ఏ రంగంలో అయినా సక్సెస్ ఉన్నోడిదే రాజ్యం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఉంటే దానికి తగ్గట్లే రెమ్యునరేషన్ డిమాండ్ చేయొచ్చు. లేదంటే ఎవరూ పట్టించుకోరు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే రీసెంట్‌గా 'లెనిన్' మూవీతో అఖిల్ తొలి సక్సెస్ అందుకున్నాడు. అదే టైంలో హీరోయిన్ భాగ్యశ్రీకి కూడా ఇదే తొలి హిట్ కావడం విశేషం. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది: కాజల్)
ఉత్తరాది భామ అయిన భాగ్యశ్రీ బోర్సే.. రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఘోరమైన డిజాస్టర్ అయింది. దీని తర్వాత కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా అని వరస మూవీస్ చేసింది గానీ హిట్ దక్కలేదు. అయితే అఖిల్ 'లెనిన్'లో తొలుత శ్రీలీలని హీరోయిన్ అనుకున్నారు కానీ ఆమె సైడ్ కావడంతో ఈ అవకాశం భాగ్యశ్రీని వరించింది.
భారతి పాత్రలో అందచందాలతో ఆకట్టుకున్న భాగ్యశ్రీకి.. 'లెనిన్'తో సక్సెస్ దక్కింది. మరీ సూపర్ హిట్ కానప్పటికీ యాక్టింగ్, గ్లామర్ పరంగా భాగ్యశ్రీకి మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పటివరకు రూ.కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా సరేనంటున్నారని టాక్.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)


