బ్రిజ్‌ భూషణ్‌కు భారీ ఊరట | Brij Bhushan Sharan Singh acquitted in harassment case | Sakshi
Sakshi News home page

బ్రిజ్‌ భూషణ్‌కు భారీ ఊరట

Aug 4 2026 6:25 AM | Updated on Aug 4 2026 6:25 AM

Brij Bhushan Sharan Singh acquitted in harassment case

లైంగిక ఆరోపణల కేసులో నిర్దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు 

సాక్ష్యాలు లేవని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: మహిళ రెజ్లర్లపై లైంగిక ఆరోపణలకు పాల్పడ్డారన్న ఆరోపణల నుంచి రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్‌భూషణ శరణ్‌ సింగ్‌కు సోమవారం భారీ ఊరట లభించింది. సాక్ష్యాలు లేని కారణంగా ప్రపంచ ఛాంపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌సహా ఆరుగురు రెజ్లర్లు బ్రిజ్‌భూషణ్‌పై వేసిన కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి అశ్విని పన్వర్‌ తీర్పునిచ్చారు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌తోపాటు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌నూ నిర్దోషిగా ప్రకటించారు.

 ఈ తీర్పును సవాలు చేయాల్సిందిగా రెజర్లు తమ న్యాయవాదులకు ఇప్పటికే తెలియజేశారని, త్వరలోనే అప్పీల్‌ దాఖలవుతుందని వినేశ్‌ ఫొగాట్‌ ప్రకటించారు.

 ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేవని, సాక్షుల వాంగ్మూలాల్లోనూ స్థిరత్వం కొరవడింది. కొందరు పరస్పర విరుద్ధమైన సాక్ష్యాలు ఇచ్చారని తాము చేసిన వాదనన న్యాయమూర్తి అంగీకరించినట్లు బ్రిజ్‌భూషణ్, వినోద్‌ తోమర్‌ల తరఫు న్యాయవాది రాజీవ్‌ మోహన్‌ తెలిపారు. అయితే తీర్పు కాపీ అందక ముందే ఈ అంశాల ఆధారంగానే న్యాయమూర్తి తీర్పు        ఇచి్చనట్లు ఆయనెలా చెబుతారని రెజ్లర్ల తరఫున వాదించిన న్యాయవాది రెబెకా జాన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఆనాడే చెప్పా: బ్రిజ్‌ భూషణ్‌: ‘‘లైంగిక ఆరోపణలు నిజమైతే ఉరి వేసుకుంటానని మొదటి రోజు నుంచే చెప్పాను. నేడు నేను నిర్దోషిగా నిరూపితమవడం శుభవార్త’’అని బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. 

పోరాటం కొనసాగుతుంది: బ్రిజ్‌భూషణ్‌ను నిర్దోషిగా విడుదల చేయడంపై రెజ ర్లు వినేశ్‌ ఫొగాట్, భజరంగ్‌ పూనియలు ఎక్స్‌పై స్పందించారు. రెజర్లు తమ విశ్వాసాన్ని కోల్పోలేదని, పోరాటం కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. ఫెడరేషన్‌ పాలకపక్షం, ప్రభుత్వం, వ్యవస్థలన్నీ మొదటి నుంచి కూడా బ్రిజ్‌భూషణ్‌ను రక్షించేందుకు పనిచేస్తూనే ఉన్నాయన్నారు. 

ఇదీ నేపథ్యం... 
రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ తమపై లైంగిక దాడులకు పాల్పడినట్లు, 2023 ఏప్రిల్‌–మేలో మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద 36 రోజులపాటు నిరసన చేపట్టారు. రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్, సాక్షి మాలిక్, భజరంగ్‌ పునియాలు ఈ నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం తరువాత ఢిల్లీ పోలీసులు ఈ అంశంపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ తోమర్‌లపై జూన్‌ నెలలో ఛార్జ్‌ïÙట్‌ నమోదైంది. 2024 మేలో కోర్టు లైంగిక వేధింపులు, బెదిరింపులపై కేసు నమోదు చేసింది. మైనర్‌ రెజ్లర్‌ కేసులో 2025 మేలో పోలీసులు దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టును కోర్టు అంగీకరించింది. 2026 జూలై 2న తుది వాదనలు ముగిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement