విశాఖ : ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమిలి, తగరపువలస, అనకాపల్లి, మాడుగులలో కుండపోత వాన పడింది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది.
వర్షాల ధాటికి పలు చోట్ల కరెంట్ స్తంభాలు, చెట్లు పడిపోయాయి.
చెట్లు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వర్షాలతో ఎండల నుంచి జనానికి ఉపశమనం లభించింది.


