breaking news
Social Media
-
పాములు, చేపలు రోడ్డెక్కాయి!
చరిత్రలోనే ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా.. రోడ్లపై అడుగు పెట్టాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్లు, అపార్ట్మెంట్ ప్రాంగణాలు, మార్కెట్లు నీట మునగడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎటు చూసినా నీరే కనిపిస్తుండగా.. ఆ వరద నీటిలో పాములు, చేపలు తేలుతూ కనిపించడం మరింత కలవరపెడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఈ భయానక పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బ్యాంకాక్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్లు కిటికీల వరకు, మరికొన్ని చోట్ల దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో పార్క్ చేసిన వాహనాల్లో పైకప్పులు మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడింది. వరద నీటిలో పాములు, చేపలు సైతం కొట్టుకొస్తూ కనిపించడంతో స్థానికులు మరింత ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోల్లో వీటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే అదనుగా కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతో మరింత బెంబేలెత్తిస్తున్నారు.📍Bangkok ,Thailand 🇹🇭 "Bangkok is flooded, even the fish 🐟 🐠 🐟 are on the streets 🛣️ ! Before, traffic jams were caused by too many cars, now you might still need to watch out for fish in the water"#bangkok #thailand #heavyrain #climatechange #Elnino #flooding… pic.twitter.com/p6b1x2KWLp— sustainme.in® (@sustainme_in) September 28, 2026 Banjir di Bangkok pic.twitter.com/zpQzpWdcqd— @ (@anthraxxxx) September 26, 2026ప్రధాన రహదారులపైనా భారీగా నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి జెట్స్కీ(బోట్ తరహా వాహనం)తో వరద ముంచెత్తిన రోడ్డుపై దూసుకెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థాయ్ పోలీసులు చర్యలు తీసుకుని అతడిని అరెస్టు చేశారు.थाईलैंड में भीषण बाढ़ की वजह से सड़कों पर विशालकाय रेटिकुलेटेड पायथन तौर रहे हैं. किसी जानवर को निगलने के कारण अजगर का पेट काफी फूला हुआ था, जिसके चलते यह पानी में ठीक से तैर या हिल-डुल नहीं पा रहा था.दूसरी तरफ घरों के भीतर भी जहरीले सांप घुस रहे हैं, pic.twitter.com/2AhvcpdbZ1— Ruby Arun रूबी अरुण (@arunruby08) September 26, 2026మీటర్ లోతు నీటిలో.. బ్యాంకాక్‌లోని బాంగ్ కాపి ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని చోట్ల వరద నీరు దాదాపు మీటర్ వరకు చేరింది. అయినప్పటికీ వ్యాపారులు దుకాణాలు మూసివేయకుండా వినూత్నంగా వ్యాపారం కొనసాగించారు. ప్లాస్టిక్ క్రేట్లు, ఫోమ్ బాక్సులు, బేసిన్లను నీటిపై తేలేలా చేసి వాటిలో కూరగాయలు, చేపలు, మాంసం, ఇతర నిత్యావసరాలను విక్రయించారు. ప్రజలు నీటిలోనే నడుచుకుంటూ సరుకులు కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్ మొత్తం ఓ ‘ఫ్లోటింగ్ మార్కెట్’ను తలపించింది.7 లక్షల మందిపై ప్రభావంవారాంతపు వరదలకు బ్యాంకాక్‌లో 3.29 లక్షల కుటుంబాలు.. దాదాపు 7 లక్షల మంది ప్రభావితమైనట్లు నగర అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. అయితే సోమవారం నుంచి వర్షం కొంత తగ్గడంతో అధికారులు డ్రైనేజీ, నీటి తొలగింపు చర్యలను వేగవంతం చేశారు.తాజా అధికారిక సమాచారం ప్రకారం.. బ్యాంకాక్‌తో పాటు థాయ్‌లాండ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. సెప్టెంబర్ 28 నాటికి దేశవ్యాప్తంగా 27 ప్రావిన్సులు, బ్యాంకాక్‌లో వరదల ప్రభావం ఉన్నట్లు థాయ్ ప్రభుత్వం తెలిపింది. దాదాపు 5.76 లక్షల కుటుంబాలు, 17.93 లక్షల మంది ప్రభావితమైనట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతుండగా.. మరికొన్ని చోట్ల ఇంకా పెరుగుతున్నాయి.విమానాశ్రయంలో భారీగా లగేజీలు..వరద ప్రభావం బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయానికీ తాకింది. వరదల కారణంగా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది విధులకు చేరుకోవడం కష్టమైంది. దీంతో బ్యాగేజీ నిర్వహణలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 6 వేల బ్యాగేజీలు ఆలస్యమైనట్లు సమాచారం. కొన్ని బ్యాగేజీ ట్రాలీలు కూడా పనిచేయకపోవడంతో టెర్మినల్‌లో లగేజీ భారీగా పేరుకుపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు థాయ్ ఎయిర్వేస్ కార్యాలయ సిబ్బంది, మేనేజర్లు, సైనిక సిబ్బందిని రంగంలోకి దించింది. ప్రయాణికులకు నేరుగా వాళ్ల ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.సెలవులు ప్రకటించిన ప్రభుత్వంవరదల తీవ్రత దృష్ట్యా థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్, పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సోమ, మంగళవారాల్లో ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు, ఆసుపత్రులు తదితరాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.వర్షం తగ్గినా.. ముప్పు మాత్రం!తాజా పరిస్థితిలో బ్యాంకాక్‌లో వర్షం కొంత తగ్గుముఖం పట్టింది. ప్రధాన కాలువల్లో నీటిమట్టాలను తగ్గించి.. రోడ్లు, నివాస ప్రాంతాల్లోని నీటిని బయటకు పంపేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అయితే తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. మరోవైపు థాయ్ వాతావరణ శాఖ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, నదులు పొంగిపొర్లడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది.ఇదీ చదవండి: ఇరాన్ ఎట్టకేలకు దిగొచ్చిందా? -
సోషల్ మీడియా 'సొంత డబ్బా' కోసమేనా?
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ‘సోషల్ మీడియా వార్’కు తెర లేపింది. నిజానికి మీడియాను వాడుకోవడంలో ఆయనను మించిన రాజకీయ నాయకుడు భారత దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో... సోషల్ మీడియాను ప్రభుత్వ పథకాల ప్రచారానికి వాడుకోవాలని బాబు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది! ప్రభుత్వాలు తమ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార సాధనాలను ఉపయోగించు కోవడం కొత్తేమీ కాదు. అయితే సోషల్ మీడియా యుగంలో ఆ ప్రచారానికి కొత్త రూపం వచ్చింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికల ద్వారా ప్రజలను చేరుకోగలిగేఇన్ ఫ్లుయెన్సర్లను అధికారికంగా ఎంప్యానెల్ చేసి, వారికి పారితో షికం చెల్లించే విధానాన్ని ప్రభుత్వం తాజాగా కేబినెట్ ఆమోదంతో ముందుకు తీసుకువచ్చింది.ప్రభుత్వ వివరణ ప్రకారం సంక్షేమ పథకాలు, మౌలిక వస తులు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ఉద్దేశం. యువత ఎక్కువగా ఉపయోగించే డిజిటల్ వేదికల ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాల సమాచారం ప్రజలకు చేరడం ప్రయోజనకరమే కావచ్చు. కానీ ప్రజాధనంతో ఏర్పడే ఏ ప్రచార వ్యవస్థకైనా పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి. ఎందుకంటే ఇక్కడే ఒక సున్నితమైన రేఖ ఉంది. అది ప్రభుత్వ సమాచార ప్రచారానికి– అధికార పార్టీ రాజకీయ ప్రచారానికీ మధ్య రేఖ. ఆ రేఖ చెరిగిపోకుండా చూడటం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. ప్రచార మాధ్యమం రాజకీయ పరిణామాలను ప్రభావితం చేయగల మహత్తర శక్తి.పారదర్శకత ముఖ్యంఒక యూట్యూబ్ వీడియో, ఒక రీల్, ఒక వైరల్ పోస్టు కొన్ని గంటల్లోనే లక్షల మందిని చేరగలదు. అందుకే నేటి రాజకీయ ప్రచా రంలో సోషల్ మీడియా అత్యంత ప్రభావశీలమైన సాధనాల్లో ఒకటిగా మారింది. అందుకే పారదర్శకంగా ప్రభుత్వం ఇన్‌ఫ్లుయెన్స ర్లను అధికారికంగా ఎంప్యానెల్ చేయాలి. ఎవరెవరిని ఎంపిక చేశారు? ఎంతమంది ఉన్నారు? వారి ఛానళ్లు, ఫాలోవర్ల సంఖ్య ఎంత? ఏ కేటగిరీలో ఎంపిక చేశారు? ఎంత పారితోషికం నిర్ణయించారు? ఏ ప్రభుత్వ కార్యక్రమం కోసం ఎంత చెల్లించారు?– ఈ వివరాలన్నీ ప్రజల ముందుంచాలి. ప్రభుత్వం ఒక పబ్లిక్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అది ముఖ్యమంత్రి వ్యక్తిగత డబ్బు కాదు, ఆయన డబ్బా కొట్టడానికి... అది ప్రజల డబ్బు. ప్రజల కోసమే వెచ్చించాలి. ప్రస్తుతం ప్రకటించిన విధానంలో ఫాలోవర్ల స్థాయిని బట్టి వేర్వేరు కేటగిరీలకు చెల్లింపులు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.ప్రచారంలో పారదర్శకత ముఖ్యం. ప్రజలు, జర్నలిస్టులు, ప్రతి పక్షాలు, పౌరసమాజం ఆ వ్యవస్థను పరిశీలించాలి. ప్రభుత్వ పథ కాల ప్రచారం ఎక్కడితో ముగుస్తోంది? రాజకీయ ప్రచారం ఎక్కడ మొదలవుతోంది? అన్నది ప్రశ్నించగలగాలి. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఒక అధికారిక విధానంగా, ఎంప్యానెల్మెంట్, చెల్లింపుల వ్యవస్థతో ముందుకు తీసుకురావడం వల్ల పారదర్శకతపై చర్చ మరింత అవసరమైంది. ప్రభుత్వానికి ప్రచారం అవసరం. ప్రజలకు సమాచారం అవసరం. కానీ ప్రజాస్వామ్యానికి అంతకంటే ఎక్కువగా పారదర్శ కత అవసరం. సోషల్ మీడియా నేటి రాజకీయ బ్రహ్మాస్త్రమైతే, దాన్ని ప్రయోగించే వ్యవస్థకు ప్రజాస్వామ్య నియంత్రణ కూడా ఉండాలి. అందుకే ప్రశ్న ఒక్కటే... ఇన్ ఫ్లుయెన్సర్లను ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఇన్ ఫ్లుయెన్సర్లకే ‘ఇన్ ఫ్లుయెన్సర్’ ఎవరు?– వీరేంద్ర కాపర్తి ‘ సీనియర్ జర్నలిస్ట్ -
8 గంటల పనికి 9 గంటలు ఎందుకు? ఆఫీసుకు ఎందుకు రావాలి?
ఇంట్లో నుంచే ఉద్యోగులు సమయానికి పని పూర్తి చేస్తూ ఆశించిన ఫలితాలు అందిస్తున్నప్పుడు వారిని ఆఫీసుకు పిలవాల్సిన అవసరం ఏముందని ఆకేత్ పంచాల్ అనే నెటిజన్ ప్రశ్నించారు. కార్యాలయానికి వెళ్లేందుకు ఉద్యోగులు ప్రయాణంలో వెచ్చించే సమయం, ఉత్పాదకతపై చర్చను ఆయన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా తెరపైకి తీసుకొచ్చారు. పని ఎక్కడి నుంచి జరుగుతుందన్నదానికంటే ఉద్యోగి అందిస్తున్న ఫలితాలపై సంస్థలు దృష్టి పెట్టాలని పంచాల్ వాదించారు. “మిత్రమా, ఇంటి నుంచి పని జరుగుతుంటే ఉద్యోగి కార్యాలయంలో భౌతికంగా ఎందుకు ఉండాలి? మీకు ఉత్పాదకత కావాలి కదా? వారు దానిని అందిస్తున్నారు. తీసుకోండి మిత్రమా. కేవలం కుర్చీ ఉన్న ప్రదేశాన్ని మార్చడం వల్ల మీకు ఏం లాభం?” అని ఆయన ప్రశ్నించారు.ఉద్యోగి 8 గంటల పనిని 8 గంటల్లోనే పూర్తి చేస్తున్నప్పుడు, మరో గంటను రాకపోకల్లో ఎందుకు వెచ్చించాలంటూ ఆయన ప్రశ్నించారు. “ఒక ఉద్యోగి 8 గంటల పనిని 8 గంటల్లో పూర్తి చేస్తుంటే, అతడిని ఒక గంట ట్రాఫిక్‌లో ప్రయాణించేలా ఎందుకు చేయాలి? కార్యాలయానికి పిలిస్తే మీకు ఏం లభిస్తుంది? మారేది అతడి శరీరం ఉన్న ప్రదేశం మాత్రమే, అతడి పని ఫలితం కాదు” అని అన్నారు.ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగి సామర్థ్యం లేదా ఉత్పాదకత తప్పనిసరిగా తగ్గిపోదని పంచాల్ పేర్కొన్నారు. “ఉద్యోగి సమర్థంగా పనిచేస్తున్నాడు, గడువుల్లో పని పూర్తి చేస్తున్నాడు, ఉత్పాదకంగా ఉన్నాడు. తేడా ఒక్కటే.. బల్ల, కుర్చీపై కూర్చొని చేయాల్సిన పనిని సోఫాపై కూర్చొని చేస్తున్నాడు. పని మాత్రం జరుగుతోంది కదా?” అని అన్నారు. సంస్థ కార్యకలాపాలు కొనసాగడానికి, వ్యాపారం వృద్ధి చెందడానికి అవసరమైన సహకారం ఉద్యోగులు అందిస్తున్నప్పుడు వారి భౌతిక స్థానం ప్రధాన అంశం కాకూడదని ఆయన అన్నారు. “సంస్థ ప్రక్రియను కొనసాగించడానికి, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సినదంతా వారికి ఇప్పటికే లభిస్తోంది” అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలిఈ వీడియోపై కొందరు సామాజిక మాధ్యమ యూజర్లు ఆయన వాదనతో ఏకీభవించారు. “అతను చెప్పింది సరైనదే”, “పని ఎక్కడ జరిగినా పని పనియే”, “అందుకే ప్రజలు ఇంటి నుంచి పనిని ఇష్టపడతారు”, “ప్రతి ఉద్యోగానికి కార్యాలయం అవసరం లేదు” అంటూ వ్యాఖ్యలు చేశారు. View this post on Instagram A post shared by Aaket (@aaketpanchal) -
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి ఆత్మహత్య
భోపాల్ : ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నారు. తన కంటెంట్‌తో లక్షల మంది ఫాలోవర్స్,మిలియన్ల వ్యూస్‌తో ఆకట్టుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్యని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. డైమండ్ స్టేట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీ జిల్లాలోని భుసా మోడ్ ప్రాంతానికి చెందిన నిధి తివారీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సుపరిచితురాలు. ఆమెను సోషల్ మీడియాలో 16లక్షల మందికిపైగా ఫాలో అవుతుంటారు. వారిలో ఇన్స్టాగ్రామ్ యూజర్లు 7లక్షల మంది ఉండగా.. 9లక్షల మంది మెటా ఫాలోవర్స్ ఉన్నారు.ఇక ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే వీడియోలకు మిలియన్ల వ్యూస్‌తో పాటు కామెంట్లతో ఆడియెన్స్‌కు దగ్గరవుతుంటారు. 2024 మిస్ ప్రెటీ ఇండియా అవార్డును సైతం దక్కించుకున్నారు. ఆ అవార్డే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. మోడలింగ్‌లో, యాక్టర్‌గా రాణించాలనే కలలు కన్నారు. ఆ దిశగా అడుగులు కూడా వేశారు. వెండితెర మినహాయించి మోడల్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా,సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కెరియర్ను కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నారని నిధి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిధి మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిధి ఆత్మహత్యకు ముందు ఆమె మాట్లాడినఫోన్ సంభాషణలు,మరణానికి దారి తీసిన కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న మార్వా పోలిస్‌స్టేషన్ ఇన్ ఛార్జ్ జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు.నిధి అగర్వాల్ మరణానికి గల కారణాల్ని విశ్లేషించేందుకు ఫోన్ కాల్ రికార్డ్స్‌ను, కుటుంబ సభ్యుల నుంచి సమాచారం,సేకరించిన ఇతర ఆధారాల్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇక నిధి మరణ వార్తపై నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణ వార్త సోషల్ మీడియాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకప్పుడు ఆమె రూపం, ఆత్మవిశ్వాసం, విజయాలను ప్రశంసిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.ఇదీ చదవండి : సింగం పోలీస్.. నిందితుల కోసం 40 కిలోమీటర్లు వేటాడాడు! -
సరిపోదా.. రెండు శనివారాలు?
మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంకు సమ్మె వాయిదా పడటంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సమ్మె వాయిదా చర్చల్లో మరో అంశం తెరపైకి వచ్చింది. బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం అమల్లోకి వస్తే.. ప్రస్తుతం పనిచేస్తున్న శనివారాలు కూడా సెలవులుగా మారనున్నాయి. దీంతో ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థపై ఓ రకమైన అభిప్రాయంతో ఉన్న ఖాతాదారుడికి మరింత అసహనం పెరుగుతోంది. ‘నెలలో రెండు శనివారాలు సెలవే కదా.. మిగిలిన రోజుల్లో బంద్ ఉంటే మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నాడు..ప్రస్తుతం ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు అధికారికంగా సెలవు ఉంటోంది. మొదటి, మూడో, ఒక్కోసారి ఐదో శనివారాల్లో శాఖలు పనిచేస్తున్నాయి. వారంలో ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలైతే ఈ శనివారాలు కూడా సెలవే కానుంది. అంటే.. నెలలో అన్ని శనివారాల్లోనూ బ్యాంకు బ్రాంచ్ తలుపులు మూసే పరిస్థితి. ప్రస్తుతానికి దీనిపైనే చర్చించేందుకు ఐబీఏ, యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఆరోజే సమయం ఉన్నవారికి?ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా వారంలో మిగిలిన రోజుల్లో పని ఒత్తిడి ఉండేవారికి శనివారం బ్యాంకు పనులు చక్కబెట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఖాతాలో మార్పులు, కేవైసీ, డాక్యుమెంటేషన్, నగదు లావాదేవీలు, రుణాలకు సంబంధించిన కొన్ని పనులు వంటి వాటి కోసం బ్రాంచ్‌కు వెళ్లాల్సి వస్తే.. పనిచేసే శనివారం వారికి మరో అవకాశం.ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకపోతే? బ్యాంకు పని కోసం సెలవు పెట్టుకోవాలి.. లేదంటే మరో పని రోజు దొరికే వరకు ఆగాలి. ఇప్పటికే బ్రాంచ్ పని వేళలు, కౌంటర్ సమయాలు, రద్దీ కారణంగా బ్యాంకు పనులు చక్కబెట్టుకోవడం కష్టంగా ఉంటే.. పనిచేసే శనివారం కూడా అందుబాటులో లేకపోవడం ఖాతాదారులకు అదనపు ఇబ్బందే. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, రోజువారీ పనుల్లో బిజీగా ఉండేవారికి శనివారం దొరికే ఆ ఒక్క అవకాశం కూడా కీలకమే.అక్కడ మరింత ఘోరం!ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చు. పట్టణాలు, నగరాలతో పోలిస్తే అక్కడ బ్యాంకింగ్ శాఖలు, సిబ్బంది, ప్రత్యామ్నాయ సేవల అందుబాటు పరిమితంగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి. దీంతో బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనుల కోసం అందుబాటులో ఉన్న పని రోజుల్లోనే సమయం కేటాయించడం కస్టమర్లకు మరింత కష్టంగా మారొచ్చు. దూర ప్రాంతాల నుంచి బ్యాంకుకు వచ్చే వారికి శనివారం లభించే అదనపు అవకాశం పోతే.. తదుపరి పని రోజు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి రావొచ్చు.డిజిటల్ బ్యాంకింగ్ ఉన్నా..యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి సేవలు కొనసాగుతాయి. కాబట్టి రోజువారీ డిజిటల్ లావాదేవీలకు పెద్దగా అంతరాయం ఉండకపోవచ్చు. కానీ ప్రతి పని మొబైల్లోనే పూర్తయ్యే పరిస్థితి లేదు. బ్రాంచ్‌కు తప్పనిసరిగా వెళ్లాల్సిన పనుల విషయంలో మాత్రం కస్టమర్‌కు అందుబాటులో ఉండే ఒక రోజు తగ్గుతుంది.ముఖ్యంగా శనివారం–ఆదివారం వరుసగా సెలవులు ఉండటంతో పాటు మధ్యలో మరో సెలవు వస్తే.. బ్రాంచ్ సేవలకు గ్యాప్ మరింత పెరగొచ్చు. అత్యవసరంగా బ్రాంచ్ సేవ అవసరమైనప్పుడు కస్టమర్లు తదుపరి పని రోజు వరకు వేచి చూడాల్సి రావచ్చు.ఉద్యోగులకు సరే.. కస్టమర్లకు?‘‘మాతో బలవంతంగా ఆదివారం పని చేయిస్తారా? దీనిని ఖండిస్తూ మరోరోజు సమ్మె చేపడతాం’’ అంటూ బ్లాక్ సండే పేరిట నిన్న విధులు నిర్వర్తించిన బ్యాంకింగ్ ఉద్యోగులు ఇప్పుడు రగిలిపోతున్నారు. మరి ఇలాంటివాళ్లు శనివారాలను సెలవుగా తీసుకున్న తర్వాత.. కస్టమర్ల కోసం ఒక పని రోజులో కాసేపు అదనంగా పనిచేయడానికి సిద్ధమవుతారా? అన్నదే ఇప్పుడు ఖాతాదారుల ప్రశ్న.ఐదు రోజుల బ్యాంకింగ్ విధానంతో ఉద్యోగులకు వారానికి రెండు రోజుల సెలవు లభిస్తుంది. అయితే తగ్గే బ్రాంచ్ సేవల రోజును కస్టమర్లకు ఎలా భర్తీ చేస్తారన్నదే అసలు విషయం. మిగిలిన రోజుల్లో పని గంటలు పెంచి సేవల లోటును భర్తీ చేస్తామని చెబుతున్నా.. ఇప్పటికే పని రోజుల్లోనే బ్రాంచ్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న పరిస్థితుల్లో మరో రోజు తగ్గితే ఖాతాదారుల కష్టాలు మరింత పెరగొచ్చు. ఉద్యోగుల సౌలభ్యం కోసం ఒక అదనపు సెలవు.. అదే సమయంలో కస్టమర్లకు ఒక పని రోజు తక్కువ. మరి ఈ లెక్కలో ఖాతాదారుడి సౌలభ్యం ఎక్కడ?.ఇదీ చదవండి: భారత్‌కు సరికొత్త సంక్షోభం! ఈసారి.. -
‘రేప్ జరగలేదు’ అన్నారు.. ఆ వెంటనే అసలు ట్విస్ట్!
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో రేప్ ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందంటూ వచ్చిన ప్రచారంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో విధ్వంసం, పోలీసు వాహనాల ధ్వంసం, జాతీయ రహదారి దిగ్బంధంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఓ వీడియో విడుదల చేసింది. అందులో సంబంధిత హాస్టల్ గదిలో ఉంటున్న ముగ్గురు విద్యార్థినులు.. ‘మా గదిలో అలాంటి ఘటన ఏదీ జరగలేదు’ అంటూ స్పష్టం చేశారు. అయితే ఆ వీడియో తర్వాత వెలుగులోకి వచ్చిన మరో వీడియోతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.ఎల్పీయూ గర్ల్స్ హాస్టల్-3లోని 504వ గదిలో ఉంటున్న ముగ్గురు విద్యార్థినులను యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ మోనికా గులాటి విడుదల చేసిన వీడియోలో చూపించారు. తమ గదిలో గత రెండు నెలలుగా ఉంటున్నామని, అక్కడ ఎలాంటి అఘాయిత్యం జరగలేదని విద్యార్థినులు తెలిపారు. పోలీసులు, ఇతర విద్యార్థులు తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.అయితే ఆ తర్వాత అదే విద్యార్థినులు మరో వీడియోలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. యూనివర్సిటీ అధికారులు తమకు ఏం చెప్పాలో ముందుగానే సూచించారని, తాము అదే విషయాలను చెప్పామని వారు ఆరోపించారు. తమ అనుమతి లేకుండానే వీడియోలోని కొంత భాగాన్ని కట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారని చెప్పారు. తమ సమ్మతి తీసుకోలేదని, దాంతో ఇప్పుడు తాము అనవసరమైన వేధింపులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.అసలు రచ్చ ఎక్కడ మొదలైంది?మూడు రోజుల క్రితం ఓ మహిళా విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలతో గర్ల్స్ హాస్టల్-3 సమీపంలో విద్యార్థుల ఆందోళన మొదలైంది. ఓ ప్లంబర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, హాస్టల్ వార్డెన్‌కు విషయం తెలిసినా చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపించారు.ఆ విద్యార్థిని అనంతరం ఇంటికి వెళ్లిపోయిందని, ఆమె రూమ్మేట్ ఇతర విద్యార్థులకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పిందని కొందరు విద్యార్థులు పేర్కొన్నారు.జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా మాట్లాడుతూ.. విద్యార్థులు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు చేపట్టామని, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డులను పరిశీలిస్తామని చెప్పారు.రోడ్డెక్కిన వేలాది మంది..ఆరోపణల నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఉదయం విద్యార్థులు జలంధర్–ఫగ్వారా జాతీయ రహదారి-44ను దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.పోలీసుల ప్రకారం.. కొందరు ఆందోళనకారులు పోలీసులపై వాటర్ బాటిళ్లు విసిరారు. అనంతరం పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. దీంతో ఆందోళనకారులు క్యాంపస్‌లోకి వెళ్లి పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. రెండు పోలీసు వాహనాలకు నిప్పంటించగా, మరో నాలుగు నుంచి ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.ఆరోపణలను ఖండించిన వర్సిటీమరోవైపు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మాత్రం క్యాంపస్‌లో రేప్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నవన్నీ తప్పుడు, నిరాధార, కల్పిత పుకార్లని రిజిస్ట్రార్ మోనికా గులాటి పేర్కొన్నారు.కొంతమంది ఉద్దేశపూర్వకంగా యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, ఆందోళనలకు దూరంగా ఉండాలని యూనివర్సిటీ సూచించింది.కేసు నమోదు.. SIT దర్యాప్తుఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో ఓ అనుమానితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే వాస్తవాలు వెల్లడవుతాయని అధికారులు స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. సుమారు 15 రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు డీఐజీ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం తేలితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.పది రోజులు క్లాసులు బంద్క్యాంపస్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ 28 నుంచి 10 రోజుల పాటు రెగ్యులర్ తరగతులను నిలిపివేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. మిడ్‌టర్మ్ పరీక్షలను కూడా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాయిదా వేసింది.విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి తమ స్వస్థలాలకు వెళ్లవచ్చని యూనివర్సిటీ తెలిపింది. క్యాంపస్‌లోనే ఉండేవారు హాస్టళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని సూచించింది.ఇదీ చదవండి: ఇదేం అరకోర చర్యలు సర్? -
ఆ రోజే నిజమైన డాటర్స్ డే
‘‘ఆడవాళ్లకు నిజమైన స్వాతంత్య్రం అంటే నేను నమ్మేది ఏంటంటే... ఒక ఆడపిల్ల రాత్రి పూట ఒంటరిగా నడవగలిగిన రోజు, చీకటి పడ్డాక పార్కులో కూర్చోగలిగిన రోజు, తనకు నచ్చిన దుస్తులు ధరించగలిగిన రోజు, ఎలాంటి భయం లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించగలిగిన రోజు, అలానే పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని ఆలోచించని రోజు... నిజమైన ‘డాటర్స్ డే’. ఆ రోజునే మనం నిజమైన డాటర్స్ డేని జరుపుకోవాలి’’ అని కృతీ సనన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆదివారం ‘డాటర్స్ డే’ని పురస్కరించుకుని ఆమె ఈ విధంగా అన్నారు. ఇంకా సమాజంలో ఆడపిల్లల భద్రత గురించి ఆమె షేర్ చేసుకున్న కొన్ని విషయాలు ఈ విధంగా... ‘‘మీ కూతురు మీకు ఫోన్ చేసి ‘నన్ను కొందరు పురుషులు వెంబడిస్తున్నట్లు అనిపిస్తోంది’ అని చెబుతున్నట్లు ఊహించుకోండి, రాత్రిపూట ఒంటరిగా నడుస్తూ, భయంతో వెనక్కి తిరిగి చూసుకోవడం... ఇంటికి చేరేలోపే మీ కూతురి ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోవడం... ఇలాంటి పరిస్థితులను ఒక్కసారి ఊహించుకుని చూడండి... వీటి గురించి లోతుగా ఆలోచించండి. అప్పుడు మన ఆడపిల్ల భద్రత లేని సమాజంలో ఉన్న విషయం ఇంకా బాగా అర్థం అవుతుంది. ఆడపిల్ల ఇంటికి క్షేమంగా చేరిన తర్వాత కుటుంబ సభ్యులకు ‘నేను ఇంటికి వచ్చేశాను’ అని ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేని రోజు రావాలి. అలాంటి సురక్షితమైన ప్రపంచాన్ని కూతుళ్లుకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆడపిల్ల బయటకు వెళ్లినప్పుడు లైవ్ లొకేషన్ షేర్ చేయడం, పెప్పర్ స్ప్రే వెంట తీసుకెళ్లడం, నడవడానికి బదులుగా క్యాబ్ బుక్ చేసుకోవడం, కేవలం సేఫ్‌గా భావించడం కోసం ఎవరికైనా ఫోన్ చేయడం... ఇవన్నీ కూడా తన జీవనశైలిలో భాగం చేసుకునేలా మనమే ఆమెను బలవంతం చేశాం’’ అంటూ కృతీ సనన్ షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కృతి చెప్పినది అక్షరాలా నిజం అని కొందరు, ఆడపిల్లల భద్రత విషయంలో ప్రపంచం చాలా మారాలని కొందరు నెటిజన్లు స్పందించారు. -
‘ది ప్యారడైజ్’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా: కేటీఆర్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరు చూపిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలోని యాక్షన్ సన్నివేశాలకు మాస్ ఆడియన్స్ నుంచి స్పందన కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ మూవీకి సంబంధించిన చర్చ కొనసాగుతోంది. సినిమా చూడబోతున్నా..తాజాగా ‘ది ప్యారడైజ్’పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర పోస్ట్ చేశారు. శనివారం రాత్రి థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడనున్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు రాత్రి థియేటర్లో సినిమా చూడబోతున్నా. నా అభిమాన నటుడు నాని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి రూపొందించిన ‘ది ప్యారడైజ్’ చూడబోతున్నా’ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఇక ఈ సినిమాలో ప్రియదర్శి కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే శంకర్ పాత్రలో ఆయన నటించారు. సవారీ తెగకు, శంకర్ పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా ‘ది ప్యారడైజ్’ చూడబోతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ‘రామాయణ’ ప్రమోషన్స్‌లో మిస్టర్ బీస్ట్..! ఇదేం ట్విస్ట్ బాస్.. After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”— KTR (@KTRBRS) September 26, 2026 -
షాకింగ్ వీడియో.. కోర్టులోనే మహిళపై దాడి..
కోర్టులో కుటుంబ వివాదంపై విచారణ జరుగుతోంది.. తండ్రి వాంగ్మూలం పూర్తయింది.. అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత! కోర్టు గది నుంచి బయటకు వచ్చిన మహిళపై ఆమె భర్తతో పాటు మరో ఇద్దరు దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అడ్డుకోబోయిన తండ్రి, సోదరిపైనా దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌ను బాధితురాలు పోలీసులకు అందించింది.ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ కుటుంబ న్యాయస్థానంలో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ప్రియా త్రిపాఠి ఫిర్యాదులో పేర్కొంది. పురందర్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సమర్ధీరా చౌరాహాకు చెందిన ప్రియాకు.. బృజ్మంజ్గంజ్ ప్రాంతంలోని కోయిలాడాడ్కు చెందిన మనీష్ కుమార్ మిశ్రాతో వివాహమైంది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భరణం కోసం ప్రియా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు నంబర్ 641/2025తో విచారణ కొనసాగుతోంది.తండ్రి వాంగ్మూలం తర్వాతే..సెప్టెంబర్ 24న కేసు విచారణకు హాజరైన ప్రియా.. తన తండ్రి లక్ష్మీకాంత్, సోదరి ప్రియాంకతో కలిసి కోర్టుకు వెళ్లింది. తండ్రి వాంగ్మూలం పూర్తైన తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముగ్గురూ కోర్టు గది నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ హాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపింది. అదే సమయంలో తన భర్త మనీష్ మిశ్రాతో పాటు ప్రిన్స్ మిశ్రా, సతీష్ మిశ్రా అక్కడికి వచ్చారని.. ముగ్గురూ కలిసి తనపై దాడి చేశారని ప్రియా ఆరోపించింది. తనను కొట్టడంతో పాటు గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారని పేర్కొంది.Inside court premises in Maharajganj, Uttar Pradesh. Women were beaten and tossed like an object infront of police and lawyers. pic.twitter.com/g3mZBkNSuK— Piyush Rai (@Benarasiyaa) September 26, 2026అడ్డుకోబోయిన వారిపైనా దాడి?ప్రియాపై దాడిని అడ్డుకునేందుకు ఆమె తండ్రి, సోదరి ప్రయత్నించగా.. వారిపైనా నిందితులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వారిని కింద పడేసి గొంతు నులిమేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. కచేరీ ప్రాంగణంలో ఒక్కసారిగా గొడవ జరగడంతో అక్కడున్న పోలీసులకు విషయం తెలియగా.. వారు వెంటనే అక్కడికి చేరుకుని జోక్యం చేసుకున్నారని తెలిపింది. పోలీసులు రావడంతో ముగ్గురూ అక్కడి నుంచి వెళ్లిపోయారని.. అయితే వెళ్లే సమయంలో కేసు విషయంలో కోర్టులో వాదనలు కొనసాగిస్తే చంపేస్తామని బెదిరించారని ప్రియా ఆరోపించింది.వీడియోతో పోలీసుల ముందుకు..తనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా తన వద్ద ఉందని తెలిపిన ప్రియా.. దాన్ని పోలీసులకు అందించినట్లు పేర్కొంది. భర్త మనీష్ మిశ్రా, ప్రిన్స్ మిశ్రా, సతీష్ మిశ్రాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది. కోర్టు ప్రాంగణంలోనే మహిళపై దాడి జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు అందించిన వీడియో, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పోలీసులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
అంతా కనిపించేలా రీల్స్ చేస్తే..
సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు హద్దులు దాటుతుంటారు. హోం టూర్ అంటూ ఇంటిని మొత్తం చూపించడమే కాకుండా.. అందులో ఉన్న బంగారం, నగదు, ఖరీదైన వస్తువులను సైతం కెమెరాకు ప్రదర్శిస్తుంటారు. తమ ఇంట్లో ఏముంది? ఎంత విలువైన వస్తువులున్నాయి? అనే విషయాలను తెలియకుండానే బహిరంగంగా చెప్పేస్తుంటారు. అలాంటి వారికి ఈ ఘటన ఓ గట్టి హెచ్చరిక తెలియజేస్తోంది.తమిళనాడులోని ఓ యూట్యూబర్ దంపతుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, నగదు అపహరణకు గురయ్యాయి. వాటి విలువ దాదాపుగా కోటి రూపాయల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఫాలోయింగ్ కోణంలోనూ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తుండడం గమనార్హం.కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని తమ్మట్టుకొణం వీఐపీ గార్డెన్లో వ్యాపారి కమ్ యూట్యూబర్ వినోద్‌కుమార్, యూట్యూబర్ మధుమిత దంపతులు నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం కుటుంబంతో కలిసి బయటకు వెళ్లిన వారు రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి వెనుక తలుపు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్లోని బీరువా కూడా పగలకొట్టి ఉంది. అందులో ఉంచిన బంగారం, వజ్రాభరణాలు, నగదు కనిపించలేదు.రీల్స్‌లో అంతా కనిపించేలా..మధుమిత సోషల్ మీడియాలో బంగారు ఆభరణాలు, నగదు కట్టలను ప్రదర్శిస్తూ పలు వీడియోలు పోస్ట్ చేశారు. పూజా గదిలో, ఇంట్లో నగదు, బంగారం చూపించడం.. చిన్నారిపై నోట్లను చల్లడం వంటి దృశ్యాలు కూడా వీడియోల్లో ఉన్నాయి. అంతేకాదు, కుటుంబం ఎక్కడికి వెళ్తోంది, బంగారం కొనుగోలు చేస్తున్న విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ వచ్చారు.Kanyakumari influencer Madhumitha showed off her gold jewellery and cash in her reels.“Look how much gold I buy every month.”Now, thieves have reportedly broken into her house and escaped with 118 sovereigns of gold worth nearly ₹1 crore, along with cash.…— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) September 26, 2026పోస్టులే క్లూ ఇస్తాయా?చోరీపై రాజాక్కమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి వెనుక తలుపు కట్టింగ్ మెషీన్‌తో తెరిచి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంటి వద్ద, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోన్ కాల్ రికార్డులు, దొంగల కదలికలపైనా దృష్టి పెట్టారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదండి: వామ్మో.. పది వేల కోట్ల పరిహారమా తల్లి? -
చైనా నగరాలు చూసొచ్చా.. మన లీడర్లు మోసం చేస్తున్నారేమో!
రోజూ మన కళ్లముందు కనిపించే రోడ్లు.. ట్రాఫిక్.. నగరాల పరిస్థితి.. ఇవన్నీ మనకు అలవాటైపోయినవే. కానీ, కొన్నిసార్లు మరో దేశంలోని నగరాలను చూసిన తర్వాత.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కొత్త కోణంలో చూడాల్సి వస్తుంది. ఓ విదేశీ పర్యటన.. తిరిగొచ్చాక చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్.. ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.‘చైనాలోని సాధారణ నగరాలను సందర్శించి తిరిగి భారత వీధుల్లోకి వస్తే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, మొత్తం వ్యవస్థ మనల్ని ఎంతగా మోసం చేసిందో అర్థమవుతుంది’ అంటూ భారతీయ మూలాలున్న అమెరికన్ ప్రొఫెసర్ రాజేశ్వరి అయ్యర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆమె పోస్టుకు భారీగా లైక్స్, షేర్లు, కామెంట్లు వచ్చాయి. చైనాలోని నగరాల దృశ్యాలతో కూడిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.‘ఇలాంటి పోస్టులు పెడితే పరువునష్టం కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘చైనా అభివృద్ధిని మెచ్చుకునేవాళ్లు.. అక్కడి నియంత్రణల గురించి కూడా మాట్లాడాలి’ అని మరో వ్యక్తి బదులిచ్చారు. ఇంకొకరు స్పందిస్తూ.. ‘చైనాలో ఇలా బహిరంగంగా మాట్లాడితే.. ఉదయానికే కనిపించరు. భారత్‌లో మాత్రం యువత రోడ్డెక్కి నిరసనలు తెలిపేంత స్వేచ్ఛ.. ఇంత ప్రజాస్వామ్యం ఉంది’ అని వ్యాఖ్యానించారు.Once you visit random cities in China and come back to Indian streets, you realize how much you’ve been scammed by your local MLAs, MPs, IAS and the whole system. pic.twitter.com/uETFhAjSvk— Dr. Rajeshwari Iyer (@RajeshwariRW) September 25, 2026అంత దాకా ఎందుకు..అయితే ఆమె వ్యాఖ్యలకు అందరూ ఏకీభవించలేదు. కొందరు నెటిజన్లు చైనాతో భారత్‌ను పోల్చాల్సిన అవసరం లేదని.. బ్యాంకాక్, వియత్నాం, ఇండోనేషియా, మలేసియా వంటి దేశాల్లోని నగరాలను చూసినా భారత్‌లో మౌలిక వసతులు, పరిశుభ్రత, పౌర సదుపాయాల్లో తేడా కనిపిస్తుందని కామెంట్ చేశారు. ‘చైనానే కాదు.. బ్యాంకాక్ వెళ్లినా అభివృద్ధి, పరిశుభ్రత, పౌరస్పృహలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది’ అంటూ ఒకరు స్పందించారు. మరికొందరు వియత్నాం, ఇండోనేషియా, మలేసియాలను కూడా ప్రస్తావించారు.చైనా మోడల్‌పై మరో వాదనమరోవైపు.. చైనా నగరాల్లో కనిపించే వేగవంతమైన రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, హైస్పీడ్ రైళ్లను ప్రశంసించిన కొందరు నెటిజన్లు.. వాటిని భారత్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థతో నేరుగా పోల్చడం సరికాదని వాదించారు. చైనాలోని వేగవంతమైన అభివృద్ధి వెనుక ఒకే పార్టీ పాలన, కేంద్రీకృత నిర్ణయ వ్యవస్థ వంటి అంశాలు ఉన్నాయని కొందరు ప్రస్తావించారు. ప్రజా పర్యవేక్షణ, రాజకీయ స్వేచ్ఛ, సోషల్ క్రెడిట్ వ్యవస్థ వంటి అంశాలను కూడా వారు చర్చలోకి తీసుకొచ్చారు.భిన్నాభిప్రాయాలుచైనా హైస్పీడ్ రైళ్లను మెచ్చుకున్న ఒక నెటిజన్.. వాటి నిర్మాణానికి తక్కువ కార్మిక వ్యయం, జపాన్ నుంచి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు కూడా కారణమని వ్యాఖ్యానించారు. రైళ్ల నిర్మాణం ఒకవైపు ఉద్యోగాల కల్పన, మరోవైపు రవాణా వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమంగా సాగిందని పేర్కొన్నారు. కేవలం రైళ్ల నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని దేశాల మధ్య పోటీని అంచనా వేయడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో.. దుబాయ్‌లాంటి చోట్ల రోడ్లు, భవనాల నిర్మాణానికి మన దేశం నుంచి కార్మికులు వెళ్తారని, వాళ్లనే ఉపయోగించి ఇక్కడ హైక్లాస్ రోడ్లను నిర్మించడం మన ప్రభుత్వాలకు చేత కాదా? అంటూ ఒకరు ప్రశ్నించారు.నెహ్రూ.. మోదీని మాత్రమే నిందించాలా?భారత్‌లో మౌలిక వసతుల సమస్యలకు రాజకీయ నాయకులను మాత్రమే బాధ్యులను చేయడం సరిపోదని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రభుత్వాలను నిందించడం కంటే.. దశాబ్దాలుగా కొనసాగుతున్న అధికార యంత్రాంగం, అవినీతి, జవాబుదారీతనం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి రాజకీయ సంకల్పంతో పాటు అధికార వ్యవస్థలోనూ మార్పులు అవసరమని ఆ వ్యాఖ్య సారాంశం.ఎవరీ రాజేశ్వరి అయ్యర్?డాక్టర్ రాజేశ్వరి అయ్యర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారతీయ మూలాలున్న అమెరికన్ ప్రొఫెసర్. ఆమె ఎక్స్ ప్రొఫైల్‌లో ఎన్ఐటీ పుదుచ్చేరి, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థినిగా, డైరెక్టర్, ప్రొఫెసర్‌గా వివరాలు ఉన్నాయి. భారత్‌లో రిజర్వేషన్లు, పన్నులు, ప్రభుత్వ వ్యవస్థ, ప్రజా మౌలిక వసతులు వంటి అంశాలపై ఆమె తరచూ పోస్టులు చేస్తుంటారు. గతంలోనూ భారత్ నుంచి అమెరికాకు తిరిగి వెళ్లడానికి కారణాలను వివరిస్తూ ఆమె చేసిన పోస్టులు వార్తల్లో నిలిచాయి.She is visiting the Netherlands. This is how the Netherlands looks.Hope the Bihar MLA can transform Bihar and make it look like this one day. https://t.co/VzRVQ2rmZe pic.twitter.com/8qpU7yTFMi— Dr. Rajeshwari Iyer (@RajeshwariRW) September 26, 2026చైనా పర్యటన అనుభవం నుంచి మొదలైన ఈ పోస్టు ఇప్పుడు కేవలం చైనా-భారత్ నగరాల పోలికకే పరిమితం కాకుండా.. మౌలిక వసతులు, పట్టణ ప్రణాళిక, అధికార యంత్రాంగం, అవినీతి, ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం వంటి విస్తృత అంశాలపై సోషల్ మీడియా చర్చకు దారితీసింది. -
భజన క్లబ్బింగ్‌లో మోదీ.. యువతతో కలిసి జోష్
యువతను ఆకట్టుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త తరహా ప్రయత్నం చేశారు. సాధారణ రాజకీయ కార్యక్రమాలకు భిన్నంగా.. యువత ఎక్కువగా పాల్గొనే ఆధునిక భజన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని సందడి చేశారు. భజనలు వింటూ చప్పట్లు కొట్టడంతోపాటు.. చేతిలో వాయిద్యం పట్టుకుని తాళం వేస్తూ కనిపించారు.పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ పార్క్‌లో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందువరుసలో కూర్చున్న మోదీ.. భజనలను ఆస్వాదిస్తూ కళాకారులతో కలిసి చప్పట్లు కొట్టారు. శ్రీరాముడిపై ఆలపించిన భజనకు ఖంజరీ తరహా వాయిద్యాన్ని వాయిస్తూ తాళం వేశారు. అనంతరం అక్కడికి వచ్చిన వారివైపు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఢిల్లీలో భజన్ క్లబ్బింగ్.. అద్భుతం! అంటూ ఈ ఈవెంట్‌పై ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. Bhajan Clubbing in Delhi. Spectacular! pic.twitter.com/BujBa4lzk7— Narendra Modi (@narendramodi) September 25, 2026ఏంటీ భజన క్లబ్బింగ్..?సంప్రదాయ భజనలను ఆధునిక సంగీత కచేరీ తరహాలో నిర్వహించే విధానమే ‘భజన క్లబ్బింగ్’. ఇందులో పెద్ద సంఖ్యలో యువత ఒకచోట చేరి భజనలు, ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ.. చప్పట్లు కొడుతూ, సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా పాల్గొంటారు. సంప్రదాయ భక్తి గీతాలకు ఆధునిక సంగీతం, హై ఎనర్జీ ప్రదర్శన శైలిని జోడించడం ఈ కార్యక్రమాల ప్రత్యేకత.మద్యం, ఇతర క్లబ్ సంస్కృతికి భిన్నంగా.. భక్తి, ఆధ్యాత్మికత కేంద్రంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ‘భజన క్లబ్బింగ్’కు ఆదరణ పెరుగుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా జెన్-జెడ్ యువతను సంప్రదాయ భజనలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు.‘మన్ కీ బాత్’లోనూ ప్రస్తావనఈ ఏడాది జనవరిలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ మోదీ ‘భజన క్లబ్బింగ్’ గురించి ప్రస్తావించారు. యువత భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ పెద్ద సంఖ్యలో ఒకచోట చేరడం తనను ఆకట్టుకుందని చెప్పారు. భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడించే ప్రయత్నంగా దీనిని అభివర్ణించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్లోబల్ కచేరీలకు ఏమాత్రం తీసిపోవని పేర్కొన్నారు.దీనదయాళ్ జయంతి సందర్భంగా..భారతీయ జనసంఘ్ కీలక నేతల్లో ఒకరైన దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ‘అంత్యోదయ’ సిద్ధాంతంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సందర్భంగా మోదీ దీనదయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించారు. ఆయన ఆలోచనలు, ప్రజా సంక్షేమంపై ఆయన చూపిన మార్గం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రిగ్గింగ్ జరిగితే పోటీ చేయడమెందుకు? -
భలే వాడివి బాసూ!
ఉద్యోగులకు బహుమతులు ఇచ్చే కార్యక్రమం అది. టేబుల్‌పై వరుసగా గిఫ్ట్ బాక్స్‌లు. ఒక్కొక్కరుగా వచ్చి తమకు నచ్చిన బాక్స్ తీసుకుంటున్న సిబ్బంది. ఎవరికో ఓపెన్ చేయగానే ఐఫోన్ కనిపించింది.. మరొకరి బాక్స్‌లో చాక్లెట్లు వచ్చాయి. దీంతో కొందరి ముఖాల్లో ఆనందం.. మరికొందరిలో కాస్త నిరాశ కనిపించింది. అయితే అసలు సర్ప్రైజ్ మాత్రం అప్పుడే మొదలైంది.యూఏఈకి చెందిన వరల్డ్ స్టార్ మాన్పవర్ సంస్థలో ఉద్యోగులకు ఈ వినూత్న గిఫ్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు నిషాద్ హుస్సేన్, మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టేబుల్‌పై ఉంచిన గిఫ్ట్ బాక్స్‌లలో కొన్నింటిలో ఐఫోన్లు, మరికొన్నింటిలో చాక్లెట్ బార్లు పెట్టారు. ఉద్యోగులు తమకు నచ్చిన బాక్స్‌ను ఎంచుకున్నారు.బాక్స్‌లు తెరిచిన తర్వాత కొందరు ఉద్యోగులకు ఐఫోన్లు దక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే చాక్లెట్ల బాక్స్ తీసుకున్నవారి పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపించింది. వారు చాక్లెట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనుకున్నారు.అప్పుడే మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ మరో సర్ప్రైజ్ ఇచ్చారు. చాక్లెట్ల బాక్స్ తీసుకున్న ఉద్యోగుల దగ్గరకు వెళ్లి.. వారికి కూడా ఐఫోన్లు బహుమతిగా ఇచ్చారు. దీంతో మొదట చాక్లెట్లు మాత్రమే వచ్చాయని భావించిన ఉద్యోగుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. చివరకు అందరి చేతుల్లోనూ ఐఫోన్లే కనిపించాయి.ఉద్యోగుల కష్టపడి పనిచేయడం, సానుకూల దృక్పథం, టీమ్‌గా కలిసి ముందుకు సాగడం సంస్థ విజయానికి కీలకమని హసీనా నిషాద్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ప్రయత్నం, ఆలోచన, సహకారం సంస్థ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని మరింత ఎదగాలని ఉద్యోగులను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను నిషాద్ హుస్సేన్, హసీనా నిషాద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉద్యోగులు బాక్స్‌లు తెరిచే సమయంలో కనిపించిన ఉత్కంఠ.. చివర్లో అందరికీ ఐఫోన్లు అందడంతో వచ్చిన ఆనందం వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇదీ చదవండి: ఆమె నిద్ర ఖరీదు.. 10 వేల కోట్లు! View this post on Instagram A post shared by Haseena Nishad (@haseena_nishad) -
‘జై కేసీఆర్’ అన్నందుకు కేసు!
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా రాజకీయ పాటలు, నినాదాల వ్యవహారం వివాదంగా మారింది. నిమజ్జనానికి వచ్చిన భక్తులు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాటలు పెట్టడాన్ని పోలీసులు అడ్డుకున్నారంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పోలీసుల తీరుతో పాటు రేవంత్ సర్కార్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గణేశ్ మండపాల వద్ద రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు, నేతలకు సంబంధించిన నినాదాలు చేయడంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. నవరాత్రి ఉత్సవాలు భక్తికి సంబంధించిన కార్యక్రమమని.. రాజకీయాలకు వేదిక కాకూడదని పేర్కొన్నారు. అసభ్యకర, రెచ్చగొట్టే పాటలు, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసుల సోషల్ మీడియా బృందాలు వీడియోలు, రీల్స్‌ను పరిశీలిస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.కేసీఆర్ పాటలపై వివాదంఈ నేపథ్యంలో గణేశ్ నిమజ్జన వాహనాల్లో కేసీఆర్‌కు సంబంధించిన పాటలు, డైలాగులతో కూడిన రీమిక్స్ డీజేలు వినిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని చోట్ల పోలీసులు వాటిని నిలిపివేసిన దృశ్యాలు కూడా చర్చకు వచ్చాయి. కేసీఆర్ పాటలు పెట్టొద్దంటూ పోలీసులు హెచ్చరించారని, కేసులు పెడతామని చెప్పడంతో పాటు వాహనం సీజ్ చేస్తామని బెదిరించారని నిర్వాహకులు ఆరోపించారు.ట్యాంక్ బండ్ మీద జై కేసీఆర్ అన్నందుకు కేసుట్యాంక్ బండ్ మీద వినాయక నిమజ్జనం సందర్భంగా జై కేసీఆర్ అన్నందుకు తన మీద కేసు పెట్టారని అంటున్న ట్రాన్స్‌జెండర్ శృతి యాదవ్ pic.twitter.com/C0opzqPaQk— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026‘జై కేసీఆర్’ అన్నందుకే కేసా?ఇదే వివాదానికి కొనసాగింపుగా.. ట్యాంక్‌బండ్‌పై ‘జై కేసీఆర్’ నినాదం చేసినందుకు తనపై కేసు పెట్టారని ట్రాన్స్‌జెండర్ శృతి యాదవ్ ఆరోపించారు. గణేశ్ నిమజ్జనానికి వచ్చిన సమయంలో తాను నినాదం చేశానని, అందుకే పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణకు సంబంధించి కేసు ఏ సెక్షన్ల కింద నమోదైంది, నినాదమే కేసుకు కారణమా అనే అంశాలపై అధికారిక పోలీసు వివరణ వెలువడాల్సి ఉంది.గణేష్ నిమజ్జనం కోసం వచ్చిన భక్తులపై లాఠీ ఝులిపించడం ఏ విధమైన పోలీసింగ్?కేసీఆర్ పాట పెట్టారని భక్తులను కొట్టడం, కేసులు పెడతానని బెదిరించడం, వాహనం సీజ్ చేస్తానని హెచ్చరించడం, కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధిపై దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సిన విషయం.… pic.twitter.com/wzBA0bh2nP— Sai Ram Guptha Andole BRS (@sairam_brs) September 24, 2026మరో ఘటనలో..కేసీఆర్ పాటలు పెట్టి.. జై కేసీఆర్ నినాదాలు చేసినందుకు ఓ ఊరేగింపు బృందంతో పోలీసులు వాగ్వాదానికి దిగిన వీడియో సైతం వైరల్ అయ్యింది. ప్రశ్నించినందుకు ఆ సభ్యులతో పాటు వీడియో తీస్తున్న వ్యక్తితోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు అందులో ఉంది. బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరంపోలీసుల హెచ్చరికలు, కేసీఆర్ పాటల వ్యవహారంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గణేశ్ నిమజ్జనం కోసం వచ్చిన భక్తులపై లాఠీలు ప్రయోగించడం, కేసుల పేరుతో బెదిరించడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. పోలీసుల చర్యలు రాజకీయపరంగా ఉన్నాయనే ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి: నిమజ్జనంలో గుండె ఆగిపోయింది! -
బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్ పోజులు.. బీచ్‌లో శ్రీలీల హోయలు...!
బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్ స్టైలిష్ పోజులు..బంగారంలా మెరిసిపోతున్న జయం రవి సతీమణి ఆర్తి..కలర్‌ఫుల్ డ్రెస్‌లో బాలీవుడ్ నటి ఇషితా దత్తా..బీచ్‌లో హీరోయిన్ శ్రీలీల హోయలు..బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ అందాలు... View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by JyotiPoorvaj (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Aarti (@aarti.ravi) -
బీహార్‌లో మళ్లీ వేధింపులు.. ఫామ్‌హౌస్‌లో ఎస్ఐ అరాచకం
బీహార్‌లో జముయ్ ఘటన మరువకముందే.. మరో దారుణం వెలుగుచూసింది. రోడ్డుపై యువతిని చుట్టుముట్టిన యువకులు.. దుర్భాషలు, వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన యువకుడిపైనా దాడికి పాల్పడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. జముయ్‌లో యువతిపై వేధింపుల వీడియో వైరల్ అయిన కొద్ది రోజులకే సమస్తిపూర్‌లో ఇలాంటి మరో ఘటన బయటపడటం కలకలం రేపుతోంది.బీహార్‌లోని జగత్సింగ్పూర్ గ్రామంలో ఓ యువతి, ఆమెతో ఉన్న యువకుడిని బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు అడ్డగించారు. అనంతరం యువతిని దుర్భాషలాడుతూ, రోడ్డుపైకి నెట్టేస్తూ వేధించినట్లు వీడియోలో కనిపిస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం.. యువతి, యువకుడు గ్రామీణ రహదారిపై ఫొటోలు తీసుకునేందుకు ఆగారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు బైక్‌లపై అక్కడికి వచ్చి వారిని చుట్టుముట్టారు. యువతిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోను పరిశీలించిన వెంటనే పోలీసులు చర్యలకు దిగారు. ఘటన జరిగిన ప్రాంతం, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల వివరాలను నిర్ధారించే పనిలో ఉన్నామని పోలీసు అధికారి అరవింద్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం బీహార్‌లోని జముయ్‌లోనూ ఇద్దరు పదో తరగతి విద్యార్థులు వేధింపులకు గురయ్యారు. కోచింగ్ క్లాసులు ముగించుకుని స్కూటర్‌పై వెళ్తుండగా కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. యువకుడి షర్ట్ కాలర్ పట్టుకుని అతడిని యువతి నుంచి దూరంగా లాగారు. యువతి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి వెనుక నుంచి ఆమెను పట్టుకున్న దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి ముగ్గురిని అరెస్టు చేశారు.#BREAKING 🚨 Samastipur Harassment IncidentFour men were arrested after a viral video showed a young woman being harassed, manhandled, and interrogated on a Samastipur bypass road.#Samastipur #BiharPolice #WomenSafety @BiharPolice_ @Samastipur_Pol pic.twitter.com/BaIxLcTTIK— jarvis ☠️ (@Vishii14) September 24, 2026మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మతపరమైన ప్రాంతాలను చూపిస్తామంటూ హర్యానాకు చెందిన యువతిని అమ్రోహాకు తీసుకెళ్లి.. ఫామ్‌హౌస్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇద్దరు యూపీ పోలీసు సిబ్బంది, ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల మేరకు.. ఫతేహాబాద్‌కు చెందిన సుమారు యువతి(24)ని సెప్టెంబర్ 20న ఓ మహిళా పరిచయస్తురాలు సంప్రదించి.. అమ్రోహాలోని మతపరమైన ప్రాంతాలకు వెళ్లేందుకు సీఆర్పీఎఫ్ సిబ్బంది మోహిత్‌ను కలవాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 21న సోనిపట్‌లో మోహిత్‌ను కలిసిన యువతి.. అతడితో కలిసి మీరట్‌కు వెళ్లగా అక్కడ సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ లాలారామ్ యాదవ్ వారితో చేరినట్లు సమాచారం.సెప్టెంబర్ 22న ఇద్దరూ కారులో యువతిని హసన్‌పూర్‌కు తీసుకెళ్తూ మార్గమధ్యలో యూపీ పోలీస్ ఎస్ఐ సంజయ్ తోమర్‌ను ఎక్కించుకున్నారు. అనంతరం అట్రాసి-హసన్పూర్ రహదారిలోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి రెండు గదులు అద్దెకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రమోద్ అక్కడికి ఆహారం, మద్యం తీసుకొచ్చినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం, తనపై మోహిత్, లాలారామ్, సంజయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. తర్వాత ప్రమోద్ కూడా గదిలోకి వచ్చి అత్యాచారానికి ప్రయత్నించగా, అతడిని బయటకు నెట్టేసి తలుపు వేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఆన్లైన్లో పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ కోసం వెతికి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చింది.సమాచారం అందుకున్న హసన్పూర్, రాజబ్‌పూర్ పోలీసులు ఫామ్‌హౌస్‌కు చేరుకుని యువతిని రక్షించి.. నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. యూపీ ఎస్ఐ సంజయ్ తోమర్‌ను సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగినట్లు ఆరోపిస్తున్న ఫామ్‌హౌస్ ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ స్వతంత్ర ఎమ్మెల్యేకు చెందినదిగా పోలీసులు చెబుతున్నారు.जब रक्षक ही भक्षक बन जाएं, तो न्याय की उम्मीद किससे की जाए?भाजपा राज में नारी सुरक्षा केवल जुमला बनकर रह गई है।अमरोहा में पुलिसवालों द्वारा एक युवती के साथ किए गए सामूहिक बलात्कार की घटना बेहद शर्मनाक और गंभीर है। दोषियों के खिलाफ सख्त से सख्त कार्रवाई होनी चाहिए और पीड़िता… pic.twitter.com/0radOOYT6E— AAP (@AamAadmiParty) September 24, 2026 -
‘సాక్షి’పై ఆగని బాబు సర్కార్ కుట్రలు
సాక్షి, అమరావతి: సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పరాకాష్టకు చేరాయి. సాక్షిపై చంద్రబాబు సర్కార్ మరోసారి అక్కసు వెళ్లగక్కింది. మరో ఫేస్బుక్, రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేయించింది. గతంలో కూడా సాక్షి ఫేస్బుక్, ఇన్‌స్టా అకౌంట్లను కూటమి ప్రభుత్వం నిలిపివేయించిన సంగతి తెలిసిందే. అరాచకాలు, అక్రమాలను ప్రశ్నిస్తూ.. వాస్తవాలను బయటపెడుతున్న సాక్షి అంటే కూటమి సర్కార్‌కు భయం పట్టుకుంది. దీంతో కుట్రలతో చెలరేగిపోతుంది.రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛకు చంద్రబాబు సర్కార్ తూట్లు పొడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాక్షి మీడియాను ఇబ్బందులకు గురిచేస్తోంది. కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై చెలరేగిపోతున్న పచ్చ బ్యాచ్.. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును కాల రాస్తోంది.ఇదీ చదవండి: అన్ని ఆధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం: వైఎస్ జగన్ -
సోషల్ మీడియాలో కోర్టు పత్రాలు పోస్ట్ చేయడంపై ఆగ్రహం
విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన అఫిడవిట్లు, కోర్టు పత్రాలను సోషల్ మీడియా వేదికలపై ప్రదర్శించడం పట్ల బాంబే హైకోర్టు విజయ్ మాల్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడం న్యాయస్థానాల సమర్థతను, స్వతంత్రతను దిగజార్చేలా ఉందనడంలో సందేహం లేదని ధర్మాసనం హెచ్చరించింది.జస్టిస్ మిలింద్ జాధవ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు మాల్యా తరఫు సీనియర్ అడ్వకేట్ అమిత్ దేశాయ్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) దాఖలు చేసిన అఫిడవిట్ సెప్టెంబర్ 9న విచారణకు రావాల్సి ఉండగా అధికారికంగా కోర్టుకు సమర్పించడానికి ముందే (సెప్టెంబర్ 8 నాటి రాత్రి) మాల్యా దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసినట్లు ఈడీ న్యాయవాది ఆశిష్ మెహతా ధర్మాసనం దృష్టికి తెచ్చారు.దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ‘ఇది ఏమాత్రం సరైన ప్రవర్తన కాదు. విషయం చాలా తీవ్రమైనది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్లయింట్‌ను హెచ్చరించండి. ఏవైనా వాదనలు లేదా నివేదికలు ఉంటే నేరుగా కోర్టుకే సమర్పించాలి తప్ప సోషల్ మీడియాలో కాదు’ అని స్పష్టం చేశారు.కేసు నేపథ్యంభారత బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9,000 కోట్లకు పైగా రుణాలను ఎగవేసి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ద్వారా నిధుల మళ్లింపు (మనీ లాండరింగ్)కు పాల్పడ్డారనే ఆరోపణలను మాల్యా ఎదుర్కొంటున్నారు. రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల సమాఖ్యకు కన్సార్టియం ద్వారా అప్పగించినందున తనపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ మాల్యా 2020లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, బ్యాంకుల రికవరీ చర్యల వల్ల క్రిమినల్ తీవ్రత తగ్గిపోదని, మనీ లాండరింగ్ నేరం చెల్లదని ఈడీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. తదుపరి విచారణలో ఎస్బీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే.. -
బీచ్‌లో వింత చేష్టలు.. రీల్స్ కోసం ఇదేం పని?
అతి చేస్తే ఇబ్బందే.. అన్న సామెతను గుర్తు చేసేలా ఓ బంగ్లాదేశ్ కంటెంట్ క్రియేటర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. బీచ్‌లో మహిళలను వీడియో తీస్తూ.. చివరకు ఓ విదేశీ మహిళకు కావాలనే దగ్గరగా వెళ్లి ఢీకొట్టినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో అతడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన దుబాయ్‌లోని ఓ బీచ్‌లో జరిగినట్టు తెలుస్తోంది.ఇమ్రాన్ హొస్సేన్ అనే బంగ్లాదేశ్ కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు సమాచారం. వీడియోలో బీచ్ నుంచి సముద్రంలోకి వెళ్తూ చుట్టుపక్కల ఉన్న మహిళలను కెమెరాలో బంధించాడు. ఆ తర్వాత నీటిలో ఉన్న ఓ విదేశీ మహిళకు నెమ్మదిగా దగ్గరై ఆమె కావాలనే తాకాడు. ఆమెకు చేరువగా వెళ్లి ఢీకొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనుకోని ఘటనతో ఆ మహిళ ఒక్కసారిగా షాకైంది. అతడి వైపు కోపంగా చూసింది. అనంతరం, ఆమె అసౌకర్యంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇమ్రాన్ మాత్రం కెమెరా ఆపకుండా చిత్రీకరణ కొనసాగించాడు. కాగా, మహిళల అనుమతి తీసుకున్నట్లు వీడియోలో ఎక్కడా కనిపించకపోవడం వివాదానికి కారణమైంది.খালাতো বোনের সঙ্গে মজা করে আসি বলেই বিদেশি নারীকে ধাক্কা, pic.twitter.com/tSEk4UVTRU— Monju Alom (@MonjuAlom1) September 23, 2026Video Credit: Monju Alom‘చేతిలో కెమెరా ఉంది కదా’ అని..బీచ్‌లో మహిళలను దూరం నుంచి మాత్రమే కాకుండా దగ్గరగా కూడా చిత్రీకరిస్తున్న అతడి ఇతర వీడియోలు కూడా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు దుబాయ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.గోప్యతపై కఠిన నిబంధనలు..యూఏఈలో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన చట్టాలు కఠినంగా ఉంటాయి. ఇతరుల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయడం విషయంలో నిబంధనలు ఉన్నాయి. గతంలో అబుదాబిలో ఓ మహిళను అనుమతి లేకుండా ఫొటో తీసిన వ్యక్తికి కోర్టు జరిమానా విధించిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అయితే వైరల్ వీడియోలోని ఘటనపై దుబాయ్ అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోపై చర్చ కొనసాగుతోంది.Meet Emran Hussein from Bangladesh, he deliberately bumped into women while swimming…! Always a Bûll@ 🤡🤲🏻 pic.twitter.com/sF6NLPyiSo— Ravi Tiwari🇮🇳 (@Ravitiwariii_) September 23, 2026Video Credit: Ravi Tiwari ఇదీ చదవండి: నెతన్యాహు, మమ్దానీ మధ్య మాటల యుద్ధం.. -
ట్రంప్ పొగడ్త.. ఉగ్రవాదంపై పాక్ ప్రధాని వ్యాఖ్యలు వైరల్
ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘టెర్రిఫిక్ మ్యాన్’ అంటూ ప్రశంసించడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రశంసలు పాక్‌కు అనుకూలంగా కనిపిస్తున్న వేళ.. ఉగ్రవాదంపై షరీఫ్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ‘‘మా ఉగ్రవాదులను నియంత్రించకపోయి ఉంటేనా..’’ అని ఆయన వ్యాఖ్యపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.81వ UNGAలో మంగళవారం ప్రసంగించిన ట్రంప్.. భారత్, పాకిస్థాన్ మధ్య 2025లో చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతను ప్రస్తావించారు. ఆ వివాదాన్ని ఆపేందుకు తాను జోక్యం చేసుకున్నానని మరోసారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘టెర్రిఫిక్ మ్యాన్’గా అభివర్ణించారు. షరీఫ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని, తాను 3 కోట్ల మంది ప్రాణాలను కాపాడినట్లు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం ఈ వివాదంలో మూడో పక్షం మధ్యవర్తిత్వం చేసిందన్న వాదనను గతంలో తిరస్కరించింది.వైరల్‌గా మారిన ఆ వ్యాఖ్య..ట్రంప్ ప్రశంసల నేపథ్యంలో షరీఫ్ చేసిన ఓ పాత వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025లో జరిగిన 80వ యూఎన్‌జీఏలో ఆయన పాకిస్థాన్ రెండు దశాబ్దాలకు పైగా ఉగ్రవాదంపై పోరాడుతోందని చెప్పారు. ఈ పోరులో 90 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయామని, భారీ ఆర్థిక నష్టం ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. అదే ప్రసంగంలో షరీఫ్.. పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కొనకపోయి ఉంటే వారు న్యూయార్క్, లండన్ వీధుల్లో తిరిగేవారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచ భద్రతకు తన దేశం చేస్తున్న సేవగా ఆయన అభివర్ణించారు.‘If we haven't controlled our terrorists, they would be roaming on the streets of New York or London"- Pakistan PM Shehbaz Sharif at UNGA pic.twitter.com/2bHJaAKEaG— Rishi Bagree (@rishibagree) September 22, 2026ఒప్పుకున్నట్లేనా?ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పాకిస్థాన్‌కు కొత్త చిక్కు ఎదురైంది. షరీఫ్ మాటలను పట్టుకుని కొందరు నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు ఉన్నాయన్న విషయాన్ని ఆ దేశ ప్రధానే స్వయంగా అంగీకరించినట్టుగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదంపై పాక్ వైఖరి, గతంలో ఆ దేశంపై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చకు వస్తున్నాయి.ఇక్కడే మరో కీలక విషయం ఉంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ‘న్యూయార్క్, లండన్’ వ్యాఖ్య ఈ సమావేశాల్లో చేసిన షరీఫ్ చేసిన ప్రసంగానిది కాదు. షరీఫ్ 2026లో 81వ UNGAకి హాజరయ్యేందుకు సెప్టెంబర్ 21న న్యూయార్క్ చేరుకున్నారు. ఆయన తాజా UNGA ప్రసంగం సెప్టెంబర్ 25న జరగనుంది.ట్రంప్ నుంచి వచ్చిన బహిరంగ ప్రశంసల సమయంలోనే ఈ పాత వ్యాఖ్య మళ్లీ తెరపైకి రావడంతో.. పాకిస్థాన్ ఉగ్రవాదంపై తన గత వాదనలపై కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడి ప్రశంసలు.. మరోవైపు షరీఫ్ పాత ఉగ్రవాద వ్యాఖ్య వైరల్ కావడం.. పాక్ దౌత్యానికి ఇది ఊహించని చర్చగా మారింది.ఇదీ చదవండి: ఆ టెక్నాలజీ మామూలుది కాదంటున్న ట్రంప్ -
మత్స్యకారుల సాహసం.. చివరకు తల్లి ఒడికి!
నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల వయసున్న ఏనుగు పిల్లను మత్స్యకారులు ప్రాణాలకు తెగించి కాపాడారు. దాదాపు నాలుగు కిలోమీటర్లు పడవల్లో వెంబడించి.. అలసిపోయిన ఆ చిన్నారిని ఒడ్డుకు చేర్చారు. అటవీశాఖ సిబ్బంది సంరక్షణ అనంతరం రెండు గంటల పాటు గాలించి చివరకు దాని తల్లిని గుర్తించారు. నీటిలోకి వచ్చి తన బిడ్డను చేరదీసిన తల్లి ఏనుగు దృశ్యం అక్కడున్న వారిని కదిలించింది.పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా గజోల్డోబా సమీపంలో సెప్టెంబర్ 21న ఈ ఘటన జరిగింది. టీస్తా నదిలో మూడు, నాలుగు రోజుల వయసున్న ఏనుగు పిల్ల ప్రవాహంలో కొట్టుకుపోతుండటాన్ని నార్త్ బెంగాల్ ఫిషర్మెన్ ఫోరం సభ్యులు గుర్తించారు. వెంటనే మిథు దాస్, బిశ్వనాథ్ దాస్, రాజేశ్ దాస్, గోపాల్ దాస్, బబ్లు దాస్ పడవల్లో దాన్ని వెంబడించారు.నాలుగు కిలోమీటర్లు వెంబడించి..తీవ్ర ప్రవాహం కారణంగా ఏనుగు పిల్లను దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర నదిలో కొట్టుకుపోతూ వెళ్లింది. మత్స్యకారులు పడవలను దాని వెంట నడిపి.. ఎట్టకేలకు దాన్ని జాగ్రత్తగా పైకి ఎత్తుకుని పడవలోకి చేర్చారు. ఒడ్డుకు తీసుకొచ్చే వరకు చిన్నారిని ఓదారుస్తూ, జాగ్రత్తగా సంరక్షించారు.రెండు గంటల తర్వాత తల్లి చెంతకు..సమాచారం అందుకున్న బైకుంఠపూర్ అటవీశాఖ అధికారులు ఏనుగు పిల్లకు అవసరమైన సంరక్షణ అందించారు. అనంతరం తల్లి ఏనుగు కోసం గాలింపు చేపట్టారు. దాదాపు రెండు గంటల తర్వాత గుంపును గుర్తించి.. పిల్లను తల్లి దగ్గరకు చేర్చారు. తన బిడ్డను చూసిన తల్లి ఏనుగు నీటిలోకి వచ్చి దానికి పాలు ఇచ్చింది.ప్రస్తుతం ఏనుగు పిల్ల, తల్లి రెండింటినీ అటవీశాఖ అధికారులు గుంపుతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సకాలంలో స్పందించి ఏనుగు పిల్ల ప్రాణాలను కాపాడిన మత్స్యకారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.Humanity. ❤️Fishermen rescue elephant calf from Teesta River in Gajoldoba, reunite it with mother. pic.twitter.com/uQL4EEW32L— Mayukh Biswas (@MayukhDuke) September 21, 2026 -
చాలా డబ్బులు నష్టపోతావని చెప్పారు..అయినా నో చెప్పా : ఐశ్వర్య లక్ష్మి
ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది సినీ తారలకు, అభిమానులకు ఓ ముఖ్యమైన వారధిగా మారింది. తమ సినిమా అప్డేట్స్తో పాటు పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు దీని ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఒక్క పోస్ట్పెట్టి..లక్షల రూపాయలు సంపాదించే తారలు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. ఏడాది క్రితం ఆమె సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పింది. ఇప్పటివరకు ఆమె మళ్లీ నెట్టింట్లోకి అడుగుపెట్టలేదు. ఇక ఎప్పటికీ సోషల్ మీడియాలోకి రానని చెబుతోంది ఈ టాలెంటెడ్ హీరోయిన్. మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సోషల్ మీడియాను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో వివరించింది. ‘నేను ఇన్‌స్టాగ్రామ్‌ని వదిలేస్తానని అస్సలు ఊహించలేదు. కొన్నాళ్లు దూరంగా ఉండి..తిరిగి వద్దామనుకున్నా. కానీ ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అసత్యప్రచారాలు ఎక్కువైపోయాయి. ఏఐ సాయంతో ఎడిట్ చేస్తున్న అసభ్యకరమైన పోస్టులు చూసి విసిగిపోయా. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల సంతోషంగా ఉంటున్నా. ఇప్పుడు ఒక వ్యక్తిగా నాకు చాలా స్వేచ్ఛ దొరికినట్లు అనిపిస్తోంది. మళ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోండి.. లేదంటే చాలా డబ్బులు నష్టపోతారని నా మేనేజర్లు చెప్పినా.. నేను అంగీకరించలేదు. డబ్బు కంటే మానసిక ప్రశాంతత విలువైనదని.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల నేను హ్యాపీగా ఉండగల్గుతున్నానని వారితో చెప్పాను. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు ప్రతి కామెంట్ చదివేదాన్ని. దాని వల్ల ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉందని అనిపించేది. నన్ను ఎవరూ ఇష్టపడరనే భావన మొదలైంది. కామెంట్స్ మనకు తెలియకుండానే నెగెటివిటీని సృష్టిస్తాయి.అందుకే నేను సోషల్ మిడియాను దూరం పెట్టా. సినిమాల ద్వారనే ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోవాలి’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. -
ఆవిడ లిఫ్ట్‌లో చిక్కుకోగానే.. అసలు కథ మొదలైంది!
ఐదు నక్షత్రాల హోటల్.. ఖరీదైన సదుపాయాలు.. అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు ఉంటాయేమోనని ఎవరైనా అనుకుంటారు. అలా అనుకునే ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి భార్య కూడా వెళ్లింది. సరిగ్గా అప్పుడే ఆమె ఎక్కన లిఫ్ట్ పని చేయకుండా పోయింది. అలా అరగంట గడిచాక.. ఆమెను బయటకు తీస్తే.. బతుకు జీవుడా అనుకుంటూ ఏడుస్తూ వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..ఓ వైద్య సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి భార్యతో పాటు మరో వైద్యుడు, వైద్య సిబ్బంది లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. లిఫ్ట్‌లో ఉన్న సంప్రదింపు నంబర్‌కు పలుమార్లు ఫోన్ చేసినా వెంటనే స్పందన రాలేదు. చివరకు విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నగరపాలక సంస్థ ఫైర్ బ్రిగేడ్, విద్యుత్, ఆరోగ్య విభాగాల సిబ్బంది అక్కడికి చేరుకుని ముగ్గురినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల తర్వాత వాళ్లు బయటకు వచ్చారు.మధ్యప్రదేశ్ భోపాల్‌లోని అరీరా హిల్స్ ప్రాంతంలోని కోర్ట్‌యార్డ్ బై మారియట్ హోటల్లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. లిఫ్ట్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసిన తర్వాత అధికారులు అక్కడితో ఆగలేదు. ఘటనకు అసలు కారణమేంటి? లిఫ్ట్ నిర్వహణ ఎలా ఉంది? అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను రక్షించే పరికరాలు ఉన్నాయా? అనే కోణాల్లో హోటల్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో కీలకమైన ఆటోమేటిక్ రెస్క్యూ డివైస్ (ARD) లిఫ్ట్‌లో లేదని గుర్తించారు. అంతేకాదు.. లిఫ్ట్‌లకు చేయాల్సిన నెలవారీ నిర్వహణ కూడా సకాలంలో జరగలేదని తేలింది. ఆగస్టు 31న చేయాల్సిన మెయింటెనెన్స్ పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లిఫ్ట్ తనిఖీతో ఆగకుండా హోటల్లోని అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను కూడా అధికారులు పరిశీలించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు, అత్యవసర తరలింపు మార్గాలు, ఎగ్జిట్ గేట్లను తనిఖీ చేశారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కొన్ని ఏర్పాట్లు లేవని నగరపాలక సంస్థ తెలిపింది.ఇక ఆరోగ్య విభాగం హోటల్ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌తో పాటు సంబంధిత పత్రాలను కూడా పరిశీలించింది. అంటే ఒక లిఫ్ట్ ఆగిపోవడంతో మొదలైన తనిఖీలు.. హోటల్ మొత్తంలోని భద్రతా వ్యవస్థలపైకి వెళ్లాయన్నమాట. వరుస లోపాలు బయటపడటంతో హోటల్లోని మూడు లిఫ్ట్‌లను భోపాల్ నగరపాలక సంస్థ తాత్కాలికంగా సీజ్ చేసింది. ఈ హోటల్‌ను గతంలోనూ తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలు పాటించాలని నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ లిఫ్ట్ నిర్వహణ, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన లోపాలు మళ్లీ కనిపించడంతో తాజా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇక్కడితోనే ఆగిపోయిందని అనుకుంటున్నారా?.ఇప్పుడు నగరమంతా తనిఖీలుఈ ఘటనతో భోపాల్ నగరపాలక సంస్థ మరింత విస్తృత తనిఖీలకు సిద్ధమైంది. నగరంలోని హోటళ్లు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లో ఉన్న లిఫ్ట్‌లను తనిఖీ చేయాలని నిర్ణయించింది. లిఫ్ట్‌లకు సకాలంలో మెయింటెనెన్స్ జరుగుతోందా? ఏడీఆర్ వంటి భద్రతా పరికరాలు ఉన్నాయా? అవసరమైన ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించనుందట. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ సంస్కృతి జైన్ ఆదేశాలు జారీ చేశారు. హోటళ్లు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాల నిర్వాహకులు లిఫ్ట్‌ల నిర్వహణతో పాటు అన్ని భద్రతా ఏర్పాట్లను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఒకవేళ ఆ లిఫ్ట్‌లో ఐఏఎస్ అధికారి భార్య సహా ముగ్గురు చిక్కుకోకపోయి ఉంటే.. ఈ లోపాలన్నీ ఇంత త్వరగా వెలుగులోకి వచ్చేవా అనే ప్రశ్న ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: ఎస్సై మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ -
బిట్టూ… నువ్వు సూపర్ రా!
నదులు, చెరువుల్లో చెత్త పారబోయడం ఒక ఎత్తయితే.. పేరుకుపోయిన ఆ చెత్తకంపుతో ముక్కు మూసుకుని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాం మనం. కానీ సురేంద్ర అలాంటోడు కాదు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడడం అతనికి చేత కాదు. చిన్నప్పటి నుంచే నీళ్లలోకి దిగి.. తన చేతులతోనే చెత్తను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. అలా సోషల్ మీడియాలో ‘బిట్టూ తబాహీ’గా గుర్తింపు పొందిన అతడు.. ఇప్పుడు యమునా నదిని శుభ్రం చేసే మిషన్ చేపట్టాడు. సెప్టెంబర్ 20న ప్రపంచ శుభ్రత దినోత్సవం సందర్భంగా.. యమునా నదిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని బిట్టూ తబాహీ చేపట్టారు. అతడి వెంట వచ్చిన వాలంటీర్లు సుమారు నాలుగున్నర గంటలపాటు యమునా ఒడ్డును శుభ్రం చేశారు. ఈ సమయంలో ఏకంగా 585 కిలోల చెత్తను తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు పూలు, దండలు, పూజా సామగ్రి, ఇతర చెత్తను ఒడ్డునుంచి సేకరించారు. స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అతడికి సహకరించారు. బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌదరి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరాకు చెందిన అతడు స్కూల్ పిల్లాడిగా ఉన్నప్పుడే నదులు, బహిరంగ ప్రదేశాల శుభ్రతపై దృష్టి పెట్టాడు. అతడి సోషల్ మీడియా ఖాతాల్లో చెత్తతో నిండిన ప్రాంతాల్లోకి వెళ్లి స్వయంగా శుభ్రం చేస్తున్న వీడియోలు కనిపిస్తాయి. పెద్ద యంత్రాలు, భారీ సిబ్బంది లేకుండానే సాధారణ పరికరాలతో చెత్తను తొలగించడం అతడి ప్రత్యేకతగా మారింది. అజ్నార్ నదితోనే అసలు గుర్తింపు..బిట్టూకు భారీగా గుర్తింపు తెచ్చింది మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నది. ప్లాస్టిక్, చెత్త, ఆల్గీతో నది దాదాపు డంపింగ్ యార్డులా మారిన పరిస్థితిని చూసి.. జనవరి 26న అక్కడ శుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తొలుత కొందరు స్నేహితులు అతడితో కలిసి పనిచేసినా.. ఆ తర్వాత వారు తప్పుకోవడంతో బిట్టూ ఒంటరిగానే నదిలోకి దిగి చెత్త తొలగించడం కొనసాగించాడు. వారాలపాటు ఈ పని చేస్తూ ప్లాస్టిక్, సీసాలు, ఇతర వ్యర్థాలను బయటకు తీశాడు. అతడు చేస్తున్న పనిని వీడియోలుగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. నదిని శుభ్రం చేయడానికి బిట్టూ తన సొంత డబ్బుతో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశాడు. కొందరు మాత్రం పిల్లాడు సోషల్ మీడియా ప్రచారం కోసమే చేస్తున్నాడంటూ విమర్శించారు. కానీ బిట్టూ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఆయన ప్రశంసతో వెలుగులోకిఅజ్నార్ నదిని శుభ్రం చేస్తున్న బిట్టూ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. బియోరాకు చెందిన ఈ యువకుడిని తన ‘మండే మోటివేషన్’గా పేర్కొంటూ ఆయన బిట్టూ చేసిన పనిని ప్రశంసించారు. దీంతో బిట్టూ కథ దేశవ్యాప్తంగా మరింతగా వైరల్ అయింది. జెన్‌జీకి ఇలాంటి కుర్రాళ్ల స్ఫూర్తి కచ్చితంగా ఉండాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. విదేశీ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్!బిట్టూ చేసిన పని అంతర్జాతీయ స్థాయిలోనూ దృష్టిని ఆకర్షించింది. నెదర్లాండ్స్‌కు చెందిన పర్యావరణ సంస్థ ది ఓషన్ క్లీనప్ వ్యవస్థాపకుడు, సీఈవో బోయన్ స్లాట్.. సోషల్ మీడియాలో బిట్టూ పనిపై స్పందిస్తూ అతడిని తమ సంస్థలో పనిచేయాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత బిట్టూ తన శుభ్రత కార్యక్రమాన్ని ఒక్క నదికే పరిమితం చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఏ రాష్ట్రానికి వెళ్లాలి, ఎక్కడి నదిని శుభ్రం చేయాలి అంటూ సోషల్ మీడియాలో ప్రజలను సూచనలు కూడా కోరాడు.ఇప్పుడు యమునా! తర్వాత ఎక్కడంటే..అజ్నార్ నది తర్వాత బిట్టూ దృష్టి మధ్యలో చిన్నాచితకా కాలువలు, చెరువులపై పడింది. ఆ తర్వాత దేశ రాజధానికి చేరి .. యమునా నదిని శుభ్రం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతని పిలుపునకు వందల మంది వలంటీర్లు ముందుకు వచ్చారు. మూడు రోజులపాటు యమునా పరిసరాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. తొలి రోజే.. అదీ నాలుగు గంటల్లోనే వందల కిలోల చెత్తను తొలగించడంతో ఈ కార్యక్రమం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తదుపరి తన శుభ్రత కార్యక్రమాన్ని గురుగ్రామ్‌లోని ఖేడ్కీ దౌలాకు తీసుకెళ్లనున్నట్లు బిట్టూ వెల్లడించాడు. ఒక చిన్న పట్టణానికి చెందిన యువకుడు.. ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురుచూడకుండా తన చేతులతోనే నదిలోని చెత్తను తొలగించడం మొదలుపెట్టాడు. ఆ పని వీడియోలుగా మారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు అదే వైరల్ ప్రయాణం అతడిని యమునా ఒడ్డుకు, అక్కడి నుంచి దేశవ్యాప్తంగా శుభ్రత కార్యక్రమాల వైపు తీసుకెళ్తోంది. -
విశాఖలో గంటల కొద్దీ పవర్ కట్!.. వీడియో వైరల్
విశాఖపట్నం: మహా విశాఖ నగరంలో నీటి సమస్యతో పాటు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై సోనాలి సాహా అనే విద్యార్థిని చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదువుకునే కీలక సమయాల్లో విద్యుత్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని ఆమె వీడియోలో ప్రశ్నించారు. నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయానికి కారణమేంటి? గంటల తరబడి విద్యుత్ కోతలు ఎందుకు కొనసాగుతున్నాయి? అనే అంశాలపై ఈపీడీసీఎల్ అధికారులు తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఆమె వీడియోకు నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు మెసేజ్‌ల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టి విద్యుత్ కోతలను నివారించాలని కోరుతున్నారు. 🚨విశాఖలో గంటల కొద్ది పవర్ కట్స్! విద్యార్థిని వీడియో వైరల్! #PowerCuts #Vizag VC: Sonali Saha pic.twitter.com/64qdIgVMQa— UttarandhraNow (@UttarandhraNow) September 20, 2026 -
‘చిన్న విషయమే..’ జముయి ఘటనపై షాకింగ్ వ్యాఖ్యలు
బిహార్ జముయిలో మోరల్ పోలీసింగ్ పేరిట జరిగిన దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పదో తరగతి విద్యార్థిని, ఆమె స్నేహితుడిపై ఓ గ్యాంగ్ దాడి చేయడం.. ఆమెను లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దారుణంపై పోలీసుల దర్యాప్తు, వరుస అరెస్టుల మధ్యే.. బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఘటనను ఖండించడం మాట అటుంచి. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి అనడంతో రాజకీయ దుమారం రేగింది.జముయి ఘటనపై ప్రతిపక్షాలు బిహార్‌లో ‘జంగిల్ రాజ్’ నడుస్తోందంటూ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి శ్రవణ్ కుమార్.. ‘ఇది ఓ చిన్న ఘటన. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ప్రపంచంలో నేరం పూర్తిగా అంతం కాలేదు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత తీవ్రమైన ఘటనను సాధారణ నేరంగా చూడకూడదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో తన వ్యాఖ్యలను పొరపాటుగా అర్థం చేసుకున్నారని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో నితీశ్‌కుమార్, ఇప్పుడు సామ్రాట్ చౌద్రీ ఇలా ఎవరి హయాంలో అయినా ఇలాంటివి జరిగాయి. ఆ సమయాల్లో కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అదే పని చేస్తాం అని అన్నారాయన. అయినప్పటికీ మంత్రి తీరుపై పలువురు మండిపడుతున్నారు. मंत्री श्रवण कुमार ने जमुई घटना हुई लड़की के साथ छेड़खानी की गई है उसे पर कहा बिहार में छुटपुट घटनाएं हो रही है उसे पर हम इनकार नहीं कर सकते हैं।हम उसे दुखी हैं फिर से ऐसी घटना दोबारा ना हो कानून के हिसाब से दोषियों पर कार्रवाई की जाएगी अपराध मुक्त पूरी दुनिया भी नहीं है छिट… pic.twitter.com/IQ0TYNAsVG— Sadan Singh Rajput (@SadanJee) September 22, 2026మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై జేడీయూ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ కుశ్వాహా కూడా స్పందిస్తూ.. తాను, మంత్రి చేసిన వ్యాఖ్యలను నోరు జారి చేసినవిగా(స్లిప్ ఆఫ్ ది టంగ్)గా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై గతంలోనూ చర్యలు తీసుకున్నామని, ఇకపైనా ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.అసలేం జరిగిందంటే..సెప్టెంబర్ 19న మడ్వా పహాడ్ ప్రాంతంలో కోచింగ్ క్లాస్ ముగించుకుని స్కూటర్‌పై తిరిగి వస్తున్న పదో తరగతి విద్యార్థులు.. ఓ గ్యాంగ్ బారినపడ్డారు. వారి వాహనాన్ని అడ్డుకున్న నిందితులు ఇద్దరినీ కిందకు దించి దాడి చేశారు. బాలుడిని కాలర్ పట్టుకుని లాగగా.. బాలిక రక్షించే ప్రయత్నం చేసింది. ఇంతలో ముసుగులో ఉన్న ఓ వ్యక్తి దూసుకొచ్చి బలవంతంగా ఆమెను ఎత్తుకుని పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆమెను అతను అసభ్యంగా తాకాడు. అయితే ఆమె స్నేహితుడు వెంటపడి ఆమెను విడిపించగలిగాడు. ఇద్దరూ తమను వదిలేయాలని వేడుకున్నప్పటికీ గ్యాంగ్ కొంతసేపు వారిని వేధించారు. చివరకు.. చేతులెత్తి బతిమాలడంతో అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతింంచారు. ఈ ఘటనను గ్యాంగ్‌లోని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితురాలిని కాపాడుకున్న ఆ యువకుడు తెగువపై ప్రశంసలు కురిశాయి.ముగ్గురు అరెస్ట్, ఏడుగురి గుర్తింపువీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీడియో, ఇతర ఆధారాల ఆధారంగా మొత్తం ఏడుగురిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గాలిస్తోంది. పోక్సోతో పాటు సంబంధిత బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.వీడియో షేర్ చేసినా చిక్కులేఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఖాతాలపైనా పోలీసులు చర్యలు ప్రారంభించారు. బాలిక మైనర్ కావడంతో ఆమె గుర్తింపు బయటపడేలా వీడియోను ప్రసారం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటివరకు 13 ఫేస్బుక్, 12 ఇన్స్టాగ్రామ్, 7 ఎక్స్ ఖాతాలు.. మొత్తం 32 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి తొలగింపు చర్యలకు పంపినట్లు అధికారులు తెలిపారు.మహిళా కమిషన్ల జోక్యంఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బిహార్ డీజీపీని ఆదేశించి.. ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా జిల్లా యంత్రాంగం నుంచి వివరాలు కోరింది.రాజకీయ దుమారంఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఘోరమైన పాలన నడుస్తోందని.. మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక చేతులు జోడించి వేడుకున్నప్పటికీ గ్యాంగ్ ఆమెను వేధించడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. నిందితులందరినీ గుర్తించి పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.మరోవైపు అధికార పక్షం మాత్రం ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దోషులుగా తేలిన ఎవరినీ వదిలిపెట్టబోమని చెబుతోంది. పోలీసులు ఇప్పటికే అరెస్టులు చేపట్టడంతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. దీంతో జముయి ఘటనలో అసలు నిందితులందరినీ ఎప్పుడు పట్టుకుంటారు? మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల వేళ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
‘నేను ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోలేను!’
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం చేసే కొన్ని పనులు కొన్నిసార్లు జీవితాల్నే తలక్రిందులు చేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్న ఘటనే ఇందుకు నిదర్శనం. వ్యక్తిగత జీవితం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా తక్కువేనని, హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును మార్చేస్తాయని ఈ ఘటన నిరూపిస్తోంది. వివాహానికి ముందు ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో స్నేహితులు ఇచ్చిన ఓ సర్ప్రైజ్ వీడియో కారణంగా ఏకంగా పెళ్లే రద్దయిన ఈ ఉదంతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. త్వరలో వివాహం చేసుకోబోయే ఓ యువతికి, ఆమె స్నేహితులు బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో కాబోయే వధువుకు ఊహించని విధంగా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ జరుగుతుండగా, వధువు మాజీ ప్రియుల చేత శుభాకాంక్షలు చెప్పిస్తూ వీడియోలు తీశారు. బ్యాచిలర్ పార్టీలో స్నేహితురాలిచ్చిన ఈ సర్ప్రైజ్ చూసి వధువు షాక్ అవగా, ఆ సమయంలో ఆమె ఇచ్చిన రియాక్షన్‌ను వీడియో తీశారు. అంతటితో ఆగకుండా ఆ సర్ప్రైజ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా భవేష్ గుజరాతి అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. క్షణాల్లో అది నెట్టింట తెగ వైరల్ అయింది. పెళ్లి రద్దు చేసుకున్న వరుడు..అయితే, సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఈ వీడియో కాస్తా నేరుగా కాబోయే పెళ్లికొడుకు దృష్టికి వెళ్లింది. కాబోయే భార్య బ్యాచిలర్ పార్టీలో మాజీల వీడియోలను ప్రదర్శించడం, పైగా అది పబ్లిక్‌గా వైరల్ కావడంతో ఆ వరుడు,అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి, అసంతృప్తికి గురైన అతను.. నేను ఇంత మంచి అమ్మాయిని వివాహం చేసుకోలేను అంటూ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు.వీడియో డిలీట్ చేసిన వధువు..ఈ అనూహ్య పరిణామాన్ని అసలు ఊహించని ఆ వధువు ఒక్కసారిగా కంగుతింది. క్షణాల వ్యవధిలో పెళ్లి క్యాన్సిల్ కావడంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె, వెంటనే ఇన్స్టాగ్రామ్ నుండి ఆ వివాదాస్పద సర్ప్రైజ్ వీడియోను తొలగించింది.వ్యక్తిగత జీవితానికి, సరదా సరదాలకూ ఒక హద్దు ఉంటుంది.. చిలిపి చేష్టలతో జీవితాలనే పాడు చేసుకుంటారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టాలని చూస్తే ఇలాగే ఉంటుంది అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇంత దూరం వస్తుందని ఆ అమ్మాయి ఊహించి ఉండదు అని కొందరు అభిప్రాయపడుతుంటే, ఇలాంటి సర్ప్రైజ్లు అవసరమా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. This video reportedly reached the groom, and he called off the wedding. She has since deleted the video from her Instagram. https://t.co/30iXcfXdvL— Bhavesh Gujrati (@Bhaveshlivelife) September 9, 2026 -
జెన్‌జీతో కలిసి డ్యాన్స్.. దుమ్మురేపిన జడేజా భార్య
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ మంత్రి రివాబా జడేజా జెన్‌జీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని జామ్‌నగర్‌లోని డీకేవీ కళాశాలలో 'ఆశీర్వాద్ నో దివ్డో' పేరుతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రివాబా జడేజా శ్రీకృష్ణుని భక్తిలో లీనమయ్యారు. రివాబాతో కలిసి జెన్ జెడ్ యువత కూడా కృష్ణ తన్మయత్వంలో మునిగిపోయి భజన చేస్తూ డ్యాన్సులు చేయడం ఆకట్టుకుంది. ఎప్పుడూ హుందాగా నడుచుకునే రివాబా భక్తి పారవశ్యంలో మునిగిపోయి నృత్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్యక్రమంలో భాగంగా రివాబా గాయకుడితో కలిసి వేదికపైకి వచ్చారు. గాయకుడితో కలిస పాట పాడుతూ అడుగులు కలిపారు. ఆమె భక్తి ప్రదర్శన ఆ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. దీంతో కార్యక్రమానికి వచ్చిన యువత కూడా రివాబాతో కలిసి చిందేస్తూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కృష్ణ తన్మయత్వంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి ధన్సుఖ్ భండేరి, మేయర్ మోనికాబెన్ వ్యాస్, బీజేపీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక రవీంద్ర జడేజా ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. ఆ టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లో జడేజా రెండు మ్యాచ్‌లు కలిపి 8 వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తో మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 65 పరుగులు చేశాడు.🔥 RIVABA JADEJA — ROYAL GRACE, CLASS & CONFIDENCE! 👑🇮🇳She can have 100 Mahua Moitras and Priyanka Vadras for breakfast! 😎🔥Gujarat’s Education Minister, Rivaba Jadeja @Rivaba4BJP , comes from a royal family and carries herself with elegance, humility, and dignity.✅ No…— Akshay Kumar (@akshay_vicky) September 21, 2026ఇదీ చదవండి: జపాన్‌తో చారిత్రక మ్యాచ్.. చిక్కుల్లో భారత క్రికెటర్ -
మన గుమ్మడి నర్సయ్యలా.. స్టేషన్ బయట ఆ మాజీ ప్రధాని!
పదవి పోయినా జీవనశైలి మారలేదు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజలకు మాత్రం దూరం కాలేదు. రాజకీయాల్లో ఒకప్పుడు అత్యున్నత పదవిలో ఉన్న నేత.. ఇప్పుడు కూడా నిత్యం సామాన్యుల మధ్యే కనిపిస్తున్నారు. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సింప్లిసిటీకి, ప్రజాసేవకు ఎలా కేరాఫ్‌గా నిలిచారో.. జపాన్‌లో 69 ఏళ్ల మాజీ ప్రధాని యోషిహికో నోడా కూడా అదే తరహాలో ఆసక్తి రేపుతున్నారు.జపాన్ మాజీ ప్రధాని యోషిహికో నోడా(Yoshihiko Noda).. ఒకప్పుడు దేశాన్ని నడిపించిన నేత. ఇప్పుడు నిత్యం ఉదయాన్నే రైల్వే స్టేషన్‌కు వెళ్లి ప్రయాణికులకు కరపత్రాలు పంచుతున్నారు. తాజాగా చిబా ప్రిఫెక్చర్‌లోని మినామి-ఫునాబాషి స్టేషన్ వద్ద ఆయన అలా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆయన్ని గుర్తించి పలకరించగా.. మరికొందరు బిజీగా ఉండటంతో కరపత్రాలు తీసుకోకుండానే వెళ్లిపోయారు. అయినా నోడా మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. ఆయన తీరే అంత!ఇది నోడాకు కొత్త వ్యవహారం కాదు. గత నలభై ఏళ్లుగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు. మధ్యలో ఆయన రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. చిబా ప్రిఫెక్చర్ అసెంబ్లీ నుంచి జపాన్ పార్లమెంట్ వరకు ఎదిగారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2011లో జపాన్ ప్రధానమంత్రి అయ్యారు. 2012లో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నా.. స్టేషన్ వద్ద ప్రజలను కలుసుకునే అలవాటును మాత్రం వదులుకోలేదు.Japan ex-PM Noda hands out flyers pic.twitter.com/CWnEuDoZpK— RT (@RT_com) September 18, 2026ఇప్పుడు ఆయన పంచే కరపత్రాల్లో స్థానిక సమస్యలు, విపత్తు బీమా, పిల్లల సంరక్షణ, ప్రిఫెక్చర్ సంస్కరణలు వంటి అంశాలు ఉంటున్నాయి. అంటే.. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజలతో నేరుగా మాట్లాడటానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు.హోదా మారినా.. రొటీన్ మారలేదు1986 అక్టోబర్ 1న జేఆర్ సుడానుమా స్టేషన్ వద్ద కరపత్రాలు పంచడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ రొటీన్‌ను కొనసాగిస్తున్నారు. ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఏళ్ల తర్వాత కూడా ఉదయాన్నే రైల్వే స్టేషన్లో నిలబడి ప్రయాణికులకు కరపత్రాలు పంచడం ఆసక్తి కలిగిస్తోంది. పెద్ద కార్యక్రమాలు, భారీ హంగామా లేకుండా సాధారణంగా ప్రజలను కలవడం నోడా రాజకీయ జీవితంలో భాగంగా మారిపోయింది.మన దగ్గర గుమ్మడి నర్సయ్య కూడా ఇలాంటి సాదాసీదా జీవనశైలితోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించడం, సాధారణంగా ప్రజల మధ్య కనిపించడం ఆయన జీవనశైలిలో భాగంగా ఉండేది. అందుకే పదవి తర్వాత కూడా సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం.. ఈ ఇద్దరి మధ్య పోలికకు కారణమైంది.ప్రధాని పదవి దేశ రాజకీయాల్లో అత్యున్నత హోదా. అయినా ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రజలను కలిసే విధానం మారలేదు. అలాగని ఆయన ఏదో వైరల్ కావడం కోసమో ఈ పని చేయడం లేదు. స్వచ్చందంగా కొందరు నెటిజన్లు ఆయన గురించి పోస్టులు చేస్తుంటారు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజల్లోకి వెళ్లడానికి పెద్ద కాన్వాయ్, హంగామా అవసరం లేదని నోడా రొటీన్ గుర్తుచేస్తోంది. ఈ సింప్లిసిటీ ఈ జనరేషన్ నేతల్లో ఉంటేనా.. సోషల్ మీడియా పోస్టులు, ఫొటోషూట్లకే పరిమితం కాకుండా.. ఇలా నేరుగా ప్రజల మధ్య కనిపించే రాజకీయాలు ఇంకెన్ని కనిపించేవో!.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో బస్సును హైజాక్ చేసి.. -
యువతిని వేధిస్తున్న టీడీపీ యువ నాయకుడు
తిరుపతి: మండలంలోని పొయ్యకొత్తూరుకు చెందిన టీడీపీ యువ నాయకుడు సురేష్ వేధింపులు ఎక్కువయ్యాయి. పట్టణంలోని సాలిపేటకు చెందిన ఓ యువతి వద్ద అతను ఏడాది క్రితం కుక్కపిల్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపేందుకు యువతి సెల్‌ఫోన్ నంబర్ తీసుకున్నాడని, ఆ తర్వాత నుంచి ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమె బీవైసీ పార్టీ రాష్ట్ర మహిళా కో కనీ్వనర్ హిమబిందు దృష్టికి తీసుకెళ్లింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సురేష్‌పై శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైనప్పటికీ బెదిరింపులు ఆగలేదని, మహిళకు జరిగిన అన్యాయంపై సామాజిక బాధ్యతతో అండగా నిలిచినందుకు తనపై కూడా దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాడని హిమబిందు ఆరోపించారు. ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేసినా..! ఈ నేపథ్యంలో గత గురువారం హిమబిందుతో కలిసి మహిళలు పొయ్యకొత్తూరులోని సురేష్ ఇంటికి వెళ్లారు. అతని వేధింపులపై కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సురేష్ హిమబిందు ఇంటికి వెళ్లి విధ్వంసానికి పాల్పడ్డాడు. పొయ్యకొత్తూరు నుంచి వస్తున్న ఇద్దరు మహిళలను అడ్డుకుని వారిపై దాడికి యత్నించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సురేష్ తాను టీడీపీ నాయకుడినని, ఎమ్మెల్యే తనకు తెలుసంటూ హంగామా చేశాడని, ‘మీ అంతు చూస్తానంటూ’ పోలీసులను సైతం బెదిరించినట్లు బాధితులు ఆరోపించారు. కొందరు టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సురేష్‌కు మద్దతుగా మాట్లాడినట్లు సమాచారం. మహిళలు రాజీకి అంగీకరించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆగని బెదిరింపులు ఇప్పటికే కేసు నమోదైనా బెదిరింపులు ఆగలేదని హిమబిందు ఆరోపించారు. ఓ మహిళకు అండగా నిలిచినందుకు తనపై దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయగా.. మరుసటి రోజు అయిన ఆదివారం ఉదయానికే సురేష్ తన ఇంటి వద్దకు వచ్చి అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం అద్దాలు, లైట్లు ధ్వంసం చేసి ఇబ్బందులకు గురిచేశాడని హిమబిందు ఆరోపించారు. అండగా నిలిస్తే చంపేస్తారా? ఈ ఘటనపై హిమబిందు సోషల్ మీడియా వేదికగా ఆదివారం తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘సామాజిక బాధ్యతతో ఓ మహిళకు అండగా నిలిస్తే చంపేస్తామని బెదిరిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే పేరును ప్రస్తావిస్తూ.. టీడీపీ యువ నాయకులు మహిళలకు చేస్తున్న అన్యాయాలు, తన∙పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలు ఆయనకు తెలియవా?.. లేక వారికి నిజంగానే ఎమ్మెల్యేయ అండదండలు ఉన్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మహిళలను కాపాడాలని, తనకు జరిగిన పరిణామాలపై కూడా స్పందించి న్యాయం చేయాలని హిమబిందు కోరారు. హిమబిందు సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై పోలీసులు స్పందించినట్లు సమాచారం. సురేష్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి 13 రోజుల రిమాండ్‌కు తరలించారు.యువతిని వేధిస్తున్న టీడీపీ యువ నాయకుడు -
మోరల్ పోలీసింగ్ పేరిట మానవ మృగాళ్లు
మోరల్ పోలీసింగ్ పేరిట యువజంటలపై తరచూ దాడులు జరుగుతున్న ఘటనలు చూస్తున్నదే. అయితే ఇక్కడ ఓ యువజంటపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన తీరు మరీ దుర్మార్గంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడిని పక్కకు లాగిన అనంతరం.. యువతిని కొందరు చుట్టుముట్టారు. పైగా వారిలో ఒకడు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రాత్రివేళ ఓ యువజంటపై ఓ గ్యాంగ్ దాడికి దిగింది. యువకుడ్ని కొందరు లాగిపడేయగా.. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. అందులో ముసుగుతో ఉన్న ఒకడు హఠాత్తుగా దూసుకొచ్చి ఆ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ టైంలో అసభ్యంగా తాకుతూ ఈడ్చుకెళ్లాడు. ఆమె భయంతో కేకలు వేయగా.. యువకుడు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ యువకుడు ఆమెను విడిపించి.. అక్కడి నుంచి ఇద్దరూ పరుగులు తీశారు. మరో వీడియోలో కాస్త దూరంలో వాళ్లిద్దరూ బైక్‌పై కూర్చోగా.. ఆ టైంలోనూ ఆ రాక్షసులు వాళ్లతో వాగ్వాదానికి దిగారు. చివరకు యువతీయువకుడు చేతులెత్తి బతిమాలడంతో.. వాళ్లను అక్కడి నుంచి పోనిచ్చారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.ఈ వీడియోలు బయటకు రావడం, వైరల్ కావడంతో.. ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మోరల్ పోలీసింగ్ పేరుతో ఎవరినీ వేధించే లేదంటే మహిళపై అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదని పలువురు పేర్కొంటున్నారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.తాజా ఘటన బిహార్‌లోని జమూయి ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇదే రీజియన్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన మూడో ఘటన ఇది. దీంతో నెటిజన్లు అక్కడి పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాళ్లది ముమ్మాటికీ ఆ యువతిని రేప్ చేసే ఉద్దేశంగా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. మహిళను బలవంతంగా పట్టుకోవడం, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. మహిళల భద్రతపై ఇలాంటి ఘటనలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటున్నారు.ప్రేమజంటలను అడ్డుకోవడం, వేధించడం, దాడి చేయడం పేరేదైనా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమే. మహిళను చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం, అసభ్యంగా ప్రవర్తించడం మరింత తీవ్రమైన అంశమంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మోరల్ పోలీసింగ్ పేరిట ఇలా ప్రవర్తించడం రేపిస్టుల మనస్తత్వమని ఏకిపారేస్తున్నారు. సదరు వీడియోపై బిహార్ పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: మనుషులా? మానవ మృగాలా? -
స్టైలిష్ లుక్‌లో నమ్రతా.. ఫ్రెండ్స్‌తో ఆషిక రంగనాథ్ చిల్..!
లేహ్‌లో హీరోయిన్ శ్వేతాబసుప్రసాద్ చిల్..స్టైలిష్ లుక్‌లో మహేశ్ బాబు సతీమణి నమ్రతా..ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోన్న ఆషిక రంగనాథ్..శారీలో హీరోయిన్ తమన్నా అందాలు..అనంతిక సనిల్‌కుమార్ నేచురల్ లుక్స్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
హడలెత్తిన రైడ్.. వెంటపడ్డ వాహనాలు.. రెండు గంటల భయానక జర్నీ!
వెనకాలే వస్తున్న వాహనాలు.. చుట్టూ వింత చూపులు.. రాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న ఢిల్లీ రోడ్లు.. స్కూటర్‌పై ఒంటరి ప్రయాణం.. వెనుక నుంచి వస్తున్న వాహనాలు.. చీకటిలో తనవైపు నిలిచిపోయిన చూపులు.. మొదట ఇదంతా ఓ సాధారణ రాత్రి రైడ్‌లానే అనిపించింది. కానీ కొన్ని నిమిషాలు గడిచేసరికి పరిస్థితి మారిపోయింది. ఒకటి తర్వాత మరొకటి ఎదురైన ఘటనలతో ఆ ప్రయాణం చివరకు భయానక అనుభవంగా మారింది.రాత్రివేళ మహిళలు ఎదుర్కొనే పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలనుకున్న ఓ కంటెంట్ క్రియేటర్ ఈ ప్రయోగం చేశాడు. BeJaintle పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ చేసే అతడు.. ఇంట్లోనే మహిళ మాదిరిగా కనిపించే మేకప్ వేసుకుని, డ్రెస్ ధరించి, తలకు దుపట్టా కప్పుకున్నాడు. ఆ తర్వాత స్కూటర్ తీసుకుని ఢిల్లీ రోడ్లపైకి బయలుదేరాడు.మొదట చూపులు.. ఆ తర్వాత వెంటపడటం!రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే తనవైపు పలువురు చూస్తున్నారని క్రియేటర్ గుర్తించాడు. ఎక్కడికి వెళ్లినా ఆ చూపులు తనను వెంబడిస్తున్నట్లు అనిపించాయని అతడు వీడియోలో పేర్కొన్నాడు. ఒక దశలో ఇద్దరు వ్యక్తులు తనను గమనిస్తూ స్కూటర్‌ను అనుసరించారని అతడు ఆరోపించాడు. మొదట దూరంగా కనిపించిన వారు.. క్రమంగా తనకు దగ్గరగా రావడానికి ప్రయత్నించారని చెప్పాడు. మరో సందర్భంలో స్కూటర్ నడుపుతుండగానే ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి మాట్లాడటం ప్రారంభించాడని తెలిపాడు.చీకటి రోడ్డుపై ఆటోలు.. అసలు టెన్షన్ అక్కడితో ఆగలేదు. ప్రయాణంలో రెండు ఆటోలు తన స్కూటర్ మార్గంలోకి పదేపదే వచ్చినట్లు క్రియేటర్ చెప్పాడు. ఓ ఆటో డ్రైవర్ తన స్నేహితులు వీడియో తీస్తున్నారని గుర్తించిన తర్వాత ఆగిపోయాడని అతడు తెలిపాడు. మరో డ్రైవర్ మాత్రం తన స్కూటర్ వైపు పలుమార్లు వాహనాన్ని మళ్లించినట్లు ఆరోపించాడు. ఆ వాహనం చివరకు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పాడు.‘ఇక చాలు..’ అంటూ ముగింపురెండు గంటలు గడిచేసరికి అతడి ఉత్సాహం మొత్తం భయంగా మారిపోయింది. పదేపదే ఎదురైన చూపులు, అనుసరిస్తున్నట్లు అనిపించిన వ్యక్తులు, తన దారిలోకి వస్తున్న వాహనాలతో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని చెప్పాడు. గత రెండు గంటల్లో నాకు చాలా అసహ్యంగా అనిపించింది. ఆటోవాళ్లు, సైకిల్ వాళ్లు.. అందరూ చూస్తూనే ఉన్నారు. రాత్రివేళ అమ్మాయిలు ఒంటరిగా బయటకు రావడం నిజంగా సురక్షితం కాదనిపించింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. చివరకు ఆ ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేశాడు. మహిళ వేషంలో చేసిన ఆ రాత్రి ప్రయాణం.. కేవలం సోషల్ మీడియా ప్రయోగంగా మొదలై, తనకు భయాన్ని మిగిల్చిన అనుభవంగా మారింది.ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మహిళలు రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఎదుర్కొనే అవాంఛిత చూపులు, అనుసరణ, వేధింపులపై పలువురు స్పందించారు. అయితే ఒక్క వ్యక్తి చేసిన ఈ ప్రయోగాన్ని ఆధారంగా చేసుకుని ఢిల్లీలో మహిళల భద్రతపై విస్తృతమైన నిర్ధారణకు రావడం సరికాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. He Dressed as a Woman and Rode Through Delhi at Night. What He Experienced in 2 Hours Is Now Raising Questions About Women’s Safety.A Delhi-based content creator conducted a social experiment by dressing as a woman and riding a scooty through the capital after dark.His… pic.twitter.com/5eVM92jtLp— News Insider 24x7 (@newsinsider24x7) September 19, 2026ఇదీ చదవండి: గణేశ్ మండపం వద్ద కరెంట్ షాక్.. మహిళ, బాలిక మృతి -
రాహుల్ సమక్షంలో మోదీ మిమిక్రీ.. రగిలిపోతున్న బీజేపీ!
భోపాల్ : పేపర్ లీకేజీలతో పాటు ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం రాజకీయ దుమారానికి దారితీసింది.మధ్యప్రదేశ్ ఇండోర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ మిమిక్రీ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు సహా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండించారు.కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కమెడియన్లు, జోకర్ల పార్టీగా మారిపోయిందని, వారు శాశ్వతంగా రాజకీయాల నుంచి కనుమరుగయ్యారని ఆర్ఐపీ వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నైతిక దివాలాకోరుతనానికి అట్టడుగు స్థాయికి దిగజారాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ధ్వజమెత్తారు. విద్యార్థుల సంభాషణ వేదికను ఉపయోగించుకుని ప్రధానిని అపహాస్యం చేయడం వారిలో మానవతా దృక్పథం లోపించడాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు. బీజేపీ నాయకుడు సీఆర్ కేశవన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇలాంటి వ్యక్తులతో వేదికను పంచుకోవడమే కాక, ఆ వ్యాఖ్యలకు నవ్వుతూ మద్దతు తెలిపారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ చవకబారు సంస్కృతిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. ఈ వివాదానికి కారణం ఏమిటి?ఇండోర్‌లో విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి రాహుల్ గాంధీతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన మిమిక్రీ ప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రభుత్వంపై, ముఖ్యంగా పేపర్ లీక్‌లు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థులు విద్యా వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. అయితే, ఇదే వేదికపై కమెడియన్ పుల్కిత్ మణి చేసిన ప్రదర్శన ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన పుల్కిత్ మణి ఒక ప్రొఫెషనల్ స్టాండప్ కమెడియన్.ఆయన 2021 నుంచి ప్రొఫెషనల్‌గా స్టాండప్ కామెడీ ప్రదర్శనలు ఇస్తున్నారు. లైవ్ షోలు, కామెడీ క్లిప్‌లు, ప్రముఖుల మిమిక్రీ , పొలిటికల్ సెటైర్లతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుత కాలంలో యువతను ఆకట్టుకునేలా సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై కామెడీ స్కిట్లు చేయడం ఆయన శైలి. #WATCH | Indore, Madhya Pradesh: At the 'Chhatron Ki Goonj' programme in Indore, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "...The 'andhbhakt' says development is not needed. Modi ji is an incarnation of Vishnu. But the andhbhakt never asks questions. An andhbhakt will… pic.twitter.com/0Xa5b70O8h— ANI (@ANI) September 19, 2026 -
లైక్స్ రాకుంటే టీనేజర్లలో నిద్రలేమి!
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు ఆశించినంత స్పందన రాని టీనేజర్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతినడమే కాకుండా నిద్రలేమి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని దేశంలో తాజాగా జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది. ‘ద జర్నల్ ఆఫ్ థియరిటికల్ అకౌంటింగ్ రీసెర్చ్’లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో భాగంగా టీనేజర్లు తమ పోస్టుకు వస్తాయని ఆశించిన లైక్స్ సంఖ్యకు, నిజంగా వచ్చిన లైక్స్ సంఖ్యకూ మధ్య ఉన్న తేడాను పరిశోధకులు పరిశీలించారు. ఈ సమయంలో టీనేజర్లను 30 రోజులపాటు స్మార్ట్ వాచ్‌ల ద్వారా పర్యవేక్షించారు.వారి నిద్రలోని దశలు, గుండె కొట్టుకొనే తీరులో మార్పులు, శ్వాస తీసుకొనే రేటు, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, నిద్ర నాణ్యత స్కోర్ తదితర అంశాలను నమోదు చేశారు. సోషల్ మీడియా కలిగించే భావోద్వేగ ఆందోళనలు టీనేజర్లలో నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాయని ఈ సర్వేలో తేలింది. ఒక పోస్టుకు ఆశించిన దానికన్నా తక్కువ లైక్స్ వస్తే ఇతరులతో పోల్చుకొని ఆందోళన చెందుతుండటం ఈ పరిస్థితికి దారితీస్తోందని వెల్లడైంది. 18–25 ఏళ్ల మధ్య యువతలో 64.7 శాతం మందికి నాణ్యమైన నిద్ర లేదని ఉండట్లేదని మరో అధ్యయనం వెల్లడించింది. 22.5 శాతం మంది రాత్రంతా నిద్రపోకుండా సోషల్ మీడియాలోనే ఉంటున్నారని.. 7.8 శాతం మంది తమకు తక్కువ లైక్స్ లేదా కామెంట్లు రావడం వల్ల బాధపడుతున్నారని అంచనా వేసింది. -
టికెట్ చూపించమంటే బట్టలు చించేసుకుంది!
రైలు ప్రయాణంలో టికెట్ తనిఖీ సాధారణమే. టికెట్ లేకపోతే జరిమానా చెల్లించాలి.. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు ఎదుర్కోవాలి. కానీ ఓ మహిళ మాత్రం టికెట్ అడిగిన టికెట్ ఎగ్జామినర్‌తో వాగ్వాదానికి దిగి.. చివరకు తన దుస్తులనే చించేసుకుంది. అంతటితో ఆగకుండా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేయడంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో రైలులో ప్రయాణిస్తున్న మహిళను యువతి చూపించమని టీటీఈ అడిగాడు. అయితే ఆమె వద్ద టికెట్ లేకపోవడంతో డ్రామాకు దిగింది. అదే సమయంలో తన సోదరుడు కూడా రైల్వేలో టీటీఈగా పని చేస్తాడని కబర్లు చెప్పింది. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫోన్లో మాట్లాడుతున్నట్లు చేస్తూ.. ఆ యువతి ఒక్కసారిగా తన దుస్తులను తానే చించుకోవడం ప్రారంభించింది. దీంతో అక్కడున్నవాళ్లంతా కంగుతిన్నారు. ఆపై టీటీఈ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఫోన్లో రికార్డ్ చేయడంతో..అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని టీటీఈ తన ఫోన్లో రికార్డ్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి గొడవకు దిగకుండా ప్రశాంతంగా వ్యవహరించిన ఆయన.. అత్యవసర పరిస్థితి అనుకుంటే 112కు ఫోన్ చేయాలని మహిళకు సూచించినట్లు తెలుస్తోంది.ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ మొదలైంది. ఘటనను రికార్డ్ చేయడం వల్ల టీటీఈపై తర్వాత ఎలాంటి ఆరోపణలు వచ్చినా అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆధారం ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. రైల్వే సిబ్బందికి బాడీ కెమెరాలు అందుబాటులో ఉంచితే ఇలాంటి వివాదాల్లో మరింత స్పష్టమైన ఆధారాలు ఉంటాయని కొందరు సూచిస్తున్నారు.రైల్వే సిబ్బందికి కొత్త సవాల్ప్రయాణికులతో నిత్యం నేరుగా వ్యవహరించే టీటీఈలు, ఇతర ఫ్రంట్‌లైన్ రైల్వే సిబ్బందికి ఇలాంటి వివాదాలు కొత్త సవాలుగా మారుతున్నాయి. టికెట్ తనిఖీల సమయంలో ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునే సందర్భాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఇరువైపులా ఉన్న వారి ప్రవర్తనను రికార్డ్ చేసే వ్యవస్థ ఉంటే వాస్తవాన్ని నిర్ధారించడం సులభమవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టత లేదు. సోషల్‌మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతోంది. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మహిళకు జరిమానా విధించినట్లు కూడా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు, కేసులో నమోదైన ఆరోపణలు తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.Woman tears off her clothes to accuse TT of molestation when he asked her to show ticketNeither Indian Police Nor Indian Judiciary knows how to handle such women Men in all such services should be provided bodycams to save themselves from false cases pic.twitter.com/ZoaV3HmBek— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) September 19, 2026ఇదీ చదవండి: రాజా సాబ్ వార్నింగ్ వీడియో వైరల్ -
‘రోడ్డు వేయకపోతే ఓటు వేయను సర్’.. ఎంపీ సీరియస్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున ప్రశ్నించడం ఒక బాధ్యత.. అధికారంలోకి వచ్చాక అదే ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం మరో బాధ్యత. ఆ మధ్య రాఘవ్ చద్దా నీట్ నిరసనలపై మౌనంగా ఉండడంపై చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తానిప్పుడు అధికార పార్టీలో భాగమని.. ప్రశ్నించే స్థానంలో లేనంటూ వ్యాఖ్యానించారాయన. ఇప్పుడు కేంద్ర మంత్రి, గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తీరు కూడా అలాగే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రోడ్డు సమస్యపై ఓటర్ నిలదీయగా.. కాస్త కోపం.. కాస్త ఆవేశంగా ఆయన స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని గుణలో సెప్టెంబర్ 18న ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు హనుమాన్ ఆలయం వద్ద సింధియా వాహనాన్ని ఆపి రోడ్డు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు నిర్మించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి.. రోడ్డు వేయకపోతే వచ్చేసారి ఎన్నికల్లో మీకు ఓటు వేయబోమని చెప్పాడు.దీనిపై సింధియా స్పందిస్తూ.. “ఈ భాష నా ముందు ఉపయోగించొద్దు.. ఊరుకుంటా అనుకుంటున్నారా’’ అంటూ కటువుగా బదులిచ్చారు. ఆ తర్వాత కాస్త శాంతించి.. మీరు వచ్చి వినతిపత్రం ఇవ్వండి.. నా బాధ్యత, అన్నీ జరుగుతాయి అని చెప్పారు. సదరు వ్యక్తికి వేలు చూపిస్తూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Janta bhi matlab ek dum bewakoof hai.Raja sahab ne election time me khud ko "jan-sevak" aur tumhe "janta-janardan" kya bol diya, tum to khud ko relevant samajh kar accountability maangne lage.Hadd me raho bhai. Charno me let kar nivedan karna seekho. pic.twitter.com/gjonJQJ5Qq— THE SKIN DOCTOR (@theskindoctor13) September 18, 2026మరోవైపు, గుణ పర్యటనలోనే సింధియా అధికారుల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలతో ఎదురుచూస్తుండగా కారు వద్ద ఉన్న కలెక్టర్, ఎస్పీలను పిలిపించి.. “వాహనంలో కూర్చోవద్దు.. మీరు నా డ్యూటీలో ఉన్నారు” అంటూ ఆదేశించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.సింధియా స్పందనపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. గుణ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా గతంలో కాంగ్రెస్‌లో ఉండి, ఆ తర్వాత బీజేపీలో చేరారు. యువత పన్నులు చెల్లించాలని, బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని తరచూ సూచించే ఆయన.. తాజాగా రోడ్డు సమస్యపై ఓ పౌరుడు, రోడ్డు నిర్మించకపోతే ఓటు వేయబోమని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందిస్తున్న కొందరు.. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల కింద ఉండే ప్రజలు కాదని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాల్సిన వారని గుర్తు చేస్తున్నారు. రాచరిక కాలం ముగిసి దశాబ్దాలు గడిచాయని, ప్రజలే అసలైన యజమానులనే విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలని సింధియాకు చురకలంటిస్తున్నారు.ఇదీ చదవండి: మోదీ 76.. ఆయనకు కూడా 76! -
13 ఏళ్ల వయసులో కన్నబిడ్డ కోసం పోరాటం?!
ఆడుకోవాల్సిన వయసులో పెళ్లి. చదువుకోవాల్సిన వయసులో మాతృత్వం. చివరకు దూరమైన బిడ్డ కోసం ఆమె తల్లడిల్లిపోయింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే తన ఏడు నెలల కొడుకు కోసం కోర్టు మెట్లెక్కిన ఆమె.. ఆ న్యాయపోరాటంలో విజయం సాధించింది. చిన్నారి అనామికా కథ.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.అనామికా అకర్త్కు సోషల్ మీడియా ద్వారా 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా.. అటు నుంచి అటు పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది. అప్పటికి ఆమె వయసు కేవలం 11 ఏళ్లే. బాల్యం అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకునే స్థితి కూడా లేదు. అయినప్పటికీ వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె 2026లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.అయితే కొద్ది నెలలకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది మేలో భర్త, అత్తమామలు అనామికను ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే అనామిక బిడ్డను మాత్రం తమ వద్దే ఉంచుకున్నారు. దీంతో తన కుమారుడిని తిరిగి తనకు అప్పగించాలని కోరుతూ అనామిక కోర్టును ఆశ్రయించింది.‘ఆమె కూడా ఇంకా చిన్నారే’ఈ కేసును విచారించిన కోర్టు.. ఏడు నెలల శిశువును అనామిక సంరక్షణకు అప్పగించాలని ఆదేశించినట్లు వైరల్ వీడియో సారాంశం. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. బిడ్డ తల్లి అనామిక కూడా ఇంకా చిన్నారేనన్న విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ వైరల్ కథనాల్లో కనిపిస్తోంది. అలా తన బాల్యాన్ని కోల్పోయిన ఓ బాలిక.. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం పోరాడి నెగ్గిందన్నమాట. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది. కఠిన చట్టం ఉన్నా.. బాల్య వివాహాలు మాత్రంబంగ్లాదేశ్లోనూ బాల్య వివాహాలను కట్టడికి చట్టాలు ఉన్నప్పటికీ.. ఆచరణలో మాత్రం సమస్య కొనసాగుతోంది. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో 20–24 ఏళ్ల వయసున్న మహిళల్లో దాదాపు 47 శాతం మంది 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నవారే. పేదరికం, సామాజిక ఒత్తిళ్లు, సంప్రదాయాలు వంటి కారణాలు బాల్య వివాహాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. చిన్న వయసులో పెళ్లి కావడం వల్ల బాలికల చదువుకు ఆటంకం కలగడమే కాకుండా.. ముందస్తు గర్భధారణ, ప్రసవ సంబంధ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఆధారపడటం, హింసకు గురయ్యే ముప్పు కూడా పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బంగ్లాదేశ్ కోర్టులో అనామికకు న్యాయం జరిగింది. కొన్నిచోట్ల మరో దేశం వినిపిస్తోంది. అలాగే ఆమె వయసు విషయంలోనూ భిన్న వాదనలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏది ఏమైనా అంత చిన్న వయసులో ఓ బాలిక తన బిడ్డ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిన ఈ ఘటన.. బాల్య వివాహం కేవలం ఓ పెళ్లి కాదని గుర్తుచేస్తోంది. ఒక చిన్నారి చేతుల్లో బిడ్డను పెట్టడమే కాదు.. ఆమె చదువు, స్వేచ్ఛ, కలలు, భవిష్యత్తును కూడా ముందుగానే బాధ్యతల కింద నలిపేస్తోంది. అనామికకు దక్కిన ఈ విజయం ఆమె బిడ్డను తిరిగి ఇచ్చింది.. కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి మరో బాలిక వెళ్లకుండా ఆపగలమా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.🚨 SHOCKING: CHILD MARRIED AT 11, MOTHER AT 13!Anamika Akter, reportedly married to a 22 year old man at just 11, became a mother at 13.A CHILD is now raising another CHILD. 💔How is this still happening in Bangladesh? pic.twitter.com/Ayg0vJIN77— News Matrix (@NewsMatrixIND) September 18, 2026 -
మోదీ టీచర్ వయసు.. ఇదిగో క్లారిటీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పాఠాలు చెప్పిన మాజీ ఉపాధ్యాయుడు హెచ్‌సీ పటేల్ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ చిన్ననాటి జ్ఞాపకాలను పటేల్ గుర్తుచేసుకోవడం ఒకవైపు ఆసక్తికరంగా మారితే.. మరోవైపు ఆయన ప్రస్తుత వయసుపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇద్దరికీ ఒకే వయసు ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన చెప్పిన సబ్జెక్ట్‌ల విషయంలోనూ పొంతన కుదరకపోవడమూ.. చర్చకు దారి తీసింది.హెచ్‌సీ పటేల్ గుజరాత్‌లోని వడ్నగర్లో మోదీ చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారట. 1965 జూన్ నుంచి 1967 మే వరకు మోదీకి మ్యాథ్స్, సైన్స్ బోధించినట్లు పటేల్ స్వయంగా గుర్తుచేసుకున్నారు. అయితే ఎన్డీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పటేల్ 10, 11 తరగతులకు మ్యాథ్స్, సైన్స్ బోధించారని పేర్కొన్నారు. పీటీఐ ఆధారంగా వచ్చిన మరో కథనంలో 11, 12 తరగతుల సైన్స్ టీచర్‌గా పేర్కొన్నారు. ఇక్కడే అసలు కథ ఆరంభమైంది.మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అంటే 1965లో ఆయన వయసు సుమారు 14–15 ఏళ్లు. 1967లో స్కూల్ విద్య పూర్తిచేసే సమయానికి ఆయన వయసు 16–17 ఏళ్ల మధ్య ఉంటుంది. అందువల్ల పటేల్ ఆ సమయంలో ఉపాధ్యాయుడిగా ఉన్న విషయం మాత్రం ఆయన చెప్పిన వివరాలతో స్పష్టంగా ఉంది. మరి టీచర్ వయసెంత? అంటూ ట్రోలింగ్ మొదలైంది.Ahmedabad, Gujarat: Teacher of Prime Minister Narendra Modi, H.C. Patel says, "I taught Narendra Modi for two years, from June 1965 to 1967 May, when he was in Classes 10 and 11. In Class 11, he would sometimes come to my house for tuition-not every day, but occasionally. There… pic.twitter.com/d7L7wCqk9N— IANS (@ians_india) September 17, 2026మోదీకి 14–16 ఏళ్ల వయసులో పాఠాలు చెప్పిన టీచర్.. ఇప్పుడు 76 ఏళ్ల మోదీతో పోలిస్తే మరింత వయసులో ఉండాలని కొందరు నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. సాధారణంగా టీచర్, విద్యార్థి మధ్య ఉండే వయసు తేడాను ప్రస్తుత వయసులతో పోల్చుతూ.. పటేల్ 80 లేదంటే 90లలో ఉండాల్సి ఉంటుందని కొందరు పోస్టులు చేస్తున్నారు.‘మోదీ.. చాలా షార్ప్’ఓవైపు ఈ చర్చ నడుస్తుండగా.. పటేల్ మాత్రం మోదీ విద్యార్థిగా ఉన్న రోజుల గురించి ఎన్నో విషయాలు గుర్తుచేసుకున్నారు. మోదీ చాలా చురుకైన విద్యార్థి అని, స్కూల్లో జరిగే దాదాపు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని చెప్పారు. ఒకసారి పాఠశాల భవనం ప్రహరీ నిర్మాణానికి నిధులు సేకరించేందుకు నిర్వహించిన నాటకంలో మోదీ జోగీదాస్ ఖుమాన్ పాత్ర పోషించారని తెలిపారు. కత్తితో నటిస్తూ కాఠియావాడీ భాషలో సంభాషణలు చెప్పిన ఆయనకు ప్రేక్షకుల నుంచి దాదాపు పది నిమిషాల పాటు చప్పట్లు(స్టాండింగ్ ఒవేషన్) లభించాయని పటేల్ గుర్తుచేసుకున్నారు.చిన్నప్పటి నుంచే మోదీకి ఈత అంటే ఆసక్తి ఉండేదని కూడా పటేల్ చెప్పారు. వడ్నగర్లోని శర్మిష్ఠ చెరువులో ఈత కొట్టే సమయంలో ఓసారి పిల్ల మొసలిని ఇంటికి తీసుకొచ్చారని.. తల్లి హీరాబెన్ దానిని తిరిగి చెరువులో వదిలేయాలని చెప్పడంతో మరుసటి రోజు మళ్లీ చెరువులో వదిలేశారని వివరించారు.రాజకీయాల్లోకి వచ్చినా.. టీచర్‌ను మర్చిపోలేదుమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను గుర్తించారని పటేల్ తెలిపారు. 2001లో మోదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు.. జన సందోహం మధ్య తనను గుర్తించిన మోదీ వచ్చి పాదాలకు నమస్కరించారని చెప్పారు. తర్వాత 2005లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ తన పాత ఉపాధ్యాయులను సత్కరించిన కార్యక్రమాన్ని కూడా గుర్తు చేశారు.సోషల్ మీడియాలో ప్రశ్న.. అసలు క్లారిటీ ఇదేఅయితే మోదీ, ఆయన టీచర్ పటేల్ వయసు 76 అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఓ జాతీయ మీడియా క్లారిటీ ఇచ్చింది. పటేల్ వయసు 90–91 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొంది. దీంతో ఆయన వయసుపై సోషల్ మీడియాలో వచ్చిన అనుమానాలకు తెరపడినట్టయింది. ఇక ఆయన చెప్పిన సబ్జెక్ట్‌ల విషయంలో ఎన్డీటీవీ, పీటీఐ కథనాల్లో కనిపించిన తేడా మాత్రం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.Age of PM modi - 76Age of Teacher - 75 pic.twitter.com/kVODe4xyd7 https://t.co/e0mimnacaU— AIN (@Tejusurya_) September 17, 2026ఇదీ చదవండి: ఆ స్టార్ హీరోలు చట్టాన్ని ఉల్లంఘించారని తెలుసా? -
బంగారంలా మెరిసిపోతున్న హన్సిక.. బ్లాక్ డ్రెస్‌లో లైగర్ భామ..!
బంగారంలా మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ..గ్రీస్‌లో చిల్ అవుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..శారీలో బాంధవి శ్రీధర్ హోయలు..ఫ్యామిలీతో మ్యాడ్ బ్యూటీ రెబా మోనిక జాన్ చిల్..బ్లాక్ డ్రెస్‌లో లైగర్ భామ అనన్య పాండే అందాలు.. View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Bandhavi Sridhar (@bandhavisridhar) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
లవర్‌ను పెళ్లాడి బిహార్‌కు, ఇన్‌స్టాలో అమెరికా అమ్మడు సందడి
అమెరికాలోని అట్లాంటా (జార్జియా) నగరానికి చెందిన యువతి హోప్ తను ప్రేమించిన వాడికోసం విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టింది. భారతీయ యువకుడైన అభిషేక్ సింగ్‌ను వివాహం చేసుకుని బిహార్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో స్థిరపడింది. ఆమె తన విభిన్నమైన కల్చరల్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. 2023లో హోప్ అభిషేక్ సింగ్‌ను వివాహం చేసుకుంది. 2025 అక్టోబర్‌లో తొలిసారిగా ఇండియాకు వచ్చింది. అంతే ఇక్కడి సంస్కృతిపై ఇష్టంతో బిహార్‌లోని ఒక చిన్న గ్రామంలోనే స్థిరపడింది. ఆమె ప్రస్తుతం ఆమె బిహార్‌లోని గ్రామీణ వాతావరణానికి, అక్కడి సాధారణ జీవనశైలికి అలవాటుపడి, భర్త, కుమారుడితో ఎంతో ఆనందంగా గడుపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by Singhfamily2.0 (@singhfamily2.0)ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్ ప్లాస్టిక్ టబ్‌లో చేతులతో బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, సాంప్రదాయ పొయ్యి మీద వంట చేయడం వంటి సాధారణ గ్రామ జీవితపు దినచర్యలను ఆమె తన సోషల్ మీడియా వీడియోల ద్వారా పంచుకుంటూ ఉంటుంది. ఎక్కువగా కుర్తాలు, చీరలు ధరించడం, సింధూరం పెట్టుకోవడం వంటి భారతీయ ఆచారాలను పాటిస్తోంది. 'గెట్-రెడీ-విత్-మి' వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే ఆమె కంటెంట్‌లో ఆహారం కూడా ఒక ముఖ్యమైన భాగం. సమోసా చాట్, పావ్ బాజీ, రోటీలు చేయడం వంటి వంటకాలను స్వయంగా చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడం విశేషం. ఇదీ చదవండి: పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతిసోషల్ మీడియా స్పందనభారతీయ సంస్కృతికి అలవాటు పడి, స్థానిక భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న తీరుపై నెటిజన్లు సంతోషాన్ని ప్రకటిస్తున్నారు. అమెరికాను వదిలి బీహార్‌లోని ఒక మారుమూల గ్రామంలో ఆమె జీవిస్తుండటం పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె నిర్ణయాన్ని ఆశ్చర్యంగా,విమర్శనాత్మకంగా చూస్తుండగా,మరికొందరు ఆమె భారతీయ సంస్కృతిని స్వీకరించిన తీరును అభినందిస్తున్నారు. అప్పుడప్పుడు విమర్శలు ఎదురైనప్పటికీ, ఆమె కంటెంట్‌కు వచ్చిన స్పందనలో చాలా వరకు సానుకూలంగానే ఉంది. ఈ అసాధారణమైన సాంస్కృతిక మార్పు, ఆమె గ్రామ జీవితానికి అలవాటుపడిన తీరు యూజర్లను ఆకట్టుకున్నాయి. ఇదీ చదవండి: మలేషియా విమానంలోనే ప్రాణం విడిచిన భారతీయుడు -
ఆఫీసులో కుక్కల హల్చల్.. ట్రెండింగ్‌లో వీడియో
నిరసనలు పలు రకాలు.. సమస్యను బట్టి వినూత్నంగా, వెరైటీగా చేపట్టేవి మరికొన్ని. కానీ వీధికుక్కల బెడదపై చేపట్టిన ఈ నిరసన మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అధికారులెంతకూ పట్టించుకోవడం లేదంటూ ఏకంగా కుక్కలనే నగర పంచాయతీ కార్యాలయంలోకి తీసుకొచ్చి అధికారి టేబుల్‌పై వదిలేశారు. అంతేకాదు.. కరెన్సీ నోట్లతో దండ వేసి మరీ తమ నిరసనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర్ పంచాయతీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రాంధవే ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. చిన్న సంచుల్లో తీసుకొచ్చిన వీధికుక్కలను కార్యాలయంలోకి తీసుకెళ్లి చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భామ్రే టేబుల్‌పై వదిలారు. దీంతో అవి అక్కడి నుంచి అటూ ఇటూ పరుగులు తీయడం వీడియోలో కనిపించింది.Yuva Sena district chief Vikram Randhave reportedly released 4–5 stray dogs inside the Niphad Nagar Panchayat chief officer’s office to protest the growing stray dog menace and alleged inaction by the civic body. 💀😭 pic.twitter.com/0wgQpHP00l— Ghar Ke Kalesh (@gharkekalesh) September 16, 2026నిఫాడ్ పట్టణంలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయిందని, వాటి వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు ఆరోపించారు. పలువురు కుక్కకాటుకు గురయ్యారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాల సమయంలో మండపాలకు వచ్చే ప్రజల్లోనూ వీధికుక్కల కారణంగా భయాందోళన నెలకొందని తెలిపారు.వీధికుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించడంతోపాటు వాటిని పట్టుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాంధవే డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా టెండర్ ప్రక్రియలపైనే అధికారులు దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇదే తరహాలో అధికారుల కార్యాలయంలో కుక్కలను తీసుకొచ్చి నిరసన చేపడతామని హెచ్చరించారు.ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలోనూ వీధికుక్కల సమస్యను నిరసిస్తూ ఓ వ్యక్తి కుక్క మాస్క్ ధరించి ప్రజావాణికి హాజరైన ఘటన వైరల్‌గా మారింది. తాజాగా నిఫాడ్‌లో కార్యకర్తలు ఏకంగా కుక్కలనే అధికారుల కార్యాలయంలోకి తీసుకురావడంతో ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.Khandwa, Madhya Pradesh - In a highly unusual form of protest, the Leader of the Opposition in the Khandwa Municipal Corporation, Deepak Rathore, arrived at the district Collectorate during a public hearing accompanied by a man wearing a dog mask. The demonstration was aimed at… pic.twitter.com/fkUih3zv4F— NextMinute News (@nextminutenews7) August 19, 2026ఇదీ చదవండి: మొసలిని ఇంటికి తెచ్చాడు.. అమ్మ మాటతో వెనక్కి వెళ్లాడు -
ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్!
సాక్షి, అమరావతి: అధికారాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలా.. లేక ప్రశ్నించిన గొంతునే మూయించాలా? రాష్ట్రంలో సోషల్ మీడియా వ్యవహారాలపై తాజాగా తలెత్తుతున్న వివాదాలు ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, అరాచక, అసమర్థ పాలనను ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. డీఎస్సీ–2025కు సంబంధించిన అక్రమాలపై ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. వాటిని ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు, ఖాతాలపై ఫిర్యాదులు, తొలగింపు అభ్యర్థనలు, కేసుల దిశగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోస్ట్ తొలగింపు.. ఖాతా నిలిపివేత.. కుదరకపోతే కేసు, అరెస్టు అన్నట్టుగా పరిస్థితి మారిందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవాబు చెప్పాల్సిన చోట.. ఖాతాలపై వేటు? డీఎస్సీ–2025 నియామకాలపై వైఎస్సార్సీపీ సహా పలువురు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిలో కొన్ని ఉదంతాలు వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. వరుసగా ఆధారాలు బయటపెడుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి అయిన ఆయన కుమారుడు లోకేశ్ గుక్కతిప్పుకోలేకపోతున్నారు. అందుకే ఆయా పోస్టులు, ఖాతాలపై చర్యలకు దిగుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి వేదికల్లో ప్రతిపక్ష పారీ్టలకు చెందిన ఖాతాలు, మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తుల పోస్టులపై ఫిర్యాదులు చేయడం ద్వారా వాటిని తొలగించేందుకు లేదా భారత్‌లో కనిపించకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు చెబుతున్నారు. డీఎస్సీ అంశంపై పోస్టులు చేస్తున్న నేపథ్యంలో సాక్షి టీవీ ఫేస్బుక్ పేజీ, సాక్షి డిజిటల్ ఇన్‌స్ట్రాగామ్, బిగ్ టీవీ ఇన్‌స్ట్రాగామ్, జగనన్న కనెక్ట్స్ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలను తప్పుడు ఫిర్యాదులతో మూసివేయించారు. ఇందుకోసం సైబర్ క్రైమ్ విభాగాన్ని రంగంలోకి దింపి తప్పుడు ఫిర్యాదులు చేయిస్తోంది. ఇన్స్పెక్టర్లే ‘సెన్సార్’ బోర్డులా? ఉండవల్లి కరకట్ట క్యాంప్ ఆఫీసు నుంచి వెళ్లిన ఆదేశాలతో పలు జిల్లాల్లో సీఐలు ఎఫ్‌బీఐ వంటి అంతర్జాతీయ సంస్థల పేరుతో ‘ఎక్స్’కు తప్పుడు రిక్వెస్టులు పంపి రాష్ట్రం పరువుతీశారు. కర్నూలు బస్సు దుర్ఘటనకు బెల్టు షాపులే కారణమంటూ 2025 అక్టోబర్ 26న వైఎస్సార్సీపీ పోస్టు పెట్టింది. ముఖ్యమంత్రిని అవమానించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత కర్నూలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ పోస్టులు తొలగించాలంటూ ‘ఎక్స్’కు నోటీసు పంపారు. గుంటూరులో ఇద్దరు నేతల ఎక్స్ పోస్టుల తొలగింపునకు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయ ఈ–మెయిల్ నుంచి ఇన్స్పెక్టర్ పేరుతో తప్పుడు ఫిర్యాదు చేశారు. అందులో ఫిర్యాదు చేసిన సంస్థ పేరును ఎఫ్‌బీఐ అని రాశారు. అది ఎఫ్‌బీఐ కాదు, ఏపీ పోలీసులేనని, ఎందుకు అలా రాశారో తమకే అర్థం కావడం లేదని ‘ఎక్స్’ సంస్థే బాధితులకు మెయిల్ పంపి గుట్టురట్టు చేసింది.విశాఖ సమీపంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం భూములు బలవంతంగా తీసుకుంటున్నారని తర్లువాడ రైతులు చేసిన వీడియోను అంతర్జాతీయ జర్నలిస్టుల నెట్వర్క్ ‘ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ కలెక్టివ్’ ప్రచురించింది. ఆ రీల్ భారత్‌లో కనిపించకుండా పోయింది. అప్పుడు భావప్రకటనా స్వేచ్ఛ.. ఇపుడు సెన్సార్షిప్.. భావప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణపై గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రతిపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు.. అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే గొంతుపై ఆంక్షలా? అంటూ నిలదీస్తున్నాయి. ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలకు సమాధానం ఇవ్వడం, వాస్తవాలను ప్రజలకు వివరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజ ప్రక్రియ. కానీ చంద్రబాబు మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉంటే భావప్రకటనా స్వేచ్ఛ ఉండాలి.. అధికారంలోకి వస్తే అన్నిటికీ సెన్సార్షిప్.. ఇదేం న్యాయం నారా వారూ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.డీఎస్సీలో అక్రమాలు.. సోషల్ మీడియాలో ప్రకంపనలు డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మంలో జరగని జూడో టోర్నమెంట్లో పాల్గొన్నట్లు కొందరు అభ్యర్థులు సర్టిఫికెట్లు సమర్పించారు.. సాఫ్ట్‌బాల్ విషయంలోనూ ఇదే తంతు. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి తన రిజర్వేషన్ కేటగిరీలో టెట్‌లో అర్హత సాధించకపోయినా ఉపాధ్యాయ ఉద్యోగం పొందారు. వీటిపై ప్రభుత్వం సమగ్రంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో.. వాటిని ప్రచారం చేస్తున్న ఖాతాలపై తప్పుడు ఫిర్యాదులతో చర్యలు తీసుకోవడం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 150 ఖాతాలు.. 770 పోస్టులు జర్నలిస్టులు, సాధారణ పౌరులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల పోస్టులపై ఏపీ సీఐడీ ‘ఎక్స్’కు లీగల్ అభ్యర్థనలు పంపి వాటిని మూసివేయించడానికి ప్రయత్నించింది. 150కి పైగా ఖాతాలకు చెందిన 770కి పైగా పోస్టులు ఆ అభ్యర్థనల్లో ఉన్నాయని, ఏకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖాతా కూడా లక్ష్యంగా మారిందని ఆ పార్టీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా తొలగించేలా చేశారు. తర్వాత పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ భారత్‌లో కనిపించకుండా పోయింది. తీవ్ర విమర్శలు రావడంతో చివరికి పునరుద్ధరించారు. ఒక గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారిక పేజీనే మూయించే స్థాయికి చంద్రబాబు దిగజారారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. -
జపాన్‌లో మంచు ఫ్యామిలీ సందడి.. అనసూయ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో..!
జపాన్‌లో మంచువారి ఫ్యామిలీ చిల్..టాలీవుడ్ నటి అనసూయ డ్యాన్స్ ప్రాక్టీస్..వినాయక నిమజ్జనంలో నటి బిందు మాధవి..శారీలో హెబ్బా పటేల్ అందాలు..గ్రీన్ శారీలో మెరిసిపోతున్న బిగ్‌బాస్ సావిత్రి.. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) -
చంద్రబాబూ.. మీ పాలనలో పోలీసింగ్ అంటే ఇదేనా?: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఏపీ పోలీసులు ఎఫ్‌బీఐ పేరును వాడటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ రాష్ట్రం పరువు తీయవద్దంటూ హితవు పలికారు. చంద్రబాబు పాలనలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందంటూ ధ్వజమెత్తారు.‘రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ఎఫ్బిఐ పేరును వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు. చంద్రబాబూ.. మీ పాలనలో ఇదేనా పోలీసింగ్ అంటే?. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా?. ‘ఎక్స్’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమను ‘ఎఫ్‌బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య.ఆ మెయిల్స్ అన్నీ ఏపీ పోలీసుల అధికారిక ఈ–మెయిల్ నుంచే వచ్చాయని ‘ఎక్స్’ ధృవీకరించింది.ఆ మెయిల్ పంపిన ఇన్స్పెక్టర్ తాను ‘ఎఫ్‌బీఐ’ అధికారినని ఎలా చెప్పుకున్నారు?.అసలు ఆ మెయిల్ పంపాలని ఆదేశించింది ఎవరు?‘ఎఫ్‌బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు?. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు..‘ఎక్స్’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా?అమలు చేయని సూపర్ సిక్స్ హామీలు, డీఎస్సీ కుంభకోణం, అమరావతి నిర్మాణంలో దోపిడీ, రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులపై పోస్టులు పెడితే ఎందుకు తొలగిస్తున్నారు?. పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించింది. అంతేగానీ మీ రాజకీయ సెన్సార్షిప్ను అమలు చేయడానికి కాదు.రాజకీయ ప్రయోజనాల ఏకంగా ఎఫ్‌బీఐ పేరును వాడటం ఏపీకి అవమానం. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తిన్నది.విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని,గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీల అమలుకు వినియోగించండి. ఇంకా తీవ్ర కరువుతో నష్టపోయిన రెతులను ఆదుకోవటానికి వాడండి. యువతకు ఉద్యోగాలు కల్పించండి. అలా నిజమైన అభివృద్ధి చేసి చూపండి. ఇకనైనా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు. ప్రజలకు మంచి చేసే విషయంలో మీ పనితీరును చూపండి.ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్షిప్, వేధింపులతో కాదు’’అని వైఎస్ జగన్ ఎక్స్‌లో తెలిపారు. .@ncbn గారి పాలనలో రాష్ట్రంలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరింది. రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు.చంద్రబాబు గారూ, మీ పాలనలో ఇదేనా…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2026 ఇదీ చదవండి : చంద్రబాబు సర్కార్ బండారం బట్టబయలు -
FBI ముసుగులో బాబు అరాచకాలు.. బయటపడ్డ సంచలన నిజాలు..
-
YSRCP సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత వెనుక సంచలన విషయాలు
-
సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్‌ను చేస్తా!
‘‘మీరు చాలా అందంగా ఉంటారు. అంతకంటే మంచి మనసు కూడా ఉంది. మీ వ్యక్తిత్వమూ ఎంతో అద్భుతమైంది. ఇవన్నీ కాదండీ.. మీరు ఓ కంప్లీట్ ఉమెన్. మీరు చేసే పని మీకు అస్సలు సూట్ కాలేదు. నేను గనుక రాజకీయాల్లో కొనసాగితే.. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కోటాలో మీకు ఏఐఎస్ జాబ్ ఇప్పిస్తా’’ .. ఇలా ఓ వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బ్యాంక్ ఉద్యోగి అయిన ఆమెను ఏకంగా ఐఏఎస్‌ను చేస్తానంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడా నేత. కాకపోతే అధికారంలోకి వస్తేనే ఆ పని చేస్తాడంట. అందుకోసం ఆమెను ‘కాంప్రమైజ్’ కావాలంటూ వేధించాడాయన!. ఓ బ్యాంక్ ఉద్యోగిని సంచలన ఆరోపణలతో ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేగింది. సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ విభాగం కార్యదర్శి రాజన్ రిజ్వీ తనను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిందామె. అంతేకాదు.. తనకు పంపిన పలు మెసేజ్‌లను మీడియా ముందు రిలీజ్ చేయడం తీవ్ర దుమారం రేపింది. రోజూ నా వెంటపడే వాడు. ఏదో ఒక పని మీద రిజ్వీ రోజూ బ్యాంక్‌కు వచ్చేవాడని.. తోటి సిబ్బందిని ప్రలోభపెట్టి తన నెంబర్ సంపాదించాడని.. అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టాడని ఆమె ఆంటోంది. గట్టిగా నిలదీస్తే బెదిరింపులకు దిగాడని ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనకు సీఎం కోటాలో ఐఏఎస్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రిజ్వీ ఆశ చూపుతున్నాడని చెబుతోంది. ఈ మేరకు రిజ్వీ చేసినట్లుగా ఉన్న వాట్సాప్ మెసేజ్‌లను బయటపెట్టిందామె."मुझे आपकी पर्सनालिटी पर ये जॉब अच्छी नहीं लगती। अगर भविष्य में राजनीति में आगे जाता हूं और सपा की सरकार बनती है तो मैं आपको CM कोटे से IAS बनवाने की कोशिश करुंगा"बैंक की महिला कर्मचारी को यह मैसेज करने वाला सपा नेता राजन रिजवी है। पुलिस ने FIR कर ली है।📍मथुरा, उत्तर प्रदेश pic.twitter.com/YfBHGXOG3Q— Sachin Gupta (@Sachingupta) September 16, 2026వేధింపులు ఎక్కువయ్యేసరికి తాను ఫోన్ ఎత్తడం మానేశానని.. దీంతో సరాసరి బ్యాంక్‌కు వచ్చి అందరి ముందే బెదిరించాడని చెప్పిందామె. అంతేకాదు.. తన కుటుంబాన్ని సైతం టార్గెట్ చేసుకున్నాడని.. గూండాలతో వాళ్లపై నిరంతరం నిఘా పెడుతున్నాడని వాపోయింది. భరించలేకనే ఇలా పోలీసుల ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంతో మధురలోని కొత్వాలి పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేయగా.. సెప్టెంబర్ 15న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఎస్పీ చర్యలు..రిజ్వీ వ్యవహారాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష ఎస్పీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అయితే కేసు నమోదైన నేపథ్యంలో రాజన్ రిజ్వీని సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ఇలా కలిశారో లేదో.. అలా పని జరిగిపోయింది! -
దర్గా సాక్షిగా హిందూ జంట పెళ్లి.. ముస్లిం పెద్దల అక్షింతలు
మతాల మధ్య చిచ్చు పెట్టి తమ ప్రయోజనాలు చూసుకునే ప్రయత్నాలు ఎక్కడో జరుగుతుండొచ్చు. కానీ సామాన్యులు మాత్రం ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికే పెద్దపీట వేస్తున్నారు. తమిళనాడులోని నాగూర్ నుంచి ఇప్పుడు అలాంటి మానవీయతను చాటే ఓ అందమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. నాగపట్నం జిల్లాలోని నాగూర్ ఆండవర్ దర్గాకు ఆదివారం ఉదయం వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలోని సన్నిధి వద్ద హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. వరుడు వధువు మెడలో తాళి కట్టగా.. అక్కడే ఉన్న దర్గా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు, ఇరు కుటుంబాల సభ్యులు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించారు.ముస్లిం పెద్దల ఆశీర్వాదం..నాగూర్ దర్గా చైర్మన్, వారసత్వ ట్రస్టీ మొహమ్మద్ ఖలీఫా సాహిబ్ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగపట్నం జిల్లా చాలా కాలంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నాగూర్ దర్గాలో వివిధ మతాలకు చెందిన ప్రజలు రావడం, తమ ప్రత్యేక సందర్భాలను జరుపుకోవడం కొత్తేమీ కాదన్నారు.VIDEO | Nagapattinam: Hindu wedding held at Nagore Dargah, with people from both Hindu and Muslim communities attending the ceremony. pic.twitter.com/D2f4vQ83PH— Press Trust of India (@PTI_News) September 15, 2026వధూవరుల వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. దర్గా నిర్వాహకులు హిందూ జంటను ఆశీర్వదిస్తున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాగూర్ దర్గా భిన్న మతాల ప్రజలు కలిసి మెలిసి ఉండే సంప్రదాయానికి మరోసారి వేదికగా నిలిచిందంటూ పలువురు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలను భవిష్యత్ తరాలకు కూడా చూపించాల్సిన అవసరం ఉందని ఖలీఫా సాహిబ్ అభిప్రాయపడ్డారు. ఓవైపు పలువురి అభ్యంతరాలు.. మరోవైపు మతం ఏదైనా ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావచ్చనే సందేశాన్ని ఈ వివాహ వేడుక చాటిందనే కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: నాగ్‌పూర్ హిట్ అండ్ రన్ కేసులో బిగ్ ట్విస్ట్ -
ఇరాన్ విమానంలో భయానక సీన్
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఒక్కసారిగా భారీగా కుదుపులకు గురైంది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇంతలో క్యాబిన్ పైకప్పు భాగాలు ఊడిపడి సీట్లపై వేలాడుతూ కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకుని బ్యాగులు కిందపడటంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. చివరకు పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.ఇరాన్‌కు చెందిన సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం మంగళవారం సాయంత్రం మషద్ నుంచి కెర్మాన్‌షాకు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్‌లోని ఓ టైరు ఊడిపోయింది. ఆ టైరు దెబ్బతినడంతో దాని భాగాలు ఇంజిన్‌ను తాకాయి. దీంతో ఇంజిన్‌లో సమస్య తలెత్తి విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి విమానాన్ని మషద్ వైపు మళ్లించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి తిరిగి ల్యాండ్ చేయాలని నిర్ణయించారు.భయంతో కేకలు..విమానం తిరిగి వస్తున్న సమయంలో కుదుపులు మరింత తీవ్రంగా మారాయి. ఆ ప్రభావంతో క్యాబిన్ పైకప్పు లోపలి లైనింగ్ భాగాలు ఊడిపోయి ప్రయాణికులపై పడినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ సమయంలో ప్రాణ భయంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. కొన్ని చోట్ల విమానం లోపలి నిర్మాణంలోని భాగాలు కూడా బయటకు కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకోవడంతో బ్యాగులు సీట్లపై, మార్గంలో పడిపోయాయి. సేఫ్‌గా ల్యాండింగ్..అయితే విమానం మషద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. లగేజీలు కిందపడ్డా కూడా ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో కెర్మాన్‌షాకు పంపించినట్లు సమాచారం. ఘటన అనంతరం రన్‌వేను కొంతసేపు మూసివేసి తనిఖీలు నిర్వహించారు.విమానంలో సాంకేతిక లోపానికి అసలు కారణమేంటన్న దానిపై ఇరాన్ పౌర విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం ఆగస్టు 25న మషద్‌లో ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి పక్కకు వెళ్లిన ఘటన జరిగింది.WATCH: Cabin ceiling falls apart onboard a Sepehran Airlines Boeing 737 after a tire reportedly burst shortly after takeoff from Mashhad Airport causing engine damage and severe vibrations. pic.twitter.com/R7RP1AwZYX— Breaking Aviation News & Videos (@aviationbrk) September 15, 2026 -
ఎఫ్‌బీఐ ముసుగులో సోషల్ మీడియా వేట!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ అణచివేత చర్యల కోసం.. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం కోసం పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు పోలీసుల స్థాయిని మరింత దిగజారి్చంది. సోషల్ మీడియాలో ప్రశ్నించేవారిపై కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్న చంద్రబాబు సర్కార్ అవి చాలవన్నట్లు వారి సోషల్ మీడియా అకౌంట్లను లక్ష్యంగా చేసుకుని పోలీసుల చేత తప్పుడు ఫిర్యాదులు చేయించే స్థాయికి కూడా దిగజారింది. సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలన్న చంద్రబాబు ఆదేశాలకు జీ హుజూర్ అంటున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో అభాసు పాలయ్యారు. ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. కానీ సంస్థ పేరు మాత్రం అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)! సోషల్ మీడియాలోని పోస్టులు తొలగించాలంటూ ‘ఎక్స్’కు చేసిన రిక్వెస్ట్‌లు ఇప్పుడు రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. గుంటూరు పోలీసుల అధికారిక ఈ–మెయిల్ నుంచి వచ్చిన ఆ రిక్వెస్ట్‌లో సంస్థ పేరు దగ్గర ‘ఎఫ్‌బీఐ’ అని రాశారు. దీంతో తొలుత అది అమెరికా ఎఫ్‌బీఐ నుంచి వచ్చిన ఫిర్యాదేనని ఎక్స్ భావించింది. అయితే తర్వాత పంపిన ఫాలోఅప్ మెయిల్లో ‘‘ఆ రిక్వెస్ట్ ఎఫ్‌బీఐ నుంచి రాలేదు.. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచే వచ్చింది’’ అని ఎక్స్ స్పష్టం చేసింది. ఏపీ పోలీసులు అలా ఎందుకు రాశారో తమకు తెలియదంది. అలా ఏపీ పోలీసుల గుట్టు రట్టయింది. పోలీసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువు అంతర్జాతీయస్థాయిలో పోయింది. అలా ఏపీని చంద్రబాబు గారు ప్రపంచ పటంలో పెట్టారంటూ నెటిజన్లు సెటైర్లు వేసే పరిస్థితి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ పోస్టులకు అమెరికా సంస్థ ఫిర్యాదా?చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న పలువురు సోషల్ మీడియా కార్యకర్తలకు ఎక్స్ నుంచి అనేక మెయిల్స్ వచ్చాయి. అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు సంగతి బయటపడింది. ‘ఎక్స్’ లీగల్ విభాగం నుంచి ‘మీ పోస్టులు భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయంటూ ఎఫ్‌బీఐ నుంచి ఫిర్యాదు అందింది’ అని మెయిల్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయాలపై పోస్టులు పెడితే అమెరికా ఫిర్యాదు చేయడమేంటి? అనే సందేహంతో ఎక్స్‌తో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని బట్టబయలు చేశాయి. తమకు అందిన ఫిర్యాదులపై ఆరా తీసిన ఎక్స్ కూడా ఏపీ పోలీసుల నిర్వాకాన్ని గ్రహించింది. తాము ముందు పంపిన మెయిల్లో ఎఫ్‌బీఐ అని పేర్కొనడం పొరపాటని, ఆ ఫిర్యాదు వచ్చింది ఏపీ పోలీసుల నుంచేనని అది స్పష్టం చేసింది. గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయ అధికారిక ఈ–మెయిల్ (జీయుఎన్టీయూఆర్యూఆర్బీఏఎన్ఎస్పీ–ఏపీ.జీవోవీ.ఐఎన్) నుంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏవీ బ్రహ్మం పేరుతో ఫిర్యాదు వచ్చిందని, దరఖాస్తులో సంస్థ పేరు దగ్గర ఆయనే ‘ఎఫ్‌బీఐ’ అని రాశారని తెలిపింది. అమెరికా ఎఫ్‌బీఐకి ఈ ఫిర్యాదుతో ఎలాంటి సంబంధం లేదని, ఏపీ పోలీసులు ఆ పేరు ఎందుకు వాడారో తమకే అర్థం కావడం లేదని ఎక్స్ లీగల్ విభాగం కుండబద్దలు కొట్టింది. ‘పూర్తి పారదర్శకత కోసం’ అంటూ అధికారి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ సహా రిపోర్టర్ సమాచారాన్ని యథాతథంగా బహిర్గతం చేసింది.అడ్డగోలుగా అంతర్జాతీయ సంస్థలను వాడేస్తారా?ఏపీ పోలీస్ అంటే ఎక్స్ అంతగా పట్టించుకోదు అనుకున్నారో ఏమో.. ఏకంగా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ పేరును వాడుకున్నారన్నమాట. చంద్రబాబు జమానాలో పోలీసుల అత్యుత్సాహంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇది బయటకు వచ్చింది కాబట్టి తెల్సిందని.. ఇలా ఏయే దర్యాప్తు సంస్థల పేర్లను వాడుకుని పోలీసులు ఇలా చేస్తున్నారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎన్ని ఖాతాలపై ఇలాంటి ‘ఎఫ్‌బీఐ’ ఫిర్యాదులు వెళ్లాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలెవరైనా పోలీసులను ఇలా గైడ్ చేశారా? ఎఫ్‌బీఐ పేరు చూస్తే ‘ఎక్స్’ భయపడి వెంటనే పోస్టులు తొలగిస్తుందన్న కుతంత్రమా? ఫిర్యాదు వెనక ఉన్నది తామేనని బాధితులకు తెలియకూడదన్న ఎత్తుగడా? ఎలా చూసినా ఇది రాష్ట్ర పోలీసు శాఖకు తలవంపులే. ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరును అధికారిక ఫిర్యాదులో వాడటం దౌత్యపరంగానూ తీవ్రమైన అంశమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ప్రశ్నించే వారిపై ఉక్కుపాదంరాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారింది. చంద్రబాబు చేస్తున్న దోపిడి, అవినీతి, దుర్మార్గపు పాలన, తాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ మోసాలు, ఎన్నికలప్పుడు ఆయనిచ్చిన బాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే....ఆ ప్రశ్నించే గొంతును నొక్కే కార్యక్రమం జరుగుతోంది. చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను చంద్రబాబు తన చేతుల్లో తీసుకున్నారు.. ఎవరైనా తనను ప్రశ్నిస్తే.. అది ప్రతిపక్ష పార్టీ నేతలైనా, సోషల్ మీడియా కార్యకర్తలైనా, ఎడిటర్లయినా, జర్నలిస్టులైనా.. వారిని అణిచివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇందుకోసం చట్టాలను, పోలీస్ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెడుతున్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?ప్రభుత్వ ఫిర్యాదులో ‘ఎఫ్‌బీఐ’ అని ఎందుకు రాశారు?దీని వెనకున్న ప్రభుత్వ పెద్దలెవరు?ఇది ఉన్నతాధికారుల అనుమతితోనే జరిగిందా?ఆ పోస్టులపై ఎఫ్ఐఆర్ నంబర్ ఏంటి?ఐటీ చట్టంలో ఏ సెక్షన్ కింద ఫిర్యాదు చేశారు?ఇలా ఎన్ని ఖాతాలపై ఫిర్యాదులు పంపారు?ఈ వ్యవహారంపై డీజీపీ విచారణ జరిపిస్తారా? -
ఏఐతో ముప్పు వట్టిదే!
వాషింగ్టన్: ఊరందరిది ఒకదారైతే... ఉలిపికట్టెది ఇంకోదారి అని సామెత. కృత్రిమ మేధ విషయంలో ఇప్పుడు ట్రంప్ వ్యవహారమూ ఉలిపికట్టె చందంగానే కనిపిస్తోంది. ఏటికేడాదీ శక్తిమంతమవుతున్న ఏఐ దుర్వీనియోగం కాకుండా.. మనిషి నియంత్రణలోంచి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, అప్పటివరకూ ఏఐ అభివృద్ధికి కంపెనీలు పగ్గాలు వేయాలని ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వ్యవస్థాపకులు సామ్ ఆల్ట్‌మ్యాన్, డారియో అమోడైలతోపాటు స్పేస్ ఎక్స్ఏఐ ఫౌండర్ ఎలాన్ మస్క్‌లు బహిరంగంగా పిలుపునిచి్చన తరువాత కూడా ట్రంప్... ఏఐతో ముప్పు వట్టిదేనని ప్రకటించడం ఈ సామెతను మరోసారి గుర్తు చేస్తుంది. కృత్రిమమేధ దారితప్పే అవకాశముందన్న ఆందోళనలపై ట్రంప్ సోమవారం వ్యాఖ్యానిస్తూ.. ‘‘కొత్త టెక్నాలజీలను పరిమితం చేసే ఏ ప్రయత్నమైనా కుట్రే’’అని అన్నారు. ‘‘ఏఐ ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తుంది.. మానవత్వాన్ని నాశనం చేస్తుందన్నది అంతా మోసపూరిత ప్రచారం మాత్రమే’’అని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వరుస పోస్టుల ద్వారా ఏఐపై ఆందోళనలు అనవసరం అన్న వాదన వినిపించారు. ఆసక్తికరంగా... చైనా ఏఐపై అంతర్జాతీయ సమాజపు పర్యవేక్షణకు మద్దతు పలికింది. కొన్నేళ్లలోనే ఏఐ విపరీతమైన ప్రాచుర్యం సంపాదించుకోవడం మనందరికీ తెలుసు. అప్పటివరకూ అసాధ్యమనుకున్న చాలా విషయాలను ఏఐ సుసాధ్యం చేసింది. అదేసమయంలో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చుట్టూ ముసురుకున్న వివాదాలూ అన్ని ఇన్ని కావు. ఏఐ వాడకం కోసం అవసరమై న డేటా సెంటర్లతో కాలుష్యం పెరిగిపోతుందని, విద్యుత్తు, నీరు భారీగా ఖర్చవుతాయన్న ఆందోళనలు వ్యక్తం కావడం ఒకపక్కనుంటే.. ఏఐ స్వయంగా మనిషి నియంత్రణ మీరి ప్రవర్తిస్తుందని, ఇది మరిన్ని సైబర్ మోసాలకు దారితీయడమే కాకుండా... జీవాయుధాల తయారీ వంటి ప్రమాదకర ధోరణులకూ దారి తీయవచ్చునని ఆంత్రోపిక్ వ్యవస్థాపకుడు డారియో అమిడో స్వయంగా ప్రకటించారు. గత శనివారం ఆయన ఇటీవలే నివేదిక విడుదల చేస్తూ.. ఏఐని దుర్వీనియోగం చేస్తూ ఏఐ అభివృద్ధికి కంపెనీలు పగ్గాలు వేయాలని పిలుపునిచ్చారు. ఇంకో ఆరు నుంచి పన్నెండు నెలల్లోపు ఏఐ టెక్నా లజీ ఇంటర్నెట్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నా ఆశ్చర్యంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మ్యాన్ కూడా అమొడై వాదనలతో దాదాపుగా ఏకీభవిస్తూ ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ తాజాగా ఏఐ మనిషి నియంత్రణలోనే ఎలా ఉంచుకోవాలన్న విషయంపై నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. చైనా పుంజుకుంటుంది ఏఐ కంపెనీల మాటలు ఎలా ఉన్నా ట్రంప్ మాత్రం ఏఐ విషయంలో అమెరికా తగ్గితే చైనా లాభపడుతుందని వ్యాఖ్యానిస్తూండటం గమనార్హం. ‘‘డేటా సెంటర్లు, ఏఐ టెక్నాలజీలకు వ్యతిరేకంగా ఒక కుట్ర జరుగుతోంది. ఈ విషయంపై సంతోషంగా ఉన్నది ఒక్క చైనా మాత్రమే’’అని ట్రంప్ ఈ మధ్యే చెప్పారు. ఏఐ టెక్నాలజీ విషయంలో ప్రభుత్వం అజమాయిïÙని ట్రంప్ చాలాకాలంగా నిరోధిస్తూ వస్తున్న విషయం చెప్పుకోవాల్సిన అంశం. రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ప్రభుత్వ పర్యవేక్షణకు సంబంధించి బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను రద్దు చేసిన ట్రంప్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిస్తే పూర్తిస్థాయి మద్దతిస్తూ తనదైన ఆదేశాలు జారీ చేశారు కూడా. ఇదిలా ఉంటే ఏఐ విషయంలో నెమ్మదించా లన్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికాలో టెక్నాలజీ కంపెనీల షేర్ల ధరలు తగ్గిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే... చైనా మాత్రం ఏఐకి ముకుతాడు వేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరగాలని మంగళవారం పిలుపునిచ్చింది. మానవాళి మేలు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఏఐ మనిషి నియంత్రణ దాటకుండా చూసుకోవాలని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు. ఏఐ అన్నది మానవాళి సమష్టి జ్ఞానం. ప్రజలందరి సొత్తు. అంత్జాతీయ సహకారంతో దీని అభివృద్ధి, పర్యవేక్షణ జరగాలి అని స్పష్టం చేశారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటనలోనూ ఏఐ నియంత్రణకు సంబంధించిన అంశాలు చర్చకు రావచ్చునని అంచనా. -
గుంటూరు పోలీసులకు ఎక్స్ మొట్టికాయలు!
గుంటూరు: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్స్ పూర్వపు హ్యాండిల్ ట్విట్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి మరీ సోషల్ మీడియా అకౌంట్లను నిలిపివేయడం సంచలనంగా మారింది. దీనంతటికి కారణం ఏపీలోని గుంటూరు పోలీసులేనని విషయం తేటతెల్లమైంది. ఎఫ్‌బీఐ పేరుతో ఎక్స్ కు ఫిర్యాదు చేసి గుంటూరు పోలీసులు బ్లాక్ చేయించారనే విషయం బయటపడింది. ఎలాగైనా ప్రతిపక్ష సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయించాలనే కుట్రతో ఎఫ్‌బీఐ పేరు వాడినట్లు తేలింది. దీనిపై ఏపీ పోలీసుల్ని ఎక్స్ సైతం ప్రశ్నించింది. అసలు ఏం జరిగిందంటే.. Tent politics పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. ఇందుకు ఎఫ్‌బీఐ పేరును వాడుకున్నారు. ‘మీరు పెట్టిన పోస్ట్‌ను తొలగించాలంటూ’ Tent politicsకు అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పంపినట్టు మెయిల్ పంపారు గుంటూరు పోలీసులు. అయితే ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి టెంట్ పాలిటిక్స్.. ఎక్స్ లీగల్ సపోర్ట్ టీమ్‌కు మెయిల్ చేసింది. అయితే ఫెడరల్ బ్యారో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఈ-మెయిల్ రాలేదని తేల్చింది ఎక్స్. దీనిపై గుంటూరు పోలీసులకు మొట్టికాయలు వేసింది ఎక్స్. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పంపినట్టు ఎలా మెయిల్ పంపారని గుంటూరు పోలీసులను ఎక్స్ ప్రశ్నించింది. ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్మెంట్లో గోల్మాల్! -
ఫ్యామిలీతో టాలీవుడ్ హీరో.. గణపతి పూజలో బుల్లితెర జంట
ఫ్యామిలీతో హీరో శౌర్య వినాయక చవితి సెలబ్రేషన్స్..బుల్లితెర జంట నిరుపమ్- మంజుల గణపతి పూజలు.. వెకేషన్లో టాలీవుడ్ నటి రోహిణి..గణపతి పూజలో బాలీవుడ్ భామ జాస్మిన్ బాసిన్..శారీలో ఇషితా దత్తా పోజులు.. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) View this post on Instagram A post shared by Jasmine Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Manjula Paritala (@manjula_paritala_official) -
మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రూట్ ఎటు...?
-
సోషల్ మీడియా ఉచ్చులో పిల్లలు చిక్కుకోకుండా ఉండాలంటే..
చిన్న పిల్లల చేతికి ఫోన్ ఇస్తే క్షణాల్లో నిశ్శబ్దంగా కూర్చుంటారు. సరిగ్గా ఇక్కడే, ఎండ్లెస్ ఫీడ్స్, రికమెండేషన్ అల్గారిథమ్స్, నోటిఫికేషన్లు, లైక్స్ వంటి వ్యసనపరిచే ఫీచర్లతో సోషల్ మీడియా వారిని తన చుట్టూ తిప్పుకుంటోంది. తద్వారా పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గంటల తరబడి స్క్రోలింగ్ చేయడం వల్ల నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు, ఒంటరితనం వంటి సమస్యలు పిల్లల్లో కూడా పెరుగుతున్నాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 13 ఏళ్లలోపు పిల్లల విషయంలో మరింత కఠినమైన రక్షణ చర్యలు అవసరం అంటున్నారు. ఇండియాలోనూ మారుతున్న గళం అమెరికాలో మెటా సంస్థపై వచ్చిన కేసులు, కోర్టుల జోక్యం నేపథ్యంలో పెద్ద పరిణామమే చోటుచేసుకుంది. పిల్లలను రక్షించడానికి సోషల్ మీడియా కంపెనీలపై ఎలాంటి నియంత్రణలు ఉండాలనే చర్చ ఇప్పుడు ఇండియాలోనూ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిపాదిస్తున్న కొన్ని కీలక నిబంధనలు చూద్దాం. ⇒ రోజువారీ సమయ పరిమితి: పిల్లలు లేదా టీనేజర్లు రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే యాప్‌లను వాడేలా పరిమితి విధించడం. ⇒ రాత్రి సమయపు ఆంక్షలు: రాత్రి 12:00 నుంచి ఉదయం 6:00 వరకు యాప్ యాక్సెస్‌ను పూర్తిగా నిరోధించడం. ⇒ స్కూల్ మోడ్: పాఠశాల వేళల్లో నోటిఫికేషన్లను నిలిపివేయడం. ⇒ స్క్రోలింగ్ బ్రేకులు: ప్రతి 15 నిమిషాల నిరంతర స్క్రోలింగ్ తర్వాత చిన్న విరామం తీసుకోవాలని గుర్తు చేయడం. ⇒ నాన్ అల్గారిథమిక్ ఫీడ్: పిల్లలకు ఆకర్షించే వ్యక్తిగతీకరించిన ఫీడ్స్ బదులుగా సాధారణ ఫీడ్‌ను అందించడం. ⇒ ఆటోప్లే, లైక్స్ నిలిపివేత: ఆటోప్లే, లైక్ కౌంట్స్ వంటి ఆకర్షణీయ ఫీచర్లను డిఫాల్ట్‌గా ఆఫ్ చేయడం, వయస్సు నిర్ధారణను బలోపేతం చేయడం.మెటా కొత్త నిబంధనలు ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లలో 13 నుంచి 17 సంవత్సరాల వయసు గల టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కొన్ని కఠినమైన నిబంధనలు, ఫీచర్లను తీసుకొస్తోంది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా ఖాతాలపై మరింత స్పష్టమైన నియంత్రణ సాధించవచ్చు. ⇒ స్క్రీన్ టైమ్ కంట్రోల్స్: రాత్రివేళల్లో పిల్లలు ఎక్కువసేపు ఫోన్‌కి అతుక్కుపోకుండా స్క్రీన్ టైమ్ పరిమితులు సెట్ చేసుకోవచ్చు. ⇒ కంటెంట్ ఫిల్టరింగ్: టీనేజర్లకు అనుచితమైన, హానికరమైన కంటెంట్ లేదా విపరీతమైన బ్యూటీ/కాస్మెటిక్ ఫిల్టర్లు కనిపించకుండా కట్టడి చేస్తారు. ⇒ మెసేజింగ్ భద్రత: పిల్లలకు అపరిచితులు లేదా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను అడ్డుకోవడానికి కాంటాక్ట్ నియంత్రణలను పెంచుతారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్ ఫ్లూ జ్వరాలు⇒ తల్లిదండ్రుల పర్యవేక్షణ: తల్లిదండ్రుల అనుమతి లేకుండా టీనేజర్లు తమ సెట్టింగ్‌లను లేదా సమయ పరిమితులను మార్చలేరు. ఒకవేళ పిల్లలు కొత్త ఖాతాలను క్రియేట్ చేసి లింక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే తల్లిదండ్రులకు అలర్ట్ వస్తుంది. ⇒ లైక్స్ మాయం: పోస్ట్‌లపై వచ్చే లైక్‌లు, రియాక్షన్ల సంఖ్యను దాచడం ద్వారా పిల్లల్లో పోలికల వల్ల వచ్చే ఆత్మనూనతా భావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వయస్సు నిర్ధారణ లోపాలు టీనేజర్లు తమ పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేసుకుంటే వారిని గుర్తించడానికి మెటా ఏఐ టూల్స్ వాడుతున్నప్పటికీ, నకిలీ పేరెంట్ ఖాతాలను తయారు చేయడం వంటి లొసుగులను పూర్తిగా అడ్డుకోవడం ఇంకా సవాలుగానే ఉంది. ⇒ ఇతర యాప్‌ల పోటీ: కేవలం మెటా మాత్రమే కాకుండా టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేనే పూర్తి ఫలితం ఉంటుంది. ఇదీ చదవండి: కాళ్లే చేతులుగా చేసుకుని పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు ⇒ కుటుంబాల మధ్య అంతరాలు: టెక్నాలజీపై అవగాహన లేదా తీరిక లేని కుటుంబాల్లో (ముఖ్యంగా దినసరి కూలీలు, పేద వర్గాల్లో) ఈ ఫీచర్లు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవచ్చు. డిజిటల్ అక్షరాస్యత ఉన్న తల్లిదండ్రుల పిల్లలకే ఇది నిజమైన రక్షణ కవచంలా మారుతోంది.⇒ సోషల్ మీడియా అనేది పూర్తిగా చెడ్డది కాదు. కానీ పిల్లలు ఎంతసేపు ఉపయోగిస్తున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, రాత్రివేళల్లో కంటి నిద్రను పాడు చేసుకుంటున్నారా లేదా అనే విషయాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ, సమయ నియంత్రణ ఉండటం అన్నింటికంటే ముఖ్యం. -
విమర్శలకు భయపడొద్దు.. సోషల్ మీడియాకు తలొగ్గొద్దు: సీజేఐ
న్యాయవ్యవస్థపై సోషల్ మీడియానో, ఇతర బయటి శక్తుల ప్రభావం ఉండకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అలాగని విమర్శలకు న్యాయవ్యవస్థను అతీతంగా ఉంచడం కూడా సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన 6వ రామ్ జెఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ‘జస్టిస్ సీన్ టు బీ డన్: ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ యాజ్ పిల్లర్స్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతం కాదని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. కోర్టుల పనితీరుపై వచ్చే నిష్పాక్షిక, నిర్మాణాత్మక విమర్శలు న్యాయవ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే కోర్టులు విమర్శలకు, పరిశీలనకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.కోర్టు తీర్పును మాత్రమే కాకుండా.. ఆ తీర్పు వెనుక ఉన్న కారణాలను కూడా ప్రజలు పరిశీలించే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. తీర్పు ప్రకటించి, దాని వెనుక ఉన్న కారణాలను మాత్రం ప్రజలకు తెలియకుండా ఉంచితే దాన్ని పూర్తి పారదర్శకతగా చెప్పలేమన్నారు.సోషల్ మీడియా ప్రభావం మాత్రం వద్దు..అయితే పారదర్శకత పేరుతో కోర్టు వ్యవహారాలను సోషల్ మీడియా ప్రభావానికి వదిలేయకూడదని సీజేఐ హెచ్చరించారు. న్యాయస్థానాలపై బాహ్య ఒత్తిళ్లు, ప్రజాభిప్రాయ ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. మీడియా లేదంటే సోషల్ మీడియా తమ సొంత అభిప్రాయాలతో వ్యవహరించే పరిస్థితుల్లో.. న్యాయం జరగడమే కాకుండా అది నిష్పాక్షికంగా కనిపించేలా ఉండటం కూడా ముఖ్యమని వివరించారు.ప్రజల మెప్పు కాదు.. నమ్మకమే ముఖ్యంకోర్టులు ప్రజల మెప్పు పొందడం ద్వారా విశ్వాసాన్ని సంపాదించలేవని సీజేఐ అన్నారు. కేసులో ఓడిపోయిన వ్యక్తి సైతం.. తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును ఇచ్చిన ప్రక్రియ న్యాయంగా జరిగిందని నమ్మినప్పుడే న్యాయవ్యవస్థపై నిజమైన విశ్వాసం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజల ఆమోదం కంటే న్యాయ ప్రక్రియలోని నిష్పాక్షికతే కోర్టుల విశ్వసనీయతకు కీలకమన్నారు.న్యాయవేత్త టామ్ ఆర్. టైలర్ పరిశోధనలను ప్రస్తావిస్తూ.. కేసులో ఓడిపోయినా ప్రక్రియ న్యాయంగా జరిగిందని భావించే వ్యక్తులు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. గెలుపు కంటే న్యాయమైన ప్రక్రియే కోర్టులకు చట్టబద్ధత, విశ్వసనీయతను తెచ్చిపెడుతుందని అన్నారు.‘న్యాయం జరగాలి.. కనిపించాలి’‘జస్టిస్ ఈజ్ డన్’తో పాటు ‘జస్టిస్ సీన్ టు బీ డన్’ అనే సూత్రాన్ని కూడా సీజేఐ ప్రస్తావించారు. 1924లో ఇంగ్లండ్‌లోని ‘ఆర్ వర్సెస్ ససెక్స్ జస్టీసెస్’ కేసును ఉదాహరణగా తీసుకున్నారు. సంబంధిత కేసుతో అనుబంధం ఉన్న సంస్థలో కోర్టు క్లర్క్ పనిచేస్తున్న విషయం బయటపడటంతో.. అతను న్యాయమూర్తుల నిర్ణయాన్ని ప్రభావితం చేశాడనే ఆధారాలు లేకపోయినా, పక్షపాతానికి అవకాశం కనిపించిందనే కారణంతో తీర్పును రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. న్యాయం చేయడం మాత్రమే కాదు.. అది న్యాయంగా జరిగిందని ప్రజలకు కనిపించడమూ అంతే ముఖ్యమని అన్నారు.ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థ బలంఅలెగ్జాండర్ హామిల్టన్ రాసిన ‘ది ఫెడరలిస్ట్ నంబర్ 78’ను కూడా సీజేఐ ప్రస్తావించారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాలకు ఆర్థిక, బలప్రయోగ అధికారాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థకు ప్రధానంగా తీర్పు ఇచ్చే అధికారమే ఉందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా కోర్టుల తీర్పులను గౌరవించడానికి కారణం.. న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసమేనన్నారు.ఆ విశ్వాసం ఒక్కసారి సంపాదించుకుంటే సరిపోదని.. ప్రతి దశలోనూ దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థకు అత్యంత విలువైన మూలధనమని చెప్పారు.సామాన్యుడికి న్యాయం చేరాలికోర్టు భవనం అందుబాటులో ఉండటం మాత్రమే న్యాయానికి ప్రాప్యత కాదని సీజేఐ అన్నారు. సామాన్య పౌరుడు న్యాయవ్యవస్థను చేరుకోగలగాలి, అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలగాలి, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం తనకు మరో పోరాటంగా మారకూడదని చెప్పారు. ఈ సందర్భంగా ఈ-కోర్టుల ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న పలు చర్యలను ప్రస్తావించారు. సింగిల్ సైన్-ఆన్ పోర్టల్, ఎలక్ట్రానిక్‌గా సమన్ల జారీ, జైలు-కోర్టు రికార్డుల అనుసంధానం వంటి చర్యలు న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయని వివరించారు. ఈ-సేవా కేంద్రాల మొబైల్ వాహనాల ద్వారా కోర్టు సేవలు, న్యాయ సహాయాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లే ప్రయత్నాలను కూడా ప్రస్తావించారు.ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రామ్ జెఠ్మలానీ. దేశంలోనే అత్యంత పేరున్న న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన.. ఎన్నో సంచలన కేసుల్లో వాదించారు. రామ్ జెఠ్మలానీ పారదర్శకత, జవాబుదారీతనం కోసం చేసిన కృషిని గుర్తుచేసిన సీజేఐ.. న్యాయవ్యవస్థలో పారదర్శకతను పునాదిగా చేసుకుని, ప్రజల విశ్వాసాన్ని నిరంతరం పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయం జరగడమే కాదు.. అది జరిగినట్లు ప్రజలకు కనిపించాలన్న సూత్రం న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: విజయ్‌కు షాకిచ్చిన వామపక్షాలు -
కేంద్రం ఆగ్రహం.. భారత్‌లో కార్యకలాపాలపై మెటా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యల నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను నేరుగా పోలీసులకు సమాచారం అందించేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.దేశంలో సోషల్ మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే చిన్నారుల ఆన్లైన్ భద్రత ప్రాథమిక సూత్రమని, ఇందులో ఎలాంటి రాజీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారుల లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన కంటెంట్, ప్రకటనలు వస్తున్నట్లు వార్తలు రావడంతో కేంద్రం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఉక్కుపాదం మోపుతోంది.చిన్నారుల భద్రతకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల వివరాలను ఇకపై భారతీయ చట్ట అమలు సంస్థలకు అందించేందుకు మెటా అంగీకరించింది. ఆన్లైన్లో పిల్లల భద్రత అనేది ఏ సోషల్ మీడియా సంస్థకైనా అత్యంత ప్రాథమిక, అనివార్యమైన సూత్రమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన సమాచారాన్ని ముందస్తుగా గుర్తించి, ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకోని సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలను పిల్లలకు పూర్తిగా సురక్షితంగా మార్చే దిశగా మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఒక కీలకమైన తొలి అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా పిల్లల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతోంది. -
3 వేల కోట్ల ఆస్తులు.. బిచ్చగాడిలా మారిన ఎమ్మెల్యే!
ఆయన రాష్ట్రంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేల్లో ఒకరు. కోట్లాది రూపాయల ఆస్తులు.. భద్రతా సిబ్బంది.. ఖరీదైన వాహనాలు.. ఎక్కడికి వెళ్లినా హంగామా. కానీ ఒక్కరోజు మాత్రం ఇవన్నీ పక్కనపెట్టి వీధుల్లో బిచ్చగాడిగా కూర్చున్నారు. చేతిలో డబ్బులు లేకపోయినా.. అడిగిన వారికి తనకు తోచినంతగా ఇవ్వమని కోరారు. చివరకు అదే రూపంలో వచ్చిన ఆహారాన్ని స్వీకరించి తిన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు?మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఈ వింత అనుభవాన్ని స్వయంగా చవిచూశారు. జైన సంప్రదాయంలో కొనసాగుతున్న ప్రత్యేక మాసం సందర్భంగా తన ఆధ్యాత్మిక గురువు చేసిన సూచనతో ఆయన ఈ పని చేశారు. ముంబైలోని ఘాట్కోపర్ వీధుల్లో కొంతసేపు బిచ్చగాడి వేషంలో గడిపారు. ఇందులో భాగంగా.. తన భద్రతా సిబ్బందిని, వాహనాలను పక్కనపెట్టారు. ఖరీదైన వస్తువులన్నింటినీ వదిలి.. మేకప్ వేసుకుని తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం రోడ్లపై కూర్చుని ప్రజలను ఆహారం, డబ్బు అడిగారు.రూ.20.. సమోసా ఉచితం!ఈ అనుభవం తనకు జీవితంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం ఇచ్చిందని పరాగ్ షా తెలిపారు. సాధారణంగా తనను కలవడానికి ప్రజలు వరుసలో నిలబడతారని.. కానీ తాను వారి దగ్గరకు వెళ్లినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు.ఓ వ్యక్తి తనకు రూ.20 ఇచ్చి “వెళ్లి తిను బాబా” అని చెప్పినట్లు షా గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఓ సమోసా విక్రేత వద్దకు వెళ్లి తన దగ్గర డబ్బులు లేవని చెప్పగా.. అతడు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చిరునవ్వుతో సమోసా ఇచ్చాడని తెలిపారు.“నేను డబ్బులు లేవని చెప్పినా.. ఆ పేద చిరు వ్యాపారి ఏ మాత్రం మొహం చాటేయకుండా నవ్వుతూ సమోసా ఇచ్చాడు. ముంబై ప్రజల్లో ఒకరికొకరు సాయం చేసే గుణం ఉంది” అని షా తన అనుభవాన్ని వివరించారు.మేకప్ తొలగించి మళ్లీ అక్కడికే..కొన్ని గంటలపాటు బిచ్చగాడిగా గడిపిన తర్వాత పరాగ్ షా మేకప్ తొలగించుకున్నారు. అనంతరం తాను గతంలో తిరిగిన ప్రాంతాలకే వెళ్లి.. తనను గుర్తుపట్టని సమయంలో ప్రజలు ఎలా స్పందించారో మరోసారి పరిశీలించారు. ఈ అనుభవాన్ని తన గురువుతో పాటు ఇతరులతోనూ పంచుకున్నారు.₹5,000 CRORE MLA BECOMES A ‘BEGGAR’ FOR A DAYGhatkopar East MLA Parag Shah, known for his immense wealth, reportedly took on the life of a beggar as part of a spiritual exercise suggested by his Jain guru, Namramuni Maharaj.He gave up his security, luxury cars and expensive… pic.twitter.com/Vv601XljkQ— Subodh Kumar (@kumarsubodh_) September 15, 2026తనకు లభించే గౌరవం, హోదా, అధికారాల వెనుక ఉన్న భిన్నమైన ప్రపంచాన్ని ఈ అనుభవం చూపించిందని షా అన్నారు. “నన్ను కలవడానికి వచ్చే ప్రజలే.. నేను వారి దగ్గరకు వెళ్లినప్పుడు నాకంటే ఎత్తుగా కనిపించారు. అదే జీవితంలోని వాస్తవం” అని ఆయన వ్యాఖ్యానించారు.రిచ్చెస్ట్ ఎమ్మెల్యేఘాట్కోపర్ ఈస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న పరాగ్ షా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. దీంతో అప్పట్లో మహారాష్ట్రలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా ఉన్న ఆయన.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో కార్పొరేటర్‌గానూ పనిచేశారు.ఇంతటి సంపద, హోదా ఉన్న వ్యక్తి ఒక్కరోజు అన్నింటినీ పక్కనపెట్టి సామాన్యుడిలా, చివరకు బిచ్చగాడి రూపంలో ప్రజల మధ్య కూర్చోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే తనకు ఈ అనుభవం “జీవితంలోని వాస్తవాన్ని చూపించింది” అని పరాగ్ షా చెప్పడం అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. -
పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!
న్యూయార్క్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.లోయర్ మన్‌హాటన్‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సౌత్ వింగ్ వైపు వెళ్తున్న నంబర్ 4 రైలు పట్టాలపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత రైలులో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను బయటకు తరలించారు.ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో..మలైకా చిత్రే న్యూజెర్సీలోని డేటన్కు చెందినవారు. అకాడియా ఫార్మాస్యూటికల్స్‌లో ఆపరేషన్స్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. నవమ్ కౌల్ సైరేవిల్లేకు చెందినవారు కాగా.. బ్లూమ్‌బర్గ్‌లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ రట్జర్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. దాదాపు ఒకే సమయంలో అక్కడి నుంచి పట్టాలు పొందారు.ఈ విషాదంతో వాళ్ల సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నవమ్ ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవాడని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. మలైకా తెలివైన, చురుకైన విద్యార్థినిగా తమకు తెలుసని ఆమె కుటుంబానికి సమీపంలోని పొరుగువారు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.A tragic situation in Manhattan. Recent Rutgers graduates Navam Kaul and Malaika Chitre were killed after being struck by a southbound 4 train at Spring Street around 3:15 a.m. Sunday.Reports say Kaul went onto the tracks first and Chitre climbed down after him, apparently…— Shadab Chow 🇺🇸 (@tonyinmycity97) September 15, 2026వైరల్‌గా మారిన వీడియో..ఈ ఘటనకు ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌గా మారింది. అందులో మలైకా, నవమ్ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. రైలు వస్తున్న సమయంలోనూ వారు అక్కడే ఉన్నారు. అయితే రైలు డ్రైవర్ మాత్రం.. మలైకా నవమ్ను తన వైపునకు లాగుతున్నట్లు, ఆమె నవ్వుతున్నట్లు కనిపించిందని చెప్పినట్లు సమాచారం.ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయి ఉండొచ్చని, ఆమెను కాపాడేందుకు మరొకరు పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రైలు డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేకులు వేసినా.. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో ఆపడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.మత్తులో ఉన్నారా?ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం లేదంటే ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆత్మహత్య కోణాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఆ యాక్సిడెంట్‌తో స్పాట్లోనే చనిపోయేదాన్ని! -
దోస్త్ మేరా దోస్త్ ట్రేండింగ్ లో విజయ్, అజిత్ వీడియో
-
‘నాపై అంత జాలి ఉంటే..’ కల్యాణ్‌కు బైకర్ సియా కౌంటర్
రోడ్డుపై వెళ్తున్న ఓ యువతి బైక్‌ను కారు ఢీకొట్టడం.. ఆమె కిందపడిపోయినా వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడం.. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. గురుగ్రామ్‌లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తనను కారు కావాలనే వెంబడించి ఢీకొట్టారని బైకర్ ‘రెబల్ వీల్స్ సియా’ ఆరోపిస్తుండగా.. నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం తప్పంతా బైకర్లదేనని అంటున్నాడు.గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగింది. సియా తన ఏప్రిలియా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్‌పై తోటి బైకర్లతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో తెల్లరంగు సెడాన్ తమను వెంబడించిందని ఆమె చెబుతోంది. కారులోని వారు తనకు దగ్గరగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించారని, దూరంగా ఉండాలని తాను సూచించినా.. బైక్‌ను ఆపాలని సైగలు చేశారని ఆమె ఆరోపించింది. చివరకు కారు పక్క నుంచి వచ్చి తన బైక్‌ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయానని తెలిపింది.‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని’ప్రమాదంపై తొలిసారి స్పందించిన సియా.. నిందితుడు కల్యాణ్ బైన్స్లా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘నాపై జాలిపడుతున్నానని చెబుతున్నారు. నిజంగా జాలిపడితే ప్రమాదం తర్వాత ఎందుకు ఆపలేదు?’ అని ప్రశ్నించింది. తనను కారు చాలా దూరం వెంబడించిందని చెబుతూ.. ‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని. ఎముకలు విరిగిపోయేంత తీవ్ర గాయాలు కూడా అయ్యుండొచ్చు’ అని పేర్కొంది.కారు తనను వెంబడించలేదన్న వాదనను కూడా ఆమె ఖండించింది. ‘నా జుట్టు కనిపించింది.. నా దగ్గరకు వచ్చారు.. ఆపాలని సైగ చేశారు. అలాంటప్పుడు బైక్‌పై మహిళ ఉందో లేదో తెలియదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించింది. ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోల్లోనూ కారు తన బైక్ వైపు లేన్ మార్చి ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది.This isn't hit and run... it's hit and kill 🖐️Car No: HR 30Y 4949In Gurugram, first a female bike rider was harassed by 4 louts sitting in a Verna car, they made vulgar vulgar gestures When the girl stopped them from doing so and told them to leave, the beasts rammed her… pic.twitter.com/W1141MIGSJ— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 14, 2026కొత్త వీడియో.. మరో కోణంలో ఢీకొట్టిన దృశ్యంఈ ఘటనకు సంబంధించి సియా వెనుకే వస్తున్న మరో బైకర్ రికార్డు చేసిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో కారు సియా బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. కారు తమను చాలా దగ్గరగా వెంబడించిందని, డ్రైవర్ కిటికీ దించి ఆపాలని సైగ చేశాడని ఆ బైకర్ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత కారు వెళ్లిపోవడంతో తాను దాన్ని వెంబడించి డ్రైవర్ ముఖాన్ని కెమెరాలో రికార్డు చేశానని చెప్పాడు. ప్రమాదం కారణంగా సియాకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే రైడింగ్ గేర్ ధరించి ఉండటంతో తీవ్ర గాయాలు తప్పాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ మాత్రం దెబ్బతింది.‘కారులో నలుగురు.. మద్యం మత్తులో ఉన్నారు’సియా సోదరుడు కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు సియా ఫోన్ చేసి.. ఎవరో కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారని చెప్పిందన్నాడు. కారులో నలుగురు ఉన్నారని, వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించారని ఆమె చెప్పినట్లు వెల్లడించాడు. కారులోని వారు అసభ్యకరమైన సైగలు చేశారని కూడా ఆరోపించాడు. సియా తండ్రి ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడలేమని, ఇది హత్యాయత్నంగా భావిస్తున్నామని అన్నారు. రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ కూడా లేదని.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.‘తప్పంతా బైకర్లదే’.. నిందితుడి తరఫు వాదనగురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్యాణ్ బైన్స్లా బాడీబిల్డర్, జిమ్ ట్రైనర్. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ‘ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్’, ‘ఇండియన్ రగ్బీ టీమ్ సభ్యుడు’గా రాసుకున్నాడు. హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్ బైన్స్లా తరఫు న్యాయవాది మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించారు. కారులో నలుగురు ఉన్నారని.. వారిలో బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. బైకర్లు రోడ్డుపై అడ్డంకిగా మారుతున్నారని, వారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఫుట్‌పాత్‌ను తప్పించుకునే క్రమంలో కొంచెం ఎడమవైపు వెళ్లిందని.. అదే సమయంలో యువతి కుడివైపు రావడంతో ఢీకొట్టిందని న్యాయవాది చెప్పారు. ప్రమాదం తర్వాత ఆపకపోవడానికి కారణం అక్కడ గుమిగూడిన వారు దాడి చేస్తారనే భయమేనని, ఆ పరిస్థితుల్లో కారు వెళ్లిపోయిందని తెలిపారు. సియా సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఘటనను ప్రచారం చేస్తోందని కూడా ఆరోపించారు. ఆమె బైక్ వేగం గంటకు 140–170 కిలోమీటర్ల వరకు ఉందని వాదించారు.కారు ఎవరిది?ప్రమాదానికి ఉపయోగించిన కారు హరియాణాలోని పల్వాల్‌కు చెందిన మనీష్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను ఆ సమయంలో కారులో లేనని మనీష్ స్పష్టం చేశాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ఘటన జరిగిన సమయంలో అసోంలో విధుల్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తన కుటుంబానికి చెందిన కారును ఓ స్నేహితుడు తీసుకెళ్లాడని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే ప్రమాదం విషయం తనకు తెలిసిందని వివరించాడు.పోలీసుల దర్యాప్తుకల్యాణ్ బైన్స్లా మాత్రం తాను కావాలనే బైకర్‌ను ఢీకొట్టలేదని చెబుతున్నాడు. బైకర్ అధిక వేగంతో వెళ్తుండగా, తాను కారు మలుపు తిప్పే సమయంలో ఢీకొన్నట్లు అతడి వాదన. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడానికి బైకర్ల గుంపు దాడి చేస్తుందనే భయమే కారణమని కూడా అతడి తరఫున వాదన వచ్చింది. అయితే మహిళా బైకర్ మాత్రం కారు తనను ఉద్దేశపూర్వకంగా వెంబడించి ఢీకొట్టిందని ఆరోపిస్తోంది. ఈ రెండు వాదనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వైరల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కారు వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారు ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బీజేపీ బిగ్ విక్టరీ -
గణనాథుని సేవలో నమ్రతా.. వినాయకుడి పూజలో అనసూయ
టాలీవుడ్ అనసూయ వినాయకుని పూజలు..గణనాథుని సేవలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా..ఫ్యామిలీతో నవీన్ చంద్ర వినాయక పూజలు..ఆది పినిశెట్టి- నిక్కీ గార్లానీ జంట వినాయక చవితి సెలబ్రేషన్స్..గణపతి బప్పా మోరియో అంటోన్న బుల్లితెర భామ తేజస్విని గౌడ.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Naveen Chandra (@naveenchandra212) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్‌కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
పెద్దల నుంచి సామాన్యుల వరకు.. ఎవరినైనా గౌరవించే తీరు ప్రత్యేకమే. అలాంటి ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఈ చిన్న పని.. ఆయన వినయానికి నిదర్శనంగా నిలిచింది.18వ బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఆయన.. సెప్టెంబర్ 12న ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరేందుకు కారులో నుంచి దిగిన షేక్ ఖలీద్.. అక్కడున్న అధికారులకు వీడ్కోలు చెబుతున్నారు. ఇంతలో తనను తీసుకొచ్చిన డ్రైవర్‌కు మాత్రం చెప్పకుండా వెళ్లిపోతున్నానని గుర్తించారు.వెంటనే వెనక్కి తిరిగిన ఆయన.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌తో చేతులు కలిపారు. కాసేపు అతడితో మాట్లాడి మరీ వీడ్కోలు చెప్పారు. ఆ డ్రైవర్ భారతీయుడని ఏఎన్ఐ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘చిన్న పని.. పెద్ద మనసు!’యువరాజు చేసిన ఈ చిన్న పనిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. హోదా, స్థాయి చూడకుండా డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించడాన్ని ఆయన వినయానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ‘ఇదే అసలైన క్లాస్’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయెద్ విలువలను ఈ ఘటన గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.భారత్ పర్యటనలో భాగంగా షేక్ ఖలీద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సహకారం, విద్య, పర్యాటకం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భేటీలో భారత్–యూఏఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించారు.18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ‘బిల్డింగ్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సుకు 13 మంది ప్రపంచ నేతలు, 17 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.అయితే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, కీలక చర్చల మధ్య.. ఒక భారతీయ డ్రైవర్‌కు స్వయంగా వెనక్కి వెళ్లి వీడ్కోలు చెప్పిన అబుదాబి యువరాజు తీరు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.#WATCH | Delhi: Crown Prince of Abu Dhabi, Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan departs from India after BRICS Summit 2026. pic.twitter.com/cw3XPOlTTz— ANI (@ANI) September 12, 2026 -
వెంబడించి మరీ.. లేడీ బైకర్‌పైకి కారు!
రోడ్డుపై ఓ లేడీ బైకర్‌ను కొందరు ఆకతాయిలు వెంబడించారు. తనను వెంబడించొద్దని.. దూరంగా ఉండాలని ఆమె వాళ్లకు సున్నితంగానే చెప్పింది. అయినా పట్టించుకోకుండా వెంటపడ్డారు. చివరకు కారుతో ఆమె బండిని ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా.. బైక్ కొద్దిదూరం ముందుకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగినట్లు బాధిత బైకర్ సియా వెల్లడించింది. ఆమె తన బైకింగ్ గ్రూప్‌తో కలిసి ఏప్రిలియా ఆర్ఎస్ 457పై వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వెంటపడటం మొదలుపెట్టిందని తెలిపింది. కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించడంతో.. కొంత దూరం పాటించాలని తాను కోరినట్లు చెప్పింది. అయితే వారు బైక్ ఆపాలని చెప్పారని, మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపించారని తెలిపింది.కారు తనను పక్కకు రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించానని సియా తెలిపింది. వెనుక వస్తున్న తన స్నేహితుడు కూడా కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడని చెప్పింది. అయినప్పటికీ కారు డ్రైవర్ బైక్‌కు ముందుగా వచ్చి కట్ చేయడంతో ఢీకొట్టిందని ఆరోపించింది. దాంతో సియా బైక్‌పై నుంచి కిందపడిపోగా.. ఆమె స్పోర్ట్స్ బైక్ కొంత దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది.ఈ మొత్తం ఘటన ఆమె బైక్‌కు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం తర్వాత సియా స్నేహితుడు కారును వెంబడించి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. తన తప్పేమీ లేదంటూ అక్కడి నుంచి కారుతో వెళ్లిపోయినట్లు సియా తెలిపింది.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సియా.. గురుగ్రామ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. వాహనం నంబర్‌తో పాటు ఆర్సీ యజమాని వివరాలను కూడా వెల్లడించింది. వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ, గురుగ్రామ్, హరియాణా పోలీసులను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.Caught on Cam: Gurugram Woman Biker Thrown Off Aprilia After Car Rams Her for Asking to Keep Distance#Gurugram - A woman motorcyclist in Gurugram has alleged that a car rammed into her sports bike and fled after she asked the driver to keep a distance. The incident, recorded on… pic.twitter.com/Mq3xdfq83o— Siraj Noorani (@sirajnoorani) September 14, 2026 -
మోదీ థ్యాంక్స్
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖ రాగ్ర సదస్సును ఫలప్రదంగా, ఫలితాల ఆధారితంగా మార్చినందుకు కూటమిలోని సభ్య దేశాల అధినేతలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు సంబంధించిన కీలక ఘట్టాలను ప్రతిబింబించే ఒక వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదస్సు విజయవంతమైందని హర్షం వ్యక్తంచేశారు.శిఖరాగ్ర సమావేశంలో మోదీ చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని కూడా ఇందులో చేర్చారు. బ్రిక్స్ సదస్సు ద్వారా భారత్ అన్ని రంగాల్లోనూ స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించుకుందని ఆయన పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్, ఇతర దేశాధినేతలు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును ముగించుకొని తమ స్వదేశానికి పయనమయ్యారు. జిన్‌పింగ్ అధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. రెండు రోజలపాటు తీరిక లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, చైనా మధ్య వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అలాగే పుతిన్ శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. -
విధి ఆడిన వింత.. భారత్‌లో బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్!
ఇద్దరూ భారత్‌లోనే పుట్టారు.. వేర్వేరు కుటుంబాలకు దత్తత వెళ్లారు.. కట్ చేస్తే.. నెదర్లాండ్స్‌లో ఒకరికొకరు దగ్గర్లోనే పెరిగారు. టీనేజ్‌లో తొలిసారి కలిసినప్పుడు ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. ఒకే ముక్కు.. ఒకే నవ్వు.. ఒకే రకమైన హావభావాలు. అందుకే అప్పట్లోనే ఒకరినొకరు సరదాగా ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. కానీ వాళ్లు నిజంగానే అక్కాచెల్లెళ్లని మాత్రం దాదాపు 30 ఏళ్ల వరకు ఎవరికీ తెలియదు. చివరకు ఓ డీఎన్ఏ టెస్ట్ వాళ్ల జీవితాలనే మార్చేసింది.ముంబైలోని వేర్వేరు అనాథాశ్రమాల నుంచి 1980ల ప్రారంభంలో కొన్ని నెలల వ్యవధిలో మీనా గెల్టింక్, మినాల్ టిజ్సెన్ వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తత వెళ్లారు. ఇద్దరూ నెదర్లాండ్స్‌లో ఒకరికొకరు సమీపంలో పెరిగారు. టీనేజ్‌లో దత్తత పిల్లల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. అప్పుడు వారి స్నేహితులే ఇద్దరి పోలికలను గుర్తించారు. అద్దంలో చూసుకుంటే ఒకేలా కనిపిస్తున్నారని చెప్పడంతో మీనా ఆశ్చర్యపోయింది. ఒకే ముక్కు, ఒకే నవ్వు ఉండటాన్ని గమనించింది.ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. స్కూల్, స్నేహితులు, ప్రేమ, డ్యాన్స్, క్రీడలు, సంగీతం.. ఇలా ఎన్నో విషయాలను ఒకరికొకరు లేఖల ద్వారా పంచుకునేవారు. ఇద్దరికీ బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ అంటే ఇష్టమని కూడా తెలుసుకున్నారు. రక్తసంబంధం ఉందన్న చిన్న అనుమానం కూడా లేకపోయినా.. ఒకరినొకరు ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. మినాల్ ఫ్రాన్స్‌కు వెళ్లగా.. మీనా తన మొదటి బిడ్డకు తల్లి కావడంతో కుటుంబ బాధ్యతల్లో బిజీ అయిపోయింది.డీఎన్ఏ టెస్ట్.. ఇంతలో 2017లో మీనా భారత్ నుంచి దత్తత తీసుకున్నవారి సమావేశానికి హాజరైనప్పుడు డీఎన్ఏ టెస్టింగ్ గురించి తెలుసుకుని పరీక్ష చేయించుకుంది. కానీ ఎలాంటి సరిపోలిక కనిపించలేదు. ఈ ఏడాది ఫోన్ స్టోరేజ్ సమస్యతో ఆమె ఆ యాప్‌ను కూడా డిలీట్ చేసింది. ఇంతలో మే 20న మినాల్ ఫేస్బుక్లో మీనాకు మెసేజ్ చేసింది. తాను ఏప్రిల్‌లో డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నానని, ఫలితాల స్క్రీన్ షాట్‌ను పంపింది. మీనాకు మొదట నమ్మశక్యం కాలేదు. యాప్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేసి ఫలితాలను చూసిన ఆమెకు షాక్ తగిలింది. ఇద్దరి డీఎన్ఏ 100 శాతం మ్యాచ్ అయింది. వారు కేవలం చిన్ననాటి స్నేహితులు కాదు.. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పూర్తి సోదరీమణులని తేలింది.మినాల్‌కు కూడా తొలుత తన డీఎన్ఏ మ్యాచ్ ఎవరిదో అర్థం కాలేదు. సోషల్ మీడియాలో పాత ఫొటోలు చూసిన తర్వాత విషయం తెలిసింది. చిన్నప్పుడు తనను ఆప్యాయంగా పట్టుకున్న అదే అమ్మాయి మీనా అని గుర్తించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఏర్పడిన స్నేహం వెనుక ఇంత పెద్ద రక్తసంబంధం ఉందని తెలుసుకుని ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఆగస్టులో మళ్లీ కలుసుకున్న ఇద్దరూ కన్నీళ్లు, నవ్వులు, కౌగిలింతల మధ్య తమ అనుబంధాన్ని జరుపుకున్నారు. ఇప్పుడు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఒకరి కుటుంబాలను మరొకరు కలుసుకున్నారు. ఇద్దరి మాట తీరు, నడక, హావభావాలు ఇప్పటికీ ఒకేలా ఉన్నాయని కుటుంబ సభ్యులు గుర్తిస్తున్నారు.ముంబై కోరిక.. తమ జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఒకరి అవసరం మరొకరికి ఉందని మీనా చెబుతోంది. తండ్రిని కోల్పోయినప్పుడు, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు సోదరి తన పక్కన ఉంటే బాగుండేదని భావోద్వేగానికి గురైంది. ఇప్పుడు ఇద్దరి కోరిక ఒక్కటే.. తమ బంధం మొదలైన ముంబైకి కలిసి వెళ్లి, తాము పుట్టిన నేలను మరోసారి చూడాలని కోరుకుంటున్నారు. దాదాపు 30 ఏళ్లుగా ‘సిస్టర్’ అని పిలుచుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు డీఎన్ఏ ద్వారా తాము నిజంగానే సోదరీమణులమని తెలుసుకున్న ఈ కథ నిజజీవితంలో జరిగిన ఓ సినిమా ట్విస్ట్‌ను తలపిస్తోంది.Çocukluk arkadaşları, yıllar sonra yaptırdıkları DNA testiyle aslında kardeş olduklarını öğrendi! 👯♀️💞📌 Bebekken Hindistan'daki yetimhanelere bırakılan ve farklı Hollandalı aileler tarafından evlat edinilen Meena Geltink ile Minal Tijssen, ilk kez 1996 yılında evlat edinilmiş… pic.twitter.com/NyMrp7DBu0— Mynet (@mynet) August 17, 2026Video Credit: Mynet. -
ఫాలోవర్లు లక్షల్లో.. మోసాలు రూ.కోట్లలో..
సాక్షి, అమరావతి: ఒకప్పుడు సెలబ్రిటీల మాటకే విలువ ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హవా నడుస్తోంది. ఒక్క వీడియో పెడితే చాలు.. వేల నుంచి లక్షల మంది నమ్మే పరిస్థితి. ఇదే నమ్మకాన్ని కొందరు ఘరానా మోసాలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాలకు పంపిస్తామని, పెట్టుబడులకు భారీ లాభాలు ఇస్తామని, బెట్టింగ్‌లో ‘ఫిక్స్డ్ టిప్స్’ ఇస్తామని చెప్పి బాధితులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ రమా నందన వ్యవహారం ఈ ప్రమాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. లండన్‌లో ఉద్యోగాలు, వీసా స్పాన్సర్‌షిప్‌లు, వీసా రెన్యూవల్స్ ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఆమె, భర్త జె.మధుకర్‌పై కేసు నమోదైంది. లుక్ఔట్ నోటీసు నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో రమా నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. ఈ వ్యవహారం ఇన్ఫ్లుయెన్సర్లు, మోసాలు, వివాదాల అంశాలను మరోసారి తెరమీదకు తెచ్చింది.ఆందోళనకర అంశాలు⇒ ఇన్ఫ్లుయెన్సర్ల కంటెంట్‌పై వచ్చిన ఫిర్యాదుల తీవ్రతను అడ్వరై్టజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ)సహా పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి.⇒ 2024–25లో ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించిన 1,015 ప్రకటనలను పరిశీలించగా.. ఏకంగా 98 శాతం ప్రకటనల్లో మార్పులు అవసరమని గుర్తించారు. వీటిలో 33 శాతం చట్టం నిషేధించిన ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసినవి. అక్రమ బెట్టింగ్ ప్రమోషన్లు 31.4 శాతంతో ముందున్నాయి. ⇒ 2024లో ఏఎస్సీఐ నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో టాప్ డిజిటల్ స్టార్ల పోస్టుల్లో 69 శాతం డిస్క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. అంటే పెయిడ్ ప్రమోషన్, బ్రాండ్‌తో తమకు ఉన్న సంబంధాన్ని ప్రేక్షకులకు స్పష్టంగా చెప్పకుండా ఏదైనా ఒక వస్తువును, సేవను ప్రోత్సహిస్తూ చేసిన పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయన్నమాట.⇒ దేశవ్యాప్తంగా 2021–25 మధ్య నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు 65.89 లక్షలకు పైగా ఆర్థిక మోసాల ఫిర్యాదులు అందగా.. ప్రజలు కోల్పోయినట్లు నివేదించిన మొత్తం రూ.55,050 కోట్లకుపైగా ఉంది. ⇒ 2024లో దేశవ్యాప్తంగా 86,420 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఏపీలో 2024లో 2,528, తెలంగాణ 18,236 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర పోలీసుల 2024 నివేదికలో 4,042 సైబర్ నేర కేసులు నమోదైనట్లు ఉంది. వీటిలో 296 కేసులు సోషల్ మీడియాకు సంబంధించినవి. 145 ఉద్యోగ మోసాలు, 926 ఇన్వెస్ట్మెంట్ మోసాలు, 563 ట్రేడింగ్ మోసాలుగా నమోదయ్యాయి. ఈ మొత్తం మోసాల్లో నష్టం దాదాపు రూ.296.32 కోట్లుగా నమోదైంది.మోసాలు.. కేసుల తీరు⇒ 2025లో సైబరాబాద్ పోలీసులు టెలిగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, అనధికార బెట్టింగ్ వెబ్సైట్లు, మ్యూల్ ఖాతాలతో నడుస్తున్న నెట్‌వర్క్‌ను ఛేదించి నలుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను అరెస్టు చేశారు. ‘ఫిక్స్డ్ మ్యాచ్‌లు’, ‘ఎక్స్‌క్లూజివ్ టిప్స్’ పేరుతో యువతను బెట్టింగ్ వైపు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు.⇒ మరో ఘటనలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్స్టాగ్రామ్, నకిలీ మ్యాట్రిమోనీ ప్రొఫైళ్లతో మోసాలకు పాల్పడిన ముఠాను పట్టుకున్నారు. ఒక బాధితుడి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ప్రొఫైళ్లలో ఓ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫొటోను కూడా ఉపయోగించినట్లు వెల్లడైంది.⇒ అంతర్జాతీయ ట్రావెలర్‌గా పేరొందిన ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ కూడా తన నోటి దురుసుతో చేసిన వ్యాఖ్యలకుగానూ అతనిపై లుక్ఔట్ నోటీస్ జారీ అయ్యింది.⇒ ఫన్ బకెట్ భార్గవ్‌పై ఏకంగా లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో పాటు జైలు శిక్ష కూడా పడింది. -
రెట్రోతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: రెట్రో.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ట్రెండ్. నేటి ఫొటోలను 1980ల కాలం నాటి చిత్రాల్లా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరు కృత్రిమమేధ (ఏఐ) యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అప్పటి దుస్తులు, హెయిర్‌స్టైల్, కెమెరా ఎఫెక్ట్, ఫొటో క్వాలిటీతో తమ చిత్రాలను మార్చుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సరదాగా కనిపిస్తున్న ఈ ట్రెండ్ వెనుక అంతే ప్రమాదం పొంచి ఉంది. ఏఐ ఫొటో ఎడిటింగ్ యాప్‌కు చిత్రాన్ని అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫొటోలోని ముఖాన్ని సాంకేతికంగా విశ్లేషించే అవకాశం ఉంటుంది. ముఖ ఆకృతి, కళ్లు, ముక్కు, పెదవులు తదితర అవయవాల లక్షణాలను గుర్తించే ప్రక్రియలో బయోమెట్రిక్ సమాచారానికి సంబంధించిన అంశాలుంటాయి. అందుకే ముఖానికి సంబంధించిన డేటాను సాధారణ ఫొటోగా మాత్రమే చూడలేమని టెక్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్టీ) దాదాపు 200 ముఖగుర్తింపు అల్గారిథమ్‌లను పరీక్షించింది. ఈ పరిశీలనలో వయసు, లింగం, జాతి, దేశ నేపథ్యం వంటి అంశాల ఆధారంగా అల్గారిథమ్‌ల పనితీరులో తేడాలున్నట్లు గుర్తించింది.పరీక్షల్లో 1.8 కోట్లకుపైగా చిత్రాలు, 84.9 లక్షలమందికి సంబంధించిన డేటా ఉపయోగించారు. థర్డ్‌పార్టీ యాప్‌లలో వ్యక్తిగత వివరాలు, కుటుంబ ఫొటోలు ఇవ్వడం వల్ల వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరించి డబ్బులివ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ప్రస్తుతం తమ దృష్టికి వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.బయటకు వెళితే ప్రమాదం యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు (ఈడీపీబీ) ముఖగుర్తింపు సాంకేతికతలో ఉపయోగించే బయోమెట్రిక్ డేటా అత్యంత సున్నితమైనదని పేర్కొంది. దాని దుర్వినియోగం జరిగితే వ్యక్తిగత వివరాల దొంగతనం, వ్యక్తి పేరుతో మోసాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడళ్లలో వ్యక్తిగత డేటా వినియోగంపై ఈడీపీబీ ప్రత్యేక అభిప్రాయాన్ని కూడా విడుదల చేసింది. ఏఐ మోడళ్ల అభివృద్ధి, వినియోగంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారనే అంశంపై స్పష్టమైన నిబంధనలు, చట్టబద్ధత అవసరమని పేర్కొంది. కొన్నిసేవల నిబంధనల్లో వినియోగదారులు అప్లోడ్ చేసే కంటెంట్‌ను సేవ మెరుగుదల, పరిశోధన లేదా ఏఐ మోడళ్ల అభివృద్ధి వంటి ప్రయోజనాలకు ఉపయోగించే హక్కులు సంస్థకు ఉండవచ్చు. ప్రతి యాప్ నిబంధనలు ఒకేలా ఉండవు. అందుకే ఉచితంగా ఫొటో మార్చుకోవచ్చు.. అన్న కారణంతో ఏ యాప్‌కైనా వ్యక్తిగత చిత్రాలను ఇవ్వడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. డిలీట్ చేస్తే అయిపోయినట్టు కాదుఫోన్లోగానీ, యాప్‌లోగానీ మనం ఏదైనా ఫొటోను డిలీట్ చేస్తే అది పూర్తిగా డిలీట్ అయినట్టేనా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రధాన సందేహం. ఏఐ యాప్‌లో ఫొటో అప్లోడ్ చేసేముందు ఆ సంస్థ ఫొటోలను ఎంతకాలం నిల్వచేస్తుంది? డిలీట్ చేసిన తర్వాత బ్యాకప్ కాపీలు ఉంటాయా? ఏఐ మోడల్ శిక్షణకు ఉపయోగిస్తారా? మూడోపక్ష (థర్డ్ పార్టీ) సంస్థలతో పంచుకుంటారా? వంటి అంశాలను ప్రైవసీ పాలసీలో పరిశీలించాలి. అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) గతంలోనే ముఖగుర్తింపు సాంకేతికతను ఉపయోగించే సంస్థలు వినియోగదారులకు డేటా ఎలా ఉపయోగిస్తారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని, ఒక ప్రయోజనం కోసం సేకరించిన ముఖం లేదా బయోమెట్రిక్ డేటాను ఇతర ప్రయోజనానికి ఉపయోగించేముందు స్పష్టమైన సమ్మతి తీసుకోవాలని సూచించింది. రెట్రో ఫొటో రెండు నిమిషాల్లో తయారవుతుంది. కానీ ఒకసారి మన ముఖం, వ్యక్తిగత డేటా ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడం అంత సులభం కాదు. ట్రెండ్కోసం ఫొటో ఇచ్చే ముందు.. ఆ యాప్ మన డేటాతో ఏం చేస్తుందో తెలుసుకోవడం తప్పనిసరి.సరదాగా రిస్క్ చేయవద్దు » తెలియని ఏఐ ఫొటో యాప్స్‌లో వ్యక్తిగత చిత్రాలు అప్లోడ్ చేయవద్దు. » యాప్ ప్రైవసీ పాలసీని ముందుగా చదవాలి.» ఫొటోలను ఏఐ మోడల్ శిక్షణకు ఉపయోగిస్తారా? తెలుసుకోవాలి. » మూడోపక్ష సంస్థలతో డేటా పంచుకుంటారా? పరిశీలించాలి.» డేటా తొలగింపు సదుపాయం ఉందో చూడాలి. » ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు కనిపించే ఫొటోలు అస్సలు అప్లోడ్ చేయవద్దు. » పిల్లలు, కుటుంబసభ్యుల ఫొటోలను కూడా అవసరం లేకుండా థర్డ్‌పార్టీ యాప్స్‌కు ఇవ్వకపోవడమే మంచిది. -
నా ఖాతాలు బ్లాక్ చేయడం కాంగ్రెస్ కుట్ర: వర్షిత్
నల్లగొండ: బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ఖాతాలు కూడా బ్లాక్ అయినట్లు ఆయన తెలిపారు.ఇటీవల నల్లగొండలో మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై వర్షిత్ రెడ్డి సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు పోస్టు చేశారు. ఈ వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.దీంతో తన సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ అయ్యాయని వర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. తన తల్లిపై దాడి జరిగిన నేపథ్యంలోనే ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు ఆయన తెలిపారు.తన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని వర్షిత్ రెడ్డి ఆరోపించారు. అయితే, ఖాతాలు బ్లాక్ కావడానికి గల కారణాలపై సంబంధిత సోషల్ మీడియా సంస్థల నుంచి అధికారికంగా ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదు.ఇదీ చదవండి: 56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ? -
నెక్ట్స్ మిషన్ ప్రకటించిన బిట్టూ భాయ్
ఒక నది బాగుపడాలంటే అధికారులు రావాలి.. భారీ నిధులు కేటాయించాలి.. పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేయాలి. కానీ 20 ఏళ్ల యువకుడు మాత్రం ఇవేవీ లేకుండానే ఓ నదిని శుభ్రం చేసి చూపించాడు. నెలల తరబడి ఒంటరిగా శ్రమిస్తూ ప్లాస్టిక్, చెత్తాచెదారం తొలగించి అజ్నార్ నదికి కొత్త రూపు తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో అతడి పని వైరల్ కావడంతో ఆపై ఏకంగా అంతర్జాతీయ పర్యావరణ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి కార్యాచరణ సైతం ప్రకటించేశాడు..మధ్యప్రదేశ్‌కు చెందిన బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌధరి. అజ్నార్ నది కాలుష్యంతో నిండిపోవడాన్ని చూసిన అతడు.. సమస్య గురించి మాట్లాడటంతో ఆగిపోలేదు. స్వయంగా రంగంలోకి దిగి నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించడం మొదలుపెట్టాడు. అవసరమైన ప్రాథమిక సామగ్రిని తన సొంత డబ్బుతో సమకూర్చుకుంటూ.. ఎవరూ తోడుగా లేకపోయినా పదేపదే నది వద్దకు వెళ్లి శుభ్రం చేస్తూ వచ్చాడు.మార్పును వీడియోలుగా..నది శుభ్రం చేసే ముందు పరిస్థితి ఎలా ఉంది.. తాను శ్రమించిన తర్వాత ఎలా మారింది అన్న విషయాలను బిట్టూ సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకున్నాడు. తొలుత స్థానికంగా కనిపించిన ఈ ప్రయత్నం క్రమంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చెత్తతో నిండిన నది ప్రాంతాన్ని స్వయంగా శుభ్రం చేస్తున్న అతడి వీడియోలు వైరల్ కావడంతో బిట్టూ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.డచ్ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్..బిట్టూ చేసిన పని చివరకు ‘ది ఓషన్ క్లీన్అప్’ దృష్టిని కూడా ఆకర్షించింది. డచ్ పర్యావరణవేత్త బోయన్ స్లాట్ స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదుల్లోని ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తోంది. బిట్టూ కృషిని గుర్తించిన సంస్థ అతడికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో అతడికి మరింతగా అభినందనలు వెల్లువెత్తాయి.‘తర్వాత ఏ రాష్ట్రానికి రావాలి?’..ఉద్యోగ ఆఫర్ వచ్చిన తర్వాత బిట్టూ సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశాడు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అతడు.. ఇక తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్లి శుభ్రత కార్యక్రమం చేపట్టాలని అడిగాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి నదులు, పరిసరాలను శుభ్రం చేయాలనే తన ఆలోచనను వెల్లడించాడు.దీంతో నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు. బిహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల పేర్లను సూచిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.కొసమెరుపు.. బిట్టూ శుభ్రం చేసిన అజ్నార్ నది మళ్లీ కాలుష్యం బారిన పడడం ప్రారంభమైంది. కొందరు చెత్తాచెదారం అందులో వేయడం.. వాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో కొందరు యువకులు అక్కడ గస్తీ కాస్తూ బిట్టూ కష్టం వృథా కానివ్వకుండా కాపాడుకుంటున్నారు. -
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
సముద్రం ఉన్నచోట ఒక్కసారిగా నేల కనిపిస్తే..? అలలు కనిపించాల్సిన చోట నిర్మాణాలు, సముద్రపు అడుగుభాగం బయటపడితే..? అర్జెంటీనాలో ఇప్పుడు ఇదే వింత పరిణామం కనిపించింది. రాత్రి వేళ సముద్రపు నీరు భారీగా వెనక్కి వెళ్లడం.. మళ్లీ కొంతసేపటికి ముందుకు రావడం వరుసగా జరుగుతోంది. ఒకటి రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 23 కిలోమీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లినట్లు కనిపించడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేపుతోంది. నీటిలో కప్పబడి ఉండే ప్రాంతాలు ఒక్కసారిగా బయటపడటంతో అక్కడి దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.‘కంటికి కనిపించేది అంతా నిజం కాదు’ అన్నట్టుగా.. సముద్రం వెనక్కి వెళ్లిన సమయంలో సాధారణంగా నీటిలో కనిపించని ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. సముద్రపు అడుగుభాగం, నీటితో కప్పబడి ఉండే నిర్మాణాలు, తీర ప్రాంతంలోని ఇతర ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. దీంతో అసలు సముద్రం ఎందుకు ఇంత దూరం వెనక్కి వెళ్లిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సాధారణంగా సముద్రం ముందుకు వెనక్కి కదలడం సహజమే. చంద్రుడి గురుత్వాకర్షణ, సూర్యుడి ప్రభావం, గాలుల వేగం, సముద్ర ప్రవాహాలు, స్థానిక భౌగోళిక పరిస్థితుల కారణంగా టైడ్స్ (ఆటుపోట్లు) ఏర్పడుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఆటుపోట్ల సమయంలో సముద్రం గణనీయంగా వెనక్కి వెళ్లినట్లు కనిపించవచ్చు. అయితే అర్జెంటీనాలో నమోదవుతున్న ఈ స్థాయి మార్పు మాత్రం సాధారణ దృశ్యానికి భిన్నంగా ఉండటంతో పర్యావరణ నిపుణుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈ పరిణామం రెండు రోజులు పాటు రాత్రి సమయంలోనే కనిపిస్తుండటమే ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. సముద్రపు నీరు వెనక్కి వెళ్లిన సమయంలో బయటపడుతున్న ప్రాంతాల్లో గతంలో నీటిలో కనిపించని నిర్మాణాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో స్థానికులు ఈ దృశ్యాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.Argentina’s Sea “Disappears” The Real Reason Behind the Shocking Retreat! 😢😲 pic.twitter.com/n2qPtDBVzU— The MES Times (@themestimes) September 11, 2026అయితే సముద్రం ఇలా వెనక్కి వెళ్లిందంటే వెంటనే సునామీ వస్తుందనే అర్థం కాదు. సముద్ర మట్టంలో అసాధారణ మార్పులకు అనేక సహజ కారణాలు ఉండొచ్చు. స్థానిక టైడల్ పరిస్థితులు, గాలులు, సముద్ర ప్రవాహాలు, వాతావరణ మార్పులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అసలు కారణాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. అదే సమయంలో పర్యావరణవేత్తలు ఈ పరిణామాలను తేలికగా తీసుకోవద్దని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు, తీర ప్రాంతాల్లో మార్పులు, వాతావరణంలో అసాధారణ పరిస్థితులు నమోదవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ‘ముందు జాగ్రత్తే మేలు’ అన్నట్టుగా తీర ప్రాంతాల్లో ఇలాంటి అసాధారణ మార్పులు కనిపించినప్పుడు అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలించడం అవసరం.మొత్తంగా.. అర్జెంటీనాలో సముద్రం ఏకంగా 23 కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గినట్లు కనిపించడం ఇప్పుడు ప్రకృతి వింతగా చర్చనీయాంశమైంది. ఇది పూర్తిగా సహజమైన టైడల్ ప్రభావమా? స్థానిక సముద్ర ప్రవాహాల కారణమా? లేక మరేదైనా అసాధారణ భౌగోళిక, వాతావరణ పరిస్థితి ప్రభావమా? అన్నది శాస్త్రీయ పరిశీలనతోనే తేలాల్సి ఉంది. కానీ రాత్రివేళ సముద్రం వెనక్కి వెళ్లి.. పగలు నీటిలో దాగిపోయే దృశ్యాలు మాత్రం అర్జెంటీనాలో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.The sea vanished without a sound. Ships that once floated now lean helpless on cracked mud, their hulls tilted under an empty sky. No waves. No warning. Only the wet silence of a world the ocean abandoned and the quiet dread of whatever comes next when the water decides to… pic.twitter.com/v0PO6g2bqK— Arif Dawood (@aridwd) September 10, 2026ఇదీ చదవండి: జపాన్ సముద్రంవైపు దూసుకెళ్లిన కిమ్ రాకెట్ -
భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే!
వివాహేతర సంబంధాల మోజులో నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజుల్లో.. భర్తను చంపే భార్యలు, భార్యలను హతమార్చే భర్తలు, ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేసే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా.. ఒక భార్య తనకు భర్త వద్దని, ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథలో ట్విస్టులు మాత్రం సినిమాను మించి ఉన్నాయి!..ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన కన్యాదానం చిత్రంలో.. తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు భార్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపిస్తాడు హీరో. ఆ క్లైమాక్స్‌ను ఏమాత్రం తీసిపోని రేంజ్లో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటే.. ఆమె మాత్రం అతను వద్దని తెగేసి చెప్పింది. దీంతో ఆ సినిమాలో శ్రీకాంత్ చేసినట్లే.. ప్రియుడి వద్దకే భార్యను చేర్చాడా భర్త. లక్నోకు చెందిన ప్రాంతీయ రక్షక్ దళ్ (PRD) జవాన్ విక్కీకి సొనాలీతో ఏడాది క్రితం వివాహమైంది. అయితే పెళ్లికి ముందే సొనాలీకి తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ స్కూల్ టైం నుంచే స్నేహితులు. ఆ స్నేహం కాస్తా వాళ్లతో పాటే పెరిగి ప్రేమగా మారింది. అయితే అతనితో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. బలవంతంగా విక్కీకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. భర్తను మోసం చేయొద్దని.. సుఖంగా కాపురం చేసుకోమని ఆ ప్రియుడు ఆమెకు హితబోధ చేస్తూ వచ్చాడు. అయితే ఆమె మాత్రం అలా ఉండలేనంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న సొనాలీ అత్తింటి నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త విక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీప జిల్లాలకు సమాచారం పంపి గాలింపు చేపట్టారు. చివరకు..సొనాలీ హర్దోయ్‌లో ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అతను తన ప్రియుడని చెప్పడంతో అంతా కంగుతిన్నారు. బుధవారం పోలీసులు ఇద్దరినీ లక్నోకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడించారు. గంటల తరబడి నచ్చజెప్పినా సొనాలీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భర్తతో ఒక్క క్షణం కూడా ఉండటం తనకు ఇష్టం లేదని, తన చిన్ననాటి ప్రియుడితోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో ప్రియుడు.. భర్త వద్దకే వెళ్లిపోవాలంటూ సూచించడం గమనార్హం.అయితే భార్య మాటలు విన్న విక్కీ కొంతసేపు షాక్‌కు గురైనా.. చివరకు ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. “ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో వారితోనే ఉండు” అని చెప్పాడు. అనంతరం ఇరువర్గాల అంగీకారంతో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సొనాలీ, ఆమె చిన్ననాటి ప్రియుడు స్థానిక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. ఈ సమయంలో ఆమె భర్త విక్కీ స్వయంగా భార్యను ప్రియుడికి అప్పగించాడు.పెళ్లి తర్వాత కూడా చిన్ననాటి ప్రేమను కొనసాగించిన సొనాలీ.. చివరకు తన ప్రియుడినే ఎంచుకుంది. అయితే ఈ ప్రేమకథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు బయటపడితే గొడవలు, దాడులు, హత్యలు, బ్లాక్‌మెయిలింగ్‌ల వరకు వెళ్లే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.. భర్త బలవంతం చేయకుండా భార్య నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు.. ఆమె చేయిని ప్రియుడి చేతిలో పెట్టి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఆ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.In #Lucknow's Malihabad, a PRD (Prantiya Rakshak Dal) jawan arranged his wife's marriage to her lover. His wife had run away from home, and upon discovering she was having an affair, the husband deemed it appropriate to have her married to the man rather than create a dispute. pic.twitter.com/9SC6Vdq05m— Siraj Noorani (@sirajnoorani) September 11, 2026 -
ప్రశ్నిస్తే ఖాతాలు మాయం.. సాక్షి గొంతు నొక్కుతున్న కూటమి ప్రభుత్వం..!
-
వానల్లేకున్నా.. గంగమ్మ గర్జన! బిహార్‌లో 47 లక్షల మంది విలవిల!
వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా.. బిహార్‌ను వరద కష్టాలు మాత్రం వీడటం లేదు. గంగమ్మ ఉగ్రరూపంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఊళ్లు, రహదారులు, పంట పొలాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజల దైనందిన జీవనం అస్తవ్యస్తమైంది. వరద ఉధృతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న సోషల్ మీడియా వీడియోలు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి. నీటమధ్య చిక్కుకున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నా పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.భాగల్పూర్ జిల్లా సుల్తాన్‌గంజ్ వద్ద గంగానది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. సెప్టెంబర్ 11 ఉదయం అక్కడ నీటిమట్టం 36.62 మీటర్లకు చేరింది. ఇది ప్రమాద స్థాయి కంటే 2.12 మీటర్లు ఎక్కువ. అయితే ఈ ఉదయం అక్కడ నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ పలు చోట్ల నదీ రక్షణ కట్టలు దెబ్బతినడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.వర్షం తక్కువైనా.. వరద ఎలా?ఈసారి బిహార్ వరదలకు ఒకే కారణం లేదని అధికారుల వివరణ, తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. ఆసక్తికరంగా.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు బిహార్‌లో సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 1 నాటికి వర్షపాతం లోటు దాదాపు 30 శాతంగా ఉంది. అంటే కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్రం వర్షాభావ పరిస్థితినే ఎదుర్కొంది. ఆ తర్వాతే ఒక్కసారిగా నదుల్లో ప్రవాహం పెరగడంతో వరద పరిస్థితి తలెత్తింది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, వారాణసి పరిసర ప్రాంతాలతో పాటు ఎగువ గంగా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల నీరు గంగలోకి చేరి దిగువకు ప్రవహించింది. దీంతో బిహార్‌లో గంగానది నీటిమట్టం వేగంగా పెరిగింది.అంతేకాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నీటి ప్రవాహం, బిహార్‌లో అక్కడక్కడ కురిసిన వర్షాలు కూడా పరిస్థితిని తీవ్రం చేశాయి. గంగా నీటిమట్టం పెరగడంతో దానిలో కలిసే చిన్న, పెద్ద నదుల నీరు వెనక్కి నిలిచే బ్యాక్‌వాటర్ ప్రభావం ఏర్పడింది. దీంతో ఇప్పటికే నీటితో నిండిన ప్రాంతాల్లో ముంపు మరింత పెరిగింది.నేపాల్ వర్షాల పాత్ర ఎంత?బిహార్ వరదల ప్రస్తావన వచ్చినప్పుడల్లా నేపాల్ పేరు ముందుకు వస్తుంది. కారణం.. ఉత్తర బిహార్‌లోని అనేక ప్రధాన నదులు నేపాల్ హిమాలయ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ రాష్ట్రంలోకి రావడమే. కోసి, గండక్, బాగ్మతి వంటి నదులకు ఎగువ పరీవాహక ప్రాంతాలు నేపాల్‌లో ఉన్నాయి. అక్కడ భారీ వర్షాలు కురిస్తే దిగువ ప్రాంతాలకు ఒక్కసారిగా భారీగా నీరు చేరే అవకాశం ఉంటుంది.ఆగస్టు చివరి వారంలో నేపాల్‌లోని కొన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల నుంచి వచ్చే నదుల్లోనూ ప్రవాహం పెరిగింది. దీనికి తోడు.. ఈసారి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు, అక్కడి నుంచి వచ్చిన వరదనీరు ముంచెత్తాయి.బిహార్‌కే వరద ముప్పు ఎందుకింత?బిహార్ భౌగోళిక స్వరూపమే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మారుస్తోంది. ముఖ్యంగా ఉత్తర బిహార్ హిమాలయాల నుంచి వచ్చే నదులు విస్తారమైన మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించే ప్రాంతం. కొండ ప్రాంతాల్లో వేగంగా ప్రవహించే నదులు మైదానాల్లోకి వచ్చిన తర్వాత ప్రవాహ వేగం తగ్గుతుంది. దీంతో అవి తీసుకొచ్చే ఇసుక, మట్టి, సిల్ట్ నదీ పడగలో పేరుకుపోతాయి. దీంతో నదుల నీటిని మోసుకెళ్లే సామర్థ్యం తగ్గి, భారీ ప్రవాహం వచ్చినప్పుడు నీరు ఒడ్డులను దాటి బయటకు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గంగా, కోసి, గండక్, బాగ్మతి, బుడి గండక్, ఘాఘ్రా, మహానంద, పున్పున్ వంటి నదులు బిహార్‌లోని వివిధ ప్రాంతాలకు వరద ముప్పును కలిగిస్తుంటాయి. ముఖ్యంగా కోసి నది తరచూ తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం, భారీగా సిల్ట్ పేరుకుపోవడం వల్ల ఉత్తర బిహార్‌లో వరద సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే కోసిని చాలాకాలంగా ‘బిహార్ దుఃఖదాయిని’గా పిలుస్తారు.#WATCH | Bhagalpur, Bihar: Over 90 panchayats and several urban areas in the Bhagalpur area remain severely flooded. NH-80 on the Bhagalpur-Patna route has been shut near Bhavnathpur for five days as floodwater flows nearly two feet deep across the road. Floodwaters have also… pic.twitter.com/nuVuW3LYNa— ANI (@ANI) September 12, 2026రక్షణ కట్టలకూ గండంఅదే సమయంలో వరదనీరు గ్రామాలు, పట్టణాలు, పంట పొలాల్లోకి చేరకుండా నదుల వెంట నిర్మించే ఎత్తైన కట్టలను రక్షణ కట్టలు అంటారు. బిహార్‌లో దశాబ్దాలుగా ఇలాంటి కట్టలపై ఆధారపడి వరద నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అయితే నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగినప్పుడు ఈ కట్టలపై నీటి ఒత్తిడి కూడా పెరుగుతుంది. తాజా వరదల్లో భాగల్పూర్లో పలు ప్రాంతాల్లో రక్షణ కట్టలు దెబ్బతినడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఒకచోట కట్ట తెగితే పెద్ద మొత్తంలో నీరు ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలు, రహదారులు, పొలాల్లోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది.లక్షల మందిపై ప్రభావంతాజా అధికారిక సమాచారం ప్రకారం 15 జిల్లాల్లో 46.88 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. 88 బ్లాకులు, 561 గ్రామ పంచాయతీల్లో ముంపు పరిస్థితులు నెలకొన్నాయి. రహదారులు, ఇతర రవాణా మార్గాలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాల్లో పడవలే ప్రజలకు ప్రధాన రవాణా మార్గంగా మారాయి. భాగల్పూర్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ వరదనీటిలో చిక్కుకున్న వారిని తరలించేందుకు పడవలను ఉపయోగిస్తున్నారు. తాజాగా వరదనీటిలో ఒక వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు మరో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన కూడా చోటుచేసుకుంది.The floods in Bihar should now be declared a national disaster, and immediate assistance should be provided to Bihar. pic.twitter.com/H2YlFNH6HW— Sameera Jain (@SameeraJain6) September 7, 2026సహాయక చర్యలు ముమ్మరంవరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. దాదాపు 33 రెస్క్యూ బృందాలు, సుమారు 700 ప్రభుత్వ పడవలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ కిచెన్లు పనిచేస్తున్నాయి. పొడి రేషన్, పాలిథిన్ షీట్లు తదితర సహాయ సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం బోటు అంబులెన్సులను కూడా వినియోగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 1,194 కమ్యూనిటీ కిచెన్లు పనిచేస్తున్నాయి.ఇప్పుడేం జరుగుతోంది?కొన్ని ప్రాంతాల్లో గంగానది నీటిమట్టం స్వల్పంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నా.. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. సుల్తాన్‌గంజ్‌లో నీటిమట్టం తగ్గుముఖం పట్టినా ప్రమాద స్థాయికి రెండు మీటర్లకు పైగా ఎగువన ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రక్షణ కట్టలపై నీటి ఒత్తిడి కొనసాగుతోంది.ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం మాత్రమే కాకుండా.. నదుల్లో పేరుకుపోయే సిల్ట్ నిర్వహణ, రక్షణ కట్టల బలోపేతం, వరద ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, నదుల ప్రవాహ మార్గాలపై శాస్త్రీయ అధ్యయనాలు, దీర్ఘకాలిక వరద నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తాజా పరిస్థితి మరోసారి గుర్తుచేస్తోంది.వైరల్ ఫెర్రీ వీడియో సంగతేంటి?ఇక భారీగా ప్రయాణికులతో నిండిన ఫెర్రీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సుమారు 200 మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వీడియో ప్రస్తుత బిహార్ వరదలకు సంబంధించినదా? పాతదా? లేదా ఏఐ సాయంతో రూపొందించిందా? అనేది క్లారిటీ లేదు. అయితే జులై చివరి వారంలోనే ఓ యూట్యూబ్ చానెల్లో ఈ వీడియో అప్లోడ్ కావడం గమనార్హం. అయితే ప్రస్తుత వరద పరిస్థితుల్లో రోడ్డు మార్గాలు దెబ్బతినడంతో పడవలపై ప్రజలు ఆధారపడుతున్న విషయం మాత్రం వాస్తవం.This is not an ocean; this is the Mighty Ganges in Bihar. pic.twitter.com/ecSUSLCahb— Magadh Updates (@magadh_updates) September 11, 2026ఇదీ చదవండి: దుర్మార్గులు: ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కావట్లేదని.. -
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? ఈ అలవాటు ప్రమాదమే!
ఉదయం నిద్ర లేవగానే తెలియకుండానే ఫోన్ వైపు చెయ్యి చాచడం ఈ రోజుల్లో అందరికీ ఒక అలవాటుగా మారిపోయింది. కేవలం అలారమ్ ఆపడం కోసమే ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పటికీ! ఆ తర్వాత తెలియకుండానే సోషల్ మీడియా స్క్రోలింగ్‌లో మునిగిపోతున్నాం. దీనివల్ల అసలు రోజేప్రారంభం కాకముందే, మనస్సు రకరకాల ఆలోచనలతో నిండిపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఫోన్‌కే మొదటిప్రాధాన్యత ఇవ్వడం వల్ల, మన రోజు ఒక నెగెటివ్ ఆలోచనలు, బలహీనమైన మానసిక స్థితితోప్రారంభమవుతోందట.మంచం దిగకముందే ఫోన్ చూడటం వల్ల మన మానసిక శక్తి తగ్గిపోతుందట. అంతేకాదు, ఆ రోజంతా మనం ఏ పని సరిగ్గా చేయలేమని పరిశోధకులు చెబుతున్నారు. మనం నిద్రలేవగానే ఒక్కసారిగా వచ్చే సందేశాలు, ఈ మెయిల్లు, సోషల్ మీడియా అప్డేట్లను చూడటం వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.ఫోన్ చూసే ముందు నీళ్లు తాగడం, బాడీ స్ట్రెచింగ్, ఆ రోజు పనులను ప్రణాళిక బద్ధంగా చేసుకోవడం వంటి వాటి కోసం ప్రతిరోజూ ఉదయం కేవలం 20 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. ఫోన్‌కి బదులు అలారం ఉపయోగిస్తే క్రమంగా మొబైల్ మీద ఆధారపడే అలవాటు తగ్గుతుందని చెబుతున్నారు.ఇవీ చదవండి: ‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’ -
మీ మామ బాగోతాలివిగో..
సాక్షి, అమరావతి: ‘నిజం గెలిచింది’ అంటూ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మామగారిని కీర్తిస్తూ పెట్టిన ఆ పోస్ట్‌లో వ్యంగ్యాన్ని, హాస్యాన్ని సమపాళ్లలో బ్రహ్మాండంగా పండించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బాగోతాలు అంటూ మూడు అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయి మూడేళ్లయిన సందర్భంగా బ్రాహ్మణి హైదరాబాద్‌లోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించారు. ‘నిజం గెలిచింది’ నినాదంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై నాగేశ్వరరావు ఇలా స్పందించారు. రెండెకరాల నుంచి.. సంపన్న సీఎం దాకా.. ‘రెండో, ఇరవై రెండో ఎకరాలతో 1970వ దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించారు. నేడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా తెలుగుజాతికి అపఖ్యాతి తీసుకొచ్చారు’ అని చంద్రబాబుపై నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆయన్ని నిస్వార్థ’ అవినీతిపరుడు అంటూ ఎద్దేవా చేశారు. ‘అగౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు’ అంటూ సంబోధించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అహర్నిశలు కృషిచేసిన ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎన్టీఆర్ అకాల మరణానికి కారకుడైన నయవంచకుడు, తెలుగు ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు. విభజనకు లిఖితపూర్వక అంగీకారం ‘అంతే కాదు తల్లీ.. మీ మామగారి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి’ అంటూ మూడో అంశాన్ని ప్రస్తావించారు. తెలుగుజాతి ఐక్యత, ఆత్మగౌరవం కోసం ఏర్పడిన టీడీపీని ఎన్టీఆర్ నుంచి గుంజుకోవడమే కాకుండా, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు లిఖితపూర్వకంగా అంగీకరించారని గుర్తుచేశారు. తద్వారా తెలుగుజాతికి తీరని ద్రోహం చేసిన ఘనుడంటూ విమర్శించారు. ‘సృజనాత్మక భరితమైన మీ కాల్పనిక వ్యథ గురించి ఈ మూడు వ్యాఖ్యలు చాలా? ఇంకా కావాలా?’ అంటూ బ్రాహ్మణిని నాగేశ్వరరావు ప్రశ్నించారు. -
‘అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా ఫోన్ చేయండి’
విజయనగరం: కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 11వ తేదీ) విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో బొత్స సమావేశమయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా కార్యకర్తలకు బొత్స దిశా నిర్దేశం చేశారు. ‘ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి. చట్ట వ్యతిరేకమైన పోస్టులకు, అబద్ధపు ప్రచారాలకు దూరంగా ఉండాలి.ఇక మీదట ప్రతి కార్యకర్త నేరుగా జిల్లా పార్టీ కార్యాలయంలో అనుసంధానం కావాలి. నేను ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను.. ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత -
అమ్మ చివరి చూపు దక్కలేదు.. కృష్ణుడి పాదాల చెంత కన్నీళ్లు!
దాదాపు రెండేళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నారు. నమోదైన అభియోగాలపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఆధారాల్లేవీ చూపించలేకపోయింది. అయితే చావు బతుకుల మధ్య తన తల్లి.. ఆ కొడుకును చూసేందుకు అర్జీ పెట్టుకుంది. అధికారుల మనసు కరగలేదు. చివరకు.. ఆ తల్లి అంత్యక్రియల కోసం పెరోల్ విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరించింది. పాపం.. కన్నతల్లిని చివరిసారి చూసే అవకాశం కూడా దక్కకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సరాసరి గుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడి విగ్రహం పాదాలను తాకుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బంగ్లాదేశ్‌లో జైల్లో ఉన్న హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తన కుమారుడిని చివరిసారైనా చూడాలని కోరుకున్నారు. అయితే అందుకు జైలు అధికారులు అంగీకరించలేదు. చివరకు ఆమె మరణించాక అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆవేదనతో ఆయన పెరోల్ టైం పూర్తికాకముందే మళ్లీ జైలుకు వెళ్లిపోయారు. ఆ మధ్యలో ఆయన దేవుడి సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సంధ్యా రాణి కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను చిట్టగాంగ్‌లోని పుండరీక ధామ్‌కు తీసుకొచ్చారు. తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న చిన్మయ్ కుటుంబ సభ్యులు.. ఆమెను చివరిసారిగా చూసేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని బుధవారం అధికారులను కోరారు. అయితే అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు ఖైదీకి పరోల్ ఇచ్చే నిబంధన లేదని అధికారులు కుటుంబానికి తెలిపారు. ఆ తర్వాతి రోజే సంధ్యా రాణి కన్నుమూశారు.ఆమె మరణంతో చిన్మయ్ కుటుంబం మరోసారి అధికారులను ఆశ్రయించింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని కోరింది. ఈసారి చిట్టగాంగ్ జిల్లా యంత్రాంగం మానవతా దృక్పథం అని పేర్కొంటూ ఐదు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు చిట్టగాంగ్ సెంట్రల్ జైలు నుంచి చిన్మయ్‌ను బయటకు తీసుకొచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్మయ్ నేరుగా హతజారీ ప్రాంతంలోని పుండరీక ధామ్‌కు వెళ్లారు. అక్కడ తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహం ముందు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ విగ్రహం పాదాలను తాకారు. జైలులో ఉన్న సమయంలో తల్లి అనారోగ్యం, ఆమెను చూడలేకపోయిన బాధ ఆయనలో ఎంతగా ఉందో ఈ దృశ్యాలు చెప్పకనే చెప్పాయి. తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాక చిన్మయ్ తిరిగి జైలు బాట పట్టారు. పరోల్ సమయం రాత్రి 9 గంటల వరకు ఉన్నప్పటికీ.. రాత్రి 8.03 గంటలకే చిట్టగాంగ్ సెంట్రల్ జైలుకు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.Heartbreaking 💔…!Hindu monk Chinmoy Krishna Das Taken into custody again In BANGLADESHHe was out on parole for few hours to see his dead mother…… pic.twitter.com/WMKX7sy68J— Mamta Painuly Kale (@mamta_kale) September 11, 2026ఒకవైపు తల్లి మరణం.. మరోవైపు ఆమెను బతికుండగానే చివరిసారి చూడలేకపోయిన బాధ.. కేవలం ఐదు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేసి మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి.. చిన్మయ్ పరోల్ దృశ్యాలను మరింత భావోద్వేగంగా మార్చాయి.ఆరు క్రిమినల్ కేసులుబంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల హక్కుల కోసం గళం వినిపించిన చిన్మయ్ కృష్ణ దాస్ 2024 నవంబర్ 25న అరెస్టయ్యారు. చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టైన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపర్చగా బెయిల్ నిరాకరించి జైలుకు పంపారు.ఆయన అరెస్టు తర్వాత చిట్టగాంగ్ కోర్టు వద్ద జరిగిన ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వ న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలిఫ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులోనూ చిన్మయ్‌ను నిందితుడిగా చేర్చారు. దీనిపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.ఇవే కాకుండా హత్యాయత్నం, విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం, విధ్వంసం తదితర ఆరోపణలతో ఆయనపై మరికొన్ని కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చిన్మయ్‌పై ఆరు క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. వీటిలో నాలుగు కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. మిగిలిన కేసుల కారణంగా ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోతున్నారు. దేశద్రోహం కేసులో లభించిన బెయిల్‌పైనా స్టే కొనసాగుతోంది.బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల హక్కులు, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వరుస దాడులు, హత్యలు, ఈ మధ్యలోనే చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు, ఆయనపై కొనసాగుతున్న కేసులు, తాజాగా తల్లి బతికుండగానే పరోల్ దక్కకపోవడం వంటి పరిణామాలు వాస్తవ పరిస్థితుల్ని బయటపెడుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, మైనారిటీల భద్రత అంశాన్ని భారత్ పలుమార్లు ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఆల్ టైం హైకి చేరితో భారత్ పరిస్థితి ఏంటి? -
రష్యా మంత్రికి మన సినిమాల్లో హీరో ఛాన్స్!.. గోయల్ సరదా ఆఫర్
‘‘మీరు ఒప్పుకుంటే.. త్వరలో మా సినిమాల్లో చూస్తామేమో’’ అంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్యా మంత్రి ఆంటోన్ అలిఖానోవ్ను ఉద్దేశించి గోయల్ ఆ వ్యాఖ్య చేశారు. వృత్తి రీత్యా రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన లుక్, కటౌట్లు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోదన్నట్లుగా ఉంటుంది. ఇదే విషయాన్ని మన మంత్రి ప్రస్తావించారు..ఇన్నోప్రామ్ ఇండియా 2026 కార్యక్రమంలో భారత్, రష్యా మధ్య పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలపై చర్చ సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. అలిఖానోవ్ చూడటానికి చాలా డ్యాషింగ్‌గా ఉన్నారని పేర్కొన్న గోయల్.. ఆయన బహుశా పొరపాటున రాజకీయాల్లోకి వచ్చారేమో అని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఆడియోవిజువల్ సహకారాన్ని కూడా మరింత పెంచుకోవాలని, త్వరలోనే ఆయనను బాలీవుడ్ సినిమాలో చూడొచ్చేమోనని సరదాగా వ్యాఖ్యానించారు.2030 నాటికి 100 బిలియన్ డాలర్ల టార్గెట్అలిఖానోవ్కు గోయల్ ఇచ్చిన బాలీవుడ్ ఆఫర్ సరదా వ్యాఖ్యే అయినప్పటికీ.. ఆయనతో జరిగిన చర్చలు మాత్రం పూర్తిగా వ్యాపారపరమైనవే. భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అలాగే రెండు దేశాల మధ్య పెట్టుబడులను 50 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయి.ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు 60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇది రికార్డు స్థాయిలో 68.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఈ వాణిజ్యంలో భారత్ నుంచి రష్యాకు జరిగే ఎగుమతులు తక్కువగా ఉండగా.. రష్యా నుంచి భారత్‌కు దిగుమతులు భారీగా ఉన్నాయి.Bollywood calling? Piyush Goyal sees a movie star in Russia’s trade minister“Possibly we’ll see him starring in a movie in Bollywood very soon,” Goyal joked about Anton Alikhanov at the India–Russia Business Dialogue 2026. pic.twitter.com/yvRpLn26en— Sputnik India (@Sputnik_India) September 10, 2026పుతిన్ మెచ్చుకుని మరీ..ఆంటోన్ ఆండ్రేయెవిచ్ అలిఖానోవ్ 1986 సెప్టెంబర్ 17న సుఖుమిలో జన్మించారు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న ఆయన.. ఆర్థికశాస్త్రం, న్యాయశాస్త్రం చదివారు. రష్యా ప్రభుత్వంలో వివిధ బాధ్యతలు చేపట్టి రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. 2016లో కేవలం 30 ఏళ్ల వయసులో కలినిన్‌గ్రాడ్ ప్రాంతానికి తాత్కాలిక గవర్నర్‌గా నియమితులై.. అప్పట్లో రష్యాలోనే అత్యంత పిన్న వయస్కుడైన రీజియనల్ లీడర్‌గా పేరు దక్కించుకున్నారు. 2017లో పూర్తిస్థాయి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు సన్నిహిత అధికారిక సమన్వయం కొనసాగింది. 2024లో పుతిన్ ప్రభుత్వం ఆయనకు కీలకమైన పరిశ్రమలు, వాణిజ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి రష్యా పారిశ్రామిక విధానాలు, విదేశీ వాణిజ్యంపై కీలక నిర్ణయాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.భారీగా వాణిజ్య లోటురష్యా నుంచి భారత్ ప్రధానంగా ముడిచమురు, ఇంధనం వంటి ఉత్పత్తులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో భారీ అసమతుల్యత(trade imbalance) ఉంది. దీన్ని తగ్గించేందుకు భారత్ నుంచి రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, టెక్స్టైల్స్ తదితరాల ఎగుమతులను పెంచాలని గోయల్ లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదే సమయంలో భారత్–యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ (EAEU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలను వేగవంతం చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. రష్యాతో పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. పీయూష్ గోయల్ సెప్టెంబర్ 10న అలిఖానోవ్తో పాటు ఈఏఈయూ వాణిజ్య మంత్రి ఆండ్రే స్లెప్నెవ్తోనూ చర్చలు జరిపారు.రేర్ ఎర్త్స్, మైక్రోఎలక్ట్రానిక్స్పై దృష్టిఇరు దేశాల మధ్య సహకారాన్ని సంప్రదాయ వాణిజ్యానికి మాత్రమే పరిమితం చేయకుండా కొత్త రంగాలకు విస్తరించాలన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలను అలిఖానోవ్ ప్రస్తావించారు. రష్యాలో ఏపీఐ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు భారత ఫార్మా కంపెనీలను ఆయన ఆహ్వానించారు.ఇలా ఇరు దేశాల మధ్య కీలకమైన వాణిజ్య, పారిశ్రామిక చర్చలు జరుగుతున్న వేళ.. అలిఖానోవ్ లుక్‌ను ప్రస్తావిస్తూ గోయల్ చేసిన ఒక్క సరదా వ్యాఖ్య మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. వ్యాపార చర్చల మధ్య ‘‘బాలీవుడ్‌లోకి వస్తారా?’’ అంటూ గోయల్ చేసిన చమత్కారం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఏఐతో ఎంతో ఈజీగా వినాశనం! -
క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్‌కు అగ్నిపరీక్ష!
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు తన అనుభవ రాహిత్యం ఏమిటో ఇప్పటికైనా తెలిసి ఉండాలి. గాజు ఇంటిలో కూర్చుని ఎదుటివాళ్లపై రాళ్లు వేస్తే ఏమవుతుందో అర్దం అయి ఉండాలి. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి బుకాయింపులు, అసత్యాలు వల్లె వేయడం వంటివి నేర్చుకున్నారు కాని, ఆయన మాదిరి ఎదుటివారిపై నెట్టివేయడం అలవాటైనట్లు లేదు. అందువల్లే ఇప్పుడు లోకేష్ సవాళ్ల పర్వం నుంచి పనిచేసేవారికే రాళ్ల దెబ్బలు అంటూ సెంటిమెంట్ ప్రయోగించే యత్నం చేశారు. లేదంటే కోర్టుకు వెళ్లండని అంటున్నారు. కొందరు అభ్యర్దులు కోర్టులకు కూడా వెళ్లారు. కానీ అవి ఎప్పటికి విచారణకు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు.ఏపీలో టీచర్ల ఎంపికలో ఎన్ని గందరగోళాలు జరిగాయో రోజురోజుకు తేటతెల్లమవుతున్నప్పటికీ, చర్చకు సవాల్ అంటూ లోకేష్ డాంబికంగా మాట్లాడి దెబ్బతిన్నారు. పదిసార్లు తాను చర్చకు సవాల్ విసిరినా మాజీ సీఎం జగన్ సిద్దం కాలేదని ఒక అసత్యపు ప్రచారం చేయడం ద్వారా ఈ స్కామ్ నుంచి బయటపడవచ్చని తొలుత అనుకున్నట్లున్నారు. కానీ నిజం నిప్పులాంటిది అంటారు. అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. అలాగే క్రీడల కోటాలో నకిలీ సర్టిఫికెట్తో, పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందినవారి బాగోతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అక్కడితో ఆగకుండా ఇతర కేటగిరీలలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి టీచర్ ఉద్యోగాలు పొందినవారూ ఉన్నారు. తొలుత ఎస్ఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ మొదటి ర్యాంకు సాధించడం, ఆ తర్వాత అతనిని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా అక్కడ పరీక్ష పత్రం లీక్ అయిందన్న అనుమానంతో మొదలైన ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ, తిరుగు లేని ఆధారాలతో స్కామ్ బయటపడిందన్న విషయం బోదపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాని, ఆయన పార్టీ నేతలు వీటికి సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తున్నా వాటికి జవాబు ఇవ్వడంలో మంత్రి లోకేష్, టీడీపీ నేతలు విఫలం అయ్యారు. సవాళ్లు చేస్తూ టీడీపీ కేడర్‌లో ఒక నమ్మకం కలిగించడానికి లోకేష్ ప్రయత్నించారు. ఆయనను రక్షించడానికి చంద్రబాబు కృషి చేశారు. అందులో భాగంగానే లోకేష్ గురుపూజోత్యవం నాడు మాట్లాడుతూ పనిచేసే వాళ్లకే రాళ్ల దెబ్బలు అని అన్నారు. ఇక్కడ సమస్య ఏమిటి?.డీఎస్సీ పెట్టింనందుకు కాదు.. అక్రమాలు జరిగినందుకు.. ఆ విషయాన్ని కప్పిపుచ్చాలనుకుంటే ఎలా కుదురుతుంది?. సమాజంలో గౌరవంగా, నిజాయితీగా ఎలా బతకాలో నేర్పించింది తన తండ్రి చంద్రబాబు అని ఆయన అన్నారు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా, యువకుడిగా ఉన్న లోకేష్ అసత్యాలు చెప్పడం మాని, అహంకారంతో ప్రవర్తించడం మాని, హుందాగా రాజకీయాలు చేస్తే ఆయనకే పేరు వస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితం గురించి నిత్యం అంతా మాట్లాడుకునేదే. జగన్‌కు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని అనడం ద్వారా ఏదో ఆత్మ సంతృప్తి చెంది ఉండవచ్చు కానీ, ఆయన విసిరిన సవాల్ గురించి లోకేష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?. డీఎస్సీ అన్న పదం రెండుసార్లు వాడినందుకే తప్పుపడుతున్న లోకేష్ తెలుగులో ఎన్ని తప్పులు మాట్లాడతారో మర్చిపోతే ఎలా?. అదే జగన్ తన టైమ్ లో జరిగిన ఏపీపీఎస్సీపై చేస్తున్న అభియోగాలు, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరారే!. తాను పదిసార్లు సవాల్ చేసినా చర్చకు రాలేదని, అసందర్భ వ్యాఖ్యలు చేస్తే ఏం ప్రయోజనం?. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి.చంద్రబాబు నాయుడు తాను ప్రభుత్వపరంగా ఏ తప్పు చేసినా, తెలివిగా అధికారుల మీద తోసేసి తప్పించుకుంటారు. ఉదాహరణకు ఈ మధ్య ఆయా సభలలో అధికారులను నిలబెట్టి వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే యత్నం చేశారు. రోడ్లు బాగోలేదు కదా అని ప్రజలను ప్రశ్నించి అధికారులను నిందిస్తే ఏం లాభం. నిధులు ఇవ్వకుండా తమపై రుద్దడం ఏమిటా అని అధికారులు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏదైనా స్కామ్ జరిగితే, అందులో తనకు ఇబ్బంది వస్తుందనుకుంటే వ్యూహాత్మకంగా సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని డ్రామా నడిపిస్తారు. ఎవరో కొందరిని ఆ సమయానికి బలి చేసి కథ ముగిస్తారు. ఉదాహరణకు గాదె సాయికృష్ణ అనే నిందితుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టడం వల్ల మరణించిన ఘటనను కేవలం అక్కడి సీఐ, ఆ దిగువ ఉండే కానిస్టేబుళ్ల వద్దే ఆపేశారు తప్ప, పై అధికారుల దాకా వెళ్లకుండా సిట్ పేరుతో కధ నడిపించేశారు. ఎందుకంటే అది పై దాక వెళితే తనకు కూడా తలనొప్పి అవుతుందని తెలుసు కాబట్టి అన్నమాట.రాజమండ్రి పుష్కరాలలో పబ్లిసిటీ కారణంగా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారన్న అభియోగాలు వచ్చాయి. ఆ ఘటనలో తను చిక్కుకోకుండా ఎలా తప్పించుకున్నారో అందరికీ తెలుసు. పైగా రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? అని ఎదురుదాడి చేశారు. తిరుమలలో 20 మంది ఎన్కౌంటర్ అయితే దేశవ్యాప్తంగా అది సంచలన ఘటన. దానిని కూడా ఎలా ముగించారో చూశాం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లను చంపడం తప్పుకాదన్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. చంద్రబాబు ధోరణి అలా ఉంటుంది. వాగ్దానాలు చేయడం, వాటిని తుస్సు మనిపించడం, తాను అబద్దం ఆడుతున్నానని తెలిసినా, ప్రజలను నమ్మించడానికి వాటినే వల్లించడం వంటివి చంద్రబాబు చేయగలరన్న అభిప్రాయం వివిధ పక్షాల నేతలలో ఉంది. ఈ విషయం వరకు బాగానే నేర్చుకున్నట్లు కనిపించిన లోకేష్, తన అనుభవ రాహిత్యంతో డీఎస్సీ అక్రమాల కేసులో ఇరుకున్నట్లయిందన్న విశ్లేషణ వస్తుంది.వైఎస్ జగన్ ఈ అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా మీడియాకు వివరించిన వెంటనే, ఆధారాలు ఉన్నట్లయితే తప్పక చర్చ తీసుకుంటామని, ఇందులో తనకు పాత్ర లేదని, అధికారులదే తప్పేమైనా ఉందేమోనని అని ఉంటే కొంతైనా తప్పించుకోగలిగేవారేమో. కానీ లోకేష్ మొత్తం వ్యవహారాన్ని తన భుజాన వేసుకుని డీఎస్సీ క్రెడిట్ అంతా తనదేనని ప్రొజెక్టు చేసుకునే క్రమంలో అందులోని డెబిట్ మొత్తం తన ఖతాలో వేసుకోవలసి వచ్చింది. ఇదే సమయంలో యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు ఉన్నవారికి క్రీడా కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణను వైఎస్సార్సీపీ చేస్తోంది. అది నిజమైతే వారికి టీచర్ల ఉద్యోగాలు ఇప్పించానన్న సంతోషం కన్నా, అది స్కాంగా మారి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయన్న టెన్షన్ లోకేష్‌కు ఏర్పడుతుంది. జగన్ వీటన్నిటిపైన ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పలేక ఎదురుదాడి చేస్తూ మరిన్ని అనుమానాలను చంద్రబాబు, లోకేష్ కలిగించారు.చిత్రంగా ఉద్యోగాలు వచ్చిన టీచర్ల ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి మరిన్ని డౌట్లు క్రియేట్ చేసుకున్నారు. టీచర్ పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నేరుగా ఆరోపిస్తున్న అభ్యర్దుల ఇళ్లకు వెళ్లి వారి నుంచి ఆధారాలు తీసుకుని చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది కదా!. ఎంపికైన టీచర్లందరిని వైఎస్సార్సీపీ తప్పుపట్టకపోయినా వాళ్లతో కర్నూలు, విశాఖపట్నం తదితర చోట్ల ర్యాలీలు తీయిస్తే ఏం ప్రయోజనం?. చిత్తశుద్ది ఉంటే ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో కాని, ఇతరత్రా కాని కొందరు అభ్యర్దులు చెబుతున్న వాటిలో నిజానిజాలు ఏమిటో తేల్చడానికి ఎందుకు లోకేష్ సిద్దపడలేకపోయారు. తాము జవాబు ఇవ్వలేకపోతుండటం, సంబంధిత అధికారులతో మీడియా సమావేశాలు పెట్టించారు. వారు మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక సతమతమయ్యారు. కొన్ని అంశాలలో విచారణ జరుగుతోందని, పరిశీలిస్తున్నామని తప్పించుకునే ధోరణిలో అధికారులు చెప్పవలసి వచ్చింది.జగన్ టైమ్‌లో సుమారు లక్షన్నర మంది సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేస్తే ఒక్క అక్రమం జరిగినట్లు కూడా ఆరోపణలు రాలేదు. గతంలో ఏ అంశంపైన అయినా, ఏ ఆరోపణ వచ్చినా, ఎలాంటి విచారణకైనా జగన్ ఆదేశించేవారు కదా!. ఆ ధైర్యం చంద్రబాబు, లోకేష్లలో ఎందుకు కొరవడుతోంది?. దీనికి తోడు సుప్రీంకోర్టు తాజాగా వేరే రాష్ట్రంలో టీచర్ల ఎంపిక కేసులో చేసిన వ్యాఖ్యలు కూడా వీరికి మరింత ఆందోళన కలిగిస్తుండవచ్చు. కాగా, ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం కూడా ఆసక్తికరమే. చిత్రంగా పవన్‌తో కలిసి టీచర్ నియామక పత్రాలు అందించామని చంద్రబాబు ఒక స్పీచ్‌లో చెప్పారు. కానీ అసలు ఆ ప్రోగ్రాంలో తండ్రి, కొడుకులు తప్ప పవన్ లేరు కదా అని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. అంటే పవన్‌కు కూడా ఈ బురద అంటిస్తే బెటర్ అనుకున్నారా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్కామ్ నేపథ్యంలో పోలీసులను ప్రయోగించి అణచివేత చర్యలు, సోషల్ మీడియాలో పోస్టులు తొలగించడం వంటి చర్యలు చేస్తున్న కొద్దీ స్కామ్‌పై జనంలో మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
#80sTrend: హద్దులు దాటిన మీమ్ వార్
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. కానీ ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘మీమ్ వార్’ మరో స్థాయికి చేరింది. తాజాగా రెట్రో ట్రెండ్ ఏఐ ద్వారా దేశాన్ని ఊపేస్తోంది. తమ ఫొటోలను 70, 80 కాలం నాటి ఫొటోల్లా మార్చేసుకుని మురిసిపోతున్నారు చాలామంది. అయితే ఈ ట్రెండ్ వెనుక సైబర్ నేరాలకు అవకాశం ఉందనే హెచ్చరికలూ జారీ చేస్తున్నారు నిపుణులు. ఆ సంగతి పక్కన పెడితే.. పొలిటికల్‌గా ఇది మరో టర్న్ తీసుకుంది. ఒక పార్టీ పాతకాలం నాటి ఫొటోతో సెటైర్ వేస్తే.. మరో పార్టీ దానికి అంతకుమించిన వ్యంగ్య చిత్రంతో కౌంటర్ ఇచ్చింది. చివరకు ఈ పోస్టుల వ్యవహారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ టార్గెట్ చేసే వరకు వెళ్లింది. దీంతో ఇరు పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.కాంగ్రెస్ పోస్టుతో మొదలు..ఈ వివాదానికి కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చేసిన ఓ పోస్టు కారణమైంది. ‘1980ల నాటి గుజరాత్ వీధి’ అంటూ ఓ చిత్రాన్ని పోస్టు చేసింది. దీన్ని బీజేపీ తెలంగాణ కౌంటర్ చేసింది. 1970ల నాటి తరహాలో ఉన్న ఓ మహిళ బార్ కౌంటర్‌పై డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని ‘లుసియానా, ఇటలీ’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసింది. ఇక్కడితో ఆగని బీజేపీ కేరళ విభాగం మరో బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. పాతకాలం నాటి రాజకీయ పార్టీ కార్యాలయాన్ని తలపించేలా ఉన్న ఈ చిత్రంతో కాంగ్రెస్‌పై సెటైర్ వేసింది.అయితే ‘లుసియానా’ ప్రస్తావనతో పాటు వరుస పోస్టులను పరిశీలించిన పలువురు.. ఈ వ్యంగ్యానికి అసలు లక్ష్యం సోనియా గాంధీనేనని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఇటలీలోని లుసియానాలో జన్మించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ గుజరాత్ ఖాతా నుంచి చేసిన ఓ పోస్టును తర్వాత తొలగించినట్లు సమాచారం. దీంతో వివాదం మరింత ముదిరింది.దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ పేజీలు గుజరాత్ గజదొంగ, చాయ్ పేరిట రైల్వే స్టేషన్లో చోరుడు, మొసలిని పట్టుకున్న మొనగాడు అంటూ రెట్రో స్టైల్లోనే పలు పోస్టులు చేసింది. దీంతో ఇది నరేంద్ర మోదీని ఉద్దేశించేనంటూ బీజేపీ భగ్గుమంది. ఇలా ఇరు పార్టీలు ఈ ట్రెండ్‌ను తమ మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు వేదికగా మార్చేశాయి.రెండు పార్టీల మధ్య మాటల యుద్ధంపోస్టులపై ఇరు పార్టీల మద్దతుదారులు తీవ్రంగా స్పందించారు. బీజేపీ పోస్టుల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిని వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వాన్ని కించపర్చడంగా అభివర్ణించాయి. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సైతం ఈ విషయంలో బీజేపీపై మండిపడ్డారు. అయితే బీజేపీ మద్దతుదారులు తమ పోస్టులను రాజకీయ వ్యంగ్యంగా సమర్థిస్తూ.. ప్రత్యర్థి పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో కొందరు మాత్రం ‘రెండు పార్టీలు బురదలో కొట్టుకుంటున్నట్లుగా ఉంది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రాజకీయ అంశాలపై చర్చించాల్సిన సోషల్ మీడియా వేదికలు.. ఇలా పాత ఫొటోలు, మీమ్స్, వ్యక్తిగత విమర్శలకు వేదికలుగా మారడంపై కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.వైరల్ ట్రెండ్.. రాజకీయ పోరుకు ఆయుధంఇటీవల సోషల్ మీడియాలో పాతకాలం నాటి ఫొటోలు, మీమ్స్‌ను కొత్త క్యాప్షన్లతో వైరల్ చేయడం ట్రెండ్‌గా మారింది. రాజకీయ పార్టీలు కూడా ఇదే ట్రెండ్‌ను తమ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. ఈ ఘటనలోనూ ఓ పార్టీ పోస్టుకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడంతో మొదలైన వ్యవహారం.. చివరకు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. దీంతో రాజకీయాల్లో సోషల్ మీడియా మీమ్ సంస్కృతి ఎంతగా ప్రభావం చూపుతోందన్న చర్చ మరోసారి మొదలైంది.ఇదీ చదవండి: కోతులు అలా చేయడానికి మనమే కారణమా? -
‘చైల్డ్ పోర్న్’ కట్టడికి చర్యలేవి?
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్, సోషల్ మీడియా వేదికలపై చిన్నారులకు సంబంధించిన అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆన్లైన్లో పిల్లలకు రక్షణ కల్పించేలా కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేంద్రంతో పాటు ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయ మంత్రిత్వ శాఖలకు గురువారం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం ఈ కేసును గురువారం విచారించింది. ఇంటర్నెట్ను వినియోగించే పిల్లలను రక్షించేందుకు ఇంటర్నెట్లో ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేయడం అత్యవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. అశ్లీల కంటెంట్ నిరోధానికి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లు ఆటోమేటెడ్ కంటెంట్–ఫిల్టరింగ్, వయో నిర్ధారణ యంత్రాంగాలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని పిటిషనర్ కోర్టు దష్టికి తీసుకెళ్లారు. అల్గారిథమిక్ రికమండేషన్ల కారణంగా చిన్నపిల్లలు పదేపదే అసభ్య కంటెంట్ బారిన పడుతున్నారని వివరించారు. పోక్సో చట్టం కింద అశ్లీల కంటెంట్‌ను రిపోర్ట్ చేయని ఇంటర్నెట్ సంస్థలు, ఐటీ చట్టం కింద లభించే చట్టపరమైన రక్షణ కోల్పోతాయని 2024 నాటి తీర్పును పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది హెచ్ఎస్ ఫూల్కా కోర్టుకు గుర్తుచేశారు. ఆన్లైన్ వేదికల్లో ఉన్న అల్గారిథమిక్ ఆడిట్లు, అమలులో ఉన్న కంటెంట్ ఫిల్టరింగ్ ప్రొటోకాల్స్‌పై పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. -
ఎనభై.. కొత్త ట్రెండురా బై..
సాక్షి, హైదరాబాద్: 1980ల నాటి రెట్రో లుక్ ఇప్పుడో క్రేజ్‌గా మారింది. ఏఐ ఆధారిత ఇమేజ్ జనరేషన్ దీనికి వేదికగా మారింది. అప్పటి సెలబ్రిటీలు అనుసరించిన ఫ్యాషన్స్‌ను కాపీ కొడుతూ ఏఐ సాయంతో సృష్టిస్తున్న ఇమేజ్‌లు సోషల్ మీడియా స్టేటస్లు, పోస్టులలో అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అప్పటి దుస్తులు, జుట్టు తీరు, పరిసరాలు వంటి అంశాలను తలపించేలా ఈ చిత్రాలు ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ఇలాంటివి సెలబ్రిటీలు, సామాన్యులకు పరిమితం కాగా.. ఈసారి రాజకీయ నేతలు కూడా చాలామంది ఈ లుక్‌ను ట్రై చేయడం విశేషం. ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ తదితర వేదికల్లో సాధారణ యువత నుంచి ప్రముఖుల వరకు ఈ ‘80ల ట్రెండ్’ను అనుసరిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లోకి ఇలా... ముందుగా చాట్‌జీపీటీలో వ్యక్తులు తమ ఫొటోను అప్లోడ్ చేసి, దానిని 1980ల నాటి లుక్‌తో ఫొటోలా మార్చాలని సూచిస్తూ సవివరమైన ప్రాంప్ట్ ఇవ్వాలి. వ్యక్తి ముఖ లక్షణాలు, సహజమైన చర్మ ఛాయ, దీని ద్వారా నాటి సంప్రదాయ దుస్తులు, సహజమైన పోజులు, పాత ఫిల్మ్ కెమెరాతో తీసినట్లుగా కనిపించే ఫొటోలను కోరవచ్చు. అలాగే పాతకాలపు ఇళ్లు, సాదాసీదా దుస్తులతో అప్పటి జీవనాన్ని ప్రతిబింబించేలా కూడా చిత్రం రూపొందించుకోవచ్చు. అప్పటి పాత బస్సులు, సైకిళ్లు, దుకాణాలు, సినిమా పోస్టర్లు వంటి అంశాలను కూడా జోడించవచ్చు. రాజకీయ నాయకులు సైతం ‘రెట్రో’లోకి.. ఈ ట్రెండ్ సామాన్యులకే పరిమితం కాలేదు. ప్రధాని నరేంద్రమోదీ, రాహుల్గాందీల 80ల లుక్‌ను ఆయా పార్టీలు షేర్ చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ ఫొటో ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అప్డేట్స్ ఖాతాలో రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ కలిసున్న ఫొటోలను 1980 ట్రెండ్‌లోకి మార్చి పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా నాటి ట్రెండ్ ఫొటోను షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంపీ రేణుకా చౌదరి సహా పలువురు ప్రముఖులు ఈ ట్రెండ్‌కు భిన్నంగా 80ల నాటి తమ ఒరిజినల్ ఫొటోను పంచుకున్నారు.నకిలీలతో జాగ్రత్త.. ఇదిలా ఉండగా తాజా ట్రెండ్ ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. 1980 పేరుతో నకిలీ యాప్స్‌ను సృష్టించి.. వాటి ద్వారా ఏపీకే ఫైల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ కుట్రలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్‌ను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయించింది. డీఎస్సీపై వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టిన వెంటనే వీడియోలను తొలగించారు. ఫేక్ అకౌంట్లతో మెటాకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. మరో వైపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి ప్రభుత్వం.. 20కిపైగా వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు కూడా బ్లాక్ చేయించింది.సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు వెనుక ఏపీకి చెందిన సైబర్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఎస్సీ స్కామ్ వార్తలు పెట్టినందుకే సోషల్ మీడియా అకౌంట్ల బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును కాల రాస్తోంది.ఇదీ చదవండి: జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్ -
ఎట్టకేలకు ఐఫోన్ డ్యూయో : సోషల్‌మీడియాలో పేలుతున్న మీమ్స్
యాపిల్ సంస్థ ఎట్టకేలకు తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo) ను లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ఫీచర్లు, ఫోల్డబుల్ స్క్రీన్, ఇతర ప్రత్యేకతలపై కాకుండా సోషల్‌మీడియాలో జరుగుతున్న సంభాషణ మాత్రం విభిన్నంగా సాగుతోంది. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న జోక్‌కు IYKYK (if you know, you know) ) అనేది ట్రెండింగ్ ట్యాగ్‌లైన్‌గా మారింది.మైక్రోసాఫ్ట్ 2020లోనే తన రెండు స్క్రీన్ల ఫోల్డబుల్ డివైజ్‌ను యాపిల్ కాపీ కొట్టిందంటూ మీమ్స్, జోకులు పేలిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన ఫోన్‌కు 'Surface Duo' అని పేరు పెట్టింది. దీంతో 'Duo' అనేది కొత్త పేరేమీ కాదు, పాతదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాపిల్ 'Fold' అని పెట్టకుండా మైక్రోసాఫ్ట్‌ను కాపీ కొట్టిందని కొందరు ఎక్స్‌లో విమర్శించారు. మరికొందరు ఇది మైక్రోసాఫ్ట్‌దే కాకుండా, గతంలొ వచ్చిన ఇంటెల్ (Core Duo) చిప్‌ల పేరును కూడా గుర్తుచేస్తోందన్నారు. అయితే, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో కంటే ముందే, అంటే 1990లలోనే యాపిల్ తన PowerBook Duo ల్యాప్‌టాప్‌లకు ఈ పేరును వాడిందని మరికొందరు గుర్తుచేశారు.విండోస్ సెంట్రల్ ఎడిటర్ జాక్ బౌడెన్ మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ తమ 'Duo' ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలేయడం వల్ల యాపిల్ ఉద్దేశపూర్వకంగానే ఈ పేరును (మరియు MacBook Neo రూపంలో 'Neo' పేరును) ఉపయోగించుకుందని నిపుణులంటున్నారు. పేర్కొన్నారు. డ్రాయిడ్ లైఫ్ అనే టెక్ సైట్ వ్యాఖ్యానిస్తూ, మైక్రోసాఫ్ట్ తయారు చేసిన అత్యంత దారుణమైన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకటైన సర్ఫేస్ డ్యూయో పేరునే యాపిల్ ఎంచుకోవడం నవ్వు తెప్పిస్తోందని రాసుకొచ్చింది.విండోస్ లేటెస్ట్ కథనం ప్రకారం, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో హార్డ్‌వేర్ అద్భుతంగా ఉన్నప్పటికీ సోఫ్ట్వేర్ పరంగా విఫలమైంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఆ ప్రాజెక్ట్‌ను కొనసాగించి ఉంటే సర్ఫేస్ డ్యూయో ఎలా ఉండేదో, యాపిల్ ఐఫోన్ డ్యూయో ఇప్పుడు అలా వచ్చిందని విశ్లేషించింది.యాపిల్ గతంలో 'MagSafe Duo' ఛార్జర్ వంటి వాటికి ఈ పేరు వాడినప్పటికీ, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ విఫలమైన ప్రాజెక్ట్ పేరు మళ్లీ యాపిల్ ఫోన్‌కు రావడాన్ని నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. అయితే ఈ పేర్ల సారూప్యతపై యాపిల్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.'Huawei made a foldable phone five years ago...' '"Junk, that phone will break in an instant... Chinese junk... Why do you need so much screen on a single phone? Just buy a tablet."' 'Apple makes a foldable phone...' '"Only Apple could pull this off."'😁😁😁 pic.twitter.com/kbeCGujp8d— FierceGoys (@GrahamInHell) September 10, 2026 -
సైనిక విన్యాసంలో పేలిపోయిన చైనా ట్యాంక్!
బంగ్లాదేశ్‌లో సైనిక విన్యాసం విషాదాంతంగా మారింది. ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో భాగంగా ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతుండగా అకస్మాత్తుగా అందులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ సైనిక అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ట్యాంక్.. చైనాకు చెందిందిగా తెలుస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 9) చట్టోగ్రామ్‌లోని హాత్హజారీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ రేంజ్లో సైనిక విన్యాసం కొనసాగుతున్న సమయంలో ట్యాంక్ నుంచి గోలాలు(మందు గుండు బాల్స్) ప్రయోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన అధికారికి తొలుత అత్యవసర చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (సీఎంహెచ్)కు తరలించారు. బంగ్లాదేశ్ సైన్యం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ (ఐఎస్పీఆర్) ఈ ప్రమాదంపై ప్రకటన చేసింది. అసలు ఏం జరిగింది?ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ట్యాంక్‌లోని మందుగుండు సామగ్రి కారణమా? లేదంటే ట్యాంక్‌లోని ఫైరింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.చైనా తయారీ ట్యాంక్..!ప్రమాదానికి గురైన ట్యాంక్ చైనాకు చెందినదిగా తెలుస్తోంది. అది టైప్–59 అని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోనూ ఇదే తరహా ట్యాంక్ కనిపిస్తోంది. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ట్యాంక్ మోడల్‌ను వెల్లడించలేదు. టైప్–59ను బంగ్లాదేశ్ ఆర్మీ చాలాకాలంగా వినియోగిస్తోంది. పాత ట్యాంకులను చైనా సాయంతో ఆధునికీకరించి ‘డుర్జోయ్’గా కూడా అప్‌గ్రేడ్ చేసింది.Bangladesh Army’s Chinese-origin Type 59 tank reportedly exploded during a firing exercise, killing 2 crew members and injuring an officer.Made in China. Used in Bangladesh. Deadly outcome. pic.twitter.com/Gn0FRx5ul4— Shadow IND (@ShadowIND_IN) September 9, 2026దశాబ్దాలుగా బంగ్లా ఆర్మీలో..చైనాలో తయారైన టైప్–59.. సోవియట్ కాలం నాటి టీ–54 ట్యాంక్ ఆధారంగా అభివృద్ధి చేసిన ప్రధాన యుద్ధ ట్యాంక్. బంగ్లాదేశ్ ఆర్మీ చాలా కాలంగా ఈ తరహా చైనా తయారీ ఆర్మర్డ్ వాహనాలను వినియోగిస్తోంది. పాతబడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా తొలగించకుండా.. ఆధునికీకరణ, అప్గ్రేడ్ల ద్వారా మరికొంతకాలం సేవల్లో కొనసాగిస్తోంది. అందులో భాగంగా 40 టైప్–59 ట్యాంకుల అప్‌గ్రేడ్, మరో 58 టైప్–69ఐఐజీ ట్యాంకుల ఆధునికీకరణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినట్లు అక్కడి రక్షణ రంగ నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే బంగ్లాదేశ్ ఆర్మీకి ఇవి కేవలం పాత ట్యాంకులు మాత్రమే కాకుండా.. ఇప్పటికీ దాని ఆర్మర్డ్ ఫ్లీట్‌లో భాగంగా ఉన్న కీలక ప్లాట్ఫారమ్లన్నమాట!.దర్యాప్తు ప్రారంభంఈ ఘటనపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్లు చెబుతోంది. అయితే పేలుడు ఎలా సంభవించింది? ఫైరింగ్ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? మందుగుండు సామగ్రికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా? ట్యాంక్ పనితనం వంటి అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. ఫీల్డ్ ఫైరింగ్ వంటి సైనిక శిక్షణ కార్యక్రమాల్లో అనుకోని ప్రమాదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చూపించింది.ఇదీ చదవండి: మిడిల్ఈస్ట్లో పాక్‌కు బిగ్ టెస్ట్ -
పోస్ట్ చేశారంటే... మీ లొకేషన్ ట్రాక్ ఖాయం!
సోషల్ మీడియా అనేది మన జీవితాల్లో ముఖ్యమైన భాగం అయింది. ‘రీల్స్’ నుంచి విహారయాత్రలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకోవడం వరకు ఎన్నో చేస్తుంటాం. గమనించాల్సిన విషయమేమిటంటే... ఏఐ సాధనాలను ఉపయోగించి పోస్ట్‌ల ద్వారా మీ లొకేషన్‌ను గుర్తించవచ్చునని గ్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెకఫీ స్టడీ తెలియజేస్తోంది...స్టడీలో భాగంగా...ఒక ఫొటోను జత చేసి, ఆ ప్రదేశాన్ని గుర్తించమని ప్రాంప్ట్ ఇచ్చారు. ఎలాంటి మెటాడేటా, ఇఎక్స్ఐఎఫ్ డేటా, ఫైల్ పేర్లను ఉపయోగించలేదు. చిత్రాలలోని సంకేతాలు, వాస్తుశిల్పం, వీధి గుర్తులు, దుకాణాలు, ఫుడ్‌స్టాల్స్... మొదలైన వివరాలతో ఏఐ సాధనాలు లొకేషన్‌ను గుర్తించాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, విలక్షణమైన ప్రదేశాలను ఏఐ సులభంగా గుర్తించింది. సాధారణ బీచ్‌లు, గ్రామీణ రహదారులు, హోటల్ గదులను గుర్తించడం మాత్రం ఏఐకి కష్టమైంది.మోసాలు జరుగుతాయా?ఇంతకుముందు బహిరంగంగా పోస్ట్ చేయని ఫొటోలతో సహా పర్సనల్ ట్రావెల్ ఫొటోలను చాట్ జీపీటీ, క్లాడ్, కోపైలట్లాంటి వాటిలో అప్లోడ్ చేసి...‘ఈ ఫొటోలు ఎక్కడ తీశారు?’ అని అడిగారు. ఏఐ గుర్తించిన వాటిలో న్యూయార్క్ రాష్ట్రంలోని హేస్టింగ్–ఆన్–హడ్సన్ అనే గ్రామం కూడా ఉన్నది. జీపీఎస్ డేటా, లొకేషన్ ట్యాగ్, క్యాప్షన్ లేకపోయినా సరే, ఆ ఫొటోలను ఎక్కడ తీశారనేది ఏఐ సాధనాలు గుర్తించగలవని మెకఫీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పదిలో తొమ్మిదిసార్లు ఏఐ సాధనాలు లొకేషన్‌ను సరిగ్గా ట్రాక్ చేశాయి. ఈ అధ్యయనంలో గూగుల్... జెమ్మ 227బీ, అలీబాబా 3వియల్ 3వోబీ అనే మోడల్స్‌ను ఉపయోగించారు. ఈ రెండు మోడల్స్ ఒపెన్–వెయిట్స్ రకానికి చెందినవి. ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఉచితంగా ఉపయోగించవచ్చు. ...ఇలా లొకేషన్లను ట్రాక్ చేయడం ద్వారా మోసాలు జరుగుతాయా? ‘అవును’ అని చెబుతోంది మెకఫీ స్టడీ.ఇలా జరగవచ్చు...జెనెరిక్ పిషింగ్ నుంచి పర్సనలైజ్ ఫ్రాడ్ వరకు ఏదైనా జరగవచ్చు. ఉదాహరణకు ఒక మోసగాడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్‌లాంటి ప్లాట్‌ఫామ్‌ల నుండి ఫొటోలను తీసుకొని వాటిని ఏఐ మోడల్స్‌లో ప్రాసెస్ చేసి లొకేషన్ ట్రాక్ చేసి, ఆ ప్రదేశాన్ని ప్రస్తావిస్తూ మెసేజ్‌లు పంపవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో అసాధారణ లావాదేవిలు జరుగుతున్నట్లు, మీరు ఉన్న ప్రాంతంలోనే ఎవరో ఒకరు లాగిన్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరికలు రావచ్చు.‘మీరు షేర్ చేసిన ఫొటోలో ఏదైనా ప్రముఖ ప్రదేశం లేదా ల్యాండ్‌మార్క్ కనిపించకపోతే ఖచ్చితమైన లొకేషన్‌ను గుర్తించడంలో ఏఐ మోడల్స్ సమర్థంగా పనిచేయకపోవచ్చు’ అంటున్నారు నిపుణులు. -
స్పెయిన్‌లో భారీ వలసలు.. ముందే హెచ్చరించిన నిఘా సంస్థ!
మాడ్రిడ్: స్పెయిన్‌లోని సియుటా ప్రాంతంలోకి భారీగా వలసదారులు ప్రవేశించే అవకాశం ఉందని ఆ దేశ జాతీయ నిఘా సంస్థ (CNI) ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రభుత్వ పత్రాల్లో ఉంది. అలాగే, జూలై 30న పెద్ద సంఖ్యలో వలసదారులు సరిహద్దు దాటే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన సందేశాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయని అధికారులు గుర్తించారు.ముందే సోషల్ మీడియాలో ప్రచారంజూలై 29న జాతీయ నిఘా సంస్థ ఈ సమాచారాన్ని మొరాకో అధికారులు, సియుటా పరిపాలనకు పంపినట్లు పత్రాల్లో పేర్కొన్నారు. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో మరుసటి రోజు సియుటాలోకి వెళ్లాలని వలసదారులను ప్రోత్సహించే సందేశాలు ప్రచారం అయినట్లు నిఘా సంస్థ గుర్తించింది. ఈ సందేశాలు దాదాపు 1.8 లక్షల మందికి చేరినట్లు అధికారులు అంచనా వేశారు.ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలుఅయితే, జూలై 30న సియుటాలోకి ఇంత పెద్ద సంఖ్యలో వలసదారులు వస్తారని ముందుగా ఊహించడం సాధ్యం కాలేదని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ గతంలో చెప్పారు. తాజాగా వచ్చిన పత్రాలను ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నాయి.రెండు రోజుల్లో 72 వేల మంది రాకజూలై 30, 31 తేదీల్లో మొరాకో నుంచి సియుటాలోకి కనీసం 72 వేల మంది వలసదారులు వచ్చినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరిలో చాలామంది సముద్రంలో ఈదుకుంటూ సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సియుటా మేయర్ తెలిపారు. దీంతో భారీగా వలసదారులు రావడంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.ప్రభుత్వం ఏం చెబుతోంది?ఈ ఘటనకు సంబంధించి 40కి పైగా భద్రతా పత్రాలను స్పెయిన్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అయితే, ముందుగా అందిన సమాచారం ద్వారా వలసదారుల రాక ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని అంచనా వేయలేకపోయామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు, జూలై 29న వచ్చిన సమాచారం అధికారిక హెచ్చరిక కాదని, కేవలం సమాచారాన్ని పరస్పరం పంచుకున్నామని సియుటాలోని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.ఇవీ చదవండి: ఇది హ్యాకింగ్ కాదు! ఓపెన్ ఏఐ ఏజెంట్లకు కొత్త చిక్కులు! -
అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్
-
తమాషా చేస్తున్నారా? లోపలేస్తా!
హైదరాబాద్: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ముందస్తు అరెస్టు కోసం కంటోన్మెంట్ ఐదోవార్డు గృహలక్ష్మి కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన కార్ఖానా సీఐ అనూరాధ దురుసు ప్రవర్తన చర్చనీయాంశమైంది. మంగళవారం ఉదయం క్రిశాంక్ ఇంట్లోకి వెళ్లేందుకు సీఐ, ఇతర సిబ్బంది యత్నించారు. ఇంటికి లోపలి నుంచి తాళం ఉండటంతో పనివాళ్లతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో క్రిశాంక్ భార్య, చిన్న పాప మాత్రమే ఉందని చెప్పినా వినకుండా తలుపులు తీయాలంటూ పనివాళ్లను గద్దించారు. తమాషాలు చేస్తున్నారా? లోపలేస్తానంటూ కార్ఖానా సీఐ బెదిరించడం గమనార్హం. ఇంతలో క్రిశాంక్ భార్య సుహాసిని బయటకు వచ్చి ఆయన ఇంట్లో లేడని చెబుతుండగా, ఫోన్ లోకేషన్ ఇక్కడే చూపిస్తుందని వాదించారు. విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన క్రిశాంక్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, పోలీసులు ఆయనను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. చదవండి: పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్టు -
‘‘అందుకోసం రూ.450 ఖర్చు పెట్టా.. చెప్పలేనంత ఆనందం’’
కాలేజీకి వెళ్తున్న ఓ యువతి ఆటోలో ప్రయాణిస్తుండగా.. రెడ్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి చిన్న ట్రాక్టర్ వంటి బొమ్మ వాహనాలను విక్రయిస్తున్నాడు. ఆటో డ్రైవర్ తన కుమారుడి కోసం ఆ బొమ్మ ధర అడిగాడు. విక్రేత రూ.550 చెప్పడంతో డ్రైవర్ నిరాశ చెందాడు. బొమ్మ కొనలేకపోవడంతో డ్రైవర్ వెనక్కి తగ్గడాన్ని గమనించిన యువతి అతడికి సాయం చేయాలని నిర్ణయించుకుంది.ఆమె విక్రేతతో బేరమాడి అదే బొమ్మను రూ.450కు కొనుగోలు చేసి డ్రైవర్‌కు ఇచ్చింది. డ్రైవర్ కృతజ్ఞతలు చెప్పడం కంటే తన కుటుంబం గురించి యువతితో చెప్పుకున్నాడు. తన కుమారుడు “నాన్నా.. నువ్వు నా కోసం ఎప్పుడూ ఏమీ తీసుకురావు” అని తరచూ చెబుతుంటాడని డ్రైవర్ తెలిపాడు. డ్రైవర్ తన కుటుంబ ఫొటోలను కూడా ఆమెకు చూపించాడు.ఈ అనుభవం తనను ఎంతో కదిలించిందని యువతి తెలిపింది. ఆమె ఖర్చు చేసిన డబ్బులో ఇదే అత్యంత సంతృప్తినిచ్చిన ఖర్చు అని పేర్కొంది. ఈ విషయాలను తనకు ఎదురైన మంచి అనుభవంగా ఆ యువతే చెప్పింది. ఆమె పేరు తన్వీ చంద్ర (Tanvi Chandra). ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసి మొత్తం ఘటనను వివరించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా, పలువురు యువతి చేసిన పనిని ప్రశంసించారు. View this post on Instagram A post shared by Tanvi Chandra- UGC,Lifestyle (@10viiee) -
బేబీ బంప్‌తో దీపికా
బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె మరోసారి తమ కుమార్తె దువాను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. దువా రెండో పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు రాబోతున్న విషయాన్ని కూడా వెల్లడించారు.ఇదీ చదవండి: దీపావళి బరిలో నయనతార కొత్త సినిమా!‘మా చిన్నారి దువా.. నిన్ను ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్’ అంటూ రణ్వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దువాను చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఈ స్టార్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్కాగా.. రణ్వీర్, దీపికా 2024లో తల్లిదండ్రులయ్యారు. తమ కుమార్తెకు ‘దువా’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో దువా త్వరలో అక్క కానుంది. -
చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్
కొన్ని సినిమాలు కథ, కథనంతోనే కాదు.. పాటలతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలా పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ప్రభాస్, త్రిష జంటగా నటించిన ‘పౌర్ణమి’ ఒకటి. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ‘భరత వేదముగ’ పాటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.ఇదీ చదవండి: వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్ఆకట్టుకునేలా..తాజాగా ఈ పాటకు ఓ చైనా యువతి అద్భుతంగా నాట్యం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మీరా వాంగ్ అనే యువతి షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన దుస్తులు ధరించి ‘భరత వేదముగ’ పాటకు ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు. ఆమె హావభావాలు, నృత్య భంగిమలు ఆకట్టుకునేలా ఉండటంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తెలుగు సినిమా పాటకు చైనా యువతి ఇంత అందంగా నాట్యం చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంగీతం సరిహద్దులు దాటి ఆకట్టుకుంటోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఏపీలో చిరంజీవి కూమార్తె సుస్మితకు పదవి A Chinese woman performed the iconic #Pournami song in Shanghai yesterday! ❤️#Prabhas #Trisha pic.twitter.com/u0U42dO503— Milagro Movies (@MilagroMovies) September 8, 2026 -
నో జిమ్, సోషల్ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్నెస్ ట్రెండ్?
బరువు తగ్గేందుకు సాధారణంగా అందరూ ఎంచుకునేంది జిమ్‌లో కసరత్తులు, క్రాష్ డైటింగ్లూను. ఇపుడు సోషల్ మీడియాలో మరో వెల్నెస్ ట్రెండ్ వచ్చింది. బరువు తగ్గడంతోపాటు, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఇది 'అత్యంత సులభమైన వ్యాయామాలలో' ఒకటి అంటూ తెగ ప్రచారం అవుతోంది. దాని పేరే లింఫాటిక్ వాకింగ్ (Lymphatic Walking). అసలేంటీ ట్రెండ్. ఎలా పనిచేస్తుంది? దీని లాభాలు, నష్టాలు తెలుసుకుందాం ఈ కథనంలో.ఆలియా భట్ నుండి హేలీ బీబర్ వరకు, లింఫాటిక్ డ్రైనేజ్ గురించి చర్చ తెగ హల్ చల్ చేప్తోంది. కొన్నిసార్లు ఫేషియల్ మసాజ్ రూపంలో, కొన్నిసార్లు ఈ ట్రెండింగ్ నడకల రూపంలో. లింఫాటిక్ వాకింగ్ అనేది సాధారణ నడకలాంటిదే. కానీ ఇందులో ప్రత్యే మైన వేగంతో శరీర కదలికలు (చేతులు, శ్వాస తీసుకునే, అడుగులు) ఉంటాయి, గుండె రక్తాన్ని పంప్ చేసినట్లుగా, లింఫాటిక్ వ్యవస్థకు ద్రవాలను పంప్ చేయడానికి సొంత అవయవమేదీ ఉండదు. అందుకే కేవలం శరీర కండరాల కదలికలు, డీప్ బ్రీతింగ్ ద్వారా మాత్రమే ఈ లిక్విడ్ ముందుకు కదులుతుంది. ఇది కణజాలాల నుండి అదనపు ద్రవాన్ని బయటకు పంపడానికి సహాయ పడుతుంది, రోగనిరోధక శక్తి పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని లింఫ్ వ్యవస్థను (రక్తనాళాల తరహాలోనే ద్రవాలను ప్రసరింపజేసే వ్యవస్థను) చురుగ్గా ఉంచడానికి చేసే ప్రత్యేకమైన, సరళమైన ప్రక్రియ. ప్రతి అడుగు లేదా కదలికతో కండరాలు సంకోచించినప్పుడు, అవి వాటి పక్కన ఉన్న లింఫాటిక్ నాళాలను సున్నితంగా నొక్కి, ఈ ఏకమార్గ నాళాల ద్వారా ద్రవాన్ని ముందుకు నెడతాయి. దీన్నే మజిల్ పంప్ అంటాం. View this post on Instagram A post shared by Fitness With Naman (@fitnesswithnaman)ఇదీ చదవండి: సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు లింఫాటిక్ వాకింగ్ Arm Swings నడిచేటప్పుడు చేతులను చాతి మరియు భుజాల స్థాయి వరకు కొద్దిగా పైకి, ముందుకు-వెనుకకు బాగా ఊపుతూ నడవడం. ముక్కు ద్వారా గాలిని లోతుగా పీల్చుకుంటూ, నోటి ద్వారా వదులుతూ నడవడం.అడుగుల కదలిక: మడమ (Heel) నుండి మొదలుపెట్టి కాలి వేళ్ల (Toe) వరకు పాదాన్ని నేలకు బలంగా ఆనిస్తూ అడుగులు వేయడం (Heel-to-toe pattern). ప్రయోజనాలు:వాకింగ్ ద్వారా వచ్చే లాభాల మాదిరిగానే క్రమంగా బరువు అదుపులోకి వస్తుంది.కాళ్లు, చేతుల్లో నీరు పట్టడం (Water Retention / Edema) వల్ల వచ్చే వాపు తగ్గుతుంది.శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు త్వరగా బయటకు పంపేస్తుంది. తల్ల రక్తకణాలు శరీరంలో బాగా వ్యాపించి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి పెరుగుతుంది.జీర్ణక్రియ , రక్తప్రసరణ మెరుగుపడుతుంది.నోట్ : సాధారణ నడక కంటే లింఫాటిక్ వాకింగ్ ఎక్కువ శరీర కొవ్వును కరిగిస్తుందనడానికి లేదా ఒక ప్రత్యేకమైన “డిటాక్స్” ప్రభావాన్ని అందిస్తుందనడానికి ప్రస్తుతం బలమైన ఆధారాలు లేవు. డెస్క్ జాబ్స్ చేసేవారు, ఎక్కువ గంటలు ప్రయాణించే వారు, ఎక్కువసేపు కదలకుండా కూర్చునే వ్యక్తులకు నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ వ్యాయామమైనా నిపుణుల సలహా మేరకు క్రమం తప్పకుండా, పట్టుదలగా చేయడం ముఖ్యం అనేది గమనించాలి.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణం -
మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్’గా ఉంటున్నాయ్!
కూటమిలోని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా రగులుతున్న వివాదం పోనుపోను మరింత ముదురుతోంది. ముఖ్యంగా డీఎస్సీ వ్యవహారంపై ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం పోస్టులు.. ఒకనొక దశలో పెద్దల మీద మీమ్స్, ట్రోల్స్‌తో విరుచుకుపడే స్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో జనసేనను ఉద్దేశిస్తూ టీడీపీ డబుల్ మేసేజ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న కార్యకర్తలకు.. ఇరు పార్టీల అధిష్టానాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయనేది జరుగుతున్న ప్రచారం. అయితే ఈ విషయంలో జనసేనదే మొత్తం తప్పు అనే లైన్లో టీడీపీ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. దానిని కాస్త నిశీతంగా పరిశీలిస్తే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వైఫల్యాల్ని.. జనసేనకు ఆపాదిస్తూ ఐటీడీపీ తన సపోర్టింగ్ పేజీలతో కొన్ని పోస్టులు చేయించింది. దీనిపై జనసేన భగ్గుమంది. ‘మీ బురదలోకి మమ్మల్నెందుకు లాగుతారు?’ అంటూ కౌంటర్ పోస్టులతో నిలదీసింది. అంతటితో ఆగకుండా.. చంద్రబాబు, నారా లోకేశ్‌ను టార్గెట్ చేసుకుని మీమ్స్ ప్రచారం చేసింది. అయితే అప్పటికే.. ఓ సినిమా కోసం సీనియర్ ఎన్టీఆర్ అమెచ్యూరిష్ డైలాగ్పై ఉద్దేశపూర్వక ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం ఆ సినీ ఫ్యామిలీపై ఎన్టీఆర్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే దీనిని క్యాష్ చేసుకోవాలని భావించిన ఐటీడీపీ.. తన కౌంటర్లను మరింత పదును పెట్టింది. ఏకంగా పవన్ కల్యాణ్ సినీ, పొలిటికల్ కెరీర్ ఫెయిల్యూర్స్‌ను ప్రస్తావిస్తూ వరుస పోస్టులు చేసింది. అదే సమయంలో.. టీడీపీలోనే ఇంకో వర్గం నుంచి సీనియర్ నటుడు, పవన్ సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి పోస్టులు వచ్చాయి. అయితే టీడీపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేన కార్యకర్తలు మీమ్స్, ట్రోల్స్ చేయడం, ఇప్పుడు రాజకీయంగా ఇరకాటంలో పడేసిన డీఎస్సీ అంశంపైనా వరుసగా పోస్టులు పెట్టడంపై టీడీపీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో కూటమి పెద్దలు రంగంలోకి దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు, దూషణలకు దిగొద్దని సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఒకరిపై ఒకరు కామెంట్లు చేయొద్దని.. తద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ సందేశం ఇచ్చింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా.. జనసేన కార్యకర్తలు చేస్తున్న కొన్ని పోస్టులతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని టీడీపీ పేర్కొంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు కుటుంబంపై జనసేన కార్యకర్తలు చేసిన అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యల విషయాన్ని ఆ పార్టీతో మాట్లాడినట్లు తెలిపింది. ఇలాంటి అమెచ్యూరీష్ వ్యాఖ్యలు, పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది. ‘మన మధ్య మనమే సోషల్ మీడియాలో పోస్టులతో పోరాటం చేసుకోవడం సరికాదు’ అని టీడీపీ స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలు చేసుకోకుండా కూటమి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని సూచించింది.అదే సమయంలో టీడీపీ పార్టీకి, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించబోమని పార్టీ పేర్కొనడం గమనార్హం. ఇది జనసేనకు ఇండైరెక్ట్ వార్నింగేనన్న చర్చ జోరందుకుంది. ఇప్పటికే పదవులు, ప్రాధాన్యత విషయంలో జనసేన కేడర్ క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో.. కూటమిగా కలిసి పనిచేయాలంటూ ఒకవైపు బుజ్జగిస్తూనే.. టీడీపీ జోలికి వస్తే ఊరుకునేది లేదన్న సంకేతాన్ని మరోవైపు బహిరంగంగానే ఇవ్వడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు.దీంతో కూటమిలో అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ–జనసేన కార్యకర్తల మధ్య పోస్టుల యుద్ధం కొనసాగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: మేయర్ సీటు.. రచ్చ రాజేయడం ఖాయం! -
టీచర్స్‌డే.. ఐటెం సాంగ్!
టీచర్స్ డే వేడుకల్లో.. అదీ పెద్ద సంఖ్యలో విద్యావేత్తలు, మేధావులు హాజరైన కార్యక్రమంలో అమ్మాయిలు చేసిన ఓ డ్యాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీచర్స్ ఐకాన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండగా.. దేశాన్ని ఊపేసిన ఓ ఐటెం సాంగ్‌కు వాళ్లు హుషారుగా ఊగిపోయారు. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట రచ్చకు కారణమైంది.డెహ్రాడూన్‌లోని జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెప్టెంబర్ 5న నిర్వహించిన కార్యక్రమం వీడియో ఎక్స్‌లో వైరల్ అయ్యింది. మొత్తం 46 మంది ఉపాధ్యాయులను సత్కరించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే ఎంచుకున్న పాటపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. డర్టీ పిక్చర్ చిత్రంలోని ‘ఊ లా లా.. ఊ లా లా.. తూ హై మేరీ ఫ్యాంటసీ’ అంటూ ఆ అమ్మాయిలు హుషారుగా స్టెప్పులేశారు. అది చూసి అక్కడే ఉన్న కొందరు కుర్రాళ్లు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే టీచర్స్ డే వేడుకలకు ఇలాంటి పాట సరిపోతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం దీనిపై వస్తున్న విమర్శలను అతిగా స్పందించడం అని కొట్టిపారేస్తున్నారు. కళాశాల కార్యక్రమాల్లో విద్యార్థులు తమకు నచ్చిన పాటలకు సరదాగా డ్యాన్స్ చేయడం సాధారణమేనని, దీనిని సంప్రదాయాలకు వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. యువత వేడుకలను చూసే దృక్పథంలో వచ్చిన మార్పుగా మరికొందరు అభివర్ణిస్తున్నారు.ఈ వీడియో వైరల్ కావడంతో టీచర్స్ డే వేడుకల్లో సంప్రదాయ విలువలకే ప్రాధాన్యమివ్వాలా? లేదంటే విద్యార్థుల ఆధునిక శైలికీ చోటివ్వాలా? అనే చర్చ మొదలైంది. ఒక చిన్న నృత్య ప్రదర్శన కాస్తా సంప్రదాయం, ఆధునికత మధ్య సోషల్ మీడియాలో వాదనకు దారితీసింది.Dr. Sarvepalli Radhakrishnan be like "Thank god, i didn't live long enough to see this"pic.twitter.com/ypB3p27XaH— Keh Ke Peheno (@coolfunnytshirt) September 7, 2026 -
‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’
సూర్యాపేట జిల్లా: వివాహితను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తుండగా.. అతడిపై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన చింతారెడ్డి భాస్కర్‌రెడ్డి ఏడాది కాలంగా మేళ్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన బేత మౌనిక వెంటపడుతూ ‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎన్నిసార్లు మందలించినా అతడి పద్ధతిలో మార్పు రాలేదు. దీంతో ఈ నెల 4న మౌనిక తన తల్లిగారి ఊరైన బక్కమంతులగూడేనికి వచ్చింది. ఆదివారం ఉదయం తన తల్లిగారింటి ముందు ఆమె వాకిలి ఊడుస్తుండగా భాస్కర్‌రెడ్డి ఒక్కసారిగా మౌనిక వద్దకు వచ్చి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లడంతో ఆమె కేకలు వేసింది. దీంతో భాస్కర్‌రెడ్డి కొడవలితో ఆమె కుడిచేతిపై కొట్టి.. ‘నా కోరిక తీర్చు, లేకపోతే నిన్ను చంపేస్తాను, నీ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతాను’అంటూ బెదిరించాడు. భాస్కర్‌రెడ్డి ఇంటిపై దాడి.. అనంతరం బేత మౌనికతోపాటు బేత రామాంజిరెడ్డి, బోగాల పద్మ, కుందూరు సంధ్య, బోగాల మధుసూదన్‌రెడ్డి కలిసి భాస్కర్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి కర్రలు, రాడ్లతో అతడిపై దాడిచేసి తల పగులగొట్టారు. దీంతో భాస్కర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భాస్కర్‌రెడ్డి భార్య శివనాగిని మెడలోని నాలుగున్నర తులాల బంగారు గొలుసు కూడా పోయింది. ఇదంతా భాస్కర్‌రెడ్డి ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. భాస్కర్‌రెడ్డి తనను లైంగికంగా వేధించడంతోపాటు అతడి భార్య శివనాగిని, కొడుకు మంజూనాథరెడ్డి కూడా అసభ్య పదజాలంతో తనను తిట్టి బెదిరించారని మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత పంచాయితీలు మనసులో పెట్టుకొని తమ ఇంటిపై దాడి చేసి తన భర్త తల పగులగొట్టారని భాస్కర్‌రెడ్డి భార్య శివనాగిని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. చదవండి: పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ -
కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ వాయిదా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పూర్తి చేసుకున్న వేల మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌ను చంద్రబాబు సర్కారు చివరి నిమిషంలో హఠాత్తుగా వాయిదా వేయడంపై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి. శిక్షణ ముగిసిన కానిస్టేబుళ్లకు ఈనెల 7వ తేదీన పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నట్లు తొలుత డీజీపీ మెమో కూడా జారీ చేశారు. అయితే ఆకస్మికంగా దీన్ని వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు ఏమిటనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీనికోసం సన్నద్ధమైన అభ్యర్థులు, వారి తల్లితండ్రులు ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్.. ఫిజికల్ టెస్టులురాష్ట్రవ్యాప్తంగా 6,100 కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కోసం 2022 నవంబర్ 28న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లోనే అభ్యర్థులందరికీ ఫిజికల్ టెస్టులు, పరుగు పందెం పకడ్బందీగా నిర్వహించారు. ఈ క్రమంలో నిరుద్యోగ జేఏసీ పేరుతో ఎస్.హేమంత్‌కుమార్ కోర్టులో కేసు వేయడంతో రాతపరీక్ష నిలిచిపోయింది. అనంతరం టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగా 2025 జూన్ 1న రాత పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన వారికి రాష్ట్రవ్యాప్తంగా పీటీసీ, డీటీసీలు ఉన్న 21 ప్రాంతాల్లో 9 నెలల పాటు శిక్షణ కూడా పూరై్తంది. 5,757 మందికి శిక్షణ పూర్తి కాగా పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించేందుకు డీజీపీ మెమో కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీనియర్ ఐపీఎస్‌లను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూ మెమోలో వారి పేర్లు కూడా పేర్కొన్నారు.క్రెడిట్ చోరీ కోసం పరేడ్ రద్దు..!గత ప్రభుత్వంలోనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడి రాత పరీక్ష మినహా కీలక దశలు పూర్తయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ క్రెడిట్ చోరీకి చంద్రబాబు సర్కారు తాపత్రయపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ గతంలో మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌కు రప్పించి సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. తాజాగా ఎక్కడికక్కడ పీవోపీ (పాసింగ్ అవుట్ పరేడ్) నిర్వహించేందుకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడంతో 21 సెంటర్లలో ఏర్పాట్లు జరిగాయి. అయితే పీవోపీని వాయిదా వేస్తూ ఈ నెల 4న చంద్రబాబు సర్కారు ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో ప్రకటించలేదు. అభ్యర్థులందరినీ మరోసారి మంగళగిరికి పిలిపించి ముఖ్యమంత్రి సమక్షంలో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించాలనే యోచనతో వాయిదా వేసినట్లు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సూచనలతో హోంమంత్రి అనిత ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.మండిపడుతున్న అభ్యర్థులు, తల్లిదండ్రులు..నేడు జరగాల్సిన పరేడ్ ఆకస్మికంగా రద్దుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పేద వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం, ఖాకీ దుస్తులు ధరించటాన్ని కళ్లారా చూడాలని ఆరాటంతో ఎంతోమంది టిక్కెట్లు బుక్ చేసుకుని హోటళ్లు రిజర్వేషన్ కూడా చేసుకున్నారు. దీనికోసం ఇతర కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకున్నారు. ఈ తరుణంలో హఠాత్తుగా పీవోపీ వాయిదా వేయడంతో హతాశులయ్యారు. ‘నోటిఫికేషన్ ఇచ్చింది గత ప్రభుత్వం.. ఇప్పటికే ఒకసారి అందరం సీఎం కోసం మంగళగిరి వచ్చాం. మళ్లీ ఈ పబ్లిసిటీ పిచ్చి ఏమిటి?’ అని పోస్టులు పెడుతూ మండిపడుతున్నారు.కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో యువగళం కోటా?అకస్మాత్తుగా పాసింగ్ అవుట్ పరేడ్ వాయిదా వేయడంపై అటు పోలీసు వర్గాలతోపాటు ఇటు టీడీపీ ప్రజాప్రతినిధుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మెగా డీఎస్సీ తరహాలోనే ఇందులో కూడా అర్హత లేనివారికి యువగళం కోటా కింద అవకాశం కల్పించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి నిదర్శనంగా పలు అంశాలను ఉదహరిస్తున్నారు. మచ్చుకు అందులో కొన్ని ఇలా ఉన్నాయి..⇒ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో జారీ అయిన నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం రాగానే రివైజ్ చేసింది. స్పోర్ట్స్ కోటాలో 20 క్రీడలు మాత్రమే ఉంటే అదనంగా మరో 47 ఆటలను చేర్చి మొత్తం 67 గేమ్స్‌లో పాల్గొన్నవారికి రాతపరీక్ష లేకుండా నేరుగా రిక్రూట్ చేసేలా నిర్ణయం తీసుకుంది.⇒ స్పోర్ట్స్ కోటాలో 3 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు సర్కారు జీవో జారీ చేసింది. కేటగిరీ ఏ, బీ, సీ పేరుతో అర్హతలను మూడు విభాగాలుగా విభజించింది. కేటగిరీ – ఏలో అంతర్జాతీయ స్థాయిలో గెలిచిన లేదా పాల్గొన్నవారు, కేటగిరీలో–బీలో జాతీయస్థాయిలో ఆడిన వారు, జాతీయస్థాయిలో యూనివర్శిటీ పరిధిలో, స్కూలు గేమ్స్‌లో గెలుపొందిన, పాల్గొన్నవారిని చేర్చింది. కేటగిరీ– సీలో జోనల్‌స్థాయిలో యూనివర్శిటీ టోర్నమెంట్లో గెలుపొందిన లేదా పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.⇒ మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులకుగానూ 3 శాతం అంటే 183 ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో చంద్రబాబు సర్కారు భర్తీ చేసింది.⇒ గేమ్స్ కోటాను ఏకంగా 67 క్రీడలకు పెంచడం... యూనివర్శిటీ స్థాయిలో పాల్గొన్నవారు కూడా అర్హత సాధించటాన్ని చూస్తుంటే, యువగళం టీమ్ కోసం ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించారా? మెగా డీఎస్సీలో ఎలాంటి కుంభకోణం జరిగిందో అచ్చం అదే తంతు పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లోనూ చోటు చేసుకుందా? అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
సంజూను కూరలో కరివేపాకులా తీసేశాడు!
కేరళ క్రికెట్ లీగ్ 2026లో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు ఘోర అవమానం ఎదురైనట్లు తెలుస్తోంది. శనివారం టోర్నీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజంటేషన్ వేడుకలో శాంసన్‌తో చేతులు కలపడానికి భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నిరాకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నిజమెంత? ఏఐ వీడియోనా అనేది పక్కనబెడితే శ్రీశాంత్ చర్య మాత్రం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.విషయంలోకి వెళితే.. ప్రజంటేషన్ సందర్భంగా అప్పటికే శాంసన్ వెళ్లి స్టేజీపై ట్రోఫీ పక్కనే నిల్చున్నాడు. ఈలోగా స్టేజీ మీదకు వచ్చిన శ్రీశాంత్ శాంసన్ వైపు కన్నెత్ని కూడా చూడలేదు. అటుపై శాంసన్ పక్కనే నిల్చున్న మిగతా అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ శాంసన్‌తో షేక్ హ్యాండ్ కాదు కదా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట క్షణాల్లో వైరలయ్యాయి. అయితే దీనిపై అటు శ్రీశాంత్ కానీ.. ఇటు సంజూ కానీ ఇప్పటివరకైతే స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం కామెంట్లతో రెచ్చిపోయారు. "సంజూ శాంసన్‌ను శ్రీశాంత్ కూరలో కరివేపాకులా తీసేశాడు.. ఇది దారుణ అవమానం" అని పేర్కొన్నారు.ఇక కేరళ క్రికెట్ లీగ్ 2026 టైటిల్‌ను త్రిసూర్ టైటాన్స్ ఎగరేసుకుపోయింది. శనివారం రాత్రి కాలికట్ గ్లోబల్స్టార్స్తో జరిగిన ఫైనల్లో త్రిసూర్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలికట్ గ్లోబల్‌స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అఖిల్ స్కారియా (45), అశ్విన్ ఆనంద్ (40) రాణించారు. త్రిసూర్ బౌలర్లలో అబ్దుల్ రమీస్ 3 వికెట్లు తీయగా, ఆనంద్ జోసెఫ్, శరత్ ప్రసాద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన త్రిసూర్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అహమ్మెద్ ఇమ్రాన్ (69) అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, సంజీవ్ సతీషన్ (29) రాణించాడు. కాలికట్ బౌలర్లలో జోస్ పెరైల్, అఖిన్ సతార్, ఇన్బుల్ అఫ్తాబ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. మహ్మద్ అజారుద్దీన్ (11 మ్యాచ్‌ల్లో 596 పరుగులు) టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలవగా, నిఖిల్ మాలిక్ (11 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ భారత జట్టులో టీ20, వన్డేల్లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే, ఇంగ్లండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న శాంసన్ అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.Any problems between Sreesanth and Sanju Samson?👀There seems to be some talk about a possible ego clash following Sreesanths recent interview.Only they know whats really happening🤷♂️#SanjuSamson @BCCI pic.twitter.com/ndNri2Tabm— Morvin Edward (@morvinedward) September 6, 2026చదవండి: 'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది! -
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. యువత, విద్యార్థుల సమస్యలపై మాట్లాడాల్సిన వేదికపై.. ప్రశ్నించే యువతను ‘దిమాగీ నక్సల్స్’ అంటూ ముద్ర వేయడం ఏమిటంటూ సీజేపీ తీవ్రంగా మండిపడింది. విద్య, ఉద్యోగాలు, విద్యార్థుల సంక్షేమంపై ప్రధాని మాట్లాడాల్సిందిపోయి.. విమర్శకులను టార్గెట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శించారు.ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో ఒకటైన SRCCలో యువతను ‘దిమాగీ నక్సల్స్’గా పేర్కొనడం ప్రధానమంత్రి చేయగలిగే అత్యంత అవమానకరమైన పని అంటూ విమర్శించారు. ప్రధాని యువతకు ఆశలు కల్పించాలి.. ప్రశ్నలు అడుగుతున్నందుకు వారిని నిందించకూడదు అని దాస్ వ్యాఖ్యానించారు. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. SRCCలోనే ఉపాధ్యాయులు మెడికల్, చైల్డ్‌కేర్ లీవ్ వంటి అంశాలపై ఆందోళన చేయాల్సి వస్తోందని.. కళాశాలలో మౌలిక వసతుల పరిస్థితి, విద్యార్థులపై పెరుగుతున్న పోటీ ఒత్తిడి వంటి అంశాలను ప్రధాని ప్రస్తావించాల్సిందని విమర్శించారు.మరోవైపు.. ఆశుతోష్ రంకా కూడా ప్రధాని ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. SRCC శతాబ్ది వేడుకల వంటి వేదికపై విద్య, ఉపాధి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే 20 ఏళ్లలో భారత్ ప్రపంచంలో తన స్థానాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలన్న అంశాలపై ప్రధాని మాట్లాడాల్సిందని అన్నారు. కానీ అందుకు బదులుగా ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలకు దిగారని ఆరోపించారు.Wow. Going to one of India’s premier colleges and once again branding a young, questioning generation as “Dimagi Naxals” has got to be among the most shameful things a Prime Minister can do. And on Teacher’s Day.He could have spoken about why SRCC’s own teachers have had to… https://t.co/U8EMRtikcu— Saurav Das (@SauravDassss) September 5, 2026అసలు మోదీ ఏం అన్నారు?SRCC శతాబ్ది వేడుకల్లో దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోదీ.. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తాను ప్రస్తావించిన ‘దిమాగీ నక్సల్స్’ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. తాను ‘దిమాగీ నక్సల్’ అంటూ చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఆ భావజాలానికి మద్దతిస్తున్నవారు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారని మోదీ అన్నారు. తన వ్యాఖ్యలను విమర్శిస్తున్నవారి తీరును ఉద్దేశిస్తూ.. ప్రజలు కూడా వారి అసలు రంగును గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సీజేపీ విమర్శలకు కారణమయ్యాయి. అయితే మోదీ ప్రసంగంలోని ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి. విద్యార్థుల సమస్యలపై చర్చ జరగాల్సిన SRCC వేదిక.. మోదీ-విమర్శకుల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారడం చర్చనీయాంశంగా మారింది. -
ఎవరికి వారు ఏకాకులే
సాక్షి, హైదరాబాద్ : వికాస్ (పేరు మార్చాం) ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉన్నతోద్యోగి. రూ.లక్షకు పైగా జీతం. సకల సదుపాయాలతో కూడిన జీవితం. భార్యాపిల్లలతో ఇల్లంతా సందడి. కానీ అతడు మాత్రం ఒంటరి. తనకంటూ ఎవ్వరూ లేని ఏకాకి. ఏమాత్రం తీరిక లభించినా ఏదో ఒక సోషల్ మీడియాలో దూరిపోతాడు. ఇంటిల్లిపాదీ అంతే. ఆత్మీయమైన పలకరింపులు, ప్రేమపూర్వకమైన అనుబంధాలు మచ్చుకైనా లేవు. దీంతో అతడు తీవ్రమైన కుంగుబాటుకు గురయ్యాడు. వికాస్ మాత్రమే కాదు, నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో కొట్టుకుపోతున్న ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. రిలేషన్స్‌పై రీల్స్ ఎఫెక్ట్రోష్ని సంస్థకు వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ కుటుంబ సంబంధాలే ఉంటున్నట్లు ఆ సంస్థ అదనపు డైరెక్టర్ రత్న తెలిపారు. ‘తల్లిదండ్రులు తమను పట్టించుకోవడం లేదని పిల్లలు బాధపడుతున్నారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. రీల్స్ ప్రభావంతో రియల్ లైఫ్‌లోని రిలేషన్స్‌కు దూరమవుతున్నారని’ఆమె విస్మయం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించినట్లుగా తాము ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నట్లు చాలామంది బాధపడుతున్నారు. ఇంట్లో అందరూ కలిసి ఆప్యాయంగా మాట్లాడుకోలేకపోతున్నట్లు రోష్ని ప్రతినిధులు తెలిపారు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యల బారిన పడుతున్నవారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉండడం గమనార్హం. రోష్నికి రోజుకు 30 నుంచి 45 ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అందులో 75 శాతం కుటుంబ బంధాల సమస్యలేనని వెల్లడైంది. సోషల్ మీడియా కోరల్లో జీవితాలు సహజమైన, ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణాన్ని సామాజిక మాధ్యమం కబళిస్తోంది. చాలా మంది ‘తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇంటిల్లిపాదీ తనకు దూరమవుతున్నా’రనే మానసిక ఆందోళనకు, కుంగుబాటుకు గురవుతున్నారు. ఇలాంటి వారు ‘ఇంటిల్లిపాదీ వారి వెంటే ఉన్నప్పటికీ ఏకాకులవుతున్నా’రని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రోష్ని అధ్యయనంలో వెల్లడైంది. వివిధ రకాల మానసిక సమస్యలపై ఆ సంస్థ ఏడాది కాలంలో సుమారు 5 వేలకు పైగా కేసులను నమోదు చేసింది.అగాధం పెరుగుతోందిఉద్యోగ, వ్యాపారాల రీత్యా తీరిక లేకుండా గడిపే చాలామంది మగవాళ్లు భార్య నుంచి ప్రేమ, ఆత్మీయత లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉరుకులపరుగుల జీవితంలో కలిసి గడిపేందుకు సమయమే లేనట్లుగా వ్యవహరించడం భార్యాభర్తలిరువురికీ సరైంది కాదు. దంపతు ల మధ్య అనుబంధాలు బలంగా ఉంటేనే పిల్ల లు ఆత్మస్థైర్యంతో ఎదుగుతారు. – రత్న, అదనపు సంచాలకులు, రోష్ని గణాంకాలివి2025లో మానసిక సమస్యలపై వచ్చిన మొత్తం ఫిర్యాదులు: 5,610 పురుషులఫిర్యాదులు 4,003 మహిళల ఫిర్యాదులు 1,497ట్రాన్స్‌జెండర్స్ నుంచి వచ్చిన ఫిర్యాదులు 110కారణాలు...మానసిక సమస్యలు 2,151రిలేషన్స్ 1,733ఆర్ధికసమస్యలు 987వివాహేతర సమస్యలు 728కుటుంబ సమస్యలు 706అనారోగ్యం వల్ల కుంగుబాటు: 285 -
పరుగు అందుకున్న జీవితం
బిడ్డ పుస్తకాలకి డబ్బుల్లేవ్... చేస్తున్న పనికి వచ్చే జీతం చాలదు.. ఇద్దరు కూతుర్లున్నారు.. ఆస్తుల్లేవ్ కాని బాగా బతకాలన్న ఆశ ఉంది. అప్పుడొచ్చిందో అవకాశం.. పరుగెడితే పైసలొస్తాయని ఎవరో అంటే... ఒంట్లో ఓపిక లేకపోయినా, శక్తి మొత్తాన్ని కూడగట్టుకుని, జారిన జోళ్లని చేత పట్టుకుని లంఘించిందో మహిళ.. ఆమే రమాబాయి రణ్వీర్.చెప్పులు చేతపట్టుకుని పరుగులు తీసిన రమాబాయిని వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే అది కాస్తా వైరల్‌గా మారింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆమె ప్రయత్నానికి ముచ్చటపడి షూ కొనిస్తానని వెల్లడించారు. నటుడు మాధవన్ రమాబాయ్ పట్టుదలను ప్రశంసించారు. బీడ్ జిల్లా కలెక్టర్ వివేక్ జాన్సన్ ఆమెను సత్కరించి ఆర్థిక సహాయం అందించారు. మరోవైపు దేశవ్యాప్తంగా రమాబాయికి ప్రశంసలు వెల్లువెత్తడంతో పాటు లక్షన్నర వరకు నగదు సాయం కూడా అందింది. ప్రభుత్వం ఆమె కుమార్తెల చదువుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం రమాబాయి పెద్ద కూతురు పూజ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తోంది. చిన్న కూతురు బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధపడుతోంది.ఎవరీ రమాబాయి?మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగైకి చెందిన రమాబాయి రణవీర్‌కు 47 ఏళ్లు. భర్త మరణించిన తర్వాత ఇద్దరి కుమార్తెల బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న రమాబాయి వారి చదువుకోసం ఇళ్లలో వంట చేస్తూ జీవించేది. ఆమె కుమార్తె చదువు కోసం పుస్తకాలు కొనాల్సి వచ్చింది కాని రమా దగ్గర డబ్బుల్లేవు. అంబాజోగైలోని భారతీయ శిక్షణ ప్రసారక సంస్థకు చెందిన ఖోలేశ్వర్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ‘అమృత్ దౌడ్’ పేరుతో పరుగు పందెం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆ పోటీలో పాల్గొని, అందులో గెలుపొందితే పరుగెడితే డబ్బులొస్తాయని తెలిసి రమాబాయి కూడా ఆ పందెంలో పాల్గొనాలని నిర్ణయించుకుంది.చెప్పులు చేత పట్టుకుని...సాధారణంగా రన్నింగ్ రేస్ అంటే ట్రాక్స్ వేసుకుని షూ వేసుకుని స్టైల్‌గా గాగుల్స్ పెట్టుకుని సిద్ధమవుతారు. కాని అవేవి రమాబాయికి తెలీదు. మామూలు చీర కట్టుకుని, ఆకు చెప్పులు వేసుకుని పందేనికి సిద్ధపడింది. రేసు మొదలైంది. రమాబాయి చెప్పులు జారిపోయాయి. కంగారు మొదలైంది. వెంటనే చెప్పులు చేతపట్టుకుని ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని పరుగులు తీసింది. వర్షంతో తడిసిన రోడ్డుపై చిన్నచిన్న రాళ్లు, పెంకులు లాంటివి గుచ్చుకుంటున్నా ఆమె బెదరలేదు.. పరుగు ఆపలేదు. ఎలాగైనా సరే, బిడ్డకు పుస్తకాలు కొనాలన్న పట్టుదల, బిడ్డ చదువు ఆగిపోకూడదన్న అమ్మతనం గెలిచాయి. అందరు రన్నరప్‌లను దాటుకుంటూ ఆమె విన్నర్‌గా నిలిచింది మూడు వేల రూపాయల బహుమతిని అందుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె పెద్ద కుమార్తె పూజా కూడా ఈ పరుగు పందెంలో పాల్గొంది. మూడు వేల కోసం మొదలైన పరుగుతో రమాబాయి కూతుళ్ల జీవితాలకు కొండంత భరోసా వచ్చింది. -
వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రస్తుతం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ వేటలో దూసుకెళ్తున్నాడు. నాలుగు నెలల పాటు మణికట్టు గాయం కారణంగా ఆటకు దూరమైన అల్కరాజ్ యూఎస్ ఓపెన్ ద్వారా పునరాగమనం చేశాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌కు చేరిన అల్కరాజ్ టైటిల్ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. టోర్నమెంట్లో అల్కరాజ్ ధరించిన బనియన్ (Nike OutFit) వైరల్‌గా మారింది. అతడి బనియన్ కారణంగా సోషల్ మీడియాలో అల్కరాజ్ "నిపుల్గేట్" (Nipplegate) ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.విషయంలోకి వెళితే యూఎస్ ఓపెన్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అల్కరాజ్ జులపాల జుట్టుతో పాటు వేషదారణను కూడా పూర్తిగా మార్చేశాడు. మొదటి రెండు రౌండ్ల మ్యాచ్‌లకు అల్కరాజ్ నైక్ (Nike) బ్రాండ్‌కు చెందిన లూజ్-ఫిట్టింగ్ బ్రౌన్ కలర్ ట్యాంక్ టాప్ ధరించాడు. Photo Credit: Twitterమ్యాచ్ సమయంలో అతను కోర్టులో వేగంగా కదులుతున్నప్పుడు ఆ లూజ్ జెర్సీ పక్కకు జరిగి, అతని కుడి వైపు రొమ్ము భాగం (Nipple) పదే పదే బయటకు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. "లవ్ యూ కార్లోస్, కానీ నీ రొమ్ము భాగాన్ని కప్పి ఉంచేలా టైట్ బనియన్ వేసుకొని బరిలోకి దిగు" అని మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, కామెంటేటర్ యూజినీ బౌచర్డ్ ఎక్స్ వేదికగా ఫన్నీ కామెంట్ చేసింది.తన ఔట్ఫిట్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, కామెంట్లను అల్కరాజ్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా అనిపించింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ బ్రౌన్ ట్యాంక్ టాప్ కింద వైట్‌కలర్ అండర్ షర్ట్ ధరించడం కనిపించింది. మ్యాచ్ సమయంలో వేగంగా కదిలినప్పటికీ అతడి రొమ్ము భాగం కనిపించలేదు. Photo Credit: Twitterఇక మ్యాచ్ అనంతరం ఫ్రెస్ కాన్ఫరెన్స్‌లో అల్కరాజ్ మాట్లాడుతూ తన ఔట్ఫిట్పై సరదాగా స్పందించాడు. “ఇటీవల నా రొమ్ము భాగం నాకే ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా అనిపించింది. అందుకే కనీసం ఒక్క మ్యాచ్‌కైనా వాటిని దాచేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇన్నర్‌వేర్ రూపంలో రెండో షర్ట్ ధరించడం చాలా సౌకర్యంగా అనిపిస్తోంది. ఇకపై దీనినే కొనసాగిస్తాను” అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని, నైక్ సంస్థ దీనికి కారణం కాదని అల్కరాజ్ మరోసారి స్పష్టం చేశాడు. No more wardrobe malfunctions for Carlos Alcaraz 😂 pic.twitter.com/BDEfGRs4Pf— TNT Sports (@tntsports) September 5, 2026 Cue the Carlos Alcaraz break of serve! pic.twitter.com/SB8YyFHLCK— US Open Tennis (@usopen) August 31, 2026 Quem será que ganhou esse sorriso do Carlitos 😍.. pic.twitter.com/ytqhNRiY7F— Central Carlos Alcaraz (@AlcarazCentral) September 4, 2026చదవండి: బంతి వేయడానికి 100 కి.మీ. పరిగెత్తిన ఇంగ్లండ్ బౌలర్ -
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026 -
ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం.. ప్రేమ పేరిట ఆకర్షణ.. ఇవన్నీ యువతపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన మరో ఉదాహరణ. తమకు నచ్చిన వ్యక్తి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో కొందరు హద్దులు దాటుతున్నారు. క్షణికమైన కోరిక కోసం తీసుకునే నిర్ణయాలు.. చివరికి జీవితాన్నే మార్చే పరిణామాలకు దారితీస్తున్నాయి. తమ ప్రేమను నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఓ యువతి చేసిన పని ఇప్పుడు ఆమెను కటకటాల వెనక్కి నెట్టింది.ప్రియుడి మనసులో చోటు కోసం ఓ యువతి వెంపర్లాడింది. అతనికి ఉన్న ఖరీదైన బైక్ కలను నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీ విద్యార్థినిని దొంగగా మారి.. తండ్రి పరువు తీసేసింది. తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. స్థానికంగా కాలేజీ చదువుతున్న ఓ యువతి.. ఓ అబ్బాయిని ఇష్టపడుతోంది. అతను కూడా ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఖరీదైన బైక్ ఎప్పటికైనా కొనుక్కోవాలని అతను తరచూ ఆమెకు చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఓరోజు తన తండ్రి స్నేహితుడైన హెచ్. తమిళ్‌సెల్వన్ ఇంటికి వెళ్లింది. అక్కడ అల్మారాలో బంగారం ఉన్న విషయం గుర్తించింది. వాళ్ల కళ్లు గప్పి.. 9 సవర్ల బంగారు నగలను చోరీ చేసింది.ఆపై ఆ నగలను స్థానిక దుకాణంలో రూ.2.5 లక్షలకు విక్రయించింది. ఆ వచ్చిన డబ్బుతో తన ప్రియుడు జనగన్ శివకు ఓ కాస్ట్లీ బైక్ కొనిచ్చింది. అంతేకాదు.. సంతోషంగా ఆ సర్ప్రైజింగ్ క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలోనూ పంచుకుంది. ఇంట్లో బంగారు నగలు కనిపించకపోవడంతో తమిళ్‌సెల్వన్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో.. స్నేహితుడి కూతురిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. విచారణలో తానే బంగారం తీసుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు ఆమె ప్రియుడు జనగన్ శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.ప్రియుడికి బైక్ కొనివ్వాలన్న కోరికతో మొదలైన వ్యవహారం.. చివరకు దొంగతనం, అరెస్టు వరకు వెళ్లింది. క్షణికమైన ప్రేమ, ఆకర్షణ కోసం తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆ యువతి జీవితానికే చేదు అనుభవంగా మారింది. ఇప్పుడీ కేసు.. ఆమె బైక్ కొనిచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.தந்தையின் நண்பர் வீட்டில் 9 சவரன் நகையைத் திருடி விற்று காதலனுக்கு புதிய பைக் வாங்கிக்கொடுத்த கல்லூரி மாணவி..!#Gold | #GoldTheft | #Bike | #Love | #PolimerNews pic.twitter.com/gcz136ETHK— Polimer News (@polimernews) September 4, 2026VIDEO CREDITS: Polimer News -
సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్
-
బొమ్మను చూసి అమ్మే అనుకుని..
ఆవు బొమ్మను చూసిన ఓ లేగదూడ అమాయకంగా దాని దగ్గరకు వెళ్లింది. డెయిరీ వ్యాన్‌పై ఉన్న ఆవు ఫొటోలోని నిండైన పొదుగు నుంచి పాలు తాగేందుకు ప్రయత్నించింది. అది బొమ్మ అని తెలియక.. ఆకలితో, అమ్మ కోసం వెతుకుతున్నట్టుగా వ్యాన్‌ను అనుసరించిన దృశ్యం చూపరులను కదిలించింది. నిజం తెలియని ఆ చిన్న ప్రాణి, తల్లి కోసం పడిన తపన ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో సహజసిద్ధంగా కారులో నుంచి వీడియో తీస్తున్నట్లు ఉంది. అయితే ఇది ఏఐ వీడియో.అయినప్పటికీ ఈ వీడియో చూస్తూ చాలామంది నవ్వుతూనే.. భావోద్వేగానికి లోనయ్యారు. బంధం అంటే ఇదేనేమో.. తల్లిని వెతికే మనసు అనేది ఇలానే ఉంటుంది కదా అని భావోద్వేగానికి లోనవుతున్నారు.. దాంతో ఈ వీడియో వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో అత్యంత పవిత్రమైన తల్లి- బిడ్డ మధ్య ఉండే బంధం ఉండటంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి స్పర్శ అనేది బిడ్డకు ధైర్యాన్ని, రక్షణ ఇచ్చేది కావడం ఒకటైతే, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీడియోను వీక్షకులు అమితంగా ఇష్టపడుతూ తెగ వైరల్ చేస్తున్నారు. The ancients called it physis, the nature that precedes reason! Before we learn to speak, we learn to seek.A calf saw a cow image and without knowing the illusion from reality, walked towards it seeking milk.It is what Aristotle meant by saying: " Some bonds are not taught by… pic.twitter.com/UZDizeT3Kv— WireClicks (@Wireclicks) September 4, 2026 -
సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు
సాక్షి, విజయవాడ: ఏపీలో రెడ్‌బుక్ అరాచకాలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను కూటమి సర్కార్ బ్లాక్ చేయించింది. వాస్తవాలు ప్రసారం చేసిన సాక్షి సోషల్ మీడియాపై అక్కసు వెళ్లగక్కుతోంది. సాక్షి ఫేస్బుక్, ఇన్‌స్టా అకౌంట్లను బ్లాక్ చేయించిన చంద్రబాబు సర్కార్.. డీఎస్సీ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేయడంతో వణుకు పోతోంది.సాక్షి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు మరికొన్ని సోషల్ మీడియా అకౌంట్లపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది. టీడీపీ ఫేక్ అకౌంట్లు, ఏపీ సైబర్ క్రైమ్‌తో కలిసి కుట్రలు చేస్తోంది. ఇప్పటికే సాక్షి సోషల్ మీడియాపై కూటమి సర్కార్ పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును చంద్రబాబు సర్కార్ కాల రాస్తోంది. ఏపీ సర్కార్ కుట్రలపై సాక్షి మీడియా న్యాయ పోరాటం చేస్తోంది.అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అడుగడుగునా అక్రమ కేసులు పెట్టించిన సంగతి తెలిసిందే. అవసరం లేకపోయినా విచారణలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరించేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇదీ చదవండి: మెగా డీఎస్సీ కాదది.. నిరుద్యోగుల గొంతు కోసిన ‘దగా డీఎస్సీ’ -
ట్వీట్.. ట్విస్ట్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ది వెయిట్ ఈజ్ ఆల్ మోస్ట్ ఓవర్.. బిగ్ అప్డేట్ కమింగ్ సూన్.. తెలంగాణ స్టే ట్యూన్డ్’అంటూ కొండా సురేఖ పేరుతో శుక్రవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పోస్టు.. మంత్రివర్గం నుంచి ఆమె ఉద్వాసన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కథ మొదలైన వెంటనే ట్విస్ట్.. కాసేపటికే ‘అది మా పోస్టు కాదు’అంటూ సురేఖ అధికారిక ఖాతాల నుంచి ప్రకటన వచ్చింది. అసలేం జరుగుతోంది.. రాజకీయవర్గాల్లో కొత్త చర్చ ఫేక్ పోస్టు అయితే.. ఇంతకీ ‘బిగ్ అప్డేట్’ఏమిటి? కొండా దంపతుల తదుపరి రాజకీయ అడుగు ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ‘నిరీక్షణ దాదాపు ముగిసింది.. త్వరలోనే బిగ్ అప్డేట్.. తెలంగాణ వేచిచూడండి’ కొండా సురేఖ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ మూడు వాక్యాలు.. కాసేపట్లోనే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి. మంత్రివర్గం నుంచి సురేఖను తొలగించిన నేపథ్యంలో ఈ పోస్టు రావడంతో.. ఇక కీలక రాజకీయ నిర్ణయం ప్రకటించబోతున్నారా? కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతారా? కొత్త రాజకీయ అడుగు వేయబోతున్నారా? అంటూ చర్చ మొదలైంది. ఆ ఉత్కంఠకు తెరపడకముందే మరో ట్విస్ట్! ‘అది మా పోస్ట్ కాదు’అంటూ సురేఖ అధికారిక ఖాతాల ద్వారా ప్రకటించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మరి బిగ్ అప్డేట్?: అసలు సురేఖ రాజకీయ నిర్ణయం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సురేఖ పేరుతో వచ్చిన పోస్టు ఫేక్ అని స్పష్టమైనా, ఆమె రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తి మాత్రం తగ్గలేదు. కొండా సురేఖ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పినా, తాజా పరిణామాల నేపథ్యంలో బయట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? పార్టీ నాయకత్వంపై మరింత ఒత్తిడి తెస్తారా? లేక రాజకీయంగా మరో మార్గాన్ని ఎంచుకుంటారా? తనపై చర్యల విషయంలో న్యాయ పోరాటం చేస్తారా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. -
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
ప్రపంచ రాజకీయాల్లో ఈ జంట కనిపిస్తే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇద్దరి సరదా సంభాషణలు, ఆప్యాయ పలకరింపులు ఇప్పటికే ‘మెలోడీ’ పేరుతో వైరల్‌గా మారాయి. తాజాగా మెలోనీకి మోదీ చేసిన ఓ ప్రత్యేక విషెస్ ఈ స్నేహాన్ని మరోసారి చర్చలోకి తెచ్చింది.ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నేతగా ఆమె తాజాగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. మెలోనీని తన స్నేహితురాలిగా పేర్కొంటూ.. ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఘనత నిదర్శనమని అన్నారు.“నా స్నేహితురాలు ప్రధాని మెలోనీకి అభినందనలు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నిరంతరంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రధానిగా ఆమె నిలిచారు” అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్ట్ చేశారు. మెలోనీ నాయకత్వంలో భారత్–ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మెలోనీతో కలిసి మరింత సన్నిహితంగా పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.Mi congratulo con la mia amica, il Primo Ministro Meloni, per essere diventata il Primo Ministro con il mandato più lungo nella storia del dopoguerra italiano. Questo traguardo riflette la fiducia che il popolo italiano ripone nella sua leadership. La sua amicizia è stata…— Narendra Modi (@narendramodi) September 4, 2026అలా ప్రధానిగా..1977లో రోమ్‌లో జన్మించిన జార్జియా మెలోనీ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో యువజన రాజకీయ ఉద్యమంలో చేరిన ఆమె.. ఆ తర్వాత ఇటలీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2008లో అప్పటి ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ ప్రభుత్వంలో యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2012లో ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీని స్థాపించి, 2014లో దాని అధ్యక్షురాలయ్యారు. 2022 సాధారణ ఎన్నికల్లో ఆమె పార్టీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించడంతో.. అదే ఏడాది అక్టోబర్ 22న ఇటలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఇటలీ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా మెలోనీ రికార్డు సృష్టించారు. తాజా రికార్డుపై ఇటు తన సోషల్ మీడియాలో మెలోనీ సైతం ఓ పోస్ట్ చేశారు.Oggi il nostro Governo diventa il più longevo della storia della Repubblica italiana.È un dato che accolgo con gratitudine e con un forte senso di responsabilità. Perché la stabilità non è un record da esibire, ma la condizione che consente a una Nazione di programmare,… pic.twitter.com/EpdHe35vJa— Giorgia Meloni (@GiorgiaMeloni) September 4, 2026మెలోనీ కంటే ముందు..ఇటలీ రిపబ్లిక్ ఏర్పడిన 1946 తర్వాత ఎంతోమంది ప్రధానులు మారారు. మెలోనీకి ముందు సుదీర్ఘకాలం నిరంతరంగా ప్రధానిగా కొనసాగిన రికార్డు సిల్వియో బెర్లుస్కోనీ పేరిట ఉండేది. 2001లో ప్రారంభమైన ఆయన రెండో ప్రభుత్వం 1,412 రోజులు కొనసాగింది. 2022 అక్టోబర్ 22న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెలోనీ తాజాగా ఆ రికార్డును అధిగమించారు.‘మెలోడీ’గా ఫేమస్..మోదీ, మెలోనీ మధ్య స్నేహం అంతర్జాతీయ వేదికలపైనా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఇద్దరి సమావేశాలు, సంభాషణలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ‘మెలోడీ’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. మెలోనీ కూడా గతంలో మోదీతో తన స్నేహాన్ని సానుకూలంగా ప్రస్తావించారు. ఆఖరికి ఈ బంధం మెలోడీ చాక్లెట్లు పంచుకునే సరదా స్థాయి దాకా వెళ్లింది. అయితే ఈ బంధం గురించి ఇటు ఇండియాలో రాజకీయ దుమారం రేపిన సందర్భమూ ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇక్కడ మోదీ రికార్డేఇటలీలో మెలోనీ సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ రికార్డు నెలకొల్పిన వేళ.. భారత్‌లోనూ ప్రధాని మోదీ సుదీర్ఘ పాలనతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2019, 2024లో వరుసగా ఎన్నికై మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. దీంతో దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతల జాబితాలో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. భారత్‌లో నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు ఎన్నికై ప్రధానిగా కొనసాగుతున్న నేతగా మోదీ నిలిచారు. ఇటలీలో మెలోనీ, భారత్‌లో మోదీ.. ఇద్దరూ తమ తమ దేశాల్లో సుదీర్ఘ రాజకీయ ప్రయాణంతో ప్రత్యేక ముద్ర వేశారు.మరింత బలపడనున్న బంధంఇటలీతో భారత్ సంబంధాలు మోదీ ప్రధాని అయ్యాకే క్రమక్రమంగా బలపడుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మెలోనీ స్నేహం కీలకంగా ఉందని మోదీనే చాలాసార్లు పేర్కొన్నారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ ఈ సంబంధాలు మరింత విస్తరించనున్నాయని మోదీ సంకేతమిచ్చారు.ఇదీ చదవండి: మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా? -
రోడ్డుపై ఈము.. పోలీస్ పరుగులు! చివరికి ఏం జరిగిందంటే?
అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటిదే ఈ ఘటన కూడా. రోడ్డుపైకి వచ్చిన ఓ భారీ ఈము పక్షి.. ఓ పోలీస్ అధికారిని పరుగులు పెట్టించింది. ఈమును పట్టుకునేందుకు అధికారి చేసిన ప్రయత్నం కాసేపు సరదా ఛేజింగ్‌గా మారింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో నాష్డేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈము పక్షి రోడ్డుపైకి వచ్చి అటూ ఇటూ సంచరించడంతో వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సమాచారం అందుకున్న ఓ యువ పోలీస్ అధికారి అక్కడికి చేరుకున్నాడు. రోడ్డుపై నుంచి ఈమును పక్కకు పంపించేందుకు ప్రయత్నించగా.. అది ఆ అధికారిని పరుగులు పెట్టించింది. అధికారి ఎంత వేగంగా పరుగెత్తినా ఈము ఏమాత్రం దొరకకుండా ఉరకలు తీసింది. దీంతో అక్కడ కొద్దిసేపు సరదా ఛేజింగ్ కనిపించింది. ఎట్టకేలకు అధికారి ఆ పక్షిని రోడ్డుకు దూరంగా పంపించడంలో విజయవంతమయ్యాడు.అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ‘క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్’ అని పేర్కొంటూ పోస్ట్ చేశారు. రోడ్డుపై ఈము ఉండటం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపైకి వచ్చిన పశువులు, కంగారూలను పోలీసులు తరలిస్తుంటారు. అయితే ఈము కోసం ట్రాఫిక్ నిర్వహించాల్సి రావడం మాత్రం అరుదైన అనుభవమని అధికారులు పేర్కొన్నారు.ఈ వీడియోకు దాదాపు 90 వేల వ్యూస్ రావడంతో నెటిజన్లు కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘అది తిరిగి పోలీస్‌ను వెంటాడితే అసలు వేగం తెలుస్తుంది’ అంటూ కొందరు సరదాగా స్పందించారు. మరికొందరు ఈ ఘటనను 1932లో ఆస్ట్రేలియాలో జరిగిన ‘ఈము వార్’తో పోల్చారు. అప్పట్లో పంటలను నాశనం చేస్తున్న ఈములను నియంత్రించేందుకు సైన్యం చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించకపోవడంతో ఆ ఘటన చరిత్రలో నిలిచిపోయిందని గుర్తుచేసుకున్నారు.అయితే, ఈ ఘటన సరదాగా కనిపించినప్పటికీ రోడ్డుపైకి వచ్చే పెద్ద జంతువులు వాహనదారులకు ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ఉండాలి. పక్షులను, జంతువులను భయపెట్టకుండా దూరంగా వెళ్లి, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిదని మరికొందరు వారి వారి అభిప్రాయాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. View this post on Instagram A post shared by ABC News (@abcnews) ఇవి కూడా చదవండి: సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి! -
మా పిల్లలనూ కాపాడండి!
అమెరికా రాష్ట్రాలు సంయుక్తంగా దాఖలు చేసిన దావాలో టెక్ దిగ్గజం ‘మెటా’ రాజీకి వచ్చి, 18 బిలియన్ డాలర్ల చెల్లింపుతో పాటు, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బాలలకు రోజుకు కేవలం రెండు గంటల వినియోగ పరి మితి, రాత్రిపూట ఆటోమేటిక్ లాకౌట్, క్రోనలాజికల్ ఫీడ్, కఠిన వయో నిర్ధా రణ వ్యవస్థను అమలు చేయడానికి అంగీకరించింది.స్నాప్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్ కూడా ఇదే బాటలో నడవనున్నాయి. ఐరోపా సమాఖ్య సైతం తమ పిల్లల భద్రత కోసం ఇదే తరహా రక్షణ చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. భారత దేశం కూడా మేలుకోవాలి. ‘లోకల్ సర్కిల్స్’ సర్వే ప్రకారం, ఆన్ లైన్ లో తమ పిల్లలు అనుచితమైన కంటెంట్‌కు గురైనట్లు సగం మంది భారతీయ తల్లిదండ్రులు గుర్తించారు.మన దేశంలో 2023 డేటా ప్రొటెక్షన్ చట్టం ‘తల్లిదండ్రుల సమ్మతి’పై ఆధారపడి ఉంది. ఆస్ట్రే లియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించగా, ఇండోనేషియా, బ్రెజిల్, టర్కీ, యూకే కఠిన నిబంధనలు తెచ్చాయి. దీనితో పాటు... అశ్లీలత, హింస, షార్ట్–వీడియోల వ్యసనం, గేమింగ్–బెట్టింగ్ యాప్స్ లాంటి పెద్ద ముప్పులను కూడా అడ్డుకోవాలి. టెక్సాస్, బ్రిటన్, ఫ్రాన్స్ తరహాలో బయోమెట్రిక్ లేదా ఐడీ ద్వారా వయసు నిర్ధారణను కఠినంగా అమలు చేయాలి.పిల్లల మెదడులో డోపమైన్‌ను పెంచి బానిసలను చేస్తున్న షార్ట్–వీడియోల నిరంతర ఆటో ప్లే, స్క్రోలింగ్‌లను ఆపేయాలి. గేమింగ్ ముసుగులో ఉండే ‘లూట్ బాక్స్’లను జూదంగా పరిగణించి నియంత్రించాలి. చైనాలో మైనర్లకు ‘మైనర్ మోడ్’ తీసుకువచ్చారు. ఆర్థిక సర్వే 2025–26 సూచించినట్లుగా, స్కూళ్లలో బేసిక్ ఫోన్లను మాత్రమే అనుమతించాలి. ఈయూ తరహాలో ‘మా పిల్లలను కూడా రక్షించండి (ప్రొటెక్ట్ అవర్ కిడ్స్ టూ)’ అని భారతదేశం కూడా గట్టిగా అడగాలి.అలాగే ఇటీవలి సంఘటనల్లో టీనేజీ పిల్లల బాధితులైన ‘ఒంటరి మహిళ బలహీన లక్ష్యం’ అనే మూస ధోరణిని తిప్పి కొట్టాలి. హ్యాండ్‌బ్యాగ్‌లో ‘పెప్పర్ స్ప్రే’ వంటి చట్టబద్ధ మైన సాధనం ఉంచు కోవాలి. దీనితో పాటు ‘హోమ్ ఎస్.ఓ.ఎస్. సైరన్’ వ్యవస్థను ప్రోత్సహించాలి. ప్యానిక్ బటన్ నొక్కగానే మోగే పెద్ద సైరన్ చుట్టు పక్కల వారిని అప్రమత్తం చేసి, ఇరుగుపొరుగు వారి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది.లాటిన్ అమెరికాలో వీధి మొత్తానికి ‘అలార్మా వెసినాల్’ సైరన్ ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికీ ఒక రిమోట్ ఇస్తారు. బటన్ నొక్కితే చుట్టుపక్కల వారు వచ్చి సాయం చేస్తారు. దక్షిణాఫ్రికాలో నేరాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు ప్యానిక్ బటన్లు, ప్రత్యేకమైన విజిల్స్ వాడుతారు. అలాగే, యాప్‌లోని ‘షౌట్’ బటన్ ద్వారా లొకేషన్‌తో కూడిన సందేశం పోలీసులకు చేరవేసే ‘112 ఇండియా’ యాప్‌పై అవగాహన పెంచాలి.– శ్రీనివాస మాధవ్, ఆర్టీఐ పరిశోధకులు -
ఇతర మహిళల్ని అవమానించొద్దు.. నటిపై భగ్గుమన్న బీజేపీ!
కృతి సనన్ రాఖీ యాడ్ దుమారం చల్లారక ముందే.. మరో నటి స్వరా భాస్కర్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాలోని ‘జౌహర్’ సన్నివేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మహిళల త్యాగాన్ని అవమానించేలా మాట్లాడటం సరికాదని విమర్శించింది.ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘వుమన్, లైఫ్, ఫ్రీడమ్’ కార్యక్రమంలో స్వరా భాస్కర్ ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశాన్ని ప్రస్తావించారు. సినిమాలో మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాహుతి చేసుకున్నట్లు చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ లైంగిక హింసకు గురైన మహిళ ఈ సన్నివేశాన్ని చూస్తే.. తన జీవితాన్ని కొనసాగించాలనుకోవడం తప్పా అనే భావన కలగొచ్చని స్వరా ప్రశ్నించారు. ‘గౌరవం కోసం చనిపోకపోతే పిరికిదానిననే భావన కలుగుతుందా?’ అన్న కోణంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లైంగిక హింసకు గురైన మహిళలకు కూడా బతికే హక్కు ఉందన్న సందేశమే సమాజానికి వెళ్లాలని ఆమె పేర్కొన్నారు.జౌహర్ (Jauhar) అంటే.. యుద్ధంలో శత్రు సైన్యం చేతిలో చిక్కి అవమానం, లైంగిక హింసకు గురికాకుండా ఉండేందుకు మహిళలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకునే ఆచారం.‘ఆమె పిరికిదని అనలేదు’స్వరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను రాణి పద్మావతిని కానీ, జౌహర్ చేసిన మహిళలను కానీ పిరికివాళ్లుగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అనువదించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రశ్నించింది జౌహర్ చేసిన మహిళల ధైర్యాన్ని కాదని.. ఆ సన్నివేశం ఆధునిక సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందన్నదేనని వివరించారు.‘ఇతర మహిళలను గౌరవించాలి’ఈ వివాదంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి మహిళ ఇతర మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వరా పేరులోని ‘స్వర్’ (గొంతు/స్వరం)ను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ఆమె ఎవరి గొంతుతో మాట్లాడుతున్నారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. మహిళల త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.పోలీసులకు ఫిర్యాదుఈ వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. బిహార్‌కు చెందిన బీజేపీ నేత కృష్ణకుమార్ సింగ్ స్వరా భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హిందూ సమాజం, రాజ్‌పుత్ మహిళలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించినట్లు కథనాలు పేర్కొన్నాయి.కర్ణిసేన కూడా..పద్మావత్ విడుదల సమయంలోనే ఆ సినిమాలోని అంశాలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణిసేన.. తాజా వివాదంలోనూ స్వరా భాస్కర్‌ను తప్పుబట్టింది. జౌహర్‌ను, రాజ్‌పుత్ మహిళల త్యాగాన్ని విమర్శించే ముందు చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. కర్ణిసేన మహిళా విభాగం నేత కీర్తి రాథోర్.. స్వరా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌పుత్ మహిళల త్యాగం, ధైర్యాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.మళ్లీ తెరపైకి ‘పద్మావత్’ వివాదం2018లో విడుదలైన ‘పద్మావత్’లో రాణి పద్మావతి పాత్రను దీపికా పదుకొణె పోషించారు. ఆ సమయంలో కర్ణిసేన అభ్యంతరాలతో సినిమా టైటిల్ పద్మావతి కాస్త పద్మావత్‌గా మారింది. ఇక చిత్ర క్లైమాక్స్‌లో శత్రు సేనల చేతికి చిక్కకుండా రాజ్‌పుత్ మహిళలు సామూహికంగా జౌహర్ చేసినట్లు సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. స్వరా భాస్కర్ కూడా సినిమా విడుదల సమయంలో దర్శకుడు భన్సాలీకి బహిరంగ లేఖ రాసి జౌహర్ చిత్రీకరణపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడంతో వివాదం తాజాగా మళ్లీ రాజుకుంది.చరిత్రా? సమాజానికి సందేశమా?‘పద్మావత్’లో జౌహర్ చిత్రీకరణ చుట్టూ సాగుతున్న తాజా వివాదం.. చరిత్రను సినిమాల్లో ఎలా చూపించాలి? చారిత్రక ఘటనలను ఆధునిక సామాజిక విలువలతో ఎలా చూడాలి? అనే ప్రశ్నలను మరోసారి ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో ‘పద్మావత్’ రచయిత ప్రకాశ్ కపాడియా కూడా జౌహర్ సన్నివేశాన్ని సమర్థించారు. అది ఆ కాలంలోని వాస్తవ పరిస్థితుల ప్రతిబింబమని, నేటి ప్రమాణాలతో మాత్రమే దాన్ని అంచనా వేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరా భాస్కర్ మాత్రం తన ఉద్దేశం ఏ మహిళనూ అవమానించడం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ, కర్ణిసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. ‘పద్మావత్’ జౌహర్ వివాదం మరోసారి బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.వివాదాలు స్వరా భాస్కర్‌కు కొత్తేమీ కాదు. నటిగా ‘తను వెడ్స్ మను’, ‘రాంఝనా’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘నిల్ బట్టే సన్నాటా’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత తన వ్యాఖ్యలు, రాజకీయ వైఖరితోనూ తరచూ వార్తల్లో నిలిచారు. సీఏఏ-ఎన్ఆర్సీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం నుంచి ‘వీరే ది వెడ్డింగ్’లోని ఓ సన్నివేశంపై వచ్చిన విమర్శల వరకు.. ఆమెపై పలు సందర్భాల్లో చర్చ జరిగింది. 2024లో యాహ్యా సిన్వార్పై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇప్పుడు ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశంపై వ్యాఖ్యలతో మరోసారి వివాదం రేగింది.ఇదీ చదవండి: పాతికేళ్ల జలయుద్ధానికి ఎట్టకేలకు తెర -
నిద్రను మింగేస్తున్న ‘హెల్’ ఫోన్
సాక్షి, అమరావతి: రాత్రి భోజనం అయిన వెంటనే మంచంపైకి వెళ్లి ఫోన్ చేతిలోకి తీసుకోవడం.. రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా పోస్టులు చూడటం.. మధ్యలో ఓ వెబ్‌సిరీస్ ఎపిసోడ్.. ‘ఐదే నిమిషాలు’ అంటూ మొదలయ్యే ఈ అలవాటు గంటల తరబడి సాగిపోతుంది. ఫలితంగా నిద్ర సమయం తగ్గిపోయి, నిద్ర నాణ్యత దెబ్బతిని.. చివరకు ఆరోగ్యం దెబ్బతింటోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా పడుకునే ముందు సోషల్ మీడియా, స్ట్రీమింగ్ వంటి డిజిటల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్నవారిలో నిద్ర సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమస్య కేవలం స్క్రీన్ వెలుతురుతోనే కాదు. ఆసక్తికరమైన కంటెంట్ మెదడును చురుగ్గా ఉంచుతుంది. దాని వల్ల నిద్ర రాదు. అందుకే పడుకునే ముందు సెల్ ఫోన్, సోషల్ మీడియాను దూరంగా ఉంచటం, మంచంపై ఫోన్ వాడకపోవడం, అవసరం లేని నోటిఫికేషన్లు ఆపేయడం వంటి అలవాట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కేవలం ఒకటి రెండు అధ్యయనాలు చెప్పిన విషయం కాదు. 55 అధ్యయనాల పేపర్లు, 41,716 మంది పాల్గొన్న డేటాను విశ్లేíÙంచిన ‘మెటా’ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. రోజూ 5 నుంచి 8 గంటలు సెల్‌ఫోన్‌తో గడుపుతున్న వారు 29.6 శాతం ఉన్నట్లు వెల్లడించింది. 2 నుంచి 4 గంటలు ఫోన్ చూస్తున్న వారు 44.9 శాతం ఉన్నట్లు గుర్తించింది. నిద్రకు ముందు గంటలో స్క్రీన్ ఉపయోగిస్తున్నామని 46.7 శాతం మంది తెలిపారు. 18.3 శాతం మందిలో సోషల్ మీడియా వ్యసనంఈ ఏడాది ప్రచురితమైన ‘బియాండ్ స్క్రీన్ టైమ్’ అధ్యయనంలో 722 మంది పెద్దలను పరిశీలించారు. నిద్రకు ముందు డిజిటల్ మీడియా వినియోగం, నిద్ర నాణ్యత, నిద్ర వ్యవధి, నిద్ర పట్టేందుకు పట్టే సమయాన్ని విశ్లేషించారు. సోషల్ మీడియా, స్ట్రీమింగ్ వినియోగం ఎక్కువగా ఉన్న వర్గాల్లో సుమారు 8 శాతం వరకు నిద్ర తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నిద్ర పట్టే సమయంలోనూ సుమారు 15 శాతం వ్యత్యాసం ఉన్నట్లు తెలుసుకున్నారు. » మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా ప్రాంతంలో 18 నుంచి 25 ఏళ్ల వయసున్న 750 మంది కాలేజీ విద్యార్థులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అధ్యయనంలో 18.3 శాతం మందిలో సోషల్ మీడియా వ్యసనం ఉన్నట్లు తేలింది. ఈ వ్యసనం పెరిగేకొద్దీ నిద్ర నాణ్యత తగ్గుతున్నట్లు గుర్తించారు. రోజుకు 3 గంటలకు మించి సోషల్ మీడియా వినియోగం కూడా వ్యసనంగా భావించాలని అధ్యయనం తెలిపింది. » 2024లో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన అధ్యయనంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన 792 మంది విద్యార్థులను పరిశీలించగా.. 17.7 శాతం మందికి సోషల్ మీడియా వ్యసనం ఉన్నట్లు తేలింది. » పట్నాలోని ఏడు మెడికల్ కాలేజీలకు చెందిన 510 మంది అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులపై 2025 జూన్‌లో నిర్వహించిన మరో అధ్యయనంలో 68.2 శాతం మందికి నిద్ర నాణ్యత సరిగా లేదని తేలింది. -
‘బతికించమని అడుక్కోవాలా?’.. నేపాల్‌లో రెస్క్యూ తీరిదీ!
నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించి వారం రోజులు దాటుతున్నా.. వేల మంది జాడ లేకుండా పోయింది. నేపాల్ సైన్యంతో పాటు భారత్, చైనా, అమెరికా, దక్షిణ కొరియా దేశాలు అన్వేషణలో సాయం చేస్తున్నాయి. అయితే భారీ వర్షాలు, నదులు పొంగిపొర్లుతుండడం.. ఇప్పటికే బురద దట్టంగా పేరుకుపోయి ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ తరుణంలో సొరంగాల్లో చిక్కుకున్న బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. నేపాల్ ఆకస్మిక వరదల్లో 4 వేల మంది జాడ తెలియరావడం లేదు. ఇందులో సుమారు 1000 మంది సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. దీంతో ఆ టన్నెళ్లకు రంధ్రాలు చేసి.. పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్‌ను పంపిస్తున్నారు. అయితే బోర్‌హోల్ కెమెరాలతో సొరంగాల పరిశీలనలో కార్మికులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో వాళ్లంతా కొట్టుకుపోయి ఉంటారా? లేదంటే వాటిల్లోనే సమాధి అయ్యారా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సహాయక చర్యలు నత్తనడకన సాగుతుండడంపై బాధిత కుటుంబాలు నేపాల్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రసువా జిల్లాలోని త్రిశూలీ-3ఏ జలవిద్యుత్ కేంద్రంలో సుమారు 40 మంది నెపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉద్యోగులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ‘ఆరు రోజులుగా ఎదురుచూస్తున్నాం.. అసలు రెస్క్యూ ఎప్పుడు?’ అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఓ ఇంజినీర్ భార్య. తన భర్తతో పాటు 40 మంది ఉద్యోగులు త్రిశూలీ-3ఏ ప్రాజెక్టులో చిక్కుకున్నారని ఆమె తెలిపారు. ఈ జలవిద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యంత సురక్షితమైన వాటిలో ఒకటని చెప్పడంతో.. లోపలున్న వారంతా క్షేమంగానే ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళన పెరుగుతోందన్నారు. సమాచారం కోసం ఆర్మీ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. కొందరు టన్నెల్ వద్దకు కూడా వెళ్లారు. ఎవరి నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు అని వాపోయారామె.ప్రకటనలకే పరిమితమా?చైనా, భారత్ నుంచి రెస్క్యూ బృందాలు వెళ్లాయని మీడియాలో వార్తలు వస్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆమె ఆరోపించారు. ‘చైనా, భారత్ బృందాలు వెళ్లాయని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క జేసీబీ కూడా అక్కడికి చేరలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వరద తీవ్రత, మట్టి, శిథిలాల పరిస్థితి తెలిసి ఆరు రోజులైనా.. సొరంగాల్లోకి వెళ్లేందుకు అవసరమైన భారీ యంత్రాలు, టన్నెల్ కట్టర్లు ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. రోజుకో రెస్క్యూ బృందం వచ్చిందంటూ ప్రకటనలు చేయడం తప్ప.. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదన్నారు.‘ఈ రోజు.. రేపు అంటూ ఆరు రోజులు’రెస్క్యూ బృందాలు వస్తున్నాయని, మంత్రులు ఘటనాస్థలికి వెళ్తున్నారని, చైనాతో సమన్వయం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారని ఆమె తెలిపారు. దీంతో బాధిత కుటుంబాలు కూడా ‘ఈరోజు కాకపోతే రేపైనా మా వాళ్లు బయటకు వస్తారు’ అని ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ‘ఇలా ఆశ పెట్టుకుని ఆరు రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రతి గంటా, ప్రతి క్షణం భారంగా మారింది’ అని కన్నీటి పర్యంతమయ్యారు.‘వాళ్ల ప్రాణాలతో ఆటలు ఆడాలా?’రెస్క్యూ చర్యల పురోగతిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పది మీటర్లు వెళ్లాం.. 20 మీటర్లు వెళ్లాం అని చెబుతున్నారు. ఇది ఏంటి? మనం వాళ్ల ప్రాణాలు కాపాడుతున్నామా? లేక ఆటలు ఆడుతున్నామా?’ అని ప్రశ్నించారు. ‘ఇది ఒక్కరి విషయం కాదు. 40 కుటుంబాల ప్రాణాల సమస్య. వారి కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో ప్రభుత్వానికి తెలుసా?’ అని నిలదీశారు.తమ ఆవేదనను బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితిలో పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రుల పాలయ్యారని తెలిపారు. ‘ఆయన వ్యక్తిగత పని కోసం అక్కడికి వెళ్లలేదు. దేశం కోసం పని చేయడానికి వెళ్లారు. మరి ఆయనను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ప్రాణాలు కాపాడమని మేము మీడియా ముందు వేడుకోవాలా?’ అని ఆమె ప్రశ్నించారు.వందలాది మంది ఉద్యోగులు గల్లంతునేపాల్లో వరదల కారణంగా మరికొన్ని హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగులు, ఇతర సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. అప్పర్ త్రిశూలీ-1 ప్రాజెక్టు వద్ద 550 మందికి పైగా ఆచూకీ తెలియడం లేదని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (ఐపీపీఏఎన్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్కడ 254 మందిని సురక్షితంగా రక్షించినప్పటికీ.. మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.అప్పర్ త్రిశూలీ-3బీ ప్రాజెక్టులో 122 మంది, లాంగ్టాంగ్ ఖోలా ప్రాజెక్టులో 41 మంది, చిలిమే హైడ్రోపవర్ ప్రాజెక్టులో ఎనిమిది మంది, మెయిలంగ్ ఖోలా ప్రాజెక్టులో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. రసువాగఢి హైడ్రోపవర్ ప్రాజెక్టులోనూ 93 మంది ఆచూకీ తెలియడం లేదు. చైనా, దక్షిణ కొరియా, భారత్‌కు చెందిన బృందాలు నేపాల్ సైన్యంతో కలిసి పలు ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం సమయం గడుస్తున్న కొద్దీ కుటుంబాల ఆందోళన మరింత పెరుగుతోంది.అధికారులు ఏం చెబుతున్నారు?మరోవైపు.. సహాయక చర్యల్లో తామేమీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదని అక్కడి అధికారులు అంటున్నారు. సొరంగాల్లోకి చేరుకోవడం అత్యంత క్లిష్టంగా మారిందని చెబుతున్నారు. భారీ బురద, నీరు, రాళ్లు, శిథిలాలు మార్గాన్ని పూర్తిగా మూసేశాయని.. కొన్ని ప్రాంతాల్లో డ్రిల్లింగ్, భారీ యంత్రాల సాయంతో మార్గాన్ని క్లియర్ చేస్తున్నామని వెల్లడించారు. చైనా, భారత్ తదితర దేశాల నిపుణుల సహకారంతో పరిస్థితిని అంచనా వేసి రెస్క్యూ చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: భారత్ మాకు పరిహారం చెల్లించాల్సిందే.. నేపాల్ డిమాండ్ -
బాబు,పవన్ లను ప్రశ్నిస్తే తప్పా..? గొంతు నొక్కే కుట్ర
-
సబ్‌స్క్రైబ్ చేసుకో.. తిరుమల లడ్డూ తీసుకో!
తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సోషల్ మీడియా ప్రచారానికి వినియోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘ఒక్కసారి సబ్‌స్క్రైబ్ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం’ అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి ఫేస్ బుక్‌లో ఈ వీడియోను పోస్టు చేసినట్లు సమాచారం. తన చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసిన వారికి ఒక్కొక్కరికీ ఒక్కో తిరుమల లడ్డూను ఇస్తున్నట్లు వీడియోలో చూపించారు.ఇలా సుమారు 30 మందితో సబ్‌స్క్రైబ్ చేయించుకుని.. వారికి 30 లడ్డూలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా మరో వీడియోలో తన చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి.. వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసిన వారికి తిరుమల లడ్డూల బాక్స్‌ను పంపిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఈ వీడియోలు వైరల్ కావడంతో భక్తుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సోషల్ మీడియా ప్రచారానికి ఉపయోగించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇంత పెద్ద మొత్తంలో లడ్డూలు ఎలా వచ్చాయి? తిరుమలలో లడ్డూ ప్రసాదం జారీకి నిర్దిష్ట నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. అలాంటప్పుడు సదరు వ్యక్తి వద్దకు పెద్ద సంఖ్యలో లడ్డూలు ఎలా చేరాయి? వాటిని అధికారికంగా తిరుమల నుంచి పొందారా? లేక మరే మార్గంలో సమకూర్చుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీడియోలో చూపించిన లడ్డూలు నిజంగా టీటీడీ ప్రసాదాలేనా తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై టీటీడీ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.చదవండి: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్‌డ్రింక్ తాగుదాం!’ -
వాట్సాప్ డీపీలతోఉద్యమ వేడి
సాక్షి, అమరావతి: న్యాయమైన సమస్యల పరిష్కారం.. వెంటనే పీఆర్సీతోపాటు డీఏలు, ఐఆర్, పెండింగ్ బకాయిల విడుదల డిమాండ్‌తో చంద్రబాబు సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగుల ఆందోళన కొత్త రూపం తీసుకుంది. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా నిరసనలు తెలిపారు. ‘సీఎం సార్..! మా డబ్బులు మాకు ఇవ్వండి’ అనే నినాదంతో ఉద్యోగులు వాట్సాప్ డీపీలతో హోరెత్తించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లలో పెట్టుకున్న డీపీలతో ఉద్యోగుల ఉద్యమం డిజిటల్ ఉద్యమంగా మారింది. ఎవరి ఫోన్లో చూసినా అదే డీపీ కనిపించింది. ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు మొదలు ప్రభుత్వ పాఠశాలలు, మండల స్థాయిలో తహశీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, వెటర్నరీ ఉద్యోగులు, అన్ని ఆర్టీసీ డిపోలు, వివిధ కార్యాలయాల ఉద్యోగులు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల ఉద్యోగులు, కార్మిక, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు, జిల్లా స్థాయిలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, వివిధ శాఖల కార్యాలయాల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి గట్టిగా వినిపించాం.. ఉద్యమంలో భాగంగా ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు విజయవంతమైందని ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుని ఉద్యోగులు తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి గట్టిగా వినిపించారన్నారు. 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా, డివిజన్ కార్యాలయాలను ఏపీ జేఏసీ నాయకులు సందర్శించి ప్రతి ఉద్యోగిని కలసి ఉద్యమానికి కారణాలను వివరించి విస్తృత ప్రచారం చేపట్టి చేయి చేయి కలిపే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. 3, 5వ తేదీల్లో అన్ని జిల్లా, డివిజన్ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. 11వ తేదీన విజయవాడతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి అన్ని ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ సంఘాలను ఆహ్వానించి ఉద్యోగుల సమస్యలపై మద్దతు కూడగడతామని ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీచర్ల నిరసన ఐక్యంగా కదిలిరావాలి పీఆర్సీ, డీఏలు, ఐఆర్, రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంటే కొందరు నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని పలువురు ఉద్యోగులు మండిపడ్డారు. అలాంటి వారి తీరు వల్లే రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించలేకపోయామని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచలేకపోయామని, వారికి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చేయలేకపోయామని ఏపీ జేఏసీ అమరావతి నేతలు మండిపడ్డారు. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా కనీసం చర్చలకు సైతం పిలవకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి శ్రీకాకుళం, అనంతపురంలో ఉద్యమ సన్నద్ధ సభలను ప్రకటించిందని తెలిపారు. దీంతో సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని జూలై 22వ తేదీన అన్ని సంఘాలతో చర్చలు జరిపిందన్నారు. కానీ చర్చలు జరిపినా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా గత 40 రోజులుగా ప్రభుత్వం కాలయాపన చేయడంతో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించినట్లు తెలిపారు. తమకు రావాల్సిన న్యాయమైన బకాయిలు, హక్కుల సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ఉద్యోగులంతా స్వచ్ఛందంగా భాగస్వాములై సంఘాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
సబ్‌స్క్రైబ్ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం
-
మెస్సీ కంటతడి బాధ కలిగించింది: క్రిస్టియానో రొనాల్డో
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మెస్సీ రిటైర్మెంట్పై రొనాల్డో స్పందించింది ఇప్పుడు కాదు. పదేళ్ల క్రితం 2016లో తొలిసారి మెస్సీ అనూహ్యంగా వీడ్కోలు పలకడంపై రొనాల్డో మద్దతు పలికాడు. ఆనాడు మెస్సీ రిటైర్మెంట్పై స్పందిస్తూ.. "మెస్సీ చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులు అతడి పరిస్థితిని, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. అతడికి ఓటములు, నిరాశలు అలవాటు లేవు. రెండో స్థానంలో నిలవడాన్ని కూడా అతడు ఇష్టపడడు. పెనాల్టీ మిస్ అయినంత మాత్రాన అతడు చెడ్డ ఆటగాడు అయిపోడు. మెస్సీ కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే బాధగా ఉంది. అతడు తిరిగి తన దేశం తరఫున ఆడాలని ఆశిస్తున్నాను. అర్జెంటీనాకు అతడు అవసరం" అని రొనాల్డో అప్పట్లో వ్యాఖ్యానించాడు. Photo Credit: Twitterమెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకడంతో రొనాల్డో పదేళ్ల నాటి పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. మెస్సీ తాజా వీడ్కోలుపై రొనాల్డో ఇప్పటివరకైతే స్పందించలేదు. ప్రస్తుతం అతడు సౌదీ అరేబియా క్లబ్ అల్-నస్ర్ తరఫున ఆడుతూ బిజీగా ఉన్నాడు. మెస్సీ రిటైర్మెంట్ నేపథ్యంలో తన ట్రెయినింగ్ ఫొటోను పంచుకున్న రొనాల్డో "కీప్ పుషింగ్" అని క్యాఫ్షన్ జత చేశాడు. మెస్సీని ఉద్దేశించే రొనాల్డో ఆ క్యాప్షన్ పెట్టాడని, "ముందుకు సాగుదాం" అన్నట్లుగా అర్ధం వచ్చేలా రొనాల్డో కామెంట్ ఉందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే పదేళ్ల క్రితం రొనాల్లో మెస్సీకి మద్దతుగా నిలుస్తూనే కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశించాడు. అతడు ఆశించినట్లే తిరిగివచ్చిన మెస్సీ ఫుట్‌బాల్‌లో అద్భుతాలు సృష్టించాడు. 2021, 2024లో అర్జెంటీనాకు కోపా అమెరికా కప్‌ను అందించిన మెస్సీ.. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిపా ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు అందించి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్పుల్లో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో అగ్రస్థానం సంపాదించాడు. రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ ఈసారి మాత్రం తిరిగి రాడన్న సంగతి అభిమానులకు అర్థమయ్యింది. దీంతో ఈతరం గొప్ప ఆటగాళ్లలో రొనాల్డో మిగిలాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచకప్‌లు ఆడినప్పటికీ, పోర్చుగల్‌కు ఫిఫా టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. తాజాగా మెస్సీ రిటైర్మెంట్ నేపథ్యంలో రొనాల్డో కూడా తన వీడ్కోలుపై కీలక నిర్ణయం తీసుకోనున్నాడనే వార్తలు వస్తున్నాయి. కానీ రొనాల్డో మాత్రం ఇప్పటివరకు తన అంతర్జాతీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.Read: 40 బంతుల్లోనే శతకం.. విండీస్ హిట్టర్ ప్రపంచ రికార్డు -
ఇంటర్నెట్ కట్.. పాక్ నుంచి మరో మీమ్ వైరల్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో.. వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే కొత్తదనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊహించని పరిణామాలు తప్పవు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన అందుకు ఓ ఉదాహరణ.పాకిస్తాన్లో టెక్నాలజీ ప్రయోగం కాస్తా.. పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టే ఘటనగా మారింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కసారిగా తెగిపోవడంతో రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న ఓ ఆటోమేటిక్ కారు అదుపు తప్పి నేరుగా పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయి నవ్వులు పూయిస్తోంది.ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి జర్నలిస్టు మహ్మద్ ఆలిజా కారులో ముందు సీట్లో కూర్చొని దాని ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అబ్బొట్టాబాద్కు చెందిన టెక్నాలజీ ఔత్సాహికుడు ఇహ్సాన్ జాఫర్ రూపొందించిన ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై రిపోర్టు చేసేందుకు తాను అక్కడికి వెళ్లినట్లు ఆలిజా వెల్లడించారు.కారు ముందుకు కదులుతుండగా.. ఒక్కసారిగా రిమోట్ ద్వారా నియంత్రించే స్టీరింగ్ స్పందించడం ఆపేసింది. పరిస్థితిని గమనించిన ఆలిజా వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు వేగంగా ముందుకు దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టింది.కనెక్షన్ కట్.. కారు కంట్రోల్ ఔట్!ఈ కారును ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్ల సాయంతో రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు ఆలిజా తెలిపారు. అయితే ప్రయోగం జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తెగిపోవడంతో కారు నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కారు రద్దీగా ఉండే రోడ్డుపై అదుపు తప్పి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని ఆలిజా పేర్కొన్నారు. అయితే పోలీసులు ఎలా స్పందించారో అనేది మాత్రం ఆయన వివరించలేదు.A Pakistani innovator was demonstrating a driverless car he developed when it lost control and crashed directly into a police vehicle in Islamabad.The car is remotely controlled over the internet through an app or computer.Source: ProPakistani, Khabrain News pic.twitter.com/bUVuesS4cH— Planet Report HQ (@PlanetReportHQ) August 31, 2026ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం వెనుక టెక్నాలజీని రూపొందించిన యువకుడిని విమర్శించడం తన ఉద్దేశం కాదని ఆలిజా స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, ప్రయోగాలు చేయడం అవసరమేనని.. అయితే వాటిని ప్రజల్లోకి తీసుకురాకముందు పూర్తిస్థాయిలో పరీక్షించి భద్రతను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్లపై ఆధారపడే రిమోట్ డ్రైవింగ్ వ్యవస్థల్లో కనెక్షన్ తెగిపోయినప్పుడు వాహనాన్ని సురక్షితంగా నిలిపే ప్రత్యామ్నాయ వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలని ఈ ఘటన స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.పాక్ నుంచి మరో మీమ్!ఈ తరహా ఘటనలను నెట్టింట ఎలా ట్రోలింగ్ చేస్తారో తెలియంది కాదు. గతంలో పాక్ నుంచి ఎన్నో ఇలాంటివి మీమ్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు పాక్ టెక్నాలజీ నాసిరకంగా ఉంటుందని ఎద్దేవా చేస్తుండగా.. మరికొందరు ఈ ఘటనను సరదాగా తీసుకుని మీమ్స్ చేస్తున్నారు. “పోలీసులను చూడగానే పాకిస్థాన్‌లో ఏఐ కూడా కంగారుపడుతుంది” అంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. మొత్తంగా.. ఇంటర్నెట్ కనెక్షన్ పోవడంతో పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టిన ఈ రిమోట్ కారు వీడియో పాకిస్థాన్‌లో నవ్వులు పూయిస్తోంది.ఇదీ చదవండి: నేపాల్ వరదలకు ఆమె కన్నీరే కారణమా? -
మంగాయమ్మ కథ మళ్లీ తెరపైకి.. అసలు కారణమిదే!
లేటు వయసులో కవలలకు జన్మనిచ్చి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంగాయమ్మ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత విషయమే కదా.. ఇప్పుడెందుకు తెర మీదకు వచ్చింది? అని చాలామంది అనుకుంటున్నారు. ఏడేళ్ల తర్వాత ఆమె కథ గుర్తు చేసుకోవడానికి ఓ ప్రత్యేక కారణం లేకపోలేదు. ఆ కవల పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? తల్లి వయసు పెరుగుతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న చర్చే ఇందుకు కారణంగా మారింది.2019లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగాయమ్మ, ఆమె భర్త రాజారావు ఐవీఎఫ్ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. దాదాపు ఆరు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత వారికి సంతానం కలగడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డోనర్ అండాన్ని ఉపయోగించి, రాజారావు స్పెర్మ్‌తో ఐవీఎఫ్ చికిత్స నిర్వహించారు. అనంతరం సిజేరియన్ ద్వారా మంగాయమ్మ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. వారికి రమా తులసి, ఉమా తులసి అని పేర్లు పెట్టారు. అలా వాళ్ల కథ దేశవ్యాప్తంగా ఆ టైంలో వైరల్ అయ్యింది.57 ఏళ్ల నిరీక్షణ తర్వాత..మంగాయమ్మకు 1962లో రాజారావుతో వివాహమైంది. ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూశారు. అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు ఈ దంపతులు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. 2019లో వైద్యుల పర్యవేక్షణలో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోగా.. తొలి ప్రయత్నంలోనే గర్భం దాల్చారు. మెనోపాజ్ దశ దాటిపోవడంతో.. డోనర్ అండాన్ని రాజారావు వీర్యంతో ఫలదీకరించి ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా గర్భధారణ చేశారు.ఆ వయసులో తల్లి కావడం సంచలనం..విదేశాల్లో ఇలాంటివి సహజమే కావొచ్చేమో!. కానీ, మన మంగాయమ్మ 74 ఏళ్ల వయసులో పిల్లలకు జన్మనివ్వడం దేశంలో పెద్ద చర్చకే దారితీసింది. వయసు కారణంగా సహజంగా గర్భం దాల్చే అవకాశం లేకపోవడంతో ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగి చివరకు కవలలు జన్మించారు. దీంతో వృద్ధాప్యంలో మాతృత్వంపై వైద్య, సామాజిక, నైతిక అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఏడాదికే భర్త మృతిఅయితే మంగాయమ్మ కుటుంబంలో ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. కవలలు జన్మించిన మరుసటి ఏడాదే ఆమె భర్త రాజారావు గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 84 ఏళ్లు. దీంతో ఇద్దరు చిన్నారుల బాధ్యత పూర్తిగా మంగాయమ్మపై పడింది. భర్తను కోల్పోయిన తర్వాత కూడా ఆమె తన పిల్లలను చూసుకుంటూ వారి పెంపకాన్ని కొనసాగించారు.74-year-old Andhra woman had twins through IVF😮 pic.twitter.com/WBXKsnc5Wv— Vije (@vijeshetty) August 31, 2026ఇప్పుడు ఏడేళ్ల వయసు..2019లో జన్మించిన రమా తులసి, ఉమా తులసి ప్రస్తుతం ఏడేళ్ల వయసులో ఉన్నారు. మంగాయమ్మ వయసు మాత్రం ఇప్పుడు 80 ఏళ్లకు చేరువైంది. ఈ నేపథ్యంలో తల్లి వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల భవిష్యత్తు, సంరక్షణ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. వాళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారు? అనే ప్రశ్నతో.. ఇదే అంశం పాత కథనాలను, అప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యేలా చేసింది.అప్పట్లోనూ విమర్శలు..వృద్ధాప్యంలో ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనడంపై అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకవైపు ఎన్నో ఏళ్ల కలను దంపతులు నెరవేర్చుకున్నారంటూ పలువురు అభినందించగా.. మరోవైపు తల్లిదండ్రుల అధిక వయసు కారణంగా పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, సంరక్షణ వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తాయి.ఇప్పుడు వయసుపై చర్చ ఎందుకు?భారత్‌లో సహాయక పునరుత్పత్తి సాంకేతికతకు సంబంధించిన నిబంధనలు కూడా ఈ చర్చకు మరో కోణాన్ని తీసుకొచ్చాయి. 2021లో వచ్చిన చట్టం ప్రకారం ఐవీఎఫ్ సేవలకు మహిళల వయసుపై పరిమితులు విధించారు. దీంతో మంగాయమ్మ అంత వయసులో ఐవీఎఫ్ ద్వారా తల్లి అయిన ఘటన అప్పటి నిబంధనల నేపథ్యంలోనూ ప్రత్యేకంగా నిలిచింది.మొత్తంగా.. ఆలస్యంగానైనా తల్లైన మంగాయమ్మ కథ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నది కేవలం ఆమె రికార్డు కోసం కాదు. ఏడేళ్ల వయసుకు చేరుకున్న ఆమె కవలల భవిష్యత్తు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులుగా మారడంపై అప్పట్లో మొదలైన చర్చ మళ్లీ తెరపైకి రావడమే తాజా వైరల్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: ఆ కుటుంబాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు! -
మెటాకు మరమ్మత్తు!
సామాజిక మాధ్యమ టెక్ కంపెనీల్లో అగ్రభాగాన వున్న మెటా సంస్థ తనపై న్యాయ స్థానంలో దాఖలైన కేసుల్లో రాజీకొచ్చి 1,800 కోట్ల డాలర్లు చెల్లించటానికి అంగీకరించటం కీలకమైన పరిణామం. దీంతో గత నెల 18న ఓక్లాండ్ న్యాయస్థానంలో మొదలైన విచారణ అసంపూర్ణంగా నిలిచి పోయినట్టయింది. అదే జరిగుంటే మెటా చీఫ్ మార్క్ జూకర్బర్గ్ కోర్టు బోనెక్కి ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పిల్లలకూ, టీనేజర్లకూ హాని కలిగించే విధానాలను అవలంబిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చేది. న్యాయవాదులు ఒక్కో ఉదంతమే వివరించి, ఆ సంస్థలు పసిమనసుల్ని ఎంత కలుషితం చేశాయో సోదాహరణంగా వివరిస్తూ, నిలదీస్తుంటే ఆయనకు ముచ్చెమటలు పట్టేవి. అమెరికాలోని 48 రాష్ట్రాలు, కొలంబియా జిల్లా, మరో మూడు ప్రాంతాలూ ఈ వ్యాజ్యాలను దాఖలు చేశాయి. ఇంతవరకూ వచ్చిన తీర్పుల్ని చూస్తే కోర్టు వెలుపల కుదిరిన ఈ రాజీ ఒప్పందం పర్యవసానంగా మెటా చెల్లించవలసిన మొత్తం చాలా పెద్దగానే కనబడుతుంది. భద్రత విషయంలో పక్కదోవపట్టించిన కేసులో న్యూమెక్సికో న్యాయస్థానం ఆదేశించిన 37.5 కోట్ల డాలర్ల పరిహారమే ఇంత వరకూ అతి పెద్ద మొత్తం. అయితే దాదాపు లక్షన్నర కోట్ల డాలర్ల మార్కెట్ విలువగల మెటా సంస్థ నిరుటి వార్షికాదాయం 20,097 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఏటా ఈ ఆదాయం 24 శాతం వరకూ పెరుగుతోంది. ఇప్పుడు చెల్లించదల్చుకున్న మొత్తానికి కూడా బోలెడు మెలికలున్నాయి. వచ్చే పదేళ్లకాల వ్యవధిలో ఈ పరిహారం చెల్లిస్తుందట. ఈ వాయిదాలను 15 శాతం డిస్కౌంట్‌తో లెక్కిస్తే ప్రస్తుత విలువ ప్రకారం మెటా సంస్థపై పడే భారం 800 కోట్ల డాలర్లకన్నా తక్కువే ఉంటుందని ఒక ఆర్థిక రంగ నిపుణుడు లెక్కగట్టారు. అత్యధిక జరిమానాలు చెల్లించిన టాప్–20 కంపెనీల జాబితాలో కూడా మెటా ఉండకపోవచ్చన్నది ఆయన విశ్లేషణ. అన్నిటికన్నా వింతైన విషయం–మెటా చెల్లించాల్సిన పరిహారంలో 530 కోట్ల డాలర్ల మొత్తానికి ఉన్న మెలిక. తన ప్రత్యర్థి సంస్థలు టిక్‌టాక్, యూట్యూబ్‌లు సైతం తన మాదిరే టీనేజర్లు యాప్‌లో గడిపే సమయాన్ని పరిమితం చేసుకుంటేనే... అవి కూడా ఇంతే మొత్తాన్ని చెల్లిస్తేనే ఈ పరిహారం బాధ్యత నెరవేరుస్తానని చెప్పడం తోకే కుక్కను ఆడించిన చందంగా కనబడుతోంది.మెటా సంస్థ మాజీ ఉద్యోగులూ, విజిల్బ్లోయర్లూ దానిపై చేసిన ఆరోపణలు చిన్నవేమీ కాదు. వీరు న్యాయస్థానాల్లోనూ, పార్లమెంటరీ కమిటీల ఎదుటా ఎన్నో అంశాలు ఏకరువు పెట్టారు. తన ఉత్పత్తుల్ని సురక్షితంగా మార్చటానికి అంతర్గతంగా అవకాశాలున్నా... వినియోగదారులు అధిక సమయం గడిపేలా చూసేందుకే సంస్థ ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. లాభార్జనే ముఖ్యమనుకున్నదని వివరించారు. ఇన్స్టాగ్రామ్ వల్ల టీనేజ్ బాలికలు తమ శరీరాకృతిపై తీవ్ర ఆందోళన చెందటం, అనోరెక్సియా(ఆకలి చంపుకోవటం) అనే తీవ్ర మానసిక రుగ్మత బారిన పడటం, మానసిక ఒత్తిళ్లకు లోనుకావటం వంటివి సంభవిస్తున్నాయని అంతర్గత సర్వేల్లో బయటపడినా వెల్లడి కానీయలేదన్నది వారి ఆరోపణ. అలాగే 13 యేళ్లలోపు పిల్లల డేటాను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించటమంటే... ఆన్లైన్ వేధింపులకూ, నేరగాళ్లు వలవేయటానికి తోడ్పడే వాతావరణంలోకి వారిని నెట్టడమేనని చెప్పారు. టీనేజర్లు ఏమేరకు హానికర విషయాల ప్రభావంలో పడ్డారన్న గణాంకాలను తగ్గించిచూపే ప్రయత్నాలు జరిగాయని సాక్ష్యాధారాలు సమర్పించారు. సంస్థ తీసుకునే భద్రతా చర్యలు అతి స్వల్పమని తెలిపారు. వీటిని ఎత్తిచూపిన సిబ్బందిపై వేధింపులకూ, బెదిరింపులకూ పాల్పడ్డారని కూడా చెప్పారు. ఇవన్నీ న్యాయస్థానంలో నిగ్గుదేలితే సామాజిక మాధ్యమాలు సక్రమంగా వ్యవహరించకతప్పని స్థితి ఏర్పడేది. అయితే ఈ రాజీ ఒప్పందం పిల్లల ఆన్లైన్ భద్రతకు సంబంధించి సరైన చట్టం ఏర్పడని మనలాంటి దేశాలకు నమూనాగా ఉపయోగపడుతుంది. తగిన కట్టుదిట్టాలతో మెరుగైన చట్టం రూపొందించటానికి పనికొస్తుంది. ఇప్పుడు మెటా విషయంలో కుదిరిన ఒప్పందం సామాజిక మాధ్యమాల చరిత్రలో తొలి అడుగే. కాలక్రమంలో ఇది మరింత పదునుదేరితే వాటి ఆగడాలకు కాస్తయినా అడ్డుకట్ట పడుతుంది. -
‘మోదీజీ.. నా జీవితాన్ని నరకం చేశారు’
జంతర్ మంతర్ నిరసనల సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తీవ్ర దుమారం రేగడంతో ఆమె క్షమాపణలు చెప్పడం, బాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేయడం.. ఆయన క్షమించేయడం.. పోలీసులు ఉండదని చెప్పడంతో ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోయిందని అంతా భావించారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో నెట్టింటకు చేరింది.తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. ‘మోదీజీ.. మీరు నా జీవితాన్ని నరకం చేశారు’ అంటూ ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఘటన తర్వాత తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పినట్లు ఉంది. ‘‘మీరు నన్ను ఎంతగా వెంటాడారంటే.. ప్రతిచోటా వేధింపులకు గురయ్యాను. ఎక్కడికెళ్లినా ముఖం దాచుకోవాల్సి వస్తోంది’’ అని ఆమె అందులో చెప్పినట్లు ఉంది. ఈసారి తాను వెనక్కి తగ్గబోనని, కోల్పోవడానికి తన వద్ద ఏమీ లేదని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో స్పష్టత లేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ దీనిని తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాల్లో షేర్ చేశాయి. బాలికను బెదిరించి, క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేశారని ఇరు పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు.. బాలిక తరఫు న్యాయవాది మాత్రం ఆ వీడియో ఏఐ జనరేటెడ్ కాదని, అందులో ఉందని ఆమెనేనని వ్యాఖ్యానించారు. కానీ, ఆ వీడియో ఎప్పుడు తీశారనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.జులై 23న జంతర్ మంతర్ నీట్ నిరసనల సమయంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సదరు బాలిక తిట్టిపోసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చాందెల్ ఫిర్యాదు చేయడంతో జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం కేసును దర్యాప్తు కోసం ఢిల్లీకి బదిలీ చేశారు. తొలుత ఆమె వయసును పోలీసులు ఎఫ్ఐఆర్లో తప్పుగా పేర్కొన్నారు. అయితే.. తన వయసు 15 ఏళ్లేనని.. కొందరు రెచ్చగొట్టి అలా మాట్లాడించారని ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది.మకాం మార్చేసి..జంతర్ మంతర్ ఘటన వివాదం, కేసు భయంతో ఆమె కుటుంబం ఆందోళనకు గురైంది. తమకు వేధింపులు వస్తున్నాయని, తన బిడ్డ చేసిన తప్పును పెద్ద మనుసుతో మన్నించాలని తల్లి, ప్రధాని మోదీని వేడుకుంది. ఆ తర్వాత నోయిడాలోని నివాసాన్ని ఖాళీ చేసి ప్రస్తుతం హరియాణాలో తల్లిదండ్రులతో ఉంటున్నట్లు తెలిసింది.‘యువతకు మరో అవకాశం ఇవ్వాలి’ఈ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ ఘటనలో పాల్గొన్న యువతపై కఠిన చర్యలకు బదులుగా వారిని క్షమించి మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. దీంతో వివాదం క్రమంగా సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో ఈ వ్యవహారం మళ్లీ రాజకీయ చర్చకు వచ్చింది. ఇదీ చదవండి: డింపుల్.. మామూలు దూకుడు కాదది! -
నేపాల్: లక్కీ హౌస్ వెనక.. అసలు కథ ఇదే!
నేపాల్ వరద బీభత్సంలో.. ఓ ఆకుపచ్చ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చుట్టూ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నా.. ఈ ఇల్లు మాత్రం మొండిగా నిలబడింది. ఇంటి చుట్టూ నీరు, బురద, భారీ బండరాళ్లు దూసుకొస్తున్నా.. బాల్కనీలో చిక్కుకున్న కుటుంబం సైతం సురక్షితంగా బయటపడింది. దీంతో ‘ఈ ఇంటిని కట్టిన ఇంజనీర్ ఎవరు? ఇంతటి వరదను ఇది ఎలా తట్టుకుంది?’ అనే చర్చ మొదలైంది.నేపాల్‌లోని హిమాలయ లోయల్లో ఆగస్టు 26న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ నీటితో పాటు బురద, బండరాళ్లు, చెట్ల దుంగలు ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి. మార్గంలో కనిపించిన ఇళ్లు, వంతెనలు, రహదారులను ధ్వంసం చేశాయి. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోల్లో మాత్రం ఓ ఆకుపచ్చ ఇల్లు ప్రత్యేకంగా కనిపించింది. వరద నీరు ఆ ఇంటిని దాదాపు చుట్టుముట్టింది. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోయింది. అయినప్పటికీ ఇంటి నిర్మాణం కూలిపోలేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బాల్కనీలోకి చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. చివరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అసలు కారణం ఇదే.. ఈ ఇల్లు అక్కడి ఇతర నిర్మాణాలతో పోలిస్తే భిన్నంగా ఉండటమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో అనేక ఇళ్లు రాళ్లతో నిర్మిస్తారు. ఇవి ఇంటిపై పడే నిలువు బరువును తట్టుకోగలిగినా.. వరద నీరు అడ్డంగా ఢీకొన్నప్పుడు ఏర్పడే భారీ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. కానీ వైరల్‌గా మారిన ఇంటికి రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC) ఫ్రేమ్ ఉన్నట్లు నిర్మాణ నిపుణుల విశ్లేషణలో తేలింది. పిల్లర్లు, బీములు, పునాదులను స్టీల్ రాడ్లతో అనుసంధానించడంతో మొత్తం నిర్మాణం ఒక బలమైన ఫ్రేమ్‌లా పనిచేసింది. వరద నీరు, బురద, రాళ్లు ఢీకొన్నప్పుడు ఏర్పడిన అడ్డదిశ ఒత్తిడిని ఈ ఫ్రేమ్ కొంత మేర గ్రహించి పునాది వైపు మళ్లించింది.Good News,Dear citizens of world,All those were praying and worried about what happened to people in the Green House during the catastrophic Nepal FloodsThe family and house survived the ordeal. pic.twitter.com/iElo4qXvBL— Woke Eminent (@WokePandemic) August 28, 2026ఇంజినీరింగ్ ఒక్కటే కాదు.. అదృష్టం కూడా!అయితే ఇంటి నిర్మాణమే దాన్ని కాపాడిన ఏకైక కారణం కాదు. వరద ప్రవాహం నేరుగా ఇంటిని ఢీకొనకపోవడం కూడా అత్యంత కీలకంగా మారింది. భారీ బండరాళ్లు, చెట్లు, మట్టి కలిసిన ప్రవాహంలో అత్యంత బరువైన శిథిలాలు సాధారణంగా ప్రధాన ప్రవాహ మార్గంలోనే దూసుకుపోతాయి. ఈ ఇల్లు ఆ ప్రధాన ప్రవాహ మార్గానికి కొద్దిగా పక్కన, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంది. దీంతో వరద శక్తిలో కొంత భాగం ఇంటిని నేరుగా ఢీకొట్టకుండా ఇరువైపులా విడిపోయి వెళ్లింది.ఇంటి ఆకారం కూడా ప్లస్ పాయింట్ఇంటి కాంపాక్ట్ ఆకారం కూడా వరద ప్రవాహాన్ని మళ్లించడంలో సహాయపడినట్లు నిపుణులు చెబుతున్నారు. నీరు నేరుగా ఇంటి గోడను ఢీకొని అక్కడే నిలిచిపోకుండా.. ఇరువైపులా ప్రవహించే అవకాశం ఏర్పడింది. వరదతో వచ్చిన బురద ఇంటి చుట్టూ పేరుకుపోవడం కూడా మరో రక్షణగా మారింది. అది సహజమైన ర్యాంప్‌లా ఏర్పడి.. తర్వాత వచ్చిన ప్రవాహాల దిశను కొంత మార్చినట్లు నిపుణుల విశ్లేషణ.‘ఇంజినీర్ ఎవరు?’ అనే ప్రశ్నకు..సోషల్ మీడియాలో ఈ ఇల్లు వైరల్ కావడంతో ‘ఇంత బలంగా కట్టిన ఇంజినీర్ ఎవరు?, ఏ సిమెంట్ వాడారు’ అనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు.. బిహార్‌లో చిన్నపాటి వరదలకు కూడా బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, ఈ మధ్య వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ వేలు కూడా కొట్టుకుపోతుండడంతో .. ఆ ఇంజినీర్ సాబ్‌ను ఇక్కడికి రప్పించాలనే చర్చా సరదాగా నడిచింది. అయితే ఆ ఇంజనీర్ ఎవరు? అనే విషయాన్ని త్వరలో చెబుతామని ఆ కుటుంబం అంటోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. తమను ఇబ్బంది పెట్టొద్దని స్థానిక మీడియాను ఆ కుటుంబం వేడుకుంది. ఇటు నెట్టింట కూడా.. దాని బలమైన పునాదే అంత పెద్ద వరదను తట్టుకుని నిలబడిందనే దానిపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.ప్రతి ఇల్లు ఇలా నిలబడుతుందా?కచ్చితంగా కాదు. ఇదే తరహా నిర్మాణం ఉన్న ప్రతి ఇల్లు ఇలాంటి విపత్తును తట్టుకుంటుందని చెప్పలేం. వరద వేగం, నీటి పరిమాణం, బండరాళ్ల దెబ్బ, పునాది బలం, నిర్మాణ నాణ్యత, అది కట్టిన ప్లేస్ కూడా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఆ ఇల్లు కేవలం ‘అదృష్టవంతమైన ఇల్లు’ కాదు.. సరైన నిర్మాణ విధానం, అనుకూలమైన స్థానం రెండూ కలిసి పనిచేసిన అరుదైన ఉదాహరణ. చుట్టూ విధ్వంసం జరిగినా.. ఆ చిన్న ఇల్లు మాత్రం నిలబడటం ఇప్పుడు నేపాల్ వరదల విషాదంలో ఆశ్చర్యపరిచే దృశ్యంగా మిగిలిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ఇల్లు.. పర్యాటక ప్రదేశంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇదీ చదవండి: అటు అమెరికాలోనూ పెను విధ్వంసం! -
నవ్వుతో నెట్టింట గెలిచాడు! ఎన్నో మీమ్స్, రీల్స్‌కి కేరాఫ్ అడ్రస్!!
ఆ నవ్వు ప్రపంచాన్నే చుట్టేసింది.. ఎన్నో మీమ్స్, రీల్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయింది.. కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.. కానీ.. ఆ నవ్వు వెనుక ఓ బతుకు పోరాటం ఉంది.. పేదరికం కారణంగా మూడో తరగతితోనే చదువుకు దూరమైన ఓ బాలుడి కథ ఉంది.మొబైల్ లేకున్నా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ.. ప్రస్తుతం అరుణ్ షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ, సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. నటనపై ఆసక్తితో, తన కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతున్నాడు. 15 నుంచి 20 నిమిషాల నిడివితో కూడిన 20 షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. సొంత మొబైల్ లేకున్నప్పటికీ ఇతరుల మొబైల్, కెమెరాలు వాడి తన, ఇతరుల చానళ్లలో షార్ట్ ఫిల్మ్స్ పోస్ట్ చేస్తున్నాడు. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నానని అరుణ్‌కుమార్ ‘సాక్షి’తో తెలిపాడు.అయితే, అదే నవ్వు..అతడి జీవితానికి కొత్త దారిని చూపించింది. లారీ క్లీనర్‌గా చిరుజీవితం గడుపుతున్న బాలుడిని సోషల్ మీడియా స్టార్‌గా చేసింది. మధ్యలో ఆగిపోయిన చదువును మళ్లీ కొనసాగించాలనే అతడి ఆశకు ఊపిరిపోసింది. ఆ నిష్కల్మషమైన నవ్వునే తన కలలకు మెట్లుగా చేసుకుని ముందుకెళ్లేలా చేసింది. అతడే అరుణ్‌కుమార్. రీల్స్ చివర్లో అతడి నవ్వును చూస్తే చాలు.. మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం గ్రామానికి చెందిన బచ్చల లక్ష్మీసమ్మయ్య, రాజేశ్వరిల కుమారుడు అరుణ్‌కుమార్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మూడో తరగతితోనే ఆపేశాడు. చదువుకోవాలనే ఆశ ఉన్నా, కుటుంబ పరిస్థితులు అతన్ని కూలి పనుల వైపు నడిపించాయి. అదే గ్రామానికి చెందిన తన బావ నెహ్రూ లారీపై క్లీనర్‌గా పని చేశాడు. ఆ సమయంలో భూపాలపల్లిలో లారీలో నుంచి బొగ్గు అన్లోడ్ చేసే క్రమంలో టీ తాగుతుండగా నెహ్రూ వేసిన ఓ జోక్‌కు అరుణ్‌కుమార్ తనివితీరా నవ్వాడు. ఆ నిష్కల్మషమైన, గుండెల్లోంచి వచ్చిన నవ్వు నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుందంటే, ఆ వీడియో కొద్ది కాలంలోనే వైరల్ అయిపోయింది. మీమ్స్, రీల్స్‌లో ఎక్కడ చూసినా అరుణ్ నవ్వే దర్శనమివ్వడం మొదలైంది. తన నవ్వు తెచ్చిన గుర్తింపు అరుణ్ జీవితానికి కొత్త దిశను చూపించింది. బావ నెహ్రూ ప్రోత్సాహంతో చదువుకోవాలనే తన పాత కలని గుర్తుచేసుకున్నాడు. ఓపెన్ స్కూలింగ్ ద్వారా పరీక్షలు రాసి, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు. - భూపాలపల్లి -
చెస్ ఆడాలని చాలెంజ్.. ‘సారీ బ్రో రిటైరయ్యా’
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు 2024లో క్లాసికల్ వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన తర్వాత మరో టైటిల్ సాధించలేకపోయాడు. ఆ తర్వాత నుంచి గుకేశ్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గుకేశ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర స్టోరీని పంచుకున్నాడు. ‘ఒక క్రిటిక్ తనతో చాట్‌లో భాగంగా రిటైర్ అవ్వమని సలహా ఇచ్చాడు. ఇప్పుడు అదే క్రిటిక్ తనతో చెస్ ఆడాలని చాలెంజ్ చేశాడు. కానీ నేను తెలివిగా అతడికి సారీ, నేను రిటైర్ అయ్యా కదా బ్రో’ అని సమాధానం ఇచ్చాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గుకేశ్ ఇన్‌స్టా స్టోరీ ట్రెండింగ్‌గా మారిపోయింది. ఇక గుకేశ్ ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్‌లో చెస్ ఒలింపియాడ్ 2026లో బిజీగా గడుపుతున్నాడు.ఇక ఏడాది వ్యవధిలో ఫామ్‌లేమితో గుకేశ్ 73 రేటింగ్ పాయింట్లు కోల్పోయి ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌లో 32వ స్థానంలో కొనసాగుతున్నాడు. గుకేశ్ ఖాతాలో 2,703 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. గత 10 గేముల్లో గుకేశ్ ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించడం విశేషం.Read: యూఎస్ ఓపెన్ బరిలో అల్కరాజ్.. టైటిల్ నిలబెట్టుకునేనా? -
అనురాగ బంధానికి అడ్డంకులు లేవని..!
సాక్షి, హైదరాబాద్: ఆత్మీయ బంధానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించారు ఓ మహిళా ఉద్యోగి. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వైష్ణవి.. చేతులు పని చేయకపోయినా రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సహోద్యోగులకు కాలి వేళ్లతోనే ఇలా రాఖీ కట్టారు. గతంలో తెలంగాణ అవతరణోత్సవాల సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా చిత్రపటాన్ని కాలివేళ్లతో చిత్రీకరించి బహూకరించారు. వైష్ణవిని ఆయన ప్రశంసించి ఆశీర్వదించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పలు సందర్భాల్లో వైష్టవి పట్టుదలను సోషల్ మీడియా వేదికగానూ ప్రస్తావించారు.ఇదీ చదవండి: తండ్రిని కాపాడిన 10 ఏళ్ల కూతురు! -
నేపాల్ అంతటా హృదయవిదారక దృశ్యాలే!
నేపాల్‌ను భీకర వరద కుదిపేసిన నాలుగు రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి హృదయవిదారకంగానే ఉంది. ఇంకా రెండు వేల మందికి పైగా ఆచూకీ తెలియరావాల్సి ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి. నేపాల్ ఆకస్మిక వరదలు మహా విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు చేరుతున్నాయి. ఒక్క చిత్వన్లోనే శనివారం ఉదయానికి 233 మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. నౌవల్పరాసి తూర్పులో మరో 158, గోర్ఖాలో 48, నౌవల్పరాసి పశ్చిమలో 47 మృతదేహాలు వెలుగుచూశాయి. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో స్థలం లేక.. నేపాల్-టిబెట్ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో మార్చురీల సామర్థ్యం 350 మృతదేహాలుగా తెలుస్తోంది. ఈ తరుణంలో సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు భారత్పూర్ సహా పలు ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలను(బాడీ మేనేజ్మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల టెంట్ల కింద కూడా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిటీ హాళ్లు, పోలీస్ ప్రాంగణాలు, ఇతర భవనాలను తాత్కాలిక మార్చురీలుగా మార్చేసినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజీ కొరత, హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు మృతదేహాలను భద్రపరచడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారాయి. ఎవరో గుర్తించడమే కష్టం..చాలా మృతదేహాలు బురద, శిథిలాల్లో తీవ్రంగా దెబ్బతినడంతో ముఖాలను చూసి గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో అధికారులు మృతదేహాల ఫొటోలు తీస్తూ, శరీరంపై ఉన్న గుర్తులు, దుస్తులు, టాటూలు, ఆభరణాలు, వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. అవసరమైన చోట డీఎన్ఏ నమూనాలను కూడా సేకరించి కుటుంబ సభ్యులతో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు.బంధువుల కోసం ఆర్తనాదాలు..కళ్లెదుటే అయినవాళ్లు కొట్టుకుపోతుంటే.. నిస్సహాయంగా చూస్తున్న ఉండిపోయిన వాళ్లు అధికారులను బతిమాలుకుంటున్నారు. వాళ్ల ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో వందలాది మంది ఇంకా గల్లంతై ఉండగా, మొత్తం విపత్తులో 2,000కుపైగా మంది ఆచూకీ తెలియడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. తాత్కాలిక బాడీ-మేనేజ్మెంట్ సెంటర్ల వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఫొటోలు, మొబైల్ చిత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. మృతదేహాలపైనా దోపిడీ..ఈ విపత్తు వేళ కొందరి అమానవీయ ప్రవర్తన కూడా వెలుగులోకి వచ్చింది. వరదలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన నేపాల్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయినా ఆ తతంగం ఆగడం లేదని తెలుస్తోంది. మరోవైపు నదుల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలతో పాటు వస్తువులు, బ్యాగులు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నగదు, నగల కోసం కొందరు పడవల్లో పరుగులు తీస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎటు చూసినా విషాదం, ఆర్తనాదాలు, మృతదేహాలే కనిపిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: ఆ సరస్సు నీటి రంగు మారింది.. చైనా వార్నింగ్ -
లంచగొండి ఆఫీసర్‌కు చుక్కలు చూపించిన జనం!
దేశవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైడ్‌కు వెళ్లిన అధికారి లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ జనం భలే శిక్ష విధించారు. అక్కడ తప్పు జరగలేదని ఆ అధికారి బుకాయించే యత్నం చేయగా.. అది కరెక్ట్ అయితే నిరూపించమంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆ అధికారి నీళ్లు మింగాల్సి వచ్చింది. తుకారాం ముండే ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ విషయంలో ఆయన నేతృత్వంలో జరుగుతున్న సోదాలు.. తీసుకుంటున్న చర్యలు.. కంట్రోల్లో ఉండాలంటూ కోర్టులు ఆదేశిస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరూ.. ఇవన్నీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నవే. అలాంటి రాష్ట్రంలోనే తాజాగా జరిగిన ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఛత్రపతి సంభాజీనగర్‌లో వైజాపూర్ ఏరియాలో ఓ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారికి చేదు అనుభవం ఎదురైంది. తనిఖీల్లో పట్టుబడిన ఎక్స్పైరీ(కాలం చెల్లినవి) బిస్కెట్లను అధికారితోనే తినిపించేందుకు స్థానికులు ప్రయత్నించడం నెట్టింట వైరల్ అయ్యింది. ఓ దుకాణదారుడిని కాపాడే క్రమంలో ఆయన లంచం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జనం ఈ పని చేయబోయారు. స్థానికంగా ఓ దుకాణంలో తినుబండారాలు తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌డీఏ అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నేపథ్యంలో ఓ అధికారి దుకాణాన్ని తనిఖీ చేయడానికి వెళ్లగా.. అప్పటికే చిన్నారి తిన్నట్లు చెబుతున్న స్నాక్ మిక్స్‌ను దుకాణం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.CHHATRAPATI SAMBHAJINAGAR — An FDA officer was cornered and forcibly fed expired biscuits by an angry crowd in the Vaijapur area of Maharashtra. pic.twitter.com/Pq5rUfBenO— Truth India Live (@Truthindialive) August 29, 2026అయితే తనిఖీల్లో కొన్ని ఎక్స్పైరీ బిస్కెట్ ప్యాకెట్లు బయటపడ్డాయట. వాటిని తమ వాహనంలో పెట్టిన అధికారులు.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జనం.. ఆ అధికారి చుట్టూ చేరారు. దుకాణానికి సీజ్ వేయకుండా ఎందుకు వెళ్లిపోతున్నారంటూ నిలదీశారు. దానికి ఆ అధికారి తనిఖీల్లో ‘అంతా సవ్యం’గానే ఉందని చెప్పాడు. దీంతో వాహనం నుంచి ఆ బిస్కెట్లను తీసుకున్న స్థానికులు ‘బిస్కెట్లు సురక్షితమే అయితే మీరే తినండి’ అంటూ నోట్లో కుక్కేందుకు ప్రయత్నించారు. దాంతో నమల్లేక.. మింగలేక.. కక్కలేక ఆ అధికారి పడ్డ అవస్థలు పడ్డ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం FDA కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలో ఆహార భద్రతపై భారీ స్థాయిలో తనిఖీలు, దాడులు జరుగుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, డెయిరీలు, క్యాంటీన్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు సహా వివిధ ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్సులు సస్పెండ్ చేయడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో ఆహార భద్రతను కాపాడాల్సిన అధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం, అదే సమయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికారిని అవమానించే స్థాయికి వెళ్లడం కలకలం రేపింది.ఇదీ చదవండి: ఆ పుస్తకం చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? -
జెన్–జీ.. దగ్గరవడంలో లేజీ..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర నేతలకు కొత్త సమస్య వచ్చి పడింది. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జెన్–జీ ఆందోళనలు తదనంతర పరిణామాల నేపథ్యంలో నవ యువతరానికి దగ్గరయ్యేది ఎలా అన్న మీమాంస పట్టిపీడిస్తోందట. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పార్టీ శాఖలు, సోషల్ మీడియా టీమ్‌లు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. జెన్–జీకి దగ్గర కావాలని, నేటి తరంతో మమేకం కావాలని ప్రధాని మోదీ కూడా కమలం నేతలకు సూచించారు. అయితే బీజేపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాఖలు మాత్రం వెనుకబడ్డాయని పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.తెలంగాణ బీజేపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌ను ఆ పార్టీ అభిమానులే వ్యంగ్యోక్తులు, మీమ్లతో ట్రోలింగ్ చేసే పరిస్థితి కూడా ఎదురవుతోంది. బీజేపీ నేషనల్ టీమ్, ఇతర రాష్ట్రాల సోషల్ బృందాలతో పోల్చుతూ రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులను ఉద్దేశించి హిందుత్వవాదుల వ్యంగ్యబాణాలు సంధిస్తుండడంలో అవాక్కు కావడం నేతల పనైంది.‘మీకు చేతకాకపోతే చెప్పండి... మేమైనా మీకు కంటెంట్ ఇస్తాం’అన్నంత వరకూ విమర్శలు వెళ్లాయి. వివిధ రాష్ట్రాల బీజేపీ అకౌంట్స్ రాహుల్‌గాంధీని, ‘దిమాగీ నక్సల్స్’లక్ష్యంగా అగ్రెసివ్ పోస్టులు పెడుతూ సినిమా డైలాగులు, సినిమా సీన్లు, ఏఐ జనరేటెడ్ కంటెంట్ పెట్టి రచ్చరచ్చ చేస్తుంటే, రెండు రాష్ట్రాల వారు చేష్టలుడిగి మిన్నకుండిపోతున్నారనే దాడి తీవ్రస్థాయికి చేరుకుంటోంది.దిద్దుబాటు చర్యల్లో రాష్ట్ర నేతలుతెలంగాణ బీజేపీ సోషల్ మీడియా టీమ్ మాత్రం బాగానే పోస్టింగ్‌లు పెడుతున్నామనే అభిప్రాయంతో ఉందట. అయితే పార్టీకి కాకుండా కొందరు లీడర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ టీమ్‌పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా యువత, విద్యార్థులకు దగ్గర అయ్యేందుకు కార్యాచరణ ప్రారంభించారు. పార్టీ అధ్యక్షుడు మొదలు వివిధ స్థాయిల నేతలు, అనుబంధ విభాగాలు కాలేజీ క్యాంపస్‌ల సందర్శన మొదలైంది.ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై పార్టీపరంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో యువ క్రీడాకారులు, విద్యార్థులు ఖేలో ఇండియాకు సంబంధించిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. దీంతో దిద్దుబాటులో రాష్ట్రపార్టీ నిమగ్నమైందని, వివిధ అంశాలపై చురుగ్గా వ్యవహరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు స్పష్టమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లోని సీన్‌పై మీమ్స్ వైరల్
ప్రేక్షకులకు సినిమాల్లోని కొన్ని సీన్లు అలరించడమే కాదు.. కొన్ని మీమ్ మెటీరియల్‌గా కూడా మారుతుంటాయి. తాజాగా సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ప్రతి నెల 27వ తేదీ రాగానే సూర్య పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు.27న విశ్వనాథ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటూ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సూర్య పోషించిన సంజయ్ విశ్వనాథ్ పాత్రకు సంబంధించిన ఓ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి నెల 27న వ్యక్తిగత కారణాలతో అతడు విదేశాలకు వెళ్తుంటాడు. దీంతో ఆ తేదీరాగానే సంజయ్ విశ్వనాథ్ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటూ అభిమానులు సరదాగా మీమ్స్ పెడుతున్నారు. గతంలో దృశ్యం2’ సినిమాలోనివి కూడా..మొన్నటి వరకు వెంకటేశ్ నటించిన ‘దృశ్యం2’ సినిమాలోని కొన్ని తేదీలు కూడా ఇలాగే వైరలయ్యాయి. ఆగస్టు 3 అంటే రాంబాబు విజయనగరం నుంచి వచ్చిన రోజు అని ఇలా ఆగస్టు నెలకు సంబంధించిన తేదీలు మీమ్‌గా మార్చి సోషల్‌మీడియాలో పోస్ట్చేసేవారు.కాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు రాబెట్టింది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, భవానీ శ్రీ, నాజర్, ఆది, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
జార్జ్‌కుట్టి.. ఈసారి అయినా లొంగిపోవయ్యా..!
2013లో వచ్చిన చిత్రం ‘దృశ్యం’. అప్పటి నుంచి ప్రారంభమైన దృశ్యం ఫ్రాంచైజీ మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సీక్వెల్స్ తీస్తూనే వచ్చారు. ఇటీవలే దృశ్యం4’ కూడా ఉంటుందని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ అప్డేట్ ఇచ్చారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో మరోసారి జార్ట్కుట్టి కుటుంబం, వరుణ్ హత్య కేసుపై మీమ్స్, జోకులు వైరల్ అవుతున్నాయి. ( ఇదీ చదవండి: దృశ్యం ఫ్రాంచైజీకి మరో సీక్వెల్ )ఎలా ట్రోల్ చేస్తున్నారంటే..జార్జ్‌కుట్టిగా మోహన్‌లాల్ మరోసారి తెరపై కనిపిస్తుండడంపై అభిమానులు ఆసక్తిని వ్యక్తం చేస్తూనే.. ‘ఇక ఈ కేసుకు ముగింపు పలకాలంటే అందరినీ అరెస్టు చేయడమే మార్గం’ అని సరదగా కామెంట్లు చేస్తున్నారు.‘వరుణ్ అస్థిపంజరం కూడా జార్జ్‌కుట్టి కుటుంబాన్ని ప్రశ్నిస్తుందేమో’ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. ‘ఆ వ్యక్తిని చంపింది నేనే.. నన్ను అరెస్టు చేయండి’ అంటూ మరో వ్యక్తి కేరళ పోలీసులను, మోహన్‌లాల్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. మరి కొందరు ఈ ఫ్రాంచైజ్‌ను ‘ప్రధానమంత్రి అజయ్ దేవ్‌గణ్ రోజ్గర్ యోజన’ అంటూ సరదాగా ట్రోల్ చేశారు.దృశ్యం4 కథేంటి..మోహన్‌లాల్ జార్జ్‌కుట్టిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’ 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘దృశ్యం2’, ‘దృశ్యం3’ వరకు కొత్త కొత్త అంశాలతో కథను కొనసాగించారు. ఇప్పుడు ‘దృశ్యం4’లో ఈసారి జార్జ్‌కుట్టిని పోలీసులు ఎలా ఎదుర్కొన్నారు? అతడి కుటుంబం ఎలాంటి సమస్యలో చిక్కుకోనుంది.? అనే కోణంలో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడొస్తుందోనని ఈ ప్రాంచేజీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘జార్జ్‌కుట్టి.. ఇక చాలించు.. ఈసారి అయినా లొంగిపో’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.ఎలా మొదలైందంటే..‘దృశ్యం’ సినిమాలో జార్జ్‌కుట్టి, అతడి భార్య రాణి, ఇద్దరు కుమార్తెల జీవితాల్లోకి వరుణ్ ప్రభాకర్ మరణం అనుకోని సమస్యను తీసుకొస్తుంది. జార్జ్‌కుట్టి పోలీసులకు చిక్కకుండా పక్కా స్కెచ్ వేస్తాడు. పోలీసు అధికారి కుమారుడు వరుణ్ కావడంతో అప్పటి నుంచి ఆ కేసు అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుంది. -
జుట్టు పట్టుకుని లాగి.. చెవిపోగులు చోరీ!
నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకుని బయటకు లాగిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె చెవులకు ఉన్న బంగారు పోగులను చోరీ చేశారు. దీనికి సంబంధించిన 41 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. నరాయణి నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహాన్ని 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరి గుర్తించారు. చెక్క దుంగల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు లాగిన వారు.. జుట్టు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె రెండు చెవులకు ఉన్న పోగులను తొలగించి పక్కన పెట్టుకున్నారు. చుట్టూ ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు.ఈ వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన చిత్వాన్ పోలీసులు నిందితులను గుర్తించారు. గురువారం భరత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని పోఖరా బస్పార్క్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల పట్ల దోపిడీకి పాల్పడటం, అమానవీయంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.మరోవైపు నేపాల్–టిబెట్ సరిహద్దులో వరదలు, కొండచరియలు బీభత్సం తీవ్ర విషాదం మిగిల్చాయి . ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 500 మంది మృతి చెందగా.. 1,400 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. భారీ బురద, కొండచరియల కారణంగా పలు గ్రామాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రంప్-కిమ్ భేటీ ఇప్పుడు ఎంతో అవసరం! -
రీల్స్‌తో రీచ్
సోషల్ మీడియా రీల్స్. ప్రస్తుతం దేశాన్ని కమ్మేస్తున్న మేనియా ఇదే. కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్.. ఫోన్లో రీల్స్‌ను స్క్రోల్ చేయడం సర్వ సాధారణ మైపోయింది. భారతీయ మార్కెట్‌ను సైతం రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్లోకి వస్తున్న కొత్త ఉత్పత్తుల సమాచారం తెలుసుకునేందుకు.. వివిధ ఉత్పత్తులతో సరిపోల్చేందుకు.. ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలో నిర్ణయించుకునేందుకు కూడా సగటు భారతీయులు రీల్స్‌పైనే ఆధార పడుతున్నారు. ప్రధానంగా జెన్‌జీ తరం సోషల్ మీడియా రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాలను సైతం రీల్స్ మేనియా ప్రభావితం చేస్తోందని మెటా తాజా సర్వే వెల్లడించింది. ప్రధానంగా కాస్మొటిక్స్, ఫ్యాషన్, ఫిట్నెస్, క్రీడలు, ఇతర యాక్ససరీస్ ఉత్పత్తుల విక్రయాలను సోషల్ మీడియా రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. రీల్స్ చూడాలి.. తరువాతే కొనాలి⇒ జెన్‌జీ తరంలో 81 శాతం మంది కొత్త ఉత్పత్తుల గురించి రీల్స్ ద్వారానే తెలుసుకుంటామన్నారు. వాటిలో 66 శాతం ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకుంటున్నామని.. 47 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ⇒ 76 శాతం మంది మహిళలు తమ కొనుగోలు నిర్ణయాలను రీల్స్ ప్రభావితం చేస్తున్నాయన్నారు. ⇒ గ్రామీణ ప్రాంతాల ఖాతాదారుల్లో 76 శాతం మంది ఆర్థిక విషయాలపై సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు రీల్స్‌పై ఆధారపడుతున్నారు.‘మెటా’ ఏం తేల్చిందంటే..⇒ ‘మెటా ఇంపోసోస్ –2026’ పేరిట విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కసారైన రీల్స్ చూడాల్సిందే⇒ భారత్‌లో మెటా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఖాతాదారుల్లో 90 శాతం మంది రీల్స్‌ను చూస్తున్నారు. అతి తక్కువ నిడివి గల వీడియోలను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.⇒ జెన్‌జీ తరానికి చెందిన వారిలో 98 శాతం మంది తాము రోజుకు ఒక్కసారైనా రీల్స్ చూస్తున్నట్టు చెప్పారు. ⇒ మెటా ఖాతాదారులైన మహిళల్లో 96 శాతం మంది రోజుకు ఒక్కసారైన రీల్స్ చూస్తామన్నారు.⇒ అధిక ఆదాయం కలిగిన వర్గాల్లో 88 శాతం మంది తాము రోజుకు ఒక్కసారైనా రీల్స్ చూస్తామన్నారు. -
చావు తప్పి కన్ను లొట్టపోవడమంటే ఇదే.. మహిళకు వింత అనుభవం
ముంబైలో ఓ యువతి పదో అంతస్తు నుంచి దూకిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ‘చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు’ అన్న చందంగా.. నేలను తాకాల్సిన ఆమె భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. ‘బతికితే బలుసాకు తినవచ్చు’ అన్న సామెతను గుర్తు చేసేలా.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆమెకు ఆ చెట్టే ప్రాణరక్షకంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ముంబైలోని భాండూప్ వెస్ట్ తుల్షెట్పాడ ప్రాంతంలోని సన్‌షైన్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతీక్ష హివ్రాలే(26) సన్‌షైన్ బిల్డింగ్‌లోని పదో అంతస్తు ఫ్లాట్ కిటికీ నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. పదో అంతస్తు నుంచి కిందకు దూకిన ఆమె నేరుగా నేలను తాకకుండా.. భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడింది. దీంతో చెట్టుపై సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయి వేలాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితిని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.A woman fell from the 10th floor of a residential building at #Bhandup , #Mumbai, but was miraculously saved as she stuck to a tree. Later on, the fire brigade rescued her safely and had her admitted to a hospital. pic.twitter.com/WdhAiGj80o— Hiren Antani (@HirenAntani) August 26, 2026సమాచారం అందిన వెంటనే ఉదయం 9.32 గంటలకు ముంబై ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. హుక్ ల్యాడర్ సహాయంతో చెట్టు వద్దకు చేరుకున్న సిబ్బంది.. ఎంతో జాగ్రత్తగా ప్రతీక్షను కిందకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె ఎడమ కాలికి గాయం అయినట్లు తేలింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం సియాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.చదవండి: నేపాల్‌కు అత్యవసర సాయం పంపిన భారత్పోలీసుల వివరాల ప్రకారం ప్రతీక్షకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే ఆమె పదో అంతస్తు నుంచి ఎందుకు దూకింది? అసలు ఏం జరిగింది? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రస్తుతం పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోయారు. వైద్యుల నుంచి మెడికల్ ఎండార్స్మెంట్ తీసుకున్నారు. ఆమె కోలుకుని స్పృహలోకి వచ్చిన తర్వాత వాంగ్మూలం నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
నాకు యాక్టింగ్ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్
నటీనటుల ప్రతిభకు స్టార్డమ్తో సంబంధం ఉండదు. మంచి నటన ఎక్కడ కనిపంచినా ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా బాలనటి నక్షత్ర విషయంలో కూడా అదే జరిగింది. ‘ఇరుముడి’ చిత్రంలోని ఆమె నటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తుండగా.. ప్రముఖ తమిళ నటుడు ధనుష్ కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోకాల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.వీడియో కాల్ చేసి ప్రశంసలు..నక్షత్ర నటనను చూసిన ధనుష్ స్వయంగా ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారిని అభినందించడంతోపాటు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఎప్పుడైనా మనం కలిసినప్పుడు నీ దగ్గర నటన నేర్చుకోవాలని ఉంది. చాలా అద్భుతంగా, అందగా నటించావు. నీ నటన నాకు చాలా నచ్చింది. ఎప్పుడైనా మనం కలుద్దాం. గ్రేట్ జాబ్ కన్నా.. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి’. అంటూ వీడియో కాల్లో మాట్లాడాడు. ఈ సమయంలో ఆ చిన్నారి ఇచ్చిన అమాయకరమైన, ఉత్సాహభరితమైన స్పందన కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. A cloud-nine moment for our little star ❤️The extraordinary @dhanushkraja Garu praised #Nakshatra for her performance and showered #Irumudi with appreciation ❤️🔥Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/oJbwLVl3N0— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026 ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..! -
మెటాకు రూ. 1.43 లక్షల కోట్ల భారీ జరిమానా!
వాషింగ్టన్: ఇన్స్టాగ్రామ్, మెటా(ఫేస్బుక్)వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పిల్లలను వ్యసనపరులుగా మారుస్తున్నారనే తీవ్ర ఆరోపణలపై టెక్ దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. ఈ వివాదానికి తెరదించేందుకు ఏకంగా 17 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,43,000 కోట్లు) సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు ఆ సంస్థ అంగీకరించింది. బిగ్ టెక్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ జరిమానాల్లో ఒకటిగా నిలిచింది.ఎండ్లెస్ స్క్రోలింగ్, బ్యూటీ ఫిల్టర్లు, లైక్‌ల కౌంట్ వంటి వ్యసనపూరిత ఫీచర్లను మెటా ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేసిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనివల్ల పిల్లలు, టీనేజర్లలో ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి వంటి తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఈ ముప్పును మెటా సంస్థ గోప్యంగా ఉంచి, ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు గుప్పించారు.అమెరికాలోని 47 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ, ప్యూర్టో రికో, అమెరికన్ సమోవా, నార్తర్న్ మరియానా ఐలాండ్స్ అటార్నీ జనరల్స్, ప్రభుత్వాలు సంయుక్తంగా మెటాపై ఈ సంచలన వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ చారిత్రక కేసు విచారణ, సెటిల్మెంట్ ఆమోద ప్రక్రియ యూనైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టులో ముగిశాయి.వర్జీనియా అటార్నీ జనరల్ జే జోన్స్ ఈ కేసులో వర్జీనియా తరఫున కీలక పాత్ర పోషించారు. అటార్నీ జనరల్ జోన్స్ ప్రకటన ప్రకారం.. మెటా ప్లాట్‌ఫామ్స్ సుమారు రూ.1,43,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఇందులో వర్జీనియా రాష్ట్రానికి గ్యారంటీగా 353 మిలియన్ డాలర్లు అందనున్నాయి. 1990ల నాటి బిగ్ టొబాకో సెటిల్మెంట్ల తర్వాత రాష్ట్ర స్థాయి వినియోగదారుల పరిరక్షణ చరిత్రలో ఇదే అతిపెద్ద సెటిల్మెంట్లలో ఒకటి. ఈ చెల్లింపుతో పాటు, ఇన్స్టాగ్రామ్, మెటాలలో పిల్లలను రక్షించేందుకు వీలుగా మెటా కొన్ని కఠినమైన భద్రతా ఫీచర్లను అమలు చేయాల్సి ఉంటుంది.వర్జీనియా అటార్నీ జనరల్ కార్యాలయానికి చెందాల్సిన 353 మిలియన్ డాలర్లతో పాటు, 2016 ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి థర్డ్ పార్టీలకు మెటా యూజర్ల సమాచారాన్ని షేర్ చేసినందుకు అదనంగా 11 మిలియన్ డాలర్లు వర్జీనియాకు అందనున్నాయి.ఇన్స్టాగ్రామ్, మెటాలలో కలిపి రోజుకు గరిష్టంగా రెండు గంటల సమయ పరిమితి ఉంటుంది. ఎండ్లెస్ స్క్రోలింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం 15 నిమిషాలు వాడిన తర్వాత, అలాగే 60, 90 నిమిషాల వద్ద తప్పనిసరి పాజులు వస్తాయి. రాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు రాత్రివేళ బ్లాకింగ్ ఉంటుంది.పాఠశాల విద్యార్థులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లు ఉండవు. యువ వినియోగదారుల వయస్సును మరింత కచ్చితంగా ధృవీకరించే పద్ధతులు, వేధింపులు, ఈటింగ్ డిజార్డర్స్, ఆత్మహత్య, స్వీయ-హానిని ప్రోత్సహించే కంటెంట్‌పై బలమైన రక్షణలు, మరింత పటిష్టమైన, తల్లిదండ్రులు సులభంగా ఉపయోగించుకునే నియంత్రణ టూల్స్ అందుబాటులోకి వస్తాయి.పిల్లలు, టీనేజర్లలో మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే బ్యూటీ ఫిల్టర్లు, కనిపించే లైక్స్ కౌంట్‌పై పరిమితులు ఉంటాయి. ఈ ఫీచర్ల అమలు, పనితీరును ఒక స్వతంత్ర ఆడిటర్ క్రమం తప్పకుండా పరిశీలిస్తారు.2021 నుంచి దేశంలోని దాదాపు అటార్నీ జనరల్లందరూ ఏకమై, హానికరమని తెలిసినప్పటికీ పిల్లలు, టీనేజర్ల కోసం సోషల్ మీడియాను డిజైన్ చేస్తున్న తీరుపై దర్యాప్తు చేపట్టారు. ఈ చారిత్రక ఒప్పందంలో అలబామా, అలాస్కా, కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సస్తో సహా అనేక రాష్ట్రాలు భాగస్వామ్యమయ్యాయి. -
దొంగల భయంతో ఆస్పత్రికి నగలు తెస్తే..
ఆస్పత్రిలో లక్షల విలువైన నగల సంచి మాయమైంది. దొంగతనం కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నర్సు, ఆయమ్మలు.. సిబ్బంది ఇలా అందరినీ ప్రశ్నించారు. ఆపై సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు ‘దొంగ’ ఎవరన్నది తెలిసి ఖాకీలు సైతం అవాక్కయ్యారు. అది రెండు కాళ్ల మనిషి కాదు.. నాలుగు కాళ్ల కుక్క ఆ సంచిని నోట కరుచుకుని ఆస్పత్రి నుంచి దౌడు తీసింది.మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ జిల్లా ఆస్పత్రిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కయాంపూర్కు చెందిన లతాబాయి తన కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఇంట్లో నగలు ఉంచి రావడం సురక్షితం కాదని భావించి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను తన వెంట తీసుకొచ్చింది. ఆమె వద్ద ఉన్న సంచిలో బంగారు మంగళసూత్రం, చెవి దుద్దులు, బంగారు పూసలు, వెండి పట్టీలు తదితర ఆభరణాలతో పాటు సుమారు రూ.2 వేల నగదు, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 24న తెల్లవారుజామున ఆ బ్యాగు కనిపించకుండా పోయింది.సంచి మాయమైన విషయాన్ని గుర్తించిన లతాబాయి వెంటనే కోత్వాలి పోలీసులను ఆశ్రయించింది. ఆస్పత్రిలోనే ఎవరో నగలను దొంగిలించి ఉంటారని అనుమానించారు. దీంతో పోలీసులు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. సర్జికల్ వార్డులోకి ఓ వీధి కుక్క వచ్చింది. అక్కడ ఉన్న సంచిని వాసన చూసి.. నోట కరుచుకుని మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సంచిలో ఉన్న ఆహార పదార్థాల వాసనకు ఆకర్షితమైన కుక్క దాన్ని తిండి సంచిగా భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఇక అక్కడి నుంచి మొదలైంది పోలీసుల ‘డాగ్ ట్రాకింగ్ ఆపరేషన్’. ఆస్పత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ కుక్క ఎటువైపు వెళ్లిందో పోలీసులు పరిశీలించారు. చివరకు.. కుక్కను, అది తీసుకెళ్లిన సంచిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ అందులోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, ఇతర వస్తువులు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం వాటిని లతాబాయికి అప్పగించారు. తన విలువైన వస్తువులను తిరిగి అందించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. సోసల్ మీడియాలో ఆ కుక్క వీడియో చూసి.. ‘‘అరేయ్ చింటూ బ్రో.. ఏంట్రా ఇది’’ అంటూ ఫన్నీ కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో దొంగతనం జరగకపోయినా.. ఆస్పత్రిలోకి వీధి కుక్క ఎలా ప్రవేశించింది? రోగులు, వారి వెంట వచ్చే వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేంటి? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తాయి.🚨 STRAY DOG TURNS THIEF IN MANDSAUR!A stray dog was caught on CCTV carrying away a bag containing jewellery worth ₹4 lakh and nearly ₹2,000 cash from Mandsaur District Hospital.Police traced its route and recovered everything. The belongings were later returned to the… pic.twitter.com/MjYAzeQfCH— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2026 ఇదీ చదవండి: వైరల్ కావాలనే ఆశతో గర్ల్‌ఫ్రెండ్‌తో అలా.. -
టీవీకే మంత్రి కీర్తన పోలికలు.. ఆ యువతికి నరకం చూపించిన నెటిజన్లు!
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే నానుడిని నిజం చేస్తూ, అచ్చం తమలాగే ఉండే వ్యక్తుల కోసం నెటిజన్లు ఆన్లైన్లో వెతుకుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే సింగపూర్‌లో నివసిస్తున్న వినోషా రవి అనే యువతి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ముఖ కవళికలు తమిళనాడు మంత్రి కీర్తనను పోలి ఉండటంతో ఈ వివాదం చెలరేగింది.డీఎంకే శ్రేణులు, నెటిజన్లు, పొట్టి దుస్తులు ధరించిన ఒక మహిళ వీడియోను షేర్ చేస్తూ.. ఆ వీడియోలో ఉన్నది తమిళనాడు మంత్రియేనా అని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం మొదలైంది. నెటిజన్లు సైతం ఆ వీడియోలో ఉన్నది మంత్రేనని పొరపడి, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు. అయితే, ఆ వైరల్ వీడియోలో ఉన్నది తాను కాదని మంత్రి కీర్తన స్పష్టం చేశారు. కేవలం పోలికల కారణంగా ట్రోలింగ్‌కు గురైన సింగపూర్‌కు చెందిన వినోషా రవికి ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు.ఈ పరిణామాలపై వినోషా రవి మాట్లాడుతూ..‘తొలత నా సహోద్యోగి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఆ వీడియోను తీశారు. మొదట దానిని నేను ఒక జోక్‌గా తీసుకున్నాను. ఇటువంటి పరిణామాలకు దారి తీస్తుందని అనుకోలేదు. కానీ, నెటిజన్ల నుంచి వచ్చిన విమర్శలు నన్ను పూర్తిగా డిప్రెషన్‌కు గురిచేశాయి. కొందరు పెట్టిన కామెంట్లు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. నా ప్రమేయం లేకుండా, నేను ఏ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయని వీడియోను రికార్డ్ చేసి ఆన్లైన్లో తప్పుగా ప్రచారం చేశారు. ఈ సంఘటన తర్వాత నేను బయటకు వెళ్లడానికి, కనీసం ఆఫీస్‌కు వెళ్లడానికి కూడా భయపడుతున్నానని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.బెదిరింపులు, అసభ్యకర సందేశాలు రావడంతో ఆమె మలేషియా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ట్రోలింగ్ వల్ల కలత చెంది భయపడినప్పటికీ, తాను వెనక్కి తగ్గేది లేదని వినోషా రవి స్పష్టం చేశారు. కొంతమంది ఆన్లైన్లో ట్రోల్ చేశారనే కారణంతో తాను తన వస్త్రధారణ శైలిని మార్చుకోబోనని తేల్చిచెప్పారు. మహిళలకు నీతులు చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఏమి, ఎలా దుస్తులు ధరించాలో మాకు బాగా తెలుసు’అని ఆమె అన్నారు. ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు ఎదుటి వ్యక్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో నెటిజన్లు ఆలోచించాలని, కేవలం వ్యూస్ కోసం బాధ్యతారహితంగా ప్రవర్తించవద్దని ఆమె హితవు పలికారు. -
అధికార దర్పం.. 'వారికి' మాత్రమే సాధ్యం!
‘రాజు వెడలె రవితేజము లలరగ’ అని పూర్వాకాలంలో రాజులు తమ పరివారంతో బయలుదేరిన తీరును వర్ణించారు కవులు. వర్తమానంలోనూ ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు మనకు సాక్షాత్కరిస్తుంటాయి. అయితే ఇప్పుడు రాజులు లేరు కదా, ఇంత ఆర్భాటంగా బయట తిరిగేదెవరనే అనుమానం కలగడం సహజం. రాజులు, రాజ్యాలు లేకపోయినా పాలకులు ఉన్నారుగా! పాలకులకు అధికార దర్పం ఉంటుంది, పదర్శిస్తారు సరే. కానీ వారి కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా అధికార దర్పం ప్రదర్శించడమే ఇప్పుడు వైచిత్రి. న్యాయస్థానాల్లో దోషులుగా తేలిన వారూ ఎటువంటి సంకోచం లేకుండా అధికార దర్పంతో వెలిగిపోతున్నారు. మచ్చుకు రెండింటి గురించి మాట్లాడుకుందాం.బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారన్న వాదన ఉండనే ఉంది. ఇటీవల ఆయన ఉదారంగా ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఫలితంగా నితీశ్‌కు రాజ్యసభ ఎంపీ, ఆయన కుమారుడు నిశాంత్‌కు బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి పదవి దక్కాయి. నిశాంత్‌ను బిహార్ భవిష్యత్తు ముఖ్యమంత్రిగా జేడీయూ పార్టీ నాయకులు స్తుతిస్తున్నారు. మరి కాబోయే సీఎం జనం మధ్యకు వస్తున్నారంటే ఎంత హడావుడి ఉండాలి!మంత్రి డాబు50పైగా వాహనాల కాన్వాయ్‌తో నిశాంత్ వెళుతున్న వీడియో ఒకటి తాజాగా ఎక్స్‌లో షేర్ అయింది. నిశాంత్ వాహనశ్రేణి వీధుల్లో దూసుకుపోతుండగా.. సామాన్య జనమంతా నిలబడి చూస్తున్నట్టుగా వీడియో ఉంది. వీణా జైన్ అనే యూజర్ ఈ వీడియో షేర్ చేశారు. 'బిహార్‌కు 9 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ పుత్రరత్నం 50కి పైగా వాహనాల కాన్వాయ్‌లో ప్రయాణించారు. వారికి ఓటు వేస్తూ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న ప్రజలు ఆయన కాన్వాయ్‌కు దారి ఇస్తూ అమితాశ్చర్యంతో చూస్తున్నారు' అని వ్యాఖ్యానాన్ని జోడించారు. ఇక వీడియో చూసిన నెటిజనులు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. భారతదేశానికి 'రాజులు వద్దు' అనే ఉద్యమం ఇప్పుడు నిజంగా అవసరం అంటూ పెట్టిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది.బాబా.. దర్జాఇక సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి పదవి లేకపోయినా ఆయన కూడా.. ‘రాజు వెడలె రవితేజము లలరగ’ తరహాలోనే ఆర్భాటాలు ప్రదర్శిస్తుంటారు. తాజాగా మరోసారి పెరోల్‌పై హరియాణాలోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన లగ్జరీ కార్ల కాన్వాయ్‌లో సిర్సాకు చేరుకున్నారు.చదవండి: చక్కెర కొనాలంటే.. కిడ్నీ అమ్ముకోవాల్సిందే!లైంగిక వేధింపుల కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. 17వ సారి పెరోల్‌పై బయటకు రావడం.. బహుశా మనదేశంలో మాత్రమే సాధ్యమేమో! 2017 నుంచి కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన 435 రోజులు జైలు బయటే ఉండడం మరో విచిత్రం. ఇక, ఈయనగారి దర్జాపై సోషల్ మీడియాలో నెటిజనులు కారాలు మిరియాలు నూరుతున్నారు. గుర్మీత్‌కు హరియాణా ప్రభుత్వం రాఖీ కానుక ఇచ్చిందని జోకులు వేస్తున్నారు. 'పెట్టి పుట్టాడు' అంటూ నిష్టూరమాడుతున్నారు. 'ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే.. కొంత మంది మాత్రం ఎక్కువ సమానమ'నే నానుడిని గుర్తుచేసుకుంటున్నారు. 9 Times Bihar CM Nitish Kumar's Son Nishant Kumar travelling with 50+ vehicles convoyAnd the people who voted for them continuously and living Below poverty line watching it while giving way for his convoy 👀 pic.twitter.com/jEMRtMwvzY— Veena Jain (@Vtxt21) August 25, 2026#WATCH | Sirsa, Haryana: Rape convict Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh arrived at the Dera headquarters in Sirsa from Sunaria Jail after being granted 21-day parole pic.twitter.com/Q7WKr98dvG— ANI (@ANI) August 25, 2026ఇదీ చదవండి: నేనే నిరసనకు దిగుతా.. బాబా రామ్‌దేవ్ వార్నింగ్ -
YSRCP సోషల్ మీడియా పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
వైరల్ అవ్వాలని.. 3,400 ముద్దులు!!
సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఏదో ఒకటి తుంటరి పని చేసేవాళ్లు ఎక్కువైపోయారు. అదే తరహాలో ఇక్కడో యువకుడు చేసిన వింత స్టంట్ చివరకు ఊహించని తీరానికి చేరింది. తన స్నేహితురాలి పెదాలతో కారు నిండా ముద్దులతో నింపేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఏకంగా మిలియన్ల వ్యూస్ సాధించడంతో సంబురపడిపోయింది. ఇంతటితో ఆగితే.. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటుంది.. అసలు కథలోకి వెళ్దాం పదండి..గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులతో పూర్తిగా నిండిపోయిన స్విఫ్ట్ కారు కనిపించింది. ఆ కారును నగర రహదారిపై వేగంగా నడుపుతున్నట్లు కూడా వీడియోలో కనిపించడంతో పోలీసులు దృష్టి సారించారు. వాహనం వివరాలను సేకరించి దాని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని యజమానిని కూడా విచారణకు పిలిచారు.విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ట్రెండ్‌ను అనుసరించి వీడియోను వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టంట్ చేసినట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. తన మహిళా స్నేహితురాలే కారుపై దాదాపు 3,400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులు వేసిందని చెప్పాడు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు మూడున్నర గంటలు పట్టిందని, లిప్‌స్టిక్ కోసం రూ.800–900 వరకు ఖర్చయిందని వివరించాడు. కారును మొత్తం ముద్దుల గుర్తులతో నింపి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు చెప్పాడు.యువకుడు అనుకున్నట్లుగానే వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్లింది. దాదాపు 55 లక్షల(5.5M) మంది వీడియోను వీక్షించినట్లు అతడు తెలిపాడు. అయితే అదే వైరల్ వీడియో అతడిని పోలీసుల వద్దకు తీసుకెళ్లింది. మధ్యప్రదేశ్ బోఫాల్‌లో జరిగింది ఈ ఘటన. ఆ కారు ఓనర్ పేరు ఆదిత్య సికర్వార్.స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అభిషేక్ రఘువంశీ మాట్లాడుతూ.. సుమారు రెండు రోజుల క్రితం ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పటేల్‌నగర్–సిటీ సెంటర్ ప్రాంతంలో లిప్‌స్టిక్ గుర్తులతో ఉన్న స్విఫ్ట్ కారు వేగంగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందన్నారు. వీడియో ఆధారంగా వాహనాన్ని గుర్తించి థాటీపూర్లో పట్టుకున్నట్లు చెప్పారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కింద ఆదిత్యకు సుమారు రూ.5,500 చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన తప్పును అంగీకరించిన ఆదిత్య.. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే కారుపై ఉన్న వేలాది లిప్‌స్టిక్ గుర్తులను స్వయంగా శుభ్రం చేసుకున్నాడు. తన మహిళా స్నేహితురాలే ఈ ఆలోచన ఇచ్చిందని ఆదిత్య చెప్పాడు. తాను కారు పార్క్ చేసి వెళ్లిన సమయంలో ఆమె కారుపై ముద్దుల గుర్తులు వేసిందని వివరించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రెండ్ నడుస్తుండటంతో వీడియో చేస్తే వైరల్ అవుతుందని భావించామని, అనుకున్నట్లుగానే భారీగా వ్యూస్ వచ్చాయని తెలిపాడు. అయితే ఈ వీడియో కారణంగా ట్రాఫిక్ పోలీసుల నుంచి చర్యలు ఎదురవుతాయని ఊహించలేదని చెప్పాడు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తానని, ఇలాంటి స్టంట్‌ను పునరావృతం చేయబోనని పోలీసులకు హామీ ఇచ్చాడు.వైరల్ కోసం చేసిన వింత ప్రయోగం.. లక్షల వ్యూస్ తెచ్చిపెట్టినా, చివరకు చలాన్‌తో పాటు పోలీస్ స్టేషన్లో కారు కడిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. Love was in the air… and all over the car! 3,400 kisses got Gwalior's "Kissing Car" 5.5 million views and a ₹5,500 challan. He wanted to make a "reelationship" go viral. Traffic Police made sure it came with a "fine ending" @GargiRawat pic.twitter.com/d2GwGeHbUS— Anurag Dwary (@Anurag_Dwary) August 25, 2026 ఇదీ చదవండి: ఓనం హిందువుల పండుగ కాదా? -
‘బికినీ డ్రెస్‌లో రాఖీ కట్టాల్సి అవసరం ఏంటి..?’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ఓ రక్షా బంధన్ జ్యువెలరీ యాడ్ గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారుతోంది. ఈ ప్రకటనలో కృతి సనన్ స్కర్ట్ ధరించి గ్లామరస్‌గా కనిపించారు. అయితే పవిత్రమైన రాఖీ పండగ యాడ్‌లో గ్లామర్ షో చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయమై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా తనదనైన సైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘మహిళలకు డ్రెస్ ఎంపికలో ఎన్నో రకాల ఆప్షన్లు ఉన్నాయి. మన దగ్గర జీన్స్, చీరలు, సల్వార్ కమీజ్ నుంచి కాక్టైల్ డ్రెస్సుల వరకు మరెన్నో మంచి దుస్తులు ఉన్నాయి. వాటిని వదిలి సోదరుడికి బికినీ, లోదుస్తుల వేసుకుని రాఖీ కట్టాల్సిన అవసరం ఏంటి?. ఈ యాడ్ కూడా కావాలనే వివిదాస్పదంగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది’ అని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ మండిపడ్డారు. అయితే ఈ యాడ్‌పై అటు కృతి సనన్గానీ, యాడ్ యాజమాన్యం గానీ ఏవిధంగా స్పందించలేదు. ఇదీ చదవండి: విలన్‌గా మెప్పించిన జబర్దస్త్ నటుడు -
ఇన్‌స్టాలో 15 ఏళ్ల బాలుని ప్రేమ.. ఆత్మహత్యాయత్నం
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియా ప్రేమల్లో పడి యువత, బాలలు పెడదారి పడుతున్నారు. ప్రాణాలు తీసుకోవడానికీ సంకోచించడం లేదు. బెంగళూరులో 15 ఏళ్ల బాలుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు యత్నించాడు . వివరాలు.. బేగూరు వద్ద అక్షయ నగరలో బాలునికి ఇన్‌స్టాలో ఒక అమ్మాయి పరిచయం ఏర్పడింది. 3 నెలల నుంచి ఇద్దరూ ఫోన్లో కూడా మాట్లాడుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం యువతి అతనికి కాల్ చేసి తనకు నిశ్చితార్థం అయిందని, ఇకపై ఫోన్ చేయొద్దని చెప్పింది. దీంతో ఆవేశానికి లోనైన బాలుడు ఎలుకల మందు తాగి చనిపోతానని హెచ్చరించాడు. అలాగే భవనం 6వ అంతస్తుకు వెళ్లి అక్కడ నుంచి కిందకి దూకి చనిపోతానని బెదిరించాడు. యువతి పోలీసులకు ఫోన్ చేసి చెప్పగా, అక్కడికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి అతన్ని కిందికి తీసుకువచ్చారు. బాలిక, యువతిని మందలించారు. -
యువతను చేరుకోవడమే వ్యూహమా?
విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలో ఆగస్టు 19 నుంచి 21 వరకు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూడు రోజుల అఖిల భారత సమన్వయ సమావేశాన్ని సాధారణ వార్షిక సంస్థాగత సమావేశంగా మాత్రమే చూడటం సరిపోదు. ఈ సమా వేశంలో యువత, వ్యవస్థలోని లోపాలు, జంతర్ మంతర్ నిరస నలు, కుటుంబ వ్యవస్థ, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి, కృత్రిమ మేధస్సు వంటి అంశాలు చర్చకు రావడం ఆర్ఎస్ఎస్ భవిష్యత్ సామాజిక వ్యూహంలో మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రవేశ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకులు, యువత భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాలతో ప్రారంభమైన జెన్–జీ ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్దచర్చకు దారితీసింది. 49 రోజుల ఆందోళన అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడంతో ఉద్యమం ముగిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఎన్నికల రాజకీయాల్లో యువత శక్తిని ఏ రాజకీయ సంస్థ కూడా నిర్లక్ష్యం చేయలేదు.జంతర్ మంతర్ నిరసనలపై విలేఖరులు ప్రశ్నించినప్పుడు, ఆర్ఎస్ఎస్ దానిని కేవలం అవినీతి సమస్యగా చూడలేదు; వ్యవస్థ లోని లోపాలు, యువతలో భవిష్యత్తుపై ఏర్పడుతున్న ఆందోళన; ప్రభుత్వాలు, సమాజం కలిసి వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉందని సంఘ్ నాయకత్వం పేర్కొంది. విద్య, ఉద్యోగం, పోటీ పరీక్షలు, పరిపాలనా పారదర్శకత, అవినీతి, ధరలు, సామాజిక అవకాశాలు వంటి అనుభవాలు క్రమంగా యువతలో ప్రభు త్వంపై నమ్మకాన్ని నిర్మిస్తాయి లేదా దెబ్బతీస్తాయి. జంతర్ మంతర్ ఉద్యమం ఈ అసంతృప్తికి ఒక డిజిటల్ ముఖాన్ని చూపించింది.సోషల్ మీడియానే యుద్ధభూమిజంతర్ మంతర్ ఉద్యమం... నేటి రాజకీయ శక్తి కేవలం సభలు, ర్యాలీలు, పోస్టర్లు, సంప్రదాయ మీడియా ద్వారా నిర్ణయించబడదు, సామాజిక మాధ్యమాల్లో కథనాన్ని ఎవరు నిర్మిస్తారన్నది కూడా అంతే ముఖ్యం అనే విషయాన్ని స్పష్టం చేసింది. జనరేషన్ జెడ్ రాజకీయ చైతన్యం చాలా వరకు డిజిటల్ ప్రపంచంలో పెరుగుతోంది. వ్యంగ్యం, మీమ్స్, చిన్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసా రాలు, వ్యక్తిగత కథనాలు– ఇవి యువతను సంప్రదాయ రాజకీయ ప్రసంగాల కంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఆర్ఎస్ఎస్ యువతతో ‘నిరంతర సంబంధం’ గురించి మాట్లా డటం, సాంకేతికతపై ప్రత్యేకంగా చర్చించడం యాదృచ్ఛికం కాదు.ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయదు. అయినప్పటికీ బీజేపీతో దాని సైద్ధాంతిక, సంస్థాగత సంబంధాల కారణంగా సంఘ్ సమాజంలో చేపట్టే కార్యాచరణకు ఎన్నికల రాజకీయాలపై పరోక్ష ప్రభావం ఉండటం సహజం. అందుకే విశాఖ సమావేశాన్ని బీజేపీ భవిష్యత్ ఎన్నికల వ్యూహానికి కూడా ఒక సూచికగా చూడవచ్చు.ఇకపై సంఘ్ ముందున్న అసలు పరీక్ష యువతకు హిందు త్వాన్ని వివరించడం కాదు; యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు హిందుత్వ–సనాతన ధర్మ భావజాలం ఏ సమాధానం ఇస్తుందో చూపించడం. ఉపాధి, విద్య, అవినీతి, సాంకేతిక మార్పు, పర్యావరణం, సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు ఈ అంశాలపై ఆచరణాత్మక పరిష్కారాలను చూపగలిగితే సంఘ్ తన సామాజిక ప్రభావాన్ని మరింత విస్తరించగలదు. అలా చేయలేక పోతే, కేవలం సిద్ధాంతపరమైన ప్రచారం కొత్తతరాన్ని ఆకర్షించక పోవచ్చు. విశాఖ సమన్వయ సమావేశం అందుకే ఒక సాధారణ వార్షిక సమావేశం కాదు. ఇది ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది అనంతర దశలో ‘సమాజాన్ని ఎలా చేరుకోవాలి?’ అనే ప్రశ్నకు వెతుకుతున్న సమాధానానికి ఒక ముఖ్యమైన అధ్యాయం.– సీహెచ్.వి.ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్ -
బ్లాక్మెయిల్ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు
కాకినాడ క్రైం: ‘సాధిక్ ఖాన్ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు.. నన్ను మతం మార్పించడానికి, నా ఆస్తి కోసం వేధించేవాడు’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య మరణానికి ముందు రాసినట్లుగా భావిస్తున్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖలో సాధిక్ క్రూరత్వాన్ని వివరించింది. సాధిక్ తన కుమారుడు రియో సాయంతో తనకు దగ్గరయ్యాడని తెలిపింది. తన బిడ్డ చదివే స్కూల్లో చేరాడని, చెప్పిన మాట వినకపోతే రియోను కిడ్నాప్ చేస్తానని బెదిరించేవాడని పేర్కొంది. తన ప్రైవేటు విషయాలతో బ్లాక్మెయిల్ చేశాడని, ప్రశ్నిస్తే కొట్టాడని తెలిపింది. తన భర్త కూడా సాధిక్‌కు భయపడేవాడని తెలిపింది. తన భర్తను చంపేయడానికి ఓ రసాయనాన్ని తెచ్చాడని పేర్కొంది. తన ప్రతి ఫోన్ కాల్‌ను పరిశీలించేవాడని తెలిపింది. అతడి కన్ను తన ఆస్తిపై ఉందన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించానని పేర్కొంది. తన ఆస్తి పత్రాలు, లాకర్ కూడా అతని ఆధీనంలో పెట్టుకున్నాడని, అతనికి పోలీసులతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఎవరికీ చెప్పుకోలేకపోయానని వివరించింది. తనను ఇస్లాంలోకి మారాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఇస్లాం మత పుస్తకాలు చదవమని, రాయమని బెదిరించేవాడని పేర్కొంది. చాలాసార్లు మనోవేదనకు గురై చనిపోదామనుకుంటే బిడ్డ గుర్తొచ్చి ఆగిపోయానని తెలిపింది. మతం పిచ్చి, ఆడవాళ్ల పిచ్చి ఉన్న సాధిక్తో ప్రతి మహిళ, యువతులు, పిల్లల తల్లులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ లేఖ విషయమై ఎస్పీ బిందుమాధవ్ని వివరణ కోరగా, పరిశీలిస్తున్నామని చెప్పారు. సాధిక్ ఖాన్ తనకంటే పదేళ్లు పెద్ద వయసున్న సౌజన్యను ట్రాప్ చేసి మతం మార్చేందుకు, ఆస్తి కాజేసేందుకు కుట్రపన్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. సాధిక్ ఇచ్చిన విష రసాయనంతోనే జగదీశ్వర్ రెడ్డి మృతి? సౌజన్య భర్త జగదీశ్వర్‌రెడ్డి నరాల సంబంధ వ్యాధితో బాధపడుతుండేవాడని, సాధిక్ ఇచ్చిన విష రసాయనంతో అతనికి జీర్ణకోశ వ్యాధి కూడా వచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అతన్ని హైదరాబాద్‌లో ఏఐజీ ఆసుపత్రిలో చేర్చగా 23 రోజుల చికిత్స అనంతరం జూలై 2న మృతి చెందినట్లు సమాచారం. పోలీసులతోనే ఫొటోలన్నీ... సాధిక్ కాకినాడ గుడారిగుంటలో నిర్వహిస్తున్న ప్రో షూటింగ్ అకాడెమీలో ఫొటోలన్నీ పోలీసులతోనే ఉండటం చర్చనీయాంశమైంది. తాను సాధించిన మెడల్స్‌తో గతంలో పనిచేసిన జిల్లా ఎస్పీ సహా పలువురు అధికారులతో ఫొటోలు తీయించుకున్నాడు. వీటిని చూపించి పోలీస్ ఉన్నతాధికారులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తన అకాడెమీకి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు చెప్పుకునేవాడు. పలువురు పోలీసుల పిల్లలకు కూడా సాధిక్ శిక్షణ ఇస్తుండటం గమనార్హం. రిమాండ్‌కు సాధిక్ ఖాన్శనివారం ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసిన పోలీసులుకాకినాడ రూరల్/కాకినాడ లీగల్/కాకినాడ క్రైం: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్‌ను సర్పవరం పోలీసులు సోమవారం కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అతనికి సెప్టెంబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మి కుమారి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని కాకినాడ సబ్‌జైలుకు రిమాండ్‌కు పంపించారు. ఈ నెల 16న ఏఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన వెంటనే సాధిక్ ఖాన్ పరారయ్యాడు. అతన్ని శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో అరెస్ట్ చేసి, ఆదివారం అర్ధరాత్రి సర్పవరం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆరితేరిన నేరస్తుడిలా సాధిక్ పరారు: కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు పాల్పడగానే సాధిక్ ఖాన్ ఆరితేరిన నేరస్తుడి తరహాలో చాకచక్యంగా పారిపోయాడని ఎస్పీ బిందుమాధవ్ చెప్పారు. అతని కోసం 10 పోలీసు బృందాలు ఆరు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో గాలించాయని సోమవారం కాకినాడలో విలేకరుల సమావేశంలో తెలిపారు. అతను సామర్లకోట నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి వెళ్లిపోయాడన్నారు. సామర్లకోట మీదుగా ఢిల్లీ, అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌కు వెళ్లాడన్నారు. రైఫిల్ షూటింగ్లో శిక్షకుడైన ఓ మిత్రుడు సహా ఒకరిద్దరి దగ్గర ఆశ్రయం పొందినట్లు తెలిపారు. అతని ఫోన్ నుంచి చివరి కాల్ షూటింగ్ అసోసియేషన్‌లో సభ్యుడైన ఓ వ్యక్తికి వెళ్లడంతో అతని జాడ తెలుసుకొనే అవకాశం చిక్కిందని చెప్పారు. 22వ తేదీన అతని వద్దకు పోలీసులు వెళ్లగా.. అప్పటికి కొద్ది సేపటి ముందు సాధిక్ అక్కడి నుంచి మీరఠ్‌లో ఉంటున్న మరో షూటింగ్ శిక్షకుడైన అబ్బాస్ వద్దకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. స్థానిక పోలీసుల సాయంతో అబ్బాస్ ఇంటి వద్ద కాపు కాసి, సాధిక్ రాగానే పట్టుకున్నట్లు తెలిపారు. అతనిపై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించడం, బెదిరింపులు, మతమార్పిడికి యత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
చక్కెర కొనాలంటే.. కిడ్నీ అమ్ముకోవాల్సిందే!
పంచదార ధర సామాన్యులను బెంబేలెతిస్తోంది. ధరలు రోజు రోజుకు ఎగబాకుతుండడంతో చక్కెర వైపు చూడటానికి జనం జంకుతున్నారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడదామంటే దాని ధర కూడా దడ పుట్టిస్తోంది. తీపి అంటేనే హడలిపోయేలా రేట్లు షాక్ ఇస్తున్నాయి. ఉత్పత్తి పడిపోవడం, సరఫరాలో సమస్యల కారణంగా గత కొన్ని వారాలుగా చక్కెర, బెల్లం ధరలు బాగా పెరిగిపోయాయి.కొద్దిరోజుల క్రితం వరకు 45 రూపాయలు ఉన్న కిలో చక్కెర ధర ఇప్పుడు దాదాపు 70 రూపాయలకు చేరుకుంది. బెల్లం కిలో రేటు దాదాపు 20 రూపాయలు పెరిగి రూ.75కు వచ్చింది. పండగ సీజన్‌తో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండడంతో బెల్లం, చక్కెరకు ఫుల్ గిరాకీ ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో ధరలు చుక్కలనంటడంతో జనం విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వం ధరలు తగ్గించి, తమకు ఊరట కల్పించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: భారత్‌ను ముంచెత్తిన చక్కెర సంక్షోభం!చక్కెర ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు, మీమ్స్ పెద్ద ఎత్తున పోస్ట్ అవుతున్నాయి. గతంలో నాయకుల మాటలను కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కమలం గుర్తు బటన్ నొక్కండి, కిలో చక్కెర రూ.13కే పొందండి అంటూ 2019లో స్మృతి ఇరానీ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకుముందు ఐఫోన్ దక్కించుకోవానికి కిడ్నీ అమ్మాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు చక్కెర కోసం మూత్రపిండాలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నట్టుగా ఉన్న వీడియో నవ్వులు పూయిస్తోంది.సోషల్ మీడియాపై చక్కెర ధరల పెరుగుదలపై షేర్ అయిన పోస్టులు మీ కోసం..कमल का बटन दबाओ, 13 रुपए किलो में शक्कर पाओ.- स्मृति ईरानी (2019 में)#Sugar pic.twitter.com/mOZE7VoWCH— Abdul Wahab (@AbdulWahabRs) August 23, 2026First it was iPhone, now it's SUGAR #Sugar pic.twitter.com/SiNybQqWJp— Indian (@MeIndian03) August 24, 2026Dhurandhar 3 on the way #Sugar https://t.co/9F5PCKM478 pic.twitter.com/1MNOcaIcgy— Indian (@MeIndian03) August 24, 2026మీ సైడు 50 రూపాయల షుగర్ ఇట్లా ఎట్లా ఇస్తారూ @NaperuShivaMani pic.twitter.com/dKOw7cYpBd— d కృష్ణ (@2029krisha) August 23, 2026#Sugar prices may be going UP… 🍬📈But this #Reel has sweetened the internet for free! And entertainment value is already OFF THE CHARTS! 😂🔥#SugarPriceHikes #BandhanDay #ReelOfTheDay #CreativeContent#NeverStopPlaying pic.twitter.com/GyZlLTVw6i— Zenith Chaudhary (@ZC_zenith) August 23, 2026 -
వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే?
దులీప్ ట్రోఫీ 63వ ఎడిషన్ ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈస్ట్ జోన్‌తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్‌తో వెస్ట్ జోన్ తలపడుతున్నాయి. అయితే దులీప్ ట్రోఫీలో అందరి కళ్లు ఈస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీపై నెలకొని ఉన్నాయి. కానీ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వైభవ్ మూడు ఫోర్లు కొట్టినప్పటికీ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. నార్త్ఈస్ట్ జోన్ పేసర్ బిష్వోర్జిత్ కొంతోజమ్ బౌలింగ్‌లో వైభవ్ వెనుదిరిగాడు. అయితే పెవిలియన్ చేరుతున్న క్రమంలో వైభవ్ జెర్సీ వెనుక భాగంలో ఉన్న సంఖ్యకు టేప్ అంటించి ఉండడం అభిమానులు గమనించారు. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలోనూ వైభవ్ జెర్సీ వెనుక భాగంలో టేప్ అలాగే ఉండడం కనిపించింది. దీంతో అసలు వైభవ్ జెర్సీకి టేప్ ఎందుకు వేసుకున్నాడనే దానిపై ఆరా తీశారు. దీంతో విషయం బయటపడింది.మ్యాచ్‌లో వైభవ్ 13వ నంబర్ ఉన్న జెర్సీని ధరించాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ జెర్సీ నెంబర్ 3. ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఇదే జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సమయంలోనూ వైభవ్ మూడు నెంబర్ జెర్సీతోనే ఆడాడు. అయితే దులీప్ ట్రోఫీలో వైభవ్‌కు మూడో నెంబర్ జెర్సీ స్థానంలో 13వ నెంబర్ జెర్సీ అందించారు. ఈస్ట్ జోన్ జట్టు వైభవ్ కోసం తనకు అచ్చొచ్చిన మూడో నెంబర్ జెర్సీని అందించడంలో విఫలమైందని లాజిస్టిక్స్ మేనేజర్ తెలిపాడు. తనకు మూడు నెంబర్ జెర్సీ అయితేనే అచ్చొస్తుందని భావించాడేమో.. అందుకే వైభవ్ తనకు ఇచ్చిన 13వ నెంబర్ జెర్సీలో ఒకటి సంఖ్య కనిపించకుండా టేప్ అంటించాడు. ఒకటి సంఖ్య లేకపోవడంతో ఇప్పుడు ఆ జెర్సీ 3 నెంబర్‌గా మారిపోయింది. ఇక మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు వైభవ్ జెర్సీపై ఫన్నీ కామెంట్స్ చేశారు. "పాపం జెర్సీ మారడంతో వైభవ్‌కు లక్ కలిసిరాలేదని కొందరు పేర్కొంటే... ఒకవేళ తనకు అచ్చొచ్చిన 3వ జెర్సీ నెంబర్‌ను ఇచ్చి ఉంటే మ్యాచ్‌లో ఇరగదీసేవాడేమో" అని మరికొందరు తెలిపారు. అయితే వైభవ్ తన జెర్సీని తెప్పించాలని ఇప్పటికే ఈస్ట్‌జోన్ జట్టుకు సమాచారం ఇచ్చాడట. రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ తన లక్కీ నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.Exciting early battle 🔥4️⃣,4️⃣,🇼Bishworjit Konthoujam wins the contest against Vaibhav Sooryavanshi 👌#DuleepTrophyScorecard ▶️ https://t.co/XJFhfvvTIU pic.twitter.com/4xGnLaAhpx— BCCI Domestic (@BCCIdomestic) August 23, 2026Read: బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ కీలక ప్రకటన!


