అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల​ వయసులో ఆమె .. | Viral Video: 73 year old woman goes skydiving after surprise from daughter | Sakshi
Sakshi News home page

అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల​ వయసులో ఆమె ..

Jun 12 2026 12:05 PM | Updated on Jun 12 2026 12:27 PM

Viral Video: 73 year old woman goes skydiving after surprise from daughter

చాలామంది యువకులు సైతం ప్రయత్నించడానికి సంకోచించే డేరింగ్‌ ఫీట్‌ ఇది. నేర్చుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాహసం చేయాలన్న వయసు ఎన్నటికీ అడ్డంకి కాదు అనే చెప్పే సంఘటన ఇది. ఓ కూతురు తల్లి కలను నెరవేర్చి ఆమె కళ్లలో ఉబికి వచ్చిన ఆనందం చూసి ఉప్పొంగింది. వాళ్లను బాగా కేర్‌గా చూసుకోవడం కాదు..వాళ్ల కలలను కూడా నెరవేర్చే ప్రయత్నం చేయండి అంతకన్న ఇంకేం ఆశించరు అన్న అంశాన్ని నొక్కి చెప్పింది ఈ ఘటన.     

అందుకు సంబంధించిన వీడియోని రూపాలి జన్బంధు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె 53 ఏళ్ల తల్లి తన కూతురుతో కలిసి ఒక స్కైడైవింగ్‌ క్లిప్‌ని చూస్తూ..కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె కూతురితో తాను కూడా ప్రయత్నించొచ్చా అని సరదాగా అడుగుతుంది. ఏదో సరదాగా అన్న ఆమాటను కూతురు నిజం చేస్తుందని ఆ క్షణం ఆమె అనుకోలేదు. కానీ ఆ తర్వాత కూతురు ఆ సాహసాన్నే తల్లికి ఊహించని సర్‌ప్రైజ్‌ గిప్ట్‌లా ఇచ్చింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ చాలా ఉత్సాహంతో ఎప్పడెప్పుడు ఆకాశంలోకి ఎగిరిపోతానో అన్నట్లుగా స్కైడైవింగ్‌ దుస్తులతో ఆత్రుగా ఉందామె. 

ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా ఎగరడానికి సిద్ధం అన్నట్లుగా డేరింగ్‌ చేసింది ఆ స్టంట్‌. పైగా ఆ స్కైడైవింగ్‌ని ఎంజాయ్‌ చేస్తూ కనిపిస్తున్న ఆమెను చూస్తే..ఎవ్వరికైన జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా తప్ప వయసు, భయాలను అడ్డంకిగా చేసుకోకూడదనిపిస్తుంది. అంతేగాదు ఈ వీడియోకి కూతురు రూపాలి..“73 ఏళ్లకే ఎగరడానికి సిద్ధం. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది  అమ్మా” అని క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. నెటిజన్లు కూడా ప్రేమిస్తున్నా అని చెప్పే బదులు..వారి కలలను నెరవేర్చేలా చూడండి..ఉన్నది ఒక్కటే జీవితం..హాయిగా జీవించనివ్వండి అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్‌ ఖేర్‌)
    
 

Advertisement
 
Advertisement
Advertisement