Politics
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఇందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వేదికగా మారింది. గత జనవరిలో పాలకవర్గం కొలువు దీరిన నాటి నుంచి మార్కెట్ యార్డు చైర్పర్సన్ బల్లా పల్లవి, వైస్ చైర్మన్ అర్షదుల్లా మధ్య మాటలు లేవు. కొందరు డైరెక్టర్లు అటు ఇటు ఉండగా.. మరికొందరు ఇరు వర్గాలకూ దూరంగా ఉంటున్నారు.ఇదే అదనుగా మార్కెట్ యార్డు తనకే రాసిచ్చారన్నట్లుగా చైర్పర్సన్ బల్లా పల్లవి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా చైర్పర్సన్ తనదైన శైలిలో వైస్ చైర్మన్, డైరెక్టర్లను కట్టడి చేసి ఏకపక్షంగా వెళుతున్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. వైస్ చైర్మన్‌గా, డైరెక్టర్లుగా తమకు పార్టీ గొప్ప అవకాశం కల్పించినట్లు సంబరపడుతూ పదవులు అనుభవిస్తామని, సంపాదించుకుంటామని అనుకున్న వారు మొదట్లో నెల రోజుల పాటు హడావుడి చేసినా ఇప్పుడు పలకరించేవారు లేక డీలా పడ్డారు. పాలకవర్గ ప్రమాణ స్వీకారం, బాధ్యతలు తీసుకున్న రోజు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో ఆర్భాటం చేసిన చైర్పర్సన్ పల్లవి.. ఆ తర్వాత ఎమ్మెల్యేకు దూరమయ్యారు.ప్రధానంగా మార్కెట్ యార్డులో వేబ్రిడ్జి (లారీ కాటా) విషయంలో చైర్పర్సన్ భర్త బల్లా సురేష్‌కు ఎమ్మెల్యే దగ్గుపాటికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సహకారంతో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటుకు నిధులు సమీకరించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు కొందరు ఇటీవల మార్కెట్ యార్డుకు వచ్చి బల్లా పల్లవిని కలిసి వెళుతుండటం జరుగుతోంది. అదే విధంగా టన్నుకు ఇంత అని చీనీ మార్కెట్, వారానికి ఇంత మొత్తం అని పశువులు, జీవాల సంతల్లో చైర్పర్సన్ పల్లవి డిమాండ్ చేస్తూ కమీషన్లు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటం, అలాగే కమీషన్లు దక్కకపోవడం లాంటి కారణాలతో ఎమ్మెల్యే దగ్గుపాటి తీవ్రంగా పరిగణించి చైర్పర్సన్ బల్లాపల్లవి వ్యవహారంపై దృష్టి సారించి వైస్ చైర్మన్, కొందరు డైరెక్టర్లను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు
వనస్థలిపురం (హైదరాబాద్): ‘తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ చచ్చుడో..’అనే నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన మహానాయకుడు కేసీఆర్ పోరాట పటిమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 8 రోజులుగా కొడుకును దాచిపెట్టి, బాలిక కుటుంబసభ్యులను బెదిరించి, మీడియా నోరు నొక్కిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆదివారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎల్బీనగర్ నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ‘గతంలో నిజాం ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు ఆసుపత్రుల నిర్మాణం జరిగితే, బీఆర్ఎస్ హయాంలో 4 ఆసుపత్రుల నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తే, రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోంది. మైనర్ బాలిక విషయమై బీఆర్ఎస్ మహిళా విభాగం, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోరాడుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న బాలిక తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తున్నాం. బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వైఫల్యాలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసు కెళ్ళాలి..’అని కేటీఆర్ చెప్పారు. ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి ‘దేశంలో బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియలో భాగంగా బెంగాల్, కేరళ రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై బీఆర్ఏ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పార్టీ సభ్యత్వం, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నవారికే అవకాశం వస్తుంది. ఎల్బీనగర్లో ఉన్న 18 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, నాయకులు దాసోజు శ్రవణ్, దేశ్‌పతి శ్రీనివాస్, దేవీప్రసాద్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, పల్లె రవికుమార్, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
బాబూ.. ఏపీని ఏం చేయదలచుకున్నావ్..?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీని ఉద్దరిస్తామంటూ చంద్రబాబు మోసపూరిత మాటలు చెప్పారు.. ఇప్పుడు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవలం 24 నెలల్లోనే ప్రజల నెత్తిన చంద్రబాబు అప్పుల బండ పెట్టారు. 3 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేశారు. రాబోయే మూడేళ్లలో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు’’ అంటూ నిలదీశారు.‘‘అప్పుల్లో, నేరాల్లో నిరుద్యోగంలో దేశంలో ఏపీనే ముందు ఉంది. ఇప్పుడు ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు. ఆర్టీసీని అమ్మేయడానికి మహిళలపై నెపం పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చిందంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంది. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారు. 2014 నుంచి 2019 వరకూ జయము జయము చంద్రన్న అని ఆర్టీసీని వాడుకున్నారు. ఆర్టీసీ టిడిపి సొత్తులాగా.. ఖర్జూర నాయుడు సంపాదించిన సొత్తులాగా అప్పనంగా వాడేశారు..నయా పైసా ఆర్టీసీకి చంద్రబాబు జమ చేయలేదు. 2018లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే చంద్రబాబు కుదరదన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 54 వేల మందిని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ఆర్టీసీ ఆపరేషనల్ అప్పులు 6300 కోట్లు, ఎక్యుమలేటెడ్ అప్పు 3350 కోట్లు. 2020 జనవరిలో ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ఏడాదికి రూ.3600 కోట్లు జీతాలుగా చెల్లించారు..వైఎస్ జగన్ దిగిపోయేనాటికి ఆర్టీసీ అప్పుల భారం 2,500 కోట్లకు తగ్గింది. వైఎస్ జగన్ చొరవతో 9 వేల కోట్ల నుంచి 2500 కోట్లకు అప్పులు తగ్గాయి. ఆర్టీసీ అప్పులు తగ్గించిన ఘనత వైఎస్ జగన్‌ది. ఎలక్ట్రికల్ బస్సులు కొనడం ఆర్టీసీ వల్ల కాదని ఇప్పుడు కథలు చెబుతున్నారు. ప్రజారవాణాలో ఎలక్ట్రికల్ బస్సులు కొంటే కేంద్రం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. 2014-19 లో చంద్రబాబు ఒక్క ఎలక్ట్రికల్ బస్సైనా కొన్నాడా?. 2019-24 లో వైఎస్ జగన్ ప్రభుత్వం 100 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసింది. తిరుపతిలో ఆ బస్సులను అందుబాటులోకి తెచ్చింది...తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేది ఆర్టీసీ డ్రైవర్లే. ఆర్టీసీ డ్రైవర్లకు వైఎస్ జగన్ ట్రైనింగ్ ఇప్పించారు. వైఎస్ జగన్ అప్పులు తీర్చి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించినప్పుడు మీరెందుకు చేయలేరు?. ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. మీరు ఆర్టీసీని దోచుకుతినడానికి రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర మహిళలకు ఉచిత బస్సు స్కీమ్. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లే ఆర్టీసీ కుదేలైపోయిందని చంద్రబాబు చెప్పించాడు. స్త్రీ శక్తి హామీ ఎవరిది?. ఆర్టీసీకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది. ఉచిత మహిళ పథకం ఇస్తున్నప్పుడు ఆర్టీసీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్టడం లేదు? ..ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను ప్రైవేట్ పరం చేసేస్తామంటున్నారు. మీ మనుషులు , మీ బ్రోకర్లకు ఆర్టీసీని కట్టబెట్టడమేనా మీ సంపద సృష్టి. ఆర్టీసీని సర్వనాశనం చేసి.. మహిళలపై నెపం వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలకు పంగనామాలు పెట్టారు. వైఎస్ జగన్ మహిళలకు రూ.24 వేల కోట్లు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇచ్చారు. ఎలక్ట్రికల్ బస్సు కిలోమీటర్‌కు 7 రూపాయలే భారం అని చెప్పడం పచ్చిమోసం. ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ పినాకిల్ అనే కంపెనీకి ఇచ్చారు. పినాకిల్ సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే కిలోమీటర్‌కు 71 రూపాయలు బిల్ వేస్తారట. 71 రూపాయల బిల్లులో 21 మోదీ ఇస్తే మిగిలిన 50 రూపాయలు మీ బాబు ఇస్తాడా?..కరెంట్ బస్సుకు కిలోమీటర్ కు 7 రూపాయలని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. పీఎంఈబస్ స్కీమ్ కింద రాబోయే రోజుల్లో బస్సులు వస్తే పేదలు, సామాన్యులు బస్సులు ఎక్కగలరా?. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులు పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులు మార్చేస్తామనడం కరెక్ట్ కాదు. పీఎంఈబస్ స్కీమ్ ప్రకారం 3 లక్షల పైబడి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే కరెంట్ బస్సులు తిప్పాలి. రాబోయే 750 కరెంట్ బస్సులన్నీ రాజధానిలోని 29 గ్రామాల్లో తిప్పుతారా?..కోటి 70 లక్షల చొప్పున వైఎస్ జగన్ 100 బస్సులు కొన్నాడు కదా. ఒక్క ప్రైవేట్ వ్యక్తిని కూడా రాకుండా ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు కదా.. ఈరోజుకీ ఆహా ఓహో అంటూ ఆ బస్సులపై వస్తున్న డబ్బులను మీరు తీసుకుంటున్నారు కదా. ఆడపిల్ల కనిపిస్తే చాలు సీటీపాట పాడినట్లు ఓట్లు అడుక్కున్నారు. మహిళలను మీ ప్రభుత్వం వచ్చాక ఏం ఉద్ధరించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి? రాష్ట్రంలోని సంపద అంతా చంద్రబాబు, లోకేష్, పవన్, ఎమ్మెల్యేలకే.. ఇప్పటికే ఆర్టీసీలో రిక్రూట్ మెంట్ నిలిపేశారు. ఆర్టీసీ జోలికొస్తే చూస్తూ ఊరుకోం’’ అని చంద్రబాబును పేర్ని నాని హెచ్చరించారు.
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో వైఫల్యం ఎందుకో? నిష్పక్షపాతంగా నిజాలు చెప్పండి అని క్షేత్ర పరిశోధన బృందానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదేశించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కేవలం 59 సీట్లను మాత్రమే గెలుచుకుని ఊహించని పరాజయాన్ని చవిచూసింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండు, మూడో స్థానాలకు పరిమితమయ్యారు. చివరికి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా తాను పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ భారీ షాక్ తర్వాత, ఓటమికి గల అసలు కారణాలను విశ్లేషించడానికి డీఎంకే నాయకత్వం రంగంలోకి దిగింది.క్షేత్రస్థాయి పరిశోధన బృందంతో స్టాలిన్ భేటీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్ నిర్మించేందుకు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ 36 మంది సభ్యులతో కూడిన ఒక క్షేత్ర పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేశారు. చెన్నైలో శనివారం ఈ బృందంతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు కనిమొళి, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.నిజాలు మాత్రమే చెప్పండి ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యులు లేదా స్థానిక నిర్వాహకులు ఏం చెబుతున్నారనేది పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకుని తనకు నేరుగా చెపాలని కోరారు. నివేదికలో తనను (డీఎంకే అధ్యక్షుడు) విమర్శించినా తప్పుగా అనుకోను. ఎవరినీ కాపాడటానికి ప్రయత్నించవద్దు అని సూచించారు. అలాగే ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో నివేదికలు ఇవ్వద్దు అని సూచించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, పరిశీలకులు , కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించి జూన్ 5వ తేదీలోగా తుది నివేదికను సమర్పించాలని స్టాలిన్ కోరారు.
Sports
ఒక్క బెర్త్.. ఐదు జట్లు
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. నిన్న (మే 18) సీఎస్కేను ఓడించడంతో ఎస్ఆర్హెచ్ ఓ బెర్త్ ఖరారు చేసుకుంది. వెళ్తూ వెళ్తూ ఆ జట్టు గుజరాత్‌ను కూడా ఫైనల్-4లోకి తీసుకెళ్లింది. అంతకుముందే ఆర్సీబీ ఓ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ప్రస్తుతానికి మూడు జట్లు బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ఏకంగా ఐదు జట్లు పోటీపడుతున్నాయి.ఆ జట్లు ఏవి.. ఏ జట్టుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఏ జట్టుకు స్వల్పంగా ఉన్నాయి.. ఈ అంశాలపై ఓ లుక్కేద్దాం. మిగిలిన ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే, ఢిల్లీ, కేకేఆర్ జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో రాజస్థాన్‌కు అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ తక్కువగా ఉన్నాయి. మిగతా మూడు జట్లలో చూసుకుంటే పంజాబ్, కేకేఆర్‌కు సమాన అవకశాలు ఉండగా.. సీఎస్కేకు కాస్త తక్కువ అవకాశాలు ఉన్నాయి.ముందుగా రాజస్థాన్‌ను తీసుకుంటే.. ఈ జట్టు లీగ్ దశలో ఇంకా 2 మ్యాచ్‌లు (లక్నో, ముంబై) ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ జట్టు మిగతా జట్ల జయాపజయాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. మిగతా జట్లు వారు ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లు గెలిచినా రాయల్స్ (16) ఉండే పాయింట్లు ఉండవు. కాబట్టి పోటీలో ఉన్న ఐదు జట్లలో రాయల్స్‌కే అవకాశాలు ఎక్కువ.రేసులో రెండో అతి పెద్ద అవకాశాలు ఉన్న జట్లు పంజాబ్, కేకేఆర్. ఈ రెండు జట్లు సమాన అవకాశాలు కలిగి ఉన్నాయి. పంజాబ్ వారు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (లక్నో) గెలిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది (రాజస్థాన్ ఏదైనా మ్యాచ్ ఓడిన పక్షంలో, మిగతా జట్లతో పనిలేదు). ఈ జట్టుకు మంచి రన్‌రేట్ ఉండటం అదనపు బెనిఫిట్ (కేకేఆర్‌తో పోలిస్తే) అవుతుంది.ఇక కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన 2 మ్యాచ్‌ల్లో (ముంబై, ఢిల్లీ) భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది (రాజస్థాన్ కనీసం ఒక మ్యాచ్ అయినా ఓడి, పంజాబ్ ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో ఓడితే). ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది.సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (గుజరాత్) భారీ తేడాతో గెలిస్తే బెర్త్ దక్కే అవకాశం ఉంది (రాజస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి, పంజాబ్ ఓడాలి, కేకేఆర్ కనీసం ఒక మ్యాచ్ అయినా ఓడాలి, డీసీ ఓడాలి).చివరిగా ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు ఆడాల్సిన ఏకైక మ్యాచ్‌లో (కేకేఆర్) భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కే అవకాశం ఉంది (కేకేఆర్ కనీసం ఒక మ్యాచ్ అయినా ఓడాలి, రాజస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి, పంజాబ్ ఓడాలి, సీఎస్కే ఓడాలి).
ఐదో ప్రపంచకప్ ఆడనున్న మోడ్రిచ్
జాగ్రెబ్: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే క్రొయేషియా జట్టును ప్రకటించారు. 40 ఏళ్ల లుకా మోడ్రిచ్ ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడనున్నాడు. 2006లో అరంగేట్రం చేసిన మోడ్రిచ్ ఆ తర్వాత 2014, 2018, 2022 ప్రపంచకప్ టోర్నిల్లో క్రొయేషియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను వెనక్కి నెట్టి ప్రతిష్టాత్మక ‘బాలన్ డోర్’ అవార్డు అందుకున్న మోడ్రిచ్ 196 మ్యాచ్‌ల్లో క్రొయేషియా తరఫున ఆడాడు. వచ్చే నెలలో అమెరికా, మెక్సికో, కెనడా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్‌లో మిడ్‌ఫీల్డర్ మోడ్రిచ్ 200 మైలురాయిని దాటే అవకాశముంది. అంటోనియో కర్బాజాల్ (మెక్సికో), ఆండ్రెస్ గార్డాడో (మెక్సికో), లోథర్ మథియాస్ (జర్మనీ), రాఫెల్ మార్కెజ్ (మెక్సికో), గియాన్లుగి బఫన్ (ఇటలీ), యుటో నాగటోమో (జపాన్), గిలెర్మో ఒచావా (మెక్సికో), మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) ఇప్పటికే ఐదు ప్రపంచకప్ టోర్నీలు ఆడారు. మెస్సీ, రొనాల్డో తాజాగా ఆరోసారి ప్రపంచకప్‌లో పోటీపడనున్నారు. 2018 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా, 2022 ప్రపంచకప్‌లో మూడో స్థానాన్ని సంపాదించింది. క్రొయేషియా ఫుట్‌బాల్ జట్టు: లివాకోవిచ్, కొటార్స్కీ, ఇవోర్ పాండుర్ (గోల్‌కీపర్లు), గ్వార్డియోల్, కాలెటకార్, సుటాలో, స్టానిసిక్, పొన్గ్రాసిక్, ఎర్లిక్, వుస్కోవిచ్ (డిఫెండర్లు), లుకా మోడ్రిచ్, కొవాసిచ్, పాసాలిచ్, వ్లాసిక్, లుకా సుసిక్, బటురినా, జాకిక్, పీటర్ సుసిక్, నికోలా మోరో, టోనీ ఫ్రుక్ (మిడ్‌ఫీల్డర్లు), పెరిసిచ్, క్రామారిచ్, బుడిమిర్, పాసాలిచ్, పీటర్ మూసా, మటానోవిచ్ (ఫార్వర్డ్స్).
ఆసియా క్రీడలకు సురేఖ, చికిత, ధీరజ్, గణేశ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ప్రకటించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ... తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత.. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్... పురుషుల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన తిరుమూరు గణేశ్ మణిరత్నం భారత జట్టులోకి ఎంపికయ్యారు. మూడు రోజులపాటు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్ అనంతరం భారత జట్లను ఎంపిక చేశారు. వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి... దీపిక భర్త, భారత మాజీ నంబర్‌వన్ అతాను దాస్... వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పాల్గొనడంతోపాటు రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలు నెగ్గిన అభిషేక్ వర్మ ట్రయల్స్‌లో విఫలమై ఆసియా క్రీడలకు ఎంపిక కాలేకపోయారు. ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ 15.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా వరుసగా నాలుగో ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. ట్రయల్స్‌లో రెండో స్థానంలో నిలిచిన ప్రపంచ యూత్ చాంపియన్ చికిత, మూడో స్థానంలో నిలిచిన ప్రీతిక కూడా ఆసియా క్రీడలకు ఎంపికయ్యారు. పురుషుల కాంపౌండ్ విభాగంలో గణేశ్ 10.75 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం పొందాడు. గణేశ్‌తోపాటు సాహిల్ జాధవ్, కుశాల్ దలాల్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. సర్వీసెస్ తరఫున పోటీపడ్డ ధీరజ్ రికర్వ్ విభాగంలో 15.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు.
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
ఐపీఎల్-2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. ఎనిమిదో సారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో ఇషాన్ కిషన్‌ది కీలక పాత్ర.కిషన్ కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా 47 పరుగులతో రాణించాడు. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందించాడు. జట్టును గెలిపించిన క్లాసెన్, కిషన్‌పై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన చాలా సంతృప్తిని ఇచ్చింది. మేము సాధారణంగా ఆడే శైలికి ఇది భిన్నమైన మ్యాచ్. ఇక్కడి వికెట్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇషాన్, క్లాసెన్ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా ఒక అద్భుతం. వారిద్దరూ బౌలర్లను టార్గెట్ చేస్తూ ధైర్యంగా షాట్లు ఆడుతూ మ్యాచ్‌ను గెలిపించారు. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు మాకు 1-2 భాగస్వామ్యాలు అవసరమని మేం భావించాం. ఎందుకంటే క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్‌కు పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. క్రీజులో కుదురుకున్నాక బ్యాటింగ్ కాస్త సులభమవుతుంది. క్లాసెన్, కిషన్ ప్రణాళికలు తగ్గట్టు ఆడారు. వారిద్దరూ సరైన బౌలర్లను టార్గెట్ చేసుకుని కొన్ని అద్భుతమైన షాట్లు ఆడారు. గత మ్యాచ్‌లో 86 పరుగులకే ఆలౌటైన తర్వాత మేము మా బ్యాటింగ్ గురుంచి చర్చించాము. నిజం చెప్పాలంటే మా జట్టు బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌కు అంతగా ఫేమస్ కాదు. కానీ పరిస్థితులకు తగ్గట్టు ఆడగలమని ఈ మ్యాచ్‌లో నిరూపించాం. అయితే మా బౌలింగ్ సమయంలోనే పిచ్ కాస్త స్లోగా ఉంది. బంతి కొద్దిగా లోపలికి వస్తూ, గ్రిప్ అవ్వడం గమనించాము. అలాంటి పరిస్థితుల్లో భారీ షాట్లు ఆడడం కుదరదు. కానీ మా బ్యాటర్లు పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని ఆడారు. ఈ పిచ్‌పై 180 పరుగులు మంచి స్కోరే. కానీ చేధించగలమన్న నమ్మకం మాకు ఉండేది. టాస్ గురుంచి కూడా పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఇక్కడ సెకెండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కూడా గెలిచాయి. మాకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్-2లో నిలిచేందుకు ప్రయత్నిస్తాం. అయితే ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉంది. కానీ అసలైన కథ ఇప్పుడే మొదలువుతోంది. ఇప్పటికంటే ఎక్కువగా కష్టపడాలి. ఈ విజయాల్లో కిషన్‌ది కూడా కీలక పాత్ర. సగం సీజన్ వరకు అతడే కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి అతడికి చాలా ఎక్కువ క్రెడిట్ దక్కాలి. మా టీమ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే రిథమ్‌ను కొనసాగిస్తామని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరన్స్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!
National
ఫ్రీ బస్సుతో కేరళ ఖజానాకు చిల్లు?
తిరువనంతపురం: కేరళలో కొత్తగా కొలువుదీరిన యూడీఎఫ్ (యూడీఎప్) ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రకటించిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకం ఒకవైపు ఆడపడుచుల్లో ఆనందం నింపుతున్నా.. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జూన్ 15 నుంచి కేఎస్ఆర్టీసీ బస్సుల్లో అమలు కానున్న ఈ పథకంతో అటు రవాణా వ్యవస్థకు, ఇటు రాష్ట్ర ఖజానాకు మోయలేనంత ఆర్థిక భారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రైవేట్ రవాణా వ్యవస్థకు ఉరితాడు!కేరళలో దాదాపు 80 శాతానికి పైగా ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల పైనే ఆధారపడి ఉన్నారు. మహిళలకు కేఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే, తమ బస్సుల్లో కేవలం విద్యార్థులు మాత్రమే మిగులుతారని, ఇది ప్రైవేట్ బస్ సెక్టార్‌ను నాశనం చేస్తుందని ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కనీసం డీజిల్ కొట్టించడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. గోపీనాథన్ వాపోతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసి తమ సమస్యను వివరించనున్నట్లు వారు తెలిపారు.అప్పుల కుప్పగా మారనున్న కేరళ?ఈ ఉచిత హామీతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కేరళ తీవ్ర ఆర్థిక లోటుతో సతమతమవుతోంది. రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సిన ఈ తరుణంలో.. అదనపు సంక్షేమ పథకాలతో సబ్సిడీ భారం లక్ష కోట్ల రూపాయలు దాటే ప్రమాదం ఉందని, తద్వారా అభివృద్ధి పనులు కుంటుపడతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన కేఎస్ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పొరుగు రాష్ట్రాల పాఠాలు ఏవి?కర్ణాటకలో అమలు చేస్తున్న ‘శక్తి’ పథకానికి ఏటా రూ. 5,300 కోట్లు ఖర్చవుతుండటంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడింది. తెలంగాణలో కూడా ఉచిత ప్రయాణ హామీతో ఆర్థిక ఒత్తిడి పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, మహిళలందరికీ కాకుండా, మత్స్యకార్మికులు, కార్మికుల వంటి అట్టడుగు వర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేస్తే ఆర్థికంగా అంతగా ఇబ్బందులు ఎదురుకావని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి
ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చుట్టూ చట్టం ఉచ్చు మరింత బిగుస్తోంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఆర్థిక అక్రమాలు, అవినీతి కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. 2024 ఆగస్టులో ఇదే వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన ఆర్థిక అక్రమాల కేసులో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది.గవర్నర్ ఆమోదం.. కఠిన చట్టాల కింద చర్యలుభారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం సందీప్ ఘోష్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. సదరు అధికారి క్రిమినల్ ఉల్లంఘనలకు, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.సీబీఐ ఎఫ్ఐఆర్.. తెరపైకి మూడు సంస్థలుఈ అవినీతి వ్యవహారంలో సందీప్ ఘోష్‌తో పాటు మరో మూడు ప్రైవేట్ సంస్థలపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇప్పటికే రెగ్యులర్ కేసు నమోదు చేసింది. ‘మా తారా ట్రేడర్స్’, ‘ఈశాన్ కేఫ్’, ‘ఖామ లౌహా’ అనే సంస్థలతో కలిసి ఘోష్ నేరపూరిత కుట్రకు, మోసాలకు పాల్పడినట్లు సీబీఐ తన దర్యాప్తులో గుcoolingర్తించింది. ప్రభుత్వ నిధులను దారిమళ్లించి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.సీఎం సువేందు అధికారి సోషల్ మీడియా ప్రకటనఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ముఖ్యమంత్రిగా ఇదొక అత్యంత పారదర్శకమైన, సానుకూలమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన అన్యాయాలపై చట్టపరమైన పోరాటంలో ఇదొక కీలక అడుగు అని ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: మండుటెండను జయించే ‘ఆయుష్’ అస్త్రాలివే!
మండుటెండను జయించే ‘ఆయుష్’ అస్త్రాలివే!
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల దెబ్బకు ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రాణనష్టాన్ని నివారించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డజీహెచ్ఎస్), ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి రంగంలోకి దిగింది. వేసవి తాపం నుంచి ప్రజలను రక్షించేందుకు అత్యవసర, సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే సంప్రదాయ ఆహార పదార్థాలైన కొబ్బరి నీళ్లు, షర్బత్‌తో పాటు యోగా, ఇతర ఆరోగ్య జాగ్రత్తలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించింది.తీవ్రమైన వడగాల్పులు.. అప్రమత్తతే రక్షణదేశంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని రక్షించడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ, డీజీహెచ్ఎస్తో కలిసి ఈ వేసవి కాలానికి సంబంధించిన ఒక సమగ్ర మార్గదర్శకాన్ని ప్రకటించింది. సాధారణ ప్రజలతో పాటు కార్మికులు, క్రీడాకారులు, భారీ బహిరంగ సభల్లో పాల్గొనే వారిని వడదెబ్బ తదితర అనారోగ్యాల నుంచి కాపాడటమే ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. ప్రజలు ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలని, మధ్యాహ్నం వేళ సూర్యరశ్మికి నేరుగా గురికాకుండా చూసుకోవాలని తెలియజేసింది. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉండే పానీయాలు తీసుకోవడం అత్యవసరమని సూచించింది.ప్రాణాంతక వడదెబ్బ.. లక్షణాలు ఇవేశరీరంలో నీటి శాతం పడిపోవడం వల్ల వచ్చే వడదెబ్బను ఏమాత్రం తేలికగా తీసుకోకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. తలతిరగడం, తీవ్రమైన తలనొప్పి, వికారం, మానసిక స్థితిలో మార్పులు, అత్యధిక శరీర ఉష్ణోగ్రత, డీహైడ్రేషన్, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటివి వడదెబ్బ ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే అప్రమత్తం కావాలి. వడదెబ్బను అత్యవసర వైద్య పరిస్థితిగా పరిగణించి, పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే వెంటనే 108 లేదా 102 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి, వైద్య సహాయం పొందాలని సూచించింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదమని ప్రభుత్వం నొక్కి చెప్పింది.ముప్పు పొంచి ఉన్న వర్గాలు.. ప్రత్యేక జాగ్రత్తలువిపరీతమైన ఎండల కారణంగా కొన్ని వర్గాల ప్రజలకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. పసిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఆరుబయట పనిచేసే కార్మికులతో పాటు గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వడగాల్పుల సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీరికి ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. అలాగే పని ప్రదేశాలు, బహిరంగ సభలు, ఇతర ఆరుబయట కార్యకలాపాల సమయంలో నీడ ఉండే విశ్రాంతి ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. కార్మికులకు తరచుగా నీరు తాగేందుకు విరామం ఇవ్వడం, వడదెబ్బ లక్షణాలపై అవగాహన కల్పించడం వంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. వాతావరణ శాఖ (ఐఎండీ) ఇచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.ఆయుర్వేదంలో అద్భుతమైన శీతలీకరణ మార్గాలుఈ వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు వివిధ ఆయుష్ వైద్య విధానాల్లోని నివారణ చర్యలను ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ముఖ్యంగా ఆయుర్వేదం శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఆహార పద్ధతులను సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు రోజూ తీసుకోవాలి. అలాగే తీవ్రమైన ఎండల్లో శరీరాన్ని చల్లబరిచేందుకు నిమ్మరసం, పచ్చి మామిడి షర్బత్, తదితర సంప్రదాయ పానీయాలు అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేద విభాగం పేర్కొంది. ఇవి డీహైడ్రేషన్‌ను అడ్డుకుని శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.యోగా, సిద్ద వైద్యం ఇచ్చే ఉపశమనంశారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే యోగా.. వడదెబ్బ ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సిద్ద, యోగా విభాగాలు వేసవిలో ప్రత్యేకమైన శ్వాస పద్ధతులను సూచించాయి. ముఖ్యంగా 'శీతలీ ప్రాణాయామం' చేయడం ద్వారా శరీరంలోని వేడిని సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే మితమైన యోగా సాధన వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. యునానీ వైద్య విధానం వడదెబ్బ, చర్మం కమిలిపోకుండా ఉండేందుకు కొన్ని మూలికా లేపనాలను సూచిస్తుండగా, హోమియోపతి విభాగం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తోంది.తప్పనిసరిగా తీసుకోవాల్సిన వేసవి ఆహారంవేసవిలో మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ద్రవ పదార్థాలు ఎక్కువగా ఉండే, శరీరాన్ని చల్లబరిచే పండ్లు, కూరగాయలను దైనందిన ఆహారంలో చేర్చుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కీరదోసకాయ, పుచ్చకాయ, నిమ్మకాయ, కర్బూజా (మస్క్ మెలన్), బూడిద గుమ్మడికాయ, టమోటాలు మొదలైన వాటిని తరచుగా తినాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉంటుంది. ఇలాంటి సంప్రదాయ, సహజసిద్ధమైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా మండుటెండలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట!
ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం
ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. రుషికేష్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో రైలు ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే దేశవ్యాప్తంగా గత మూడు రోజుల్లో వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడం రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రుషికేశ్ సమీపంలో ఖాంద్ గ్రామం వద్ద యోగనగరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్‌తో పాటు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అధికారులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. రాత్రంతా రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాలు సంఘటనా స్థలంలో పనిచేశాయి. బోగీలను తొలగించడానికి భారీ యంత్రాలను మంగళవారం ఉదయం పంపించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. బ్రేక్‌లో సాంకేతిక లోపం లేదంటే లోకో పైలట్ నిర్లక్ష్యం కారణమని అనుమానం వ్యక్తమవుతోంది.#WATCH | Rishikesh, Uttarakhand | Morning visuals from the spot where three coaches of the Ujjaini Express derailed in the Khand village area near the Yog Nagari Rishikesh Railway Station yesterday night. No passengers were on board the train at the time of the accident. pic.twitter.com/TRjraIEi1G— ANI (@ANI) May 19, 2026ఈ ప్రమాదంతో రుషికేశ్ ప్రాంతంలో రైలు రాకపోకలు తాత్కాలికంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. రక్షణ పనులు పూర్తయిన తర్వాతే సాధారణ సేవలు పునరుద్ధరించబడతాయని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఒక పెద్ద ఉపశమనం. అయితే, వరుసగా ప్రమాదాలు జరగడం రైల్వే భద్రతా వ్యవస్థలో లోపాలను స్పష్టంగా చూపిస్తోంది. మే 17న తిరువనంతపురం–హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం, మే 18న బీహార్‌లో ససారం–పాట్నా ప్యాసింజర్ రైలులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగాయి. అదృష్టవశాత్తూ, ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
International
NRI
నో వీసా, నో సిటిజన్‌షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?
లండన్: విద్యాభ్యాసం కోసం స్టూడెంట్ వీసాపై స్కాట్లాండ్కు వచ్చిన తమిళనాడు విద్యార్థి క్యూ మణివణ్ణన్ రాజకీయపథంలో పయనించి పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. విదేశీ విద్యార్థులు విదేశీగడ్డపై చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడాల్సిందిపోయి విదేశీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విదేశీ విద్యార్థులూ ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడేందుకు అవకాశం చిక్కింది. ఈ సువర్ణావకాశాన్ని మణివణ్ణన్ అందిపుచ్చుకుని స్కాటిష్ గ్రీన్పార్టీ తరఫున ఎడిన్బర్గ్ అండ్ లూథియన్స్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్(ఎంఎస్పీ) సభ్యుడయ్యాడు. తాత్కాలిక వీసాపై వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తొలి విదేశీ అభ్యర్థిగా మణివణ్ణన్ చరిత్రసృష్టించాడు. తమిళనాడులో పుట్టిన ఇతను 2021లో స్కాట్లాండ్కు వచ్చాడు. ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో పీహెచ్డీ విద్యారి్థగా చేరాడు. కనీసం మూడేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్న, శాశ్వత స్థిరనివాస హోదా లేని విదేశీ పీహెచ్డీ విద్యార్థులూ స్కాట్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయొచ్చని గతేడాది చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో పరిపాలనలో వైవిధ్యం చూపేందుకు తానూ ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టానని ట్రాన్స్‌జెండర్ అయిన మణివణ్ణన్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. గ్రీన్స్ పార్టీ పాలస్తీనా సంఘీభావ విభాగానికి కో–కన్వీనర్‌గా పనిచేశాడు. గతంలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య, దివ్యాంగ కార్యకర్తగా పనిచేశాడు. తానో తమిళ వలసదారుడినని ప్రచారం చేసుకున్నాడు. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనువిదేశీయుడు మనకు ఎలా ప్రాతినిథ్యం వహించగలడని ప్రత్యర్థి పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా కాలపరిమితి ముగిసేలోపే అతని వీసా గడువు ముగిస్తే బ్రిటన్ గడ్డపై ఉండేందుకు అతను అర్హత కోల్పోతాడు. అప్పుడు అతను స్కాట్లాండ్ను వీడక తప్పదు. అప్పుడు ఎడిన్బర్గ్, లూథియన్స్ ప్రాంతవాసుల బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? ఎంపీ లేకుండా ఒక నియోజకవర్గం అలా నిస్సహాయంగా మిగిలిపోవాలా? దీనిని పరిష్కారం ఏంటి? స్కాట్లాండ్ స్థానిక ప్రజల సంస్కృతి, సంప్ర దాయాలు, అవసరాలకు అనుగుణంగా జరిగే చట్టాలు, విధాన నిర్ణయాల్లో మణివణ్ణన్ మేరకు క్రియాశీలక పాత్ర పోషించగలడు? అంటూ ప్రశ్నల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విదేశీ విద్యార్థుల మార్గదర్శకంలో నడవడమేంటి? అంటూ వలసల వ్యతిరేక యూకే విభాగ షాడో చాన్స్‌లర్, మాజీ ఎంపీ రాబర్ట్ జెన్రిక్ అన్నారు. అయితే ఈ అంశంలో మణివణ్ణన్‌కు గ్రీన్స్ పార్టీ అండగా నిలిచింది. అతని వీసా ఖచి్చతంగా రెన్యూవల్అయ్యేలా చూస్తామని పార్టీ నేత గిలియన్ మెకే తెలిపారు. వామపక్ష భావాలున్న గ్రీన్స్ పార్టీ తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఇదీ చదవండి: విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి, భారత సంతతికి చెందినకమలా ప్రసాద్-బిస్సెసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని తన పూర్వీకుల మూలాల పట్ల ప్రగాఢమైన గర్వాన్ని వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ఆమె, తన మూలాలను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అవమానకరంగా భావించిన పదాన్ని ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎలా మార్చుకున్నారో వివరించారు.భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్రినిడాడ్‌లో (మే 8-9 తేదీలలో) పర్యటన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమలా మాట్లాడుతూ, తన భారతీయ గుర్తింపు కారణంగా ఇప్పటికీ తనను అవమానించాలని ప్రయత్నిస్తున్న వారికి కమలా ప్రసాద్ తగిన విధంగా సమాధానమిచ్చారు.ట్రినిడాడ్‌లో నేటికీ అనేక చోట్ల భారతీయులను 'కూలీలు' అని పిలుస్తారని, ఇది ఒక అవమానకరమైన పదంగా పరిగణించబడుతుందని కమలా ప్రసాద్ అన్నారు. "కానీ నేను ఈ విషయంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ 'కూలీల' కష్టం, రక్తం, చెమట వల్లే ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఒక కూలీ కూతురు ట్రినిడాడ్ ప్రధానమంత్రి అయినందుకు గర్వపడుతున్నాను" అని ఆమె ఎంతో గర్వంగా చెప్పారు. ఆమె ప్రకారం, తన భారతీయ గుర్తింపు పట్ల ఆమెకు ఎలాంటి కలత గానీ, సిగ్గు గానీ లేదు.ట్రినిడాడ్‌లోని జనాభాలో సుమారు 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారని ప్రధానమంత్రి కమలా ప్రసాద్ అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను బానిసలుగా ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, వారు తమతో పాటు రామాయణం, గీత, ఖురాన్‌ను కూడా తీసుకొచ్చారని చెప్పారు. వారికి ఆంగ్లం తెలియకపోయినా, ఎన్నో అఘాయిత్యాలను ఎదుర్కొన్నప్పటికీ, వారు తమ ప్రాచీన భారతీయ నాగరికత, భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నారని ఆమె వెల్లడించారు.అంతేకాదు చారిత్రాత్మక పర్యటన సందర్భంగా కమలా ప్రసాద్ ఒక సంచలన ప్రకటన చేశారు. భారతీయుల గౌరవార్థం నెల్సన్ ఐలాండ్ పేరును మార్చనున్నట్లు తెలిపారు. 1866 నుండి 1917 వరకు, ఈ ద్వీపాన్ని భారతీయ ఒప్పంద కార్మికుల కోసం ఒక ల్యాండింగ్ స్టేషన్‌గా, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించారు. భారతీయ పూర్వీకులను గౌరవిస్తూనే, ప్రజలను సంప్రదించి, కొత్త పేరును సూచించమని కోరతామని ఆమె అన్నారు. ప్రధానమంత్రి కమలా ప్రసాద్‌తో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా నెల్సన్ ఐలాండ్‌ను సందర్శించారు. భారత్-ట్రినిడాడ్ మధ్య 150 ఏళ్ల సంబంధాలకు ఇది కొత్త బలాన్ని చేకూరుస్తున్నందున, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేంద్ర మంత్రి జై శంకర్ పర్యటన చారిత్రాత్మకమైన నెల్సన్ ద్వీపంలో ఉండటం నిజంగా చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జై శంకర్సంతోషం వ్యక్తం చేశారు. సరిగ్గా 180 సంవత్సరాల క్రితం, భారతదేశం మరియు ట్రినిడాడ్-టొబాగోల చరిత్రలో తొలి అడుగు ఇక్కడే పడిందని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు, ధైర్యవంతులైన భారతీయులు తమ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొని, కొత్త జీవితాలను ఎలా నిర్మించుకున్నారో ఆలోచించడం సహజమనీ అంటూ వారి ధైర్యసాహసాలకు, వారి సంకల్పానికి , వారి దృఢ నిశ్చయానికి నమస్సులు అందజేశారు.వారు జీవన విధానాన్ని, సంప్రదాయాలను , విశ్వాసాన్ని తమతో పాటు తీసుకువచ్చారు. నిజానికి, తమతో పాటు ఒక సంపూర్ణ నాగరికతను తీసుకువచ్చారు. వీటిని ఒక వారసత్వ ప్రదేశంగా భవిష్యత్ తరాల కోసం నమోదు చేయడం ఎంతైనా సముచితమని తెలిపారు. భారతదేశ గ్రాంట్ సహాయంతో నెల్సన్ ద్వీపంలోని సాంస్కృతిక వారసత్వాన్ని ఉన్నతీకరించడానికి ఉద్దేశించిన ఒక క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలోకార్యక్రమంలో జై శంకర్ పాల్గొన్నారు. కమలా ప్రసాద్ ఘనతభారత సంతతికి చెందిన కమలా ప్రసాద్-బిస్సేసర్ 2010లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 2010లో మొదటిసారి, ఆ తరువాత 2026లో కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఆమె వ్యక్తి. బ్రిటీష్ పాలనలో భారతదేశం నుండి చెరకు తోటలలో పనిచేయడానికి 'గిర్మిటియా' కార్మికులుగా వెళ్లిన వారి వారసురాలు ఆమె. 19వ శతాబ్దంలో బ్రిటీష్ వారు భారతదేశం నుండి ఒప్పంద కార్మికులను (Indentured Labourers) కరేబియన్ దేశాలకు తరలించారు. వారిని తక్కువ చూపు చూస్తూ "కూలీ" అని పిలిచేవారు. ఇది ఒక జాతి వివక్షతో కూడిన పదంగా (Racial Slur) ఉండేది. View this post on Instagram A post shared by Ministry of Health T&T (@minhealthtt)
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్‌లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్బోర్న్కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. మెల్బోర్న్ ఉద్యోగ మార్కెట్ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్ ఆఫర్ Airbnb అపార్ట్మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం 2008లో లండన్‌కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 2023 నాటికి లండన్ బోటిక్ వెడ్డింగ్ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్బోర్న్కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది. ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్‌లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్బోర్న్లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్ వైఫ్ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్ అయిపోవడమే మేలని అంటోంది. చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. ఇలా ఈ రేంజ్‌కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shweta (@shweta_lifecoach) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..)
స్నేహితురాలి పెళ్లికి వెళ్లి..
హైదరాబాద్: అమెరికాలో స్విమ్మింగ్‌పూల్‌లో పడి నగర యువతి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ డివిజన్ న్యూ శివపురి కాలనీకి చెందిన ముద్దసాని దేవేందర్ రెడ్డి, సునీత దంపతుల కూతురు శ్రీవీణ (28)కు 2023లో ప్రశాంత్ రెడ్డితో వివాహమైంది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవీణ స్నేహితురాలి వివాహం సందర్భంగా రెండు రోజుల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. అక్కడ శ్రీవీణ స్విమ్మింగ్‌పూల్‌లో విగతజీవిగా కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఒక్కగానొక్క కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో నగరంలోని దేవేందర్ రెడ్డి, సునీత దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీవీణ తల్లిదండ్రులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి పరామర్శించారు. ఆమె భౌతిక కాయాన్ని అమెరికా నుంచి భారత్‌కు వీలైనంత తొందరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Sakshi Originals
ఎఫ్ఐఐ వర్సెస్ డీఐఐ రిటైలర్లు చూడని కథేంటి?
రమణమూర్తి మంథా ‘‘ఈ రోజు ఎఫ్ఐఐలు రూ.5,000 కోట్ల విలువైన షేర్లు అమ్మారు. డీఐఐలు రూ.5,267 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.’’ క్రికెట్ స్కోరులా కొన్నాళ్లుగా ఇన్వెస్టర్లు రోజూ ఇదే వార్త చూస్తున్నారు. అంకెలు మారొచ్చు కానీ... అమ్ముతున్నది ఎఫ్ఐఐలే. కొంటున్నది దేశీ ఫండ్లే. ఎందుకిలా? విదేశీ ఇన్వెస్టర్లకు మన మార్కెట్లపై విశ్వాసం తగ్గుతోందా? లేదా మన దేశీ మ్యూచువల్ ఫండ్లు బలోపేతమయ్యాయా? నిజమేంటి? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిందొక్కటే. ఇదేదో స్మార్ట్ మనీకి, నడమంత్రపు సిరికి జరుగుతున్న యుద్ధమేమీ కాదు. రెండు భిన్నమైన పవర్ సెంటర్ల మధ్య పోరాటం. కాకపోతే ఎఫ్ఐఐల దగ్గరున్న ఆయుధాలు పెద్దవి. ఆ ఆయుధాల్ని ఎలా వాడతారో వివరించేదే ఈ వెల్త్ స్టోరీ...దేశీ ఫండ్లు ప్రధానంగా భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించే ఆలోచిస్తుంటాయి. కానీ విదేశీ ఫండ్లు అమెరికా వడ్డీ రేట్లను, డాలర్ కదలికల్ని, ముడిచమురు– బంగారం ధరల్ని, బాండ్ ఈల్డ్స్‌ని, కమోడిటీ సైకిల్స్‌ని, గ్లోబల్ లిక్విడిటీని గమనిస్తుంటాయి. ఇదే పెద్ద తేడా. మన దేశీ ఫండ్లు ఒక బోర్డ్‌పై చెస్ ఆడుతుంటే... విదేశీ ఫండ్లు ఒకేసారి పది బోర్డులపై ఆడుతుంటాయి. అలాగని ఎఫ్ఐఐలే ఎప్పుడూ గెలుస్తారని కాదు. రిస్క్ లను వాళ్లు ముందే గమనిస్తారన్నది మాత్రం వాస్తవం.ఎఫ్ఐఐలు ఎందుకు చేస్తారంటే...ఉదాహరణకు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిందనుకోండి. తక్షణం అమెరికన్ బాండ్లు ఆకర్షణీయంగా మారతాయి. డాలర్ బలపడి... ఎమర్జింగ్ మార్కెట్ల కరెన్సీలు వీక్‌గా మారతాయి. భారత్ వంటి మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కెళ్లటం జరిగిపోతాయి. అంతేతప్ప ఇన్ఫోసిస్ ఒక్కరోజులో మారిపోవటమో, హెచ్డీఎఫ్సీ నష్టాల్లోకి జారిపోవటమో, ఎయిర్టెల్ సబ్ర్‌స్కయిబర్లను కోల్పోవటమో జరగలేదని గుర్తుంచుకోవాలి. ఎఫ్ఐఐలు విక్రయించారంటే దానర్థం... వారికి ఎక్కువ లాభాలు వచ్చే మార్కెట్లోకి డబ్బును మళ్లిస్తున్నారని. అందుకే కొన్నిసార్లు కంపెనీల ఫలితాలు అదరగొట్టినా మార్కెట్లు మాత్రం పడిపోతూ ఉంటాయి. కరెన్సీయే ప్రధాన సమస్య!ఇన్వెస్టర్లు పొరపడేది ఇక్కడే. ఎందుకంటే మన ఇన్వెస్టర్లు రూపాయిల్లో ఆలోచిస్తే విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లలో ఆలోచిస్తారు. ఒకవేళ మన మార్కెట్లలో 10 శాతం లాభం వచ్చినా... రూపాయి గనక 8 శాతం పడిపోతే నికరంగా విదేశీ ఇన్వెస్టరుకు దక్కేది 2శాతం లాభమే. అందుకే ఎఫ్ఐఐలు రూపాయి కదలికల్ని, దిగుమతి బిల్లు పెంచే చమురు, బంగారం, వెండి ధరల్ని, ద్రవ్యలోటును, ఆర్బీఐ పాలసీని నిశితంగా గమనిస్తుంటారు. వీటిలో దేన్నీ దేశీ ఇన్వెస్టర్లు నియంత్రించే పరిస్థితి లేదు. దేశంలోని అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్లు కూడా పెరుగుతున్న డాలర్‌తో పోరాడే పరిస్థితి లేదు. మాటే... బంగారం మార్కెట్ల పరిస్థితిని ముందు చెప్పేది బంగారమే. ఎందుకంటే అనిశ్చితి పెరుగుతున్న కొద్దీ బంగారం ధరలు పెరిగి.. డాలర్ బలోపేతమవుతుంది. ఎమర్జింగ్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు జాగ్రత్తపడతారు. బంగారమంటే కేవలం నగలు కాదు. అంతర్జాతీయంగా ఇదో థర్మామీటర్. ఇటీవల ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులన్నీ దూకుడుగా బంగారం కొన్నాయి. ఎందుకని? భౌగోళిక అనిశ్చితి పెరిగి కరెన్సీ ఊగిసలాడుతుందని, వృద్ధి మందగిస్తుందని అవి ఊహించడం వల్లే. ఈ సంకేతాల్ని మొదట అందుకునేది విదేశీ ఇన్వెస్టర్లే. రిటైలర్లు చేయాల్సిందేంటి?రిటైలర్లు గమనించాల్సిందొకటే. ఎవరు అమ్ముతున్నారు... ఎవరు కొంటున్నారని కాదు. దేన్ని అమ్ముతున్నారు... దేన్ని కొంటున్నారనేది. ఎఫ్ఐఐలు భయపడి అమ్మేస్తున్నపుడు కొంటే దీర్ఘకాలంలో సంపద సృష్టి సాధ్యమేనని నిరూపించిన కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, ఐటీసీ వంటివి ఉన్నాయి. బలమైన క్యాష్ ఫ్లో, మార్కెట్ లీడర్షిప్, దీర్ఘకాల చరిత్ర వీటి సొంతం. ఎఫ్ఐఐలు విక్రయించేసినంత మాత్రాన వీటి వృద్ధి దెబ్బతినదు. కానీ రిటైలర్లు ఇవన్నీ పట్టించుకోకుండా రాకెట్లలా పెరుగుతున్న షేర్ల వెంట పరుగులు తీస్తేనే సమస్య వస్తుంది. డిఫెన్స్, పీఎస్‌యూ, రెన్యూవబుల్ ఎనర్జీ, కొత్త తరం టెక్ కంపెనీలంటూ స్టోరీలు ప్రత్యక్షమై... ఆ స్టోరీల వెంబడి కొన్ని షేర్లు హద్దూ అదుపూ లేకుండా పెరగటం... వాటి వెనక పడటమే అసలైన ప్రమాదకరం. ఎందుకంటే కంపెనీల ఆదాయాలు గనక వాటి షేర్ల ధరను ప్రతిఫలించకపోతే విదేశీ ఇన్వెస్టర్లు పట్టించుకోరు. అందుకే వారు లాభాలతో బయటపడతారు.గెలిచేదెవరంటే...? ఎఫ్ఐఐలు విక్రయిస్తున్నంత మాత్రాన రిటైలర్లు భయపడాల్సిన పని లేదు. ఎందకంటే ఎఫ్ఐఐలు– డీఐఐల లక్ష్యాలు వేరు. ఎఫ్ఐఐలు గ్లోబల్ అలొకేషన్, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తే... డీఐఐలు సిప్ పెట్టుబడులు, రిటైర్మెంట్ నిధి, బీమా నిధులు, దేశ దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారు. దీనివల్ల ఆసక్తికర పరిస్థితులు తలెత్తుతాయి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఎఫ్ఐఐలు విక్రయిస్తే... దేశ దీర్ఘకాలిక వృద్ధిలో భాగమయ్యే షేర్లను డీఐఐలు కొంటుంటారు. అంటే... ఇద్దరూ గెలిచినట్టే. భారత్‌ది నిర్మాణాత్మక బలం.. స్టోరీలను పక్కనబెడితే దేశీయంగా బలమైన ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థ ఉంది. నెలవారీ సిప్ ప్రవాహాలు చాలా బలంగా ఉంటున్నాయి. మార్కెట్లలోకి బీమా, పింఛన్ నిధుల రాక పెరిగింది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరుగుతోంది. ఇదో నిర్మాణాత్మక మార్పు. ఓ పదేళ్ల కిందట చూస్తే... ఈ స్థాయిలో ఎఫ్ఐఐలు గనక షేర్లను విక్రయిస్తే మార్కెట్లు కుప్పకూలేవి. కానీ ఇపుడు డీఐఐలు ఆదుకోగలుగుతున్నాయి. కాకపోతే ఈ మద్దతును ఆధిపత్యంగా చూడలేం. ఎందుకంటే లిక్విడిటీని, విలువను, కరెన్సీని, ఆఖరికి మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగలిగేది విదేశీ ఇన్వెస్టర్లే. దీన్ని విస్మరించలేం. మార్కెట్‌ని మార్కెట్‌గానే చూడాలి... విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించినంత మాత్రాన అదేదో చెత్త కంపెనీ అని... డీఐఐలు కొన్నంత మాత్రాన మంచి కంపెనీ అని అనుకోవటానికి లేదు. ఆదాయం, క్యాష్ ఫ్లో, గవర్నెన్స్ బాగున్న కంపెనీలనే మార్కెట్ ఆదరిస్తుంది. ఓపిగ్గా వేచిచూడటంతో పాటు, విలువల పరంగా క్రమశిక్షణ చూపించే ఇన్వెస్టర్లకే లాభాలొస్తాయి.
గోల్డ్ కొనాలా.. వద్దా..
‘కొంతకాలం బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ పిలుపుతో కొనుగోళ్లు ఆపాలని కొందరు , ఏడాది పాటు వాయిదా వేయాలని మరికొందరు చర్చలకు దిగారు ఇప్పటికే కొనేశాంగా మరి అమ్మేయాలా అని అనేకమంది సందిగ్ధంలో పడ్డారు. సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో ఈటీఎఫ్‌లుగా కొంటున్నవారు ఏంచేయాలో తోచక అయోమయంలో పడ్డారు. అయితే ప్రధాని పిలుపు ఒక రకమైన కొనుగోలుదారులకు పూర్తిగా వర్తిస్తుంది. మరొక వర్గం కొనుగోలుదారులకు అంతగా సంబంధం ఉండకపోవచ్చు. కానీ చాలా మందికి తాము ఏ రకమైన బయ్యర్లో తెలీదు. అది తెలిస్తే మీరు బంగారం కొనాలో, అమ్మాలో, కొనసాగించాలో నిజంగా ఏంచేయాలో స్పష్టమవుతుంది. క్రూడ్, చమురు దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యంపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని మోదీ గత వారం చేసిన బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలన్న పిలుపును బాధ్యత గల పౌరులుగా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. పతనమవుతున్న రూపాయి , పశ్చిమ ఆసియాలో అస్థిర పరిస్థితి, పెరుగుతున్న దిగుమతి బిల్లు వంటి కారణాలను ప్రధాని ప్రస్తావించారు. అయితే ఈ పిలుపునకు అందరూ ఒకేరకంగా స్పందించాల్సిన అవసరంలేదు. సరదాగా, ఆడంబరం కోసం, ఫ్యాషన్‌గా ప్రదర్శించుకునేందుకు మీరు నగలు కొనేవారైతే ఈ పిలుపు మీకు పూర్తిగా వర్తిస్తుంది. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలి అనుకుంటే ఆపడానికి ఆలోచించాల్సిందే. అదెలాగో తెలుసుకుందాం...ప్రధాని పిలుపు అసలు అర్థం ఏమిటి?భారతదేశం వినియోగించే బంగారంలో 99 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే వస్తుంది. దేశంలో గణనీయమైన స్థాయిలో బంగారం తవ్వకం జరగదు. నగలు, నాణేలు, బార్లు ఏ రూపంలో అయినా బంగారం కొనడానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి డాలర్ల రూపంలో దిగుమతులకే వెళ్తుంది. డాలరు మారకంలో రూపాయి విలువ 96 స్థాయికి పతనమై ఒకవైపు దిగుమతి బిల్లు పెరుగుతున్న సమయంలో బంగారం డిమాండ్ పెరగడం ఆర్థిక పరిస్థితిని మరింత కఠినతరం చేస్తోంది. ఎందుకంటే బంగారం దిగుమతులకు ప్రభుత్వం డాలర్లలోనే చెల్లిస్తుంది. డిమాండ్ పెరిగితే డాలర్లు భారీగా బయటకు వెళ్తాయి. దాంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే కీలకమైన దిగుమతులైన చమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు అన్నీ ఖరీదవుతాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అది చివరికి సాధారణ కుటుంబాలపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రధాని పిలుపులో భావోద్వేగం కన్నా గణాంకాలకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి.ఎవరి కోసం...ఈ పిలుపు అత్యంత ప్రభావం చూపేది జ్యువెలరీ కొనుగోలుదారులపైనే. ఎందుకంటే నగలలో బంగారం విలువతో పాటు 10 నుంచి 15 శాతం వరకు మేకింగ్ చార్జీలు, జీఎస్టీ కూడా ఉంటాయి. ఇవి తిరిగి రికవర్ కాని ఖర్చులు. అంటే నగలను పెట్టుబడిగా భావించే వారు , కొనుగోలు చేసిన క్షణం నుంచే తమ సంపదను అంతకన్నా ఎక్కువ శాతంగా అంచనా వేస్తారు. నగలు అనేవి వినియోగం కోసమే. పెట్టుబడి కోసం కాదు. అందుకే ప్రధాని పిలుపు వీరిని ఉద్దేశించి చేసిందిగా గమనించాలి.బంగారం పని సంపద పెంచడం కాదు ...రక్షణ ఇవ్వడంప్రధాని పిలుపును పాటించాలా వద్దా అనుకునే ముందు, మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం అసలు ఏ పని చేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి. బంగారంపై పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు ఉండటం సరైనదిగా పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు భావిస్తారు. అది సంపదను వేగంగా పెంచడానికి కాదు. ఒక రకమైన ఇన్సూరెన్స్‌లా పనిచేయడానికి. ఈక్విటీలు దీర్ఘకాలంలో సంపదను పెంచుతాయి. డెట్ ఇన్స్ట్రుమెంట్లు మూలధనాన్ని కాపాడి వడ్డీ ఇస్తాయి. బంగారం పని మాత్రం వేరు. రూపాయి బలహీనపడినప్పుడు లేదా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు, బంగారం సాధారణంగా తన విలువను నిలబెట్టుకుంటుంది. ఆసమయంలో ఇతర పెట్టుబడులను కాపాడేది బంగారం. ఆ పరిస్థితులకు హెడ్జింగ్‌గా బంగారాన్ని అలొకేషన్‌లో ఉంచుతారు.నగలు, ఈటీఎఫ్‌లు ఎస్‌జీబీలు పూర్తిగా భిన్నందిగుమతుల స్థాయిలో చూస్తే బంగారం అంటే బంగారమే. దేశంలో జ్యువెలరీ తయారీ దారులు గోల్డ్ బార్లు దిగుమతి చేసుకుని నగలుగా మారుస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌లు , గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా తమ యూనిట్లకు బ్యాకింగ్‌గా ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి దిగుమతి భారంలో పెద్ద తేడా ఉండదు. ఇక్కడ అసలు తేడా దిగుమతుల్లో కాదు. దానికి చేసే వ్యయంలో ఉంది.గోల్డ్ఈటీఎఫ్లు – మ్యూచువల్ ఫండ్లు గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా ఫిజికల్ గోల్డ్ దిగుమతులపైనే ఆధారపడతాయి. వీటి విషయంలో మేకింగ్ చార్జీలు ఉండవు. గోల్డ్ విలువపై జీఎస్టీ ఉండదు. తిరిగి అమ్ముకోవడం కూడా తేలిక.ఎస్జీబీలే నిజమైన మినహాయింపుసావరిన్ గోల్డ్ బాంండ్ల (ఎస్జీబీ)కు మాత్రమే నిజమైన ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. బాండ్ల విషయంలో ప్రభుత్వం బంగారం ధరలకు అనుసంధానమైన ఒక పేపర్ ఇన్స్ట్రుమెంట్ను జారీ చేస్తుంది. ఇందులో ఫిజికల్ గోల్డ్ కొనుగోలు లేదా దిగుమతి అవసరం ఉండదు. ఇష్యూ సమయంలో కొనుగోలు చేసిన వారు ఎనిమిదేళ్లు హోల్డ్ చేస్తే, 2.5 శాతం వార్షిక వడ్డీతో పాటు మెచ్యూరిటీ సమయంలో ట్యాక్స్ ఫ్రీ లాభాన్ని పొందేవారు. అయితే ఇప్పుడు కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూలు ఆగిపోయాయి. చివరిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సంవత్సరాల క్రితం కొత్త ట్రాంచ్ను విడుదల చేసింది.ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?మీ గోల్డ్ ఈటీఎఫ్‌లు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లను కలిపి లెక్కించండి. నగలను లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే అవి వినియోగానికి ఉద్దేశించినవి. మొత్తం పెట్టుబడుల్లో బంగారం శాతం ఎంత ఉందో చూడండి. అది 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 శాతం కంటే తక్కువైతే పోర్ట్‌ఫోలియో సమతుల్యత కోసం కొంత కొని పెంచుకోవచ్చు.10 శాతం దాటితే కొంత తగ్గించి ఆవచ్చే డబ్బును ఈక్విటీ, డెట్ లేదా క్యాష్ వైపు మార్చడం మంచిది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మార్కెట్ టైమింగ్ వల్ల ఈ పనిచేయడంలేదు. రీబ్యాలెన్సింగ్ మాత్రమే చేస్తున్నాం. బంగారాన్ని ఇన్సూరెన్స్‌లా చూడండి. ఇన్సూరెన్స్‌ను ఎవరైనా అవసరం వచ్చినప్పుడు కాదు, ముందుగానే కొనుగోలు చేస్తారు. బంగారంపై పెట్టుబడి కూడా అంతే.. పెరుగుతున్నపుడు కొనడం సరైన పెట్టుబడి విధానం కాదు. ప్రధాని పిలుపు బంగారం వినియోగం కోసం కొనేవారి విషయంలో సరైనదే. ముఖ్యంగా నగలు కొనేవారు దానిని సీరియస్‌గానే తీసుకోవాలి. ఇప్పటికే 5 నుంచి 10 శాతం సరైన గోల్డ్ అలొకేషన్ కలిగిన పెట్టుబడిదారు తన పోర్ట్‌ఫోలియోను కదిలించాల్సిన పనిలేదు. మొదటి నుంచి పెట్టుబడి ప్రణాళిక సరైనదైతే ఇప్పుడు చేయాల్సింది దానికి కట్టుబడి ఉండటమే.చరిత్ర ఏం చెబుతోంది?2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తమ బాండ్ కొనుగోళ్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. దాంతో రూపాయి సహా అనేక ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలు బలహీనపడ్డాయి. 2020 కరోనా సంక్షోభం, 2022 ఎనర్జీ క్రైసిస్ సమయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి సందర్భంలో రూపాయి బలహీనపడగా, ఈక్విటీలు నష్టపోగా, గోల్డ్ ధరలు మాత్రం పెరిగాయి. ఆ సమయంలో కొంత బంగారం కలిగి ఉన్న పోర్ట్‌ఫోలియోలు మాత్రమే సంక్షోభాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఇక్కడ గమనించాల్సింది ఒకటే బంగారం మిమ్మల్ని ధనవంతులను చేయడానికి కాదు, మీ సంపద పెంచడానికి కాదు మార్కెట్ కష్టకాలంలో మీ ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని.– సాక్షి, వెల్త్ డెస్క్
సారస్వత పరిషత్‌లో... అరుదైన సాహితీ సంస్మరణ!
అద్భుతంగా పాఠం చెప్పే అధ్యాపకులు చాలామంది ఉంటారు. అజ్ఞానం దూరం చేసి, అపరిమిత జ్ఞానాన్ని అందించే ఆచార్యులూ అనేకులుంటారు. కానీ, చదువుతో పాటు సామాజిక చలనశీల సూత్రాల ఆధారంగా చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో దోవ చూపి, ఆమరణాంతం వీడని ఆలోచనా మార్గం పట్టించే ఆచార్య వరేణ్యులు కొందరే ఉంటారు. శిష్యులను సైతం సహచరులుగా, మిత్రులుగా సంభావించి, వారిని తీర్చిదిద్దే అలాంటి ఆచార్యుల ఆలోచన, ఆచరణ, సాహిత్య - సామాజిక మూర్తిమత్వం ఆ శిష్యులపై చెరగని ముద్ర వేస్తుంది. హైదరాబాద్‌లో హైస్కూల్ టీచర్‌గా మొదలై, ఆగని అధ్యయనం, అధ్యాపనంతో ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ ప్రధానాచార్యులుగా, ‘హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ’ తెలుగు శాఖాధ్యక్షులుగా, హ్యుమానిటీస్ విభాగానికి డీన్‌గా ఎదిగి, ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి – సారస్వతమూర్తి... ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు (1941 – 2021).సాహితీ లోకంలో కె.కె.ఆర్.గా సుప్రసిద్ధులైన ఆయన భౌతికంగా కనుమరుగై అయిదేళ్ళు నిండినా, ఇప్పటికీ సహచరులు, శిష్య మిత్రులెవరూ మరిచిపోలేని విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. మండు వేసవిలో సైతం ప్రతి మే నెలలో వారు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకొనే తీరు అందుకు ఓ నిదర్శనం. చారిత్రక సాహితీ విమర్శకుడిగా కె.కె.ఆర్. విశిష్ట స్థానాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఈ ఏడాది కూడా ఆయన వర్ధంతిని ఆలోచనా స్ఫోరక సాహితీ సమావేశంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు జరిపారు.ఇరవై ఒక్కేళ్ళ పాటు కె.కె.ఆర్. ప్రధానాచార్యత్వానికీ, సాహిత్య సంగోష్ఠికీ నెలవైన హైదరాబాద్‌లోని ‘తెలంగాణ (అప్పటి ఆంధ్ర) సారస్వత పరిషత్’ కళాశాల ప్రాంగణమే ఈసారి కూడా అందుకు వేదికగా నిలిచింది. కె.కె.ఆర్. వార్షిక సంస్మరణ ప్రసంగ కార్యక్రమం మే 15 సాయంత్రం ఆహూతుల మధ్య ఆత్మీయంగా సాగింది. సుప్రసిద్ధ చరిత్ర ఆచార్యులు డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ ‘తెలుగువారి చరిత్ర – సంస్కరణోద్యమాలు’ అన్న అంశంపై ఈ ఏటి సంస్మరణ ప్రసంగం చేశారు. గత మూడేళ్ళుగా ఏటా జరుగుతున్న కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పరంపరలో ఇది మూడో ప్రసంగం.“అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్”: ఆచార్య చంద్రశేఖరరెడ్డిప్రధాన ప్రసంగానికి ముందు ‘ఎమెస్కో బుక్స్’ ప్రధాన సంపాదకులు – సాక్షాత్తూ కె.కె.ఆర్. వద్దే చదువుకొని, సారస్వత పరిషత్‌లో సహోద్యోగిగా ఎదిగి, సన్నిహితంగా మెలిగిన ఆచార్య డాక్టర్ దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, కె.కె.ఆర్. ప్రత్యేకతను వివరించారు. “తెలుగు సాహిత్య విమర్శలో చారిత్రక దృక్కోణానికి పెద్ద పీట వేసి ఒరవడి దిద్దిన అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్. ఆయనకు చరిత్రపై అమితమైన ఆసక్తి. భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేశారు. చరిత్ర పరిణామాలను గమనించి ఊరుకోకుండా, చరిత్రలోని పరిణామాలకూ సాహిత్యంలోని పరిణామాలకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించేవారు. ఎలాంటి చారిత్రక పరిస్థితుల్లో, ఎలాంటి సాహిత్యం వచ్చిందో లోతైన అధ్యయనం చేసి చెప్పేవారు. చరిత్ర నిర్దేశించే సాహిత్య స్వరూపాన్ని విశదీకరించేవారు. అందుకే, ఆయనను అరుదైన ‘చారిత్రక విమర్శకుడి’గా గణిస్తున్నాం. అగ్రశేణి తెలుగు సాహితీ విమర్శకులను పదిమందిని తీసుకున్నా... మొదటి అయిదుగురు ప్రాచీన సాహితీ విమర్శకులనుకుంటే, మిగిలిన అయిదుగురు ఆధునిక విమర్శకులలో ‘కనిష్ఠికాధిష్ఠితుడైన కాళిదాసు’ లాగా మున్ముందు చెప్పుకోవాల్సిన పేరు కె.కె.ఆర్.దే” అని డి. చంద్రశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు.అలాగే, కె.కె.ఆర్. వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని ఇంకా వివరిస్తూ, “సమాజంలోని సమకాలీన సంఘటనలపై ఆయన స్పందించేవారు. సర్వసాధారణంగా ఆయన ఎంత సంయమనం పాటిస్తారో, ప్రపంచంలో దుర్మార్గాన్ని చూస్తున్నప్పుడు అంత అసహనం వ్యక్తం చేసేవారు. వాటి గురించి రాయకున్నా, ఉపన్యసించకున్నా... మిత్రులతో తన బాధ, ఆవేదన, ఆవేశం పంచుకొనేవారు. చుట్టూ ఉన్న ప్రపంచంలోని మంచిని ఎంతగా అభిమానిస్తామో... చెడును అంత తీవ్రంగా ఖండించడమన్నది శిష్యులందరూ ఆయనను చూసి నేర్చుకున్నదే. అందుకే, ఒక్కమాటలో కె.కె.ఆర్. సంఘ సంస్కరణవాది కూడా” అని చంద్రశేఖరరెడ్డి విశ్లేషించారు. అందుకు తగ్గట్టే ‘తెలుగు వారి చరిత్ర – సంఘ సంస్కరణోద్యమాలు’ అంశంపై ప్రధాన ప్రసంగకర్త వకుళాభరణం రామకృష్ణ సైతం భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడైన ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ వద్ద పరిశోధన సాగించిన ఉద్దండులంటూ ఆయన కృషిని స్థూలంగా పరిచయం చేశారు.“ఆ సమగ్ర స్వరూపమే తెలుగువారి చరిత్ర”: వకుళాభరణంవకుళాభరణం రామకృష్ణ ప్రధాన ప్రసంగం చేస్తూ, ఢిల్లీలోని జె.ఎన్.యు.లో సాగిన తన చరిత్ర పరిశోధన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రసిద్ధ చరిత్రకారులు, పరిశోధకులైన రొమిల్లా థాపర్, సర్వేపల్లి గోపాల్ తదితరులతో జరిగిన సంగతులు పంచుకున్నారు. “తెలుగునాట ఆధునిక సంఘ సంస్కరణలకు దీపధారి లాంటి కందుకూరి వీరేశలింగం మీద రిసెర్చ్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పినప్పుడు మా గైడ్ సర్వేపల్లి గోపాల్ అన్న ఓ మాట నాకు ఇప్పటికీ గుర్తు. ‘పరిశోధనంటే - వీరేశలింగం వితంతు వివాహాలు జరిపాడు, బాలికా విద్యను ప్రోత్సహించాడు లాంటివి కాదు రాయాల్సింది. ‘హౌ బి శానిటైజ్డ్ ది సొసైటీ’ (తెలుగు సమాజాన్ని ఆయన ఎలా శుభ్రపరిచాడు) అన్నది చెప్పాలి, రాయాలి’ అన్నారాయన. అది నా మనసులో నాటుకొని, పరిశోధనకు మార్గదర్శకమైంది. కష్టపడి ఆయన దగ్గరే ఎం.ఫిల్, ఆ తర్వాత పీహెచ్డీ చేశాను” అని తెలిపారు.“ఒకసారి ‘యునెస్కో’ ఆహ్వానంపై సర్వేపల్లి గోపాల్ గారు ప్యారిస్‌కు వెళ్ళినప్పుడు, ఆయన స్థానంలో నన్ను పెడితే, నేను పాఠాలు చెప్పడం ఓ అపూర్వ గౌరవం. ‘ఆఖరి టాపిక్ మిగిలిస్తే, విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత నేనే ఆ పాఠం చెబుతాన’ని వెళ్ళే ముందు గోపాల్ అన్నారు. తీరా, పర్యటన నుంచి తిరిగొచ్చాక విద్యార్థులకు ఆ పాఠం కూడా నన్నే చెప్పమనేశారు. నేను ఆ పాఠం చెబుతుంటే, ఆయన కూడా ఆ క్లాసులో కూర్చొని విన్న క్షణాలు మర్చిపోలేను” అని వకుళాభరణం పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.ఈ మే 15 నాడే 88 వసంతాలు పూర్తి చేసుకొని, 89వ ఏట అడుగిడిన వకుళాభరణం దాదాపు నలభై నిమిషాల తన ప్రసంగంలో, ఆధునిక తెలుగు రాజకీయ చరిత్రలో జరిగిన ప్రధానమైన మార్పులను ఓపికగా ప్రస్తావించారు. బ్రిటీషు వారి కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేరుగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ మొదలైన ఉద్యమం, 1913 నాటి బాపట్ల ‘ప్రథమాంధ్ర మహాసభ’ నుంచి ఆంధ్ర రాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు, చివరకు 2013 నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన పరిణామాల క్రమాన్ని ఆయన స్థూలంగా వివరించారు.కందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రవేశం తర్వాత నడచిన సంస్కరణోద్యమాల తీరుతెన్నుల గురించి ‘సోషల్ రిఫార్మ్స్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే తన సిద్ధాంత గ్రంథంలో విపులంగా చర్చించిన వకుళాభరణం రామకృష్ణ, “గురజాడ, గిడుగు, కందుకూరి... ఈ ముగ్గురూ తెలుగు నేలకు వేగుచుక్కల త్రయం. వారిలో మొదటి ఇద్దరు సాహితీస్రష్టలూ విజయనగరం వారే కావడం విశేషం. అలాగే, తెలంగాణ ప్రాంతం నుంచి సాహిత్య, సామాజిక, రాజకీయ చైతన్యం తెచ్చినవారిలో కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు... ఈ ముగ్గురి పేర్లూ చెప్పుకొని తీరాలి” అని అభిప్రాయపడ్డారు. నక్సలైట్ల ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం లాంటి వాటిని ఆయన తన ప్రసంగంలో చూచాయగా ప్రస్తావించారు. రాజకీయంగా, సామాజికంగా, కళాత్మకంగా, సాంస్కృతికంగా తెలుగు నేలపై వచ్చిన మార్పుల్ని లోతుగా చూసినప్పుడే ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర – దాని పరిణామాలు – పర్యవసాలను సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతామని అన్నారు. హైదరాబాద్ వచ్చిన తొలిరోజుల్లో సారస్వత పరిషత్ గ్రంథాలయాన్ని తరచూ సందర్శించిన రోజులను గుర్తుచేసుకున్న వకుళాభరణం, చారిత్రక విమర్శ దృక్పథంతో కె.కె.ఆర్. చేసిన సాహిత్య కృషిని ప్రశంసించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా, కె.కె.ఆర్.తో సాగిన స్నేహాన్ని స్మరించుకున్నారు.అయిదేళ్ళుగా... ప్రతి ఏటా... అదే వేదికపై!నిజామాబాద్ జిల్లాలోని ‘తెలంగాణ విశ్వవిద్యాలయం’లో తెలుగు శాఖలో ఆచార్యత్వం వహిస్తున్న డాక్టర్ సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి ఈ మొత్తం సభా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. “ఉత్తమ ఆచార్యుడిగా, లోతైన సాహితీ విమర్శకుడిగా పేరున్న కె.కె.ఆర్. మరణానంతరం ఆయన శిష్య మిత్ర బృందం ఆచార్య చంద్రశేఖరరెడ్డి సారథ్యంలో ఏటా ఒక ప్రత్యేక సాహితీ కార్యక్రమం చేస్తోంది. తొలి ఏడాది ‘కె.కె.ఆర్. సంస్మరణ’ పేరిట ఆయన సంస్మరణ సంచిక తీసుకువచ్చారు. రెండో ఏడాది ఆయన బహుముఖీన వ్యక్తిత్వంపై ‘కె.కె.ఆర్. సాహిత్య వ్యక్తిత్వం’ పేరిట పలువురు సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనం వెలువరించారు. ఆ తర్వాత నుంచి మూడేళ్ళుగా ఏటా ఒక సుప్రసిద్ధుడితో సంస్మరణ ప్రసంగాలు చేయిస్తున్నారు. తత్త్వశాస్త్ర ఆచార్యులు డాక్టర్ అడ్లూరి రఘురామరాజు, సాహితీ విమర్శకుడు డాక్టర్ బి. తిరుపతిరావుల అనంతరం ఈసారి మూడో సంస్మరణ ప్రసంగం – చరిత్ర పరిశోధకులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారిది” అంటూ లక్ష్మణ చక్రవర్తి అయిదేళ్ళ ప్రస్థానాన్ని అద్దంలో చూపారు. అలాగే, తాజా సభలో విడుదలైన కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగ పుస్తకాలు రెంటికీ లక్ష్మణ చక్రవర్తే సంపాదకత్వ బాధ్యతలు వహించడం విశేషం. పిల్లలకు ప్రేమ పంచి... ఆచరణలో గౌరవం చూపి...ప్రధాన ప్రసంగానికి ముందు సభలో కె.కె.ఆర్. శిష్యమిత్రులు పలువురు మాట్లాడుతూ, మాస్టారితో తమ అనుబంధాన్నీ, వారి జ్ఞాపకాలనూ పంచుకున్నారు. కె.కె.ఆర్. వద్ద చదువుకున్న 73 ఏళ్ళ అధ్యాపకుడు డాక్టర్ డి. నరసయ్య అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ, “విద్యార్థులను సైతం గౌరవించడాన్ని ఆచరణలో చూపిన అరుదైన టీచర్ ఆయన. ఆ విశిష్ట గుణం ఆయన దగ్గరే చూశాను. విద్యార్థులతో ‘అంత్యాక్షరి పద్యపఠనం’తో పాటు ‘స్లో సైక్లింగ్’ లాంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ, పిల్లలతో అంతగా మమేకమైన టీచర్‌గా కె.కె.ఆర్. సార్‌ను మర్చిపోలేము” అన్నారు.జర్నలిస్ట్ రవీంద్రబాబు మాట్లాడుతూ, “ఎం.ఏ, ఎంఫిల్ కె.కె.ఆర్ గారి దగ్గరే చేశా. ఆధునిక కవిత్వం, స్ట్రక్చర్ ఆఫ్ మోడరన్ తెలుగు, సంస్కృతంలోని కాళిదాసు ‘మేఘసందేశం’... ఇలా ఏ సబ్జెక్ట్‌నైనా ఆయన బోధించేవారు. తాను చెప్పిన అంశం మీద కాకుండా, అప్పట్లో కొత్తగా వచ్చిన త్రిపురనేని శ్రీనివాస్ ‘హో’ కవితా సంపుటి మీద నేను పరిశోధన చేస్తానంటే ఆయన అభ్యంతర పెట్టలేదు. ముందుగా తానే ఆ పుస్తకం తెప్పించుకొని, చదివి, పరిశోధక విద్యార్థినైన నాకు సరైన మార్గనిర్దేశనం చేసిన అరుదైన గైడ్ ఆయన” అని వివరించారు.అరుదైన అధ్యయనశీలి ఆఖరి కోరిక!‘తెలుగు అకాడెమీ’కి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన రచయిత, భాషావేత్త డాక్టర్ అప్పం పాండయ్య మాట్లాడుతూ, “విద్యార్థులు, పరిశోధకులపై కె.కె.ఆర్. ఆప్యాయత అపారం. ఏదైనా తనకు తప్పు అనిపిస్తే మాత్రం... మిత్రధర్మం, శిష్యధర్మం ఎంత ఉన్నా సరే వెరవకుండా, వాటిని పక్కనబెట్టి మరీ నిక్కచ్చిగా ఆయన తన అభిప్రాయం చెప్పేవారు. కె.కె.ఆర్. తన విద్యాభ్యాసం, ఉద్యోగ జీవిత కాలంలోని సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సమాజంలోని చైతన్యశీలత, మార్పులను చెబుతూ జీవిత కథనం రాయాలని భావించారు. తీరని ఆయన కోరికను ఇప్పటికైనా మిత్రులెవరైనా పూనుకొని తీరిస్తే బాగుంటుంది” అని సూచన చేశారు. సారస్వత పరిషత్‌లో చదువుకొని సినీ, టీవీ నటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న మానిక్ అప్పటి తన అనుభవాలు పంచుకున్నారు.కుటుంబంతో కాదు... సాహితీ కుటుంబంతో!ఈ కార్యక్రమానికి కె.కె.ఆర్. సతీమణి ఊర్మిళ, కుమారుడు సుమన్, మనుమడు స్వభావ్తో సహా కె.కె.ఆర్. కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. “కేవలం కుటుంబ సభ్యులమే కాకుండా, సాహితీ బంధువులందరితో కలసి ఏటా కె.కె.ఆర్.ను స్మరించుకోవడం కోసం అయిదేళ్ళుగా ఇలా సాహితీ ప్రసంగాల సభ జరుపుతున్నాం. గతంలో కె.కె.ఆర్. ఇలాంటి ప్రసంగాల ‘సారస్వత వేదిక’ను దాదాపు పదేళ్ళ పాటు నిర్వహించారు. దాని ఫలితంగానే, సాహిత్య చరిత్ర వ్యాసాలుగా చిరస్థాయిగా నిలిచిపోయిన ‘తెలుగు సాహిత్యం - మరోచూపు’, ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’ లాంటి లాంటి పుస్తకాల రూపంలో ఆ ప్రసంగాలు మిగిలాయి. ఆ ఫక్కీలోనే ఇప్పుడీ వార్షిక ప్రసంగాలు చేయిస్తున్నాం. రానున్న రోజుల్లో యువతరంతోనూ, ఆధునిక వక్తలతోనూ ఇలాంటి ఆలోచనాత్మక సంస్మరణ ప్రసంగాలు ఇప్పించాలని భావిస్తున్నాం” అని ఊర్మిళ సభాముఖంగా ప్రకటించారు. అతిథులకు తమ కుటుంబ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంస్మరణ ప్రసంగ సభలో కె.కె.ఆర్.తో అనుబంధం ఉన్న ప్రముఖ కవి నిఖిలేశ్వర్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు – సాహితీవేత్త మోత్కూరి నరహరి, సాహితీ విమర్శకుడు కె.పి. అశోక్ కుమార్, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన ఆచార్య అయినవోలు ఉషాదేవి, ఆచార్య గారపాటి ఉమా మహేశ్వరరావు, ‘తెలుగు అకాడెమీ’ మాజీ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, చరిత్ర ప్రొఫెసర్ వకుళాభరణం రాజగోపాల్, ‘ఆకాశవాణి’ వార్తావిభాగం మాజీ ఉద్యోగి సమ్మెట నాగమల్లేశ్వరరావు మొదలైన ప్రముఖులు పలువురు పాల్గొనడం విశేషం.దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమానికి ముందు, తరువాత కూడా వచ్చినవారందరూ ఆత్మీయంగా పరస్పరం పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువెసుకోవడం, సారస్వత పరిషత్ ప్రాంగణంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం అరుదైపోతున్న సాహితీ కుటుంబ వాతావరణాన్ని ప్రతిఫలించాయి. వచ్చే ఏడాది కలయికకు మరో ఆత్మీయ భూమికను సిద్ధం చేశాయి. సారస్వత్ పరిషత్ ప్రాంగణంలో దాదాపు పదేళ్ళ పాటు ‘సారస్వత వేదిక’ పేరిట విశిష్ట అతిథుల సాహితీ ప్రసంగాలు నిర్వహించినప్పుడు ఆచార్య కె.కె.ఆర్. ఆచరించింది, అభిలషించిందీ కూడా ఇదేనేమో! - రెంటాల జయదేవ
వెండి దిగుమతులపై ఆంక్షలు
సాక్షి, బిజినెస్ డెస్క్: పశ్చిమాసియా సంక్షోభం వేళ విదేశీ మారక (డాలర్ల) నిల్వలను కాపాడుకునే క్రమంలో దిగుమతులను కట్టడి చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పసిడి, వెండి, ప్లాటినంలపై సుంకాలను పెంచిన ప్రభుత్వం వెండికి సంబంధించి మరిన్ని నియంత్రణలను ప్రకటించింది. ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే (ఫ్రీ ఇంపోర్ట్) కేటగిరీలో ఉన్న వెండిని ఆంక్షలు వర్తించే ‘రిస్ట్రిక్టెడ్’ కేటగిరీలోకి మార్చింది. దీనితో ఈ విభాగంలోని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్సు అవసరం ఉంటుంది. తాజా పరిణామంతో ఇకపై 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలు, సెమీప్రాసెస్డ్ సిల్వర్, సిల్వర్ పౌడర్, సాదా వెండి ఆభరణాల్లాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలన్నా డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) నుంచి ప్రత్యేక అనుమతులు అవసరమవుతాయి.అయితే, 100 శాతం ఎగుమతి ఆధారిత యూనిట్లు (ఈవోయూ), ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)లోని యూనిట్లకు ఈ ఆంక్షలు వర్తించవు. కాకపోతే, అవి దిగుమతి చేసుకున్న వాటిని భారత మార్కెట్లో విక్రయించకుండా, పూర్తిగా ఎగుమతి మాత్రమే చేయాల్సి ఉంటుంది. పైపెచ్చు ముందస్తు అనుమతి తీసుకున్నా సరే... ఒకసారి 100 కిలోలకన్నా ఎక్కువ పరిమాణంలో దిగుమతి చేసుకోవటానికి అనుమతించరు. ఇక ఎగుమతి ఆధారిత యూనిట్లు తొలుత దిగుమతి చేసుకున్న వెండిని వినియోగించి... అందులో కనీసం 50 శాతాన్ని ఎగుమతి చేసినట్లు నిరూపిస్తేనే మరోసారి దిగుమతికి అనుమతిస్తారు. విలువైన లోహాల దిగుమతి కోసం విదేశీ మారక నిల్వలను భారీగా వెచ్చించాల్సి వస్తుండటంతో పసిడితో పాటు వెండి దిగుమతులపై కేంద్రం సుంకాలను ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.12 బిలియన్ డాలర్ల దిగుమతులుభారత దిగుమతుల్లో వెండి వాటా ఏడాదికి దాదాపు 7 వేల నుంచి 9 వేల టన్నుల వరకు ఉంటోంది. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2025– 26లో వెండి దిగుమతులు పరిమాణం పరంగా 42 శాతం పెరిగి 7,335 టన్నులకు చేరాయి. విలువపరంగా 150 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడమే ఇందుకు కారణం. దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానంగా సిల్వర్ పౌడర్, బులియన్ కడ్డీలు, ముడి రూపంలోని వెండి ఉంటున్నాయి. కొత్త నిబంధనలతో వెండి దిగుమతుల్లో సింహభాగానికి డీజీఎఫ్టీ అనుమతి తప్పనిసరి కానుంది. ఎందుకీ నిర్ణయాలుకేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు లక్ష్యాలతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత విలువైన ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడం అందులో ఒకటి. అలాగే వివిధ దేశాలతో పెరిగిపోతున్న వాణిజ్య లోటును నియంత్రించడం మరో లక్ష్యం. థాయ్‌లాండ్, యూఏఈలాంటి దేశాలతో భారత్‌కి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఉన్నాయి. దీనితో సుంకాల భారం భారీగా ఉండకుండా, ఆయా దేశాల మార్గం గుండా దిగుమతి చేసుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. కనుక, ఎఫ్‌టీఏల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాధారణ ప్రజలపై ప్రభావం ఏంటంటే..ఆభరణాలు ప్రియం..: అంతర్జాతీయంగా వెండి ధరలు భారీ స్థాయిలోనే కదలాడుతున్నాయి. ఇటీవలి సుంకాల విధింపుతో సిల్వర్ ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దీనికి తోడు ఇక సంక్లిష్టమైన లైసెన్సు ప్రక్రియ కూడా తోడైతే దిగుమతుల్లో జాప్యానికి దారి తీయొచ్చు. ఫలితంగా దేశీయంగా డిమాండ్, అలాగే ధరలు కూడా భారీగా ఎగిసే అవకాశం ఉంది. మన దగ్గర శుభకార్యాలు, ఇతరత్రా గిఫ్ట్ ఐటెమ్స్‌లో వెండి వినియోగం ఎక్కువే ఉంటోంది. అయితే, చిన్న వ్యాపారులు, ఆభరణాల తయారీదార్లకు ముడి వస్తువు వ్యయాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు వాటి రేట్లు కూడా పెరిగిపోతాయి. స్మగ్లింగ్ ముప్పు..: దిగుమతి సుంకాలను పెంచినప్పుడే స్మగ్లింగ్ ముప్పులపై ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు మరిన్ని నియంత్రణల వల్ల ఈ రిస్కులు ఇంకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. పరిశ్రమలకు షాక్..: కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా ఇతరత్రా పారిశ్రామిక అవసరాలకు కూడా వెండి వినియోగం గణనీయంగా పెరిగింది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు .. ఇలా ఒకటేమిటి, అనేక అవసరాల కోసం సిల్వర్‌ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. తాజా నియంత్రణల వల్ల ఆయా పరిశ్రమలకు ముడి వస్తువు ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా అవి తయారు చేసే ఉత్పత్తుల ధరలూ పెరుగుతాయి. పెట్టుబడులకు కొనసాగనున్న ఆసక్తి..పసిడితో పాటు ఇన్వెస్టర్లు ఇప్పుడు వెండిని కూడా ఓ కీలకమైన పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. బంగారంతో పోలిస్తే అందుబాటు స్థాయిలో ఉండటంతో రేట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నా సిల్వర్వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ల కోణంలో దీనికి డిమాండ్ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పెట్టుబడులకు ‘ఆతిథ్యం’!
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
ఆ సినిమాలో నా పాత్రే చాలా కీలకం: భాగ్యశ్రీ బోర్సే
భర్త.. రెండో భర్త.. ఇద్దరు ప్రియులు!
‘పెద్ది’ .. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే మూవీ : రామ్ చరణ్
ఆ ఇంటి దీపం ఆరిపోలేదు
సీఎస్కే అభిమానులను రెచ్చగొట్టిన ఇషాన్ కిషన్
ఈ సినిమా ప్రేక్షకుల ఊహకు అందదు : రష్మిక మందన్నా
ఫ్రీ బస్సుతో కేరళ ఖజానాకు చిల్లు?
సెల్యుమా అడ్వాన్స్డ్ లైట్థెరపీని ఆవిష్కరించిన సినీ నటి
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
మాను సంపంగి... మా అబ్బాయి
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
‘సెలక్టర్లు చెప్పినా వినలేదు.. లేదంటే నాడే ద్రవిడ్ కెరీర్ ఖతం’
మాట మార్చిన ట్రంప్
క్రైమ్
మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్ మెసేజెస్
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల గర్భిణి అయిన ట్విషా (31) భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి ముందు తన స్నేహితులకు పంపిన చివరి సందేశాలు వాట్సాప్ చాట్ కలకలం రేపుతోంది. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అంటూ ఆమె తన స్నేహితులకు పంపిన సందేశాలు ఆమె తీవ్రమైన మానసిక ఆందోళన, ఒంటరితనం, పెళ్లి తర్వాత వేదనలో ఉన్నట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఆమె ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్టు చెబుతున్న బెల్టును పోస్ట్‌మార్టంకు ఎయిమ్స్ భోపాల్‌కు పంపకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ కేసును పక్క దారి పట్టిస్తున్నారంటూ భోపాల్ పోలీసులపై ఆరోపణలు కుదిపేస్తున్నాయి. దర్యాప్తు సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అసలు ఏం జరిగింది?నోయిడాకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ట్విషా శర్మ, ఢిల్లీలో ఉద్యోగం చేసేది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన అయిదు నెలలకే, మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన భర్త ఇంట్లో ట్విషా శవం వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమె మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని తేలినప్పటికీ, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాల గుర్తులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా చాట్స్ కీలకంగా మారాయి.మే 7న ఒక స్నేహితురాలితో వాట్సాప్ చాట్‌లో.. "నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. పెళ్లి కుటుంబాన్ని ఇస్తుంది, కానీ ఎక్కడున్నా మన కోసం మనం పని చేయడం ఆపకూడదు" అని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించి ముందడుగు వేయండి" అని స్నేహితురాలిని హెచ్చరించింది. అలాగే తనకు ఇల్లు, స్నేహితులు బాగా గుర్తొస్తున్నారని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో స్నేహితుడితో మాట్లాడుతూ.. "నేను చిక్కుకుపోయాను బ్రో (I am trapped bro). నువ్వు మాత్రం ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, సమయం వచ్చినప్పుడు కాల్ చేస్తాను" అని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబంట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జడ్జి)లపై కుటుంబ సభ్యులు హత్య, కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. నిందితులు ప్రభావవంతమైన వ్యక్తులు కావడం వల్ల వారికి ముందస్తు బెయిల్ లభించిందని, దీనివల్ల స్థానిక పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై న్యాయం చేయాలని, ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)లో మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. భోపాల్ వచ్చినప్పటి నుండి తాము ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం కోసం మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ట్విషా తండ్రి నవనిధి శర్మ, సోదరుడు ఆశిష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు .స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు, వారికి సమీప బంధువైన వ్యక్తి లోకాయుక్తగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తున్నారని తండ్రి నవనిధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లయిన దగ్గర్నుంచీ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో తిరిగి వచ్చేయాలని ఆమె భావించింది. ఇంతలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్‌ను సవాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య
కిర్లంపూడి: నవ వధువు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు..కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన సత్యంశెట్టి వెంకటేశులు దంపతుల మూడవ కుమార్తె వెంకటలక్ష్మి (25)కి ఏప్రిల్ 25న పిఠాపురం మండలం మర్లావకు చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. దుర్గాకోటేశ్వరరావు పెళ్లి జరిగిన మూడో రోజే తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వీడియోలు, ఫొటోలు ఆమెకు చూపించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి అప్పటినుంచి అన్యమనస్కంగా ఉంటోంది. ఆచారాల్లో భాగంగా మూడు సార్లు అత్తారింటికి వెళ్లి వచ్చిన ఆమె గోనేడలోని తన తల్లిదండ్రుల ఇంటివద్దే ఉంటోంది. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయాన్ని తట్టుకోలేక శనివారం రాత్రి తన గదిలోని ఫ్యానుకు చీరకట్టి ఉరి వేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు.కాగా, వెంకటలక్ష్మి తల్లిదండ్రులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహాలు కాగా, చిన్న కుమార్తె వెంకటలక్ష్మిని డిగ్రీ వరకు చదివించి గత నెలలోనే పెళ్లి చేశాడు. తమ బాధ్యతలు తీరాయని సంతోషపడేలోపే ఈ దారుణం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి సత్యంశెట్టి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త దుర్గాకోటేశ్వరరావు, అత్త నూకామణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వీడియోలు
జర భద్రం..! మూడ్రోజులు అసలు బయటకి రావద్దు
బండి భగీరథ్ కేసులో బయటపడ్డ కీలక విషయాలు
దామోదర్ పై సైబర్ క్రైమ్ కేసు..
బండి భగీరథ్ కేసులో మలుపు..! బాధితురాలు మైనర్ కాదు..?
చిన్నారిపై నుంచి వెళ్లిన థార్.. షాకింగ్ వీడియో
ప్రేమించడం లేదని యువతి గొంతుకోసిన యువకుడు..
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం
మా అక్కను ఇలా చూస్తా అనుకోలేదు.. పొడిచి పొడిచి చంపారు.. చెల్లి ఆవేదన
కృషి ఉంటే 'రిషి' అవుతారు.. ఎంసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్
నల్లగొండ జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి తల్లీకుమార్తె హత్య
