యశ్ హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ – అప్స్. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీ కేవలం పెద్దల కోసం మాత్రమేనని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో వయొలెన్స్, గన్స్, స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బోల్డ్ టచ్ ఉన్న సన్నివేశాలు, గ్లామరస్ పాటలు సినిమాపై ఆసక్తితో పాటు చర్చకు కూడా కారణమయ్యాయి
అయితే తాజాగా టాక్సిక్ మూవీలో కియారా రోల్‌పై మొదటి నుంచి విమర్శలొస్తున్నాయి. ఆమె తల్లి అయిన కొద్ది నెలల్లోనే ఇలాంటి బోల్డ్ రోల్ చేయడంపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. టాక్సిక్ బోల్డ్ సాంగ్ రిలీజ్ తర్వాత ఆమెపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీ డైరెక్టర్ కూడా లేడీ కావడంతో టాక్సిక్‌పై మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనూ వయొలెన్స్, బోల్డ్ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో యశ్.. హీరోయిన్ కియారాపై ప్రశంసలు కురిపించారు. ఆమె ఒక ప్రళయం అంటూ కొనియాడారు. ముఖ్యంగా ట్రోలింగ్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు యశ్. నువ్వు ఈ సినిమాలో చాలా గొప్ప పాత్ర పోషించావని కొనియాడారు. నయనతార సైతం కియారాపై ప్రశంసలు కురిపించింది.
అయితే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా అంటే కేవలం వయొలెన్స్, బోల్డ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి సినిమాలతో సమాజానికి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా మూవీ తీస్తే కథలో కొంతైనా సందేశాత్మకంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను ఎక్కువగా తీసుకురావడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. టాక్సిక్ మాత్రమే కాదు.. ఇటీవలే రిలీజైన ది ప్యారడైజ్ టీజర్‌లో కూడా కేవలం హింసనే చూపించారు. రక్తపాతాన్ని తలపించేలా టీజర్ విడుదల చేశారు. ఇదంతా చూస్తుంటే డైరెక్టర్స్ సృజనాత్మకత పక్కనపెట్టి.. కేవలం హింస, బోల్డ్‌నే నమ్ముకున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సినిమా అంటే సమాజానికి ఓ సందేశం ఇచ్చేలా ఉండాలి కానీ.. కేవలం డబ్బుల కోసం ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఓ సారి ప్రశ్నించుకోవాలి. సినిమాను సినిమాగానే చూడాలి అని అంటారు.. కరెక్టే కానీ.. దానికి కూడా లిమిట్స్ ఉంటాయని గ్రహించాలని నెటిజన్స్ కోరుతున్నారు.


