నేను చెప్పింది చెయ్‌! లేదంటే నీ ఫొటోలు అందరికీ.. | Chirala Woman Alleges Social Media Harassment and Blackmail: Case Registered | Sakshi
Sakshi News home page

నేను చెప్పింది చెయ్‌! లేదంటే నీ ఫొటోలు అందరికీ..

Jul 30 2026 2:03 PM | Updated on Jul 30 2026 2:09 PM

Chirala Woman Alleges Social Media Harassment And Blackmail Case Registered

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

ఆంధ్రప్రదేశ్‌, బాపట్ల: ఆన్లైన్లో ఏర్పడిన పరిచయం వేధింపులు ఆపై దాడికి దారితీసిన ఘటన బుధవారం సాయంత్రం చీరాల మండలం జాండ్రపేట సమీపంలోని అక్కయ్యపాలెం రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజమండ్రికి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బలుకూరి సత్యవాణి (32) టైలర్‌గా పని చేస్తోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం మరణించగా అనంతరం సోషల్ మీడియా ద్వారా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన జోగాబత్తుని వెంకట కిరణ్‌తో పరిచయం ఏర్పడింది. కొంత కాలం తర్వాత నిందితుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె అతనికి దూరంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను నిందితుడు ఆమె బంధువులకు పంపడంతో బాధితురాలు అతనిపై రాజమండ్రిలో క్రిమినల్ కేసు నమోదు చేసింది.

వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు..
కొంతకాలం అనంతరం మళ్లీ ఆమెకు ఫోన్ చేసి తనతో కలిసి ఉండాలని, లేకపోతే ఫొటోలను అందరికి పంపిస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుడి ప్రవర్తన గురించి అతని తల్లిదండ్రులతో మాట్లాడేందుకు బాధితురాలు మంగళవారం చీరాల వచ్చారు.

సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అక్కయపాలెం రోడ్డులో వెళుతుండగా వెంకట కిరణ్ అతని స్నేహితులతో కలిసి ఆమెను అడ్డగించి అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని తెలిపింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఆటోడ్రైవర్ జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా చీరాలకు తీసుకువచ్చినట్లు సమాచారం. అనంతరం ఆమె బుధవారం చీరాల వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement