ఏఐప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ నుంచి నోవాపాడ్స్‌ | AIPlus Expands Into AIoT Segment Launches NovaPods And Nova Watch, Pulse 2 and Nova 2 Smartphones Launched | Sakshi
Sakshi News home page

ఏఐప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ నుంచి నోవాపాడ్స్‌

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 12:48 PM

AIPlus Expands into AIoT Segment Launches NovaPods and Nova Watch

న్యూఢిల్లీ: ఏఐప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ తాజాగా ఏఐఓటీ విభాగంలోకి కార్యకలాపాలు విస్తరించింది. నోవాపాడ్స్, నోవావాచ్‌ని ప్రవేశపెట్టింది. ఇవి ఫిబ్రవరి 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. నోవాపాడ్స్‌ ధర రూ. 699 నుంచి, నోవా వాచ్‌ ధర రూ. 2,499 నుంచి ప్రారంభమవుతుంది.

అలాగే కొత్త తరం స్మార్ట్‌ఫోన్లయిన పల్స్‌ 2, నోవా 2 సిరీస్‌ని కూడా కంపెనీ ప్రకటించింది. మార్చ్‌ 2న పల్స్‌ 2ని, ఆ తర్వాత నోవా 2 సిరీస్‌ని ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. పల్స్‌ 2లో 50 ఎంపీ ఏఐ డ్యుయల్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 16 తదితర ఫీచర్లు ఉంటాయని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement