లైంగిక కుంభకోణం నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) కేసులోబాధితురాలు రినా ఓహ్ (Rina Oh) ఎదుర్కొన్న చేదు అనుభవాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా బ్రిటీష్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్ట్ తరువాత లైంగిక వేధింపుల పర్వంపై 40 ఏళ్ల రీనా విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఎప్‌స్టీన్ లాంటిపవర్‌పుల్ వ్యక్తి సామాన్యులను, మానసికంగా బలహీనంగా ఉన్నవారిని ఎలా లోబరుచుకుంటారో, ఎలాంటి వేధింపులకు గురిచేస్తారో వివరించింది.
21 ఏళ్ల వయసులో ఉన్న తాను జెఫ్రీ ఎపిస్టీన్ వల్ల తాను అనుభవించిన నరకాన్ని ,ప్రస్తుత పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 1990ల చివరలో రీనా 21 ఏళ్ల ఆర్ట్ స్టూడెంట్ ఉన్నప్పుడు, చిన్నతనంలోనే వేధింపులు గురికావడం, భయం, ఒంటరితనం మగ్గుతున్న తనకు ఎప్‌స్టీన్ ఒక ‘లైఫ్ లైన్’ లా కనిపించాడని, అయితే తన మౌనాన్ని అతను స్వార్థానికి వాడుకున్నాడని చెప్పింది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నపుడు తనకు ఎటువంటి షరతులు లేని స్కాలర్‌షిప్ ఇస్తానని నమ్మబలికి, ఫ్లోరిడాలోని ఎప్‌స్టీన్ ఎస్టేట్ లోపల, తనను బంధించారని, డబ్బు, రవాణా సౌకర్యం లేక తాను అక్కడ చిక్కుకు పోయానని వాపోయింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని తనను బెదిరించారని తెలిపింది.
ఆమె అతన్ని కలవడానికి నిరాకరించినప్పుడు, "నువ్వు విధేయత చూపడం లేదు" అని చెప్పి ఆ ఆర్థిక సహాయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 21 వయస్సులోనే ముసలి దానిలా ఉన్నావని అవమానించాడని గుర్తు చేసుకుంది. తనకున్న రాజకీయ పలుకుబడితో (వాషింగ్టన్‌లో అందరూ తెలుసని చెప్పి) ఆమెను భయపెట్టాడు. తన తల్లిదండ్రుల వివరాలు కూడా అతనికి తెలుసని, మాట్లాడితే హాని చేస్తాడనే భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయానని చెప్పింది. ఎప్‌స్టీన్ డార్క్‌సీక్రెట్స్ అన్నీ తనకు చెప్పాడని, బాధితులను కేవలం శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా కృంగదీసేవాడని, దాని నుండి కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతడొక ర్యాగింగ్ నార్సిసిస్ట్"గా అభివర్ణించింది.
అంతేకాదు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరున్న ప్రతి ఒక్కరినీ,వారు ఎంతటి శక్తివంతమైన వారైనా (రాజకీయ నాయకులు లేదా ధనవంతులు), విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే అమెరికా ప్రభుత్వం ఈ కేసులో తీసుకుంటున్న చర్యలు సరిపోవని ఆమె అభిప్రాయపడింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అన్నీ తెలుసు, ఆయన పేరు కూడా ఫైళ్లలో ఉంది, కాబట్టి ట్రంప్ కచ్చితంగా నిజాలు చెప్పాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆండ్రూ అరెస్టుపై స్పందన
ఎప్‌స్టీన్ కేసులో మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్ (Prince Andrew) అరెస్టు కావడంపై స్పందిస్తూ, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, ఇది ఒక ఉదాహరణగా నిలవాలని ఆమె పేర్కొంది. ఈ వ్యవహారంలోయూరప్ దేశాలు వేగంగా స్పందిస్తున్నాయని, కానీ అమెరికా ప్రభుత్వం జవాబుదారీతనం వహించకుండా తప్పించుకుంటోందని ఆమె విమర్శించారు.
కాగా ఎప్‌స్టీన్ వేధింపుల నుండి బయటపడిన రినా ఓహ్ఆత్మగౌరవం కోసం పోరాడుతోంది. తనను తప్పుగా చిత్రీకరించిన వారిపై కోర్టులో కేసులు వేశారు. 2 మిలియన్లకు పైగా ఉన్న ఎప్‌స్టీన్ కేసు దర్యాప్తు ఫైళ్లను బహిరంగపరచాలని ఆమె కోరుతున్నారు.
ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి


