చెన్నై: డీఎంకే నేత ఉదయనిధి అరెస్టును డీఎంకే ఖండించింది. ఉదయనిధి తన మాటల్లో ఎక్కడా ఎవరి పేరు ప్రస్థావించలేదని అందులో ఎక్కడా తప్పు కనిపించలేదని తెలిపింది. అంతకు ముందు అరెస్ట్ సమయంలో ఉదయనిధి మాట్లాడారు. తాను ఎవరి పేరు ప్రస్థావించలేదని ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటాన్నారు.
ఈరోజు తమిళనాడులో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉదయనిధిపై కేసు నమోదైంది.దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఆరుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు.
ఏం జరిగిందంటే..
సోమవారం తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన డీఎంకే కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో.. కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయ్‌నిధి.. కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా, ‘నీళ్లు’ మాత్రం అక్కడికి వెళ్తాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి డబుల్ మీనింగ్‌గా చేసిన వ్యాఖ్యలేనని టీవీకే ఆరోపిస్తోంది.


