ఛత్రా: జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికపై అత్యాచారం, నిర్బంధం ఆరోపణల నేపథ్యంలో ఒక యువకునిపై ఆగ్రహించిన గ్రామస్తుల అతనికిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఒక బాలిక కనిపించకుండా పోయింది. మంగళవారం ఉదయం ఆమె ఆచూకీ లభించగా, సదరు యువకుడు తనను ఇంట్లో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.
దీంతో సుమారు 100 నుంచి 150 మంది గ్రామస్తులు యువకుడి ఇంటిని చుట్టుముట్టారు. ఆ యువకుడి తల్లిదండ్రులను కట్టేసి దాడికి పాల్పడ్డారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడిపై కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా 56 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) డియోలాల్ ఒరాన్ తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించామని, నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాలను మోహరించారు.
ఇది కూడా చదవండి: జంతర్ మంతర్‌లో పెట్రోల్ బాంబులతో దాడికి ప్లాన్


