20 నిమిషాల ఎపిసోడ్‌.. ‘వారణాసి’లో అదే హైలెట్‌! | This 20 Minutes Ramayana Sequence Episode Is Highlights In Mahesh Babu Varanasi Film, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

20 నిమిషాల ఎపిసోడ్‌ కోసం 60 రోజుల షూటింగ్‌.. ‘వారణాసి’లో అదే హైలెట్‌

Aug 6 2026 8:46 AM | Updated on Aug 6 2026 10:08 AM

This 20 Minute Episode Is Highlights In Mahesh Babu Varanasi Film

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ బాబు హీరోగా పాన్‌ వరల్డ్‌ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘వారణాసి’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. దాదాపు 20 నిమిషాల పాటు సాగే రామాయణం ఎపిసోడ్‌లో రాముడిగా మహేశ్‌ ప్రెజెన్స్‌ అద్భుతంగా ఉంటుందని సమాచారం. తెరపై కనిపించే ఈ 20 నిమిషాల ఎపిసోడ్‌ చిత్రీకరణకు దాదాపు 60 రోజులు పట్టిందట. 

ఇక ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం వరకు ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరగ్గా, మహేశ్‌ పాల్గొన్నారట. ఆ తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకుని వెకేషన్‌ వెళ్లారు. మరి... బర్త్‌ డే సందర్భంగా ‘వారణాసి’ చిత్రం నుంచి మహేశ్‌బాబు ప్రత్యేక పోస్టర్‌ని కానీ వేరే ఏదైనా అప్‌డేట్‌ కానీ ఇస్తారేమో చూడాలి. ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో ‘వారణాసి’ని రిలీజ్‌ చేయనున్నారు. 

విదేశాల్లో బర్త్‌డే సెలెబ్రేషన్స్‌
నటుడిగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి తగినంత సమయాన్ని కేటాయిస్తుంటారు మహేశ్‌బాబు. షూటింగ్స్‌కి గ్యాప్‌ దొరికినప్పుడు ఫ్యామిలీతో వెకేషన్‌ ప్లాన్‌ చేసుకుంటారు. ప్రస్తుతం తన కుటుంబంతో సహా మహేశ్‌ విదేశాల్లో ఉన్నారు. ఈ నెల 9న ఈ హీరో పుట్టినరోజు. సో... బర్త్‌ డే వేడుకను అక్కడే జరుపుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకుని ‘వారణాసి’ సినిమా షూట్‌లో పాల్గొంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement