15 ఏళ్లలోపు ‘బ్యాన్‌’ | French MPs approve law seeking ban on social media for children below 15 | Sakshi
Sakshi News home page

15 ఏళ్లలోపు ‘బ్యాన్‌’

Jan 28 2026 2:58 AM | Updated on Jan 28 2026 2:58 AM

French MPs approve law seeking ban on social media for children below 15

చిన్నారులు సోషల్‌ మీడియా వాడకుండా నిషేధం

ఫ్రాన్స్‌ దిగువసభలో బిల్లుకు ఆమోదముద్ర

పారిస్‌: సామాజిక మాధ్యమాల సుడిగుండంలో పడి విద్యారోగ్యాలను పాడుచేసుకుంటున్న చిన్నారులను కాపాడే లక్ష్యంతో ఫ్రాన్స్‌ ముందడుగువేసింది. 15 ఏళ్లలోపు చిన్నారుల సోషల్‌మీడియా వినియోగంపై నిషేధం విధిస్తూ ఫ్రాన్స్‌ చట్టసభ సభ్యులు సంబంధిత బిల్లుకు ఆమోదముద్ర వేశారు. సోమవారం అర్ధరాత్రి దాటాక ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ దిగువసభలో జరిగిన ఓటింగ్‌లో 13021 మెజారిటీతో బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు.

సెప్టెంబర్‌లో మొదలయ్యే నూతన విద్యాసంవత్సరం నుంచి ఈ నిషేధాన్ని అమల్లోకి తేనున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రకటించారు. అయితే ఈ బిల్లు ఇంకా ఎగువసభ అయిన సెనేట్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంది. వచ్చే కొద్దివారాల్లో దీనిని సెనేట్‌లోనూ ఆమోదింపజేసుకుంటామని మేక్రాన్‌ ధీమా వ్యక్తంచేశారు. బిల్లు దిగువసభలో ఆమోదంపొందడంతో మేక్రాన్‌ సంతోషం వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement