బంపరాఫర్‌.. ఒక్క రూపాయి రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ | BSNL Rs 1 Plan With 30 Days of Unlimited Calls and 2GB Data More | Sakshi
Sakshi News home page

BSNL: కేవలం రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్‌ కాల్స్.. అదిరిపోయే ఫ్రీడమ్ ఆఫర్

Aug 1 2025 4:15 PM | Updated on Aug 1 2025 4:58 PM

BSNL Rs 1 Plan With 30 Days of Unlimited Calls and 2GB Data More

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం ఒక రూపాయితోనే 30 రోజుల అపరిమిత కాల్స్ అంటూ ట్వీట్ చేసింది.

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ పరిచయం చేసింది. దీని ద్వారా యూజర్ 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. సిమ్ కార్డు కూడా పూర్తిగా ఉచితం కావడం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement