
రక్షాబంధన్‌కు ముందు ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఊరట కలిగించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా రూ .33.50 తగ్గించాయి. కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
కొత్త ధరల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ .1,631.50 కు లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ.1,665గా ఉండేది. వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపుతో క్యాటరింగ్ యూనిట్లు, హోటళ్లు-రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యాపారులకు ఉపశమనం కలుగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ కొత్త రేట్లు
ఢిల్లీ: రూ.1,631.50
కోల్‌కతా: రూ.1734.50
ముంబై: రూ.1582.50
చెన్నై: రూ.1789
హైదరాబాద్: రూ.1,886.50
డొమెస్టిక్ సిలిండర్ ధరలు
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.3 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025 నుండి స్థిరంగా ఉంది. ఇందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. గత నాలుగు నెలలుగా ధరలు పెంచలేదు, తగ్గించలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.853గా ఉంది.