సిమ్‌ బైండింగ్‌పై ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం | Broadband India Forum Objects To Centre’s SIM Binding Rule For WhatsApp, Signal And Telegram | Sakshi
Sakshi News home page

సిమ్‌ బైండింగ్‌పై ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం

Mar 1 2026 10:39 AM | Updated on Mar 1 2026 11:12 AM

SIM Binding Directives Unconstitutional Says Broadband India Forum

న్యూఢిల్లీ: వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం లాంటి యాప్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ సర్వీసులు తప్పనిసరిగా యాక్టివ్‌ సిమ్‌కార్డుతో లింక్‌ అయి ఉండాల్సిందేనంటూ (సిమ్‌ బైండింగ్‌) కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది టెలికమ్యూనికేషన్స్‌ చట్టాన్ని అతిక్రమించడమేనని, రాజ్యాంగవిరుద్ధమని టెలికం శాఖ కార్యదర్శి అమిత్‌ అగ్రవాల్‌కి ఫిబ్రవరి 23న రాసిన లేఖలో వ్యాఖ్యానించింది.

దీని వెనుక గల అసలు కారణాలను తాము అర్థం చేసుకోగలమని, కాకపోతే నియంత్రణ సంస్థ జోక్యమనేది నిర్దిష్ట చట్టపరిధికి లోబడి ఉండాలని కోరుతున్నామని పేర్కొంది. మెటా, గూగుల్‌ లాంటి టెక్‌ దిగ్గజాలన్నీ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరంలో సభ్యులుగా ఉన్నాయి. దేశ భద్రత రీత్యా సిమ్‌ బైండింగ్‌ నిబంధనలను మార్చే ప్రసక్తి లేదంటూ కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన నేపథ్యంలో బీఐఎఫ్‌ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement