సీఆర్పీఎఫ్ క్యాంపులో కాల్పుల కలకలం.. ముగ్గురు జవాన్లు మృతి! | CRPF Officer Shoots 2 Colleagues Dead Then Kills Self in Assam | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్ క్యాంపులో కాల్పుల కలకలం.. ముగ్గురు జవాన్లు మృతి!

Aug 4 2026 12:29 PM | Updated on Aug 4 2026 12:35 PM

CRPF Officer Shoots 2 Colleagues Dead Then Kills Self in Assam

నాగావ్: అస్సాంలోని నాగావ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) క్యాంపులో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. క్యాంపు పరిధిలో జరిగిన ఈ ఘర్షణలో ఒక సీఆర్పీఎఫ్ అధికారి తన సహచరులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు సహచరులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

సహచరులను హతమార్చిన అనంతరం ఆ అధికారి తన తుపాకీతో తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, ఈ ఘర్షణకు దారితీసిన కారణాలు, పరిస్థితులు ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
 

మృతి చెందిన సిబ్బందికి సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. క్యాంపులో భద్రతను కట్టుదిట్టం చేసి, ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ విషాదకర ఘటనతో సీఆర్పీఎఫ్ క్యాంపులో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: బాలాజీ శ్రీనివాసన్ సంచలన ప్రాజెక్ట్‌కు బిగ్ షాక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement