పెళ్లికి ముందు ఇంకొకరితో ప్రేమలో ఉన్నా.. బ్రేకప్‌కి కారణం ఇదే: నటి | Swasika Vijay Opens Up About Her Heartbreaking Past Relationship, Speaks On Casting Couch In Film Industry | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు ఒకరితో రిలేషన్‌లో ఉన్నా..బ్రేకప్‌కి కారణం ఇదే : మలయాళ నటి

Jul 16 2026 3:42 PM | Updated on Jul 16 2026 4:04 PM

Swasika Vijay Opens About Her Past Love Story

మలయాళ, తమిళ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక విజయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గత ప్రేమ బంధం గురించి వివరిస్తూ, సినీ పరిశ్రమలోని సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లికి ముందు నేను ఒకరితో రిలేషన్‌లో ఉన్నా. ఒక సీరియల్‌లో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డాను. 'మనసు పోలే మంగళ్యం' సీరియల్ షూటింగ్ సమయంలో మా పరిచయం ప్రేమగా మారింది. అతను వృత్తిరీత్యా గేమ్ డెవలపర్. అతని కుటుంబానికి నటనతో ఎలాంటి సంబంధం లేదు. 

కానీ కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ ఉండటం వల్ల, అతను సరదాగా సీరియల్‌లో నటించడానికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి ఆలోచనలు, నటనపై ఉన్న ప్యాషన్ కలవడంతో మేము దగ్గరయ్యాం. అతను చాలా మంచి వ్యక్తి, నన్ను ఎంతో గౌరవించేవాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అనూహ్యంగా అతని కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అలాగే కొందరు కుటుంబ సభ్యులు మరణించారు. ఆ పరిస్థితులు అతన్ని మానసికంగా తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ డిప్రెషన్ కారణంగానే అతను నన్ను దూరం చేసుకున్నాడు. ఇందులో నా తప్పేమీ లేదు’ అని స్వాసిక చెప్పుకొచ్చింది.

ఇక సినీ పరిశ్రమలో ఎదురయ్యే 'కాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతూ..ఈ సమస్యలు కేవలం సినిమా రంగానికే పరిమితం కావని, అన్ని రంగాల్లోనూ ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, మీడియా దృష్టి ఎక్కువగా సినిమా పరిశ్రమపైనే ఉండటం వల్ల ఇది ఇక్కడ పెద్ద విషయంగా కనిపిస్తుందని ఆమె విశ్లేషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement