Hyderabad
-
చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
జీడిమెట్ల(హైదరాబాద్): ఆ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా సంవత్సర కాలంగా ఇంట్లో ఐ ఫోన్ వాడుతున్నాడు. కుమారుడు ఐ ఫోన్ వాడటాన్ని గమనించిన తండ్రి.. ‘నీకు ఫోన్ ఎలా వచి్చంది’ అని నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. ‘మన షాపులోంచి రోజూ కొంత డబ్బు తీసి ట్యూషన్ మాస్టారుకు ఇచ్చేవాణ్ని. మాస్టారే ఈ ఫోన్ కొనిచ్చాడు’ అని బాలుడు తన తండ్రికి వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. షాపూర్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త కమల్‌జైన్. ఆయన కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. సంవత్సర కాలంగా బాలుడు తమ షాపులోంచి కొంత నగదు దొంగిలించసాగాడు. ఆ డబ్బును తనకు ట్యూషన్ చెప్పే మాస్టారుకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో బాలుడికి సదరు ట్యూషన్ మాస్టారు ఐ ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుమారుడికి ట్యూషన్ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్‌లో కమల్‌జైన్ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్ మాస్టారు సందీప్‌పై కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా కుమారుడు తమ షాపులోంచి డబ్బులు తీస్తున్న తండ్రి పసిగట్టకపోవడం గమనార్హం. అలాగే సంవత్సర కాలంగా కుమారుడు ఇంట్లో ఫోన్ వాడుతున్నా కుటుంబ సభ్యులు చూడకపోవడం మరో విచిత్రం. ఎవరైనా పిల్లలు ఇలాంటి పనులు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సీఐ గడ్డం మల్లేష్ తల్లిదండ్రులకు సూచించారు. -
అధ్యక్షుడి కోసం.. నిరీక్షణ తప్పదా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ఇంకా కొన్నిరోజులు సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అధ్యక్షుడితో పాటు ఏపీ తదితర రాష్ట్రాల అధ్యక్షులు అలాగే, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉండగా..ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తాజాగా కశ్మీర్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పహల్గాంలో 28 మంది పర్యాటకులు చనిపోవడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని.. పాలనా పరంగా, రాజకీయంగానూ కుదిపేసింది.ప్రభుత్వంలో, పార్టీలో కీలకమైన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పూర్తిగా..పహల్గాం ఉగ్రదాడి తదనంతరం పరిణామాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత అంశాలు, రాజకీయపరమైన విషయాలను ఇప్పట్లో పట్టించుకునే అవకాశం లేదని, కొత్త జాతీయ అధ్యక్షుడి విషయంలో మరి కొంతకాలం వేచిచూడక తప్పదని బీజేపీ నేతలు అంటున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక కూడా ముడిపడి ఉన్నందున, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కూడా ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడికి అన్నీ సవాళ్లే..! రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనా సంస్థాగతంగా, రాజకీయంగానూ కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఈ బాధ్యతలు చేపట్టగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ప్రక్రియపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని అంటున్నారు. పార్టీలో గ్రూపులు పెరగడంతో.. సొంత ముద్రతో క్యాడర్‌ను తమ వైపు తిప్పుకోవడమూ సవాళ్ళతో కూడుకున్నదేననే చెబుతున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా (2028) పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడం ద్వారా పార్టీ బలాన్ని చాటడం కొత్త అధ్యక్షుడికి పెద్ద సవాల్‌గానే నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేడర్‌లో నిరాసక్తత! రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగకపోవడం, పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేకపోవడంతో.. పైకి బాగానే కనిపిస్తున్నా కేడర్‌లో లోలోపల నిరాసక్తత, నిర్లిప్తత చోటు చేసుకుందని అంటున్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు ఇతర వర్గాల సమస్యలపై అడపాదడపా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా పెద్దగా కార్యాచరణ ఏదీ లేదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. రాజకీయ కార్యకలాపాలు జోరుగా సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు తమ సొంత ఇమేజీని పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
రాజకీయ ప్రేరేపిత చర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య. 2024 మే 1 వరకు ఎన్డీఎస్ఏ సిఫారసులు ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. రిపోర్టు ఇచ్చిన తర్వాత మరమ్మతులు చేయకపోవడం మరో కుట్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చివేసే కుట్ర చేశాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మౖక్కై ఎన్డీఎస్ఏ నివేదికను ఈడీ, సీబీఐ తరహాలో వాడుతున్నారు..’ అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీఎస్ఏ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ వ్యతిరేకించారని చెప్పారు. గతంలో ఆయన కు ఎన్డీఎస్ఏ తప్పుగా కన్పించిందని, ఇప్పుడు అదే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక..ఆయనకు భగవద్గీతలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. భారత్ సమ్మిట్, రైతు మహోత్సవాలు, ఎన్డీఎస్ఏ తుది నివేదిక పేరిట బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, అయినా కేసీఆర్ గర్జనతో కాంగ్రెస్ కకావికలం అయిందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికను ప్రశ్నిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఎన్డీఎస్ఏ నిర్మించిన పోలవరం డయాఫ్రమ్ వాల్ కుప్పకూలినా నాలుగేళ్లుగా ఎందుకు సందర్శించ లేదు..’ అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నివేదిక తప్పుబట్టింది ‘బీఆర్ఎస్పై విమర్శలు చేయాలనే తొందరపాటులో మంత్రి ఉత్తమ్ కనీసం ఎన్డీఎస్ఏ నివేదికను కూడా అధ్యయనం చేయలేదు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పకున్నా.. బురద చల్లేందుకు ఉత్తమ్ అపసోపాలు పడ్డారు. బ్లాక్ 7ను తిరిగి నిర్మించడం ద్వారా మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చని ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. లక్ష కోట్లు వృధా అయితే నీళ్లెలా వస్తున్నాయి? మహారాష్ట్రతో అంతర్ రాష్ట ఒప్పందం లేకుండానే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కాంగ్రెస్ నేతలకు కమీషన్లు దోచిపెట్టారు. అనుమతులు తేవడంలో విఫలం కావడం వల్లే సీడబ్ల్యూసీ, వాప్కోస్ సూచన మేరకు నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాం. నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచడం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నిపుణుల సూచనల మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల వృధా జరిగితే నీళ్లు ఎలా వస్తున్నాయి?..’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్‌కు వెంటనే మరమ్మతు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పార్టీ నేత ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ‘మిస్ వరల్డ్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వేదికగా మే 10 నుంచి జరగనున్న ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్–2025) అందాల పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. లోటుపాట్లులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన ప్రపంచ సుందరి పోటీలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చే సుందరీమణులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఇబ్బందిలేని రీతిలో ఏర్పాట్లు ఉండాలని సీఎం ఆదేశించారు.విమానాశ్రయం, పోటీలు జరిగే వేదికలు, ప్రతినిధులు బస చేసే హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను వారు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమాల పర్యవేక్షణకు విభాగాలవారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వచ్చే నెల 4న మరోసారి సమీక్షిస్తానని.. ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్‌తోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.మూడంచెల భద్రతా ఏర్పాట్లు!మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న మొత్తం 120 దేశాల ప్రతినిధులు మే 6, 7 తేదీల్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. వారు ఎయిర్‌పోర్టులో దిగినప్పటి నుంచి బస చేసే హోటళ్లు, పోటీల వేదిక ప్రాంతం వరకు ప్రభుత్వం మూడంచెల భద్రత కల్పించనున్నట్లు తెలిసింది. మొత్తం భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణను అదనపు డీజీ ర్యాంకులో ఉన్న ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి అప్పగించారు. ఆయన నేతృత్వంలో ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో విదేశీ అతిథుల భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ 2017లో హైదరాబాద్ పర్యటన సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన, అంతర్జాతీయ సదస్సులకు భద్రతా విధులు చేపట్టిన అనుభవంగల అధికారులు, సిబ్బందిని మిస్ వరల్డ్–2025 భద్రతా ఏర్పాట్లలో భాగస్వాములను చేస్తున్నట్లు సమాచారం. కాగా, మే 31న జరిగే ఫైనల్స్‌లో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. -
ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ దందా
సాక్షి, హైదరాబాద్: ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా ఐదారేళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ దందా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–ఎన్ఈడబ్ల్యూ) రట్టు చేసింది. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి మొత్తంగా రూ. 1.4 కోట్ల విలువైన 1.38 కిలోల ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా (ఓజీ) పిలిచే హైడ్రోపోనిక్ గంజాయి, 44 ఎల్ఎస్డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఎథిలమైడ్) బ్లాట్లు, 250 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్స్ (సైలోసైబిన్ డ్రగ్), మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులంతా ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. టాస్‌్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్రతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో అదనపు సీపీ (నేరాలు) పి.విశ్వప్రసాద్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.కస్టమర్ నుంచి పెడ్లర్‌గా మారి... సికింద్రాబాద్‌కు చెందిన అభిషేక్ ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ ఐఐఐటీ నుంచి బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. రాయ్‌పూర్‌లో ఉండగా మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడిన అతను.. తేలిగ్గా డబ్బు సంపాదన కోసం పెడ్లర్గానూ మారాడు. అభిషేక్‌కు డార్క్ వెబ్‌లో ఉన్న డ్రెడ్ మార్కెట్ అనే కమ్యూనిటీ ద్వారా ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు కావాల్సిన ఓజీ, ఎల్ఎస్డీ కోసం సిగ్నల్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఆర్డర్ ఇచ్చేవాడు.జబల్పూర్కు చెందిన హర్షవర్థన్ శ్రీవాస్తవ బీ–ఆర్క్ పూర్తి చేసినప్పటికీ ఆ రంగంపై ఆసక్తిలేక ఓ స్టార్టప్ కంపెనీ తెరవడానికి డబ్బు కోసం డ్రగ్ పెడ్లర్ అవతారం ఎత్తాడు. డ్రెడ్ మార్కెట్ ద్వారానే ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కి లోకల్ ఏజెంట్‌గా మారాడు. అయితే అతనికి డ్రగ్స్ అలవాటు లేకపోవడం గమనార్హం. సికింద్రాబాద్‌కు చెందిన మరో ఆర్కిటెక్ట్ ధావల్ కూడా హర్షవర్థన్‌కు మరో పెడ్లర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే డ్రగ్స్ సప్లయిర్ అయిన చెన్నైవాసి బి. శ్రీనివాస రాహుల్‌ను కొన్నేళ్ల క్రితం పరిచయం చేసుకున్న అభిషేక్ అతన్నుంచి డ్రగ్స్ కొని విక్రయిస్తున్నాడు. ఈ దందాపై హెచ్–న్యూకు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్ నేతృత్వంలో ఎస్సై సి.వెంకట రాములు, నల్లకుంట ఇన్స్పెక్టర్ బి.జగదీశ్వర్‌రావు తమ బృందాలతో వలపన్ని హర్షవర్థన్, రాహుల్, ధావల్, అభిషేక్‌లను నగరంలో పట్టుకున్నారు. రాహుల్ చెన్నైతోపాటు బెంగళూరు, హైదరాబాద్‌లోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. పోలీసుల నిఘాకు చిక్కకుండా సరఫరా... థాయ్‌లాండ్ నుంచి ఓడల ద్వారా డ్రగ్స్ భారత్‌లోకి.. అక్కడి నుంచి జబల్పూర్లో ఉంటున్న హర్షవర్థన్ వద్దకు చేరుతున్నాయి. అతను వినియోగదారుడికి కొరియర్ సంస్థల ద్వారా పంపుతున్నాడు. పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పార్శిల్ బుక్ చేసేటప్పుడు చిరునామా, ఫోన్ నంబర్ ఇచ్చి ట్రాకింగ్ ఐడీని మాత్రం అభిõÙక్ వంటి వినియోగదారులకు పంపుతున్నాడు. ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరగానే అక్కడకు వెళ్లి వారు తీసుకొనేవారు. హ్యాండ్లర్ నుంచి డ్రగ్స్‌ను ఔన్స్ (28.34 గ్రాములు)కు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించి తెప్పించుకొని వినియోగదారులకు ఔన్స్‌కు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల మధ్య విక్రయిస్తున్నారు. -
పాస్‌బుక్ ఉంటే తహసీల్దార్.. లేదంటే ఆర్డీవోకు
సాక్షి, హైదరాబాద్: భూభారతి చట్టం ద్వారా వారసత్వ హక్కుల బదలాయింపు (విరాసత్) విషయంలో రెవెన్యూ శాఖ స్పష్టతనిచ్చిoది. విరాసత్ ప్రక్రియ పూర్తి చేసే విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను పేర్కొంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీపీఎల్ఏ) కార్యాలయం సర్క్యులర్ పంపింది. ఈ సర్క్యులర్ ప్రకారం.. వారసత్వ హక్కుల బదిలీ కోరే సమయంలో ఆ భూమికి పాసు పుస్తకం ఉన్నట్టైతే తహసీల్దార్ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పాసు పుస్తకం లేని పక్షంలో తహసీల్దార్ నివేదిక మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సీసీఎల్ఏ పంపిన ఆర్వోఆర్/3069215/2025 సర్క్యులర్ ప్రకారం విరాసత్ ప్రక్రియను ఇలా పూర్తి చేయాల్సి ఉంటుంది. పాసు పుస్తకం ఉంటే» విరాసత్ ప్రక్రియ కోసం భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. »ఆపరేటర్ లాగిన్‌లో దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తీసుకుని సదరు దరఖాస్తును తహశీల్దార్‌కు పంపుతారు. »ఈ వారసత్వ హక్కుల బదిలీ కోసం సంబం«దీకులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు. నోటీసు గడువు ముగిసిన అనంతరం ఆ దరఖాస్తును తహసీల్దార్ పరిశీలిస్తారు. సంబంధీకుల నుంచి అభ్యంతరాలు వచ్చి ఉంటే వాటిపై విచారణ జరుపుతారు. అన్నీ సక్రమంగా ఉంటే డిజిటల్ సిగ్నేచర్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియను తహసీల్దార్ పూర్తి చేస్తారు. పాసు పుస్తకం లేకపోతే»విరాసత్ ప్రక్రియ కోసం తొలుత భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. »భూభారతి పోర్టల్ ద్వారా వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆర్డీవో నోటీసులు ఇస్తారు. వీటిని తహసీల్దార్ ద్వారా సంబందీకులకు పంపి అభ్యంతరాలను కోరతారు. »నోటీసు గడువు ముగిసిన తర్వాత తహసీల్దార్ విచారణ జరిపి తన నివేదికను ఆర్డీవోకు పంపుతారు. ఈ నివేదిక ఆధారంగా సదరు విజ్ఞప్తిని ఆర్డీవో ఆమోదిస్తారు. ఒకవేళ ఆధారాలు సక్రమంగా లేకపోతే తిరస్కరిస్తారు. సదరు విజ్ఞప్తిని ఆమోదించేందుకు లేదంటే తిరస్కరించేందుకు గల కారణాలను కూడా తన ఉత్తర్వుల్లో ఆర్డీవో పేర్కొనాల్సి ఉంటుంది. »సదరు విజ్ఞప్తిని ఆర్డీవో ఆమోదించిన పక్షంలో దరఖాస్తుదారులు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. »అప్పుడు దరఖాస్తు ఆపరేటర్ లాగిన్‌కు వెళుతుంది. తర్వాత దరఖాస్తుదారుల బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటారు. »అనంతరం మళ్లీ సంబం«దీకులకు నోటీసులు పంపి అభ్యంతరాలను కోరతారు. నోటీసు గడువు ముగిసిన అనంతరం ఈ అభ్యంతరాలను తహసీల్దార్ పరిశీలించి మరోమారు విచారిస్తారు. »అప్పుడు అన్నీ సక్రమంగా ఉంటే డిజటల్ సిగ్నేచర్ చేసి తహసీల్దార్ మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. -
కెమిస్ట్రీలో మూలకాలు.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. తొలి రోజు అగ్రి, ఫార్మా సెట్ జరిగింది. ఈఏపీ సెట్‌పై ఎక్కువ మంది విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. బోటనీ, జువాలజీ పేపర్లలో ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగామని చెప్పారు. కెమిస్ట్రీలో ఈసారి మూలకాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. ఆర్గానిక్ కెమిస్ట్రీపై పట్టు ఉన్న విద్యార్థులు చాలా ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగారు. ఫిజిక్స్‌లో కొన్ని ప్రశ్నలు తేలికగా ఉంటే, మరికొన్ని మధ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. మెకానిక్స్, థర్మోడైనమిక్స్ ప్రశ్నలు కొన్ని సంవత్సరాలుగా వస్తున్నవే ఇచ్చినట్టు తెలిపారు. అయితే కొన్ని ప్రశ్నలు తిప్పి ఇచ్చినట్టు చెప్పారు. మొత్తంగా రెండు సెషన్లలో పేపర్లు ఈజీగా ఉన్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలనఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి పేపర్ సెట్‌ను లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్‌కుమార్ రెడ్డి, ఈఏపీ సెట్ కన్వీనర్ దీన్‌కుమార్, కో కన్వీనర్, యూనివర్సిటీ రెక్టార్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలకు వెళ్లిన అధికారులు ఏర్పాట్లు పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఉదయం, సాయంత్రం రెండు షిప్టుల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఉదయం షిప్టులో 28,834 మంది సెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే, వారిలో 26,741 మంది పరీక్ష రాశారు. సాయంత్రం షిప్టులో 28,830 మందికి స్లాట్ అలాట్ చేయగా, 26,964 మంది హాజరయ్యారు. మొత్తంగా ఉదయం 92 శాతం, సాయంత్రం 95 శాతం విద్యార్థులు పరీక్ష హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ మంది హైదరాబాద్ నుంచేహైదరాబాద్లో నాలుగు జోన్లు ఏర్పాటు చేయగా, ఎక్కువ మంది ఈ ప్రాంతాల నుంచే దరఖాస్తు చేశారు. పరీక్ష హాజరు శాతం కనిష్టంగా 91.3 శాతం, గరిష్టంగా 95 శాతం నమోదైంది. జిల్లాల్లో పరీక్షకు దరఖాస్తు చేసింది తక్కువే అయినా ఎక్కువ మంది హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 97 శాతం, సాయంత్రం 100 శాతం హాజరు నమోదైంది. అన్నిచోట్లా హడావుడితొలి రోజున అన్నిచోట్లా హడావుడి కన్పించింది. పరీక్ష కేంద్రాలను ముందే చూసుకునేలా సెట్ అధికారులు ఈసారి క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచారు. మరోవైపు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద కొద్దిసేపు విద్యార్థులు ఒత్తిడికి గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు విద్యార్థులు ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి చేరుకుని టెన్షన్ పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్లు సకాలంలో ఆన్ అవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల కొద్దిసేపు కంప్యూటర్లు మొరాయించినట్టు విద్యార్థులు తెలిపారు. -
హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజనీరింగ్ తయారీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఈ వెర్నోవాకి చెందిన స్టీమ్ పవర్ సర్వీసెస్ అవసరాల కోసం హైదరాబాద్‌లో లీన్ తయారీ ప్లాంటును ప్రారంభించినట్లు ప్రెసిషన్ ఇంజినీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్ వెల్లడించింది. ఈ ప్లాంటు లో 180 మంది సుశిక్షితులైన ప్రొఫెషనల్స్ ఉండగా, రాబోయే రోజుల్లో వందల సంఖ్యలో మరింత మంది నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నట్లు సంస్థ చైర్మన్ రాకేష్ చోప్దార్ వివరించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ఏటా 1,00,000 బ్లేడ్లను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్..గ్యాస్ తదితర రంగాల సంస్థలతో పటిష్టమైన భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు ఇలాంటి వ్యూహాలు తోడ్పడగలవని రాకేష్ తెలిపారు. -
'వేతన యాతన'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రలో అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒక్కసారి కూడా కనీస వేతన సవరణ జరగలేదు. ఐదేళ్లకోసారి తప్పనిసరిగా కనీస వేతన సవరణను ఖరారు చేయాలని కార్మీక చట్టాల్లో ఉన్నప్పటికీ 11 ఏళ్లుగా ఆ దిశగా ప్రభుత్వాలు కసరత్తు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుంచి 2012 మధ్య ఇచ్చిన వేతన సవరణ ఉత్తర్వులే ఇప్పటికీ దిక్కయ్యాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం వివిధ ఉపాధి రంగాల్లో కనీస వేతనం రూ. 3,370 నుంచి రూ. 5,138 మధ్య ఉంది. రాష్ట్రంలో 73 ఉపాధి రంగాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించగా వాటిలో దాదాపు 1.27 కోట్ల మంది కార్మీకులు పనిచేస్తున్నారు. వారిలో 38 లక్షల మంది మహిళలు ఉన్నట్లు రాష్ట్ర కార్మీక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న జీవన ప్రమాణాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణ చేస్తుంది. అదే తరహాలో అసంఘటితరంగ కార్మికుల వేతన సవరణను కూడా ఐదేళ్లకోసారి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలోని కార్మీక వేతన సలహా బోర్డు పాత్ర కీలకం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వేతన సవరణ ప్రక్రియ కొలిక్కిరాలేదు. కొత్త రాష్ట్రంలో నాలుగు బోర్డులు... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాలుగు కనీస వేతన సవరణ సలహా బోర్డులు ఏర్పాటయ్యాయి. మొదటి సలహా బోర్డు 2014 నవంబర్‌లో ఏర్పాటై 2016 నవంబర్‌తో ముగిసింది. రెండో బోర్డు 2016 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు కొనసాగాల్సి ఉంది. కానీ తదుపరి బోర్డు ఏర్పాటులో జాప్యంతో 2021 ఫిబ్రవరి కొనసాగింది. ఈ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమైంది. ఆ తర్వాత మూడో బోర్డును ప్రభుత్వం 2023 మేలో ఏర్పాటు చేసింది. అయితే 2023 డిసెంబర్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం నామినేటెడ్ పదవులను రద్దు చేయడంతో ఆ బోర్డు రద్దయ్యింది. 2024 మార్చిలో నాలుగో బోర్డు చైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బోర్డును 2024 డిసెంబర్లో నియమించింది. ఏయే బోర్డులు ఏం చేశాయి? అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి బోర్డు పలు దఫాల చర్చల అనంతరం అన్‌స్కిల్డ్ కార్మీకుడి కనీస వేతనాన్ని రూ. 11,905.36 నుంచి రూ. 12,068.80 మధ్య ఉండేలా సిఫారసు చేసింది. మొత్తం 73 షెడ్యూల్డ్ రంగాలకుగాను 34 రంగాలకు ఈ వేతనాలను ఖరారుచేస్తూ కార్మీక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇక రెండో బోర్డు.. మొదటి బోర్డు చేసిన సిఫార్సులను పునఃసమీక్షించి కేటగిరీలవారీగా వేతన సవరణ పూర్తిచేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అందులో 5 కేటగిరీలకు ప్రభుత్వం జీఓలు ఇచ్చినప్పటికీ వాటిని గెజిట్‌లో చేర్చలేదు. దీంతో మరో 12 కేటగిరీల ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టింది. ఇక మిగిలిన 56 కేటగిరీల ప్రతిపాదనల ఊసేలేదు. ఆ తర్వాత ఏర్పాటైన మూడో బోర్డు ప్రస్తుతమున్న ఏడు కార్మిక కేటగిరీలను నాలుగుకు కుదించేందుకు ప్రయత్నించింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మూడో బోర్డు రద్దైంది. ప్రస్తుత నాలుగో బోర్డు పలు దఫాలు సమావేశమైనా ఇంకా నిర్ణయాలేవీ తీసుకోలేదు. ఈలోగా రేవంత్ ప్రభుత్వం గతేడాది మొత్తం 73 ఉపాధి రంగాలకూ కనీస వేతన సవరణ చేయాలని నిర్ణయిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో కనీస వేతన సవరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వేతన సవరణ లెక్క సూత్రం... ఒక కార్మీకుడి కుటుంబంలో నలుగురు సభ్యులుంటే అందులో కార్మీకుడిని ఒక యూనిట్ విలువగా, కార్మికుని భార్యను 0.8 యూనిట్‌గా, ఇద్దరు పిల్లల్ని 0.6 చొప్పున నిర్ధారిస్తారు. లేబర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఆమోదం ప్రకారం ఒక కార్మీకుడు జీవించేందుకు అవసరమైన కేలరీలు 2,700. ఒక కుటుంబానికి ఏడాదికి కావాల్సిన వస్త్రం 72 గజాలు. ఇంటి అద్దె కింద 10 శాతం, పిల్లల చదువులు, వైద్యం, ఇతర ఖర్చులకు 20 శాతం చొప్పున లెక్కించి వేతన సవరణ చేయాలి. సవరణ సమయంలో నిత్యావసరాల ధరలు, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. శాస్త్రీయత పాటించకుంటే న్యాయ చిక్కులు కార్మికుల కనీస వేతన సవరణ ప్రక్రియను చట్టప్రకారం చేయాలి. అక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా గణించాలి. గత ప్రభుత్వ నిర్ణయాల కంటే మెరుగ్గా వేతన సవరణ చేస్తామని ఇప్పటి ప్రభుత్వం చెబుతున్నా అందుకు శాస్త్రీయత, క్రమపద్ధతి పాటించకుంటే న్యాయ చిక్కులు తప్పవు. – ఎండీ యూసూఫ్, కనీస వేతన సలహా బోర్డు సభ్యుడు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు దుర్భరంగా కార్మీకుల జీవితాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత అసంఘటితరంగ కార్మీకుల వేతన సవరణ కోసం చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా వేతన సవరణ జరగకపోవడంతో కార్మీకుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినా కనీస వేతన సవరణపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం సరికాదు. కేంద్రం కనీస వేతనాన్ని రూ. 21 వేలకు ఖరారు చేసినా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా వేతనాలున్నాయి. – సుంకరి మల్లేశం, ఈపీఎఫ్ఓ సీబీటీ మెంబర్, భారత్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు ఇది శ్రమ దోపిడీయే ప్రభుత్వం దశాబ్దన్నర కాలంగా వేతన సవరణ చేయకపోవడం కార్మీకుల శ్రమను దోచుకోవడమే. మొత్తం 73 ఉపాధి రంగాలకు వేతనాలను సవరించాలని రెండో కార్మీక వేతన సవరణ సలహా బోర్డు 2021 ఫిబ్రవరి 3న రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే అందులో 5 ఉపాధి రంగాలకు తుది ఉత్తర్వులు వెలువడ్డా గెజిట్‌లో ప్రచురించకపోవడం, మిగిలిన ఉపాధి రంగాలకు జీఓలు ఇవ్వకపోవడంతో కార్మీకులు నష్టపోతున్నారు. – దేవసాని భిక్షపతి, కనీస వేతన సలహా బోర్డు మాజీ సభ్యుడు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణకు పడని ముందడుగుఅన్‌స్కిల్డ్ కార్మీకుడైన నర్సింహ 20 ఏళ్లుగా ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఈ రంగానికి సంబంధించి జరిగిన వేతన సవరణ ప్రకారం ఆయన నెలవారీ కనీస వేతనంరూ. 3,370గా ఖరారైంది. ఆ నిబంధనల ప్రకారం ప్రస్తుతం నర్సింహ అందుకుంటున్న వేతనం రూ. 12,420 మాత్రమే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రెండో కనీస వేతన సవరణ సలహా బోర్డు సిఫార్సుకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ 22 ప్రకారం నర్సింహ నెలవారీ కనీస వేతనం రూ. 23,275గా ఉండాలి. కానీ ఆ జీఓను గెజిట్‌లో ప్రచురించకపోవడం వల్ల ఆయన ఏకంగా రూ. 10,855 తక్కువ వేతనం పొందుతున్నాడు. -
మరో 36 స్పెషల్ ట్రైన్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
విజయవాడ: విజయవాడ మీదుగా చర్లపల్లి–కాకినాడ టౌన్, చర్లపల్లి–నర్సాపూర్ మధ్య మరో 36 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07031) మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07032) మే 4 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి–నర్సాపూర్ ప్రత్యేక రైలు..చర్లపల్లి–నర్సాపూర్ ప్రత్యేక రైలు (07233) మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మే 4 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. -
యాదాద్రిలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మరణించినట్లు సమాచారం. కార్మికుల మరణంపై పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉండగా.. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను భూవనగిరిలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
భూదాన్ ల్యాండ్ ఇష్యూ.. సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మహేశ్వరం నాగారంలో భుదాన్ భూములు అమ్మకాలు జరిగాయని.. నిన్న ఐదు చోట్ల సోదాలు చేపట్టామని ఈడీ ప్రకటించింది. మునావర్ ఖాన్ ఫామ్ హౌస్‌లో పార్కు చేసిన 25 కార్లు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మునావర్ ఖాన్, లతీఫ్, అక్తర్ సుకుర్ ఇళ్లలో జరిపిన సోదాల్లో 45 వింటేజ్ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. విదేశీ కరెన్సీతో పాటు 23 లక్షల నగదు సీజ్ చేశాం’’ అని అధికారులు తెలిపారుకుదురున్నీసా, మునావర్‌ఖాన్ ఇళ్లలో సోదాలు చేశాం. మునావర్‌ఖాన్ ఫామ్ హౌస్‌లోని పత్రాలను సీజ్ చేశాం. ప్రభుత్వ స్థలాలకు తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మకాలు సాగించారు. తమ వారసత్వ ఆస్తిగా పేర్కొంటూ అమ్మకాలు జరిపారు. ప్రముఖులు, రియల్టర్లు భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించాం. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి విక్రయాలు జరిపారు’’అని ఈడీ అధికారులు వెల్లడించారు. -
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
భద్రాద్రి కొత్తగూడెం,సాక్షి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రోటోకాల్ రగడ అధికార కాంగ్రెస్‌లో చర్చాంశనీయంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ కరువైంది. దమ్మపేట మండలం పూసికుంటలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పర్యటనలో గిరిజన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు అవమానం జరిగింది.కోట్లాది రూపాయల పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఆహ్వానం అందలేదు. అధికారులు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేని పట్టించుకోలేదు. ఆహ్వానం అందకపోయినా కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల సమక్షంలో అధికారుల తీరుపై జారే మండిపడ్డారు. తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ఎమ్మెల్యే చచ్చిపోయాడనుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శంకుస్థాపన నిలిపివేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..ఎమ్మెల్యే జారె ఆదినారాయణను సముదాయించేందుకు తన కారులోకి తీసుకెళ్లారు. ఎలాగోలా సముదాయించి ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో శంకుస్థాపన చేయించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే జారె వర్గీయులు వెనక్కి తగ్గలేదు. అధికారుల నిర్లక్క్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. -
మండే ఎండలు : కిడ్నీలో రాళ్లు, పెరుగుతున్న కేసులు, బీ అలర్ట్!
హైదరాబాద్ తెలంగాణలో వేసవి ముదురుతోంది. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) తన నివేదికలో తెలిపింది. డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, విపరీతంగా ఎండల్లో తిరగడం వల్ల రోజుకు సుమారు 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలో రాళ్ల సమస్యతో రావడంతో వారికి ఏఐఎన్‌యూల చికిత్సలు చేస్తున్నారు. వేసవి అంటేనే “స్టోన్ సీజన్” అంటారు. ఈ కాలంలో ముఖ్యంగా కిడ్నీలకు చాలా ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా శరీరంలో నీరు ఆవిరి అయిపోవడం, ఉప్పు ఎక్కువగా తినడం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వేసవిలో కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి.ప్రధానాంశాలు: రోజుకు సగటున 300 నుంచి 400 వరకు కిడ్నీలో రాళ్ల కేసులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇది బాగా ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలంతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య రెట్టింపు దాటిపోయింది. జంక్ ఫుడ్ తినడం, ఎక్కువగా కదలకపోవడం, తగినంత నీరు తాగకపోవడంతో పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువవుతోంది. 10-17 సంవత్సరాల మధ్య పిల్లల్ల రాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాఠశాలలో ఉన్నప్పుడు నీళ్లు తాగకపోవడం, స్నాక్స్ ప్యాకెట్లు కొని తినడం, కూల్ డ్రింకులు తాగడం దీనికి కారణం. పురుషులతో పోలిస్తే మహిళలకు ఈ సమస్య కొంత తక్కువే (సుమారు 40% తక్కువ). కానీ, గర్బవతులుగా ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చి, గుర్తించకపోతే ముప్పు ఎక్కువ. పిల్లల్లో ఈ సమస్య వల్ల దీర్ఘకాలంలో వారి కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.ఈ సందర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ తైఫ్ బెండెగెరి మాట్లాడుతూ, “కిడ్నీలో రాళ్ల కేసులు ఈసారి అసాధారణంగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వేడి పెరిగిపోవడం, తగినంత నీరు తాగకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. పాఠశాలకు వెళ్లే పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల వారికి ఈ కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువ అవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రాళ్ల సమస్య కేవలం పెద్దవాళ్లది అనుకోకూడదు. పిల్లల తల్లిదండ్రులతో పాటు పాఠశాలలు కూడా దీనిపై అవగాహన పొందాలి. తగినంత నీళ్లు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, సమస్యను త్వరగా గుర్తించడం వల్ల చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా.. వేసవి నెలల్ల ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి” అని సూచించారు.జాగ్రత్తగా ఉండండిలా...తగినన్ని నీళ్లు తాగాలి. మూత్రం స్పష్టంగా, లేతరంగులో ఉండేలా చూసుకోవాలి.ఉప్పు, ప్రాసెస్డ్ ఆహారం, జంతువుల కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. ముఖ్యంగా పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ చిరుతిళ్లు, కూల్ డ్రింకుల వాడకం మానేయాలి.స్కూల్లో ఉన్నప్పుడు, ఇళ్ల దగ్గర కూడా తగినన్ని నీళ్లు తాగేలా చూడాలికుటుంబంలో ఎవరికైనా గతంలో కిడ్నీ రాళ్లు ఏర్పడితే మరింత జాగ్రత్తగా ఉండాలి.ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు కారణం లేకుండా కడుపునొప్పి రావడం, తరచు మూత్ర విసర్జనకు ఇబ్బంది పడడం లాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులకు చూపించాలి. తగినన్ని నీళ్లు తాగడం చాలావరకు ఈ సమస్యను దూరం పెడుతుంది. -
బీఆర్ఎస్ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డ ప్రాజెక్టు కట్టింది.. కూలిపోయింది.. ఈ విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికగా ఇచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికపై తెలంగాణ సచివాలయంలో మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారాయన. తెలంగాణ ఆర్టిక వ్యవస్థకు సంబంధించింది బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం బీఆర్ఎస్వాళ్లు తప్పుడు ప్రచారాలు చేశారు. 16 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం.. 38వేల కోట్లతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అనాడు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రీ ఇంజినీరింగ్, రీ డిజైనింగ్ చేసింది. కమిషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచింది. కమీషన్లకక్కుర్తి కోసం ప్రాణహిత డిజైన్ మార్చింది. చివరకు తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన బ్యారేజి...మేడిగడ్డ వద్ద వంద మీటర్ల హైట్ తో కట్టారు. దీని వల్ల ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. బ్యారేజీల నిర్మాణ సమయంలోనే లోపాలు తెలిసినప్పటికీ సరిదిద్దుకోలేదు. సుందిళ్ల, అన్నారం దగ్గర సాయిల్ టెస్ట్ చేయలేదు. ప్రారంభానికి ముందే లోపాలు బయటపడ్డాయి.. కానీ, బీఆర్ఎస్ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర నష్టం జరిగింది. కాళేశ్వరం డిజైన్లు ఒకలా ఉంటే.. మరోలా నిర్మాణం చేశారు. ప్రాజెక్టు కోసం 85 వేల కోట్లు అంచనా వేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం లోన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలింది. NDSA మేడిగడ్డ పరిశీలనకు వచ్చింది గత ప్రభుత్వం పాలనలోనే. మేడిగడ్డ లో డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని NDSA రిపోర్ట్ గత ప్రభుత్వ హయంలోనే ఇచ్చారు. NDSA అథారిటీ బిల్లుకు పార్లమెంట్లో BRS మద్దతు పలికింది. దేశంలో 5600 బ్యారేజీలు, డ్యామ్‌లను ఎన్డీఎస్ఏ పర్యవేక్షిస్తోంది. దేశంలో ఏ బ్యారేజీకి ఎలాంటి సమస్య వచ్చినా NDSA నుంచే అభిప్రాయం చెప్తుంది. NDSA లో జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. అలాంటిది NDSA నిపుణులను సైతం BRS నాయకులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై లక్షన్నర కోట్ల భారం పడుతోంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు మిత్తి ఏడాదికి 16వేలు కట్టాల్సి వస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌కు లేఖ చేశాం. 14 నెలలు పరిశీలించి నివేదిక రూపొందించింది. గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది తుమ్మెడిహట్టి దగ్గర రెండు ప్రాజెక్టులు కడతామన్నారు. తట్టెడు మట్టి కూడా పోయలేదు. పైగా అక్కడ నీటి లభ్యత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు.. లొకేషన్ పెద్ద మిస్టేక్. అది కూలినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వాల్స్, భీమ్స్‌లో రంధ్రాలు వచ్చాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఇంతకన్నా సిగ్గు చేటు ఉంటుందా?. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. అనవసర మాటలు మాట్లాడుతున్నారు అని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. కాళేశ్వరాన్ని ఉపయోగించుకునే స్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. రీడిజైన్ చేసి నిర్మాణం చేయాలని చెప్పింది. రిపోర్ట్ ఆధారంగానే ముందుకు వెళ్తాం ప్రాజెక్టు తప్పిదాలకు కారణమైన అధికారుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయి. అధికారులు తప్పిదాలు చేయడానికి కారణమైన వ్యక్తి గత ప్రభుత్వ పెద్ద కేసీఆర్ . చట్టప్రకారం గత ప్రభుత్వ పాలకులు, అధికారులపై చర్యలు ఉంటాయి. రాబోయే కేబినెట్ భేటీలో NDSA రిపోర్ట్ పై చర్చ జరుపుతాం. క్యాబినేట్ లో చర్చించిన తర్వాత ప్రాజెక్టు పై తదుపరి కార్యాచరణ ప్రకటన చేస్తాం. -
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ట్వీట్లు పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో ఆమె మరో సంచలన ట్వీట్ చేశారు. తనపై వేటు తర్వాత ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. భగవద్గీతలోని అంశాన్ని తన బదిలీకి అన్వయిస్తూ ట్వీట్ చేశారు. కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన. 4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ 25-30లో రాష్ట్రానికి పరిచయం చేశాను’’ అని ట్వీట్ చేశారు.‘‘నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్లలో దిశ, పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రేమ్‌ని సృష్టించాను. డిపార్ట్మెంట్ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి- గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాను.. అది నాకు ఆనందం.. గౌరవంగా ఉంది’’అంటూ స్మితా ట్వీట్ చేశారు."Karmanye vadhikaraste, ma phaleshu kadachana"#IAS Spent 4 months in Tourism.Did my best!1.Brought in the long pending Tourism Policy 25-30, a first for the State. Will create a solid frame for direction & investment in neglected tourist circuits.2. Revamped the working… pic.twitter.com/2nUlVQO4W3— Smita Sabharwal (@SmitaSabharwal) April 29, 2025 కాగా, కంచ గచ్చిబౌలి భూవివాదంలో స్మితా సబర్మాల్.. ఏఐ ఫోటో రిట్వీట్ చేసిందని పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె.. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారిన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. స్మితాపై బదిలీ వేటు వేసింది. ఆమెను ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. -
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: పలువురు ఐపీఎస్‌లు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వ్యవహారంలో (Bhoodan Land Issue) కొద్ది రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 26 మంది ఆఫీసర్లకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ నెల 24న సింగిల్ బెంచ్ జస్టిస్ భాస్కర్‌రెడ్డి తీర్పు వెల్లడించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై ముగ్గురు ఐపీఎస్‌లు అప్పీల్ చేశారు. మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూముల కబ్జా, అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరి పించాలని హైకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సన్న ద్ధంగా ఉన్నారా? లేరా? అనే దానిపై వైఖరిని తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులని, వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. తమ ముందున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని, ఆ మేరకు ఆర్టికల్ 226ను వినియోగించుకుని ఈ ఆదేశాలు ఇస్తున్నామని తేల్చిచెప్పింది.తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రతివాదులకు స్పష్టంచేసింది. అదీగాక, ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్‌కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్ ఉపసంహరించుకోవాలని భావించినా అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూ కబ్జాలపై ఫిబ్రవరి 16న, మార్చి 8న అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారన్నారు.ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారని చెప్పారు. 26 మంది ఉన్నతాధికారులు భూకబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గత గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘భూదాన్ భూములపై బినామీల పేరిట రిజిస్ట్రేషన్, భూ కబ్జా, మనీలాండరింగ్‌పై విచారణ జరిపించాలని మహేశ్ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు.కొందరు అధికారులకు అందజేసిన పట్టాదారు పాస్‌బుక్‌లు, మ్యుటేషన్ ప్రొసీడింగ్‌లపై వివరాలు సమర్పించేలా రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేయండి. భూకబ్జాలో తెలంగాణతోపాటు ఏపీకి చెందిన సీనియర్ అధికారుల పాత్ర ఉంది. పిటిషనర్‌కు హక్కుగా ఉన్న భూమిని మోసపూరితంగా బదిలీ చేసుకున్నట్లు అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు.అధికారులు భూరికార్డులను ఎలా తారుమారు చేశారో, తప్పుడు వారసత్వ పత్రాలు ఎలా తయారయ్యాయో.. పట్టాదార్ పాస్‌బుక్‌లను చట్టవిరుద్ధంగా ఎలా జారీ చేశారో దర్యాప్తు చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్‌ను కూడా దుర్వినియోగం చేశారు. తన భూమి కోసం పోరాడుతున్న పిటిషనర్‌కు సాయం చేసే బదులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే 10కిపైగా లీగల్ నోటీసులు పంపారు.క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. మోసపూరిత పాస్‌బుక్‌లను రద్దు చేయాలి. భూమిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలి. సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించాలి’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది అతి పెద్ద భూ కుంభకోణంలా కనిపిస్తున్నందున ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేశారు. -
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. రేపు.. అంటే ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 1గం.కు రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్ రిలీజ్ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్ సిగ్నల్ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది. ఈసారి మెమోలో మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడులు ఇవ్వనున్నారు. త్వరగతిన.. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్ చేసుకునేందుకు https://education.sakshi.com/ క్లిక్ చేయండి. -
మహిళా కార్పొరేటర్‌పై హనీమూన్ వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తనపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పోలీసులలతో పాటు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ ఫిర్యాదుతో Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 BNS సెక్షన్ల కింద సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశంపై వివరణ, విచారణకు హాజరవ్వాలంటూ మహిళా కమిషన్ సైతం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం, ఎమ్మెల్యే సుధీరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరోజు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు అడిగారు. లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చాను. కావాలని నాపై రాజకీయ కక్షతో పిర్యాదు చేశారు. ఈ అంశంపై లీగల్‌గా ఫైట్ చేస్తాను’అని వ్యాఖ్యానించారు.వివాదం నేపథ్యం ఇదే గత నెలలో ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ రగడతో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎమ్మెల్యే కొన్ని పనులకు శంకుస్థాపన చేయగా.. అవే పనులకు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మళ్లీ శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేశాక మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఈలోపు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే..కాసేపటికే మరో చోటులో శంకుస్థాపనలు పనులు జరగ్గా.. ఈసారి బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు.దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌కు తరలించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..పీఎస్‌కు చేరుకుని వాళ్లను విడిపించారు. అరెస్ట్ సమయంలో కార్యకర్తలకు గాయాలు అయ్యాయని తెలుసుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు.వాళ్లను సరాసరి డీసీపీకి ఆఫీస్‌కు తీసుకెళ్లి ఉన్నతాధికారులకు జరిగింది వివరించారు.ఆపై బయటకు వచ్చి మాట్లాడిన ఆయన.. ఈ దాడుల వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రమేయం ఉందని, కార్పొరేటర్ల మధ్య హనీమూన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. వివాదం రాజుకుంది. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకానొక తరుణంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. -
హైదరాబాద్‌లో విషాదం.. రీల్స్ పిచ్చి.. ప్రాణాలు తీసింది
సాక్షి, మేడ్చల్: సోషల్ మీడియా సరదా యువకుడి ప్రాణం తీసింది. జవహర్‌నగర్‌లో రీల్స్ చేస్తూ తరుణ్(17) అనే యువకుడు క్వారీ గుంతలో పడి మృతి చెందాడు. రీల్స్ ప్రభావంతో తరుణ్ తన ఆరుగురి స్నేహితులతో కలిసి ఓ క్వారీ దగ్గర ఫోటో షూట్ చేస్తుండగా ఈ విషాదం జరిగింది. స్నేహితులతో ఈత కొడుతూ ఫొటోలు దిగుతూ లోతును గమనించకపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తరుణ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సమాచారం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కాగా, కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. -
ట్యూషన్ టీచర్ నిర్వాకం.. బాలుడి తండ్రి ఆవేదన
సాక్షి, జీడిమెట్ల: జీడిమెట్ల పీఎస్ పరిధిలో ట్యూషన్ టీచర్ నిర్వాకం వెలుగులోకి రావడంతో బాలుడు తండ్రి ఖంగుతిన్నాడు. సదరు టీచర్.. బాలుడి వద్ద నుంచి దాదాపు రెండు లక్షలు తీసుకున్నట్టు తండ్రి గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు పట్టించుకోకపోవడంతో హెచ్ఆర్సీని ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. జీడిమెట్ల పరిధిలో కమల్ నివాసం ఉంటున్నారు. కమల్ కుమారుడు.. స్థానికంగా ఉన్న ఓ ట్యూషన్ టీచర్ వద్దకు ట్యూషన్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్ వస్తున్న బాలుడిని సదరు టీచర్ డబ్బులు అడగంతో అతడు తన ఇంట్లో మనీ దొంగతనం చేసి టీచర్‌కు ఇస్తున్నాడు. ఇలా పలుమార్లు డబ్బులు దొంగలించి.. రెండు లక్షలకుపైగా టీచర్‌కు ఇచ్చాడు. ఇక, ఇటీవలే.. ఐఫోన్ కూడా టీచర్‌కు ఇచ్చాడు. ..తనకు ఫోన్ వద్దని.. డబ్బులే కావాలని సదరు టీచర్ అడగటంతో సదరు బాలుడు ఫోన్ అమ్మకానికి పెట్టాడు. అనంతరం, ఆ డబ్బులను మళ్లీ టీచర్‌కు అందజేశాడు. ఈ నేపథ్యంలో మొబైల్ షాప్ ఓనర్.. బాలుడి తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అసలు విషయంలో కమల్‌కు తెలియడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, వెంటనే కమల్.. జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు. అయితే, అతడి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో కమల్.. తాజాగా హెచ్ఆర్సీని ఆశ్రయించారు. సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
బంజారాహిల్స్(హైదరాబాద్): వివాహితపై కన్నేసిన ఆమెకు వరుసకు సోదరుడైన యువకుడు తన గదికి వచ్చి కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తానంటూ బెదిరించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నివసించే మహిళకు (26)కు ముగ్గురు సంతానం. ఆమెకు భర్తకు దూరపు బంధువైన నవీన్ అనే యువకుడు నగరంలోనే ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తరచూ ఇంటికి వచ్చే అతను ఆమెతో మాటలు కలుపుతూ తన కోరికను బయటపెట్టేవాడు. తాను అడిగింది ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించేవాడు. రెండు నెలల క్రితం బాధితురాలు ఈ విషయం తనకు భర్తకు చెప్పడంతో అప్పటి నుంచి నవీన్ ఆమెకు ఫోన్ చేయడం మానేశాడు. ఈ నెల 26న కొందరి వద్ద నవీన్ ఆమెపై అసభ్యకరంగా ప్రచారం చేశాడు. ఆమె పనిచేస్తున్న సెలూన్‌కు వెళ్లి నువ్వు బయటకు వస్తావా..? నన్ను లోపలికి రమ్మంటావా? అంటూ బెదిరించాడు. తాను బయటకు రానని చెప్పడంతో నువ్వు నా గదికి రాకపోతే మొహంపై యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు నవీన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
GHMC: పది నెలలు.. నలుగురు కమిషనర్లు!
రాజధాని నగరంగా..తెలంగాణకు తలమానికంగా కీలకపాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మహానగరంపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోందా..అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. మహానగరాభివృద్ధిలో కీలకమైన జీహెచ్ఎంసీ నిర్వహణ తీరునే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. తరచుగా కమిషనర్లను మార్చడం..అభివృద్ధి పనులు నిలిచిపోవడం..నిధుల కొరత కారణంగా జీహెచ్ఎంసీ నిరీ్వర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏంటో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బహుశా..ఎలాగూ రెండో, అంతకంటే ఎక్కువో కార్పొరేషన్లు చేసే యోచనలో ఉన్నందున కాబోలు ప్రభుత్వం జీహెచ్ఎంసీపై పెద్దగా శ్రద్ధ చూపుతున్నట్లు లేదు. పది నెలల వ్యవధిలోనే నలుగురు కమిషనర్లు రావడం అందుకు నిదర్శనమంటున్నారు జీహెచ్ఎంసీ గురించి తెలిసిన వారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటికి కమిషనర్‌గా ఉన్న రోనాల్డ్‌రాస్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ముగ్గురు కమిషనర్లు మారారు. గత సంవత్సరం ఆగస్ట్‌లో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి ఏపీకి వెళ్లాల్సి రావడంతో, అక్టోబర్‌లో అదనపు కమిషనర్‌గా నియమించిన ఇలంబర్తిని నవంబర్ 14 నుంచి రెగ్యులర్ కమిషనర్‌గా నియమించారు. ఐదు నెలల్లోనే ఆయన్ను బదిలీ చేసి ఆర్వీ కర్ణన్‌ను తాజాగా నియమించారు. కారణాలేవైనా తరచూ కమిషనర్లు మారుతుండటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీలో ఆరువేల మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులున్నారు. ఔట్సోర్సింగ్, ఇతరత్రా వెరసి 30 వేల మంది వరకున్నారు. ఇంతపెద్ద వ్యవస్థను అర్థం చేసుకోవడానికే కనీసం ఆర్నెళ్లు పడుతుంది. ఆలోగానే మారిస్తే..కొత్తగా వచ్చేవారికి అదే పరిస్థితి ఎదురవుతుంది. తనదైన శైలితో.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయిన ఇలంబర్తి.. గతంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవంతో కావచ్చు పాలనలో లోపాల్ని, ఇష్టారీతిన జరుగుతున్న వ్యవహారాల్ని, పెచ్చరిల్లిన అవినీతిని అడ్డుకునేందుకు నిశ్శబ్దంగానే పలు కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు.. సంస్థ ఆస్తులెన్నో తెలియని దిక్కుమాలిన స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీని చక్కదిద్దే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతతో అంగుళం కూడా తేడా రాకుండా జీహెచ్ఎంసీ ఆస్తుల్ని గుర్తించే పనుల్ని చేపట్టారు. ఇంజినీరింగ్ పనుల్లో, కాంట్టాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో లోపాలకు అడ్డుకట్ట వేశారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లలో అవకతవకల నివారణకు చర్యలు చేపట్టారు. స్ట్రీట్‌లైట్స్, సీఆర్ఎంపీ పనుల్లో అడ్డగోలు చెల్లింపులను గుర్తించి కట్టడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి. అవన్నీ గాడిన పడి ఒక దశకు రాకముందే ఆయన్ను బదిలీ చేయడంతో..కొత్త కమిషనర్‌కు పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. వదలరు.. కదలరు సుదీర్గకాలంగా జీహెచ్ఎంసీలో పాతుకుపోయిన వారి కొందరి ఆట కట్టించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.రిటైరయ్యాక సైతం జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న వారందరినీ పంపించాలని,ఒకవేళ వారి సేవలు నిజంగా అవసరమైతే అందుకు కారణాలు తెలపాలని,ప్రభుత్వం అనుమతించాక తిరిగి కొనసాగించాలని గత నెలలో ప్రభుత్వం సూచించినప్పటికీ, జీహెచ్ఎంసీలో మాత్రం ఎక్కడి వారక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇరవై మంది సేవలు మళ్లీ అవసరమని కోరినప్పటికీ, ప్రభుత్వం నుంచి అనుమతి రాకుండానే వారు కొనసాగుతూనే ఉన్నారు. మిగతా ప్రభుత్వ విభాగాల్లో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక అలాంటి వారు కొనసాగుతుండగా, జీహెచ్ఎంసీలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం. అలా కొనసాగుతున్న వారిలో కొందరు జీహెచ్ఎంసీకి పనులు చేయడం కంటే, జీహెచ్ఎంసీని అడ్డుపెట్టుకొని సొంత ప్రయోజనాల కోసం సాగిస్తున్న ‘ప్రైవేట్’ దందానే ఎక్కువని జీహెచ్ఎంసీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇప్పుడిప్పుడే.. ఇలంబర్తి చేపట్టిన కొన్ని చర్యలు తొలుత అర్థం కాకపోయినప్పటికీ, కనిపిస్తున్న ఫలితాలతో జీహెచ్ఎంసీ మెరుగవుతోందనుకుంటున్న తరుణంలో బదిలీ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. రోనాల్డ్‌రాస్, ఆమ్రపాలి సైతం జీహెచ్ఎంసీని అర్థం చేసుకొని, గాడిలో పెట్టే తరుణంలోనే జీహెచ్ఎంసీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి అప్పట్లో వారిని పంపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడలాంటి పరిస్థితి లేకున్నా ఇలంబర్తి బదిలీతో జీహెచ్ఎంసీ పరిస్థితి ఏం కానుందో వేచి చూడాల్సిందే ! -
చంపేసి..లిఫ్ట్ గుంతలో పడేసి..
కవాడిగూడ: గుర్తుతెలియని ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి...సమీప భవనంలోని లిఫ్ట్ గుంతలో శవాన్ని పడేసి వెళ్లిన ఘటన దోమలగూడ పీఎస్ పరిధిలోని హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 8లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆ యువకుడిని గుర్తు తెలియని దుండగలు ముందుగా బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం మృతదేహన్ని బట్టలో చుట్టి ప్లాజా అపార్ట్మెంట్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు పక్కనే ఉన్న లిఫ్ట్ గుంతలో పడేసి పారిపోయారు. సోమవారం ఉదయం అపార్ట్మెంట్ ప్రాంగణాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది రక్తపు మరకలు, దుస్తులు పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దోమలగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అపార్ట్మెంట్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కనే ఉన్న లిఫ్ట్‌లో 32 సంవత్సరాల యువకుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది. వెంటనే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, గాందీనగర్ డివిజన్ ఇన్చార్జీ ఏసీపీ గురురాఘవేంద్ర దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు నిరంజన్, సాయిచంద్‌లు, క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరిలించారు. ఇదిలా ఉండగా ప్రతి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య జరగడం సంచలనం సృష్టించింది. కాగా స్థానికుల వివరాల ప్రకారం..గుర్తుతెలియని యువకుడు ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో భోజనం చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ షట్టర్ ముందు నిద్రపోగా..మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నకొంత మంది దుండగులు అతని వద్దకు వచ్చి నిద్రలేపి పక్క వీధిలోకి తీసుకెళ్లి ఘర్షణ పడ్డారని తెలిసింది. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్య జరిగినట్లు సమాచారం. -
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్ కార్డు మంజూరు దేవుడెరుగు..పాత కార్డులోని పేర్ల తొలగింపుతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. రేషన్ కార్డు కలిగిన కుటుంబంలో ఒకరి పేరు బదులు మరొకరి పేర్లు తొలగింపునకు గురవుతోంది. మరికొందరికి కొత్త రేషన్ కార్డు కోసం పేరు తొలగిస్తే ..కొత్తది రాకపోగా పాతదాంట్లోనూ కోటా కట్ అవుతోంది. కొత్త కార్డులో పేర్ల నమోదు కోసం పాత వాటిలో తొలగింపునకు దరఖాస్తు తప్పడం లేదు. దరఖాస్తును సరిగ్గా పరిశీలించని పౌరసరఫరాల శాఖ సిబ్బంది తొలగించాల్సిన యూనిట్‌కు బదులు దరఖాస్తుదారుల పేర్లు తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. వివాహ బంధాలతో కొత్తగా ఏర్పాటైన కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తల్లిదండ్రుల కుటుంబం కార్డుల్లో పేర్లు రద్దయితే కానీ, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. కుటుంబం రేషన్ కార్డుల నుంచి తమ పేర్లను తొలగించుకునేందుకు పౌరసరఫరాల శాఖ సర్కిల్ ఆఫీస్‌లకు క్యూ కట్టి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించుకుంటున్నారు. దీంతో సంబంధిత సిబ్బంది ఒక సభ్యుడికి బదులు మరో సభ్యుడి పేరు తొలగిస్తుండటంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. రెండుశాతం వరకు .. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల నుంచి రేషన్‌కార్డులో పేర్ల తొలగింపునకు సంబంధించి సుమారు రెండు లక్షలపైగా ఆఫ్‌లైన్ దరఖాస్తులు వచి్చనట్లు తెలుస్తోంది. అందులో రెండు శాతం వరకు సభ్యుల పేర్ల తొలగింపులో తికమక జరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. గ్రేటర్ మొత్తం మీద సుమారు పన్నెండు అర్భన్ సర్కిళ్ల పరిధిలో 12,34,873 కార్డులు అందులో 42,72,820 మంది లబ్ధిదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో మరో ఐదు లక్షల కార్డులు, 17 లక్షల మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు. అందులో మొత్తం మీద సుమారు 10 శాతం కుటుంబాల్లోని సభ్యులు పెళ్లిల్లు చేసుకోవడంతో కొత్త కుటుంబాలు ఏర్పాటయ్యాయి. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండంతో కొత్త కుటుంబాలకు ఆసక్తి పెరిగింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు పాత కార్డులోని తమ పేర్లను తొలగించాలని దరఖాస్తు చేస్తున్నారు. కానీ వీటి తొలగింపు గందరగోళంగా తయారైంది. ఎదురు చూపులే..పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులకు ఎదురు చూపులు తప్పడం లేదు. గత ఎనిమిదేళ్లుగా రేషన్‌కార్డులోని సభ్యులు (యూనిట్లు) వివిధ సాకులతో తొలగింపునకు గురవుతున్నా..కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులకు మాత్రం మోక్షం లభించడం లేదు. ఈ వ్యవధిలో ఉమ్మడి కుటుంబాలు రెండు, మూడుగా ఏర్పడగా, మరోవైపు కుటుంబంలో మరి కొందరు కొత్త సభ్యులుగా చేరారు. పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల ప్రక్రియ పెండింగ్‌లో మగ్గుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు మూడు లక్షల కుటుంబాలు తొమ్మిది లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆన్ లైన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులు కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తూనే..ఆమోదించే ఆప్షన్‌ను మాత్రం ప్రభుత్వం నిలిపివేసింది. రేషన్ కార్డులోని సభ్యుల తొలగింపు నిరంతరం ప్రక్రియగా సాగుతోంది. అమోదం లేక పోవడంతో నిరుపేద కుటుంబాలు మీ సేవ, సివిల్ సప్లై ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఆమోదించే ఆప్షన్ ఇచ్చేంతవరకు ఆగాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో పేర్ల తొలగింపునకు గురైన యూనిట్ల నెలవారి కోటా కట్ కావడంతో పేద కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి. -
దోచుకున్న డబ్బుతో కేసీఆర్ సభ
నల్లగొండ: పదేళ్లు దోచుకున్న డబ్బుతో బీఆర్ఎస్.. వరంగల్‌లో సభ నిర్వహించిందని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నల్లగొండ నియోజకవర్గంలో మూడు లిఫ్టులకు, కలెక్టరేట్లో అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎంపీలు కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, బాలునాయక్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీయించారని ధ్వజమెత్తారు. రైతులను ప్రోత్సహిస్తున్నాం.. రాష్ట్రంలో ఏడాది కాలంలో 2.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని.. సన్నాలకు బోనస్ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. దేశంలో పేదలకు సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. అలాగే అర్హులకు రేషన్‌కార్డులు ఇవ్వడంలో బీఆర్ఎస్ విఫలమవగా తాము అర్హులందరికీ కార్డులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాలను ఆంధ్రాకు అప్పగించారని.. 512 టీఎంసీలు ఏపీ తీసుకుంటే, తెలంగాణకు 299 టీఎంసీలే వచ్చేలా ఒప్పందం చేసుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. కానీ తామిప్పుడు 500 టీఎంసీలను తెలంగాణకు ఇవ్వాలని కొట్లాడుతున్నామని చెప్పారు. తమ పాలనలోనే ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నాడు సోనియా కాళ్లు మొక్కి.. నేడు కాంగ్రెస్ విలన్ అంటావా: కోమటిరెడ్డి తెలంగాణ ఇచ్చిన తల్లి అంటూ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్ నేడు కాంగ్రెస్ పారీ్టనే విలన్ అనడం ఎంత వరకు సమంజసమని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి నేడు అదే నోటితో కాంగ్రెస్‌ను విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళితుడిని సీఎం చేస్తాన ని చెప్పి కేసీఆర్ మాటమార్చి మోసం చేశారని దుయ్యబట్టారు. అవినీతి డబ్బుతో మీటింగ్ పెట్టి కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఉత్తమ్, వెంకట్రెడ్డిలది సీఎం స్థాయి: రాజగోపాల్‌రెడ్డి కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని.. పదేళ్లు ఆయన ఏం చేశారో సమాధానం చెబుతామని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మంత్రులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం స్థాయిలో ఉన్నవారన్నారు. కోమటిరెడ్డి పదవు ల కోసం పాకులాడలేదని.. తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. -
సెట్ చేయడానికే ఏడాది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని, రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది ఆయనేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ రజతోత్సవం పేరుతో ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఆయనలో ఉన్న అక్కసునంతా వెళ్లగక్కాడని విమర్శించారు. వాస్తవానికి తాను ముఖ్యమంత్రిని అయిన రోజునే కేసీఆర్ గుండె పగిలిందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక.. అంతకుముందు పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సెట్ చేయడానికే ఏడాది కాలం సరిపోయిందని, ఇప్పుడంతా స్ట్రీమ్‌లైన్ (క్రమబద్ధీకరణ) చేస్తున్నామని చెప్పారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. బీఆర్ఎస్ సభ, మావోయిస్టుల సమస్య, కేసీఆర్ పాలన, తన పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, రాహుల్‌గాందీతో తనకున్న మైత్రి తదితర అంశాలపై మాట్లాడారు. ఎవరో అడుగుతున్నారని అరెస్టులు ఉండవు ‘కేసీఆర్ ప్రసంగంలో పస లేదు. బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ కంటే నేను గజ్వేల్‌లో పెట్టిన సభే హైలైట్. ఖమ్మంలో జరిగిన రాహుల్‌గాంధీ సభకు బీఆర్ఎస్ హయాంలో కనీసం బస్సులు కూడా ఇవ్వలేదు. కానీ మేం బీఆర్ఎస్ నేతలు అడిగినన్ని బస్సులు ఇచ్చాం. తద్వారా ఆర్టీసీకి ఆదాయం కూడా వచ్చింది. హరీశ్, కేటీఆర్‌లు చిన్నపిల్లలని నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్నే కేసీఆర్ ఎల్కతుర్తి సభలో చెప్పాడు. మరి పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు? కేసీఆర్, మోదీ వారి అవసరాలకు అనుగుణంగా మాట్లా డుతుంటారు. కేసీఆర్ తరహాలో నేను చట్టాన్ని అతిక్రమించి పనిచేయను. ఎవరో అడుగుతున్నా రని అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేది లేదు. చట్టప్రకారమే అన్నీ జరుగుతాయి..’ ముఖ్యమంత్రి అన్నారు. ఏ పథకమైనా అర్హులందరికీ లబ్ధి చేకూరాలి ‘కేసీఆర్ తరహాలో లాంచింగ్, క్లోజింగ్ పథకాలు నేను పెట్టలేను. షోపుటప్ స్కీంలు నాతో కాదు. ఒక పథకాన్ని ప్రారంభిస్తే అర్హులందరికీ లబ్ధి కలిగేంతవరకు పనిచేస్తా. రేవంత్‌రెడ్డి చెప్పిందే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తా. ఇప్పటివరకు ప్లానింగ్‌కే సమయం సరిపోయింది. ఇక నుంచి స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. పథకాల గ్రౌండింగ్ చేస్తాం. అయితే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను చెప్పుకోవడంలో కూడా మేము వెనుకబడ్డాం. ఏడాదిన్నరలోనే ఎన్నో పథకాలు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో పథకాలు తీసుకువచ్చాం. ఇప్పుడు వాటన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం. మేము అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవు. బీఆర్ఎస్ తరహాలో మాకు కూడా తెలంగాణ ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తారు. వాస్తవానికి నా పాలన, పథకాల అమలుపై ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే చర్చ జరుగుతోంది..’ అని రేవంత్ చెప్పారు. రాహుల్‌తో మంచి సంబంధాలున్నాయి ‘రాహుల్‌గాంధీతో నా స్నేహం గురించి నాకు తెలిస్తే చాలు. ఎవరో ఏదో చెబితే వినాల్సిన పనిలేదు. ఆయనతో నాకు మంచి సంబంధాలున్నాయి. మా ఇద్దరి గురించి బయటి వారు ఏం మాట్లాడుకుంటున్నారనేది నాకు అవసరం లేదు. ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన రాజకీయ యోధురాలు లేరు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెది. వేరే ఆప్షన్ లేకే ఆ అధికారుల కొనసాగింపు పాలన అవసరాలను బట్టి అధికారులను వినియోగించుకుంటాం. కొందరు అధికారుల గురించి అన్ని విషయాలు తెలిసినా వేరే ఆప్షన్ లేకపోవడంతో కొనసాగించాల్సి వస్తోంది. కలెక్టర్లను మార్చుకునే వెసులుబాటు ఉంది కనుకనే మారుçస్తున్నాం. సీపీఐ, ఎంఐఎంకు అండగా ఉన్నా.. నేను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ మర్చిపోను. నన్ను నమ్మిన సీపీఐకి, ఎంఐఎంకు అండగా ఉన్నా. అద్దంకి దయాకర్‌కు పదవి ఇప్పించగలిగా. దయాకర్ ఓపికతో ఉన్న కారణంగానే పదవి వచ్చింది. ఓపికతో ఉంటేనే నాకు కూడా బాధ్యత ఉంటుంది. అవకాశాలు వస్తాయి. అలా కాదని బయటకు వచ్చి స్లీపింగ్ రిమార్కులు చేస్తే నాపై భారం తగ్గించినట్టే అవుతుంది. పదవి ఇవ్వలేని పరిస్థితికి, వారి మాటలకు చెల్లుకు చెల్లు అయినట్టు నేను ఫీల్ అవుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఎంత చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు వినడం లేదు ‘కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సరిగా పనులు చేసుకోలేకపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు హైదరాబాద్ వదిలి వెళ్లలేకపోతున్నారు. మీడియా చుట్టూ తిరిగేందుకే పరిమితం అవుతున్నారు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మావోయిస్టులపై పార్టీ నిర్ణయమే ఫైనల్ ‘ఆపరేషన్ కగార్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. మావోయిస్టుల విషయంలో పార్టీ నిర్ణయమే ఫైనల్. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం..’ అని రేవంత్ తెలిపారు. జానా నివాసంలో ‘కగార్’పై చర్చలు లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ స్వీకార కార్యక్రమానికి సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా మాజీ మంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ జానారెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డిలతో సమావేశమయ్యారు. ఆపరేషన్ కగార్ గురించి చర్చించారు. మావోయిస్టుల సమస్యకు సంబంధించి శాంతి చర్చల కమిటీ ఆదివారం తనతో సమావేశం కావడాన్ని, తాను చొరవ తీసుకుని కేంద్రాన్ని శాంతి చర్చలకు ఒప్పించేలా చూడాలని వారు కోరిన విషయాన్ని తెలియజేశారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి హోంమంత్రిగా, కేశవరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో.. శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనలపై ఏం చేయాలన్న దానిపై వారితో చర్చించారు. అక్కడి నుంచే ఏఐసీసీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, చిదంబరంలతో సీఎం మాట్లాడారని సమాచారం. కాగా శాంతి చర్చల కమిటీ ప్రతిపాదనను పార్టీ అధిష్టానానికి పంపాలని సమావేశంలో నిర్ణయించారు. -
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎన్నోఏళ్లుగా ఎదురుచూపులకే పరిమితమైన ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల హైవేకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ప్రధానమంత్రి కార్యాలయ సూచన మేరకు ఆ రోడ్డు నిర్మాణానికి వీలుగా అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఇక టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించటమే తరువాయి. మూడేళ్లలో ఈ రోడ్డు అందుబాటులోకి రానుంది. దేశంలోనే కీలక జాతీయ రహదారిగా ఉన్న ఎన్‌హెచ్ 63ను కేంద్రం నాలుగు వరుసలుగా విస్తరిస్తోంది. ఇది మహారాష్ట్రలోని దౌండ్ వద్ద మొదలై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా 1,065 కి.మీ. కొనసాగి ఒడిశాలోని కోరాపుట్‌లో ముగుస్తుంది. తెలంగాణలో బోధన్–నిజామాబాద్–ఆర్మూరు–మెట్పల్లి–కోరుట్ల–జగిత్యాల–లక్సెట్టిపేట–ధర్మపురి–మంచిర్యాల–చెన్నూరు మీదుగా సాగుతుంది. ఇందులో నిజామాబాద్ నుంచి ఆర్మూరు శివారులోని ఎన్‌హెచ్ 44 వరకు, తిరిగి మంచిర్యాల దాటిన తర్వాత ఉండే ఎన్‌హెచ్ 363 నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు చెన్నూరు వరకు రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరిస్తోంది. ఆ పనులు దాదాపు పూర్తయ్యాయి.ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు కీలక నిర్మాణం అయినందున దాన్ని ఎన్హెచ్ఏఐకి అప్పగించారు. ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు పట్ణణాలు, గ్రామాల మీదుగా కొనసాగుతున్నందున, దాన్ని గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ఇందుకు భారీగా ప్రైవేట్ భూములు సేకరించాల్సి రావటంతో రైతులు ఎదురుతిరిగారు. దీంతో ఊళ్లున్న ప్రాంతాల్లో బైపాస్‌లు నిర్మించి మిగతా పాత రోడ్డును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. మధ్యలో ఓ పర్యాయం టెండర్లు పిలిచినా.. చివరకు సాంకేతిక కారణాలతో రద్దు చేసుకున్నారు. ప్రధాని కార్యాలయ దృష్టికి రావటంతో.. మూడోసారి అధికారంలోకి వచి్చన మోదీ ప్రభుత్వం, దేశవ్యాప్తంగా జాప్యం జరుగుతూ వస్తున్న కీలక రహదారులను వేగంగా పూర్తి చేసేలా జాబితాను రూపొందించింది. మొత్తం 3 వేల కి.మీ. నిడివి ఉండే రోడ్లను ఇందులో చేర్చారు. తెలంగాణ నుంచి జగిత్యాల–కరీంనగర్, ఆర్మూరు–మంచిర్యాల రోడ్లను చేర్చారు. వీటిని స్వయంగా ప్రధాని కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు ఈ రోడ్లకు లైన్‌క్లియర్ అయ్యింది. యాక్సెస్ కంట్రోల్డా...కాదా? ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు రోడ్డు నిడివి 131.8 కి.మీ. ఇందులో పలు పట్టణాలు, పెద్ద గ్రామాలున్నందున చాలా ప్రాంతాల్లో బైపాస్‌లను నిర్మించనున్నారు. ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల పట్టణాల వద్ద 6 కి.మీ. నుంచి 12 కి.మీ. మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మరో ఎనిమిది ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లు నిర్మిస్తారు. మొత్తంలో 105 కి.మీ. బైపాస్‌లే ఉండటంతో గ్రీన్‌ఫీల్డ్ హైవేగానే ఉండనుంది. దీన్ని యాక్సెస్ కంట్రోల్డ్ తరహాలో నిర్మించాలని ప్రతిపాదించినా, కేంద్రం ఇంకా దానికి అనుమతి ఇవ్వలేదు. ఈ రోడ్డుమీద టోల్‌బూత్‌లు ఉంటాయి. వాహనాల సంఖ్య అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా లేదు. యాక్సెస్ కంట్రోల్డ్ పద్ధతిలో అయితే, నిర్ధారిత ప్రాంతాలలో మినహా మధ్యలో ఎక్కడా వేరే వాహనాలు ఈ రోడ్డు మీదకు చేరే వీలుండదు. దీంతో టోల్ ఆదాయం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. బైపాస్‌ల కోసం 500 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇందుకే రూ.900 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇక వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇది 45 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. మధ్యలో సెంట్రల్ మీడియన్, రెండువైపులా పేవ్డ్ షోల్డర్స్ దారి ఉంటుంది. ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 61లను అనుసంధానిస్తుంది. మంచిర్యాల శివారు శ్రీరాంపూర్ వద్ద ఎన్‌హెచ్ 63లో నిర్మించిన ఈ ఇంటర్‌ఛేంజ్‌తో ప్రతిపాదిత రోడ్డు అనుసంధానమవుతుందిప్యాకేజీ1: ఆర్మూరు నుంచి మెట్పల్లి 35.9 కి.మీ ప్యాకేజీ2: మెట్పల్లి నుంచి జగిత్యాల 28.7 కి.మీ. ప్యాకేజీ3: జగిత్యాల నుంచి రాయపట్నం 31.9 కి.మీ. ప్యాకేజీ4: రాయపట్నం నుంచి మంచిర్యాల 35.39 కి.మీ. -
యువ ప్రతిభకు 'మకుటం': క్రీడాకారునికి చేయూత
హైదరాబాద్‌లో చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ అండ్ నిర్మాణ సంస్థ అయిన మకుటా డెవలపర్స్, నిర్మాణాలతో సొంతిటి కలల్ని సాకారం చేస్తూనే, ప్రతిభ కలిగిన యువతకు చేయూతనిచ్చి లక్ష్య సాధనలో ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాణిస్తున్న క్రీడాకారునికి వెన్నుతట్టి నడిపిస్తోంది.దక్షిణ కొరియాలో జరిగే 20వ ఆసియా రోలర్-స్కేటింగ్ చాంపియన్‌షిప్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన యువ రోలర్ స్కేటర్ 'ప్రతీక్'ను మకుట నిర్మాణ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రతీక్ అన్ని పోటీల్లో రాణిస్తూ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు.రోలర్ స్కేటింగ్‌లో యువ క్రీడాకారుని అంకితభావం, అభిరుచిని గుర్తించి మకుట డెవలపర్స్ స్పాన్సర్ షిప్ చేస్తోంది. ప్రతీక్ పోటీల్లో రాణించి సత్తా చాటేందుకు మద్దతుగా ₹2 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ విరాళాన్ని శ్రీ జనార్ధన్ కొంపల్లి (వ్యవస్థాపకుడు & CEO), శ్రీ హర్షవర్ధన్ రెడ్డి వంగా (డైరెక్టర్) చేతుల మీదుగా ప్రతీక్, అతని తల్లి శ్రీమతి మృదులకు సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా మకుట వ్యవస్థాపకులు కొంపల్లి జనార్ధన్ మాట్లాడుతూ.. "సమాజం అభివృద్ధి చెందినప్పుడే నిజమైన వృద్ధి జరుగుతుందని మేము నమ్ముతాము. యువ ప్రతిభకు మద్దతు ఇవ్వడం అనేది మెరుగైన భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిది. ప్రతీక్ లాంటి యువ ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సామాజిక బాధ్యతతో ఇలాంటి ఆటగాళ్లకు మద్దతు తెలిపితే, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించి భారతదేశం ఖ్యాతి, గౌరవాన్ని పెంచుతారని'' కొంపల్లి అన్నారు. -
జిమ్ చేస్తూ గాయపడ్డ కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గాయపడ్డారు. జిమ్ వర్కవుట్ చేస్తుండగా గాయమైనట్లు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు. వైద్యులు కొన్నిరోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని, త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నట్లు KTR ఓ పోస్ట్ ఉంచారు.ఇదిలా ఉంటే.. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. Picked up a slip disc injury during a gym workout session. Have been advised a few days of bed rest and recovery by my doctorsHope to be back on my feet soon— KTR (@KTRBRS) April 28, 2025కేటీఆర్‌కు హైకోర్టులో ఊరటకేటీఆర్కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ‘‘రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ.2,500కోట్లను పంపించారని కేటీఆర్ ఆరోపించగా, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్ వేశారు. ఇరువైపులా వాదనలు విన్నజస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం కేసును కొట్టేస్తున్నట్లు సోమవారం తీర్పు ఇచ్చింది. -
‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు వస్తారా?’
హైదరాబాద్: తెలంగాణ విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని బీజేఎప్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో దిట్టని, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలపై చర్చకు వస్తారా? అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎల్కతుర్తి సభలో సెటైర్లు వేశారు మహేశ్వర్ రెడ్డి. కొండంత రాగం తీసి.. దిక్కుమాలని పాట పాడినట్లు ఉంది బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని ఎద్దేవా చేశారు.‘తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని నిందించారు. బీబీ నగర్ లో ఎయిమ్స్ ఎవరిచ్చారు?, కేసీఆర్ పదేళ్లపాటు మావోయిస్టులను చర్చలకు ఎందుకు పిలవలేదు. అధికారం పోయాక మావోయిస్టులు గుర్తుకు వచ్చారా?, మావోయిస్టులను వెనకేసుకురావడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. గతంలో చర్చలు జరిపినప్పుడు ఏమైంది?, మావోయిస్టులకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు’ అని ధ్వజమెత్తారు.కేసీఆర్ పగటి కలలు కంటున్నారు..మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంస పాలన.. ఫెయీల్యూర్ పాలన.. కుటుంబ పాలన. కుటుంబ పాలనకు కాలం చెల్లింది. తెలంగాణకు అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టారు. కాళేశ్వరం కట్టి తెలంగాణ ప్రజల మీద భారం మోపారు. మొసలీ కన్నీరు కార్చిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’ అని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. -
‘కేసీఆర్, చంద్రబాబు నా దగ్గర పని చేశారు’
హైదరాబాద్: ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభపై కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హెచ్(వి హనుమంతరావు) విమర్శలు గుప్పించారు. అది బీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్ మీటింగే కానీ, అంతకు మించి ఏమీ లేదన్నారు. పార్టీలో ఉన్న వాళ్లు వెళ్లిపోతారేమో అని భయపడి సభ పెట్టారని, కేసీఆర్ డిక్టేటర్ పాలన చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తప్పులు మీద తప్పులు చేశారని వీహెచ్ మండిపడ్డారు.‘తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా?, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ప్రజలు కేసీఆర్ ని తిరస్కరించారు. ప్రగతి భవన్, సెక్రటరియేట్ కట్టాలనే మంచి ఆలోచన కేసీఆర్ కు వచ్చింది. . కానీ ప్రజలను ఎవ్వరినీ అక్కడికి రానివ్వలేదు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని మహారాష్ట్ర వెళ్లి కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు. హర్యానా, పంజాబ్ వెళ్లి డబ్బులు పంచి వచ్చారు కేసీఆర్. మీర్చి రైతులకు సంకెళ్లు వేశారు. ఇలా కేసీఆర్ తప్పులు మీద తప్పులు చేశారు’ అని వీహెచ్ ఆరోపించారు. ఇక యూత్ కాంగ్రెస్ లో కేసీఆర్, చంద్రబాబులు తన దగ్గర పని చేసిన వారేనంటూ వీహెచ్ స్పష్టం చేశారు. అయితే వాళ్లకు అవకాశం వచ్చింది.. తనకు రాలేదని కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు వీహెచ్. -
చేసిన పనులు చెప్పుకోవడంలో వెనుకబడ్డాం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని, చివరి ఆరు నెలల్లోనే వీటిపై కచ్చితంగా చర్చ జరుగుతుందని అన్నారాయన. సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సహా పలు అంశాలపై స్పందించారు.ఎల్కతుర్తి సభలో కేసీఆర్(KCR) తన అక్కసు మొత్తం గక్కారు. కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిల్లగాళ్లు అని ఆయన అన్నారు. మరి వాళ్లనెందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు?. గతంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వని చరిత్ర వాళ్లది. కానీ, బీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు కావాలని మమ్మల్ని అడిగారు. ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వమని చెప్పా. ఆర్టీసీకి ఆదాయం వస్తుంటే.. వద్దంటామా?. .. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అనేక పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటన్నింటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. నేను కమిట్మెంట్తో పనిచేస్తున్నా. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పా. ఇప్పించా. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డాం. వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ చెప్పింది చేస్తాడు అని ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తాం. అంతేగానీ.. కేసీఆర్ మాదిరి లాంచింగ్ క్లోజింగ్ పనులు చేయను. చిట్‌ఛాట్‌లో ఇంకా..ఆపరేషన్ కగార్(Operation Kagar) అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్‌పై మా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే. ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం.ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరు. ఓ దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరా గాంధీదే. ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారు. నాకు, రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఈ విషయంలో ఎవర్ని నమ్మించాల్సిన అవసరం లేదు.కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. చివరి ఆరు నెలలు వీటిపై చర్చ జరుగుతోంది. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నాం. ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలన్నీ తెలిసేదెలా?. ఎమ్మెల్యే అయ్యాక మనోడు.. మందోడు అని ఉండదు. కానీ, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైం పాస్ చేస్తున్నారు. ఎమ్మెల్యే లు నియోజకవర్గాల్లో ఉండాలి.. అవసరం అయితేనే హైదరాబాద్ రావాలి -
ఆటల పండుగ వచ్చేసింది...ఇవిగో పూర్తి వివరాలు
సనత్‌నగర్: వేసవి సెలవుల జోష్ మొదలైంది. నిన్నమొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు ఇక మైదానాల్లో తమకిష్టమైన క్రీడల్లో సందడి చేయనున్నారు. ప్రతియేటా లాగానే ఈ సారి కూడా జీహెచ్ఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణను చేపట్టింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఈ సారి కాస్తా ఆలస్యం కాగా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వేసవి క్రీడా శిబిరాలు అందుబాటులోకి వచ్చాయి. వేసవి క్రీడా శిక్షణ సామగ్రి సైతం ఆయా డివిజన్లకు చేరుకున్నాయి. సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లలో అతిపెద్ద క్రీడా సౌధాలతో పాటు మైదానాలకు కొదువ లేదు. గ్రేటర్లో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్‌లో ఆయా చోట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. సాధారణంగానే నిరంతర శిక్షణ ఉంటుంది. అయితే వేసవి సెలవుల దృష్ట్యా వాటి స్థానంలో శనివారం నుంచి మే 31 వరకు ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! ఎప్పటిలాగానే అమీర్‌పేట్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లతో పాటు వివిధ క్రీడా ప్రాంగణాలు వేసవి శిక్షణ శిబిరాలకు వేదికయ్యాయి. క్రికెట్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్కేటింగ్, షటిల్, జిమ్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్, హాకీ, యోగ, చెస్, కరాటే....ఇలా వివిధ రకాల క్రీడాంశాల్లో జీహెచ్ఎంసీ తరుపున శిక్షణ ఇస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా కొనసాగే ఆటల్లో శిక్షణ పొందేందుకు 5 నుంచి 16 ఏళ్ళ మధ్య వయస్సున్న వారు అర్హులుగా నిర్ణయించారు. ఆసక్తి గల బాలబాలికలు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ క్రీడా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి తెలిపారు. వేసవి శిబిరాల్లో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ మినహాయించి అన్ని క్రీడల్లో శిక్షణ పొందేందుకు రూ.10 ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవచ్చు. స్కేటింగ్, క్రికెట్లో మాత్రం వేసవి శిక్షణ కోసం రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ శిక్షణకు రూ.500లు చెల్లించాలి.వేసవి శిక్షణ శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలు స్పోర్ట్స్.జీహెచ్ఎంసీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి పిల్లల పేరు, వివరాలు నమోదు చేసి, ఇష్టమైన క్రీడను ఎంపిక చేసుకుని సూచించిన ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయి. స్కేటింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: పవన్‌కుమార్ ఫోన్: 98665 13604 బాక్సింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: ప్రకాశ్ ఫోన్: 93907 65412 జిమ్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.200, కోచ్: విక్రమ్ ఫోన్: 91772 85745 బ్యాడ్మింటన్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: సురేష్ ఫోన్: 99498 14362 హాకీవేదిక: అమీర్‌పేట్ క్రీడామైదానం ఫీజు: రూ.10, కోచ్: దర్శన్‌సింగ్ , ఫోన్: 98497 21703 కరాటే వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: బాబు, ఫోన్: 96181 33057జిమ్నాస్టిక్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మహేష్ ఫోన్: 90002 77716 యోగా వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మనోజ్ ఫోన్: 99639 78509 హ్యాండ్‌బాల్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.10, కోచ్: ఇమ్రాన్‌ఖాన్ ఫోన్: 91772 39786 బాస్కెట్‌బాల్ వేదిక: సనత్‌నగర్ ఎస్ఆర్టీకాలనీ ఇమ్మానుయేల్ చర్చి సమీపంలోని గ్రౌండ్ ఫీజు: రూ.10 కోచ్: నయిముద్దీన్, ఫోన్: 98483 96922వాలీబాల్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ ఫీజు: రూ.10, కోచ్: చిన్ని, పెద్ది ఫోన్ :99599 51499 క్రికెట్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.100, కోచ్: రాజ్‌కిరణ్ ఫోన్: 97041 59549 ఇదీ చదవండి: చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..! -
Himayat Nagar: పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం లిఫ్ట్‌లో దారుణ హత్య
హైదరాబాద్,సాక్షి: హిమాయత్ నగర్లో దారుణం జరిగింది. దోమలగూడా పీఎస్ పరిధిలో హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం లిఫ్ట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు బాధితుణ్ని హత్య చేశారు. అనంతరం, బ్యాంకు లిఫ్ట్‌లో పడేసి వెళ్లారు. హత్యపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాల్ని సేకరిస్తున్నారు. -
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం
ఢిల్లీ: మీరు మా కంటే (భారత్) అరగంట వెనకబడలేదు.. అర్థ శతాబ్ధం వెనకబడ్డారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. అదే సమయంలో భారత్‌లో పలు టీవీ ఛానెళ్ల యాంకర్లపై మండిపడ్డారు. కాశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఆదివారం మహారాష్ట్ర పర్భానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై దాడి చేసేందుకు తాము అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్ నాయకుల హెచ్చరికలపై ఆయన స్పందించారు. ‘తమ వద్ద అణు బాంబులు, అణు బాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం ఎందుకు మౌనంగా ఉంటుంది. అందుకు గట్టిగానే బదులిస్తోంది.మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారుఅభివృద్ధిలో మా దేశానికి, మీ దేశానికి పోలిక ఎక్కడా? అభివృద్ధిలో మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదు’ అని గుర్తు చేశారు. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ (అరబ్ భాషలో తీవ్రవాదులు) కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్ఐఎస్ వారసులని చూపిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.Parbhani, Maharashtra: AIMIM Chief Asaduddin Owaisi says, "Pakistan always talks about being a nuclear power; they need to remember if they enter a country and kill innocent people, that country will not sit quietly. No matter the government, by killing our people on our land,… pic.twitter.com/zB80FJcY8G— ANI (@ANI) April 27, 2025 ప్రధాని మోదీకి ఎంపీ అసదుద్దీన్ డిమాండ్అంతేకాదు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి, హ్యాకర్లను ఉపయోగించి ఆ దేశంలో ఇంటర్నెట్ను హ్యాక్ చేసేందుకు భారత్‌కు అనుమతి ఉందని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలహీన పరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.షేమ్పలు టీవీ ఛానెళ్లలో పనిచేసే యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షేమ్. కశ్మీర్ మన అంతర్భాగం. కాశ్మీరీలు కూడా మనదేశంలో అంతర్భాగమే. అలాంటి వారిని మనం ఎలా అనుమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించింది ఓ కాశ్మీరీనే. గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచింది కూడా ఓ కాశ్మీరీనే అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎత్తి చూపారు. -
కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డితో భేటీ అయ్యారు. జానారెడ్డి నివాసంలో ఆపరేషన్ కగార్ అంశంపై సీఎం రేవంత్.. జానారెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి భేటీకి హాజరయ్యారు. అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్‌పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక.. ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా..తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో కొన్ని రోజులుగా మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. కర్రెగుట్టలో బాంబు వర్షం కురిపిస్తోంది. ఈ ఆపరేషన్ వల్ల వందలాది మంది మావోలు మృతిచెందుతున్నారు. మావోలు చనిపోతుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర చర్యలను ఖండించారు. పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాంతి చర్చల కమిటీ భేటీలో నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి మంత్రులతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. సామాజిక కోణంలో మావోయిస్టుల అంశాన్ని చూడాలి. మావోయిస్టుల భావాజాలాన్ని చంపాలనుకోవడం సరైంది కాదని అన్నారు. -
పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పాతబస్తీలోని పలువురు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. తెలంగాణలో భూదాన్ భూములు, మహేశ్వరం భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. భూదాన్ భూములను అక్రమంగా ఆక్రమించి లే-అవుట్ చేసి మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా అనే వ్యక్తులు అమ్మకాలు జరిపారు. దాదాపు వంద ఎకరాల భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగి.. పాతబస్తీలో మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిస్, శర్పాన్, సుకుర్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమాయ్ కుమార్‌ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. -
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కొడంగల్ రూరల్: ఎదురెదురుగా వస్తున్న బొలెరో..కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అయినన్పల్లి స్టేజ్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన రామారావు(51) హైదరాబాద్‌లోని కేపీహెచ్పీ కాలనీలో ఏడాది కాలంగా నివాసం ఉంటున్నారు. ఇతనికి భార్య శారద, కుమారుడు అనిష్ ఉన్నారు. శనివారం పని మనిషి శ్రీలత(42), ఆమె మూడో కూతురు శ్రుతి(12)తో కలిసి కారులో కర్ణాటకలోని గానుగాపూర్‌లో గల దత్తాత్రేయస్వామి ఆలయానికి వెళ్లారు. ఆదివారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కొడంగల్ మండలం అయినన్పల్లి గేటు సమీపంలోకి రాగానే కొడంగల్ నుంచి లక్ష్మీపల్లికి వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీలత అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులు శ్రుతి, రామారావును హైవే అంబులెన్సులో కొడంగల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా రామారావు మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రుతి మృతి చెందింది. ఇదిలా ఉండగా కొడంగల్ మండలం పర్సాపూర్‌కు చెందిన శ్రీలతకు పెద్దేముల్ మండలం మంబాపూర్కు చెందిన కృష్ణప్పతో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని హబ్సిగూడలో నివాసముంటూ ఇళ్లలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రామారావు ఇంటో శ్రీలత పని చేస్తోంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామారావు, శ్రీలత, శ్రుతి మృతి చెందారు. బొలెరో వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బొలెరో.. కారు ఢీకొని ముగ్గురు దుర్మరణం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన -
క్రీడారంగ అభివృద్ధికి కృషి
మంత్రి పొన్నం ప్రభాకర్ గన్‌ఫౌండ్రీ: క్రీడారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఎల్బీస్టేడియంలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టి–20 క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రికెట్ ఖేలో–నషా చోడో అనే నినాదంతో, నో డ్రగ్స్– నో బెట్టింగ్ అంటూ క్రికెట్ పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, స్పోర్ట్స్ సెల్ ఇన్చార్జి పొన్నం తరుణ్ గౌడ్, శక్తి సూపర్ షీ కోఆర్డినేటర్ కె.విద్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బహుజనుల రాజ్యం స్థాపించాలి
ఇబ్రహీంపట్నం: బహుజనుల రాజ్యాన్ని స్థాపించి ఎర్రకోటపై జెండా ఎగురవేయాలని దళితసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జేబీ రాజు పిలుపునిచ్చారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో పూలే, అంబేద్కర్ జన జాతర సభను ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. 95 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజనులంతా ఏకమై బహుజన రాజ్యస్థాపనకు కృషిచేయాలన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అందరూ సమానులేనని అంబేడ్కర్ రాజ్యాంగంలో రచిస్తే దానిని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చే మెజార్టీ పార్లమెంట్లో లేని కారణంగానే మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయలేకపోయిందన్నారు. మనుధర్మాన్ని అమలు చేస్తే మన బతుకులు పాత కాలంలో మాదిరిగా మారిపోతాయని, మనుషుల మధ్య స్వేచ్ఛ, సమానత్వం ఉండవని, అణగారిన కులాలు ఆగమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించాలని, అప్పుడే మన బతుకులు మారుతాయన్నారు. లెక్కలు తేలితే తమ ఆటలు సాగవని బీసీ జనాభా లెక్కలు తేల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడంలేదని విమర్శించారు. పోరాటలతోనే రాజ్యాధికారం దక్కదని.. ఎన్నికల్లో గెలుపే ప్రధానమన్నారు. అందుకు బహుజనులంతా అధికారం చేపట్టే దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. పూలే, అంబేడ్కర్ ఆశయాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న మాట్లాడుతూ.. పూలే, అంబేడ్కర్లను స్మరించకపోతే మన భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలనే దుర్భర పరిస్థితులు నేడు దేశంలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ నేతృత్వంలో బహుజనులను ఏకం చేస్తూ రాజ్యాధికారం వైపు నడిపించే పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, జిల్లా అధ్యక్షుడు సామేల్, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. దళితసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జేబీ రాజు -
‘ఏ’ కథా సంపుటి ఆవిష్కరణ
సాక్షి, సిటీ బ్యూరో: రిటైర్డ్ పోలీస్ అధికారి, రచయిత చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ రాసిన ‘ఏ’ కథా సంపుటిని పలువురు సాహితీ వేత్తలు ఆవిష్కరించారు. ఆదివారం జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, బాల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్, రచయితలు ఖదీర్ బాబు, అనిల్, మానస ఎండ్లూరి, కుప్పిలి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ‘ఏ’ కథా సంపుటిలో వైవిధ్యం, వాస్తవికత, మానవీయత కలిగిన కథలు ఉన్నాయని కొనియాడారు. ఈ కథల్లో సీ్త్ర, పురుష సంబంధాల గురించి స్వేచ్ఛగా వ్యక్తపరచడం పాఠకులను ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నారు. కథలన్నీ ఆలోచింపజేసేలా ఉన్నాయన్నారు. సీ్త్ర, పురుష సంబంధాల పట్ల, సమాజం నిర్మించిన నైతిక చట్రపు విలువలను, సంబద్ధతను రచయిత నిశితంగా ప్రశ్నించారని వివరించారు. ఒకే మూసలో ఒదగని ఈ కథలు చెప్పేతీరు కూడా కథ కథకి మారుతుందన్నారు. కాగా ఉమామహేశ్వర శర్మ పదవీ విరమణ చేశాక రాసిన రెండో పుస్తకం ‘ ఏ’ కథలు. ఆయన మొదటి పుస్తకం ‘నేనూ శాంత కూడా–ఓ జీవన కథ’ ఇప్పటికే పాఠకుల ఆదరణ పొందింది. -
3 నెలలకోసారి వాహన ధ్రువీకరణ తప్పనిసరి
సాక్షి, సిటీబ్యూరో: మ్యాన్‌హోళ్ల క్లీనింగ్‌కు వినియోగిస్తున్న బిగ్ ఎయిర్‌టెక్ మిషన్లలో కాలం చెల్లిన వాటికి చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమవుతోంది. ఎయిర్‌టెక్ వాహనాలకు పాత టెక్నాలజీ అప్‌గ్రేడ్‌తో కొత్త గ్రేడింగ్‌కు అవకాశం కల్పిస్తూనే సరికొత్త నిబంధనలతో టెండర్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. వాహన కాల పరిమితి 13 ఏళ్లలోపు ఉండాలని, జెట్టింగ్, సక్షన్‌తో పాటు గ్రాబర్ కలిగి ఉండేలా నిబంధనలు రూపొందిస్తోంది. పైపులైన్‌లోని మురుగును గ్రాబర్ (బకెట్) ద్వారా బయటికి తీసుకొచ్చేలా ఉన్న వాహనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయి వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి పీడీఐఎల్ (భారత ప్రభుత్వ వాహన యోగ్యత తనిఖీ కేంద్రం) ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించేలా నిబంధన రూపొందిస్తోంది. నిత్యం వాహనాల పనితీరుపై జీపీఎస్ ద్వారా ఏవీటీఎస్ వినియోగించి పర్యవేక్షించనుంది. ముచ్చటగా మూడోసారి.. జలమండలి పరిధిలో 80 భారీ ఎయిర్ మిషన్లను అద్దె ప్రాతిపదికన వినియోగిస్తున్నారు. ఎయిర్ టెక్ మిషన్ల టెండర్ వర్క్ ఆర్డర్ కాలపరిమితి గతేడాది సెప్టెంబర్ 14తోనే ముగిసింది. తిరిగి టెండర్ ప్రక్రియ చేపట్టకుండా ఇదివరకే మూడు నెలల చొప్పున రెండుసార్లు వర్క్ ఆర్డర్ కాలపరిమితిని అధికారులు పొడిగించారు. తాజాగా మూడోసారి కూడా ఆరు నెలల కాల పరిమితిని పొడిగించేందుకు దస్త్రాలు ముందుకు కదిలాయి. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ కాలపరిమితి ముగియక ముందే కొత్త టెండర్ ప్రక్రియ చేపట్టి వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. టెండర్ కాలపరిమితి ముగిసి ఎలాంటి ఆటంకం లేనప్పటికీ పాత వర్క్ ఆర్డర్‌కు గడువు పొడిగింపు పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక నెల బిల్లు ముట్టజెబితే... ఎయిర్ టెక్ వాహనాల్లో సగానికిపైగా కాలం చెల్లినవి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా మార్కెట్లో ఏఆర్ఏఐ బీఎస్–6 వాహనాలు అందుబాటులో ఉండగా.. జలమండలి మాత్రం అత్యధికంగా బీఎస్–3, బీఎస్–4 వాహనాలు వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కొందరు జలమండలి ఉన్నతాధికారులకు కలిసి వచ్చేలా తయారైంది. కాలం చెల్లిన వాహనాలకు వర్క్ ఆర్డర్‌ను కొత్త టెండర్ ప్రక్రియ పూర్తి వరకు కొనసాగించాలంటే ఒక నెల బిల్లు ముట్టజెప్పాలని అధికారులు సదరు ఏజెన్సీలపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక జెట్టింగ్, సక్షన్‌తో పాటు గ్రాబర్ తప్పనిసరి పాత టెక్నాలజీ అప్‌గ్రేడ్‌తో కొత్త గ్రేడింగ్‌కు అవకాశం త్వరలో సరికొత్త నిబంధనలతో టెండర్ల ప్రక్రియ చర్యలకు సిద్ధమవుతున్న జలమండలి యంత్రాంగం ఏడాది రూ.30కోట్లపైనే.. జలమండలి భారీ ఎయిర్‌టెక్ వాహనాలకు ప్రతి యేటా రూ.30కోట్లకుపైగా అద్దె చెల్లిస్తోంది. నిబంధనల ప్రకారం ఒక్కో యంత్రం రోజువారీగా గరిష్టంగా 500 రన్నింగ్ మీటర్ మేర పైపులైన్లో సీవరేజీ క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక రన్నింగ్ మీటర్‌కు రూ.22 చొప్పున సదరు ఏజెన్సీలకు చెల్లిస్తోంది. ఇలా ఒక్కో యంత్రానికి నెలకు రూ.3.30 లక్షల చొప్పున ఏటా 80 వాహనాలకుగాను రూ.31.68 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. కొందరు భారీ ఎయిర్‌టెక్ యజమానులు క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో లాగ్ పుస్తకాల్లో తప్పుడు సమాచారం నమోదు చేసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం 150 నుంచి 200 వరకు రన్నింగ్ మీటర్ల పైపులైన్ క్లీన్ చేసి రెండింతలకు పైగా ఎక్కువగా నమోదు చేయించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వాహనాలకు జీపీఎస్ ద్వారా ఏవీటీఎస్ విధించినా క్షేత్రస్థాయి అధికారుల ధ్రువీకరణ ఇందుకు దోహదం చేస్తోంది. మరోవైపు కొన్ని యంత్రాలు సరిగా పని చేయకున్నా పని చేసినట్లు బిల్లుల చెల్లింపు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలో టెండర్లు ఆహ్వానిస్తాం మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో వినియోగిస్తున్న భారీ ఎయిర్‌టెక్ మిషన్ల కోసం సరికొత్త నిబంధనలతో త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నాం. టెండర్ ప్రక్రియ పూర్తయి వర్క్ ఆర్డర్ ఇచ్చేవరకు సీవరేజీ క్లీనింగ్ చేస్తున్న వాహనాల వర్క్ ఆర్డర్ల కాలపరిమితి పొడించాలని నిర్ణయించాం. ఏఆర్ఏఐ నిబంధనల ప్రకారం కాలం చెల్లిన వాహనాలను కట్టడి చేస్తాం. – అశోక్‌రెడ్డి, ఎండీ, జలమండలి జలమండలి పరిధిలో భారీ ఎయిర్‌టెక్ యంత్రాలు ఇలా.. డివిజన్ నియోజక వర్గం వాహనాల సంఖ్య 1 చార్మినార్, బహదూర్‌పురా 6 2 మలక్‌పేట, యాకుత్‌పురా 6 3 కార్వాన్, నాంపల్లి (కొద్ది భాగం) 6 4 గోషామహల్, నాంపల్లి (కొద్ది భాగం) 6 5 అంబర్‌పేట, ముషీరాబాద్ 7 6 జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ 10 7 సికింద్రాబాద్, సనత్‌నగర్ 7 8 చాంద్రాయణగుట్ట 3 9 కూకట్పల్లి 3 10 ఎల్బీనగర్ (కొద్ది భాగం) 2 11 ఎల్బీనగర్ (ఇంకొద్ది భాగం) 2 12 కుత్బుల్లాపుర్ 4 13 మల్కాజిగిరి 6 14 ఉప్పల్ 4 15 శేరిలింగంపల్లి (కొద్ది భాగం) 3 16 రాజేంద్రనగర్ 3 17 శేరిలింగంపల్లి (కొద్ది భాగం) 3 -
ఉత్సాహంగా తైక్వాండో, కరాటే పోటీలు
● సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో వెయ్యి మందితో ఫాస్ట్ కిక్కింగ్ కాంపిటీషన్ ● హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుహుడాకాంప్లెక్స్: ఫస్ట్ ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ ఓపెన్ తైక్వాండో కరాటే, కుంగ్‌ఫూ, మార్షల్ఆర్ట్స్ చాంపియన్ షిప్–2025 పోటీలు ఉత్సాహంగా సాగాయి. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఇంటర్నేషనల్ తైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్‌రెడ్డి, కోచ్ ఖలీల్, గజిందర్ ఆధ్వర్యంలో స్పీడ్ కిక్కింగ్, స్పీడ్ పంచింగ్ విభాగంలో పోటీలు నిర్వహించారు. ఒకేసారి వెయ్యి మంది క్రీడాకారులు ఫాస్ట్ కిక్కింగ్లో పాల్గొనడంతో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. ఈ సందర్భంగా అమికల్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ వీణా వాహిని మాట్లాడుతూ.. పిల్లల్లో ఆత్మరక్షణ పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. లండన్‌లో జూలైలో జరిగే పోటీలకు ఇందులోని విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. యువత చెడుమార్గాల వైపు అడుగులు వేయకుండా ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విజేతలకు సుమన్ పల్లె, శ్రీకాంత్ గుర్తింపు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఖాజా అఫ్రిది, ముర్వాసిఫ్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హైరేంజ్ ప్రతినిధులు వీణా వాహినికి రికార్డ్స్ పత్రాన్ని అందజేశారు. -
బల్దియాకు నయా బాస్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం బల్దియా కమిషనర్‌గా ఉన్న ఇలంబర్తికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించారు. ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా కె.శశాంకను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్వీ కర్ణన్.. తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఫారెస్ట్రీ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2007లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. అనంతరం 2012లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, కరీంనగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా ఉన్న కర్ణన్.. ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆహార కల్తీలపై విస్తృతంగా తనిఖీలు చేయించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో తనిఖీలపై ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆహార కల్తీలను గుర్తించినప్పుడు హోటళ్ల లైసెన్సులు రద్దు చేయడం తదితర అధికారాలను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు అప్పగిస్తూ.. వారిని ఇన్చార్జి ఫుడ్‌సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారులుగా నియమించారు. ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాక పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ఇలంబర్తిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించిన ప్రభుత్వం.. ఆయనను నవంబర్‌లో రెగ్యులర్ కమిషనర్‌గా నియమించింది. దాదాపు ఆర్నెల్లకే బదిలీ చేయడంతో జీహెచ్ఎంసీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందనే వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. రోనాల్డ్‌రాస్, ఆమ్రపాలి సైతం స్వల్పకాలం మాత్రమే జీహెచ్ఎంసీ కమిషనర్లుగా పని చేయడం తెలిసిందే. కాగా హెచ్ఎండీఏ సెక్రటరీగా ఆర్.ఉపేందర్ రెడ్డి బదిలీపై వచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెక్రటరీగా ఇలంబర్తి ఎఫ్‌సీడీఏ కమిషనర్‌గా శశాంక నియామకం -
పరస్పర బది‘లీలలు’!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పరస్పర బదిలీల్లో పలువురు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో రెండు మూడు నెలలు/ రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన వారు కూడా పరస్పర బదిలీ పేరుతో ఇతర జిల్లాలకు వెళ్తుండడం సందేహాలకు తావిస్తోంది. ప్రతిఫలంగా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే సర్వీసు ఎక్కువ ఉన్న వారి నుంచి ‘పెద్ద మొత్తంలో’ లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని అడ్డుకోవాల్సిన ఉపాధ్యాయ సంఘాలు, ఉన్నతాధికారులు పరోక్షంగా ఇందుకు సహకరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి స్థానికేతరుల కోటా 20 శాతానికి మించకూడదు. కానీ జిల్లాలో ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి డిప్యూటేషన్లపై వచ్చి చేరిన వారితో స్థానికేతరుల కోటా 50 శాతం దాటిపోయింది. స్పౌజ్ కోటాలో ఇప్పటికే 32 మంది ఉపాధ్యాయులు జిల్లాకు రాగా, తాజాగా పరస్పర బదిలీల ప్రక్రియలో భాగంగా మరో 112 మంది వచ్చి చేరినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడెందుకు వెళ్తున్నట్లు? ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 4,054 ఎస్జీటీలు, 3,997 స్కూల్ అసిస్టెంట్లు, 278 మంది హైస్కూలు ప్రధానోపాధ్యాయులు, 200 మంది ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులను స్థానికత ఆధారంగా ఆయా జిల్లాలకు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని కొంత మంది ఉపాధ్యాయులకు స్థానికత ఉన్నప్పటికీ సీనియారిటీ లేకపోవడంతో ఇతర జిల్లాలకు కేటాయించింది. ఇందులో భాగంగా ఆమనగల్లు మండల పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని నాగరకర్నూలు జిల్లాకు కేటాయించింది. ఆయన ఇప్పటి వరకు రిలీవ్ కాలేదు. తనకున్న ఆర్థిక, రాజకీయ పలుకుబడితో నాలుగేళ్లుగా ఇక్కడే కొనసాగుతూ వచ్చారు. మరో మూడు రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. సర్వీసు ముగిసే సమయంలో ఆయన పరస్పర బదిలీల్లో భాగంగా వికారాబాద్‌కు వెళ్తున్నారు. ఆయన స్థానంలో వికారాబాద్ జిల్లాకు చెందిన సర్వీసు ఎక్కువగా ఉన్న మరో ఉపాధ్యాయురాలు జిల్లాకు వచ్చారు. పరస్పర బదిలీల్లో భాగంగా ఇద్దరి మధ్య పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 25 మంది వరకు పరస్పర బదిలీల్లో వెళ్లి.. అటు నుంచి వచ్చే వారి నుంచి భారీగా ‘పుచ్చుకున్నట్లు’ తెలిసింది. నిజానికి సర్వీసు ముగింపు దశలో ఉన్న వారిని రిలీవ్ చేయకూడదు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖలో అడ్డగోలు ట్రాన్స్ఫర్లు అనుకూలమైన చోటుకు వెళ్లేందుకు అడ్డదారులు నిబంధనలకు విరుద్ధంగా రిలీవింగ్.. జాయినింగ్ భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఇష్టారీతిన పోస్టింగ్‌లు ఆరోగ్య సమస్యలు, పిల్లల ఉన్నత చదువుల పేరుతో ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు సహా ప్రజాప్రతినిధుల బంధువులు రాజకీయ, ఆర్థిక పలుకుబడిని అడ్డంపెట్టుకుని డిప్యూటేషన్‌పై జిల్లాకు వస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కాకుండా, ఇంటికి సమీపంలో, తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లలో (ఫోకల్) పోస్టింగ్‌లు పొందుతున్నారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదువుకుని, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికై న వారు ఇతర మండలాల్లోని నాన్ ఫోకల్ పోస్టుల్లో పని చేయాల్సి వస్తోంది. సీనియార్టీ పేరుతో పదోన్నతులను కొల్లగొడుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. జిల్లాలో ఇప్పటికే 20 వేల మందికిపైగా బీఈడీ, టెట్ అర్హత పరీక్షలు పూర్తి చేసుకుని డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పోస్టుల భర్తీకి రెండు మూడేళ్లకోసారి నోటిఫికేషన్లు జారీ చేస్తే.. ఆయా సమయాల్లో ఖాళీ లేక జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది. -
Telangana: ఈనెల 30న టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 30వ తేదీన పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విడుదల చేసే అవకాశం ఉందని టెన్త్ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. వాస్తవానికి టెన్త్ మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, పలు దఫాల పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అ«దీనంలోనే ఉంది. ఈ కారణంగా ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధికారులు భావించారు.ఆ సమయంలో సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన వచ్చే వరకూ నిరీక్షించారు. ఇటీవల అధికారులు సీఎంను కలవగా, ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్పగించినట్టు తెలిసింది. ఈనెల 30న భట్టి సమయం ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మెమోల్లో మార్పులు టెన్త్ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఇందుకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చేవాళ్లు. ఇక నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్‌తో పాటు, విద్యార్థి మార్కులు మోమోలో పొందుపరుస్తారు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులు, జీపీఏ మెమోలో ఉంటాయని ఆ ఆదేశాల్లో వెల్లడించారు.ఇప్పటివరకూ విద్యార్థి ఆయా సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. దీనివల్ల ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించడం కష్టం. ఇప్పుడీ విధానాన్ని మార్చడంతో గ్రేడ్స్‌తో పాటు ఆయా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది. ప్రస్తుతం వార్షిక పరీక్ష ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన 20 అంతర్గత మార్కులుగా ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులను ఎత్తివేసేందుకు కూడా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. -
ఒకేసారి కాదు.. దశల వారీగా పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లు.. వారి సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట హామీ కాకుండా, దశల వారీ పరిష్కార హామీ ఇచ్చి సమ్మెకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల ఏడో తేదీ నుంచి సమ్మె చేస్తామంటూ సంస్థ కార్మిక సంఘాలతో కూడిన ఓ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి మరో జేఏసీ, ఇతర సంఘాలు అంతగా సానుకూలంగా లేకపోవటంతో సమ్మె విజయవంతం విషయంలో డోలాయమానం నెలకొంది. దీంతో ప్రభుత్వం కూడా సమ్మె విషయంలో అంత ఆందోళనగా లేదని సమాచారం. అసలు సమ్మెనే మొదలు కాకుండా చూసేందుకు చర్యలు ప్రారంభించింది. 21 అంశాలను పేర్కొంటూ ఓ జేఏసీలోని కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. అయితే డిమాండ్లకు సంబంధించి ఎప్పటిలోగా పరిష్కరించేది, ఎంత మొత్తం నిధులు విడుదల చేసేది.. స్పష్టంగా చెప్పకుండా, ఓ ఏడాది కాలంలో పరిష్కరిస్తాం అనే తరహా హామీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రిటైర్డ్ అధికారుల సమావేశంలో సంకేతాలు..: ఆర్టీసీ రిటైర్డ్ అధికారులకు ఆర్థిక పరమైన బకాయిల అంశం చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. పలు సందర్భాల్లో రిటైర్డ్ ఉద్యో గులు బస్‌భవన్ ఎదుట ధర్నాలు చేశారు. వాటిని చెల్లించాలని వినతిపత్రాలు సమ ర్పించారు. కానీ అవి పరిష్కారం కాలేదు. ఆర్టీసీ రిటైర్డ్ అధికారుల సంఘం ఐదో వార్షిక సమావేశం ఆదివారం ఓ హోటల్లో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు హాజరయ్యారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతోపాటు వారి డిమాండ్ల పరిష్కారానికి దృష్టి సారిస్తున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే తొలిసారిగా పేగుమార్పిడి శస్త్ర చికిత్స
అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్): దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా ఆసుపత్రిలో పేగు మార్పిడి (కాలేయానికి ఆనుకుని ఉండే పేగు) శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశామని వైద్యు లు ప్రకటించారు. 40 ఏళ్ల వయసున్న వ్యక్తి కాలేయ తదితర సమ స్యలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఉస్మానియాలో చేరాడు. అతడు కాలేయ జబ్బులతో పాటు కుడివైపు కడుపులో గాంగ్రీన్ సెంట్రల్ లైన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో పేగు మార్పిడి చేయాలని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ నిర్ధారించారు. ఈనెల 19న పేగు మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం 7వ రోజు ప్రొ టోకాల్ ఎండోస్కోపి నిర్వహించి రోగి సాధారణ స్థితికి చేరుకున్న ట్లు నిర్ధారించారు. దేశంలోనే తొలిసారిగా పేగుమార్పిడి శస్త్రచికిత్స చేయడంపై ముఖ్యమంత్రి వైద్యులను అభినందించారు. -
ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పనిప్రదేశాల్లో స్నేహాలు ఉద్యోగులకు 49 శాతం ఎక్కువ జాబ్ శాటిస్ఫాక్షన్ను అందిస్తున్నాయని ది పవర్ ఆఫ్ సోషలైజేషన్ పేరిట జరిగిన తాజా సర్వే వెల్లడించింది. సంస్థల ఉత్పాదకత పెరుగుదల, దీర్ఘకాలిక విజయాల సాధనకు సైతం ఇవి దోహదపడుతున్నాయని తెలిపింది. అదే సమయంలో సహచరులతో స్నేహంచేయని మరో 49 శాతం మంది భారత ఉద్యోగులు తాము ఒంటరిగా ఉన్నామని కుమిలిపోతున్నట్లు పేర్కొంది. భారత్ సహా 21 దేశాల్లో పనిచేస్తున్న వివిధ రంగాల్లోని ఉద్యోగుల ఆఫీసు స్నేహాలపై ఫుడ్ అండ్ ఫెసిలిటీ సర్వీసెస్ సంస్థ కంపాస్ గ్రూప్ ఇండియా, మింటెల్ అనే సంస్థతో కలిసి చేపట్టిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆఫీసుల్లో లంచ్ లేదా టిఫిన్ చేసే వేళలు లేదా కలిసి టీ, ఇతర పానియాలు సేవించే సమయాల్లో చోటుచేసుకొనే సంభాషణల వల్ల ఉద్యోగుల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయని సర్వే గుర్తించింది.అదేవిధంగా సంబంధిత సంస్థల వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ఉద్యోగులను అనుసంధానం చేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు తేల్చింది. మరోవైపు ఒంటరితనానికి లోనవుతున్న ఉద్యోగులు సామాజికంగా కనెక్ట్ అయిన వారితో పోలిస్తే రెట్టింపు సిక్ లీవ్‌లు తీసుకుంటున్నారని.. ఇది సంస్థల ఖర్చులు, ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపుతోందని సర్వేలో వెల్లడైంది.వెల్లడైన అంశాలు ఇవీ..⇒ ఆఫీసుల్లో సామాజిక కార్యక్రమాలు ఉద్యోగుల సంతోషాన్ని 50% పెంచుతున్నాయి.⇒ భోజన వేళల్లో సహోద్యోగులతో సంభాషణలు సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని సర్వేలో పాల్గొన్న వారిలో 75% మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.⇒ సహోద్యోగులతో క్రమం తప్పకుండా సంభాషించే 44% మంది ఉద్యోగులు తమకు ఆఫీసులో కనీసం ఒక మంచి స్నేహితుడు ఉన్నాడని నమ్ముతున్నారు.⇒ సామాజికంగా కనెక్ట్ అయిన 38% మంది ఉద్యోగుల మధ్య బంధం ధృడంగా ఉంది.⇒ ఆఫీసుల్లో సామాజిక సంబంధాలు లేని వారు 10 శాతమే.⇒ క్యాంటీన్లలో 58%, భోజన విరామ సమయాల్లో 67% సామాజికీకరణ జరుగుతోంది.⇒ సామాజిక కలయికల సందర్భంగా 71% మంది ఉద్యోగులు తమ సంస్థ గురించి సానుకూల ప్రచారం చేస్తున్నారు. ఇది బలమైన ఎంప్లాయర్ నెట్ ప్రమోటర్ స్కోర్ ను సృష్టిస్తుంది.⇒ కార్యాలయంలో స్నేహితులుగా ఉన్న 41% మంది ఉద్యోగులు బలమైన భావనను ఆస్వాదిస్తున్నారు.⇒ సామాజిక సంబంధాలు లేని కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్య సహకార రేటు 12 శాతమే.సమస్యల పరిష్కారంలో యాజమాన్యాలకు ఇదో కొత్త దృక్పథం..ఉద్యోగులు, ఉత్పాదకత వంటి అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సర్వే ఫలితాలు సంస్థల యాజమాన్యాలకు కొత్త దృక్పథాన్ని అందిస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా మెలిగే 42% మంది ఉద్యోగులు తమ సంస్థ వ్యూహం, లక్ష్యాలను స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. సామాజిక సంబంధాలు లేని కార్యాలయాల్లో కేవలం 19% మంది ఉద్యోగులే తమ సంస్థలతో కనెక్ట్ అయినట్లు భావిస్తున్నారు. ఇది సంస్థలకు తీవ్రమైన వ్యాపార ప్రమాదంగా మారుతోంది.– వికాస్ చావ్లా, కంపాస్ గ్రూప్ ఇండియా ఎండీ -
ఇప్పుడు రాలేను.. సమయం ఇవ్వండి: మహేష్ బాబు
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని నటుడు మహేశ్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కోరారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌లకు హాజరుకావాల్సి ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ లేఖ రాసినట్టు తెలిసింది. ఈ నెల 22న ఈడీ ఇచ్చిన సమన్ల ప్రకారం సోమవారం బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది. కాగా, సాయి సూర్య డెవలపర్స్ వెంచర్స్ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం మహేశ్‌బాబు రూ.5.9 కోట్లు తీసుకున్నట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. దీనిపై మరింత లోతుగా విచారించేందుకు మహేశ్‌బాబుకు సమన్లు జారీ చేశారు. సురానా గ్రూప్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఈ నెల 16న ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో మహేశ్‌బాబుకు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు లభించాయి. -
రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామా బాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యా పేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, వికా రాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగు ళాంబ గద్వాల, నారాయణ పేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.తగ్గిన ఉష్ణోగ్రతలు..: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు శనివారంతో పోలిస్తే ఆదివారం కాస్త తగ్గాయి. మెదక్‌లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
ప్రాధాన్యాలకు కొత్త జట్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో భారీగా బదిలీలు జరిగాయి. ఆదివారం తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ వెంటనే పలు కీలక శాఖలు, విభాగాలకు కొత్త బాస్‌లను నియమించింది. పెట్టుబడుల ఆవిష్కరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, హైదరాబాద్ నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ ప్రాధాన్యాంశాలకు అనుగుణంగా కొత్త జట్టును సిద్ధం చేసింది. ఈ మేరకు 18 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు నాన్ కేడర్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన ఐటీ, పరిశ్రమలు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్ రంజన్‌ను సీఎంఓలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్, స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫీషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/సీఈఓగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో పరిశ్రమలు, ఐటీ, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ స్థానచలనం పొందారు. ఇక గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ‘ఎక్స్’లో పోస్టులను షేర్ చేసిన యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్ స్మితా సబర్వాల్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమెను రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యకార్యదర్శిగా మళ్లీ ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్‌గా జయేశ్ రంజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా, శాఖాధిపతిని మార్చడం గమనార్హం. సీనియారిటీ ప్రకారం సీఎస్ రేసులో ముందంజలో ఉన్న శశాంక్ గోయల్‌ను ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ పోస్టు నుంచి మరో ప్రాధాన్యత లేని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ పోస్టుకు ప్రభుత్వం బదిలీ చేసింది. రెండుగా పురపాలక శాఖ విభజన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ను ప్రభుత్వం కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ శాఖను రెండుగా విడగొట్టి ఇద్దరు కార్యదర్శులను నియమించింది. పురపాలక శాఖ డైరెక్టర్, కమిషనర్ టీకే శ్రీదేవిని పురపాలక శాఖ (హెచ్ఎండీ వెలుపలి ప్రాంతం) కార్యదర్శిగా బదిలీ చేసింది. హెచ్ఎండీఏ వెలుపలి ప్రాంతాల్లోని పురపాలికలు మాత్రమే ఈ పోస్టు పరిధిలోకి రానున్నాయి. మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ శాఖ (హెచ్ఎండీఏ పరిధి) పేరుతో కొత్త శాఖను సృష్టించి దాని కార్యదర్శిగా జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తిని బదిలీ చేసింది. ఇక ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటైన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆథారిటీ(ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా కె.శశాంకను నియమించింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీగా అదనపు బాధ్యతల నుంచి సందీప్‌కుమార్ సుల్తానియాను తప్పించింది. జెన్కో సీఎండీగా సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్అఫిషియో స్పెషల్ సెక్రటరీ ఎస్.హరీశ్‌ను నియమించింది. సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్అఫిషియో స్పెషల్ సెక్రటరీగా, రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్ అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. -
హరిరామ్ ఆస్తులు రూ.250 కోట్లపైనే..!
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గజ్వేల్ ఈఎన్సీ భూక్యా హరిరామ్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేసిన ఏసీబీ బృందాలు పలుచోట్ల భూములు, ఇతర ఆస్తులు ఉన్నట్టు గుర్తించాయి. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ గృహాలు, షేక్‌పేటలో ఒక విల్లా, కొండాపూర్‌లో ఒక విల్లా, మాదాపూర్‌లో ఒక ఫ్లాట్, నార్సింగిలో ఒక ఫ్లాట్, అమరావతిలో ఒక వాణిజ్య స్థలం, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, బొమ్మలరామారంలో 6 ఎకరాల్లో మామిడి తోటతో కూడిన ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, కుత్బుల్లాపూర్‌లో, మిర్యాలగూడలో స్థలాలు ఉన్నట్టు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల విలువ కట్టేపనిలో ఉన్నారు. అదేవిధంగా మూడు బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. ఈ లాకర్లను తెరిచేందుకు అనుమతి కోరుతూ అధికారులు సోమవారం కోర్టులో మెమో దాఖలు చేయనున్నట్టు సమాచారం. కాగా, శనివారం అర్ధరాత్రి వరకు సోదాలు జరిపిన అధికారులు.. హరిరామ్‌ను అరెస్టు చేసి జడ్జి ముందు హాజరుపర్చగా. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. బినామీలపై ఆరా: ఈఎన్సీ హరిరామ్ అక్రమార్జనను కొందరు బినామీల పేరిట పెట్టినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. వారు ఎవరు, ఎక్కడెక్కడ వారి పేరి ట ఆస్తులు ఉన్నాయనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. జలసౌధ కార్యాల యంలో సేకరించిన పలు పత్రాలు, హరిరామ్ ఇంట్లో లభించిన పత్రాలను పరిశీలించే పనిని ప్రత్యేక టీంకు అప్పగించినట్టు తెలిసింది. హరిరాం ఇంట్లో, సిద్దిపేట జిల్లా మర్కూక్ తహ సీల్దార్ ఆఫీసులో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆయన భార్య అనితపై కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
ఓరుగల్లు.. గులాబీ జల్లు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగసభ ఉద్యమకాలం నాటి సభలను గుర్తు చేసింది. భారీగా జనం తరలివచ్చి సభ విజయవంతం కావడం పార్టీలో కొత్త జోష్‌ను నింపింది. భారీ జన సమీకరణ లక్ష్యంగా కేసీఆర్ ఆదేశాల మేరకు జరిగిన ప్రయత్నాలు సఫలం కావడంతో సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికలో నిరాశ కలిగించే ఫలితాలు ఎదుర్కొన్న బీఆర్ఎస్లో కొత్త ఉత్సాహం నింపేలా సభ సాగింది. సుమారు ఏడాది కాలం తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కేడర్‌లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి దాకాటీఆర్ఎస్ ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఉన్న సామా జిక పరిస్థితులను కేసీఆర్ వివరించారు. ఉద్యమ కాలంలో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఎత్తు పల్లాలను గుర్తు చేశారు. తాను చేపట్టిన ఆమరణ దీక్ష మూలంగా తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్యత కాంగ్రెస్‌కు ఏర్పడిన తీరును వివరించారు. ప్రత్యేక రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో వ్యవసా యం, విద్యుత్, తాగునీరు, సాగునీరు, విద్య తదితర రంగాల్లో జరిగిన కృషిని గుర్తు చేశారు. రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తాను ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాన్ని కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై మెరుపు దాడిఏడాది తర్వాత బహిరంగసభ వేదికగా మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల పేరు ఎత్తకుండా వారి పనితీరుపై విమర్శల దాడి చేశారు. సీఎం రేవంత్ ప్రభుత్వ పాలనావైఫల్యం, అనుభవలేమి, అవినీతిపై విమర్శల దాడి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల వైఫల్యాన్ని తనదైన శైలిలో సామెతలు, పిట్ట కథలతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తెచ్చిన తెలంగాణ.. కాంగ్రెస్ పాలనలో ఆగమవుతోందని భావోద్వేగంతో వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపించింది. వచ్చే రెండున్నర ఏళ్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని ప్రస్తావించారు.కేటీఆర్ స్థానాన్ని బలోపేతం చేసేలాసభావేదికను ‘బాహుబలి’గా పార్టీ నేతలు అభివర్ణించగా, సభా మైదానంలో చేసిన ఏర్పాట్లపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా వేదికపైనా కేటీఆర్ వచ్చిన సందర్భంలో నేతలు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. పార్టీ రజతోత్సవ సభ వేదికగా కేటీఆర్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఏర్పాట్లు జరిగాయని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది.భవిష్యత్ కార్యాచరణపై సంకేతాలుసోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధించడాన్ని కేసీఆర్ ఖండించారు. అదే సమయంలో పార్టీ కేడర్ వెంట నిలుస్తానని, రాబోయే రోజుల్లో పదవులు లభిస్తాయని భరోసా ఇచ్చారు. ఇకపై ప్రజాక్షేత్రంలో చురుగ్గా వ్యవహరిస్తాననే సంకేతాలు ఈ సభ ద్వారా కేసీఆర్ ఇచ్చారు. ఆపరేషన్ కగార్ మినహా బీజేపీకి సంబంధించిన ప్రస్తావన కేసీఆర్ ప్రసంగంలో పెద్దగా కనిపించలేదు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన వరంగల్‌ను రజతోత్సవ సభ నిర్వహణకు ఎంపిక చేసుకున్న బీఆర్ఎస్.. రాష్ట్ర రాజకీయాల్లో తమ స్థానం చెక్కు చెదరలేదనే సంకేతం ఇచ్చేందుకు బలంగా ప్రయత్నించింది. మూడు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలుహసన్పర్తి/వరంగల్‌క్రైం: బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రించలేకపోయారు. అధిక సంఖ్యలో వాహనాలు రోడ్లపై బారులుదీరడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల్ని నిలిపేందుకు మూడుచోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇటు హనుమకొండ నుంచి ఎల్కతుర్తి, దేవన్నపేట–అన్నాసాగరం మార్గంతోపాటు హుజూరాబాద్, సిద్దిపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఎటూ చూసినా మూడు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సభకు వెళుతున్న బస్సుల అడ్డగింత తిరుమలాయపాలెం: ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులకు బీఆర్ఎస్ స్టిక్కర్లు వేసుకొని రజతోత్సవ సభకు వెళుతుండగా, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద ఆర్టీఓ, అధికారులు అడ్డుకున్నారు. లైసెన్స్‌లు రద్దు చేసి, డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య అక్కడకు చేరుకొని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా, బస్సులను పంపించారు. ఆ తర్వాత మళ్లీ బస్సులు ఆపుతుండగా, మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆగి రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా సభ: కేసీఆర్తెలంగాణ నలమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చి బీఆర్ఎస్ సభను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా భారీ సభను విజయవంతం చేయడంలో భాగస్వాములైన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కిక్కిరిసిన గూడూరు టోల్ప్లాజాబీబీనగర్: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జంట నగరాలు సహా.. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తల వాహనాలు భారీగా తరలి రావడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. దీంతో గూడూరు టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయి.. వాహనాలు నెమ్మదిగా కదిలాయి. -
డేట్ ఫిక్స్ చేయండి..అసెంబ్లీకి రండి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రజతోత్సవ సభ పేరుతో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై ఆక్రోశంతో విషం కక్కారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతాలు జరిగినట్టు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ జరగనట్టు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో..కాంగ్రెస్ టైంలో ఏం జరిగిందో చర్చించేందుకు సిద్ధం కావాలని చాలెంజ్ చేశారు. ‘మీరు డేట్ ఫిక్స్ చేయండి. అసెంబ్లీకి రండి. మీరే సరి్టఫికెట్ ఇచ్చిన మీ బచ్చాగాళ్లతో మాట్లాడేది లేదు. మీరు రండి. మీ పాలనలో అద్భుతాలు, మీరు చేసిన ఘనకార్యాలను ప్రజలకు వివరిద్దాం. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి కూడా మాట్లాడదాం. డేట్ మీరే చెప్పండి. చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి పొంగులేటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు తనను గద్దె దింపారనే ఆక్రోశంతో కేసీఆర్ మాట్లాడారని విమర్శించారు. కడుపునిండా కాంగ్రెస్ పార్టీపై విషం పెట్టుకొని మమ్మల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు విలన్ అయ్యిందో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్ అయ్యిందా? హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసినందుకు విలన్ అయ్యిందా అని ప్రశ్నించారు. రజతోత్సవ సభలో తన హయాంలో జరిగిన మంచి పనులను చెప్పుకోవచ్చు.. అదేవిధంగా లోపాలను కూడా మాట్లాడి ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరన్నారు. రైతుల గుదిబండగా మారిన ధరణి పోర్టల్ గురించి, కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ సభలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తామేదో బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశామని చెబుతుంటే నవ్వు వస్తుందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ సభలకు బస్సులు ఇవ్వలేదని, టూవీలర్లు కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామని, వారు ఎన్ని బస్సులకు డబ్బులు కడితే అన్ని బస్సులు ఇచ్చామని తెలిపారు. నిజంగా కాంగ్రెస్ అడ్డుకొని ఉంటే బీఆర్ఎస్ సభ జరిగేదా అని నిలదీశారు. తామేదో వర్సిటీ భూములు అమ్మినట్టు కేసీఆర్ చెప్పారని, ఏ యూనివర్సిటీ భూముల అమ్మామో ప్రజలకు చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును తనకు కావాల్సిన వారికి లీజుకు ఇచ్చుకుంది.. వైన్ షాపుల టెండర్లు ముగియక ముందే డబ్బులు వసూలు చేసుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తాము కమీషన్లు తీసుకున్నామని కేసీఆర్ అంటున్నారని, ఎక్కడ తీసుకున్నామో చూపించాలని డిమాండ్ చేశారు. ఏ కమీషన్లు తీసుకోకుండానే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎలా ఎదిగిందని, రూ.1,500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోమని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన కూలిస్తే కూలిపోవడానికి ప్రభుత్వమేమైనా బొమ్మరిల్లా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన నాయకుడు... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ లేదన్నారు. తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదని, ఇప్పుడైనా ఆ పార్టీ శాసనసభ పక్ష పదవిని దళితుడికి ఇస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీకి ఇవ్వగలరా అని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై మాట్లాడేందుకు కేసీఆర్ డేట్‌ఫిక్స్ చేస్తే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించేందుకు సిద్ధం కావాలని మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ నేతలను సవాల్ చేశారు. అధికారం పోయినా గర్వం పోలేదు: మంత్రి జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలు ఉద్యోగం ఊడగొట్టినా కేసీఆర్‌కు గర్వం పోలేదని.. చింత చచ్చినా పులుపు చావనట్టు ఆయన మాట్లాడుతున్నారన్నారు. ఒక్కో గ్రామానికి రూ. 3 లక్షలు ఖర్చు చేసి ఈ సభ నిర్వహించారని, ఆ డబ్బులు ఎక్కడివని నిలదీశారు. తాము కూడా రాజకీయాల్లోనే ఉన్నామని, తమకు ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని, అసలు ఆయన ఉద్యోగం ఎందుకు ఊడిందో..ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోవాలని హితవు పలికారు. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం కాంగ్రెస్ పార్టీని విలన్ అంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీనే లేకుంటే కేసీఆర్ మూడు చెరువుల నీళ్లు తాగినా, వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. ఎల్కతుర్తి సభకు జనం రాకపోతే అదేదో తాము అడ్డుకున్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్గిపెట్టి రాజకీయానికి బలైన ఉద్యమకారులు, అమరవీరులకు ఆ సభలో ఎందుకు నివాళులరి్పంచలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. నియంత మాట్లాడినట్టుంది: మంత్రి సీతక్క మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక నియంత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాట్లాడినట్టు కేసీఆర్ ప్రసంగం ఉందని చెప్పారు. అధికారం పోయాక కుటుంబం, ఆస్తులు చీలికలు,పీలికలు అయ్యాయన్న ఆవేదనతో ఆయన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ మంచి కార్లలో తిరగొచ్చు గానీ.. పేద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తిరగవద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరూ ఉపయోగించుకోలేదని చెప్పారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ తీసేశారని, ఇప్పుడు మళ్లీ తాము ధర్నాచౌక్ తెరిస్తే సిగ్గు లేకుండా అక్కడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో సొల్లు కబుర్లు మాట్లాడుతున్నారని చట్టసభను అవమానించిన కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే అర్హత ఉందా అని ప్రశ్నించారు. -
మా వాళ్లు కరెక్ట్‌గా లేకే అధికారంలోకి రాలేదు: రాజాసింగ్
హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కచ్చితంగా బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా స్పందించింది. దీనిలో భాగంగా మాట్లాడిన రాజాసింగ్.. ‘ సభలో కేసీఆర్ ఆడిన ప్రతి మాట అబద్ధం. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయిలు ఇచ్చింది. తెలంగాణ అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగింది. కేసీఆర్ ఫాంహౌస్ లో మంచిగా ఉన్నారు. మీరు అక్కడ ఉంటేనే మంచిది.కేసీఆర్ రాష్ట్రాన్ని మత్తుగా మార్చారు. తెలంగాణ అంటే బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చారు. తెలంగాణ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారుతోనే జరుగుతుంది’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు కేసీఆర్ వార్నింగ్ -
తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?: కేసీఆర్‌కు మంత్రుల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ మనసంతా విషాన్ని నింపుకొని ప్రసంగించారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎల్కతుర్తిలో కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పుల అంశాన్ని కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదంటూ పొంగులేటి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను కేసీఆర్ విలన్లా చూపిస్తూ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. అభివృద్ధి, సంక్షేమాన్ని సమంగా ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.‘‘కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీకి ఎప్పుడూ రాలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్లు మొక్కిన విషయం గుర్తుకు లేదా?. దొరపాలన చేసింది మీరు కాదా?. బీఆర్ఎస్కు రెండుసార్లు అధికారం ఇస్తే ఏం చేశారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ కావాలనే కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ వల్ల ధనిక తెలంగాణ.. అప్పుల రాష్ట్రంగా మారింది. వరి వస్తే ఉరి అన్నది మీరు కాదా?. సర్పంచ్‌లకు బకాయిలు పెట్టింది మీరు కాదా?’’ అంటూ పొంగులేటి ప్రశ్నాస్త్రాలు సంధించారు.‘‘అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. కేసీఆర్ పదేళ్లలో కలిపి లక్ష ఇళ్లు కూడా ఇవ్వలేదు. మేం నాలుగున్నర లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం.’’ అని పొంగులేటి పేర్కొన్నారు.మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్‌కు ఉందా? మంత్రి సీతక్కఒక నియంత అధికారని కోల్పోయి మాట్లాడినట్లు ఉంది కేసీఆర్ స్పీచ్. నీ కుటుంబంలో చీలికలు, పేలికలు పెరుగుతున్నాయన్న బాధ కేసీఆర్‌లో కనిపించింది. పది నెలల్లో 59,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. మీరెంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ బిడ్డ మంచి మంచి కార్లలో తిరుగుతుంది. మా పేద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో తిరగకూడదా?. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరు వాడుకోలేదు. 60 వేల కోట్ల కరెంట్ బిల్లుల బకాయిలను పెట్టి వెళ్లిపోయావు. ధర్నా చౌక్‌లలో కేసీఆర్ ధర్నాలు కూడా చేయనీయలేదు. కేసీఆర్ సభ దగ్గర రైతుల కాలువలను పూడ్చి సభ నిర్వహించారు. అసెంబ్లీని సొల్లు కబురు అని కేసీఆర్ అవమానించారు. మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్‌కు ఉందా?. అసెంబ్లీ సొల్లు కబురు అయితే నీ కొడుకు, నీ అల్లుడ్ని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నావు?‘విలన్’ వ్యాఖ్యలు కేసీఆర్ ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్కాంగ్రెస్ విలన్ అంటూ చేసిన కేసీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేపం నెట్టడం సరైనది కాదు. అగ్గిపెట్ట రాజకీయానికి ప్రాణాలర్పించిన తెలంగాణ వాళ్లకు కనీసం నీవాళ్లు అర్పించారా?. కేసీఆర్ సభకు జనం రాకపోవడం వల్లే... అర్థగంటసేపు ఆయన ప్రాంగణానికి వచ్చి కూడా వేదిక పైకి రాలేదు. -
సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ నేతల సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ తో వారు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ తో బేటీ అయిన వారిలో జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ లు ఉన్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్ ను వారు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ నేతలు.మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాందీనిపై సీఎం రేవంత్ వారితో మాట్లాడుతూ.. ‘నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించదు. గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉంది.ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటాం. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని తెలిపారు.కాగా, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలనేది శాంతి చర్చల కమిటీ నేతల విన్నపం. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. అయితే ఈ లేఖ రాసిన మరుసటి రోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. -
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 30న ఆమె రిటైర్ కానున్నారు. ప్రస్తుత సీఎస్ పదవీకాలం పొడిగిస్తారని చర్చ సాగింది.. కానీ ప్రభుత్వం.. కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా శశాంక్ గోయల్మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సెకట్రరీగా టీకే శ్రీదేవిజీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వి కర్ణన్యాదగిరిగుట్ట ఈవోగా ఎస్.వెంకట్రావుపరిశ్రమలు, పెట్టుబడుల సెల్ సీఈవోగా జయష్ రంజన్ప్యూచర్ సిటీ కమిషనర్‌గా శశాంకకార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్జెన్కో సీఎండీగా హరీష్హెల్త్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణపరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్ కుమార్పట్టణాభివృద్ధి కార్యదర్శిగా ఇలంబర్తిరాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవోగా నిఖిలసెర్ప్ అదనపు సీఈవోగా పి. కాత్యాయనీదేవిఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ అదనపు సీఈవోగా ఈవీ నర్సింహారెడ్డిజీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా హేమంత్‌సహదేవ్ రావుటీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఫణీంద్రారెడ్డిపంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్‌గా కధిరవన్హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విద్యాసాగర్హెచ్ఎండీఏ సెక్రటరీగా ఉపేందర్ రెడ్డి -
ఇంట్లోని రూ.3.20 కోట్ల నగదు, బంగారం తీసుకెళ్లిన భార్య
పంజగుట్ట (హైదరాబాద్): ఓ న్యాయవాది ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదు ఎత్తుకెళ్లిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను పంజగుట్ట పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ద్వారకాపురి కాలనీలో నివాసం ఉండే పురుషోత్తంరెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్గవితో 2007లో కులాంతర వివాహం జరిగింది. భార్గవి సికింద్రాబాద్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా విధులు నిర్వహిస్తోంది. భార్యాభర్తలకు తరచూ గొడవలు జరగడంతో పలుమార్లు భార్గవి పురుషోత్తంరెడ్డిపై గృహహింస, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఇంట్లో ఉన్న రూ.3.20 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్న భార్గవి ఆమెకు పాతపరిచయం ఉన్న సంగారెడ్డి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరవింద్ కిరణ్ ఇటికి వెళ్లి అక్కడే ఉంటోంది. గత నెల 30న ఇంట్లో నగదు, బంగారం కనిపించకపోవడంతో పురుషోత్తంరెడ్డి ఆరాతీశాడు. భార్గవి అల్వాల్‌లోని అరవింద్ కిరణ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి డబ్బుల విషయమై ఆరాతీస్తే తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో పురుషోత్తంరెడ్డి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరవింద్ కిరణ్, భార్గవిని అదుపులోకి తీసుకున్నారు. -
బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
బంజారాహిల్స్(హైదరాబాద్): నైజీరియా నుంచి డ్రగ్స్‌ను కొనుగోలుచేస్తూ గోవాతో పాటు ముంబయ్, హైదరాబాద్‌లలో విక్రయిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్‌తో పాటు సహకరించిన మరో వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. గోవాకు చెందిన లివియో జోసఫ్ అల్మిడా అలియాస్ ప్యూషా (41) గోవాకు తరచూ పర్యాటకులుగా వచ్చే నైజీరియన్లతో ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చని, నైజీరియా నుంచి తాము దిగుమతి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా నైజీరియా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ విక్రయిస్తున్న జోసఫ్ కదలికలపై నగర పోలీసులు దృష్టిసారించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని కమలాపురికాలనీ ప్రాంతంలో జోసఫ్ ఓ వ్యక్తికి కొకైన్ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నుంచి 11 గ్రాములు ఎండీఎంఏ, 10 గ్రాముల కొకైన్, రూ.1.97 లక్షల నగదు, ఒక బైక్, మూడు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. గోవా నుంచి మూడు రోజుల క్రితం జోసఫ్ హైదరాబాద్‌కు రాగా ఇక్కడ ఓ వ్యక్తి ఆశ్రయమిస్తున్నట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివసించే ఉబలంక శంకర్ (48) అనే వ్యక్తి షెల్టర్ ఇవ్వడమే కాకుండా బైక్ కూడా సమకూర్చి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఆయనను కూడా బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో కూడా జోసఫ్ హైదరాబాద్‌లోనే డ్రగ్స్ విక్రయిస్తుండగా అప్పుడు కూడా వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. నగరంలో ప్రతి నెలా రెండు సార్లు సంజయ్, లోకేష్ సతీష్‌వర్మ, అమిత్, సిద్దార్ధ, రుద్రరాజు తదితర కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పడల్లా పాత కేసులో భాగంగా కోర్టుకు హాజరవుతూ వచ్చేటప్పుడే గోవా నుంచి డ్రగ్స్ తీసుకువస్తూ తెలిసిన కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. గోవా నుంచి హైదరాబాద్‌కు రావడానికి బస్సులోనే వస్తుంటాడని, బస్సులో అయితే ఎలాంటి చెకింగ్లు ఉండవన్న ఉద్దేశ్యంతో తన మాజీ భార్యతో టికెట్ బుక్ చేయిస్తుంటాడని తేలింది. -
పాతికేళ్లుగా కేసీఆర్ వెంటే ఉన్నా..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధిని పరుగులు పెట్టించి, పేద ప్రజలకు సంక్షేమాన్ని పంచిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్పార్టీ పాతికేళ్ల పండుగ సందర్భంగా శనివారం ఆయన ‘సాక్షి’తో తన ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు. ⇒ ప్రజలు ఒక్కసారి చేసే పొరపాటుతో కాంగ్రెస్‌ను ఐదేళ్లు భరించాల్సిన పరిస్థితి నెలకొం ది. దీంతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక కేసిఆర్ అని, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ద్వారా మరోసారి రుజువు కానుంది. ⇒రెండున్నర దశాబ్ధాల రాజకీయ ప్రస్థానంలో పదవుల కంటే తెలంగాణ రాష్ట్ర సాధన కల సంతృప్తి ఇచి్చంది. హైదరాబాద్ పాతబస్తీ నుంచి పాతికేళ్లుగా కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ అవిర్భావం కంటే ముందు పత్రికలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం రాబోతున్నట్లు చదివి వెంటనే ఆయన ఇంటికి వెళ్లి కలిశా..⇒హైదరాబాదీ ముస్లిం – తెలంగాణ ఉద్యమంలో ఎలా కలిసివస్తావని పలువురు ప్రశి్నంచారు. అప్పుడు నేను విద్యార్ధి దశలోనే 1969 తెలంగాణ ఉద్యమ్యంలో కీలక పాత్ర పోషించా. ఆ తర్వాత ఉద్యమం చల్లారడం కుటుంబ వ్యాపారంలో నిమగ్నమయ్యా. ⇒తెలంగాణ వస్తే ఆంధ్ర పాలకుల పెత్తనం పోయి మా నీళ్లు. మా విద్యుత్, మా ఉద్యోగాలు మాకు వర్తిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశా. అప్పుడు నన్ను పై ఫ్లోర్‌కు తీసుకేళ్లి నా పేరు అడిగి మహమూద్ భాయి.. మాతో జత కలవండి ...కోట్లాది తెలంగాణ సాధిద్దామని చెప్పి భరోసా ఇచ్చాÆరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పిలుపు.. ⇒ ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక తండ్రిగా కేసీఆర్ ను గౌరవిస్తూ వ్యూహాలకు అనుగుణంగా పనిచేస్తూ వస్తున్నా. పార్టీ ఆవిర్భావం నుంచి తన నివాసంలోని అఫీస్‌లో కేసీఆర్‌కు ప్రత్యేక చాంబర్, కుర్చీ ఉందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పారీ్టలో జీవిత కాలం రెండో సభ్యత్వం నాదే.. ⇒ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తుంటే తన తల్లి, సతీమణి మినహా బంధువులు, మిత్రులు, తోటి వ్యాపారులందరూ ఉద్యమం పేరుతో తూటాలు, లాఠీ దెబ్బలు ఎందుకు తింటావు... ప్రశాంతంగా వ్యాపారం చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. ⇒ కానీ, తెలంగాణ సాధన కల లక్ష్యంతో ముందుకు సాగితే.. ప్రత్యేక రాష్ట్ర సాకారంతో పాటు ఊహించని విధంగా డిప్యూటీ సీఎం,హోం మంత్రి లాంటి కీలక పదవులు నిర్వహించే భాగ్యం కలిగింది. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడికి బయలుదేరినా.. ఆయన చేతికి ఇమామ్–ఎ–జామీన్ కడుతున్నా.⇒ఒక సారి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1000 కార్ల ర్యాలీ బయలు దేరినప్పడు తాను జ్వరంతో ఇమామ్–ఏ జామిన్ కట్టడం మర్చిపోగా.. మహమూద్ భాయి దట్టీ తేలేదా అని అడిగి చాంద్రాయణ గుట్ట వద్ద అరగంట సేపు ర్యాలీ నిలిపి వేశారు .దట్టి తీసుకొచ్చి కట్టి తర్వాత ర్యాలీ ముందుకు సాగిందని గుర్తు చేసుకున్నారు. -
భారీ అగ్ని ప్రమాదం.. 300 గుడిసెలు దగ్ధం
హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులోని వివాదాస్పద స్థలంలోని గుడిసెల్లో శనివారం అగ్ని ప్రమాదం జరిగి సుమారు 300 పైగా గుడిసెలు అగ్ని ఆహుతయ్యాయి. మంటలు ఎగిసి పడుతూ విస్తరిస్తుండడంతో బాధితులు గుడిసెల నుంచి బయటికి పరుగులు తీశారు. ఐదు అగ్ని మాపక వాహనాలతో మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలా జరిగిందంటే. ? కుంట్లూరు సర్వేనెంబర్ 214 నుంచి 224 వరకు ఉన్న సుమారు 100 ఎకరాలు భూమిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ భూమి తమకు చెందుతుందని ప్రైవేటు వ్యక్తులు వాదిస్తుండగా ఇది భూదాన భూమి అని సీపీఐ నాయకులు వాదిస్తున్నారు. ఈ వివాదం కోర్టులో కొనసాగుతుండగా సీపీఐ ఆధ్వర్యంలో రెండేళ్ళ క్రితం వేలాది మంది పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. కోర్టు వివాదం ఉన్న భూమిలోని గుడిసెలలో అగ్రి ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా తగలబెట్టారా... ప్రమాద వశాత్తు జరిగిందా... అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ ప్రవీణ్‌కుమార్, సీఐ నాగరాజుగౌడ్, ట్రాఫిక్ సీఐలు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సందర్శించారు.ఈ ప్రమాదంపై అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు తగులబడి సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకుంటామన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపుతామన్నారు. -
ఎట్టకేలకు.. నగరాన్ని వీడిన ఓ పాకిస్థానీ
సాక్షి,హైదరాబాద్: పాకిస్థాన్ నుంచి షార్ట్ టర్మ్ వీసాపై (ఎస్టీవీ) నగరానికి వచ్చిన నలుగురు పౌరుల్లో ఒకరు శనివారం వెళ్లిపోయారు. సిటీ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురూ ఆదివారం వెళ్లిపోయే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర దేశంలో ఉన్న పాకిస్థానీయుల వీసాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతానికి ఎస్టీవీ కేటగిరీకి చెందిన వారిని ఆదివారం లోపు పంపాలంటూ కేంద్రం ఆదేశించింది. దీంతో నగర పోలీసులు శనివారం ఆ నలుగురికీ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ పురుషుడు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పురుషుడు, ఓ మహిళ వేర్వేరుగా సిటీకి రాగా... తన చిన్నారితో మరో మహిళ వచ్చారు. శనివారం పురుషుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. నగరంలో ఉన్న 199 మంది పాకిస్థానీల్లో ఈ నలుగురే ఎస్టీవీతో వచ్చారు. సైబరాబాద్‌లో ఉంటున్న 11 మంది లాంగ్ టర్మ్ వీసా (ఎల్టీవీ)తోనే ఉంటుండటంతో వారికి ప్రస్తుతం నోటీసులు జారీ చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన అన్నదమ్ముల్ని వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు లాంగ్ టర్మ్ వీసాపై ఉంటున్నారు. వీరి వీసా గడువు సెపె్టంబర్ వరకు ఉండటంతో పాటు కేటగిరీ వేరు కావడంతో వీరిని పంపే ఆస్కారం లేదని తెలుస్తోంది. ఇక్కడి యువకుడు దుబాయ్‌లో ఉండగా అతడిని ప్రేమ వివాహం చేసుకున్న మరో పాకిస్థానీ ప్రస్తుతం భర్తతో కలిసి వాసవీ కాలనీలో నివసిస్తున్నారు. ఈమె లాంగ్‌టర్మ్ వీసా గడువు గతంలోనే ముగిసిపోయింది. భర్తతో కలిసి జీవిస్తున్న తనకు వీసా పొడిగించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఈ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఆమె విషయంలోనూ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిఘా విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కేంద్రం నుంచి కేవలం షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారికే నోటీసులు జారీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్న వారికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే తదుపరి ఆదేశాలను బట్టి వీరిపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. -
కొత్త నాయకత్వం కావాలి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ పాత తరం రాజకీయాలకు కాలం చెల్లిందని.. అందుకే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కొత్త రాజకీయ నాయకత్వం రావాలని.. దాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అందుకు భారత్ సమ్మిట్–2025 వేదిక కావాలని ఆకాంక్షించారు. రెండు రోజుల భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం జరిగిన ప్లీనరీకి ముఖ్యఅతిథిగా రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ విధానాలను మార్చుకుంటున్నాయని చెప్పారు. భారత్ జోడో యాత్ర చేపట్టేందుకు దారితీసిన పరిస్థితులతోపాటు యాత్రకు ముందు, ఆ తర్వాత తనలో రాజకీయంగా వచ్చిన మార్పుల గురించి వివరించారు. దేశంలోని పాలకపక్షం ద్వేషం, కోపాలను విస్తరింపజేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తోందని రాహుల్ విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దృష్టి కోణం మాత్రం ప్రేమ, ఆప్యాయతలేనని స్పష్టం చేశారు.దేశ ప్రజల్ని కలిసేందుకే భారత్ జోడో యాత్ర చేపట్టా‘ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు మౌలిక విధానాలను మార్చుకుంటున్నాయి. పదేళ్ల క్రితం నాటి ఆలోచనలు ఇప్పుడు పనిచేయవు. ఒక్కమాటలో చెప్పాలంటే పాత తరం రాజకీయం చనిపోయింది. ఇప్పుడు కొత్త రకం రాజకీయాలు రావాలి. ఇది ప్రపంచ రాజకీయాలకు ఒక సవాల్ లాంటిది. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఓ వలయంలో చిక్కు కొని ఒంటరైంది. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయా లనే ఆలోచనలో భాగంగా మా అవకాశాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించా. అందుకే దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడక ద్వారా ప్రజలను కలవాలనే నిర్ణయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కి.మీ. పాదయాత్ర చేశా. ఈ పాదయాత్రలో ఓపిక, ప్రేమ గురించి నేర్చుకున్నా. రాజకీయ నాయకులకు ఈ రెండు లక్షణాలు ఉండాలి. ప్రజలు ఏం చెబుతు న్నారన్నది ఓపికగా వినగలగాలి. ప్రజలపట్ల ప్రేమ, ఆప్యాయతలను చూపించగలగాలి. విధానాల రూపంలో ప్రజలతో పరోక్షంగా కలిసి ఉండటం కంటే వారిపట్ల ప్రేమ బంధం ఏర్పరచుకోగలగాలి’ అని రాహుల్ గాంధీ చెప్పారు. -
శూన్యత నుంచి సునామీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995కు అటూ ఇటుగా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వ పాలన తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. వర్షాభావ పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతలు ప్రజల జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. విద్యుత్ సంస్కరణల పేరిట చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచడం, అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వారిపై జరిగిన ‘బషీర్‌బాగ్ కాల్పులు’ఘటనలో ముగ్గురు మరణించడం నాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తీవ్రంగా కలిచివేసింది. విద్యుత్ చార్జీల పెంపుతో తెలంగాణ రైతులు ఎదుర్కొనే దయనీయతను వివరిస్తూ 2000 సంవత్సరంలో చంద్రబాబుకు కేసీఆర్ బహిరంగలేఖ రాశారు. ఈ నేపథ్యంలో నుంచే తెలంగాణకు స్వీయ అస్థిత్వం కలిగిన రాజకీయ పార్టీ అవసరమనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న ‘జలదృశ్యం’సాక్షిగా 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి, సిద్దిపేట శాసన సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఏకకాలంలో కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు విశ్రమించేది లేదని..మధ్యలో విరమిస్తే తనను రాళ్లతో కొట్టి చంపమని కేసీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 2001 మే, 17న కరీంనగర్లో సింహగర్జన పేరిట నిర్వహించిన సభకు భారీ స్పందన లభించింది. సిద్దిపేట ఉపఎన్నికతో బరిలోకి కేసీఆర్ రాజీనామాతో 2001 సెపె్టంబర్ 22న సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తొలిసారిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కేసీఆర్ 58,712 మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు టీఆర్ఎస్ ఏర్పడిన కొద్ది నెలల్లోనే 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 85 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకొని కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. పార్టీ ఏర్పడిన మూడు నెలల్లోనే 25 శాతం ఓటు బ్యాంకును సాధించింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న టీఆర్ఎస్.. ఆ ఎన్నికల్లో 26 ఎమ్మెల్యే, ఐదు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. తర్వాతి కాలంలో టీఆర్ఎస్కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేబినెట్ మంత్రిగా, ఆలె నరేంద్ర సహాయమంత్రిగా చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరింది. రాజీనామాల పర్వం.. తెలంగాణపై కాంగ్రెస్ నాని్చవేత ధోరణిని నిరసిస్తూ 2005 జూలైలో రాష్ట్ర కేబినెట్, 2006 ఆగస్టు 22న కేంద్ర కేబినెట్ నుంచి టీఆర్ఎస్ మంత్రులు వైదొలిగారు. 2006 సెపె్టంబర్ 12న కరీంనగర్ ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. అదే ఏడాది డిసెంబర్ 4న జరిగిన ఉపఎన్నికలో కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై 2.01లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2008 మార్చి 3న టీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఉప ఎన్నికలో కేసీఆర్‌తో సహా ఇద్దరు ఎంపీలు, ఏడుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో 2009 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని మహాకూటమితో టీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుంది. కేసీఆర్ సచ్చుడో... తెలంగాణ వచ్చుడో..: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 సెపె్టంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తూ 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణలో ఆందోళనలకు దారితీసింది. ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’పరిష్కారం అని నినదించారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో ’అంటూ 2009 నవంబర్ 29 నుంచి సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. 11 రోజుల పాటు కేసీఆర్ నిరాహార దీక్ష కొనసాగడంతో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు డిసెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గిన కేంద్రం సంప్రదింపుల పేరిట 2009 డిసెంబర్ 23న మరో ప్రకటన చేసింది. దీంతో సరికొత్త వ్యూహానికి పదును పెడుతూ కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తూ జేఏసీని ప్రతిపాదించారు. స్వరాష్ట్ర కల సాకారం.. తొలిసారి అధికారం..: సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా 2014 ఫిబ్రవరి 17న లోక్‌సభలో, 20న రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందింది. 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ మనుగడలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తొలిసారిగా ఒంటరిగా పోటీ చేసింది. 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి 11 చోట్ల గెలుపొంది లోకసభలో ఎనిమిదో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 119 అసెంబ్లీ స్థానాలకుగాను 63 చోట్ల గెలుపొంది సొంత బలంతో తెలంగాణ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా 2014, జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్..: రాష్ట్ర సాధన లక్ష్యంగా అవతరించిన టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. రాజకీయ పునరేకీరణ పేరిట 2014–18 మధ్యకాలంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలను ప్రోత్సహించారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరిట ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంది. అధికార పీఠం నుంచి ప్రతిపక్ష స్థానానికి..: జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం పార్టీ పేరును మార్చుకొని పొరుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకున్న బీఆర్ఎస్కు 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఆ ఎన్నికల్లో 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. పార్టీ అ«ధ్యక్షుడు కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టారు. పార్టీ ఆవిర్భవించిన 25 ఏళ్లలో బీఆర్ఎస్కు తొలిసారిగా లోక్‌సభ ప్రాతినిథ్యం లేకుండా పోయింది. 2014లో 11, 2019లో 9 సీట్లలో గెలుపొంది లోక్‌సభలో ఎనిమిదో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 17 స్థానాల్లో ఒక్కటి కూడా గెలుచుకోలేక పోయింది. ఫిరాయింపులతో ఉక్కిరిబిక్కిరి..: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి వంటి నేతలు కూడా హస్తం గూటికి వెళ్లారు. పార్టీలో సెక్రటరీ జనరల్ పదవిలో ఉన్న రాజ్యసభ సభ్యుడు కేకే ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. పలువురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించింది. దానిపై విచారణ జరుగుతోంది. -
తెలంగాణ జాతి సర్వం 'కేసీఆర్'
‘ప్రారంభించిన లక్ష్యాన్ని అందుకునే అవకాశం అతి కొద్దిమందికే దక్కుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా ముగించిన అరుదైన నాయకుడు. కేంద్ర మంత్రిగా ఏ శాఖ కేటాయించాలని అడిగినప్పుడు ‘‘నా లక్ష్యం మీకు తెలుసు. నాకు తెలంగాణ రాష్ట్రం కావాలి. ఏ శాఖ ఇచ్చినా నాకు అంగీకారమే’అంటూ వ్యక్తిగత అవకాశాల కంటే తెలంగాణ సాధనకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు’అంటూ దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ ‘ది కొయలేషన్ ఇయర్స్ 1996–2012’లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) వ్యవస్థాపకుడు కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పదవీ త్యాగాల పునాదుల మీద పార్టీని ప్రారంభించిన ఉద్యమ నాయకుడు. ఎత్తుపల్లాలు ఎదురైనా, ఎత్తిన జెండా దించకుండా ముందుకు సాగిన నాయకుడు. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఉద్యమ నేతగా, ప్రభుత్వ సారథిగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ స్ఫూర్తిమంత ప్రయాణం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనతో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత గమ్యాన్ని ముద్దాడారు. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ఎజెండాగా ఆయన ఎక్కని కొండ లేదు.. మొక్కని బండలేదు.పక్కా రోడ్ మ్యాప్‌తో ఉద్యమంలోకి.. కేసీఆర్ పక్కా రోడ్‌మ్యాప్ రూపొందించుకున్న తర్వాతే తెలంగాణ ఉద్యమంలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు మునుపు ఆయన లోతుగా విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు కసరత్తు చేశారు. 1969 ఉద్యమం నేరి్పన పాఠాల నుంచి ‘శాంతియుత మార్గంలోనే తెలంగాణ’అనే నిర్ణయం తీసుకున్నారు. రక్తం చుక్క చిందించకుండా తెలంగాణ సాధిస్తానని, ఉద్యమం వీడితే రాళ్లతో కొట్టండి అని పిలుపునివ్వడం ద్వారా తన నిబద్ధతను చాటే ప్రయత్నం చేశారు. ఉప ఎన్నికలు.. రాజీనామా అ్రస్తాలు లక్ష్య సాధనకు పదవులకు రాజీనామా, ఉప ఎన్నికలను అస్త్రంగా వాడిన నేత దేశ చరిత్రలో బహుశా కేసీఆర్ ఒక్కరేనేమో. భావజాల వ్యాప్తి, లక్ష్య సాధనకు ఉప ఎన్నికలతో ప్రయోగాలు చేశారు. ఉప ఎన్నికల అస్త్రం 2008లో విఫలమైనా, 2010లో ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాలపై కేసీఆర్ పట్టును పెంచాయి. 2012లో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం ద్వారా జరిగిన ఉప ఎన్నికలు కేంద్రంపై తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్యతను సృష్టించాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లను కోల్పోగా కాంగ్రెస్ కూడా నాలుగు చోట్ల డిపాజిట్ గల్లంతు అయ్యింది. అనునిత్యం ప్రజాక్షేత్రంలోనే.. టీఆర్ఎస్ ఏర్పాటు ద్వారా అనునిత్యం క్షేత్ర స్థాయిలోనే ఉండేలా కేసీఆర్ కార్యాచరణ కొనసాగింది. తెలంగాణ భావజాల వ్యాప్తికి వరుస బహిరంగ సభలు, నాగార్జునసాగర్ నీళ్లు, చేనేత కార్మికుల కోసం బిక్షాటన, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం సభ, పాలమూరు వలస కూలీల సమస్యపై పాదయాత్ర, జల సాధన సభ, సిద్దిపేట నుంచి సైకిల్ ర్యాలీ, ఫ్లోరైడ్ సమస్యపై పాదయాత్ర వంటి కార్యక్రమాలతో తొలి రెండేళ్లు కేసీఆర్ అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేలా చూసుకున్నారు. ఉద్యమానికి కీలక మలుపు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించడం కేసీఆర్ శైలిగా మారిపోయింది. ఉద్యమ సమయంలోనే ‘దళితాభివృద్ది’ తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను 2003లోనే సిద్ధం చేశారు. 2003 అక్టోబర్ 17న హైదరాబాద్ గ్రీన్ పార్కు హోటల్లో దళిత స్వయం సమృద్ధి సమావేశం నిర్వహించారు. అదే ఏడాది అక్టోబర్ 18, 19 తేదీల్లో టీఆర్ఎస్ ఎస్టీ, ఎస్సీ, బీసీ పాలసీలను విడుదల చేశారు. ఈ పాలసీలను ప్రజలకు వివరించేందుకు అక్టోబర్ 22న మేడారంలో పల్లెబాటను కేసీఆర్ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రారంభించిన పథకాల్లో ఈ పాలసీలు మూలాధారంగా నిలిచాయి. నేషనల్ ఫ్రంట్ కన్వినర్‌గా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కేసీఆర్ తన ఆలోచన, మక్కువను ఉద్యమ సమయం నుంచే వివిధ రూపాల్లో బయటపెడుతూ వచ్చారు. ఓ వైపు క్షేత్ర స్థాయిలో తన కొత్త పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న నాయకులు, పార్టీలకు ఒకే తాటి మీదకు తెచ్చి 2003 సెపె్టంబర్ 9న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త రాష్ట్రాల నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి దానికి కేసీఆర్ కన్వీనర్‌గా కొనసాగారు. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు ఎదురైనా అధిగమిస్తూ ఢిల్లీలో ‘థర్డ్ ఫ్రంట్’ఏర్పాటు దిశగా చర్చలు జరిపారు. 2008 జూలై 18 నుంచి 23 వరకు అజిత్ సింగ్, మాయావతి, దేవెగౌడ్ తదితరులతో చర్చలు జరిపారు. 2022లో బీఆర్ఎస్ స్థాపనకు ముందూ కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం కేసీఆర్ ఇవే తరహా ప్రయత్నాలు చేయడం గమనార్హం. ఎన్నికల పొత్తులు.. ఎత్తులు టీఆర్ఎస్ ఆవిర్భంచిన కొద్ది నెలల్లోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి 25 శాతం ఓటు బ్యాంకు సాధించిన కేసీఆర్.. 2004 సాధారణ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యతను కాంగ్రెస్‌కు సృష్టించారు. 2009 సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ ఏర్పాటు పట్ల విముఖంగా ఉన్న టీడీపీ, సీపీఐ, సీపీఎంతో కూడిన ‘మహా కూటమి’తోనూ కేసీఆర్ వ్యూహాత్మకంగా> ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నారు. 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్కు లాభం చేకూర్చగా, 2009 ఎన్నికల్లో టీడీపీ కలిసి పోటీ చేయడం కలిసి రాలేదు. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ కేసీఆర్ ఒంటరిగా బరిలోకి దిగారు. ఉద్యమ కాలం నుంచే రాజకీయ పునరేకీకరణ..: పార్టీని బలోపేతం చేయడం, ఎదుటి పార్టీలను బలహీన పరచడం లక్ష్యంగా కేసీఆర్ ఉద్యమ కాలం నుంచే రాజకీయ పునరేకీరణ వ్యూహానికి పదును పెడుతూ వచ్చారు. పార్టీ ఆవిర్భావ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న రేగులపాటి పాపారావు (టీడీపీ), రావుల రవీంద్రనాథ్‌రెడ్డి (బీజేపీ), ఆలె నరేంద్ర (ఎంపీ బీజేపీ) కేసీఆర్‌తో కలిసి నడిచారు. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష ఘట్టం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ టి.రాజయ్య, టీడీపీ నుంచి జోగు రామన్న, గంప గోవర్దన్ టీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎంపీలు డాక్టర్ వివేక్, మందా జగన్నాథం, పలువురు మాజీ ఎంపీలు టీఆర్ఎస్లో చేరారు. ఇదే కోవలో 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు 2014–23 మధ్యకాలంలో టీడీపీ, కాంగ్రెస్ లక్ష్యంగా కేసీఆర్ పునరేకీకరణ కొనసాగించారు. ఉద్యమ రూపాలుగా కళలు.. పండుగలు..: రాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక కోణాన్ని కూడా ఆవిష్కరించి ఉద్యమ రూపం ఇచ్చిన నేత కేసీఆర్. జానపద పాటలు, నృత్యాలు, ఒగ్గు కథలు, గొల్ల సుద్దులు, బుర్ర కథలు, యక్షగానాలు, బతుకమ్మలు, బోనాలు తెలంగాణ ఉద్యమానికి ఆలంబనగా నిలిచాయి. ధూంధాం, వంటావార్పు, సడక్ బంధ్, రైలు రోకో, సాగర హారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, తదితరాలు కొత్త ఉద్యమ రూపాలను ఆవిష్కరించాయి. స్వరాష్ట్ర ఆకాంక్ష ప్రతీక ‘తెలంగాణ తల్లి’..: తెలుగుతల్లి అస్థిత్వాన్ని ‘ఎవరి తల్లి.. ఎక్కడి తల్లి’అని ప్రశ్నించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ‘తెలంగాణ తల్లి’అనే భావనకు కేసీఆర్ పురుడు పోశారు. జేఏసీ.. వినూత్న ఆలోచన..: ఎన్నికల్లో పొత్తులతో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలను తెలంగాణవాదంతో కట్టిపడేసిన కేసీఆర్ తర్వాతి కాలంలో ఈ వ్యూహాన్ని మరింత విస్తృతం చేశారు. 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గిన నేపథ్యంలో అన్ని పార్టీలు, శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ‘జాయింట్ యాక్షన్ కమిటీ’అనే ఎత్తుగడను తెరమీదకు తెచ్చారు. 2009 డిసెంబర్ 23న నాటి కాంగ్రెస్ కీలక నేత జానారెడ్డి నివాసంలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ‘జేఏసీ’ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ చైర్మన్‌గా కళింగ ఫంక్షన్ హాల్లో తొలి భేటీ నిర్వహించారు. తర్వాతి కాలంలో ఈ జేఏసీ నుంచి కాంగ్రెస్, టీడీపీ వైదొలిగినా బీజేపీ, ఇతర పక్షాలు చివరి వరకూ కొనసాగాయి. విభిన్న భావజాలాలు కలిగిన పార్టీలు, సంస్థలు, ఉద్యోగసంఘాలు జేఏసీ వేదికగా పనిచేశాయి. కలానికి పదును పెట్టిన కేసీఆర్..: రాష్ట్ర సాధన ఉద్యమంలో టీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలంగాణ కళలు, సాహిత్యాన్ని ఆయుధంగా మార్చిన వైనం కూడా కేసీఆర్‌లో చూడొచ్చు. అవసరమైన సందర్భంలో తాను కలం చేతబట్టి పాటలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని.. అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రమొచ్చి తీరుతుంది’అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో ‘గారడీ చేస్తుండ్రు.. గజిబిజి చేస్తుండ్రు’అంటూ తెలంగాణ వ్యతిరేకుల తీరును ఎండగట్టారు. చెప్పినదీ.. చెప్పనిదీ చేయడమే..!..: ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో ఏర్పడిన ప్రభుత్వాధినేతగా తాను చెప్పినదీ చెప్పనిదీ కూడా చేసి చూపడం ద్వారా కేసీఆర్ తన వినూత్న శైలిని చాటుకుంటూ వస్తున్నారు. 2014 జూన్ 2 నుంచి 2018 సెప్టెంబర్ 6 వరకు 51 నెలల పాటు సాగిన పాలనలో వినూత్న నిర్ణయాలతో విమర్శలు, ప్రశంసలు పొందిన సందర్భాలు అనేకం. బీపీఎల్ ఆదాయ పరిమితి, ఆసరా పెన్షన్ల పెంపు, బీడీ కార్మికులకు భృతి వంటి సంక్షేమ పథకాలతో పాటు ‘కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్’వంటి వినూత్న పథకాలతో ప్రజల్లోకి వెళ్లారు.2014–18 వరకు ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్ల ప్రస్థానంలో సుమారు 500 సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ఆచరణలో చూపిన నేత కేసీఆర్. ఎన్నికల మేనిఫెస్టోలో లేని దళితబంధు, చేప పిల్లల పంపిణీ వంటి పథకాలు లెక్కకు మిక్కిలి. తెలంగాణ అత్మను అర్థం చేసుకున్న నేతగా పేరొందిన కేసీఆర్ వ్యవసాయం, నీటిపారుదల, ఐటీ, పరిశ్రమలు, విద్య ఇలా ప్రతీ రంగంపైనా తనదైన ముద్ర వేశారు. ప్రతిపక్ష నేతగా మరో ప్రస్థానం..: నాలుగు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటూ ఉద్యమ నేతగా, ప్రభుత్వాధిపతిగా పనిచేసిన కేసీఆర్ 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష నాయకుడి పాత్రలోకి మారిపోయారు. ఎర్రవల్లి నివాసం నుంచే పార్టీ యంత్రాంగాన్ని నడుపడంలోనూ విలక్షణ శైలిని చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంలో పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ పాలక పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. -
సోషల్ మీడియా పోస్టులపై నిఘా
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాతో మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంటోంది. ఇటీవల కొందరు వ్యక్తులు విద్వేషాలు వెళ్లగక్కేందుకు సోషల్ మీడియా యాప్‌లను అ్రస్తాలుగా మార్చుకుంటున్నారు. ఎదుటి వారిని రెచ్చగొట్టేలా పెట్టే అసభ్యకర పోస్టింగులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. కశ్మీర్లో ఉగ్రదాడితో దేశంలో ఏర్పడిన సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా మరో వర్గం వ్యాఖ్యలు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేయడం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, యూ ట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అనవసర ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు ఏవైనా ఉన్నాయా? అని పోలీసులు నింతరం ఆరా తీస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్‌ను మరింత అప్రమత్తం చేసినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక కేంద్రంతోపాటు అన్ని జిల్లాల్లోని సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ మరింత యాక్టివ్ అయినట్టు తెలిపారు. నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫొటోలు, అత్యంత హేయమైన అసభ్యకర పదజాలంతో సోషల్‌మీడియాలో పోస్టింగ్స్ పెట్టే వారికి చెక్ పెడుతున్నారు. అలాంటి పోస్టులను వెంటనే తొలగించడంతోపాటు అవి ఎక్కడి నుంచి, ఎవరు పెడుతున్నారన్నది కూడా ఆరా తీస్తున్నారు. కీలక ఆధారాలు లభించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) పోలీసులు దీనిపై నిరంతరం నిఘా పెడుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిఘా కోసం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఇంటిగ్రేటెడ్ సోషల్ మీడియా సరై్వలెన్స్ వింగ్, సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ (స్మాష్)తో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. -
కొత్త కొలువుల జోరు
న్యూఢిల్లీ: దేశంలోని వ్యవస్థాపక రంగంలో ఉద్యోగ కల్పన జోరుమీద ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం రికార్డు స్థాయిలో కోటీ 45 లక్షల కొత్త కొలువులు సృష్టించింది. దేశంలో పటిష్ట ఆర్థిక వృద్ధి అంచనాల నేపథ్యంలో పలు సంస్థల్లో నియామకాలు భారీగా జరుగుతున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) గణాంకాల ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో కోటీ 38 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.సగటున నెలకు 12 లక్షల ఉద్యోగాలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు 12 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో మొత్తంగా సృష్టించిన కొత్త కొలువుల సంఖ్య 1,32,25,401. చివరి నెల సగటను కూడా కలుపుకుంటే కోటీ 45 లక్షల కొత్త నియామకాలు జరిగాయి. ఇది 2022–23తో పోల్చితే 7 లక్షలు అధికం. 6.4 శాతం ఆర్థిక వృద్ధి రేటు ప్రభుత్వ అంచనాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆర్థిక వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. 2025–26లోనూ దాదాపు ఇదే స్థాయిలో వృద్ధి రేటు నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో పటిష్ట వృద్ధి కారణంగా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ జీతాలను నగదు చెల్లింపులకు బదులు బ్యాంక్ ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేసే ట్రెండ్ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. దీని కారణంగానే వ్యవస్థాపక రంగంలో కొత్త ఉద్యోగాల పెరుగుదల ఈపీఎఫ్‌వో డేటాలో భారీగా నమోదువుతున్నట్లు చెబుతున్నారు. కొత్త కంపెనీలు తక్కువే దేశంలో కొత్తగా ఏర్పాటైన సంస్థల సంఖ్య ఈ ఏడాది తక్కువగానే ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ఈపీఎఫ్ఓలో నమోదైన కొత్త సంస్థల సంఖ్య 2024–25లో కనిష్టంగా ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో మొత్తం 45,860 కొత్త సంస్థలు ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయ్యాయి. అంటే సగటున నెలకు 4,169 సంస్థలు. ఇంత తక్కువ సంఖ్యలో సంస్థలు ఈపీఎఫ్‌వోలో చేరడానికి కారణం ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు లేకపోవడమేనని పేర్కొంటున్నారు. 2024 జూలైలో ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ఈఎల్ఐ) అమల్లోకి వస్తే పరిస్థితి మారుతుందని చెబుతున్నారు. -
‘ప్రైవేట్’కు ఇచ్చే అధికారం కలెక్టర్‌కు లేదు
సాక్షి, హైదరాబాద్: భూముల వర్గీకరణ, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీలకు సంబంధించిన వివాదాల్లో జోక్యం చేసుకుని, ఉత్తర్వులు జారీ చేసే అధికారం కలెక్టర్‌కు ఉండదని హైకోర్టు తేల్చిచెప్పింది. సివిల్ కోర్టులకు మాత్రమే అలాంటి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మారుస్తూ కలెక్టర్ కొత్తగా సర్వే నంబర్ కేటాయించడం చట్టవిరుద్ధమని చెప్పింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్, మోకిల గ్రామాల మధ్య ఉన్న 40.12 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తేల్చుతూ సర్వే శాఖ, తహసీల్దార్ 2014లోనే ఉత్తర్వులు జారీ చేసినా, జిల్లా కలెక్టర్ దాన్ని ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రికార్డుల్లోకి చేర్చుతూ ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది.వెంటనే ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ సర్వే నంబర్ 398/ఏ, 400/ఏ, 402/ఏ, 402/ఏ1/1 లోని 2.14 ఎకరాల భూమిని 2008లో చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, తన పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కృష్ణరామ్ భూపాల్ అనే వ్యక్తి కబ్జా చేసి తమకు దారి ఇవ్వడం లేదంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన శైలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆక్రమించిన 20.12 ఎకరాల ప్రభుత్వ భూమి ‘బిలా దాఖలా’(ఎవరికీ చెందనిది, ఏ సర్వే నంబర్లో లేనిది) కేటగిరీ కిందకు వస్తుందన్నారు. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ 2022, 2023లో కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ భూ వివాదంపై 2014లో పిటిషన్ వేశామన్నారు. అప్పుడు సర్వే చేసిన అధికారులు 40.12 ఎకరాలు బిలాదాఖలా భూమిగా (ప్రభుత్వ భూమిగా) తేల్చారన్నారు. అందులో 20.12 ఎకరాలు ఆక్రమణల్లో ఉందని తహసీల్దార్ కౌంటర్ కూడా వేశారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆ భూమిని పట్టా భూమిగా పేర్కొంటూ విలేజ్ మ్యాప్‌ను మార్చాలని 2022లో కలెక్టర్ సర్వే శాఖకు ప్రొసీడింగ్స్ ఇచ్చారని నివేదించారు. 2023లో కొత్త సర్వే నంబర్లతో ప్రైవేటు వ్యక్తుల పేర్లను రికార్డుల్లో చేర్చారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సదరు భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం, భూమిని ఇతరుల పేరు మీదకు మార్చడం చేయొద్దని పిటిషనర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 21కు వాయిదా వేశారు. -
రజతోత్సవ రణన్నినాదం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’ పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా. సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి. దేశం దృష్టిని ఆకర్షించేలా.. 14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పార్టీగా ప్రస్థానం సాగించిన బీఆర్ఎస్.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీయే విలన్‌గా ఉందని ఈ సభలో కేసీఆర్ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది. ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. 2024 మార్చి 31న తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్ 5 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించే భవిష్యత్ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. విద్యుత్ వెలుగుల్లో సభా ప్రాంగణం అట్టహాసంగా ఏర్పాట్లు రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సభా వేదికపై 500 మంది.. సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు.సభ ఏర్పాట్లు ఇలా⇒ సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు ⇒ బీఆర్ఎస్ అంచనా ప్రకారం సభకు హాజరయ్యే ప్రజలు: సుమారు 10 లక్షలు ⇒ మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు ⇒ ప్రధాన వేదికపై సీటింగ్: 500 మందికి ⇒ సభా సమయం: సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు. ⇒ వాహనాల పార్కింగ్ : 1,059 ఎకరాలు ⇒ సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్ బాటిళ్లు: 10.80 లక్షలు ⇒ మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు ⇒ సభావేదిక చుట్టూ అంబులెన్స్‌లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్‌లు ⇒ మెడికల్ క్యాంపు: సభావేదిక చుట్టూ 12 ⇒ ట్రాఫిక్, పార్కింగ్ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు -
లీవ్ ఇండియా పేరుతో నోటీసులు: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ‘సాక్షి’ తో మాట్లాడిన డీజీపీ జితేందర్.. తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు ఉన్నారు. వీరిలో 199 మంది లాంగ్ టర్న్ వీసాలు కలిగి ఉన్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు. మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి. ఈ షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నాము.లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చాము. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు టైం ఉంది. మిగిలిన వారు రేపు తిరిగి వెళ్ళిపోవాలి. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండి వెళ్ళిపోవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్ళిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి కో ఆర్డినేషన్ లో జాయింట్ ఆపరేషన్ చేస్తాము. కర్రెగుట్టలో తెలంగాణా పోలీస్ శాఖ నుండి ఎలాంటి ఆపరేషన్ లేదు. మా బలగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల వద్ద ఎలాంటి బలగాలు మోహరించలేదు. ములుగులో కూంబింగ్ కి తెలంగాణ పోలీసులకు సంబంధం లేదు’ అని డీజీపీ జితేందర్ తెలిపారు. -
‘స్పెషల్ కాయిన్’..వీడియోలో చూపించి మరీ, రూ.9 లక్షలు దోచేసింది!
శంషాబాద్: ‘‘అదో స్పెషల్ కాయిన్... కాయిన్ ఎదురుగా పెట్టగానే సూది కూడా లేచి నిలబడుతుంది’’.. ఇలా కాయిన్‌తో అనేక విన్యాసాలు చూపించి దానిని తయారీకి రూ. 4 నుంచి రూ. 6 లక్షలు ఖర్చు చేస్తే.. దానిని కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు.. లేడీ టక్కుటమార విద్యలతో పాటు మాటలను నమ్మిన ఓ మహిళ 8 లక్షల రూపాయలు చెల్లించింది.. ఆరు నెలలుగా ఇదిగో అదిగో అంటూ చెప్పుకొస్తున్న ఆ మహిళ మాటలు నమ్మి చివరికి నిండా మునిగింది. జరిగింది ఇలా... శంషాబాద్ పట్టణంలోని సాతంరాయి బస్తీకి చెందిన అరుణ(32) అదే బస్తీకి చెందిన ఓ యువకుడి ద్వారా కాయిన్ విషయాన్ని తెలుసుకుంది. కర్నాటక మైసూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ కాయిన్ వ్యాపారం చేస్తుందని తెలపడంతో గతేడాది అక్టోబర్‌లో అరుణ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్ ముందు ఉన్న కాఫీ షాపులో కిలేడీ లక్ష్మీని కలిసింది. లక్ష్మీ మరోమారు వీడియోలో కాయిన్ చూపించి దానిని తయారు చేయడానికి సుమారు రూ. 6 లక్షల వరకు ఖర్చువుతుందని తయారు చేసి దానిని అమ్మి కోటి రూపాయాల వరకు ఇస్తానని నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన అరుణ నగదు రూపంలో రూ. 90 వేలు ఇవ్వగా పలు దఫాలుగా రూ. 6 లక్షలు చెల్లించింది. తనిఖీలో కాయిన్ చేసిన తర్వాత తాను ఉంటున్న హోటల్లో తనిఖీలు జరగడంతో దానిని అక్కడే పడేసి వెళ్లాలని బుకాయించింది. తనకు మరో రెండు లక్షల వరకు చెల్లిస్తే ఈ దఫా కాయి తప్పకుండా చేసి విక్రయించి నీ కష్టం అంతా తీర్చేస్తానని నమ్మించింది. దీంతో మరోసారి మోసపోయిన మరో రెండు లక్షల వరకు ఫొన్‌పే ద్వారా చెల్లించింది. చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీఎయిర్పోర్టులో హైడ్రామా... తాను పూర్తిగా మోసపోయినట్లు గుర్తించిన అరుణ ఎలాగైనా లక్ష్మీని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని ఈ నెల 19 మరో వ్యక్తి డబ్బులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రప్పించింది. ఆ రోజు మాట్లాడిన తర్వాత మరుసటిరోజు ఉదయం శనివారం కలుస్తానని చెప్పి నిందితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఈ నెల 20 ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన కిలేడీని పట్టుకునేందుకు నానా పాట్లు పడ్డారు. చివరికి పోలీసుల సాయంతో పట్టుబడింది.. తాను డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని పోలీసుల సమక్షంలోనే నమ్మించింది. ఆ తర్వాత తనతో పాటు కారు ఎక్కాలని చెప్పిన లేడీ చాకచక్యంగా అరుణతో పాటు ఆమెతోపాటు ఉన్న మరో మహిళను తోసేసి తనవెంట వచ్చిన వ్యక్తితో కారుతో వేగంగా ఎయిర్‌పోర్టు నుంచి ఉడాయించింది. దీంతో బాధిత మహిళ బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. అక్కడి పోలీసుల సూచనల మేరకు గురువారం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలరాజు ముందు జరిగిన విషయాన్ని వెల్లడిండించడంతో పాటు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కిలేడీ ఫొటోలు, ఫోన్‌పే ద్వారా చెల్లింపు చేసిన వాటన్నింటిని, పలు దఫాలుగా జరిగిన సంభాషణల రికార్డింగులు సమర్పిచింది. బాధితురాలి నుంచి ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో -
మహిళా ప్రయాణికుల భద్రతకు ట్యూటెమ్ యాప్
మహిళలకు సురక్షితమైన రవాణా సదుపాయాన్ని కల్పింపంచేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ మెట్రో ((HMR) రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం హైదరాబాద్ మెట్రో రైల్, హైదరాబాద్ పోలీస్ సహకారంతో సరికొత్త మొబైల్ యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. బిట్స్ పిలానీ–హైదరాబాద్ క్యాంపస్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ బొంబాయి సంయుక్తంగా ఏడీబీ ఆర్థిక సహాయంతో ట్యూటెమ్ (టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్రాన్సిట్ టు ఎన్హాన్స్ మొబిలిటీ అండ్ సేఫ్ యాక్సెసిబిలిటీ) అనే ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో మొబైల్ యాప్ రూపంలో ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుందన్నారు. ఈ మేరకు బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్‌లో గురువారం జరిగిన యూజర్ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. రోజురోజుకు జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్యకు ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే ఏకైక పరిష్కారమన్నారు. మెట్రోలో పయనించే మహిళలు తమ చిట్టచివరి గమ్యస్థానానికి భద్రంగా చేరడానికి ట్యూటెమ్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇంటి దగ్గర నుంచి గమ్యస్థానాల వరకు రాకపోకలు సాగించే క్రమంలో ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తుందన్నారు. ఈ మొబైల్ యాప్‌లో డ్రైవర్ యాప్, యూజర్ యాప్ అని రెండు భాగాలు ఉంటాయని, మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే అన్ని జాగ్రత్తలు ఇందులో ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ప్రయాణికులు మెట్రోస్టేషన్‌కు చేరుకోవడానికి, తిరిగి ఇంటికి బయలేదేరడానికి కాలినడకన, ద్విచక్ర వాహనంపై కానీ కారు లేదా బస్సు లేదా ఆటో తదితర ఎలాంటి ప్రయాణ సదుపాయాలను వినియోగించినా సరే ఈ యాప్ ద్వారా నిఘా ఉంటుందన్నారు. గమ్యస్థానికి చేరే క్రమంలో మహిళలు ఎలాంటి అభద్రతకు గురైనా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌ను, కుటుంబసభ్యులను, బంధువులను అప్రమత్తం చేసే సదుపాయం ఉంటుందన్నారు. సామాజిక, ఆర్థిక సమస్యలకు ఇంజనీరింగ్, సాంకేతిక పరిష్కారం చూపాలన్నదే తమ అభిమతమని, అందుకు తగ్గట్టుగా కొత్త ఆవిష్కరణలకు ముందుంటామని ఎన్వీఎస్ తెలిపారు. బిట్స్ పిలానీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.రామ్ గోపాల్‌రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర నగరాలకు కూడా ఈ యాప్‌ను విస్తరించేలా తమ సంస్థ సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏడీబీ ప్రతినిధి కుమారి జోసెఫిన్ ఎక్వినో, బిట్స్ పిలానీ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సౌమ్యో ముఖర్జీ, ఐఐటీ బొంబాయి కి చెందిన ప్రొఫెసర్ అవిజిత్ మాజీ, బిట్స్ పిలానీ ప్రొఫెసర్ ప్రశాంత్ సాహు పాల్గొన్నారు. -
రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హెచ్ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమేనని.. ఆధునిక సోషల్ మీడియాతో అంతా మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు. నిన్ననే ఇక్కడకు రావాల్సిన ఉన్నా.. కశ్మీర్‌కు వెళ్లడంతో రాలేకపోయాయన్నారు.పాతతరం రాజకీయం ఓ రకంగా అంతరించిపోయిందని.. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచానన్నారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. వాదన వినిపించేందుకు కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.విద్యా, వైద్యం తదితర అంశాలపై నూతన పాలసీలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశాను. దేశ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి నా పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. విద్వేష రాజకీయాలను మార్చాలని అర్థం చేసుకున్నాను. ఎంతో మందిని కలిసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇండియాలో నూతన రాజకీయాలను నిర్మిద్దాం. అందరి ఆలోచనలు స్వీకరించి నూతన విధానాన్ని కొనసాగిద్దాం. పాదయాత్రలో ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారు. ప్రేమ, ఆప్యాయతను ప్రజలతో పంచుకోవడం మొదలు పెట్టాను. పాదయాత్రలో అనేక మందిని కలిసిన తర్వాత విద్వేషపు బజారుల్లో ప్రేమ దుకాణాన్ని తెరిచానని స్లోగన్ తీసుకున్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు.అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం: సీఎం రేవంత్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. భారత్ సమ్మిట్‌లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నా.. తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారు. వారి పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ అన్నారు. -
HYD: నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నివాసం ఉంటున్న పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు అందజేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ను విడిచి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 213 మంది పాకిస్తానీలు నివాసం ఉంటున్నారు. వీరిలో నలుగురు షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు (LTV) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు నలుగురు వ్యక్తులు రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తానీయులు వీసా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన వారు వెంటనే తమ రాష్ట్రాలను వీడి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్.. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే స్వదేశీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుండి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలి. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.కాగా, భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. -
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
హైదరాబాద్: ఇటీవల కుప్పలుతెప్పలుగా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. అచ్చం అలాంటి పనిచేసే..ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌కి చెందిన శివ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లై, పిల్లలున్న శివ కొంతకాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. కారణం మరో మహిళతో వివాహేతర సంబంధమే. ఆ విషయం అతడి భార్య దీప్తి కనిపెట్టింది. ఎలాగైనా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకోవాలని గట్టి నిఘా పెట్టింది.చివరికి తన భర్త శివ, సుష్మా అనే ఆమెతో కలిసి కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని తెలుసుకుని, కుటుంబసభ్యుల సాయంతో ఒకే గదిలో ఉన్న భర్త శివ, సుష్మలను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. అంతేగాక తనను పట్టించుకోకుండా మరో మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాట్లు ఫిర్యాదు కూడా చేసింది. pic.twitter.com/95aRDE2twc— Telugu Scribe (@TeluguScribe) April 26, 2025 -
సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: దేశంలో సకల దరిద్రాలకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని.. రాబోయే 30 ఏళ్ల కాలంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సాక్షికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారాయన.2006లో పార్టీలో అడుగుపెట్టినప్పుడు కనీసం మంత్రి కూడా అవుతానని, ఈ స్థాయి గౌరవం లభిస్తుందని ఊహించలేదు. ఈనాటికి సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు. వచ్చే ఎన్నికల్లోనూ మా సీఎం అభ్యర్థి కేసీఆరే. ఆయన మా ట్రంప్ కార్డు. తురుపు ముక్క. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. కాంగ్రెస్ హయాంలో పాడైపోయిన వ్యవస్థను బాగు చేయడమే మా ముందు ఉన్న లక్ష్యం అని స్పష్టం చేశారాయన. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 420 హామీలు ఇచ్చినా ఒక్కటి అమలు చేయలేదు. 15 నెలల పాటనలో సంక్షేమం అమలు చేయలేదు. అధికారం కోసం ఇష్టమున్నట్లు హామీలు ఇచ్చారు. పథకాలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నికృష్టంగా పని చేస్తోంది. నా వరకు నేను ఈ ప్రభుత్వానికి మైనస్ మార్కులు ఇస్తాను. లిక్కర్ విషయంలో మాత్రమే పెరుగుదల కనిపిస్తోంది. కేసీఆర్ సర్కార్‌ది సంక్షేమం.. రేవంత్ సర్కార్‌ది సంక్షోభం అన్నారు.హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలు అయ్యింది. తులం బంగారం లేదు.. స్కూటీ లేదు. ఫార్ములా రేసులో ఎలాంటి అవినీతి జరగలేదు. సీఎం పదవి వచ్చాక సమర్థవంతంగా పని చేయొచ్చు కదా. ఫార్ములా ఈ కోసం ఖర్చు చేస్తే తప్పైతే.. అందాల పోటీతో ఖర్చు చేయడం కరెక్టా?. ఫార్ములా ఈ రేసు కోసం చేసిన ఒప్పందాలతో పెట్టుబడులు తెచ్చాం. అందాల పోటీతో ఎంత మందికి ఉపాధి లభిస్తుంది. లైవ్‌లో డిబేట్ పెడితే.. ఎవరిది మోసమో అర్థం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు అని కేటీఆర్ జోస్యం పలికారు.కేసీఆర్ పథకాలను పక్క రాష్ట్రాల్లో కాపీ కొట్టారు. దేశం మొత్తం ఆ పథకాలు అమలు కావాలనే.. పార్టీని దేశ స్థాయిగా విస్తరించాలనుకున్నాం. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా విస్తరించాం. బీఆర్ఎస్ మీదనే మాకు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితం వచ్చింది. కాబట్టి మళ్లీ పార్టీ పేరు మార్చాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. బీఆర్ఎస్లో ఎలాంటి కుమ్ములాటలు లేవు. అలాగే.. హరీష్‌రావుతో నాకు ఎలాంటి విబేధాల్లేవ్. మా అందరికి కావాల్సినంత పని ఉంది. ఎజెండా తిరిగి తెలంగాణలో పట్టాలెక్కాలి. రాష్ట్రం కేసీఆర్ నాయకత్వం కోరుకుంటోంది. కేసీఆర్ ఉన్నంతదాకా.. ఆ ప్రస్తావన రాదు.తెలంగాణ వచ్చాక.. మూడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాం. త్రిముఖ పోటీ(బీజేపీ+జనసేన+టీడీపీ), కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ ప్రభావం మా మీద ఉండదని అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఒంటరిగానే పోటీ చేస్తాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. -
కాస్త పెరిగిన ఇంటి అద్దెలు..
కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల విపణి క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లయి తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది. -
కారెనుక.. కారు గట్టి..
సాక్షి, హైదరబాద్: వరంగల్ జిల్లా ఎల్కతుర్తితో ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు గ్రేటర్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 5 వేల మందిని తరలించాలని తీర్మానించింది. ఆ మేరకు ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు 1,200 బస్సులు సహా మరో 1,500కుపైగా కార్లను కేటాయించింది. పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను మాజీ మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అప్పగించింది. ఇప్పటికే వీరంతా ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి, మున్సిపాలిటీ, కార్పొరేషన్, మండలం, గ్రామ పంచాయతీల వారీగా బస్సులను, కార్లు, ఇతర వాహానాలను కేటాయించారు. ‘ఇంటికో జెండా.. ఊరికో బస్సు’ చొప్పున కేవలం గ్రేటర్ జిల్లాల నుంచే లక్ష మందిని తరలించాలని నిర్ణయించారు. పురుషులనే ఎక్కువగా తరలించాలని.. భగ్గున మండుతున్న ఎండల నేపథ్యంలో మహిళలు వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పురుషులనే ఎక్కువగా తరలించాలని భావిస్తున్నారు. ఆ మేరకు కార్యకర్తలను, అభిమానులను సన్నద్ధం చేస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం, క్యాంపు ఆఫీసుల నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు. ఎవరికీ వారు ఆయా సమీప మార్గాల నుంచి ఔటర్ మీదుగా ఘట్కేసర్ జంక్షన్‌కు చేరుకోనున్నారు. అటు నుంచి భారీ ర్యాలీగా వరంగల్ బయలుదేరనున్నారు. సభకు వచ్చే ముఖ్య నాయకులు, కార్యకర్తలకు మంచినీరు, భోజన వసతి కల్పించనున్నారు. ఆరీ్టసీ, ప్రైవేటు టూరిస్ట్ బస్సులతో పాటు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిలకు సంబంధించిన ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల బస్సులను ఇందుకు కేటాయించారు. 25 ఏళ్లు.. అనేక ఆటుపోట్లు 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమం తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన ఎజెండాగా 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పడింది. కేసీఆర్ సహా ఆచార్య జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆలే నరేంద్ర, గాదె ఇన్నయ్య తదితరులు మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఆ తర్వాత 2003 ఏప్రిల్ 27న సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వేదికగా ‘తెలంగాణ గర్జన’ పేరుతో ద్వితీయ వార్షికోత్సవ సభను నిర్వహించారు. 2001 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. అప్పటి వరకు ఒక్క సికింద్రాబాద్ (పద్మారావు గౌడ్) మినహా గ్రేటర్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఆ సమయంలో తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంది. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల పోరు గర్జనతో చివరకు కేంద్రం దిగొచి్చంది. డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసింది. కొందరి అభ్యంతరాలతో డిసెంబర్ 23న కేంద్రం మళ్లీ వెనక్కి తగ్గింది. 2011 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్, ఆ తర్వాత సకల జనుల సమ్మె, ఉద్యోగుల సహాయ నిరాకరణ వంటి వరుస ఆందోళనలతో చివరకు కేంద్రం దిగొచి్చంది. 2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది, జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పటివరకు గ్రేటర్ జిల్లాల్లో పారీ్టకి పెద్దగా బలం లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ, కాంగ్రెస్ నుంచి భారీగా పార్టీలోకి వలసలు పెరిగాయి. మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు సహా గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 2018 నాటికి పార్టీ మరింత బలపడింది. పదేళ్లు అధికారంలో ఉంది. గ్రేటర్లో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. 2024 ఎన్నికల్లో ఎల్బీనగర్, మహేశ్వరం, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో గెలుపొందింది. రూరల్ జిల్లాలతో పోలిస్తే.. గ్రేటర్ జిల్లాల్లోనే పారీ్టకి అత్యధిక సీట్లు వచ్చాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి, భారీగా నిధుల కేటాయింపుల పేరుతో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ముఖ్య నేతలు పార్టీ మారినా.. కేడర్ మాత్రం కేసీఆర్ నాయకత్వాన్నే నమ్ముకుని పని చేస్తోంది. -
మాజీ ఇరిగేషన్ అధికారి హరిరాం ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తి పత్రాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు.. సోదాఉ చేపట్టారు. అయితే, హరిరాం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించారు. ఇక, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, టోలీచౌకిలోని హరిరాం ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. ఈ తనిఖీల్లో భాగంగా భారీగా ఆస్తిపత్రాలను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి గుర్తింపు.. అలాగే, మూడు బ్యాంక్ లాకర్స్‌ను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ సోదాల్లో భాగంగా అనధికారిక లావాదేవీలను కూడా గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసును ఏసీబీ బుక్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన తుది నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. వీటిని రీ డిజైన్ చేసి.. మళ్లీ నిర్మించాలని సిఫారసు చేసింది. నిర్మాణం, డిజైన్‌లో అన్నీ లోపాలేనని స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో నిర్మాణ, నిర్వహణ, డిజైన్ లోపాలే మూడు బ్యారేజీలకు గండిని తేల్చేయడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.ఇక, ఎన్డీఎస్ఏ(NDSA) రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చిందని.. వచ్చే కేబినెట్లో ఎన్డీఎస్ రిపోర్ట్‌పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’ అని మండిపడ్డారు.కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఈ రిపోర్టు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఫైనల్‌గా కేసీఆర్, హరీష్ రావులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోఎన్‌డీఎస్‌ఏ రిపోర్టు రావడం బీఆర్ఎస్కు షాక్ లాంటిదే. ఇప్పుడు సాధారణ ప్రజలు.. పాలక పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. -
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
సాక్షి,హైదరబాద్: కాశ్మీర్ లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ముష్కర మూకల ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై పోరు కొనసాగుతోంది. ఈ ఘాతుకాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాకిస్థానీల వీసాల రద్దు కూడా అందులో ఒకటి. దీంతో వివిధ రకాలైన వీసాలపై నగరంలో ఉన్న 208 మంది పాకిస్థానీల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంలో తెరపైకి వచ్చే అంశమే హైదరాబాద్ డిటెన్షన్ సెంటర్లో బందీగా ఉన్న పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్. సిటీలో నమోదైన కేసుల విషయం తేలినా.. ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయాడు. ఢిల్లీ వాసిగా నమ్మించి.. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. 17 ఏళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈమెకు పాకిస్థానీ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించి ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్ తిరిగొచ్చేశారు. 2011లో ఇక్రమ్ సైతం నగరానికి వచ్చాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ ఆమెతో చెప్పాడు. అయితే వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చి అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ.. అక్కడి నుంచి నగరానికి చేరుకున్నాడు. ఆ విషయం బయటపడక.. ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షగట్టిన అతగాడు ఆమెను వేధించడంతో మహిళా ఠాణాను ఆశ్రయించింది. దీంతో ఇక్రమ్‌పై వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఇక్రమ్‌ను విచారించి, నోటీసులు జారీ చేశారు. అప్పట్లో తన భర్త పాకిస్థాన్‌కు చెందినవాడని చెప్పకపోవడంతో విషయం బయటకు రాలేదు. పోలీసులు 2018 జూన్‌లో ఇక్రమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సరిహద్దుల నుంచి వెనక్కు.. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసు విచారణ, శిక్షా కాలం ముగియడంతో ఇక్రమ్‌ను పాకిస్థాన్‌కు బలవంతంగా తిప్పి పంపాలని (డిపోర్టేషన్) భావించారు. డిపోర్టేషన్‌కు సంబంధించిన పత్రాల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు చెప్పిన పాకిస్థాన్ అధికారులు అతడి రాకను అడ్డుకున్నారు. కాగా.. తనపై నమోదైన కేసును భార్యతో రాజీ చేసుకున్న ఇక్రమ్‌ను దాదాపు రెండేళ్లుగా నగరంలోని సీసీఎస్ అదీనంలో ఉన్న డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. ఇక్రమ్‌ను పాకిస్థాన్‌కు పంపడానికి అవసరమైన కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా పహల్గాం ఉదంతంతో ఇతడి డిపోర్టేషన్ పక్రియపై సందేహాలు నెలకొన్నాయి. -
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
సాక్షి స్పెషల్ డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 5 రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల రైతులు ఈ సమయంలో దుక్కులు దున్నుకోవాలని రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలారాణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బులెటిన్ విడుదల చేశారు.మామిడి పంటలో పండు ఈగ నియంత్రణకు ఇదే మంచి సమయమని తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగులో ఈ నెల 26 (శనివారం) నుంచి 30 వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్లను విడుదల చేస్తున్నదని వెల్లడించారు.రైతులకు సూచనలు 5 రోజులు మండే ఎండలు.. ఈదురుగాలులతో వర్షాలు.. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని లీలారాణి తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావొచ్చని చెప్పారు. 26న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 27 నుంచి 29 తేదీల మధ్య ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. బులెటిన్లోని ప్రధాన సూచనలు ఇవే..వేసవి దుక్కుల వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న చీడపీడలు కలిగించే పురుగులు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి. భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల వేసవి జల్లులను వినియోగించుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంతలు తీసి ఎండకు ఆరనివ్వాలి. దీనివల్ల నేలలోని పురుగులు వాటి గుడ్లు తెగుళ్లను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి.కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు) వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్‌కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలి. తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీని వాయిదా వేసుకోవాలి. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే 1 గ్రా. కార్బండజిమ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
వారసుల కోసం.. రోగుల వేషం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా మెడికల్ కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ మెడికల్ సరి్టఫికెట్లు చూపించి తాము ఇక పనిచేయలేమంటూ.. తమ వారసులకు ఉద్యోగాలు ఇప్పిద్దామనుకున్న ఇద్దరు వెటర్నరీ శాఖ ఉద్యోగుల గుట్టును అధికారులు రట్టు చేయటంతో ఈ స్కాం బయటపడింది. ఈ స్కాం లోతుపాతులను కనిపెట్టేందుకు పోలీసులు కూపీ లాగుతున్నారు. సిరిసిల్ల, కరీంనగర్‌తోపాటు ఇతర జిల్లాల్లోనూ అక్రమ వారసత్వ నియామకాల రాకెట్ సాగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ వెటర్నరీ శాఖ అధికారునలు సీఐడీకి లేఖ రాశారు. దీంతో సీఐడీ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.ఎలా బయటపడిందంటే? వాస్తవానికి ఈ కుంభకోణాన్ని మార్చిలోనే గుర్తించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట మండలాల నుంచి వెటర్నరీ శాఖకు చెందిన ఉద్యోగులు వేర్వేరుగా మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లోనూ సమర్పించిన డాక్యుమెంట్లు ఒకేలా ఉండటం, ఇద్దరూ కాలేయ సంబంధిత సమస్యలనే కారణాలుగా చూపించడంతో అధికారులకు అనుమానం వచ్చి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. కరీంనగర్ కేంద్రంగా ఈ రాకెట్ పనిచేసిందని గుర్తించారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు కరీంనగర్‌కు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ బీరయ్యను సంప్రదించారు. ఆయన వారి నుంచి రూ.3 లక్షల చొప్పున తీసుకొని తనకు డి.ఎం.హెచ్.ఓ ఆఫీస్‌లో పరిచయం ఉన్న మొహమ్మద్ బాసిద్ హుస్సేన్, ల్యాబ్ టెక్నీషియన్ కొత్తపల్లి రాజేశం సాయంతో కరీంనగర్‌లోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి ప్ప్రిస్కిప్షన్లతో నకిలీ మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు గుర్తించారు. దీనిపై ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట పోలీసుస్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి.రంగంలోకి సీఐడీ.. ఇదే తరహాలో మెడికల్ అన్‌ఫిట్ కింద ఉమ్మడి జిల్లాలో 30 మంది వరకు ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. ఈ రాకెట్ సిరిసిల్ల, కరీంనగర్‌కు మాత్రమే కాకుండా వెటర్నరీ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిందని భావిస్తున్నారు. కుంభకోణం భారీగా కనిపిస్తుండటంతో స్థానిక పోలీసులతో దర్యాప్తు సాధ్యం కాదని భావించి సీఐడీకి లేఖ రాశారు. దీంతో సీఐడీ అధికారులు ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట పోలీసుస్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లు, ప్రాథమికంగా ఉమ్మడి జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుని అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే దర్యాప్తు మొదలుపెట్టనున్నారని అధికార వర్గాల సమాచారం. -
తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలను విడుదల చేశారని కేటీఆర్, జగదీశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పీఎస్‌లో నవీన్ ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గతేడాది మే 25న వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమపై నమోదైన ఈ కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్, జగదీశ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయ వాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి కేటీఆర్, జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. తప్పుడు అభియోగాలతో ఫిర్యాదు చేశారని, ఆరోపణలకు ఆధారాల్లేవన్నారు. -
అపార్థం చేసుకోవద్దు.. రాజకీయాల్లోకి రండి
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలను యువత అపార్థం చేసుకోవద్దని, రాజకీయాలపై ఏవగింపు ధోరణితో కాకుండా సానుకూల దృక్పథంతో ఆలోచించి అవకాశాలను వెతుక్కోవడం ద్వారా సమాజ భవిష్యత్తుకు పునాదులు వేయాలని భారత్ సమ్మిట్–2025 పిలుపునిచ్చింది. అసమానత, వాతావరణ మార్పులు, వృద్ధిలో అస్థిరత అనే అంశాలపై దృష్టి సారించేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేసింది. ‘ఓటింగ్‌లో పాల్గొనడం, గళమెత్తడం, రాజకీయాల్లో చేరడం’ అనేవి నేటి యువతకు మార్గదర్శకాలుగా నిలవాలని కోరింది.యువజన కాంగ్రెస్ జాతీయ నాయకుడు కృష్ణ అళవారు సంధానకర్తగా శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ‘యువత..రేపటి రాజకీయాలు’ అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పెద్దపల్లి ఎంపీ డాక్టర్ వంశీకృష్ణ, ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరిలతో పాటు పలు దేశాలకు చెందిన ఉదయ్‌భాను చిబ్, అరెనా విలియమ్స్, లినేశ్‌సెల్యు అందాన్, మెరీనా హే, జేమ్స్ స్టీవ్ సెరానో, జీసస్ తాపియాలు ప్యానలిస్టులుగా వ్యవహరించిన ఈ గోష్టి పలు కీలక అభిప్రాయాలకు వేదికయింది. వక్తలు వెలిబుచి్చన అభిప్రాయాలివే.. పరిస్థితులను యువత అధిగమించాలి ⇒ రాజకీయాలంటే అవినీతి అని యువత అనుకుంటోంది. ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేసి విస్మరించే పారీ్టల వైఖరి వారికి వెగటు పుట్టిస్తోంది. అయితే ఈ కారణాలతో యువత రాజకీయాల నుంచి దూరం జరగకూడదు. వీటిని అధిగమించేలా యువత కంకణం కట్టుకోవాలి. ⇒ చదువుకునేటప్పుడే యువతకు రాజకీయాలు అలవడాలి. వారు వివిధ వృత్తుల్లోకి వెళ్లిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని కోరితే ప్రయోజనం ఉండదు. అందుకే కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలి. ⇒ సోషల్ మీడియా యువతను బాగా ప్రభావితం చేస్తోంది. పలు సామాజిక మాధ్యమాల ద్వారా హింస, విద్వేషపూరిత ప్రసంగాలకు యువత ప్రభావితమవుతోంది. ఇది మంచిది కాదు. చెడును ప్రోత్సహించే ఎలాంటి సామాజిక మాధ్యమాలనైనా యువత అధిగమించగలగాలి. ⇒ వాతావరణ మార్పు అనే అంశాన్ని యువత సీరియస్‌గా తీసుకోవాలి. ఇందుకోసం చట్టాలు చేసే క్రమంలో యువత భాగస్వామ్యం కావాలి. యువత ముందున్న ప్రస్తుత రాజకీయ కర్తవ్యం వాతావరణ మార్పులపై పోరాటమే. ⇒ యువత ఎంత గట్టిగా అరిచిందన్నది ముఖ్యం కాదు. ఎంత నిఖార్సుగా పోరాడిందన్నదే ముఖ్యం. వారసత్వం ఇంకెన్నాళ్లు? చర్చాగోష్టిలో భాగంగా డొమినిక్ రిపబ్లిక్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలపై ప్రశ్నించారు. తన కుటుంబం నుంచి ఒక ఎంపీనో, మంత్రినో ఉంటే ఆ కుటుంబ సభ్యులు మళ్లీ అవే పదవుల్లోకి వెళుతున్నారని, అలాంటప్పుడు సామాన్యులకు అవకాశాలెలా వస్తాయో ప్యానలిస్టులు చెప్పాలని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగానని చెప్పారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌లలో పనిచేసి ఎంపీని అయ్యానని, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నానని, కష్టపడిన వారికి రాజకీయాల్లో అవకాశాలు వస్తాయనేందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. అయితే వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తున్న వారు కూడా ఉన్నారని, ఆ పరిస్థితిని కాదనలేమని పొన్నం అభిప్రాయపడ్డారు. మరో రెండు అంశాలపైనా చర్చ తొలిరోజు భారత్ సమ్మిట్‌లో భాగంగా మరో రెండు అంశాలపై కూడా చర్చాగోషు్టలు జరిగాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినాటె మోడరేటర్‌గా జరిగిన ‘నిజం వర్సెస్ ఊహాజనితం: తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడం’పై జరిగిన చర్చాగోష్టిలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగి్వజయ్‌సింగ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలతో పాటు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద శర్మ మోడరేటర్‌గా వ్యవహరించిన ‘బహుళపక్ష వాదం’ అనే అంశంపై చర్చాగోష్టిలోనూ పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొని వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. -
ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని విద్యుత్ చార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం వంటివి టీఆర్ఎస్ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేనూ భాగస్వామిని కావడంతో ఉద్యమంవైపు ఆకర్షితుడినయ్యా.సాక్షి, హైదరాబాద్ : కుటుంబ పార్టీ అంటూ బీఆర్ఎస్పై చేసే విమర్శలు అర్థ రహితమని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించిన తాము.. ప్రజల ఆశీర్వాదంతోనే పదవులు చేపట్టామన్నారు. బ్యాక్‌డోర్‌లో తాము పదవులు పొందలేదని చెప్పారు. కేటీఆర్, కవిత సహా ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఇచి్చన నివేదిక ఎన్డీఏ ప్రభుత్వ నివేదిక తరహాలో ఉందని తెలిపారు.మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులో ఉద్దేశపూర్వకంగా కాలయాపన జరుగుతోందన్నారు. ఏడాదిన్నరలోనే రేవంత్ పాలన తేలిపోయిందని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా తిరిగి అధికారంలోకి వచ్చి కేంద్రంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి నడిచిన హరీశ్‌రావు ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో నెమరువేసుకున్నారు. ఉద్యమంలో తన అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు.పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. నాటి పరిస్థితులతోనే టీఆర్ఎస్ స్థాపన తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం తదితరాలు టీఆర్ఎస్ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేనూ భాగస్వామిని కావడంతో ఉద్యమం పట్ల ఆకర్షితుడిని అయ్యా. ప్రొఫెసర్ జయశంకర్ తదితరులతో జరిగిన చర్చల్లో అనేక అంశాల పట్ల అవగాహన ఏర్పడటంతో ఉద్యమం పట్ల ఆకర్షణ, పాల్గొనాలనే ఉత్సాహం పెరిగింది.తెలంగాణకు సంబంధించిన అంశాలను ఆకళింపు చేసుకునే క్రమంలో కేసీఆర్ వందలాది మందితో గంటల కొద్దీ సంప్రదింపులు జరిపారు. వారిని సమన్వయం చేయడం నా ప్రధాన బాధ్యతగా ఉండేది. టీఆర్ఎస్ ఆరంభంలోనే పార్టీ కోశాధికారిగా, ప్రచార కార్యదర్శిగా మీడియా బాధ్యతలు, ఆర్థిక అంశాలు, ఎన్నికల బాధ్యతలు చూసేవాడిని. పార్టీ పెట్టిన రెండు నెలల్లోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు జెడ్పీటీసీ సభ్యులతో క్యాంప్‌ల నిర్వహణ బాధ్యత కేసీఆర్ నాకు అప్పగించారు. వైఎస్ మంత్రివర్గంలోకి అనగానే..నాకు ఎమ్మెల్యే పదవి లేకున్నా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చేరమని కేసీఆర్ ఆదేశించినప్పుడు నేను ఆశ్చర్యానికి లోనయ్యా. మంత్రివర్గంలో కొనసాగుతూ పార్టీ బలోపేతం చేయమని ఆదేశిస్తూ టీఆర్ఎస్ తరఫున మంత్రివర్గంలో చేరే వారి జాబితాను నాతోనే కేసీఆర్ రాయించి కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చారు. 33 ఏళ్ల వయసులోనే రాష్ట్ర మంత్రివర్గంలో చేరినా, పాలన కంటే ఉద్యమం మీదే ఎక్కువ దృష్టి ఉండేది. మంత్రిగా పనిచేస్తూనే 2004 అక్టోబర్‌లో సిద్దిపేట ఉప ఎన్నికలో తొలిసారి పోటీ చేశాం. అంతకు మునుపే కేసీఆర్‌కు సంబంధించిన 2001 ఉపఎన్నిక, 2004 అసెంబ్లీ ఎన్నిక బాధ్యతలను నేనే చూశా. దీంతో నాకు సిద్దిపేట, ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో ఉన్న సన్నిహిత సంబంధం ఉండటం కలిసొచి్చంది. నివేదికల పేరిట పార్టీని దెబ్బతీసే కుట్ర తెలంగాణలో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో మిషన్ కాకతీయతోపాటు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఆయకట్టును పెంచాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా పనులు వేగంగా పూర్తి చేసేందుకు సైట్ వద్దే నిద్రించిన సందర్భాలు అనేకం. ఈడీ, సీబీఐతరహాలోనే ఎన్డీఎస్ఏ కూడా ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర నివేదిక, రజతోత్సవ సందర్భంలో తుది నివేదిక అంటూ మా పార్టీని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. పదవులొస్తాయని అనుకోలేదు కుటుంబ పార్టీ, ఆ నలుగురు అంటూ మాపై చేసే విమర్శలు అర్థ రహితం. రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించడం మినహా, అధికారం, పదవులు వస్తాయని మాలో ఎవరూ అనుకోలేదు. మేము వెనుక డోర్ నుంచి పదవుల్లోకి రాలేదు. ప్రజల ఆశీర్వాదంతో వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వాళ్లం. కేసీఆర్ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో కార్యకర్తలుగా పనిచేస్తాం. నాతో సహా పార్టీలో అందరమూ కేసీఆర్ సైనికులమే.బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతుంది ఏడాదిన్నరలోనే రేవంత్ ప్రభుత్వం తేలిపోయింది. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగితే వారి పాలన సామర్థ్యం ప్రజలకు మరింత అర్థమవుతుంది. ఇప్పటికే బీజేపీ కేంద్రంలో ప్రాంతీయ పార్టీల మద్దతు వల్లే మనుగడలో ఉంది. రేపు కేంద్రంలో అధికారంలోకి వచి్చనా ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి. బీఆర్ఎస్ బలమైన శక్తిగా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తుంది. మహాగర్జన అపురూప జ్ఞాపకంHarish Rao ,Interview with Sakshi, telanganaఉద్యమ సమయంలో వరంగల్‌లో 25 లక్షల మందితో నిర్వహించిన మహాగర్జన అపురూప జ్ఞాపకంగా మిగిలిపోయింది. కేసీఆర్ ఈ సభకు సిద్దిపేట నుంచి సైకిల్‌పై వచ్చారు. అలాంటి సభలు ఈ రోజుల్లో నిర్వహించడం సాధ్యం కాదు. పార్టీ వద్ద అప్పట్లో పెద్దగా డబ్బులు లేకున్నా ప్రజలు ఈ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. -
బడికి టాటా.. 50 రోజుల ఆట
సాక్షి, హైదరాబాద్: పరీక్షా కాలం ముగిసింది.. చదువుల ఒత్తిడి నుంచి పిల్లలకు విరామం లభించింది.. బడులకు టాటా చెప్పి ఆటపాటలతో సేదతీరే వేళయింది. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో దాదాపు 50 రోజులపాటు సందడే సందడి నెలకొననుంది. అయితే వినోదాల పేరిట పిల్లలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ దారితప్పకుండా తల్లిదండ్రులు ఇప్పుడే దృష్టి పెట్టాలని.. వారు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. అవసరమైన మార్గదర్శనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళిక రచించాలంటున్నారు. కాసేపు టీవీలు చూడనిచ్చినా కుటుంబ సభ్యులంతా కలిసి ఆడుకొనే ఆటలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.ఆన్‌లైన్‌కు బానిసలు కానివ్వొద్దుపట్టణాలు, నగరాల్లో పిల్లలకు ఆటస్థలాల కొరత వల్ల చాలా మంది సెల్ఫోన్లు, ఆన్లైన్ ఆటలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల 50 రోజుల్లో వారి మానసిక ధోరణిలో మార్పులొస్తాయని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త అంజలా గౌరీ తెలిపారు. ఈ విధానం వల్ల రెండేళ్లలో మెదడు మొద్దుబారి విచిత్ర ధోరణి ప్రదర్శించిన 28 మందికి కౌన్సెలింగ్ ఇచి్చనట్లు చెప్పారు. రేయింబవళ్లు సెల్ఫోన్లకు పరిమితమవడం నిద్రలేమికి దారితీస్తుందని.. ఫలితంగా వారి మానసిక ధోరణిలో మార్పులొస్తాయని హైదరాబాద్‌కు చెందిన మానసిక నిపుణులు అరోరీ వాగ్దేవి తెలిపారు. గతేడాది వేసవి సెలవుల్లో తన కుమారుడు అదేపనిగా ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల తిరిగి స్కూల్ తెరిచాక ఏడాదంతా పాఠ్యపుస్తకాలు చదవాలంటే ఒక రకమైన భయం పట్టుకుందని కూకట్‌పల్లికి చెందిన ఓ విద్యార్థి తల్లి పేర్కొన్నారు.బంధాల వైపు మళ్లించాలి పిల్లలకు అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లలో గడిపే అవకాశం ఇవ్వడం వల్ల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటంతోపాటు పొడుపు కథల వంటివి వారి నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలుగు భాషపై వరంగల్ స్కాలర్ వినీత్ భార్గవ్ జరిపిన పరిశోధనలో వెలుగులోకి వచి్చంది. నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మల అనుభవాల్లోంచి కథలు నేర్చుకొనే పిల్లల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని.. 100 మందిలో 82 మంది తరగతి గదుల్లోనూ చురుకుగా వ్యవహరించిన తీరును గుర్తించామని ఆయన పేర్కొన్నారు.దీంతోపాటు గ్రామీణ అనుబంధాలు, బంధువులతో మమేకమైనప్పుడు కలిగే అనుభూతులు విద్యార్థుల మానసిక ధోరణిలో మార్పు తెస్తున్నాయన్నారు. అనుబంధాలు పెంచుకొనే పిల్లల మానసిక ధోరణి ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటోందని భారత సైకాలజీ అసోసియేషన్ జరిపిన ఓ పరిశోధన తేల్చింది. 468 మందిపై అసోసియన్ ఆన్లైన్ సర్వే చేపట్టింది. ఎవరికి ఎవరు అనే ధోరణి నుంచి బయటపడిన పిల్లల్లో 332 మంది వేసవి సెలవుల్లో పెద్దవాళ్ల దగ్గర నేర్చుకున్న జ్ఞానమేనని తేలింది.జాగ్రత్తగా వ్యాయామంఆట విడుపులో భాగంగా పిల్లలు నిత్యం క్రికెట్, కబడ్డీ లాంటి రకరకాల క్రీడలు ఆడుతుంటారు. దీనివల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా బలపడతారని వ్యాయామ కళాశాలలో విశేష అనుభవం ఉన్న జీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఆటలతో స్నేహాలు మరింత మెరుగవుతాయని.. కొత్త స్నేహాలను చిగురింపజేస్తాయని పేర్కొన్నారు.అయితే ఈ క్రమంలో పిల్లలు ఘర్షణలు, విభేదాల వైపు మళ్లకుండా మార్గదర్శకుల పర్యవేక్షణలో వారు ఆటలు ఆడేందుకు వీలున్న గ్రౌండ్లకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తూ సేదతీరుతుంటారు. అయితే ఇందులో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఇలాంటి ఘటనల్లో తీవ్రంగా గాయపడగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.⇒ వేసవి సెలవుల్లో పిల్లల్ని ఖాళీగా వదిలేస్తే ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడమో లేదా ఎండలో స్నేహితులతో తిరగడమో చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలకు నీతికథలు చెప్పాలి. గ్రామాల్లో ఇరుగుపొరుగు పిల్లలందరినీ ఒకచోట కూర్చోబెట్టి వారికి లోకజ్ఞానం నేరి్పంచే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పిల్లలు కూడా ఇవే కోరుకుంటున్నారు. బోర్‌గా ఫీలవ్వడం లేదు. – కాకి వీరభద్రం, వనం వారి కృష్ణాపురం, ఖమ్మం జిల్లా⇒ కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పిల్లల్లో పెరిగింది. దాని గురించి నేర్పడానికి ఇదే మంచి తరుణం. వేసవిలో వారితో కూర్చొని ఏఐపై కసరత్తు చేస్తే పిల్లలు బోర్‌గా ఫీలవ్వరు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా మోటివేషన్ బాగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దలు చొరవ తీసుకొని ఆన్లైన్లో ఏఐపై శిక్షణ ఇప్పించాలి. – కంకిపాటి శేషుకుమార్, హైదరాబాద్ -
పాక్‌ను ముక్కలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘మోదీజీ.. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను భారత్‌లో కలపండి. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు నాటి ప్రధాని ఇందిరా గాంధీ దీటైన జవాబు ఇచ్చారు. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారు. ప్రధానిగా మీరు ఇప్పుడు తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాదులు పర్యాటకులను హతమార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీకి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కఠినంగా వ్యవహరించాలి.. ‘పహల్గాంలో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకూ మద్దతు పలికేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులంతా ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వబౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.‘ఉగ్రదాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుభూతి తెలుపుతున్నాం. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం’అని రేవంత్ అన్నారు. ఇందిరాగాంధీ ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్‌పేయ్ దుర్గామాతతో పోల్చారని పేర్కొన్నారు. ‘మోదీజీ.. మీరు దుర్గామాత భక్తులు. ఇందిరను ఆదర్శంగా తీసుకొని ఉగ్రవాదులపై దాడులు నిర్వహించాలని కోరారు. కొవ్వొత్తుల ప్రదర్శన...పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ ఎంపీలు అజహరుద్దీన్, సల్మాన్ ఖుర్షీద్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు విజయశాంతి, సలహాదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతించాలని ప్రారి్థంచారు. భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేసిన ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ ముందుకు సాగారు. -
నేపాల్ మీదుగా హైదరాబాద్‌కు.. పోలీసుల అదుపులో పాకిస్తానీ
హైదరాబాద్: పహెల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ హైదరాబాద్‌కు వచ్చిన పాక్ జాతీయుడు పోలీసులకు చిక్కాడు. మహ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి.. హైదరాబాద్ కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యను కలిసేందుకు ఫయాజ్ భారత్ కు చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నాడు ఫయాజ్. అయితే ప్రస్తుతం పాకిస్తానీయులను వెనక్కి పంపించే పనిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై ఓ కన్నేసి ఉంచాయి. ఈ క్రమంలోనే ఫయాజ్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఆ యువకుడ్ని మరింత లోతుగా విచారించనున్నారుపోలీసులు. అతను దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్ జాతీయులు తమ దేశానికి వెళ్లిపోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ.. ముందుగా అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఇక వారు రాష్ట్రాల నుంచి ఖాళీ చేసి పాక్ కు వెళ్లిపోవాలని డీజీపీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో భార్యను కలవడానికి వచ్చి పోలీసులకు పాకిస్తాన్ జాతీయుడు చిక్కడం గమనార్హం. -
పహల్గాం ఉగ్రదాడి.. నెక్లెస్‌రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు.అందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలి: సీఎం రేవంత్రెడ్డిఅందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడినవారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోంది. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను పాక్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారు. ప్రధాని మోదీ.. మీరు దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోండి. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం రేపాయి. గోదాంలో డబ్బుల కట్టలను చూసి బోయిన్పల్లి పోలీసులు షాకయ్యారు. పలు బ్యాంకులకు చెందిన డబ్బును ఏటీఎంలలో డిపాజిట్ చేయకుండా ఆ నోట్ల కట్టలను ఏజెన్సీలు.. గోదాంలో నిల్వ ఉంచాయి. రూ.8 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.బ్యాంకు అధికారులతో కలిసి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జీతాలు చెల్లించకపోవడంతో కొన్నాళ్ల నుంచి సిబ్బంది విధుల బహిష్కరించారు. దీంతో గత కొద్ది రోజులుగా గోదాంలోనే కోట్ల రూపాయల నగదు ఉండిపోయాయి. ఏజెన్సీ నిర్వాహకులు గోదాంలో పెట్టి వదిలేశారు. -
సాంకేతికంగా... ‘నిరభ్యంతరం’గా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అగ్నిమాపక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవనాల నిర్మాణానికి ముందు జారీ చేసే తాత్కాలిక నిరభ్యంతర పత్రం (ప్రొవిజినల్ ఎన్ఓసీ) జారీ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ పర్యవేక్షణలో ఓ ప్రముఖ సంస్థ రూపొందిస్తున్న ఈ సాఫ్ట్వేర్ నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నిర్ణీత రుసుం చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ప్రొవిజినల్ ఎన్ఓసీ (provisional fire noc) పొందవచ్చని పేర్కొన్నారు. వీరికి ప్రొవిజినల్ ఎన్ఓసీ తప్పనిసరి రాష్ట్రంలో వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం నిర్మించే 15 మీటర్ల కంటే ఎత్తైన, నివాస గృహాలుగా నిర్మించే 18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన భవనాలకు ఈ ప్రొవిజినల్ ఎన్ఓసీ తప్పనిసరి. వీటితో పాటు 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే పాఠశాలలు, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, మతపరమైన, ప్రజావసరాలకు సంబంధించిన భవనాలకు కూడా ఈ ప్రొవిజినల్ ఎన్ఓసీ తీసుకోవడం అనివార్యం. భవన నిర్మాణానికి ముందే దీన్ని పొందాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నుంచి ప్రొవిజినల్ ఎన్ఓసీ తీసుకుంటేనే ఇతర విభాగాలు తమ అనుమతుల్ని జారీ చేస్తాయి. ఈ ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసే ముందు ఆయా భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు అమలు చేయబోయే ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఆ వివరాలన్నీ పొందుపరచాలి... భవన నిర్మాణం ప్రారంభానికి ముందే జారీ అయ్యే ఈ ప్రొవిజినల్ ఎన్ఓసీ కోసం దరఖాస్తుదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు ఆ ఫైల్‌ను, అందులోని ప్రతిపాదిత భద్రత ప్రమాణాలను పరిశీలిస్తారు. అవసరమైతే మార్పులు, చేర్పులు సూచించి, వాటిని జోడించిన తర్వాతే జారీ చేస్తారు. భవనం ఎత్తు, విస్తీర్ణం, ఎందుకు వినియోగిస్తారు? తదితర అంశాల ఆధారంగా భద్రతా ప్రమాణాలు ఉంటాయి. ఆ భవనానికి ఎన్ని ఫైర్ ఎగ్ట్వింగ్విషర్లు, స్ప్రింక్లర్లు ఎన్ని, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే విషయాలు నిర్దేశించి ఉంటాయి. భవనం భద్రత ప్రమాణాల నమూనా, వాటికి తగ్గట్టు ఉంటేనే ప్రొవిజినల్ ఎన్ఓసీ జారీ అవుతుంది. వాటిని తనిఖీ చేసే అధికారి అవసరాలకు తగ్గట్టు ఉన్నాయా? లేదా? అనేది తేలుస్తారు.చదవండి: హైదరాబాద్‌లో హై అలర్ట్సాఫ్ట్వేర్తో ఆటోమేటిక్‌గా... తాజా సాఫ్ట్‌వేర్‌లో ఈ వివరాలన్నీ ముందే పొందుపరిచి ఉంటాయి. దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారుడు భవనం వివరాలు పొందుపరచడంతోపాటు దాని భద్రతా ప్రమాణాల ప్లాన్‌ను ఆటో క్యాడ్ రూపంలో దాఖలు చేస్తాడు. దీన్ని ఆద్యంతం పరిశీలించే సాఫ్ట్వేర్ అవసరమైతే తగిన మార్పులు చేర్పుల్ని సూచిస్తుంది. ఈ మేరకు ప్లాన్‌ను మారుస్తూ మరో ఆటో క్యాడ్‌ను అప్లోడ్ చేస్తే ప్రొవిజినల్ ఎన్ఓసీ జారీ అవుతుంది. ‘కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తే మానవ వనరుల జోక్యం తగ్గుతుంది. తర్వాదా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రొవిజినల్ ఎన్ఓసీ దరఖాస్తును పరిశీలించి, మార్పులు, చేర్పుల సూచన వస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పని విధానం పారదర్శకంగా మారి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు’ అని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
‘భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైనది’’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ సమ్మిట్ చారిత్మాకమైనదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో భారత్ సమ్మిట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్ సమ్మిట్ లో గ్లోబల్ జస్టిస్ కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. హెచ్ఐసీసీ వేదికగా తొలిరోజు జరిగిన భారత్ సమ్మిట్ గురించి మల్లు భట్టి విక్రమార్క్ మీడియాతో మాట్లాడారు.‘గ్లోబల్ జస్టిస్ కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సోషల్ జస్టిస్, శాంతి తదితర అంశాలపై సమ్మిట్ లో చర్చించారు. సామాజిక న్యాయం, అభివృద్ధిపై డెలిగేట్స్ తో చర్చించాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల విదేశీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ న్యాయ్ కార్యక్రమం పట్ల డెలిగేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడికి నిరసనలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటామని అన్నారు. కశ్మీర్ ఉగ్రవాద దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.నెక్లెస్ రోడ్డులో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు’ అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. -
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తానీయులు వీసా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన వారు వెంటనే తమ రాష్ట్రాలను వీడి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్.. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే స్వదేశీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుండి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలి. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’ అని డీజీపీ జితేందర్ హెచ్చరించారు.కాగా, భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం పాక్ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్ రద్దు చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. -
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
సాక్షి, హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో అఘోరీకి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నిద్ర పోకుండా గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేసిన అఘోరీని ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచారు. నా భార్య వర్షిణితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారంటూ అధికారులతో అఘోరీ వాగ్వాదానికి దిగారు. అఘోరీకి ఖైదీ నంబర్ 12121ను కేటాయించగా.. అఘోరీ ప్రవర్తనపై జైలు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.కాగా, చంచల్ గుడ జైలును నిన్న(గురువారం) సందర్శించిన మహిళ కమిషన్ ఛైర్పర్సన్ నెరేళ్ల శారదా.. అఘోరీని ఉంచిన బ్యారక్‌ను పరిశీలించారు. అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన మోకిల పోలీసులు బుధవారం చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజులు జ్యూడిషయల్ రిమాండ్ విధించింది. అఘోరీతో పాటు శ్రీవర్షిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మోకిల పీఎస్‌లో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించారు. అనంతరం నగరంలోని హైదర్షాకోట్ కస్తూర్బాగాంధీ వెల్ఫేర్ హోమ్‌కు తరలించారు. కాగా.. మరోవైపు కోర్టు నియమించిన న్యాయవాది ఇవాళ అఘోరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.మహిళా సినీ నిర్మాత ఫిర్యాదుతో..పూజల పేరుతో అఘోరీ తనను మోసం చేసిందని, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు తీసుకుందని శంకర్పల్లి మండలం ప్రొద్దుటూర్ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో నివాసముండే ఓ మహిళా సినీ నిర్మాత ఈ ఏడాది ఫిబ్రవరి 25న మోకిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ 308(5), 318(1), 351(3), 352 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, గత మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో అఘోరీని అరెస్టు చేసి, తీసుకువచ్చారు. నార్సింగి ఏసీపీ కార్యాలయం నుంచి బుధవారం పోలీస్ వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, సాధారణ వైద్య పరీక్షలు చేయించి, చేవెళ్ల జూనియర్ ఫస్ట్‌క్లాస్ జడ్జి ధీరజ్‌కుమార్ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.న్యాయమూర్తి ఆదేశాల మేరకు మోకిల పోలీసులు అఘోరీని సంగారెడ్డి జిల్లా కంది జైలు అధికారులకు అప్పగించి వెళ్లారు. అయితే అఘోరీని ఏ బ్యారక్‌లో ఉంచాలనే సందేహం రావడంతో, వారు మళ్లీ మోకిల పోలీసులను పిలిపించారు. దీంతో అఘోరీని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. మహిళ అని గుర్తించిన తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు. అరెస్టు సమయంలో అఘోరీ నుంచి రూ. 5,500 నగదు, నేరాలకు ఉపయోగించిన ఐ20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనను తాను అఘోరీ మాతగా ప్రకటించుకుని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీనివాస్(28) చిన్ననాటి నుంచి అబ్బాయిగానే ఉన్నాడు. ఆతర్వాత సులభంగా డబ్బు సంపాదించడంతో పాటు ఇతర కారణాలతో చైన్నె, ఇండోర్‌లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. అనంతరం ఆధ్యాత్మిక వేషధారణలో కనిపిస్తూ, తంత్ర పూజలు అంటూ అమాయకులను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఎస్ఏ(NDSA) రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చిందని.. వచ్చే కేబినెట్లో ఎన్డీఎస్ రిపోర్ట్‌పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. -
తెలంగాణలో తొలిసారిగా టెండన్ ఆగ్మెంటేషన్ షోల్డర్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆపరేషన్
హైదరాబాద్: ఆధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో అపోలో వైద్యులు అరుదైన ఘనతను సాధింఆరు తెలంగాణలోనే తొలి అల్లోగ్రాఫ్ట్ టెండన్ (ఆకిలీస్ టెండన్) ఆధారిత లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ షోల్డర్ సర్జన్ డా. ప్రశాంత్ మేశ్రం ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇటువంటి చికిత్స అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో తొలిసారిగా జాయింట్ ప్రిజర్వేషన్ కోసం అల్లోగ్రాఫ్ట్ టెండన్ ద్వారా ఆ శస్త్ర చికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు.వివరాల్లోకి వెళితే 55 ఏళ్ల శక్తివంతమైన వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు. ఆరు నెలలపాటు తీవ్రమైన నొప్పితోపాటు, చేతిలో బలహీనతతో బాధపడ్డాడు. మాసివ్, మరమ్మతులు చేయలేని రోటేటర్ కఫ్ టియర్తో పాటు ఆర్మ్ జాయింట్లో ప్రారంభ దశ ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారు అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్‌లోని డా. మేశ్రంని సంప్రదించారు.ఈ మేరకు అతి సంక్లిష్టమైన ఈ ఆర్థోస్కోపిక్-అసిస్టెడ్ లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ శస్త్రచికిత్సలో ఆకిలీస్ టెండన్ అల్లోగ్రాప్ట్ను నిష్ణాతంగా ఉపయోగించారు. బైసెప్స్ టెండన్ రీ-రూటింగ్, సబ్స్కాపులారిస్ టెండన్ మరమ్మతులతో కూడిన ఈ చికిత్స ద్వారా భుజం పనితీరు సామర్థ్యాన్ని పునరుద్ధరించి, తద్వారా ఆర్థరైటిస్‌ను నివారించే ప్రయత్నించి విజయవంతమైనారు. ఆపరేషన్ తర్వాత చేసిన షోల్డర్ జాయింట్లో మారిన హెడ్ పొజిషన్ తిరిగి సరి అయినట్టు వెల్లడైంది. అరుదైన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడం ఒక కొత్త మైలురాయి అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. -
Summer లేస్ బ్రైట్ఫుల్
వేసవిలో కంఫర్ట్గానూ,స్టైలిష్‌గానూ ఉండే ఔట్ఫిట్స్ జాబితాలో కూల్‌గా మన మదిని చుట్టేస్తుంది క్రోచెట్ లేస్ డ్రెస్సింగ్ స్టైల్. ఎప్పుడూ ఎవర్గ్రీన్ అనిపించుకునే ఈ క్రియేటివ్ వర్క్‌ని ఏ ఫ్యాబ్రిక్‌తోనైనా జత చేస్తే రిచ్ లుక్‌ని మన సొంతం చేస్తుంది.క్యాజువల్ లేదా పార్టీవేర్‌గా ఇట్టే మార్కులు కొట్టేస్తుంది.బ్రైడల్ వేర్‌గా యూనివర్సల్ సింబల్‌ని సొంతం చేసుకున్న ఈ అల్లికల అందం ఈ వేసవికి మగువల ముస్తాబులో రెక్కలకు రంగులు అద్దుకున్న రాయంచలా మరింతగా మెరిసిపోతుంది.సంప్రదాయ హంగులుక్రోచెట్ లేస్ అత్యంత సున్నితమైన, క్లిష్టమైన వర్క్. సంప్రదాయ అల్లిక కావడంతో ఈ వర్క్ ఎవర్‌గ్రీన్‌గా అందరి మన్ననలు అందుకుంటుంది. కాటన్, సిల్క్, చందేరీ, నెటెడ్... ఏ ఫ్యాబ్రిక్‌తో అయినా ఇట్టే జత కట్టే క్రోచెట్ లేస్‌లో సంప్రదాయ పద్ధతిలో హ్యాండ్మేడ్గానూ, అధునాతనంగా మిషనరీపైనా రూపు దిద్దుకుంటుంది. ఇండో–వెస్ట్రన్గానూ..వెస్ట్రన్ గౌన్స్, టాప్స్, మిడీస్.. ఇండోవెస్ట్రన్ శైలులు క్రోచెట్ లేస్ మోడల్ డ్రెస్సుల ద్వారా మనం చూడచ్చు. కాటన్, సిల్క్దారాలతో తయారయ్యే ఈ అల్లికల ఫ్యాబ్రిక్‌లో పువ్వులు, తీగలు, లతల డిజైన్లు కనిపిస్తాయి. లేతరంగులు, ముఖ్యంగా తెలుపులో ఎక్కువగా కనిపించే ఈ డ్రెస్సులు సమ్మర్ స్పెషల్‌గానూ యువతను ఆకట్టుకుంటున్నాయి.వెస్ట్రన్ బ్రైడ్స్ ధరించే పొడవాటి తెల్లని గౌన్లతో మనల్ని ఆకట్టుకుంటుంది క్రోచెట్ లేస్. మన సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలలోనూ నవ వధువులు లేస్ డిజైనరీ దుస్తులు ధరించడం చూస్తే కదలాడుతుండే హంసలు కళ్ల ముందు నిలుస్తాయి. క్యాజువల్ వేర్‌గానూ, చీరలు, లెహంగాలు, కుర్తా, దుపట్టా.. వంటి డ్రెస్సులకు, క్రొచెట్ లేస్ అందమైన అలంకరణగా విరాజిల్లుతుంది. క్రోచెట్ లేస్తో అంచులు, డెకరేటివ్ ప్యాచ్ లేదా మొత్తం దుపట్టా, శారీగానూ ఆకట్టుకుంటుంది. లేస్ ఆభరణాలుముచ్చటైన కంఠాభరణాలు, పర్సులు, హ్యాండ్ కఫ్స్, షూ డిజైన్స్‌లోనూ డిజైనర్లు లేస్తో క్రియేటివ్ డిజైన్స్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. నాణ్యతను బట్టి వందల రూపాయల నుంచి డిజైన్‌ను బట్టి వేలల్లోనూ ఈ డిజైన్స్ ధర పలుకుతున్నాయి. -
హైదరాబాద్‌లో హై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో రాజధానిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. త్వరలో రెండు కీలక ఘట్టాలకు నగరం వేదిక కానుండటంతో హైదరాబాద్, సైబరాబాద్ అధికారులు అప్రమత్తమయ్యారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నగర వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హెచ్ఐసీసీలో ఈ నెల 25, 26 తేదీల్లో భారత్ సమ్మిట్, వచ్చే నెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్–2025 పోటీలు జరగనున్నాయి. వీటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, సెలబ్రెటీలు రానున్నారు. దేశంలోని ఉగ్రవాద ప్రభావిత నగరల్లో హైదరాబాద్ కూడా ఒకటి కావడంతో నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. భారత్ సమ్మిట్‌కు వంద దేశాల నుంచి దాదాపు 400 మంది, మిస్ వలర్డ్ పోటీలకు 140 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హాజరుకానుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలూ సైబరాబాద్‌లో జరుగుతున్నప్పటికీ అతిథుల్లో అత్యధికులు హైదరాబాద్‌లోని వివిధ హోటళ్లలో బస చేయనున్నారు. -
Hyderabad: నగరంలోని పాకిస్థానీలపై ఆరా
సాక్షి,హైదరబాద్: పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్రం.. దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఉన్న పాకిస్థానీలు నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నగరంలోని స్పెషల్ బ్రాంచ్‌లో (ఎస్బీ) రిజస్టర్ చేసుకున్న పాకిస్థానీల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ వీసాలపై భారత్‌కు వచ్చే విదేశీయులు ఇక్కడ కచి్చతంగా రిజిస్టర్ చేయించుకోవాలి. వారి వీసా వివరాలతో పాటు ఎక్కడ ఉంటున్నారు? ఎవరితో ఉంటున్నారు? ఫోన్ నంబర్? చిరునామా? తదితరాలను అందించాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని దేశాలకు చెందిన వాళ్లూ శంషాబాద్‌లోని మామిడిపల్లిలో ఉన్న ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) వద్ద రిజిస్టర్ చేసుకుంటారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జాతీయులు మా త్రం ఎస్బీ అధీనంలోని పాక్, బంగ్లా బ్రాంచ్‌ల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ కార్యాలయం పాతబస్తీలోని పురానీ హవేలీలో ఉంది. ఈ విభాగంలో రిజిస్టరై ఉన్న పాకిస్థానీల సంఖ్య 208గా ఉంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్లు 156 మంది ఉన్నారు. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న పాకిస్థానీలతో పాటు వారి రక్త సంబం«దీకులకు ఈ వీసాలు జారీ చేస్తుంటారు. మరో 13 మంది షార్ట్‌టర్మ్ వీసా కలిగి ఉన్నారు. విజిట్, బిజినెస్ తదితర కేటగిరీలకు చెందిన వీసాలు షార్ట్‌టర్మ్ కిందికి వస్తా యి. మిగిలినవన్నీ మెడికల్ వీసాలని అధికారులు చెబుతున్నారు. 1992 నుంచి సార్క్ వీసాలు అమలవుతున్నాయి. సార్క్ సభ్యత్వ దేశాలకు చెందిన ప్రముఖులు, ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు, పార్లమెంటేరియన్లు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, క్రీడాకారులు సహా 24 రకాల వారికి ప్రత్యేక మినహాయింపులతో కూడిన వీసాలు ఇస్తుంటారు. ప్రస్తుతం సిటీలో ఉన్న పాకిస్థానీల్లో సార్క్ వీసా కలిగిన వాళ్లు లేరు. నగరంలో రిజిస్టర్ అయిన ఈ 208 మంది వివరాలను ఎస్బీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ వదలాల్సిందిగా సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. కేంద్రం విధించిన గడువు ముగిసిన తర్వాత వీరిలో ఎందరు ఎగ్జిట్ అయ్యారు అనేది ఇమ్మిగ్రేషన్ నుంచి తీసుకోనున్నారు. అప్పటి కీ ఎవరైనా మిగిలిన ఉన్నట్లు తేలితే వారిని పట్టుకుని బలవంతంగా తిప్పి పంపుతారని ఓ అధికారి తెలిపారు. -
హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు..
హైదరాబాద్: నెల రోజుల నుండి నిఘా ఉంచి రూ.74.56 లక్షల హవాలా డబ్బును రాయదుర్గం పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. ఇద్దరు యువకులు యాక్టివాపై డబ్బు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్లో ఎస్ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వాహనంపై ఒక బ్యాగ్ కనిపించింది. తనిఖీ చేయగా ఆ బ్యాగ్‌లో రూ. 74,56,200 నగదు లభించింది. కరీంనగర్‌కు చెందిన బి.సాయికృష్ణ బీటెక్ పూర్తి చేసి చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గంలో ఉండేరవితో కలిసి బేగంపేట్‌లోని సురేందర్ అగర్వాల్ నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు. రవి డ్రైవింగ్ చేస్తుండగా బ్యాగ్‌తో సాయి కృష్ణ వెనకాల కూర్చున్నాడు. మియాపూర్‌కు వెళ్లి ఫోన్ చేస్తే ఎవరికి ఇచ్చేది చెప్తారని పోలీసులకు తెలిపారు. స్వాధీనం చేసుకొని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించామన్నారు. కొంత కాలంగా బ్లాక్ మనీ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు పట్టుకునేందుకు ప్రయతి్నంచినా పట్టుబడలేదు. ఎట్టకేలకు భారీ నగదును స్వా«దీనం చేసుకున్నారు. -
సూరీడు సుర్రు.. మీటర్ గిర్రు!
సాక్షి, హైదరాబాద్: భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలకే సుర్రుమంటున్నాడు. ఎండలు మండిపోతుండటంతో గురువారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. కొద్ది రోజులుగా నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 2024 మే 6న రికార్డు స్థాయిలో 4,352 మెగావాట్ల డిమాండ్ (90.68 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా.. తాజాగా గురువారం 4,170 మెగావాట్లకు చేరింది. ఇది ఇలాగే కొనసాగితే మే ఒకటి నాటికి 4,500 మెగావాట్లకుపైగా డిమాండ్ వచ్చే అవకాశం లేకపోలేదని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఆన్‌లోనే ఏసీలు, కూలర్లు గతంతో పోలిస్తే ప్రస్తుతం నగరవాసుల కొనుగోలు శక్తి పెరిగింది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలోనే కన్పించే ఏసీలు ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి నివాసాల్లోనూ అనివార్యమయ్యాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం అనేక మంది ఏసీలు, కూలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తయారీ కంపెనీలతో పాటు వివిధ ప్రైవేటు బ్యాంకులు జీరో పర్సంటేజీ లోన్లు మంజూరు చేస్తుండటంతో ఆర్థికంగా ఉన్నవారే కాదు.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఎల్రక్టానిక్ యంత్రాలు సాధారణమయ్యాయి. ఫలితంగా గత కొద్ది రోజుల నుంచి నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. -
టూర్.. డర్!
సాక్షి, హైదరాబాద్: కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి పర్యాటక రంగంపై పిడుగుపాటుగా మారింది. నగర నుంచి కాశ్మీర్‌కు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. గత రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో బుకింగ్‌లు రద్దయినట్లు నగరానికి చెందిన పలు ట్రావెల్స్ సంస్థలు వెల్లడించాయి. ఇటీవల పిల్లలకు వేసవి సెలవులు ప్రకటించడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నగర వా సులు సన్నద్ధమవుతున్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఊటీ, మనాలి, కొడైకెనాల్, సిమ్లా తదితర ప్రాంతాలతో పాటు ఎక్కువ మంది కశ్మీర్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అనూహ్యంగా పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి నేపథ్యంలో పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. మూడేళ్లుగా పెరిగిన టూర్లు.. కోవిడ్ అనంతరం పర్యాటకరంగం అనూహ్యంగా విస్తరించింది. హైదరాబాద్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. దక్షిణమధ్య రైల్వే ఆధ్యాత్మిక టూర్ల కోసం ప్రత్యేకంగా భారత్‌గౌరవ్ రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరిగింది. సుమారు 70 నగరాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో గత మూడేళ్లుగా టూరిస్టులు పెరిగారు. ఏటా లక్షలాది మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. జైపూర్, ఉదయ్‌పూర్ వంటి చారిత్రక నగరాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. 10 వేల మందికిపైగా.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యాటకుల రాకపోకలు విస్తరించాయి. ‘మే మొదటి వారంలోనే హైదరాబాద్ నుంచి కశీŠమ్ర్కు వెళ్లేందుకు 5 గ్రూపులు బుక్ అయ్యాయి. ఇప్పుడు వాళ్లంతా తమ టూర్లను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అంతా తలకిందులైంది’ అని హిమాయత్‌నగర్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్ పవన్ విచారం వ్యక్తం చేశారు. కాశ్మీర్ ఉగ్ర ఘటన నేపథ్యంలో ఈ రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కశ్మీర్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న సుమారు 10 వేల మందికి పైగా పర్యాటకులు టూర్లను రద్దు చేసుకున్నట్లు ట్రావెల్స్ సంస్థలు అంచనా వేశాయి.అమర్నాథ్ యాత్రపై ప్రభావం.. మరోవైపు జూలైలో జరగనున్న అమర్నాథ్యాత్రపైనా పహల్గాం దాడి ఘటన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం తమ వద్ద నమోదు చేసుకున్న 70 బుకింగ్‌లు నిలిచిపోయినట్లు అమీర్‌పేట్‌కు చెందిన ఓ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఆసక్తి చూపిన ఎంతోమంది ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగి జూలై వరకు సాధారణ పరిస్థితులు నెలకొంటే మార్పు రావచ్చు. కాశ్మీర్ పర్యటనలను రద్దు చేసుకున్న వాళ్లు చాలామంది సిమ్లా, ఉత్తరాఖండ్, ఊటీ, మనాలీ వంటి ప్రాంతాలను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంటున్నారు. -
Hyderabad MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం అందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్‌కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు వచ్చాయి. దీంతో, ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న 25 ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇక, ఎంఐఎంకి చెందిన 49, కాంగ్రెస్‌కి చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఓటు వేయలేదు. దీంతో, ఓటమి ఎదురైంది. ఇక, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకునప్పటికీ అలాంటి ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. మరోవైపు, ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓట్లు వేయవద్దని అని చెప్తారు.. మరి మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది. ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పని చేస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అనేది అర్థమవుతుంది. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి.ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి, అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వారు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఓటింగ్‌కు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సంఖ్య పరంగా మేము ఓడినా.. నైతికంగా నేను గెలిచాను. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తొత్తులుగా మారాయి. ఎంఐఎంకు కాంగ్రెస్ డైరెక్ట్‌గా మద్దతు ఇస్తే.. బీఆర్ఎస్ ఓటింగ్‌కు రాకుండా దోహదపడింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. కౌంటింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు జీహెచ్ఎంసీ వద్ద మోహరించాయి. -
ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
హైదరాబాద్,సాక్షి: జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుంది.కాశ్మీర్ ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరేలా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు ,ఎమ్మెల్యేలు , భారత్ సమ్మిట్‌కు హాజరయ్యే పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు. -
క్వాలిటీ కంట్రోల్ ఫెయిల్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో నాణ్యత పర్యవేక్షణ కొరవడటంతోనే 7వ బ్లాక్ కుంగిపోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ తేల్చింది. బరాజ్ పునాదుల(ర్యాఫ్ట్) కింద సికెంట్ పైల్స్‌ను నీళ్లను నిలువరించేలా నిర్మించడంలో విఫలమైనట్టు నిర్ధారించింది. దీంతో ఇసుక భారీగా కొట్టుకుపోయి పునాదుల కింద పెద్దపరిమాణంలో బుంగలు ఏర్పడ్డాయని నిర్ధారించింది. బరాజ్‌కి ఎగువన 20–21 పియర్ల మధ్య ఏర్పడిన భారీ గుంత, 17వ పియర్కి దిగువన ఏర్పడిన గుంతలే దీనికి సంకేతమని స్పష్టం చేసింది. సికెంట్ పైల్స్(కటాఫ్ వాల్స్) విఫలం కావడంతోనే మేడిగడ్డ బరాజ్ కుంగిందని పేర్కొంది. బరాజ్‌లో ఇలాంటి బుంగలు మరిన్ని ఉండటానికి ఆస్కారముందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవచ్చని హెచ్చరించింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల సికెంట్ పైల్స్ నిర్మాణంలో సైతం ఇదే తరహా వైఫల్యాలున్నట్టు గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యాలపై సుదీర్ఘ అధ్యయనం అనంతరం కమిటీ రూపొందించిన తుది నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మేడిగడ్డ బరాజ్ డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించాక ఎన్నో లోపాలను గుర్తించినట్టు కమిటీ తెలిపింది. నిర్మాణానికి ముందు నిర్వహించిన సైట్ పరిశోధనలు, మోడల్ స్టడీస్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అండ్ జియోటెక్నికల్ డిజైన్, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, నిర్వహణ, పర్యవేక్షణతోపాటు బరాజ్ రక్షణకి సంబంధించిన అంశాల్లో లోపాలున్నట్టు నిర్ధారించింది. రెండు నెలల కిందే కేంద్రానికి నివేదిక నిర్మాణ లోపాలకు తోడుగా బరాజ్ కింద బుంగలు ఏర్పడి ఇసుక కొట్టుకుపోవడం, దిగువ ప్రాంతంలోని అప్రాన్ సీసీ బ్లాకులు కొట్టుకుపోవడంతో 7వ బ్లాక్ కుంగిపోయి బరాజ్ పూర్తిగా నిరుపయోగంగా మారిందని కమిటీ స్పష్టం చేసింది. బరాజ్‌లోని ఇతర బ్లాకుల్లో సైతం ఇలాంటి లోపాలే ఉండవచ్చని అంచనా వేసింది. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణంలో లోపాలుండటం, సమస్యలు ఉత్పన్నం కావడంతో అవి కూడా దుర్బల స్థితిలో ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మూడు బరాజ్‌లపై అన్ని కోణాల్లో సమగ్ర అధ్యయనం జరపాలని సిఫారసు చేసింది. బరాజ్‌లపై జరిపే పరీక్షలు, పరిశోధనల ఆధారంగా వాటి పునరుద్ధరణకు ప్రణాళికలు, డిజైన్లను రూపొందించి అమలు చేయాలని కోరింది. ఎన్డీఎస్ఏ తుది నివేదికను రెండు నెలల కిందే కేంద్రానికి సమర్పించగా, గురువారం మీడియాకి అందింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. –ఎలాంటి సైట్ ఇన్వెస్టిగేషన్లు నిర్వహించకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లోకేషన్లు మార్చాలని హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. –మేడిగడ్డ బరాజ్ డిజైన్ల తయారీ, నిర్మాణం కోసం నిర్వహించిన జియోటెక్నికల్ పరీక్షలు.. పునాదుల కింద భూగర్భంలోని వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఏ మాత్రం సరిపోవు. – బరాజ్ 7వ బ్లాక్ కుంగడానికి కారణాలను విశ్లేíÙంచడానికి 22 బోర్ రంధ్రాలు చేసి జియోటెక్నికల్ పరీక్షలను నిర్వహించాలని ఎన్డీఎస్ఏ ప్రతిపాదించగా, కేవలం 9 రంధ్రాలు చేసి పరీక్షలు చేశారు. దీంతో కమిటీకి అవసరమైన సమాచారం ఈ పరీక్షల ద్వారా లభించలేదు. –ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మూడు బరాజ్‌లను సందర్శించి చూడగా మూడింటిలోనూ గణనీయమైన రీతిలో నిర్మాణ లోపాలు కనిపించాయి. –అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి సీపేజీ జరిగింది. –బరాజ్‌లకి మరింత నష్టం జరగకుండా గత వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలతోపాటు వైఫల్యాలను నిర్ధారించడానికి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని కమిటీ సిఫారసు చేయగా, వాటిని తగిన రీతిలో చేయడంలో నీటిపారుదల శాఖ విఫలమైంది. –అధ్యయన పరీక్షలకు ముందే మేడిగడ్డ బరాజ్ పునాదులకు బోర్‌హోల్ రంధ్రాలు చేసి గ్రౌటింగ్‌తో బుంగలను మూసివేయడంతో వైఫల్యానికి కారణాలు తెలిపే సాక్ష్యాధారాలకు నష్టం జరిగింది. మేడిగడ్డ 7వ బ్లాక్ తొలగించాలి మేడిగడ్డ బరాజ్‌లో కుంగిపోయిన 7వ బ్లాక్‌ను పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా తొలగించాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. సాధ్యం కాని పక్షంలో 7వ బ్లాకు స్థిరంగా ఉండేలా పటిష్టపరచాలని సూచించింది. రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా పక్కన ఉన్న ఇతర బ్లాకులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పింది. -
ఆరోగ్య బీమా అంతంతే..
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య బీమా తీసుకునే విషయంలో భారతీయులు వెనకడుగు వేస్తున్నారు. ఆరోగ్య బీమా గురించి 83 శాతం మందికి అవగాహన ఉన్నా.. 23 శాతం మంది మాత్రమే హెల్త్ పాలసీలు తీసుకున్నారు. ఆరోగ్య బీమా లేని భారతీయుల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది అనూహ్యంగా ఎదురయ్యే జీవన, ఆరోగ్య సంక్షోభాల వాస్తవ ఖర్చులపై ముందుచూపు లేక ఇబ్బందులు పడుతున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ వంటివి లేనివారిలో 87 శాతం మంది ఆర్థికంగా పడబోయే భారాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. 13 శాతం మంది మాత్రమే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ అవసరాలను గుర్తిస్తున్నట్లు ‘హౌ ఇండియా బైస్ ఇన్సూరెన్స్ 2.0’పేరిట ‘పాలసీ బజార్ డాట్‌కామ్’సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు» భారతీయులు ఆరోగ్య సంరక్షణ వ్యయాలు,ఆకస్మిక ఖర్చులను భరించేందుకు సిద్ధంగా లేరు. » దేశ జనాభాలో ఆరోగ్య బీమా లేనివారే అధికం. పాలసీదారుల్లోనూ సుమారు 75 శాతం మంది రూ.10 లక్షల కంటే తక్కువ కవరేజీ ఉన్నవారే. 48 శాతం మంది రూ.5 లక్షలు, అంతకంటే తక్కువ కవరేజీతో సరిపెట్టుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ఇక్కడ 66 శాతం పాలసీదారులు రూ 5 లక్షల అంతకంటే తక్కువ కవరేజీ కలిగి ఉన్నారు. » పాలసీదారుల్లో 51 శాతం మంది క్యాన్సర్, కిడ్నీ మారి్పడి, గుండె జబ్బుల చికిత్సల ఖర్చు రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటుందనిభావిస్తున్నారు. 47.6 శాతం భారతీయులకు టర్మ్ ఇన్సూరెన్స్ప్రయోజనాల గురించి తెలియదు. » ఇప్పటికీ బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా సంబంధిత పొదుపు పథకాలు, రియల్ ఎస్టేట్ వంటి సంప్రదాయ పెట్టుబడులు ఆధిపత్యం వహిస్తున్నాయి. » బీమా తీసుకోనివారిలో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక లేకపోవడం ఆందోళనకరంగా మారింది. » చాలామంది తమ కుటుంబ అవసరాలను అంచనా వేసేటప్పుడు పిల్లల విద్య, వివాహం, రుణ బాధ్యతలు, జీవిత భాగస్వామి పదవీ విరమణ, ఆకస్మిక వైద్య ఖర్చుల వంటివాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు.అవగాహన పెంచుతున్నాంఈ నివేదికఆధారంగా ప్రజల్లో ఆరోగ్య బీమాపైఅవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసర చికిత్సలతో ఆర్థిక సంక్షోభం ఎదురైనపుడు ఆస్తులను అమ్మటం, అప్పు చేయటానికి బదులు ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకోవటంమంచిది. అందరికీ ఆర్థిక భద్రత ఏర్పడేలా పాలసీలు, ఇతరత్రా సలహాల ద్వారా కష్టమర్లకు ప్రయోజనం కలిగేలా చూడాల్సిఉంది. – సర్బ్వీర్ సింగ్,జాయింట్ గ్రూప్ సీఈఓ, పీబీ ఫిన్‌టెక్. -
మండుతున్న ఉష్ణోగ్రతలకు జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మే నాటికి 46–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సింగరేణి కాలరీస్‌తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వేసవికి అనుగుణంగా నడుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత.. తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల సమీపంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వడగాడ్పులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సింగరేణి కార్మికులతోపాటు రోజువారీ కూలీలు, రైతులు, చిరువ్యాపారులు, నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరగడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తత అవసరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరైతే గొడుగు, టోపీ, సన్‌్రస్కీన్ లేదా తడి గుడ్డ ఉపయోగించడం ద్వారా ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందాలని చెబుతున్నారు. టూవీలర్లపై వెళ్లే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వదులైన, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలంటున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ... వేసవిలో తాగిన నీరు తాగినట్టే చెమట రూపంలో వెళ్లిçపోతుంది. రోజుకు 3–4 లీటర్ల నీరు తాగడం శ్రేయస్కరం. దాహం లేకపోయినా గంటకోసారి నీటిని తాగుతూ ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఓఆర్ఎస్, ఉప్పు–చక్కెర కలిపిన నీరు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. కూల్‌డ్రింక్స్, బీర్లు, చికెన్, మాంసం తినడం వేసవిలో వేడిని ఇంకా పెంచుతాయి. రోజుకు 2–3 సార్లు కొబ్బరినీరు తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతౌల్యంగా ఉంటాయి. కాఫీ, టీ, ఆల్కహాల్ శరీరంలో నీటిని తగ్గిస్తాయి కాబట్టి వాటి బదులు హెర్బల్ టీ, తాజా పండ్ల రసాలు తాగడం మేలు. ఆహారం ముఖ్యం తేలికైన, నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, కీర దోస వంటివి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అధిక ఉప్పు, కారం, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఉడకబెట్టిన ఆహారం, సూప్‌లు, సలాడ్లు తీసుకోవాలి. గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వాళ్లు నీటిని అధికంగా సేవిస్తూ ఎండల్లో తిరగడం తగ్గించాల్సి ఉంటుంది.జాగ్రత్తలతోనే వేసవి నుంచి రక్షణ వేసవిలో శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీర ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు దాటినప్పుడు మెదడు వ్యాధులు, అవయవ వైఫల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను శరీరం బ్యాలెన్స్ చేసుకొనేలా వ్యవహరించాలి. ఆహార నియమాలు పాటించాలి. అధిక ఎక్సర్సైజ్లు తగ్గించాలి. – డాక్టర్ కిరణ్ మాదాల, ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఉస్మానియా కళాశాల -
శిక్షణ లేదు.. ఉద్యోగాల్లేవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధి హామీ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) త్రిశంకుస్వర్గంలో వేలాడుతోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఈ పథకం అమలు గత కొంతకాలంగా దాదాపు నిలిచిపోయింది. వివిధ రంగాలు, విభాగాల్లో నైపుణ్యాల శిక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా..ఆచరణలో అంతంత మాత్రంగానే ఉంటోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈజీఎంఎం కింద గ్రామీణ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారికి వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంది. ఆరోగ్యం, రిటైల్, ఆతిథ్య, సాఫ్ట్వేర్, యానిమేషన్, ఫార్మసీ, ఫ్యాషన్, తదితర రంగాల్లో ఏజెన్సీల ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఆయా రంగాల్లో నైపుణ్యాలున్న సంస్థలు డిజైన్ చేసిన కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. కాగా ప్రస్తుతం ఈ లక్ష్యాల సాధన తూతూ మంత్రంగానే మిగిలిపోయిందనే విమర్శలున్నాయి. నిధుల లేమి కారణంగా ఈ పథకం మొక్కుబడిగా సాగుతోంది.కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకం కావడంతో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) కింద కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. కేంద్రం నుంచి క్రమం తప్పకుండా నిధులు వస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా సరిగ్గా విడుదల కాకపోవడంతో పథకం కుంటి నడక నడుస్తోంది. 2019 నుంచి సమస్యే.. ఈ స్కీమ్ కోసం రాష్ట్ర వాటా నిధులు 2019 నుంచే సక్రమంగా విడుదల కావడం లేదని తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం ఓసారి రాష్ట్ర వాటా విడుదల కాకపోవడంతో ఈ పథకం ఆగిపోయింది. ఈ కారణంగా కేంద్రం నుంచి ఆ తర్వాత రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అయితే ఆ తర్వాత కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తులు పంపించడంతో నిధులు విడుదల పునరుద్ధరించారు. అయితే రాష్ట్రవాటా కింద ఏటా రూ.144 కోట్లు సక్రమంగా చెల్లించకపోవడంతో సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలల్లోనూ ఈ స్కీమ్ కింద నిధులు విడుదల కాలేదని అంటున్నారు. డీడీయూజీకేవై 2.0కు కేంద్రం సన్నాహాలు రాష్ట్రంలో ప్రస్తుతం డీడీయూజీకేవై 1.0 స్కీమ్ అమలవుతుండగా (2015 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ దాకా)...దానిని ఈ ఏప్రిల్ దాకా పొడిగించినట్టు అధికారవర్గాల సమాచారం. కాగా వచ్చే జూలై, ఆగస్టు తర్వాత డీడీయూజీకేవై 2.0 స్కీమ్ అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లక్ష్యాలు, ఇతర వివరాలను రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం అందజేసింది. రాష్ట్ర వాటా విడుదల కాని పక్షంలో..తెలంగాణలో డీడీయూజీకేవై 2.0 పథకం అమలు, తద్వారా ఈజీఎంఎం నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోవచ్చునని అంటున్నారు. -
ప్రపంచానికి మోడల్‌గా తెలంగాణను చూపుతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్‌గా చూపేందుకు రెండు రోజుల భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమంగా నిర్వహించనుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా శుక్ర, శనివారాల్లో సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి భట్టి గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించేందుకు సుమారు 100 దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్ మొత్తంగా 450 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్ ఎటువైపు మొగ్గు చూపకుండా అలీన విధానాన్ని ఎంచుకొని ముందుకెళ్లిందని భట్టి గుర్తుచేశారు. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిలబడిందని.. అలీన విధానాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లాయని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల ప్రతినిధులను వివిధ అంశాలపై చర్చించేందుకు ఆహ్వానించిందని వివరించారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, వనరులు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించామని తెలిపారు. ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు రానుండటం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. అనంతరం భారత్ సమ్మిట్ ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, డిప్యూటి సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు సమీక్షించారు. డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో.. భారత జాతీయ కాంగ్రెస్ 140వ వార్షికోత్సవం, అలీనోద్యమానికి ఆధారమైన 1955 నాటి బండుంగ్ సదస్సు జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘న్యాయ్’ఆలోచన ఆధారంగా ఇది రూపొందింది. భారతీయ విలువలతో కూడిన న్యాయమైన, ఉదారవాద ప్రపంచ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తొలిరోజు సదస్సులో స్వాగతోపన్యాసం చేయనుండగా రాహుల్ గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం ‘హైదరాబాద్ డిక్లరేషన్’ను ప్రకటిస్తారు. సదస్సు ముగింపు సమావేశంలో ప్రియాంక గాంధీ, కె.సి.వేణుగోపాల్ ప్రసంగించనున్నారు. -
ఐఐటీల్లో సీట్లు పెరుగుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలుగా పేరున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఈసారి సీట్లు పెరగబోతున్నాయి. వీటితోపాటు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (ఎన్ఐటీ)ల్లో కూడా సీట్లు పెరిగే అవకాశం కన్పిస్తోంది. సీట్ల పెంపుపై ఇప్పటికే ఐఐటీలు, ఎన్ఐటీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. డిమాండ్, మారుతున్న అవసరాలకు అనుగుణంగా సీట్ల పెంపు అనివార్యమని పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోందని, ఈ పోటీని తట్టుకోవాలంటే కొన్ని కొత్త కోర్సుల అవసరం ఉందన్నాయి. ఇప్పటికే ఐఐటీలు, ఎన్ఐటీలు అవసరమైన మౌలిక వసతుల దిశగా అడుగులేస్తున్నాయి. కాబట్టి అదనపు సీట్లు అవసరమని కేంద్రాన్ని కోరాయి. ఐఐటీల్లో గరిష్టంగా 500 వరకూ సీట్లు పెంచే ఆలోచన ఉన్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఇంకో 900 సీట్లు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. సూత్రప్రాయంగా కేంద్రం ఆమోదం తెలిపిందని, దీనిపై అధికారిక అనుమతి రావాల్సి ఉందని ఓ సీనియర్ ఐఐటీ అధికారి తెలిపారు.జోసా కౌన్సెలింగ్ నాటికి..మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 2.50 లక్షల మందిని ఎంపిక చేశారు. ఇది పూర్తయి, ఫలితాలు వెల్లడించిన వెంటనే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ మొదలుపెడుతుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో (కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థ) సీట్లను భర్తీ చేస్తారు. ఇది మొదలయ్యే నాటికి కొత్త సీట్లపై స్పష్టత వచ్చే వీలుంది. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ప్రస్తుతం 17,740 బీటెక్ సీట్లున్నాయి. గత ఏడాది కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడంతో 355 సీట్లు పెరిగాయి. ఐఐటీ తిరుపతిలో 244 సీట్లుంటే, మరో పది పెంచారు. వరంగల్ ఎన్ఐటీలో 989గా ఉన్న సీట్లను 1049కు పెంచారు. కొత్తగా 60 సీట్లతో సీఎస్ఈ (ఏఐ అండ్ డేటా సైన్స్) కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 40 నుంచి 110 సీట్లకు పెంచారు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీఎస్ఈలో సీట్లు పెంచారు. ఇక్కడే గత ఏడాది అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (మెటీరియల్స్ ఇంజనీరింగ్) బ్రాంచీని 60 సీట్లతో కొత్తగా ప్రవేశపెట్టారు. ఇందులో ఈసారి మరికొన్ని సీట్లు పెరిగే వీలుంది. ఐఐటీ–గాంధీనగర్, ఐఐటీ–బాంబే, ధార్వాడ్, భిలాయ్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పట్నా, గువాహటిలో సీట్ల పెంపు ప్రతిపాదనలు పంపారు. -
బీటీ పత్తి.. పురుగుమందు ఎడాపెడా
సాక్షి, స్పెషల్ డెస్క్ : జన్యుమార్పిడి (జీఎం) పంటలు మన దేశ సాగులోకి వచ్చిన గత ముప్పయ్యేళ్లలో ముందు ఆశించినట్టు, రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గకపోగా పెరిగిందా? అంటే అవుననే చెబుతోంది ఓ తాజా అధ్యయనం. అమెరికాలోని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం (ఐసీఏసీ), వాషింగ్టన్‌లోని వర్డ్యూ యూనివర్సిటీ, లీ యూనివర్సిటీ పరిశోధకులు ఉమ్మడిగా ఈ అధ్యయనం చేశారు. మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95% బీటీ పత్తి విత్తనాలనే ఇప్పుడు రైతులు వాడుతున్న సంగతి తెలిసిందే. బీటీ పత్తి మొక్క విషపూరితంగా ఉంటుంది కాబట్టి.. పురుగు ఆశించిన వెంటనే చనిపోతుందని, తద్వారా పురుగు మందులు వాడాల్సిన అవసరమే తగ్గిపోతుందని చెబుతూ వచ్చారు. అయితే, వాస్తవానికి ఆచరణలో అందుకు భిన్నంగా జరిగిందని ‘జర్నల్ ఆఫ్ అగ్రేరియన్ చేంజ్’లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం తేల్చింది. భారతీయ రైతులు 1990 దశకంలో నాన్‌బీటీ పత్తి రకాలను సాగు చేసినప్పుడు వాడినప్పటికన్నా బీటీ పత్తి వచ్చిన తర్వాత ఎక్కువగా విష రసాయనాలను వాడాల్సి వస్తోందని గత ముప్పయేళ్ల గణాంకాలను విశ్లేíÙంచిన తర్వాత పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. పెరిగిన ఖర్చులు బీటీ పత్తిని 2002లో దేశంలోకి ప్రవేశపెట్టిన తొలిదశలో పురుగుమందుల వాడకం, తద్వారా సాగు ఖర్చు తగ్గింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో సంప్రదాయ పత్తి వంగడాలను వదిలి రైతుల్లో 95% మంది బీటీ పత్తి వైపు మళ్లారు. అయితే, బీటీపత్తిపై పెట్టుకున్న ఆశలు కొద్ది ఏళ్లలోనే తారుమారయ్యాయి. పురుగులు బీటీ పత్తికి అలవాటుపడిపోవటంతో 2010 నాటికే పురుగుమందుల వాడకం మళ్లీ పెరిగింది. ‘2018 నాటికి భారతీయ పత్తి రైతులు బీటీకి ముందుకన్నా 37% ఎక్కువగా పురుగు మందులపై ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’అని అధ్యయనం తెలిపింది. ఎక్కువ మంది బీటీ పత్తిని ఏకపంటగా విస్తారంగా సాగు చేస్తుండటంతో త్వరలోనే పురుగులు బీటీ విషానికి తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి. పురుగు మందుల వాడకం ఉధృతమైంది. ఈ అధ్యయనంలో భాగస్వాములైన సంస్థల్లో వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం (ఐసీఏసీ) ఒకటి. దీని ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ కేశవ్ క్రాంతి తెలుగు వ్యక్తి కావటం విశేషం. ఆయన గతంలో నాగపూర్‌లోని ఐసీఏఆర్–కేంద్రీయ పత్తి పరిశోధన కేంద్రం (సీఐసీఆర్) సంచాలకుడిగా పనిచేశారు. రసం పీల్చే పురుగుల విజృంభణ కాయ తొలిచే పురుగును నియంత్రించే ప్రధాన లక్ష్యంతో బీటీ పత్తి వంగడాలను ప్రవేశపెట్టారు. అయితే, ఆ తర్వాత ఈ పురుగుల ఉధృతి తగ్గినా, అప్పటి వరకు స్వల్పంగా ఉన్న రసం పీల్చే పురుగుల బెడద గతమెన్నడూ ఎరుగనంత తీవ్రమైంది. 2006 నాటికి బీటీ పత్తి సాగు చేయటం దేశవ్యాప్తమైంది. తదనంతర కాలంలో పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఏటేటా పెరుగుతూ వచ్చింది. 2018 నాటికే భారతీయ పత్తి రైతులపై పురుగుమందుల పిచికారీ ఖర్చు భారీగా పెరిగిందని ఈ అధ్యయనం పేర్కొంది. అమెరికాలో ఏకు మేకైన కలుపు అమెరికాలో రైతులు గ్లైఫొసేట్ వంటి కలుపు మందులను చల్లినా తట్టుకొని నిలిచేలా జన్యుమార్పిడి చేసిన పంటల (హెచ్‌టీ క్రాప్స్)ను విస్తారంగా సాగు చేస్తున్నారు. సోయా, మొక్కజొన్న తదితర పంటలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాలో హెచ్‌టీ. సోయా విస్తీర్ణం 1994 లో 92 లక్షల ఎకరాలుండగా, 2018 నాటికి 11.3 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఆ మేరకు గ్లైఫొసేట్ వినియోగం పెరిగింది. గ్లైఫొసేట్ పనితీరు సంక్లిష్ట పద్ధతిలో ఉంటుంది కాబట్టి దీనికి కలుపు మొక్కలు అలవాటు పడి, చనిపోకుండా ఎదురు తిరగవని గ్లైఫొసేట్ తయారు చేసిన కంపెనీ చెబుతూ వచ్చింది. అయితే, 1998 నాటికే డజన్ల కొద్దీ కలుపు మొక్కలు గ్లైఫొసేట్ చల్లినా చనిపోని పరిస్థితి ఏర్పడింది. దక్షిణ అమెరికాలో జన్యుమారి్పడి పంటలకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ రైతులు హెచ్‌టీ సోయా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. కెనడాలోనూ హెచ్‌టీ మొక్కజొన్న, షుగర్ బీట్, ఆవ పంటల సాగు విస్తీర్ణం తామరతంపరగా విస్తరించింది. ‘ఈ (జన్యుమార్పిడి పంటల) సాంకేతికత చెప్పినట్టు రసాయనిక పురుగుమందుల వినియోగం తొలుత తగ్గినా, తదనంతరం అంతకుముందుకన్నా పెరిగిపోయింది. ఏదో ఒకే రకం పంటనే పొలం అంతటా సాగు చేసే పారిశ్రామిక సాంద్ర వ్యవసాయ పద్ధతి వల్ల రసాయనిక పురుగుమందులతో పాటు ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. శక్తివంతమైన రసాయనిక ఎరువులు, పురుగుమందుల కంపెనీల ఒత్తిళ్ల ప్రభావం వల్ల ఆయా దేశాల ప్రభుత్వాలు శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంపొందించే జన్యుమార్పిడి పంటలను గట్టిగా ప్రోత్సహిస్తున్నాయి..’అని ఈ అధ్యయనం విశ్లేషించింది. భారత్‌లోనూ గ్లైఫొసేట్‌ను తట్టుకునే హెచ్‌టీ బీటీ పత్తి వంగడాన్ని అనేక లక్షల ఎకరాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, గత కొన్ని సంవత్సరాలుగా అనధికారికంగా సాగు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగిన గ్లైఫొసేట్ వాడకంతెలంగాణ, ఏపీలోకూడా హెర్బిసైడ్ టాలరెంట్ పత్తి విత్తనాల ఉపయోగం వల్ల గ్లైఫొసేట్ వాడకం పెరిగింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కలు పు మందును రెండు, మూడు సంవత్సరాలు 60 రోజుల పాటు నిషేధించాయి. తెలంగాణలో పత్తి విస్తీర్ణం పెరిగింది. గులాబీ పురుగులు మరింత ఉధృతం కావటంతో ప్రమాదకర రసాయనాల వాడకం ఎక్కువైంది. సాగు ఖర్చు పెరిగింది. – డా. దొంతి నరసింహారెడ్డి, విధాన విశ్లేషకుడు, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా, హైదరాబాద్ -
రుణం.. కాదిక సులభం!
డబ్బు అవసరం ఉంది.. సులభంగా వ్యక్తిగత రుణం తీసుకోవచ్చనుకుంటే కుదరదిక. రుణాల మంజూరులో ఆర్థిక సంస్థలు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాపారాన్ని, వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడానికి గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు ఇచ్చిన సంస్థలు రూట్ మార్చాయి. మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడంతో తాము ఇచి్చన రుణాలు నిరర్ధక ఆస్తులుగా (ఎన్పీఏ) మారకూడదని జాగ్రత్త పడుతున్నాయి. ఎన్పీఏల రిస్క్ నుంచి బయటపడేందుకు క్రెడిట్ స్కోర్‌ను నిక్కచ్చిగా పాటిస్తున్నాయి. ముప్పు తక్కువగా ఉన్న కస్టమర్లకే లోన్స్ మంజూరు చేస్తున్నాయి. మరికొన్ని రుణ సంస్థలు ఒక మెట్టు దిగినప్పటికీ వాహనాలు, కన్యూమర్ డ్యూరబుల్స్ విషయంలో తక్కువ మొత్తం మంజూరు చేయడం లేదా డౌన్‌పేమెంట్ అధికంగా వసూలు చేయడం లాంటివి చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్కంపెనీల సేఫ్ గేమ్క్రెడిట్ హిస్టరీ లేనివారు.. అంటే తొలిసారిగా రుణం తీసుకోవాలనుకునే వారిని కంపెనీలు అంత సులభంగా కనికరించడం లేదు. న్యూ టు క్రెడిట్ (ఎన్టీసీ) విభాగంలో రెండేళ్లలో లోన్ పొందిన కస్టమర్ల సంఖ్య 54.5% తగ్గిందంటే కంపెనీల సేఫ్ గేమ్‌ను అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 730లోపు ఉన్న వినియోగదార్లకు జారీ చేస్తున్న రుణాల సంఖ్య సైతం క్షీణించింది. రెండేళ్లలో వీరి వాటా 42 నుంచి 36 శాతానికి వచి్చంది. అదే సమయంలో 731 మించి క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లు 58 నుంచి 64 శాతానికి చేరారు. అంతేకాదు ఏడాదిలో సగటు వ్యక్తిగత రుణ మొత్తాన్ని 2024 డిసెంబర్ నాటికి 20% తగ్గించి రూ.44,000కు చేర్చడం పరిస్థితికి అద్దం పడుతోంది. 2023 డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.55,000 ఉండేది. చిన్న రుణాల్లో ఫిన్‌టెక్ హవా భారత్‌లో 2024 డిసెంబర్ నాటికి ఫిన్‌టెక్ కంపెనీలు మంజూరు చేసిన రుణాల మొత్తం రూ.1,30,000 కోట్లు. దేశంలోని మొత్తం రుణ పరిశ్రమలో ఫిన్‌టెక్ సంస్థల వాటా కేవలం 1.03 శాతమే. అయినా ఈ కంపెనీలు జారీ చేసిన రుణాలు ఏడాదిలో 32% వృద్ధిని నమోదు చేశాయి. రూ.50,000లోపు విలువ చేసే వ్యక్తిగత రుణాల్లో ఖాతాల సంఖ్య పరంగా ఫిన్‌టెక్ కంపెనీల వాటా ఏకంగా 89 శాతం ఉంది. ఇక ఫిన్‌టెక్‌లు ఇస్తున్న పర్సనల్ లోన్స్‌లో తక్కువ విలువ చేసే (రూ.50 వేల లోపు) ఖాతాలు 92 శాతం నమోదు చేశాయి. ఈ కంపెనీలు యువత లక్ష్యంగా మారుమూల పల్లెలకూ విస్తరించాయనడానికి ఈ అంకెలే నిదర్శనం. ఫిన్‌టెక్ సంస్థలు వినూత్న సాంకేతికతను ఉపయోగించి ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ చెల్లింపులు, వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్–టు–పీర్ లెండింగ్) రుణాల వంటి సేవలను ఆఫర్ చేస్తున్నాయి. 2024 డిసెంబర్ నాటికి భారత్‌లో రిటైల్ రుణాలు ఇలా..పరిశ్రమమొత్తం రుణాలు రూ.1,26,48,000 కోట్లురెండేళ్లలో వృద్ధి: 52%కస్టమర్లు: 27.8 కోట్లుఫిన్టెక్మొత్తం రుణాలు రూ.1,30,000 కోట్లు రెండేళ్లలో వృద్ధి: 145%కస్టమర్లు: 2.33 కోట్లు -
‘భూదాన్’పై సీబీఐ విచారణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూముల కబ్జా, అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరి పించాలని హైకోర్టు నిర్ణయించింది. దీనికి సన్న ద్ధంగా ఉన్నారా? లేరా? అనే దానిపై వైఖరిని తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులని, వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. తమ ముందున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని, ఆ మేరకు ఆర్టికల్ 226ను వినియోగించుకుని ఈ ఆదేశాలు ఇస్తున్నామని తేల్చిచెప్పింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రతివాదులకు స్పష్టంచేసింది. అదీగాక, ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్‌కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్ ఉపసంహరించుకోవాలని భావించినా అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.భూకబ్జాలో 26 మంది ఉన్నతాధికారులు: రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూ కబ్జాలపై ఫిబ్రవరి 16న, మార్చి 8న అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారన్నారు. ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారని చెప్పారు. 26 మంది ఉన్నతాధికారులు భూకబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.అధికారుల నుంచి స్పందన లేదు..పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘భూదాన్ భూములపై బినామీల పేరిట రిజిస్ట్రేషన్, భూ కబ్జా, మనీలాండరింగ్‌పై విచారణ జరిపించాలని మహేశ్ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు. కొందరు అధికారులకు అందజేసిన పట్టాదారు పాస్‌బుక్‌లు, మ్యుటేషన్ ప్రొసీడింగ్‌లపై వివరాలు సమర్పించేలా రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేయండి. భూకబ్జాలో తెలంగాణతోపాటు ఏపీకి చెందిన సీనియర్ అధికారుల పాత్ర ఉంది. పిటిషనర్‌కు హక్కుగా ఉన్న భూమిని మోసపూరితంగా బదిలీ చేసుకున్నట్లు అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు. అధికారులు భూరికార్డులను ఎలా తారుమారు చేశారో, తప్పుడు వారసత్వ పత్రాలు ఎలా తయారయ్యాయో.. పట్టాదార్ పాస్‌బుక్‌లను చట్టవిరుద్ధంగా ఎలా జారీ చేశారో దర్యాప్తు చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్‌ను కూడా దుర్వినియోగం చేశారు. తన భూమి కోసం పోరాడుతున్న పిటిషనర్‌కు సాయం చేసే బదులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే 10కిపైగా లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. మోసపూరిత పాస్‌బుక్‌లను రద్దు చేయాలి. భూమిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలి. సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించాలి’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది అతి పెద్ద భూ కుంభకోణంలా కనిపిస్తున్నందున ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేశారు. -
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. కాగా, అనారోగ్య కారణాలు చూపెట్టడంతో షకీల్‌కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి.2023 డిసెంబర్ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది.బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారును నడపగా.. అతన్ని తప్పించేందుకు షకీల్ తన ఇంటి పని మనిషి ఆసిఫ్‌పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పై సస్పెన్షన్ వేటు పడింది కూడా. -
ఆ వీడియోలు లీక్ చేస్తా.. ఎమ్మెల్యేను బెదిరించిన యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి జిల్లా: ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన ఓ యూట్యూబర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావును బెదిరించిన కేసులో యూట్యూబర్ శ్యామ్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ శ్యామ్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు.సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే భారీగా డబ్బులు ఇవ్వాలంటూ శ్యామ్ డిమాండ్ చేశాడు. దీంతో తన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడంటూ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్‌ని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసం బెదిరించిన వ్యవహారంలో శ్యామ్‌తో పాటు మరో మహిళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆ దిశగానే భారత్ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే భారత్ సమ్మిట్ లో వంద దేశాలకు సంబంధించిన 450 ప్రతినిధులు పాల్గొంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ స్పష్టం చేశారు. భారతదేశం అలీనోద్యమం తీసుకొని ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని, ఆ దిశగానే సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క.ఈరోజు(గురువారం) హెచ్ఐసీసీ నుంచి మాట్లాడిన భట్టి విక్రమార్క.. ‘ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఉదయం గం. 7.30ని.ల నుంచి గం.10.30 ని.ల వరకూ ఎన్ఆర్జీసీ పథకం ఫీల్డ్ విజిటింగ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం వివరిస్తాం. 2:45 నుంచి 4 గంటల వరకు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ కోసం ఏం చేస్తుందనేది వివరిస్తాం. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శాంతిని నింపేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది.ఎల్లుండి(శనివారం) సాయంత్రం ఇందిర మహిళ శక్తి బజార్ శిల్పకళ వేదిక సందర్శిస్తాం. పెహల్గామ్ ఉగ్రదాడి దురదృష్టకర సంఘటన. ఈ ప్రాంతాన్ని రేపు రాహుల్ గాంధీ సందర్శిస్తారు. అనంతరం భారత్ సమ్మిట్ కి రాహుల్ గాంధీ హాజరు అవుతారు. అహింస, సత్యాగ్రహ పద్ధతి ప్రపంచం పాటించాలని కోరుకుంటున్నాం. భారత్ సమ్మిట్ ద్వారా వివిధ దేశాల ప్రతినిధులు తెలంగాణకి వస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న వనరుల వివరిస్తాం. న్యాయం అన్ని వర్గాలకు దక్కాలనేది కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు. మా ప్రభుత్వం ద్వారా ప్రపంచానికి ఈ మూల సిద్ధాంతం తెలియజేస్తాం. ప్రగతిశీల భావజాలం ఉన్న, న్యాయ సిద్ధాంతం ఉన్న పార్టీలను ఈ సమ్మిట్ కి ఆహ్వానిస్తాం’ అని భట్టి పేర్కొన్నారు. భారత్ ఫౌండేషన్ సహకారంలో ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో భారత్ సమ్మిట్ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
పహల్గాం ఉగ్ర దాడి.. హైదరాబాద్‌లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. పాత బస్తీతో పాటు వివిధ ప్రాంతాలపై పోలీసులు నజర్ పెట్టారు. పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని గతంలో టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.మరో వైపు, తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో టీటీడీ.. తిరుమలలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో సెక్యూరిటీని పెంచారు. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. -
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ జిల్లా పెహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా చేసిన దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాసారు. పెహల్గాంలోని బైసరాన్‌కు విహార యాత్రలోభాగంగా , ప్రకృతి అందాలను వీక్షిస్తున్న తరుణంలో ఉగ్రమూకలు వారిపై దాడికి తెగబడ్డారు. దాంతో ఆ ఆనంద క్షణాలు కాస్తా విషాదంగా మారిపోయాయి. ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుమారుడు ఉన్నారు.ఐబీ(ఇంటెలిజెన్సీ బ్యూరో) ఆఫీసర్ గా హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న మనీష్ రంజాన్.. ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు విడిచాడు. రంజాన్ మృతదేహం బుధవారం స్వస్థలానికి చేరుకున్న తరుణంలో ఆయన తండ్రి మంగ్లేస్ మిశ్రా కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మృతదేహాన్ని చూస్తూ కృంగిపోయారు. ఈ క్రమంలోనే జాతీయ మీడియా ఆయన్ని పలకరించగా తాను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని, ఒంటరిగా ఉన్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.‘నన్ను ఒంటరిగా వదిలేయండి. నేనే మాట్లాడలేను. కశ్మీర్ కు నవ్వుతూ వెళ్లాడు నా కుమారుడు రంజన్. ప్రతీరోజూ మాకు కాల్ చేసి మా ఆరోగ్యం గురించి అడిగేవాడు.. జాగ్రత్తలు చెప్పేవాడు. తాను అసువులు బాసిన చివరి రోజు కూడా మాకు కాల్ చేశాడు. అంతకుముందే మా కాల్ చేసి మాట్లాడిన నా కుమారుడు ఇలా వస్తాడని అనుకోలేదు’ అంటూ కన్నీటి వేదనతో చెప్పారు. -
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తాను ఏది మాట్లాడినా సరే.. అది సంచలనమే అవుతుందని చెప్పుకునే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా.. ఆయనను చూడటానికి జనం ఆశగా ఉన్నారంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.‘‘కేసీఆర్ సభకు జనం భారీగా రావొచ్చు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో స్మితా సబర్వాల్ ట్వీట్లో తప్పేం లేదు. ఆమె వాస్తవాన్నే ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసినట్టు లేదు. ఇదే విషయంలో సీఎస్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భూమల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం పునరాలోచన చేస్తుంది.’’ అంటూ ఆయన పేర్కొన్నారు.కాగా, ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపడానికి ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 27న నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు వేదిక కావడం గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా 1,250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారికి 260 ఎకరాల్లో గోపాల్పూర్ రోడ్డువైపు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వావానాల కోసం ఎల్కతుర్తి సమీపంలో హుజూరాబాద్ మార్గంలో మరో 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల వారికి ఎల్కతుర్తికి ఆర కిలోమీటర్ దూరంలోనే 600 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. -
కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ.. వీటిపైనే ఫోకస్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పరిధిలోని బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్.. తుది దశ విచారణ మొదలుపెట్టింది. మే రెండో వారం వరకు విచారణ కొనసాగించనుంది. మే రెండో వారంలో ప్రభుత్వానికి తుది రిపోర్ట్‌ను ఇవ్వనుంది. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ సిద్ధం చేసిన కమిషన్.. దాదాపు 90 శాతం రిపోర్ట్ పూర్తి చేసింది. ఇంకా కమిషన్‌కు ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ అందకపోవడంతో ఆ నివేదిక కోసం ఎన్డీఎస్ఏకి కమిషన్ లేఖ రాసింది. ఫైనల్ రిపోర్ట్ కోసం ఎన్డీఎస్ఏ మరో మూడు వారాల సమయం కోరింది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ కీలక దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి ప్రశ్నించాల్సి ఉంది.ఈ దఫాలోనే వారికి సమన్లు పంపించి క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలని కమిషన్ కోరే అవకాశముంది. ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో బరాజ్‌ల నిర్మాణంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించి కీలక సాక్ష్యాధారాలు సేకరించిన విషయం తెలిసిందే. వీటిని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల ముందు ఉంచి ప్రశ్నించనున్నట్టు తెలిసింది. -
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం ఇప్పటికీ ముత్యాల నగరంగా ప్రసిద్ధి చెందిన విషయం విధితమే.. ఈ గుర్తింపును ఇప్పటికీ కాపాడుకుంటూ దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, వజ్రాలకు ప్రసిద్ధ గమ్యస్థానంగా నగరం నిలుస్తోంది. అంతేకాకుండా ఆభరణాల వ్యాపారానికి సురక్షితమైన ప్రాంతంగానూ నగరం సేవలందిస్తోంది. విభిన్న సంస్కృతుల నేపథ్యంలో ఈ వ్యాపార కలాపాలు ఇక్కడ విస్తృతంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆభరణాల వినియోగంలో దేశం దాదాపు 29 శాతం వాటా కలిగి ఉంది. ఇందులో దక్షిణాది, మరీ ముఖ్యంగా భాగ్యనగరం ప్రధాన వాటాదారుగా ఉంది. ఈ నేపథ్యంలో నగరం వేదికగా ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’కు సిద్ధమవు తోంది. 3 రోజుల ఈవెంట్లో ట్రెండ్ సెట్టింగ్ డిజైన్లు, బ్రాండ్ లాంచ్‌లు, ఆభరణాల సమావేశాలు, ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక, పవర్ ఆఫ్ యంగ్, లెజెండ్స్ ఆఫ్ సౌత్, జ్యువెలరీ పర్చేజ్ మేనేజర్స్ కనెక్ట్, కాఫీ విత్ డాక్టర్ చేతన్, బిజినెస్ మ్యాచ్ మేకింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం దక్షిణాదిలోని హైదరాబాద్ సహా ముంబై, జైపూర్, కేరళ, బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నై వంటి నగరాలకు చెందిన ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్లు నగరానికి విచ్చేయనున్నాయి. నగరంలోని హైటెక్స్ వేదికగా వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకు ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’ నిర్వహించనున్నారు. భారతదేశపు ప్రీమియర్ బీ2బీ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌గా ఇందులో 8 వేలకు పైగా వాణిజ్య సందర్శకులను ఆకర్షిస్తోందని, 220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం ఇస్తుందని అంచనా. ఈ వేదికగా తాజా ఆభరణాల ట్రెండ్స్, ప్రత్యేక బ్రాండ్ సేకరణలు, అత్యాధునిక డిజైన్లను ఆవిష్కరిస్తుంది. ఈ వేదికగా భారతదేశ వార్షిక ఆభరణాల అమ్మకాలలో 60 శాతం వరకు ప్రభావితం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ దేశంలోని ప్రీమియం ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా స్థిరపడింది. దక్షిణాదిలోని ఆవిష్కరణ, హస్తకళ, వారసత్వం, వ్యాపారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాం. బంగారం, వజ్రం, వెండి, ముత్యాలు, రత్నాల ఆభరణాలను, టెక్నాలజీ ప్రొవైడర్లు, విలువైన లోహ సరఫరాదారులు, ఆభరణాల యంత్రాల తయారీదారులు, భారత్‌తో పాటు విదేశాల నుంచి మౌంటింగ్ వ్యాపారులను ఏకం చేస్తున్నాం. – యోగేష్ ముద్రాస్, భారత ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్. వచ్చే నెలలో హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్, జెమ్ ఫెయిర్ -
‘అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు’.. హైకోర్టులో పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ హైకోర్టులో (telangana highcourt) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (brs mla padi kaushik reddy)కి ఊరట దక్కింది. సుబేదారి పీఎస్‌లో నమోదైన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.50లక్షలు ఇవ్వాలంటూ క్వారీ యజమాని మనోజ్‌ను పాడి కౌశిక్‌రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయంపై మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే,ఈ నేపథ్యంలో తనపై నమోదైనే కేసును కొట్టి వేయాలని కోర్టుతో పాడికౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పాడికౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్..2023 అక్టోబర్25న 25లక్షల రూపాయలు కౌశిక్ రెడ్డికి మనోజ్ చెల్లించినట్లు వాంగ్మూలం ఉంది కదా అని ప్రభుత్వం తరుఫు న్యాయవాది (public prosecutor) హైకోర్టు ప్రశ్నించింది.అందుకు పాడికౌశిక్ రెడ్డి బెదిరించారు కాబట్టే రూ.25 లక్షలను కౌశిక్‌రెడ్డికి మనోజ్ చెల్లించారని పీపీ కోర్టుకు తెలిపారు. ఇప్పుడు రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 2023లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని పీపీని ప్రశ్నించిన హైకోర్టు..కౌశిక్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ 28వ తేదీకి విచారణ వాయిదా వేసింది. -
World Mental Health Index : అట్టడుగున హైదరాబాద్, కారణాలివే!
ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం నగర యువత మానసిక ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. అంతర్జాతీయంగా సేపియన్ ల్యాబ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ దీనిని వెల్లడించింది. మానసిక ఆరోగ్యం ( World Mental Health Index )అత్యల్పంగా ఉన్న భారతదేశపు మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు అట్టడుగున స్థానం కల్పించింది. మెంటల్ హెల్త్ కోషియంట్(ఎంహెచ్క్యు) స్కేల్లో నగరం ప్రపంచ సగటు 63 కాగా మన నగరం 58.3 స్కోర్‌ను సాధించింది. ఢిల్లీ 54.4 స్కోర్‌తో మన తర్వాత స్థానంలో నిలిచింది. ఈ అధ్యయనం కోసం సంస్థ 18 నుంచి 55 ఆ తర్వాత వయస్సు కలిగిన 75 వేల మంది వ్యక్తులను ఎంచుకుంది. – సాక్షి, సిటీబ్యూరోఎంహెచ్క్యు స్కేల్ మానసిక ఆరోగ్యాన్ని ‘బాధలో ఉండటం’ నుంచి ‘అభివృద్ధి చెందడం’ వరకు విభజించింది. ‘ఎండ్యూరింగ్’ ‘మేనేజింగ్’ కేటగిరీల మధ్య హైదరాబాద్ సగటు పడిపోయింది. నగరంలో ‘32% మంది ‘బాధపడుతున్న’ లేదా ‘కష్టపడుతున్న’ కేటగిరీల్లోకి వచ్చారు. ఇది పేలవమైన భావోద్వేగ నియంత్రణ, బలహీనమైన సంబంధాలతో క్షీణించిన మానసిక పనితీరుగా గుర్తించడం జరిగింది’ అని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేందర్ స్వామినాథన్ అంటున్నారు.యువతే ఎక్కువ.. మానసికంగా ప్రభావితమైన వారి సంఖ్య యువకులలో ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు అంతర్జాతీయ కొలమానాలతో సమానంగా 102.4 స్కోర్ సాధించగా, 18 నుంచి 24 సంవత్సరాల మధ్య యువత సగటున 27 పాయింట్లు పైబడి మాత్రమే సాధించి ‘ఎండ్యూరింగ్’ విభాగంలో చోటు దక్కించుకుంది. సేపియన్ ల్యాబ్స్‌కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ మాట్లాడుతూ.. ‘దాదాపు సగం మంది యువకులు బాధను, మనసును బలహీనపరిచే భావాలను కలిగి ఉన్నారు’ అని చెప్పారు. యువత మానసిక ఆరోగ్య సంక్షోభానికి కారణాలను సైతం నివేదిక కీలకంగా ప్రస్తావించింది.పంచుకునే మనసులు లేక.. హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పరిస్థితికి ముఖ్యంగా సామాజిక బంధాల విచ్ఛిన్నం ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. వ్యక్తివాద మనస్తత్వాలు పెరగడం వల్ల కుటుంబాలు సన్నిహిత స్నేహాలు వంటి సంప్రదాయ పద్ధతులు క్షీణించాయి. పిల్లలతో గడపడం అనే విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటివి వీటికి జత కలిసి ఒంటరితనం పెరుగుదలకు ఆజ్యం పోసింది అని నివేదిక తేల్చింది.ఊహ తెలిసేలోపే.. స్మార్ట్ ఫోన్ వినియోగం చిన్న వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వినియోగం అలవాటు కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తోంది. తగిన వయసు లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల విషాదం, నిరాశా నిస్పృహలు, ఉద్రేకం, ఆత్మహత్యా ధోరణులు పెట్రేగేందుకు అవకాశం ఇచ్చి వాస్తవ దూరమైన ప్రపంచంలోకి నెడుతోంది. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రాభంగానికి, సైబర్ బెదిరింపులు, హానికరమైన కంటెంట్‌ను దగ్గర చేస్తుంది. పర్యావరణ ప్రభావం.. మానసిక సమస్యలకు పర్యావరణ మార్పులు కూడా దోహదం చేస్తున్నాయి. ఆహారం నీటిలో ఇప్పుడు సర్వ సాధారణంగా కనిపించే పురుగు మందులు, భారీ లోహాలు మైక్రోప్లాస్టిక్‌లు–మెదడు అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు యుక్తవయస్సులో ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు ఇది దోహదం చేస్తోందని నివేదిక నిర్ధారించింది. రాంగ్ డైట్.. సైకలాజికల్ ఫైట్.. అతిగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్(యుపీఎఫ్) తీసుకునే వ్యక్తులు మానసిక క్షోభను కూడా ఎక్కువ అనుభవించే అవకాశం ఉంది. ‘యుపీఎఫ్ వినియోగం 15 సంవత్సరాలలో బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇది 30% వరకు మానసిక అనారోగ్యానికి కారణమవుతోందని మా డేటా సూచిస్తోంది.’ అని నివేదిక పేర్కొంది. -
పహల్గాం దాడి.. సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించాలనుకున్న క్యాండిల్ ర్యాలీ వాయిదా పడింది. ఏఐసీసీ పిలుపు మేరకు రేపు(శుక్రవారం) ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. మృతుల ఆత్మకు శాంతి కలిగిలా కొవ్వుతులతో ఈ ర్యాలీలో నివాళులర్పించనున్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. -
సుంకిశాల పనుల్లో నిర్లక్ష్యం వద్దు
జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: సుంకిశాల ప్రాజెక్టు పనుల డిజైన్లు వెంటనే సమర్పించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. పనుల నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన జలమండలి ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. పైపులైన్ విస్తరణ పనులు.. సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్, పైపులైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. టన్నెల్, ఎలక్ట్రికల్ పనులు తుది దశకు చేరుకున్నాయని.. సివిల్ వర్క్స్ ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం సుంకిశాల టన్నెల్ గేట్ రిటైనింగ్ వాల్ పక్కకు ఒరిగిన ప్రాంతాన్ని అశోక్‌రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం మహేష్, జీఎంలు, ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. -
ఈసారి ‘బతుకమ్మ’ కుంటలోనే..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రజలు వినియోగించుకోవడానికి సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. స్థానికులు బతుకమ్మ కుంటలోనే పండగ సంబరాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించి న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. దీంతో రంగనాథ్ బుధవారం అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు. అభివృద్ధి పనులను స్థానికుల సమక్షంలో పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువు పునరుజ్జీవంతో పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలూ ఆహ్లాదకరంగా మారుతాయన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాలని స్థానికులను కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చెరువు పూడికతీత ప్రారంభమైంది. ఆ నెల 18న జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా... లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఆపై కోర్టు వివాదం నేపథ్యంలో పనులకు బ్రేక్ పడగా.. బుధవారం మళ్లీ మొదలయ్యాయి. హైడ్రా కోసం ప్రత్యేక లోగో సిద్ధమైంది. ఇప్పటి వరకు అధికారులు జీహెచ్ఎంసీలో భాగంగా ఉండగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) కోసం రూపొందించిన లోగోనే వినియోగించారు. తాజాగా హైడ్రా కోసం ఓ ప్రత్యేక లోగోను డిజైన్ చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైడ్రా ప్రధాన లక్ష్యం జలవనరుల పరిరక్షణ. ఈ థీమ్ ఉట్టిపడేలా లోగోను కమిషనర్ ఏవీ రంగనాథ్ ఖరారు చేశారు. అభివృద్ధి పనులు పునఃప్రారంభంలో రంగనాథ్ వెల్లడి హైడ్రా కోసం రూపొందించిన ప్రత్యేక లోగో సిద్ధం -
కొంపముంచిన ‘మ్యాజిక్ మనీ’
కరెన్సీ కట్టలను ప్యాక్ చేసి ఇంజక్షన్ ఇస్తే డబుల్ మనీ అంటూ టోకరా ● చైతన్యపురిలో వెలుగులోకి నయా తరహా వంచన ● రూ.1.75 లక్షలు స్వాహా చైతన్యపురి: మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించినా కొత్త రకం మోసాలకు అమాయకులు బలైపోతున్నారు. చెప్పుడు మాటలతో మోసపోతున్నారు. ఇలా ‘మ్యాజిక్ మనీ’ పేరుతో జరిగిన నయా తరహా మోసం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురిలో నివసించే ప్రైవేట్ ఉద్యోగి దుద్దాల సాయి కల్యాణ్, బి.ఆనంద్ స్నేహితులు. ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే మ్యాజిక్ మనీ ట్రిక్ ఒకటి ఉందని, ఎంత డబ్బులు ఇస్తే దానికి రెట్టింపు సంపాదించవచ్చని ఆనంద్ చెప్పాడు. తన స్నేహితుడు కందా శ్రీనివాస్‌ను మ్యాజిక్ మనీ గురించి తెలుసన్నాడు. ఈ నెల 16న విద్యుత్‌నగర్ రోడ్‌నంబర్–8 లోని శ్రీనివాస్ ఇంటికి సాయి కల్యాణ్‌ను తీసుకెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత రవి అనే వ్యక్తిని పిలిపించారు. ఎంత డబ్బు ఇస్తే అంత రెట్టింపు మనీ వచ్చేలా చేస్తానని నమ్మబలికాడు. దీంతో సాయి కల్యాణ్ తన వద్ద ఉన్న రూ.1.75 లక్షల కరెన్సీ నోట్లను శ్రీనివాస్ ద్వారా రవికి అప్పగించాడు. రవి ఆ డబ్బును తీసుకుని బ్రౌన్ కలర్ బాక్స్‌లో పెట్టి పైన ఆకుపచ్చ రంగు టేప్ చుట్టి డబ్బాకు పింక్ కలర్ ఇంజక్షన్ చేశాడు. బాక్స్‌ను శ్రీనివాస్ ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టి సాయంత్రం వస్తానని రవి వెళ్లిపోయాడు. అయితే సాయంత్రం అయినా రవి తిరిగి రాలేదు. అతని మొబైల్‌కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండు రోజుల తర్వాత శ్రీనివాస్ తన ఇంట్లో ఫ్రిజ్‌లోని డబ్బులు పెట్టిన బాక్స్‌ను సాయి కల్యాణ్ ఇంటికి తీసుకొచ్చాడు. దానిని తెరిచి చూడగా డబ్బుకు బదులు తెల్ల కాగితాలు ఉండటం గమనించారు. దీంతో మోసపోయానని గ్రహించిన సాయి కల్యాణ్ మంగళవారం సాయంత్రం పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
బుక్ చేయబోయి బుక్కయ్యాడు!
ఆన్లైన్ విధానంలో శ్రీశైలంలో రూమ్ బుకింగ్ ● జీఎస్టీ కోసమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ● నగదు రిఫండ్ చేస్తామని రూ.1.33 లక్షలు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: శ్రీశైలం వెళ్లాలని భావించిన నగర వాసి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూమ్ బుక్ చేసుకున్నారు. జీఎస్టీ విషయంలో తేడా రావడంతో ఆ బుకింగ్ రద్దు చేసుకోవాలని భావించారు. చెల్లించిన మొత్తం రిఫండ్ ఇస్తామంటూ ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.1.33 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి శ్రీశైలంలోని వైశ్య సత్రంలో రూమ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఓ వెబ్సైట్ ఆధారంగా ఒక రోజు కోసం రూమ్ బుక్ చేసుకుని, అందుకు సంబంధించి రూ.1000 చెల్లించారు. అది బోగస్ వెబ్సైట్ కావడంతో బాధితుడి వివరాలను సైబర్ నేరగాళ్లకు చేరాయి. కొద్దిసేపటికే అతడికి కాల్ చేసిన నేరగాళ్లు... రూమ్ అద్దె మాత్రమే చెల్లించారని, బుకింగ్ ఖరారు కావడానికి జీఎస్టీగా మరో రూ.180 చెల్లించాలని కోరారు. దీంతో తనకు రూమ్ వద్దని చెప్పిన బాధితుడు తాను చెల్లించిన రూ.వెయ్యి రిఫండ్ చేయాలని కోరాడు. దీంతో సైబర్ నేరగాడు రిఫండ్ కోసం సంప్రదించాలంటూ మరో నెంబర్ ఇచ్చాడు. బాధితుడు ఆ నెంబర్‌కు కాల్ చేసి విషయం చెప్పగా... రిఫండ్ ప్రాసెస్ ప్రారంభించడానికి తొలుత తమకు రూ.1 చెల్లించాలని కోరారు. యువకుడు అలానే చెల్లించగా... రూ.2 రిఫండ్ చేశారు. తమ కంపెనీ రిఫండ్ పాలనీ ఇలానే ఉందని... తమకు చెల్లించిన మొత్తానికి రెట్టింపు తిరిగి ఇస్తూ రిఫండ్ పూర్తి చేస్తామని నమ్మబలికారు. ఆపై బాధితుడి నుంచి రూ.1,180 కట్టించుకుని రెట్టింపు ఇచ్చారు. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత రూ.76,500 చెల్లించాలని చెప్పడంతో బాధితుడు నిరాకరించాడు. ఇప్పటి వరకు తాను చెల్లించింది తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో తమ వద్దకు నేరుగా వచ్చి డబ్బు తీసుకోవాలని వాళ్లు చెప్పడంతో నగర యువకుడు అంగీకరించలేదు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు లెక్కలు చూడగా సైబర్ నేరగాళ్లకు రూ.1,33,564 చెల్లించినట్లు తేలింది. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. -
పోలింగ్‌కు బీఆర్ఎస్ దూరం
ఫలించిన కేటీఆర్ హుకుం ● కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీల నుంచి అందరూ హాజరు ● 112 మందికిగాను ఓటేసింది 88 మంది ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ అప్పుడు అలా.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక పర్యాయం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్ధానానికి రెండు పార్టీలు పోటీకి దిగగా, ఓటర్ల బలం లేని పార్టీ తీరా పోలింగ్ రోజున బహిష్కరించడంతో సాంకేతికంగా పోలింగ్ జరిగినప్పటికీ, ఎన్నిక ఏకగ్రీవమే అయినట్లు సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అవాంఛనీయ ఘటనలేమైనా జరుగుతాయేననే భయాందోళనలతో పాటు పలు ఊహాగాలకు తావిచ్చింది. పలు ప్రచారాలతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎన్నికలో ఓటర్లు కేవలం ప్రజాప్రతినిధులే కావడం.. పార్టీల వారీగా సంఖ్యాబలంతోనే గెలవలేమని తెలిసి తక్కువ ఓట్లున్న పార్టీలు పోటీ చేయకపోవడంతో గతంలో ఏకగ్రీవంగానే ఈ ఎన్నిక ముగిసేది. ఈసారి తగిన సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ పోటీలో దిగడం, ఇతర పార్టీల ఓట్లనూ కూడగడతామని ధీమాగా చెప్పడంతో ఈ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ పోలింగ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీ వారి వైఖరి ఏమిటన్నది పోలింగ్ ముగిసేంత వరకూ సస్పెన్స్‌గానే సాగింది. ఒక దశలో నలుగురైదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోలింగ్‌కు వస్తున్నట్లు మీడియాలో కొందరికి సమాచారమిచ్చి, అంతలోనే ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. రెండు కేంద్రాల్లో పోలింగ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతంతో పోలింగ్ పూర్తయింది. మొత్తం 112 మంది ఓటర్లలో (కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) 88 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మిగతా 24 మంది బీఆర్ఎస్ వారిగా భావిస్తున్నారు. అన్ని పార్టీల్లో వెరసి ఎక్స్అఫీషియో సభ్యులు 31 మందిలో 22 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది ఓట్లేశారు. తొలుత బీజేపీ.. పోలింగ్ సమయం ప్రారంభమయ్యాక తొలుత బీజేపీ నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డా.కె. లక్ష్మణ్ వరుసగా ఓట్లు వేశారు. అనంతరం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, మాజిద్ హుస్సేన్, అహ్మద్ బలాలా, మహ్మద్ ముబిన్, కౌసర్ తదితరులు ఒకరి తర్వాత ఒకరు ఓట్లు వేశారు. టీజేఎస్ ఎమ్మెల్సీ కోదండరామ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ప్రస్తుత ‘స్థానిక’ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డితో పాటు ఇతర కార్పొరేటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ విడిగా వచ్చి ఓటేశారు. బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీలకు చెందిన ఓటర్లందరూ పోలింగ్‌లో పాల్గొన్నారు. ఎంఐఎం గెలుపు లాంఛనమే.. పోలింగ్‌లో 88 మంది పాల్గొన్నందున సగం కంటే ఎక్కువ.. అంటే 45 ఓట్లు వచ్చిన వారు విజేతగా నిలుస్తారు. ఎంఐఎం పార్టీకి స్వతహాగానే 49 ఓటర్ల బలం ఉండటంతో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా వారికే పడే అవకాశ ఉండటంతో ఎంఐఎం గెలుపు లాంఛనమేనని భావిస్తున్నారు. బీజేపీ మాత్రం తమకు కొన్ని కాంగ్రెస్ ఓట్లు పడ్డట్లు చెబుతోంది. స్ట్రాంగ్‌రూమ్‌లకు బ్యాలెట్ బాక్స్‌లు పోలింగ్ ముగిశాక బ్యాలెట్ పత్రాలున్న బాక్స్‌లను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లోకి తరలించారు. ఓటు వేస్తున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి -
ఉగ్రవాదంపై పెల్లుబికిన ఆగ్రహం
జమ్మూ కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రదాడిని నగరం ముక్తకంఠంతో ఖండించింది. ఉగ్రవాదంపై ఆగ్రహం పెల్లుబికింది. బుధవారం నగర వ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. మృతులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్–ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు క్రీడాకారులు, రిఫరీలు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు. సంతాప సూచికంగా ఈ మ్యాచ్‌కు చీర్ గర్ల్స్ను రద్దు చేశారు. – సాక్షి, సిటీబ్యూరో -
‘కళింగ’ వేదికగా వస్త్ర వైభవం..
ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్న నేషనల్ సిల్క్ ఎక్స్పో సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యం కలిగిన వస్త్ర ఉత్పత్తులు నగరం వేదికగా అలరిస్తున్నాయి. నగరంలోని బంజారాహిల్స్ వేదికగా కళింగ కల్చరల్ సెంటర్లో ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్న ‘నేషనల్ సిల్క్ ఎక్స్పో’ నగరవాసులకు నాణ్యమైన, విలక్షణమైన వస్త్రర సోయగాలను చేరువ చేస్తోంది. ఈ ఎక్స్‌పోలో విభిన్న రకాల పట్టు డిజైన్లతో పాటు కాటన్ డిజైన్ దుస్తులు, డిజైనర్ బ్లౌజ్‌లు, కుర్తీలు తదితర భారతీయ వస్త్ర వైభవాలు నేత కార్మికుల ద్వారా 50 శాతం వరకు తగ్గింపుతో అందించబడుతున్నాయి. ఇందులోని మహారాష్ట్ర స్వచ్ఛమైన పైథానీ సిల్క్ చీరలు, కర్ణాటక – బెంగళూరు సిల్క్, సాఫ్ట్ సిల్క్ తదితరాలు వస్త్ర ప్రియులను ఆకర్షిస్తున్నాయి. -
‘సీవర్ క్రోక్’ పనితీరు పరిశీలన
సాక్షి, సిటీబ్యూరో: మురుగు నీటి పైపు లైన్లలో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన సీవర్ క్రోక్ రోబోటిక్ యంత్రం పనితీరును హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఇలంబర్తి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోబోటిక్, వాటర్–జెట్ శక్తితో నడిచే ఈ యంత్రం సిల్ట్‌ను తొలగించే విధానాన్ని గమనించారు. సచివాలయం ముందు ఉన్న డైన్లలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. మురుగు, వరద నీరు పొంగి రహదారులను ముంచెత్తిత్తడం నగరంలో సర్వ సాధారణం. ఈ పరిస్థితుల్లో సీవర్ క్రోక్ ఎంత వరకు ఉపకరిస్తుందనేది అధ్యయనం చేశారు. వాటర్ జెట్‌తో టర్బైన్ తిప్పడంతో ముందుకు వెళ్లి ఈ యంత్రం బ్లేడ్ల సాయంతో చెత్తను తొలగిస్తుంది. మురుగునీటి లైన్లను శుభ్రం చేయడానికి సీవర్ క్రోక్ను గతంలో వాటర్ బోర్డు వినియోగించిందని తయారీ సంస్థ అజంతా టెక్నో సొల్యూషన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ జర్మయ్య తెలిపారు. -
రెడ్‌బుక్ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
సాక్షి, గుంటూరు/హైదరాబాద్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్.. వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో అమలులో భాగంగా మరో వైఎస్సార్సీపీ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోపీపై పలు కేసులు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని గచ్చిబౌలిలో గోపీని అరెస్ట్ చేశారు. లక్ష్మీ బాలాజీ క్రషర్స్ ఆరోపణల కేసులో విడదల గోపీని అరెస్ట్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో గోపీని ఏపీకి తరలించనున్నారు. -
దళారులే రైతులుగా దోపిడీ
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని స్వయంగా రైతే విక్రయించాలి. ఒకవేళ కౌలు రైతులు పంట పండిస్తే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) చేయించి ఏఈవోల వద్ద మిస్సింగ్ డేటా కింద ధ్రువపత్రం తీసుకోవాలి. తర్వాత జిన్నింగ్ మిల్ వద్ద ఫొటో దిగి.. పండించిన పత్తిని మార్కెటింగ్ శాఖ ద్వారా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి విక్రయించాలి. వరంగల్ రీజియన్‌లోని ఓ జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల పేరుతో దిగిన ఫొటోల్లో వార పత్రికల మీద కవర్ పేజీల్లో ఉన్న సినిమా తారల ఫొటోలు, పత్రికల్లో వివిధ సందర్భాల్లో వచ్చిన ఫొటోలు కనిపించడంతో విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు.సాక్షి, హైదరాబాద్: పత్తి రైతుల ముసుగులో దళారులు, అధికారులు కుమ్మక్కయ్యారు. వానాకాలం సీజన్‌కు సంబంధించిన పత్తి రైతు ల పేరిట సాగించిన దందా.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సాగిస్తున్న విచారణలో వెలుగు చూస్తున్నట్టు సమాచారం. వానాకాలం సీజన్లో రూ.15,557 కోట్ల విలువైన 21లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తే అందులో 40 శాతం కొనుగోళ్లలో అవకతకవలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించింది. తద్వారా రైతులకు దక్కాల్సిన రూ.వేల కోట్లు పక్కదారి పట్టినట్లు వెల్లడైంది. ఈ విచారణ నివేదికను ప్రభుత్వానికి చేరితే..మార్కెటింగ్ శాఖతోపాటు సీసీఐ ఉద్యోగులు, సిబ్బందే కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) ధ్రువపత్రాలు ఇచ్చిన వ్యవసాయ శాఖ ఎక్స్టెన్షన్ అధికారులపై కూడా చర్యలు తప్పవని తెలుస్తోంది. 28.46 లక్షల మంది రైతులు పంట పండిస్తే... విక్రయించింది 8.58 లక్షల మందే.. రాష్ట్రంలో వానకాలం సీజన్లో 28,46,668 మంది రైతులు 44.73 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. 28.11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తే , కేవలం 25.45 ఎల్ఎంటీ వచ్చింది. ఇందులో 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మార్కెటింగ్ శాఖ తెరిచిన 302 కొనుగోలు కేంద్రాల ద్వారా సీసీఐ సేకరించింది. ఇక్కడే దళారులు, అధికారులు కుమ్మక్కైన విషయం వెలుగు చూసింది. పత్తి విక్రయాల కోసం కనీసం 20 లక్షల మంది రైతులైనా రావాలి. కానీ కేవలం 8,85,894 మంది రైతులు మాత్రమే 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని విక్రయించినట్టు మార్కెటింగ్ శాఖ లెక్కల్లో చూపిస్తోంది. ఈ దందా ఉత్తర తెలంగాణలో అధికంగా సాగగా, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొంత తక్కువగా ఉంది. రైతు తెచ్చిన పత్తిని తిరస్కరించి... దళారుల ద్వారా తిరిగి కొనుగోలు రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి తేగానే, తేమ 8 నుంచి 12 శాతం లోపు లేదని కొనుగోలుకు తిరస్కరిస్తారు. పత్తిని ఆరబెట్టి తీసుకొస్తేనే మద్ధతు ధర క్వింటాల్‌కు రూ. 7,521చొప్పున కొనుగోలు చేస్తారని మార్కెటింగ్ కార్యదర్శులు చెబుతారు. దీంతో అక్కడే ఉన్న దళారులు రంగ ప్రవేశం చేసి, రైతుల నుంచి క్వింటాల్‌కు రూ. 6,000 నుంచి రూ. 6,500 చొప్పున కొనుగోలు చేస్తారు. అదే పత్తిని అదే కొనుగోలు కేంద్రంలో దళారులు సాయంత్రం విక్రయిస్తారు. అందుకు అవసరమైన తాత్కాలిక రిజిస్ట్రేషన్ల ధ్రువపత్రాలను రైతుల పేరిట ఏఈవోల నుంచి తీసుకోవడం నుంచి జిన్నింగ్ మిల్లులో ఫొటోలు దిగడం వరకు అన్ని ప్రక్రియలు పూర్తవుతాయి. క్వింటాల్‌కు కనీసంగా రూ. 1,000–1,500 వరకు దోచుకొనే దళారులు, అధికారులతో కలిసి ఆదాయాన్ని పంచుకుంటారు. క్రాప్ మిస్సింగ్ డేటాతో విక్రయాలు పోల్చడంతో దొరికిన దొంగలు నాలుగేళ్లుగా ఏఈవోలు ప్రతి సీజన్లో క్రాప్ బుకింగ్ డేటా తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇందులో భాగంగా గత డిసెంబర్ నుంచి జనవరి వరకు సాగిన సీసీఐ పత్తి అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో దళారుల ప్రమేయం స్పష్టంగా కనిపించింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏడుగురు మార్కెటింగ్ మేనేజర్లను సస్పెండ్ చేశారు. పూర్తి విచారణపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు. -
చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని, చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఈ నెల 27న నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు వేదిక కావడం గర్వంగా ఉందని అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తొలుత జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మార్గంలో బోధించు, సమీకరించు, పోరాడు అనే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించాలనే నినాదంతో కేసీఆర్ నాయకత్వంలో బీ(టీ)ఆర్ఎస్ పురుడు పోసుకుంది. ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడి తెలంగాణను సాధించడంతో పాటు అధికారాన్ని చేపట్టి అద్భుతమైన పాలన అందించింది. ప్రభుత్వంగా, ప్రతిపక్షంగా హిమాలయాల స్థాయికి తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్. రెండున్నర దశాబ్దాలుగా ప్రజల్లో ఉంటోంది. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా..’ అని కేటీఆర్ చెప్పారు. సభా స్థలికి నలుమూలలా పార్కింగ్ ఏర్పాట్లు‘రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా 1,250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఉంటుంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారికి 260 ఎకరాల్లో గోపాల్పూర్ రోడ్డువైపు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వావానాల కోసం ఎల్కతుర్తి సమీపంలో హుజూరాబాద్ మార్గంలో మరో 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల వారికి ఎల్కతుర్తికి ఆర కిలోమీటర్ దూరంలోనే 600 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. 10 లక్షల చొప్పున వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లుసభకు హాజరయ్యే వారి కోసం 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాం. వీటిని ఇంకా పెంచుతాం. వెయ్యికి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు మీద నమ్మకం లేదు. అందువల్ల 200 జనరేటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. 2 వేల మంది వలంటీర్లు సభకు వచ్చే వారికి సహకరిస్తారు..’ అని కేటీఆర్ తెలిపారు. సూర్యాపేట రైతులకు సలాం‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చూడాలి. ఆయన మాట వినాలన్న ఆత్రుతతో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడదాం. కేసీఆర్ సందేశాన్ని గులాబీ సైనికులు ప్రతీ గ్రామానికీ చేర్చాలి. 27వ తేదీన తెలంగాణలోని 12,796 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాలు ఎగురవేసి కదం తొక్కిన ఉత్సాహంతో చలో వరంగల్ సభకు చేరుకోవాలి. మండుటెండలను లెక్కచేయకుండా రజతోత్సవ సభ కోసం ఎడ్లబండ్లలో బయలుదేరిన సూర్యాపేట రైతులకు సలాం చేస్తున్నా. మనమందరం వారిని ఆదర్శంగా తీసుకోవాలి..’ అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డాక్టర్ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నిప్పుల కొలిమి.. రికార్డు స్థాయిలో ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో చాలా ప్రాంతాలు భగభగమంటున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గత వారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఐదు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతు న్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్ర తలు తార స్థాయికి చేరాయి. మరోవైపు గాలిలో తేమ శాతం కూడా పెరగటంతో ఉక్క పోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. బుధవారం నిజామాబాద్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణో గ్రత మెదక్‌లో 24.3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్ర తలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డయ్యాయి. నిజామాబాద్‌లో 3.6, ఆదిలాబాద్‌లో 3.4, ఖమ్మంలో 3.1 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటిపూట జన సంచారం తగ్గింది. అత్యవసరమైతేనే ప్రజలు బయ టకు రావాలని, మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ప్రాంత జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతుండటంతో రాత్రిపూట కూడా వేడి తగ్గటంలేదు. -
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల చివరి రోజు నుంచి పలు ఊహాగానాలతోపాటు ఉత్కంఠను రేకెత్తించిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, చివరి రెండు గంటల్లో ఎవరూ రాలేదు. మొత్తం 112 మంది ఓటర్లలో.. 88 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ నుంచి ఎన్.గౌతమ్‌రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభ్యులెవరూ పోలింగ్‌లో పాల్గొనలేదు. పార్టీల వారీగా పోలింగ్‌కు హాజరైన ఓటర్ల సంఖ్యను బట్టి ఎంఐఎం గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ బరిలో ఉండటంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి నెలకొంది. తమ పార్టీలకు గెలిచేంత ఓటర్ల సంఖ్య లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. చివరి క్షణం వరకూ తమకు ఇతర పార్టీల ఓట్లు పడతాయన్న బీజేపీ, పోలింగ్ అనంతరం సైతం కాంగ్రెస్ ఓట్లు కొన్ని తమకు పడ్డట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఎంఐఎం తొత్తుగా మారిందని బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు బయటపడ్డాయని, ఎంఐఎంకు వాటి మద్దతు ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి నల్ల దుస్తులతో పోలింగ్‌కు హాజరయ్యారు. మిగతా బీజేపీ ఓటర్లు చేతులకు నల్లరిబ్బన్లు చుట్టుకొని వచ్చారు. -
ప్రపంచ సాగుభూమిలో 15% కలుషితం
భూమి..మన మనుగడకు మూలాధారం. మనం తినే 95% ఆహారానికే కాదు..అనుదినం తాగే నీటికి కూడా ప్రధాన వనరు భూమి. అయితే ఈ భూమిలో దాదాపు 15% విస్తీర్ణం మేర విషతుల్యమైన భార లోహాలతో కలుషితమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐరోపా, ఆసియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో ఈ కాలుష్యం అపరిమితంగా ఉంది. ఆర్సెనిక్, లెడ్ తదితర భార లోహాలు పరిమితికి మించి సాగు భూమిని కలుషితం చేసి ఆహార వ్యవస్థల్లోకి చేరిపోయాయి. సుమారు 140 కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి భార లోహాల కాలుష్యం» అమెరికన్ అసోసియేషన ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ (ఏఏఏఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్య యనానికి చైనాలోని సింగువా విశ్వవిద్యాలయ పరిశోధకుడు డా. దేయీ హౌ నేతృత్వం వహించారు. ఈ పరిశోధన ఫలితాలపై వ్యాసం ప్రసిద్ధ ‘సైన్స్’జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రాంతీయ అధ్యయనాల గణాంకాలను సేకరించి, మెషీన్ లెర్నింగ్ సాంకేతికత ద్వారా విశ్లేషించారు. » ప్రపంచవ్యాప్త సాగు భూమిలో కనిష్టంగా14% గరిష్టంగా 17% విస్తీర్ణంలో ఈ కాలుష్యం ఉంది. సుమారు 24.2 కోట్ల హెక్టార్ల నేలల్లో భార లోహ కాలుష్యం తిష్ట వేసిందని అధ్యయనం తేల్చింది.ఆర్సెనిక్, కాడ్మియం, కోబాల్ట్, క్రోమియం,రాగి, నికెల్, సీసం వంటి భార లోహాలు అపరిమిత స్థాయిలో సాగు భూమిలో ప్రజారోగ్యానికి తీరనిహాని కలిగించే స్థాయిలో ఉన్నాయని అధ్యయనంతెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్భార లోహాలతో ముప్పేమిటి?శిలలు, మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడే లోహాలు, మెటలాయిడ్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని నేలల్లో ఉంటాయి. ఇతర లోహాలతో పోల్చితే ఈ లోహాల బరువు అణుస్థాయిలో అధికంగా ఉంటుంది. అందుకే వీటిని భార లోహాలు అంటారు. అవి మన కంటికి కనిపించవు. సేంద్రియ పదార్థం మాదిరిగా కాలగమనంలో భార లోహాలు విచ్ఛిన్నం కావు. ఒక్కసారి మట్టిలో ఇవి కలిశాయంటే దశాబ్దాల కాలం వరకూ పోవు. వీటిని మట్టిలో నుంచి పంట మొక్కల వేర్లు గ్రహిస్తాయి. అవి ఆ పంటల ధాన్యాలు, పూలు, కాయల్లోకి చేరుతాయి. ఆ విధంగా ఆహార చక్రం ద్వారా మనుషుల దేహాల్లోకి చేరుతున్నాయి. » ఈ సమ్మేళనాలు పరిమితికి మించి దేహంలోకి చేరితే మనుషులు, జంతువులు, ఇతర జీవులకు ఆరోగ్యపరంగా తీరని హాని జరుగుతుంది. అయితే, వీటి ప్రతికూల ప్రభావం వెంటనే తెలియదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏయే దేశాల సాగు భూముల్లో ఏయే మోతాదుల్లో భార లోహాలు ఇప్పటికే మితిమీరి ఉన్నాయనే వివరాలు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పుడు మనం తినే ఆహారంలో ఉన్నాయి. ఇక ముందూ దశాబ్దాల పాటు ఉంటాయి. » జింక్, రాగి వంటివి భార లోహాలైనప్పటికీ అత్యల్ప మోతాదులో మనకు సూక్ష్మపోషకాలుగా మనకు అవసరమే. అయితే, ఆర్సెనిక్, కాడ్మియం, పాదరసం, సీసం వంటి విషతుల్యమైన భార లోహాలు అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉన్నా కేన్సర్, కిడ్నీ, ఎముకల పటుత్వం క్షీణించటంతో పాటు పిల్లల్లో డిజార్డర్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. యురేసియా దేశాలకు అధిక ముప్పు యురేసియా తక్కువ అక్షాంశ ప్రాంతంలోని సాగుభూముల్లో భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ఈ అధ్యయనం గుర్తించింది. దక్షిణ ఐరోపా, మధ్య ప్రాచ్య, దక్షిణాసియా, దక్షిణ చైనా ప్రాంత దేశాలకు ఈ బెడద అధికం. గ్రీకు, రోమన్, పర్షియన్, చైనా తదితర పురాతన నాగరికతలు విలసిల్లిన ప్రాంతం ఈ హైరిస్క్ జోన్లోనే ఉంది. గనుల తవ్వకం, లోహాలను కరిగించటం, వ్యవసాయం వంటి మానవ కార్యకలాపాలతోపాటు లోహ సంపన్న సహజ రాతి శిలలు ఉండటం, ఇవి తక్కువ వర్షపాత ప్రాంతం కావటమే ఈ కాలుష్యానికి కారణమని పరిశోధకులు విశ్లేషించారు. » అన్నిచోట్లా సాగు భూముల్లో ఈ ఏడు భార లోహాలు ఉన్నాయని కాదు.. కనీసం ఏదో ఒక రకమైనా అపరిమిత మోతాదులో పోగుపడినట్టు శాస్త్రబద్ధమైన అధ్యయనంలో గుర్తించామని డా. దేయీ హౌ స్పష్టం చేశారు. వీటిల్లో కాడ్మియం కాలుష్యం అత్యధికంగా ఉంది. ప్రపంచ నేలల్లో కనీసం 9% భూమిని కలుషితం చేసింది. ఉత్తర, మధ్య భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ చైనాతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో కొన్ని ప్రాంతపు నేలల్లో కాడ్మియం ఎక్కువగా ఉంది. » ఆర్సెనిక్ బెడద దక్షిణ చైనా, ఆగ్నేయాసియా, పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా ఉంది. నికెల్, క్రోమియం కాలుష్యం మధ్య ప్రాచ్యం, సబార్కిటిక్ రష్యా, తూర్పు ఆఫ్రికాలో ఎక్కువ. కోబాల్ట్ కాలుష్యానికి ప్రధాన కారణం గనుల తవ్వకం. జాంబియా, కాంగో, ఇథియోపియాల్లో ఇది అధికం. » ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తుల వాణిజ్యం విస్తృతంగా జరుగుతున్నందున, ఆయా ప్రాంతాల్లో ప్రజలకు మాత్రమే ముప్పు పరిమితమైందని భావించడానికి లేదు. కాబట్టి, భార లోహాల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగు భూముల స్థితిగతులపై పర్యవేక్షణకు అంతర్జాతీయంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని డా. దేయీ హౌ సూచించారు. -
పోలవరం ఎత్తు కుదింపు
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించగా, తొలిదశ కింద 135 అడుగులకే ఎత్తును కుదించి నిర్మించాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి ప్రాజెక్టులో 135 అడుగుల నీటిమట్టంతో నీటిని నిల్వ చేస్తే.. ప్రాజెక్టు కింద తెలంగాణ భూభాగంలో ఎలాంటి ముంపు ఉండదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎత్తు 150 అడుగులకు ఎప్పుడు పెంచితే అప్పుడే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే నిర్వహించే అంశంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఈ నెల 8న హైదరాబాద్‌లో ఏపీ, తెలంగాణ అధికారులతో నిర్వహించిన సమావేశం మినట్స్‌లో ఈ విషయాన్ని పొందుపరిచింది. పోలవరం బ్యాక్‌వాటర్‌తో కిన్నెరసాని, మున్నేరువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై మాత్రమే అధ్యయనం చేయాలని ఎన్జీటీ తీర్పు ఇచి్చన నేపథ్యంలో ఆ మేరకే నిర్వహిస్తామని ఈ సమావేశంలో ఏపీ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ముంపు సమస్య ఉండదని వాదించింది. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం మేర నీటిని నిల్వ చేస్తే మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపు ప్రభావంపై సైతం ఏకకాలంలో అధ్యయనం చేయాలని సమావేశంలో తెలంగాణ పట్టుబట్టింది. మొత్తం 954.15 ఎకరాల్లో ముంపు ఏర్పడుతుందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిలో తాము స్వయంగా మిగిలిన 5 వాగులకు ఉండే ముంపు ప్రభావంపై అధ్యయనం జరుపుతామని పీపీఏ సీఈఓ అనీల్‌జైన్ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో సంప్రదింపులు జరిపి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. పోలవరం ముంపుపై అధ్యయనం చేయండిఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలోని 6 వాగులకు ఏర్పడనున్న ముంపు ప్రభావంపై అధ్యయనం నిర్వహించాలని కేంద్ర జలసంఘానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కోరింది. ఈ మేరకు పీపీఏ సీఈఓ అనీల్‌జైన్ తాజాగా సీడబ్ల్యూసీకి లేఖ రాశారు. గతంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం నిర్వహించిన అనుభవం సీడబ్ల్యూసీకి ఉండడంతో మరోసారి సర్వే నిర్వహించాలని అధ్యయనంలో కోరారు. -
ధరణి కష్టాలు తొలగించేందుకే భూభారతి
నూతనకల్: రాష్ట్రంలో వివాద రహిత భూ విధానం తేవాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దొర పాలనలో రెవెన్యూ చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ధరణి పోర్టల్‌ను తెచ్చారని ఆరోపించారు. ధరణి వల్ల నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఎంతో మంది తమ భూములు పట్టా కాకపోవడంతో ఇబ్బందులు పడి కోర్టుల చుట్టూ తిరిగారని చెప్పారు. ధరణి కష్టాలను తొలగించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి భూ భారతి చట్టాన్ని తెచ్చామని వివరించారు. నిషేధిత జాబితాలోని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తాం ధరణిలో తప్పిదాలు జరిగితే రెవెన్యూ అధికారులు వాటిని సరిచేయడానికి కూడా అధికారం లేకుండా గత పాలకులు చట్టాలు చేశారని పొంగులేటి ఆరోపించారు. అన్నం పెట్టే రైతన్నకు లాభం చేయడమే భూ భారతి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ధరణిలో పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్లు తెలిపారు. కొత్తగా 3.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొత్తగా ఇచ్చే పాసు పుస్తకాల్లో సర్వే మ్యాప్ వివరాలు ఉంటాయని తెలిపారు. మండల స్థాయిలో ఏర్పడే సమస్యలను తహసీల్దార్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణలో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రైవేట్ పట్టా భూములను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వమే ఉచిత దరఖాస్తు ఫారాలను అందించి రైతుల పక్షపాతిగా నిలుస్తోందని తెలిపారు. భూమికి హద్దులు నిర్ణయించి పూర్తి కొలతలతో ప్రతి రైతుకు భూధార్ కార్డులు అందజేస్తామని తెలిపారు. సదస్సులో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె. నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏ పంటలకు బీమా ఇవ్వాలి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓసారి బ్యాంకర్లు, ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించినా, పథకం అమలు ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడం, నష్టపోయిన రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పంటల బీమాపై దృష్టి పెట్టింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి పంటల బీమా పథకాన్ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి , వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఇతర అధికారులతో పంటల బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశం నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులందరికీ బీమా అందే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఏఏ పంటలకు వానాకాలం, యాసంగిలో ఏఏ పంటలకు ఏఏ విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. అయితే కొత్తగా రాష్ట్రం పంటల బీమా పథకాన్ని రూపొందించి అమలు చేయడం కష్టమైన పని కాబట్టి, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో రాష్ట్రం చేరే విషయంపై చర్చ జరిగింది. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో అధ్యయ నం చేసి, రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి.. ప్రాథమిక అంచనాల ప్రకారం అధికార యంత్రాంగం పంట నష్టం కలిగే సంభావ్యత ఆధా రంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించింది. » వానాకాలం సీజన్లో సుమారు 128 లక్షల ఎకరాలు పంటలు వేస్తే, వాటిలో వరి 66.78 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.23 లక్షల ఎకరాలు, పత్తి 44.75 లక్షల ఎకరాలు పోగా మిర్చి, సోయాబీన్, కంది వంటి ఇతర పంటలు కూడా సాగవుతాయి. » యాసంగి సీజన్లో 78 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, అందులో వరి 59 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 9, వేరుశనగ 2.2, శనగ 1.7 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. » ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానాకాలానికిగాను మొత్తం ప్రీమియంలో రైతు వాటా 2%, యాసంగి పంటకాలంలో 1.5 %, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% ప్రీమియం ఉంటుందని, మిగిలిన ప్రీమి యంలో రాష్ట్రం, కేంద్రప్రభుత్వం 50:50 భరిస్తుందని తెలిపారు. రైతులందరికీ పంటలబీమా వర్తింపచేయడం వల్ల స్థూల పంట విస్తీర్ణంలోని 98% విస్తీర్ణానికి బీమా వర్తిస్తుందని అధికారులు వివరించారు. రైతులందరికీ మేలు జరిగేలా బీమా: తుమ్మలవాతావారణ మార్పుల వలన కలిగే పంట నష్టాన్ని పంటల బీమాతో కొంతవరకు భర్తీ చేసే అవకాశం కలుగుతుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశనగ, శనగ, నువ్వులు మొదలైన పంటలు, వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ పామ్, టమాటా, బత్తాయి మొదలైన పంటలకు బీమా వర్తింపచేసే అవకాశం ఉందన్నారు. పూర్తిస్థాయిలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పథకాన్ని రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఎండాకాలంలో వడగళ్ల వర్షంతో నష్టపోయే వరి మరియు మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయి నష్ట పరిహారాన్ని రైతులకు అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. -
65 దాటితే 'నో' పదవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిల్లోని అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మూడు దశల్లో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయసేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. పార్టీ పదవుల నియామకంలో కొన్ని షరతులను కూడా ఖరారు చేసింది. 65 ఏళ్లు దాటినవారికి బ్లాక్, మండల, గ్రామ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వరాదని, ఆ పదవుల్లో యువకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. ఇదీ షెడ్యూల్..: ⇒ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున 70 మందిని పార్టీ పరిశీల కులుగా నియమించారు. వీరు ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు ఆయా జిల్లాల్లో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పేర్లను పీసీసీ ఇచ్చిన ఫార్మాట్లో సేకరించాలి. జిల్లా అధ్యక్ష పదవుల కోసం 5, బ్లాక్ అధ్యక్షుల కోసం 3, మండల అధ్యక్షుల కోసం 5 పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ⇒ మే 3 నుంచి 10 వరకు మరోమారు సమావేశం నిర్వహించి సంవిధాన్ బచావో సభలను నిర్వహించాలి. మే 4 నుంచి 10 వరకు ఆయా జిల్లాల్లో అసెంబ్లీ/బ్లాక్ స్థాయి నేతల సమావేశం నిర్వహించాలి. బ్లాక్, మండల కమిటీల ఆఫీస్ బేరర్లు, కార్యవర్గం పేర్లను సేకరించాల్సి ఉంటుంది. ⇒ మే 13 నుంచి 20 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీల కోసం పేర్లను సేకరించాలి. గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా ఐదు పేర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ మూడు దశల సమావేశాల అనంతరం బ్లాక్, మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రతిపాదనలతో కూడిన నివేదికను పీసీసీకి సమర్పించాలి. ⇒ ఈ కమిటీల్లో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఎందుకు ఇవ్వాలనే అంశాలను కూడా నివేదికలో పేర్కొనాలని ఆమె ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గుజరాత్ పీసీసీ విధానాన్ని మోడల్‌గా తీసుకోవాల సూచించారు. పరిశీలకుల హోదాలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే బాధ్యతలు చాలా కీలకమైనవని, ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కోరారు.లేటుగా వచ్చినవారు ఇంటికే.. పరిశీలకుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారిని బాధ్యతల నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి కొందరు పరిశీలకులు అరగంట ఆలస్యంగా వచ్చారు. మరికొందరు రాలేదు. మొత్తం 70 మంది రావాల్సి ఉండగా, 58 మంది హాజరయ్యారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు, సమావేశానికి రాని వారిని మీనాక్షి ఆదేశాల మేరకు పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశంలోనే ప్రకటించారు. పరిశీలకులుగా ఆరుగురు మాత్రమే మహిళలను నియమించడంతో ఇంకా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని మీనాక్షి సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన లోగో మార్చుకుంది. జల వనరుల శాఖను పోలి ఉండేలా కొత్త లోగోను అధికారులు రూపొందించారు. హైడ్రా అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల్లో ఈ లోగోను ప్రొఫైల్ చిత్రంగా పెట్టి అప్డేట్ చేసింది. ఈ లోగోను తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆమోదించింది. హైడ్రా కార్యాలయంతో పాటు సిబ్బంది యూనిఫాం, వాహనాలపై కొత్త లోగోను ముద్రించనున్నారు.కాగా, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్ఆర్ఎస్సీ)తో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఆర్ఎస్సీ వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, ఎన్ఆర్ఎస్సీ సంచాలకుడు డాక్టర్. ప్రకాశ్ చౌహాన్ బాలానగర్‌లోని ఎన్ఆర్ఎస్సీలో సంతకాలు చేశారు. -
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ‘ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి!’ అంటూ వ్యవంగంగా మాట్లాడారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ స్మితా సబర్వాల్ సోషల్‌మీడియా రీట్వీట్లను ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికిందని ఆరోపించారు. ఆ చెట్లను నరికి వేసినప్పుడు స్మితా సబర్వాల్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని పునరుద్ఘాటించారు. స్మితా సబర్వాల్.. అప్పుడు ఏం చేశినవ్? - గజ్జెల కాంతంకేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికేసినప్పుడు జింకలు, వణ్యప్రాణులు వేరే అడవులకు పోతుంటే నువేం చేశినవ్అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి ఇది కరెక్టు కాదని ఎందుకు ఖండించలేదు?IAS అధికారి స్మితా సబర్వాల్‌పై రెచ్చిపోయిన… pic.twitter.com/FrHZkWO2dA— Telugu Galaxy (@Telugu_Galaxy) April 23, 2025 -
జానారెడ్డి ఎపిసోడ్.. రాజగోపాల్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్లో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. వారం క్రితం జానారెడ్డిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.అయితే, జానారెడ్డి ఎపిసోడ్‌పై రాజగోపాల్‌రెడ్డి.. బుధవారం స్పందించారు. ‘‘జానారెడ్డి అంటే నాకు గౌరవం. ఆయన మా పార్టీ సీనియర్ నేత. జానారెడ్డి రాసిన లెటర్‌పై ఒక సభలో మాట్లాడాను. మంత్రి పదవి పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి గట్టి హెచ్చరికలే చేశారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది...మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. -
గిన్నిస్ బుక్ రికార్డు: ఒకే కుటుంబంలో ముగ్గురికి అరుదైన గౌరవం
సాక్షి, సిటీబ్యూరో: కేపీహెచ్ బీ కాలనీకి చెందిన మేడిది లలితాకుమారి తన ఇద్దరు చిన్నారులు లీషా ప్రజ్ఞ (8) అభిజ్ఞ ( 5) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించారు. 18 దేశాలకు చెందిన కీబోర్డ్ సంగీత కళాకారులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రికార్డు నెలకొల్పడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయ, సహకార మార్కెటింగ్ చేనేత వ్రస్తాల శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని అభినందించారు. డిసెంబర్ 1, 2024న హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్‌స్ట్రాగాం వేదికగా వీడియోలు అప్లోడ్ చేశారు. లండన్‌లోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత మిస్టర్ రిచర్డ్ స్టన్నింగ్ సంగీత కళాకారులను విజేతలను ప్రకటించి డిసెంబర్ 9, 2024న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వారిని అభినందించారు. ఈనెల 14న హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన వేడుకల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. -
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో బట్టతల మందు కోసం బాధితులు క్యూ కట్టారు. ఉప్పల్ బాగాయత్లో ఏర్పాటు చేసిన శిబిరం.. వేలాది మంది బట్టతల బాధితులతో నిండిపోయింది. వెయ్యి రూపాయలు పెట్టి బట్టతలకు బాధితులు మందు తీసుకుంటున్నారు. 300 ఎంట్రీ ఫీజు.. 700 ఆయిల్ కాస్ట్ అంటూ హరీశ్ అనే వ్యక్తి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్, వినోద్, రాజశేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు పాతబస్తీలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన వకీల్ గత కొంత కాలంగా పాతబస్తీ రామనాస్పుర రోడ్డులో కింగ్ పేరుతో కటింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున యువకులు క్యూలో నిలబడి మందు పెట్టించుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.వకీల్ మొదట బట్టతల గుండు కొట్టి రూ.100 తీసుకొని తర్వాత జుట్టు మొలిపించేందుకు కెమికల్‌ను బట్టతలపై రాసేవాడు. ఉన్న కాస్త జుట్టు కూడా పోయిందంటూ ఆందోళనకు గురయ్యారు.