షాపింగ్‌ కోసం ఏకంగా హెలికాప్టర్‌ ..!విస్తుపోయిన అధికారులు | 69 Year Old Man In US Flies Helicopter To Shop Goes Viral | Sakshi
Sakshi News home page

షాపింగ్‌ కోసం ఏకంగా హెలికాప్టర్‌..!విస్తుపోయిన అధికారులు

Aug 5 2026 6:52 PM | Updated on Aug 5 2026 7:27 PM

 69 Year Old Man In US Flies Helicopter To Shop Goes Viral

షాపింగ్‌ కోసం ఇక్కడొక అమెరికా వ్యక్తి ఏకంగా హెలికాప్టర్‌లో ప్రయాణించాడు. ఈ ఘటన అమెరికాలోని రోసెండాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. స్టానిక అవుట్‌ డోర్‌ సామాగ్రి దుకాణమైన 'కాబెలాస్'కు వెళ్లేందుకు విస్కాన్సిన్‌కు చెందిన 69 ఏళ్ల వ్యక్తి హెలికాప్టర్‌లో వెళ్లాడు. అతడు సుదీర్ఘ ప్రయాణాన్ని నివారించేందుకు ఇలా చేసినట్లు సమాచారం. అయితే ఆ హెలికాప్టర్‌ను నేరుగా పార్కింగ్‌ స్థలంలో ల్యాండ్‌ చేయడంతో ఒక్కసారిగా స్థానికులు, అధికారులు ఆశ్చర్యపోయారు. 

రోసెండాల్‌ గ్రామం నుంచి బయలుదేరిన పైలట్‌ తన అసాధారణ జర్నీ గురించి వివరిస్తూ.. హైవేపై డ్రైవింగ్ చేయడానికి చాలా సమయం పడుతుందని తేలికగా పేర్కొన్నారు. రిచ్‌ఫీల్డ్ గ్రామంలోని కాబెలాస్ పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ దిగినట్లు సమాచారం రావడంతో వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. 

పైలట్‌తో మాట్లాడిన తర్వాత, రోసెండేల్‌కు చెందిన 69 ఏళ్ల వ్యక్తి ఇలా తన ప్రైవేట్‌ హెలికాప్టర్‌లో ప్రయాణించినట్లు గ్రహించారు. చాలా దూరం జర్నీ ఉంటుందని చెప్పడంతోనే ఇలా హెలికాప్టర్‌లో తీసుకువచ్చినట్లు అధికారులకు పైలట్‌ తెలిపాడు. అంతేగాదు ఆ పైలట్‌కు లైసెన్స్‌ ఉంది. అలాగే సురక్షితంగా ల్యాండ్‌ అయ్యాడు కూడా. అన్ని నిబంధనలను పాటించే హెలికాప్టర్‌ని నడిపనట్లు తేలింది. 

అలాగే అతడు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తేలడంతో ఎటువంటి అరెస్టులు వంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు అధికారులు. నెటిజన్లు కూడా ప్రతి ఒక్కరికీ ఎగిరే విమానం ఉంటే ఎంత బాగుండును అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: ‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement