లెనిన్ విలన్.. ప్రభాస్‌ను అంత మాట ‍అనేశాడా? | Lenin Villain comments on tollywood hero Prabhas goes viral | Sakshi
Sakshi News home page

Lenin Movie: లెనిన్ విలన్.. ప్రభాస్‌ను అంత మాట అన్నావేంటి బ్రో?

Jul 16 2026 4:27 PM | Updated on Jul 16 2026 5:03 PM

Lenin Villain comments on tollywood hero Prabhas goes viral

అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్‌లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్‌ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ గుంటూరులో నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్‌ లెనిన్‌లో విలన్‌గా మెప్పించిన కన్నడ నటుడు ప్రమోద్ పంజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీట్‌లో ప్రభాస్ గురించి మాట్లాడారు. ఆయనలో తనకు నచ్చింది హాస్పిటాలిటీ అని తెలిపారు. అఖిల్ అన్నలో కూడా అదే చూశానని కొనియాడారు. అయితే ప్రభాస్‌ను పొగిడే క్షణంలో వాడు అని ప్రమోద్ సంభోదించారు. తెలుగు సరిగా రాకపోవడం వల్లా అలా అన్నారా.. లేదా కావాలనే ఉద్దేశపూర్వకంగా అన్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రభాస్‌ను వాడు అని సంభోధించడంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement