మిస్సైల్స్‌ను, డ్రోన్స్‌ను అడ్డుకుంటున్న యుఎఇ
US-Israel War on Iran day 15: భీకర దాడులతో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం 15 రోజు కూడా తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానంగా ఇరాన్‌లోని కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దళాలు (CENTCOM) అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు నిర్వహించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
మరోవైపు ఖార్గ్ ద్వీపం బాంబు దాడి తర్వాత అమెరికా మద్దతు ఉన్న చమురు కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ గట్టి కౌంటరిచ్చింది.2,500 మంది అమెరికన్ మెరైన్‌లు, నౌకలు గల్ఫ్‌కు పయనమవుతుండగా టెహ్రాన్ ‘మరింత విధ్వంసక’ క్షిపణులను సిద్ధం చేస్తోంది.
ఇరాన్ నుండి వస్తున్న క్షిపణులను గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శనివారం ఇజ్రాయెల్‌రాజదాని నగరం జెరూసలేం మీదుగా భారీ పేలుళ్లు వినిపించాయని AFP నివేదించింది.
ఇది ఇలా ఉంటే యుఎఇ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) వైమానిక రక్షణ దళాలు మార్చి 13న 7 బాలిస్టిక్ క్షిపణులు , 27 యుఎవిలను అడ్డుకున్నాయి. UAE ఈ రోజు 9 క్షిపణులు , 33 డ్రోన్‌లను అడ్డుకుంది. దీంతో వీటి సంఖ్య 285 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు , 1,567 యుఎవిలకు చేరుకున్నాయి. ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని యుఎఇ కాన్సులేట్ జనరల్‌ను లక్ష్యంగా చేసుకుని వారం రోజుల్లో రెండవసారి జరిగిన ఉగ్రవాద డ్రోన్ దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడగా, కాన్సులేట్ భవనం దెబ్బతింది.
45 మంది అరెస్ట్
మరోవైపు యుఎఇలో, తప్పుదారి పట్టించే లేదా ఏఐ వీడియోలను ఆన్‌లైన్‌లో పంచుకున్నందుకు 10 మంది నిందితులకు భారీ షాక్ తగలనుంది. వీరిపై విచారణణు వేగవంతం చేశారు. సంఘటనాస్థలాలను చిత్రీకరించడం, లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 45 మందిని అబుదాబి అధికారులు అరెస్టు చేశారు. ఇది తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను రక్షించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగమని అక్కడి అధికారులు తెలిపారు.
కాగా ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం మధ్యప్రాచ్య వివాదం మూడవ వారంలోకి ప్రవేశించింది. దాదాపు 43,000 నివాస, వాణిజ్య యూనిట్లు దెబ్బతిన్నాయని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ వెల్లడించారు. ప్రభుత్వ నిర్వహణలోని IRNA వార్తా సంస్థ ప్రకారం, దెబ్బతిన్న నిర్మాణాలలో 36,469 నివాసాలు, 6,179 వాణిజ్య సౌకర్యాలు ఉన్నాయి..
అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని, 223 మంది మహిళలు , బాలికలు మరణించారని మరియు 2,129 మంది గాయపడ్డారని మొహజెరానీ చెప్పారు. ఆమె మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించలేదు కానీ గతంలో అధికారులు 1,230 మంది మరణించారని చెప్పారు.సైనిక నష్టం గురించి ఇరాన్ ఎటువంటి సమాచారం అందించలేదు.


