చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న (సోమవారం) కావేరీ అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో సీఎం విజయ్‌పై విమర్శలు గుప్పిస్తున్న సమయంలో సభలోని ప్రజలనుంచి నుంచి "త్రిష-త్రిష" అంటూ నినాదాలు వ్యక్తమయ్యాయి. దీనికి ఉదయనిధి నవ్వుతూ ఇన్యుయేండో (అర్థవంతమైన వ్యాఖ్య) అని అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
కాగా ఈ వాఖ్యలను టీవీకేతో పాటు బీజేపీ ఖండించింది
టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ మాట్లాడుతూ " ఇలాంటి వ్యాఖ్యలు అసహ్యకరం. ఎవరిపైనైనా ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలు చేయడం పూర్తిగా సిగ్గుచేటు. ఇది ఆ కుటుంబం యొక్క ఆలోచనా విధానాన్ని, రాజకీయ సంస్కృతిని పడిపోతున్న ప్రమాణాలను బట్టబయలు చేస్తోంది" అని ఆయన మండిపడ్డారు. రాజకీయ నాయకుడిగా ఉదయనిధి స్థాయి మరింతగా దిగజారిందని విమర్శించారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ నారాయణ తిరుపతి మాట్లాడుతుూ..తంజావూరులో ముఖ్యమంత్రి విజయ్ ,త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ ప్రసంగం అసహ్యకరమైనది, అభ్యంతరకరమైనది సిగ్గుచేటని అన్నారు. "తల్లి, భార్య, కూతురు ఉన్న ఏ దొంగ లేదా రౌడీ కూడా అంత నీచంగా మాట్లాడలేడు. 'ద్రవిడ మోడల్' అని చెప్పుకునే ఈ వ్యక్తులు బహిరంగంగా ఇలా మాట్లాడుతుంటే, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చూస్తూ ఊరుకోవడం సిగ్గుచేటు" అని ఆయన దుయ్యబట్టారు. ఉదయనిధిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం: "తాను ఆ కళాకారుడి మనవడిని అని చెప్పుకునే ఆయన ఇలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. ప్రతిపక్ష నేత స్వయంగా మాజీ నటుడే. అయినప్పటికీ తోటి కళాకారుల పట్ల ఇంత చిన్నచూపుతో, అసహ్యంగా మాట్లాడడం దిగ్భ్రాంతికరం ". అన్నారు.
గత వివాదాలు
మూడేళ్ల క్రితం సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోల్చి ఉదయనిధి స్టాలిన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దానిని నిర్మూలించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో, ఉదయనిధి చేసిన ఈ తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేపాయి.
ఏం జరిగింది.
తమిళనాడులో కావేరి నీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం (టీవీకే) వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తంజావూరులో ఒక భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఆ సమయంలో సభికుల్లో నుంచి కొందరు అకస్మాత్తుగా "త్రిష... త్రిష" అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రజల నుంచి ఆ నినాదాలను చూసి ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం మధ్యలో ఆగిపోయి, నవ్వుతూ ఒక డబుల్ మీనింగ్ (అర్థవంతమైన ఇన్యుయేండో) వ్యాఖ్య చేశారు. దీనిపై ఇప్పడు దుమారం చెలరేగింది


