మహేశ్‌ బాబు-రాజమౌళి కాంబో.. వారణాసి బర్త్‌ డే అప్‌డేట్‌ ఇదే | Mahesh Babu and SS rajamouli Varanasi Movie update on birthday | Sakshi
Sakshi News home page

Varanasi Movie: మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. ఇంత సింపుల్‌గా ఇచ్చారేంటి?

Aug 9 2026 7:34 AM | Updated on Aug 9 2026 8:16 AM

Mahesh Babu and SS rajamouli Varanasi Movie update on birthday

మహేశ్‌ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు రాజమౌళి.  ఈ మూవీ వచ్చే ఏప్రిల్ 7న  ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో రుద్రను పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు అనే క్యాప్షన్‌ పెట్టారు. కాగా.. ఈ చిత్రంలో మహేశ్ బాబు.. రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మహేశ్ బాబు చాలా సింపుల్‌గా కనిపించారు. పొడవైడ జుట్టు, గడ్డంతో రిలీజ్ చేసిన మహేశ్ బాబు పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇది చూస్తుంటే రుద్ర పాత్ర ప్రపంచ యాత్రికుడిగా ఉండనుందని అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement