సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. గత రెండు దశాబ్దాలుగా తనదైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ చేతిలో దాదాపు 8 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కో సినిమాకు తక్కువలో తక్కువ రూ.15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బును వృధా చేయకుండా.. పలు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతుంది. ఇప్పటికే సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్‌ని నిర్వహిస్తుంది.
దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ నయన తార పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలోని అత్యంత విలాసవంతమైన, ప్రముఖులు నివసించే ‘పోయెస్ గార్డెన్’ ఏరియాలో ఆమె ఒక లగ్జరీ నివాసాన్ని కొనుగోలు చేశారట. మార్కెట్ విలువల ప్రకారం దాని విలువ రూ. 40 కోట్ల విలువ ఉంటుందట.
త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేయబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఏరియాలో . సూపర్ స్టార్ రజినీకాంత్, నటుడు ధనుష్‌లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. నయనతార నటిస్తున్న చిత్రాల్లో ఆగస్ట్ 26న ‘టాక్సిక్’, ఆగస్ట్ 14న హాయ్ చిత్రం రిలీజ్ కానుంది.


