బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..! | Nutritionist Shares How To Eat With Purpose For Every Organ | Sakshi
Sakshi News home page

బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!

Apr 26 2026 11:54 AM | Updated on Apr 26 2026 11:54 AM

Nutritionist Shares How To Eat With Purpose For Every Organ

శరీరం సంక్రమంగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యం. నిజానికి శరీరం వివిధ భాగాలతో కూడిన ఒక జట్టులా పనిచేస్తుంది. ప్రతి అవయవానికి దానికంటూ ఒక పాత్ర, సొంత అవసరాలు, ఇష్టమైన పోషకాలు ఉండాయి. జీర్ణవ్యవస్థకు సహాయపడేది ఊపిరితిత్తులకు లేదా కళ్లకు సరిపడకపోవచ్చు. అందుకే తెలివిగా తినడం అంటే కేవలం స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు అది బలవర్ధకమైనదై ఉండాలి కూడా అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు లాన్విత్‌ బాత్ర. అవయవాలు సక్రమంగా పనిచేసేలా, ఏకాగ్రత, శ్వాస బాగుండేలా ఎలాంటి పోషకాహారం తినాలో, జీవనశైలిలో అందుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పుల చోటు చేసుకోవాలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు.

శరీరంలోని ప్రతి భాగానికి సరైన ఆహారాలు

1. ఊపిరితిత్తులు: వాపు నివారణపై (Anti-Inflammation) దృష్టి సారించండి
మెరుగైన శ్వాస, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసంఅల్లం, పసుపు, సిట్రస్ పండ్లను (పుల్లని పండ్లు) ప్రత్యేకంగా సూచించారు. వీటిలో జింజెరోల్, కర్కుమిన్‌, విటమిన్ సీ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించడానికి సహాయపడతాయి. అందుకోసం ఉదయపు టీ లేదా జ్యూస్‌లో తాజా అల్లం, పసుపును చేర్చుకోండి.

2 కాలేయం (Liver): 
విషతుల్యాల నిర్మూలనకు (Detox), కొలెస్ట్రాల్‌ జీవక్రియకు మద్దతునివ్వండి. శరీరం నుంచి విషతుల్యాలను తొలగించడానికి (detox) కాలేయం ఎంతో కష్టపడి పనిచేస్తుంది. బ్రకోలి (సల్ఫోరాఫేన్ పుష్కలంగా ఉండేది), గ్రీన్ టీ, ఆలివ్ నూనె వంటి ఆహారాలు ఈ ప్రక్రియకు మద్దతునివ్వడానికి, కొవ్వు పేరుకుపోకుండా రక్షించడానికి సహాయపడతాయి. అంతేగాదు కొన్ని సులభమైన మార్పులతో, రోజువారీ ఆహారం ద్వారా వాటికి మద్దతు ఇవ్వవచ్చు.

3. పేగు ఆరోగ్యం: మంచి బ్యాక్టీరియా కోసం.. 
ఆరోగ్యకరమైన పేగుకు ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ రెండూ అవసరం. పెరుగు మీకు సజీవ మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. అయితే అరటిపండ్లు, చియా గింజలు వాటికి ఆహారం అందించే ఫైబర్‌ను అందిస్తాయి.
సులభమైన, జీర్ణవ్యవస్థకు మేలు చేసే చిరుతిండి కోసం పెరుగు, చియా గింజలను కలిపి ప్రయత్నించండి.

4. కళ్ళు: ఒత్తిడి నుంచి రక్షణ
స్క్రీన్ సమయం పెరగడంతో, కంటి ఆరోగ్యం మునుపెన్నడూ లేనంతగా ముఖ్యమైంది. క్యారెట్లు, చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ) పుష్కలంగా ఉంటుంది, అదే సమయంలో ఉసిరి రెటీనాను రక్షించడానికి విటమిన్ సీ ని అందిస్తుంది. రోజువారీ భోజనంలో కనీసం ఒక నారింజ రంగు కూరగాయను చేర్చుకోండి.

చిన్న చిన్న ఆహార ఎంపికలు శరీరంలోని వివిధ భాగాలకు వివిధ రకాలుగా సహాయపడతాయి. అందువల్ల ఏమి తింటున్నారు, ఎందుకు తింటున్నారు అనే దానిపై కాస్త శ్రద్ధ పెట్టి తీసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు పోషకాహారు నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే కాదు. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించాలి. 

(చదవండి: పాద' సేవలను గుర్తించండి!)

 

Advertisement
 
Advertisement
Advertisement