రామ్ చరణ్‌కి అమ్మగా ఛాన్స్.. రిజెక్ట్ చేసేశా: ప్రముఖ నటి
సినిమాల్లో అప్పుడప్పుడు చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. నిజ జీవితంలో హీరోల కంటే తక్కువ వయసులో ఉన్న కొందరు.. అదే హీరోలకు తల్లి-పిన్ని తరహా పాత్రలు చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మలయాళ నటికి ఏకంగా రామ్ చరణ్ తల్లిగా నటించే ఛాన్స్ వచ్చింది కానీ ఆమె దాన్ని మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఎవరామె? ఏంటి సంగతి?మలయాళ నటి స్వాసిక తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. రీసెంట్గా రిలీజైన నితిన్ 'తమ్ముడు' సినిమాలో చుట్ట కాలుస్తూ విలన్‌గా చేసింది ఈమెనే. 2009లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. మలయాళ, తమిళ సినిమాలు చేసింది. రియాలిటీ షోలు, టీవీ సీరియల్స్ కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది రిలీజైన తమిళ మూవీ 'లబ్బర్ పందు'లో హీరోయిన్‌కి తల్లిగా అద్భుతంగా నటించింది. ఈ మూవీ వచ్చిన తర్వాత నుంచి ఈమె తల్లి పాత్రలే చాలా వస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ))'తల్లి పాత్రల ఆఫర్స్ వరసపెట్టి వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కాదు గానీ రామ్ చరణ్‌కి తల్లిగా నటించే ఛాన్స్ రావడం మాత్రం నాకు పెద్ద షాక్ ఇచ్చింది. 'పెద్ది' మూవీ కోసమే అడిగారు. కానీ నేను చేయనని చెప్పేశాను. చేసుంటే ఎలా ఉండేదే ఏమో గానీ ఇప్పుడు ఒప్పుకోవడం కరెక్ట్ కాదనిపించింది. భవిష్యత్తులో ఇదే అవకాశం వస్తే మాత్రం ఆలోచిస్తాను' అని స్వాసిక చెప్పుకొచ్చింది.ప్రస్తుతం స్వాసిక వయసు 33 ఏళ్లే. రామ్ చరణ్ వయసు 40 ఏళ్లు. ఒకవేళ చేసుంటే మాత్రం క్రేజీగా ఉండేదేమో. స్వాసిక వ్యక్తిగత విషయానికొస్తే.. నటుడు ప్రేమ్ జాకబ్‌ని గత కొన్నేళ్లుగా ప్రేమించింది. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా వచ్చిన రెట్రో, మామన్, తమ్ముడు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సూర్య 'కరుప్పు' మూవీలో కీలక పాత్ర చేస్తోంది.'పెద్ది' విషయానికొస్తే.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఓ గ్లింప్స్ రాగా అంచనాలు పెంచేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'సూపర్ మ్యాన్'.. తెలుగులోనూ స్ట్రీమింగ్)🔥 #Swasika’s BOLD response to being offered a mother’s role in #RamCharan’s movie! 😱 #Swasika #RamCharan #Kollywood #TamilCinema #RamCharan𓃵 #Ramcharan #Peddi #Peddi #swasika pic.twitter.com/4JQoobYtHE— Mix Show (@MixShow1016584) August 24, 2025