విష్ణుప్రియతో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి | JD Chakravarthy Respond On Marriage Rumours With Achor Vishnupriya | Sakshi
Sakshi News home page

విష్ణుప్రియతో రిలేషన్‌, పెళ్లి.. జేడీ చక్రవర్తి ఏమన్నారంటే..

Apr 26 2026 4:21 PM | Updated on Apr 26 2026 6:54 PM

JD Chakravarthy Respond On Marriage Rumours With Achor Vishnupriya

యాంకర్‌ విష్ణుప్రియకు జేడీ చక్రవర్తి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో చాన్స్‌ వస్తే జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటానని కూడా ఆమె చెప్పింది. అప్పటి నుంచి జేడీ, విష్ణుప్రియల పెళ్లిపై రకరకాల రూమర్స్‌ వచ్చాయి. నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకుంటారని సోషల్‌ మీడియా కోడై కూసింది. 

తాజాగా ఈ పుకార్లపై జేడీ చక్రవర్తి  స్పందించాడు. ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్ధుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జేడీ చక్రవర్తి తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ సందర్భంగా యాంకర్ విష్ణుప్రియతో రిలేషన్‌, రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వస్తున్న రూమర్స్‌పై యాంకర్ ప్రశ్నించగా.. జేడీ చక్రవర్తి ఇలా సమాధానం ఇచ్చాడు. ‘విష్ణుప్రియ గురించి నేను ఒక విషయం చెబుతా. నేను నటుడిగానే కాకుండా నాకు మరో కోణం ఉంది. అదే ఫిలాసఫి. దానిపరంగా విష్ణుప్రియ నా శిష్యురాలు. విష్ణుప్రియకు నేను ఫోన్ చేస్తే గురువుగారు అనే మాట్లాడుతుంది. అసలు ఆ అమ్మాయికి నాకు ఎఫైర్ ఉందని అనుకోవడం అన్నంత దుర్మార్గం ఇంకోకటి లేదు. ఆమె నా శిష్యురాలు... పైగా పెళ్లి చేసుకోవడమా? ఆ అమ్మాయి నన్ను గురువుగా భావిస్తోంది. అలాంటి అమ్మాయితో నా పెళ్లి ముడిపెట్టడం సరికాదు’ అని జేడీ చెప్పుకొచ్చాడు.

ఇక విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నాకు ఫిలాసఫికల్‌గా మాత్రమే శిష్యురాలు.తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌తో నాకు ఏ సంబంధం లేదు. తన ఇష్టం తనది.. తను నాతో డిస్కష్ చేసేది ఫిలాసఫి. విపరీతమైన దైవభక్తి, విపరీతమైన జ్ఞానం ఆ అమ్మాయిలో ఉన్నాయి. ఫిలాసఫి వేరు, దేవుడు వేరు. ఫిలాసఫికి సంబంధించిన విషయాలకే తను నాకు ఫోన్ చేసి కన్సల్ట్ అవుతుంది. దాని మీద మాత్రమే మేమిద్దరం మాట్లాడుకుంటాం. నేను విష్ణుప్రియని కలిసి దాదాపు మూడేళ్లు అవుతోంది అని జేడీ చక్రవర్తి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement