ఐదు పదుల వయసులోనూ అంతే యంగ్‌గా ప్రిన్స్‌ మహేశ్‌..! | diet secrets behind 51-year-old Telugu actors Mahesh Babu ageless look | Sakshi
Sakshi News home page

ఐదు పదుల వయసులోనూ అంతే యంగ్‌గా ప్రిన్స్‌ మహేశ్‌..! ఆకర్షణీయమైన రూపం కోసం..

Aug 9 2026 3:18 PM | Updated on Aug 9 2026 3:34 PM

diet secrets behind 51-year-old Telugu actors Mahesh Babu ageless look

ప్రిన్స్‌ మహేశ్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఆరాధించే ఈ టాలీవుడ్‌ హీరో ఈ రోజుతో 51వ వసంతంలోకి అగుడుపెట్టారు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా..ఇప్పటికీ అంతే అందంగా యంగ్‌లుక్‌లో అలరించే నటుడు ఆయన. అందంలో ఈ యువరాజుకి "సరిలేరు నీకెవ్వరు" అనేలా అభిమానులను ఆకట్టుకుంటారాయన. ఇవాళ ప్రిన్స్‌ మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా..వృద్ధాప్యాన్నే తిప్పికొట్టేలా అంతలా గ్లామరస్‌గా కనిపించేందుకు మహేశ్‌ ఏం చేస్తుంటారు, ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటారో సవివరంగా తెలుసుకుందామా.

టాలీవుడ్‌ నటుడు మహేశ్‌ బాబు ఆగస్టు9, 2026న 51వ ఏటలోకి అడుగుపెట్టారు. వయసు కనపించని ఆయన ఆకర్షణీయమైన రూపానికి ఫిదా అవ్వని వాళ్లు లేరు. అంతలా అభిమానులను సంపాదించుకున్న​ ఈ నటుడు తన చర్మసంరక్షణ కోసం ఎలాంటి ఖరీదైన చికిత్సలు జోలికి పోరట. అదంతా ఆయన తీసుకునే ఆహారంలో ఉందట. 

యంగ్‌ లుక్‌ కోసం..
ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో పేస్ట్రీ, బర్గర్ లేదా పెరుగు అన్నం వీటిలో ఏది ఇష్టంగా తింటారని అడగగా..ఆ మూడు తను తినని అన్నారు. తాను పాల ఉత్పత్తులకు చాలా దూరంగా ఉంటానన్నారు. బ్రెడ్‌, బర్గర్ల జోలికి పోనన్నారు. తాను ఎక్కువగా మొక్కల ఆధారిత భోజనమే తీసుకుంటానని అన్నారు. వైద్యుల సైతం ఆయన డైట్‌ని 'గట్-స్కిన్ యాక్సిస్' గా పేర్కొన్నారు. ఆయన తీసుకునే ఆహారం పోషణకు, దీర్ఘాయువుకి..చర్మసంరక్షణకు కీలకమైన ఆరోగ్యకరమైన ఆహరంగా చెబుతున్నారు వైద్యులు. 

ఆ కారణంగానే ఆయన ఏళ్ల తరబడి ఒకేలా అంతే అందంగా కనిపిస్తున్నారని అన్నారు. చర్మానికి చికిత్స అంటే మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఎందుకంటే మనం కూరగాయలు తిన్నప్పుడు వాటిలో మంచి ఫైబర్‌ ఉంటుంది. దీని వల్ల మీ గట్‌లో మంచి బ్యాక్టీరియా ఆహారంగా మారుతుంది. దాంతో చర్మంపై వాపులు అలాంటివి ధరిచేరవు, పైగా హెల్దీ స్కిన్‌కి, కాంతికి దోహదపడుతుందని చెబుతున్నారు వైద్యులు. 

గట్‌ బ్యాక్టీరియా సరిగా లేనప్పుడు చర్మం దెబ్బతినేలా వాపుని కలిగించే రసాయనాలు రక్తప్రవాహంలో చేరి మెటిమలు, ఎరుదనంతో కూడిన ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయన్నారు. అంతేగాదు మొటిమలు, సోరియాసిస్, ఎగ్జిమా వంటి సమస్యలుంటే వారిలో మైక్రోబయోమ్‌లు దెబ్బతిన్నాయని , ప్రయోజనకరమైన బ్యాక్టీరియా స్థాయిలు తగ్గాయని అర్థమట. 

ప్రేగు-చర్మం ఆరోగ్యంకోసం..

ఫైబర్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రీబయోటిక్ ఫైబర్‌లు బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందిస్తాయి, ఇవి బ్యూటిరేట్ వంటి షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడటమే గాక చర్మాన్ని ప్రభావితం చేస్తుంది.

క్యారెట్లు, మిరపకాయలు, టమోటాలు వంటి ఆహారాలలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. బీటా-కెరోటిన్, లైకోపీన్, ఆస్టాక్సాంథిన్ ఒక అంతర్గత సన్‌స్క్రీన్‌లా పనిచేసి..ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, చర్మ ఆకృతిని, కాంతిని మెరుగుపరుస్తాయి. 

ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇది చర్మ సమస్యలకు దారితీస్తుంది. 

ఆరోగ్యకరమైన చర్మ కాంతి కోసం హీరో మహేశ్‌ బాబులా పాల ఉత్పత్తులకు, బ్రెడ్‌, బర్గర్‌లకు దూరంగా ఉండాలే అసాధారణమైన సంకల్పం బలం కావాలన్నారు. మంచి చర్మం అంటే కేవలం ముఖానికి రాసుకునే క్రీమ్‌లు, లోషన్‌లు మాత్రమే కాదు, అంతర్గతంగా మనం తీసుకునే ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

(చదవండి: మెరిసే ముఖానికి కుంకుమాది తైలం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement