూ.50 మిగిలి ఉండగానే రీచార్జ్ చేసుకునేలా తొలి సందేశం పంపాలి. రీచార్జ్ మొత్తం అయిపోయాక మరోసారి, క్రెడిట్‌గా ఇచ్చిన రూ.300 కరెంట్‌ను వాడుకున్న తర్వాత మూడోసారి సందేశం ఇచ్చి ఆ తరువాత విద్యుత్ సరఫరా నిలిపివేయాలని (డిస్కనెక్ట్) కేంద్రం సూచించింది. వినియోగదారులు మళ్లీ రీచార్జ్ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ మీటర్లు బిగించాక మొబైల్లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేయాలని, వినియోగదారులు ఈ యాప్ ఆధారంగా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవచ్చని పేర్కొంది. అంటే విద్యుత్ అవసరం లేనప్పుడు మీటర్‌ను ఆఫ్ చేసుకోవడం ద్వారా బిల్లును ఆదా చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొదలైన ప్రక్రియ విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని మూడు డిస్కంలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్ సర్వీసులకు, వాణిజ్య, పరిశ్రమలు, గృహæ విద్యుత్ సర్వీసులకు ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. మొదటి విడతలో దక్షిణ డిస్కం పరిధిలో 6.19 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 2.56 లక్షల త్రీ ఫేజ్ మీటర్లను ఏర్పాటు చేయనుండగా.. మధ్య డిస్కం పరిధిలో 7.23 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 1.09 లక్షల త్రీ ఫేజ్ మీటర్లు అమర్చనున్నారు. తూర్పు డిస్కం పరిధిలో 6.09 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, 1.15 లక్షల త్రీ ఫేజ్ మీటర్లను అమర్చనున్నారు. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదే. ఈ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార (టైం అప్డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే ఆఫ్ పీక్ సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకునే అవకాశం ఉంది. -
జియో కొత్త ప్లాన్.. అదనపు డేటాతోపాటు 14 ఓటీటీలు ఫ్రీ!
Reliance Jio new plan : సరసమైన రీఛార్జ్ ప్లాన్లకు పేరుగాంచిన దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ కంపెనీ టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి వినియోగదారులకు చౌకైన, సరసమైన ప్లాన్లను అందిస్తోంది. అందుకే జియోకి 44 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. జియో తాజాగా 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదనపు డేటాతోపాటు 14 ప్రముఖ ఓటీటీలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఈ ప్లాన్ అందిస్తోంది. జియోకి సంబంధించిన ఓటీటీలతోపాటు అనేక ఇతర ఓటీటీల ఉచిత ప్రయోజనాలను అందించే రూ. 1,198 విలువైన కొత్త ప్లాన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రూ. 1198 ప్లాన్ వివరాలు రిలయన్స్ జియో రూ. 1198 విలువైన ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 84 రోజుల పాటు 168జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత 64kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఉచిత ఓటీటీలు ఇవే.. ఓటీటీలు చూడడాన్ని ఇష్టపడే వారి కోసం జియో రూ. 1198 ప్లాన్ 14 ఓటీటీలకు ఉచిత సబ్స్క్రిప్షన్లు అందిస్తోంది. వీటిలో సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ NXT, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, జియో టీవీ యాప్ ద్వారా Hoichoi, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ వంటివి ఉన్నాయి. -
జియో, ఎయిర్టెల్ కొత్త రీచార్జ్.. ప్లాన్ ఒక్కటే! మరి బెనిఫిట్లు..
దేశంలో దిగ్గజ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో ( Jio ), భారతీ ఎయిర్టెల్ ( Airtel ) రెండూ ఒకే రకమైన కొత్త రీచ్చార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం చాలా తేడా ఉంది. రెండు ప్లాన్లతో కస్టమర్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. జియో రూ.666 ప్లాన్ ➥ 84 రోజుల వ్యాలిడిటీ ➥ 84 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత కాలింగ్ ➥ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులకు 126జీబీ డేటా అందిస్తుంది. రోజుకు 1.5జీబీ డేటాను ఉపయోగించవచ్చు. ➥ రోజుకు 100 SMS ➥ జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ సబ్స్క్రిప్షన్లు ఎయిర్టెల్ రూ.666 ప్లాన్ ➥ మొత్తంగా 115జీబీ డేటా. రోజుకు 1.5 జీబీ డేటా వాడుకోవచ్చు. ➥ 77 రోజుల వరకు వ్యాలిడిటీ ➥ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సబ్స్క్రిప్షన్ ➥ వింక్ మ్యూజిక్‌తోపాటు హలో ట్యూన్స్‌కి ఉచిత సబ్స్క్రిప్షన్ ఈ ప్లాన్‌లో రెండు కంపెనీలు తమ కస్టమర్లకు అపరిమిత 5G డేటాను అందిస్తున్నాయి. రిలయన్స్ జియోకు 44 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. మరోవైపు ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 37 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. రెండు టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఈ రీఛార్జ్ ప్లాన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. -
Jio New Year Offer: జియో ‘కొత్త’ ఆఫర్! బెనిఫిట్స్ ఇవే..
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) నూతన సంవత్సరం సందర్భంగా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ పేరిట రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని కింద ఇప్పటికే ఉన్న ఏడాది కాలపరిమితి రీఛార్జ్ ప్లాన్ రూ.2,999పై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. దీనివల్ల లాంగ్‌టర్మ్ ప్లాన్ వినియోగించే వారికి ప్రయోజనం కలుగుతుంది. ప్లాన్ ప్రయోజనాలు ఇవే.. జియో రూ.2,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పై 24 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే మొత్తం 389 రోజులు ఈ ప్లాన్‌ని వినియోగించుకోవచ్చు. దీని ప్రకారం.. రోజుకు రూ.8.21 పడే ప్లాన్ ధర రూ.7.70లకే తగ్గుతుంది. రోజుకు 2.5 జీబీ అపరిమిత 4జీ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటా, వాయిస్‌కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. వీటితో పాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి జియో యాప్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో జియో సినిమా ప్రీమియం మెంబర్షిప్ ఉండదు. ఇది కావాలంటే విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో న్యూ ఇయర్ ప్లాన్ ప్రయోజనాలు డిసెంబర్ 20 తర్వాత రీచార్జ్ చేసుకున్నవారికి వర్తిస్తాయి. కాగా ఆఫర్‌ను పొందేందుకు చివరి తేదీ అంటూ కంపెనీ ప్రత్యేకంగా వెల్లడించలేదు. -
గూగుల్‌పేలో రీఛార్జిపై ఫీజు.. ఎంతంటే..?
గూగుల్ ఆధ్వర్యంలోని పేమెంట్ యాప్ గూగుల్‌పే మొబైల్ రీఛార్జీలపై అదనంగా ఫీజు వసూలు చేయనుంది. ఏ విధానంలో పేమెంట్ చేసినా కన్వీనియన్స్ ఛార్జీల రూపంలో ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫోన్‌పే, పేటీఎం సంస్థలు ఇదే మాదిరి ప్రత్యేక ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఉచితంగా సేవలందించిన గూగుల్‌పే ప్రస్తుతం ఛార్జీలు వసూలు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే రూ.100లోపు రీఛార్జిపై గూగుల్‌పే ఎలాంటి ఫీజూ వసూలు చేయబోదని కొన్ని మీడియాలో వస్తున్న కథనాల ద్వారా తెలుస్తోంది. రూ.100 నుంచి రూ.200 వరకు రీఛార్జిపై ఒక రూపాయి, రూ.200 నుంచి రూ.300 వరకు రూ.2, రూ.300 కంటే ఎక్కువ రీఛార్జి చేస్తే రూ.3 చొప్పున కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు సమాచారం. కొత్తగా కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయనున్నట్లు గూగుల్ నిబంధనలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
గుడ్‌న్యూస్: తక్కువ ధరకు 5 నెలల వ్యాలిడిటీ.. సూపర్ రీచార్జ్ ప్లాన్
తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీని అందించే సూపర్ రీచార్జ్ ప్లాన్ (Recharge Plan) ను ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తీసుకొచ్చింది. 150 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ. 397 ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ రూ. 397 ప్లాన్ కొత్తది కాదు. ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ గతంలోనే అందించింది. అయితే ప్రస్తుతం పెట్టిన ప్లాన్‌లో మాత్రం కొన్ని ప్రయోజనాలు మారాయి. ఇంతకుముందు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 180 రోజులు ఉండగా ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులకు తగ్గింది. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత ఫోన్ కాల్స్ వంటి ప్రయోజనాలు ఉన్నా ఇవన్నీ 30 రోజుల్లోనే ముగుస్తాయి. పాత ప్లాన్‌లో ఈ ప్రయోజనాలన్నీ 60 రోజులపాటు ఉండేవి. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ మళ్లీ ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: అతి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్.. నెలంతా అన్లిమిటెడ్! -
ఆ పాపులర్ ‘జియో ప్లాన్’ ఇక లేదు
Reliance Jio New Plan: ఆధునిక కాలంలో ఎక్కువమంది వినియోగించే నెట్‌వర్క్‌లలో రిలయన్స్ జియో (Reliance Jio) ఒకటని అందరికి తెలుసు. అయితే ఇప్పుడు సంస్థ ఇప్పటి వరకు అందించిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపివేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కంపెనీ ఇప్పటి వరకు అందిస్తున్న రూ. 119 ప్లాన్ నిలిపివేసి, ఆ స్థానంలో రూ. 149 ప్లాన్ తీసుకువచ్చింది. సాధారణంగా రూ. 119తో రీఛార్జ్ చేసుకుంటే 14 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ మాత్రమే కాకుండా, ప్రతి రోజూ 1.5 జీబీ డేటా, 100 మెసేజులు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ ప్లాన్ స్థానంలో కొత్త ప్లాన్ పుట్టుకొచ్చింది. రూ. 119 స్థానంలో వచ్చిన రూ. 149 ప్లాన్ వ్యాలిడిటీ ఇప్పుడు 20 రోజుల వరకు ఉంటుంది. అలాగే రోజుకి 1 జీబీ డేటాతో సహా 100 మెసేజిలు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ ప్లాన్ ద్వారా యూజర్లు జియో టీవీ యాప్, జియో సినిమాల్లో కార్యక్రమాలను చూసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ఇదిలా ఉండగా.. ఇటీవల జియో తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో మొదటిసారి రెండు ప్లాన్స్ లాంచ్ చేసింది. దీంతో ఒక ప్లాన్ రూ. 1099 (84 రోజుల వ్యాలిడిటీ) కాగా, మరో ప్లాన్ రూ. 1499 (84రోజుల వ్యాలిడిటీ). ఈ రెండింటిలోనూ వినియోగదారుని లభించే డేటా ప్యాక్ వేరువేరుగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మొబైల్స్ ప్లాన్ ధర రూ. 149 కాగా, బేసిక్ ప్లాన్ ధర రూ. 199గా ఉంటుంది. -
అతి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్.. నెలంతా అన్లిమిటెడ్!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, ఎయిర్ టెల్ వంటి బడా కంపెనీలకు పోటీగా తమ వినియోగదారులకు తక్కువ ధరలోనే డేటా, కాల్స్, ఎస్ఎంఎస్లను అందిస్తోంది. నెలంతా కేవలం రూ. 200 కంటే తక్కువ ధరలతో రీఛార్జ్ ప్లాన్స్ బీఎస్ఎన్ఎల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్పెషల్ ప్లాన్స్ వివరాలేంటో తెలుసుకుందాం.. రూ. 184 ప్లాన్ బీఎస్ఎన్ఎల్ రూ . 184 ప్లాన్ కింద కస్టమర్లకు నెలంతా అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు 1జీబీ రోజువారీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. తక్కువ సంఖ్యలో నెట్ వినియోగించే కస్టమర్లకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. రూ. 185 ప్లాన్ రూ.184 ప్లాన్ ప్రయోజనాలనే రూ. 185 ప్లాన్ కూడా అందిస్తోంది. రోజూ 1జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలు ఉంటాయి. అయితే రోజువారీ డేటా ఉపయోగించిన తర్వాత ఈ ప్లాన్ కింద కస్టమర్లకు 40Kbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. రూ. 186 ప్లాన్ రోజూ ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి ఈ రూ. 186 ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 1జీబీ రోజువారీ డేటా, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. ఇదీ చదవండి: GST On X: ట్విటర్ నుంచి డబ్బులు వస్తున్నాయా? జీఎస్టీ తప్పదు! -
జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. సూపర్ ప్లాన్ అంటే ఇదే, రూ.6వేల వరకు బెనిఫిట్స్ కూడా!
కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇవి పండుగల లాంటి సమయాల్లో వీటి డోస్ మరింత పెంచుతూ పోతుంటాయి. తాజాగా రిలయన్స్ సంస్థ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా తన కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. లాంగ్ టర్న్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లాన్‌పై ఓ లుక్కేస్తే.. రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద రూ.2,999తో ఏడాది వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ ప్లాన్ లో భాగంగా దాదాపు రూ.5000 వరకు విలువైన కూపన్లను జియో తన కస్టమర్ల కోసం జత చేసింది. కాలింగ్, డేటాతో పాటు, Jio నుంచి అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో ప్రముఖ ఫుడ్ డెలివరీ, ట్రావెల్, ఆన్లైన్ షాపింగ్‌తో పాటు మరిన్నింటిపై తగ్గింపులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్లాన్‌లో ఏమున్నాయంటే.. వినియోగదారులు రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్ ప్రయోజనాలు, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలను పొందుతారు. వినియోగదారులకు మొత్తం 912.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ వినియోగదారులకు 5G డేటాను కూడా అందిస్తుంది. వీటితో పాటు రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్విగ్గీ ఆర్డర్లపై రూ. 100 తగ్గింపు, అలాగే యాత్ర ద్వారా బుక్ చేసుకున్న విమానాలపై రూ. 1,500 వరకు పొదుపు పొందే అవకాశం ఉంది. దేశీయ హోటల్ బుకింగ్‌లపై 15 శాతం తగ్గింపు (రూ. 4,000 వరకు) పొందవచ్చు. Ajioలో ఎంపిక చేసిన ఉత్పత్తుల కోసం రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లపై రూ. 200 తగ్గింపు కూడా ఉంది. నెట్‌మెడ్స్‌లో అదనపు NMS సూపర్క్యాష్తో పాటు రూ. 999 కంటే ఎక్కువ ఆర్డర్లపై 20 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఈ ఆఫర్ నిర్దిష్ట ఆడియో ఉత్పత్తులు, రిలయన్స్ డిజిటల్ నుంచి కొనుగోలు చేసిన దేశీయ ఉపకరణాలపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇలా దాదాపు ఈ ప్యాక్‌తో రూ.6000 అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. చదవండి: China Company: భారీ నష్టాల్లో చైనా కంపెనీ.. అదే జరిగితే 70 వేల మంది ఉద్యోగాలు పోతాయ్! -
చార్జీ పెంపు.. ఎయిర్‌టెల్‌ను ప్రశ్నించనున్న కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: డేటా వ్యయం, పరికరాల ధర పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కనీస నెలవారీ చార్జీని ఎయిర్టెల్ 57 శాతం పెంచిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘డేటా ధరలు అధికం కావడం వేగవంతమైన డిజిటైజేషన్‌కు అవరోధాలు. 2025 నాటికి 120 కోట్ల భారతీయులను ఆన్‌లైన్‌కు తీసకురావాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం 83 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న డేటా వినియోగం లేదా పరికరాల ధరలో ఏదైనా పెరుగుదల వంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఎయిర్టెల్ ఇటీవల మొబైల్ సేవల ధరల పెంపుపై అధ్యయనం చేయలేదు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పరిశీలించే వరకు వేచి చూస్తాం.ట్రాయ్‌తో తప్పకుండా మాట్లాడబోతున్నాం. రష్యా–ఉక్రెయిన్ సమస్య కారణంగా ఇది స్వల్పకాలికమా? లేదా దీర్ఘకాలికమా? ఇది ట్రెండ్‌గా మారబోతుందా? ఇవీ మేం అడగబోయే ప్రశ్నలు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ధరలపై ప్రభావం పడింది. డేటా ధరల ప్రభావాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. చార్జీలు పెంచడానికి కారణం ఏమిటని ఆపరేటర్‌ను ప్రశ్నిస్తాం. డేటా వ్యయాలు అందుబాటులో ఉండాలన్నదే మా ఆశయం’ అని ఆయన అన్నారు. చదవండి: గూగుల్ నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు! -
రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే!
దేశంలో 5జీ సేవల ప్రారంభంతో టెలికాం సంస్థలు.. ఈ సర్వీసులను అన్నీ నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. మరో వైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. ఇందులో ఓటీటీ బెనిఫిట్స్, అన్లిమిటెడ్ కాలింగ్, డేటా ఇలా పలు రకాలు సేవలను తక్కవ ధరకే కస్టమర్లకు ఆకర్షించేలా సరికొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. టెలికాం కంపెనీలు ఎన్ని కొత్త ప్లాన్లు తీసుకొచ్చినా దాదాపు తక్కువ రీఛార్జ్‌తో ఎక్కువ బెనిఫిట్స్ ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం 'రిలయన్స్ జియో' తన యూజర్ల కోసం కొత్త రీచార్జ్ ప్లాన్‌ని ప్రకటించింది. డేటా ఎక్కువ ఉపయోగిస్తున్న కస్టమర్లకు దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేకంగా ఓ ఆఫర్‌ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు వీడియో కాలింగ్ యూజర్లు కోసం ప్రత్యేకంగా రూ. 61 రీఛార్జ్ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో తక్కువ ధరకే 6 GB డేటాను లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ మీ ఇతర ప్లాన్ ఉన్నంత వరకు ఉంటుంది. చదవండి: ఉద్యోగులకు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో షాక్! -
డేటా ఎక్కువ వినియోగిస్తున్నారా? జియో కొత్త ప్లాన్ వచ్చేసింది!
వివిధ రకాల ఆఫర్లతో ఆకట్టుకుంటూ కస్టమర్ల సంఖ్య పెంచుకుంటూ పోతోంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. తాజాగా మరో సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ డేటా ఎక్కువగా వినియోగించే వారి కోసం 4జీ డేటా యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్యాక్ (Data Add on plan) తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫిఫా వాల్డ్ కప్ ఖతర్ 2022 జరుగుతున్న నేపథ్యంలో ఫుట్‌బాల్ లవర్స్ కోసం ఈ యాడ్ ఆన్ ప్లాన్‌ని ప్రారంభించింది. ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇది రూ.222 ధరకు డేటా యాడ్ ఆన్ ప్లాన్, దీని వ్యాలిడిటీ 30 రోజులు. ఈ ప్యాక్ మొత్తం 50GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే 1GB డేటా కోసం వినియోగదారులు రూ.4.44 చెల్లిస్తారు. దీని గడువు ముగిసేలోపు మొత్తం డేటా ఉపయోగిస్తే, నెట్వర్క్ స్పీడ్ 64Kbpsకి పరిమితం అవుతుంది. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ డేటా ప్యాక్‌ను ఇప్పటికే ఉన్న బేస్ ప్లాన్‌తో కలిపి ఉపయోగించాల్సి ఉంటుంది. యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ కింద అందించే రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఈ 50GB డేటా వాడుకోవచ్చు. ఇదే కాకుండా రూ. 181, రూ. 241, రూ. 301 ధరలతో ఇలాంటి మరిన్ని యాడ్-ఆన్ డేటా ప్యాక్‌లు కూడా జియో అందిస్తోంది. చదవండి ‘మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా’..పిచాయ్ వార్నింగ్..ఆందోళనలో గూగుల్ ఉద్యోగులు! -
ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?
సాక్షి, ముంబై: దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. తన నెలవారీ రీచార్జ్ ప్లాన్ ఏకంగా 57 శాతం పెంచేసింది. తన కనీస రీఛార్జ్ ధర 28 రోజుల మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్లాన్ ధరను సుమారు 57 శాతం పెంచి రూ. 155కి పెంచినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్! కంపెనీ వెబ్సైట్ ప్రకారం కంపెనీ రూ.99 కనీస రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసింది. ఇప్పుడు అపరిమిత కాలింగ్, 1 జీబీ డేటా, 300 SMSలతో రూ.155 ప్లాన్‌ను ప్రారంభించింది. అయితే ఈ ప్లాన్ హరియాణా, ఒడిశాలకు పరిమితమైన ఈ కొత్త ప్లాన్‌ను మిగిలిన ప్రదేశాల్లో కూడా అమలు చేయనుందనే ఆందోళన యూజర్లలో నెలకొంది. అటు తొలుత ట్రయల్‌గా లాంచ్ చేసిన ఈ ప్లాన్‌ను భారతదేశం అంతటా విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో, 2021లో ఎంపిక చేసిన సర్కిల్‌లలో కనీస రీఛార్జ్ ఆఫర్‌ను రూ.79 నుండి రూ.99కి పెంచినప్పుడు కంపెనీ ఇదే తరహా విధమైన కసరత్తు (మార్కెట్-టెస్టింగ్) చేసిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. ఇది చదవండి: ‘రస్నా’ ఫౌండర్ కన్నుమూత, ‘మిస్ యూ’ అంటున్న అభిమానులు -
ఓటీటీ యూజర్లకు జియో భారీషాక్!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఓటీటీ యూజర్లకు భారీషాక్ ఇచ్చింది. ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భాగస్వామ్యంతో కొన్ని ఓటీటీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందించింది. అయితే ఇప్పుడు ఆ ప్లాన్లను తొలగించినట్లు తెలుస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్లను అక్టోబర్‌లో తొలగించిన జియో.. తాజాగా రూ.1499, రూ.4199 ప్రీపెయిడ్ ప్లాన్లను సంబంధిత ప్లాట్ ఫామ్ అన్నింటి నుంచి తొలగించింది. ఇప్పటికే ఈ ప్లాన్లు యాక్టీవేట్ యూజర్లు వినియోగించుకోవచ్చు. కానీ కొత్తగా ఆ ప్లాన్లు తీసుకోవాలనుకునే వారికి అందుబాటులో ఉండవని ఓటీటీ నివేదికలు చెబుతున్నాయి. కాగా, జియో - డిస్నీప్లస్ హాట్ స్టార్ మధ్య కుదరిన ఓటీటీల ఒప్పందం నుంచి జియో ఎందుకు తొలగిందో చెబుతూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకుంటూ వచ్చిన డిస్నీ+హాట్‌స్టార్.. 2023 ఐపీఎల్ ప్రసార హక్కులను కోల్పోయింది. ఈసారి రిలయన్స్ గ్రూప్‌కే చెందిన వయాకామ్ 18 ఆ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హాట్‌స్టార్ ప్లాన్లను జియో తొలగించినట్లు సమాచారం. -
వాట్ ఏ ప్లాన్.. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌తో పాటు మరిన్ని ఓటీటీలు!
కరోనా దెబ్బకు ఓటీటీ మార్కెట్ విపరీతంగా పుంజుకుంది. వందల కోట్లలో ఓటీటీ వేల కోట్లుకు చేరింది. ఈ క్రమంలో ఓటీటీల సంస్థలు కస్టమర్లను పెంచుకునే పనిలో పడ్డాయి. అందుకోసమే ప్రత్యేకంగా సిరీస్‌లు, సినిమాలు, ప్రత్యేక కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నాయి. కంటెంట్ వరకు అంతా బాగున్న కస్టమర్లు పైసలు పెట్టి సబ్స్క్రైబర్లుగా మార్చడం కోసం మొబైల్ ఓన్లీ ప్లాన్స్‌ను (Mobile Only Plans) కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందిస్తున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం. అమెజాన్ ప్రైమ్ వీడియో అమెజాన్ ఇటీవల ప్రైమ్ వీడియో కోసం మొబైల్-మాత్రమే సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ .దీని ధర రూ. 599, ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ మొబైల్ డివైజ్ సబ్స్క్రైబర్లకు ప్రైమ్ వీడియో యాక్సెస్‌ను మాత్రమే అందిస్తుంది. ఇది ఉచిత డెలివరీలు, అమెజాన్ మ్యూజిక్ మొదలైన ఇతర ప్రైమ్ మెంబర్షిప్ ప్రయోజనాలను ఉండవని గమనించుకోవాలి. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌తో సహా అనేక రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది, దీని ధర నెలకు రూ.149. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫాంలో SD (480p) క్యాలిటీ అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ డిస్ని+హాట్‌స్టార్ (Disney+ Hotstar) మొబైల్ డివైజ్ కోసం నెలవారీ, వార్షిక ప్లాన్లను అందిస్తుంది. దీని ధర మూడు నెలలకు రూ.149, సంవత్సరానికి రూ.499. ఈ రెండు ప్లాన్లు యాడ్-సపోర్టుతో వస్తాయి. ఒకేసారి ఒక డివైజ్‌లో మాత్రమే లాగిన్ చేయగలరు. వూట్ సెలెక్ట్ మొబైల్ ప్లాన్ Voot Select సంవత్సరానికి రూ. 299 ఖరీదు చేసే ఒక మొబైల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఒక డివైజ్‌కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. SD 720p స్ట్రీమింగ్‌ను అవకాశం ఉంటుంది. సోనీలైవ్ మొబైల్ ప్లాన్ సోనీలైవ్ మొబైల్ ప్లాన్ సంవత్సరానికి రూ.599తో ఉంది. ఇది ఒక మొబైల్ డివైజ్‌లో మాత్రమే 720p స్ట్రీమింగ్కు అవకాశం ఉంటుంది. జీ5 జీ5లో మొబైల్ ప్లాన్ అందుబాటులో లేదు. అయితే, ఇది సంవత్సర వ్యాలిడిటీ, మూడు నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది. వాటి ధర రూ.999( సంవత్సరం) , రూ. 399 (3 నెలలు). చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే!
ఎప్పటికప్పుడు కస్టమర్లకు అదిరిపోయే అఫర్లను ప్రకటిస్తూ దూసుకుపోతోంది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్. ఈ సారి తన వినియోగదారుల కోసం ఒకే ప్లాన్‌లో బోలెడు ప్రయోజనాలను అందివ్వాలని నిర్ణయించుకుంది. అందుకే కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్‌లో.. డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ఓటీటీ బెనిఫిట్స్, ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, DTH ప్రయోజనాలను ఒక రీచార్జ్‌తో కస్టమర్లకు సొంతం చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్‌ను ఎయిర్టెల్ బ్లాక్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇప్పటికే ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌పై ఒకే బిల్లులో ఫైబర్, డీటీహెచ్ మొబైల్‌తో సహా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్టెల్ సర్వీసులను కలిపేందుకు ఎయిర్టెల్ బ్లాక్ యూజర్లకు అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ ద్వారా జీరో-స్విచింగ్ ఇన్స్టాలేషన్ ఖర్చులతో పాటు జీవితకాలపు ఉచిత సర్వీస్ కూడా పొందవచ్చు. వీటిని రూ. 699 నుంచి 2,999 వరకు వివిధ రకాల ప్లాన్లతో అందిస్తోంది. వీటిపై ఓ లుక్కేద్దాం! రూ. 699 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఇది ఎయిర్టెల్ అందించే ఎంట్రీ-లెవల్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ల్యాండ్‌లైన్ కనెక్షన్, ఫైబర్ ద్వారా 40Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు DTH కనెక్షన్లో రూ. 300 విలువైన టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో డిస్నీ హాట్ స్టార్( Disney Hotstar), సోనీ లివ్( Sony Liv), Airtel XStream యాప్‌తో పాటు మరో 12 ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ప్లాన్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందించదు, కాబట్టి దీనిని ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా కొనుగోలు చేయవచ్చు. రూ. 899 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 105 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్‌తో రెండు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లను అందిస్తోంది ఎయిర్టెల్. ఈ ఆఫర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీంతో పాటు 12 ఇతర యాప్‌లకు సబ్స్క్రిప్షన్, రూ. 350 విలువైన (డీటీహెచ్) DTH టీవీ ఛానెల్‌లు ఉన్నాయి. రూ. 1098 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 100Mbps స్పీడ్‌తో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ లభిస్తుంది. 75 GB ఇంటర్నెట్తో పాట అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. రూ. 1099 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ సబ్స్క్రిప్షన్ ల్యాండ్‌లైన్ ద్వారా అపరిమిత కాలింగ్, ఫైబర్‌పై 200Mbps వరకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, మరో 13 యాప్‌లతో సహా రూ.350 విలువైన OTT ఛానెల్‌లకు కూడా కస్టమర్లు యాక్సెస్ పొందుతారు. రూ. 1599 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: అన్లిమిటెడ్ కాలింగ్, 300Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌తో వస్తుంది. ఇందులో రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో డీటీహెచ్ కనెక్షన్ వస్తుంది. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, మరిన్ని OTT ప్రయోజనాలు ఉంటాయి. రూ. 1799 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్‌లో ఫైబర్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్తో కూడిన ల్యాండ్‌లైన్ వస్తుంది అది కూడా గరిష్టంగా 200Mbps స్పీడ్‌తో ఉపయెగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 190GB డేటా , 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లతో అపరిమిత కాలింగ్ ఉంది. అదనంగా OTTలో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, ఇతర సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. రూ. 2299 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ : ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, 300 Mbps డేటాతో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను అందించే అత్యంత ఖరీదైన ప్లాన్. 240 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్‌తో 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు పొందవచ్చు. అంతేనా ఇంకా రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో DTH కనెక్షన్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్( Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలు (Amazon Prime Videos), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, (Airtel Xstream) మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. -
ఓటీటీ ప్రియుల కోసం వోడాఫోన్ చవకైన ప్లాన్.. రూ.151తో డేటా, 3 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
టెలికాం రంగంలో పోటీ విపరీతంగా పెరుగుతోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు అదిరిపోయే ఆఫర్లతో పాటు ట్రెండ్‌ని కూడా ఫాలో అవుతూ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ) తమ వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కరోనా కారణంగా ప్రజలు ఓటీటీలకు అలవాటు పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కేటగిరి కస్టమర్లను దృష్టిలో వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఓటీటీ( OTT) ప్రయోజనాలతో వస్తుంది. ఓటీటీ ప్రియుల కోసం ప్రత్యేక ప్లాన్.. ఓటీటీ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే కస్టమర్లకు ఈ రీచార్జ్ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్‌లోని బెనిఫిట్స్‌పై ఓ లుక్కేద్దాం.. వీఐ కొత్త రూ.151 ప్రీపెయిడ్ యాడ్-ఆన్ ప్యాక్‌ని ప్రకటించింది. ఈ చవకైన రీచార్జ్ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఇందులో ప్రధానంగా మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఈ ప్యాక్‌తో కస్టమర్లు మొత్తం 8GB డేటాను కూడా పొందుతారు. అయితే ఈ రీచార్జ్ ప్లాన్‌పై కాలింగ్, ఉచితంగా ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అనేవి ఉండవు. అధిక డేటాతో హాట్ స్టార్, డిస్నీ సబ్స్క్రిప్షన్ కోరుకునే కస్టమర్లకు ఈ రీచార్జ్ ప్లాన్ అనువుగా ఉంటుందని చెప్పువచ్చు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
వావ్.. సూపర్ ప్లాన్‌ని తీసుకొచ్చిన జియో.. అదిరిపోయే బెనిఫిట్స్, ఓటీటీ కూడా!
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లను ఆకర్షించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అందుకే టెలికాం రంగంలో టాప్ పోజిషన్లో కొనసాగుతోంది. తాజాగా మరో అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది జియో. ఇందులో అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజువారి డేటా అనేక బెనిఫిట్స్‌తో పాటు ఓటీటీ(OTT) ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ప్రత్యేకంగా ప్రతిరోజూ 3GB డేటా ప్రయోజనాలను అందిస్తోంది. అదిరిపోయే ప్లాన్లు.. - రూ. 419 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడీటీతో 84GB డేటాను అందిస్తుంది. ఇందులో 3GB రోజువారీ డేటా పరిమితి, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్‌కి 3 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. - రూ. 601 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, 3GB రోజువారీ పరిమితితో మొత్తం 90GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇది జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అదనపు 6GB డేటాను కూడా అందిస్తుంది. కస్టమర్లు ఈ ప్లాన్‌తో రూ.499 విలువైన ఒక సంవత్సర డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. - రూ. 1,199 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడీటీ, 3GB రోజువారీ డేటా పరిమితితో మొత్తం 252GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, జియో యాప్ సబ్స్క్రిప్షన్ తోపాటు రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా 3 నెలల (90 రోజులు) అందిస్తుంది. - రూ. 4,199 ప్లాన్: ఈ వార్షిక ప్లాన్‌లో 3GB రోజువారీ డేటా పరిమితితో 1095GB డేటాను అందిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS తో పాటు జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. దానితో పాటుగా ఈ ప్లాన్ ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను రూ. 1499తో అందిస్తుంది. ఇది OTTలోని అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌కు ఉచితంగా చూడవచ్చు. చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో ఎలాన్ మస్క్ .. ఆ ఫొటోకు వేలంలో ఊహించని ధర.. ఎంతంటే? -
రిలయన్స్ జియో బంఫర్ ఆఫర్.. రీచార్జ్ ఒకటే.. బెనిఫిట్స్ ఆరు!
టెలికాం రంగంలో రిలయన్స్ జియో అరగ్రేటంలోనే అన్లిమిటెడ్ కాల్స్, డేటా ప్రకటించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్లను తన వైపు తిప్పుకుంటూ దూసుకెళ్తోంది. ఫ్రీ ఆఫర్‌తో మొదలెట్టిన దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో (Reliance Jio) 6వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇందులో భాగంగా, తన కస్టమర్లు ₹2,999 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌తో 6 బెనిఫిట్స్ పొందేలా ఓ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఈ మేరకు “రూ.2999 ప్లాన్‌తో 6 సంవత్సరాల జియోపై 6 బెనిఫిట్స్ పొందండి. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి" అని రిలయన్స్ జియో అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 3, 2022 నుంచి అందుబాటులో ఉండనుంది. రిచార్జ్ ఒకటే.. బెనిఫిట్స్ ఆరు ►రూ.2,999 ప్లాన్‌తో రీచార్జ్‌తో.. అదనంగా 75జీబీ హైస్పీడ్ డేటా ఉచితం. ►ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో(ixigo)కు చెందిన రూ.750 విలువైన కూపన్ దక్కుతుంది. ( రూ. 4500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై) ►నెట్‌మెడ్స్ (Netmeds)లో రూ.1000 కొనుగోలుపై 25శాతం డిస్కౌంట్ లభించేలా కూపన్ ►జియోకు చెందిన షాపింగ్ సైట్ ఆజియో(Ajio) లో రూ.2990 కోనుగోలుపై రూ.750 విలువైన కూపన్ లభిస్తుంది. ►రిలయన్స్ డిజిటల్ (Reliance Digital)లో రూ.5,000 కొనుగోలుపై రూ.500 తగ్గింపు పొందేలా కూపన్ ►జియో సావన్ ప్రో ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌పై 50శాతం తగ్గింపుతో కూపన్ లభిస్తుంది. ఆఫర్ ప్రకారం ₹2,999 ప్రీపెయిడ్ ప్లాన్‌తో మీ జియో నంబర్‌ను రీఛార్జ్ చేసిన తర్వాత, అన్ని వోచర్లు, కూపన్లు మై జియో యాప్ ద్వారా కూపన్స్‌ని ఉపయోగించుకోవచ్చ. -
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా 2 ప్లాన్లు, వ్యాలిడిటీ పెంచారండోయ్!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారం లాభాల బాట పట్టలాంటే కస్టమర్లను ఆకట్టుకోవడమే ప్రధాన మార్గమని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ సూత్రాన్ని క్రమం తప్పకుండా అమలు చేస్తూ టెలికాం కంపెనీలు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా తక్కువ ధరలోనే బెస్ట్ ఆఫర్లు ప్రవేశపెట్టింది ఎయిర్టెల్. సరికొత్త ఆఫర్లు కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూ.519, రూ.779 ప్లాన్‌ని తీసుకొచ్చింది ఎయిర్టెల్. ఇందులో రూ. 779 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ ఉండగా, రూ. 519 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ ఉంది. ఈ రెండు ప్లాన్లలో కస్టమర్లు అన్లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ(STD), రోమింగ్ కాల్స్‌తో పాటు రోజుకు 1.5జీబీ 4G డేటా, రోజుకు 100 SMSలను పొందుతారు. అయితే.. ప్రస్తుతం టెలికాం కంపెనీలు 28, 56 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లు అందిస్తుండగా ఈ ప్లాన్లు పూర్తి క్యాలెండర్ నెల వ్యాలిడిటీని అందిస్తున్నాయి. వీటితో పాటు అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలల పాటు అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. ఫాస్ట్‌ట్యాగ్ (FASTag)పై రూ.100 క్యాష్ బ్యాక్, ఎయిర్టెల్ థాంక్స్ బెనిఫిట్స్ ఉచిత హలో ట్యూన్లు, వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. చదవండి: Bajaj CT 125X: బజాజ్ సీటీ 125 ఎక్స్.. బోలెడు ఫీచర్లతో పాటు చార్జింగ్ సాకెట్ కూడా! -
వొడాఫోన్ ఐడియా ఆఫర్ అదిరిపోలా!.. కేవలం రూ.82 రీచార్జ్‌తో ఓటీటీ సబ్స్క్రిప్షన్!
భారత్‌లో మొబైల్ యూజర్లు పెరిగే కొద్దీ టెలికాం రంగం వృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా పోటీపడి మరీ కస్టమర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బంఫర్ ఆఫర్ల పేరుతో గతంలో రీచార్జ్ ప్లాన్లతో వస్తే, తాజా పరిస్థితుల దృష్ట్యా ఓటీటీని కూడా ఆఫర్ల జాబితాలో జత చేశారు. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్‌తో తీసుకొచ్చింది. హిందీ పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC 2022)ని చూడడానికి ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అతి కూడా తక్కువ ధరలోనే! ఆఫర్ అదిరిపోలా! వొడాఫోన్ ఐడియా వినియోగదారులు కేవలం రూ. 82 చెల్లిస్తే నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రఖ్యాత కేబీసీ 2022 అన్ని ఎపిసోడ్లను వీక్షించవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఇంకో విషయం ఏంటంటే ఇది డేటా వోచర్ ప్లాన్. రూ.82 ప్లాన్ పని చేయడానికి మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. ఈ ప్లాన్‌తో కస్టమర్లు 14 రోజుల పాటు 4GB డేటాను పొందుతారు. కానీ సోనీలివ్ సబ్స్క్రిప్షన్ మాత్రం 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మొబైల్ సబ్స్క్రిప్షన్ కాబట్టి కేవలం మొబైల్లో మాత్రమే చూడగలరు. మీ టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో చూసే సౌకర్యం ఉండదు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత, సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ పాజ్ చేయడం, లేదా డియాక్టివేట్ చేయలేము. అంటే మీరు సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేసిన వెంటనే, మీరు దాన్ని 28 రోజుల పాటు పొందుతారు. ఈ ప్లాన్‌తో కేబీసీ 2022 షో మాత్రమే కాదు ఈ ప్లాట్‌ఫాంలో ప్రసారమయ్యే ఇతర షోలు, సినిమాలను కూడా చూసేయచ్చు. సోనీలివ్ ఒక ఏడాది ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో టీవీలో చూసే సౌకర్యం కూడా ఉంది. అదే ఒక సంవత్సరం మొబైల్ ప్లాన్ కోసం అయితే రూ. 599 చెల్లిస్తే సరిపోతుంది. చదవండి: Oppo Launch K9x Smart Tv:ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు! -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఆగస్టు 31 వరకు మాత్రమే!
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) కస్టమర్ల బంపరాఫర్ ప్రకటించింది. తమ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. ‘ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ ప్లాన్ 2022’ లో భాగంగా రూ.2022తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని, అయితే ఈ ఆఫర్ ఆగస్టు 31 లోపు రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఏముంది ఈ ప్లాన్‌లో.. బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌లో.. రూ.2022తో రీచార్జ్ చేసుకుంటే 300 రోజులు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. దీంతో పాటు నెలకు 75GB డేటా కూడా లభిస్తుంది. ఒకవేళ నెలలోపు మీ డేటా పరిమితి నెలలోపు పూర్తయితే స్పీడ్ 40kbps పడిపోతుంది. అలాగే రూ 2399, రూ 2,999 ప్లాన్‌పై అదనంగా మరో 75 జీబీ డేటా ఇస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. కాగా బీఎస్ఎన్ఎల్కు ఊపరి పోసేందుకు ఇటీవలే కేంద్రం కోటి 64 లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించడంతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ ప్యాకేజీతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కేంద్రం ఆదేశిస్తూ లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. చదవండి: అలర్ట్: మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు, 75శాతం డిస్కౌంట్.. ఈరోజే లాస్ట్! -
సారీ..రీచార్జ్‌కు డబ్బుల్లేవు
బనశంకరి: రాష్ట్రంలో వేలాది గ్రామాలు, పట్టణాల్లో పేద బాలలకు విద్యా, పోషణ సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు తీవ్ర కష్టం వచ్చింది. డిజిటలీకరణ మాటలకే పరిమితమైంది. అంగన్వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులకు అందించిన స్మార్ట్ ఫోన్లు అలంకారంగా మిగిలాయి. నిరుపేద కుటుంబాల పిల్లలు, గర్భిణీలు, బాలింతలు సమగ్ర సమాచారం మొత్తం ఆన్లైన్లో నమోదై ఉండాలని కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన పథకం ప్రారంభించింది. ప్రతి అంగన్వాడీ కి అందించిన స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం రీచార్జ్ చేయకపోవడంతో ఇంటర్నెట్ అందక పనిచేయడం లేదు. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన పథకం లక్ష్యం నెరవేరలేదు. ఆరు నెలలుగా సమస్య పోషణ అభియాన కింద 2020లో 62,581 అంగన్వాడీ, 3,331 ఉపకేంద్రాలతో పాటు మొత్తం 65, 911 కేంద్రాల కార్యకర్తలకు శామ్సంగ్ గ్యాలక్సీ ఏ–10 ఎస్ మోడల్ స్మార్ట్‌ఫోన్, ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ సిమ్‌లను సర్కారు అందజేసింది. కొత్తగా ప్రారంభించిన 1050 అంగన్వాడీలకు ఇంకా ఇవ్వలేదు. ఈ పథకానికైన వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60–40 కింద భరిస్తాయి. ఎయిర్‌టెల్‌కు డబ్బు చెల్లించక సుమారు 6 నెలలుగా 65,911 స్మార్ట్ ఫోన్లు మూగబోయాయి. దీనిపై అంగన్వాడీలు పై అధికారులకు ఫిర్యాదు చేస్తే నిధుల కొరత అని సమాధానం వచ్చింది. రెండువారాల కిందట బెంగళూరులో జరిపిన రాష్ట్రస్థాయి అంగన్వాడీల ఆందోళలోనూ ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మళ్లీ చేతితో ఫైళ్లు రాయడం, రికార్డుల నిర్వహణ లాంటి పనులు ప్రారంభమయ్యాయి. జీతాలు, ప్రోత్సాహక ధనానికి ఇబ్బందులే రాష్ట్రంలో 62 వేల అంగన్వాడీల్లో 1.24 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పనిచేస్తున్నారు. వీరికి సేవ ఆధారంగా పురస్కారాలు, గౌరవవేతనం పెంచే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. 20 ఏళ్లకు పైబడి సేవలందించినవారికి రూ.1,500, 10 నుంచి 20 ఏళ్లు సరీ్వస్ కు రూ.1,250, 10 ఏళ్లలోపు సరీ్వసు ఉన్నవారికి రూ వెయ్యి చొప్పున జీతం పెంచుతామని సీఎం బసవరాజబొమ్మై బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టి నాలుగు నెలలు గడిచినప్పటికీ గౌరవవేతనం పెంపు వీరికి అందలేదని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గత 3 నెలలనుంచి జీతాలు కూడా అందలేదని సమాచారం. గత వారం నుంచి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అందింది రెండునెలలు వేతనమేనని తెలిపారు. పెండింగ్ జీతం కూడా త్వరలోనే మంజూరు చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ప్రియాంక తెలిపారు. స్మార్ట్ ఫోన్లకు త్వరలో రీచార్జ్ చేస్తామని మహిళా శిశుసంక్షేమ శాఖా మంత్రి హాలప్ప ఆచార్ తెలిపారు. సొంత ఖర్చుతో కొందరు నిత్యం యాప్‌లో పిల్లలు నమోదు, ఆహార సామగ్రి, గర్భిణీలు సమాచారం నమోదు చేయడానికి అనుకూలంగా ఉండేది. సిమ్ రీచార్జ్ చేయకపోవడంతో గత ఆరునెలలుగా ఇబ్బందిగా ఉందని అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీ తెలిపారు. ఇబ్బందులు పడలేక కొందరు కార్యకర్తలు సొంత డబ్బుతో రీచార్జ్ చేసుకున్నట్లు చెప్పారు. (చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ..) -
జియో యూజర్లకు భారీ షాక్!
దేశీయ టెలికాం కంపెనీలు ఈ ఏడాది టారిఫ్ ధరల్ని పెంచేందుకు ప్రయత్నాలు మమ్మరం చేస్తున్నాయి. అంతకంటే ముందే జియో తన యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రత్యేకంగా జియో ఫోన్ నెక్ట్స్ యూజర్లకు అందిస్తున్న మూడు రీఛార్జ్ ప్లాన్ల ధరల్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జియో ఫోన్ నెక్ట్స్ ప్రీపెయిడ్ ప్రారంభ రీఛార్జ్ ప్లాన్లు గతంలో రూ.155, రూ.185, రూ.749 ఉండేవి. తాజాగా పై 3 ప్లాన్ల ధరల్ని 20శాతం పెంచింది. ఇప్పుడు ఆ ప్లాన్ ధరలు ఎలా ఉన్నాయంటే? రూ.155 రీఛార్జ్ ప్లాన్ కాస్తా రూ.186కి పెరిగింది. రూ.185 ప్లాన్ భారీగా రూ.222కి చేరింది. ఇక రూ.749 ప్లాన్ ప్రస్తుతం రూ.899తో అందుబాటులో ఉంది. ఈ మూడు ధరల్ని పెంచినట్లు జియో సైతం తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొన్నట్లు పలు నివేదికలు తెలిపాయి. జియో ఫోన్ నెక్ట్స్ ప్లాన్లు రిలయన్స్ సంస్థ జియో ఫోన్ నెక్ట్స్ పేరుతో కొనుగోలు దారులకు బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే జియో సంస్థ ఆ ఫోన్‌కు ప్రత్యేకమైన వివిధ టారిఫ్ ధరల్ని అందిస్తుంది. ఇప్పుడు ఆ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెరిగిన ప్లాన్స్‌తో అందించే బెన్ఫిట్స్ ఇవే జియో ఫోన్ నెక్ట్స్ యూజర్లకు అందిస్తున్న రూ.186 బేసిక్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 1జీబీ డేటాను అందిస్తుంది. వాయిస్ కాల్స్ తో పాటు 100ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు రూ.222ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లో యూజర్లు ప్రతిరోజు ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌తో 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అదే విధంగా వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు సెండ్ చేసుకోవచ్చు. రూ.899 ప్లాన్: 336రోజుల వ్యాలిడిటీతో 24జీబీ డేటాను పొందవచ్చ. ఈ ప్లాన్ 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. వ్యాలిడిటీతో పూర్తయితే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు 50 ఎస్ఎంఎస్లు, ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. చదవండి👉ముఖేష్ అంబానీ స్కెచ్ మామూలుగా లేదుగా! ఇక ప్రత్యర్ధులకు చుక్కలే! -
యూజర్లకు పేటీఎం భారీ షాక్!
మీరు మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ ఎలా చేస్తున్నారు? పేటీఎం నుంచి చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. పేటీఎం యాప్ నుంచి మొబైల్ రీఛార్జ్ చేస్తే అందుకు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పేటీఎం యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేస్తే ఎంత అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే విషయం వెలుగులోకి రాలేదు. కానీ పలు నివేదికలు మాత్రం రూ.1 నుంచి రూ.6 మధ్యలో అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పేటీఎం వ్యాలెట్, యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు.. ఇలా ఏ పేమెంట్ విధానం అయినా సర్‌ఛార్జి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ.100కి మించిన ట్రాన్సాక్షన్లు చేస్తే వాటిపై సర్ ఛార్జీల మోత తప్పదనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎయిర్,జియో,వొడాఫోన్..అదిరిపోయే ప్లాన్లు ఇవే!
ఈ ఏడాది జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మరోసారి టారిఫ్‌లు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో 2022–23లో టెల్కోల ఆదాయాలు 20–25 శాతం పెరగనున్నాయని దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. అందుకే ప్రస్తుతానికి, రోజువారీ ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాలింగ్, లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రయోజనాల్ని అందించే టారిఫ్ ధరల్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అయితే ఇప్పుడు మనం మూడు టెలికాం సంస్థల్లో ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వోడాఫోన్ ఐడియా వోడాఫోన్ ఐడియా రూ.400లోపు ప్లాన్లను అందిస్తుంది. ముఖ్యంగా రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 డేటా,అపరిమిత కాల్లు, రోజుకు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా, వారాంతపు డేటా రోల్ఓవర్, వీఐ సినిమాలు, ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా పొందవచ్చు. రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్లు, రోజుకు 100ఎస్ఎంఎస్లను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో అదనపు ప్రయోజనాల్ని అందిస్తుంది. వారాంతపు డేటా రోల్ఓవర్, వీఐ సినిమాలు, టీవీని ఫ్రీగా యాక్సిస్ చేయోచ్చు. ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా పొందవచ్చు. రూ.399 ప్లాన్‌లో 28రోజుల వ్యాలిడిటీతో 3నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ డేటాను పొందవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా,వారాంతపు డేటా రోల్ఓవర్, వీఐ సినిమాలు, టీవీని ఫ్రీగా యాక్సిస్ చేయోచ్చు. ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా పొందవచ్చు. ఎయిర్టెల్ 28రోజుల వ్యాలిడిటీతో ఎయిర్టెల్ రూ.399 ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత కాల్లు, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌కి ఉచిత సబ్స్క్రిప్షన్లను పొందవచ్చు. 28రోజుల వ్యాలిడిటీతో రూ. 359 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్‌లను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 319 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ పొందచ్చు. జియో 28రోజుల వ్యాలిడిటీతో రూ.299 ప్రీపెయిడ్ పెయిడ్ ప్లాన్. 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ పొందవచ్చు. రిలయన్స్ జియో 30 రోజుల వ్యాలిడిటీతో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది. మీ రోజువారీ డేటా ముగిసిన తర్వాత, మీరు 64కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయోచ్చు. రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, రిలయన్స్ జియో ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. మీరు రోజుకు 100ఎస్ఎంఎస్, జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. -
కేవలం రూ. 197తో 150 రోజుల వ్యాలిడిటీ..! ఇంకా ఎన్నో ప్రయోజనాలు..!
BSNL 197 Plan Details: ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్ ధరలను పెంచుతూ యూజర్లపై అధిక భారాన్ని మోపాయి. ఇక ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్‌ను పరిచయం చేసింది. ఏ టెలికాం కంపెనీ ఆఫర్ చేయని ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ..! పాత యూజర్ల కోసం, కొత్త యూజర్ల కోసం వారిని ఆకర్షించేలా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్. తాజాగా అతి తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీను అందించే ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసింది. కేవలం రూ.197రీచార్జ్ ప్లాన్‌తో 150 రోజుల వ్యాలిడిటీను అందించనుంది. అధిక వ్యాలిడిటీతో పాటుగా..! బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన రూ. 197 ప్లాన్‌తో ఎక్కువ రోజుల వ్యాలిడిటే కాకుండా రోజుకు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్లు కూడా ఆఫర్ చేస్తుంది. కాగా ఈ ప్రయోజనాలు మాత్రం కేవలం 18 రోజులు మాత్రమే పొందే వీలు ఉంటుంది. సుదీర్ఘ వ్యాలిడిటీ అందించమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 18 రోజుల తర్వాత కూడా ఎలాంటి టాప్అప్ వేయకపోయినా ఉచిత ఇన్కమింగ్ సౌకర్యాన్ని పొందే వీలు ఉంటుంది. దాంతో పాటుగా 40kbps వేగంతో ఇంటర్నెట్ను కూడా పొందవచ్చును. చదవండి: హైదరాబాద్ బేస్డ్ బ్లాక్ చెయిన్ స్టార్టప్.. ఇన్వెస్ట్ చేసిన అమెరికా కంపెనీ -
మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. 28 కాదు ఇకపై 30 రోజులు
భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. టెలికాం సంస్థలకు ప్రీపెయిడ్ ప్యాక్‌ల విషయంలో వాలిడిటీని పెంచాలని షాకిచ్చింది. తద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారుల ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ విషయంలో గుడ్ న్యూస్ చెప్పినట్లయ్యింది. గతంలో ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో లభ్యమయ్యేవి. అయితే, ఆ తర్వాత వీటిని అన్ని టెలికం సంస్థలు 28 రోజులకు తగ్గించేశాయి. ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. వినియోగదారులకు ఇది భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో.. ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకురావాలని ఆదేశించింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్ 1999కి మార్పు చేస్తూ.. ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెలా ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, రెండు నెలల్లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని టెల్కోలను ఆదేశించింది. -
'ఆఫర్లు మావి..ఛాయిస్ మీది', పోటీపడుతున్న టెలికాం దిగ్గజాలు!
'ఆఫర్లు మావి..ఛాయిస్ మీది' అంటూ దేశీయ టెలికాం దిగ్గజాలు యూజర్లకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే జియో' బ్రాండ్ బ్యాండ్ తన వినియోగదారులకు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్..! వీటితో పాటుగా మరో 14 ఓటీటీ సేవల్ని ఉచితంగా అందిస్తుంది. తాజాగా టెలికాం నెట్‌వర్క్‌లైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్‌ఐడియాకు పోటీగా కొన్నిప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా'లు ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌లను పెంచాయి.ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో కొన్ని అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తున్నాయి. అంతేకాదు ఆయా కంపెనీల యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే ప్రత్యేకంగా డిస్కౌంట్లను ప్రకటించాయి. ముఖ్యంగా యాప్ ద్వారా రీఛార్జ్ చేయించుకునే వినియోగదారులు కొంతమేర డబ్బును ఆదా చేసుకోవచ్చని టెలికాం కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా చాలా మంది వినియోగదారులు అపరిమిత కాల్లు, రోజుకు 100ఎస్ఎంఎస్లతో పాటు రోజువారీ 2జీబీ డేటాను పొందవచ్చు. 2జీబీ రోజువారీ డేటా, నెలవారీ, వార్షిక ప్లాన్లు ధరల పరంగా విభిన్నంగా ఉన్నాయి. ముందుగా ఎయిర్ టెల్ 2జీబీ నెలవారీ ప్లాన్లు vs వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు ఎయిర్టెల్ 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో పాటు.. ఈ నాలుగు ప్లాన్లకు రోజువారీ 2జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ల ధరలు వరుసగా రూ.359, రూ.549, రూ.839, రూ.2999 ఉన్నాయి. ఇక యాప్ ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్ రూ.309కే వస్తుంది. దీంతో రూ.50 ఆదా అవుతుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అపరిమిత కాల్‌లను పొందవచ్చు. రోజువారీ డేటా ఎక్కువ పొందితే..వాటిపై ధరలు తక్కువగా ఉంటున్నాయి. ప్లాన్ల ధరలు పెరిగే కొద్ది ప్రయోజనాలు పెరుగుతున్నాయి. ►ఉదాహరణకు వినియోగదారులు సంవత్సరానికి ప్రతి నెల రూ.359 చెల్లిస్తున్నట్లయితే ఆమొత్తం రూ.4308 అవుతుంది. కానీ నేరుగా వార్షిక ప్లాన్‌కు సబ్స్క్రయిబ్ అయినప్పుడు ధర రూ.2999 అవుతుంది. దీని వల్ల వినియోగదారులకు రూ.1309 ఆదా చేసుకోవచ్చు. ►అలాగే వినియోగదారులు రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసినప్పుడు నెలకు రూ. 250 ఖర్చవుతుంది. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లో రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్ ప్యాక్ తో నెలకు ఖర్చు రూ.200 లోపు అవుతుందని ప్రచారం చేస్తుంది. జియో నెలకు 2జీబీ vs వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు ►జియో 28రోజుల వ్యాలిడిటీతో రూ.299ప్లాన్‌లో భాగంగా 2జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్లు,రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ►రూ.533 ప్లాన్‌లో భాగంగా 56 రోజుల వాలిడిటీతో అందిస్తుంది. ►84రోజుల వ్యాలిడిటీతో రూ.719 ప్లాన్‌ను అందిస్తుంది ►చివరిగా వార్షిక ప్లాన్ కింద రూ.2879తో సూపర్ వాల్యూ ప్లాన్‌ను అందిస్తుంది. మొత్తం డేటా ప్రయోజనాలు నెలవారీ ప్లాన్ కంటే ఎక్కువ, ప్లాన్ మొత్తం సంవత్సరం పాటు కొనసాగుతుంది. వొడాఫోన్ ఐడియా నెలకు 2జీబీ vs త్రైమాసిక ప్రీపెయిడ్ ప్లాన్లు వొడాఫోన్ ఐడియా 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ఈ ప్లాన్ల ధరలు వరుసగా రూ.359, రూ.539, రూ.839. అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్,రోజుకు 100ఎస్ఎంఎస్లను పొందవచ్చు. వార్షిక ప్లాన్ లేదా 84 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ రూ.279కి తగ్గింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా 2జీబీ రోజువారీ డేటాను అందించే వార్షిక ప్లాన్లను అందించడం లేదు. అయితే, ఇది రూ.2899 ధరతో 1.5GB రోజువారీ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఎక్కువ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్లకు సబ్స్క్రయిబ్ చేసుకోవడం వల్ల యూజర్లకు డబ్బు ఆదా అవుతుంది. వార్షిక ప్లాన్లకు సబ్స్క్రయిబ్ చేసినట్లయితే, వారు పూర్తి సంవత్సరం వ్యాలిడిటీతో పాటు అదే డేటా, కాలింగ్ ప్రయోజనాలను పొందుతారని పై ప్లాన్లు చూపుతున్నాయి. చదవండి: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సేవలను ఉచితంగా ఇలా పొందండి..! -
ఫోన్‌పేలో ఉచితాలకు కోత.. ఈ సర్వీసులకు మొదలైన బాదుడు..
Phone Pay User Charges: ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఇండియాలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఫోన్‌పే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇంతకాలం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సర్వీసులకు సంబంధించి ఉచితంగా అందించిన సర్వీసులకు ఇప్పుడు యూజర్ ఛార్జీలను వసూలు చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో పెట్రోలు డీజిలు ధరలు పెరుగుతున్నాయి. ఇదే బాటలో ప్రైవేటు రంగంలోని డీటీహెచ్, ప్రైమ్ వీడియోల సబ్స్క్రిప్షన్స్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఫోన్‌పే వచ్చి చేరింది. ఇంత కాలం ఉచితంగా అందించిన సర్వీసులకు యూజర్ ఛార్జీలను చేర్చింది. వినియోగదారులకు నేరుగా ఈ విషయం చెప్పకుండానే బాదుడు మొదలు పెట్టింది. యూజర్ ఛార్జీలు ఇప్పటి వరకు ఫోన్‌పే ద్వారా బ్యాంకు చెల్లింపులు, గ్యాస్ బుకింగ్, మనీ ట్రాన్స్ఫర్, మొబైల్ రీఛార్జ్ వంటి సేవలన్నీ ఉచితంగా అందేవి. అయితే ఇటీవల పెద్దగా హడావుడి చేయకుండానే యూజర్ ఛార్జీల విధానాన్ని ఫోన్‌పే ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా మొబైల్ రీఛార్జీల విషయంలో వినియోగదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తోంది. బాదుడు ఇలా మొబైల్ రీఛార్జీలకు సంబంధించి రూ.50లోపు ఉన్న రీఛార్జీ సేవలను గతంలోలాగానే ఉచితంగా అందిస్తోంది. కానీ రూ. 50 నుంచి 100ల మధ్యన రీఛార్జ్ చేస్తే ఒక రూపాయి యూజర్ సర్వీస్ ఛార్జ్‌ని వసూలు చేస్తోంది. 100కు మించి ఉన్న రీఛార్జ్‌లకు రెండు రూపాయల వంతున యూజర్ ఛార్జీలుగా ఫోన్‌పే విధించింది. కవరింగ్ మొబైల్ రీఛార్జీ యూజర్ చార్జీలకు సంబంధించిన వివరాలను ఫోన్‌పే పెద్దగా ప్రచారం చేయడం లేదు. పైగా ప్రయోగాత్మకంగా యూజర్ ఛార్జీలు తీసుకుంటున్నాం. కేవలం కొద్ది మంది మాత్రమే యూజర్ ఛార్జీల పరిధిలోకి వస్తున్నారంటూ కవరింగ్ ఇస్తోంది. మార్కెట్ లీడర్ కానీ సెప్టెంబరులో దేశవ్యాప్తంగా ఫోన్‌పే ద్వారా రికార్డు స్థాయిలో 165 కోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. యూపీఏ సర్వీసులు అందిస్తున్న థర్ట్ పార్టీ యాప్‌లలో ఒక్క ఫోన్‌పేనే 40 శాతం వాటాను ఆక్రమించింది. మార్కెట్ లీడర్‌గా స్థానం సుస్థిరం చేసుకునే సమయంలో ఫోన్‌పై యూజర్ ఛార్జీలు వసూలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. కనీసం యూజర్ ఛార్జీలకు సంబంధించి ముందుగా కొంత ప్రచారం చేయాల్సిందని అంటున్నారు. చదవండి:ఇలా చేస్తే రూ.5000 ఉచితం..! -
ఫాస్టాగ్: ప్రయోజనాలెన్నో.. సద్వినియోగం చేసుకుందాం
ఏఎన్‌యూ: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల సమయం, శ్రమ ఆదా చేయడంతోపాటు సులభతరమైన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. దీంతో చాలా టోల్ ప్లాజాలు ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరిగా అమలు చేస్తుండగా, కొన్ని టోల్ ప్లాజాల వద్ద కొంత సడలింపునిచ్చి నగదు లావాదేవీలు జరపుతుండగా, మరికొన్ని పాజాల వద్ద ఫాస్టాగ్ లేని వాహనాలకు జరిమానా రూపంలో అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని వాహన దారులు చెబుతున్నారు. ఫాస్టాగ్ పొందడం ఎలా.. ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద గుర్తింపు పొందిన బ్యాంకులు, వాలెట్ సంస్థలు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు, లేదా ఫాస్టాగ్ సేవలకు అనుమతించిన జాతీయ బ్యాంకుల్లోనూ ఫాస్టాగ్‌ను వాహన దారుడు పొందవచ్చు. ఫాస్టాగ్ అనుమతి ఉన్న బ్యాంకులు, వాలెట్ సంస్థలు.. దేశ వ్యాప్తంగా 22 జాతీయ బ్యాంకులు పలు వాలెట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సేవలకు అనుమతించింది. బ్యాంకుల్లో.. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ, కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సెస్ బ్యాంక్, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సిటీ యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బీఎల్, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్‌లతోపాటు ఎయిర్టెల్, పేటీఎం, ఈక్విటాస్, ఐహెచ్ఎంసీఎల్, పాల్ మర్చెంట్స్ వంటి వాలెట్లలో ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఫాస్టాగ్ పొందేందుకు ఏ పత్రాలు సమర్పించాలి... ఫాస్టాగ్ పొందేందుకు వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన ఆర్సీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను సంబంధిత ధరఖాస్తుకు జత చేయాలి. సంబంధిత సంస్థ లేదా బ్యాంకు కేంద్రం వారు సంబంధిత పత్రాలను పరిశీలించిన వెంటనే ఫాస్టాగ్ జారీ చేస్తారు. రీఛార్జ్ ఎలా.. ఫాస్టార్ రీఛార్జ్‌ను వాహన దారుడు ప్రభుత్వం గుర్తించిన 22 బ్యాంకుల్లో ఏదైనా బ్యాంకులో ఖాతా కలిగి ఉంటే ఆ ఖాతాకు ఫాస్టాగ్‌ను జత చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి ఫాస్టాగ్ ద్వారా టోల్ ప్లాజా వద్ద ఆటోమేటిక్‌గా చెల్లింపులు చేయబడతాయి. లేదా ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ కేంద్రాల ద్వారా ప్రీపెయిడ్ విధానంలో ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. చెల్లింపులు ఎలా జరుగుతాయి.. వాహన దారుడు దాటుటున్న టోల్ ప్లాజా వద్ద నిర్ధేశించిన టారిఫ్‌ను బట్టి ఫాస్టాగ్ ఎకౌంట్ నుంచి నగదు ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. సింగిల్ ప్రయాణమా, అప్ అండ్ డౌన్ కావాలా అనేది చెప్పాల్సినవసరం లేదు. ఒక సారి టోల్ ప్లాజా దాటుతుంటే సింగల్ జర్నీ క్రింద నిర్థేశించిన మొత్తం కట్ అవుతుంది. అదే వాహన దారుడు 24 గంటల లోపు మరలా అదే టోల్ గేట్ నుంచి తిరిగి వెనుకకు వెళితే సింగిల్ ప్రయాణంలో సగం మొత్తం మాత్రమే కట్ అవుతుంది. లోకల్ పాస్ విధానమూ అందుబాటులో... ఫాస్టాగ్ సౌకర్యం ఉన్న వాహన దారుడు తమకు దగ్గర్లోని టోల్ ప్లాజా వద్ద లోకల్ పాస్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వాహనదారుడు ఆ టోల్ ప్లాజా నుంచి నిర్థేశించిన కిలోమీటర్లలోపు ప్రాంతంలో నివసిస్తున్నట్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వాహనం ఆర్సీతోపాటు మూడు నెలల లోపు చెల్లింపులు జరిగిన గ్యాస్ బిల్లు వంటి అడ్రస్ ఫ్రూఫ్ జిరాక్సులను సంబంధిత టోల్ ప్లాజా వద్ద కేంద్రంలో సమర్పించాలి. లోకల్ పాస్ కోసం ఆ టోల్ ప్లాజా నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించాలి. లోకల్ పాస్ ఉన్న వాహనదారుడు నెలలో ఎన్నిసార్లయినా ఆ టోల్‌ప్లాజా నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఐసీఐసీఐ ఫాస్టాగ్ లోకల్ పాస్ వినియోగదారులకు 11 నెలల ఆటో రెన్యువల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పదకొండు నెలల తరువాత మరలా నిర్ధేశిత పత్రాలు సమర్పించి ఆటో రెన్యువల్ పొందవచ్చు. లేదా టోల్ ప్లాజా వద్ద ఉన్న కేంద్రంలో ప్రతి నెలా ఒకటవ తారీఖు కల్లా నిర్ధేశించిన నగదు చెల్లించి మంత్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోరెన్యువల్ లోకల్ పాస్ సౌకర్యం ఉన్న ఫాస్టాగ్ వినియోగదారుడు ప్రతినెలా 27వ తేదీకల్లా తమ ఫాస్టాగ్ ఎకౌంట్లో నిర్ధేశించిన మొత్తం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక వేళ ఆ ఎకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఆటోరెన్యువల్ జరగదు. -
జియో స్పెషల్ ఆఫర్... ఈ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్
మొబైల్ ఇంటర్నెట్ యూసేజీలో విప్లవాత్మక మార్పలకు కారణమైన జియో సంస్థ తన వినియోగదారులకు మరో ఆఫర్ ప్రకటించింది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని పలు రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని ప్రకటించింది. రియలన్స్ జియోకి సంబంధించి మోస్ట్ పాపులర్ ప్లాన్స్‌గా ఉన్న రూ. 249, రూ.555, రూ. 599లపై జియో 20 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే మైజియో యాప్ నుంచే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీఛార్జీ పూర్తయిన వెంటనే క్యాష్‌బ్యాక్ అమౌంట్ ఖాతాలో జమ అవుతాయి. వీటిని తదుపరి రీఛార్జ్ సమయంలో ఉపయోగించుకోవచ్చు. చదవండి : చైనా ఫోన్లు కనిపిస్తే విసిరి కొట్టండి, ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ -
టీవీ రీచార్జ్ : రూ. 1.18 లక్షలు హాంఫట్
బాలానగర్: బ్యాంకు అకౌంట్ల వివరాలు, పిన్ నెంబర్లు, పాస్వర్డ్స్ ఎవరికీ చెప్పొద్దని ఎంత మొత్తుకుంటున్నా, వినియోగదారులు మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును క్షణాల్లో పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఆన్లైన్ ద్వారా టీవీ రీచార్జ్ చేసిన మహిళ రూ.1.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన సంధ్య గత నెల 30న సన్ డైరెక్ట్ రీచార్జ్ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. దీంతో ఆమె గూగూల్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి కనిపించిన నంబర్‌కు ఫోన్ చేసింది. తమ సన్ డెరెక్ట్ రీచార్జ్ కావడం లేదని తెలుపగా టీమ్‌వీవర్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని చేయాలని అవతలి వ్యక్తి చెప్పడంతో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రయత్నించినా కాలేదు. మళ్లీ రీచార్జ్ కావడం లేదని బాధితురాలు చెప్పగా మీ యూనో యాప్ పిన్ నెంబర్, పాస్వర్ట్ చెప్పండి, ఎలా చేయాలో చెబుతానని కోరగా ఆమె చెప్పడంతో ఐదు దఫాలుగా రూ. 1,18,000 ఆమె అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యాయి. మోసపోయినట్లు గ్రహించిన మహిళ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆన్లైన్లో రైల్వే స్మార్ట్ కార్డుల రీచార్జ్ సదుపాయం
సాక్షి, సిటీబ్యూరో: స్మార్ట్‌కార్డు ద్వారా రైల్వే ప్రయాణం చేసేవారు ఇక నుంచి ఆన్లైన్లోనే రీచార్జ్ చేసుకోవచ్చు. వెబ్‌పోర్టల్‌లో యూటీఎస్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకొనేందుకు రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. డిజిటలైజేషన్లో భాగంగా రైల్వే మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అన్రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు క్యూ లైన్లలో నించోవలసిన అవసరం లేకుండా ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లను (ఏటీవీఎం) అందుబాటులోకి తెచ్చా రు. తాజాగా స్మార్ట్‌కార్డు రీచార్జ్ సదుపాయం కల్పించారు. సాధారణంగా ప్రయాణికులు తమ స్మార్ట్ కా ర్డులను రైల్వే బుకింగ్ కౌంటర్లలో మాత్రమే రీచార్జ్ చేసుకోవలసి రావడం వల్ల ప్రతిసారి రైల్వే బుకింగ్ కౌంటర్లకు రావలసి వస్తోంది. తాజాగా ఆన్లైన్ రీచార్జ్ సదుపాయం కల్పించడం వల్ల ఆ ఇబ్బంది తప్పినట్లయింది. ప్రస్తుత కోవిడ్ సమయంలో బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని నివారించేందుకు ఇది ఎంతో దోహదం చేయనుంది. సేవలు ఇలా.... ►ప్రయాణికులు https://www.utsonmobile.indianrail.gov.in వెబ్సైట్లో మొదట నమోదు చేసుకోవాలి. ►మెనూలో ‘స్మార్ట్ కార్డు రీచార్జీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ►డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి అన్ని డిజిటల్ విధానాల ద్వారా చెల్లించవచ్చు. ►అనంతరం ప్రయాణికులు ఏటీవీఎమ్ రీడర్ వద్ద స్మార్టు కార్డులను పెట్టి ‘రీచార్జి స్మార్ట్ కార్డు’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత ఏటీవీఎమ్‌లో ఆన్లైన్ రీచార్జీ వివరాలు వస్తాయి. ఈ మేరకు స్మార్టు కార్డులో రీచార్జ్ అవుతుంది. ►ప్రయాణికులు అన్రిజర్వ్డ్ టికెట్లను, ప్లాట్ఫారం టికెట్లను రైల్వే స్మార్ట్ కార్డుల ద్వారా పొందితే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిల్చోవలసిన అవసరం ఉండదు. ►మొట్టమొదటిసారి స్మార్టు కార్డు పొందడానికి చిరునామ రుజువు, ఇతర అవసరమైన వివరాలను అందజేయవలసి ఉంటుంది. ►ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్ కార్డు రీచార్జి చేసుకోవాలి.


