ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Uyir Movie OTT Release Date Telugu Details | Sakshi
Sakshi News home page

Uyir OTT: నిజమైన పోలీస్ అధికారి రాసిన స్టోరీ.. ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రెడీ

Jul 25 2026 3:48 PM | Updated on Jul 25 2026 4:02 PM

Uyir Movie OTT Release Date Telugu Details

ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో మలయాళ థ్రిల్లర్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అయితే లెక్కకు మించి తీస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అలానే ఒకటి ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ చిత్రమేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: 3 వారాలలోనే ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా)

గతంలో 'ఎల వీజ పూంచిర' అనే సినిమాకు రచయితగా పనిచేసిన నిజమైన పోలీస్ అధికారి షాజీ మారడ్.. ఈ 'ఉయిర్' సినిమాకు స్టోరీ, డైలాగ్స్ అందించారు. పోలీస్ శాఖలో నిజమైన విచారణ విధానాలు ఎలా ఉంటాయో రియలస్టిక్‌గా చూపించారు. రోషన్ మ్యాథ్యూ హీరో కాగా బైజు సంతోష్, అతుల్య చంద్ర, శ్రుతి మేనన్, సయామి ఖేర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

గత నెల 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే నెల 4వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

'ఉయిర్' విషయానికొస్తే.. అజీబ్(రోషన్ మ్యాథ్యూ) ప్రొబెషనరీ ఎస్సైగా ఓ స్టేషన్‌లో చేరతాడు. కొన్నాళ్లకే పాడుబడిన బావిలో ఓ మహిళ మృతదేహం కనిపిస్తుంది. సాధారణంగా చనిపోయిందని అనుకుని విచారణ ప్రారంభిస్తారు. అయితే ఇది హత్య మాత్రమే కాదని, దీని వెనక పెద్ద క్రైమ్ నెట్‌వర్క్ ఉందని అజీబ్ గుర్తిస్తాడు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎందుకు హత్య చేశారు? చివరకు హంతకుడు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement