క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుఉన్నపుడు కేవలం ఓవర్లు పరుగులు, బాల్స్, వికెట్స్, విజయాలు, రికార్డులు మరికొంతమంది కూడా విశేషంగా మారిపోతుంటారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా అవతరిస్తారు. ఇటీవల భారతదేశం , అమెరికా మధ్య జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాయ్‌లో ఇలాంటి విశేషమే చోటు చేసుకుంది.
ఒక అందాల ముందు గుమ్మ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ 3వేల 3.77 లక్షలకు పెరిగిందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ICC పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తళుక్కున మెరిసింది ఐరా రావత్ (Aira Rawat).
ఆ క్షణం ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. ఇండియా vs USA మ్యాచ్ సందర్భంగా కెమెరా ప్యాన్ అవుతూన్న సందర్భంలో ఒక యువతి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది.
అంతే నిమిషాల్లోనే, ఇంటర్నెట్ ఆమె ఫోటోలు, వీడియోలతో నిండిపోయింది. మ్యాచ్ రోజున ఆమె నీలం రంగు టీ-షర్టు, తెల్లటి షార్ట్ స్కర్ట్ ధరించి స్టేడియంలో సందడి చేసింది.


