ఏడాది చివరికల్లా 93,918 పాయింట్లకు సెన్సెక్స్‌ | Sensex Poised for 11pc Upside to 93918 by 2026 End | Sakshi
Sakshi News home page

ఏడాది చివరికల్లా 93,918 పాయింట్లకు సెన్సెక్స్‌

Jan 8 2026 2:28 PM | Updated on Jan 8 2026 3:11 PM

Sensex Poised for 11pc Upside to 93918 by 2026 End

బీఎస్‌ఈ ఎక్స్ఛేంజ్‌లోని బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 2026 డిసెంబర్‌ నాటికి 93,918 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ క్లయింట్‌ అసోసియేట్స్‌ అంచనా వేసింది. అంటే సెన్సెక్స్‌ ప్రస్తుత స్థాయి (84,961)తో పోలిస్తే 11% పెరిగే వీలుందని అభిప్రాయపడింది.

‘‘దేశీయ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. కార్పొరేట్‌ ఆదాయాల అవుట్‌లుక్‌ మెరుగ్గానే ఉన్నాయి. అయితే షేర్ల వాల్యుయేషన్లు అధికంగా ఉండటం, అంతర్జాతీయ అనిశి్చతుల కారణంగా ఇన్వెస్టర్లు ‘క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి’ వ్యూహాన్ని అనుసరించవచ్చు. దీంతో ఈ ఏడాది భారతీయ మార్కెట్‌ విస్తృత స్థాయి ర్యాలీలకు స్వస్తి పలికి.., ఎంపిక చేసుకున్న, ఫండమెంటల్‌ ఆధారిత అవకాశాల దిశగా అడుగులు వేయోచ్చు’’ అని సంస్థ రీసెర్చ్‌ హెడ్‌ నితిన్‌ అగర్వాల్‌ తెలిపారు.

రిస్క్‌ అంచనాలను మెరుగుపరుచుకుంటూ.., సరైన డైవర్సిఫికేషన్‌ విధానాలను అనుసరిస్తే ధీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీలు ప్రధాన వనరులుగా కొనసాగుతాయని అగర్వాల్‌ పేర్కొన్నారు.

ఇంకా 2026కి సంబంధించిన క్లయింట్‌ అసోసియేట్స్‌ వార్షిక ఈక్విటీ అంచనా నివేదికలో....

  •     పోర్ట్‌ఫోలియో వైవిద్యీకరణలో బంగారం, వెండి కీలకం. డాలర్‌ బలహీనత, భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాల్లో మార్పుల కారణంగా గతేడాదిలో విలువైన లోహాలు భారీ రాబడులు ఇచ్చాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం డిమాండి పెరిగి, వ్యూహాత్మక పెట్టుబడి సాధనగా పసిడి ప్రాధాన్యం మరింత పెరిగింది. అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు, అమెరికా–చైనా ఉద్రిక్తతలు, వెండిని కూడా కీలక లోహంగా గుర్తించే చర్చల నేపథ్యంలో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి.  

  • భారత్‌ వృద్ధి అవుట్‌లుక్‌ మెరుగ్గానే ఉంది. బలమైన డిమాండ్, తయారీ–సేవల రంగ విస్తరణ, స్థిరమైన జీఎస్‌టీ వసూళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదవ్వొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement