మహేశ్ బాబు బర్త్‌ డే.. నమ్రతా స్పెషల్ పోస్ట్ | Namrata Shirodkar Special Birthday Wishes To Her Husband Superstar Mahesh Babu, Post Trending On Social Media | Sakshi
Sakshi News home page

Mahesh Babu- Namratha: మహేశ్ బాబు బర్త్‌ డే.. నమ్రతా స్పెషల్ పోస్ట్

Aug 9 2026 12:36 PM | Updated on Aug 9 2026 2:09 PM

Namrata Shirodkar Birthday wishes to her Husband Mahesh Babu

మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్‌ డే ఎంబీ.. ప్రతి రోజు మాకు ఎంతో స్పెషల్‌ చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఈ ఏడాది మరింత ప్రేమ, ఆరోగ్యం, సంతోషంగా గడవాలని కోరుకుంటున్నట్లు నమ్రతా రాసుకొచ్చింది. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నామంటూ ఇన్‌స్టాలో ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది.

కాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడైన మహేశ్ బాబు.. నమ్రతాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు జంటగా వంశీ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడిన ఈ జంట పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత నమ్రతా సినిమాలకు గుడ్‌ బై చెప్పేసింది. వీరికి సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం మహేశ్ బాబు.. రాజమౌళితో కలిసి వారణాసి మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement