ట్రంప్‌ను టార్గెట్‌ చేశారా?.. గోల్ఫ్ క్లబ్‌ వద్ద హైటెన్షన్‌.. | Trump golf course visit Armed man arrest | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ను టార్గెట్‌ చేశారా?.. గోల్ఫ్ క్లబ్‌ వద్ద హైటెన్షన్‌..

Aug 5 2026 7:44 AM | Updated on Aug 5 2026 7:44 AM

Trump golf course visit Armed man arrest

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కాలిఫోర్నియా పర్యటన వేళ తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో నిర్వహించనున్న నిధుల సేకరణ కార్యక్రమానికి (ఫండ్‌రైజింగ్ డిన్నర్) హాజరుకానున్న నేపథ్యంలో, అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద గన్‌, బుల్లెట్స్‌ లభించడం మరింత టెన్షన్‌కు గురిచేసింది. సదరు వ్యక్తిని జీనైన్ జాన్ టేలే (38)గా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై అధికారుల వివరాల ప్రకారం.. జీనైన్ జాన్ టేలే గోల్ఫ్ కోర్స్‌లో తిరుగుతూ ఫోటోలు, వీడియోలు తీస్తూ భద్రతా ఏర్పాట్లను గమనిస్తున్నట్లు కనిపించాడు. తనిఖీలో అతని వద్ద దాచిన పిస్టల్, నిషేధిత సామర్థ్యం గల మ్యాగజైన్లు, హాలో-పాయింట్ బుల్లెట్లు లభించాయి. అనంతరం అతని ఇంటిపై జరిపిన సోదాల్లో అక్రమంగా మార్పులు చేసిన AR-శైలి రైఫిల్, మరో పిస్టల్, బాడీ ఆర్మర్, అధిక మొత్తంలో మందుగుండు సామగ్రి, అలాగే ఆందోళన కలిగించే నోట్‌బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌బీఐ జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్, యు.ఎస్. సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ట్రంప్ పర్యటనతో ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా? దాడి చేసే ఉద్దేశం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. అయితే, ట్రంప్‌పై దాడి చేయాలనే కుట్ర జరిగినట్లు లేదా నిందితుడు అలాంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చినట్లు ఇప్పటివరకు అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అతనిపై ఆయుధాలకు సంబంధించిన అభియోగాలే నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతోంది. < /p>

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement