ఇజ్రాయెల్‌ ప్రకటన : ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ?! | Top Iran Security Chief Ali Larijani Killed In Overnight Israeli Airstrike Amid Ongoing Conflict, Claims Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ ప్రకటన : ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ?!

Mar 17 2026 3:37 PM | Updated on Mar 17 2026 4:41 PM

Iran Security Chief Ali Larijani Killed In Overnight Strike Claims Israel

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా గత 18 రోజులుగా ఇరాన్‌ పోరాడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా విభాగం అధిపతి అలీ లారిజానీ మరణించినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ, టెహ్రాన్ బసిజ్ పారామిలిటరీ దళాల కమాండర్‌ సోలేమానీ హతమయ్యారని  ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మంగళవారం తెలిపారు.
 

కీలక నేత అలీ లారిజానీ మృతి
ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులలో ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ చనిపోయారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.. ఈ దాడుల్లో బాసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అధిపతి సులేమానీ లక్ష్యంగా ఈదాడి జరిగిందని వెల్లడించాయి.అయితే లారిజాని ఈ దాడిలో మరణించారా లేదా గాయపడ్డారా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది.

ఇంకా స్పందించని ఇరాన్‌ 
ఈ నివేదికలపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. లారిజానిని ఇరాన్ అధికార వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా  భావిస్తారు. ఈ వార్త నిజమైతే, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత ఇరాన్‌లో మరణించిన అత్యంత కీలకమైన వ్యక్తి లారిజానీ. లారిజానీ గతంలో అణు చర్చల ప్రతినిధిగా కూడా పనిచేశారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శిస్తూ, ఇరాన్ ప్రజల పోరాటం కొనసాగుతుందని తమ పోరాటంలో టెహ్రాన్ "దృఢంగా" ఉంటుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి లారిజాని ముస్లిం ఐక్యతకు పిలుపునిచ్చిన మరునాడు ఈ వార్తలు  వెలువడ్డాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement